Friday, 14 February 2020

" -అఘనాశక గాయత్రీ స్తోత్రమ్

అఘనాశక గాయత్రీ స్తోత్రమ్
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥ప్రాంజలి ప్రభ 
సేకరణ : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 
🕉🌞🌏🌙🌟🚩
నారద ఉవాచ:-

 1) భక్తానుకమ్పిన్సర్వజ్ఞ హృదయం పాపనాశనమ్ ।

 గాయత్ర్యాః కథితం తస్మాద్గాయత్ర్యాః స్తోత్రమీరయ ॥

 2) ఆదిశక్తే జగన్మాతర్భక్తానుగ్రహకారిణి ।

 సర్వత్ర వ్యాపికేఽనన్తే శ్రీసన్ధ్యే తే నమోఽస్తు తే ॥

 3)త్వమేవ సన్ధ్యా గాయత్రీ సావిత్రీ చ సరస్వతీ ।

 బ్రాహ్మీ చ వైష్ణవీ రౌద్రీ రక్తా శ్వేతా సితేతరా ॥

 4) ప్రాతర్బాలా చ మధ్యాహ్నే యౌవనస్థా భవేత్పునః ।

 బ్రహ్మా సాయం భగవతీ చిన్త్యతే మునిభిః సదా ॥ 

5) వృద్ధా సాయం హంసస్థా గరుడారూఢా తథా వృషభవాహినీ ।

 ఋగ్వేదాధ్యాయినీ భూమౌ దృశ్యతే యా తపస్విభిః ॥

 6) యజుర్వేదం పఠన్తీ చ అన్తరిక్షే విరాజతే ।

 సా సామగాపి సర్వేషు భ్రామ్యమాణా తథా భువి ॥

7) రుద్రలోకం గతా త్వం హి విష్ణులోక నివాసినీ ।

 త్వమేవ బ్రహ్మణో లోకేఽమర్త్యానుగ్రహకారిణీ ॥

 8) సప్తర్షిప్రీతిజననీ మాయా బహువరప్రదా ।

 శివయోః కరనేత్రోత్థా హ్యశ్రుస్వేదసముద్భవా ॥ 

9) ఆనన్దజననీ దుర్గా దశధా పరిపఠ్యతే ।

 వరేణ్యా వరదా చైవ వరిష్ఠా వరవర్ణినీ ॥ 

10) గరిష్ఠా చ వరార్హా చ వరారోహా చ సప్తమీ ।

 నీలగఙ్గా తథా సన్ధ్యా సర్వదా భోగమోక్షదా ॥

 11) భాగీరథీ మర్త్యలోకే పాతాలే భోగవత్యపి ।

 త్రిలోకవాహినీ దేవీ స్థానత్రయనివాసినీ ॥ 

12) భూర్లోకస్థా త్వమేవాసి ధరిత్రీ లోకధారిణీ ।

 భువో లోకే వాయుశక్తిః స్వర్లోకే తేజసాం నిధిః ॥  

13) మహర్లోకే మహాసిద్ధిర్జనలోకే జనేత్యపి ।

 తపస్వినీ తపోలోకే సత్యలోకే తు సత్యవాక్ ॥

 14) కమలా విష్ణులోకే చ గాయత్రీ బ్రహ్మలోకగా ।

 బ్రహ్మలోకదా రుద్రలోకే స్థితా గౌరీ హరార్ధాఙ్గనివాసినీ ॥

15) అహమో మహతశ్చైవ ప్రకృతిస్త్వం హి గీయసే ।

 సామ్యావస్థాత్మికా త్వం హి శబల బ్రహ్మ రూపిణీ ॥ 

 16) తతః పరాపరా శక్తిః పరమా త్వం హి గీయసే ।

 ఇచ్ఛాశక్తిః క్రియాశక్తిర్జ్ఞానశక్తిస్త్రిశక్తిదా ॥ 

14) గఙ్గా చ యమునా చైవ విపాశా చ సరస్వతీ ।

 సరయూర్దేవికా సిన్ధుర్నర్మదేరావతీ తథా ॥ 

15) గోదావరీ శతద్రుశ్చ కావేరీ దేవలోకగా ।

 కౌశికీ చన్ద్రభాగా చ వితస్తా చ సరస్వతీ ॥

 16) గణ్డకీ తాపినీ తోయా గోమతీ వేత్రవత్యపి ।

 ఇడా చ పిఙ్గలా చైవ సుషుమ్ణా చ తృతీయకా ॥

 17) గాన్ధారీ హస్తిజిహ్వా చ పూషాపూషా తథైవ చ ।

 అలమ్బుషా కుహూశ్చైవ శఙ్ఖినీ ప్రాణవాహినీ ॥

 18) నాడీ చ త్వం శరీరస్థా గీయసే ప్రాక్తనైర్బుధైః ।

 హృతపద్మస్థా ప్రాణశక్తిః కణ్ఠస్థా స్వప్ననాయికా ॥ 

19) తాలుస్థా త్వం సదాధారా బిన్దుస్థా బిన్దుమాలినీ ।

 మూలే తు కుణ్డలీ శక్తిర్వ్యాపినీ కేశమూలగా ॥

 20) శిఖామధ్యాసనా త్వం హి శిఖాగ్రే తు మనోన్మనీ ।

 కిమన్యద్ బహునోక్తేన యత్కిఞ్చిజ్జగతీత్రయే ॥

21) తత్సర్వం త్వం మహాదేవి శ్రియే సన్ధ్యే నమోఽస్తు తే ।

ఇతీదం కీర్తితం స్తోత్రం సన్ధ్యాయాం బహుపుణ్యదమ్ ॥ 

 22) మహాపాపప్రశమనం మహాసిద్ధివిధాయకమ్ ।

 య ఇదం కీర్తయేత్ స్తోత్రం సన్ధ్యాకాలే సమాహితః ॥

 23) అపుత్రః ప్రాప్నుయాత్ పుత్రం ధనార్థీ ధనమాప్ను యాత్ ।

 సర్వతీర్థతపోదానయజ్ఞయోగఫలం లభేత్ ॥ 

24) భోగాన్ భుక్త్వా చిరం కాలమన్తే మోక్షమవాప్నుయాత్ ।

 తపస్విభిః కృతం స్తోత్రం స్నానకాలే తు యః పఠేత్ ॥

 25) యత్ర కుత్ర జలే మగ్నః సన్ధ్యామజ్జనజం ఫలమ్ ।

 లభతే నాత్ర సన్దేహః సత్యం చ నారద ॥ 

 26) శృణుయాద్యోఽపి తద్భక్త్యా స తు పాపాత్ ప్రముచ్యతే ।

 పీయూషసదృశం వాక్యం సన్ధ్యోక్తం నారదేరితమ్ ॥

॥ ఇతి శ్రీదేవీభాగవతే మహాపురాణే ద్వాదశస్కన్ధే పఞ్చమోఽధ్యాయే శ్రీఅఘనాశకగాయత్రీస్తోత్రం సమ్పూర్ణమ్ ॥

🕉🌞🌏🌙🌟🚩

మంత్రాల్లో శ్రేష్ఠం గాయత్రీ మంత్రం - సంధ్యాదేవత.. గాయత్రి

ॐॐॐॐॐॐॐॐॐॐ

సమస్త జీవులకు తేజస్సును, మనస్సును, బుద్ధిని ప్రేరేపించేది, మంచి మార్గాన నడిపించేది, సర్వలోకాలను సృష్టించేది, జ్ఞాన సరూపమైనది ‘గాయత్రి’. వేదమాత గాయత్రి కరుణామయి. పరమశాంత స్వరూపిణి. అడిగిన వారికి లేదనకుండా అన్నీ ఇచ్చే దయాసాగరి. అందుకే గాయత్రీ మాతను
*ఓం తత్స వితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహీ
ధియోయోనః ప్రచోదయాత్‌॥*

అంటూ స్తుతిస్తారు. ఏ మహాతేజం ఈ లోకమంతా వ్యాపించి సర్వాధిపత్యం వహిస్తుందో, ఏ తేజ పుంజం సర్వ చరాచర జీవ జాలాన్ని నడుపుతూ కర్మఫలాలను అనుభవింపచేస్తుందో ఆమే గాయత్రి. ఆ తల్లి దివ్యతేజస్సుతో బ్రహ్మాది దేవతలు సైతం ప్రభాభాసమయ్యారని పురాణాలు చెబుతున్నాయి.

 అత్యంత మహిమాన్వోపేతమైన గాయత్రీ మాత కరుణకు పాత్రులం కావడానికి గాయత్రీ మంత్రోపాసన ముఖ్య భూమికను పోషిస్తోంది. ఈ గాయత్రీ మంత్రం సూర్యపరంగా, శక్తిపరంగా, శివపరంగా, పరబ్రహ్మపరంగా, తేజోమయుడైన పురుషోత్తముని పరంగా ధ్యానింపబడుతోంది.
సర్వశక్తికి మూలప్రదమైన ‘గాయత్రీ’ పుట్టుక గురించి పురాణాలు ప్రముఖంగా ప్రస్తావించడం జరిగింది. ఈ చరాచర సృష్టిలోని అంధకారం నుంచి ‘జ్యోతి’ జన్మించింది. ఆ జ్యోతినుంచి విశ్వవ్యాపక తేజమగు ‘విష్ణువు’ జనించాడు.
ఆ మహావిష్ణువు రెండువ్రేళ్ళ రాపిడితో ‘నురుగు’ జన్మించింది.

 నురుగు నుండి ‘బుడగ’, బుడగనుంచి ‘గ్రుడ్డు’, గ్రుడ్డు నుంచి ‘ఆత్మ’, ఆత్మనుంచి ‘ఆకాశం’ ఆకాశం నుంచి ‘వాయువు’, వాయువు నుంచి ‘అగ్ని’, అగ్నినుంచి ‘ఓంకారం’, ఓంకారంనుంచి ‘వ్యాహృతులు’ వాటి నుంచి ‘గాయత్రి’ జన్మించింది.
మంత్రాల్లోకెల్లా శ్రేష్టమైనది గాయత్రీ మంత్రం. దీనివల్ల గరుడు నారాయణుడుగా మారతాడని శాస్త్రాలు చెబుతున్నాయి. దీనిని ‘గురుమంత్రమని’ బ్రహ్మోపదేశ మంత్రమని కూడా పిల్వడం జరుగుతోంది. అత్యంత శక్తివంతమైన, మహిమాన్వితమైన ఈ మంత్ర జపం వల్ల కాని కార్యాలంటూ ఏవీ ఉండవు. 

మూడు పాయలు కల్గిన ఈ మంత్రంలోని ఒక్కొక్క పాదానికి ఎనిమిది అక్షరాలు చొప్పున 24 బీజాక్షరాలున్నాయి. ఈ 24 బీజాక్షరాలలోనూ ఈ విశ్వంలోని సర్వవిజ్ఞానం నిక్షిప్తమై ఉంది. అలాగే ఈ మహామంత్రంలోని 24 బీజాక్షరాలు 24 దైవిక శక్తుల బీజాక్షరాలు. అంతేకాకుండా ప్రతి అక్షరానికి ఒక్కొక్క దేవత అధిపతియై, ఆయా దేవతల శక్తులు అంతర్లీనంగా ఇమిడి ఉన్నాయి. అందుకే ఇది మహామంత్ర రాజమైందని తాంత్రిక గ్రంథాలు చెబుతున్నాయి.

వాల్మీకి రామాయణానికి మూలాధారం గాయత్రీ మంత్రమేనని, గాయత్రీ మంత్రములోని ఒక్కొక్క బీజాక్షరానికి వెయ్యి శ్లోకాల చొప్పున 24వేల శ్లోకాలతో వాల్మీకి రామాయణాన్ని రచించడం జరిగిందని పురాణాల ద్వారా అవగతమవుతోంది.
గాయత్రీ మహామంత్ర మంత్రోచ్ఛారణ చేయునపుడు సాధకుని కంఠం, జిహ్వ, దంతాలు, శిరస్సు తదితరాల నుంచి ఒక విధమైన ధ్వని తరంగాలు జనిస్తాయట. ఆ విధంగా జనించిన స్పందనల వల్ల సాధకునిలోని సమస్త శక్తి కేంద్రాలు ఉత్తేజితమైన, చైతన్యాన్ని కల్గిస్తాయట.

 శ్రద్ధాశక్తులతో, విశ్వాసంతో గాయత్రీ జపం చేస్తే ఆత్మ, బుద్ధి, మనస్సు పవిత్రత చెంది బ్రహ్మశక్తి పుట్టి శుభాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి.
‘‘గాయతం త్రాయతే గాయత్రే’’
గాయత్రి జపం చేసే వారిని గాయత్రీయే కాపాడుతుందట. ఈ గాయత్రీ జపాన్ని త్రిసంధ్యలలో చేస్తే అత్యంత శ్రేయస్కరమని విజ్ఞులు చెబుతారు. ఉదయం పూట ఎర్రని వస్త్రాన్ని ధరించి గాయత్రీదేవిని దేవతగా ఏకాగ్రతతో ధ్యానించాలి.

 మధ్యాహ్నం తెల్లని వస్త్రం ధరించి సావిత్రిదేవిని దేవతగా భావించి ధ్యానించాలి. సాయంకాలం నీలి వస్త్రం ధరించి సరస్వతిదేవిని దేవతగా ఏకాగ్రతతో ధ్యానించాలి.
ఇలా ధ్యానించిన వారికి పగలు చేసిన పాపాలు పగలే నశించిపోతాయని, అలాగే రాత్రి చేసిన పాపాలు రాత్రే మటుమాయమవుతాయంటారు. గాయత్రీ జపంవల్ల ఆయుర్దాయం, బ్రహ్మవర్చస్సు పెరుగుతుంది.
లక్ష్మీకటాక్షంతోపాటు సంతాన ధన, ధాన్య వృద్ధి కలుగుతుంది. గాయత్రి శబ్దం ఉచ్చరించినంత మాత్రానే సంసార సాగరం నుంచి మోక్షం లభిస్తుంది.

 త్రిసంధ్యలలో త్రికరణ శుద్ధిగా గాయత్రిని ధ్యానించేవారిని ఆ గాయత్రి మాత తల్లివలే కాపాడి ధనధాన్య సుఖాలను ఐహిక సుఖాలనిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.
గాయత్రీ మంత్రాన్ని జపం చేసేవారు ప్రాతఃకాలంలోనే చేయడం శ్రేయస్కరం. బ్రాహ్మీముహూర్త కాలంలో నిద్రలేచి కాలకృత్యాదులు తీర్చుకుని, శుచియై, గాయత్రీ జపాన్ని చేయాలి. ఎవరి శక్తి అనుసారం వారు గాయత్రీ జపం చేయొచ్చు. అయితే ఇక్కడ ఏకాగ్రత ప్రధానం కానీ సంఖ్య కాదని గుర్తుంచుకోవాలి.
గాయత్రీ జపం చేసే వారిల్లు శుచి శుభ్రతలతో ఉండాలి.

 సాత్విక ఆహారమే తీసుకోవాలి. దూమ, మద్యపానాలకు దూరంగా ఉండాలి. మైలుపడిన వారిని తాకకుండా గాయత్రీ మాతను భక్తిశ్రద్ధలతో పూజిస్తూ, జపం చేయాలి. అలా చేసిన వారికి ఆ గాయత్రీమాత అభీష్టాలను నెరవేర్చి చల్లగా చూస్తుంది.
‘అమ్మా నీవే శరణు’ అన్న వారిని అనేక విధాలుగా ఆ తల్లి కాపాడుతుంది. ఆ తల్లినే ‘అన్యథా శరణం నాస్తి తల్లీ నీవే గతి, ఇహపరసుఖాలను నీవే ప్రసాదించు తల్లీ’ అంటే చాలు ఈ లోకంలోనే కాదు ఏ లోకాన తన భక్తులున్నా వారిని కంటికిరెప్పలాగా కాపాడుతుందా తల్లి. అందుకే అందరం కలసి అందాం. ’ఓం శ్రీ గాయత్రీ దేవతాభ్యోనమః‘

కాల చక్రాన్ని తన సంచారంతో నడిపించేవాడు సూర్యుడు. చండ మార్తాండ మం డల మధ్యలో సూర్యునికి అధిష్ఠాత్రి అయి, సూర్యునికి సత్తాస్ఫూర్తులను కలిగించే చిన్మయ చైతన్యరూపిణి- గాయత్రీమాత. సకల జగత్తును నియతగా నడిపేది- ధర్మం.

 అందరికీ ధర్మదేవత- గాయత్రి.
సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశికి వెళ్ళడానికి నెల రోజులు పడుతుంది. ఒక్కొక్క రాశిలో ఉన్నపుడు కొన్ని ప్రత్యేకతలుంటాయి. ప్రకృతిలో అనేక మార్పులు వస్తాయి. అవి మానవ శరీరం మీద, మనస్సు మీద ప్రభావం చూపుతాయి. అయితే పుట్టినప్పుడు- ఏ రాశిలో సూర్యుడు ఉ న్నాడో అది ముఖ్యమైన ప్రాణశక్తి. ప్రాణం మన శరీరంలో నాభి దగ్గర ఉంటుంది. అందుకే సృష్టించే బ్రహ్మదేవుడు, స్థితి కారకుడైన విష్ణుమూర్తి నాభి కమలంలోంచే ఆవిర్భవించాడు. అలాగే గర్భస్థ శిశువు నాభి, తల్లి నాభి కలుస్తాయి. 

ఇదే గర్భస్థ శిశువులకు ప్రాణ శక్తిని యిచ్చేది. బయటకు వచ్చిన తరువాత వేరు చేస్తారు. వేరవగానే సూర్యశక్తి ప్రాణశక్తిగా, పుట్టిన శిశువుకు సమకూరుతుంది. ఆ శక్తియే గాయత్రీమాత.
పిల్లలు ఎదిగినకొద్దీ వారికి- ప్రాణశక్తిని ఎలా పొందాలనే విషయమై ప్రాణాయామం, కుండలినీ శక్తి గురించి చెప్పి నేర్పించాలి. రోజూ మూడుసార్లు త్రిసంధ్యావేళల్లో ప్రాణాయామం చేస్తే బుద్ధి వికసిస్తుంది.

 పరిపూర్ణ ఆరోగ్యం చేకూరుతుంది. ఆ సంధ్యాదేవతే- గాయత్రీ మాత.
గాయత్రీమాత కాంతి లేక వెలుగు 
స్వరూపం, తేజోమయి. శక్తివంతమైన కాంతి, వెలుగులోకెల్లా వెలుగు. అది స్వయం ప్ర కాశం కలిగిన అఖండ వెలుగు. సూర్యుడిని సూర్యునిగా భాసింపజేసి, విశ్వానికి కనుపింపచేసే ‘ప్రభావతి’ గాయత్రీ మాత.

ప్రత్యక్ష కర్మసాక్షి- సూర్యభగవానుడు. మన కంటికి కనిపించే ఈ భౌతిక ప్రకాశమే ఆయన భర్గస్సు. ‘సవిత’ అంటే మానవబుద్ధి. బుద్ధిలో ప్రతిఫలించే జ్ఞాన తేజః కిరణాలే- భర్గస్సు.

 ‘సవిత’ అంటే పరబ్రహ్మస్వరూపము. చైతన్యవంతమయిన నామరూపాది రుూ విశ్వమే- భర్గస్సు అదే శక్తి స్వరూపం ఆ శక్తీ గాయత్రీమాత. ప్రాణుల దేహ గోళములందు కుండలినీ శక్తిగా మూలాధారాధి షట్చక్రములలో ఉంటుంది. ప్రాతఃకాలంలో కుండలినీ శక్తితో పవిత్ర తేజస్సును ధ్యానించినా, జపించినా- విశ్వ కల్యాణం జరుగుతుంది. ఇది గాయత్రీ మాత సర్వజనావళికి యిచ్చే రక్ష.

బాహ్య ప్రపంచంలో ఉండే పంచ భూతములు అనగా- పృథ్వి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము మన శరీరంలో కూడా ఉన్నాయి. సూర్య తేజస్సు ఉంది. విద్యుత్ అయస్కాంత శక్తి ఉన్నాయి.

 పంచభూతములలో సూర్యశక్తి ఉన్నది. దీనినే సోలార్ ఎనర్జీ అని అంటున్నారు. ప్రాణశక్తి నాడుల ద్వారా ప్రసరిస్తుంది. మన శరీరంలోని ముఖ్యమైన నాడులు- ఇడ, పింగళ నాడులు, వెన్నెముక వద్దనున్న సుషుమ్నానాడి. సూర్యుడు ప్రాణశక్తి ప్రదాత. అందుకే అగస్త్య మహర్షి శ్రీరామచంద్రునికి ఆదిత్య హృదయ స్తోత్రాన్ని ఉపదేశించాడు- దగ్గరలో వున్న ప్రాణశక్తి ప్రదాత సూర్యుడు కాబట్టి. అప్పుడే రాముడు రావణుని సంహరించేలా ‘శక్తి’మంతుడైనాడు. సూర్యునిలో ఉండే ప్రాణశక్తి- గాయత్రీమాత.

సద్బుద్ధిని, దీర్ఘాయుష్షుని, సత్సంతానాన్ని, గో సంపదను, కీర్తి ప్రతిష్ఠలను, బ్రహ్మ వర్చస్సును, ఓజస్సును, భ్రాజస్సును ప్రసాదించి, అంత్యమున మోక్షమును ప్రసాదించు కరుణామయి- గాయత్రీమాత అని అధర్వణ వేదం చెపుతోంది.
శివ,శక్తులలో భేదభావం లేదు. ఒకరికొరు ఆరాధ్యులు. శివుని ప్రేమను సంపాదించిన శక్తి శివుని మించిన వ్యక్తిత్వాన్ని పొందుతుంది. పరమాత్మను సేవించే భక్తులు భగవంతుని కంటే మిన్నగా ఉంటారు. అందుకే శక్తికి శిష్టులంటే చాలా ఇష్టం. మంచి మనసంటే తల్లికి ఎంతో అనురాగం. అలాంటివారి పూజలందుకొని, తన అమేయమైన స్వ యం జ్యోతిలో వారిని అనుగ్రహిస్తుంది.

 పరమ చైతన్య రూపంలో ఆమె చిచ్ఛిక్తి స్వరూపిణి. అయినా, జడపదార్థాలలో కూడా జగన్మాత జడశక్తి కూడి ఉంటుంది. ఆమె దృష్టిలో జడ చేతన భేదం లేదు. రెండింటిలో ఒకే పరతత్త్వం ప్రధానంగా ఉంటుంది. ఆ పరతత్త్వమే గాయత్రి.
‘‘గాయంతం త్రాయత ఇతి గాయత్రీ’’ -తనను గూర్చి గానం అనగా ధ్యానం చేసేవారిని రక్షించే వేదమాత గాయత్రీమాత. ఓంకారంతో ఆరంభించి, భూం, భువః సువః, మహః జనః తపః సతం- అనే సప్త వ్యాహృతుల్లో గాయత్రి నివసిస్తుంది.

 ఈ సప్త వ్యాహృతుల్లో, సప్తలోకాల సర్వసంపద ఇమిడి ఉంది. పగలు - రాత్రి, వెలుగు - చీకటి, జాగృతి- సుషుప్తి- వీటికి సంధిస్థలమైన సంధ్యలో గాయత్రి ప్రవేశిస్తుంది. ‘గతా భగవతీ రాత్రిః అహశ్శివ ముపస్థితం’ అన్న ఆర్ష వాక్యాల్లో సాంధ్యరాగంలోని శివశక్తి సాయుజ్యం స్పష్టంగా గోచరిస్తుంది. ఉదయం, సాయంత్రం సంధ్య వె లుగు కనిపించగానే గూళ్ళలోని పక్షులు గలగలా ధ్వనిచేస్తూ సంధ్యాదేవిని కీర్తిస్తాయి.

 సంధ్యాదేవత- గాయత్రి. సంధ్యా సమయాల్లో ఉపాసించినవారి యోగక్షేమములను ఆ తల్లే చూసుకుంటుంది.
ఋగ్వేద సూక్తములు, వాటియందలి సర్వ విశేషములతో ఏర్పడిన సామము, యజుర్వేద, అధర్వణ వేదములు, ఆ వేదములనుండి ఒక్కొక్క పాదముగా ఏర్పడిన గాయత్రీ మహామంత్ర హృదయము, సరిగమ పదని సంగీత సప్తస్వర సుందరులకు నిలయమని, ‘నాభి హృత్కంఠీ రసన నాసాదులలో ధర ఋక్యామాదులలో వరగాయత్రీ హృదయమున’ -అని గాయత్రీ మంత్రాన్ని సమన్వయపరుస్తూ ‘శోభిల్లు సప్తస్వర సుందరుల భజింపవే మనసా’ అని జగన్మోహినీ రాగంలో సద్గురు త్యాగరాజ స్వామి మనకందించిన గంభీర ఉదాత్త కీర్తన- గాయత్రీ మాత ఆరాధనకు స్ఫూర్తినిస్తుంది.

గాయత్రీ మంత్రంలోని ఇరువది నాలుగు అక్షరములను మూడు భాగములుగా చేస్తే- ఒక్కొక్క భాగానికి ఎనిమిది అక్షరాలు వస్తాయి. ఈ మూడు ఖండాలు- సృష్టి స్థితి లయలకు సూచికం. మొదటి ఖండం- ఋగ్వేదం, రెండవ ఖండం-సామవేదం, తృతీయ ఖండం- యజుర్వేదం అవుతాయి. ఇది వేదమాత గాయత్రీ మంత్ర అంతరార్థం.

వాల్మీకి మహర్షి ప్రతి వేయి శ్లోకాలకు మొదటి ఒక్కొక్క గాయత్రీ మంత్రాక్షరాన్ని చేర్చి, ఇరువది నాలుగు వేల శ్లోకాలతో శ్రీమద్రామాయణాన్ని రచించాడు. గాయత్రీ మంత్రాక్షర ఘటితమైన శ్రీమద్రామాయణం సర్వశక్తి స మన్వితం, కల్యాణప్రదం. అందుకనే ఇహపర సాధకమై జీవన్ముక్తికి సోపానమయింది శ్రీరామకథ.

సూర్యభగవానుడు- కాలప్రాముఖ్యతను తెలియచేసేవాడు. త్యాగమూర్తి, నిత్య కర్తవ్య పరిపాలకుడు. అందుకే మహర్షులు ‘‘మీరు కూడా సూర్యునివలే ఉండండని, ఆత్మ తేజస్సుని విసింపచేసుకోండి’’ అని చెప్తారు. సూర్యునిలోని సద్గుణ శక్తియే- గాయత్రి. సూర్యునికి, గాయత్రికి భేదం లేదు. సూర్య సహస్రనామావళిలో ‘గాయత్రీ జప సుప్రీతాయైనమః’’ అని ఉంటుంది.

‘‘సంధ్యాదేవీం, సావిత్రీం, వర గాయత్రీం, సరస్వతీం భజేహం’’ ప్రాతఃకాలము, మధ్యాహ్నము, సాయంకాలము- గాయత్రీ, సావిత్రీ, సరస్వతీ రూపములలో సంధ్యాదేవిని ధ్యానిస్తారని, వీటినే జన్మ, మధ్యమ, అస్తమయ జీవిత కాలములుగా చెప్తారు.

 గాయత్రీ పూజకు స్ఫూర్తిదాయకమైన ఈ కీర్తనను అందించాడు ముత్తుస్వామి దీక్షితులు దేవక్రియ రాగంలో. దేవీ అనుగ్రహంతో సంప్రాప్తించిన శక్తిని, సకాలంలో లోక కల్యాణానికి స్వార్థరహితంగా ఉపకరించి తరించాలని ఉద్బోధిస్తోంది- సద్బుద్ధి ప్రదాయిని, సం ధ్యాదేవత వేదమాత గాయత్రి.

🕉🌞🌎🌙🌟🚩

 గాయత్రీ పూజకు స్ఫూర్తిదాయకమైన ఈ కీర్తనను అందించాడు ముత్తుస్వామి దీక్షితులు దేవక్రియ రాగంలో. దేవీ అనుగ్రహంతో సంప్రాప్తించిన శక్తిని, సకాలంలో లోక కల్యాణానికి స్వార్థరహితంగా ఉపకరించి తరించాలని ఉద్బోధిస్తోంది- సద్బుద్ధి ప్రదాయిని, సంధ్యాదేవత వేదమాత గాయత్రి.

🕉🌞🌎🌙🌟🚩

🌹. సర్వ శుభములకు మూల మంత్రములు  -  ప్రతీరోజు 108 సార్లు 🌹
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. సంపదలకు : 🌻

ఈ క్రింది మంత్రాన్ని పటించినచో అమ్మవారి అనుగ్రహము మీకు ఎల్లప్పుడూ సర్వాభీష్ట దాయకముగా వుంటుంది.

శ్రీనిదిహి శ్రీవరః శ్రగ్వి శ్రీలక్ష్మీకర పూజితః !

శ్రీరధః శ్రీవిభుహు సింధు కన్యపతి రదోక్షజః !!
----

🌻. అదృష్టమునకు ఈ క్రింది మంత్రాన్ని పఠించండి. 🌻

భాగ్యప్రదో మహాసత్వో విశ్వాత్మ విగతజ్వరః!

సురచార్యర్చితో వస్యో వాసుదేవో వసుప్రదః!!
 ----

🌻. పాపవిముక్తికై : 🌻

ప్రణతార్ది హరిశ్రేష్ఠ శరణ్యః పాపనాశనః!

పావకో వారనాద్రిశో వైకుంటో వీత కల్మషః !!
--- 

🌻. విద్య, తెలివితేటలకు : 🌻

ఉద్గీత ప్రణవోద్గీత సర్వ వాగేశ్వరేశ్వర!

సర్వ వేదామయ ,సర్వవేదామయ చింత్య సర్వం భోధయ భోధయ!!
----

🌻. వివాహమునకు, దాంపత్యం, కుటుంబ అన్యోన్యతకు: 🌻

ఓం హరివల్లభాయై విశ్నుమనోనుకూలాయి!

దివ్యాయై సౌభాగ్యదాయినియై ప్రసీదప్రసీద నమః!!
ఓం నమో పురుషోత్తమాయ విష్ణవే లక్ష్మివల్లభాయ
సర్వ మంగళాయ శరణ్యాయ పరిష్టాయ ప్రరసీద ప్రసీద నమః
----

🌻. సుసంతానమునకై : 🌻

విప్రపుత్ర భరతశైవ సర్వమాతృ సూతప్రదః!

పార్ద విశ్వయకృత్ పార్ద ప్రణవర్ద ప్రభోధనః !!
---

🌻. ఆయురారోగ్యమునకై: 🌻

ఓం నమో నారసింహాయ వజ్రధ్రంష్టాయ వజ్రిణే !

వజ్రాయ, వజ్రదేహాయ నమో వజ్ర నఖాయ చ !!
-----

🌻. వ్యాపార వృద్ధి కొరకై : 🌻

ఓం నమో, మహా సుదర్శనాయ షోడషాయుధ భూషితాయ

సర్వశత్రువినాశకాయ ప్రత్యాలీదాయ త్రినేత్రాయ
జ్వాలా స్వరూపాయ సర్వతో భద్రాయ నమః !!
---

🌻. ప్రాణాపాయ రక్షణకై : 🌻

ప్రకార రూపాప్రాణేశీ ప్రాణ సంరక్షణి పరా !

ప్రాణ సంజీవని ప్రాచ్యాప్రాణిహి ప్రభోదిని !!

🌻. శాంతి, భక్తివైరాగ్యసిద్ధి కొరకు : 🌻

ఓం నమో యోగీశ్వరాయ యోగాయ

శుభదాయ శాంతిదాయ పరమాత్మనే !
జ్ఞానగమ్యాయ త్రుప్తాయ భక్తిప్రియాయ
హరయే పాహి పాహి నమః !!
ఓం శాంతి ! ఓం శాంతి ! ఓం శాంతి !!
🌹 🌹 🌹 🌹 🌹 

Friday, 31 January 2020

మహాభాగవతం అష్టమ స్కంధము - ప్రథమాధ్యాయము

ప్రాంజలి ప్రభ ... అంతర్జాల పత్రిక  (1) 

ప్రాతః కాల సందేశము, వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం, అష్టమ స్కంధము - ప్రథమాధ్యాయము,  మన్వంతరముల  వర్ణనము
 మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

రాజోవాచ

పరీక్షిన్మహారాజు అడిగెను- గురుదేవా! స్వాయంభువ మనువుయొక్క వంశ విస్తృతిని గూర్చి నేను వింటిని. అదే వంశమునందు అతని కుమార్తెల ద్వారా మరీచి మొదలగు ప్రజాపతులను తమవంశ పరంపరను కొనసాగించిరి. ఇప్పుడు ఇతర మనువులను గురుంచి వర్ణింపుడు.

మహాత్మా! జ్ఞానులు ఏయే మన్వంతరములలో మహిమాన్వితుడైన భగవంతుని యొక్క అవతారములను, లీలలను వర్ణించిరో, వాటిని నాకు తప్పక వినిపింపుము. నేను శ్రద్ధగా వాటిని వినగోరుచున్నాను.

జగత్పతియైన శ్రీహరి గడచిన మన్వంతరములలో చేసిన, వర్తమానమునందు చేయుచున్న, భవిష్యన్మన్వంతరములలో చేయబోవు లీలలను వినిపింపుము.

ఋషిరువాచ

శ్రీశుకుడు వచించెను మహారాజా! ఈ కల్పమునందు స్వాయంభువుడు మున్నగు ఆరుగురు మనువుల యొక్క మన్వంతరములు గడచిపోయెను. వాటిలో మొదటి మన్వంతరమును గూర్చి నేను వర్ణించితిని. అందులో దేవతలు మొదలగు వారి యొక్క ఉత్పత్తి జరిగినది.

స్వాయంభువమనువు కుమార్తెయైన ఆకూతియందు యజ్ఞపురుషుని రూపములో భగవానుడు జన్మించి, ధర్మములను  ఉపదేశించెను. అట్లే దేవహూతియందు ఆ ప్రభువు కపిల భగవానునిగా అవతరించి, జ్ఞానోపదేశమును చేసెను.

పరీక్షిన్మహారాజా! కఫిల భగవానునిగూర్చి మూడవ స్కంధములో వర్ణింపబడినది. ఇప్పుడు ఆకూతియందు యజ్ఞపురుషుడుగా అవతరించి చేసిన లీలలను వివరించెదను.

స్వాయంభువమనువు సకల విషయ భోగముల యెడ విరక్తుడై రాజ్యమును పరిత్యజించెను. పిమ్మట, తన భార్యయైన శతరూపతో గూడి తపమాచరించుటకై వనములకు వెళ్ళెను.

అతడు సునందానదీ తీరమున ఒంటి కాలిపై నిలబడి నూరు సంవత్సరములు తీవ్రమైన తపమొనర్చెను. ఆ సమయమున అతడు నిత్యము ఈ విధముగా భగవంతుని స్తుతించెను.

మనురువాచ

మనువు పలికెను పరమాత్మ చేతనను పొంది విశ్వము చైతన్యవంతమగును. కాని, విశ్వము మాత్రము ఆయనను చైతన్యవంతునిగా చేయజాలదు. ఆ ప్రభువు ప్రళయకాలమున నిద్రించు చున్నను మేల్కొనియే యుండును. ఆ విషయమును ఆయన ఎరుగును. కాని, విశ్వము మాత్రము  తెలియజాలదు. కనుకనే, అతడు పరమాత్ముడు.

ఈ సమస్త విశ్వమునందును, అందలి చరాచరప్రాణుల యందును ఆ పరమాత్మయే వ్యాపించియున్నాడు. కనుక, ఈ జగత్తునందలి యే పదార్థము నందును వ్యామోహమును పొందక ఆ ప్రభువు అనుగ్రహించిన వాటిచేతనే జీవితమును గడపవలెను. ఈ జగత్తునందలి సంపదలు ఏ యొక్కని సొంతము కాదు. కనుక, సర్వదా వాటిపై తృష్ణను విడిచి పెట్టవలెను. సమస్తకర్మలను భగవదర్పణ బుద్ధితో ఆచరింపవలెను.

అన్నింటికిని సాక్షి ఆ భగవంతుడే, బుద్ధి యొక్క వృత్తులు నేత్రములు మొదలగు ఇంద్రియములు ఆయనను చూడజాలవు. కాని, ఆయన జ్ఞానశక్తి అఖండమైనది. సకల ప్రాణుల హృదయములలో నివసించువాడును, సంగరహితుడును, స్వయంప్రకాశకుడును ఐన ఆ పరమాత్మను శరణు పొందవలెను.

ఆ పరమాత్మకు ఆది, మధ్యాంతములు లేవు. ఆయనకు తనవాడు, పరాయివాడు అను భేదములు లేవు. ఆయన ఉనికివలననే విశ్వము అంతయును నిలిచియున్నది. ఈ విరాట్ బ్రహ్మాండము పరమాత్మ స్వరూపము అగుటచే అదికూడా ఋతమనబడును.

ఈ విశ్వము ఆ పరబ్రహ్మ స్వరూపమే. అసంఖ్యాకములగు పేర్లు అన్నియును ఆయనవే. సర్వశక్తిమంతుడైన ఆయనయే సత్యము. ఆయన స్వయంప్రకాశకుడు, పుట్టుకలేనివాడు, పురాణ పురుషుడు. తన మాయాశక్తిచే ఈ విశ్వమును సృజించి, తాను స్వీకరించెను. విద్యాశక్తి ద్వారా దానిని త్యజించి (మాయాతీతుడై) నిష్క్రియుడై సత్స్వరూపముతో నిలిచియున్నాడు.

ఋషులు, మునులు నైష్కర్మ్యస్థితికై - అనగా పరబ్రహ్మముతో ఏకత్వమును పొందుటకై మొదట కర్మయోగమును అనుష్ఠించెదరు. తరచుగా కర్మలను ఆచరించు పురుషుడే చివరకు నిష్క్రియుడై కర్మలనుండి బయటపడును.

సర్వశక్తిమంతుడైన భగవంతుడు కూడా కర్మలను ఆచరించును. కాని, ఆ ప్రభువు పూర్ణకాముడగుటచే స్వలాభమునకై ఆ కర్మలయందు ఆసక్తుడుకాడు. కనుక, ఆయనను అనుసరించి అనాసక్తులై, కర్మలను ఆచరించువారు కూడా కర్మబంధము నుండి ముక్తులగుదురు.

భగవంతుడు జ్ఞానస్వరూపుడు. కనుక, ఆయనలో లేశమాత్రము అహంకారము లేదు. ఆయన అన్ని విధములుగా పరిపూర్ణుడు. అందువలనను ఆయనకు ఏ వస్తువుపైనను కోరికలేదు. ఆ ప్రభువు ఎవ్వరి ప్రేరణ లేకుండగనే స్వచ్ఛందముగా కర్మలను ఆచరించు చుండును. తాను స్థాపించిన మర్యాదలయందే నిలచి తన కర్మల ద్వారా మానవులకు శిక్షణను ఇచ్చుచుండును. ఆయన సమస్త ధర్మములకు ప్రవర్తకుడు. జీవన దాత. నేను ఆ స్వామిని శరణువేడుచున్నాను.

శ్రీశుక ఉవాచ

శ్రీశుకుడు వచించెను- పరీక్షిన్మహారాజా! ఒకసారి స్వాయంభువమనువు ఏకాగ్రచిత్తములో ఉపనిషద్రూపమైన ఈ వేదమంత్రమును పఠించుచుండెను. అతడు నిద్రలో అచేతనుడుగా ఉన్నాడని భావించి ఆకలి గొన్న రాక్షసులు అతనిని భక్షించుటకై అతనిపై విజృంభించిరి.

అట్లు మనువును భక్షించుటకై ఏతెంచిన రాక్షసులను జూచి, అంతర్యామియు, యజ్ఞపురుషుడు ఐన శ్రీహరి, యాములు అను తన పుత్రులైన దేవతలతోగూడి అచటికి విచ్చేసెను. పిమ్మట ఆ అసురులను సంహరించి యజ్ఞపురుషుడైన శ్రీహరియే ఇంద్రపదవిని అధిష్ఠించి, స్వర్గమును పరిపాలింపసాగెను.

మహారాజా! స్వారోచిషుడు రెండవమనువు. అతడు అగ్నిపుత్రుడు. అతనికి ద్యుమంతుడు, సుషేణుడు, రోచిష్మంతుడు మొదలగు పుత్రులు కలిగిరి.

ఆ మన్వంతరమున ఇంద్రుని పేరు రోచనుడు. ఇంకను తుషితులు మొదలగు దేవతాగుణములు ఊర్జస్తంభుడు మొదలగు వేదవేత్తలైన సప్తర్షులు ఉండిరి.

ఆ మన్వంతరమున వేదశిరుడు అను ఋషివలన అతని పత్నియైన  తుషిత యందు భగవంతుడు అవతరించి, విభువు అను పేరుతో ప్రసిద్ధిగాంచెను.

అతడు తన జీవిత పర్యంతము బ్రహ్మచర్యవ్రతమును పాటించెను. అతని ఆచరణనుండి శిక్షణను పొందిన ఎనుబది ఎనిమిదివేల మంది ఋషులుగూడ వ్రతనిష్ఠతో బ్రహ్మచర్యమును పాటించిరి.

ప్రియవ్రతుని కుమారుడైన ఉత్తముడు మూడవ మనువు. అతనికి పవనుడు, సృంజయుడు, యజ్ఞహోత్రుడు మొదలగు కుమారులు కలిగిరి.

ఆ మన్వంతరమున వసిష్ఠునకు ప్రమదుడు మొదలగు ఏడుగురు సప్తర్షులు సుతులుగా జన్మించిరి. సత్యుడు, వేదశ్రుతుడు, భద్రుడు అనువారు దేవతలలో ప్రముఖులు. సత్యజిత్తు అనువాడు ఇంద్ర పదవిని చేపట్టెను.

ఆ సమయమున ధర్ముని పత్నియైన  సూనృతయందు ఫురుషోత్తముడైన  భగవంతుడు సత్యసేనుడు అను పేరున అవతరించెను. అతనితో గూడి సత్యవ్రతులు అను దేవతలుగూడ ఉండిరి.
ఆ సమయమున భగవంతుడు, ఇంద్రుడగు సత్యజిత్తునకు మిత్రుడై, అసత్యపరాయణులును, దుశ్శీలురును, దుష్టులును ఐన యక్షరాక్షసులను, జీవ ద్రోహులైన భూతగణములను సంహరించెను.

తామసుడు అనువాడు నాల్గవ మనువు. అతడు మూడవ మనువైన ఉత్తమునకు సోదరుడు. అతనికి పృథువు, ఖ్యాతి, నరుడు, కేతువు మొదలగు పదిమంది సుతులు కలిగిరి.

సత్యకుడు, హరి, వీరుడు అనువారు దేవతలలో ముఖ్యులు. ఆ మన్వంతరమున త్రిశిఖుడు అనువాడు ఇంద్రుడు. జ్యోతిర్ధాముడు మొదలగువారు సప్త ఋషులుగా ఉండిరి.

మహారాజా! ఆ తామస మన్వంతరమున విధృతికి పుత్రులై వైధృతులు అను దేవతలు గూడ ఉండిరి. వారు కాల ప్రభావమున నష్టప్రాయమైన వేదములను తమ శక్తిద్వారా రక్షించిరి. అందువలన వారు వైధృతులు- అని ప్రసిద్ధిగాంచిరి.

ఆ మన్వంతరమున హరిమేధుడు అను ఋషివలన హరిణి అను పేరుగల అతని పత్నియందు భగవంతుడు హరి యను పేర అవతరించెను. ఈ అవతారమున గజేంద్రుని మొసలి బారినుండి భగవంతుడు రక్షించెను.

రాజోవాచ

పరీక్షిన్మహారాజు ప్రశ్నించెను శుకమహర్షీ! భగవంతుడైన శ్రీహరి గజేంద్రుని మొసలి పట్టునుండి ఎట్లు విడిపించెనో నేను వినగోరుచున్నాను.

ఆ గజేంద్ర మోక్షణ వత్తాంతము అన్ని కథలలో ఉత్తమమైనది, అది పవిత్రము, ప్రశస్తము, శుభ ప్రదము. మహాత్ములు ఆ కథను గానము చేయుచు శ్రీహరిభగవానుని పవిత్రకీర్తిని ప్రశంసింతురు కదా!

సూత ఉవాచ

సూతుడు వచించెను శౌనకాదిమహర్షులారా! పరీక్షిన్మహారాజు శ్రీహరి కథలను వినుటకై ప్రాయోపవేశమునకు పూనుకొనెను. ఆ మహారాజు శ్రీశుకమహర్షిని ఇట్లు ప్రశ్నించగా ఆ మునీశ్వరుడు సంతోషించి, అతనిని అభినందించెను. పిమ్మట మహర్షులసభలో గజేంద్రమోక్షణ కథను వినిపించసాగెను.

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం అష్టమస్కంధే ప్రథమోఽధ్యాయః (1)

ఇది భాగవత మహాపురాణమునందలి అష్టమ స్కంధమునందు ప్రథమాధ్యాయము (1)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

ప్రాంజలి ప్రభ ... అంతర్జాల పత్రిక  (1)
: 22.7.2020   ప్రాతః కాల సందేశము, వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం
అష్టమ స్కంధము - ప్రథమాధ్యాయము,  మన్వంతరముల  వర్ణనము
పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం మరియు మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 
(1 నుండి 10 శ్లోకాల తెలుగు తాత్పర్యము) ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

రాజోవాచ

పరీక్షిన్మహారాజు అడిగెను- గురుదేవా! స్వాయంభువ మనువుయొక్క వంశ విస్తృతిని గూర్చి నేను వింటిని. అదే వంశమునందు అతని కుమార్తెల ద్వారా మరీచి మొదలగు ప్రజాపతులను తమవంశ పరంపరను కొనసాగించిరి. ఇప్పుడు ఇతర మనువులను గురుంచి వర్ణింపుడు.

మహాత్మా! జ్ఞానులు ఏయే మన్వంతరములలో మహిమాన్వితుడైన భగవంతుని యొక్క అవతారములను, లీలలను వర్ణించిరో, వాటిని నాకు తప్పక వినిపింపుము. నేను శ్రద్ధగా వాటిని వినగోరుచున్నాను.

జగత్పతియైన శ్రీహరి గడచిన మన్వంతరములలో చేసిన, వర్తమానమునందు చేయుచున్న, భవిష్యన్మన్వంతరములలో చేయబోవు లీలలను వినిపింపుము.

ఋషిరువాచ

శ్రీశుకుడు వచించెను మహారాజా! ఈ కల్పమునందు స్వాయంభువుడు మున్నగు ఆరుగురు మనువుల యొక్క మన్వంతరములు గడచిపోయెను. వాటిలో మొదటి మన్వంతరమును గూర్చి నేను వర్ణించితిని. అందులో దేవతలు మొదలగు వారి యొక్క ఉత్పత్తి జరిగినది.

స్వాయంభువమనువు కుమార్తెయైన ఆకూతియందు యజ్ఞపురుషుని రూపములో భగవానుడు జన్మించి, ధర్మములను  ఉపదేశించెను. అట్లే దేవహూతియందు ఆ ప్రభువు కపిలభగవానునిగా అవతరించి, జ్ఞానోపదేశమును చేసెను.

పరీక్షిన్మహారాజా! కఫిల భగవానునిగూర్చి మూడవ స్కంధములో వర్ణింపబడినది. ఇప్పుడు ఆకూతియందు యజ్ఞపురుషుడుగా అవతరించి చేసిన లీలలను వివరించెదను.

స్వాయంభువమనువు సకల విషయ భోగముల యెడ విరక్తుడై రాజ్యమును పరిత్యజించెను. పిమ్మట, తన భార్యయైన శతరూపతో గూడి తపమాచరించుటకై వనములకు వెళ్ళెను.

అతడు సునందానదీ తీరమున ఒంటి కాలిపై నిలబడి నూరు సంవత్సరములు తీవ్రమైన తపమొనర్చెను. ఆ సమయమున అతడు నిత్యము ఈ విధముగా భగవంతుని స్తుతించెను.

మనురువాచ

మనువు పలికెను పరమాత్మ చేతనను పొంది విశ్వము చైతన్యవంతమగును. కాని, విశ్వము మాత్రము ఆయనను చైతన్యవంతునిగా చేయజాలదు. ఆ ప్రభువు ప్రళయకాలమున నిద్రించు చున్నను మేల్కొనియే యుండును. ఆ విషయమును ఆయన ఎరుగును. కాని, విశ్వము మాత్రము  తెలియజాలదు. కనుకనే, అతడు పరమాత్ముడు.

ఈ సమస్త విశ్వమునందును, అందలి చరాచరప్రాణుల యందును ఆ పరమాత్మయే వ్యాపించియున్నాడు. కనుక, ఈ జగత్తునందలి యే పదార్థము నందును వ్యామోహమును పొందక ఆ ప్రభువు అనుగ్రహించిన వాటిచేతనే జీవితమును గడపవలెను. ఈ జగత్తునందలి సంపదలు ఏ యొక్కని సొంతము కాదు. కనుక, సర్వదా వాటిపై తృష్ణను విడిచి పెట్టవలెను. సమస్తకర్మలను భగవదర్పణ బుద్ధితో ఆచరింపవలెను.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి అష్టమస్కంధములోని ప్రథమ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

7702090319
Only admins can send messages

[04:50, 22/07/2020] +91 95058 13235: 22.7.2020   ప్రాతః కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

అష్టమ స్కంధము - ప్రథమాధ్యాయము

మన్వంతరముల వర్ణనము

ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

రాజోవాచ

1.1 (ప్రథమ శ్లోకము)

స్వాయంభువస్యేహ గురో వంశోఽయం విస్తరాచ్ఛ్రుతః |

యత్ర విశ్వసృజాం సర్గో మనూనన్యాన్ వదస్వ నః॥6326॥

పరీక్షిన్మహారాజు అడిగెను- గురుదేవా! స్వాయంభువ మనువుయొక్క వంశ విస్తృతిని గూర్చి నేను వింటిని. అదే వంశమునందు అతని కుమార్తెల ద్వారా మరీచి మొదలగు ప్రజాపతులను తమవంశ పరంపరను కొనసాగించిరి. ఇప్పుడు ఇతర మనువులను గురుంచి వర్ణింపుడు.

1.2 (రెండవ శ్లోకము)

యత్ర యత్ర హరేర్జన్మ కర్మాణి చ మహీయసః|

గృణంతి కవయో బ్రహ్మంస్తాని నో వద శృణ్వతామ్॥6327॥

మహాత్మా! జ్ఞానులు ఏయే మన్వంతరములలో మహిమాన్వితుడైన భగవంతుని యొక్క అవతారములను, లీలలను వర్ణించిరో, వాటిని నాకు తప్పక వినిపింపుము. నేను శ్రద్ధగా వాటిని వినగోరుచున్నాను.

1.3 (మూడవ శ్లోకము)

యద్యస్మిన్నంతరే బ్రహ్మన్ భగవాన్ విశ్వభావనః|

కృతవాన్ కురుతే కర్తా హ్యతీతేఽనాగతేఽద్య వా॥6328॥

జగత్పతియైన శ్రీహరి గడచిన మన్వంతరములలో చేసిన, వర్తమానమునందు చేయుచున్న, భవిష్యన్మన్వంతరములలో చేయబోవు లీలలను వినిపింపుము.

ఋషిరువాచ

1.4 (నాలుగవ శ్లోకము)

మనవోఽస్మిన్ వ్యతీతాః షట్ కల్పే స్వాయంభువాదయః|

ఆద్యస్తే కథితో యత్ర దేవాదీనాం చ సంభవః॥6329॥

శ్రీశుకుడు వచించెను మహారాజా! ఈ కల్పమునందు స్వాయంభువుడు మున్నగు ఆరుగురు మనువుల యొక్క మన్వంతరములు గడచిపోయెను. వాటిలో మొదటి మన్వంతరమును గూర్చి నేను వర్ణించితిని. అందులో దేవతలు మొదలగు వారి యొక్క ఉత్పత్తి జరిగినది.

1.5 (ఐదవ శ్లోకము)

ఆకూత్యాం దేవహూత్యాం చ దుహిత్రోస్తస్య వై మనోః|

ధర్మజ్ఞానోపదేశార్థం భగవాన్ పుత్రతాం గతః॥6330॥

స్వాయంభువమనువు కుమార్తెయైన ఆకూతియందు యజ్ఞపురుషుని రూపములో భగవానుడు జన్మించి, ధర్మములను  ఉపదేశించెను. అట్లే దేవహూతియందు ఆ ప్రభువు కపిలభగవానునిగా అవతరించి, జ్ఞానోపదేశమును చేసెను.

15.6 (ఆరవ శ్లోకము)

కృతం పురా భగవతః కపిలస్యానువర్ణితమ్|

ఆఖ్యాస్యే భగవాన్ యజ్ఞో యచ్చకార కురూద్వహ॥6331॥

పరీక్షిన్మహారాజా! కఫిల భగవానునిగూర్చి మూడవ స్కంధములో వర్ణింపబడినది. ఇప్పుడు ఆకూతియందు యజ్ఞపురుషుడుగా అవతరించి చేసిన లీలలను వివరించెదను.

15.7 (ఏడవ శ్లోకము)

విరక్తః కామభోగేషు శతరూపాపతిః ప్రభుః|

విసృజ్య రాజ్యం తపసే సభార్యో వనమావిశత్॥6332॥

స్వాయంభువమనువు సకల విషయ భోగముల యెడ విరక్తుడై రాజ్యమును పరిత్యజించెను. పిమ్మట, తన భార్యయైన శతరూపతో గూడి తపమాచరించుటకై వనములకు వెళ్ళెను.

1.8 (ఎనిమిదవ శ్లోకము)

సునందాయాం వర్షశతం పదైకేన భువం స్పృశన్|

తప్యమానస్తపో ఘోరమిదమన్వాహ భారత॥6333॥

అతడు సునందానదీ తీరమున ఒంటి కాలిపై నిలబడి నూరు సంవత్సరములు తీవ్రమైన తపమొనర్చెను. ఆ సమయమున అతడు నిత్యము ఈ విధముగా భగవంతుని స్తుతించెను.

మనురువాచ

1.9 (తొమ్మిదవ శ్లోకము)

యేన చేతయతే విశ్వం విశ్వం చేతయతే న యమ్|

యో జాగర్తి శయానేఽస్మిన్నాయం తం వేద వేద సః॥6334॥

మనువు పలికెను పరమాత్మ చేతనను పొంది విశ్వము చైతన్యవంతమగును. కాని, విశ్వము మాత్రము ఆయనను చైతన్యవంతునిగా చేయజాలదు. ఆ ప్రభువు ప్రళయకాలమున నిద్రించు చున్నను మేల్కొనియే యుండును. ఆ విషయమును ఆయన ఎరుగును. కాని, విశ్వము మాత్రము  తెలియజాలదు. కనుకనే, అతడు పరమాత్ముడు.

1.10 (పదియవ శ్లోకము)

ఆత్మావాస్యమిదం విశ్వం యత్కించిజ్జగత్యాం జగత్|

తేన త్యక్తేన భుంజీథా మా గృధః కస్య స్విద్ధనమ్॥6335॥

ఈ సమస్త విశ్వమునందును, అందలి చరాచరప్రాణుల యందును ఆ పరమాత్మయే వ్యాపించియున్నాడు. కనుక, ఈ జగత్తునందలి యే పదార్థము నందును వ్యామోహమును పొందక ఆ ప్రభువు అనుగ్రహించిన వాటిచేతనే జీవితమును గడపవలెను. ఈ జగత్తునందలి సంపదలు ఏ యొక్కని సొంతము కాదు. కనుక, సర్వదా వాటిపై తృష్ణను విడిచి పెట్టవలెను. సమస్తకర్మలను భగవదర్పణ బుద్ధితో ఆచరింపవలెను.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి అష్టమస్కంధములోని ప్రథమ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

22.7.2020   సాయం కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

అష్టమ స్కంధము - ప్రథమాధ్యాయము

మన్వంతరముల వర్ణనము

ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

1.11 (పదకొండవ శ్లోకము)

యం న పశ్యతి పశ్యంతం చక్షుర్యస్య న రిష్యతి|

తం భూతనిలయం దేవం సుపర్ణముపధావత॥6336॥

అన్నింటికిని సాక్షి ఆ భగవంతుడే, బుద్ధి యొక్క వృత్తులు నేత్రములు మొదలగు ఇంద్రియములు ఆయనను చూడజాలవు. కాని, ఆయన జ్ఞానశక్తి అఖండమైనది. సకల ప్రాణుల హృదయములలో నివసించువాడును, సంగరహితుడును, స్వయంప్రకాశకుడును ఐన ఆ పరమాత్మను శరణు పొందవలెను.

1.12 (పండ్రెండవ శ్లోకము)

న యస్యాద్యంతౌ మధ్యం చ స్వః పరో నాంతరం బహిః|

విశ్వస్యామూని యద్యస్మాద్విశ్వం చ తదృతం మహత్॥6337॥

ఆ పరమాత్మకు ఆది, మధ్యాంతములు లేవు. ఆయనకు తనవాడు, పరాయివాడు అను భేదములు లేవు. ఆయన ఉనికివలననే విశ్వము అంతయును నిలిచియున్నది. ఈ విరాట్ బ్రహ్మాండము పరమాత్మ స్వరూపము అగుటచే అదికూడా ఋతమనబడును.

1.13 (పదమూడవ శ్లోకము)

స విశ్వకాయః పురుహూత ఈశః సత్యః స్వయంజ్యోతిరజః పురాణః|

ధత్తేఽస్య జన్మాద్యజయాఽఽత్మశక్త్యా తాం విద్యయోదస్య నిరీహ ఆస్తే॥6338॥

ఈ విశ్వము ఆ పరబ్రహ్మ స్వరూపమే. అసంఖ్యాకములగు పేర్లు అన్నియును ఆయనవే. సర్వశక్తిమంతుడైన ఆయనయే సత్యము. ఆయన స్వయంప్రకాశకుడు, పుట్టుకలేనివాడు, పురాణ పురుషుడు. తన మాయాశక్తిచే ఈ విశ్వమును సృజించి, తాను స్వీకరించెను. విద్యాశక్తి ద్వారా దానిని త్యజించి (మాయాతీతుడై) నిష్క్రియుడై సత్స్వరూపముతో నిలిచియున్నాడు.

1.14 (పదునాలుగవ శ్లోకము)

అథాగ్రే ఋషయః కర్మాణీహంతేఽకర్మహేతవే|

ఈహమానో హి పురుషః ప్రాయోఽనీహాం ప్రపద్యతే॥6339॥

ఋషులు, మునులు నైష్కర్మ్యస్థితికై - అనగా పరబ్రహ్మముతో ఏకత్వమును పొందుటకై మొదట కర్మయోగమును అనుష్ఠించెదరు. తరచుగా కర్మలను ఆచరించు పురుషుడే చివరకు నిష్క్రియుడై కర్మలనుండి బయటపడును.

1.15 (పదునైదవ శ్లోకము)

ఈహతే భగవానీశో న హి తత్ర విషజ్జతే|

ఆత్మలాభేన పూర్ణార్థో నావసీదంతి యేఽను తమ్॥6340॥

సర్వశక్తిమంతుడైన భగవంతుడు కూడా కర్మలను ఆచరించును. కాని, ఆ ప్రభువు పూర్ణకాముడగుటచే స్వలాభమునకై ఆ కర్మలయందు ఆసక్తుడుకాడు. కనుక, ఆయనను అనుసరించి అనాసక్తులై, కర్మలను ఆచరించువారు కూడా కర్మబంధము నుండి ముక్తులగుదురు.

1.16 (పదహారవ శ్లోకము)

తమీహమానం నిరహంకృతం బుధం నిరాశిషం పూర్ణమనన్యచోదితమ్|

నౄన్ శిక్షయంతం నిజవర్త్మసంస్థితం ప్రభుం ప్రపద్యేఽఖిలధర్మభావనమ్॥6341॥

భగవంతుడు జ్ఞానస్వరూపుడు. కనుక, ఆయనలో లేశమాత్రము అహంకారము లేదు. ఆయన అన్ని విధములుగా పరిపూర్ణుడు. అందువలనను ఆయనకు ఏ వస్తువుపైనను కోరికలేదు. ఆ ప్రభువు ఎవ్వరి ప్రేరణ లేకుండగనే స్వచ్ఛందముగా కర్మలను ఆచరించు చుండును. తాను స్థాపించిన మర్యాదలయందే నిలచి తన కర్మల ద్వారా మానవులకు శిక్షణను ఇచ్చుచుండును. ఆయన సమస్త ధర్మములకు ప్రవర్తకుడు. జీవన దాత. నేను ఆ స్వామిని శరణువేడుచున్నాను.

శ్రీశుక ఉవాచ

1.17 (పదునేడవ శ్లోకము)

ఇతి మంత్రోపనిషదం వ్యాహరంతం సమాహితమ్|

దృష్ట్వాసురా యాతుధానా జగ్ధుమభ్యద్రవన్ క్షుధా॥6342॥

శ్రీశుకుడు వచించెను- పరీక్షిన్మహారాజా! ఒకసారి స్వాయంభువమనువు ఏకాగ్రచిత్తములో ఉపనిషద్రూపమైన ఈ వేదమంత్రమును పఠించుచుండెను. అతడు నిద్రలో అచేతనుడుగా ఉన్నాడని భావించి ఆకలి గొన్న రాక్షసులు అతనిని భక్షించుటకై అతనిపై విజృంభించిరి.

1.18 (పదునెనిమిదవ శ్లోకము)

తాంస్తథావసితాన్ వీక్ష్య యజ్ఞః సర్వగతో హరిః|

యామైః పరివృతో దేవైర్హత్వాశాసత్త్రివిష్టపమ్॥6343॥

అట్లు మనువును భక్షించుటకై ఏతెంచిన రాక్షసులను జూచి, అంతర్యామియు, యజ్ఞపురుషుడు ఐన శ్రీహరి, యాములు అను తన పుత్రులైన దేవతలతోగూడి అచటికి విచ్చేసెను. పిమ్మట ఆ అసురులను సంహరించి యజ్ఞపురుషుడైన శ్రీహరియే ఇంద్రపదవిని అధిష్ఠించి, స్వర్గమును పరిపాలింపసాగెను.

1.19 (పందొమ్మిదవ శ్లోకము)

స్వారోచిషో ద్వితీయస్తుథ మనురగ్నేః సుతోఽభవత్|

ద్యుమత్సుషేణరోచిష్మత్ప్రముఖాస్తస్య చాత్మజాః॥6344॥

మహారాజా! స్వారోచిషుడు రెండవమనువు. అతడు అగ్నిపుత్రుడు. అతనికి ద్యుమంతుడు, సుషేణుడు, రోచిష్మంతుడు మొదలగు పుత్రులు కలిగిరి.

1.20 (ఇరువదియవ శ్లోకము)

తత్రేంద్రో రోచనస్త్వాసీద్దేవాశ్చ తుషితాదయః|

ఊర్జస్తంభాదయః సప్త ఋషయో బ్రహ్మవాదినః॥6345॥

ఆ మన్వంతరమున ఇంద్రుని పేరు రోచనుడు. ఇంకను తుషితులు మొదలగు దేవతాగుణములు ఊర్జస్తంభుడు మొదలగు వేదవేత్తలైన సప్తర్షులు ఉండిరి.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి అష్టమస్కంధములోని ప్రథమ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

23.7.2020   ప్రాతః కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

అష్టమ స్కంధము - ప్రథమాధ్యాయము

మన్వంతరముల వర్ణనము

ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

1.21 (ఇరువది ఒకటవ శ్లోకము)

ఋషేస్తు వేదశిరసస్తుషితా నామ పత్న్యభూత్|

తస్యాం జజ్ఞే తతో దేవో విభురిత్యభివిశ్రుతః॥6346॥

ఆ మన్వంతరమున వేదశిరుడు అను ఋషివలన అతని పత్నియైన  తుషిత యందు భగవంతుడు అవతరించి, విభువు అను పేరుతో ప్రసిద్ధిగాంచెను.

1.22 (ఇరువది రెండవ శ్లోకము)

అష్టాశీతిసహస్రాణి మునయో యే ధృతవ్రతాః|

అన్వశిక్షన్ వ్రతం తస్య కౌమారబ్రహ్మచారిణః॥6347॥

అతడు తన జీవిత పర్యంతము బ్రహ్మచర్యవ్రతమును పాటించెను. అతని ఆచరణనుండి శిక్షణను పొందిన ఎనుబది ఎనిమిదివేల మంది ఋషులుగూడ వ్రతనిష్ఠతో బ్రహ్మచర్యమును పాటించిరి.

1.23 (ఇరువది మూడవ శ్లోకము)

తృతీయ ఉత్తమో నామ ప్రియవ్రతసుతో మనుః|

పవనః సృంజయో యజ్ఞహోత్రాద్యాస్తత్సుతా నృప॥6348॥

ప్రియవ్రతుని కుమారుడైన ఉత్తముడు మూడవ మనువు. అతనికి పవనుడు, సృంజయుడు, యజ్ఞహోత్రుడు మొదలగు కుమారులు కలిగిరి.

1.24 (ఇరువది నాలుగవ శ్లోకము)

వసిష్ఠతనయాః సప్త ఋషయః ప్రమదాదయః|

సత్యా వేదశ్రుతా భద్రా దేవా ఇంద్రస్తు సత్యజిత్॥6349॥

ఆ మన్వంతరమున వసిష్ఠునకు ప్రమదుడు మొదలగు ఏడుగురు సప్తర్షులు సుతులుగా జన్మించిరి. సత్యుడు, వేదశ్రుతుడు, భద్రుడు అనువారు దేవతలలో ప్రముఖులు. సత్యజిత్తు అనువాడు ఇంద్ర పదవిని చేపట్టెను.

1.25 (ఇరువది ఐదవ శ్లోకము)

ధర్మస్య సూనృతాయాం తు భగవాన్ పురుషోత్తమః|

సత్యసేన ఇతి ఖ్యాతో జాతః సత్యవ్రతైః సహ॥6350॥

ఆ సమయమున ధర్ముని పత్నియైన  సూనృతయందు ఫురుషోత్తముడైన  భగవంతుడు సత్యసేనుడు అను పేరున అవతరించెను. అతనితో గూడి సత్యవ్రతులు అను దేవతలుగూడ ఉండిరి.

1.26 (ఇరువది ఆరవ శ్లోకము)

సోఽనృతవ్రతదుఃశీలానసతో యక్షరాక్షసాన్|

భూతద్రుహో భూతగణాంస్త్వవధీత్సత్యజిత్సఖః॥6351॥

ఆ సమయమున భగవంతుడు, ఇంద్రుడగు సత్యజిత్తునకు మిత్రుడై, అసత్యపరాయణులును, దుశ్శీలురును, దుష్టులును ఐన యక్షరాక్షసులను, జీవ ద్రోహులైన భూతగణములను సంహరించెను.

1.27 (ఇరువది ఏడవ శ్లోకము)

చతుర్థ ఉత్తమభ్రాతా మనుర్నామ్నా చ తామసః|

పృథుః ఖ్యాతిర్నరః కేతురిత్యాద్యా దశ తత్సుతాః॥6352॥

తామసుడు అనువాడు నాల్గవ మనువు. అతడు మూడవ మనువైన ఉత్తమునకు సోదరుడు. అతనికి పృథువు, ఖ్యాతి, నరుడు, కేతువు మొదలగు పదిమంది సుతులు కలిగిరి.

1.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)

సత్యకా హరయో వీరా దేవాస్త్రిశిఖ ఈశ్వరః|

జ్యోతిర్ధామాదయః సప్త ఋషయస్తామసేఽన్తరే॥6353॥

సత్యకుడు, హరి, వీరుడు అనువారు దేవతలలో ముఖ్యులు. ఆ మన్వంతరమున త్రిశిఖుడు అనువాడు ఇంద్రుడు. జ్యోతిర్ధాముడు మొదలగువారు సప్త ఋషులుగా ఉండిరి.

1.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)

దేవా వైధృతయో నామ విధృతేస్తనయా నృప|

నష్టాః కాలేన యైర్వేదా విధృతాః స్వేన తేజసా॥6354॥

మహారాజా! ఆ తామస మన్వంతరమున విధృతికి పుత్రులై వైధృతులు అను దేవతలు గూడ ఉండిరి. వారు కాల ప్రభావమున నష్టప్రాయమైన వేదములను తమ శక్తిద్వారా రక్షించిరి. అందువలన వారు వైధృతులు- అని ప్రసిద్ధిగాంచిరి.

1.30 (ముప్పదియవ శ్లోకము)

తత్రాపి జజ్ఞే భగవాన్ హరిణ్యాం హరిమేధసః|

హరిరిత్యాహృతో యేన గజేంద్రో మోచితో గ్రహాత్॥6355॥

ఆ మన్వంతరమున హరిమేధుడు అను ఋషివలన హరిణి అను పేరుగల అతని పత్నియందు భగవంతుడు హరి యను పేర అవతరించెను. ఈ అవతారమున గజేంద్రుని మొసలి బారినుండి భగవంతుడు రక్షించెను.

రాజోవాచ

1.31 (ముప్పది ఒకటవ శ్లోకము)

బాదరాయణ ఏతత్తే శ్రోతుమిచ్ఛామహే వయమ్|

హరిర్యథా గజపతిం గ్రాహగ్రస్తమమూముచత్॥6356॥

పరీక్షిన్మహారాజు ప్రశ్నించెను శుకమహర్షీ! భగవంతుడైన శ్రీహరి గజేంద్రుని మొసలి పట్టునుండి ఎట్లు విడిపించెనో నేను వినగోరుచున్నాను.

1.32 (ముప్పది రెండవ శ్లోకము)

తత్కథా సుమహత్పుణ్యం ధన్యం స్వస్త్యయనం శుభమ్|

యత్ర యత్రోత్తమశ్లోకో భగవాన్ గీయతే హరిః॥6357॥

ఆ గజేంద్ర మోక్షణ వత్తాంతము అన్ని కథలలో ఉత్తమమైనది, అది పవిత్రము, ప్రశస్తము, శుభ ప్రదము. మహాత్ములు ఆ కథను గానము చేయుచు శ్రీహరిభగవానుని పవిత్రకీర్తిని ప్రశంసింతురు కదా!

సూత ఉవాచ

1.33 (ముప్పది మూడవ శ్లోకము)

పరీక్షితైవం స తు బాదరాయణిః  ప్రాయోపవిష్టేన కథాసు చోదితః|

ఉవాచ విప్రాః ప్రతినంద్య పార్థివం  ముదా మునీనాం సదసి స్మ శృణ్వతామ్॥6358॥

సూతుడు వచించెను శౌనకాదిమహర్షులారా! పరీక్షిన్మహారాజు శ్రీహరి కథలను వినుటకై ప్రాయోపవేశమునకు పూనుకొనెను. ఆ మహారాజు శ్రీశుకమహర్షిని ఇట్లు ప్రశ్నించగా ఆ మునీశ్వరుడు సంతోషించి, అతనిని అభినందించెను. పిమ్మట మహర్షులసభలో గజేంద్రమోక్షణ కథను వినిపించసాగెను.

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం అష్టమస్కంధే ప్రథమోఽధ్యాయః (1)

ఇది భాగవత మహాపురాణమునందలి అష్టమ స్కంధమునందు ప్రథమాధ్యాయము (1)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

Tuesday, 5 November 2019

ఉత్తర పీఠిక
విష్ణు సహస్రనామ స్తోత్రమ్
ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ: హరిః ఓం

01_వ శ్లోకము
ఇతీదం కీర్తనీయస్య కేశవస్య. మహాత్మనః ।
నామ్నాం సహస్రం దివ్యనామశేషేణ ప్రకీర్తితమ్ ॥
02_వ శ్లోకము
య ఇదం శృణుయాన్నిత్యం యశ్చాపి పరికీర్తయేత్ ।
నా√ శుభం ప్రాప్నుయాత్కించిత్ సో√ ముత్రేహ, చ మానవః॥
03_వ శ్లోకము
వేదాన్తగో బ్రాహ్మణస్స్యాత్ క్షత్రియో విజయీభవత్ ।
వైశ్యోధన సమృద్ధః స్యాచ్ఛూద్రః సుఖమవాప్నుయాత్ ॥
04_ వ శ్లోకము
ధర్మార్థీప్రాప్నుయాద్ధర్మ మర్థార్థీచార్థమాప్నుయాత్ ।
కామానవాప్నుయాత్కామీ ప్రజార్థీ ప్రాప్నుయాత్ప్రజామ్ ॥
05_ వ శ్లోకము
భక్తిమాన్ యస్సదోత్థాయ శుచిస్తద్గతమానసః ।
సహస్రం వాసుదేవస్య నామ్నా మేతత్ప్రకీర్తయేత్ ॥
06_వ శ్లోకము
యశః ప్రాప్నోతి విపులం జ్ఞాతిప్రాధాన్యమేవచ ।
అచలాం శ్రియమాప్నోతి శ్రేయః ప్రాప్నోత్యనుత్తమమ్ ॥
07_ వ శ్లోకము
నభయం క్వచిదాప్నోతి వీర్యం తేజశ్చవిన్దతి ।
భవత్యరోగోద్యుతిమాన్ బలరూప గుణాన్వితః ॥
08_వ శ్లోకము
రోగార్తో ముచ్యతే రోగాత్ బద్దోముచ్యేత బంధనాత్ ।
భయాన్ముచ్యేత భీతస్తు ముచ్యేతాపన్న ఆపదః ॥
09_వ శ్లోకము
దుర్గాణ్యతి తరత్యాశు పురుషః పురుషోత్తమమ్ ।
స్తువన్నామ సహస్రేణ నిత్యం భక్తిసమన్వితః ॥
10_వ శ్లోకము
వాసుదేవాశ్రయో మర్త్యో వాసుదేవ పరాయణః ।
సర్వపాప విశుద్ధాత్మా యాతి బ్రహ్మ సనాతనమ్ ॥
11_వ శ్లోకము
న వాసుదేవ భక్తానా మశుభం విద్యతేక్వచిత్ ।
జన్మ, మృత్యు, జరా, వ్యాధి భయం నైవోపజాయతే ॥
12_వ శ్లోకము
ఇమం స్తవ మధీయానః శ్రద్ధాభక్తి సమన్వితః ।
యుజ్యేతాత్మా సుఖ క్షాన్తి, శ్రీ, ధృతి, స్మృతి, కీర్తిభిః ॥
13_వ శ్లోకము
నక్రోధో నచ మాత్సర్యం నలోభో నాశుభామతిః ।
భవన్తి కృత పుణ్యానాం భక్తానాం పురుషోత్తమే ॥
14_వ శ్లోకము
ద్యౌస్సచంద్రార్క నక్షత్రం ఖందిశో భూర్మహోదధిః ।
వాసుదేవస్య వీర్యేణ విధృతాని మహాత్మనః ॥
15_వ శ్లోకము
ససురాసుర గంధర్వం స యక్షోరగ రాక్షసం ।
జగద్వశే వర్తదేదః కృష్ణస్య. సచరాచరమ్ ॥
16_వ శ్లోకము
ఇంద్రియాణి మనోబుద్ధిః సత్త్వం తేజోబలం ధృతిః ।
వాసుదేవాత్మకాన్యాహుః క్షేత్రం క్షేత్రజ్ఞ ఏవచ ॥
17_వ శ్లోకము
సర్వాగమానాం ఆచారః ప్రథమం పరికల్పితః ।
ఆచార ప్రభవోధర్మోధర్మస్య ప్రభురచ్యుతః ॥
18_వ శ్లోకము
ఋషయః పితరోదేవామహా భూతాని ధాతవః ।
జంగమా√ జంగమం చేదం జగన్నారాయణోద్భవమ్ ॥
19_వ శ్లోకము
యోగోజ్ఞానం తథాసాంఖ్యం విద్యాశ్శిల్పాది కర్మచ ।
వేదాః శాస్త్రాణి విజ్ఞానమే తత్సర్వం జనార్దనాత్ ॥
20_వ శ్లోకము
ఏకోవిష్ణుర్మహద్భూతం పృథగ్భూతాన్యనేకశః ।
త్రీన్ లోకాన్ వ్యాప్య భూతాత్మా భుజ్త్కే విశ్వభుగవ్యయః ॥
21_వ శ్లోకము
ఇమంస్తవం భగవతో విష్ణోర్వ్యాసేన కీర్తితమ్ ।
పఠేద్య ఇచ్ఛే త్పురుషః శ్రేయః ప్రాప్తుంసుఖానిచ ॥
22_వ శ్లోకము
విశ్వేశ్వర మజం దేవం జగతః ప్రభుమవ్యయమ్ ।
భజంతి యేపుష్కరాక్షం నతేయాంతి పరాభవమ్ ॥
హరిః ఓమ్ తత్సత్
యదక్షర పదంభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ ।
తత్సర్వం క్షమ్యతాందేవ నారాయణ నమోస్తుతే ॥
శ్రీకృష్ణ పరబ్రహ్మార్పణమస్తు
శ్రీవిష్ణుసహస్రనామస్తోత్ర  సమాప్తము.

సర్వేజనాః సుఖినో భవన్తు
సమస్త సన్మంగళాని భవన్తు

మీ ప్రాంజలి ప్రభ 
సేకరణ : రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 
అందరికీ ధన్యవాదములు 
--(())--

ఉత్తర పీఠిక
విష్ణు సహస్రనామ స్తోత్రమ్
( సంగ్రహ తాత్పర్య వివరణము)
(01_8_2019)
హరిః ఓం
01_వ శ్లోకము
ఇతీదం కీర్తనీయస్య కేశవస్య. మహాత్మనః ।
నామ్నాం సహస్రం దివ్యనామశేషేణ ప్రకీర్తితమ్ ॥
ఈరీతిగా స్తవనీయుండును మహాత్ముండును అగు శ్రీ మహావిష్ణువు
దివ్యాతి దివ్యములయిన వేయి పుణ్యనామములు సంకీర్తనము చేయబడినవి.
02_వ శ్లోకము
య ఇదం శృణుయాన్నిత్యం యశ్చాపి పరికీర్తయేత్ ।
నా√ శుభం ప్రాప్నుయాత్కించిత్ సో√ ముత్రేహ, చ మానవః॥
పరమ మంగళకరములగు ఈ సహస్రనామములను శ్రద్ధగా శ్రవణము
చేయునట్టిగానీ, కీర్తనము చేయునట్టిగాని మానవులకు ఇహ లోకమందును పరలోకమందును యెట్టి అశుభములును కలుగవు.
03_వ శ్లోకము
వేదాన్తగో బ్రాహ్మణస్స్యాత్ క్షత్రియో విజయీభవత్ ।
వైశ్యోధన సమృద్ధః స్యాచ్ఛూద్రః సుఖమవాప్నుయాత్ ॥
ఈ సహస్రనామ పారాయణముచేత బ్రాహ్మణుడు బ్రహ్మవేత్త యగును . క్షత్రియుడు విజయపరంపరలనొందును. వైశ్యుడు ధనసంపన్ను
డగును . శూద్రుడు సుఖభోగముల ననుభవింౘును.
( అనగా బ్రహ్మజ్ఞానాభిలాషతో, అద్వైత సిద్ధిని గోరి పారాయణము
చేసినచో బ్రహ్మస్వరూపుడే యగును. లౌకిక కార్య విజయ కాంక్షలు గలవానికి
అదియే సిద్ధింౘును. ధనసంపన్నత అభిలషింౘు వానికి ధనరాసులు సిద్ధింౘును.
లౌకిక భోగ సుఖములు కాంక్షింౘు వానికి అవియే లభింౘునని భావము).
04_ వ శ్లోకము
ధర్మార్థీప్రాప్నుయాద్ధర్మ మర్థార్థీచార్థమాప్నుయాత్ ।
కామానవాప్నుయాత్కామీ ప్రజార్థీ ప్రాప్నుయాత్ప్రజామ్ ॥
ధర్మాభిలాషికి ధర్మపరంపరలు అర్థార్థులకు సమస్తములగు
అర్థములు. వివిధవాంఛలు గలవారికి ఆయా మనోవాంఛలును ఈ సహస్రనామ
పారాయణము వలన లభింౘును. ( ధర్మార్థకామమోక్షములను చతుర్విధ పురుషార్థములును సిద్ధిౘునని భావము )
05_ వ శ్లోకము
భక్తిమాన్ యస్సదోత్థాయ శుచిస్తద్గతమానసః ।
సహస్రం వాసుదేవస్య నామ్నా మేతత్ప్రకీర్తయేత్ ॥
ప్రాతఃకాలము నందు మేల్కొని, శుచిర్భూతుడై భక్తిభావముతో
ప్రతిదినమును (నిరంతరమును) సర్వమంగళకరుడగు వాసుదేవుని ఈ సహస్ర
నామములను పారాయణ మొనర్పవలెను.
06_వ శ్లోకము
యశః ప్రాప్నోతి విపులం జ్ఞాతిప్రాధాన్యమేవచ ।
అచలాం శ్రియమాప్నోతి శ్రేయః ప్రాప్నోత్యనుత్తమమ్ ॥
ఈరీతిగా సంకీర్తనము చేయుటవలన గొప్ప యశస్సు కలుగును. జ్ఞాతులందు ప్రాధాన్యము పొందును. స్థిరముగా సంపదలు వర్ధిల్లును. ఉత్తమ శ్రేయస్సు లభింౘును.
07_ వ శ్లోకము
నభయం క్వచిదాప్నోతి వీర్యం తేజశ్చవిన్దతి ।
భవత్యరోగోద్యుతిమాన్ బలరూప గుణాన్వితః ॥
దీనిని పఠింౘు పుణ్యాత్మునకు యెట్టి భయమును కలుగదు.
అతడు ప్రతిభా సంపన్నుడును గొప్ప తేజశ్శాలియునగును. శారీర మానసిక రోగములు కలుగవు . గొప్ప దీప్తిగలవాడును ,ౘక్కని ఆరోగ్యము, బలము, కాంతి
సద్గుణములు గలవాడును అగును.

ఉత్తర పీఠిక
విష్ణు సహస్రనామ స్తోత్రమ్
( సంగ్రహ తాత్పర్య వివరణము)
(02_8_2019)
హరిః ఓం
08_వ శ్లోకము
రోగార్తో ముచ్యతే రోగాత్ బద్దోముచ్యేత బంధనాత్ ।
భయాన్ముచ్యేత భీతస్తు ముచ్యేతాపన్న ఆపదః ॥
వ్యాధిహరణమును గోరి పారాయణము చేయువారలకు అట్టి వ్యాధులు
నశింౘును. సాంసారిక బంధనములతో కలతచెందు వారికి సమస్త భయములును
హరింౘును. సమస్త కష్టములును ఈపుణ్యపారాయణము వలన నశింౘును.
09_వ శ్లోకము
దుర్గాణ్యతి తరత్యాశు పురుషః పురుషోత్తమమ్ ।
స్తువన్నామ సహస్రేణ నిత్యం భక్తిసమన్వితః ॥
భక్తితో నిరంతరమును మంగళకరములగు భగవానుని సహస్రనామ
ముల పారాయణము చేత సమస్తములగు భయంకరక్లేశములు మహాదుఃఖములు
హరింౘును.
10_వ శ్లోకము
వాసుదేవాశ్రయో మర్త్యో వాసుదేవ పరాయణః ।
సర్వపాప విశుద్ధాత్మా యాతి బ్రహ్మ సనాతనమ్ ॥
వాసుదేవుని ఆశ్రయించి, వాసుదేవుడే పరమ గతి యని భావించి మనుష్యుడు సకల పాపముల నుండియును విముక్తుడై, చిత్తశుద్ధి గలవాడై
సనాతన పరబ్రహ్మమునే పొందును.
11_వ శ్లోకము
న వాసుదేవ భక్తానా మశుభం విద్యతేక్వచిత్ ।
జన్మ, మృత్యు, జరా, వ్యాధి భయం నైవోపజాయతే ॥
భగవానుని శరణాగతిని పొందిన భక్తులకు అశుభములెన్నడును
కలుగనే కలుగవు. జనన, మరణ, జరా (ముసలితనము) రోగాది భయము లెంత
మాత్రమును గలుగవు.
12_వ శ్లోకము
ఇమం స్తవ మధీయానః శ్రద్ధాభక్తి సమన్వితః ।
యుజ్యేతాత్మా సుఖ క్షాన్తి, శ్రీ, ధృతి, స్మృతి, కీర్తిభిః ॥
శ్రద్ధా భక్తి సమన్వితుడై ఈపవిత్ర స్తవరాజమును పారాయణము గావింౘు భక్తులకు అంతఃకరణ శుద్ధి కలుగును. గొప్ప సహనము, మహైశ్వర్యము, చిత్తస్థైర్యము, మేధాసంపద, సత్కీర్తి లభింౘును. ఏకాగ్ర చిత్తము, సదాచార
సంపద, శుచిత, భగవానునియందు పూర్ణ విసశ్వాసము, అనురాగమును కలిగి పారాయణము చేసిన వారికి పైన వివరించిన మహా ఫలము లన్నియును కలుగునని భావము.
13_వ శ్లోకము
నక్రోధో నచ మాత్సర్యం నలోభో నాశుభామతిః ।
భవన్తి కృత పుణ్యానాం భక్తానాం పురుషోత్తమే ॥
భగవానునియందు భక్తిగల పుణ్యాత్ములకు కామ, క్రోధ, లోభ
మద, మాత్సర్యములు మున్నగు దుర్గుణములుండవు (వారు అరిషడ్వర్గములను
జయించిన వారగుదురు. అట్టి పవిత్రులకు అశుభములగు భావనలే యుండవు.
14_వ శ్లోకము
ద్యౌస్సచంద్రార్క నక్షత్రం ఖందిశో భూర్మహోదధిః ।
వాసుదేవస్య వీర్యేణ విధృతాని మహాత్మనః ॥
సూర్యచంద్ర నక్షత్రములతో కూడిన స్వర్గలోకమును, ఆకాశము
దిక్కులు, భూమి, మహాసాగరములు మున్నగునవన్నియును మహాత్ముండగు
శ్రీకృష్ణపరమాత్మ యొక్క బలవీర్యములచేతనే ధరింపబడి యున్నవి.

ఉత్తర పీఠిక
విష్ణు సహస్రనామ స్తోత్రమ్
( సంగ్రహ తాత్పర్య వివరణము)
(03_8_2019)
హరిః ఓం
15_వ శ్లోకము
ససురాసుర గంధర్వం స యక్షోరగ రాక్షసం ।
జగద్వశే వర్తదేదః కృష్ణస్య. సచరాచరమ్ ॥
దేవదానవ గంధర్వులతో కూడినట్టియు యక్షోరగ రాక్షస గణములతో
కూడినట్టిదియును నగు విశాల సచరాచర విశ్వమంతయును భగవానుడగు
శ్రీకృష్ణుని వశవర్తియైయున్నది.
16_వ శ్లోకము
ఇంద్రియాణి మనోబుద్ధిః సత్త్వం తేజోబలం ధృతిః ।
వాసుదేవాత్మకాన్యాహుః క్షేత్రం క్షేత్రజ్ఞ ఏవచ ॥
సర్వేంద్రియములు, మనస్సు, బుద్ధి అహంకారము, తేజస్స్సు, బలము,ధారణ, ప్రతిభా సంపత్తి, క్షేత్రము (శరీరము) క్షేత్రజ్ఞుడు (దేహి) మున్నగు
సమస్తమునూ వాసుదేవుని స్వరూపములేయని తెలుపబడుౘున్నవి.
17_వ శ్లోకము
సర్వాగమానాం ఆచారః ప్రథమం పరికల్పితః ।
ఆచార ప్రభవోధర్మోధర్మస్య ప్రభురచ్యుతః ॥
సర్వ శాస్త్రములందును సదాచారమే ప్రధానముగా చెప్పబడి యున్నది. సదాచారము నుండియే ధర్మముత్పన్న మగును. అట్టి ధర్మమునకు పరమాత్మయే ప్రభువు.
18_వ శ్లోకము
ఋషయః పితరోదేవామహా భూతాని ధాతవః ।
జంగమా√ జంగమం చేదం జగన్నారాయణోద్భవమ్ ॥
ఋషులు , పితరులు, సమస్త దేవతలు, మహాభూతములు,
సువర్ణాది ధాతువులు జంగమ స్థావరములగు నీ యనంత విశ్వము నారాయణుని
వలననే యుద్భవించినది.
19_వ శ్లోకము
యోగోజ్ఞానం తథాసాంఖ్యం విద్యాశ్శిల్పాది కర్మచ ।
వేదాః శాస్త్రాణి విజ్ఞానమే తత్సర్వం జనార్దనాత్ ॥
యోగము, జ్ఞానము, సాంఖ్యము, సకలవిద్యలు , సమస్తములగు
శిల్పాది కర్మలు, వేద శాస్త్రాదులు ఈ విజ్ఞానమంతయును పరమాత్మ నుండియే
కలుగుౘున్నవి.
20_వ శ్లోకము
ఏకోవిష్ణుర్మహద్భూతం పృథగ్భూతాన్యనేకశః ।
త్రీన్ లోకాన్ వ్యాప్య భూతాత్మా భుజ్త్కే విశ్వభుగవ్యయః ॥
మహారూపుడై, సమస్తభూత స్వరూపుడై , సర్వమును భరింౘు
వాడును, నాశన రహితుడును, అద్వితీయుండునునగు శ్రీమహావిష్ణువు ముల్లోకములందును వ్యాపించి సకలభూతజాలములందును వేరువేరు వివిధ
రూపములతో ననుభవింౘుౘున్నాడు.
21_వ శ్లోకము
ఇమంస్తవం భగవతో విష్ణోర్వ్యాసేన కీర్తితమ్ ।
పఠేద్య ఇచ్ఛే త్పురుషః శ్రేయః ప్రాప్తుంసుఖానిచ ॥
సర్వ విజ్ఞాన సాగరుండును భగవానుండును నగు శ్రీకృష్ణద్వైపాయనుని చేత గానము చేయబడిన నీ విష్ణసహస్రనామ స్తోత్రమను
దివ్యస్తవరాజమును పరమశ్రేయస్సును, సకలఫలసిద్ధులను వాంఛింౘు వారందరును సాదరముతో పఠింపవలయును.
22_వ శ్లోకము
విశ్వేశ్వర మజం దేవం జగతః ప్రభుమవ్యయమ్ ।
భజంతి యేపుష్కరాక్షం నతేయాంతి పరాభవమ్ ॥
సర్వలోక మహేశ్వరుండును , ఆదిమధ్యాంత రహితుండును,
తేజోమూర్తియును, సృష్టిస్థితి లయకారకుండును, సర్వశక్తిసంపన్నుడును నగు
శ్రీకృష్ణపరమాత్మను భక్తిభావముతో (స్మరణ చింతన ధ్యాన కీర్తనాదులచే)
భజింౘువాఱికి ఎట్టి అపజయములుగాని, పరాభవములుగాని దుఃఖములుగాని
యెన్నడును కలుగవని వ్యాసదేవుని వాక్యమై యున్నది.
హరిః ఓమ్ తత్సత్
యదక్షర పదంభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ ।
తత్సర్వం క్షమ్యతాందేవ నారాయణ నమోస్తుతే ॥
శ్రీకృష్ణ పరబ్రహ్మార్పణమస్తు
శ్రీవిష్ణుసహస్రనామస్తోత్ర సంగ్రహ తాత్పర్యవివరణము సమాప్తము.

సర్వేజనాః సుఖినో భవన్తు
సమస్త సన్మంగళాని భవన్తు
సౌందర్యలహరి శివానందలహరి స్తోత్రము ల నాస్వాదించి ఆదరించినటులే శ్రీవిష్ణుసహస్రనామస్తోత్ర సంగ్రహ తాత్పర్యవివరణము ను
గూడా భక్తి శ్రద్ధలతో నాస్వాదించి యాదరించి ప్రోత్సహించిన
మిత్రులు, బంధువులు, ఆత్మీయులు, భగవద్భక్తు లందరికీ
శ్రావణమాస శుభాకాంక్షలతో
శుభాభినందనలతో
సదా మీయందఱి శ్రేయోభిలాషి
మునీశ్వరరావు యనమండ్రం
(03_8_2019)