వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం , సప్తమ స్కంధము - ఆరవ అధ్యాయము
అసురబాలకులకు ప్రహ్లాదుని ఉపదేశము ఓం నమో భగవతే వాసుదేవాయ
***
ప్రహ్లాద ఉవాచ
ప్రహ్లాదుడు నుడివెను మిత్రులారా! ఈ లోకమున మానవజన్మ దుర్లభమైనది. దీనిద్వారానే శాశ్వతుడైన పరమాత్మ యొక్క ప్రాప్తి కలుగును. కాని, ఈ మానవజన్మ ఎప్పుడు ముగియునో తెలియదు. బుద్ధిమంతుడైనవాడు ముసలితనముపై, యౌవనముపై విశ్వాసమును ఉంచక, బాల్యము నుండియే భగవత్ప్రాప్తికై సాధనలను చేయవలెను.
ఈ మానవజీవితము భగవంతుని చరణములను శరణుపొందుటవలననే సఫలమగును. ఏలయన, భగవంతుడు సకల ప్రాణులకు ప్రభువు. సుహృదుడు, ప్రియతముడు, ఆత్మస్వరూపుడు.
దితి వంశీయులారా! జీవులకు ఏ జన్మలోనైనా, ఎటువంటి దేహముతో సంయోగము కలుగునో, అట్టి దేహసంబంధమైన ఇంద్రియములవలన లభించెడు సుఖములు సహజముగనే కలుగును. అట్లే ప్రారబ్ధమును అనుసరించి దుఃఖములు కూడా ఎటువంటి ప్రయత్నము లేకుండగనే లభించుచుండును.
అందువలన సాంసారిక సుఖముల కొరకు ప్రయత్నింపనవసరము లేదు. ఏలయన, తనంతట తానే లభించువస్తువు కొరకు శ్రమించుట, కేవలము తన ఆయువును, శక్తిని వ్యర్థము చేసికొనుటయే యగును. ఇంద్రియ భోగముల వెంటపడిన వానికి పరమ కల్యాణస్వరూపుడైన భగవంతుని పాదపద్మములు ప్రాప్తింపవు.
మానవ జీవితము పుష్కలమైన భయములతో నిండియుండును. భగవత్ప్రాప్తియే దీని లక్ష్యము. కనుక, ఈ శరీరము రోగ శోకాదులచే గ్రస్తమై మృత్యు ముఖమున ప్రవేశింపకముందే, బుద్ధిమంతుడు తన శ్రేయస్సు కొరకు ప్రయత్నింపవలెను.
మానవుని ఆయుర్దాయము నూరు సంవత్సరములు. జితేంద్రియుడుకాని వాని ఆయువు సగభాగము చూచుచుండగనే నిష్ఫలముగ గడచిపోవును. ఏలయన, అజ్ఞాన కారణముగా రాత్రులయందు తమోగుణ ప్రధానమైన నిద్రయందే గడచిపోవును.
బాల్యమునందు మానవునకు మంచిచెడుల వివేకము ఉండదు. కౌమారదశయందు అతడు ఆటపాటలలోనే మునిగిపోవును. ఈ విధముగా తెలియకుండగనే ఇరువది సంవత్సరములు గడచిపోవును. ఇంతలో వృద్ధాప్యము ఆవహించుటచే దేహము సడలిపోయి ఏమిచేయుటకు శక్తి సరిపోవక మరొక ఇరువది యేళ్ళు గడచిపోవును.
ఇంక మిగిలిన ఆయుర్ధాయము స్వల్పముగనే యుండును. అందులో మానవుడు మోహములో చిక్కుకొని, ఎప్పటికిని పూర్తికాని కోరికలయందును, గృహకృత్యముల యందును ఆసక్తుడై యుండును. అందువలన తన కర్తవ్యము, అకర్తవ్యముల జ్ఞానము అతనికి ఉండదు. ఈ విధముగా మిగిలిన ఆయువుగూడ చేజారిపోవును.
ఇంద్రియములకు వశుడైనవాడు గృహకార్యముల యందే ఆసక్తుడై మాయ, మమత అను బలమైన బంధములకు వశుడైయుండును. అట్టివాడు వాటినుండి విముక్తి పొందుటకు ఉత్సహింపడు.
చోరుడు, సేవకుడు, వ్యాపారి తనకు అత్యంత ప్రీతిపాత్రమైన ప్రాణముల నొడ్డియైన ధనసంపాదనకు పాటు పడును. ధనము పైగల ఈ పేరాశను ఎవరు విడిచిపెట్టగలరు?
మానవుడు తన ప్రియపత్నితో ఏకాంతవాసము చేయును. ప్రేమపూరితములైన ఆమె మాటలు, చెవులకు ఇంపు గొలుపు ఆమె సూచనలను పాటించుచు తన జీవితమునే వ్యర్థముగా గడుపును. బంధుమిత్రుల స్నేహపాశములచే, పిల్లల చిలుక పలుకులచే ఆకర్షితుడగును. ఇంక వాటినుండి అతడు ఎట్లు బయటపడగలడు? వివాహితలైన తన కుమార్తెలను, సుతులను, సోదరులను, దీనులైన తల్లిదండ్రులను, అమూల్యమైన వస్తువులచే అలంకరింపబడిన ఇంఢ్లను, వంశపరంపరాగతమైన తమ జీవన సాధనములను, పశువులను, సేవకులను నిరంతరము స్మరించుచునే యుండును. అట్టి వాటిని అతడెట్లు వదులు కొనగలడు?
మానవుడు జననేంద్రియ, రసనేంద్రియ సుఖములనే సర్వస్వమని భావించును. భోగసుఖముల వాసనలకు అతడు ఎప్పుడును తృప్తిపడడు. లోభకారణముగా కర్మలపై కర్మలను చేయుచు సాలెపురుగువలె అతడు ఇంకను బంధములయందు కూరుకొనిపోవును. అతని వ్యామోహములకు అంతూపొంతూ ఉండదు. అట్టివాడు వాటియందు ఎట్లు విరక్తుడగును? వాటిని ఎట్లు త్యజింపగల్గును?
కుటుంబముపై గల మోహముచే దాని పోషణయందే తన అమూల్యమైన ఆయువును పోగొట్టుకొనును. అతడు ఎన్నడును తన జీవిత పరమార్థమును గూర్చి ఆలోచింపడు. అంతులేని ప్రమాదములలొ పడిపోవును. ఇట్టి అభిలాషల వలన అతనికి ఎట్టి సుఖమూ లభింపకపోగా, అతనిని దైహిక, దైవిక, భౌతిక తాపత్రయములు వెంటాడుచునే యుండును. ఐనను, అతనికి వైరాగ్యము అబ్బదు. కుటుంబము పైగల మమకారముచే బద్ధుడై ధనసంపాదన చింతలోనే మునిగియుండును. ఇతరుల సొత్తులను దొంగిలించుట వలన లౌకిక, పారలౌకిక దోషములు కలుగునని తెలిసినను కోరికలకు లోబడి, తన కర్తవ్యమును మరచి, భోగలాలసుడై ధనమును అపహరించు చుండును.
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి సప్తమస్కంధములోని ఆరవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
***
వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం, సప్తమ స్కంధము - ఆరవ అధ్యాయము
అసురబాలకులకు ప్రహ్లాదుని ఉపదేశము , ఓం నమో భగవతే వాసుదేవాయ
***
సోదరులారా! మానవుడు ఈ విధముగా తనకుటుంబ పోషణయందే నిబద్ధుడైనవాడు, ఎన్నడును భగవంతుని సేవింపుడు. అతడు విద్వాంసుడేయైననూ అతనికి భగవత్ప్రాప్తి కలుగదు. ఇది నాది, ఇది ఇతరులది అను భేదభావము ఉండుటవలన అతనికిని అజ్ఞానులవలె తమోగుణ ప్రధానమైన అధోగతులే లభించును.
అతడు కామినుల మనస్సులను రంజింపజేయునట్టి కీలు బొమ్మయగును. అట్టి పాపకృత్యముల ఫలితముగా కలిగిన సంతానము, అతని పాదములకు సంకెల యగును. అట్టి దీనుడు ఎప్పుడైనను, ఎప్పుడైనను, ఏవిధముగనైనను ఆత్మోద్ధరణకై ప్రయత్నింపలేడు.
సోదరులారా! అందువలన మీరు విషయాసక్తులైన దైత్యుల సాంగత్యమును దూరముగ పారద్రోలుడు. ఆదిదేవుడైన శ్రీమన్నారాయణుని శరణువేడుడు. ఏలయన, సాంసారిక విషయముల యందు ఆసక్తిలేని మహాత్ములకు ఆ ప్రభువే ప్రియతముడు. అతడే పరమగతి.
మిత్రులారా! భగవంతుని ప్రసన్నునిగా జేసికొనుటకు ఎక్కువ పరిశ్రమ లేక ప్రయత్నములు చేయనవసరము లేదు. అతడు సకల ప్రాణులలో ఆత్మస్వరూపుడై సర్వత్ర వ్యాపించియున్నాడు.
చెట్టు చేమలు మొదలుకొని బ్రహ్మదేవుని వరకు, సకల ప్రాణుల యందు ఆ ప్రభువు వ్యాపించియున్నాడు. అంతేగాదు, పంచభూతములయందును, వాటిచే నిర్మితములైన వస్తువులయందును, సూక్ష్మతన్మాత్రలయందును, ఆ పరమాత్మ విరాజిల్లుచున్నాడు. మహత్తత్వము నందును, త్రిగుణములయందును, వాటి సామ్యావస్థలయందును, తద్వ్యతిరేకావస్థలయందును ఆ స్వామి శాశ్వతముగా నెలకొనియున్నాడు. అతడు సమస్త సౌందర్యమాధుర్య ఐశ్వర్యములకు నిధి.
ఆ శ్రీహరి ప్రాణులలో అంతర్యామియై ద్రష్టరూపమునను, దృశ్యమైన జగద్రూపమునను విరాజిల్లుచున్నాడు. ఆ స్వామి సర్వధా అనిర్వచనీయుడు. ఆ పరమపురుషుని స్వరూపము ఇట్టిది అని వర్ణింపజాలము. వికల్పరహితుడైనను అతడు ద్రష్టగను, దృశ్యముగను, వ్యాప్య, వ్యాప్యక రూపములలోను ప్రకటితుడు అగుచుండును. కాని, వాస్తవమునకు అతడు ఉన్నది ఒక్కడే అయినను ద్రష్ట, దృశ్యము, వ్యాప్యము, వ్యాపకములన్నియును పరమాత్మను ఆశ్రయించియే యుండును. అతని లోనే విలీనమగును. అతనిలో ఎటువంటి వికల్పములు - భేదములు లేవు. ఉన్నది పరమాత్ముడు ఒక్కడే అని ఎరుగవలయును.
పరమానంద స్వరూపుడైన ఆ పరమేశ్వరుడు అనుభవైకవేద్యుడు. నిరంజనుడు. త్రిగుణమయమైన మాయచేతనే అతని ఐశ్వర్యము (మహత్త్వము) కప్పబడి యున్నది. ఆ మాయనుండి బయట పడినవానికి, ఆ ప్రభువు యొక్క దర్శనము కాగలదు.
అందువలన, మీరు దైత్య లక్షణమైన అసురీస్వభావమును విడనాడి నిర్హేతుక సుహృద్భావమును కలిగి సమస్త ప్రాణులయందును దయతో మెలగుడు. వాటికి మేలు చేయుడు. అప్పుడే, ఆ భగవంతుడు ప్రసన్నుడగును.
ఆది పురుషుడగు శ్రీమన్నారాయణుడు ప్రసన్నుడైనచో మనము పొందజాలనిదంటూ ఏముండును? మనము ఆ భగవంతుని పాదారవిందముల అమృతమును గ్రోలుతూ ఆయన నామ, గుణ, లీలాసంకీర్తనాదులను చేయుచు, అందలి పరమానందములోనే ఓలలాడెదము. ఈ జగత్తులో సత్త్వరజస్తమోగుణముల పరిణామమువలన తమంతట తాముగా లభించెడు ధర్మార్థకామమోక్షములతోగానీ, అందరునూ కోరుకొనెడు గుణాతీతమైన మోక్షముతోగానీ, మనకేమి పని?
శాస్త్రములయందు ధర్మార్థకామములు అను మూడు పురుషార్థములు వర్ణింపబడినవి. అంతేగాక, ఆత్మవిద్య, కర్మకాండము, తర్కశాస్త్రము, దండనీతి, జీవనోపాధి సాధనములు గూడ వేదములయందు ప్రతిపాదింపబడినవి. కాని, మనందరికి అత్యంత ఆత్మీయుడు, పరమహితైషియగు పురుషోత్తమునకు తమ సర్వస్వమును సమర్పించుటయే పరమసత్యము - సార్థకము అని నేను తలంతును.
సోదరులారా! నేను మీకు తెలపిన నిర్మలజ్ఞానము బహుదుర్లభమైనది. పూర్వము దీనిని నరనారాయణులు నారదునకు ఉపదేశించియుండిరి. భగవంతునియెడ అనన్యభక్తి గలిగి, అకించనులైన భాగవతోత్తముల పాదధూళియందు స్నానమొనర్చినవారికి ఈ జ్ఞానము లభ్యమగును.
విజ్ఞానసహితమైన ఈ జ్ఞానము పవిత్రభాగవత ధర్మములను ప్రతిపాదించును. దీనిని పూర్వమునేను నారద మహర్షినుండి వినియుంటిని. ఆ దేవర్షి భగవంతుని దర్శనమును కలిగించుటలో సమర్థుడు.
దైత్యపుత్రా ఊచుః
దైత్యబాలురు వచించిరి - ప్రహ్లాదా! ఈ ఇద్దరు గురుపుత్రులను దప్ప మఱి ఏ గురువును నీవు గాని, నేనుగాని ఎఱుగము. వీరే బాలురమైన మన అందరిని శాసించువారు. ప్రియమిత్రమా! నీవు ఇంకను చిన్న వయసు వాడవు. పుట్టినప్పటినుండియు రాజభవనమున తల్లికడ ఉన్నవాడవు. కనుక, నీవు మహాత్మడైన నారదునితో కలియుట అసంభవమని మాకు తోచుచున్నది. ఈ విషయమున మాకు నమ్మకము కలుగుటకు తగిన కారణమున్నయెడల, మా ఈ సందేహమును తీర్చుము.
ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం సప్తమస్కంధే షష్ఠోఽధ్యాయః (6)
ఇది భాగవత మహాపురాణమునందలి సప్తమ స్కంధమునందు ఆరవ అధ్యాయము (6)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
***
వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం సప్తమ స్కంధము - ఆరవ అధ్యాయము
అసురబాలకులకు ప్రహ్లాదుని ఉపదేశము ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
ప్రహ్లాద ఉవాచ
6.1 ప్రథమశ్లోకము)
కౌమార ఆచరేత్ప్రాజ్ఞో ధర్మాన్ భాగవతానిహ|
దుర్లభం మానుషం జన్మ తదప్యధ్రువమర్థదమ్॥5825॥
ప్రహ్లాదుడు నుడివెను మిత్రులారా! ఈ లోకమున మానవజన్మ దుర్లభమైనది. దీనిద్వారానే శాశ్వతుడైన పరమాత్మ యొక్క ప్రాప్తి కలుగును. కాని, ఈ మానవజన్మ ఎప్పుడు ముగియునో తెలియదు. బుద్ధిమంతుడైనవాడు ముసలితనముపై, యౌవనముపై విశ్వాసమును ఉంచక, బాల్యము నుండియే భగవత్ప్రాప్తికై సాధనలను చేయవలెను.
6.2 (రెండవ శ్లోకము)
యథా హి పురుషస్యేహ విష్ణోః పాదోపసర్పణమ్|
.
యదేష సర్వభూతానాం ప్రియ ఆత్మేశ్వరః సుహృత్॥5826॥
ఈ మానవజీవితము భగవంతుని చరణములను శరణుపొందుటవలననే సఫలమగును. ఏలయన, భగవంతుడు సకల ప్రాణులకు ప్రభువు. సుహృదుడు, ప్రియతముడు, ఆత్మస్వరూపుడు.
6.3 (మూడవ శ్లోకము)
సుఖమైంద్రియకం దైత్యా దేహయోగేన దేహినామ్|
సర్వత్ర లభ్యతే దైవాద్యథా దుఃఖమయత్నతః॥5827॥
దితి వంశీయులారా! జీవులకు ఏ జన్మలోనైనా, ఎటువంటి దేహముతో సంయోగము కలుగునో, అట్టి దేహసంబంధమైన ఇంద్రియములవలన లభించెడు సుఖములు సహజముగనే కలుగును. అట్లే ప్రారబ్ధమును అనుసరించి దుఃఖములు కూడా ఎటువంటి ప్రయత్నము లేకుండగనే లభించుచుండును.
6.4 (నాలుగవ శ్లోకము)
తత్ప్రయాసో న కర్తవ్యో యత ఆయుర్వ్యయః పరమ్|
న తథా విందతే క్షేమం ముకుందచరణాంబుజమ్॥5828॥
అందువలన సాంసారిక సుఖముల కొరకు ప్రయత్నింపనవసరము లేదు. ఏలయన, తనంతట తానే లభించువస్తువు కొరకు శ్రమించుట, కేవలము తన ఆయువును, శక్తిని వ్యర్థము చేసికొనుటయే యగును. ఇంద్రియ భోగముల వెంటపడిన వానికి పరమ కల్యాణస్వరూపుడైన భగవంతుని పాదపద్మములు ప్రాప్తింపవు.
6.5 (ఐదవ శ్లోకము)
తతో యతేత కుశలః క్షేమాయ భయమాశ్రితః|
శరీరం పౌరుషం యావన్న విపద్యేత పుష్కలం॥5829॥
మానవ జీవితము పుష్కలమైన భయములతో నిండియుండును. భగవత్ప్రాప్తియే దీని లక్ష్యము. కనుక, ఈ శరీరము రోగ శోకాదులచే గ్రస్తమై మృత్యు ముఖమున ప్రవేశింపకముందే, బుద్ధిమంతుడు తన శ్రేయస్సు కొరకు ప్రయత్నింపవలెను.
6.6 (ఆరవ శ్లోకము)
పుంసో వర్షశతం హ్యాయుస్తదర్ధం చాజితాత్మనః|
నిష్ఫలం యదసౌ రాత్ర్యాం శేతేఽన్ధం ప్రాపితస్తమః॥5830॥
మానవుని ఆయుర్దాయము నూరు సంవత్సరములు. జితేంద్రియుడుకాని వాని ఆయువు సగభాగము చూచుచుండగనే నిష్ఫలముగ గడచిపోవును. ఏలయన, అజ్ఞాన కారణముగా రాత్రులయందు తమోగుణ ప్రధానమైన నిద్రయందే గడచిపోవును.
6.7 (ఏడవ శ్లోకము)
ముగ్ధస్య బాల్యే కౌమారే క్రీడతో యాతి వింశతిః|
జరయా గ్రస్తదేహస్య యాత్యకల్పస్య వింశతిః॥5831॥
బాల్యమునందు మానవునకు మంచిచెడుల వివేకము ఉండదు. కౌమారదశయందు అతడు ఆటపాటలలోనే మునిగిపోవును. ఈ విధముగా తెలియకుండగనే ఇరువది సంవత్సరములు గడచిపోవును. ఇంతలో వృద్ధాప్యము ఆవహించుటచే దేహము సడలిపోయి ఏమిచేయుటకు శక్తి సరిపోవక మరొక ఇరువది యేళ్ళు గడచిపోవును.
6.8 (ఎనిమిదవ శ్లోకము)
దురాపూరేణ కామేన మోహేన చ బలీయసా|
శేషం గృహేషు సక్తస్య ప్రమత్తస్యాపయాతి హి॥5832॥
ఇంక మిగిలిన ఆయుర్ధాయము స్వల్పముగనే యుండును. అందులో మానవుడు మోహములో చిక్కుకొని, ఎప్పటికిని పూర్తికాని కోరికలయందును, గృహకృత్యముల యందును ఆసక్తుడై యుండును. అందువలన తన కర్తవ్యము, అకర్తవ్యముల జ్ఞానము అతనికి ఉండదు. ఈ విధముగా మిగిలిన ఆయువుగూడ చేజారిపోవును.
6.9 (తొమ్మిదవ శ్లోకము)
కో గృహేషు పుమాన్ సక్తమాత్మానమజితేంద్రియః|
స్నేహపాశైర్దృఢైర్బద్ధముత్సహేత విమోచితుమ్॥5833॥
ఇంద్రియములకు వశుడైనవాడు గృహకార్యముల యందే ఆసక్తుడై మాయ, మమత అను బలమైన బంధములకు వశుడైయుండును. అట్టివాడు వాటినుండి విముక్తి పొందుటకు ఉత్సహింపడు.
6.10 (పదియవ శ్లోకము)
కో న్వర్థతృష్ణాం విసృజేత్ప్రాణేభ్యోఽపి య ఈప్సితః|
యం క్రీణాత్యసుభిః ప్రేష్ఠైస్తస్కరః సేవకో వణిక్॥5834॥
చోరుడు, సేవకుడు, వ్యాపారి తనకు అత్యంత ప్రీతిపాత్రమైన ప్రాణముల నొడ్డియైన ధనసంపాదనకు పాటు పడును. ధనము పైగల ఈ పేరాశను ఎవరు విడిచిపెట్టగలరు?
6.11 (పదకొండవ శ్లోకము)
కథం ప్రియాయా అనుకంపితాయాః సంగం రహస్యం రుచిరాంశ్చ మంత్రాన్|
సుహృత్సు తత్స్నేహసితః శిశూనాం కలాక్షరాణామనురక్తచిత్తః॥5835॥
6.12 (పండ్రెండవ శ్లోకము)
పుత్రాన్ స్మరంస్తా దుహితౄర్హృదయ్యా భ్రాతౄన్ స్వసౄర్వా పితరౌ చ దీనౌ|
గృహాన్ మనోజ్ఞోరుపరిచ్ఛదాంశ్చ వృత్తీశ్చ కుల్యాః పశుభృత్యవర్గాన్॥5837॥
మానవుడు తన ప్రియపత్నితో ఏకాంతవాసము చేయును. ప్రేమపూరితములైన ఆమె మాటలు, చెవులకు ఇంపు గొలుపు ఆమె సూచనలను పాటించుచు తన జీవితమునే వ్యర్థముగా గడుపును. బంధుమిత్రుల స్నేహపాశములచే, పిల్లల చిలుక పలుకులచే ఆకర్షితుడగును. ఇంక వాటినుండి అతడు ఎట్లు బయటపడగలడు? వివాహితలైన తన కుమార్తెలను, సుతులను, సోదరులను, దీనులైన తల్లిదండ్రులను, అమూల్యమైన వస్తువులచే అలంకరింపబడిన ఇంఢ్లను, వంశపరంపరాగతమైన తమ జీవన సాధనములను, పశువులను, సేవకులను నిరంతరము స్మరించుచునే యుండును. అట్టి వాటిని అతడెట్లు వదులు కొనగలడు?
6.13 (పదమూడవ శ్లోకము)
త్యజేత కోశస్కృదివేహమానః కర్మాణి లోభాదవితృప్తకామః|
ఔపస్థ్యజైహ్వ్యం బహు మన్యమానః కథం విరజ్యేత దురంతమోహః॥5837॥
మానవుడు జననేంద్రియ, రసనేంద్రియ సుఖములనే సర్వస్వమని భావించును. భోగసుఖముల వాసనలకు అతడు ఎప్పుడును తృప్తిపడడు. లోభకారణముగా కర్మలపై కర్మలను చేయుచు సాలెపురుగువలె అతడు ఇంకను బంధములయందు కూరుకొనిపోవును. అతని వ్యామోహములకు అంతూపొంతూ ఉండదు. అట్టివాడు వాటియందు ఎట్లు విరక్తుడగును? వాటిని ఎట్లు త్యజింపగల్గును?
6.14 (పదునాలుగవ శ్లోకము)
కుటుంబపోషాయ వియన్నిజాయుర్న బుధ్యతేఽర్థం విహతం ప్రమత్తః|
సర్వత్ర తాపత్రయదుఃఖితాత్మా నిర్విద్యతే న స్వకుటుంబరామః॥5838॥
6.15 (పదునైదవ శ్లోకము)
విత్తేషు నిత్యాభినివిష్టచేతాః విద్వాంశ్చ దోషం పరవిత్తహర్తుః|
ప్రేత్యేహ చాథాప్యజితేంద్రియస్త- దశాంతకామో హరతే కుటుంబీ॥5839॥
కుటుంబముపై గల మోహముచే దాని పోషణయందే తన అమూల్యమైన ఆయువును పోగొట్టుకొనును. అతడు ఎన్నడును తన జీవిత పరమార్థమును గూర్చి ఆలోచింపడు. అంతులేని ప్రమాదములలొ పడిపోవును. ఇట్టి అభిలాషల వలన అతనికి ఎట్టి సుఖమూ లభింపకపోగా, అతనిని దైహిక, దైవిక, భౌతిక తాపత్రయములు వెంటాడుచునే యుండును. ఐనను, అతనికి వైరాగ్యము అబ్బదు. కుటుంబము పైగల మమకారముచే బద్ధుడై ధనసంపాదన చింతలోనే మునిగియుండును. ఇతరుల సొత్తులను దొంగిలించుట వలన లౌకిక, పారలౌకిక దోషములు కలుగునని తెలిసినను కోరికలకు లోబడి, తన కర్తవ్యమును మరచి, భోగలాలసుడై ధనమును అపహరించు చుండును.
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి సప్తమస్కంధములోని ఆరవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
28.6.2020 ప్రాతః కాల సందేశము
వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం
సప్తమ స్కంధము - ఆరవ అధ్యాయము
అసురబాలకులకు ప్రహ్లాదుని ఉపదేశము
ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
6.16 (పదహారవ శ్లోకము)
విద్వానపీత్థం దనుజాః కుటుంబం పుష్ణన్ స్వలోకాయ న కల్పతే వై|
యః స్వీయపారక్యవిభిన్నభావస్తమః ప్రపద్యేత యథా విమూఢః॥5840॥
సోదరులారా! మానవుడు ఈ విధముగా తనకుటుంబ పోషణయందే నిబద్ధుడైనవాడు, ఎన్నడును భగవంతుని సేవింపుడు. అతడు విద్వాంసుడేయైననూ అతనికి భగవత్ప్రాప్తి కలుగదు. ఇది నాది, ఇది ఇతరులది అను భేదభావము ఉండుటవలన అతనికిని అజ్ఞానులవలె తమోగుణ ప్రధానమైన అధోగతులే లభించును.
6.17 (పదు నేడవ శ్లోకము)
యతో న కశ్చిత్క్వ చ కుత్రచిద్వా దీనః స్వమాత్మానమలం సమర్థః|.
విమోచితుం కామదృశాం విహారక్రీడామృగో యన్నిగడో విసర్గః॥5841॥
అతడు కామినుల మనస్సులను రంజింపజేయునట్టి కీలు బొమ్మయగును. అట్టి పాపకృత్యముల ఫలితముగా కలిగిన సంతానము, అతని పాదములకు సంకెల యగును. అట్టి దీనుడు ఎప్పుడైనను, ఎప్పుడైనను, ఏవిధముగనైనను ఆత్మోద్ధరణకై ప్రయత్నింపలేడు.
6.18 (పదునెనిమిదవ శ్లోకము)
తతో విదూరాత్పరిహృత్య దైత్యాః దైత్యేషు సంగం విషయాత్మకేషు|
ఉపేత నారాయణమాదిదేవం స ముక్తసంగైరిషితోఽపవర్గః॥5841॥
సోదరులారా! అందువలన మీరు విషయాసక్తులైన దైత్యుల సాంగత్యమును దూరముగ పారద్రోలుడు. ఆదిదేవుడైన శ్రీమన్నారాయణుని శరణువేడుడు. ఏలయన, సాంసారిక విషయముల యందు ఆసక్తిలేని మహాత్ములకు ఆ ప్రభువే ప్రియతముడు. అతడే పరమగతి.
6.19 (పందొమ్మిదవ శ్లోకము)
న హ్యచ్యుతం ప్రీణయతో బహ్వాయాసోఽసురాత్మజాః॥
ఆత్మత్వాత్సర్వభూతానాం సిద్ధత్వాదిహ సర్వతః॥5843॥
మిత్రులారా! భగవంతుని ప్రసన్నునిగా జేసికొనుటకు ఎక్కువ పరిశ్రమ లేక ప్రయత్నములు చేయనవసరము లేదు. అతడు సకల ప్రాణులలో ఆత్మస్వరూపుడై సర్వత్ర వ్యాపించియున్నాడు.
6.20 (ఇరువదియవ శ్లోకము)
పరావరేషు భూతేషు బ్రహ్మాంతస్థావరాదిషు|
భౌతికేషు వికారేషు భూతేష్వథ మహత్సు చ॥5844॥
6.21 (ఇరువది యొకటవ శ్లోకము)
గుణేషు గుణసామ్యే చ గుణవ్యతికరే తథా|
ఏక ఏవ పరో హ్యాత్మా భగవానీశ్వరోఽవ్యయః॥5845॥
చెట్టు చేమలు మొదలుకొని బ్రహ్మదేవుని వరకు, సకల ప్రాణుల యందు ఆ ప్రభువు వ్యాపించియున్నాడు. అంతేగాదు, పంచభూతములయందును, వాటిచే నిర్మితములైన వస్తువులయందును, సూక్ష్మతన్మాత్రలయందును, ఆ పరమాత్మ విరాజిల్లుచున్నాడు. మహత్తత్వము నందును, త్రిగుణములయందును, వాటి సామ్యావస్థలయందును, తద్వ్యతిరేకావస్థలయందును ఆ స్వామి శాశ్వతముగా నెలకొనియున్నాడు. అతడు సమస్త సౌందర్యమాధుర్య ఐశ్వర్యములకు నిధి.
6.22 (ఇరువది రెండవ శ్లోకము)
ప్రత్యగాత్మస్వరూపేణ దృశ్యరూపేణ చ స్వయమ్|
వ్యాప్యవ్యాపకనిర్దేశ్యో హ్యనిర్దేశ్యోఽవికల్పితః॥5846॥
ఆ శ్రీహరి ప్రాణులలో అంతర్యామియై ద్రష్టరూపమునను, దృశ్యమైన జగద్రూపమునను విరాజిల్లుచున్నాడు. ఆ స్వామి సర్వధా అనిర్వచనీయుడు. ఆ పరమపురుషుని స్వరూపము ఇట్టిది అని వర్ణింపజాలము. వికల్పరహితుడైనను అతడు ద్రష్టగను, దృశ్యముగను, వ్యాప్య, వ్యాప్యక రూపములలోను ప్రకటితుడు అగుచుండును. కాని, వాస్తవమునకు అతడు ఉన్నది ఒక్కడే అయినను ద్రష్ట, దృశ్యము, వ్యాప్యము, వ్యాపకములన్నియును పరమాత్మను ఆశ్రయించియే యుండును. అతని లోనే విలీనమగును. అతనిలో ఎటువంటి వికల్పములు - భేదములు లేవు. ఉన్నది పరమాత్ముడు ఒక్కడే అని ఎరుగవలయును.
6.23 (ఇరువది మూడవ శ్లోకము)
కేవలానుభవానందస్వరూపః పరమేశ్వరః|
మాయయాంతర్హితైశ్వర్యః ఈయతే గుణసర్గయా॥5847॥
పరమానంద స్వరూపుడైన ఆ పరమేశ్వరుడు అనుభవైకవేద్యుడు. నిరంజనుడు. త్రిగుణమయమైన మాయచేతనే అతని ఐశ్వర్యము (మహత్త్వము) కప్పబడి యున్నది. ఆ మాయనుండి బయట పడినవానికి, ఆ ప్రభువు యొక్క దర్శనము కాగలదు.
6.24 (ఇరువది నాలుగవ శ్లోకము)
తస్మాత్సర్వేషు భూతేషు దయాం కురుత సౌహృదమ్|
ఆసురం భావమున్ముచ్య యయా తుష్యత్యధోక్షజః॥5848॥
అందువలన, మీరు దైత్య లక్షణమైన అసురీస్వభావమును విడనాడి నిర్హేతుక సుహృద్భావమును కలిగి సమస్త ప్రాణులయందును దయతో మెలగుడు. వాటికి మేలు చేయుడు. అప్పుడే, ఆ భగవంతుడు ప్రసన్నుడగును.
6.25 (ఇరువది ఐదవ శ్లోకము)
తుష్టే చ తత్ర కిమలభ్యమనంత ఆద్యే కిం తైర్గుణవ్యతికరాదిహ యే స్వసిద్ధాః|
ధర్మాదయః కిమగుణేన చ కాంక్షితేన సారంజుషాం చరణయోరుపగాయతాం నః॥5849॥
ఆది పురుషుడగు శ్రీమన్నారాయణుడు ప్రసన్నుడైనచో మనము పొందజాలనిదంటూ ఏముండును? మనము ఆ భగవంతుని పాదారవిందముల అమృతమును గ్రోలుతూ ఆయన నామ, గుణ, లీలాసంకీర్తనాదులను చేయుచు, అందలి పరమానందములోనే ఓలలాడెదము. ఈ జగత్తులో సత్త్వరజస్తమోగుణముల పరిణామమువలన తమంతట తాముగా లభించెడు ధర్మార్థకామమోక్షములతోగానీ, అందరునూ కోరుకొనెడు గుణాతీతమైన మోక్షముతోగానీ, మనకేమి పని?
6.26 (ఇరువది ఆరవ శ్లోకము)
ధర్మార్థకామ ఇతి యోఽభిహితస్త్రివర్గ ఈక్షా త్రయీ నయదమౌ వివిధా చ వార్తా|
మన్యే తదేతదఖిలం నిగమస్య సత్యం స్వాత్మార్పణం స్వసుహృదః పరమస్య పుంసః॥5850॥
శాస్త్రములయందు ధర్మార్థకామములు అను మూడు పురుషార్థములు వర్ణింపబడినవి. అంతేగాక, ఆత్మవిద్య, కర్మకాండము, తర్కశాస్త్రము, దండనీతి, జీవనోపాధి సాధనములు గూడ వేదములయందు ప్రతిపాదింపబడినవి. కాని, మనందరికి అత్యంత ఆత్మీయుడు, పరమహితైషియగు పురుషోత్తమునకు తమ సర్వస్వమును సమర్పించుటయే పరమసత్యము - సార్థకము అని నేను తలంతును.
6.27 (ఇరువది ఏడవ శ్లోకము)
జ్ఞానం తదేతదమలం దురవాపమాహ నారాయణో నరసఖః కిల నారదాయ|
ఏకాంతినాం భగవతస్తదకించనానాం పాదారవిందరజసాఽఽప్లుతదేహినాం స్యాత్॥5851॥
సోదరులారా! నేను మీకు తెలపిన నిర్మలజ్ఞానము బహుదుర్లభమైనది. పూర్వము దీనిని నరనారాయణులు నారదునకు ఉపదేశించియుండిరి. భగవంతునియెడ అనన్యభక్తి గలిగి, అకించనులైన భాగవతోత్తముల పాదధూళియందు స్నానమొనర్చినవారికి ఈ జ్ఞానము లభ్యమగును.
6.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)
శ్రుతమేతన్మయా పూర్వం జ్ఞానం విజ్ఞానసంయుతమ్|
ధర్మం భాగవతం శుద్ధం నారదాద్దేవదర్శనాత్॥5852॥
విజ్ఞానసహితమైన ఈ జ్ఞానము పవిత్రభాగవత ధర్మములను ప్రతిపాదించును. దీనిని పూర్వమునేను నారద మహర్షినుండి వినియుంటిని. ఆ దేవర్షి భగవంతుని దర్శనమును కలిగించుటలో సమర్థుడు.
దైత్యపుత్రా ఊచుః
6.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)
ప్రహ్లాద త్వం వయం చాపి నర్తేఽన్యం విద్మహే గురుమ్|
ఏతాభ్యాం గురుపుత్రాభ్యాం బాలానామపి హీశ్వరౌ॥5853॥
6.30 (ముప్పదియవ శ్లోకము)
బాలస్యాంతఃపురస్థస్య మహత్సంగో దురన్వయః|
ఛింధి నః సంశయం సౌమ్య స్యాచ్చేద్విశ్రంభకారణం॥5854॥
దైత్యబాలురు వచించిరి - ప్రహ్లాదా! ఈ ఇద్దరు గురుపుత్రులను దప్ప మఱి ఏ గురువును నీవు గాని, నేనుగాని ఎఱుగము. వీరే బాలురమైన మన అందరిని శాసించువారు. ప్రియమిత్రమా! నీవు ఇంకను చిన్న వయసు వాడవు. పుట్టినప్పటినుండియు రాజభవనమున తల్లికడ ఉన్నవాడవు. కనుక, నీవు మహాత్మడైన నారదునితో కలియుట అసంభవమని మాకు తోచుచున్నది. ఈ విషయమున మాకు నమ్మకము కలుగుటకు తగిన కారణమున్నయెడల, మా ఈ సందేహమును తీర్చుము.
ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం సప్తమస్కంధే షష్ఠోఽధ్యాయః (6)
ఇది భాగవత మహాపురాణమునందలి సప్తమ స్కంధమునందు ఆరవ అధ్యాయము (6)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
No comments:
Post a Comment