**
సాహిత్యం అంటే సహనం నుండి వచ్చేది
అనుభవాల అక్షర సత్యాలను తెలిపేది
కవి హృదయం అర్ధం చేసుకోవటం ఎలా చెప్పేది
పదానికి అర్ధాలు ఎన్నో, అర్ధం కానివారికి ఎం చెప్పెది
వనంలోకి ప్రేమికులు రావద్దంటే ఆగుతారా
ఇది జంతు సాహిత్యం చదవద్దంటే ఆగుతారా
మనుష్యులకంటే జంతువులే మేలని తెలియదా
భావాన్ని అర్ధం చేసుకోలేనివారికి బూతు అంటే ఎలా
ఉత్తమ సాహిత్యాన్ని ఆదరించటం అందరి కర్తవ్యం
మనో నిగ్రహశక్తి పెంచేది, ఆలోచిన్పచేసేది కవిత్వం
సరస్వతీ పుత్రులను విమర్సించటం అవివేకం
మనలోలేనిది ఇతరుల్లో ఉన్నది గ్రహించటమే వివేకం
--((*))--
( ప్రేమ )
లేదనకు నా మీద ప్రేమ
కాలమునకు లోబడి ప్రేమించాను
మనసుకు తట్టే మనోహర ప్రేమ
గంధపు గుబాళింపులతో ప్రేమించాను
నాది సమ న్యాయముగల ప్రేమ
మనకు సమస్యలుండవని ప్రేమించాను
మౌన మనస్సుతో పొందే ప్రేమ
మనసు మనసు కలవాలని ప్రేమించాను
ఘడియ ఘడియకు మారదు ప్రేమ
గగనంలా విస్తరించి పృద్విలా ప్రేమించాను
మరువ లేకున్నా మమతల ప్రేమ
మనమధ్య బలం ప్రేగాలని ప్రేమిస్తున్నాను
--((*))--
( తోడులేని ప్రేమ )
జాబిల్లి నన్నుచూసి ఆసహ్యంగా నవ్వుతున్నాడు
మలయ మారుతం నా దగ్గరకు రానంటున్నాడు
మత్తెక్కించే మరులుగొలిపే వేణుగానం లేదన్నాడు
పరిమళాలు వెదజల్లే పుష్పాలు వెక్కిరిస్తున్నాయి
నా ఊహల సప్తస్వరాలు నన్ను విడిచి పోయినాయి
సొగసు రెక్కలు విప్పారినమల్లెలు ముడుచుకున్నాయి
మధురరాత్రుల సవ్వడులు మనసుకు తాకనంటున్నాయి
నా తనువులో ఉన్న ఊహలు ఆవిరులై బిందువులైనాయి
మనసు నీతో సరాగాలకై ఆరాటపడుతున్నా ఫలితమేది
వయసు వేధింపులకు బ్రహ్మచర్యమే నాకు శుభమైనది
మనోనిగ్రహ శక్తితో వెచి ఉండుటే నాకు శ్రేయస్కరమైనది
ఎంత ఆలస్యమైనా ఓర్పు వహిస్తే అంతా ఆనందమయమే
--((*))--
(కధనం )
పురా సాహిత్య సహకారం
భాషా నైపుణ్యానికి శ్రీకారం
నవ నవాభ్యుదయ చరితం
కలియుగ కావ్య నాందిప్రస్తానం
లలిత సరళ పదాల తోరణం
రచనా చమత్కార వచనం
జీవిత వర్ణన బహుసులభం
మనస్సు తెలియుట గ్రాహ్యం
పదవిభజనే మూలవ్యాకరణం
ఇటికె ముడి సరుకుల మయం
అలంకారం ఆకర్షనకు చిహ్నం
నగిషి కోప్పతనానికి ఒక వరం
రక్త మాంసాదులతో ఉండేది దేహం
ధర్మా ధర్మాదులను తెలిపేది వాక్యం
మనసు పరి తపించేదే మూలభావం
గుండెచప్పుడుఉంటెనే మనిషికి ప్రాణం
జల, సాకామ్బర మేలికలయక రసం
సుఖదు:ఖాల జీవిత సమరమే కావ్యం
మనసుకు ఉల్లాస పరిచేది హృద్యం
సంఘటనల పరిమళం కధా కధనం
--((*))--
(ప్రయత్నం)
(
om
ReplyDelete