ఓ కృష్ణా యుద్ధం చేయగోరి సిద్దపడి వచ్చిన ఎవరెవరితో నేను యుద్ధం చేయాలో వారందరిని ఈ యుద్ధ ప్రారంభ సమయంలో చూడాలి
దుర్భేద్యమైన దృతరాష్ట్ర పురునికి ప్రియం కలిగించటానికి ఏ ఏ వీరులు ఇక్కడ యుద్ద సింసిద్దులై యున్నారో వారిని నేను చూడాలి
--((*))--
గీతామృతబోధి (003)
గురువుగారు ఇంత ముందు చెప్పినటువంటి చిన్న కథకు మాకు ఐదు ప్రశ్నలు ఉదయించాయండి అందులో రైతుగా శిష్యులు లేచి వారి అభిప్రాయ తెలియపరుస్తున్నారు
✅ 1. నిత్యమైన అనిశ్చితి – భవిష్యత్తు ఎవ్వరికీ తెలియదు కదా గురువుగారు అడిగాడు మొదటివాడు
> గీతా సారము: బట్టి తెలియ పరుస్తా వినండి.
“న జాయతే మ్రియతే వా కదాచిన్ నాయం భూత్వా భవితా వా న భూయః”
(2.20) – ఆత్మకి జననమూ లేదు, మరణమూ లేదు.
మీ వాక్యం:
> “నిద్రపోవటం తెల్లవారితే లేవటం... రేపు ఏమి జరుగుతుందో ఎవ్వరు కనుగొనలేరు”
➡️ ఇది భగవద్గీతలో చెప్పిన జీవిత మాయ, అనిశ్చితి, అనిత్యత భావనకు తగ్గది. భవిష్యత్ అజ్ఞాతం అనేది మనం జ్ఞానం ద్వారా అర్థం చేసుకోవాలి అని గీతా బోధ.
***
ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:గీతామృతబోధి (002)
గీతా జీవన దర్పణం
ఒక్క సారి ఆలోచిస్తే?
మనం ఒక్క సారి ఆలోచిస్తే మనకు ప్రతి రోజూ కొత్తగా కనిపిస్తుంది, నిద్రపోవటం తెల్లవారితే లేవటం కష్ట బడటమ్ ఇదే జీవితం అని అందరికి తెలుసు కానీ రేపు ఏమి జరుగుతుందో మాత్రం ఎవ్వరు కనుగొనలేరు ఎందుకు? మనం అద్దం లో చూసామనుకో మనబొమ్మే కనబడుతున్నది కానీ వేరే బొమ్మ అక్కడ కనబడదు.
మంచి చెడు గమనించి బ్రతికే శక్తి మానవులకు ఉన్నది, కానీ జ్ఞానేంద్రియాలు తెలిపే ఆనందాన్ని దు:ఖాన్ని సమానంగా అనుభవిస్తాం.
సినిమా చూసి మనసు ఉల్లాసం ఉత్సాహం గా మార్చుకోవడం, లేదా భయాందోలనకు దిగుతాం, అది తెలిసి వెళతాం కానీ దాని వెనుక ఎందరో కృషి ఉన్నది, తెరమీద బొమ్మల రావటానికి ఒక ప్రొజక్టర్ ఉన్నది, దానికి కనిపించని కరంటు పంపితే గాని చిత్రాన్ని చూపలేదు. అనగా ఎదో శక్తి మనచుట్టూ పరిభ్రమిస్తూ ఉన్నది అనగా ప్రకృతిలో మారే ప్రతి చర్యకు ఎదో ఒక కారణం తప్పక ఉన్నది అని గ్రహించవలెను.
మనం ఏదైనా తెలుసుకోవాలంటే ఎవరినయినా ఆశ్రయించాలి, లేదా మనమే శోధన ద్వారా తెలుసు కోవాలి, తెలుసుకున్న దానిని ప్రపంచానికి తెలియ పరిస్తే అర్ధం చేసుకున్నవారికి కొంత మంచి ఉండవచ్చు, అర్ధం కానివారికి తేలిక భావంగా ఉండవచ్చు, అర్ధాన్ని ఆచరించటం, గమనించటమే మనకు అవసరము, చెడును వేలెత్తి చూపి మంచిని పెంచుట అవసరం, మానవులలో మార్పు రావటానికి సహకారం మరీ అవసరం.
ఎవరి శక్తి వారికి తెలియదు, ఎందు కంటే మన ఆలోచన మన సంసారం భాదలు సుఖాలు కమ్మి వేస్తాయి, ఏదైనా అడిగిన దానికి వెంటనే చెప్పలేరు. అంత మాత్రాణ శక్తి హీనులు కాదు, ఎందుకంటే మనలో అహం అడ్డు పడుతుంది, మనకెందుకు జరిగేవి జరుగక మానవు అని వాదనలో ఉండుట మంచిది కాదు. మనలో ఉన్న శక్తి తో ఎదుటి వానిలో ఉన్న జీవాన్ని ఉత్తేజ పరుచుటకు ప్రోత్సహించాలి. అది మంచి మాటలతో అందరిని ఉత్తేజ పరచాలి .
మానవులకు మానసిక పరిస్థితిని గ్రహించటం ఎవరి వళ్ళ కాదు, మెలుకవలో అంతర్గతముగా మనస్సులో కలిగే మార్పులే నిగ్రహ శక్తిని పెంచు తాయ్ నిద్రలో ఎటువంటి కలలు రాకుండా మనసు ప్రశాంతముగా నిద్రపోతే ఉషోదయం ఎప్పుడు ప్రశాంతముగా ఉంటుంది.
మన హృదయంలో విజ్ఞాన సంపద నిండి ఉంటుంది, అదే ప్రేమగా మారి సుఖ మార్గముగా చూపు తున్నది, గడియారం కదిలినట్లు గుండె చప్పుడుతో నిజమేదో గ్రహించు అని హెచ్చరిస్తున్నది అని తెలుసు కోవాలి. బుద్ది వికసించి బలహీనత నుండి బయట పడితే మానవ బలం పెరుగు తుంది.
సూర్యుని బింబము నీటిలో చూసి పట్టుకోవటానికి ప్రయత్నిమ్చే మనస్సు మనది, అది సాధ్యము కాదని మనకు తెలుసు, ఒక మూర్ఖుడుగా ప్రయత్నీమ్చితే ఫలితము ఉంటుందా ? మొండి వాదనకు దిగటం తప్ప, అది అవసరమా ?
కుండ నీళ్లలో ఉన్న సూర్యుణ్ణి పట్టలేము, తలయెత్తి నింగి నున్న సూర్యుణ్ణి చూడలేము కానీ నిత్యమూ దర్శనముగా ప్రత్యక్షంగా కనిపించే దేవుణ్ణి ఒక్కసారి రెండు చేతులతో నమస్కరించుటే మనం చేయగల నిజ స్థితి . అదేవిధముగా ప్రతిఒక్కరు తన తోటి వారికి వెలుగు చూపటం నేర్చు కోవాలి, కొవ్వొత్తి వెలుగు చూపి కరిగినట్లు మనం పరులకు సహాయం చేయటం, వెలుగును పంచటం వళ్ళ కష్టములు ఎదురైనా సంతృప్తి వళ్ళ మానవులకు జీవనా ధారము అని గమనించాలి . ***--(())--
2012 లో నేను వ్రాసిన కథ పై మీ అభిప్రాయం భగవద్గీత బోధకు పనికొస్తుందా?
శిష్యులారా పైన ఉదాహరించిన కథ నీ అభిప్రాయలు తెలియపరచండి దాని భవద్గీత అనుకరణగా కొన్ని తెలియపరుస్తాను
యింకా వుంది
✅ 2. 'అహం' - మన అహంకారమే మనకు అడ్డుగా ఉంది
అన్నారు కదండీ అవును...
> గీతా బోధ:లో
“అహంకారవిమూఢాత్మా కర్తాహమితి మన్యతే” (3.27)
అహంకారంతో మూర్ఖుడు "నేనే కర్త" అని భావిస్తాడు.
మీ వాక్యం:
> “మనలో అహం అడ్డు పడుతుంది... అంత మాత్రాణ శక్తిహీనులు కాదు...”
➡️ గీతా స్పష్టంగా చెబుతుంది — మన కర్మలు ప్రకృతి గుణాల ప్రభావంతో జరుగుతాయి, మనం అహం వల్లే వాటికి కర్తలమని భావిస్తున్నాం.
---
✅ 3. ఇంద్రియ జ్ఞానం, అనుభవం, సినిమాను ఉపమానంగా చెప్పిన తీరు అర్ధం కాలేదు గురువుగారు
> గీతా ధ్యానం:
“ఇంద్రియాణి పరాణ్యాహుః...” (3.42)
ఇంద్రియాల కంటే మనస్సు, ఆపై బుద్ధి, ఆపై ఆత్మ ప్రబలమైనవి.
మీ వాక్యం:
> “జ్ఞానేంద్రియాలు తెలిపే ఆనందాన్ని దుఃఖాన్ని సమానంగా అనుభవిస్తాం... తెరమీద చిత్రం – కాని వెనుక కరెంటు, ప్రొజెక్టర్ ఉన్నారు...”
➡️ ఇది గీతలో చెప్పిన దృశ్య ప్రపంచం వెనుక ఉన్న అదృశ్య మూలకారణం అనే భావనకు నిండు ప్రతిబింబం. మీరు సినిమాను రూపకంగా ఉపయోగించి దీన్ని అందంగా చెప్పారు.
*****
✅ 4. “వెలుగు పంచటం – కొవ్వొత్తిలా కరిగి వెలుగు ఇవ్వడం” ఏలా
> గీతా బోధ:
“తమసః పరస్థాత్” — (గీత 15.6)
దివ్య లోకములు చీకటి నివారించినవి.
లేదా
“యదాదిత్యగతం తేజో జగద్భాసయతేఽఖిలమ్...” (15.12)
➡️ మీరు చెప్పిన “వెలుగు పంచటం” భావన గీతలో చెప్పే జ్ఞానప్రభ, ఆత్మ వెలుగు, ఇతరులకు జ్ఞానం పంచే యోగి భావనలతో అనుసంధానించవచ్చు.
---
✅ 5. మార్పు కోసం పరిశీలన, ప్రయోగం, ఆచరణ – జ్ఞానాన్ని విస్తరించడం సమమా
> గీతా ధర్మం:
“తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా” (4.34)
జ్ఞానిని ఆశ్రయించి, ప్రశ్నించి, సేవచేసి జ్ఞానం తెలుసుకో.
➡️ మీరు చెప్పిన “ఎవరినైనా ఆశ్రయించాలి... లేకపోతే శోధన ద్వారా తెలుసుకోవాలి” అన్నది ఇదే భావాన్ని ప్రతిబింబిస్తుంది.
---
ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ:
గీతామృతబోధి (004)
ఒకరికి ఒకరు
ఈ విశ్వములో కేవలము విద్య ఒక్కటి మాత్రమే కాదు, విద్యతో పాటు వినయము కూడా ఉండాలి, వీటికి తోడు దానగుణము తప్పక ఉండాలి, అనగా విద్యను దాచకుండా తాను తెలుసుకున్న విద్యను తోటివారికి అందించటమే, విద్యా " జ్ఞానము " వళ్ళ మానవులకు మంచి చెడులు తెలుసుకొని మాయ మాటలకు నమ్మకుండా జీవితాన్ని ఓర్పుతో నేర్పుతో సరి దిద్దు కోవటమే ముఖ్యమైన లక్షణం. .
విద్య లేని వారు వింత పశువు అనే వారు, కానీ అది తప్పు, అందరు అందలం ఎక్కే వారయితే మోసేవారు ఎవరు అనే ప్రశ్న వస్తున్నది. కానీ అవిద్యా ప్రభావము వళ్ళ కొంత నిరుత్సాహము తప్పదు, ఆయినప్పడికి ప్రకృతి సహకారంతో, తోటి వారి సహాయముతో తాను సంపాదించినదే సంతృప్తిగా భావించితే జీవితం అంతా సుఖమయం. కానీ ఎదుటి వారిని చూసి ఆలోచించి, ఆరోగ్యాన్ని పాడు చేసుకోవటం, అసంతృప్తిగా ఉండటం అవసరమా ?
రాత్రి వచ్చే కల తెల్లవారితే మాయ మవుతుంది, దాని వళ్ళ ఎటువంటి హాని ఉండదు, కలలు రావటానికి కారణం మనలో ఉన్న అసంతృప్తి ఒక కారణం, మరియు మనం చూసిన కొన్ని సంఘటనలను ఉహించుకొని నిద్రపోవటం వల్లనే. అందుకే మనం నిద్రపోయేప్పుడు తల్లి, తండ్రి, గురువు, దైవాన్ని తలచుకుంటే మంచిది. శ్రమ తక్కువగాను ఆలోచన ఎక్కువగాను ఉండటం వళ్ళ కలలు ఱావచ్చును.
నా ఉద్దేశ్యములో ఏ రోజు పని ఆరోజే చేసుకొని రేపటి గురించి ఆలోచన చేయకుండా ఉండ గలిగిన వాడికి, బాగా కష్టపడి కడుపు నిండా భోజనము చేసిన వాడికి మంచిగా నిద్రవస్తుంది.
నమ్ముకున్నదానిపైన నిరంతరం దృష్టి ఉంచడం. ఒకసారి ఏదైనా చేయాలనే నిర్ణయానికి వస్తే ఎవడేమనుకున్నా వెనక్కు తిరక్కుండా ‘జంకుగొంకు లేక ముందు సాగిపొమ్మురా!‘ అనుకుని, అనుకున్నదాన్ని సాధించేవరకు కష్టించడం, ఫలితాన్ని మాత్రం మాట్లాడకుండా స్వీకరిచడం - మంచైనా చెడైనా తప్పదు. మనం మన మనస్సు బట్టి నిర్ణయాలు తీసుకుంటాం, సహకరించే వారి సలహాను పాటిస్తాం, సరైన జ్ఞానము వళ్ళ బుద్ధి వికసించుతుంది.
ఎర్రని పుష్పము క్రిష్టల్ ముందుంచి నప్పుడు ఎర్రదనం క్రిష్టల్ ల్లో ప్రతి బింబిస్తుంది. అట్లాగే మనచుట్టు వున్నా వారి ప్రభావము మనపై కొంత పడి, చేసేపనిలో కొంత ఆసౌకర్యము కలుగవచ్చు, ఆయన పట్టుదల విడవకుండా ప్రయత్నిమ్చటమే మానవులకు ఉన్న నిజమైనా ధర్మం.
ధన వనితాది విషయం భోగాలకు చిక్కకుండా విశ్వములో జీవితాన్ని సాగించాలి. బురద నీటిలో కలువ పువ్వు కాడ ఉండి పైన అందాలు విరజిమ్మే విధంగా ఉండే పువ్వుని గమనించాలి. సముద్రములో ఎగిరే చేపలు లాగా ప్రేమను పంచుకుంటూ ఒకరికి ఒకరై విశ్వములో జీవించాలి.
--((*))--
|
రుక్మిణీ సందేశము .(వివరణ ..... శ్రీ పిస్కా సత్యనారయణ గారు.) నాలుగవ పద్యము వ్రతముల్, దేవ గురు ద్విజన్మ బుధ సేవల్, దానధర్మాదులున్ గతజన్మంబుల నీశ్వరున్, హరి, జగత్కళ్యాణు గాంక్షించి చే సితినేనిన్ వసుదేవనందనుడు నా చిత్తేశుడౌగాక! ని ర్జితులై బోదురుగాక సంగరములో జేదీశ ముఖ్యాధముల్ ఈ పద్యములో తన పూర్వజన్మ సుకృతఫలంగా శ్రీకృష్ణుడే తనకు భర్తగా లభించాలని రుక్మిణి కోరుకుంటున్నది. వెనుకటి జన్మలలో నేను వ్రతములను, దేవతలకు, ఆచార్యులకు, బ్రాహ్మణులకు, జ్ఞానులకు సేవలను, దానధర్మాదులను సర్వేశ్వరుడైన శ్రీవిష్ణుమూర్తి యొక్క ప్రీత్యర్థం చేసివుంటే, ఈ జన్మలో నాకు వసుదేవనందనుడైన శ్రీకృష్ణుడే ప్రాణనాథుడు కావాలనీ, శిశుపాలాది నీచులు ఆ యదువీరుని చేతిలో సంగరరంగాన నిర్జింపబడాలనీ రుక్మిణి ప్రార్థిస్తున్నది. భగవంతుని ప్రీతి కొరకు ఆయనకు సేవాపరంగా కర్మలను ఆచరిస్తే, అవి భగత్ప్రాప్తిని కలిగిస్తాయని శ్రుతులు, స్మృతులు బోధిస్తున్నాయి. పుణ్యకర్మల చేత భగవానుడు తృప్తినొందినప్పుడు, తానే జీవులను చేబట్టి తన సన్నిధికి చేర్చుకుంటాడు. అందుకే "పుణ్యం కొద్దీ పురుషుడు" అంటారు. కాబట్టి తన పూర్వజన్మ పుణ్యఫలమే తన మనోభీష్టాన్ని పూర్తిచేయగలదని రుక్మిణి విశ్వాసం! "వసుదేవనందనుడు" అంటే వసుదేవుని కుమారుడైన శ్రీకృష్ణుడు. అందుకే ఆయనను "వాసుదేవుడు" అంటారు....... దశరథ పుత్రుడైన శ్రీరాముణ్ణి "దాశరథీ" అని సంబోధించడం కూడా ఇట్టిదే!రుక్మిణీ సందేశము . ఐదవ పద్యము మరి, ఐదవ పద్యములో రుక్మిణి ఏమంటున్నదో చూడండి. అంకిలి సెప్ప లేదు, చతురంగ బలంబుల తోడ నెల్లి యో పంకజనాభ! నీవు శిశుపాల జరాసుతులన్ జయించి, నా వంకకు వచ్చి, రాక్షసవివాహమునన్ భవదీయ శౌర్యమే యుంకువ సేసి కృష్ణ! పురుషోత్తమ! చేకొనిపొమ్ము! వచ్చెదన్. ఈ పద్యములో శ్రీకృష్ణుడు తనను చేపట్టవలసిన విధానాన్ని రుక్మిణి విన్నవిస్తున్నది. పంకజనాభుడవూ, పురుషశ్రేష్ఠుడవూ అయిన ఓ కృష్ణా! నీవు అడ్డు చెప్పేందుకు కారణమేమీ లేదు. రథ, గజ, తురగ, పదాతి చతురంగబలములతో నీవు విచ్చేసి, శిశుపాల జరాసంధులను జయించి, నా వద్దకు వచ్చి, క్షత్రియోచితమైన రాక్షసవివాహ పద్ధతిలో నన్ను పరిగ్రహించి తీసికొని వెళ్ళు. నేను నీ వెంట వస్తాను. ఇదీ ఈ పద్య భావము. (మగధ చక్రవర్తియైన జరాసంధుడు తన కూతుళ్ళు ఇద్దరిని కంసునికి ఇచ్చి వివాహం చేశాడు. తన అల్లుడు కంసుని హతమార్చిన శ్రీకృష్ణునిపై పగతో ఉన్నాడు. ఇతడు శిశుపాలునికి, రుక్మి కి మిత్రుడు.) విష్ణుమూర్తి పద్మనాభుడు. ఈ విశ్వాన్ని సృజించిన సృష్టికర్తయైన బ్రహ్మదేవుని యొక్క జన్మస్థానము విష్ణుమూర్తి బొడ్డులో నుండి మొలిచిన కమలము. నాభి నుండి ఆరంభమైన ఆలోచన, సంకల్పము స్థిరమైనవి, అమోఘమైనవి. అందువల్ల ఆ పంకజనాభుడైన వాసుదేవుడు తలచుకుంటే ఏ కార్యమైనా ఎలాంటి అవాంతరం లేకుండా నిర్విఘ్నంగా నెరవేరుతుందనే అర్థం ఈ "పంకజనాభ!" అనే సంబోధనలో స్ఫురిస్తున్నది. వ్యాసమహర్షులవారి "సంస్కృత భాగవతము" లో "నీవు రహస్యంగా విదర్భకు వచ్చి, రాక్షసవివాహ పద్ధతిలో నన్ను పరిగ్రహించు" అని రుక్మిణి విన్నవించినట్టుగా ఉంది. సాక్షాత్తూ శ్రీమన్నారాయణుని అంశయైన గోపాలుణ్ణి రహస్యంగా రమ్మనడం పోతనగారికి నచ్చినట్లు లేదు. అందుకే, బాహాటంగా చతురంగబలాలతో రమ్మంటున్నది పోతనగారి రుక్మిణి! ఇకపోతే, వివాహాలు 8 రకములని పెద్దలు చెప్పారు. ఈ ఎనిమిదింటిని "అష్టవిధ వివాహములు" గా మన పూర్వులు వర్గీకరించారు. 1) బ్రాహ్మము : ప్రతిఫలాపేక్ష లేకుండా సాలంకృతయైన కన్యను సమర్థుడైన వరునకు ఇచ్చి వివాహం చేయడం. 2) దైవము : కన్యాదాత యజ్ఞం చేసి, ఋత్విక్కును పూజించి, అతనికి కన్యను ఇచ్చి పెళ్ళి చేయడం. 3) ఆర్షము : కన్య తల్లిదండ్రులు వరుని నుండి గోమిధునాన్ని స్వీకరించి, శాస్త్రవిధేయంగా కన్యను ఇచ్చి వివాహం చేయడం. 4) ప్రాజాపత్యము : ' నేను సంతానార్థం పెళ్ళి చేసికొని, గృహస్థాశ్రమధర్మాలు ఆచరిస్తాను ' అని వరునితో ప్రతిజ్ఞ చేయించి, కట్నకానుకల ప్రసక్తి లేకుండా పెళ్ళి చేయడం. 5) రాక్షసము : కన్య తనకు నచ్చినవానిని తనవారి అంగీకారం ఉన్నా, లేకపోయినా (వరునిచే బలాత్కారంగానైనా సరే తీసుకొని వెళ్ళబడి) వివాహం చేసుకోవడం. 6) ఆసురము: కన్యాశుల్కం ఇచ్చి పెళ్ళి చేసుకోవడం. 7) గాంధర్వము: పెద్దల ప్రమేయం లేకుండా వధూవరులు పరస్పర ప్రేమానురాగాలతో చేసుకొనే వివాహం. 8) పైశాచము: స్పృహలేని, తనను తాను రక్షించుకోలేని దశలో ఉన్న కన్యను, కేవలం కామదృష్టితో పెళ్ళి చేసుకోవడం. వీటిలో గాంధర్వము, రాక్షసము అనేవి క్షత్రియులకు శాస్త్రసమ్మతమైనవని "మహాభారతము - ఆదిపర్వము" లో చెప్పబడింది - "గాంధర్వ రాక్షసే క్షత్రే ధర్మ్యౌతౌ మా విశంకిధాః" అని. స్త్రీపురుషులు పరస్పరం ఒకరినొకరు ఇష్టపడి, రహస్యంగా వివాహం చేసుకోవడం ' గాంధర్వము ' అనబడుతుంది. "మహాభారతము" లో శకుంతలా దుష్యంతుల పరిణయం ఈ పద్ధతిలోనే జరిగింది. పురుషుడు తనను ఇష్టపడిన స్త్రీని ఎత్తుకువెళ్ళి వివాహం చేసుకోవడం ' రాక్షసము ' గా చెప్పబడింది. "మహాభారతము" లోనే భీష్ముడు తన తమ్ముడైన విచిత్రవీర్యుని కొరకు కాశీరాజు కూతుళ్ళైన అంబ, అంబిక, అంబాలికలను స్వయంవరమంటపములోని రాజులందరినీ జయించి, హస్తినాపురానికి తీసుకువచ్చి పెళ్ళి జరిపిస్తాడు. (వారిలో పెద్దదైన అంబ తాను సాళ్వుణ్ణి ప్రేమించానని చెప్తే, ఆమెను వెనక్కి పంపిస్తాడు.) ఇటీవలి చారిత్రికకాలానికి వస్తే, జయచంద్రుని కుమార్తెయైన సంయుక్తను, పృథ్వీరాజు పైవిధంగా స్వయంవరమంటపము నుండి ఎత్తుకెళ్ళి వివాహం చేసుకుంటాడు. ఈ సంఘటనలు రాక్షసవివాహ పరిధిలోకి వస్తాయి. ఇక్కడ రుక్మిణి సైతం తనను రాక్షసవివాహ పద్ధతిలో పరిగ్రహించమని ఆ దేవదేవుణ్ణి అర్థిస్తున్నది. అది క్షత్రియోచితమైన కార్యమే కనుక, ఎవరికీ ఆక్షేపించే అవకాశం లేదని ఆమె భావన. ఇక, ఆరవ పద్యము. | |||
రుక్మిణీ సందేశము (చివరిభాగము) ( కృతజ్ఞతలు ... శ్రీ పిస్కా సత్యనారయణ గారికి. వారి అద్బుత వివరణకు కు మా అభినందనలు.) ఎనిమిదవ పద్యము ప్రాణేశ! నీ మంజుభాషలు వినలేని ........ కర్ణరంధ్రంబుల కలిమి యేల? పురుషరత్నమ! నీవు భోగింపగాలేని ........ తనులత వలని సౌందర్యమేల? భువనమోహన! నిన్ను బొడగానగాలేని ........ చక్షురింద్రియముల సత్త్వమేల? దయిత! నీ యధరామృతం బానగాలేని ........ జిహ్వకు ఫలరస సిద్ధి యేల? నీరజాతనయన! నీ వనమాలికా గంధ మబ్బలేని ఘ్రాణమేల? ధన్యచరిత! నీకు దాస్యంబు సేయని జన్మమేల యెన్ని జన్మములకు?! రుక్మిణి పంపిన ప్రణయసందేశములోని చివరి పద్యం ఇది. "శ్రీకృష్ణా! మనోజ్ఞమైన నీ మాటలు వినలేని చెవులు, నీవు అనుభవించడానికి అక్కరకురాని ఈ దేహసౌందర్యము, నిన్ను చూడడానికి నోచుకోని కన్నులు, నీ అధరామృతాన్ని గ్రోలలేని నాలుక, నీ వనమాలికా పరిమళమును ఆఘ్రాణించలేని నాసిక, నీకు సేవ చేయలేని ఈ మానవజన్మ నిష్ప్రయోజనం కదా!" అంటున్నది రుక్మిణీరమణి. మానవ శరీరం పంచేంద్రియముల సంపుటి. చెవులున్నాయి వినడానికి. చేతులున్నాయి తాకడానికి. కళ్ళున్నాయి చూడడానికి. జిహ్వ ఉన్నది రుచులను ఆనడానికి. నాసిక ఉంది వాసన చూడడానికి. ఇవి సర్వప్రాణులకు సహజమైన లక్షణాలు. ఐతే, రుక్మిణి దృష్టిలో పాంచభౌతికమైన తన శరీరానికి పరమావధి వేరు. ప్రాణేశ్వరుని సమాగమం, ఆ సమాగమం వల్ల కలిగే మహానుభవం తన పంచేంద్రియాల కలిమికి పరమార్థమని ఆమె భావన! ఈ అవయవాలన్నింటికీ సార్థక్యం అదేనని ఆమె విశ్వాసం!....... శరీర సాకల్యానికీ, జన్మ సాఫల్యానికీ చేసిన మహోదాత్త సమన్వయం ఈ పద్య ప్రసూనం! ఈ సందర్భములో, ఈ పద్యానికి సంబంధించిన నా స్వానుభవం ఒకటి ఉటంకించకుండా ఉండలేకపోతున్నాను!........ నాకు బాగా ఇష్టమైన పద్యాల్లో ఇది ఒకటి. చాలారోజుల నుండి, ఈ పద్యమును విన్నప్పుడల్లా నాలో ఒక సందేహం కదలాడుతూ ఉండేది. ఇది సీసపద్యం. సీసపద్యానికి 4 పాదాలు, చివరలో ఎత్తుగీతి ఉంటాయని మనందరికీ తెలిసినదే! ఐతే, పోతనగారు మొదటిపాదములో చెవులనూ, రెండవపాదములో తనువునూ, మూడవపాదములో నేత్రాలనూ, నాల్గవపాదములో జిహ్వనూ ప్రస్తావించి, ఎత్తుగీతిలో నాసిక గురించి చెప్పారు. నాకు ఏమనిపించేదంటే, 'ఒక్కొక్క పాదములో ఒక్కొక్క అవయవమును అభివర్ణించిన కవీశ్వరులు, 2వ పాదములో మాత్రము సర్వావయవ సమ్మిళితమైన శరీరాన్ని ఎందుకు చెప్పారు?!... ఎత్తుగీతిలో ప్రస్తావించిన నాసికను 2వ పాదములో చెప్పి, తనువును ఎత్తుగీతిలో చెప్పివుంటే ఇంకా బాగా ఉండేది కదా!' అనుకునేవాడిని. సంపూర్ణమైన ఛందోజ్ఞానం నాకు లేకపోవడంచేత, 'ఒకవేళ సీసపద్యము యొక్క ఛందస్సు అందుకు అనుమతించలేదేమో!' అని నాకు నేనే సమాధానం చెప్పుకునేవాడిని. ఐనా, సంతృప్తి కలగక ఎవరైనా విజ్ఞులైనవారితో నా సందేహనివృత్తి చేసుకోవాలని అనుకున్నాను...... ఐతే, ఆశ్చర్యకరంగా నేను ఈ వ్యాసమును తయారుచేసుకునేటప్పుడే తటాలున మెరుపు మెరిసినట్టుగా నా సందేహానికి సమాధానం దొరికింది! అదేమిటో వివరిస్తాను. ఈ మానవ శరీరం పాంచభౌతికమైనదని ఇంతకుముందే చెప్పుకున్నాము. అనగా, పంచభూతముల మేళవింపుతో తయారైనదన్నమాట! పంచభూతములు అంటే ఆకాశం, వాయువు, అగ్ని, జలము మరియు భూమి. వీటి ఆవిర్భావం ఏ వరుసలో జరిగినదో "భాగవతము" లో విశదంగా ఉంది. ప్రథమంగా అనంతమైన ఆకాశం ఉండేది. తర్వాత వాయువు, ఆపైన అగ్ని, ఆ పిమ్మట నీరు, అటుపైన భూమి ఏర్పడినాయని "భాగవతము" చెప్తున్నది. ఈ పంచభూతముల యొక్క ప్రధానగుణములు సైతం "భాగవతము"లో చెప్పబడ్డాయి. అవి ఎలాగంటే, వరుసగా శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు అనబడే గుణములు. అనగా, మొదటిదైన ఆకాశమునకు శబ్దగుణము, రెండవదైన వాయువుకు స్పర్శగుణము, మూడవదైన అగ్నికి రూపము, నాల్గవదైన నీటికి రసగుణము, చివరిదైన పుడమికి గంధగుణము ప్రధానమైనవని చెప్పారు మన మహర్షులు. మనం చెప్పుకుంటున్న సీసపద్యములో పోతనామాత్యులు ఈ క్రమాన్నే పాటిస్తూ, వరుసగా ఒక్కొక్క పాదములో ఒక్కొక్క గుణానికి సంబంధించిన శరీరావయవమును వర్ణించారు. శబ్దగుణముకు ఆలంబనం కర్ణములు కనుక వాటిని మొదటిపాదములో, రెండవదైన స్పర్శగుణానికి ప్రాతినిధ్యం వహించేది చర్మమే కాబట్టి 2వ పాదములో తనువును, మూడవదైన రూపగుణానికి ప్రతినిధులుగా 3వ పాదములో నయనాలను, నాల్గవదైన రసగుణానికి 4వ పాదములో రసనను అనగా నాలుకను, చివరిదైన గంధగుణానికి ఆలంబనమైన నాసికను ఎత్తుగీతిలో పేర్కొన్నారు. పైవిధంగా పర్యాలోచించి చూసుకుంటే, నా సందేహం మబ్బుతెరలా విడిపోయింది. ఈ పద్యములో పురుషోత్తముని వనమాలికను ప్రస్తావించారు పోతనగారు. దీని గురించి ఒకమాట! ' వనమాలిక ' అంటే 5 రకముల పుష్పములతో కూర్చబడి, దేవదేవుని గళం నుండి చరణయుగళం దాకా (కంఠం నుండి పాదముల వరకు) వ్రేలాడుతూ ఉండే పూలమాల. దీనికే "వైజయంతిమాల" అని పేరు....... పరమ భాగవతోత్తముడైన విప్రనారాయణుడు ఈ వైజయంతిమాల అంశతోనే జన్మించినాడని అంటారు. సారంగు తమ్మయ అనే కవీశ్వరుడు విప్రనారాయణుని కథను "వైజయంతీ విలాసము" అనే పేరిట కావ్యంగా వెలయించాడు. మొత్తం మీద రుక్మిణీసందేశములోని ఈ చివరి పద్యము రుక్మిణి దాస్యభక్తితో పాటు, పోతన కవితాశక్తిని ప్రస్ఫుటంగా ప్రదర్శిస్తున్నది. *** *** *** *** రుక్మిణీసందేశ రూపకంగా ఉన్న 8 పద్యాలను నా చేతనైనంతమేరకు వివరించే ప్రయత్నం చేశాను. సాహితీమిత్రులు నా ఈ ప్రయత్నాన్ని సమాదరిస్తారని ఆశిస్తున్నాను. | ||