వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం, సప్తమ స్కంధము - రెండవ అధ్యాయము
హిరణ్యాక్షుని వధానంతరము హిరణ్యకశిపుడు తన తల్లిని, ఇతర బంధువులను ఓదార్చుట
ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
నారద ఉవాచ
నారదుడు వచించెను-ధర్మరాజా! శ్రీమహావిష్ణువు యజ్ఞవరాహావతారము దాల్చి, హిరణ్యాక్షుని సంహరించెను. అప్పుడు హిరణ్యకశిపుడు తన సోదరుని మరణమునకు శోకసంతప్తుడై శ్రీహరికి మిగుల క్రుద్ధుడయ్యెను.
ఆ క్రోధాతిరేకముతో అతని శరీరము కంపించుచుండెను. అప్పుడతడు పండ్లు పటపట కొరుకుచు, కన్నుల నిప్పులు గ్రక్కుచు, ఆకాశమువైపు చూచుచు ఇట్లు పలికెను-
హిరణ్యకశిపుని కోరలు మిగుల భీకరముగా నుండెను. ముడిచిన బొమముడితో అతని ముఖము చూడశక్యము గాకుండెను. నిండుసభలో అతడు శూలమును చెబూని, దానవులతో ఇట్లనెను - "దానవులారా! దైత్యులారా! ద్విమూర్ధా! త్ర్యక్షా! శంబరా! శతబాహూ! హయగ్రీవా! నముచీ! పాకా! ఇల్వలా! విప్రచిత్తీ! పులోమా! శకునాదులారా! నామాటలను శ్రద్ధగా ఆలకింపుడు. పిమ్మట నేను చెప్పినట్లుచేయుడు. ఆలస్యము చేయవద్దు".
హిరణ్యకశిపుడు ఇంకను ఇట్లనుచుండెను:
"నా సోదరుడైన హిరణ్యాక్షుడు నాకు ప్రాణతుల్యుడు, హితైషి, క్షుద్రులైన దేవతలు శ్రీహరితో అతనిని చంపించిరి. శ్రీహరి దేవతలపై, దైత్యులపై సమభావము కలిగియున్నప్పటికిని వారు ఆయనకడకు పరుగెత్తి, వినమ్రవచనములతో ఆయనను తమ వైపు త్రిప్ఫుకొనిరి'.
హిరణ్యకశిపుడు ఇంకను ఇట్లనుచుండెను:
'శ్రీమహావిష్ణువు పవిత్రుడు, నిష్పక్షపాతి. ఐనను, అతడు తన స్వభావమునకు విరుద్ధముగా మాయతో యజ్ఞవరాహ రూపమును దాల్చెను. బాలునివలె అతడు తనను సేవించు వారి పక్షము వహించెను. అతని చిత్తము చంచలమైనది'.
హిరణ్యకశిపుడు ఇంకను ఇట్లనుచుండెను:
ఇప్పుడే నేను నా శూలముచే అతని కంఠమును నరికెదను. రక్తదాహముగల నా సోదరునకు అతని నెత్తురుతో తర్పణమిచ్చెదను. అంతట నా కసి తీరును.
చెట్టుయొక్క మూలమును ఖండించినచో, దాని కొమ్మలు వాటి యంతట అవే ఎండిపోవును. అట్లే మాయావియైన విష్ణువును వధించినచో, ఆయననే నమ్ముకొని యున్న దేవతలు కృశించి పోవుదురు. ఏలయన, దేవతలకు ప్రాణము ఆ విష్ణువేకదా!'
హిరణ్యకశిపుడు ఇంకను ఇట్లనుచుండెను:
కనుక, మీరు ఇప్పుడే భూతలమునకు చేరుడు. అచట బ్రాహ్మణుల, క్షత్రియుల సంఖ్య పెరిగిపోవుచున్నది. జనులు అచట తపస్సులు, యజ్ఞములు, స్వాధ్యాయములు (వేదపఠనములు), వ్రతములు, దానములు మొదలగు శుభకర్మలను ఆచరించుచున్నారు. వారిని అందరిని వధింపుడు'.
హిరణ్యకశిపుడు ఇంకను ఇట్లనుచుండెను:
వేదవేత్తలైన బ్రాహ్మణులు ఆచరించు ధర్మకార్యములకు, శ్రీమహావిష్ణువు మూలము. అతడు యజ్ఞ ధర్మ స్వరూపుడు. దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు, సకలప్రాణులకు, ధర్మమునకు పరమాశ్రయుడు.
బ్రాహ్మణులు, గోవులు, వేదములు, వర్ణాశ్రమధర్మ కార్యములు గల దేశములకు వెళ్ళుడు. వాటిని అన్నింటిని తగులబెట్టి నాశమొనర్పుడు'
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి సప్తమస్కంధములోని రెండవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

దైత్యులు సహజముగనే జనులను హింసించుచు, సంతసించు చుందురు. కనుక, వారు తమకు ప్రభువైన హిరణ్యకశిపుని ఆజ్ఞను శిరసావహించి, జనులును హింసింపసాగిరి.
వారు పురములను, గ్రామములను, గోశాలలను, ఉద్యానవనములను, పంటపొలములను, విహారభూములను, ఋష్యాశ్రమములను, గనులను, రైతుల పల్లెలను, కొండపల్లెలను, అడవులను, పట్టణములను తగులబెట్టిరి.
కొందరు దైత్యులు గడ్డపారలతో వంతెనలను ప్రాకారములను, గోపురములను ధ్వంసమొనర్చిరి. మరికొందరు గొడ్డళ్ళను చేబూని, ఫలపుష్పములతో కళకళలాడుచున్న వృక్షములను నరికివేసిరి. ఇంకను కొందరు మండుచున్న కొరవులతో ప్రజల ఇండ్లను అగ్గిపాలు చేసిరి.
ఈ విధముగా హిరణ్యకశిపుని యొక్క అనుచరులు, అమాయకులైన ప్రజలను పీడింపసాగిరి. అప్పుడు దేవతలు స్వర్గమును వీడి, భూతలమునకు చేరి, రహస్యముగా తలదాచుకొనిరి.
ధర్మరాజా! హిరణ్యకశిపుడు తన సోదరుడు మృతుడగుటతో మిక్కిలి పరితపించెను. అంత్యక్రియలను ఆచరించిన పిదప, తన సోదరుని సుతులైన శకుని, శంబరుడు, దృష్టుడు, భూతసంతాపనుడు, వృకుడు, కాలనాభుడు, మహానాథుడు, హరిశ్మశ్రుడు, ఉత్కచుడు అనువారిని ఓదార్చెను. పిదప వారి తల్లియైన (హిరణ్యాక్షుని భార్యయైన) రుషభానువును, తన తల్లియైన దితిని దేశకాలములను అనుసరించి, ఆత్మీయ వచనములతో ఓదార్చెను-
హిరణ్యకశిపురువాచ
తల్లీ! దితీ! రుషాభానూ! పుత్రులారా! మీరు శోకింపదగని వీరుడైన హిరణ్యాక్షుని కొరకై ఈ విధముగా దుఃఖింపదగదు. వీరులు రణరంగమున శత్రువును ఎదుర్కొని, మృతిచెందుటను కోరుకొందురు. వీర మరణము శ్లాఘనీయము.
చలివేంద్రమునొద్ద పెక్కుమంది వ్యక్తులు కలియుచుందురు. కాని, వారి కలయిక కొద్ది సమయమువరకే ఉండును. అట్లే జీవులు గూడ తామొనర్చిన కర్మలను బట్టి దైవ వశమున కలియుదురు. విడిపోవుదురు.
వాస్తవముగా ఆత్మ కాలమునకు అతీతమైనది. వినాశము లేనిది. పవిత్రమైనది. సర్వవ్యాపి. సర్వజ్ఞము. దేహేంద్రియాదులకంటె వేరైనది. అదీ అజ్ఞాన కారణముగా దేహాదులను సృష్టించుకొని. భోగసాధనమైన సూక్ష్మశరీరమును స్వీకరించును.
పుణ్యాత్ములారా! కదలుచున్న నీటియందు ప్రతిబింబించిన వృక్షముగూడ కదలుచున్నట్లుగా కనబడును. కన్నులు తిరిగినిప్పుడు భూమి తిరుగుచున్నట్లు కనబడును. అట్లే, గుణకార్యములగు విషయములకు కారణమైన మనస్సు చలించు చుండుటచే వికారరహితమైన ఆత్మగూడ దానితో సమానముగా చలించుచున్నట్లు అనిపించును. స్థూల, సూక్ష్మ శరీరములతో ఆత్మకు ఎట్టి సంబంధమూ లేదు. ఐనను, వీటితో సంబంధమున్నట్లు గోచరించును.

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం సప్తమ స్కంధము - రెండవ అధ్యాయము
హిరణ్యాక్షుని వధానంతరము హిరణ్యకశిపుడు తన తల్లిని, ఇతర బంధువులను ఓదార్చుట
ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
ఆత్మకు ఎట్టి శరీరము లేకున్నను, తనను శరీరముగా భావించుటయే అజ్ఞానము. దానివలన ప్రియమైన, అప్రియమైన వస్తువుల సంయోగము, వినియోగము కలుగు చుండును. అందువలన కర్మలతో సంబంధము ఏర్పడును. ఫలితముగా సంసారచక్రములో పరిభ్రమింప వలసి వచ్చును.
జనన మరణములు,పెక్కువిధములైన దుఃఖములు, అవివేకము, చింతలు, వివేకము యొక్క విస్మృతి మొదలగువాటికి, అన్నిటికిని అజ్ఞానమే కారణము
ఈ విషయములో మహాత్ములు ఒక ప్రాచీన ఇతిహాసమును తెలిపెదరు. అది మృతుడైన మానవుని యొక్క బంధువులకును, యమధర్మరాజునకు మధ్య జరిగిన సంభాషణము. దానిని తెలిపెదను శ్రద్ధగా వినుడు-
ఉశీనరదేశమునందు సుయజ్ఞుడు అను పేరు గల యశస్వియైన ఒకరాజు ఉండెను. యుద్ధములో శత్రువులు అతనిని వధించిరి. అతని బంధుమిత్రులు అతని చుట్టును కూర్చొనియుండిరి.
రత్నఖచితమైన అతనికవచము భగ్నమై యుండెను. అతని ఆభరణములు, మాలలు చెల్లాచెదరై పడిపోయి యుండెను. శత్రువుల బాణముల తాకిడికి అతని హృదయము భిన్నమైయుండెను. శరీరము రక్తముతో తడిసి యుండెను. కేశములు చెదరియుండెను. కనులు కాంతిహీనమై యుండెను. కోపకారణముగా దంతములు పెదవులను కొరుకుచున్నట్లుండెను. కమలము వంటి ఆయన ముఖము దుమ్ముకొట్టుకొని యుండెను. యుద్ధములో అతని శస్త్రములు, భుజములు ఖండింపబడి యుండెను.
దైవవశమున మృతుడై పడియున్న ఆ ఉశీనరరాజును జూచి, ఆయన రాణులు దుఃఖముతో క్రుంగి పోయి విలవిలలాడుచు ఇట్లనిరి- "నాథా! భాగ్యహీనువమైన మేము దిక్కులేని వారమైతిమి" అని పలుకుచు వారు గుండెలు బాదుకొనుచు తమ పతిదేవుని పాదములపై బడిరి.
వారు బిగ్గరగా ఏడువ సాగిరి. వారి వక్షస్థలమునందు విలేపితమైన కుంకుమ దుఃఖాశ్రువులతో కలిసి అతని పాదమును తడుపసాగెను. వారి కేశములు, ఆభరణములు ఇటునటు చెల్లాచెదరైయుండెను. దుఃఖపూరితమైన వారి ఆక్రందనలకు అచటి మనుష్యులును మిగుల పరితపింపసాగరి.
మృతుడై పడియున్న ఉశీనరరాజును జూచి ఆయన రాణులు దుఃఖముతో క్రుంగి విలపించుచూ ఇంకను ఇట్లనుచున్నారు:
"అయ్యో! విధాత ఎంత క్రూరుడు. నేడు నిన్ను మృతుని గావించి, నేత్రములకు గోచరముగాని దశకు చేర్చినాడు. ఇంతకు ముందు ఉశీనరదేశ వాసులందరికిని పోషకుడవై యుంటివి. నేడు అతడు నిన్న ఈ స్థితికి చేర్చి, మమ్ములను శోకసాగరములో ముంచివేసెను.
మృతుడై పడియున్న ఉశీనరరాజును జూచి ఆయన రాణులు దుఃఖముతో క్రుంగి విలపించుచూ ఇంక ఇట్లనుచున్నారు:
ప్రాణేశ్వరా! నీవు మమ్ములను ఎంతగానో ప్రేమించుచుంటిని. మేము చేయు కొద్దిసేవలకే మిగుల సంతసించుచుంటిని. ఇప్పుడు నీవు లేకుండా మేము ఎట్లు జీవింపగలము? మేము ఎల్లప్పుడును నీ పాదములనే ఆశ్రయించుచుండువారము. నీవు వెళ్ళిన చోటికే మేమును వచ్చెదము'
ఆ రాణులు పతిదేవుని శవమును కౌగలించుకొని ఇట్లు బోరుబోరున విలపింపసాగిరి.అతని మృతకళేబరమును దహనము చేయుటకు వారు ఇష్టపడకుండిరి. ఇంతలో సూర్యుడు అస్తమించెను. ఆ రాజుగారి బంధువుల యొక్క రోదన ధ్వనిని విని, యమధర్మరాజు స్వయముగా బాలుని వేషములో అచటికి వచ్చి, వారితో ఇట్లు పలికెను-
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి సప్తమస్కంధములోని రెండవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
***
వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం, సప్తమ స్కంధము - రెండవ అధ్యాయము
హిరణ్యాక్షుని వధానంతరము హిరణ్యకశిపుడు తన తల్లిని, ఇతర బంధువులను ఓదార్చుట ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
యమ ఉవాచ
యముడు ఇట్లు పలికెను- మీరు వయసులో పెద్దవారు. లోకములోని ప్రాణుల యొక్క జనన మరణములను చూచుచునే యున్నారు. ఐనను, మెండైన మోహములో పడిపోయినారు. ఈ మానవుడు ఎచటి నుండి వచ్చెనో, అచటికి వెళ్ళినాడు. మీరుకూడ ఏదో యొకనాడు వెళ్ళవలసిన వారే. ఐనను వ్యర్థముగా శోకించుచున్నారు. ఇది మిగుల ఆశ్చర్యకరము.
మేము ఎంతయు ధన్యజీవులము. మా తల్లిదండ్రులు మమ్ములను వదలిపెట్టి వెళ్ళిరి. మేము శారీరకముగా దుర్బలులమైనను మాకు ఎట్టి చింతయును లేదు. తోడేళ్ళు మొదలగు క్రూరమృగములు మమ్ము ఏమియు చేయలేవు. మేము తల్లి గర్భములో ఉన్నప్పుడు రక్షించిన దేవుడే మమ్ములను జీవిత పర్యంతము కాపాడును.
రాణులారా! శాశ్వతుడైన ఈశ్వరుడే తన ఇష్టాను సారము ఈ జగత్తును సృష్టించి, పాలించి, లయమొనర్చు చున్నాడు. ఇది యెంతయు ఆ సర్వేశ్వరునకు ఒక క్రీడ. అతడు ఈ చరాచరజగత్తును దండించుటకును, ఆదరించుటకును సమర్థుడు.
అదృష్టము ఉన్నచో, వీధిపాలైన వస్తువుగూడ సురక్షితముగా ఉండును. దైవము ప్రతికూలుడైనచో ఇంటిలో ఉంచబడిన వస్తువుగూడ నశించును. జీవుడు ఎవరు తోడు లేకున్నను దైవానుగ్రహమున అడవిలోగూడ జీవించుయుండును. కాని దైవము చిన్నచూపు చూచినచో, ఇంటిలో దాగికొన్నను మృత్యువుపాలగుట తథ్యము.
రాణులారా! ప్రాణులు వాటి పూర్వజన్మ కర్మవాసనలను అనుసరించి, జన్మించు చుంఢును. కాలము ఆసన్నమైనంతనే అవి మరణించుచుండును. కాని, ఆత్మ శరీరముకంటె భిన్నమైనది. అందువలన శరీరములో ఉన్నను దాని జననమరణ రూప ధర్మములు ఆత్మకు అంటవు.
మానవుడు మట్టితో నిర్మించిన తన గృహమును తన కంటె వేరుగ భావించును. అట్లే పాంచభౌతికమైన ఈ శరీరముగూడ ఆత్మకంటెసు వేరైనది. కాని, మోహవశమున అతడు దానిని తనదిగా భావించును. మట్టిని నీటితో తడిపి కుండను తయారుచేసి, అగ్నిలో కాల్చిన పిదప కుండ సిద్ధమగును. కాలాంతరమున కుండ పగిలినప్పుడు తిరిగి అది తన మూలతత్త్వములైన మట్టి, నీరు నిప్పులో కలిసిపోవును. అటులే పంచభూతములతో నిర్మాణమైన ఈ శరీరము కాలప్రభావముచే నిర్మింపబడును. కాలక్రమమున మార్పుచెంది, నశించిపోవును.
కర్రలలో వ్యాపించియున్న అగ్ని వాటికంటే వేరుగా కన్పట్టును. దేహములో ఉన్ననూ వాయువునకు, ఆ దేహముతో ఎట్టి సంబంధమూ ఉండదు. ఆకాశము సర్వత్ర ఒకేవిధముగా ఉన్ననూ, అది ఎట్టి గుణదోషములతోను లిప్తముగాదు. అట్లే సమస్త జీవుల దేహములలో ఉండి, వాటికి ఆశ్రయమైన ఆత్మగూడ వాటికంటెను భిన్నముగా నిర్లిప్తముగా ఉండును.
మూఢులారా! శోకింపగూడని దానిని గూర్చి మీరు ఎందుకు శోకించుచున్నారు? ఈ శోకమునకు కారణమైన సుయజ్ఞుని శరీరమైతే మీ యెదుటనే పడియున్నది. దానిని మీరు చూచుచునేయున్నారు. మీ మాటలను వినువాడు, మీతో మాట్లాడువాడు ఎన్నటికిని, ఎవ్వరికిని కనబడడు. ఇప్పుడు గూడ అతడు కనబడుటలేదు. ఇక అతనికొరకై శోకించుట ఎందులకు?
శరీరమునందు అన్ని ఇంద్రియముల చేష్టలకు హేతువు ముఖ్యప్రాణము. అది ముఖ్యమైనదే ఐనప్పకిని అది మాట్లాడదు, వినదు. ఏలయన అది జడము. దేహేంద్రియములద్వారా అన్ని పదార్థములను చూచుచుండునది ఆత్మ. అది శరీరము కంటెను ప్రాణములకంటెను విలక్షణమైనది.
ఆత్మ అఖండము, సర్వవ్యాపకము. ఐనను పంచభూతములు, ఇంద్రియములు, మనసు అను వానితోగూడి దేవ, మనుష్య, పశు, పక్ష్యాది శరీరములను ధరించును. తన బుద్ధిబలముతో ముక్తినిగూడ పొందును. వాస్తవముగ అది వాటికంటె వేరైనది.
పంచప్రాణములు (5), పంచకర్మేంద్రియములు (5), పంచ జ్ఞానేంద్రియములు (5), బుద్ధి (1), మనస్సు (1) అను పదునేడు తత్త్వముల కార్యరూపమైన లింగశరీరముతో కలిసియున్నంత వరకును జీవుడు కర్మలలో బంధింపబడి యుండును. ఈ బంధములకు కారణమైన మాయవలన కలిగే మోహము, క్లేశము తప్పనిసరిగా జీవుని వెంబడించి యుండును.
ప్రకృతియొక్క గుణములను వాటి కార్యరూపములైన వస్తువులను సత్యమని భావించుట, పలుకుట అజ్ఞానము. మనోరథములు నెరవేరుటకు కల్పింపబడిన వస్తువులన్నియును స్వప్నముల వలె మిథ్యయే. ఇంద్రియముల ద్వారా గ్రహింపబడిన ఆ వస్తువులునూ (ఈ జగత్తుకూడా) మిథ్యయే.
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి సప్తమస్కంధములోని రెండవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
***
వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం, సప్తమ స్కంధము - రెండవ అధ్యాయము
హిరణ్యాక్షుని వధానంతరము హిరణ్యకశిపుడు తన తల్లిని, ఇతర బంధువులను ఓదార్చుట, ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
అందువలన శరీరము యొక్క ఆత్మయొక్క తత్ప్వమును ఎరింగిన జ్ఞానులు అనిత్యమైన శరీరము కొరకు గాని, నిత్యమైన ఆత్మకొరకుగాని శోకింపరు. జ్ఞానము దృఢముగా లేనట్టి అజ్ఞానులు ఎల్లప్పుడు శోకించుచుందురు. అట్లని వారు దేహాదుల స్వభావమగు అనిత్యత్వముసు మార్చి, వాటిని శాశ్వతముగా మార్చలేరుకదా! అది అసంభవమైనపని. అంతేగాక, అట్టి మానవుల స్వభావము మారుట కూడా అసంభవమే. కావున, నిత్యానిత్య వస్తువివేకముగల వారలు శోకించుటయే వ్యర్థమని తలంతురు.
ఒకానొక అడవిలో ఒక వేటగాడు ఉండెను. విధాత వానిని పక్షులను హతమార్చుటకై కాలస్వరూపునిగా సృష్టించినట్లున్నది. అతడు పక్షులను ప్రలోభపెట్టి పట్టుకొనుటకై అచ్చటచ్చట వలలను పన్నియుండెను.
ఒకనాడు అతడు వడ్రంగి పిట్టల జంటలు గింజలకొరకై తిరుగుచుండుట చూచెను. వెంటనే ఆ వేటగాడు ఆడుపక్షిని ప్రలోభపరచి, వలలో బంధించెను.
విధివశమున ఆ ఆడుపిట్ట వలలో చిక్కుకొనెను. మగపక్షి ఆపదలోనున్న ఆ ఆడుపక్షినిజూచి, మిగుల దుఃఖించెను. నిస్సహాయురాలైయున్న ఆడుపక్షి కొరకై అది పరితపించుచు ఇట్లనెను-(తరువాత శ్లోకం)
నిస్సహాయురాలైయున్న ఆడుపక్షి కొరకై మగపక్షి పరితపించుచు ఇట్లనెను
"విధాత సర్వశక్తి మంతుడేయైనను మిక్కిలి నిర్దయుడు. ఈ నా సహచరి ఒక స్త్రీ అదృష్ట హీనుడనైన నా కొరకు దీనముగా శోకించుచున్నది. దీనిని తీసికొని పోయి, అతడేమి చేయునోకదా!"
నిస్సహాయురాలైయున్న ఆడుపక్షి కొరకై మగపక్షి పరితపించుచు ఇంకను ఇట్లనెను
"ఆ దేవునకు ఇష్టమైనచో నన్ను తీసికొని పోవలసియుండెను. ఇప్పుడు నా భార్యలేకుండా విధురడ (భార్యలేనివాడ) నైన నేను దైన్యముతో, దుఃఖముతో నిండిన ఈ జీవితమును గడపుటయెట్లు?"

"మా పిల్లలు మందభాగ్యులు. వాటికి ఇంకను ఱెక్కలుగూడ రాలేదు. అవి తమ తల్లి కొరకై గూటిలో ఎదురుచూచుచున్నవి. తల్లిని కోల్పోయిన మాపిల్లలను ఇక మీదట పోషించుటయెట్లు?"
ఆ విధముగా ఆ మగపిట్ట తన అర్ధాంగి వియోగమును భరింపజాలక మిక్కిలి విలపింపసాగెను. దుఃఖాతి రేకముచే దానికంఠము బొంగురుపోయెను. కాలుని ప్రేరణచే అచటనే పొంచియున్న ఆ వేటగాడు ఒక బాణముచే ఆ మగపక్షిని గూడ కొట్టెను. అది గూడ అసువులను బాసెను.
బాలుని వేషములో నున్న యముడు మృతుడైన ఉశీనరరాజు రాణులతో వడ్రంగి పిట్టల కథ చెప్పిన తరువాత ఇంకను ఇట్లు అనుచున్నాడు
మూర్ఖులైన రాణులారా! మీకును ఇట్టి గతియే పట్టుచున్నది. మీకు రాబోవు మృత్యువును మీరు గుర్తింపలేకున్నారు. మోహములో పడి ఇతని కొరకై విలపించుచున్నారు. నూరు సంపత్సరముల వరకు ఇట్లు గుండెలు బాదుకొనుచు శోకించుచున్నను మీరు మీ పతిని మాత్రము పొందలేరు".
హిరణ్యకశిపురువాచ
హిరణ్యకశిపుడు ఇట్లనెను- బాలుని రూపములో నున్న ఆ యమధర్మరాజు చెప్పిన జ్ఞానవిలసితమైన, ఈ మాటలకు అందరును ఆశ్చర్యపడిరి. ఉశీనరుని బంధుమిత్రులు, రాణులు ఈ సంసారము, అందలి సుఖదుఃఖములు అనిత్యమనియు, మిథ్యయనియు, తెలిసికొనిరి. యమధర్మరాజు ఈ ఉపాఖ్యానమును తెలిపి, వెంటనే అంతర్ధానమయ్యెను. సుయజ్ఞుని బంధుమిత్రులు అతనికి అంత్యక్రియలను నెరపిరి.
కనుక, మీరు, మీ కొరకుగాని, ఇతరుల కొరకుగాని దుంఖింపదగదు. ఈ జగత్తులో మనవాడు ఎవరు? పరాయి వాడెవరు? మన వస్తువేది? ఇతరుల వస్తువేది? ప్రాణులు అజ్ఞానముచే ఇది నాది, ఇది పరులది అను భేదబుద్ధిని కలిగియుండును.
శ్రీనారద ఉవాచ
నారదుడు వచించెను- ధర్మరాజా! హిరణ్యకశిపుని ఈ మాటలను విని, దితియు, ఆమె కోడలును అదే క్షణములో పుత్రశోకమును వీడిరి. తమ చిత్తములను పరమాత్మ తత్త్వమునందు లగ్నమొనర్చిరి.
ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం సప్తమస్కంధే ద్వితీయోఽధ్యాయః (2)
ఇది భాగవత మహాపురాణమునందలి సప్తమ స్కంధమునందు రెండవ అధ్యాయము (2)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
***
19.6.2020 సాయం కాల సందేశము
వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం
సప్తమ స్కంధము - రెండవ అధ్యాయము
హిరణ్యాక్షుని వధానంతరము హిరణ్యకశిపుడు తన తల్లిని, ఇతర బంధువులను ఓదార్చుట
ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
నారద ఉవాచ
2.1 (ప్రథమ శ్లోకము)
భ్రాతర్యేవం వినిహతే హరిణా క్రోడమూర్తినా|
హిరణ్యకశిపూ రాజన్ పర్యతప్యద్రుషా శుచా॥5623॥
నారదుడు వచించెను-ధర్మరాజా! శ్రీమహావిష్ణువు యజ్ఞవరాహావతారము దాల్చి, హిరణ్యాక్షుని సంహరించెను. అప్పుడు హిరణ్యకశిపుడు తన సోదరుని మరణమునకు శోకసంతప్తుడై శ్రీహరికి మిగుల క్రుద్ధుడయ్యెను.
2.2 (రెండవ శ్లోకము)
ఆహ చేదం రుషా ఘూర్ణః సందష్టదశనచ్ఛదః|
కోపోజ్జ్వలద్భ్యాం చక్షుర్భ్యాం నిరీక్షన్ ధూమ్రమంబరమ్॥5624॥
ఆ క్రోధాతిరేకముతో అతని శరీరము కంపించుచుండెను. అప్పుడతడు పండ్లు పటపట కొరుకుచు, కన్నుల నిప్పులు గ్రక్కుచు, ఆకాశమువైపు చూచుచు ఇట్లు పలికెను-
2.3 (మూడవ శ్లోకళము)
కరాళదంష్ట్రోగ్రదృష్ట్యా దుష్ప్రేక్ష్యభ్రుకుటీముఖః|
శూలముద్యమ్య సదసి దానవానిదమబ్రవీత్॥5625॥
2.4 (నాలుగవ శ్లోకము)
భో భో దానవదైతేయా ద్విమూర్ధంస్త్ర్యక్ష శంబర|
శతబాహో హయగ్రీవ నముచే పాక ఇల్వల॥5626॥
2.5 (ఐదవ శ్లోకము)
విప్రచిత్తే మమ వచః పులోమన్ శకునాదయః|
శృణుతానంతరం సర్వే క్రియతామాశు మా చిరమ్॥5627॥
హిరణ్యకశిపుని కోరలు మిగుల భీకరముగా నుండెను. ముడిచిన బొమముడితో అతని ముఖము చూడశక్యము గాకుండెను. నిండుసభలో అతడు శూలమును చెబూని, దానవులతో ఇట్లనెను - "దానవులారా! దైత్యులారా! ద్విమూర్ధా! త్ర్యక్షా! శంబరా! శతబాహూ! హయగ్రీవా! నముచీ! పాకా! ఇల్వలా! విప్రచిత్తీ! పులోమా! శకునాదులారా! నామాటలను శ్రద్ధగా ఆలకింపుడు. పిమ్మట నేను చెప్పినట్లుచేయుడు. ఆలస్యము చేయవద్దు".
2.6 (ఆరవ శ్లోకము)
సపత్నైర్ఘాతితః క్షుద్రైర్భ్రాతా మే దయితః సుహృత్|
పార్ష్ణిగ్రాహేణ హరిణా సమేనాప్యుపధావనైః॥5628॥
హిరణ్యకశిపుడు ఇంకను ఇట్లనుచుండెను:
"నా సోదరుడైన హిరణ్యాక్షుడు నాకు ప్రాణతుల్యుడు, హితైషి, క్షుద్రులైన దేవతలు శ్రీహరితో అతనిని చంపించిరి. శ్రీహరి దేవతలపై, దైత్యులపై సమభావము కలిగియున్నప్పటికిని వారు ఆయనకడకు పరుగెత్తి, వినమ్రవచనములతో ఆయనను తమ వైపు త్రిప్ఫుకొనిరి'.
2.7 (ఏడవ శ్లోకము)
తస్య త్యక్తస్వభావస్య ఘృణేర్మాయావనౌకసః|
భజంతం భజమానస్య బాలస్యేవాస్థిరాత్మనః॥5629॥
హిరణ్యకశిపుడు ఇంకను ఇట్లనుచుండెను:
'శ్రీమహావిష్ణువు పవిత్రుడు, నిష్పక్షపాతి. ఐనను, అతడు తన స్వభావమునకు విరుద్ధముగా మాయతో యజ్ఞవరాహ రూపమును దాల్చెను. బాలునివలె అతడు తనను సేవించు వారి పక్షము వహించెను. అతని చిత్తము చంచలమైనది'.
2.8 (ఎనిమిదవ శ్లోకము)
మచ్ఛూలభిన్నగ్రీవస్య భూరిణా రుధిరేణ వై|
రుధిరప్రియం తర్పయిష్యే భ్రాతరం మే గతవ్యథః॥5630॥
హిరణ్యకశిపుడు ఇంకను ఇట్లనుచుండెను:
ఇప్పుడే నేను నా శూలముచే అతని కంఠమును నరికెదను. రక్తదాహముగల నా సోదరునకు అతని నెత్తురుతో తర్పణమిచ్చెదను. అంతట నా కసి తీరును.
2.9 (తొమ్మిదవ శ్లోకము)
తస్మిన్ కూటేఽహితే నష్టే కృత్తమూలే వనస్పతౌ|
విటపా ఇవ శుష్యంతి విష్ణుప్రాణా దివౌకసః॥5631॥
చెట్టుయొక్క మూలమును ఖండించినచో, దాని కొమ్మలు వాటి యంతట అవే ఎండిపోవును. అట్లే మాయావియైన విష్ణువును వధించినచో, ఆయననే నమ్ముకొని యున్న దేవతలు కృశించి పోవుదురు. ఏలయన, దేవతలకు ప్రాణము ఆ విష్ణువేకదా!'
2.10 (పదియవ శ్లోకము)
తావద్యాత భువం యూయం విప్రక్షత్రసమేధితామ్|
సూదయధ్వం తపోయజ్ఞస్వాధ్యాయవ్రతదానినః॥5632॥
హిరణ్యకశిపుడు ఇంకను ఇట్లనుచుండెను:
కనుక, మీరు ఇప్పుడే భూతలమునకు చేరుడు. అచట బ్రాహ్మణుల, క్షత్రియుల సంఖ్య పెరిగిపోవుచున్నది. జనులు అచట తపస్సులు, యజ్ఞములు, స్వాధ్యాయములు (వేదపఠనములు), వ్రతములు, దానములు మొదలగు శుభకర్మలను ఆచరించుచున్నారు. వారిని అందరిని వధింపుడు'.
2.11 (పదకొండవ శ్లోకము)
విష్ణుర్ద్విజక్రియామూలో యజ్ఞో ధర్మమయః పుమాన్|
దేవర్షిపితృభూతానాం ధర్మస్య చ పరాయణమ్॥5633॥
హిరణ్యకశిపుడు ఇంకను ఇట్లనుచుండెను:
వేదవేత్తలైన బ్రాహ్మణులు ఆచరించు ధర్మకార్యములకు, శ్రీమహావిష్ణువు మూలము. అతడు యజ్ఞ ధర్మ స్వరూపుడు. దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు, సకలప్రాణులకు, ధర్మమునకు పరమాశ్రయుడు.
2.12 (పండ్రెండవ శ్లోకము)
యత్ర యత్ర ద్విజా గావో వేదా వర్ణాశ్రమాః క్రియాః|*
తం తం జనపదం యాత సందీపయత వృశ్చత॥5634॥
బ్రాహ్మణులు, గోవులు, వేదములు, వర్ణాశ్రమధర్మ కార్యములు గల దేశములకు వెళ్ళుడు. వాటిని అన్నింటిని తగులబెట్టి నాశమొనర్పుడు'
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి సప్తమస్కంధములోని రెండవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
20.6.2020 ప్రాతః కాల సందేశము

2.13 (పదమూడవ శ్లోకము)
ఇతి తే భర్తృనిర్దేశమాదాయ శిరసాఽఽదృతాః|
తథా ప్రజానాం కదనం విదధుః కదనప్రియాః॥5635॥
దైత్యులు సహజముగనే జనులను హింసించుచు, సంతసించు చుందురు. కనుక, వారు తమకు ప్రభువైన హిరణ్యకశిపుని ఆజ్ఞను శిరసావహించి, జనులును హింసింపసాగిరి.
2.14 (పదునాలుగవ శ్లోకము)
పురగ్రామవ్రజోద్యానక్షేత్రారామాశ్రమాకరాన్|
ఖేటఖర్వటఘోషాంశ్చ దదహుః పత్తనాని చ॥5636॥
వారు పురములను, గ్రామములను, గోశాలలను, ఉద్యానవనములను, పంటపొలములను, విహారభూములను, ఋష్యాశ్రమములను, గనులను, రైతుల పల్లెలను, కొండపల్లెలను, అడవులను, పట్టణములను తగులబెట్టిరి.
2.15 (పదునాలుగవ శ్లోకము)
కేచిత్ఖనిత్రైర్బిభిదుః సేతుప్రాకారగోపురాన్|
ఆజీవ్యాంశ్చిచ్ఛిదుర్వృక్షాన్ కేచిత్పరశుపాణయః|
ప్రాదహన్ శరణాన్యేకే ప్రజానాం జ్వలితోల్ముకైః॥5637॥
కొందరు దైత్యులు గడ్డపారలతో వంతెనలను ప్రాకారములను, గోపురములను ధ్వంసమొనర్చిరి. మరికొందరు గొడ్డళ్ళను చేబూని, ఫలపుష్పములతో కళకళలాడుచున్న వృక్షములను నరికివేసిరి. ఇంకను కొందరు మండుచున్న కొరవులతో ప్రజల ఇండ్లను అగ్గిపాలు చేసిరి.
2.16 (పదునారవ శ్లోకము)
ఏవం విప్రకృతే లోకే దైత్యేంద్రానుచరైర్ముహుః|
దివం దేవాః పరిత్యజ్య భువి చేరురలక్షితాః॥5638॥
ఈ విధముగా హిరణ్యకశిపుని యొక్క అనుచరులు, అమాయకులైన ప్రజలను పీడింపసాగిరి. అప్పుడు దేవతలు స్వర్గమును వీడి, భూతలమునకు చేరి, రహస్యముగా తలదాచుకొనిరి.
2.17 (పదునేడవ శ్లోకము)
హిరణ్యకశిపుర్భ్రాతుః సంపరేతస్య దుఃఖితః|
కృత్వా కటోదకాదీని భ్రాతృపుత్రానసాంత్వయత్॥5639॥
2.18 (పదునెనిమిదవ శ్లోకము)
శకునిం శంబరం ధృష్టం భూతసంతాపనం వృకమ్|
కాలనాభం మహానాభం హరిశ్మశ్రుమథోత్కచం॥5640॥
2.19 (పందొమ్మిదవ శ్లోకము)
తన్మాతరం రుషాభానుం దితిం చ జననీం గిరా|
శ్లక్ష్ణయా దేశకాలజ్ఞ ఇదమాహ జనేశ్వర॥5641॥
ధర్మరాజా! హిరణ్యకశిపుడు తన సోదరుడు మృతుడగుటతో మిక్కిలి పరితపించెను. అంత్యక్రియలను ఆచరించిన పిదప, తన సోదరుని సుతులైన శకుని, శంబరుడు, దృష్టుడు, భూతసంతాపనుడు, వృకుడు, కాలనాభుడు, మహానాథుడు, హరిశ్మశ్రుడు, ఉత్కచుడు అనువారిని ఓదార్చెను. పిదప వారి తల్లియైన (హిరణ్యాక్షుని భార్యయైన) రుషభానువును, తన తల్లియైన దితిని దేశకాలములను అనుసరించి, ఆత్మీయ వచనములతో ఓదార్చెను-
హిరణ్యకశిపురువాచ
2.20 (ఇరువదియవ శ్లోకము)
అంబాంబ హే వధూః పుత్రా వీరం మార్హథ శోచితుమ్|
రిపోరభిముఖే శ్లాఘ్యః శూరాణాం వధ ఈప్సితః॥5642॥
తల్లీ! దితీ! రుషాభానూ! పుత్రులారా! మీరు శోకింపదగని వీరుడైన హిరణ్యాక్షుని కొరకై ఈ విధముగా దుఃఖింపదగదు. వీరులు రణరంగమున శత్రువును ఎదుర్కొని, మృతిచెందుటను కోరుకొందురు. వీర మరణము శ్లాఘనీయము.
2.21 (ఇరువది ఒకటవ శ్లోకము)
భూతానామిహ సంవాసః ప్రపాయామివ సువ్రతే|
దైవేనైకత్ర నీతానామున్నీతానాం స్వకర్మభిః॥5643॥
చలివేంద్రమునొద్ద పెక్కుమంది వ్యక్తులు కలియుచుందురు. కాని, వారి కలయిక కొద్ది సమయమువరకే ఉండును. అట్లే జీవులు గూడ తామొనర్చిన కర్మలను బట్టి దైవ వశమున కలియుదురు. విడిపోవుదురు.
2.22 (ఇరువది రెండవ శ్లోకము)
నిత్య ఆత్మావ్యయః శుద్ధః సర్వగః సర్వవిత్పరః|
ధత్తేఽసావాత్మనో లింగం మాయయా విసృజన్ గుణాన్॥5644॥
వాస్తవముగా ఆత్మ కాలమునకు అతీతమైనది. వినాశము లేనిది. పవిత్రమైనది. సర్వవ్యాపి. సర్వజ్ఞము. దేహేంద్రియాదులకంటె వేరైనది. అదీ అజ్ఞాన కారణముగా దేహాదులను సృష్టించుకొని. భోగసాధనమైన సూక్ష్మశరీరమును స్వీకరించును.
2.23 (ఇరువది మూడవ శ్లోకము)
యథాంభసా ప్రచలతా తరవోఽపి చలా ఇవ|
చక్షుషా భ్రామ్యమాణేన దృశ్యతే చలతీవ భూః॥5645॥
2.24 (ఇరువది నాలుగవ శ్లోకము)
ఏవం గుణైర్భ్రామ్యమాణే మనస్యవికలః పుమాన్|
యాతి తత్సామ్యతాం భద్రే హ్యలింగో లింగవానివ॥5646॥
పుణ్యాత్ములారా! కదలుచున్న నీటియందు ప్రతిబింబించిన వృక్షముగూడ కదలుచున్నట్లుగా కనబడును. కన్నులు తిరిగినిప్పుడు భూమి తిరుగుచున్నట్లు కనబడును. అట్లే, గుణకార్యములగు విషయములకు కారణమైన మనస్సు చలించు చుండుటచే వికారరహితమైన ఆత్మగూడ దానితో సమానముగా చలించుచున్నట్లు అనిపించును. స్థూల, సూక్ష్మ శరీరములతో ఆత్మకు ఎట్టి సంబంధమూ లేదు. ఐనను, వీటితో సంబంధమున్నట్లు గోచరించును.
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి సప్తమస్కంధములోని రెండవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
20.6.2020 సాయం కాల సందేశము

2.25 (ఇరువది ఐదవ శ్లోకము)
ఏష ఆత్మవిపర్యాసో హ్యలింగే లింగభావనా|
ఏష ప్రియాప్రియైర్యోగో వియోగః కర్మసంసృతిః॥5447॥
ఆత్మకు ఎట్టి శరీరము లేకున్నను, తనను శరీరముగా భావించుటయే అజ్ఞానము. దానివలన ప్రియమైన, అప్రియమైన వస్తువుల సంయోగము, వినియోగము కలుగు చుండును. అందువలన కర్మలతో సంబంధము ఏర్పడును. ఫలితముగా సంసారచక్రములో పరిభ్రమింప వలసి వచ్చును.
2.26 (ఇరువది ఆరవ శ్లోకము)
సంభవశ్చ వినాశశ్చ శోకశ్చ వివిధః స్మృతః|
అవివేకశ్చ చింతా చ వివేకాస్మృతిరేవ చ॥5648॥
జనన మరణములు,పెక్కువిధములైన దుఃఖములు, అవివేకము, చింతలు, వివేకము యొక్క విస్మృతి మొదలగువాటికి, అన్నిటికిని అజ్ఞానమే కారణము
2.27 (ఇరువది ఏడవ శ్లోకము)
అత్రాప్యుదాహరంతీమమితిహాసం పురాతనమ్|
యమస్య ప్రేతబంధూనాం సంవాదం తం నిబోధత॥5649॥
ఈ విషయములో మహాత్ములు ఒక ప్రాచీన ఇతిహాసమును తెలిపెదరు. అది మృతుడైన మానవుని యొక్క బంధువులకును, యమధర్మరాజునకు మధ్య జరిగిన సంభాషణము. దానిని తెలిపెదను శ్రద్ధగా వినుడు-
2.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)
ఉశీనరేష్వభూద్రాజా సుయజ్ఞ ఇతి విశ్రుతః|
సపత్నైర్నిహతో యుద్ధే జ్ఞాతయస్తముపాసత॥5650॥
ఉశీనరదేశమునందు సుయజ్ఞుడు అను పేరు గల యశస్వియైన ఒకరాజు ఉండెను. యుద్ధములో శత్రువులు అతనిని వధించిరి. అతని బంధుమిత్రులు అతని చుట్టును కూర్చొనియుండిరి.
2.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)
విశీర్ణరత్నకవచం విభ్రష్టాభరణస్రజమ్|
శరనిర్భిన్నహృదయం శయానమసృగావిలమ్॥5651॥
2.30 (ముప్పదియవ శ్లోకము)
ప్రకీర్ణకేశం ధ్వస్తాక్షం రభసా దష్టదచ్ఛదమ్|
రజఃకుంఠముఖాంభోజం ఛిన్నాయుధభుజం మృధే॥5652॥
రత్నఖచితమైన అతనికవచము భగ్నమై యుండెను. అతని ఆభరణములు, మాలలు చెల్లాచెదరై పడిపోయి యుండెను. శత్రువుల బాణముల తాకిడికి అతని హృదయము భిన్నమైయుండెను. శరీరము రక్తముతో తడిసి యుండెను. కేశములు చెదరియుండెను. కనులు కాంతిహీనమై యుండెను. కోపకారణముగా దంతములు పెదవులను కొరుకుచున్నట్లుండెను. కమలము వంటి ఆయన ముఖము దుమ్ముకొట్టుకొని యుండెను. యుద్ధములో అతని శస్త్రములు, భుజములు ఖండింపబడి యుండెను.
2.31 (ముప్పది ఒకటవ శ్లోకము)
ఉశీనరేంద్రం విధినా తథా కృతం పతిం మహిష్యః ప్రసమీక్ష్య దుఃఖితాః|
హతాః స్మ నాథేతి కరైరురో భృశం ఘ్నంత్యో ముహుస్తత్పదయోరుపాపతన్॥5653॥
దైవవశమున మృతుడై పడియున్న ఆ ఉశీనరరాజును జూచి, ఆయన రాణులు దుఃఖముతో క్రుంగి పోయి విలవిలలాడుచు ఇట్లనిరి- "నాథా! భాగ్యహీనువమైన మేము దిక్కులేని వారమైతిమి" అని పలుకుచు వారు గుండెలు బాదుకొనుచు తమ పతిదేవుని పాదములపై బడిరి.
2.32 (ముప్పది రెండవ శ్లోకము)
రుదత్య ఉచ్చైర్దయితాంఘ్రిపంకజం సించంత్య అస్రైః కుచకుంకుమారుణైః|
విస్రస్తకేశాభరణాః శుచం నృణాం సృజంత్య ఆక్రందనయా విలేపిరే॥5654॥
వారు బిగ్గరగా ఏడువ సాగిరి. వారి వక్షస్థలమునందు విలేపితమైన కుంకుమ దుఃఖాశ్రువులతో కలిసి అతని పాదమును తడుపసాగెను. వారి కేశములు, ఆభరణములు ఇటునటు చెల్లాచెదరైయుండెను. దుఃఖపూరితమైన వారి ఆక్రందనలకు అచటి మనుష్యులును మిగుల పరితపింపసాగరి.
2.33 (ముప్పది మూడవ శ్లోకము)
అహో విధాత్రాకరుణేన నః ప్రభో భవాన్ ప్రణీతో దృగగోచరాం దశామ్|
ఉశీనరాణామసి వృత్తిదః పురా కృతోఽధునా యేన శుచాం వివర్ధనః॥5655॥
మృతుడై పడియున్న ఉశీనరరాజును జూచి ఆయన రాణులు దుఃఖముతో క్రుంగి విలపించుచూ ఇంకను ఇట్లనుచున్నారు:
"అయ్యో! విధాత ఎంత క్రూరుడు. నేడు నిన్ను మృతుని గావించి, నేత్రములకు గోచరముగాని దశకు చేర్చినాడు. ఇంతకు ముందు ఉశీనరదేశ వాసులందరికిని పోషకుడవై యుంటివి. నేడు అతడు నిన్న ఈ స్థితికి చేర్చి, మమ్ములను శోకసాగరములో ముంచివేసెను.
2.34 (ముప్పది నాలుగవ శ్లోకము)
త్వయా కృతజ్ఞేన వయం మహీపతే కథం వినా స్యామ సుహృత్తమేన తే|
తత్రానుయానం తవ వీర పాదయోః శుశ్రూషతీనాం దిశ యత్ర యాస్యసి॥5656॥
మృతుడై పడియున్న ఉశీనరరాజును జూచి ఆయన రాణులు దుఃఖముతో క్రుంగి విలపించుచూ ఇంక ఇట్లనుచున్నారు:
ప్రాణేశ్వరా! నీవు మమ్ములను ఎంతగానో ప్రేమించుచుంటిని. మేము చేయు కొద్దిసేవలకే మిగుల సంతసించుచుంటిని. ఇప్పుడు నీవు లేకుండా మేము ఎట్లు జీవింపగలము? మేము ఎల్లప్పుడును నీ పాదములనే ఆశ్రయించుచుండువారము. నీవు వెళ్ళిన చోటికే మేమును వచ్చెదము'
2.35 (ముప్పది ఐదవ శ్లోకము)
ఏవం విలపతీనాం వై పరిగృహ్య మృతం పతిమ్
అనిచ్ఛతీనాం నిర్హారమర్కోఽస్తం సన్న్యవర్తత॥5657॥
తత్ర హ ప్రేతబంధూనామాశ్రుత్య పరిదేవితమ్|
ఆహ తాన్ బాలకో భూత్వా యమః స్వయముపాగతః॥5658॥

21.6.2020 ప్రాతః కాల సందేశము
వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం
సప్తమ స్కంధము - రెండవ అధ్యాయము
హిరణ్యాక్షుని వధానంతరము హిరణ్యకశిపుడు తన తల్లిని, ఇతర బంధువులను ఓదార్చుట
ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
యమ ఉవాచ
2.37 (ముప్పది ఏడవ శ్లోకము)
అహో అమీషాం వయసాధికానాం విపశ్యతాం లోకవిధిం విమోహః|
యత్రాగతస్తత్ర గతం మనుష్యం స్వయం సధర్మా అపి శోచంత్యపార్థమ్॥5659॥
యముడు ఇట్లు పలికెను- మీరు వయసులో పెద్దవారు. లోకములోని ప్రాణుల యొక్క జనన మరణములను చూచుచునే యున్నారు. ఐనను, మెండైన మోహములో పడిపోయినారు. ఈ మానవుడు ఎచటి నుండి వచ్చెనో, అచటికి వెళ్ళినాడు. మీరుకూడ ఏదో యొకనాడు వెళ్ళవలసిన వారే. ఐనను వ్యర్థముగా శోకించుచున్నారు. ఇది మిగుల ఆశ్చర్యకరము.
2.38 (ముప్పది ఎనిమిదవ శ్లోకము)
అహో వయం ధన్యతమా యదత్ర త్యక్తాః పితృభ్యాం న విచింతయామః|
అభక్ష్యమాణా అబలా వృకాదిభిః స రక్షితా రక్షతి యో హి గర్భే॥5660॥
బాలుని వేషములో నున్న యముడు ఇంకను ఇట్లనుచుండెను
మేము ఎంతయు ధన్యజీవులము. మా తల్లిదండ్రులు మమ్ములను వదలిపెట్టి వెళ్ళిరి. మేము శారీరకముగా దుర్బలులమైనను మాకు ఎట్టి చింతయును లేదు. తోడేళ్ళు మొదలగు క్రూరమృగములు మమ్ము ఏమియు చేయలేవు. మేము తల్లి గర్భములో ఉన్నప్పుడు రక్షించిన దేవుడే మమ్ములను జీవిత పర్యంతము కాపాడును.
2.39 (ముప్పది తొమ్మిదవ శ్లోకము)
య ఇచ్ఛయేశః సృజతీదమవ్యయో య ఏవ రక్షత్యవలుంపతే చ యః|
తస్యాబలాః క్రీడనమాహురీశితు- శ్చరాచరం నిగ్రహసంగ్రహే ప్రభుః॥5661॥
రాణులారా! శాశ్వతుడైన ఈశ్వరుడే తన ఇష్టాను సారము ఈ జగత్తును సృష్టించి, పాలించి, లయమొనర్చు చున్నాడు. ఇది యెంతయు ఆ సర్వేశ్వరునకు ఒక క్రీడ. అతడు ఈ చరాచరజగత్తును దండించుటకును, ఆదరించుటకును సమర్థుడు.
2.40 (నలుబదియవ శ్లోకము)
పథి చ్యుతం తిష్ఠతి దిష్టరక్షిత గృహే స్థితం తద్విహతం వినశ్యతి|
జీవత్యనాథోఽపి తదీక్షితో వనే గృహేఽభిగుప్తోఽస్య హతో న జీవతి॥5662॥
అదృష్టము ఉన్నచో, వీధిపాలైన వస్తువుగూడ సురక్షితముగా ఉండును. దైవము ప్రతికూలుడైనచో ఇంటిలో ఉంచబడిన వస్తువుగూడ నశించును. జీవుడు ఎవరు తోడు లేకున్నను దైవానుగ్రహమున అడవిలోగూడ జీవించుయుండును. కాని దైవము చిన్నచూపు చూచినచో, ఇంటిలో దాగికొన్నను మృత్యువుపాలగుట తథ్యము.
2.41 (నలుబది ఒకటవ శ్లోకము)
భూతాని తైస్తైర్నిజయోనికర్మభి- ర్భవంతి కాలే న భవంతి సర్వశః|
న తత్ర హాత్మా ప్రకృతావపి స్థితస్తస్యా గుణైరన్యతమో నిబధ్యతే॥5663॥
రాణులారా! ప్రాణులు వాటి పూర్వజన్మ కర్మవాసనలను అనుసరించి, జన్మించు చుంఢును. కాలము ఆసన్నమైనంతనే అవి మరణించుచుండును. కాని, ఆత్మ శరీరముకంటె భిన్నమైనది. అందువలన శరీరములో ఉన్నను దాని జననమరణ రూప ధర్మములు ఆత్మకు అంటవు.
2.42 (నలుబది రెండవ శ్లోకము)
ఇదం శరీరం పురుషస్య మోహజం యథా పృథగ్భౌతికమీయతే గృహమ్|
యథౌదకైః పార్థివతైజసైర్జనః కాలేన జాతో వికృతో వినశ్యతి॥5664॥
మానవుడు మట్టితో నిర్మించిన తన గృహమును తన కంటె వేరుగ భావించును. అట్లే పాంచభౌతికమైన ఈ శరీరముగూడ ఆత్మకంటెసు వేరైనది. కాని, మోహవశమున అతడు దానిని తనదిగా భావించును. మట్టిని నీటితో తడిపి కుండను తయారుచేసి, అగ్నిలో కాల్చిన పిదప కుండ సిద్ధమగును. కాలాంతరమున కుండ పగిలినప్పుడు తిరిగి అది తన మూలతత్త్వములైన మట్టి, నీరు నిప్పులో కలిసిపోవును. అటులే పంచభూతములతో నిర్మాణమైన ఈ శరీరము కాలప్రభావముచే నిర్మింపబడును. కాలక్రమమున మార్పుచెంది, నశించిపోవును.
2.43 (నలుబది మూడవ శ్లోకము)
యథానలో దారుషు భిన్న ఈయతే యథానిలో దేహగతః పృథక్ స్థితః|
యథా నభః సర్వగతం న సజ్జతే తథా పుమాన్ సర్వగుణాశ్రయః పరః॥5665॥
కర్రలలో వ్యాపించియున్న అగ్ని వాటికంటే వేరుగా కన్పట్టును. దేహములో ఉన్ననూ వాయువునకు, ఆ దేహముతో ఎట్టి సంబంధమూ ఉండదు. ఆకాశము సర్వత్ర ఒకేవిధముగా ఉన్ననూ, అది ఎట్టి గుణదోషములతోను లిప్తముగాదు. అట్లే సమస్త జీవుల దేహములలో ఉండి, వాటికి ఆశ్రయమైన ఆత్మగూడ వాటికంటెను భిన్నముగా నిర్లిప్తముగా ఉండును.
2.44 (నలుబది నాలుగవ శ్లోకము)
సుయజ్ఞో నన్వయం శేతే మూఢా యమనుశోచథ|
యః శ్రోతా యోఽనువక్తేహ స న దృశ్యేత కర్హిచిత్॥5666॥
మూఢులారా! శోకింపగూడని దానిని గూర్చి మీరు ఎందుకు శోకించుచున్నారు? ఈ శోకమునకు కారణమైన సుయజ్ఞుని శరీరమైతే మీ యెదుటనే పడియున్నది. దానిని మీరు చూచుచునేయున్నారు. మీ మాటలను వినువాడు, మీతో మాట్లాడువాడు ఎన్నటికిని, ఎవ్వరికిని కనబడడు. ఇప్పుడు గూడ అతడు కనబడుటలేదు. ఇక అతనికొరకై శోకించుట ఎందులకు?
2.45 (నలుబది ఐదవ శ్లోకము)
న శ్రోతా నానువక్తాయం ముఖ్యోఽప్యత్ర మహానసుః|
యస్త్విహేంద్రియవానాత్మా స చాన్యః ప్రాణదేహయోః॥5667॥
శరీరమునందు అన్ని ఇంద్రియముల చేష్టలకు హేతువు ముఖ్యప్రాణము. అది ముఖ్యమైనదే ఐనప్పకిని అది మాట్లాడదు, వినదు. ఏలయన అది జడము. దేహేంద్రియములద్వారా అన్ని పదార్థములను చూచుచుండునది ఆత్మ. అది శరీరము కంటెను ప్రాణములకంటెను విలక్షణమైనది.
2.46 (నలుబది ఆరవ శ్లోకము)
భూతేంద్రియమనోలింగాన్ దేహానుచ్చావచాన్ విభుః|
భజత్యుత్సృజతి హ్యన్యస్తచ్చాపి స్వేన తేజసా॥5668॥
ఆత్మ అఖండము, సర్వవ్యాపకము. ఐనను పంచభూతములు, ఇంద్రియములు, మనసు అను వానితోగూడి దేవ, మనుష్య, పశు, పక్ష్యాది శరీరములను ధరించును. తన బుద్ధిబలముతో ముక్తినిగూడ పొందును. వాస్తవముగ అది వాటికంటె వేరైనది.
2.47 (నలుబది ఏడవ శ్లోకము)
యావల్లింగాన్వితో హ్యాత్మా తావత్కర్మ నిబంధనమ్|
తతో విపర్యయః క్లేశో మాయాయోగోఽనువర్తతే॥5669॥
పంచప్రాణములు (5), పంచకర్మేంద్రియములు (5), పంచ జ్ఞానేంద్రియములు (5), బుద్ధి (1), మనస్సు (1) అను పదునేడు తత్త్వముల కార్యరూపమైన లింగశరీరముతో కలిసియున్నంత వరకును జీవుడు కర్మలలో బంధింపబడి యుండును. ఈ బంధములకు కారణమైన మాయవలన కలిగే మోహము, క్లేశము తప్పనిసరిగా జీవుని వెంబడించి యుండును.
2.48 (నలుబది ఎనిమిదవ శ్లోకము)
వితథాభినివేశోఽయం యద్గుణేష్వర్థదృగ్వచః|
యథా మనోరథః స్వప్నః సర్వమైంద్రియకం మృషా॥5670॥
ప్రకృతియొక్క గుణములను వాటి కార్యరూపములైన వస్తువులను సత్యమని భావించుట, పలుకుట అజ్ఞానము. మనోరథములు నెరవేరుటకు కల్పింపబడిన వస్తువులన్నియును స్వప్నముల వలె మిథ్యయే. ఇంద్రియముల ద్వారా గ్రహింపబడిన ఆ వస్తువులునూ (ఈ జగత్తుకూడా) మిథ్యయే.
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి సప్తమస్కంధములోని రెండవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
21.6.2020 సాయం కాల సందేశము
వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం
సప్తమ స్కంధము - రెండవ అధ్యాయము
హిరణ్యాక్షుని వధానంతరము హిరణ్యకశిపుడు తన తల్లిని, ఇతర బంధువులను ఓదార్చుట
ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
2.49 (నలుబది తొమ్మిదవ శ్లోకము)
అథ నిత్యమనిత్యం వా నేహ శోచంతి తద్విదః|
నాన్యథా శక్యతే కర్తుం స్వభావః శోచతామితి॥5671॥
అందువలన శరీరము యొక్క ఆత్మయొక్క తత్ప్వమును ఎరింగిన జ్ఞానులు అనిత్యమైన శరీరము కొరకు గాని, నిత్యమైన ఆత్మకొరకుగాని శోకింపరు. జ్ఞానము దృఢముగా లేనట్టి అజ్ఞానులు ఎల్లప్పుడు శోకించుచుందురు. అట్లని వారు దేహాదుల స్వభావమగు అనిత్యత్వముసు మార్చి, వాటిని శాశ్వతముగా మార్చలేరుకదా! అది అసంభవమైనపని. అంతేగాక, అట్టి మానవుల స్వభావము మారుట కూడా అసంభవమే. కావున, నిత్యానిత్య వస్తువివేకముగల వారలు శోకించుటయే వ్యర్థమని తలంతురు.
2.50 (ఏబదియవ శ్లోకము)
లుబ్ధకో విపినే కశ్చిత్పక్షిణాం నిర్మితోఽన్తకః|
వితత్య జాలం విదధే తత్ర తత్ర ప్రలోభయన్॥5672॥
ఒకానొక అడవిలో ఒక వేటగాడు ఉండెను. విధాత వానిని పక్షులను హతమార్చుటకై కాలస్వరూపునిగా సృష్టించినట్లున్నది. అతడు పక్షులను ప్రలోభపెట్టి పట్టుకొనుటకై అచ్చటచ్చట వలలను పన్నియుండెను.
2.51 (ఏబది ఒకటవ శ్లోకము)
కులింగమిథునం తత్ర విచరత్సమదృశ్యత|
తయోః కులింగీ సహసా లుబ్ధకేన ప్రలోభితా॥5573॥
ఒకనాడు అతడు వడ్రంగి పిట్టల జంటలు గింజలకొరకై తిరుగుచుండుట చూచెను. వెంటనే ఆ వేటగాడు ఆడుపక్షిని ప్రలోభపరచి, వలలో బంధించెను.
2.52 (ఏబది రెండవ శ్లోకము)
సాసజ్జత సిచస్తంత్ర్యాం మహిషీ కాలయంత్రితా|
కులింగస్తాం తథాఽఽపన్నాం నిరీక్ష్య భృశదుఃఖితః|
స్నేహాదకల్పః కృపణః కృపణాం పర్యదేవయత్॥5674॥
విధివశమున ఆ ఆడుపిట్ట వలలో చిక్కుకొనెను. మగపక్షి ఆపదలోనున్న ఆ ఆడుపక్షినిజూచి, మిగుల దుఃఖించెను. నిస్సహాయురాలైయున్న ఆడుపక్షి కొరకై అది పరితపించుచు ఇట్లనెను-(తరువాత శ్లోకం)
2.53 (ఏబది మూడవ శ్లోకము)
అహో అకరుణో దేవః స్త్రియాఽఽకరుణయా విభుః|
కృపణం మానుశోచంత్యా దీనయా కిం కరిష్యతి॥5675॥
నిస్సహాయురాలైయున్న ఆడుపక్షి కొరకై మగపక్షి పరితపించుచు ఇట్లనెను
"విధాత సర్వశక్తి మంతుడేయైనను మిక్కిలి నిర్దయుడు. ఈ నా సహచరి ఒక స్త్రీ అదృష్ట హీనుడనైన నా కొరకు దీనముగా శోకించుచున్నది. దీనిని తీసికొని పోయి, అతడేమి చేయునోకదా!"
2.54 (ఏబది నాలుగవ శ్లోకము)
కామం నయతు మాం దేవః కిమర్ధేనాత్మనో హి మే|
దీనేన జీవతా దుఃఖమనేన విధురాయుషా॥5676॥
నిస్సహాయురాలైయున్న ఆడుపక్షి కొరకై మగపక్షి పరితపించుచు ఇంకను ఇట్లనెను
"ఆ దేవునకు ఇష్టమైనచో నన్ను తీసికొని పోవలసియుండెను. ఇప్పుడు నా భార్యలేకుండా విధురడ (భార్యలేనివాడ) నైన నేను దైన్యముతో, దుఃఖముతో నిండిన ఈ జీవితమును గడపుటయెట్లు?"
2.55 (ఏబది ఐదవ శ్లోకము)
కథం త్వజాతపక్షాంస్తాన్ మాతృహీనాన్ బిభర్మ్యహమ్|
మందభాగ్యాః ప్రతీక్షంతే నీడే మే మాతరం ప్రజాః॥5677॥
నిస్సహాయురాలైయున్న ఆడుపక్షి కొరకై మగపక్షి పరితపించుచు ఇంకను ఇట్లనెను
"మా పిల్లలు మందభాగ్యులు. వాటికి ఇంకను ఱెక్కలుగూడ రాలేదు. అవి తమ తల్లి కొరకై గూటిలో ఎదురుచూచుచున్నవి. తల్లిని కోల్పోయిన మాపిల్లలను ఇక మీదట పోషించుటయెట్లు?"
2.56 (ఏబది ఆరవ శ్లోకము)
ఏవం కులింగం విలపంతమారా- త్ప్రియావియోగాతురమశ్రుకంఠమ్|
స ఏవ తం శాకునికః శరేణ వివ్యాధ కాలప్రహితో విలీనః॥5678॥
ఆ విధముగా ఆ మగపిట్ట తన అర్ధాంగి వియోగమును భరింపజాలక మిక్కిలి విలపింపసాగెను. దుఃఖాతి రేకముచే దానికంఠము బొంగురుపోయెను. కాలుని ప్రేరణచే అచటనే పొంచియున్న ఆ వేటగాడు ఒక బాణముచే ఆ మగపక్షిని గూడ కొట్టెను. అది గూడ అసువులను బాసెను.
2.57 (ఏబది ఏడవ శ్లోకము)
ఏవం యూయమపశ్యంత్యః ఆత్మాపాయమబుద్ధయః|
నైనం ప్రాప్స్యథ శోచంత్యః పతిం వర్షశతైరపి॥5679॥
బాలుని వేషములో నున్న యముడు మృతుడైన ఉశీనరరాజు రాణులతో వడ్రంగి పిట్టల కథ చెప్పిన తరువాత ఇంకను ఇట్లు అనుచున్నాడు
మూర్ఖులైన రాణులారా! మీకును ఇట్టి గతియే పట్టుచున్నది. మీకు రాబోవు మృత్యువును మీరు గుర్తింపలేకున్నారు. మోహములో పడి ఇతని కొరకై విలపించుచున్నారు. నూరు సంపత్సరముల వరకు ఇట్లు గుండెలు బాదుకొనుచు శోకించుచున్నను మీరు మీ పతిని మాత్రము పొందలేరు".
హిరణ్యకశిపురువాచ
2.58 (ఏబది ఎనిమిదవ శ్లోకము)
బాల ఏవం ప్రవదతి సర్వే విస్మితచేతసః|
జ్ఞాతయో మేనిరే సర్వమనిత్యమయథోత్థితం॥5680॥
2.59 (ఏబది తొమ్మిదవ శ్లోకము)
యమ ఏతదుపాఖ్యాయ తత్రైవాంతరధీయత|
జ్ఞాతయోఽపి సుయజ్ఞస్య చక్రుర్యత్సాంపరాయికమ్॥5681॥
హిరణ్యకశిపుడు ఇట్లనెను- బాలుని రూపములో నున్న ఆ యమధర్మరాజు చెప్పిన జ్ఞానవిలసితమైన, ఈ మాటలకు అందరును ఆశ్చర్యపడిరి. ఉశీనరుని బంధుమిత్రులు, రాణులు ఈ సంసారము, అందలి సుఖదుఃఖములు అనిత్యమనియు, మిథ్యయనియు, తెలిసికొనిరి. యమధర్మరాజు ఈ ఉపాఖ్యానమును తెలిపి, వెంటనే అంతర్ధానమయ్యెను. సుయజ్ఞుని బంధుమిత్రులు అతనికి అంత్యక్రియలను నెరపిరి.
2.60 (అరువదియవ శ్లోకము)
తతః శోచత మా యూయం పరం చాత్మానమేవ చ|
క ఆత్మా కః పరో వాత్ర స్వీయః పారక్య ఏవ వా|
స్వపరాభినివేశేన వినాజ్ఞానేన దేహినామ్॥5682॥
కనుక, మీరు, మీ కొరకుగాని, ఇతరుల కొరకుగాని దుంఖింపదగదు. ఈ జగత్తులో మనవాడు ఎవరు? పరాయి వాడెవరు? మన వస్తువేది? ఇతరుల వస్తువేది? ప్రాణులు అజ్ఞానముచే ఇది నాది, ఇది పరులది అను భేదబుద్ధిని కలిగియుండును.
శ్రీనారద ఉవాచ
2.61 (అరువది ఒకటవ శ్లోకము)
ఇతి దైత్యపతేర్వాక్యం దితిరాకర్ణ్య సస్నుషా|
పుత్రశోకం క్షణాత్త్యక్త్వా తత్త్వే చిత్తమధారయత్॥5683॥
నారదుడు వచించెను- ధర్మరాజా! హిరణ్యకశిపుని ఈ మాటలను విని, దితియు, ఆమె కోడలును అదే క్షణములో పుత్రశోకమును వీడిరి. తమ చిత్తములను పరమాత్మ తత్త్వమునందు లగ్నమొనర్చిరి.
ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం సప్తమస్కంధే ద్వితీయోఽధ్యాయః (2)
ఇది భాగవత మహాపురాణమునందలి సప్తమ స్కంధమునందు రెండవ అధ్యాయము (2)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
No comments:
Post a Comment