Monday, 22 August 2016

om sri Ram


ఓం శ్రీ 


*మా  బంగారు చెల్లి పెళ్లి  (పెళ్లిళ్ల సందర్భముగా నా కవిత)

మా ఇంటి బంగారు తల్లి
మా మమతల  మళ్ళీ
మా అందరి గారాబాల చెల్లి
ఇప్పుడే జరుగు తున్నది పెళ్లి

మా చెల్లి చదువుల తళ్లి
మా చెల్లి లక్ష్మిని చేకూర్చే కల్పవళ్లి
మా చెల్లి నిత్యమూ ఉదయించే మళ్లి
మేమందరము కలసి చేస్తున్నాము పెళ్లి

ఆకాశమంత పందిరి వేసి, భూదేవి అంతా పీట వేసి
బంగారు పళ్ళెరములో  ముత్యాల తలంబ్రాలు చేసి
మనసంతా రంగరించి పల్లకీలో ఉరిగింపు చేసి
మంగళతోరణాల మధ్య, వాయిద్యాలమధ్య చేస్తున్న పెళ్లి    

భాజా బజంత్రీలు వాయిస్తున్నారు మళ్లీమళ్లి
స్త్రీలు పెద్దలు పిన్నలు అందరూ దివిస్తున్నారు వచ్చి వెళ్లి
మా లోగిళ్ళలో సంబరం జరుపుకుంటున్నారు మళ్లి
మా ఆత్మీయతతో, ఆనందాంతో, అనురాగంతో చేస్తున్న పెళ్లి

మెట్టినింటికి పుట్టినింటికి మమతానురాగాలు అందించే తళ్లి
మనసును పంచి మనువాడే మనసునుదోచె మకరంద మళ్లి
ఎవ్వరి మనసును నొప్పించక మనసును శాంతపరిచేది మా చెళ్లి
దేవతలారా దీవించండి జరుగుతున్నది మా  బంగారు చెల్లి పెళ్లి 
   
--((*))--


* ప్రశాంతత


మనసుకు మనసుకు మధ్య ఉండు వేదాంతం
మనిషికి మనిషికి మధ్య ఉండు ఏకాంతం
మమతకు మమతకు మధ్య ఉండు రాద్ధాంతం
తనువుకు తనువుకు మధ్య ఉండు ఒంటితనం

మనిషి సంపాదన చుట్టూ కమ్ముకుంటుంది వలయం
మనిషికి దానం సుఖ యాత్రకు ఒక దివ్య ఔషధం   
మనిషికి ప్రేమతో ఉన్న చెలిమి ఉంటే శుభ ప్రదం
మనిషికి మమతానురాగాలు తోడు ఉంటే ప్రపంచం

మనిషి పలకరింతల్లోని పులకరింతలే ఆహ్వానం
మనిషికి  కరచానాల్లోని కల్లమెరుపులే ఆనందం
మనిషి మనుగడ ప్రస్నార్ధకం కాక ఉండాలి మార్గం  
మళ్ళీ మళ్ళీ మనసును ప్రేమగా మార్చుట తత్త్వం
 
మనిషి ఆలింగనాల్లోని ఆత్మీయతను గ్రహించి
తల్లితండ్రుల లోని ముద్దుమురిపాలను గ్రహించి
మనస్సు అనేది చలువ పందిరిలాంటిదని గ్రహించి
ఆనంద బాష్పాలతో పెద్దలను అభిషేకించు  

మనిషి యొక్క ప్రయాణానికి అంతు లేదంటా
అత్యాశ లేని బ్రతుకులకు కొదవ లేదంటా
మమకారంతో ఉంటాయి బాధలు, బాధ్యతలంటా
అందుకే మనసంతా ప్రశాంతముగా ఉంచుకోవాలంటా
--((*))--


*మధురవాణి

పట్టుదల ఉన్నది -
విజయం మనదేనంటున్నది
మౌనం వద్దంటున్నది -
సంతోషం పంచుకోమంటున్నది

భావం తెలుప మంటున్నది -
భాషకు విలువ పెంచమంటున్నది
స్త్రీలకు గౌరవం పెరుగుతున్నది -
ధైర్యముగా బ్రతకాలంటున్నది

మనసుతో నవ్వమంటున్నది -
నవ్వులు పంచి బ్రతకమంటున్నది
కన్నీటిని అదుపు చేయద్దన్నది -
వెలుగుకు కన్నీటి సాక్షమన్నది

ప్రమిదకు వెలుగివ్వాలని తపన ఉన్నది-
స్నేహితులతో కలసి వెలుగిస్తున్నది
భంగ పడవద్దన్నది -
ఓర్పుకు అది ఒక పరీక్షయని తలవమన్నది

కాంతి ధార పంచమన్నది -
నిగ్రహశక్తితో నలుగురిని బ్రతికించమన్నది
నేల చినుకును కోరుకుంటుంది -
నింగి సహకారంతో పులకరించిపోతుంది

మధురవాణి మనవెంటే ఉన్నది -
మమతలు పంచుతూ విజ్ఞావంతులుచేయమన్నది
తనువును స్పర్శ అవసరమన్నది -
జిహ్వచాపల్యంనకు స్పర్స్ సుఖమన్నది

రచ్చబండ రాజకీయ మొద్దన్నది
ఉడతలా సహాయ బడమన్నది
వయసుని బట్టి ప్రవర్తించమన్నది
వానరుడులా సహాయపడుతూ బ్రతకమన్నది

--((*))--


* కొత్త జిల్లాలు (భావ కవిత )

రాష్ట్ర ప్రగతి కోసం మనప్రభుత్వం
ప్రజల ముందుకు ప్రగతి పధంగా
రాష్టంలో కొన్ని కొత్త జిల్లాలను
ఏర్పాటుకు ఏకగ్రీవం
కొత్త జిల్లాలకు స్వాగతం, సుస్వాగతం

ప్రజా సమస్యలను తీర్చుటకు
ఆధునిక అభివృద్ధి కొరకు
విద్య , వైద్య, అనేక ఉద్యోగాల కొరకు
ప్రజల నాడి తెలుసుకొని ప్రగతి బాటకు
ప్రభుత్వమూ, మేదావాలు ఆలోచించి
కొత్త జిల్లాలకు స్వాగతం, సుస్వాగతం

కొత్త మార్పులు కోసం
కోరుకున్న వారిఆశలకోసం
కమిషన్ల బ్రతుకుల కోసం
కార్యదక్షుల క్రమశిక్షణ కోసం
ప్రత్యక్షముగా ప్రజలకు
స్సహాయ సహకారం అందించటం కోసం

వస్తూన్నాయి వస్తున్నాయి కొత్త జిల్లాలు
కొత్త జిల్లాలకు స్వాగతం, సుస్వాగతం

నవనాయకులకు పసందు
నవ తేజో వంతులకు ఉద్యోగాల విందు
ఆగి ఆగి అలోచించి ప్రజల మేలు కొరకు
కొత్త జిల్లాలు గా మారుస్తున్నారు ముందు

కొత్త జిల్లాలకు స్వాగతం, సుస్వాగతం
--((*))--

*కొత్తపాట (ధైర్యాన్ని పెంచే తాతగారి పాట  )

ఓ వీరుడా, ఓ ఓ ధీరుడా, కల్లు తెరచి నిజం తెలుసుకో
శ్రీ కృష్ణుడిలా శంఖం పూరించు, అర్జునిడిలా అధర్మాన్ని ఎదిరించు
మానవత్వాన్ని బ్రతికించుటకు ధైర్యముగా ముందుకు సాగిపో సాగిపో

సత్యం పలకని చోట, ధర్మం గెలవని చోట
న్యాయం నిలవని చోట, నివే ధైర్యంగా చేయాలి వేట

నిన్ను నీవు రక్షించు కోవటం కాదు
నమ్మిన సిద్దాతాన్ని బ్రతికించటం నేర్చుకో
అవసరాన్ని బట్టి, ప్రకృతిని బట్టి మారుట నేర్చుకో
క్రూరమ్రుగాలను, కిరాతాకులను వేటాడుట నేర్చుకో

ఓ వీరుడా, ఓ ఓ ధీరుడా, కల్లు తెరచి నిజం తెలుసుకో
మానవత్వాన్ని బ్రతికించుటకు ధైర్యముగా ముందుకు సాగిపో సాగిపో

కలికాలంలో దుర్మార్గానికి ఎవ్వరూ బలి కాకుండా ఆదుకో
ప్రతిఒక్కరి మనసును మార్చుటకు వెయ్యాలి కొత్త బాట
తప్పదు తప్పదు అనుకుంటే చెయ్యాలి కత్తుల వేట

తప్పో ఒప్పో తెలియదు ఆనాడు కృష్ణుడు కురుక్షేత్రంలో ఆడిన ఆట
నీవే చేయాలి ఈనాడు దుర్మార్గులపై రణక్షేత్రంలో వేట

ఓ వీరుడా, ఓ ఓ ధీరుడా, కల్లు తెరచి నిజం తెలుసుకో
శ్రీ కృష్ణుడిలా శంఖం పూరించు, అర్జునిడిలా అధర్మాన్ని ఎదిరించు
మానవత్వాన్ని బ్రతికించుటకు ధైర్యముగా ముందుకు సాగిపో సాగిపో
--((*))--

విశ్వప్రేమ
(కరుణశ్రీ)
సీ.
ఏ ప్రేమ మహిమచే నీ ధారుణీచక్ర
మిరుసు లేకుండనే తిరుగుచుండు
ఏ ప్రేమమహిమచే నెల్ల నక్షత్రాలు
నేల రాలక మింట నిలిచియుండు
ఏ ప్రేమమహిమచే పృథివిపై బడకుండ
కడలిరాయుడు కాళ్ళు ముడుచుకొనును
ఏ ప్రేమమహిమచే నీ రేడు భువనాల
గాలిదేవుడు సురటీలు విసరు
గీ.
ఆ మహాప్రేమ - శాశ్వతమైన ప్రేమ -
అద్భుత మఖండ మవ్యక్తమైన ప్రేమ -
నిండియున్నది బ్రహ్మాండభాండమెల్ల
ప్రేయసీ ! సృష్టియంతయు ప్రేమ మయము ! !



...

No comments:

Post a Comment