9.6.2020 సాయం కాల సందేశము
వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం
షష్ఠ స్కంధము - పదునైదవ అధ్యాయము
చిత్రకేతువునకు అంగిరస నారదుల ఉపదేశము
ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
శ్రీశుక ఉవాచ
15.1 (ప్రథమ శ్లోకము)
ఊచతుర్మృతకోపాన్తే పతితం మృతకోపమమ్
శోకాభిభూతం రాజానం బోధయన్తౌ సదుక్తిభిః॥5336॥
శ్రీ శుకయోగి వచించెను - పరీక్షిన్మహారాజా! చిత్రకేతు మహారాజు శోకగ్రస్తుడై, మృతుడైన తన పుత్రుని సమీపమున జీవచ్ఛవమువలె పడియుండెను. అపుడు అంగిరసుడు, నారదుడు ఆ మహారాజును మంచి మాటలతో ఊరడించుచు ఇట్లు పలికిరి-
15.2 (రెండవ శ్లోకము)
కోఽయం స్యాత్తవ రాజేన్ద్ర భవాన్ యమనుశోచతి
త్వం చాస్య కతమః సృష్టౌ పురేదానీమతః పరమ్॥5337॥
చిత్రకేతుమహారాజా! నీవు ఇతనిని గూర్చి మిగుల దుఃఖించుచుంటివి. ఈ జన్మయందుగాని, పూర్వజన్మమునందు గాని ఇతడు నీకు ఏమగును? అతనికి నీవు ఏమగుదువు? రాబోవుజన్మలలోగూడ ఇతనితో నీకెట్టి సంబంధముండును?
15.3 (మూడవ శ్లోకము)
యథా ప్రయాన్తి సంయాన్తి స్రోతోవేగేన వాలుకాః
సంయుజ్యన్తే వియుజ్యన్తే తథా కాలేన దేహినః॥5338॥
జలప్రవాహవేగమున ఇసుక కణములు కలియు చుండును, విడిపోవుచుండును. అట్లే కాల ప్రవాహమున ప్రాణులు గూడ కలియుట, విడిపోవుట జరుగుచుండును.
15.4 (నాలుగవ శ్లోకము)
యథా ధానాసు వై ధానా భవన్తి న భవన్తి చ|
ఏవం భూతేషు భూతాని చోదితానీశమాయయా॥5339॥
రాజా! గింజలనుండి కొన్ని గింజలు ఉత్పన్నములగును, మరికొన్ని ఉత్పన్నములు కావు. కొన్ని నష్టమగునుగూడ. అట్లే భగవంతుని మాయచే ప్రేరణను పొంది, ప్రాణులనుండి ఇతర ప్రాణులు పుట్టుచుందురు, గిట్టుచుందురు.
15.5 (ఐదవ శ్లోకము)
వయం చ త్వం చ యే చేమే తుల్యకాలాశ్చరాచరాః|
జన్మమృత్యోర్యథా పశ్చాత్ప్రాఙ్ నైవమధునాపి భోః॥5340॥
చిత్రకేతు మహారాజా! మేము, నీవు, మనతో పాటు ఉన్న ఈ చరాచరప్రాణులు తమ జన్మలకు పూర్వము లేరు, తరువాత ఉండబోరు. ఈ సమయమునందు గూడ వాటికి అస్తిత్వములేదని చెప్పవచ్చును. ఎందుకనగా, అన్ని కాలములలో మార్పు చెందకుండా ఉన్నదొక్కటే సత్యమైనది.
15.6 (ఆరవ శ్లోకము)
భూతైర్భూతాని భూతేశః సృజత్యవతి హన్త్యజః|
ఆత్మసృష్టైరస్వతన్త్రైరనపేక్షోఽపి బాలవత్॥5341॥
భగవంతుడే సకల ప్రాణులకును అధిపతి. అతనికి జననమరణాది వికారములు ఏవియును లేవు. అతనికి ఎట్టి ఇచ్ఛగాని, అపేక్షగాని లేదు. బాలురు బొమ్మరిండ్లను నిర్మించి, కొంత సేపు ఆడుకొని, తరువాత వాటిని పడగొట్టు చుందురు. అది వారికి క్రీడ. అట్లే భగవంతుడు స్వయముగా పరతంత్రులగు ప్రాణులను గూడ పుట్టించి, పాలించి సంహరించును. ఇది ఆయనకు ఒక విలాసము.
15.7 (ఏడవ శ్లోకము)
దేహేన దేహినో రాజన్ దేహాద్దేహోఽభిజాయతే|
బీజాదేవ యథా బీజం దేహ్యర్థ ఇవ శాశ్వతః॥5342॥
రాజా! ఒక గింజనుండి మరియొక గింజ ఉత్పన్నమైనట్లు, తండ్రి దేహము ద్వారా తల్లి దేహము నుండి శిశుదేహము ఉత్పన్నమగును. తల్లిదండ్రులు, పుత్రులు జీవరూపములోనున్న దేహియే. బాహ్యదృష్టితో వీరు మృణ్మయ శరీరములు. ఒక దేహము నుండి మరియొక దేహము పుట్టును. దేహమునకు అభిమానియగు దేహికూడా దేహముతో పుట్టినట్లుగా అనిపించును. కాని, దేహి నిత్యుడు, శాశ్వతుడు. ఏలయన, మట్టితో చేసిన కుండలు వేర్వేరుగా కనిపించును. అందుకు ఉపయోగించిన మట్టి మాత్రము ఒక్కటే. అది శాశ్వతముగ నుండును కదా!
15.8 (ఎనిమిదవ శ్లోకము)
దేహదేహివిభాగోఽయమవివేకకృతః పురా|
జాతివ్యక్తివిభాగోఽయం యథా వస్తుని కల్పితః॥5343॥
రాజా! ఒకే మృత్తికనుండి ఘటాదివస్తువులు రూపొందుచుండును. ఘటాదివ్యక్తుల విభాగము కేవలము కల్పనయే. అట్లే దేహి, దేహము అను విభాగము గూడ అనాది, అవిద్యా (అవివేక) కల్పితము. ఈ భేదదృష్టి తత్త్వజ్ఞానము కలుగుటకు ముందు మాత్రమే ఉండును.
శ్రీశుక ఉవాచ
15.9 (తొమ్మిదవ శ్లోకము)
ఏవమాశ్వాసితో రాజా చిత్రకేతుర్ద్విజోక్తిభిః|
ప్రమృజ్య పాణినా వక్త్రమాధిమ్లానమభాషత॥5344॥
శ్రీశుకుడు నుడివెను- రాజా! ఈ విధముగా అంగిరసమహర్షి, దేవర్షియైన నారదుడు చిత్రకేతు మహారాజునకు నచ్చచెప్పిరి. అప్పుడతడు ధైర్యమును కూడగట్టుకొని, దుఃఖాశ్రువులతో తడిసిన తన ముఖమును చేతితో తుడుచుకొని వారితో ఇట్లు పలికెను.
రాజోవాచ
15.10 (పదియవ శ్లోకము)
కౌ యువాం జ్ఞానసమ్పన్నౌ మహిష్ఠౌ చ మహీయసామ్|
అవధూతేన వేషేణ గూఢావిహ సమాగతౌ॥5345॥
చిత్రకేతుమహారాజు ఇట్లనెను- ఇంతకు మీరు ఎవరో కానీ, మీ నిజస్వరూపమును మరుగుపరిచి అవధూత వేషముతో వచ్చినట్లున్నారు. ఖచ్చితముగా మీరు జ్ఞానసంపన్నులైన, మహామహిమాన్వితులుగా కనబడుచున్నారు.
15.11 (పదకొండవ శ్లోకము)
చరన్తి హ్యవనౌ కామం బ్రాహ్మణా భగవత్ప్రియాః|
మాదృశాం గ్రామ్యబుద్ధీనాం బోధాయోన్మత్తలిఙ్గినః॥5346॥
భగవంతునకు ప్రీతిపాత్రులైన బ్రహ్మవేత్తలు, పెక్కుమంది మా వంటి విషయాసక్తులైన వారికి జ్ఞానోపదేశము చేయుటకై ఉన్మత్తులవలె వేషములు ధరించి, ఈ భూమిపై సంచరించుచుందురని మేము వినియున్నాము.
15.12 (పండ్రెండవ శ్లోకము)
కుమారో నారద ఋభురఙ్గిరా దేవలోఽసితః|
అపాన్తరతమో వ్యాసో మార్కణ్డేయోఽథ గౌతమః॥5347॥
15.13 (పదమూడవ శ్లోకము)
వసిష్ఠో భగవాన్ రామః కపిలో బాదరాయణిః|
దుర్వాసా యాజ్ఞవల్క్యశ్చ జాతూకర్ణ్యస్తథారుణిః॥5348॥
15.14 (పదునాలుగవ శ్లోకము)
రోమశశ్చ్యవనో దత్త ఆసురిః సపతఞ్జలిః|
ఋషిర్వేదశిరా బోధ్యః మునిః పఞ్చశిరాస్తథా॥5349॥
15.15 (పదునైదవ శ్లోకము)
హిరణ్యనాభః కౌసల్యః శ్రుతదేవ ఋతధ్వజః|
ఏత పరే చ సిద్ధేశాశ్చరంతి జ్ఞానహేతవః॥5350॥
సనత్కుమారుడు, నారదుడు, ఋభువు, అంగిరసుడు, దేవలుడు, అసితుడు, అపాంతరతముడు, వ్యాసుడు, మార్కండేయుడు, గౌతముడు, వసిష్ఠుడు, పూజ్యుడైన పరుశురాముడు, కపిలుడు, శ్రీశుకుడు, దుర్వాసుడు, యాజ్ఞవల్క్యుడు, జాతూకర్ణుడు, ఆరుణి, రోమశుడు, చ్యవనుడు, దత్తాత్రేయుడు, ఆసురి, పతంజలి, మహర్షియైన, వేదశిరుడు, మహామునియైన బోధ్యుడు, పంచశిరుడు, హిరణ్యనాభుడు, కౌసల్యుడు, శ్రుతదేవుడు, ఋతధ్వజుడు మొదలగువారేగాక, ఇంకను సిద్ధేశ్వరులైన మఱికొందఱును జ్ఞానోపదేశము చేయుటకై భూతలమున సంచరించు చుందురని ప్రతీతి.
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి షష్ఠస్కంధములోని పదునైదవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
10.6.2020 ప్రాతః కాల సందేశము
వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం
షష్ఠ స్కంధము - పదునైదవ అధ్యాయము
చిత్రకేతువునకు అంగిరస నారదుల ఉపదేశము
ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
15.16 (పదునారవ శ్లోకము)
తస్మాద్యువాం గ్రామ్యపశోర్మమ మూఢధియః ప్రభూ|
అన్ధే తమసి మగ్నస్య జ్ఞానదీప ఉదీర్యతామ్॥5351॥
మహాత్ములారా! నేను, విషయభోగములకు వశుడై యున్నవాడను. మందబుద్ధిని, అజ్ఞానాంధకారములో పడియున్నవాడను. మీరు దయచేసి, నాలో జ్ఞానదీపమును వెలిగింపుడు.
అఙ్గిరా ఉవాచ
15.17 (పదిహేడవ శ్లోకము)
అహం తే పుత్రకామస్య పుత్రదోఽస్మ్యఙ్గిరా నృప|
ఏష బ్రహ్మసుతః సాక్షాన్నారదో భగవాన్ ఋషిః॥5352॥
అంగిరసుడు వచించెను- మహారాజా! నీవు సంతానప్రాప్తికై పరితపించుచున్న సమయమున నేను నీకు పుత్రలాభమును కలిగించిన అంగిరసుడను. ఇతడు పూజ్యుడు, సాక్షాత్తు బ్రహ్మపుత్రుడయిన నారదుడు.
15.18 (పదునెనిమిదవ శ్లోకము)
ఇత్థం త్వాం పుత్రశోకేన మగ్నం తమసి దుస్తరే|
అతదర్హమనుస్మృత్య మహాపురుషగోచరమ్॥5353॥
15.19 (పందొమ్మిదవ శ్లోకము)
అనుగ్రహాయ భవతః ప్రాప్తావావామిహ ప్రభో|
బ్రహ్మణ్యో భగవద్భక్తో నావసీదితుమర్హతి॥ 5354॥
నీవు పుత్రశోకము వలన అపారమైన అజ్ఞానాంధకారమున మునిగియున్నట్లు తెలిసికొంటిమి. భగవద్భక్తుడవైన నీవు శోకింపరాదని మా అభిప్రాయము. రాజా! నిన్ను అనుగ్రహించుట కొరకై మేము ఇచటికి వచ్చితిమి. భగవంతునియెడ, బ్రాహ్మణుల యందు భక్తిగలవాడు ఎట్టి పరిస్థితిలోను దుఃఖింపరాదు.
15.20 (ఇరువదియవ శ్లోకము)
తదైవ తే పరం జ్ఞానం దదామి గృహమాగతః|
జ్ఞాత్వాన్యాభినివేశం తే పుత్రమేవ దదావహమ్॥ 5355॥
పూర్వము నేను మీ గృహమునకు ఏతెంచిన సమయముననే నీకు జ్ఞానోపదేశమును చేసియుండెడివాడను. కాని, నీలో పుత్రప్రాప్తికై లాలన మిక్కుటముగా ఉండుటను చూచితిని, కనుక, ఆ సమయమున నీకు జ్ఞానమును ప్రసాదింపక పుత్రుని మాత్రమే అనుగ్రహించితిని.
15.21 (ఇరువది ఒకటవ శ్లోకము)
అధునా పుత్రిణాం తాపో భవతైవానుభూయతే|
ఏవం దారా గృహా రాయో వివిధైశ్వర్యసమ్పదః॥5356॥
15.22 (ఇరువది రెండవ శ్లోకము)
శబ్దాదయశ్చ విషయాశ్చలా రాజ్యవిభూతయః|
మహీ రాజ్యం బలం కోశో భృత్యామాత్యసుహృజ్జనాః॥5357॥
ఇప్పుడు పుత్రుల వలన ఎంత పరితాపము కలుగునో, నీవే స్వయముగా అనుభవించుచున్నావు. అట్లే భార్య, గృహము, ధనము, వివిధములైన ఐశ్వర్యములు, సంపదలు, శబ్దాది విషయభోగములు, రాజ్యవైభవములు, భూమి రాజ్యము, సేనలు, కోశము, సేవకులు, అమాత్యులు, బంధుమిత్రులు మున్నగు వీరు అందరును దుఃఖహేతువులు, అనిత్యములు.
15.23 (ఇరువది మూడవ శ్లోకము)
సర్వేఽపి శూరసేనేమే శోకమోహభయార్తిదాః|
గన్ధర్వనగరప్రఖ్యాః స్వప్నమాయామనోరథాః॥ 5358॥
15.24 (ఇరువది నాలుగవ శ్లోకము)
దృశ్యమానా వినార్థేన న దృశ్యన్తే మనోభవాః|
కర్మభిర్ధ్యాయతో నానాకర్మాణి మనసోఽభవన్॥ 5359॥
శూరసేనమహారాజా! ఇవి అన్నియును శోకమును, మోహమును, భయమును, దుఃఖమును కలిగించునవి. మానసికములైన ఆట బొమ్మలు సర్వధా కల్పితములు, మిథ్య. ఏలయన, ఇవి లేకున్నను, ఉన్నట్లుగా కనిపించును. ఇవి క్షణమాత్రము కనబడినను, మరుక్షణమే మాయమగును. ఇవి గంధర్వనగరము, స్వప్నము, మాయ, మనోరథ వస్తువులవలె అసత్యములు. కర్మవాసనలచే ప్రేరితులై, విషయ భోగములచే ధ్యానించువారియొక్క మనస్సులు, అనేక విధములైన కర్మలను సృష్టించుచుండును.
15.25 (ఇరువది ఐదవ శ్లోకము)
అయం హి దేహినో దేహో ద్రవ్యజ్ఞానక్రియాత్మకః|
దేహినో వివిధక్లేశసన్తాపకృదుదాహృతః॥5360॥
జీవాత్మయొక్క ఈ దేహము పంచభూతముల, జ్ఞానేంద్రియముల, కర్మేంద్రియముల సమూహము. ఇది జీవుని పలు విధములైన క్లేశముల, సంతాపముల పాలుచేయునని విజ్ఞులు తెలుపుదురు.
15.26 (ఇరువది ఆరవ శ్లోకము)
తస్మాత్స్వస్థేన మనసా విమృశ్య గతిమాత్మనః|
ద్వైతే ధ్రువార్థవిశ్రమ్భం త్యజోపశమమావిశ॥5361॥
కనుక, నీవు నీ మనస్సును విషయ భోగములవైపు పోనీయక శాంతపరచుము. దాని ద్వారా నీ యదార్థ స్వరూపమును గూర్చి ఆలోచింపుము. ద్వైతభ్రమయందు నిత్యత్వ బుద్ధిని వీడి నీ మనస్సును పరమ శాంతి స్వరూపుడైన పరమాత్మయందు నిలుపుము.
నారద ఉవాచ
15.27 (ఇరువది ఏడవ శ్లోకము)
ఏతాం మన్త్రోపనిషదం ప్రతీచ్ఛ ప్రయతో మమ|
యాం ధారయన్ సప్తరాత్రాద్ద్రష్టా సఙ్కర్షణం ప్రభుమ్॥5362॥
నారదమహాముని పలికెను రాజా! నీవు ఏకాగ్రచిత్తుడవై నా నుండి ఈ ఉపనిషన్మంత్రమును గ్రహింపుము. దీనిని ఏడురాత్రులు ధారణ చేసినచో నీకు సంకర్షణ భగవానుని దర్శనమగును.
15.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)
యత్పాదమూలముపసృత్య నరేన్ద్ర పూర్వే శర్వాదయో భ్రమమిమం ద్వితయం |
సద్యస్తదీయమతులానధికం మహిత్వం ప్రాపుర్భవానపి పరం న చిరాదుపైతి॥5363॥
మహారాజా! పూర్వకాలమున పరమశివుడు మొదలగువారు పూజ్యుడైన సంకర్షణభగవానుని పాదపద్మములను ఆశ్రయించిరి. దానివలన వారిలోగల ద్వైతభ్రమ తొలగిపోయి ఆ భగవానుని మహిమ బోధపడెను. దానిని మించినది ఏదియును లేదు. సమానమైనదియు లేదు. నీవును అనతి కాలములో ఆ పరమాత్ముని పరమపదమును పొందగలవు.
ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం షష్ఠస్కంధే పంచదశోఽధ్యాయః (15)
ఇది శ్రీమద్భాగవత మహాపురాణమునందలి షష్ఠ స్కంధమునందు పదునైదవ అధ్యాయము (15)

No comments:
Post a Comment