Wednesday, 17 June 2020

మహాభాగవతం సప్తమ స్కంధము - మొదటి అధ్యాయము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం, సప్తమ స్కంధము - మొదటి అధ్యాయము
నారద-యుధిష్థిర సంవాదము-జయవిజయుల గాథ ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

రాజోవాచ

పరీక్షిన్మహారాజు వచించెను-స్వామీ! శ్రీహరి సహజముగా భేదభావము లేనివాడు. సముడు, సకల ప్రాణులకు ప్రియుడు, సుహృదుడు. అట్టివాడు సామాన్యమానవులవలె భేదబుద్ధితో తన మిత్రులపక్షము వహించి, శత్రువులకు కీడు తలపెట్టెను. ఇంద్రునికొరకై దైత్యులను ఏల వధించెను?

ఆ ప్రభువు స్వయముగ పరిపూర్ణుడు. దివ్యమంగళ విగ్రహుడు! కనుక, ఆయనకు దేవతలవలన కలుగు ప్రయోజనము ఏమియు ఉండదు. నిర్గుణుడు అగుటవలన దైత్యులతో వైరముగాని, ఉద్వేగముగాని ఉండదు.

మహాత్మా! నీవు భగవద్భక్తి సంపన్నుడవు. భగవంతుని సమత్వాది గుణముల విషయమున నా చిత్తమునందు గొప్ఫ సందేహము గలదు. దయచేసి దానిని తొలగింపుము.

శ్రీశుక ఉవాచ

శ్రీశుకుడు వచించెను-పరీక్షిన్మహారాజా! శ్రీహరి వృత్తాంతము అద్భుతావహమైనది. దాని విషయమున నీవు సముచితముగా ప్రశ్నించితివి. ఈ ప్రసంగమున ప్రహ్లాదుడు మొదలగు భక్తులయొక్క మహత్త్వము వివరింపబడినది. దానిని వినుటవలన భగవద్భక్తి ఇనుమడించును.

పరమ పవిత్రమైన శ్రీహరి కథలను నారదాది మహాత్ములు పరమభక్తితో గానము చేయుచుందురు. నేను నా తండ్రిగారైన వేదవ్యాసునకు నమస్కరించి, భగవంతుని లీలలను వర్ణింతును.

వాస్తవముగా భగవంతుడు నిర్గుణుడు, జన్మరహితుడు. దేహేంద్రియాదులు లేనివాడు. ప్రకృతికి అతీతుడు. ఐనను తన మాయాగుణములను ఆశ్రయించి, బాధ్యబాధకభావములను (అనగా చంపుట, చనిపోవుట అను పరస్పర  విరుద్ధభావములను) గ్రహించెను.

రాజా! సత్త్వరజస్తమములు ప్రకృతియొక్క గుణములు. అవి ఆత్మకు లేవు. ఈ మూడు గుణములు గూడ ఒకేసారి పెరుగుటగాని, తగ్గుటగాని జరుగదు.

భగవంతుడు వేర్వేరు సమయములయందు ఆయా గుణములను స్వీకరించును. సత్త్వగుణములు వృద్ధి చెందునప్పుడు దేవతల, ఋషల పక్షము వహించును. రజోగుణమువృద్ధి చెందినప్పుడు దైత్యుల పక్షమున చేరును. తమోగుణము వర్ధిల్లు సమయమున యక్షరాక్షసుల పక్షమున నిలుచును.

సర్వత్ర వ్యాపించియున్న అగ్ని, కర్రల సంబంధములే గోచరించును. అట్లే అంతటా నిరాకారముగ నిండి నిబిడీకృతమైయున్న పరమాత్మను, ప్రజ్ఞావంతులు నేతి, నేతి-ఇదికాదు, ఇదికాదు అనుచు అన్నింటిని నిషేధించుచు తమ హృదయములను మథించు అంర్యామిగానున్న ఆ భగవంతుని దర్శింతురు.

పరమేశ్వరుడు చిత్రవిచిత్రములగు శరీరములద్వారా రమించగోరినప్పుడు తన మాయాశక్తిద్వారా రజోగుణముచే సృష్టికార్యమును ప్రారంభించును. సత్త్వగుణముతో ఆ సృష్టిని సంరక్షించును. అనంతరము నశింపజేయ గోరినప్పుడు ఆ ఈశ్వరుడే తమోగుణముద్వారా సమస్తసృష్టిని లయింపజేయును.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి సప్తమస్కంధములోని మొదటి అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

మహారాజా! భగవంతుడు సత్యసంకల్పుడు. ఆయనయే జగదుత్పత్తికి నిమిత్తకారణమై ప్రకృతి, పురుషులకు ఆశ్రయమైన కాలమును సృష్టించును. కనుక, ఆయన కాలమునకు అధీనుడుకాదు. కాలమే ఆయన యొక్క అధీనములో ఉండును. కాలస్వరూపుడైన ఈశ్వరుడు సత్ప్వగుణమును వృద్ధిచేయునప్పుడు సత్త్వమయుడైన దేవతల బలమును పెంపొందింప జేయును. పరమయశస్వి, దేవతా ప్రియుడైన ఆ పరమాత్మ అప్పుడు దేవవిరోధులు, రజస్తమోగుణములు గల దైత్యులను సంహరించును. వాస్తవముగా అందరును ఆయనకు సమానులే.

రాజా! ఈ విషయమున దేవర్షియైన నారదుడు ప్రీతితో ఒక గాధను తెలిపియుండెను. మీ తాతయైన యుధిష్ఠిరుడు రాజసూయ యాగసమయమున ఈ విషయమును గూర్చి నారదుని ప్రశ్నించెను.

రాజసూయ యాగసమయమున చేదిరాజైన శిశుపాలుడు అందరు చూచుచుండగనే శ్రీకృష్ణభగవానునిలో ఐక్యమైన అద్భుతమైన సంఘటనను యుధిష్ఠిరుడు స్వయముగా తిలకించెను. ఆ మహాసభయందు మహామునులు ఆసీనులైయుండిరి. దేవర్షియగు నారదుడు గూడ అప్ఫుడు అచట ఉండెను. మిగుల ఆశ్చర్యకరమైన ఈ దృశ్యమును గాంచి, పాండుసుతుడగు యుధిష్ఠిరుడు దేవర్షిని ఇట్లు ప్రశ్నించెను.

యుధిష్ఠిర ఉవాచ

యుధిష్ఠిరుడు పలికెను-ఔరా! ఈ దృశ్యము మిగుల అద్భుతమైనది. పరమాత్ముడైన శ్రీకృష్ణునియందు ఐక్యమగుట అనన్యభక్తులకు గూడ దుర్లభము. కావున, శ్రీకృష్ణుని నిరంతరము ద్వేషించునట్టి శిశుపాలునకు ఇట్టి దుర్లభమైన గతి ఎట్లు ప్రాప్తించెను.

మునీశ్వరా! మేము అందరము ఈ రహస్యమును తెలియగోరుచున్నాము. పూర్వకాలమున భగవంతుని నిందించుటచే వేనుడను రాజును ఋషీశ్వరులు నరకమున పడద్రోసిరి.

దమఘోషుని సుతుడు, పాపాత్ముడైన శిశుపాలుడును, దుర్భుద్ధియైన దంతవక్త్రుడును బాల్యము నుండియు ఇంతవరకును భగవంతుడైన శ్రీకృష్ణుని యందు ద్వేషభావమును కలిగియేయున్నారు.

శాశ్వతుడు, పరబ్రహ్మస్వరూపుడైన శ్రీకృష్ణభగవానుని తిట్టిపోయుచునే యున్నారు. ఐనను, వారికి నాలుకపై చిన్న మచ్చకూడ ఏర్పడలేదు. వారికి ఘోరాంధకారమయమైన నరకము గూడ ప్రాప్తించలేదు. పైగా, అత్యంత దుర్లభమైన భగవత్ప్రాప్తి అందరును చూచుచుండగనే అనాయాసముగా వీరికి లభించినది. దీనికి కారణమేమి?

ఈ విషయమున గాలి తాకిడికి దీపశిఖవలె నా బుద్ధి భ్రమకులోనై అటునిటు కొట్టుకొనుచున్నధి. దేవర్షీ! నీవు సర్వజ్ఞుడవు. కావున, ఈ అద్భుతఘటనలోగల రహస్యమును వివరింపుము.

******

శ్రీశుక ఉవాచ

శ్రీశుకుడు నుడివెను - సర్వసమర్థుడైన నారదమహర్షి యుధిష్ఠిరుని ఈ ప్రశ్నను విని మిక్కిలి సంతసించెను. పిమ్మట ఆ మహాసభయందు అందరు వినుచుండగా ధర్మరాజునకు ఈ కథను వినిఫించెను.

నారద ఉవాచ

నారదుడు వచించెను- ధర్మరాజా! నింద, స్తుతి, సత్కారము, తిరస్కారము అనునవి ఈ శరీరమునకు సంబంధించినవి. ప్రకృతి, పురుషులను గూర్చిన వివేకము లేకుండుటచే అజ్ఞానకారణముగా ఆత్మయందు కల్పితమైనది.

దేహాభిమానము కారణముగా జీవుడు ఈ శరీరమును నేను అని భావించి, దండనము, పరుషవచనములు ఎదురైనప్పుడు, అవి తనవిగానే భావించును. కాని, భగవంతునకు జీవులవలె ఇట్టి అభిమానము ఉండదు. ఆ ప్రభువు సర్వాత్మ స్వరూపుడు, అద్వితీయుడు. ఇతరులను దండించునప్పుడుగూడ క్రోధము, ద్వేషముల వలనగాక, వారి శ్రేయస్సు కొరకే అట్లు చేయును. భగవంతుని విషయములో హింసకు చోటులేదు.

అందువలన వైరముచేగాని, భక్తిచేగాని, భయముచేగాని, మైత్రిచేగాని, ప్రియతముడనిగాని, లేక ఏ కారణముననైనను భగవంతునిపై పూర్తిగ మనసును లగ్నము చేయవలెను. భగవంతుని దృష్టిలో ఈ భావములయందు ఎట్టి భేదము ఉండదు.

రాజా! మనుష్యుడు భగవంతుని యెడల వైరభావముతో ఎంతటి తన్మయత్వమును భక్తిభావముతో పొందలేడు అని నా దృఢ విశ్వాసము.

తుమ్మెద ఒక పురుగును తెచ్చి తన గూటిలో ఉంచి, మూసివేయును. పిమ్మట అది ఝుమ్మని నాదము చేయుచూ ఆ గూటిచుట్టూరా తిరుగును. ఆ పురుగు భయమునకు లోనై ఆ తుమ్మెదనే స్మరించుచుండును. తత్ఫలితముగా ఆ పురుగు తన శరీరమును విడువకుండగనే, ఆ తుమ్మెద రూపమును పొందును.

శ్రీకృష్ణభగవానుని విషయములోగూడ ఈ దృష్టాంతము చక్కగా వర్తించును. సర్వశక్తిమంతుడైన ఆ పరమపురుషుడు తన లీలలను ప్రకటించుటకై మానవునిగా గోచరించును. వైరభావముతో నైనను ఆ ప్రభువును నిరంతరము స్మరించుటచే పాపరహితుడై వారు కూడా ఆ స్వామినే పొందిరి.

పెక్కుమంది మనుజులు కామముతో, ద్వేషముతో, భయముతో, స్నేహముతో తమ మనస్సును ఆ భగవంతుని యందే లగ్నము చేయుటవలన వారి పాపములన్నియును ప్రక్షాళితములయ్యెను. భక్తులవలె వారును ఆ భగవంతునిలో లీనమైరి.

రాజా! గోపికలు కామముతోను, అనగా ప్రేమభావముతో, కంసుడు భయకారణముగను, శిశుపాల దంతవక్త్రాది రాజులు ద్వేషభావముతోను, యాదవులు బాంధవ్య కారణముగను, మీరు (పాండవులు) స్నేహభావముతోను, మేము (మహర్షులు) భక్తితోను మన మనస్సులను భగవంతునియందు లగ్నమొనర్చుట జరిగెను.

పైన తెలిపిన భావములలో భక్తి భావము తప్ప మిగిలిన వాటిలో ఏ విధముగనైనను తరించిన వారిలో వేనుడు చేరడు - ఏలయన, అతడు ఏ విధముగ నైనను భగవంతుని స్మరింపలేదు. సారాంశ మేమనగా ఏ రీతిగ నైనను శ్రీకృష్ణుని యందు మనస్సును నిలుపుట అవసరము.

రాజా! మీ పినతల్లి కుమారుడైన శిశుపాలుడును, దంతవక్త్రుడును, శ్రీమహావిష్ణువునకు ప్రముఖ పార్షదులై యుండిరి. సనకాది బ్రాహ్మణ శాపము వలన ఆ ఇరువురును పదచ్యుతులైరి.

యుధిష్ఠిర ఉవాచ

యుధిష్ఠిరుడు అడిగెను- భగవంతుని పార్షదులను గూడ ప్రభావితమొనర్చిన ఆ శాపము ఎట్టిది? అట్లు శపించిన వారెవరు? భగవంతుని అనన్య భక్తులు గూడ జనన మరణ రూప సంసార చక్రమునందు పడవలసి వచ్చె నను విషయము నమ్మశక్యముగాకున్నది. వైకుంఠవాసులకు ప్రాకృత శరీరములు, ఇంద్రియములు, ప్రాణములు ఉండవు. అట్టి వారికి ప్రాకృత శరీరములతో సంబంధము ఎట్లు ఏర్పడినది? ఈ విషయమును  దయతో వివరింపుము.

నారదుడు వచించెను-ధర్మరాజా! బ్రహ్మదేవుని కుమారులైన సనకాది మహర్షులు ముల్లోకములయందును స్వేచ్ఛగా తిరుగుచు ఒకనాడు వైకుంఠమునకు చేరుకొనిరి.

సనకాది మహామునులు మరీచి మొదలగు మహర్షులకంటెను ప్రాచీనులు. వారు ఐదారు సంవత్సరముల వయస్సుగల వారివలె గోచరించుదురు. వారు దిగంబరులై యుండిరి. వైకుంఠ ద్వారపాలకులు వారిని సామాన్య శిశువులవలె భావించి లోపలికి వెళ్ళుటకు అడ్డగించిరి.

అట్లు అడ్డగించుటచే సనకాదులు కుపితులై ఆ ద్వారపాలకులను శపించిరి- "మూర్ఖులారా! శ్రీమహావిష్ణు పాదములు రజస్తమోగుణ రహితములు. ఆ పాదముల చెంత నివసించుటకు మీరు అనర్హులు. కనుక, వెంటనే పాప భూయిష్ఠమైన అసురజన్మలను పొందుదురుగాక!"

సనకాదులు ఇట్లు శపింపగ, ఆ ద్వారపాలకులు (జయవిజయులు) వైకుంఠము నుండి, భూలోకమునకు పడి పోవుచుండిరి. అప్పుడు కృపాళువు లైన ఆ మహాత్ములు మీరు మూడు జన్మలలో ఈ శాపమును అనుభవించి, మఱల వైకుంఠమునకు చేరగలరు అని పల్కిరి.

ధర్మరాజా! వారు ఇరువురు దితికి పుత్రులై జన్మించిరి. జ్యేష్ఠుడు హిరణ్యకశిపుడు, రెండవవాడు హిరణ్యాక్షుడు. దైత్యదానవులలో వారు సర్వశ్రేష్ఠులు.

శ్రీమహావిష్ణువు నృసింహరూపమును దాల్చి, హిరణ్యకశిపుని వధించెను. పృథ్విని ఉద్ధరించు సమయమున ఆ ప్రభువు యజ్ఞవరాహరూపమున అవతరించి, హిరణ్యాక్షుని సంహరించెను.

హిరణ్యకశిపుని పుత్రుడైన ప్రహ్లాదుడు భాగవతోత్తముడు. అతనిని హతమార్చుటకై హిరణ్యకశిపుడు ఆ బాలుని పెక్కు యాతనలకు గురిచేసెను.

ప్రహ్లాదుడు సర్వవ్యాపకుడైన శ్రీహరికి పరమప్రియుడు. సమదర్శి, ప్రశాంత చిత్తుడు. అతనిని చంపుటకు ఎన్ని ప్రయత్నములు చేసినను అవి అన్నియును నిష్ఫలములయ్యెను.

రెండవ జన్మయందు ఆ ఉభయులే విశ్రవసునకు కేశినియందు రాక్షసులై జన్మించిరి. రావణుడు, కుంభకర్ణుడు అనునవి వారి పేర్లు. వారు సకల లోకములలోని వారిని బాధించిరి. ఆ సమయమున గూడ వారిని శాపవిముక్తులను గావించుటకు శ్రీహరి శ్రీరాముడుగా అవతరించి, వారిని హతమార్చెను. శ్రీరాముని చరిత్రను నీవు మార్కండేయ మహామునిద్వారా వినగలవు.

మరల వారు ఈ యుగమున క్షత్రియవంశమున నీ పినతల్లి కుమారులైన శిశుపాల దంతవక్త్రులుగా జన్మించిరి. శ్రీకృష్ణభగవానుని చక్రస్పర్శచే వారి పాపములన్నియును నశించెను. సనకాది మునుల శాపమునుండి వారు ముక్తులైరి. వారు నిరంతరము వైరభావముచే శ్రీకృష్ణుని స్మరించు చుండిరి. తీవ్రమైన ఆ స్మరణ ఫలితముగా వారు భగవంతుని జేరి, తిరిగి ఆ స్వామికి పార్హదులైరి. 

యుధిష్ఠిర ఉవాచ

యుధిష్ఠిరుడు పలికెను- మహాత్మా! హిరణ్యకశిపుడు తన ముద్దుల కుమారుడైన ప్రహ్లాదుని ద్వేషించుటకు కారణమేమి? మహాత్ముడైన ప్రహ్లాదుడు ఏ సాధనచే భగవంతునకు ప్రియభక్తుడయ్యెను? దయతో వివరింపుడు.

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం సప్తమస్కంధే ప్రథమోఽధ్యాయః (1)

ఇది భాగవత మహాపురాణమునందలి సప్తమ స్కంధమునందు మొదటి అధ్యాయము (1)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

--(()) --

రాజోవాచ

1.1 (ప్రథమ శ్లోకము)

పరీక్షిన్మహారాజు వచించెను-స్వామీ! శ్రీహరి సహజముగా భేదభావము లేనివాడు. సముడు, సకల ప్రాణులకు ప్రియుడు, సుహృదుడు. అట్టివాడు సామాన్యమానవులవలె భేదబుద్ధితో తన మిత్రులపక్షము వహించి, శత్రువులకు కీడు తలపెట్టెను. ఇంద్రునికొరకై దైత్యులను ఏల వధించెను?

1.2 (రెండవ శ్లోకము)

ఆ ప్రభువు స్వయముగ పరిపూర్ణుడు. దివ్యమంగళ విగ్రహుడు! కనుక, ఆయనకు దేవతలవలన కలుగు ప్రయోజనము ఏమియు ఉండదు. నిర్గుణుడు అగుటవలన దైత్యులతో వైరముగాని, ఉద్వేగముగాని ఉండదు.

1.3 (మూడవ శ్లోకము)

థఇతి నః సుమహాభాగ నారాయణగుణాన్ ప్రతి|

సంశయః సుమహాన్ జాతస్తద్భవాంశ్ఛేత్తుమర్హతి॥5578॥

మహాత్మా! నీవు భగవద్భక్తి సంపన్నుడవు. భగవంతుని సమత్వాది గుణముల విషయమున నా చిత్తమునందు గొప్ఫ సందేహము గలదు. దయచేసి దానిని తొలగింపుము.

శ్రీశుక ఉవాచ

1.4 (నాలుగవ శ్లోకము)

సాధు పృష్టం మహారాజ హరేశ్చరితమద్భుతమ్|

యద్భాగవతమాహాత్మ్యం భగవద్భక్తివర్ధనం॥5579॥

శ్రీశుకుడు వచించెను-పరీక్షిన్మహారాజా! శ్రీహరి వృత్తాంతము అద్భుతావహమైనది. దాని విషయమున నీవు సముచితముగా ప్రశ్నించితివి. ఈ ప్రసంగమున ప్రహ్లాదుడు మొదలగు భక్తులయొక్క మహత్త్వము వివరింపబడినది. దానిని వినుటవలన భగవద్భక్తి ఇనుమడించును.

1.5 (ఐదవ శ్లోకము)

గీయతే పరమం పుణ్యమృషిభిర్నారదాదిభిః|

నత్వా కృష్ణాయ మునయే కథయిష్యే హరేః కథామ్॥5580॥

పరమ పవిత్రమైన శ్రీహరి కథలను నారదాది మహాత్ములు పరమభక్తితో గానము చేయుచుందురు. నేను నా తండ్రిగారైన వేదవ్యాసునకు నమస్కరించి, భగవంతుని లీలలను వర్ణింతును.

1.6 (ఆరవ శ్లోకము)

నిర్గుణోఽపి హ్యజోఽవ్యక్తో భగవాన్ ప్రకృతేః పరః|

స్వమాయాగుణమావిశ్య బాధ్యబాధకతాం గతః॥5581॥

వాస్తవముగా భగవంతుడు నిర్గుణుడు, జన్మరహితుడు. దేహేంద్రియాదులు లేనివాడు. ప్రకృతికి అతీతుడు. ఐనను తన మాయాగుణములను ఆశ్రయించి, బాధ్యబాధకభావములను (అనగా చంపుట, చనిపోవుట అను పరస్పర  విరుద్ధభావములను) గ్రహించెను.

1.7 (ఏడవ శ్లోకము)

సత్త్వం రజస్తమ ఇతి ప్రకృతేర్నాత్మనో గుణాః|

న తేషాం యుగపద్రాజన్ హ్రాస ఉల్లాస ఏవ వా॥5582॥

రాజా! సత్త్వరజస్తమములు ప్రకృతియొక్క గుణములు. అవి ఆత్మకు లేవు. ఈ మూడు గుణములు గూడ ఒకేసారి పెరుగుటగాని, తగ్గుటగాని జరుగదు.

1.8 (ఎనిమిదవ శ్లోకము)

జయకాలే తు సత్త్వస్య దేవర్షీన్ రజసోఽసురాన్|

తమసో యక్షరక్షాంసి తత్కాలానుగుణోఽభజత్॥5583॥

భగవంతుడు వేర్వేరు సమయములయందు ఆయా గుణములను స్వీకరించును. సత్త్వగుణములు వృద్ధి చెందునప్పుడు దేవతల, ఋషల పక్షము వహించును. రజోగుణమువృద్ధి చెందినప్పుడు దైత్యుల పక్షమున చేరును. తమోగుణము వర్ధిల్లు సమయమున యక్షరాక్షసుల పక్షమున నిలుచును.

1.9 (తొమ్మిదవ శ్లోకము)

జ్యోతిరాదిరివాభాతి సంఘాతాన్న వివిచ్యతే|

విదంత్యాత్మానమాత్మస్థం మథిత్వా కవయోఽన్తతః॥5584॥

సర్వత్ర వ్యాపించియున్న అగ్ని, కర్రల సంబంధములే గోచరించును. అట్లే అంతటా నిరాకారముగ నిండి నిబిడీకృతమైయున్న పరమాత్మను, ప్రజ్ఞావంతులు నేతి, నేతి-ఇదికాదు, ఇదికాదు అనుచు అన్నింటిని నిషేధించుచు తమ హృదయములను మథించు అంర్యామిగానున్న ఆ భగవంతుని దర్శింతురు.

1.10 (పదియవ శ్లోకము)

యదా సిసృక్షుః పుర ఆత్మనః పరో రజః సృజత్యేష పృథక్  స్వమాయయా|

సత్త్వం విచిత్రాసు రిరంసురీశ్వరః   శయిష్యమాణస్తమ ఈరయత్యసౌ॥5585॥

పరమేశ్వరుడు చిత్రవిచిత్రములగు శరీరములద్వారా రమించగోరినప్పుడు తన మాయాశక్తిద్వారా రజోగుణముచే సృష్టికార్యమును ప్రారంభించును. సత్త్వగుణముతో ఆ సృష్టిని సంరక్షించును. అనంతరము నశింపజేయ గోరినప్పుడు ఆ ఈశ్వరుడే తమోగుణముద్వారా సమస్తసృష్టిని లయింపజేయును.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి సప్తమస్కంధములోని మొదటి అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

18.6.2020    ప్రాతః కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

సప్తమ స్కంధము - మొదటి అధ్యాయము

నారద-యుధిష్థిర సంవాదము-జయవిజయుల గాథ

ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

1.11 (పదకొండవ శ్లోకము)

కాలం చరంతం సృజతీశ ఆశ్రయం  ప్రధానపుంభ్యాం నరదేవ సత్యకృత్|

య ఏష రాజన్నపి కాల ఈశితా సత్త్వం సురానీకమివైధయత్యతః|

తత్ప్రత్యనీకానసురాన్ సురప్రియో రజస్తమస్కాన్ ప్రమిణోత్యురుశ్రవాః ॥5586॥

మహారాజా! భగవంతుడు సత్యసంకల్పుడు. ఆయనయే జగదుత్పత్తికి నిమిత్తకారణమై ప్రకృతి, పురుషులకు ఆశ్రయమైన కాలమును సృష్టించును. కనుక, ఆయన కాలమునకు అధీనుడుకాదు. కాలమే ఆయన యొక్క అధీనములో ఉండును. కాలస్వరూపుడైన ఈశ్వరుడు సత్ప్వగుణమును వృద్ధిచేయునప్పుడు సత్త్వమయుడైన దేవతల బలమును పెంపొందింప జేయును. పరమయశస్వి, దేవతా ప్రియుడైన ఆ పరమాత్మ అప్పుడు దేవవిరోధులు, రజస్తమోగుణములు గల దైత్యులను సంహరించును. వాస్తవముగా అందరును ఆయనకు సమానులే.

1.12 (పండ్రెండవ శ్లోకము)

అత్రైవోదాహృతః పూర్వమితిహాసః సురర్షిణా|

ప్రీత్యా మహాక్రతౌ రాజన్ పృచ్ఛతేఽజాతశత్రవే॥5587॥

రాజా! ఈ విషయమున దేవర్షియైన నారదుడు ప్రీతితో ఒక గాధను తెలిపియుండెను. మీ తాతయైన యుధిష్ఠిరుడు రాజసూయ యాగసమయమున ఈ విషయమును గూర్చి నారదుని ప్రశ్నించెను.

1.13 (పదమూడవ శ్లోకము)

దృష్ట్వా మహాద్భుతం రాజా రాజసూయే మహాక్రతౌ|

వాసుదేవే భగవతి సాయుజ్యం చేదిభూభుజః॥5588॥

1.14 (పదునాలుగవ శ్లోకము)

తత్రాసీనం సురఋషిం రాజా పాండుసుతః క్రతౌ|

పప్రచ్ఛ విస్మితమనా మునీనాం శృణ్వతామిదం॥5589॥

రాజసూయ యాగసమయమున చేదిరాజైన శిశుపాలుడు అందరు చూచుచుండగనే శ్రీకృష్ణభగవానునిలో ఐక్యమైన అద్భుతమైన సంఘటనను యుధిష్ఠిరుడు స్వయముగా తిలకించెను. ఆ మహాసభయందు మహామునులు ఆసీనులైయుండిరి. దేవర్షియగు నారదుడు గూడ అప్ఫుడు అచట ఉండెను. మిగుల ఆశ్చర్యకరమైన ఈ దృశ్యమును గాంచి, పాండుసుతుడగు యుధిష్ఠిరుడు దేవర్షిని ఇట్లు ప్రశ్నించెను.

1.15 (పదునైదవ శ్లోకము)

యుధిష్ఠిర ఉవాచ

అహో అత్యద్భుతం హ్యేతద్దుర్లభైకాంతినామపి|

వాసుదేవే పరే తత్త్వే ప్రాప్తిశ్చైద్యస్య విద్విషః॥5590

యుధిష్ఠిరుడు పలికెను-ఔరా! ఈ దృశ్యము మిగుల అద్భుతమైనది. పరమాత్ముడైన శ్రీకృష్ణునియందు ఐక్యమగుట అనన్యభక్తులకు గూడ దుర్లభము. కావున, శ్రీకృష్ణుని నిరంతరము ద్వేషించునట్టి శిశుపాలునకు ఇట్టి దుర్లభమైన గతి ఎట్లు ప్రాప్తించెను.

1.16 (పదునారవ శ్లోకము)

ఏతద్వేదితుమిచ్ఛామః సర్వ ఏవ వయం మునే|

భగవన్నిందయా వేనో ద్విజైస్తమసి పాతితః॥5591॥

మునీశ్వరా! మేము అందరము ఈ రహస్యమును తెలియగోరుచున్నాము. పూర్వకాలమున భగవంతుని నిందించుటచే వేనుడను రాజును ఋషీశ్వరులు నరకమున పడద్రోసిరి.

1.17 (పదిహేడవ శ్లోకము)

దమఘోషసుతః పాపః ఆరభ్య కలభాషణాత్|

సంప్రత్యమర్షీ గోవిందే దంతవక్త్రశ్చ దుర్మతిః॥5592॥

దమఘోషుని సుతుడు, పాపాత్ముడైన శిశుపాలుడును, దుర్భుద్ధియైన దంతవక్త్రుడును బాల్యము నుండియు ఇంతవరకును భగవంతుడైన శ్రీకృష్ణుని యందు ద్వేషభావమును కలిగియేయున్నారు.

1.18 (పదునెనిమిదవ శ్లోకము)

శపతోరసకృద్విష్ణుం యద్బ్రహ్మ పరమవ్యయమ్|

శ్విత్రో న జాతో జిహ్వాయాం నాంధం వివిశతుస్తమః॥5593॥

1.19 (పందొమ్మిదవ శ్లోకము)

కథం తస్మిన్ భగవతి దురవగ్రాహధామని|

పశ్యతాం సర్వలోకానాం లయమీయతురంజసా॥5594॥

శాశ్వతుడు, పరబ్రహ్మస్వరూపుడైన శ్రీకృష్ణభగవానుని తిట్టిపోయుచునే యున్నారు. ఐనను, వారికి నాలుకపై చిన్న మచ్చకూడ ఏర్పడలేదు. వారికి ఘోరాంధకారమయమైన నరకము గూడ ప్రాప్తించలేదు. పైగా, అత్యంత దుర్లభమైన భగవత్ప్రాప్తి అందరును చూచుచుండగనే అనాయాసముగా వీరికి లభించినది. దీనికి కారణమేమి?

1.20 (ఇరువదియవ శ్లోకము)

ఏతద్భ్రామ్యతి మే బుద్ధిర్దీపార్చిరివ వాయునా|

బ్రూహ్యేతదద్భుతతమం భగవాంస్తత్ర కారణమ్॥5595॥

ఈ విషయమున గాలి తాకిడికి దీపశిఖవలె నా బుద్ధి భ్రమకులోనై అటునిటు కొట్టుకొనుచున్నధి. దేవర్షీ! నీవు సర్వజ్ఞుడవు. కావున, ఈ అద్భుతఘటనలోగల రహస్యమును వివరింపుము.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి సప్తమస్కంధములోని మొదటి అధ్యాయము ఇంకను కొనసాగును)

******

18.6.2020    సాయం కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

సప్తమ స్కంధము - మొదటి అధ్యాయము

నారద-యుధిష్థిర సంవాదము-జయవిజయుల గాథ

ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

శ్రీశుక ఉవాచ

1.21 (ఇరువది ఒకటవ శ్లోకము)

రాజ్ఞస్తద్వచ ఆకర్ణ్య నారదో భగవానృషిః|

తుష్టః ప్రాహ తమాభాష్య శృణ్వత్యాస్తత్సదః॥5596॥

శ్రీశుకుడు నుడివెను - సర్వసమర్థుడైన నారదమహర్షి యుధిష్ఠిరుని ఈ ప్రశ్నను విని మిక్కిలి సంతసించెను. పిమ్మట ఆ మహాసభయందు అందరు వినుచుండగా ధర్మరాజునకు ఈ కథను వినిఫించెను.

1.22 (ఇరువది రెండవ శ్లోకము)

నారద ఉవాచ

నిందనస్తవసత్కారన్యక్కారార్థం కలేవరమ్|

ప్రధానపరయో రాజన్నవివేకేన కల్పితం॥5597॥

నారదుడు వచించెను- ధర్మరాజా! నింద, స్తుతి, సత్కారము, తిరస్కారము అనునవి ఈ శరీరమునకు సంబంధించినవి. ప్రకృతి, పురుషులను గూర్చిన వివేకము లేకుండుటచే అజ్ఞానకారణముగా ఆత్మయందు కల్పితమైనది.

1.23 (ఇరువది మూడవ శ్లోకము)

హింసా తదభిమానేన దండపారుష్యయోర్యథా|

వైషమ్యమిహ భూతానాం మమాహమితి పార్థివ॥

1.24 (ఇరువది నాలుగవ శ్లోకము)

యన్నిబద్ధోఽభిమానోఽయం తద్వధాత్ప్రాణినాం వధః|

తథా న యస్య కైవల్యాదభిమానోఽఖిలాత్మనః|

పరస్య దమకర్తుర్హి హింసా కేనాస్య కల్ప్యతే॥5599॥

దేహాభిమానము కారణముగా జీవుడు ఈ శరీరమును నేను అని భావించి, దండనము, పరుషవచనములు ఎదురైనప్పుడు, అవి తనవిగానే భావించును. కాని, భగవంతునకు జీవులవలె ఇట్టి అభిమానము ఉండదు. ఆ ప్రభువు సర్వాత్మ స్వరూపుడు, అద్వితీయుడు. ఇతరులను దండించునప్పుడుగూడ క్రోధము, ద్వేషముల వలనగాక, వారి శ్రేయస్సు కొరకే అట్లు చేయును. భగవంతుని విషయములో హింసకు చోటులేదు.

1.25 (ఇరువది ఐదవ శ్లోకము)

తస్మాద్వైరానుబంధేన నిర్వైరేణ భయేన వా|

స్నేహాత్కామేన వా యుంజ్యాత్కథంచిన్నేక్షతే పృథక్॥5600॥

అందువలన వైరముచేగాని, భక్తిచేగాని, భయముచేగాని, మైత్రిచేగాని, ప్రియతముడనిగాని, లేక ఏ కారణముననైనను భగవంతునిపై పూర్తిగ మనసును లగ్నము చేయవలెను. భగవంతుని దృష్టిలో ఈ భావములయందు ఎట్టి భేదము ఉండదు.

1.26 (ఇరువది ఆరవ శ్లోకము)

యథా వైరానుబంధేన మర్త్యస్తన్మయతామియాత్|

న తథా భక్తియోగేన ఇతి మే నిశ్చితా మతిః॥5601॥

రాజా! మనుష్యుడు భగవంతుని యెడల వైరభావముతో ఎంతటి తన్మయత్వమును భక్తిభావముతో పొందలేడు అని నా దృఢ విశ్వాసము.

1.27 (ఇరువది ఏడవ శ్లోకము)

కీటః పేశస్కృతా రుద్ధః కుడ్యాయాం తమనుస్మరన్|

సంరంభభయయోగేన విందతే తత్సరూపతామ్॥5602॥

తుమ్మెద ఒక పురుగును తెచ్చి తన గూటిలో ఉంచి, మూసివేయును. పిమ్మట అది ఝుమ్మని నాదము చేయుచూ ఆ గూటిచుట్టూరా తిరుగును. ఆ పురుగు భయమునకు లోనై ఆ తుమ్మెదనే స్మరించుచుండును. తత్ఫలితముగా ఆ పురుగు తన శరీరమును విడువకుండగనే, ఆ తుమ్మెద రూపమును పొందును.

1.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)

ఏవం కృష్ణే భగవతి మాయామనుజ ఈశ్వరే|

వైరేణ పూతపాప్మానస్తమాపురనుచింతయా॥5603॥

శ్రీకృష్ణభగవానుని విషయములోగూడ ఈ దృష్టాంతము చక్కగా వర్తించును. సర్వశక్తిమంతుడైన ఆ పరమపురుషుడు తన లీలలను ప్రకటించుటకై మానవునిగా గోచరించును. వైరభావముతో నైనను ఆ ప్రభువును నిరంతరము స్మరించుటచే పాపరహితుడై వారు కూడా ఆ స్వామినే పొందిరి.

1.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)

కామాద్ద్వేషాద్భయాత్స్నేహాద్యథా భక్త్యేశ్వరే మనః|

ఆవేశ్య తదఘం హిత్వా బహవస్తద్గతిం గతాః॥5604॥

పెక్కుమంది మనుజులు కామముతో, ద్వేషముతో, భయముతో, స్నేహముతో తమ మనస్సును ఆ భగవంతుని యందే లగ్నము చేయుటవలన వారి పాపములన్నియును ప్రక్షాళితములయ్యెను. భక్తులవలె వారును ఆ భగవంతునిలో లీనమైరి.

1.30 (ముప్పదియవ శ్లోకము)

గోప్యః కామాద్భయాత్కంసో ద్వేషాచ్చైద్యాదయో నృపాః|

సంబంధాద్వృష్ణయః స్నేహాద్యూయం భక్త్యా వయం విభో॥5605॥

రాజా! గోపికలు కామముతోను, అనగా ప్రేమభావముతో, కంసుడు భయకారణముగను, శిశుపాల దంతవక్త్రాది రాజులు ద్వేషభావముతోను, యాదవులు బాంధవ్య కారణముగను, మీరు (పాండవులు) స్నేహభావముతోను, మేము (మహర్షులు) భక్తితోను మన మనస్సులను భగవంతునియందు లగ్నమొనర్చుట జరిగెను.

1.31 (ముప్పది ఒకటవ శ్లోకము)

కతమోఽపి న వేనః స్యాత్పంచానాం పురుషం ప్రతి|

తస్మాత్కేనాప్యుపాయేన మనః కృష్ణే నివేశయేత్॥5606॥

పైన తెలిపిన భావములలో భక్తి భావము తప్ప మిగిలిన వాటిలో ఏ విధముగనైనను తరించిన వారిలో వేనుడు చేరడు - ఏలయన, అతడు ఏ విధముగ నైనను భగవంతుని స్మరింపలేదు. సారాంశ మేమనగా ఏ రీతిగ నైనను శ్రీకృష్ణుని యందు మనస్సును నిలుపుట అవసరము.

1.32 (ముప్పది రెండవ శ్లోకము)

మాతృష్వసేయో వశ్చైద్యో దంతవక్త్రశ్చ పాండవ|

పార్షదప్రవరౌ విష్ణోర్విప్రశాపాత్పదాచ్చ్యుతౌ॥5607॥

రాజా! మీ పినతల్లి కుమారుడైన శిశుపాలుడును, దంతవక్త్రుడును, శ్రీమహావిష్ణువునకు ప్రముఖ పార్షదులై యుండిరి. సనకాది బ్రాహ్మణ శాపము వలన ఆ ఇరువురును పదచ్యుతులైరి.

యుధిష్ఠిర ఉవాచ

1.33 (ముప్పది మూడవ శ్లోకము)

కీదృశః కస్య వా శాపో హరిదాసాభిమర్శనః|

అశ్రద్ధేయ ఇవాభాతి హరేరేకాంతినాం భవః॥5608॥

1.34 (ముప్పది నాలుగవ శ్లోకము)

దేహేంద్రియాసుహీనానాం వైకుంఠపురవాసినాం|

దేహసంబంధసంబద్ధమేతదాఖ్యాతుమర్హసి॥5609॥

యుధిష్ఠిరుడు అడిగెను- భగవంతుని పార్షదులను గూడ ప్రభావితమొనర్చిన ఆ శాపము ఎట్టిది? అట్లు శపించిన వారెవరు? భగవంతుని అనన్య భక్తులు గూడ జనన మరణ రూప సంసార చక్రమునందు పడవలసి వచ్చె నను విషయము నమ్మశక్యముగాకున్నది. వైకుంఠవాసులకు ప్రాకృత శరీరములు, ఇంద్రియములు, ప్రాణములు ఉండవు. అట్టి వారికి ప్రాకృత శరీరములతో సంబంధము ఎట్లు ఏర్పడినది? ఈ విషయమును  దయతో వివరింపుము.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి సప్తమస్కంధములోని మొదటి అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

[03:32, 19/06/2020] +91 95058 13235: 19.6.2020    ప్రాతః కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

సప్తమ స్కంధము - మొదటి అధ్యాయము

నారద-యుధిష్థిర సంవాదము-జయవిజయుల గాథ

ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

నారద ఉవాచ

1.35 (ముప్పది ఐదవ శ్లోకము)

ఏకదా బ్రహ్మణః పుత్రా విష్ణోర్లోకం యదృచ్ఛయా|

సనందనాదయో జగ్ముశ్చరంతో భువనత్రయం॥5610॥

నారదుడు వచించెను-ధర్మరాజా! బ్రహ్మదేవుని కుమారులైన సనకాది మహర్షులు ముల్లోకములయందును స్వేచ్ఛగా తిరుగుచు ఒకనాడు వైకుంఠమునకు చేరుకొనిరి.

1.36 (ముప్పది ఆరవ శ్లోకము)

పంచషడ్ఢాయనార్భాభాః పూర్వేషామపి పూర్వజాః|

దిగ్వాససః శిశూన్ మత్వా ద్వాఃస్థౌ తాన్ ప్రత్యషేధతాం॥5611॥

సనకాది మహామునులు మరీచి మొదలగు మహర్షులకంటెను ప్రాచీనులు. వారు ఐదారు సంవత్సరముల వయస్సుగల వారివలె గోచరించుదురు. వారు దిగంబరులై యుండిరి. వైకుంఠ ద్వారపాలకులు వారిని సామాన్య శిశువులవలె భావించి లోపలికి వెళ్ళుటకు అడ్డగించిరి.

1.37 (ముప్పది ఏడవ శ్లోకము)

అశపన్ కుపితా ఏవం యువాం వాసం న చార్హథః|

రజస్తమోభ్యాం రహితే పాదమూలే మధుద్విషః|

పాపిష్ఠామాసురీం యోనిం బాలిశౌ యాతమాశ్వతః॥5612

అట్లు అడ్డగించుటచే సనకాదులు కుపితులై ఆ ద్వారపాలకులను శపించిరి- "మూర్ఖులారా! శ్రీమహావిష్ణు పాదములు రజస్తమోగుణ రహితములు. ఆ పాదముల చెంత నివసించుటకు మీరు అనర్హులు. కనుక, వెంటనే పాప భూయిష్ఠమైన అసురజన్మలను పొందుదురుగాక!"

1.38 (ముప్పది ఎనిమిదవ శ్లోకము)

ఏవం శప్తౌ స్వభవనాత్పతంతౌ తైః కృపాళుభిః|

ప్రోక్తౌ పునర్జన్మభిర్వాం త్రిభిర్లోకాయ కల్పతామ్॥5613॥

సనకాదులు ఇట్లు శపింపగ, ఆ ద్వారపాలకులు (జయవిజయులు) వైకుంఠము నుండి, భూలోకమునకు పడి పోవుచుండిరి. అప్పుడు కృపాళువు లైన ఆ మహాత్ములు మీరు మూడు జన్మలలో ఈ శాపమును అనుభవించి, మఱల వైకుంఠమునకు చేరగలరు అని పల్కిరి.

1.39 (ముప్పది తొమ్మిదవ శ్లోకము)

జజ్ఞాతే తౌ దితేః పుత్రౌ దైత్యదానవవందితౌ|

హిరణ్యకశిపుర్జ్యేష్ఠో హిరణ్యాక్షోఽనుజస్తతః॥5616॥

ధర్మరాజా! వారు ఇరువురు దితికి పుత్రులై జన్మించిరి. జ్యేష్ఠుడు హిరణ్యకశిపుడు, రెండవవాడు హిరణ్యాక్షుడు. దైత్యదానవులలో వారు సర్వశ్రేష్ఠులు.

1.40 (నలుబదియవ శ్లోకము)

హతో హిరణ్యకశిపుర్హరిణా సింహరూపిణా|

హిరణ్యాక్షో ధరోద్ధారే బిభ్రతా సౌకరం వపుః॥5615॥

శ్రీమహావిష్ణువు నృసింహరూపమును దాల్చి, హిరణ్యకశిపుని వధించెను. పృథ్విని ఉద్ధరించు సమయమున ఆ ప్రభువు యజ్ఞవరాహరూపమున అవతరించి, హిరణ్యాక్షుని సంహరించెను.

1.41 (నలుబది ఒకటవ శ్లోకము)

హిరణ్యకశిపుః పుత్రం ప్రహ్లాదం కేశవప్రియమ్|

జిఘాంసురకరోన్నానా యాతనా మృత్యుహేతవే॥5616॥

హిరణ్యకశిపుని పుత్రుడైన ప్రహ్లాదుడు భాగవతోత్తముడు. అతనిని హతమార్చుటకై హిరణ్యకశిపుడు ఆ బాలుని పెక్కు యాతనలకు గురిచేసెను.

1.42 (నలుబది రెండవ శ్లోకము)

సర్వభూతాత్మభూతం తం ప్రశాంతం సమదర్శనమ్|

భగవత్తేజసా స్పృష్టం నాశక్నోద్ధంతుముద్యమైః॥5617॥

ప్రహ్లాదుడు సర్వవ్యాపకుడైన శ్రీహరికి పరమప్రియుడు. సమదర్శి, ప్రశాంత చిత్తుడు. అతనిని చంపుటకు ఎన్ని ప్రయత్నములు చేసినను అవి అన్నియును నిష్ఫలములయ్యెను.

1.43 (నలుబది మూడవ శ్లోకము)

తతస్తౌ రాక్షసౌ జాతౌ కేశిన్యాం విశ్రవఃసుతౌ|

రావణః కుంభకర్ణశ్చ సర్వలోకోపతాపనౌ॥5618॥

1.44 (నలుబది నాలుగవ శ్లోకము)

తత్రాపి రాఘవో భూత్వా న్యహనచ్ఛాపముక్తయే|

రామవీర్యం శ్రోష్యసి త్వం మార్కండేయముఖాత్ప్రభో॥5619॥

రెండవ జన్మయందు ఆ ఉభయులే విశ్రవసునకు కేశినియందు రాక్షసులై జన్మించిరి. రావణుడు, కుంభకర్ణుడు అనునవి వారి పేర్లు. వారు సకల లోకములలోని వారిని బాధించిరి. ఆ సమయమున గూడ వారిని శాపవిముక్తులను గావించుటకు శ్రీహరి శ్రీరాముడుగా అవతరించి, వారిని హతమార్చెను. శ్రీరాముని చరిత్రను నీవు మార్కండేయ మహామునిద్వారా వినగలవు.

1.45 (నలుబది ఐదవ శ్లోకము)

తావేవ క్షత్రియౌ జాతౌ మాతృష్వస్రాత్మజౌ తవ|

అధునా శాపనిర్ముక్తౌ కృష్ణచక్రహతాంహసౌ॥5620॥

1.46 (నలుబది ఆరవ శ్లోకము)

వైరానుబంధతీవ్రేణ ధ్యానేనాచ్యుతసాత్మతామ్|

నీతౌ పునర్హరేః పార్శ్వం జగ్మతుర్విష్ణుపార్షదౌ॥5621॥

మరల వారు ఈ యుగమున క్షత్రియవంశమున నీ పినతల్లి కుమారులైన శిశుపాల దంతవక్త్రులుగా జన్మించిరి. శ్రీకృష్ణభగవానుని చక్రస్పర్శచే వారి పాపములన్నియును నశించెను. సనకాది మునుల శాపమునుండి వారు ముక్తులైరి. వారు నిరంతరము వైరభావముచే శ్రీకృష్ణుని స్మరించు చుండిరి. తీవ్రమైన ఆ స్మరణ ఫలితముగా వారు భగవంతుని జేరి, తిరిగి ఆ స్వామికి పార్హదులైరి. 

యుధిష్ఠిర ఉవాచ

1.47 (నలుబది ఏడవ శ్లోకము)

విద్వేషో దయితే పుత్రే కథమాసీన్మహాత్మని|

బ్రూహి మే భగవన్ యేన ప్రహ్లాదస్యాచ్యుతాత్మతా॥5622॥

యుధిష్ఠిరుడు పలికెను- మహాత్మా! హిరణ్యకశిపుడు తన ముద్దుల కుమారుడైన ప్రహ్లాదుని ద్వేషించుటకు కారణమేమి? మహాత్ముడైన ప్రహ్లాదుడు ఏ సాధనచే భగవంతునకు ప్రియభక్తుడయ్యెను? దయతో వివరింపుడు.

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం సప్తమస్కంధే ప్రథమోఽధ్యాయః (1)

ఇది భాగవత మహాపురాణమునందలి సప్తమ స్కంధమునందు మొదటి అధ్యాయము (1)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

No comments:

Post a Comment