Sunday, 21 June 2020

మహాభాగవతం సప్తమ స్కంధము - మూడవ అధ్యాయము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం, సప్తమ స్కంధము - మూడవ అధ్యాయము
హిరణ్యకశిపుని తపస్సు - వరప్రాప్తి ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

నారద ఉవాచ

నారదుడు పలికెను యుధిష్ఠిరా! హిరణ్యకశిపుడు ఇట్లు ఆలోచించెను- "నేను అజయుడను, జరామరణములు లేనివాడను. ఈ జగత్తునకు ఏకచ్ఛత్రాధిపతిని కావలెను. నన్ను ఎదిరించువాడు ఎవ్వడును ఉండరాదు" అని అనుకొనెను.

ఇట్లు ఆలోచించి, అతడు మందరాచల లోయలయందు తీవ్రమైన తపస్సును ఆచరించెను. భూమిపై కాలి బొటనవ్రేలిని మాత్రమే ఆన్చి నిలబడెను. చేతులు పైకెత్తి ఆకాశమువైపే దృష్టిని సారించెను.

అతని జడలు ప్రళయకాలసూర్యుని కిరణములవలె భాసిల్లుచుండెను. అతడు ఇట్లు తపస్సులో లీనమైయుండగా దేవతలు తమతమ స్థానములలో, పదవులలో మరల ప్రతిష్ఠితులైరి.

హిరణ్యకశిపుడు పెక్కు సంవత్సరములు ఇట్లు తపస్సు చేసిన పిదప, అతని శిరస్సునుండి, ధూమముతో గూడిన తపోమయాగ్ని వెలువడెను. అది నలువైపుల యందును వ్యాపించి ఊర్ధ్వలోకములను అధోలొకములను గూడ తపింపజేసెను.

అతని తపస్సుతో వెలువడిన తీవ్రమైన అగ్నికి నదులూ, సముద్రములు క్షోభకు గురియయ్యెను. ద్వీపములు, పర్వతములతో సహా భూమి చలించెను. గ్రహములు, నక్షత్రములు రాలిపోయెను. దశదిశలయందును అగ్నిజ్వాలలు చెలరేగెను.

హిరణ్యకశిపుని తపోగ్ని జ్వాలలకు దేవతలు తట్టుకొనలేకపోయిరి. వారు భయముతో స్వర్గలోకము వీడి బ్రహ్మలోకమునకు చేరిరి. బ్రహ్మ దేవునితో ఇట్లు మొరపెట్టుకొనిరి- "దేవదేవా! జగత్పతీ! హిరణ్యకశిపుని తపోగ్ని జ్వాలలకు తప్తులమైన మేము స్వర్గలోకములో నివసింపలేకున్నాము. అనంతా! సర్వాధ్యక్షా! మేము నీ సేవకులమని భావించినచో, లోకములను భస్మము చేయకముందే ఆ అగ్నిజ్వాలను చల్లార్పుము.

మహాత్మా! నీవు సర్వజ్ఞుడవు. నీకు తెలియని విషయమే లేదు. ఐనను, మేము నీకు విన్నవించుకొనుచున్నాము. దయతో ఆలకింపుము. అతడు ఏదో ఒక సంకల్పముతో దుష్కరమైన తపస్సును ఆచరించుచున్నాడు. బహుశః అతడు ఇట్లు ఆలోచించుచుండవచ్చును. 'బ్రహ్మదేవుడు తన తపోయోగ ప్రభావమున చరాచర జగత్తును సృష్టించి, లోకములకు అన్నింటికిని పైన సత్యలోకము నందు విరాజిల్లుచున్నాడు. అట్లే నేను గూడ నా ఉగ్రమైన తపస్సు ద్వారా యోగప్రభావమున అదే పదవిని, స్థానమును పొందెదను. కాలము అనంతమైనది. ఆత్మనిత్యము. ఒక జన్మలో గాకున్నను, అనేక జన్మలలోనైనను, ఒక యుగములో గాకున్నను పెక్కు యుగములలో నైనను దానిని సాధించి తీరెదను'

హిరణ్యకశిపుని తపస్సు నాచరింపుటపై దేవతలు హిరణ్యకశిపుని స్వగతమును ఇంకను ఇట్లు తలపోయుచున్నారు:

'నేను నా తపశ్శక్తిచే పాపపుణ్య నియమమలను తలక్రిందులు గావించి, జగత్తును ఇదివరకు లేనట్లుగా మరియొక విధముగ మార్చెదను. కల్పాంతమున కాలగర్భములో కలిసి పోవు విష్ణుపదముతో నాకేమి పని?'

ముల్లోకాధిపతీ! బ్రహ్మదేవా! ఇట్టి సంకల్పముతోనే అతడు ఇట్టి ఘోరమైన తపస్సును ఆచరించుచున్నాడు అని మేము వినియున్నాము. కనుక, ఈ విషయమున తగిన కార్యమును నీవే చేయుము.

మహానుభావా! నీవు బ్రాహ్మణులకును, గోవులకును అభివృద్ధిని, శుభమును, శ్రేయస్సును, సంపదలను, క్షేమమును, విజయమును కలిగించుటకై సర్వశ్రేష్ఠమైన ఈ పరమేష్ఠిపదమును అధిష్ఠించియున్నావు (ఈ పదవి హిరణ్య కశిపునకు దక్కినచో, సజ్జనులందరును సంకటముల పాలగుదురు)

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి సప్తమస్కంధములోని మూడవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

***
వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం, సప్తమ స్కంధము - మూడవ అధ్యాయము
హిరణ్యకశిపుని తపస్సు - వరప్రాప్తి, ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

యుధిష్ఠిరా! దేవతలు బ్రహ్మదేవునకు ఇట్లు నివేదింపగా ఆ ప్రభువు భృగువు, దక్షుడు మొదలగు ప్రజాపతులతో గూడి హిరణ్యకశిపుని ఆశ్రమమునకు వెళ్ళెను.

అచటికి వెళ్ళిచూడగా బ్రహ్మదేవునకు హిరణ్యకశిపుడు కనబడలేదు. ఏలయన, పుట్టలు, గడ్డి, వెదుళ్ళు అతని శరీరమును కప్పివేసియుండెను. అతని శరీరములోని కొవ్వును, చర్మమును, మాంసమును, రక్తమును చీమలు తినివేసియుండెను.

కాని మేఘములచే కప్పబడిన సూర్యుని కాంతివలె హిరణ్యకశిపుని తపస్సు యొక్క తేజః ప్రభావమున లోకములు అన్నియును తపించి పోవుచుండెను. అట్టి స్థితిలో అతనిని జూచి బ్రహ్మదేవుడు ఆశ్చర్యముతో నవ్వుచు ఇట్లనెను-

బ్రహ్మోవాచ

బ్రహ్మదేవుడు పలికెను - నాయనా! కశ్యపనందనా! నీకు శుభమగుగాక! లెమ్ము. లెమ్ము,. నీ తపస్సు ఫలించినది. నీకు వరమును ఇచ్చుటకై నేను ఇచటికి వచ్చితిని. నీ అభీష్టమును కోరుకొనుము.

నీ మనోబలము అద్భుతమైనది. అడవి ఈగలు నీ దేహమును పూర్తిగ భక్షించినవి. ఐనను, ఎముకల గూడువంటి నీ దేహమునందు ప్రాణములు నిలిచియే యున్నవి.

ఇంతటి కఠినమైన తపస్సును ఇంతకుముందు ఏ ఋషులును ఆచరించి యుండలేదు. మున్ముందు సైతము ఎవ్వరును చేయజాలరు. నీటిని గూడ త్రాగకుండ నూరు దివ్య సంవత్సరములు ప్రాణములను ఎవరు నిలుపు కొనగలరు?

దితికుమారా!  నీవు చేసిన ఈ తపస్సును ధీరపురుషులు గూడ చేయజాలరు. నీ తపోనిష్ఠకు నేను వశుడనైతిని.

అసురశ్రేష్ఠా! నీవు కోరినవి అన్నియును ఇచ్చెదను. నీవు మర్త్యుడవు. మృతిచెందువాడవు. నేను అమరుడను. నా దర్శనము ఎన్నడును నిష్ఫలము కారాదు.

నారద ఉవాచ

నారదుడు పలికెను- యుధిష్ఠిరా! బ్రహ్మదేవుడు ఇట్లు పలికిన పిదప చీమలచే భక్షింపబడిన హిరణ్యకశిపుని శరీరముపై అమోఘమైన తన కమండల జలమును చల్లెను. ఆ జలముల ప్రభావము అద్భుతము.

బ్రహ్మదేవుడు ఆదివ్య జలములను చల్లినంతనే వెదుళ్ళతో నిండియున్న  ఆ పుట్టనుండి కర్రలనుండి అగ్నిదేవునివలె హిరణ్యకశిపుడు లేచి నిలబడెను. అప్పుడు అతని శరీరావయవములు వజ్రములవలె దృఢమై బలిష్ఠముగా నుండెను. అతడు పుటము పెట్టిన బంగారమువలె మెరిసిపోవుచు నవయువకునివలె తేజరిల్లుచుండెను.

హిరణ్యకశిపుడు ఆకాశమున హంసవాహనుడైన బ్రహ్మదేవుని జూచెను. ఆ దేవదేవుని దర్శనమునకు అతడు ఆనందముతో పొంగి పోయెను. వెంటనే అతడు సాగిలపడీ సాష్టాంగనమస్కారము చేసెను.

అతడు భూమిపైనుండి లేచి, వినయముతో అంజలి ఘటించెను. తనయెదుట సాక్షాత్కరించియున్న బ్రహ్మదేవుని చూచెను. అంతట హిరణ్యకశిపుని నేత్రముల నుండి ఆనందాశ్రువులు నిరంతరము ప్రవహింపసాగెను. ఒడలంతయు గగుర్పాటుతో నిండిపోయెను. అప్పుడతడు గద్గదస్వరముతో ఆ ప్రభువును ఇట్లు స్తుతించెను.

హిరణ్యకశిపురువాచ

హిరణ్యకశిపుడు నుడివెను "కల్పాంతమునందు ఈ జగత్తు అంతయును కాలప్రేరితమై, తమోగుణమయమై అంధకారముచే కప్పబడియుండెను. ఆ సమయమున స్వయం ప్రకాశస్వరూపుడవైన నీవు తేజస్సుచే మరల ఆ జగత్తును ప్రకటించితివి. నీవే త్రిగుణాత్మకమైన నీ రూపము ద్వారా ఆ జగత్తుయొక్క సృష్టి, సంరక్షణ, సంహారములను చేయుచుందువు. సత్త్వ రజస్తమోగుణములకు నీవు ఆశ్రయుడవు. ఐనను, వాటికి అతీతుడవు. అట్టి మహాత్ముడవైన నీకు నమస్కారము.

ప్రభూ! నీవు జగత్తునకు మూలకారణుడవు. జ్ఞానవిజ్ఞానములు నీ స్వరూపములే. ప్రాణములు, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి  మొదలగు వాటి కార్యముల రూపముగా నీవే గోచరించుచుందువు. నీకు నమస్కారము.

హోత, అధ్వర్యువు, బ్రహ్మ, ఉద్గాత అను ఋత్విజులు నిర్వర్తించు యజ్ఞములను వేదము ప్రతిపాదించును. అట్టి వేదమే నీ స్వరూపము. అగ్నిష్టోమము, అత్యగ్నిష్టోమము, ఉక్థము, షోడశి, వాజపేయము, ఆప్తోర్యామము, అతిరాత్రము అను ఏడు యజ్ఞములను నీవు విస్తరింపజేయుచున్నావు. నీవే అనాదివి, అనంతుడవు, హద్దులు లేనివాడవు. సకలప్రాణులకు ఆత్మవు, సర్వజ్ఞుడవు. అనగా దేశ, కాల పరిచ్ఛేదరహితుడవు.

నీవే కాలస్వరూపుడవు, ప్రతిక్షణము  సావధానుడవై కణము, లవము మున్నగు కాలవిభాగముల ద్వారా జనుల ఆయువును క్షీణింపజేయుచుందువు. ఐనను, నీవు నిర్వికారుడవు. ఏలయన, నీవు జ్ఞాన స్వరూపుడవైన పరమేశ్వరుడవు. జన్మరహితుడవైన పరమాత్ముడవు. సకల జీవులకు జీవనదాతవు, అంతరాత్మవు.

ప్రభూ! కార్యకారణముల, చరాచరములైన వస్తువులు ఏవియును నీ కంటె భిన్నములుగావు. సకల విద్యలు, కళలు నీ స్వరూపములే. త్రిగుణాత్మకమగు మాయకు అతీతుడవు. స్వర్ణమయమైన ఈ బ్రహ్మాండము నీ గర్భమునందే యున్నది. కనుక, నీవు హిరణ్యగర్భుడవు, దీనిని నీవు నీ నుండియే ప్రకటించుచుందువు.

ప్రభూ! వ్యక్తమైన ఈ బ్రహ్మాండము నీ స్థూలశరీరము. దీని ద్వారా ఇంద్రియముల, ప్రాణముల మనస్సు యొక్క విషయములను అనుభవించుచుందువు. కాని, ఆ సమయమునందు గూడ నీవు నీ పరమైశ్వర్య స్వరూపమునందే నిలిచియుందువు. వాస్తవముగా నీవు పురాణపురుషుడవు. స్థూలసూక్ష్మములకు అతీతుడవైన పరబ్రహ్మవు.

నీవు అనంతమైన అవ్యక్తమైన స్వరూపముతో జగత్తునందు అంతటను వ్యాపించియున్నావు. చేతనములు, అచేతనములు గూడ నీ శక్తులే. పరమాత్మా! అట్టి నీకు నమస్కారము.

ప్రభూ! నీవు వరప్రదులలో శ్రేష్ఠుడవు. నీవు నాకు ఇష్టమైన వరములను ఇయ్యదలచినచో, నేను ఒక వరమును కోరెదను. నీచే సృష్టింపబడిన ఏ ప్రాణిచేతనైనను, అనగా - మనుష్యులు, పశుపక్ష్యాదులు, ప్రాణము గలవి, ప్రాణములేనివి మరియు దేవతలు, దైత్యులు, నాగులు మొదలగు వారిచేతను, నాకు మృత్యువు కలుగరాదు. లోపలగాని, బయటగాని, పగలుగాని, రాత్రిగాని నీచే సృష్టింపబడిన ప్రాణులకంటె వేరైన ఏ జీవునివలనగాని, అస్త్రశస్త్రములచేగాని, భూమ్యాకాశముల యందుగాని, నాకు మరణము కలుగరాదు. యుద్ధమునందు నన్ను ఎదిరించగల మొనగాడు మరెవ్వడును ఉండరాదు. సమస్త ప్రాణులకును, నేను సార్వభౌముడుగా ఉండవలెను.

ఇంద్రుడు మొదలగు లోకపాలురలో గల నీ మహిమ నాలోగూడ ఉండవలెను. తపస్సంపన్నులకు, యోగీశ్వరులకు ప్రాప్తించు అక్షయ ఐశ్వర్యములను నాకును ఫ్రసాదింపుము.

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం సప్తమస్కంధే తృతీయోఽధ్యాయః (3)

ఇది భాగవత మహాపురాణమునందలి సప్తమ స్కంధమునందు మూడవ అధ్యాయము (3)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

***

22.6.2020    ప్రాతః కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

సప్తమ స్కంధము - మూడవ అధ్యాయము

హిరణ్యకశిపుని తపస్సు - వరప్రాప్తి

ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

నారద ఉవాచ

3.1 (ప్రథమ శ్లోకము)

హిరణ్యకశిపూ రాజన్నజేయమజరామరమ్|

ఆత్మానమప్రతిద్వంద్వమేకరాజం వ్యధిత్సత॥5684॥

నారదుడు పలికెను యుధిష్ఠిరా! హిరణ్యకశిపుడు ఇట్లు ఆలోచించెను- "నేను అజయుడను, జరామరణములు లేనివాడను. ఈ జగత్తునకు ఏకచ్ఛత్రాధిపతిని కావలెను. నన్ను ఎదిరించువాడు ఎవ్వడును ఉండరాదు" అని అనుకొనెను.

3.2 (రెండవ శ్లోకము)

స తేపే మందరద్రోణ్యాం తపః పరమదారుణమ్|

ఊర్ధ్వబాహుర్నభోదృష్టిః పాదాంగుష్ఠాశ్రితావనిః॥5685॥

ఇట్లు ఆలోచించి, అతడు మందరాచల లోయలయందు తీవ్రమైన తపస్సును ఆచరించెను. భూమిపై కాలి బొటనవ్రేలిని మాత్రమే ఆన్చి నిలబడెను. చేతులు పైకెత్తి ఆకాశమువైపే దృష్టిని సారించెను.

3.3 (మూడవ శ్లోకము)

జటాదీధితిభీ రేజే సంవర్తార్క ఇవాంశుభిః|

తస్మింస్తపస్తప్యమానే దేవాః స్థానాని భేజిరే॥5686॥

అతని జడలు ప్రళయకాలసూర్యుని కిరణములవలె భాసిల్లుచుండెను. అతడు ఇట్లు తపస్సులో లీనమైయుండగా దేవతలు తమతమ స్థానములలో, పదవులలో మరల ప్రతిష్ఠితులైరి.

3.4 (నాలుగవ శ్లోకము)

తస్య మూర్ధ్నః సముద్భూతః సధూమోఽగ్నిస్తపోమయః|

తీర్యగూర్ధ్వమధో లోకానతపద్విష్వగీరితః॥5687॥

హిరణ్యకశిపుడు పెక్కు సంవత్సరములు ఇట్లు తపస్సు చేసిన పిదప, అతని శిరస్సునుండి, ధూమముతో గూడిన తపోమయాగ్ని వెలువడెను. అది నలువైపుల యందును వ్యాపించి ఊర్ధ్వలోకములను అధోలొకములను గూడ తపింపజేసెను.

3.5 (ఐదవ శ్లోకము)

చుక్షుభుర్నద్యుదన్వంతః సద్వీపాద్రిశ్చచాల భూః|

నిపేతుః సగ్రహాస్తారాః జజ్వలుశ్చ దిశో దశ॥5688॥

అతని తపస్సుతో వెలువడిన తీవ్రమైన అగ్నికి నదులూ, సముద్రములు క్షోభకు గురియయ్యెను. ద్వీపములు, పర్వతములతో సహా భూమి చలించెను. గ్రహములు, నక్షత్రములు రాలిపోయెను. దశదిశలయందును అగ్నిజ్వాలలు చెలరేగెను.

3.6 (ఆరవ శ్లోకము)

తేన తప్తా దివం త్యక్త్వా బ్రహ్మలోకం యయుః సురాః|

ధాత్రే విజ్ఞాపయామాసుర్దేవదేవ జగత్పతే॥5689॥

3.7 (ఏడవ శ్లోకము)

దైత్యేంద్రతపసా తప్తాః దివి స్థాతుం న శక్నుమః|

తస్య చోపశమం భూమన్ విధేహి యది మన్యసే|

లోకా న యావన్నంక్ష్యంతి బలిహారాస్తవాభిభూః॥5690॥

హిరణ్యకశిపుని తపోగ్ని జ్వాలలకు దేవతలు తట్టుకొనలేకపోయిరి. వారు భయముతో స్వర్గలోకము వీడి బ్రహ్మలోకమునకు చేరిరి. బ్రహ్మ దేవునితో ఇట్లు మొరపెట్టుకొనిరి- "దేవదేవా! జగత్పతీ! హిరణ్యకశిపుని తపోగ్ని జ్వాలలకు తప్తులమైన మేము స్వర్గలోకములో నివసింపలేకున్నాము. అనంతా! సర్వాధ్యక్షా! మేము నీ సేవకులమని భావించినచో, లోకములను భస్మము చేయకముందే ఆ అగ్నిజ్వాలను చల్లార్పుము.

3.8 (ఎనిమిదవ శ్లోకము)

తస్యాయం కిల సంకల్పశ్చరతో దుశ్చరం తపః|

శ్రూయతాం కిం న విదితస్తవాథాపి నివేదితః॥5691॥

3.9 (తొమ్మిదవ శ్లోకము)

సృష్ట్వా చరాచరమిదం తపోయోగసమాధినా|

అధ్యాస్తే సర్వధిష్ణ్యేభ్యః పరమేష్ఠీ నిజాసనమ్॥5692॥

3.10 (పదియవ శ్లోకము)

తదహం వర్ధమానేన తపోయోగసమాధినా|

కాలాత్మనోశ్చ నిత్యత్వాత్సాధయిష్యే తథాఽఽత్మనః॥5693॥

మహాత్మా! నీవు సర్వజ్ఞుడవు. నీకు తెలియని విషయమే లేదు. ఐనను, మేము నీకు విన్నవించుకొనుచున్నాము. దయతో ఆలకింపుము. అతడు ఏదో ఒక సంకల్పముతో దుష్కరమైన తపస్సును ఆచరించుచున్నాడు. బహుశః అతడు ఇట్లు ఆలోచించుచుండవచ్చును. 'బ్రహ్మదేవుడు తన తపోయోగ ప్రభావమున చరాచర జగత్తును సృష్టించి, లోకములకు అన్నింటికిని పైన సత్యలోకము నందు విరాజిల్లుచున్నాడు. అట్లే నేను గూడ నా ఉగ్రమైన తపస్సు ద్వారా యోగప్రభావమున అదే పదవిని, స్థానమును పొందెదను. కాలము అనంతమైనది. ఆత్మనిత్యము. ఒక జన్మలో గాకున్నను, అనేక జన్మలలోనైనను, ఒక యుగములో గాకున్నను పెక్కు యుగములలో నైనను దానిని సాధించి తీరెదను'

3.11 (పదకొండవ శ్లోకము)

అన్యథేదం విధాస్యేఽహమయథాపూర్వమోజసా|

కిమన్యైః కాలనిర్ధూతైః కల్పాంతే వైష్ణవాదిభిః॥5694॥

హిరణ్యకశిపుని తపస్సు నాచరింపుటపై దేవతలు హిరణ్యకశిపుని స్వగతమును ఇంకను ఇట్లు తలపోయుచున్నారు:

'నేను నా తపశ్శక్తిచే పాపపుణ్య నియమమలను తలక్రిందులు గావించి, జగత్తును ఇదివరకు లేనట్లుగా మరియొక విధముగ మార్చెదను. కల్పాంతమున కాలగర్భములో కలిసి పోవు విష్ణుపదముతో నాకేమి పని?'

3.12 (పండ్రెండవ శ్లోకము)

ఇతి శుశ్రుమ నిర్బంధం తపః పరమమాస్థితః|

విధత్స్వానంతరం యుక్తం స్వయం త్రిభువనేశ్వర॥5695॥

ముల్లోకాధిపతీ! బ్రహ్మదేవా! ఇట్టి సంకల్పముతోనే అతడు ఇట్టి ఘోరమైన తపస్సును ఆచరించుచున్నాడు అని మేము వినియున్నాము. కనుక, ఈ విషయమున తగిన కార్యమును నీవే చేయుము.

3.13 (పదమూడవ శ్లోకము)

తవాసనం ద్విజగవాం పారమేష్ఠ్యం జగత్పతే|

భవాయ శ్రేయసే భూత్యై క్షేమాయ విజయాయ చ॥5696॥

మహానుభావా! నీవు బ్రాహ్మణులకును, గోవులకును అభివృద్ధిని, శుభమును, శ్రేయస్సును, సంపదలను, క్షేమమును, విజయమును కలిగించుటకై సర్వశ్రేష్ఠమైన ఈ పరమేష్ఠిపదమును అధిష్ఠించియున్నావు (ఈ పదవి హిరణ్య కశిపునకు దక్కినచో, సజ్జనులందరును సంకటముల పాలగుదురు)

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి సప్తమస్కంధములోని మూడవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

22.6.2020    సాయం కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

సప్తమ స్కంధము - మూడవ అధ్యాయము

హిరణ్యకశిపుని తపస్సు - వరప్రాప్తి

ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

3.14 (పదునాలుగవ శ్లోకము)

ఇతి విజ్ఞాపితో దేవైర్భగవానాత్మభూర్నృప|

పరీతో భృగుదక్షాద్యైర్యయౌ దైత్యేశ్వరాశ్రమం॥5697॥

యుధిష్ఠిరా! దేవతలు బ్రహ్మదేవునకు ఇట్లు నివేదింపగా ఆ ప్రభువు భృగువు, దక్షుడు మొదలగు ప్రజాపతులతో గూడి హిరణ్యకశిపుని ఆశ్రమమునకు వెళ్ళెను.

3.15 (పదునైదవ శ్లోకము)

న దదర్శ ప్రతిచ్ఛన్నం వల్మీకతృణకీచకైః|

పిపీలికాభిరాచీర్ణమేదస్త్వఙ్మాంసశోణితమ్॥5698॥

అచటికి వెళ్ళిచూడగా బ్రహ్మదేవునకు హిరణ్యకశిపుడు కనబడలేదు. ఏలయన, పుట్టలు, గడ్డి, వెదుళ్ళు అతని శరీరమును కప్పివేసియుండెను. అతని శరీరములోని కొవ్వును, చర్మమును, మాంసమును, రక్తమును చీమలు తినివేసియుండెను.

3.16 (పదునారవ శ్లోకము)

తపంతం తపసా లోకాన్ యథాభ్రాపిహితం రవిమ్|

విలక్ష్య విస్మితః ప్రాహ ప్రహసన్ హంసవాహనః॥5699॥

కాని మేఘములచే కప్పబడిన సూర్యుని కాంతివలె హిరణ్యకశిపుని తపస్సు యొక్క తేజః ప్రభావమున లోకములు అన్నియును తపించి పోవుచుండెను. అట్టి స్థితిలో అతనిని జూచి బ్రహ్మదేవుడు ఆశ్చర్యముతో నవ్వుచు ఇట్లనెను-

బ్రహ్మోవాచ

3.17 (పదిహేడవ శ్లోకము)

ఉత్తిష్ఠోత్తిష్ఠ భద్రం తే తపఃసిద్ధోఽసి కాశ్యప|

వరదోఽహమనుప్రాప్తో వ్రియతామీప్సితో వరః॥5700॥

బ్రహ్మదేవుడు పలికెను - నాయనా! కశ్యపనందనా! నీకు శుభమగుగాక! లెమ్ము. లెమ్ము,. నీ తపస్సు ఫలించినది. నీకు వరమును ఇచ్చుటకై నేను ఇచటికి వచ్చితిని. నీ అభీష్టమును కోరుకొనుము.

3.18 (పదునెనిమిదవ శ్లోకము)

అద్రాక్షమహమేతత్తే హృత్సారం మహదద్భుతమ్|

దంశభక్షితదేహస్య ప్రాణా హ్యస్థిషు శేరతే॥5701॥

నీ మనోబలము అద్భుతమైనది. అడవి ఈగలు నీ దేహమును పూర్తిగ భక్షించినవి. ఐనను, ఎముకల గూడువంటి నీ దేహమునందు ప్రాణములు నిలిచియే యున్నవి.

3.19 (పందొమ్మిదవ శ్లోకము)

నైతత్పూర్వర్షయశ్చక్రుర్న కరిష్యంతి చాపరే|

నిరంబుర్ధారయేత్ప్రాణాన్ కో వై దివ్యసమాః శతమ్॥5702॥

ఇంతటి కఠినమైన తపస్సును ఇంతకుముందు ఏ ఋషులును ఆచరించి యుండలేదు. మున్ముందు సైతము ఎవ్వరును చేయజాలరు. నీటిని గూడ త్రాగకుండ నూరు దివ్య సంవత్సరములు ప్రాణములను ఎవరు నిలుపు కొనగలరు?

3.20 (ఇరువదియవ శ్లోకము)

వ్యవసాయేన తేఽనేన దుష్కరేణ మనస్వినామ్|

తపోనిష్ఠేన భవతా జితోఽహం దితినందన॥5703॥

దితికుమారా!  నీవు చేసిన ఈ తపస్సును ధీరపురుషులు గూడ చేయజాలరు. నీ తపోనిష్ఠకు నేను వశుడనైతిని.

3.21 (ఇరువది ఒకటవ శ్లోకము)

తతస్తే ఆశిషః సర్వాః దదామ్యసురపుంగవ|

మర్త్యస్య తే హ్యమర్త్యస్య దర్శనం నాఫలం మమ॥5704॥

అసురశ్రేష్ఠా! నీవు కోరినవి అన్నియును ఇచ్చెదను. నీవు మర్త్యుడవు. మృతిచెందువాడవు. నేను అమరుడను. నా దర్శనము ఎన్నడును నిష్ఫలము కారాదు.

నారద ఉవాచ

3.22 (ఇరది రెండవ శ్లోకము)

ఇత్యుక్త్వాఽఽదిభవో దేవో భక్షితాంగం పిపీలికైః|

కమండలుజలేనౌక్షద్దివ్యేనామోఘరాధసా॥5705॥

నారదుడు పలికెను- యుధిష్ఠిరా! బ్రహ్మదేవుడు ఇట్లు పలికిన పిదప చీమలచే భక్షింపబడిన హిరణ్యకశిపుని శరీరముపై అమోఘమైన తన కమండల జలమును చల్లెను. ఆ జలముల ప్రభావము అద్భుతము.

3.23 (ఇరువది మూడవ శ్లోకము)

స తత్కీచకవల్మీకాత్సహఓజోబలాన్వితః|

సర్వావయవసంపన్నో వజ్రసంహననో యువా|

ఉత్థితస్తప్తహేమాభో విభావసురివైధసః॥5706॥

బ్రహ్మదేవుడు ఆదివ్య జలములను చల్లినంతనే వెదుళ్ళతో నిండియున్న  ఆ పుట్టనుండి కర్రలనుండి అగ్నిదేవునివలె హిరణ్యకశిపుడు లేచి నిలబడెను. అప్పుడు అతని శరీరావయవములు వజ్రములవలె దృఢమై బలిష్ఠముగా నుండెను. అతడు పుటము పెట్టిన బంగారమువలె మెరిసిపోవుచు నవయువకునివలె తేజరిల్లుచుండెను.

3.24 (ఇరువది నాలుగవ శ్లోకము)

స నిరీక్ష్యాంబరే దేవం హంసవాహమవస్థితమ్|

ననామ శిరసా భూమౌ తద్దర్శనమహోత్సవః॥5707॥

హిరణ్యకశిపుడు ఆకాశమున హంసవాహనుడైన బ్రహ్మదేవుని జూచెను. ఆ దేవదేవుని దర్శనమునకు అతడు ఆనందముతో పొంగి పోయెను. వెంటనే అతడు సాగిలపడీ సాష్టాంగనమస్కారము చేసెను.

3.25 (ఇరువది ఐదవ శ్లోకము)

ఉత్థాయ ప్రాంజలిః ప్రహ్వః ఈక్షమాణో దృశా విభుమ్|

హర్షాశ్రుపులకోద్భేదో గిరా గద్గదయాగృణాత్॥5708॥

అతడు భూమిపైనుండి లేచి, వినయముతో అంజలి ఘటించెను. తనయెదుట సాక్షాత్కరించియున్న బ్రహ్మదేవుని చూచెను. అంతట హిరణ్యకశిపుని నేత్రముల నుండి ఆనందాశ్రువులు నిరంతరము ప్రవహింపసాగెను. ఒడలంతయు గగుర్పాటుతో నిండిపోయెను. అప్పుడతడు గద్గదస్వరముతో ఆ ప్రభువును ఇట్లు స్తుతించెను.

హిరణ్యకశిపురువాచ

3.26 (ఇరువది ఆరవ శ్లోకము)

కల్పాంతే కాలసృష్టేన యోఽన్ధేన తమసాఽఽవృతమ్|

అభివ్యనగ్జగదిదం స్వయంజ్యోతిః స్వరోచిషా॥5709॥

3.27 (ఇరువది ఏడవ శ్లోకము)

ఆత్మనా త్రివృతా చేదం సృజత్యవతి లుంపతి|

రజస్సత్త్వతమోధామ్నే పరాయ మహతే నమః॥5710॥

హిరణ్యకశిపుడు నుడివెను "కల్పాంతమునందు ఈ జగత్తు అంతయును కాలప్రేరితమై, తమోగుణమయమై అంధకారముచే కప్పబడియుండెను. ఆ సమయమున స్వయం ప్రకాశస్వరూపుడవైన నీవు తేజస్సుచే మరల ఆ జగత్తును ప్రకటించితివి. నీవే త్రిగుణాత్మకమైన నీ రూపము ద్వారా ఆ జగత్తుయొక్క సృష్టి, సంరక్షణ, సంహారములను చేయుచుందువు. సత్త్వ రజస్తమోగుణములకు నీవు ఆశ్రయుడవు. ఐనను, వాటికి అతీతుడవు. అట్టి మహాత్ముడవైన నీకు నమస్కారము.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి సప్తమస్కంధములోని మూడవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

23.6.2020    ప్రాతః కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

సప్తమ స్కంధము - మూడవ అధ్యాయము

హిరణ్యకశిపుని తపస్సు - వరప్రాప్తి

ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

3.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)

నమ ఆద్యాయ బీజాయ జ్ఞానవిజ్ఞానమూర్తయే|

ప్రాణేంద్రియమనోబుద్ధివికారైర్వ్యక్తిమీయుషే॥5711॥

ప్రభూ! నీవు జగత్తునకు మూలకారణుడవు. జ్ఞానవిజ్ఞానములు నీ స్వరూపములే. ప్రాణములు, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి  మొదలగు వాటి కార్యముల రూపముగా నీవే గోచరించుచుందువు. నీకు నమస్కారము.

3.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)

త్వమీశిషే జగతస్తస్థుషశ్చ  ప్రాణేన ముఖ్యేన పతిః ప్రజానాం|

చిత్తస్య చిత్తేర్మన ఐంద్రియాణామ్  పతిర్మహాన్ భూతగుణాశయేశః॥5712॥

నీవు ముఖ్య ప్రాణమై సూత్రాత్మ రూపమున చరాచర జగత్తును నియంత్రించుచుందువు. నీవే ప్రజలకు రక్షకుడవు. చిత్తము, చైతన్యము, మనస్సు, ఇంద్రియములు మొదలగు వానికి స్వామివి. పంచభూతములు, శబ్దాది విషయములు, వాటి సంస్కారములకు ఆశ్రయమైన మహత్తత్త్వ రూపముగూడ నీవే.

3.30 (ముప్పదియవ శ్లోకము)

త్వం సప్తతంతూన్ వితనోషి తన్వా త్రయ్యా చాతుర్హోత్రకవిద్యయా చ|

త్వమేక ఆత్మాఽఽత్మవతామనాది- రనంతపారః కవిరంతరాత్మా॥5713॥

హోత, అధ్వర్యువు, బ్రహ్మ, ఉద్గాత అను ఋత్విజులు నిర్వర్తించు యజ్ఞములను వేదము ప్రతిపాదించును. అట్టి వేదమే నీ స్వరూపము. అగ్నిష్టోమము, అత్యగ్నిష్టోమము, ఉక్థము, షోడశి, వాజపేయము, ఆప్తోర్యామము, అతిరాత్రము అను ఏడు యజ్ఞములను నీవు విస్తరింపజేయుచున్నావు. నీవే అనాదివి, అనంతుడవు, హద్దులు లేనివాడవు. సకలప్రాణులకు ఆత్మవు, సర్వజ్ఞుడవు. అనగా దేశ, కాల పరిచ్ఛేదరహితుడవు.

3.31 (ముప్పది ఒకటవ శ్లోకము)

త్వమేవ కాలోఽనిమిషో జనానా- మాయుర్లవాద్యావయవైః క్షిణోషి|

కూటస్థ ఆత్మా పరమేష్ఠ్యజో మహాంస్త్వం  జీవలోకస్య చ జీవ ఆత్మా॥5714॥

నీవే కాలస్వరూపుడవు, ప్రతిక్షణము  సావధానుడవై కణము, లవము మున్నగు కాలవిభాగముల ద్వారా జనుల ఆయువును క్షీణింపజేయుచుందువు. ఐనను, నీవు నిర్వికారుడవు. ఏలయన, నీవు జ్ఞాన స్వరూపుడవైన పరమేశ్వరుడవు. జన్మరహితుడవైన పరమాత్ముడవు. సకల జీవులకు జీవనదాతవు, అంతరాత్మవు.

3.32 (ముప్పది రెండవ శ్లోకము)

త్వత్తః పరం నాపరమప్యనేజజగచ్చ కించిద్వ్యతిరిక్తమస్తి|

విద్యాః కలాస్తే తనవశ్చ సర్వాః హిరణ్యగర్భోఽసి బృహత్త్రిపృష్ఠః॥5715॥

ప్రభూ! కార్యకారణముల, చరాచరములైన వస్తువులు ఏవియును నీ కంటె భిన్నములుగావు. సకల విద్యలు, కళలు నీ స్వరూపములే. త్రిగుణాత్మకమగు మాయకు అతీతుడవు. స్వర్ణమయమైన ఈ బ్రహ్మాండము నీ గర్భమునందే యున్నది. కనుక, నీవు హిరణ్యగర్భుడవు, దీనిని నీవు నీ నుండియే ప్రకటించుచుందువు.

3.33 (ముప్పది మూడవ శ్లోకము)

వ్యక్తం విభో స్థూలమిదం శరీరం  యేనేంద్రియప్రాణమనోగుణాంస్త్వమ్|

భుంక్షే స్థితో ధామని పారమేష్ఠ్యే అవ్యక్త ఆత్మా పురుషః పురాణః॥5717॥

ప్రభూ! వ్యక్తమైన ఈ బ్రహ్మాండము నీ స్థూలశరీరము. దీని ద్వారా ఇంద్రియముల, ప్రాణముల మనస్సు యొక్క విషయములను అనుభవించుచుందువు. కాని, ఆ సమయమునందు గూడ నీవు నీ పరమైశ్వర్య స్వరూపమునందే నిలిచియుందువు. వాస్తవముగా నీవు పురాణపురుషుడవు. స్థూలసూక్ష్మములకు అతీతుడవైన పరబ్రహ్మవు.

3.34 (ముప్పది నాలుగవ శ్లోకము

అనంతావ్యక్తరూపేణ యేనేదమఖిలం తతమ్|

చిదచిచ్ఛక్తియుక్తాయ తస్మై భగవతే నమః॥5717॥

నీవు అనంతమైన అవ్యక్తమైన స్వరూపముతో జగత్తునందు అంతటను వ్యాపించియున్నావు. చేతనములు, అచేతనములు గూడ నీ శక్తులే. పరమాత్మా! అట్టి నీకు నమస్కారము.

3.35 (ముప్పది ఐదవ శ్లోకము)

యది దాస్యస్యభిమతాన్ వరాన్ మే వరదోత్తమ|

భూతేభ్యస్త్వద్విసృష్టేభ్యో మృత్యుర్మా భూన్మమ ప్రభో॥5718॥

3.36 (ముప్పది ఆరవ శ్లోకము)

నాంతర్బహిర్దివా నక్తమన్యస్మాదపి చాయుధైః|

న భూమౌ నాంబరే మృత్యుర్న నరైర్న మృగైరపి॥5719॥

3.37 (ముప్పది ఏడవ శ్లోకము)

వ్యసుభిర్వాసుమద్భిర్వా సురాసురమహోరగైః|

అప్రతిద్వంద్వతాం యుద్ధే ఐకపత్యం చ దేహినామ్॥5720॥

ప్రభూ! నీవు వరప్రదులలో శ్రేష్ఠుడవు. నీవు నాకు ఇష్టమైన వరములను ఇయ్యదలచినచో, నేను ఒక వరమును కోరెదను. నీచే సృష్టింపబడిన ఏ ప్రాణిచేతనైనను, అనగా - మనుష్యులు, పశుపక్ష్యాదులు, ప్రాణము గలవి, ప్రాణములేనివి మరియు దేవతలు, దైత్యులు, నాగులు మొదలగు వారిచేతను, నాకు మృత్యువు కలుగరాదు. లోపలగాని, బయటగాని, పగలుగాని, రాత్రిగాని నీచే సృష్టింపబడిన ప్రాణులకంటె వేరైన ఏ జీవునివలనగాని, అస్త్రశస్త్రములచేగాని, భూమ్యాకాశముల యందుగాని, నాకు మరణము కలుగరాదు. యుద్ధమునందు నన్ను ఎదిరించగల మొనగాడు మరెవ్వడును ఉండరాదు. సమస్త ప్రాణులకును, నేను సార్వభౌముడుగా ఉండవలెను.

3.38 (ముప్పది ఎనిమిదవ శ్లోకము)

సర్వేషాం లోకపాలానాం మహిమానం యథాఽఽత్మనః|

తపోయోగప్రభావాణాం యన్న రిష్యతి కర్హిచిత్॥5721॥

ఇంద్రుడు మొదలగు లోకపాలురలో గల నీ మహిమ నాలోగూడ ఉండవలెను. తపస్సంపన్నులకు, యోగీశ్వరులకు ప్రాప్తించు అక్షయ ఐశ్వర్యములను నాకును ఫ్రసాదింపుము.

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం సప్తమస్కంధే తృతీయోఽధ్యాయః (3)

ఇది భాగవత మహాపురాణమునందలి సప్తమ స్కంధమునందు మూడవ అధ్యాయము (3)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

No comments:

Post a Comment