గీతామృతబోధి (003)
గురువుగారు ఇంత ముందు చెప్పినటువంటి చిన్న కథకు మాకు ఐదు ప్రశ్నలు ఉదయించాయండి అందులో రైతుగా శిష్యులు లేచి వారి అభిప్రాయ తెలియపరుస్తున్నారు
✅ 1. నిత్యమైన అనిశ్చితి – భవిష్యత్తు ఎవ్వరికీ తెలియదు కదా గురువుగారు అడిగాడు మొదటివాడు
> గీతా సారము: బట్టి తెలియ పరుస్తా వినండి.
“న జాయతే మ్రియతే వా కదాచిన్ నాయం భూత్వా భవితా వా న భూయః”
(2.20) – ఆత్మకి జననమూ లేదు, మరణమూ లేదు.
మీ వాక్యం:
> “నిద్రపోవటం తెల్లవారితే లేవటం... రేపు ఏమి జరుగుతుందో ఎవ్వరు కనుగొనలేరు”
➡️ ఇది భగవద్గీతలో చెప్పిన జీవిత మాయ, అనిశ్చితి, అనిత్యత భావనకు తగ్గది. భవిష్యత్ అజ్ఞాతం అనేది మనం జ్ఞానం ద్వారా అర్థం చేసుకోవాలి అని గీతా బోధ.
***
ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:గీతామృతబోధి (002)
గీతా జీవన దర్పణం
ఒక్క సారి ఆలోచిస్తే?
మనం ఒక్క సారి ఆలోచిస్తే మనకు ప్రతి రోజూ కొత్తగా కనిపిస్తుంది, నిద్రపోవటం తెల్లవారితే లేవటం కష్ట బడటమ్ ఇదే జీవితం అని అందరికి తెలుసు కానీ రేపు ఏమి జరుగుతుందో మాత్రం ఎవ్వరు కనుగొనలేరు ఎందుకు? మనం అద్దం లో చూసామనుకో మనబొమ్మే కనబడుతున్నది కానీ వేరే బొమ్మ అక్కడ కనబడదు.
మంచి చెడు గమనించి బ్రతికే శక్తి మానవులకు ఉన్నది, కానీ జ్ఞానేంద్రియాలు తెలిపే ఆనందాన్ని దు:ఖాన్ని సమానంగా అనుభవిస్తాం.
సినిమా చూసి మనసు ఉల్లాసం ఉత్సాహం గా మార్చుకోవడం, లేదా భయాందోలనకు దిగుతాం, అది తెలిసి వెళతాం కానీ దాని వెనుక ఎందరో కృషి ఉన్నది, తెరమీద బొమ్మల రావటానికి ఒక ప్రొజక్టర్ ఉన్నది, దానికి కనిపించని కరంటు పంపితే గాని చిత్రాన్ని చూపలేదు. అనగా ఎదో శక్తి మనచుట్టూ పరిభ్రమిస్తూ ఉన్నది అనగా ప్రకృతిలో మారే ప్రతి చర్యకు ఎదో ఒక కారణం తప్పక ఉన్నది అని గ్రహించవలెను.
మనం ఏదైనా తెలుసుకోవాలంటే ఎవరినయినా ఆశ్రయించాలి, లేదా మనమే శోధన ద్వారా తెలుసు కోవాలి, తెలుసుకున్న దానిని ప్రపంచానికి తెలియ పరిస్తే అర్ధం చేసుకున్నవారికి కొంత మంచి ఉండవచ్చు, అర్ధం కానివారికి తేలిక భావంగా ఉండవచ్చు, అర్ధాన్ని ఆచరించటం, గమనించటమే మనకు అవసరము, చెడును వేలెత్తి చూపి మంచిని పెంచుట అవసరం, మానవులలో మార్పు రావటానికి సహకారం మరీ అవసరం.
ఎవరి శక్తి వారికి తెలియదు, ఎందు కంటే మన ఆలోచన మన సంసారం భాదలు సుఖాలు కమ్మి వేస్తాయి, ఏదైనా అడిగిన దానికి వెంటనే చెప్పలేరు. అంత మాత్రాణ శక్తి హీనులు కాదు, ఎందుకంటే మనలో అహం అడ్డు పడుతుంది, మనకెందుకు జరిగేవి జరుగక మానవు అని వాదనలో ఉండుట మంచిది కాదు. మనలో ఉన్న శక్తి తో ఎదుటి వానిలో ఉన్న జీవాన్ని ఉత్తేజ పరుచుటకు ప్రోత్సహించాలి. అది మంచి మాటలతో అందరిని ఉత్తేజ పరచాలి .
మానవులకు మానసిక పరిస్థితిని గ్రహించటం ఎవరి వళ్ళ కాదు, మెలుకవలో అంతర్గతముగా మనస్సులో కలిగే మార్పులే నిగ్రహ శక్తిని పెంచు తాయ్ నిద్రలో ఎటువంటి కలలు రాకుండా మనసు ప్రశాంతముగా నిద్రపోతే ఉషోదయం ఎప్పుడు ప్రశాంతముగా ఉంటుంది.
మన హృదయంలో విజ్ఞాన సంపద నిండి ఉంటుంది, అదే ప్రేమగా మారి సుఖ మార్గముగా చూపు తున్నది, గడియారం కదిలినట్లు గుండె చప్పుడుతో నిజమేదో గ్రహించు అని హెచ్చరిస్తున్నది అని తెలుసు కోవాలి. బుద్ది వికసించి బలహీనత నుండి బయట పడితే మానవ బలం పెరుగు తుంది.
సూర్యుని బింబము నీటిలో చూసి పట్టుకోవటానికి ప్రయత్నిమ్చే మనస్సు మనది, అది సాధ్యము కాదని మనకు తెలుసు, ఒక మూర్ఖుడుగా ప్రయత్నీమ్చితే ఫలితము ఉంటుందా ? మొండి వాదనకు దిగటం తప్ప, అది అవసరమా ?
కుండ నీళ్లలో ఉన్న సూర్యుణ్ణి పట్టలేము, తలయెత్తి నింగి నున్న సూర్యుణ్ణి చూడలేము కానీ నిత్యమూ దర్శనముగా ప్రత్యక్షంగా కనిపించే దేవుణ్ణి ఒక్కసారి రెండు చేతులతో నమస్కరించుటే మనం చేయగల నిజ స్థితి . అదేవిధముగా ప్రతిఒక్కరు తన తోటి వారికి వెలుగు చూపటం నేర్చు కోవాలి, కొవ్వొత్తి వెలుగు చూపి కరిగినట్లు మనం పరులకు సహాయం చేయటం, వెలుగును పంచటం వళ్ళ కష్టములు ఎదురైనా సంతృప్తి వళ్ళ మానవులకు జీవనా ధారము అని గమనించాలి . ***--(())--
2012 లో నేను వ్రాసిన కథ పై మీ అభిప్రాయం భగవద్గీత బోధకు పనికొస్తుందా?
శిష్యులారా పైన ఉదాహరించిన కథ నీ అభిప్రాయలు తెలియపరచండి దాని భవద్గీత అనుకరణగా కొన్ని తెలియపరుస్తాను
యింకా వుంది
✅ 2. 'అహం' - మన అహంకారమే మనకు అడ్డుగా ఉంది
అన్నారు కదండీ అవును...
> గీతా బోధ:లో
“అహంకారవిమూఢాత్మా కర్తాహమితి మన్యతే” (3.27)
అహంకారంతో మూర్ఖుడు "నేనే కర్త" అని భావిస్తాడు.
మీ వాక్యం:
> “మనలో అహం అడ్డు పడుతుంది... అంత మాత్రాణ శక్తిహీనులు కాదు...”
➡️ గీతా స్పష్టంగా చెబుతుంది — మన కర్మలు ప్రకృతి గుణాల ప్రభావంతో జరుగుతాయి, మనం అహం వల్లే వాటికి కర్తలమని భావిస్తున్నాం.
---
✅ 3. ఇంద్రియ జ్ఞానం, అనుభవం, సినిమాను ఉపమానంగా చెప్పిన తీరు అర్ధం కాలేదు గురువుగారు
> గీతా ధ్యానం:
“ఇంద్రియాణి పరాణ్యాహుః...” (3.42)
ఇంద్రియాల కంటే మనస్సు, ఆపై బుద్ధి, ఆపై ఆత్మ ప్రబలమైనవి.
మీ వాక్యం:
> “జ్ఞానేంద్రియాలు తెలిపే ఆనందాన్ని దుఃఖాన్ని సమానంగా అనుభవిస్తాం... తెరమీద చిత్రం – కాని వెనుక కరెంటు, ప్రొజెక్టర్ ఉన్నారు...”
➡️ ఇది గీతలో చెప్పిన దృశ్య ప్రపంచం వెనుక ఉన్న అదృశ్య మూలకారణం అనే భావనకు నిండు ప్రతిబింబం. మీరు సినిమాను రూపకంగా ఉపయోగించి దీన్ని అందంగా చెప్పారు.
*****
✅ 4. “వెలుగు పంచటం – కొవ్వొత్తిలా కరిగి వెలుగు ఇవ్వడం” ఏలా
> గీతా బోధ:
“తమసః పరస్థాత్” — (గీత 15.6)
దివ్య లోకములు చీకటి నివారించినవి.
లేదా
“యదాదిత్యగతం తేజో జగద్భాసయతేఽఖిలమ్...” (15.12)
➡️ మీరు చెప్పిన “వెలుగు పంచటం” భావన గీతలో చెప్పే జ్ఞానప్రభ, ఆత్మ వెలుగు, ఇతరులకు జ్ఞానం పంచే యోగి భావనలతో అనుసంధానించవచ్చు.
---
✅ 5. మార్పు కోసం పరిశీలన, ప్రయోగం, ఆచరణ – జ్ఞానాన్ని విస్తరించడం సమమా
> గీతా ధర్మం:
“తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా” (4.34)
జ్ఞానిని ఆశ్రయించి, ప్రశ్నించి, సేవచేసి జ్ఞానం తెలుసుకో.
➡️ మీరు చెప్పిన “ఎవరినైనా ఆశ్రయించాలి... లేకపోతే శోధన ద్వారా తెలుసుకోవాలి” అన్నది ఇదే భావాన్ని ప్రతిబింబిస్తుంది.
---
ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ:
గీతామృతబోధి (004)
ఒకరికి ఒకరు
ఈ విశ్వములో కేవలము విద్య ఒక్కటి మాత్రమే కాదు, విద్యతో పాటు వినయము కూడా ఉండాలి, వీటికి తోడు దానగుణము తప్పక ఉండాలి, అనగా విద్యను దాచకుండా తాను తెలుసుకున్న విద్యను తోటివారికి అందించటమే, విద్యా " జ్ఞానము " వళ్ళ మానవులకు మంచి చెడులు తెలుసుకొని మాయ మాటలకు నమ్మకుండా జీవితాన్ని ఓర్పుతో నేర్పుతో సరి దిద్దు కోవటమే ముఖ్యమైన లక్షణం. .
విద్య లేని వారు వింత పశువు అనే వారు, కానీ అది తప్పు, అందరు అందలం ఎక్కే వారయితే మోసేవారు ఎవరు అనే ప్రశ్న వస్తున్నది. కానీ అవిద్యా ప్రభావము వళ్ళ కొంత నిరుత్సాహము తప్పదు, ఆయినప్పడికి ప్రకృతి సహకారంతో, తోటి వారి సహాయముతో తాను సంపాదించినదే సంతృప్తిగా భావించితే జీవితం అంతా సుఖమయం. కానీ ఎదుటి వారిని చూసి ఆలోచించి, ఆరోగ్యాన్ని పాడు చేసుకోవటం, అసంతృప్తిగా ఉండటం అవసరమా ?
రాత్రి వచ్చే కల తెల్లవారితే మాయ మవుతుంది, దాని వళ్ళ ఎటువంటి హాని ఉండదు, కలలు రావటానికి కారణం మనలో ఉన్న అసంతృప్తి ఒక కారణం, మరియు మనం చూసిన కొన్ని సంఘటనలను ఉహించుకొని నిద్రపోవటం వల్లనే. అందుకే మనం నిద్రపోయేప్పుడు తల్లి, తండ్రి, గురువు, దైవాన్ని తలచుకుంటే మంచిది. శ్రమ తక్కువగాను ఆలోచన ఎక్కువగాను ఉండటం వళ్ళ కలలు ఱావచ్చును.
నా ఉద్దేశ్యములో ఏ రోజు పని ఆరోజే చేసుకొని రేపటి గురించి ఆలోచన చేయకుండా ఉండ గలిగిన వాడికి, బాగా కష్టపడి కడుపు నిండా భోజనము చేసిన వాడికి మంచిగా నిద్రవస్తుంది.
నమ్ముకున్నదానిపైన నిరంతరం దృష్టి ఉంచడం. ఒకసారి ఏదైనా చేయాలనే నిర్ణయానికి వస్తే ఎవడేమనుకున్నా వెనక్కు తిరక్కుండా ‘జంకుగొంకు లేక ముందు సాగిపొమ్మురా!‘ అనుకుని, అనుకున్నదాన్ని సాధించేవరకు కష్టించడం, ఫలితాన్ని మాత్రం మాట్లాడకుండా స్వీకరిచడం - మంచైనా చెడైనా తప్పదు. మనం మన మనస్సు బట్టి నిర్ణయాలు తీసుకుంటాం, సహకరించే వారి సలహాను పాటిస్తాం, సరైన జ్ఞానము వళ్ళ బుద్ధి వికసించుతుంది.
ఎర్రని పుష్పము క్రిష్టల్ ముందుంచి నప్పుడు ఎర్రదనం క్రిష్టల్ ల్లో ప్రతి బింబిస్తుంది. అట్లాగే మనచుట్టు వున్నా వారి ప్రభావము మనపై కొంత పడి, చేసేపనిలో కొంత ఆసౌకర్యము కలుగవచ్చు, ఆయన పట్టుదల విడవకుండా ప్రయత్నిమ్చటమే మానవులకు ఉన్న నిజమైనా ధర్మం.
ధన వనితాది విషయం భోగాలకు చిక్కకుండా విశ్వములో జీవితాన్ని సాగించాలి. బురద నీటిలో కలువ పువ్వు కాడ ఉండి పైన అందాలు విరజిమ్మే విధంగా ఉండే పువ్వుని గమనించాలి. సముద్రములో ఎగిరే చేపలు లాగా ప్రేమను పంచుకుంటూ ఒకరికి ఒకరై విశ్వములో జీవించాలి.
--((*))--
om sri raam
ReplyDelete