[21:26, 12/06/2020] +91 95058 13235: 12.6.2020 సాయం కాల సందేశము
వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం
షష్ఠ స్కంధము - పదిహేడవ అధ్యాయము
చిత్రకేతువును పార్వతీదేవి శపించుట
ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
శ్రీశుక ఉవాచ
17.1 (ప్రథమ శ్లోకము)
యతశ్చాన్తర్హితోఽనంతస్తస్యై కృత్వా దిశే నమః|
విద్యాధరశ్చిత్రకేతుశ్చచార గగనేచరః॥5429॥
శ్రీశుకుడు నుడివెను- పరీక్షిన్మహారాజా! సంకర్షణ భగవానుడు అంతర్ధానమైన పిమ్మట విద్యాధరులకు అధిపతియైన చిత్రకేతువు ఆ దిశవైఫు మరలి నమస్కరించెను.
17.2 (రెండవ శ్లోకము)
స లక్షం వర్షలక్షాణామవ్యాహతబలేన్ద్రియః ।
స్తూయమానో మహాయోగీ మునిభిః సిద్ధచారణైః॥5430॥
17.3 (మూడవ శ్లోకము)
కులాచలేన్ద్రద్రోణీషు నానాసఙ్కల్పసిద్ధిషు|
రేమే విద్యాధరస్త్రీభిర్గాపయన్ హరిమీశ్వరమ్॥5431॥
కోట్లకొలది సంవత్సరములవరకు సకల సంకల్పములను సిద్ధింపజేయు మేరుపర్వతముయొక్క సానువులయందు విహరింపసాగెను. ఐన…
[03:20, 13/06/2020] +91 95058 13235: 🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉శ్రీమాత్రేనమః🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అద్వైత చైతన్య జాగృతి సభ్యులందరికీ శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
[03:25, 13/06/2020] +91 95058 13235: 🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏శ్రీమాత్రేనమః 🙏 🙏🙏 🙏🙏🙏 శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ🌹🌹🌹 578వ నామమంత్రము🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉 ఓం ఐం హ్రీం శ్రీం మహాకైలాస నిలయాయై నమః🙏🙏🙏మహాదేవుడే ఉండు మహాకైలాసమే నివాసమే తన స్థానమై ఉండు తల్లికి నమస్కారము🌻🌻🌻శ్రీచక్రం మధ్యలో నుండు బిందువే అమ్మ తన నివాసంగా ఉండు జగన్మాతకు నమస్కారము🌹🌹🌹శ్రీ లలితా సహహ్రనామావళి యందలి మహాకైలాస నిలయా అను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును ఓం ఐం హ్రీం శ్రీం మహాకైలాస నిలయాయై నమః అని ఉచ్చరించుచూ అత్యంత భక్తిశ్రద్ధలతో ఆ పరమేశ్వరిని ఉపాసించు భక్తులు నిశ్చయముగా బ్రహ్మజ్ఞాన సంపన్నులై, శివశక్త్యైత్వ తత్త్వాన్ని గ్రహించి పరాశక్తి కరుణతో ఆత్మానందాన్ని పొంది తరించుదురు🌻🌻🌻శివుడు ఉండే ప్రదేశము కైలాసం అంటే విశ్వము, విశ్వంబరునికన్నా వేరుగా లేకున్నా సామాన్యంగా చెప్పే స్థానం మహాకైలాసం, పాలు ఆవు శరీరమంతా…
[03:25, 13/06/2020] +91 95058 13235: 13.6.2020 ప్రాతః కాల సందేశము
వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం
షష్ఠ స్కంధము - పదిహేడవ అధ్యాయము
చిత్రకేతువును పార్వతీదేవి శపించుట
ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
శ్రీశుక ఉవాచ
17.16 (పదునారవ శ్లోకము)
ఏవం శప్తశ్చిత్రకేతుర్విమానాదవరుహ్య సః|
ప్రసాదయామాస సతీం మూర్ధ్నా నమ్రేణ భారత॥5444॥
శ్రీ శుకుడు పలికెను- రాజా! ఇట్లు పార్వతీ దేవి శపించినంతనే చిత్రకేతువు తన విమానము నుండి దిగి వినమ్రుడై శిరసువంచి, ఆ దేవిని ప్రసన్నురాలినిగా చేసి కొనుటకు సిద్ధపడి ఇట్లు పలికెను-
చిత్రకేతురువాచ
17.17 (పదిహేడవ శ్లోకము)
ప్రతిగృహ్ణామి తే శాపమాత్మనోఽఞ్జలినామ్బికే|
దేవైర్మర్త్యాయ యత్ప్రోక్తం పూర్వదిష్టం హి తస్య తత్॥5445॥
చిత్రకేతువు పలికెను- "జగన్మాతా! నేను సవినయముగా చేతులు జోడించి సంతోషముతో నీ శాపమును గ్రహించు చున్నాను. దేవతలు మనుష్యుల కొరకై చెప్పిన మాటలన్నియును వారి ప్రారబ్ధ కర్మల ఫలములనే సూచించును.
17.18 (పదునెనిమిదవ శ్లోకము)
సంసారచక్ర ఏతస్మిఞ్జన్తురజ్ఞానమోహితః|
భ్రామ్యన్ సుఖం చ దుఃఖం చ భుఙ్క్తే సర్వత్ర సర్వదా॥5446॥
అమ్మా! జీవుడు అజ్ఞానమోహితుడై, ఈ సంసారచక్రమున పరిభ్రమించు చుండును. సర్వదా సర్వత్ర సుఖదుఃఖములను అనుభవించుచునే యుండును.
17.19 (పందొమ్మిదవ శ్లోకము)
నైవాత్మా న పరశ్చాపి కర్తా స్యాత్సుఖదుఃఖయోః|
కర్తారం మన్యతేఽప్రాజ్ఞ ఆత్మానం పరమేవ చ॥5447॥
తల్లీ! జీవుని సుఖ దుఃఖములకు అతని ఆత్మగాని, ఇతరులుగాని కారణము కాదు. సుఖదుఃఖములు కలుగుటకు కారణము తాను లేదా ఇతరులు కర్తలగుదురు అని మానవుడు అజ్ఞానముచే అనుకొనును.
17.20 (ఇరువదియవ శ్లోకము)
గుణప్రవాహ ఏతస్మిన్ కః శాపః కో న్వనుగ్రహః|
కః స్వర్గో నరకః కో వా కిం సుఖం దుఃఖమేవ వా॥5448॥
ఈ జగత్తు సహజముగా సత్త్వరజస్తమో గుణముల ప్రవాహము. శాపానుగ్రహములు, స్వర్గనరకములు, సుఖదుఃఖములు ఆ ప్రకృతి కార్యములే.
17.21 (ఇరువది ఒకటవ శ్లోకము)
ఏకః సృజతి భూతాని భగవానాత్మమాయయా|
ఏషాం బన్ధం చ మోక్షం చ సుఖం దుఃఖం చ నిష్కళః॥5449॥
పరిపూర్ణుడైన ఆ సర్వేశ్వరుడే తన ఆత్మమాయచే సమస్త ప్రాణులను సృష్టించుచున్నాడు; వారి బంధమోక్షములను, సుఖదుఃఖములను ఆ ప్రభువే కల్పించుచున్నాడు.
17.22 (ఇరువది రెండవ శ్లోకము)
న తస్య కశ్చిద్దయితః ప్రతీపో న జ్ఞాతిబన్ధుర్న పరో న చ స్వః|
సమస్య సర్వత్ర నిరఞ్జనస్య సుఖే న రాగః కుత ఏవ రోషః॥5450॥
మాతా! సర్వేశ్వరుడైన శ్రీహరి అందరియెడలను సమదృష్టియే కలిగియుండును. మాయాదోషములు అతనిని అంటవు. అతనికి ప్రియులు, అప్రియులు, జ్ఞాతులు, బంధువులు, తనవారు, పెరవారు అను భేదము ఉండదు. ఆయనకు సుఖమునందే ప్రీతి లేనప్ఫుడు రాగానుబంధమైన కోపము ఎట్లు కలుగును?
17.23 (ఇరువది మూడవ శ్లోకము)
తథాపి తచ్ఛక్తివిసర్గ ఏషాం సుఖాయ దుఃఖాయ హితాహితాయ|
బన్ధాయ మోక్షాయ చ మృత్యుజన్మనోః శరీరిణాం సంసృతయేవ కల్పతే॥5451॥
ఐననూ, ఆయన మాయాశక్తి ఈ దేహధారులకు సుఖదుఃఖములను, మంచి-చెడులను, బంధ-మోక్షములను, జనన-మరణములను కల్పించుటకు ప్రవాహరూపమగు సంసారమును కల్పించుటకు సమర్థమగుచున్నది.
17.24 (ఇరువది నాలుగవ శ్లోకము)
అథ ప్రసాదయే న త్వాం శాపమోక్షాయ భామిని|
యన్మన్యసే హ్యసాధూక్తం మమ తత్ క్షమ్యతాం సతి॥5452॥
పతివ్రతామతల్లీ! నీవు ఇచ్చిన శాపమునుండి ముక్తునిచేసి, నన్ను అనుగ్రహింపుమని నేను కోరుటలేదు. కాని, అనుచితములుగా తలచిన నా చెడు మాటలను మన్నించి, నన్ను క్షమింపుమని నిన్ను వేడుకొనుచున్నాను"
శ్రీశుక ఉవాచ
17.25 (ఇరువది ఐదవ శ్లోకము)
ఇతి ప్రసాద్య గిరిశౌ చిత్రకేతురరిన్దమ|
జగామ స్వవిమానేన పశ్యతోః స్మయతోస్తయోః॥5453॥
శ్రీ శుకుడు వచించెను- "రాజా! విద్యాధరుడైన చిత్రకేతువు శంకరభగవానుని, పార్వతీదేవిని ఈ విధముగా ప్రసన్నులనుగా చేసికొనెను. అనంతరము వారు చూచుచుండగనే అతడు తన విమానమును ఎక్కి అచటినుండి వెళ్ళిపోయెను. అతని వినమ్రతకు వారు ఎంతయు ఆశ్చర్యపడిరి.
17.26 ఇరువది ఆరవ శ్లోకము)
తతస్తు భగవాన్ రుద్రో రుద్రాణీమిదమబ్రవీత్|
దేవర్షిదైత్యసిద్ధానాం పార్షదానాం చ శృణ్వతామ్॥5454॥
దేవతలు, ఋషులు, దైత్యులు, సిద్ధులు, పార్షదులు వినుచుండగ, పరమశివుడు పార్వతితో ఇట్లు పలికెను-
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి షష్ఠస్కంధములోని పదిహేడవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
13.6.2020 సాయం కాల సందేశము
వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం
షష్ఠ స్కంధము - పదిహేడవ అధ్యాయము
చిత్రకేతువును పార్వతీదేవి శపించుట
ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉️🕉️
శ్రీరుద్ర ఉవాచ
17.27 (ఇరువది ఏడవ శ్లోకము)
దృష్టవత్యసి సుశ్రోణి హరేరద్భుతకర్మణః|
మాహాత్మ్యం భృత్యభృత్యానాం నిఃస్పృహాణాం మహాత్మనామ్॥5455॥
శ్రీ శివుడు పలికెను- సుందరీ! శ్రీహరియొక్క దివ్యలీలలు అద్భుతములు, ఆయన దాసానుదాసులు, ఉదార హృదయులు ఎట్టి కోరిక లేని వారు. వారి మహిమను నీవు కనులార చూచితివిగదా!
17.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)
నారాయణపరాః సర్వే న కుతశ్చన బిభ్యతి|
స్వర్గాపవర్గనరకేష్వపి తుల్యార్థదర్శినః॥5456॥
శ్రీమన్నారాయణునకు ప్రసన్నులైనవారు దేనికిని భయపడరు. వారికి స్వర్గము, నరకము, మోక్షము, మొదలగునవి అన్నియును సమానములే. వారు అన్నింటి యందును పరమాత్మతత్తవమును దర్శించుచుందురు.
17.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)
దేహినాం దేహసంయోగాద్ద్వన్ద్వానీశ్వరలీలయా|
సుఖం దుఃఖం మృతిర్జన్మ శాపోఽనుగ్రహ ఏవ చ॥5457॥
దేవీ! శ్రీహరిలీలా ప్రభావమున జీవునకు దేహముతో సంయోగము ఏర్పడును. ఆ కారణమున వారికి సుఖదుఃఖములు,జనన మరణములు, శాపానుగ్రహములు మొదలగు ద్వంద్వములు ప్రాప్తించును.
17.30(ముప్పదియవ శ్లోకము)
అవివేకకృతః పుంసో హ్యర్థభేద ఇవాత్మని|
గుణదోషవికల్పశ్చ భిదేవ స్రజివత్కృతః॥5458॥
మానవునకు భేదదృష్టి కారణముగా స్వప్నమునందు సుఖదుఃఖాదులు ప్రతీతములగును. జాగ్రదవస్థయందు వారు భ్రమకులోనై, మాలను సర్పముగా భావింతురు. అట్లే మనుష్యుడు అజ్ఞాన వశమున ఆత్మయందు దేవ, మనుష్యాది భేదములను, గుణదోషాదులను కల్పించుకొనును.
17.31 (ముప్పది ఒకటవ శ్లోకము)
వాసుదేవే భగవతి భక్తిముద్వహతాం నృణామ్|
జ్ఞానవైరాగ్యవీర్యాణాం నేహ కశ్చిద్వ్యపాశ్రయః॥5459॥
వాసుదేవ భగవానుని చరణములయందు భక్తిగలవారు, జ్ఞాన, వైరాగ్యబల సంపన్నులగుదురు. వారికి ఈ లోకమున రాగద్వేషముల కారణముగ ఆశ్రయింప దగినదిగాని, త్యజింపవలసినది గాని ఏదియు ఉండదు. ఏలయన, వారికి భగవంతుడు తక్క వేరొక అస్తిత్వముగల వస్తువు ఏదీలేదు.
17.32 (ముప్పది రెండవ శ్లోకము)
నాహం విరిఞ్చో న కుమారనారదౌ న బ్రహ్మపుత్రా మునయః సురేశాః|
విదామ యస్యేహితమంశకాంశకా న తత్స్వరూపం పృథగీశమానినః॥5460॥
నేనును, బ్రహ్మదేవుడును, సనకాదులు, నారదాదులు, బ్రహ్మ పుత్రులైన భృగువు, ఆది మునీశ్వరులు, దేవతలు మొదలగువారు అందరును ఆ భగవానుని లీలా రహస్యములను ఎరుగరు. ఆ భగవానుని అంశాంశలమైన మేమ ఆ స్వామి స్వరూపమును ఎరుంగక మేమే జగత్తునకు ప్రభువులమని విర్రవీగుచుందుము.అట్టి స్థితిలో మేము కూడ ఆ పరమేశ్వరుని లీలా రహస్యమును ఎట్లు తెలియుదుము?
17.33 (ముప్పది మూడవ శ్లోకము)
న హ్యస్యాస్తి ప్రియః కశ్చిన్నాప్రియః స్వః పరోఽపి వా|
ఆత్మత్వాత్సర్వభూతానాం సర్వభూతప్రియో హరిః॥5461॥
శ్రీహరికి ఎవ్వరును ప్రియుడుగాని, అప్రియుడుగాని లేరు. తనవారుగాని, పెరవారుగాని లేరు. ఆయన సకల ప్రాణులకు ఆత్మ. కనుక ఆయనకు సకల ప్రాణులును ప్రీతిపాత్రులే.
17.34 (ముప్పది నాలుగవ శ్లోకము)
తస్య చాయం మహాభాగశ్చిత్రకేతుః ప్రియోఽనుగః|
సర్వత్ర సమదృక్ శాన్తో హ్యహం చైవాచ్యుతప్రియః॥5462॥
17.35 (ముప్పది ఐదవ శ్లోకము)
తస్మాన్న విస్మయః కార్యః పురుషేషు మహాత్మసు|
మహాపురుషభక్తేషు శాన్తేషు సమదర్శిషు॥5463॥
దేవీ! పరమ భాగ్యశాలియైన చిత్రకేతువు ఆయనకు ప్రియమైన అనుచరుడు. శాంతస్వభావుడు, సమదర్శి. నేనుగూడ ఆ శ్రీహరికి ప్రియభక్తుడను. కావున, నీవు ఆ భగవంతునకు ప్రియమైన భక్తులు, శాంత చిత్తులు, సమదర్శులు, మహాత్ములు ఐనవారి విషయమున ఎట్టి ఆశ్చర్యమునకు లోను కావలదు.
శ్రీశుక ఉవాచ
17.36 (ముప్పది ఆరవ శ్లోకము)
ఇతి శ్రుత్వా భగవతః శివస్యోమాభిభాషితమ్
బభూవ శాన్తధీ రాజన్ దేవీ విగతవిస్మయా॥5464॥
శ్రీ శుకుడు వచించెను- రాజా! శంకరభగవానుని పలుకులను విన్న పిమ్మట పార్వతీదేవి యొక్క మనస్సు స్తిమిత పడెను. చిత్రకేతువునెడ ఆమెకుగల అభిప్రాయము తొలగిపోయెను.
17.37 (ముప్పది ఏడవ శ్లోకము)
ఇతి భాగవతో దేవ్యాః ప్రతిశప్తుమలన్తమః|
మూర్ధ్నా సంజగృహే శాపమేతావత్సాధులక్షణమ్॥5465॥
భకవద్భక్తుడైన చిత్రకేతువు గూడ పార్వతీ దేవికి ప్రతిశాపమును ఈయగల సమర్థుడే. కాని, ఆమె ఇచ్చిన శాపమును శిరసావహించెను. సాధు పురుషుల లక్షణమే అంత.
17.38 (ముప్పది ఎనిమిదవ శ్లోకము)
జజ్ఞే త్వష్టుర్దక్షిణాగ్నౌ దానవీం యోనిమాశ్రితః|
వృత్ర ఇత్యభివిఖ్యాతో జ్ఞానవిజ్ఞానసంయుతః॥5466॥
ఆ చిత్రకేతువే త్వష్టకు దక్షిణాగ్నియందు అసురుడుగా జన్మించెను. అతడు వృత్రుడను పేర ఖ్యాతివహించెను. పూర్వజన్మ సంస్కార ప్రభావమున అతనికి భగవత్స్వరూపజ్ఞానము, భగవంతుని యెడగల భక్తి పూర్తిగా ఏర్పడెను.
17.39 (ముప్పది తొమ్మిదవ శ్లోకము)
ఏతత్తే సర్వమాఖ్యాతం యన్మాం త్వం పరిపృచ్ఛసి|
వృత్రస్యాసురజాతేశ్చ కారణం భగవన్మతేః॥5467॥
పరీక్షిన్మహారాజా! అసురుడుగా జన్మించిన వృత్రునకు ఇట్టి భగవద్భక్తి ఏర్పడుటకు కారణమేమని నీవు అడిగియుంటివి. దానిని గూర్చి నీకు పూర్తిగా వివరించితిని.
17.40 (నలుబదియవ శ్లోకము)
ఇతిహాసమిమం పుణ్యం చిత్రకేతోర్మహాత్మనః|
మాహాత్మ్యం విష్ణుభక్తానాం శ్రుత్వా బన్ధాద్విముచ్యతే॥5468॥
మహాత్ముడైన చిత్రకేతువు యొక్క ఈ ఇతిహాసము మిగుల పవిత్రమైనది. విష్ణు భక్తులయొక్క మహాత్మ్యమును గూర్చి విన్నవారి బంధములన్నియును తొలగి పోవును గదా!
17.41 (నలుబది ఒకటవ శ్లోకము)
య ఏతత్ప్రాతరుత్థాయ శ్రద్ధయా వాగ్యతః పఠేత్|
ఇతిహాసం హరిం స్మృత్వా స యాతి పరమాం గతిమ్॥5469॥
ప్రాతఃకాలమున నిద్రలేచి, మౌనముగా భక్తి శ్రద్ధలతో శ్రీహరిని స్మరించుచు ఈ ఇతిహాసమును పఠించినవారు, పఠింపజేసినవారు, వినిపించినవారు పరమపదమును పొందుదురు.
ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం షష్ఠస్కంధే సప్తదశోఽధ్యాయః (17)
ఇది శ్రీమద్భాగవత మహాపురాణమునందలి షష్ఠ స్కంధమునందు పదిహేడవ అధ్యాయము (17)

No comments:
Post a Comment