Monday, 6 April 2026

 🔹 901. వ్యాధిశ

“వ్యాధిశ” అంటే —👉 వ్యాధుల అధిపతి (వ్యాధులపై అధికారం కలవాడు)👉 రోగాలను నియంత్రించేవాడు / నివారించేవాడు👉 శరీర, మనో, కర్మజ వ్యాధులను సమతుల్యం చేసేవాడు

వ్యాధిశ జీవనంబుకళ వ్యాపిక దుఃఖము సంత తంబుగన్

సాధన శుద్ధచిత్తకళ శాంతిగ మార్గము చూపులేయగున్

ఆధి నివారణంబగుట ఆత్మల జ్ఞానము ముఖ్యమేయగున్

వ్యాధికి శాంతి సౌఖ్యమును వాంఛల తోదయ నిత్య సత్యమున్

🔹 సరళ భావం:జీవితంలో వ్యాధులు (బాధలు) ఎప్పటికప్పుడు కలుగుతూ మనకు దుఃఖాన్ని ఇస్తాయి.కానీ శుద్ధమైన మనస్సుతో సాధన చేస్తే శాంతి దారి కనిపిస్తుంది.మనసులో ఉన్న ఆందోళనలు (ఆధి) తొలగాలంటే ఆత్మజ్ఞానం చాలా ముఖ్యము.అప్పుడు వ్యాధులు తగ్గి, శాంతి–సౌఖ్యం కలిగి, మన మంచి కోరికలు నెరవేరుతాయి. 🙏

*****

902.దిశ 

దిశ వసుధదిక్కగు జ్ఞాన జీవనంబు

సదిశ విలువ సరయుకాల సత్య వాక్కు

అదిశ గాను విచలితగా ఆత్మ సాగు

నిదిశ స్థిరశాంతి దుఃఖము నిశ్చ లంబు

🔹 సరళ భావం:జ్ఞానం మన జీవనానికి దిక్కుగా (మార్గదర్శిగా) ఉంటుంది.సరైన సమయంలో చెప్పే సత్యవాక్కు జీవితం విలువను పెంచుతుంది.దిశ తప్పితే మనసు చంచలంగా మారి జీవితం అస్థిరంగా సాగుతుంది.సరైన దిశలో నడిస్తే మనసుకు స్థిరత్వం, శాంతి వచ్చి దుఃఖం తొలగుతుంది. 🙏

*****

903..అనాది.. సమస్తమునకు కారణమైనవాడు 


అనాది కర్మ సిద్ధిగాను ఆశ్రితామనస్సుగన్ 

క్షణాల విద్య లన్ని జూడ కాలదాహమేయగున్ 

రుణాల మోహదాహమౌను రుద్రతాండవంబుగన్ 

గుణాలు మారుచుండ తీరు గుప్త వాక్కు మాయగన్ 

🔹 సరళ భావం:ఆదిలేని పరమతత్త్వం వల్లే కర్మలు జరుగుతాయి, మనస్సు కూడా దాని ఆధీనంలో ఉంటుంది.కాలం వేగంగా గడుస్తూ మన జీవితం నశ్వరమని తెలియజేస్తుంది.మోహం, రుణబంధాలు మనలను బాధల్లోకి నెడతాయి — అది రుద్రతాండవంలా కఠినంగా ఉంటుంది.గుణాలు మారుతూ ఉంటాయి; జీవితం లోని మాటలు, సంఘటనలు ఒక గూఢమైన మాయలాగా అనిపిస్తాయి. 🙏

🔹...

904. భూర్భువ — భావం

భూ (భూర్ః)భౌతిక లోకం – భూమి, స్థూల జగత్తు, మనం అనుభవించే ప్రాప్త ప్రపంచం.

భువః

ప్రాణమయ, మధ్య లోకం – జీవశక్తి, మనస్సు, ప్రాణచలనం ఉన్న స్థితి.

(సంపూర్ణ రూపంలో) స్వః

దివ్య లోకం – జ్ఞానం, ఆత్మతత్త్వం, దైవ చైతన్యం.

తాత్విక వివరణ

“భూర్భువ” అనే భావం సృష్టి మూడు స్థాయిలను సూచిస్తుంది:

స్థూలం – భౌతిక ప్రపంచం

సూక్ష్మం – ప్రాణం, మనస్సు

కారణం – దైవ చైతన్యం

ఈ మూడు స్థాయిలలో కూడా పరమాత్మ వ్యాపించి ఉన్నాడనే భావాన్ని ఇది సూచిస్తుంది. అందుకే గాయత్రి మంత్రంలో మొదట “భూర్భువః స్వః” అని పలుకుతారు.

పద్యం 

భూర్భువ లోకకాలమగు భూత నినాదము సర్వ మంగళమ్

భూర్భువ భావగర్భమున భుక్తి సయుక్తియు శక్తి తత్త్వమున్

భూర్భువ జీవజాలము సజ్యోతుల కాంతిగ రూప భాస్వరం

భూర్భువ దివ్యమై పలుకు భూతల తృప్తియు దేవ దేవగన్

భావ వివరణ

భూ–భువ లోకాల కాలచక్రంలో వినిపించే ప్రాథమిక నాదం (సృష్టి ధ్వని) సర్వ మంగళకరమైనది.

భూ–భువ స్థితుల గర్భంలో భోగం (భుక్తి), శక్తి, తత్త్వజ్ఞానం అన్నీ కలసి ఉన్నాయి.

ఈ భూ–భువ లోకాలలోని సమస్త జీవజాలం దివ్య జ్యోతి కాంతితో ప్రకాశించే రూపమే.

ఈ భూర్భువ తత్త్వాన్ని గ్రహించి పలికితే భూమిపై తృప్తి లభించి, అది దేవదేవుని మహిమగా అనుభూతమవుతుంది.

భూ–భువ లోకాలలో వ్యాపించిన దివ్య నాదం, శక్తి, జ్యోతి—all ఇవే సృష్టి మూలాలు. వాటిని గ్రహించిన జీవి భూమిపై తృప్తి పొందుతూ దైవత్వాన్ని అనుభవిస్తాడు.

****

905. లక్ష్మీ ::


శ్రీ లక్ష్మీ సహభాగ్యసంపదలుగన్ శ్రీ కాంతి దివ్యంబుగన్

శ్రీ లక్ష్మీ చలనంబులేనివిధిగాన్ శ్రీ చిత్త శ్రీ ధన్యతన్

శ్రీ లక్ష్మీ విలువల్ సుశాంతి గనుగన్ శ్రీ తత్వ సౌభాగ్యతన్

శ్రీ లక్ష్మీస్మరణంబునిత్యమగుటన్ శ్రీ చక్ర మోక్షత్వమున్

🌸 పద్య భావ వివరణ..లక్ష్మీ అనేది కేవలం ధనం కాదు —సహభాగ్యంగా (పంచుకునే సంపదగా)👉 దివ్య కాంతిగా వెలిగే శుభశక్తి.🔹 లక్ష్మీ స్థిరంగా ఉండేది ఎక్కడంటే —చంచలత లేని మనస్సులో (నిశ్చల చిత్తంలో)👉 అక్కడే నిజమైన “శ్రీ ధన్యం” (అంతరంగ సంపద) ఉంటుంది.🔹 లక్ష్మీ యొక్క అసలైన విలువ:సుశాంతి (లోతైన ప్రశాంతత) అదే నిజమైన సౌభాగ్యం (తాత్త్విక సంపద).🔹 లక్ష్మీ స్మరణ నిరంతరం ఉంటే అది శ్రీచక్ర తత్త్వానుభూతికి దారి తీస్తుంది చివరికి మోక్షస్వరూపాన్ని అందిస్తుంది.

******

906.సువీర..ధైర్యం సౌర్యం ధర్మ బలముకలవాడు 


సువీర ధర్మతత్త్వమాయ సూత్రదారి సౌర్యతన్ 

ప్రవీన మార్గ హృద్యలక్ష్య ప్రాభవంబు ధీరతన్ 

నవీన విద్యలన్నితీర్పు నమ్మ కంబుసఖ్యతన్ 

వివేక వర్ధనంబుగాను విశ్వమందు సేవగన్ 

🌺 పద్య భావ వివరణ..👉 సువీరుడు అనగా ధర్మతత్త్వాన్ని అర్థం చేసుకుని👉 దానిని ఆచరణలో నడిపించే సూత్రధారి.👉 అతని శౌర్యం కేవలం శక్తి కాదు — ధర్మాధిష్ఠితమైనది.🔹 అనుభవంతో కూడిన మార్గం ఎంచుకొని👉 హృదయానికి హితమైన లక్ష్యాన్ని సాధించడంలో👉 అతని ధైర్యం (ధీరత్వం) ప్రతిఫలిస్తుంది.🔹 కొత్త జ్ఞానాలను అంగీకరించి, అవగాహనతో తీర్పు చెప్పగలడు👉 నమ్మకంతో, స్నేహంతో సమాజంతో మమేకమవుతాడు.🔹 తన వివేకాన్ని పెంపొందించుకుంటూ..ప్రపంచానికి సేవ చేయడం అతని ప్రధాన ధ్యేయం.

******

907 రుచిరాంగద.. మంగళకరమైన బాహుపురులు కలవాడు 


రుచిరాంగద బాసుర శోభనగన్

అచలం సుచిరం సహ సాధనగన్

స్వచ ధర్మపరాత్పర ఆత్మ బలమ్

వచనం భవరమ్య వరాల గనున్

🌺 పద్య భావ వివరణ..🔹 రుచిరమైన ఆంగదాలు (బాహుపురాలు) ధరించినవాడు👉 ప్రకాశమానమైన శోభతో వెలుగుతాడు➡️ ఇది బాహ్య సౌందర్యం + అంతరంగ కాంతి సూచన.🔹  అతని స్వభావం అచలమైనది (స్థిరత్వం)👉 సుదీర్ఘ సాధనతో కూడినది➡️ దీక్ష, నిశ్చలత, సాధనశక్తి.🔹  స్వచ్ఛమైన ధర్మంలో పరమమైన స్థితి👉 అంతరంగ ఆత్మబలం కలిగినవాడు➡️ శుద్ధ ధర్మం + ఆత్మవిశ్వాసం.*అతని మాటలు మధురంగా, శుభప్రదంగా ఉంటాయి👉 అవి వరాల్లా అనుభూతి కలిగిస్తాయి

*****

908..జనన.. ప్రాణులను ఉత్పత్తి చేయువాడు 

జనన తత్వ విభాసుగన్ జయ జాడ్యవిద్యలమాయగన్

ప్రణవ సృష్టిగ చక్రమున్ సుమ పాశ మార్గశుభంబుగన్

మనన జీవన నాన్యతన్ కళ మాన శోభలతీరుగన్

గుణము గమ్యము ధర్మమై విధి గుప్త విద్య లతీరుగన్

🌺 పద్య భావ వివరణ🔹 జనన తత్త్వం ప్రకాశమానమైనది👉 అది అజ్ఞానం (జాడ్యం) మరియు మాయలను జయించగల శక్తి➡️ సృష్టి తత్త్వం = జ్ఞానోదయం.🔹 ఓం” (ప్రణవం) ద్వారా సృష్టి చక్రం ఆవిర్భవిస్తుంది👉 అది పాశబంధాలను కూడా శుభమార్గంగా మార్చుతుంది➡️ ప్రణవం = సృష్టి మూలం + బంధమును మోక్ష మార్గంగా మార్చేది.🔹  మననం (ధ్యానం) ద్వారా జీవితం ఏకత్వాన్ని గ్రహిస్తుంది👉 అప్పుడు కళాత్మకమైన శోభ, సమతా భావం ఉద్భవిస్తాయి➡️ ధ్యానం → ఏకత్వ అనుభూతి → జీవన సౌందర్యం.🔹  గుణాలు, గమ్యం అన్నీ ధర్మమే అవుతాయి👉 విధి (దైవ సంకల్పం) ఒక గూఢ విద్యగా అవగతమవుతుంది➡️ ధర్మమే జీవన మార్గం, దైవ చిత్తమే అంతరంగ రహస్యం.

*****

909..జనజన్మాది... జన్మకు మూలకరణమైనవాడు 

🌼 పద్యం

జనజన్మాదిపరాత్పరాకరుణ గన్ సామాన్య తత్త్వంబుగన్

మనమున్ మాయల బంధమార్గములుగాన్ మాధుర్య తానిత్యమున్

ధనమున్ ధర్మము దాటి తత్త్వమగుటన్ ధ్యానమ్ము గా జేరగన్

గుణ చిత్తమ్మగు నిశ్చలత్వమగుటన్ సూన్యంబు వైనంబుగన్

🔹 పాదార్థ విశ్లేషణ...1️⃣సర్వ జన్మలకు మూలమైన, పరమాతీతమైన, కరుణామయమైన బ్రహ్మతత్త్వం అన్ని జీవుల్లో సమానంగా వ్యాపించి ఉందిమనసు మాయాబంధాలలో తిరుగుతున్నప్పటికీ, లోపల ఆ పరమతత్త్వ మాధుర్యం ఎల్లప్పుడూ ఉంటుంది.ధనం, ధర్మం వంటి పరిమితులను దాటి, ధ్యానం ద్వారా పరమతత్త్వాన్ని అనుభవించాలి. మనసు గుణములతో శుద్ధమై నిశ్చలమైతే, అది శూన్యత్వం (అహంకార రహిత బ్రహ్మస్థితి)లో లీనమవుతుంది.

*****

910. భీమ


భీమ భీకర దుష్టశిక్షణ భేదకంబగు తేజమున్

సామ సద్గుణ ప్రేరనంబగు సత్య మార్గము ధాత్రిగన్

కామ క్రోధము మోహతత్త్వము కర్మబంధము చీల్చగన్

శ్వామధర్మము రూప బ్రహ్మము శాంతి చిత్తము మందుగన్

దైవం భయంకర స్వరూపంగా కనిపించినా, అది మనలోని దుష్ట గుణాలను తొలగించేందుకు ఉన్న శుద్ధి శక్తి.భీమ స్వరూపం కేవలం భయం కాదు — అది శాంతిని, సద్గుణాలను పెంపొందించి సత్య మార్గంలో నడిపిస్తుంది.ఈ దైవశక్తి మనలోని ఆరాటాలు, కోపం, మోహం వంటి బంధాలను ఛేదించి విముక్తి దారి చూపుతుంది.స్వరూప ధర్మం / ఆత్మస్వభావంబ్రహ్మము → పరమసత్యంశాంతి చిత్తము → నిశ్చలమైన మనస్సు

*******

911 భీమ పరాక్రమ..


భీమ పరాక్రమంబగుట భీకర యుద్ధ  వినాశకున్ విదే 

ధామమునందు ధైర్యముగ ధర్మసు రక్షణ దీక్షగన్ సుధీ

కామమనస్సు క్రోధముగను కల్మష బుద్దిగ యేల జీవనమ్

ప్రేమయనేదిలేసమగు ప్రీతియు మాత్రము నిత్య కాంక్షగన్

🔹 సరళ భావం:👉 భీమ పరాక్రముడు అంటే భయంకరమైన శక్తితో దుష్టులను సంహరించేవాడు.👉 ఆయన ధైర్యంగా ధర్మాన్ని కాపాడే సంకల్పంతో ఉన్న జ్ఞాని.👉 మనిషి కామం, క్రోధం వల్ల కలుషితమైన బుద్ధితో జీవిస్తుంటాడు.👉 కానీ ప్రేమ, ప్రీతి మాత్రమే శాశ్వతంగా కోరదగినవిగా ఉంటాయి.

912.ఆధార నిలయ.


ఆరోగ్యంబాధార నిలయ సహనంబేనున్ 

సారూప్యంమూలంబు మలుపు వ్యసనంబేనున్ 

ధారుడ్యంబున్ జీవ గమన కధనం గానున్ 

ప్రేరత్వంప్రాబల్య భవము తపమున్ నిత్యమ్ 

🔹 సరళ భావం:👉 ఆరోగ్యం జీవనానికి ప్రధాన ఆధారం; దానిని నిలబెట్టేది సహనం.👉 మన స్వభావానికి మూలం మన అలవాట్లు (వ్యసనాలు); అవే జీవిత దిశను మలుస్తాయి.👉 ధైర్యం (ధారుడ్యం) ఉంటేనే జీవితం సరిగా సాగుతుంది.👉 ప్రేరణ, ఆత్మబలం, తపస్సు — ఇవే జీవనాన్ని ఉన్నతంగా నడిపే శక్తులు.

*****

913..దాత..

దాత ధర్మము జీవమార్గము ధ్యాన తత్త్వము నిత్యమున్ 

ఖ్యాతి కాంక్షలు లేని జీవన కర్మ వైనము సత్యమున్ 

నీతి సర్వమనస్సుగా గతి నీడ తీరున సేవగన్ 

రాత బట్టియు కాల నిర్ణయ రమ్యతా భవ నేస్తమున్ 

🔹 సరళ భావం:👉 దానం చేయడం ధర్మమార్గం; అది ధ్యాన తత్త్వంతో నిత్యంగా అనుసరించాలి.👉 పేరు, ఖ్యాతి ఆశించకుండా చేసే సేవే నిజమైన కర్మ.👉 నీతి మనసులో నిండితే, సేవ జీవన మార్గంగా మారుతుంది.👉 కాలం నిర్ణయించిన విధిని సంతోషంగా స్వీకరించడం జీవన సౌందర్యం.

****

914. పుష్ప హాస..

పుష్పహాస సమర్ధ యుక్త సపూజ్య తాభవ కల్పనా 

పుష్ప మాల శుభంబు తీరుగ సూత్ర సఖ్యత నిల్పునే 

పుష్ప వాసన మోహ తన్మయ మూల మావ్వగ మార్పుగన్ 

పుష్ప హృద్యము తాక మర్మము పూజ్య భావము తృప్తిగన్ 

🔹 సరళ భావం:👉 పువ్వు వికసించడం (పుష్పహాసం) అనేది ఒక పవిత్రమైన, ఆరాధనీయమైన దైవ కల్పన.👉 పూలమాలగా గుచ్చితే పువ్వులు కలిసినట్లే, జీవితం కూడా సంబంధాలతో అందంగా మారుతుంది.👉 పుష్ప పరిమళం మనసును ఆకర్షించినట్లే, మంచితనం మనిషిని మారుస్తుంది.👉 పువ్వు హృదయాన్ని తాకినప్పుడు కలిగే ఆనందం, పూజ్యమైన భావంతో తృప్తిని ఇస్తుంది.

*****

915.ప్రజాగర: నిత్య జ్ఞాన స్వరూపుడే చక్కగా మేల్కొని ఉండు వాడు 

స జ స స స లగ.. 8

గుణము ప్రజాగరశుభోదయ ధర్మముగానులే

రణమే ఫలంబుకొరకకై జరిగే మరణంబులే

మనమే సమమ్ము సమయోగ్యత భావముగానులే

గణమే వికాస యుగ ధర్మముగాప్రభవంబులే

🔹 సరళ భావం:👉 జాగరూకత (ప్రజాగర) మంచి గుణంగా, శుభమైన జీవన ధర్మంగా ఉంటుంది.👉 లోకంలో పోరాటాలు ఫలితాల కోసం జరుగుతాయి; అవి మరణాలకు దారి తీస్తాయి.👉 మనుషులందరూ సమానమే; సమత్వ భావమే నిజమైన యోగ్యత.👉 సమూహ శక్తి (గణం) ద్వారానే అభివృద్ధి, యుగధర్మం సాధ్యమవుతుంది.

*****

916. ఊర్ద్వగ.. అందరికన్నా పైన ఉన్నవాడు.

ఊర్ద్వగ జన్మ సార్ధక సముఖ్యత లక్ష్యపు ధారిగాయగున్

ప్రార్ద్వగ సర్వమంగళనుపాయ సమర్ధత ధర్మ యుక్తిగన్

మార్ద్వగ దుష్టశిక్షణ సుమార్గమునిత్యము సత్య విద్యగన్

సార్ద్వగ విశ్వకామ్యమగు సాక్షి మనోభవ కాల నిర్ణయమ్

🔹 సరళ భావం👉 ఉన్నత లక్ష్యాన్ని ఆశ్రయించినవాడి జన్మ సార్థకమవుతుంది.👉 అతను సమస్త మంగళానికి కారణమై, ధర్మంతో సమర్థంగా నడుచుకుంటాడు.👉 దుష్టులను శిక్షించి, సత్యమార్గంలో నడిపించే జ్ఞానం కలవాడు.👉 సమస్త లోకానికి ఇష్టమైన సాక్షిగా, కాలం–మనస్సు నిర్ణయాలను నియంత్రించేవాడు.

******

917. సత్పదాచార :

సత్పదాచారసాధ్యా పదా సత్యమున్ 

సత్పదాచారసామీప్య సామాన్యమున్ 

సత్పదాచార సారూప్య సత్భావమున్ 

సత్పదాచార సంఘంబు ప్రేమంబుగన్ 

🌿 సరళ భావం..👉 మంచి మార్గంలో (సత్పదాచారం) నడిచేవారుసత్యాన్ని చేరుకుంటారు.👉 ఆ మంచి మార్గానికి దగ్గరగా ఉండటంప్రతి మనిషికీ సాధ్యమే.👉 ఆ మార్గాన్ని అనుసరించేవారిలోమంచి భావాలు సహజంగా వస్తాయి.👉 అలాంటి మంచి మనుషులు కలిసే చోటప్రేమే ప్రధానంగా ఉంటుంది.

*****

: 918. ప్రాణద: మృతులను కూడా బ్రతికించువాడు 


ప్రాణద మృత్యునేస్తమగు పాశము మాయల మార్చ యుక్తిగన్ 

జ్ఞానద ధర్మతత్త్వమును జాగృతి తీరుగ సేవభావమున్ 

మానస ఘోర తాపములు మార్చ ఉషస్సుగ కాల తీరుగన్ 

ప్రాణద యజ్ఞయాగములు పాలన తీరుగ విశ్వ మందునన్ 

🌿 సరళ భావం 

👉 ప్రాణదుడు (దైవం) మృత్యువు వేసే పాశాన్ని కూడాతన మాయతో మార్చి రక్షించగలడు.

👉 అతడు జ్ఞానం ఇచ్చి, ధర్మ మార్గం చూపించి,

మనలో జాగృతి (తెలివి, అవగాహన) కలిగిస్తాడు.

అది సేవాభావంగా మారుతుంది.

👉 మనసులో ఉన్న బాధలు, కష్టాలు అన్నీ

ఉషస్సు (ఉదయం వెలుగు) వచ్చినట్లు తొలగిపోతాయి.

👉 ప్రాణదుడు యజ్ఞాలు, యాగాలు, ధర్మకార్యాల ద్వారాఈ ప్రపంచాన్ని నియంత్రిస్తూ, కాపాడుతూ ఉంటాడు.

*****

 919.ప్రణవ ::ఓంఓం” =సృష్టికి మూలంమనసుకు శాంతిబంధ విమోచనంమౌనానుభవ తత్త్వంసత్యానికి మార్గదర్శి

ప్రణవ నాదము సర్వముందున రమ్యతా భవ సాక్షిగన్

ప్రణవ జ్ఞానము చిత్తశాంతిగ పాశ బంధ మహత్త్యమున్

ప్రణవ తత్త్వము పూర్ణరూపము పాఠ్య మౌను సమర్ధతన్

ప్రణవ బ్రహ్మము సత్యసాధన రక్షసారము మూలమున్

👉 

“ఓం” నాదమే ఈ జగత్తుకు ముందున్నది.అది సర్వసృష్టికి ఆనంద స్వరూప సాక్షి.👉 ప్రణవ జ్ఞానం మనసుకు శాంతిని ఇస్తుంది.జీవితంలోని బంధనాలను (పాశాలను) విడదీయగల శక్తి.👉 ప్రణవ తత్త్వం పరిపూర్ణమైనది.దాన్ని మాటలతో పూర్తిగా చెప్పలేము —మౌనం ద్వారానే గ్రహించగలిగేది.👉 ప్రణవమే బ్రహ్మ స్వరూపం.అది సత్యాన్ని సాధించేందుకు రక్షకమైన మూలతత్త్వం.

*****

 920. పణ: వ్యవహారము సలుపు వాడు 

🌿 920. పణ: (పద్యం)

పణవిధానము లోకసత్యము పాలనత్వము సూత్రమున్

పణ పరస్పర బంధ ధర్మము పాఠ్య మేయగు విశ్వమున్ 

పణ వివేకము న్యాయ మార్గ ము పావనoబగు దర్శకున్

పణవ జీవన నిర్వమూలము కాల నిర్ణయ మార్గమున్

👉 ఈ లోకంలో జరిగే అన్ని వ్యవహారాలేప్రపంచం నడిచే మూల సూత్రం.👉 మనుషుల మధ్య సంబంధాలు అన్నీఈ వ్యవహార ధర్మంపైనే ఆధారపడి ఉంటాయి.ఇది ప్రపంచానికి ఒక పాఠంలాంటిది.👉 సరైన వ్యవహారం అంటే వివేకంతో, న్యాయంతో ఉండాలి.అది మనకు సరైన మార్గాన్ని చూపిస్తుంది.👉 వ్యవహారమే జీవితాన్ని నడిపించే మూలం.సమయానికి తగినట్లు నిర్ణయాలు తీసుకోవడం కూడాఈ వ్యవహార జ్ఞానంపైనే ఆధారపడి ఉంటుంది.

*****

921.ప్రమాణమ్.. రహస్యమైనది విశ్వాసము కలిగించు

పద్యము:
ప్రమాణమ్ స్వానుభవకాల ప్రయాణ మేనున్
సమానమ్ హృద్యకళ గాను ప్రధాన మేనున్
తమాయా మర్మము కలౌను తమంత మేనున్
జమాన తత్త్వము యిదేను జయంబు గానున్
భావ వివరణ
మనిషి జీవితంలో నిజమైన ప్రమాణం (సత్యానికి కొలమానం) బయటివారి మాటలు కాదు; తన స్వానుభవం మరియు కాలప్రయాణం. కాలం గడుస్తూ అనుభవాలు మనకు నిజాన్ని నేర్పుతాయి. మనసుకు హృదయానికి హత్తుకునే కళ, సాహిత్యం, సద్భావం—ఇవి సమానత్వాన్ని కలిగిస్తాయి. అవే మనిషి జీవనంలో ప్రధానమైన విలువల
మాయ, అహంకారం, స్వార్థం—ఇవి మనిషి లోపలే దాగి ఉంటాయి. వాటి మర్మం తెలిసినవాడు తనను తాను అర్థం చేసుకుంటాడు.కాలానికి అనుగుణంగా జీవన తత్వాన్ని గ్రహించినవాడే నిజమైన విజయాన్ని పొందుతాడు. ఇదే యుగధర్మం.
-*****
922..ప్రాణ నిలయ

యాగము యోగ్య ప్రాణ నిలయా మది సర్వము నిత్య సత్యమున్
రాగము తత్వ ప్రాణమయ రమ్యత కూర్ఛ వినమ్రతాయగున్
భాగము విశ్వమాయలుగ బాధ్యత బంధము మోహ తాపమున్
ఈ గణ విద్య ప్రాణ గతి యీశ్వర కల్పన కాల నిర్ణయమ్
మన జీవితం ఒక యాగంలా భావించాలి. మన ప్రాణమే యాగస్థానం, మనస్సు దానికి కేంద్రం. ఈ జీవన యాగంలో నిత్యసత్యాన్ని గ్రహించడమే ముఖ్య లక్ష్యం అని భావం.
జీవితంలో ఉన్న రాగాలు (ఆసక్తులు, అనుభూతులు) తత్వజ్ఞానంతో సమన్వయమైతే జీవితం అందంగా మారుతుంది. ఆ అందం చివరికి **వినమ్రత (నమ్రత)**గా వ్యక్తమవుతుంది.
ఈ ప్రపంచంలో మనకు లభించే పాత్రలు అన్నీ మాయల భాగాలే. బాధ్యతలు, బంధాలు, మోహాలు ఇవన్నీ జీవన తాపాన్ని కలిగించే అంశాలు అని సూచన.
ఈ సమస్త వ్యవస్థ—జీవ గతి, జ్ఞానం, అనుభవం—అన్నీ ఈశ్వర సంకల్పంతో కాల నిర్ణయం ప్రకారం నడుస్తాయి అనే తాత్విక భావం.
*******
923..ప్రాణభృత్.. ప్రాణాన్ని బ్రతికించటానికి అన్నం పెట్టేవాడు

ప్రాణభృత్ హృద్యమై పాలనా యన్నమై
మానభృత్ విద్యయై మార్గ సాధ్యావిధీ
గాన భృత్ తెల్గుగా గమ్యమై జీవమున్
మౌనభృత్ వేదమై మోక్షమే ప్రశ్నగన్
విశ్లేషణ👉 ప్రాణాన్ని నిలబెట్టేది అన్నం — అది హృద్యంగా జీవనానికి ఆధారంమానభృత్ విద్యయై మార్గ సాధ్యావిధీ
👉 మనిషిని నిలబెట్టేది విద్య — అది జీవన మార్గాన్ని చూపుతుంది👉 గానం (సాహిత్యం/భాష) జీవనానికి గమ్యం — “తెలుగు”ని జీవంతో సమానంగా చూపారు
👉 మౌనం వేదంలా మారి, చివరికి మోక్షమే జీవన ప్రశ్నగా నిలుస్తుంది
*****
924. ప్రాణజీవన: జీవులకు జీవన హేతువుగా ప్రణాధులకు రక్షణ కల్పించువాడు

ప్రాణజీవన సర్వ మూలము ప్రాభ వoబగు కర్మగన్
జ్ఞాన విస్తరి మోక్షమైనను జ్ఞప్తి ఎవ్వరి కోరికన్
మౌన దీప్తిగ కాల కర్తగ ము ఖ్య జీవన సేవగన్
ప్రాణ త్యాగము భాష వెల్గుకు పావనoబగు ధర్మమున్
🔹 సరళ భావం👉 జీవనానికి మూలం కర్మ. మన జీవితం మన కర్మలపై ఆధారపడి ఉంటుంది.👉 జ్ఞానం విస్తరించి మోక్షం దాకా తీసుకెళ్లినా, అది ప్రతి ఒక్కరి కోరిక మీదే ఆధారపడుతుంది.👉 మౌనం ఒక దీపంలా కాలాన్ని నడిపిస్తుంది; అది జీవనానికి ముఖ్యమైన సేవ.👉 భాష కోసం ప్రాణత్యాగం చేయడం — అది పవిత్రమైన ధర్మం.
******
925.తత్వంబీ.. పారామార్థిక సత్యమైన బ్రహ్మము యొక్క వాచకమును నియమించు వాడు
తత్త్వంబీ సమయోగ్యతా భవముగన్ తన్మాయ ఛేదత్వమున్
తత్త్వంబీ సుఖయోగ మార్గమగుటన్ దాహం విధానంబుగన్
తత్త్వంబీ సకలంబు ప్రేమగమకo త్యాగంబు తీరేయగున్
తత్త్వంబీ పరమాత్మ లీలలగుటన్ ధ్యానంబు ధర్మంబుగన్
🔹 సరళ భావం👉 తత్త్వం అంటే సమతా భావం; అది మాయను ఛేదించే శక్తి.👉 తత్త్వం సుఖానికి, యోగానికి మార్గం; అది ఆత్మ దాహాన్ని తీర్చే విధానం.👉 తత్త్వం ప్రేమతో నిండి ఉంటుంది; త్యాగం ద్వారా అది సంపూర్ణమవుతుంది.👉 తత్త్వం పరమాత్మ లీలగా వ్యక్తమవుతుంది; ధ్యానం దాని సాధన.
***+*
926. తత్వ విత్.. తన తప్పు తానే ఎరిగినవారు

తత్వవిత్..సంభవం తక్షణం యోగమున్
సత్వ విత్..విశ్వమున్ సఖ్యతా భవ్యమున్
నత్వ విత్..బంధనం నమ్మకం జీవనం
హత్వ విత్ మూర్ఖతంఆత్మవేదాంతమున్
🔹 సరళ భావం👉 తన తత్వాన్ని (తప్పు–సత్యాన్ని) గ్రహించిన వెంటనే, ఆత్మతో యోగం (అంతరశాంతి) కలుగుతుంది.👉 సత్వగుణాన్ని తెలిసినవాడు ప్రపంచంతో సఖ్యతగా, శుభంగా జీవిస్తాడు.👉 వినయాన్ని తెలిసినవాడు బంధాలను (సంబంధాలను) నమ్మకంతో నిలబెడతాడు — అదే జీవన సారం.👉 మూర్ఖత్వాన్ని (అజ్ఞానాన్ని) నాశనం చేసినవాడే ఆత్మవేదాంతాన్ని గ్రహిస్తాడు.
*******

927.ఏకాత్మా.. చేతన చేతనము గన్నింటికీ తానొక్కడే శశిగానందువాడు
ఏకాత్మా సమగoధమై పరిమళం యేమాయ యేమోహమున్
ఏకాత్మా లత లాసువాసన మయం యేమార్పు యే తీర్పుగన్
ఏకాత్మా కళ రూప నేస్తముగనున్ యేస్వార్ధ నిశ్వాసగన్
ఏకాత్మాహృదయంబుధర్మము గనున్ యేలక్ష్య సాధ్యంబుగన్
🌿 సరళ భావం
అన్ని జీవులు, చలనశీలమైనవి అయినా, వాటి లోపల ఒకే ఆత్మ ఉంది. ఆ ఆత్మే ప్రతి జీవిలో ఉన్న నిజమైన సత్యం. ఈ ప్రపంచంలోని సుగంధాలు, రూపాలు, ప్రకృతి సౌందర్యం అన్నీ మారిపోతున్నవే — అవి మాయతో కూడినవి.
మనసు వాటిని నిజమని భావించి మోహపడుతుంది. కానీ ఆత్మ దృష్టితో చూస్తే అవన్నీ ఒకే తత్వంలో కలిసిపోయినవి.
స్వార్థం, మోహం తొలగితే మనలోని హృదయం ధర్మమార్గంగా మారుతుంది. చివరికి మన జీవన లక్ష్యం ఆత్మసాక్షాత్కారమే అని ఈ పద్యం చెబుతుంది.
👉 “అన్ని ఒకే ఆత్మ; మోహం తొలగితే ధర్మం, ధర్మం ద్వారా లక్ష్యం.”
*****
928. జగన్మా మృత్యు జరాధిగః :: పుట్టుకలేని, గిట్టుట లేని షడ్వికారములకు అతీతమైన వాడు

అనుష్టన్
జగన్మా మృత్యు జరాధిగః సంయుక్త సిఖీభవ
జగన్నాటక విస్తరి జగన్మోహని తత్త్వమే
యుగ యోగ్యతాభవ్యతా యాక్షర సత్యమేయగున్
కాలనిర్ణయ ప్రకృతి ప్రా భవంబు నోర్పు తీర్పున్
అనుష్టుప్ శైలిలో విస్తరించారు.
🌿 సరళ భావం
ఈ జగత్తుకు పుట్టుక లేదు, మరణం లేదు, వృద్ధాప్యం లేదు.
అంటే షడ్వికారాలకు (జననం, వృద్ధి, మార్పు, క్షీణత, మరణం మొదలైన మార్పులకు) అతీతమైన ఒక పరమ తత్వం ఉంది.
ఈ లోకమంతా ఒక నాటకంలా సాగుతోంది — అందులో జగత్తు ఒక రంగస్థలం, జీవులు పాత్రధారులు. ఆ నాటకాన్ని నడిపేది మోహాన్ని కలిగించే జగత్తు తత్త్వమే అయినా, దాని వెనుక ఉన్నది శాశ్వత సత్యం.
కాలం, ప్రకృతి, సంఘటనలు అన్నీ ఆ పరమసత్యం నియంత్రణలోనే జరుగుతాయి. మనం చూస్తున్న మార్పులన్నీ ఆ శాశ్వత తత్త్వానికి చెందిన బయటి రూపాలు మాత్రమే.
👉 “ఈ జగత్తు మార్పులకు లోనైనా, దాని వెనుక ఉన్న పరమ తత్వం శాశ్వతం, నిరంతరం, అతీతం.”
*****
929. భూర్భు వస్సుస్తరు : సువర్ణ లోకములో పారిజాత వృక్షము వలే ఆశ్రయించిన వారికి ఆశ్రయించువాడు

అనుష్టన్
భూర్భు వస్సుస్తరు స్థిర: సఖ్యతత్వ సుఖంబగు నిర్మర్యాదస్తుపురుషః
పాపాచారసమన్వితః|
మానం న లభతే సత్సు
భిన్నచారిత్రదర్శనః॥
సర్వలక్ష్య సత్యధర్మ విశ్వవ్యాప్తి విశ్వాసమున్
ఈ పరమాత్మ లేదా పరమ తత్వం సువర్ణ లోకంలోని పారిజాత వృక్షంలా ఉంటుంది.
పారిజాత వృక్షం ఎలా తనను ఆశ్రయించిన వారికి కోరిన ఫలాలను ఇస్తుందో, అలాగే ఈ దైవతత్వం తనను ఆశ్రయించిన వారికి ఆశ్రయం, శాంతి, సుఖం ఇస్తుంది.
అయితే, మనసు శుద్ధి లేకుండా, తప్పు మార్గంలో నడిచే వారికి ఆ సత్సంగ సుఖం లభించదు.
సత్పురుషుల సమక్షంలో అహంకారం నిలవదు.
వారి మధ్య నిజమైన ధర్మం, సత్యం మాత్రమే వెలుగులో ఉంటుంది.
ఈ తత్వం అన్ని లక్ష్యాలను, ధర్మాన్ని, విశ్వాసాన్ని సమన్వయం చేసే విశ్వవ్యాప్త శక్తిగా ఉంటుంది.
👉 “సత్యధర్మమయమైన పరమాత్మను ఆశ్రయించినవారికే శాంతి, సుఖం, ఆశ్రయం లభిస్తుంది.”
*****
తార: సంసార సంద్రము నుండి రక్షించు వాడు

930..తార: సంసార సంద్రము నుండి రక్షించు వాడు

తార యుత్తర చేర విత్తుర ధార దత్తుర తత్పరా
ప్రేర ణేత్తర మార మెత్తుర ధీర ధైర్యము తత్పరా
చేర నేస్తర వార వీర శుచిత్ర మో హర తత్పరా
సైర సేవర సర్వ మాయర కైర కావర నేర్పు రా

ధారా దత్తముగా విత్తనం నాటినమాదిరిగా ఆ పరంధాముని ఉత్తరం. ధైర్యము పెంచి ప్రేరణ కల్పించి భయపడని విధంగా సహాయం.* చెలిమి కలిపి శివుని సహాయముతో చక్కటి ఆకర్షణతో నుంచువాడు*స్వవే గొప్పగా, మయాలనుండి తనవంతు సహాయము చేయువాడు.
*****
931. సవితా.. సమస్తము  తానే సృజంచువాడు
సవితా వినయంబు సమాన కళల్
భవితా శుభదంబు భవాత్మ గనున్
నవతా సహనంబు నరాల గతిన్
జవసత్వ విధాన జయంబు గనున్
🌸 సరళ భావం
సవితా (సూర్యుడు)
వినయముతో సమానత్వాన్ని ప్రసరింపజేస్తాడు
భవిష్యత్తుకు శుభఫలితాలను అందించే జీవాత్మగా నిలుస్తాడు
నూతనత, సహనం మనుషుల గమనంలో ప్రేరేపిస్తాడు
శక్తి, సత్వగుణాలతో విజయ మార్గాన్ని చూపిస్తాడు
******
932. ప్రపితామహా.. బ్రహ్మకు కూడా తండ్రి యైనవాడు
ప్రపితామహ

*ప్రపితామహా సమస్త జీవసత్య లోకరక్షా*
*ఓం తత్సదితి నిర్దేశో బ్రహ్మణస్త్రివిధః స్మృతః*
*బ్రాహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితాః పురా*
*కాలప్రకృతిదేహ దాహసృష్టికర్త లోకంబున్*

🌸 పద్య భావం (సరళ వివరణ)
ప్రపితామహుడు
సమస్త జీవసత్యానికి మూలమైనవాడు
లోకాల రక్షణకర్త
“ఓం తత్ సత్” అనే పరమసత్య స్వరూపుడు
వేదాలు, యజ్ఞాలు, బ్రాహ్మణ సంప్రదాయం అన్నీ ఆయన నుండే ఉద్భవించాయి
కాలం, ప్రకృతి, దేహం, సృష్టి అన్నీ ఆయన నియంత్రణలో నడుస్తాయి
****
933..యజ్ఞ: తానే యజ్ఞమై యుండువాడు

యజ్ఞమే తనువై సహాయ సయోధ్యతా భవ దీప్తిగన్
ఆజ్ఞ మూలముగా దహించు యగ్నిగ ఆది మూర్తిగ జ్ఞానిగన్
విజ్ఞతా విజయంబు నిచ్చె సువిద్య సాక్షిగ నిత్యమున్
ప్రజ్ఞతా హృదయంబు సజ్జన పాఠ్య సత్యము తత్త్వమున్
సరళ భావం
యజ్ఞమే తనువుగా ధరించిన పరమాత్మ
సహాయం, సయోధ్య, శాంతి ద్వారా లోకంలో వెలుగుతాడు
ఆజ్ఞ రూపంగా అజ్ఞానాన్ని దహించే అగ్ని స్వరూపుడు
విజ్ఞత, విద్య ద్వారా విజయాన్ని ప్రసాదిస్తాడు
సజ్జనుల హృదయంలో ప్రజ్ఞగా నిలిచి సత్యతత్త్వాన్ని బోధిస్తాడు
******
934. యజ్ఞపతి.. యజ్ఞమునకు ఫలము నిచ్చువాడు

యజ్ఞపతి సయోధ్యత్వమ్
విజ్ఞత విశ్వంబుగాను విద్యల తీరున్
ఆజ్ఞగ సహనంబు విధీ
ప్రజ్ఞాప్రభవము సమర్థ ప్రావీణ్యతగన్
🌿 సరళ భావం
యజ్ఞపతి సయోధ్య (సమన్వయం) స్వరూపుడు
విజ్ఞానం, విద్యల ద్వారా విశ్వాన్ని నడిపించే శక్తి
ఆజ్ఞ, సహనం ద్వారా విధిని నియంత్రించువాడు
ప్రజ్ఞతో సమర్థత, ప్రావీణ్యం ప్రసాదించువాడు
*******


436..యజ్ఞాoగ.. యజ్ఞములే అవయవములు కలవాడు 

యజ్ఞాoగ స్వర మాధురీ భవముగన్ యానంద విశ్వాస మున్ 

యజ్ఞాoగత్వ పరాత్పరా సహనమున్ యాకాంక్ష విజ్ఞత్వమున్ 

యజ్ఞాoగక్షమవిద్యలేశుభముగన్ ఆశ్చర్య లక్ష్యంబుగన్ 

యజ్ఞాoగభ్రమలజ్వలాసమయమున్ కాలంబు సత్యంబుగన్

🔹 భావం..యజ్ఞంలో ఉన్న ప్రతి భాగం (యజ్ఞాంగం) మధురమైన స్వరంలా ఆనందాన్ని, విశ్వాసాన్ని కలిగిస్తుంది.యజ్ఞ భావం మనిషిలో సహనం, ఉన్నతమైన ఆలోచన (పరాత్పర తత్త్వం),మంచి లక్ష్యాలపై ఆకాంక్షను, జ్ఞానాన్ని పెంపొందిస్తుంది.యజ్ఞంతో సంబంధమున్న విద్యలు, గుణాలు మనకు శుభాన్ని అందించి,జీవిత లక్ష్యాన్ని ఆశ్చర్యకరంగా, గొప్పగా మార్చుతాయి.జీవితంలో ఉన్న భ్రమలు, అజ్ఞానం కాలంతో కలిసి క్రమంగా తొలగిపోతూ,చివరికి సత్యమే నిలిచిపోతుంది.

******

437

యజ్ఞాంగ సువిధా సహాయ భవమున్ ఆ కాంక్ష ఆత్మీయతా
యజ్ఞాసంభవతా భవామృత సుధా యానంద తత్వార్థమున్ ।
ప్రజ్ఞా ప్రాభవమున్ జయాపరముగన్ ప్రావీణ్య ప్రాధాన్యతన్
సుజ్ఞానంబగు విద్యగా సహ విధీ సూత్రంబు సంతృప్తిగన్ ॥
🌼 పద్య భావం (సరళంగా):
“యజ్ఞాంగుడు” అనగా యజ్ఞంలా సమగ్రతతో, ప్రతి అంగమూ శ్రేయోమార్గానికి ఉపకరించే స్వరూపం.
జీవితం ఒక యజ్ఞంలా ఉండాలి — అందులో సహకారం, ఆత్మీయత, కాంక్షల శుద్ధి అవసరం.
అప్పుడు జీవితం భవామృత సుధగా మారి, ఆనంద తత్త్వాన్ని అందిస్తుంది.
ఆ స్థితిలో ప్రజ్ఞ (జ్ఞానం) వికసించి, విజయానికి మార్గం చూపుతుంది.
చివరకు అది సుజ్ఞానం, విద్య, విధి సూత్రాలు అన్నీ కలిసిన సంపూర్ణతగా, సంతృప్తిని అందిస్తుంది.
*****
438..యజ్ఞభృత్.. యజ్ఞమును భరించు వాడు

యజ్ఞభృత్ జీవనo యానతీ వీక్షణమ్
యజ్ఞరూప స్థితీ యుక్తి భావామృతమ్ ।
యజ్ఞ ప్రావీణ్యతా యుక్త ధర్మార్థమున్
యజ్ఞ విశ్వార్థమున్ యుక్తి యోగామృతమ్ ॥
🌼 సరళ భావం:
“యజ్ఞభృత్” అనగా — జీవనాన్ని యజ్ఞంగా భరించి నడిపించేవాడు.
జీవితం ఒక యాత్రగా, యజ్ఞమయ దృష్టితో చూడాలి.
ఆ స్థితిలో మన జీవనం **యుక్తి (సరైన మార్గం)**తో నిండిన భావామృతంగా మారుతుంది.
యజ్ఞస్వరూపమైన కర్మలో నైపుణ్యం పెరిగితే, అది ధర్మార్థ సాధనకు దారి తీస్తుంది.
చివరకు అది సమస్త జగత్తు హితం కోసం, యోగామృతమైన జీవన మార్గంగా పరిణమిస్తుంది.
****
439.

ద్యజ్ఞకృత్.. సృష్టి ఆరంభమునుండి అంతమువరకు యజ్ఞము జేయువాడు

ద్యజ్ఞకృత్ ద్వందమై ధన్యతా భాగ్యమై
ద్యజ్ఞకృత్ విశ్వమై ధర్మమై సఖ్యతా ।
ద్యజ్ఞకృత్ విజ్ఞబోధత్వమున్ విద్యగన్
ద్యజ్ఞకృత్ స్నేహసంధాయిణీ మిత్రగన్ ॥
🌼 సరళ భావం:
“ద్యజ్ఞకృత్” అనగా — సృష్టి ఆరంభం నుండి అంతం వరకు యజ్ఞాన్ని నిర్వహించేవాడు.
జగత్తులో కనిపించే ద్వంద్వాలు (సుఖ–దుఃఖాలు) కూడా ఆయన యజ్ఞంలో భాగమే; అవి చివరికి ధన్యత, భాగ్యం వైపు నడిపిస్తాయి.
ఆయన స్వరూపమే విశ్వం, అదే ధర్మం, అదే జీవుల మధ్య సఖ్యత.
ఆయన ద్వారా విజ్ఞానం, జ్ఞానబోధ ఉద్భవించి, విద్యగా వికసిస్తుంది.
చివరికి ఆయన స్నేహాన్ని కలిపే శక్తి, సమస్తులను మిత్రభావంతో ఏకం చేసే తత్త్వం.
*****

440

యజ్ణీ.. యజ్ఞముల శేషి యైనవాడు
యజ్ఞీ జీవన యజ్ఞమున్ సమరమున్ యుక్తంబు శక్తిత్వమున్
యజ్ఞీ కర్మఫలాధిపున్ ఫలముగన్ యన్మాయ ధర్మార్థమున్ ।
యజ్ఞీ సర్వ సమర్పణామయముగన్ స్వీకార సంభావ్యతన్
యజ్ఞీ యజ్ఞమయ స్వరూప యుగమున్ యాకాంక్ష లోకంబుగన్ ॥
🌼 సరళ భావం:
“యజ్ఞీ” అనగా యజ్ఞముల స్వామి, యజ్ఞఫల భోక్త.
జీవితం ఒక యజ్ఞమూ, ఒక సమరమూ; అందులో సరైన శక్తి, యుక్తి అవసరం.
మన కర్మల ఫలానికి అధిపతి ఆయన; ధర్మార్థమయ జీవనమే నిజమైన ఫలం.
సమస్త సమర్పణలను స్వీకరించే పరమాత్మస్వరూపుడు.
యుగయుగాలపాటు యజ్ఞమయ స్వరూపంగా నిలిచి, లోకానికి ఆశయంగా, లక్ష్యంగా వెలుగుతాడు.
🌺

 941..యజ్ఞసాధన.. యజ్ఞమును సంప్రాప్తి సాధనము గలవాడు 
🌿 పద్యం:
యజ్ఞసాధనౌనునిత్యమై యనంత యోగ్యతన్
ప్రజ్ఞ పాఠ్యమౌను నిత్యమై ప్రభావ భాగ్యమున్
విజ్ఞతాభవంబు తీరుగన్ వినమ్ర తాభవమ్
యజ్ఞసాధ్యమేను విద్యగన్ రకంబు కాదుగన్
🌸 సరళ భావం:
→ యజ్ఞసాధన (సత్కర్మ/సమర్పణ భావం) నిత్యంగా ఉంటే అపారమైన యోగ్యత కలుగుతుంది.
→ అది ప్రజ్ఞగా (జ్ఞానంగా) మారి, జీవితం ప్రభావవంతంగా, భాగ్యవంతంగా మారుతుంది.
→ నిజమైన విజ్ఞానం చివరికి వినయాన్ని కలిగిస్తుంది
→ అసలు విద్య అనేది యజ్ఞసాధన ద్వారానే సిద్ధిస్తుంది; అది వేరే రకంగా కాదు.
****
 942.యజ్ఞాంత కృత్.. యజ్ఞము ద్వారా తన తత్త్వమును తెలుపు వాడు 
🌿 పద్యం:
యజ్ఞాంత కృత్ మనసు భావ యనంత మేనున్
సుజ్ఞాణ కృత్ వినయ మోక్షజ శాంతి భావమ్
విజ్ఞాన కృత్ గణము తీరు వినమ్రతాభవమేనున్
యజ్ఞాంత కృత్ సహజ లక్ష్య సహాయ మేనున్
🌸 సరళ భావం:
→ యజ్ఞస్వరూపుడు మనసులో అనంతమైన భావాన్ని వెలిగిస్తాడు.
→ శ్రేష్ఠ జ్ఞానం వినయాన్ని కలిగించి, మోక్షస్వరూపమైన శాంతిని అందిస్తుంది.
→ విజ్ఞానం పెరిగేకొద్దీ వినమ్రతే నిజమైన లక్షణంగా మారుతుంది.
→ యజ్ఞస్వరూపుడు మన సహజ లక్ష్యాన్ని చేరేందుకు సహాయపడే దైవతత్వం.
: 943. యజ్ఞగుహ్యం.. యజ్ఞ రహస్వాలు నెరింగింప చేయు వాడు 
🌿 పద్యం 
యజ్ఞగుహ్య తత్త్వమున్ సహా యథార్థ బోధకున్
యజ్ఞసుజ్ఞ దీపమున్ సుధా యశస్సు చిత్తమున్
యజ్ఞవిజ్ఞ మార్గమున్ సుధీ యనంత కాంతిగాన్
యజ్ఞగుహ్యుడౌను యోగ్యతా సకాల దాయకున్
🌸 సరళ భావం:
→ యజ్ఞ రహస్య తత్త్వాన్ని యథార్థంగా బోధించే వాడు.
→ శ్రేష్ఠ జ్ఞానదీపంతో మనస్సులో అమృతమయమైన యశస్సును వెలిగిస్తాడు.
→ విజ్ఞాన మార్గంలో నడిపి అనంతమైన జ్ఞాన కాంతిని ప్రసాదిస్తాడు.
→ యజ్ఞగుహ్యుడు సమయోచితంగా యోగ్యతను ప్రసాదించే దైవతత్వం.
*****
[: 944.. అన్నం.. అన్నము వలె అనుభవించువాడు 
🌿 పద్యం
అన్నం సాధ్యత లక్ష్య సాధనలుగన్ మానంద మూర్తిత్వమున్
అన్నం విద్యలగన్ పరంకృతిగనున్ మాకాంక్ష చిత్తంబుగన్
అన్నంబున్ పరిపూర్ణతాభవముగన్ ఆశ్చర్య చైతన్యమున్
అన్నం ఆత్మసహాయమున్ సకలమున్ సామర్థ్యమన్నంబుగన్
🌸 సరళ భావం:
→ అన్నం (ఆహారం/ఆధారం) మన లక్ష్యసాధనకు బలం ఇచ్చి, ఆనందస్వరూపాన్ని కలిగిస్తుంది.
→ అన్నమే విద్యకు మూలం; అది మన ఆశయాలను నిలబెట్టే చిత్తస్థితి.
→ అన్నం ద్వారా జీవితం పరిపూర్ణతను, చైతన్యాన్ని అనుభవిస్తుంది.
→ అన్నమే ఆత్మకు సహాయకారి; అన్ని సామర్థ్యాలకూ మూలాధారం.
****
[ 945. అన్నాద.. తనను అనుభవించినవానికి అనుభోగ్యముగా అనుభవించువాడు 
🌿 పద్యం 
సకలమన్నాద కళలుగా సాధుబుద్ధి
ప్రకటిత భవభావముగన్ ప్రతిభ ప్రగతి
అకులిత అణుకువ శుభము ఆత్మగళము
వికసిత విపులంగానులే విద్యలయలు
🌸 సరళ భావం:
→ అన్నాద స్వరూపం అన్ని కళలలోనూ, సద్బుద్ధిగా వ్యక్తమవుతుంది.
→ జీవన భావాలను వ్యక్తం చేస్తూ ప్రతిభను అభివృద్ధి చేస్తుంది.
→ ఆ దైవానుభవం మనలో అణుకువను, శుభతను, ఆత్మస్వరాన్ని కలిగిస్తుంది.
→ అది విస్తరించి జ్ఞానంగా, విద్యగా వికసిస్తుంది.
****
946. ఏవచః” నామార్థానికి (పరమ వాక్య స్వరూపుడు / వాక్యములలో వ్యక్తమయ్యే తత్త్వం
ఏవవాచః స్వరూపోఽసౌ సత్యవాక్యప్రకాశకః।
దేవవాక్యప్రబోధశ్చ దివ్యజ్ఞానప్రదాయకః॥
భావవాక్యార్థబోధశ్చ భవ్య తత్త్వప్రకాశకః।
ఏవవాచః స దేవోఽయం మోక్షమార్గప్రదాయకః॥

తెలుగు భావం:ఏవచః” అంటే వాక్యరూపంలో వ్యక్తమయ్యే పరమతత్త్వంసత్యవాక్యాలను ప్రకాశింపజేసేవాడుదైవ వాక్యాల ద్వారా జ్ఞానాన్ని బోధించేవాడుచివరకు మోక్షమార్గాన్ని చూపించే వాడు
******

947. ఆత్మయోని.. పాలలో చెక్కెరలా తన్ను ఆరాధించే వారిని తనలో కలుపు కుంటాడు.

ఆత్మయోనిసన్నిధానమున్ అనంత యోగ్యతన్
ఆత్మయోనిలీనమౌకళా సహాయ మార్గమున్
ఆత్మయోనినిత్య సత్యమౌ ధరాత లంబునన్
ఆత్మయోనిసఖ్యతాభవా సమర్ధతాయగున్
సరళ భావం:
ఆత్మయోని (పరమాత్మ) సన్నిధిలో ఉన్నవారికి అపారమైన యోగ్యత కలుగుతుంది.
ఆయనలో లీనమవడం ద్వారా జీవితం సరైన మార్గంలో సాగుతుంది.
ఆత్మయోని నిత్యసత్యంగా ఈ భూమిలోనే అనుభవించగల తత్త్వం.
ఆయనతో సఖ్యత (ఏకత్వ భావం) కలిగితే జీవితం సంపూర్ణంగా, సమర్థంగా మారుతుంది.
*****
448.స్వయంజాత: తనసంకల్పము చేతనే అవతరించువాడు

స్వయంజాత దీక్షా స్వధర్మార్ధ దక్షా
ప్రియంజాత లక్ష్యా రమాదీప్త  తేజా
వ్యయంజాత యుక్తా వ్యధాధర్మ ముక్తా
స్వయంజాత రక్షా స్వకర్మ జాత భుక్తా

సరళ భావం:
తన సంకల్పంతో స్వయంగా అవతరించే వాడు — ధర్మాన్ని స్థాపించేందుకు సిద్ధంగా ఉంటాడు.
తన లక్ష్యం స్పష్టంగా ఉండి, లక్ష్మీ కాంతితో ప్రకాశించే తేజస్సుతో వెలుగుతాడు.
యోగంతో యుక్తుడై, బాధలు మరియు అధర్మం నుండి విముక్తిని కలిగిస్తాడు.
తానే రక్షకుడై, ప్రతి ఒక్కరి కర్మఫలాన్ని అనుభవింపజేస్తాడు.
*****
449.వైఖాన.. భక్తుల యొక్క సంసార దుఃఖమును చీల్చి తొలగించువారు

వైఖాన మార్గసుభధంబు వరాల జల్లుల్
వైఖాన భక్త ప్రభవంబు శరణ్యమేనున్
వైఖాన లక్ష్యము వినమ్ర జయంబుగానున్
వైఖాన చిత్త సతతంబు వనస్పతేనున్
సరళ భావం:
వైఖాన మార్గం శుభప్రదమై, వరాల వర్షంలా కృపను ప్రసాదిస్తుంది.
వైఖాన భక్తి గొప్పది; అది శరణాగతికి ఆశ్రయంగా ఉంటుంది.
వైఖాన మార్గాన్ని లక్ష్యంగా తీసుకుంటే, వినయం ద్వారా విజయాన్ని పొందుతారు.
వైఖాన చిత్తం ఎల్లప్పుడూ ప్రకృతి (వనస్పతి)తో ఏకత్వంగా, స్థిరంగా ఉంటుంది.
****
950..సామగాయన.. మధువుని అశ్వాధించి సామగానము చేయువాడు

సామ గాయన సఖ్యతాభవ సంభవార్దిగ నిత్యమున్
ప్రేమ తత్త్వము విశ్వ మాయల రమ్యతేయగు సత్యమున్
క్షేమలక్ష్యము శాంతి దూతగ కీలకంయగు ధర్మమున్
సామదానము కర్మయోగము సంతసంబగు జీవనమ్
🌿 భావం:
సామగానము చేసే వాడు (సామగాయనుడు) సఖ్యత, శాంతి, ప్రేమలను ప్రసరింపజేసే వ్యక్తి. అతని గానం మధువులా మాధుర్యమును అందిస్తూ జీవనానికి ఆనందాన్ని ఇస్తుంది.
ప్రేమతత్త్వమే విశ్వంలో ఉన్న మాయలన్నిటికీ అసలు సత్యం; అదే జీవన సౌందర్యానికి మూలం. శాంతిని లక్ష్యంగా పెట్టుకున్న జీవితం ధర్మమనే కీలకతత్వంతో నడుస్తుంది.
“సామ, దానం” వంటి సత్సిద్ధాంతాలు, కర్మయోగం—ఇవి అన్నీ కలసి జీవనాన్ని సంతోషమయం చేస్తాయి.
*****
951.దేవకీ నందన.. మహావైభవము గలవాడు

దేవకీ గర్భసంభవ దివ్య తేజ
నందగోకుల నందనో నవరసమయ
లీలల లలిత కౌస్తుభ నిగ్రహంబు
దేవకీనందనందన దివ్య దీప
🌿 భావం:
దేవకీ గర్భంలో అవతరించిన శ్రీకృష్ణుడు దివ్య తేజస్సుతో ప్రకాశించినవాడు. నందగోకులంలో పెరిగి, అందరికీ ఆనందాన్ని పంచిన నవరసమయ స్వరూపుడు.
ఆయన లీలలు లలితమైనవి, మాధుర్యభరితమైనవి. కౌస్తుభమణి వంటి దివ్య ఆభరణాలతో అలంకృతుడై, లోకాల్ని ఆకర్షించే మహిమగలవాడు.
అటువంటి దేవకీనందనుడు లోకానికి ఒక దివ్య దీపంలా—జ్ఞానం, ఆనందం, ధర్మం ప్రసరింపజేసే పరమాత్మ.
****
952. స్ప్రష్టా :: సమస్త లోకములను సృజించు వాడు

స్ప్రష్టాకావ్యమనేది జీవనముగన్ సద్భావ విశ్వాసమున్
పుష్టీకామ్యముగాను సంపదగనున్ పూజ్యంబు ధర్మార్ధిగన్
స్ప్రష్టాసక్యత గాను గమ్యమగుటన్ రమ్యత్వ మూలమ్ముగన్
స్ప్రష్టాసర్వముగానుశాంతి జయమున్ సామర్ధ్య సంతోషమున్
భావ వివరణ:
“స్ప్రష్టా” — సృష్టికర్త. సమస్త లోకాలను సృజించే పరమాత్మ.
జీవితం ఒక కావ్యంలాంటిది; ఆ సృష్టికర్త అనుగ్రహంతో అది సద్భావం, విశ్వాసం మీద నడుస్తుంది. ఆ విశ్వాసమే జీవనాన్ని పుష్టిపరచి, సంపదను, ధర్మాన్ని పూజ్యంగా నిలబెడుతుంది.
సృష్టికర్తతో సఖ్యత (ఆత్మసంబంధం) కలిగితేనే జీవన గమ్యం స్పష్టమవుతుంది. అదే జీవన రమ్యతకు మూలకారణం.
చివరగా, సృష్టికర్త సర్వాంతర్యామిగా ఉండి, శాంతి, జయం, సామర్థ్యం, సంతోషం—all ఇవన్నీ ఆయన అనుగ్రహంగా మన జీవితంలో ప్రసరింపజేస్తాడు.
******
953. క్షితీశ.. భూమికి ప్రభువైనవాడు

క్షితీశ సంభవంబుగాను కీలకంబుగానగున్
నితాంత సేవభావమేను నీడతత్బవంబుగన్
స్వతంత్ర సఖ్యతాక్షమార్థి సాహసంబుతీరుగన్
క్షితీశలక్ష్యమేజగంబు క్షేమతన్మయంబుగన్
భావ వివరణ:
“క్షితీశ” — భూమికి ప్రభువు, రాజు. ఆయన ఉనికి సమాజ నిర్మాణానికి కీలకమైనది. రాజు కేవలం అధికారముగలవాడు కాదు; ఆయన సేవాభావంతో ప్రజలకు నీడలాంటివాడు.
నిజమైన క్షితీశుడు స్వతంత్రతతో పాటు సఖ్యతను కాపాడుతూ, క్షమా గుణంతో, ధైర్యసాహసాలతో పాలన సాగించాలి.
అలాంటి రాజుని లక్ష్యం మొత్తం జగత్తు క్షేమమే. ప్రజల సంక్షేమం, శాంతి, సమత—ఇవే అతని ధ్యేయాలు.
*****
954..పాపనాశన.. పాపమును నాశనము చేయువాడు

తనమున పాపనాశన నితాంత గుణంబు తపంబు మూలమున్
మనమున పాపనాశన సమాంతరభాగ్యతభావమేయగన్
క్షణమున పాపనాశన సకామ్య విధాన శుభంబుగాయగన్
గుణమున పాపనాశనసూత్ర పధంబు సకాల ధర్మమున్
భావ వివరణ:
మనిషి తన స్వభావాన్ని (తనము) శుద్ధి చేసుకుంటూ, తపస్సు ద్వారా ఉన్నత గుణాలను పెంపొందిస్తే—అదే పాపనాశనానికి మూలం అవుతుంది.
మనసులో పాపనాశనం అంటే, శుభభావాలు, సద్గుణాలు పెంపొందడం. అలా అంతరంగంలో మార్పు వస్తేనే నిజమైన భాగ్యం లభిస్తుంది.
క్షణక్షణమూ శుభకార్యాల ద్వారా, నియమబద్ధమైన జీవన విధానంతో పాపాలు క్రమంగా తొలగిపోతాయి.
చివరగా, సద్గుణాల ఆధారంగా నడిచే ధర్మమార్గమే పాపనాశనానికి సరైన సూత్రం. అది సమయానుకూలంగా మన జీవితాన్ని శుభమయం చేస్తుంది.
******
955.శంకభృత్.. పంచాభూతములకు ఆది యైన అహంకారాత్మాకముగ పాంచజణ్యమను శంఖము ధరించినవాడు

శంకభృత్ సుధామృతంబుగన్ సమర్ధ తాభవమ్
శంకభృత్ సహామదంబుగన్ శాంతి సౌఖ్యతేయగున్
శంకభృత్ సువిద్య నేస్తమున్ సాదుతత్వమేనగన్
శంకభృత్ ప్రధాన భవ్యతా క్షమoబు కర్తగన్
గురుభ్యో నమః 🙏
భావ వివరణ:
“శంకభృత్” — పాంచజన్య శంఖాన్ని ధరించిన పరమాత్మ. ఆ శంఖనాదం సుధామృతంలా జీవనానికి శక్తి, సామర్థ్యాన్ని ఇస్తుంది.
ఆ శంఖధ్వని అహంకారాన్ని తగ్గించి, శాంతి, సౌఖ్యాలను ప్రసాదిస్తుంది. అంతరంగంలో మదాన్ని శమింపజేసి, సమతను కలిగిస్తుంది.
సువిద్య, సత్సంగం, సద్గుణాల పట్ల ప్రేమను పెంచి, సాదుతత్వాన్ని మనసులో స్థిరపరుస్తుంది.
చివరగా, శంకభృత్ స్వరూపం భవ్యత్వం, క్షమాగుణం, ఉన్నత జీవన విధానానికి ప్రేరణగా నిలుస్తుంది.
******