10.6.2020 సాయం కాల సందేశము
వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం
షష్ఠ స్కంధము - పదునారవ అధ్యాయము
చిత్రకేతువు వైరాగ్యమును పొందుట - సంకర్షణ భగవానుని దర్శంచుట
ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
శ్రీశుక ఉవాచ
16.1 (ప్రథమ శ్లోకము)
అథ దేవఋషీ రాజన్ సమ్పరేతం నృపాత్మజమ్|
దర్శయిత్వేతి హోవాచ జ్ఞాతీనామనుశోచతామ్॥5364॥
శ్రీ శుకుడు వచించెను-పరీక్షిన్మహారాజా! అనంతరము నారదమహర్షి మృతుడైన రాజకుమారుని జీవాత్మను శోకాతురులైన స్వజనుల ముందుకు రప్పించి ఇట్లు నుడివెను.
నారద ఉవాచ
16.2 (రెండవ శ్లోకము)
జీవాత్మన్ పశ్య భద్రం తే మాతరం పితరం చ తే|
సుహృదో బాన్ధవాస్తప్తాః శుచా త్వత్కృతయా భృశమ్॥5365॥
16.3 (మూడవ శ్లోకము)
కలేవరం స్వమావిశ్య శేషమాయుః సుహృద్వృతః|
భుంక్ష్వ భోగాన్ పితృప్రత్తానధితిష్ఠ నృపాసనమ్॥5366॥
దేవర్షి నారదుడు నుడివెను- 'ఓ జీవాత్మా! నీకు శుభమగు గాక! నీ తలిదండ్రులు, సుహృదులు, బంధువులు నీ యెడబాటును సహింపలేక మిగుల శోకమున మునిగియున్నారు, చూడుము. కనుక, నీవు నీ కళేబరమున ప్రవేశింపుము. నీ శేష జీవితమును నీ బంధుమిత్రులతో గడుపుము. నీ తండ్రి నుండి ప్రాప్తించిన భోగభాగ్యములను అనుభవింపుము. రాజ్యసింహాసనమును అధిష్ఠింపుము'.
జీవ ఉవాచ
16.4 (నాలుగవ శ్లోకము)
కస్మిన్ జన్మన్యమీ మహ్యం పితరో మాతరోఽభవన్|
కర్మభిర్భ్రామ్యమాణస్య దేవతిర్యఙ్నృయోనిషు॥5367॥
జీవాత్మ పలికెను- "దేవర్షీ! నేను నా కర్మాను సారము దేవ, మనుష్య, పశుపక్ష్యాది పెక్కు యోనులలో జన్మించి, తిరుగు చుందును. వీరు నాకు ఏ జన్మయందు తల్లి దండ్రులు?
16.5 (ఐదవ శ్లోకము)
బన్ధుజ్ఞాత్యరిమధ్యస్థమిత్రోదాసీనవిద్విషః|
సర్వ ఏవ హి సర్వేషాం భవన్తి క్రమశో మిథః॥5368॥
వేర్వేరు జన్మలలో అందరును ఒకరికొకరు బంధువులు, జ్ఞాతులు, శత్రువులు, మిత్రులు, మధ్యస్థులు, ఉదాసీనులు, ద్వేషించువారు అగుచునే యుందురు.
16.6 (ఆరవ శ్లోకము)
యథా వస్తూని పణ్యాని హేమాదీని తతస్తతః|
పర్యటన్తి నరేష్వేవం జీవో యోనిషు కర్తృషు॥5369॥
బంగారము మొదలగు క్రయ విక్రయ వస్తువులు ఒక వ్యాపారి నుండి మరియొకరి కడకు చేరుచుండును. అట్లే జీవుడుగూడ వేర్వేరు యోనులలో ఉద్భవించుచుండును.
16.7 (ఏడవ శ్లోకము)
నిత్యస్యార్థస్య సమ్బన్ధో హ్యనిత్యో దృశ్యతే నృషు|
యావద్యస్య హి సమ్బన్ధో మమత్వం తావదేవ హి॥5370॥
ఈ విధముగా ఆలోచించినచో, మనుష్యుల కంటె ఎక్కువ దినములుండు సువర్ణాది పదార్థములు సంబంధము గూడ మనుష్యులతో స్థిరముగా ఉండదు. అది క్షణిక మాత్రము. ఎంతవరకు మనుష్యునికి ఆ వస్తువుతో సంబంధము ఉండునో, అంతవరకే అతనికి దానిపై మమకారము ఉండును.
16.8 (ఎనిమిదవ శ్లోకము)
ఏవం యోనిగతో జీవః స నిత్యో నిరహఙ్కృతః|
యావద్యత్రోపలభ్యేత తావత్స్వత్వం హి తస్య తత్॥5371॥
జీవాత్మ నిత్యము, అహంకార రహితము. అది ఒక గర్భము నందు ప్రవేశించి, ఏ శరీరమునందు ఉండునో, ఆ శరీరమును తనదిగా భావించును.
16.9 (తొమ్మిదవ శ్లోకము)
ఏష నిత్యోఽవ్యయః సూక్ష్మ ఏష సర్వాశ్రయః స్వదృక్|
ఆత్మమాయాగుణైర్విశ్వమాత్మానం సృజతి ప్రభుః॥5372॥
ఈ జీవాత్మనిత్యము, నాశము లేనిది, సూక్ష్మము. (జన్మాది వికారరహితము) అన్నిటికిని ఆశ్రయము స్వయం ప్రకాశకమే. ఐనను, ఈ జీవాత్మ భగవదంశ యగుటవలన తన మాయా గుణముల చేతనే ఈ విశ్వమునందు ఆయా రూపములలో ప్రకటమగు చుండును.
16.10 (పదియవ శ్లోకము)
న హ్యస్యాస్తి ప్రియః కశ్చిన్ నాప్రియః స్వః పరోపి వా|
ఏకః సర్వధియాం ద్రష్టా కర్తౄణాం గుణదోషయోః॥5373॥
ఈ జీవాత్మకు మిక్కిలి ప్రియమైనదిగాని, అప్రియమైనదిగాని ఏదీ లేదు. తనవాడు, పరాయివాడు అను భేదము లేదు. ఏలయన, గుణదోషములు (హితము అహితము) కలిగించు నట్టి మిత్రులు, శత్రువులు మొదలగు వారి బుద్ధి వృత్తులకు ఇది ఏకైక సాక్షిగా ఉండును. వాస్తవముగా ఇది అద్వితీయము.
16.11 (పదకొండవ శ్లోకము)
నాదత్త ఆత్మా హి గుణం న దోషం న క్రియాఫలమ్|
ఉదాసీనవదాసీనః పరావరదృగీశ్వరః॥5374॥
ఈ ఆత్మ కార్య, కారణములకు సాక్షి, స్వతంత్రమైనది. కనుక శరీరాది గుణ దోషములను, కర్మఫలములను అది గ్రహింపదు. సర్వదా ఉదాసీన భావముతో ఉండును"
శ్రీ శుక ఉవాచ
16.12 (పండ్రెండవ శ్లోకము)
ఇత్యుదీర్య గతో జీవో జ్ఞాతయస్తస్య తే తదా|
విస్మితా ముముచుః శోకం ఛిత్త్వాఽఽత్మ స్నేహ శృఙ్ఖలామ్॥5375॥
శ్రీ శుకుడు పలికెను- రాజా! జీవాత్మ ఈ విధముగా పలికి వెళ్ళి పోయెను. దాని పలుకులను విన్న బంధువులు అందరును మిక్కిలి ఆశ్చర్యపడిరి. దానితో గల స్నేహబంధములు గూడ తెగిపోయెను. అతని మరణమునకు ఎవ్వరును శోకింపలేదు.
16.13 (పదమూడవ శ్లోకము)
నిర్హృత్య జ్ఞాతయో జ్ఞాతేర్దేహం కృత్వోచితాః క్రియాః|
తత్యజుర్దుస్త్యజం స్నేహం శోకమోహభయార్తిదమ్॥5376॥
అనంతరము బంధువులు, మృతబాలకుని శరీరమునకు అంతిమ సంస్కారములను నడపిరి. శోకము, మోహము, భయము, దుఃఖము మొదలగు వాటికి కారణమైన దుస్త్యజమైన మమకారమును త్యజించిరి.
16.14 (పదునాలుగవ శ్లోకము)
బాలఘ్న్యో వ్రీడితాస్తత్ర బాలహత్యాహతప్రభాః|
బాలహత్యావ్రతం చేరుర్బ్రాహ్మణైర్యన్నిరూపితమ్|
యమునాయాం మహారాజ స్మరన్త్యో ద్విజభాషితమ్॥5377॥
రాజా! రాజకుమారునకు విషప్రయోగము చేసిన రాణులు శిశుహత్యాకారణముగా తమ తేజస్సును కోల్పోయిరి. సిగ్గుతో తలయెత్తుకొని చూడలేకపోయిరి. వారు అంగిరస మహర్షియొక్క ఉపదేశమును స్మరించుచు బాలహత్య చేసినందులకు యమునానదీ తీరమున బ్రాహ్మణుల ఆదేశానుసారము ప్రాయశ్చిత్తము చేసికొనిరి.
16.15 (పదునైదవ శ్లోకము)
స ఇత్థం ప్రతిబుద్ధాత్మా చిత్రకేతుర్ద్విజోక్తిభిః|
గృహాన్ధకూపాన్నిష్క్రాన్తః సరఃపఙ్కాదివ ద్విపః॥5378॥
రాజా! అంగిరస, నారదుల ఉపదేశములవలన చిత్రకేతుమహారాజులోని వివేకబుద్ధి జాగృతమయ్యెను. ఏనుగు జలాశయము యొక్క బురద నుండి బయటపడినట్లు అతడు గృహము మొదలగు అంధకారకూపము నుండి బయటపడెను.
16.16 (పదునారవ శ్లోకము)
కాలిన్ద్యాం విధివత్స్నాత్వా కృతపుణ్యజలక్రియః|
మౌనేన సంయతప్రాణో బ్రహ్మపుత్రావవన్దత॥5379॥
అతడు యమునా నదీ జలములలో విధ్యుక్తముగా స్నానము చేసి, తర్పణాదిధార్మిక కార్యక్రమములను పూర్తిచేసి ప్రాణాయామపరుడై మౌనముగా అంగిరస, నారదుల పాదములకు నమస్కరించెను.
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి షష్ఠస్కంధములోని పదునారవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
11.6.2020 ప్రాతః కాల సందేశము

16.17 (పదిహేడవ శ్లోకము)
అథ తస్మై ప్రపన్నాయ భక్తాయ ప్రయతాత్మనే|
భగవాన్నారదః ప్రీతో విద్యామేతామువాచ హ॥5380॥
చిత్రకేతువు జితేంద్రియుడై భగవద్భక్తితో తనకు శరణాగతుడగుటను జూచి, నారదమహర్షి మిగుల ప్రసన్నుడై ఈ సంకర్షణదేవుని ఉపాసనరూపమగు విద్యను ఉపదేశించెను-
16.18 (పదునెనిమిదవ శ్లోకము)
ఓం నమస్తుభ్యం భగవతే వాసుదేవాయ ధీమహి|
ప్రద్యుమ్నాయానిరుద్ధాయ నమః సఙ్కర్షణాయ చ॥5381॥
"ఓంకార స్వరూపుడవైన పరమాత్మా! నీకు నమస్కారము. నీవు వాసుదేవ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, సంకర్షణ రూపములలో క్రమముగా చిత్తము, బుద్ధి, మనస్సు , అహంకారములకు అధిష్ఠాతవైయున్నావు. అట్టి నీ చతుర్వ్యూహ స్వరూపమును, మాటి-మాటికి నమస్కారపూర్వకముగా ధ్యానించెదను.
16.19 (పందొమ్మిదవ శ్లోకము)
నమో విజ్ఞానమాత్రాయ పరమానన్దమూర్తయే|
ఆత్మారామాయ శాన్తాయ నివృత్తద్వైతదృష్టయే॥5382॥
నీవు విశుద్ధ, విజ్ఞాన స్వరూపుడవు. నీ మూర్తి పరమానంద స్వరూపము. నీవు ఆత్మారాముడవు. శాంతుడవు. భేదదృష్టి నిన్ను అంటనే అంటదు. నీకు నమస్కారము.
16.20 (ఇరువదియవ శ్లోకము)
ఆత్మానన్దానుభూత్యైవ న్యస్తశక్త్యూర్మయే నమః|
హృషీకేశాయ మహతే నమస్తే విశ్వమూర్తయే॥5383॥
ఆత్మానందస్వరూపుడవైన నీవు మాయాజనితరాగ ద్వేషాది దోషములను పారద్రోలితివి. సమస్త ప్రాణుల ఇంద్రియములకు ప్రేరణను ఇచ్చువాడవు. మహాత్ముడవు. విరాట్ స్వరూపుడవు. అట్టి నీకు నమస్కారము.
16.21 (ఇరువది ఒకటవ శ్లోకము)
వచస్యుపరతేఽప్రాప్య య ఏకో మనసా సహ|
అనామరూపశ్చిన్మాత్రః సోఽవ్యాన్నః సదసత్పరః॥5384॥
నీవు అవాఙ్మానస గోచరుడవు. అనగా వాక్కు, మనస్సు నిన్ను చేరలేవు. నీవు అద్వితీయుడవు, నామరూపరహితుడవు. చిన్మాత్రస్వరూపుడవు. కార్య, కారణములకు అతీతుడవు. అట్టి నీవు నన్ను రక్షింపుము.
16.22 (ఇరువధి రెండవ శ్లోకము)
యస్మిన్నిదం యతశ్చేదం తిష్ఠత్యప్యేతి జాయతే
మృణ్మయేష్వివ మృజ్జాతిస్తస్మై తే బ్రహ్మణే నమః॥5385॥
పరమాత్మా! కార్యకారణరూపమై ఈ జగత్తు నీ నుండి ఉత్పన్నమై, నీలో నిలిచి మరల నీ యందే లీనమగుచున్నది. మట్టి వస్తువులలో వ్యాపించియున్న మట్టివలె నీవు అన్నింటియందును ఓతప్రోతముగా ఉన్నావు. పరబ్రహ్మస్వరూపుడవైన నీకు నమస్కారము.
16.23 (ఇరువది మూడవ శ్లోకము)
యన్న స్పృశన్తి న విదుర్మనోబుద్ధీన్ద్రియాసవః|
అన్తర్బహిశ్చ వితతం వ్యోమవత్తన్నతోఽస్మ్యహమ్॥5386॥
ఆకాశమువలె నీవు వెలుపల, లోపలగూడ ఏకరూపుడవై అంతటను వ్యాపించియున్నావు. మనస్సు, బుద్ధి, జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు నీ క్రియాశక్తిని గుర్తింపలేవు. అట్టి నీకు నా ప్రాణామములు.
16.24 (ఇరువది నాలుగవ శ్లోకము)
దేహేన్ద్రియప్రాణమనోధియోఽమీ యదంశవిద్ధాః ప్రచరన్తి కర్మసు|
నైవాన్యదా లోహమివాప్రతప్తం స్థానేషు తద్ద్రష్ట్రపదేశమేతి॥5387॥
దేహము, ఇంద్రియములు, ప్రాణములు, మనస్సు, బుద్ధి ఇవన్నియును నీ చైతన్యాంశముతో యుక్తమై తమ తమ పనులను నిర్వహించుచున్నవి. చైతన్యాంశము లేకుండా ఇవేమియునూ నిర్వహింపలేవు. ఉదాహరణమునకు లోహము జడమైనది. దానిని అగ్నిలో కాల్చినప్పుడు, అది ఇతరములను కాల్చుటకు సమర్థమగును. జీవునకు జాగ్రత్, స్వప్న, సుషుప్తి అను మూడు అవస్థలు కలుగును. ఈ మూడు అవస్థలయందును జీవుని దశ మారుచుండును. కాని, ద్రష్టగా ఉండే నీవు మాత్రము ఒకే విధముగా ఉండెదవు. నిజమునకు, నీవు లేకుండా జీవునకు ప్రత్యేకమైన అస్తిత్వము లేనేలేదు.
16.25 (ఇరువధి ఐదవ శ్లోకము)
ఓం నమో భగవతే మహాపురుషాయ మహానుభావాయ మహావిభూతిపతయే సకలసాత్త్వతపరివృఢనికర కరకమలకుడ్మలోపలాలితచణారవిన్దయుగళ పరమ పరమేష్ఠిన్ నమస్తే॥5388॥
పరాత్పరా! నీవు ఓంకార స్వరూపుడవు. మహాప్రభావశాలివి. మహావిభూతులకు అధిపతివి. పరమ భక్తులు తమ కరకమలములను జోడించి, నీ పాదపద్మములను సేవించుట యందే నిరతులగుదురు. నీవు సర్వశ్రేష్ఠుడవు. నీకు పదే పదే నమస్కారము".
శ్రీశుక ఉవాచ
16.26 (ఇరువది ఆరవ శ్లోకము)
భక్తాయైతాం ప్రపన్నాయ విద్యామాదిశ్య నారదః|
యయావఙ్గిరసా సాకం ధామ స్వాయమ్భువం ప్రభో॥5389॥
శ్రీ శుకుడు పలికెను- రాజా! దేవర్షియైన నారదుడు తనకు ప్రపన్నుడు, భక్తుడు ఐన చిత్రకేతువునకు ఈ విద్యను ఉపదేశించి, అంగిరసమహర్షితో గూడి బ్రహ్మలోకమునకు వెళ్ళెను.
16.27 (ఇరువది ఏడవ శ్లోకము)
చిత్రకేతుస్తు విద్యాం తాం యథా నారదభాషితామ్|
ధారయామాస సప్తాహమబ్భక్షః సుసమాహితః॥5390॥
చిత్రకేతుమహారాజు నారదుడు ఉపదేశించిన విద్యను ఆయన ఆజ్ఞానుసారము ఏడుదినములు కేవలము మాత్రమే స్వీకరించుచు ఏకాగ్రతతో అనుష్ఠించెను.
16.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)
తతః స సప్తరాత్రాన్తే విద్యయా ధార్యమాణయా|
విద్యాధరాధిపత్యం స లేభేఽప్రతిహతం నృప॥5391॥
ఆ మహారాజు ఆ విద్యను అనుష్ఠించిన ఏడు దినముల తరువాత అతనికి విద్యాధరులపై ఆధిపత్యము ప్రాప్తించెను.
16.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)
తతః కతిపయాహోభిర్విద్యయేద్ధమనోగతిః|
జగామ దేవదేవస్య శేషస్య చరణాన్తికమ్॥5392॥
అనంతరము కొన్నిదినములకు ఆ విద్యా ప్రభావమున అతని మనస్సు ఇంకను పరిశుద్ధ మాయెను. అప్పుడతడు దేవదేవుడైన ఆదిశేషుని చరణములను ఆశ్రయించెను.
16.30 (ముప్పదియవ శ్లోకము)
మృణాలగౌరం శితివాససం స్ఫుర- త్కిరీటకేయూరకటిత్రకఙ్కణమ్|
ప్రసన్నవక్త్రారుణలోచనం వృతం దదర్శ సిద్ధేశ్వరమణ్డలైః ప్రభుమ్॥5393॥
చిత్రకేతువు సిద్ధేశ్వరుల మండలములో విరాజమానుడై యున్న ఆదిశేషుని చూచెను. ఆ ప్రభువు శరీరము తామర తూడువలె గౌరవర్ణశోభితమై నీల వస్త్రముచే ప్రకాశించుచుండెను. శిరస్సున కిరీటము, బాహువుల యందు భుజకీర్తులు, నడుమున కటిసూత్రము, ముంజేతులయందు కంకణములు మొదలగు ఆభరణములు కాంతులీనుచుండెను. అరుణకాంతిగల నేత్రములతో విలసిల్లుచున్న ఆ స్వామి ముఖము ప్రసన్నముగా నుండెను.
16.31 (ముప్పది ఒకటవ శ్లోకము)
తద్దర్శనధ్వస్తసమస్తకిల్బిషః స్వస్థామలాన్తఃకరణోఽభ్యయాన్మునిః |
ప్రవృద్ధభక్త్యా ప్రణయాశ్రులోచనః ప్రహృష్టరోమాఽఽనమదాదిపురుషమ్॥5394॥
ఆదిశేషభగవానుని దర్శించినంతనే రాజర్షియగు చిత్రకేతు పాపములు అన్నియును నశించెను. అతని అంతఃకరణము, స్వచ్ఛము, నిర్మలము అయ్యెను. హృదయముస భక్తిభావము పొంగిపొరలెను. నేత్రములు ఆనందాశ్రువులతో నిండెను. శరీరము రోమాంచితమయ్యెను. అట్టి స్థితిలో అతడు శేషభగవానునకు ప్రణమిల్లెను.
16.32 (ముప్పది రెండవ శ్లోకము)
స ఉత్తమశ్లోకపదాబ్జవిష్టరం ప్రేమాశ్రులేశైరుపమేహయన్ ముహుః|
ప్రేమోపరుద్ధాఖిలవర్ణనిర్గమో నైవాశకత్తం ప్రసమీడితుం చిరమ॥5395॥
అతని నేత్రముల నుండి అవిచ్ఛిన్నముగా స్రవించు ప్రేమాశ్రువులతో శేషభగవానుని పాదపీఠము తడిసిపోయెను. భక్త్యతిరేకముచే కంఠము గద్గదమగుటచే నోట మాటరాకుండెను. అందువలన ఆ దేవదేవుని స్తుతించుటకు అతడు చాలాసేపటివరకు అశక్తుడు అయ్యెను.

11.6.2020 సాయం కాల సందేశము

16.33 (ముప్పది మూడవ శ్లోకము)
తతః సమాధాయ మనో మనీషయా బభాష ఏతత్ప్రతిలబ్ధవాగసౌ|
నియమ్య సర్వేన్ద్రియబాహ్యవర్తనం జగద్గురుం సాత్వతశాస్త్రవిగ్రహమ్॥5396॥
ఎట్టకేలకు మనస్సు స్థిమితము కాగా అతడు మాటాడుటకు శక్తుడయ్యెను. ఇంద్రియముల బాహ్యవృత్తులను నిరోధించెను. భక్తిశాస్త్రములయందు వర్ణింపబడిన స్వరూపముగల ఆ జగద్గురువు అగు సంకర్షణభగవానుని ఇట్లు స్తుతించెను.
చిత్రకేతురువాచ
16.34 (ముప్పది నాలుగవ శ్లోకము)
అజిత జితః సమమతిభిః సాధుభిర్భవాన్ జితాత్మభిర్భవతా|
విజితాస్తేఽపి చ భజతామకామాత్మనాం య ఆత్మదోఽతికరుణః॥5398॥
చిత్రకేతుడు ఇట్లు పలికెను- "అజితా! నీవు జయింపరానివాడవు. ఐనను, జితేంద్రియులు, సమదర్శనులు ఐన సాధుపురుషులు నిన్ను జయించెదరు. నీవు కూడ నీ సౌందర్యము, మాధుర్యము, కారుణ్యము మున్నగు గుణములచే వారిని నీ వశము చేసుకొనెదవు. ప్రభూ! అనంత కరుణా సింధువుగు నీవు, నీయొక్క నిష్కామభక్తులకు నిన్ను నీవే అర్చించుకొందువు.
16.35 (ముప్పది ఆరవ శ్లోకము)
తవ విభవః ఖలు భగవన్ జగదుదయస్థితిలయాదీని|
విశ్వసృజస్తేంఽశాంశాస్తత్ర మృషా స్పర్ధన్తే పృథగభిమత్యా॥5398॥
దేవా! జగత్తుయొక్క సృష్టి, స్థితి, లయములు నీ లీలా విలాసములే. జగత్తును సృష్టిజేయు బ్రహ్మాదులు నీ అంశాంశములే. ఐనను, వారు వేర్వేరుగా తామే జగత్సృష్టి కర్తలము అని సంభావించుకొనుచు పరస్పరము పోటీపడి మసలుచుందురు.
16.36 (ముప్పది ఆరవ శ్లోకము)
పరమాణుపరమమహతోస్త్వమాద్యన్తాన్తరవర్తీ త్రయవిధురః|
ఆదావన్తేఽపి చ సత్త్వానాం యద్ధ్రువం తదేవాన్తరాలేఽపి॥5399॥
పరమాణువులు మొదలుకొని మహత్తత్త్వము వరకు గల సకల వస్తువుల యొక్క ఆది మధ్యాంతములయందు నీవే విరాజిల్లుచున్నావు. ఐనను, నీవు మాత్రము ఆదిమధ్యాంత రహితుడవు. ఏలయన, ఆద్యంతములలో స్థిరముగా ఉండు బంగారము, మధ్యయందుగూడ ఉండును. అనగా కర్ణాభరణము మిథ్య, బంగారము సత్యము. అదేవిధముగా జగత్తు మిథ్య, ఈశ్వరుడు సత్యము.
16.37(ముప్పది ఎనిమిదవ శ్లోకము)
క్షిత్యాదిభిరేష కిలావృతః సప్తభిర్దశగుణోత్తరైరణ్డకోశః|
యత్ర పతత్యణుకల్పః సహాణ్డకోటికోటిభిస్తదనన్తః॥5400॥
పృథివి, జలము, తేజస్సు, వాయువు, ఆకాశములు, అహంకారము, మహత్తు అను ఏడు తత్త్వములు ఒక దానికంటె మరియొకటి పదిరెట్లు చొప్పున ఈ బ్రహ్మాండమును ఆవరించియున్నవి. కోట్లకొలదిగాగల ఈ బ్రహ్మాండములు అణువులవలె నీలో తిరుగుచున్నవి. నీ అవధికి అంతమే లేదు. కనుక, నీవు అనంతుడవు.
16.38 (ముప్పది ఎనిమిదవ శ్లోకము)
విషయతృషో నరపశవో య ఉపాసతే విభూతీర్న పరం త్వామ్|
తేషామాశిష ఈశ తదను వినశ్యన్తి యథా రాజకులమ్॥5401॥
పరమేశా! నరపశువులు కేవలము విషయభోగములనే కోరుచుందురు. అట్టివారు నిన్ను భజింపక నీ విభూతులైన ఇంద్రాది దేవతలను ఉపాసింతురు. ప్రభూ! రాజవంశము నశించిన పిమ్మట దాని అనుయాయులైనవారి జీవనోపాధులు గూడ నశించుచుండును. అట్లే క్షుద్రదేవతలతోపాటుగా వారిచ్చిన భోగభాగ్యములుగూడ లుప్తములగును.
16.39 (ముప్పది తొమ్మిదవ శ్లోకము)
కామధియస్త్వయి రచితా న పరమ రోహన్తి యథా కరమ్భబీజాని|
జ్ఞానాత్మన్యగుణమయే గుణగణతోఽస్య ద్వన్ద్వజాలాని॥5402॥
పరమాత్మా! నీవు జ్ఞానస్వరూపుడవు, నిర్గుణుడవు. వేయించిన గింజలు మొలకెత్తనట్లు, నీకు సకామభావముతో సేవలొనర్చినను, అవి ఇతర కర్మలవలె జన్మ మృత్యురూప ఫలములను ఈయ జాలవు. జీవునకు సత్త్వాది గుణములచే సుఖదుఃఖాది ద్వంద్వములు ప్రాప్తించును. నిర్గుణుడవైన నీ వలన కాదు.
16.40 (నలుబదియవ శ్లోకము)
జితమజిత తదా భవతా యదాఽఽహ భాగవతం ధర్మమనవద్యమ్|
నిష్కిఞ్చనా యే మునయ ఆత్మారామా యముపాసతేఽపవర్గాయ॥5403॥
పరమాత్మా! నీవు అపజయమును ఎరుగవు. పవిత్రమైన భాగవతధర్మమును ఉపదేశించిన సమయముననే నీవు అందరిని జయించితివి. ఏ వస్తువునందు అహంకార మమకారములు లేని అకించనులు, ఆత్మారాములు ఐన సనకాది మహర్షులుగూడ మోక్షప్రాప్తికై ఆ భాగవత ధర్మమునే ఆశ్రయించుచున్నారు.
16.41 (నలుబది ఒకటవ శ్లోకము)
విషమమతిర్న యత్ర నృణాం త్వమహమితి మమ తవేతి చ యదన్యత్ర|
విషమధియా రచితో యః స హ్యవిశుద్ధః క్షయిష్ణురధర్మబహుళః॥5404॥
భాగవతధర్మము పవిత్రమైనది. దానిని ఆచరించు వారిలో సకామ భావముగల మనుష్యులలో కలుగు నేను,నాది-నీవు-నీది అను విషమబుద్ధి కలుగదు. అట్లుగాక విషమబుద్ధితో ఆచరించబడు విపరీత ధర్మములు అశుద్ధములు, నాశవంతములు అగును.
16.42 (నలుబది రెండవ శ్లోకము)
కః క్షేమో నిజపరయోః కియానర్థః స్వపరద్రుహా ధర్మేణ|
స్వద్రోహాత్తవ కోపః పరసమ్పీడయా చ తథాధర్మః॥5405॥
నేను-నాదీ అను భావమును గలిగిన ధర్మము పరస్పరముగా ద్రోహబుద్ధిని కలిగించును. అట్టి ధర్మమువలన తనకుగానీ, ఇతరులకు గానీ ఎట్టి మేలు జరుగును? ఏమి ప్రయోజనము చేకూరును? సకామధర్మమును ఆచరించినవాడు, ఆత్మద్రోహమునకు పాల్పడును. అప్పుడు అతడు నీ అనుగ్రహమునకు దూరమైపోవును. అంతేగాక, దానివలన ఇతరుల చిత్తమునకు బాధ కలుగుటచే అది ధర్మముగాక, అధర్మమే అగును.
16.43 (నలుబది మూడవ శ్లోకము)
న వ్యభిచరతి తవేక్షా యయా హ్యభిహితో భాగవతో ధర్మః|
స్థిరచరసత్త్వకదమ్బేష్వపృథగ్ధియో యముపాసతే త్వార్యాః॥5406॥
పరమాత్మా! భాగవతధర్మమును (నిష్కామ భక్తిని) ఉపదేశించు నీ దృష్టి ఎన్నడును పరమాత్మనుండి మానవుని దూరము చేయరు. కనుక, సకల చరాచర ప్రాణులను సమదృష్టితో చూచు సత్పురుషుల ఆ భాగవత ధర్మమునే ఉపాసించుచుందురు.
16.44 (నలుబది నాలుగవ శ్లోకము)
న హి భగవన్నఘటితమిదం త్వద్దర్శనాన్నృణామఖిలపాపక్షయః|
యన్నామ సకృచ్ఛ్రవణాత్పుల్కసకోఽపి విముచ్యతే సంసారాత్॥5407॥
సర్వేశ్వరా! నీ దర్శనమాత్రముననే మానవుల పాపములు అన్నియును పూర్తిగా నశించును, అను మాట అసంభవము కాదు. నీ నామమును ఒక్కసారి విన్నను చండాలుడు గూడ సంసార బంధముల నుండి విముక్తుడగును.
16.45 (నలుబది ఐదవ శ్లోకము)
అథ భగవన్ వయమధునా త్వదవలోకపరిమృష్టాశయమలాః|
సురఋషిణా యదుదితం తావకేన కథమన్యథా భవతి॥5408॥
పరమపురుషా! ఈ సమయమున నీ దర్శనము చేతనే నా అంతఃకరణము నందలి మాలిన్యము అంతయును ప్రక్షాళితమైనది. ఇది వాస్తవము. నీ పరమ భక్తుడైన నారదమహర్షి పలికిన వచనములు ఎన్నటికిని మిథ్య కానేరవు.
16.46 (నలుబది ఆరవ శ్లోకము)
విదితమనన్త సమస్తం తవ జగదాత్మనో జనైరిహాచరితమ్|
విజ్ఞాప్యం పరమగురోః కియదివ సవితురివ ఖద్యోతైః॥5409॥
అనంతా! నీవు సమస్త జగత్తునకును ఆత్మవు. లోకములో జనులు ఆచరించు కర్మలను అన్నింటిని నీవు ఎరుగుదువు. మిణుగురుపురుగు సూర్యుని ప్రకాశింప జాలదు. అట్లే పరమగురుడవైన నీకు నివేదింప గలిగినది ఏముండును?
16.47 (నలుబది ఏడవ శ్లోకము)
నమస్తుభ్యం భగవతే సకలజగ- త్స్థితిలయోదయేశాయ|
దురవసితాత్మగతయే కుయోగినాం భిదా పరమహంసాయ॥5411॥
పరమాత్మా! నీ అధ్యక్షత వలననే జగత్తుయొక్క సృష్టి స్థితి లయములు కలుగుచున్నవి. భేద దృష్టి గల కుయోగులు యథార్థముగా నీ స్వరూపమును ఎరుగజాలరు. నీ వాస్తవస్వరూపము పరమ పవిత్రము. అట్టి నీకు నమస్కారము.
16.48 (నలుబది ఎనిమిదవ శ్లోకము)
యం వై శ్వసన్తమను విశ్వసృజః శ్వసన్తి యం చేకితానమను చిత్తయ ఉచ్చకన్తి|
భూమణ్డలం సర్షపాయతి యస్య మూర్ధ్ని తస్మై నమో భగవతేఽస్తు సహస్రమూర్ధ్నే॥5411॥
*ప్రభూ! నీ నుండీ శక్తిని పొందియే బ్రహ్మాదిలోకపాలురు విశ్వసృష్టిని గావించుటకు సమర్థులు అగుచున్నారు. నీ దృష్టి వలన చైతన్యమును పొందిన జ్ఞానేంద్రియములు ఆయా విషయములను గ్రహింపగలుగు చున్నవి. ఈ భూమండల మంతయును నీ శిరస్సుపై ఆవగింజవలె నిలిచియున్నది. సహస్ర ఫణములుగల సంకర్షణా! నీకు ప్రణామములు".

12.6.2020 ప్రాతః కాల సందేశము
వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం
షష్ఠ స్కంధము - పదునారవ అధ్యాయము
చిత్రకేతువు వైరాగ్యమును పొందుట - సంకర్షణ భగవానుని దర్శంచుట
ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
శ్రీశుక ఉవాచ
16.49 (నలుబది తొమ్మిదవ శ్లోకము)
సంస్తుతో భగవానేవమనన్తస్తమభాషత
విద్యాధరపతిం ప్రీతశ్చిత్రకేతుం కురూద్వహ॥5412॥
శ్రీ శుకుడు వచించెను- రాజా! విద్యాధరులకు అధిపతియైన చిత్రకేతువు ఇట్లు స్తుతింపగా భగవానుడైన అనంతుడు ఆయనయెడ ప్రసన్నుడై ఇట్లు పలికెను.
శ్రీభగవానువాచ
16.50 (ఏబదియవ శ్లోకము)
యన్నారదాఙ్గిరోభ్యాం తే వ్యాహృతం మేఽనుశాసనమ్|
సంసిద్ధోఽసి తయా రాజన్ విద్యయా దర్శనాచ్చ మే॥5413॥
శ్రీ భగవానుడు పలికెను- చిత్రకేతు మహారాజా! దేవర్షియగు నారదుడు, అంగిరసమహర్షి నా విషయమున నీకు చేసిన ఉపదేశము వలనను, నా దర్శనము వలనను నీవు కృతార్థుడవైతివి.
16.51 (ఏబది ఒకటవ శ్లోకము)
అహం వై సర్వభూతాని భూతాత్మా భూతభావనః|
శబ్దబ్రహ్మ పరం బ్రహ్మ మమోభే శాశ్వతీ తనూ॥5414॥
సమస్త ప్రాణుల రూపములూ నేనే. వాటిలోనున్న ఆత్మయు నేనే. వాటిని పాలించువాడను నేనే. శబ్దబ్రహ్మ (వేదము) అందు ప్రతిపాదింపబడిన పరబ్రహ్మయు నా సనాతన రూపములే.
16.52 (ఏబది రెండవ శ్లోకము)
లోకే వితతమాత్మానం లోకం చాత్మని సన్తతమ్|
ఉభయం చ మయా వ్యాప్తం మయి చైవోభయం కృతమ్॥5415॥
ఆత్మ కార్యకారణాత్మకమగు జగత్తునందు వ్యాపించియున్నది. కార్యకారణాత్మకమగు జగత్తు ఆత్మయందు యున్నది. ఈ రెండింటియందును నేనే అధిష్ఠాన రూపమున వ్యాపించి యున్నాను. నాయందే ఈ రెండును కల్పితములై యున్నవి.
16.53 (ఏబది మూడవ శ్లోకము)
యథా సుషుప్తః పురుషో విశ్వం పశ్యతి చాత్మని|
ఆత్మానమేకదేశస్థం మన్యతే స్వప్న ఉత్థితః॥5416॥
16.54 (ఏబది నాలుగవ శ్లోకము)
ఏవం జాగరణాదీని జీవస్థానాని చాత్మనః|
మాయామాత్రాణి విజ్ఞాయ తద్ద్రష్టారం పరం స్మరేత్॥5417॥
నిద్రించుచున్న వ్యక్తి స్వప్నములో సకల జగత్తును తనలోనే చూచును. నిద్రనుండి లేచిన పిదప తాను ఒక ప్రదేశములో ఉన్నట్లు తెలిసికొనును. కాని, వాస్తవముగా అదిగూడ (జాగ్రదావస్దలో గూడ) స్వప్నసదృశమే. జీవుని యొక్క జాగ్రదాది అవస్థలు పరమేశ్వరుని మాయయే. ఈ విషయమును గ్రహించి, సర్వసాక్షియు, మాయాతీతుడును ఐన పరమాత్మను స్మరింపవలెను.
16.55 (ఏబది ఐదవ శ్లోకము)
యేన ప్రసుప్తః పురుషః స్వాపం వేదాత్మనస్తదా|
సుఖం చ నిర్గుణం బ్రహ్మ తమాత్మానమవేహి మామ్॥5418॥
నిద్రించుచున్న పురుషుడు ఆత్మ సహాయమువలననే ఆ నిద్రలోని ఇంద్రియాతీత సుఖమును అనుభవించు చున్నాడు. ఆ పరబ్రహ్మను నేనే. దానినే నీ ఆత్మగా తెలిసికొనుము.
16.55 (ఏబది ఆరవ శ్లోకము)
ఉభయం స్మరతః పుంసః ప్రస్వాపప్రతిబోధయోః|
అన్వేతి వ్యతిరిచ్యేత తజ్జ్ఞానం బ్రహ్మ తత్పరమ్॥5419॥
పురుషుడు జాగ్రదవస్థను, నిద్రావస్థను తెలిసికొనును. ఈ రెండు అవస్థలకు అనుగతమైనవాడు, అతీతమైనవాడు ఆత్మయే. అతడే జ్ఞానస్వరూపుడు. అతడే పరబ్రహ్మము.
16.57 (ఏబది ఏడవ శ్లోకము)
యదేతద్విస్మృతం పుంసో మద్భావం భిన్నమాత్మనః|
తతః సంసార ఏతస్య దేహాద్దేహో మృతేర్మృతిః॥5420॥
జీవుడు తన ఆత్మ స్వరూపుడనైన నన్ను విస్మరించినపుడు తనను తాను వేరుగా భావించుకొనును. అందువలన అతడు సంసార చక్రములో పడవలసి వచ్చును. అప్పుడు అతనికి జన్మపరంపరలు, మృత్యు పరంపరలు తప్పవు.
16.58 (ఏబది ఎనిమిదవ శ్లోకము)
లబ్ధ్వేహ మానుషీం యోనిం జ్ఞానవిజ్ఞానసమ్భవామ్|
ఆత్మానం యో న బుద్ధ్యేత న క్వచిత్క్షేమమాప్నుయాత్॥5422॥
జీవుడు మానవజన్మయందే జ్ఞాన విజ్ఞానములను పొందుటకు వీలగును.అట్టి మానవజన్మను పొందియు ఆత్మస్వరూపుడైన పరమాత్మను తెలిసికొననిచో, ఆ జీవునకు వేరే ఏ జన్మయందును శాంతి లభింపదు.
16.59 (ఏబది తొమ్మిదవ శ్లోకము)
స్మృత్వేహాయాం పరిక్లేశం తతః ఫలవిపర్యయమ్|
అభయం చాప్యనీహాయాం సఙ్కల్పాద్విరమేత్కవిః॥5422॥
రాజా! సాంసారిక సుఖములకై చేయు చేష్టలవలన శ్రమకలుగుటయే గాక, క్లేశములు గూడ ప్రాప్తించును. సుఖము కొరకు చేయబడు కర్మల వలన దానికి విరుద్ధమైన పరమ దుఃఖములే ప్రాప్తించును. కాని, కర్మల నుండి నివృత్తుడగుటవలన ఏ విధమైన భయమూ ఉండదని భావించు బుద్ధిమంతుడు ఏవిధమైన కర్మలను , వాటి ఫలములను సంకల్పింపరాదు.
16.60 (అరువదియవ శ్లోకము)
సుఖాయ దుఃఖమోక్షాయ కుర్వాతే దమ్పతీ క్రియాః|
తతోఽనివృత్తిరప్రాప్తిర్దుఃఖస్య చ సుఖస్య చ॥5423॥
జగత్తునందు స్త్రీలు, పురుషులు సుఖము ప్రాప్తించుటకును, దుఃఖములు తొలగుటకొరకును కర్మలు చేయుచుందురు. కాని, అట్టి కర్మలవలన వారి దుఃఖములు తొలగవు సరిగదా! సుఖము లభింపదు.
16.61 (అరువది ఒకటవ శ్లోకము)
ఏవం విపర్యయం బుద్ధ్వా నృణాం విజ్ఞాభిమానినామ్|
ఆత్మనశ్చ గతిం సూక్ష్మాం స్థానత్రయవిలక్షణామ్॥5424॥
16.62 (అరువది రెండవ శ్లోకము)
దృష్టశ్రుతాభిర్మాత్రాభిర్నిర్ముక్తః స్వేన తేజసా|
జ్ఞానవిజ్ఞానసన్తుష్టో మద్భక్తః పురుషో భవేత్॥5425॥
మానవుడు తాను గొప్ప బుద్ధిమంతుడనని భావించుచు కర్మజాలమునందు చిక్కుపడియున్నాడు. కాని, వాటికి విపరీత ఫలములను పొందుచున్నాడు. ఈ విషయమును అతడు బాగుగా గ్రహింపవలెను. అంతేగాదు, ఆత్మస్వరూపము అత్యంత సూక్ష్మమని గమనింపవలెను. జాగ్రత్, స్వప్న, సుషుప్తి అను మూడు అవస్థలను ప్రకాశింపజేయునది ఆత్మయేయైనను, అది వాటికంటెను విలక్షణమైనది. ఈ విషయమును తెలిసికొని, ఈ లోకములో చూచినవి, పరలోకమునందు ప్రాప్తించునని వినిన విషయ భోగములను తన వివేకము ద్వారా విడువవలెను. జ్ఞాన విజ్ఞానముల యందు సంతుష్టుడై అతడు నా యందు భక్తిని కలిగి యుండవలెను.
16.63 (అరువది మూడవ శ్లోకము)
ఏతావానేవ మనుజైర్యోగనైపుణ్యబుద్ధిభిః|
స్వార్థః సర్వాత్మనా జ్ఞేయో యత్పరాత్మైకదర్శనమ్॥5426॥
మానవుడు బుద్ధినైపుణ్యము ద్వారా యోగమార్గము యొక్క తత్త్వమును తెలిసికొనవలెను. తద్ద్వారా పరబ్రహ్మయే ఆత్మరూపముగా ఉన్నదని, దాని ఏకత్వమును అనుభవించుటకు సర్వవిధముల ప్రయత్నింపవలెను. ఇదియే అన్నింటికంటె మిన్నయైన స్వార్ధము మరియు పరమార్థము లేదా పురుషార్థము అని చక్కగా గుర్తించవలెను.
16.64 (అరువది నాలుగవ శ్లోకము)
త్వమేతచ్ఛ్రద్ధయా రాజన్నప్రమత్తో వచో మమ|
జ్ఞానవిజ్ఞానసమ్పన్నో ధారయన్నాశు సిధ్యసి॥5427॥
చిత్రకేతు మహారాజా! నా ఈ ఉపదేశమును సావధానుడవై భక్తి శ్రద్ధలతో ఆచరించినచో, జ్ఞాన విజ్ఞాన సంపన్నుడవై అనగా ఆత్మజ్ఞానమును, ఆత్మానుభవమును శీఘ్రముగా పొంది, జీవన్ముక్తుడవు కాగలవు.
శ్రీశుక ఉవాచ
16.65 (అరువది ఐదవ శ్లోకము)
ఆశ్వాస్య భగవానిత్థం చిత్రకేతుం జగద్గురుః|
పశ్యతస్తస్య విశ్వాత్మా తతశ్చాన్తర్దధే హరిః॥5428॥
శ్రీ శుకుడు పలికెను - రాజా! జగద్గురువు, విశ్వాత్ముడు ఐన శ్రీహరి చిత్ర కేతువునకు ఈ విధముగా నచ్చ జెప్పెను. పిమ్మట అతడు చూచుచుండగనే ఆ భగవానుడు అంతర్హితుడయ్యెను.
ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం షష్ఠస్కంధే షోడశోఽధ్యాయః (16)
ఇది శ్రీమద్భాగవత మహాపురాణమునందలి షష్ఠ స్కంధమునందు పదునారవ అధ్యాయము (16)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
No comments:
Post a Comment