ప్రాంజలి ప్రభ ...అంతర్జాల పత్రిక
*🌹. విష్ణు సహస్ర నామములు - 1 / Vishnu Sahasra Namavali - 1 🌹*
*నామము - భావము, సీస పద్యము
రచయత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
🌻. ప్రారంభము 🌻
*పాలకడలిలో శంఖ చక్ర గదా పద్మములు ధరించిన వాడు, భూమియే పాదములుగా గలవాడు, సూర్యచంద్రములు నేత్రములైన వాడు, దిక్కులే చెవులైన వాడు, త్రిభువనములు శరీరముగా గలవాడు, శేషశాయి, విశ్వరూపుడు, శ్రీవత్సాంక కౌస్తుభ పీతాంబరధారి, నీలమేఘ వర్ణుడు అయిన రుక్మిణీ సత్యభామా సమేతుడు, ముకుందుడు, పరమాత్ముడు అయిన దేవునకు ధ్యానము చెప్పబడుతుంది.*
*"హరిః ఓం" అంటూ వేయి నామాల జపం మొదలవుతుంది.*
*విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్యభవత్ప్రభుః |*
*భూతకృద్భూతభృద్భావో భూతాత్మా భూతభావనః ‖ 1 ‖*
1) విశ్వం :- మనకు గోచరమగు దృశ్యమాన జగత్తంతయు తానైన వాడు.
2) విష్ణు: - విశ్వమంతయు వ్యాపించి ఉన్నవాడు.
3) వషట్కార: - వేద స్వరూపుడు.
4) భూత భవ్య భవత్ ప్రభు: - భూత భవిష్యత్ వర్త మానము లందలి సర్వమునకు ప్రభువైన వాడు.
5) భూత కృద్ - భూతములను సృష్టించిన వాడు.
6) భూత భృత్ - జీవులందరిని పోషించు వాడు.
7) భావ: - సమస్త చరాచర ప్రపంచమంతయు తానే వ్యాపించిన వాడు.
8) భూతాత్మా - సర్వ జీవ కోటి యందు అంతర్యామిగ ఉండువాడు.
9) భూత భావన: జీవులు పుట్టి పెరుగుటకు కారణమైన వాడు.
సీస పద్యము
దృశ్యమాన జగత్తు అంతయు తానైన
భూమిని రక్షణ చేయు వాడు
విశ్వమంతయు ఉన్న వేదస్వరూపుడు
జగతికి ప్రభువైన వాడు విష్ణు
భూతభవిష్యత్ జరుగు కాలమును నిర్ణ
యము చేయు శక్తిని పెంచు వాడు
భూతములను సృష్టి , జీవు లందరిని పో
షణ చేసి వేదస్వ రూప విష్ణు
తేట గీతి
జగతి నందుసమస్త ప్రజలకు తానె
సర్వ జీవుల అంతర్యామిగను ఉండి
పుట్టి పెరుగుట కారణ మైన విష్ణు
తెల్పు మల్లాప్రగడ వినయపు తృప్తి
--(***)--
సశేషం...
🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 2 / Sri Vishnu Sahasra Namavali - 2 🌹నామము - భావము, సీస పద్యము రచయత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
🌻. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌻
పూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతిః |అవ్యయః పురుషః సాక్షీ క్షేత్రజ్ఞోఽక్షర ఏవ చ ‖ 2 ‖
10) పూతాత్మా - పవిత్రాత్ముడు.పూత - పవిత్రమైన, ఆత్మ- స్వరూపముగలవాడు,11) పరమాత్మ - నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపమై కార్య కారణముల కంటే విలక్షణమైన వాడు.12) ముక్తానాం పరమాగతి: - ముక్త పురుషులకు పరమ గమ్యమైన వాడు.ముక్తులగు వారికి సర్వోత్తముడు, పరమాంగతి= పునర్జన్మ యనునది లేకుండా చేయువాడు, 13) అవ్యయ: - వినాశము కానివాడు. వినాశము లేని వాడు.14) పురుష: - నవద్వారములు కలిగిన పురము నందు ఉండువాడు శరీరమనెడి పురమున సయనించు వాడు, గొప్పవి యగు ఫలములను ఇచ్చువాడు,.15) సాక్షీ - చక్కగా సమస్తమును దర్శించువాడు.సాక్షాత్తుగా తన స్వరూపమే యైన జ్ఞానము చేత సమస్తమును చూడు వాడు, 16) క్షేత్రజ్ఞ: - శరీరము లో జరుగు క్రియలన్నింటిని గ్రహించువాడు.శరీరములను వీనికి బీజమైన శుభా శుభ కర్మలను తెలిసి కొను చున్నవాడు,17) అక్షర: - నాశరహితుడు.తరుగులేనివాడు, నక్షరతీతి అక్షరా: - గుణములు పై పైని అభివృద్ధి చెందునే కాని తరగని వాడు
సశేషం... 🌹 🌹 🌹 🌹 🌹
సీస పధ్యము
నాశర హితుడు, తిరుగులేని గుణములు అభిరుద్ది పరిచేటి ముక్త పురుష దేహములో జరుగు పవిత్ర మైనట్టి ఆత్మస్వ రూపము కలిగి నోడు నిత్యము శుద్ధము బుద్ధము ముక్తమురూపమైన ప్రాణి కన్న మిన్నగొప్పవి యగుఫల ములు ఇచ్చి చక్కగా సమముగా కర్మలు తెలుపు వాడు
ఆటవెలది
నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపమైకార్య సంభవమ్ము చేయు వాడు జ్ఞాన బీజమైన శుభకర్మలను తెల్పి నాస రహిత సాక్షి గున్న వాడు
--(())--
🌻. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌻🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 3 / Sri Vishnu Sahasra Namavali - 3 🌹నామము - భావము - సీసా పద్యము రచయత : మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ
యోగో యోగవిదాం నేతా ప్రధాన పురుషేశ్వరః |నారసింహవపుః శ్రీమాన్ కేశవః పురుషోత్తమః ‖ 3 ‖
18) యోగ: - యోగము చే పొందదగిన వాడు.ఉపాయమైన వాడు 19) యోగ విదాంనేతా - యోగ విదులకు ప్రభువైన వాడు జ్ఞానుల యోగ క్షేమాదులను వహించేడి వాడు.20) ప్రధాన పురుషేశ్వర: - ప్రకృతి పురుషులకు అధినేత, ప్రధానం అంటే పకృతి, పురుష: అంటే జీవుడు, ప్రకృతిని జీవుడ్ని నియమించే వాడు.21) నారసింహవపు: - నరుని సింహమును బోలిన అవయువములు గల వాడు.22) శ్రీమాన్ - సదా లక్ష్మీ దేవితో కూడి యుండువాడు.అత్యంత మనో హరుడు, తన వక్ష స్థలమున శ్రీదేవి ని ధరించిన వాడు23) కేశవ: - కేశి యనెడి అసురుని వధించిన వాడు.మనోహరమైన కేశ (సిరోజ)ములు కలవాడు24) పురుషోత్తమ: - పురుషులందరిలోను ఉత్తముడు.
సీస పద్యము
పురుషులం దరిలోను ఉత్తము డు మనో హ రుడు హృదయమునందు లక్ష్మి ఉన్న నరుని సింహమును బోలిన అవ యవములు కలిగిన ప్రకృతిని జీవములను నియమించి యోగవి ధులకు ప్ర భువుగాను జ్ఞాన సంపదలను వృద్ధి చేయు సకలఉపాయము లకునిల యముగలమనసును పంచేటి లోకనాధ
ఆటవెలది
భాద్యతా యుత మగు పనులలో బంధుత్వ మైత్రి బుద్ధి గుణము పంచు వాడు ధరణి కలుష మంత దహియింప గలదయాపరుడు తెల్పు చుండె మల్లాప్రగడ వారు
--(())--
🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 4 / Sri Vishnu Sahasra Namavali - 4 🌹నామము - భావము - సీస పద్యము రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
*4. సర్వః శర్వః శివః స్థాణుర్భూతాదిర్నిధిరవ్యయః |సంభవో భావనో భర్తా ప్రభవః ప్రభురీశ్వరః ‖ 4 ‖ *
25) సర్వ: - సమస్తమును తానై అయినవాడు.సర్వమునకు సృష్టి స్థితి లయ కారణముగా ఉండిన వాడు26) శర్వ: - సకల జీవులను సంహరింప జేయువాడు.అసుభా లను పోగొట్టేవాడు,27) శివ: శాశ్వతుడు. సర్వులకు భగవత్ ప్రాప్తి కలుగ చేయువాడు,28) స్థాణు: స్థిరమైనవాడు.స్థాణువు స్తిరమైనవాడు,29) భూతాది: - భూతములకు ఆదికారణమైన వాడు.సమస్త ప్రాణుల చేత గ్రహిం బడుచున్నవాడు,30) అవ్యయనిధి: - నశించని ఐశ్వర్యము గల వాడు.నాశనములేని నిధిని దాచి వాడు31) సంభవ: - వివిధ అవతారములను ఎత్తినవాడు.అంతట అవతరించేవాడు,32) భావన: - సర్వ జీవులకు సమస్త ఫలముల నొసగువాడు.సమస్త భోక్తలకు ఫలములను గలిగిన్చు వాడు,33) భర్తా: - సకలములను కనిపెట్టి, పోషించువాడు. సకలమును భరించువాడు.అధిష్టానముగా ఉండి ప్రపంచమును భరించు వాడు34) ప్రభవ: - పంచభూతములకు, దేశకాలాదులకు మూలమైనవాడు.మహాభూతములు వీని నుండియే ఉద్భవించు చున్నవి, అందువలన ఉత్కృష్టమైన జన్మగలవాడు,35) ప్రభు: - సర్వశక్తి సమన్వితమైనవాడు.సమస్త కార్యములలో మహా సామర్ధ్యము గలవాడు36) ఈశ్వర: - ఒకరి సహాయములేకనే సమస్త కార్యములు నెరవేర్చగల్గిన వాడు.నిరుపాదిక మైన ఐశ్వర్యము గలవాడు,
సీసా పద్యము
సకలజీవుల అసుభాలను పోగొట్టి సర్వులకు భగవత్ ప్రాప్తి ఇచ్చి స్థిరమైన వాడు ఒకరి సహాయము లేక కార్యము లన్నియు చేసి ఉంచి ఐశ్వర్య మున్నట్టి సర్వశ క్తి సమన్వి త,సమస్త కార్యంలొ సామరస్య ముతొ సకలములను కనిపెట్టి పోషణ చేసియు ఫలములు పంచి ఇచ్చు
తేటగీతి
శాశ్వతుడు సర్వులకు మోక్ష మిచ్చు వాడు వివిధ అవతార ములు ఎత్తి రక్షకుండు దేశ కాలాదు లకు మూల మైన వాడు నిత్య మనుషుల హృదయాన కల్సి ఉండు
--(())--
🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 5 / Sri Vishnu Sahasra Namavali - 5 🌹నామము - భావము - సీస పధ్యము రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
5. స్వయంభూః శంభురాదిత్యః పుష్కరాక్షో మహాస్వనః |అనాదినిధనో ధాతా విధాతా ధాతురుత్తమః ‖ 5 ‖
37) స్వయంభూ :- తనంతట తానే ఉద్భవించిన వాడు. ఇచ్చు చేతనే తనకే అసాధారణ మైనటు వంటి విదంగా అవతరించు వాడు38) శంభు: - సర్వశ్రేయములకు మూలపురుషుడు.భక్తులకు సుఖమును కలిగించు వాడు,39) ఆదిత్య: - సూర్యుని యందు స్వర్ణకాంతితో ప్రకాశించువాడు.ఆదిత్య మండలాంతర్గతుడైన హిరన్మయ పురుషుడు40) పుష్కరాక్ష: - పద్మముల వంటి కన్నులు గలవాడు.కమలముల వంటి కళ్ళు గలవాడు,41) మహాస్వన: - గొప్పదియగు వేదరూప నాదము గలవాడు.42) అనాదినిధన: - ఆద్యంతములు లేని వాడు.జన్మము, వినాశము లేనివాడు,43) ధాతా - నామరూపాత్మకమైన ఈ జగత్తునకు అద్వితీయుడై ఆధారమై యున్నవాడు.ప్రకృతి యందు బ్రహ్మాను గర్భము ధరించు వాడు,44) విధాతా - కర్మఫలముల నందించువాడు.గర్భాన్ని ఆవిర్భవింప చేసేవాడు,45) ధాతురుత్తమ: - సర్వ ధాతువులలో ఉత్తమమైన చిద్రూప ధాతువు తానైనవాడు. కార్యా కారణ రూపమైన సమస్త ప్రపంచమును ధరించుట వలన చైతన్యము పరుచువాడు
🌹 🌹 🌹 🌹 🌹సీస పద్యము
తనకుతానుగ ఉద్భ వించిన చైతన్య రూపమై న సమస్త లోకమేలు కర్మఫలములను అందించి ఆద్యంత ముయు లేని జన్మము గలిగి నోడు గొప్పది యగు వేద రూప నాదముగల వాడు, సూర్యునియందు కాంతి గలిగి జగతినం తయును చైతన్య పరిచియు భక్తుల సుఖమును కలుగ చేసె
తేటగీత స్వర్ణ కాంతితో జగతిని ఏలు వాడు కర్మ ఫలమును వెంటనే తీర్చువాడు సర్వ ధాతువు లలొశక్తి కలిగి నోడు విష్ణు లీలలు నరులను కమ్మి వేయు
--(())--
🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 6 / Sri Vishnu Sahasra Namavali - 6 🌹నామము - భావము - సీసా పద్యము రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
అప్రమేయో హృషీకేశః పద్మనాభోఽమరప్రభుః |విశ్వకర్మా మనుస్త్వష్టా స్థవిష్ఠః స్థవిరో ధ్రువః ‖ 6 ‖
46) అప్రమేయ: - ఏ విధమైన ప్రమాణములకు అందనివాడు.*47) హృషీకేశ: - ఇంద్రియములకు ప్రభువు.48) పద్మనాభ: - నాభియందు పద్మము గలవాడు.బ్రహ్మాదేవుని ఉత్పత్తి స్థానమైన పద్మమునాభి యందు కలవాడు49) అమరప్రభు: -దేవతలకు ప్రభువైనవాడు.50) విశ్వకర్మా - విశ్వరచన చేయగల్గినవాడు.విశ్వము కర్మగా గలవాడు, విశ్వకర్మతో సాదృశ్యము గలవాడు51) మను: - మననము(ఆలోచన) చేయువాడు. సంకల్పం చేతనే పనులన్నీ చేసేవాడు,52) త్వష్టా - ప్రళయకాలమున సమస్త భూతములను కృశింపజేసి నశింపజేయువాడు.53) స్థవిష్ఠ: - అతిశయ స్థూలమైన వాడు.మిక్కిలి స్థూలమైన వాడు,54) స్థవిరోధ్రువ: - సనాతనుడు, శాశ్వతుడైనవాడు.స్థావిరుడు అనగా పురాణ పురుషుడు,స్థిరత్వము గలవాడు
*అప్రమేయ=శబ్దాది గుణములు లేనివాడు, గావున ప్రత్యక్ష ప్రమాణము నకు గోచరింపడు, అనుమాన విషయము గాడు, ఏలన ఇయ్యది వ్యాపింప దగిన లింగమితని యందు లేదు, ఉపమాన ప్రమాణముచేతను సిద్ధించువాడు కాడు, ఏమన ఒక భాగము అను నదే వీనియందు లేదు , అందువలన సాదృశ్యమే కుదరదు, కనుక బ్రహ్మ రుద్రాదుల కరణములతో తెలుసుకొన సాద్యము కానివాడు,
ఇంద్రియములకు,దేవతలకు ప్రమాణములకు అందనివాడు విశ్వరచన చేయగల్గినవాడు శబ్దాది గుణములు శాశ్వతుడైనవాడు లేనివాడుఅతిశయ స్థూలమైన పురాణ పురుషుడు నాభి యందును పద్మము గలవాడుప్రళయకాలమున సమస్త భూతములను నాశనము సృష్టింప జేయువాడు.
తేటగీత విశ్వకర్మతో సాదృశ్యము గలవాడుదైవ శక్తియు ఇదియు అదియు అనిన ఏల సర్వ సర్వాంతర్యామిగ కలిగి నోడు నరులు బ్రహ్మ రుద్రాదుల పూజ్యు డితఁడు --(())-- . శ్రీ విష్ణు సహస్ర నామములు - 7 / Sri Vishnu Sahasra Namavali - 7 🌹నామము - భావము - సీస పద్యము రచయత:మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
అగ్రాహ్యః శాశ్వతో కృష్ణో లోహితాక్షః ప్రతర్దనః |ప్రభూతస్త్రికకుబ్ధామ పవిత్రం మంగళం పరమ్ ‖ 7 ‖
55) అగ్రాహ్య: - ఇంద్రియ మనోబుద్ధులచే గ్రహించుటకు వీలులేనివాడు.కర్మేన్ద్రియముల చేత గ్రహింప బడనివాడు56) శాశ్వత: - సర్వ కాలములందున్నవాడు.57) కృష్ణ: - సచ్చిదానంద స్వరూపుడైన భగవానుడు. సర్వమును ఆకర్షించువాడు.నీలి వర్ణము శరీరము గలవాడు,58) లోహితాక్ష: - ఎఱ్ఱని నేత్రములు గలవాడు.59) ప్రతర్దన: - ప్రళయకాలమున సర్వమును నశింపచేయువాడు.60) ప్రభూత: - జ్ఞానైశ్వర్యాది గుణసంపన్నుడు.61) త్రికకుబ్ధామ - ముల్లోకములకు ఆధారభూతమైనవాడు.అధో మద్య భేదము చేత మూడు దిశలకును స్థానముగా నున్నవాడు62) పవిత్రం - పరిశుద్ధుడైనవాడు.సమస్త హేయ గుణములకు ఎదురు కోటి అయిన వాడు కనుక పరిశుద్దుడు,63) పరం మంగళం - స్మరణ మాత్రముచే అద్భుతముల నంతమొందించి శుభముల నందించువాడు. స్వయం ప్రకాశక ఆనందరూపి అయి, కళ్యాణ రూపిగా నుండేవాడు,
సీస పద్యము
స్మరణ మాత్రముచే అద్భుతములనునంతమొందించియు స్థితి బుద్ధి శుభములు కల్పించు ఆనంద రూపము కలిగియు పరిశుద్ధుడైన వాడు ముల్లోకాలను ఏలు జ్ఞానైశ్వర్యాదిగ గుణసంపద కలిగి నీలి వర్ణ ప్రళయ కాలమున సర్వమును నశింపచే యగలిగి సర్వము తెలుపు వాడు తేటగీతి
సచ్చి దానంద వెలుగులు కనులు గలిగి నిత్య సర్వము నిర్వాహ కమును గలిగి సృష్టి సక్రమ పధ్ధతి నడప గలిగి సర్వ లోకాల్ని రక్షణ చేయు వాడు
--(())--
🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 8 / Sri Vishnu Sahasra Namavali - 8 🌹నామము - భావము - సీస పద్యము రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ :
ఈశానః ప్రాణదః ప్రాణో జ్యేష్ఠః శ్రేష్ఠః ప్రజాపతిః |హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనః ‖ 8 ‖
64) ఈశాన: - సర్వ భూతములను శాసించువాడు.65) ప్రాణద: - ప్రాణి కోటికి ప్రాణశక్తి నొసగువాడు, ప్రాణదానము చేయువాడు,.66) ప్రాణ: - ప్రాణశక్తి స్వరూపమైనవాడు.ఉచ్చ్వాస నిశ్స్వాసలు సలుపు జీవుడు,67) జ్యేష్ఠ: - వృద్ధతముడు. (సృష్టికి పూర్వమునుండే ఉన్నవాడు) అత్యంత వృద్ధుడు,68) శ్రేష్ఠ: - అత్యంత ప్రశంసాపాత్రుడు.69) ప్రజాపతి: - సమస్త ప్రజలకు పతి.సమస్త ప్రజలకు అధిపతియై ఉన్నవాడు70) హిరణ్యగర్భ: - విశ్వగర్భమున నుండువాడు.హిరణ్మయమైన అండము లోపల నుండు వాడు71) భూగర్భ: - భూమిని తన గర్భమునందు ఉంచుకొన్నవాడు.భూదేవికి సర్వదా తన అనుభవము నిచ్చి గర్భము వలే కాపాడేవాడు72) మాధవ: - శ్రీదేవికి భర్తయైనవాడు.మా అనగా శ్రీదేవి, ధవుడు అనగా భర్త , శ్రీదేవికి భర్త యైన వాడు 73) మధుసూదన: - మధువను రాక్షసుని వధించినవాడు.మధు వనేడి అసురుని సంహరించిన వాడు
మధువనే అసురుని సంహరించిన వాడు భూమిని గర్భము నందు ఉంచి సర్వ భూతములను శాసించువాడవు ప్రాణకో టికి నిజ శక్తి నొసగి విశ్వగర్భమున లోపల నుండిన అత్యంత వృద్ధుడు అదిపతియును ఉచ్చ్వాస నిశ్స్వాసలు సలుపు జీవుడుతన అనుభవములు తెల్పు వాడు
ఆటవెలది
నాడు మనసు విడక ననుబట్టియున్నాడు కనులకేమో వాడు కాన రాడు నాదు కన్నులకును మోదంబు గొల్పుచు నెపుడు కాన బడునొ ? యింపు గాగ
--(())--
9. ఈశ్వరో విక్రమీధన్వీ మేధావీ విక్రమః క్రమః |
అనుత్తమో దురాధర్షః కృతజ్ఞః కృతిరాత్మవాన్‖ 9 ‖
74) ఈశ్వర: - సర్వశక్తి సంపన్నుడైనవాడు.
75) విక్రమీ - శౌర్యము గలవాడు.
76) ధన్వీ - ధనస్సును ధరించినవాడు.
77) మేధావీ - ఏకకాలములో సర్వవిషయగ్రహణ సామర్ధ్యము కలిగినవాడు.
78) విక్రమ: - గరుడుని వీపుపై ఎక్కి ఇచ్ఛామాత్రముచే ఎచ్చటైనను విహరించగలవాడు.
79) క్రమ: - నియమానుసారము చరించువాడు.
80) అనుత్తమ: - తనకంటె ఉత్తములు లేనివాడు.
81) దురాధర్ష: - రాక్షసులు కూడా ఎదుర్కోను శక్యము గానివాడు.
82) కృతజ్ఞ: - ప్రాణులు చేయు కర్మములను చేయువాడు.
83) కృతి: - కర్మకు లేదా పురుష ప్రయత్నమునకు ఆధారభూతుడై యున్నవాడు.
84) ఆత్మవాన్ - తన వైభవమునందే సర్వదా సుప్రతిష్ఠుడై యుండువాడు.
శౌర్యము గలవాడు. పురుష ప్రయత్నము
నందున ఆధార భూతుడైన
తనకంటె ఉత్తము లైనట్టి వారెవ
రునులేని వాడు , గరుడుని వీపు
పైనఎక్కివిహరిం చేటి వైభవముతొ
నియమాను సారము యున్నవాడు
రాక్షసు లకు కూడ శక్యము గానివా
డు,విషయ గ్రాహ్యము గలిగి నోడు
ఆటవెలద
ప్రాణు లన్ని కర్మ ల ఫలము పొందియు
సర్వ విషయములను తెలుసు కొనియు
ఏక కాలము సర్వము తెలుపు వాడు
సుప్ర తిష్టుడై అందర్ని ఆదు కొనెను
--(())--
🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 10 / Sri Vishnu Sahasra Namavali - 10 🌹
నామము - భావము
మేషరాశి - కృత్తిక నక్షత్ర ద్వితీయ పాద శ్లోకం
10. సురేశః శరణం శర్మ విశ్వరేతాః ప్రజాభవః |
అహస్సంవత్సరో వ్యాళః ప్రత్యయః సర్వదర్శనః ‖ 10 ‖
85) సురేశ: - దేవతలకు ప్రభువైనవాడు.
86) శరణ: - దు:ఖార్తులను బ్రోచువాడై, వారి ఆర్తిని హరించువాడు.
87) శర్మ - పరమానంద స్వరూపుడు.
88) విశ్వరేతా: - సర్వ ప్రపంచమునకు కారణమైన పరంధాముడు.
89) ప్రజాభవ: - ప్రజోత్పత్తికి కారణభూతుడైన వాడు.
90) అహ: - పగలువలె ప్రకాశించు వాడు.
91) సంవత్సర: - కాలస్వరూపుడైనవాడు.
92) వ్యాళ: - పామువలె పట్టశక్యము గానివాడు.
93) ప్రత్యయ: - ప్రజ్ఞా స్వరూపుడైనవాడు.
94) సర్వదర్శన: - సమస్తమును దర్శించగలవాడు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
సీస పద్యము
ముల్లోకములకు సమ్మదము గూర్చెడు వాడు
చల్లని లోచనా బ్జములు వాడు
దు:ఖార్తులను చూసి ఆర్తిని హరించి
రక్షించె ప్రజ్ఞా స్వ రూపుడైన
వాడు, పగలువలె ప్రకాశ ముగలిగి
కాలము స్వరూపు డైన వాడు
పరమాత్మ నంద స్వరూపుడు లోకాన్ని.
దర్శించగలగిన యశుడు
తేటగీతి
పాము వలె పట్ట శక్యము గానివాడు
నరుల కారణ భూతుడై నట్టి వాడు
గోప్యముతెలిసి ఉండేటి విశ్వ హరుడు
సమము చేసియు సంకల్ప ముగల వాడు
.
--(())--
🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 13 / Sri Vishnu Sahasra Namavali - 13 🌹
నామము - భావము
మేషరాశి - రోహిణి నక్షత్ర 1వ పాద శ్లోకం
13. రుద్రో బహుశిరా బభ్రుః విశ్వయోని శుచిశ్రవాః|
అమృత శాశ్వతః స్థాణుః వరారోహో మహాతపాః|| 13
114) రుద్రః - అన్నింటినీ తనలో లయము/విలీనము చేయువాడు.
115) బహుశిరాః - అనేక శిరములు గలవాడు, అనంతుడు.
116) బభ్రుః - అన్నింటికీ ఆధారమైనవాడు, అన్నింటినీ భరించువాడు.
117) విశ్వయోనిః - విశ్వ ఆవిర్భావానికి కారణమైనవాడు.
118) శుచిశ్రవాః - తన నామాలను విన్నంత మాత్రమునే జీవులను పవిత్రులను చేయువాడు.
119) అమృతః - తనివి తీరని అమృతమూర్తి, అమరుడు.
120) శాశ్వత స్థాణుః - ఎల్లప్పుడూ సత్యమై, నిత్యమై, నిరంతరంగా వెలుగొందువాడు.
121 ) వరారోహః - శ్రేష్టమగు, పరమోత్కృష్ట స్థానమున వసించువాడు.
122) మహాతపాః - మహత్తరమైన జ్ఞానము గలవాడు, ప్రసాదించువాడు.
సీస పద్యము
జ్ఞానము గలవాడు, ఉత్కృష్ట స్థానము
నవసించు, సత్యమై నట్టి వాడు
తనివి తీరని మహోత్తరమైన, నిత్యమై,
వెలుగొందు అమరుడు, అమృత మూర్తి
జీవుల నుపవిత్రు లను చేయు, అన్నింటి
ని భరించి ఆధార మైన వాడు
విశ్వ ఆవిర్భావానికి కారణ మైనవాడు
బహుశిర ములుగల సవ్య సాచి
తేటగీతి
కరుణ వెదజల్లు కన్నులు గాంచువాడు
నెల్ల దిశలందు గనబడు విశ్వమూర్తి
కుచితమగు నలంకారము లేనివాడు .
రండు రారండు జోహారు లిందు వేగ
--(())--
05/10/26
శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రావళి -2
శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రావళి: -- హరిః ఓం ....
11 వ, శ్లోకము ..
అజస్సర్వేశ్వరః సిద్ధః సిద్ధిః సర్వాదిరచ్యుతః ।
వృషాకపిరమేయాత్మా సర్వయోగవినిస్సృతః ॥ 11 ॥
ప్రతిపదార్థం: --
అజః = జన్మము లేనివాడు; సర్వేశ్వరః = దేవదేవుడు; సిద్ధః = అన్ని సృష్టి వ్యవహారాలనూ తీర్చి దిద్దేందుకు సతతమూ సర్వ సన్నద్ధమైన వాడు; సిద్ధిః = శ్రమకు తగిన ఫల ప్రసిద్ధినిచ్చు వాడు. సర్వాదిః =సమస్తానికీ ఆద్యుడు; అచ్యుతః = సర్వకాల సర్వావస్థలయందు తన ఉనికిని కోల్పోనివాడు (Omnipresent); వృషాకపిః = జగదరక్షకుడు; (వృషము=ధర్మము, ఎద్దు, ఎలుక, అని నానార్థములు; కపి= కోతి, ఏనుగు, వరాహము,సూర్యుడు, అని నానార్థములు-) ఈసందర్భంగా, ధరణి అనే ధర్మాన్ని, వరాహావతారంలో ప్రళయకాలంలో కాపాడిన విష్ణుమూర్తి అని భావము-దీనకింకో వివరణ ఏమంటే : • ఋగ్వేదం (10.86 సూక్తం) లో 'వృషాకపి' అంటే సూర్యుడి యొక్క తేజస్సుగా వర్ణించబడింది. సంస్కృత నిఘంటువుల ప్రకారం "వృష" అంటే వర్షించేవాడు లేదా శక్తిప్రదాత, "కపి" అంటే కిరణములు గలవాడు (సూర్యుడు)-• భావం- సమస్త జీవులపై కిరణాల ద్వారా ప్రాణ శక్తి ధారలను కురిపించే సూర్యడు అని కూడా చెబుతారు; అమేయాత్మా = ఎవరికీ అందనంతటి అపార జ్ఞాన శక్తిని గలిగిన వాడు; సర్వయోగవినిస్సృతః = సకల యోగాభ్యాస శాస్త్రాల ద్వారా తెలుసుకోదగినవాడు.
ఈ శ్లోకంలోని విష్ణు నామావళి:
95) అజుడు;
96) సర్వేశ్వరుడు;
97) సిద్ధ ;
98) సిద్ధి;
99) సర్వాది;
100) అచ్యుత
101) వృషాకపి;
102) అమేయాత్మ;
103) సర్వయోగవినిస్సృతుడు;
– రాజశేఖరు సామల
******
సీస పద్యం
అజగ సర్వేశ్వర అచ్యుత సర్వాధి
సిద్ధపరాత్పర సిద్ది ముక్తి
సకలవృషా కపి సర్వార్ధ వ్యాళుడు
సృజన ప్రత్యయుడుగా సూత్ర ధారి
సర్వమై పరంధామ సమయంబు సంతృప్తి
సర్వయోగ కళల సర్వ సాక్షి
సృష్టి అమేయాత్మ శృతిల యలగనౌను
సర్వేశ్వర హృదయ శాంతి దాత
ఆంధ్ర పద్యము:
తే. గీ. అజుడ వీవ సర్వేశ్వరా, అచ్యుతుడవు;
సహిత సంస్థితుడవు, శ్రమాశ్రయ ప్రదాయి
సతమునకుమూలమీవ, వృషాకపీంద్ర
సత్య యోగ వినిస్సృత, శరణ మయ్య
భావం:
అజుడు (జన్మరహితుడు), సర్వేశ్వరుడు, అచ్యుతుడు, సర్వాధిపతి అయిన పరమాత్ముడు సిద్ధులకూ పరాత్పరుడు; సిద్ధి, ముక్తి ప్రసాదించువాడు.
సకల జీవరాశులకు ఆధారమైనవాడు; సమస్తార్థాలను గ్రహించిన జ్ఞానస్వరూపుడు; సృష్టి నిర్వహణకు సూత్రధారిగా నిలిచినవాడు.
సర్వముగా వ్యాపించి పరంధామముగా ప్రకాశించువాడు; కాలస్వరూపుడై సంతృప్తి నింపువాడు; సమస్త యోగకళలకు మూలమైన సర్వసాక్షి.
అపారమైన ఆత్మస్వరూపుడై సృష్టిలోనూ, శృతులలోనూ వెలసి, సమస్త హృదయాలలో శాంతిని ప్రసాదించే సర్వేశ్వరుడే ఆ పరమదైవము.
పద్యపరమార్థము:
ఆ దేవదేవుడు పుట్టుక లేనివాడు; సతత సంస్థితుడు, అన్ని సృష్టి వ్యవహారాలనూ తీర్చి దిద్దేందుకు ఎల్లప్పుడూ సిద్ధమైన వాడు. శ్రమకు తగిన ఫల ప్రసిద్ధినిచ్చు వాడు. అమేయాత్మఅంటే, ఎవరూ తెలుసు
కోలేనంతటి బ్రహ్మాండమైన ధాతువులనూ, ధాతుశక్తిని గలిగిన వాడు. సర్వయోగవినిస్సృతుడు, అనగా సకల యోగాభ్యాస శాస్త్ర జ్ఞాన సాధన ద్వారా మాత్రమే తెలుసుకోదగిన ఆ విష్ణుమూర్తికి నమస్కారములు.
మీ విధేయులు
రాజశేఖరు సామల
మల్లాప్రగడ రామకృష్ణ
శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రావళి: -- హరిః ఓం ....
12 వ, శ్లోకము ..
వసుర్వసుమనాః సత్యః సమాత్మా సమ్మితస్సమః ।
అమోఘః పుండరీకాక్షో వృషకర్మా వృషాకృతిః ॥ 12 ॥
ప్రతిపదార్థం:
వసుః= "వసంతి అస్మిన్ సర్వాణి భూతాని ఇతి వసుః - సమస్త
ప్రాణుల లోని జీవశక్తి. వసుమనాః= పవిత్రమైన మనోదార్ఢ్యత
గలవాడు. సత్యః= నిత్యం సత్య మైనవాడు. సమాత్మా: = అందరినీ సమానంగా ఆదరించేవాడు. సమ్మితః = "మితత్వాత్ చ తథా భక్తైః
సన్మితః పరికీర్తితః" – సమః=సర్వకాల సర్వావస్థలందును అందరి
యెడల సమదృష్టి కలిగినవాడు, కాబట్టి ఆయనను’సమ్మితః’
అంటారు. అమోఘః= మోఘము కానిది, అనగా వ్యర్థము కానిది అనే
అర్థానికి, ప్రస్తుతం తెలుగు లో ఇది "చాలా అద్భుతమైనది" , లేదా
"సమృద్ధి యైనది" అనే విస్తృత అర్థాలలో వాడుబడుతుంది. పుండరీ
కాక్షః = "పుండరీక ఇవ అక్షిణీ యస్య సః పుండరీకాక్షః" అర్థం:తెల్ల
తామరల వంటి (విశాలమైన, అందమైన) కన్నులు కలవాడు.
వృషకర్మా: = "వృషః (ధర్మః) కర్మ యస్య సః వృషకర్మా"- ఏ
పనులు కేవలం ధర్మబద్ధంగా, సృష్టి శ్రేయస్సు కోసమే ఉంటాయో,
అట్టి - సృష్టి-స్థితి-లయ కారక కార్యాలను నెరవేర్చు మహా
శక్తిని ‘వృషకర్మ’ అనంటారు. వృషాకృతిః= 'వృష' అంటే ధర్మం అని
కూడా అర్థం. కాబట్టి "ధర్మభావాంతర శక్తి " అని అర్థం వస్తుంది.
ఈ శ్లోకంలోని విష్ణు నామావళి:
104) వసువు;
105) వసుమనము;
106) నిత్యుడు ;
107) సమాత్మ;
108) సమ్మిత ;
109) అమోఘ;
110) పుండరీకాక్ష;
111) వృషకర్మ;
112) వృషాకృతి
;****
సీస పద్యం
వసుడవు సమ్మతి వసుమన మున ధారి
నిత్యుడవు సమాత్మ నిర్మలుడవు
ధర్మకర్మలుగాను ధరణి భరించగా
పుందరీకాక్షుడు పుడమినందు
నీవమోఘుoడువు నీడలా నుంటివి
ప్రకృతి వృషాకృతి ప్రభల తీరు
ప్రణతి సధాకృతి రస రమ్యతాభవ
రవ్వవెలుగు మాకు రాత్రి పగలు
ఆంధ్ర పద్యము:
తే. గీ. వసుడవు, సమాత్మ, సమ్మిత, వసుమనమున,
నిత్యుడై ధర్మ కర్మల నెరయఁ జేయు
పుండరీ కాక్ష, నీవమోఘుండ వైన
రీతికి, వృషకర్మకు, సదాకృతికి ప్రణుతి!
భావం:
ఓ పరమేశ్వరా! నీవు సంపదలకు అధిపతివి, సమస్త జీవుల మనస్సులను నడిపించే ఆధారస్వరూపుడవు. నిత్యుడవు, సమదృష్టి కలవాడవు, నిర్మల స్వరూపుడవు.
ఈ భూమిపై ధర్మకర్మలు కొనసాగునట్లు ధరణిని భరించుచున్నావు. పద్మనేత్రుడవైన నీవు ఈ పుడమిలో సర్వత్ర విరాజిల్లుచున్నావు.
నీవు అమోఘశక్తి సంపన్నుడవు. నీడ వలె ప్రతి జీవిని వెన్నంటి అనుసరిస్తూ రక్షించుచున్నావు. ప్రకృతిలోని ప్రతి రూపంలో, ప్రతి శక్తిలో నీ ప్రభావమే వ్యక్తమవుతోంది.
భక్తుల ప్రణతిని స్వీకరించి, సదాకృతి స్వరూపుడై, రసమయమైన ఆనందాన్ని ప్రసాదించువాడవు. చీకటిలో చిన్న రవ్వ వెలుగు ఎంత దారి చూపునో, అట్లే నీవు మాకు రాత్రింబగళ్లు జ్ఞానప్రకాశమై మార్గదర్శకుడవై నిలుస్తావు.
పద్యపరమార్థము:
సకల జీవులలోని ప్రాణశక్తి ఆయనే. ధర్మ జీవనమునకు మనో
దార్ఢ్యమును కలిగించే పవిత్ర చేతన శక్తి, సమాత్ముడు, సమ్మిత
విధాత ఆయనే. నిత్యుడై అమోఘమైన ధర్మ స్థాపన చేయగలగడం
ఒక్క ఆ పుండరీకాక్షుని వలననే సాధ్యమవుతుంది. ధర్మ కారక
కర్మలకు కర్త, ఆ ధర్మ కర్మ భావాకృతీ పరాక్రమమూ ఆయనే.
అటువంటి శ్రీ మహా విష్ణువునకు నేను నమస్కరిస్తాను.
మీ విధేయులు
– రాజశేఖరు సామల
మల్లాప్రగడ రామకృష్ణ
శుభోదయం, శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రావళి: -- హరిః ఓం ....
13 వ, శ్లోకము ..
రుద్రో బహుశిరా బభ్రుర్విశ్వయోనిః శుచిశ్రవాః ।
అమృతః శాశ్వతస్థాణుర్వరారోహో మహాతపాః ॥ 13 ॥
ప్రతిపదార్థము:
రుద్రః = 'రుత్' అనగా కాంతి లేదా జ్ఞానం, అని అర్థం. అంటే జీవులకు జ్ఞానకాంతిని ప్రసాదించి, అజ్ఞానమనే చీకటిని నిర్మూలించేవాడు రుద్రుడు; బహుశిరాః =జగత్తులో వివిధ ప్రధాన ముఖములైన శక్తి సామర్థ్యాలతో సృష్టిని సమాశ్ర యించువాడు; బభ్రుః = 'భృఞ్' అంటే పోషించుట, దాని వ్యుత్పత్తి ‘బభర్తి విశ్వమ్ ఇతి బభ్రుః (లేదా) బిభర్తి లోకాన్ ఇతి బభ్రుః ‘ - ఎవరైతే ఈ విశ్వాన్ని లేదా లోకాలను పోషిస్తారో ఆయనే 'బభ్రువు'; విశ్వయోనిః = సమస్త జగత్కారకుడు; శుచిశ్రవాః = అమలిన మనో నిశ్చయము కలవాడు; అమృతః = సత్యనిత్య స్థితుడు; శాశ్వతస్థాణుః = అనునిత్యుడు; వరారోహః = శ్రేష్ఠమైన వాహనమెక్కి తిరిగే వాడని స్థూలార్థం అయితే, ఆధ్యాత్మికంగా, జీవులను ఉత్తమ పదాలకు చేర్చే వాడని అర్థం; మహాతపాః = గొప్ప తపో జ్ఞానము కలవాడు; లేదా సృష్టి కార్యాచరణకు అవసరమైన అంకిత నిష్ఠను కలిగిన వాడు.
ఈ శ్లోకంలోని విష్ణు నామావళి:
113) రుద్రుడు;
114) బహుశిరుడు;
115) బభ్రువు;
116) విశ్వ స్రష్ట;
117) శుచిశ్రవుడు;
118) సత్యనిత్య స్థితుడు;
119) అనునిత్యుడు;
120) వరారోహుడు;
121) మహాతపస్వి ;
సీస
రుద్ర బహుశిరుడు పూజ్య ప్రభాకర
బబ్రువు విశ్వ శ్రష్ఠ బ్రహ్మ సృష్టి
సత్యనిత్య స్థిత సమ్మోహనాపరా
శుచిశ్రవ చిన్మాయ సూత్ర ధారి
అనునిత్య పరమాత్మ మన వరారోహుడు
సకల సమ్మతిగా మహాతపస్వి
దివ్యవెలుగులుగా దీక్షల ప్రభలుగా
పరమాణువును సృష్టి పాత్ర ధారి
ఆంధ్ర పద్యము:
రుద్రుడవు, బహుళ విధ శిరుడవు, భరణి
బభ్రువు, శుచిశ్రవుడవు, సంభవ నియోగి,
సత్య నిత్య, వరారోహ, సర్వ జతుల
దివ్య పదములసమకూర్చు దేవ, శరణు!
భావం:
రుద్రస్వరూపుడై అనేక శిరస్సులతో విశ్వమంతటా వ్యాపించి, పూజనీయుడై ప్రకాశాన్ని ప్రసరింపజేసే ప్రభాకరుడవు. బబ్రువు (భరించువాడు)గా ఈ జగత్తును ధారించి, బ్రహ్మసృష్టికి మూలకారణమై నిలిచినవాడవు.
సత్యమునకు, నిత్యస్థితికి ఆధారమై, మాయామోహాలకు అతీతుడై, పవిత్ర కీర్తి కలిగిన చిన్మయ స్వరూపుడవు. సమస్త సృష్టిని ఒక సూత్రంలో కట్టిపడేసిన సూత్రధారివి.
అనునిత్యం ప్రతి జీవిలో పరమాత్మగా నివసిస్తూ, సమస్తులకు శ్రేయస్సు ప్రసాదించువాడవు. అందరి సమ్మతిని పొందిన మహాతపస్విగా యోగక్షేమాలను నిర్వహించువాడవు.
దివ్యవెలుగుల రూపంలో జ్ఞానాన్ని ప్రసరింపజేస్తూ, దీక్షా శక్తుల ద్వారా లోకాన్ని నడిపిస్తూ, అతి సూక్ష్మమైన పరమాణువు నుండి విశ్వసృష్టి వరకు అన్నింటికీ ఆధారమైన పాత్రధారిగా నిలిచినవాడవు.
పద్య భావము:
జీవులకు విజ్ఞానకాంతిని ప్రసాదించుటకు, అజ్ఞానమనే చీకటిని నిర్మూలించే రుద్రుడవు; జగత్తులో వివిధ ప్రధాన ముఖములైన శక్తి సామర్థ్యాలతో సృష్టిని సమాశ్ర యించువాడవు. సర్వ భరణిని పోషించే 'బభ్రుడవు. జగత్తులో సృష్టి కారకుడవు. అమలిన మనో నిశ్చయము గలిగి, సత్యనిత్య స్థితుడవై, అనునిత్యము, జీవులకు దివ్య పదములను సమకూర్చు దైవమైన నిన్ను శరణు కోరెదను. –
మీ విధేయులు
రాజశేఖరు సామల,
మల్లాప్రగడ రామకృష్ణ
శుభోదయము ..
శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రావళి: -- హరిః ఓం ....
14 వ, శ్లోకము ..
సర్వగః సర్వ విద్భానుర్విష్వక్సేనో జనార్దనః ।
వేదో వేదవిదవ్యంగో వేదాంగో వేదవిత్కవిః ॥ 14 ॥
ప్రతిపదార్థం:
సర్వగః = సర్వాంతర్యామి; సర్వవిత్=సర్వజ్ఞ; భానుః =
సూర్యాంశ; జనార్దనః=జీవులలోని దుష్టగుణాలను పోగొట్టి,
వాటిని సరియైన మార్గములో నడిపించు వాడు; వేదః =
వేదమే తానైనవాడు; వేదవిత్ =వేదజ్ఞానమును పూర్తిగా
తెలిసినవాడు; అవ్యంగః = పరిపూర్ణ సామర్థ్యమును
కలిగినవాడు (Omnipotent);వేదాంగః = వేదములలోని
జ్ఞానాంతర శక్తి చే సృష్టిని శాసించు వాడు; వేదవిత్ =
వేదముల జ్ఞానసర్వమూ తానైన వాడు ; కవిః =దృశానుడై
విశ్వాన్ని రచించు మహాకవి.
ఈ శ్లోకంలోని విష్ణు నామావళి:
122) సర్వగమనుడు;
123) సర్వవిదుడు;
124) భానుడు;
125) జనార్దనుడు;
126) వేదుడు
127) వేదవేద్యుడు;
128) అవ్యంగుడు;
129) వేద విద్వత్తు;
130) కవి;
14. సీస పద్యం
సర్వ సమయతృప్తి సర్వగమనుడుగా
సర్వ విధుని కళ శాంతి భవము
వేద వేద్యుడు గాను వేదవిధ్వత్తుడు
భగవాను భానుడు భాగ్య పరుడు
కవి అవ్యంగుడు కావ్య చరిత డౌను
నిత్య జనార్ధనుడు నియమ పరుడు
వేదజ్ఞానముదీక్ష విద్యవిశ్వాసుడు
సర్వజ్ఞ సంతస సఖ్య తతడు
ఆంధ్ర పద్యము:
తే. గీ. సర్వగమన, సకల విధి సారసాంగ,
భానుడవు, జనార్దనుడవు, పద్మనాభ,
వేదరూప, వేద నివేద్య, వేదవేద్య;
అవ్యయాంగ దృశా కవి; సవ్య, వినతి!
భావం:
సర్వకాలాల్లో, సర్వజీవులకు తృప్తిని ప్రసాదించువాడు పరమాత్మ. ఆయన సర్వత్ర సంచరించువాడు, సమస్త విద్యలు మరియు కళలకు మూలమైన శాంతిస్వరూపుడు. వేదాలు తెలుసుకోవలసిన పరమసత్యమూ ఆయనే; వేదజ్ఞానంలో పరిపూర్ణుడూ ఆయనే.
భగవంతుడు జగత్తుకు వెలుగునిచ్చే భానునివలె భాగ్యాన్ని ప్రసాదించువాడు. ఆయనలో ఎటువంటి లోపమూ లేదు. సమస్త కావ్యాలకు, చరిత్రలకు, సాహిత్యసౌందర్యానికి మూలకారణమైన దివ్యచైతన్యం ఆయనే.
నిత్యమూ జనులను పోషించి రక్షించువాడు జనార్ధనుడు. నియమబద్ధతకు ఆదర్శమై ధర్మమార్గాన్ని చూపువాడు. వేదజ్ఞానాన్ని అనుగ్రహించి, విద్యపై విశ్వాసాన్ని పెంపొందించువాడు. సర్వజ్ఞుడై, ఆనందస్వరూపుడై, సమస్త జీవులకు స్నేహితుడై ఎల్లప్పుడూ తోడుగా నిలిచేవాడు.
పద్యభావము:
సర్వగమనుడూ(సర్వాంతర్యామి); సకల విద్యాసారమే
ఆకారముగా గలవాడు, భానుడూ, జనార్దనుడు, వేద
రూపుడు, వేదవిజ్ఞుడూ, వేదవేద్యుడూ, తరగని శక్తి
గల అవ్యయాంగుడూ, దృశానుడైన విశ్వ రచయిత,
అంతయు తానైన విష్ణువునకు నమస్కరింతును.
--- రాజశేఖరు సామల
. మల్లాప్రగడ రామకృష్ణ
శుభోదయము ..
శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రావళి: -- హరిః ఓం ....
15 వ, శ్లోకము ..
లోకాధ్యక్షః సురాధ్యక్షో ధర్మాధ్యక్షః కృతాకృతః ।
చతురాత్మా చతుర్వ్యూహశ్చతుర్దంష్ట్రశ్చతుర్భుజః ॥ 15 ॥
ప్రతిపదార్థం:
లోకాధ్యక్షః= సర్వ లోకాలకు ప్రభువు; సురాధ్యక్షః = సురులకు అధిపతి;
ధర్మాధ్యక్షః =జీవ ధర్మ తీర్పులకు న్యాయమూర్తి; కృతాకృతః = కనబడే
శరీర కర్మరూపుడు. కనబడని అంతః శరీర (అవ్యక్త) ప్రాణ కర్మ కారణమైన వాడు. చతురాత్మ = సృష్టి, స్థితి, లయ, ధాతు – అనే నాలుగు సంవృత జీవ స్థితులకు ప్రతీకలుగా, బ్రహ్మ, విష్ణు, రుద్ర, కపిల-రూపాంశాలుగా, నాలుగు కాల ఋతువులుగా -నాలుగు వేదాల తీర్పుగా – సృష్టి ధారణ జేయువాడు. చతుర్వ్యూహః = సృష్టి నిర్వహణ కొరకు వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ అనే నాలుగు దివ్య శాఖాధిపతులుగా; చతుర్దంష్ట్రః = తన నరసింహ అవతారంలో నాలుగు విధాల దాడులతో దానవులను దండించు వాడు; చతుర్భుజః = శంఖ, చక్ర, గదా, పద్మాలను నాలుగు చేతులలో ధర్మార్థ కామ మోక్షాలకు గురుతులుగా నాలుగు పురుషార్థాలను
ప్రసాదించు వాడు.
ఈ శ్లోకంలోని విష్ణు నామావళి:
131) లోకాధ్యక్ష ;
132) సురాధ్యక్ష ;
133) ధర్మాధ్యక్ష ;
134) కృతాకృతుడు;
135) అవ్యక్తుడు;
136) చతురాత్మా ;
137) చతుర్వ్యూహా;
138) చతుర్దంష్ట్ర;
139) చతుర్భుజ;
15. సీస పద్యం
నిత్యలోకాధ్యక్ష నిర్మల దక్షుడు
విధిగా సూరాధ్యక్ష విశ్వ ధరుడు
కాల ధర్మాధ్యక్ష కామ్యతా భవభాగ్య
ఈకృతాకృతుడుగా యిచ్ఛ ధరుడు
సహజ అవ్యక్తుడు సహన పరాత్ముడు
ఈ చతురాత్ముడు ఇష్ట పరుడు
కళ చతుర్వూహుడు కళ చతు ర్ధంష్ట్రడు
కళ చతుర్భుజుడు కావ్య ధరుడు
ఆంధ్ర పద్యము:
తే. గీ. విశ్వనాథ, సురాధిప, విధి ప్రదాయి;
జీవధర్మ కృతాకృత ; కువలయాత్మ;
జవ చతుర్భుజ, చతురాత్మ, చతుర కల్ప
రక్షక, చతురవ్యూహ, శరణు మహాత్మ!
1.— సమస్త లోకాలకు నిత్యాధిపతి, నిర్మలమైనవాడు, కార్యసామర్థ్యం కలవాడు.
2. — దేవతలకు అధిపతి, విశ్వాన్ని ధరించి పోషించేవాడు.
3. — కాలానికి, ధర్మానికి అధిపతిగా ఉండి, భక్తుల కోరికలను నెరవేర్చేవాడు.
4సృష్టించబడినవాటిలోనూ, సృష్టికి అతీతమైన స్వరూపంలోనూ ఉండి, సంకల్పశక్తిని కలిగినవాడు.
5 — ఇంద్రియాలకు పూర్తిగా అందని అవ్యక్త స్వరూపుడు, సహనశీలి, పరమాత్మ.
6 — చతురాత్మ స్వరూపుడై, భక్తులకు ఇష్టమైనవాడు.
7 — చతుర్వ్యూహ స్వరూపుడు; చతుర్దంష్ట్రుడు అనే దివ్యనామంతో స్తుతించబడేవాడు.
8. — నాలుగు భుజాలు కలిగిన చతుర్భుజుడు; దివ్యమైన వాక్కు, స్తుతి వైభవాన్ని ధరించేవాడు.
పద్యభావము:
సర్వ లోకాలకు, సురులకూ నీవే ప్రభువు. ధర్మానికీ నీవే అధినాథుడవు. కనబడే శరీర కర్మలకూ, కనబడని అంతః శరీర (అవ్యక్త) ప్రాణ సంస్కృతికీ కారణమైన వాడవు. సృష్టి, స్థితి, లయ, ధాతువులనే నాలుగు సంవృత జీవ స్థితులకు ప్రతీకలై (బ్రహ్మ, విష్ణు, రుద్ర, కపిల రూపాంశాలు, నాలుగు కాల ఋతువులందు, నాలుగు వేదాల తీర్పుగా) సృష్టి ధారణ జేయువాడవు. సృష్టి నిర్వహణ కొరకు వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ అనే నాలుగు దివ్య శాఖాధిపతులుగా చతుర్వ్యూహములను నెరపు ధర్మ శాస్తవు. నరసింహావతారంలో ‘చతుర్దంష్ట్ర’ వై నాలుగు విధాల దాడులతో దానవులను దండించు వాడవు. శంఖ, చక్ర, గదా, పద్మాలను నాలుగు చేతులలో ధర్మార్థ కామ మోక్షాలకు గుర్తులుగా నాలుగు పురుషార్థాలను ప్రసాదించు ‘చతుర్భుజుడవు నీవే కదా మహాత్మా నీకు శరణు! -- --
రాజశేఖరు సామల.
మల్లాప్రగడ రామకృష్ణ
శుభోదయము ..
శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రావళి: -- హరిః ఓం ....
16 వ, శ్లోకము ..
భ్రాజిష్ణుర్భోజనం భోక్తా సహిష్ణుర్జగదాదిజః ।
అనఘో విజయో జేతా విశ్వయోనిః పునర్వసుః ॥ 16 ॥
ప్రతిపదార్థము:
భ్రాజిష్ణుః= భ్రాజ్ + ఇష్ణుచ్ = భ్రాజిష్ణు, ప్రకాశించుటయే గుణముగా
కలిగిన వాడు; (దీప్తి మంతుడు). భోజనం = భుజ్' (జీవన
వ్యవహారాలను - "భుజ్యతే ఇతి భోజనమ్" - అనుభవించబడే ప్రకృతి స్వరూపము తానే అయినవాడు. భోక్తా: (పై ప్రకృతీ జీవన నిమిత్త
ములను) అనుభవించు వాడు. సహిష్ణుః (సః + ఇష్ణుః = సః
(భరించు) ఇష్ణుచ్ = స్వభావము.) జగతి జీవులను భరించు
వాడు. జగదాదిజః (జగత్+ఆది+ జః ) = బ్రహ్మాండమునకు
మొదలయిన వాడు. అనఘః = పుణ్య పురుషుడు. విజయః = పరాజయమెరుగని పరమ నియంత. జేత (జి + తృచ్ ) జేతృ =
దుష్ట శిక్షణ సంభవ అవతారాల్లో –ఎప్పుడూ ధర్మ సంస్థాపనా
గమ్యంలో విజయం సాధించు వాడు. విశ్వయోనిః = ఈ విశ్వ
మంతటికీ కారణ భూతుడు. పునర్వసుః = "పునః పునః
వసంతి అస్మిన్ ఇతి పునర్వసుః" పురాతన సృష్టి లయ
మయ్యాక, తిరిగి జీవుల పునః స్థానము జేయు వాడు.
ఈ శ్లోకంలోని విష్ణు నామావళి:
140) భ్రాజిష్ణుడు ;
141) భోజ్యము (జీవానుభవము) ;
142) భోక్త (జీవానుభవ కర్త) ;
143) సహిష్ణు;
144) జగదాదిజుడు;
145) అనఘుడు;
146) విజయుడు;
147) జేత;
148) విశ్వాత్మా;
149) పునర్స్థాపాకుడు.
16. సీస పద్యం
అనఘ బ్రాజిష్ణుడు ఆనంద విజయుడు
జీవాను భవముగా జితుడ తడులె
జగదాదిజుడు గాను జాగృతి విశ్వాత్మ
కర్తగా కార్యర్థి కళలు గనులె
జేత సహిష్ణుడు జీవన్ ప్రధాతుడు
విశ్వయోని వినయ విద్య ధరుడు
పునరాగమన కర్త పూజ్య మై సృజనాత్మ
వ్యవహార సకలుడు వ్యాఖ్య ధరుడు
ఆంధ్ర పద్యము:
తే. గీ. దీప్తి గుణ ధామ, స్వాదిత దివ్య భావ
జీవననుభుక్తియును, భోక్త వీవ, జితుడ;
జన్మజ దుడుకుల సహిస్ణు, శంఖ భృత్తు,
అనఘ, సృజనాత్మ, పునరాగమన విధాయి!
: జీవుల అనుభవాలకు ఆధారమైనవాడు, జగత్తుకు ఆదికారణమైనవాడు.
: సమస్త విశ్వానికి ఆత్మస్వరూపుడు, సృష్టి కార్యాలకు కర్త.
: విజయాన్ని పొందేవాడు, సహనశీలుడు, జీవులకు జీవాన్ని ప్రసాదించేవాడు.
విశ్వయోని, వినయవిద్య: విశ్వానికి మూలకారణమైనవాడు, వినయజ్ఞానాలకు ప్రేరకుడు.
పునరాగమనకర్త, పూజ్యుడు, సృజనాత్మ: పునరాగమనానికి కారణమైనవాడు, పూజనీయుడు, సృష్టి స్వరూపుడు.
: సమస్త వ్యవహారాలకు ఆధారమైనవాడు, తత్త్వాలను వివరించేవాడు.
పద్య భావము:
జగద్దీప్తి కారకా, జీవన వ్యవహారాలూ, అయ్యనుభవ ప్రకృతీ
స్వరూపము తానే అయినవాడు. వాటిపై అనుభవ అధికారమూ
తనకే కలిగినవాడు; జగతి జీవులను సృజించి, భరించు వాడు.
జగదాదిజః (జగత్+ఆది+ జః ) = బ్రహ్మాండమునకు మూలమైన
వాడు; అనఘుడు, విజయుడు; దుష్ట శిక్షణ సంభవావతారాల్లో,
ఎప్పుడూ ధర్మ సంస్థాపనా గమ్యంలో తానే విజయం సాధించు
వాడు. సృజనాత్మ; పురాతన సృష్టి లయమయ్యాక, జీవుల
పునః స్థానము జేయు పునర్వసుడూ, తానే.–రాజశేఖరు సామల.
శుభోదయము ..
శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రావళి: -- హరిః ఓం ....
17 వ, శ్లోకము ..
ఉపేంద్రో వామనః ప్రాంశురమోఘః శుచిరూర్జితః ।
అతీంద్రః సంగ్రహః సర్గో ధృతాత్మా నియమో యమః ॥ 17 ॥
ప్రతిపదార్థం:
ఉపేంద్రః = (ఉపేంద్రో): ఇంద్రుడిని ఓడించిన ‘బలి చక్రవర్తి’ ముల్లోకాలను
కైవసం చేసికొన్న సందర్భంగా, శ్రీ మహావిష్ణువు, వామనుడై మూడడుగులతో
ఆ ముల్లోకాలనూ తిరిగి ఇంద్రునికప్పగించిన సాయానికి ప్రతీకగా - ఉపేంద్రుడు
గా (ఇంద్రునికి ఉపయుక్తం (సాయం) చేసిన వాడుగా) ప్రసిద్ధి. వామనః = వామనుడు; ప్రాంశుః (ప్ర +అంశుః) - ప్ర= మిక్కిలి, అంశుః = ఉన్నత
మైన (త్రివిక్రమ) రూపము కలిగిన వాడు; అమోఘః = అవ్యర్థుడు;
శుచిః = పావనమూర్తి; ఊర్జితః= అపారమైన శక్తి సామర్థ్యాలు కలవాడు.
అతీంద్రః= ఇంద్రియ జ్ఞానానికి అందని వాడు; సంగ్రహః= సృష్టిలోని
సమస్త చరాచర జగత్తును, జీవులను తన ఆధీనంలో ఉంచుకుని,
అందరికీ ఆశ్రయమై నిలిచేవాడు, ప్రళయ కాలంలో సమస్త సృష్టిని
తనలో లీనం (సంగ్రహణం) చేసుకునేవాడు, లేదా ప్రళయ సమయ మప్పుడు ఈ సృష్టినంతటినీ సూక్ష్మ రూపంలో తనలోనే లీనం చేసుకునేవాడు కనుక ఆయనను 'సంగ్రహః' అని పిలుస్తారు. సర్గః = "సృజ్యతే ఇతి సర్గః" సృష్టికి కారణమైనవాడు మరియు ప్రకృతే
తానైన వాడు. ధృతాత్మ=మనస్సును, ఇంద్రియాలను ఆధీనంలో
ఉంచుకునే వాడు-జితేంద్రియుడు లేదా 'ధృతాత్ముడు' అంటారు. నియమః=సృష్టిలోని జీవుల నిర్వహణ నిర్దేశిత విధులలో నియమించేవాడు; యమః = యమయతి అంతం నయతి ఇతి
యమః, లేదా అంతర్యామిగా ఉంటూ జీవులను లోపలి
నుండి నియంత్రించేవాడు మరియు ధర్మబద్ధంగా పాలించేవాడు.
ఈ శ్లోకంలోని విష్ణు నామావళి:
150) ఉపేంద్రుడు;
151) వామనుడు;
152) ప్రాంశువు;
153) అమోఘుడు;
154) శుచిరుడు;
155) ఊర్జితుడు;
156) అతీంద్రుడు;
157) సంగ్రహణుడు;
158) సర్గ;
159) ధృతాత్ముడు;
160) నియమముడు
161) యముడు
17. సీస
యముడు దృతాత్ముడు యదలోను శుచిరుడు
కళల అమోఘడు కార్య దర్శి
సృష్టిస్థితిలయకరా శృతి లయచిత్తుడు
సర్గ ఉపేంద్రుడు సంగ్రహణు డు
వామన ప్రాంశువు వాత్సవ ధీరుడు
నియమ యతీoద్రుడు నీడ నిచ్చు
ఊర్జిత విక్రమ ఉజ్వల ధరుడు
సర్వ శక్తి పరుడు సహన పరుడు
ఆంధ్ర పద్యము:
తే. గీ. వామన, సహస్ర దృక్కు, విక్రమ, యుపేంద్ర,
సంగ్రహణుడ, మహోన్నత సర్గ, శుచిర,
ఊర్జితుడమోఘుడవతీంద్ర, ఉర్వి నాథ,
నియమ యముడవీవు, ప్రభువ నీకు వినుతి.
భావం
పరమాత్ముడు ధర్మాన్ని నియంత్రించేవాడు, స్థిరచిత్తుడు, పవిత్రుడు, తన కార్యాలలో అపజయం ఎరుగనివాడు. సృష్టి, స్థితి, లయలను నిర్వహిస్తూ సమస్తాన్ని తనలో సంగ్రహించేవాడు. వామనునిగా అవతరించినవాడు, అపారమైన శక్తి, పరాక్రమం కలవాడు. నియమబద్ధంగా లోకాలను నడిపిస్తూ అందరికీ రక్షణనిచ్చేవాడు. సర్వశక్తిమంతుడై, సహనంతో సమస్తాన్ని పాలించేవాడు.
పద్యభావము:
వామనావతారాన ఇంద్రునికి ఉపయుక్తుడైన ఆయనే వామనుడు, ఉపేంద్రుడూను. త్రివిక్రముడైన ప్రాంశువు, అమోఘుడు, శుచిరుడైన పవిత్రాత్మ ఆయనే. సర్వ శక్తిమంతుడైన ఊర్జితుడు, అతీంద్రుడు;
సంగ్రహణుడై ఆయనే ప్రకృతీ సంభవమై, ఆ ప్రకృతే తానైన వాడే విష్ణుమూర్తి. సృష్టి-స్థితి-లయ కార్యాచరణలో ధృఢ చిత్తు డైనవాడు; సర్వాన్నీ చక్కగా తీర్చిదిద్దుటలో నిరతిని పాటించు వాడు; సమవర్తి ఆయనే నీవు – నీకు ప్రణామములు. --- రాజశేఖరు సామల
శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రావళి: -- హరిః ఓం ....
18 వ, శ్లోకము ..
వేద్యో వైద్యః సదాయోగీ వీరహా మాధవో మధుః ।
అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబలః ॥ 18 ॥
ప్రతిపదార్థం:
వేద్యః = సర్వ విజ్ఞతను కలిగిన వాడు; వైద్యః = సర్వ అస్వస్థతలను పోగొట్టు వాడు; సదాయోగి= సర్వావస్థల ప్రకృతి లోని జీవుల పరమార్థ జ్ఞాన యోగంలోనే ఉండేవాడు; వీరహా=దానవులను సంహరించేవాడు;
మాధవః = 'మా' అంటే బ్రహ్మవిద్య (ఆధ్యాత్మిక జ్ఞానం). 'ధవ' అంటే ప్రభువు/భర్త, అంటే – మౌనం, ధ్యానం అనే బ్రహ్మ విద్యలకు అధిపతి.
మధుః = పురాతనమును తనలో చేర్చుకుని ఆ మృత ధాతువులనుంచి అమృత సంభవాలను కలిగించే వాడు. అతీంద్రియః = సృష్టిలోని లౌకిక వస్తువులన్నీ ఇంద్రియాలకు లోబడి ఉంటాయి. కానీ పరమాత్మ (భగవంతుడు)
ఇంద్రియాల పరిధికి, వాటి ద్వారా కలిగే సుఖదుఃఖాలకు అందడు. అందుకే భగవద్గీత పురుషోత్తమ ప్రాప్తి యోగంలో భగవంతుడిని 'అతీంద్రియుడు'. అని
అన్నారు. మహామాయః = అలౌకిక మాయతో ఎవరినైననూ మోహింపజేసే గొప్ప మాయ (శక్తి) – అదే విష్ణుమాయ. మహోత్సాహః = 'మహోత్సాహుడు' అనే పదాన్ని కార్యశూరుడైన నాయకుడిని లేదా ఎల్లప్పుడూ ఉత్సాహంతో అపజయాన్ని ఒప్పుకోకుండా ముందడుగు వేసే వ్యక్తిని వర్ణించడానికి ఉపయోగిస్తారు. మహాబలః = సమస్త విశ్వాన్ని ధరించ గల అపరిమితమైన శక్తి కలవాడు- (Omnipotent).
ఈ శ్లోకంలోని విష్ణు నామావళి:
162) వేద్యుడు;
163) వైద్యుడు;
164) సదాయోగి;
165) వీరహుడు;
166) మాధవుడు;
167) మధువు;
168) అతీంద్రియుడు;
169) మహామాయుడు;
170) మహోత్సాహుడు ;
171) మహాబలుడు.
18.
నీవుగ వైద్యుడు నీవుగ వేద్యుడు
సకల సదాయోగి సాధు తత్వ
నీవు వీరహుడుగా నీవు మాధవడుగా
ఈఅతీoద్రుడుగాను యిచ్చ తత్వ
నీవెమధువుగను నీవె మహాబల
నీవెగా పరమాత్మ నిత్య తత్వ
ఈ మహా మయుడుగా ఈమహాస్థిరచిత్త
ఈ మహామాయగా యీశ్వరత్వ
ఆంధ్ర పద్యము:
తే. గీ. వేద్యుడవు, వైద్యుడవు, వీరహుడవు
నీవె స్వామి, సదాయోగి, వీవె మధువు,
మాధవుడవతీంద్రియ మహా మాయ కర్త,
సర్వ శక్తి, మహోత్సాహ, శరణు నీకు.
వసారాంశం:
ఓ శ్రీమహావిష్ణూ! నీవే వైద్యుడవు, నీవే తెలుసుకోవలసిన పరమతత్త్వానివి. నీవే సర్వయోగస్వరూపుడవు, సాధుస్వభావానికి నిలయానివి. నీవే మాధవుడవు, ఇంద్రియాలకు అతీతుడవు, సమస్త శక్తులకు మూలమైన పరమాత్మవు. నీవే మధుసూదనుడవు, మహాబలశాలివి. నీవే నిత్యసత్యమైన పరమాత్మతత్త్వానివి. మహామాయా స్వరూపుడవై, స్థిరచిత్తుడవై, సమస్త జగత్తును నడిపించే ఈశ్వరుడవై ప్రకాశిస్తున్నావు.
భావం: సకల జీవులకు ఆరోగ్యాన్ని, జ్ఞానాన్ని, యోగశక్తిని ప్రసాదిస్తూ, మాయకు అతీతమైన పరమాత్మగా విశ్వాన్ని పాలించేది శ్రీమహావిష్ణువు అనే భక్తితత్త్వాన్ని మీ పద్యం తెలియజేస్తోంది.
🙏 నమో నారాయణాయ!
పద్య భావము:
వేద్యుడవు, వైద్యుడవు, సర్వావస్థల ప్రకృతి లోని జీవుల పరమార్థ జ్ఞాన యోగంలోనే ఉండేవాడు దానవులను సంహరించేవాడు; మౌనం, ధ్యానం అనే బ్రహ్మ విద్యలకు అధిపతి అయిన మాధవ. పురాతనమును తనలో చేర్చుకుని ఆ మృత ధాతువులనుంచి అమృత సంభవాలను కలిగించే వాడు, మధుడు. సృష్టిలోని లౌకిక వస్తువులన్నీ ఇంద్రియాలకు లోబడి ఉంటాయి. కానీ పరమాత్మ (భగవంతుడు) ఇంద్రియాల పరిధికి, వాటి ద్వారా కలిగే సుఖదుఃఖాలకు అందడు. అందుకే భగవద్గీత పురుషోత్తమ ప్రాప్తి యోగంలో భగవంతుడిని 'అతీంద్రియుడు'. అని అన్నారు. మహామాయః = అలౌకిక మాయతో ఎవరినైననూ మోహింపజేసే గొప్ప మాయ (శక్తి) – అదే విష్ణుమాయ. 'మహోత్సాహుడు' అనే పదాన్ని కార్యశూరుడైన నాయకుడిని లేదా ఎల్లప్పుడూ ఉత్సాహంతో అపజయాన్ని ఒప్పుకోకుండా ముందడుగు వేసే వ్యక్తిని వర్ణించడానికి ఉపయోగిస్తారు. మహాబలః = సమస్త విశ్వాన్ని ధరించ గల అపరిమితమైన శక్తి కలవాడు- (Omnipotent). అలాంటి నీకు శరణు, మహాత్మా! -- -- సామాల రాజశేఖరు.
సుప్రభాతం--
శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రావళి: -- హరిః ఓం ....
19 వ, శ్లోకము ..
మహాబుద్ధిర్మహావీర్యో మహాశక్తిర్మహాద్యుతిః ।
అనిర్దేశ్యవపుః శ్రీమానమేయాత్మా మహాద్రిధృక్ ॥ 19 ॥
ప్రతిపదార్థం
మహాబుద్ధిః = అప్రమేయమైన విజ్ఞత గలిగినవాడు; మహావీర్యః =విశిష్ట సామర్థ్యము గలిగినవాడు; మహాశక్తిః= అద్భుతమైన శక్తి గలిగినవాడు; మహాద్యుతిః = అనంతమైన తేజస్సుతో గమ్యాలకు వెలుగు చూపువాడు;
అనిర్దేశ్యవపుః (అనిర్దేశ్య+వపుః) = నిర్దేశించలేని సందర్భావతారమును దాల్చు వాడు; శ్రీమాన్: = పురుషోత్తముడు; అమేయాత్మ= అమేయమైన మనో జ్ఞానము కలవాడు; మహాద్రిధృక్ (మహా-అద్రి-ధృక్) = గోవర్ధన గిరిధారి.
ఈ శ్లోకంలోని విష్ణు నామావళి:
172) మహా బుద్ధి ;
173) మహావీర్య ;
174) మహాశక్తి ;
175) మహా ద్యుతి ;
176) మహావపువు;
177) శ్రీమాన్;
178) అమేయాత్మ;
179) మహాద్రిధృక్;
19 సీస
జపము మహాబుద్ధి జయము మహావీర్య
సమర మహాశక్తి సమయ తృప్తి
వినయమహాధ్యూటీ శ్రీమాన్ మహావపు
విధ్యా ఆమేయాత్మ విశ్వ తృప్తి
శిష్టజ్ఞానా ధిపా సీఘ్ర మహాధీర
నిష్ఠ కళాధరా నీడ తృప్తి
రక్షణ రమ్యత రాజ్యాధి నేతగా
అక్షర ఆరాధ్య ఆది తృప్తి
ఆంధ్ర పద్యము:
శిష్ట జ్ఞానాధిపా, మహా నిష్ఠ ద్రష్ట ,
అద్భుత ప్రభాస, జీవన యాప్తి దర్శి;
ప్రబల మాన్యాత్మకా, మహా పర్వత ధర,
శిష్ట రక్షకా, అవతార శ్రేష్ఠ, శరణు.
సరళ భావం:
జపంతో జ్ఞానాన్ని, జయంతో శక్తిని, వినయంతో మహిమను, విద్యతో ఆత్మజ్ఞానాన్ని పొందిన పరమాత్మ సమస్త విశ్వానికీ తృప్తినిచ్చేవాడు. సజ్జనుల జ్ఞానానికి అధిపతి, కార్యసాధనలో వేగవంతుడు, ధైర్యనిష్ఠలకు నిలయుడు. లోకాలను రక్షిస్తూ, ధర్మరాజ్యాన్ని నడిపిస్తూ, అక్షర స్వరూపుడై ఆరాధనకు అర్హుడవుతాడు.
పద్యభావము:
అప్రమేయమైన జ్ఞానం తో, విశిష్టమైన సామర్థ్యముతో, అద్భుతమైన శక్తి తో; అనంతమైన తేజస్సుతో జీవన గమ్యాలకు వెలుగులను జూపువాడు. నిర్దేశించలేని సందర్భావతారములను ధర్మ సంస్థాపనకై దాల్చు వాడే మహామాన్యుడైన ఆ పురుషోత్తముడు. అమేయమైన మనో ధైర్యముతో, శిష్ట
రక్షణకై మందరాన్ని, గోవర్ధనాది పర్వతాలను నిలుపగల మహాద్రిధృక్కుడు అయిన ఆ విష్ణుమూర్తికి నా నమస్కృతులు.
****
శుభోదయము ..
శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రావళి: -- హరిః ఓం ....
20 వ, శ్లోకము ..
మహేశ్వాసో మహీభర్తా శ్రీనివాసః సతాంగతిః ।
అనిరుద్ధః సురానందో గోవిందో గోవిదాం పతిః ॥ 20 ॥
ప్రతిపదార్థము
మహేశ్వాసః = (జగదరక్షణలో దుష్ట శిక్షణకై)మహా ధనుస్సును
(శార్జ్ణ్గ ము) కలిగిన వాడు; మహీభర్తః = భూపతి; (వరాహావతారంలో భూమిని రక్షించి ఉద్ధరించినవాడు). శ్రీనివాసః = లక్ష్మీదేవిని తన హృదయ స్థలములో ఆశ్రయ మిచ్చినవాడు. సతాంగతిః (సతాం+గతిః) = సజ్జన సాంగత్యమే సద్గతికి మూలమనే ధర్మ సూచకుడు. అనిరుద్ధః= ఎవరిచేతనూ నిరోధించ వీలు కానివాడు, అంటే తాను నిర్ణయించిన దానికి తిరుగు లేని మహా శక్తి. సురానందః (సుర +ఆనందః) =(గొప్ప+ ఆనందము నిచ్చువాడు) చిన్మయానందుడు. గోవిందః (గో + విందః )= ‘గో’ అంటే -- ఆవు; ఎద్దు; స్వర్గము; కిరణము; మేఘము; వజ్రము; చంద్రుడు; గాలి; సూర్యుడు; బాణము; దృష్టి; దిశ; తల్లి; వాణి; భూమి ఇన్ని అర్థాలున్నాయి, వీటన్నింటినీ సంతోషపెట్టువాడు. గోవిదాంపతిః (గో+విదాం +పతిః ) = విశ్వంలో బ్రహ్మజ్ఞానమును రక్షించువాడు.
ఈ శ్లోకంలోని విష్ణు నామావళి:
180) మహేశ్వాసుడు ;
181) మహీభర్త ;
182) శ్రీనివాసుడు;
183) సతాంగతుడు;
184) అనిరుద్ధుడు;
185) సురానంద;
186) గోవింద;
187) గోవిదాంపతి.
20.సీస
సకల సతాంగత సామ్య మహేశ్వాస
జగదరక్షణగను జయము తృప్తి
ఈమహీ పతిగాను యిచ్చతీర్చ ధరుడు
శ్రీనివాసుడుగాను సీఘ్రతృప్తి
అనిరుద్ధ అణుకువ ఆత్మీయ పరుడుగా
నిత్య సురానంద నియమ తృప్తి
గోవిందుడనతృప్తి గో పాలుడన తృప్తి
గోవిదాంపతి యన గొప్ప తృప్తి
ఆంధ్రపద్యము:
తే. గీ. శ్రీనివాసా, మహీపతీ, వినిగడమగు
విలు ధరించి విశ్వముఁ గాయు విశ్వనాథ;
చిన్మయ సతాంగ; అనిరుద్ధ; స్మితవికాశ;
గోవిదాం పతీ, గోవింద, కొలుపు లిడుదు.
భావము
సకల సజ్జనులకు శుభాన్ని కలిగించే మహాశక్తి ఆయనది. జగత్తును రక్షించి విజయాన్ని, తృప్తిని ప్రసాదిస్తాడు. భూమికి అధిపతిగా, భక్తుల కోరికలను తీర్చే ధరణీధరుడిగా, శ్రీనివాసుడిగా త్వరగా అనుగ్రహిస్తాడు.
అనిరుద్ధుడిగా అణుకువతో, ఆత్మీయతతో అందరికీ దగ్గరవుతాడు. నిత్యం దేవతలకు ఆనందాన్ని అందిస్తూ, నియమబద్ధమైన ధర్మమార్గాన్ని నిలబెడతాడు.
గోవిందుడిగా, గోపాలుడిగా జీవులను కాపాడుతాడు. గోవిదాంపతిగా జ్ఞానులకు, భక్తులకు ఆనందాన్ని అందిస్తూ పరిపూర్ణ తృప్తిని ప్రసాదిస్తాడు.
పద్య భావము :
జగదరక్షణలో దుష్ట శిక్షణకై శార్జ్ణ్గ మనే మహా ధనుస్సును కలిగిన వాడు;
వరాహావతారంలో భూమిని రక్షించి ఉద్ధరించిన మహీపతి; లక్ష్మీదేవిని తన హృదయ స్థలములో ఆశ్రయ మిచ్చిన శ్రీనివాసుడు; సజ్జన సాంగత్యమే సద్గతికి మూలమనే ధర్మ సూచకుడు; ఎవరిచేతనూ నిరోధించ వీలు కాని, తాను నిర్ణయించిన దానికి తిరుగు లేని మహా శక్తిగా విలసిల్లు అనిరుద్ధుడు; చిన్మయానందుడు; గోవిందుడు; జగత్తులో సత్యమైన బ్రహ్మజ్ఞాన రక్షకుడూ, అయిన నీకు కొలుపులిస్తున్నాను.
శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రావళి - 3 వ భాగం
శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రావళి: -- హరిః ఓం ....
21 వ, శ్లోకము ..
మరీచిర్దమనో హంసః సుపర్ణో భుజగోత్తమః ।
హిరణ్యనాభః సుతపాః పద్మనాభః ప్రజాపతిః ॥ 21 ॥
ప్రతి పదార్థము;
మరీచిః = తమసోమా జ్యోతిర్గమయా; తేజోవంతులలో
అత్యంత కాంతిస్వరూపుడవై, జీవన గమ్యాలను తెలుపు
ప్రభువు.
దమనః = దుష్టుల (చెడు గుణాలను) అదుపు జేసి
మంచి మార్గమున నడుపు ధర్మ దక్ష.
హంసః = హంతి గచ్ఛతీతి హంసః: ‘హన’ అనే ధాతువు
(హింసాగత్యోః) నుండి ఇది ఏర్పడింది. దీని ప్రకారం
"నిరంతరం చరిస్తూ (నడుస్తూ) ఉండేది" లేదా "ఆకాశంలో
సంచరించేది" అని అర్థం; హంతి తమ ఇతి హంసః -
"చీకటిని లేదా అజ్ఞానాన్ని పోగొట్టేది" అని అర్థం (ఈ
అర్థంలో సూర్యుడు, పరమాత్మ లేదా యోగిని ‘హంస’
అంటారు), హంతి దోషాన్ ఇతి హంసః: పాలు, నీరు
కలిసిన మిశ్రమం నుండి నీటిని వదిలి పాలను మాత్రమే
గ్రహించే గుణం దీనికి ఉన్నందున, "దోషాలను
(మలినాలను) వేరుచేసి గుణాలను మాత్రమే
స్వీకరించేది" అనే వ్యుత్పత్తి అర్థం కూడా ఉంది,
ఆధ్యాత్మిక/యోగ వ్యుత్పత్తి: యోగ శాస్త్రం ప్రకారం
మనిషి శ్వాస ప్రక్రియలో ఉచ్ఛ్వాస చేసేటప్పుడు
‘హం’ అనే శబ్దం, నిశ్వాస (గాలి వదిలేటప్పుడు)
చేసేటప్పుడు ‘స’ అనే శబ్దం వస్తాయి. ఈ రెండింటి
కలయికే ‘హంస’ (సోఽహమ్ – అంటే "ఆ పరమాత్మ
నేను") అనే జీవన సూత్రానికి ప్రతీకగా నిలుస్తుంది.
సంసార బంధాల లంపట భయాన్ని పోగొట్టేవాడు
(హంస వలె స్వచ్ఛమైన జ్ఞాన స్వరూపుడు).
అందుకే హంసను చూస్తే పరమాత్మను జూచినంత
మహాదానందం కలుగుతుంది. ఈ భూమి లోని
మహాత్ములను, పరమహంసలుగ పిలుస్తాము—
ఉదా: రామకృష్ణ పరమహంస.
సుపర్ణో = వైదిక వాజ్మయంలో 'సుపర్ణ' అనే
పదానికి ముఖ్యంగా మూడు అర్థాలు ఉన్నాయి,
గరుత్మంతుడు (గరుడుడు, - అందమైన,
బలమైన రెక్కలు కలిగి, పక్షులకు రాజు అయిన
గరుడుడిని 'సుపర్ణుడు' అని పిలుస్తారు.
వేదములు: వేద మంత్రాలను పక్షుల
రెక్కలతో పోలుస్తూ, వేద పురుషుడిని కూడా
సుపర్ణ శబ్దంతో వ్యవహరిస్తారు, జీవాత్మ /
పరమాత్మ: ఉపనిషత్తు
లలో (ముండకోపనిషత్తు వంటి వాటిలో)
"ద్వాసుపర్ణా సాయుజ సఖాయా..." అనే
ప్రసిద్ధ మంత్రం ఉంది. ఇక్కడ రెండు
అందమైన పక్షులను జీవాత్మ, పరమాత్మలకు
ప్రతీకగా వర్ణించారు.
భుజగోత్తమః= ఆదిశేషు తల్పముగా గల వాడు.
హిరణ్యనాభః = సర్వ ప్రకృతీ సంపదకు అధిపతి.
సుతపాః = పరమ నిష్ఠా గరిష్ఠుడు.
పద్మనాభః = పద్మమంటే, విశ్వస్థితికి
కారణమైన నవ నిధులను --కచ్ఛపము, కుందము,
ఖర్వము, నీలము, పద్మము, మకరము, మహా
పద్మము, ముకుందము, శంఖములు, --) వీనిని
తన గర్భము లో గలవాడు. ప్రజాపతిః= సమస్త
ప్రాణులను రక్షించి పాలించు ఆ పరమాత్మ.
ఈ శ్లోకంలోని విష్ణు నామావళి:
188) మరీచి ;
189) దమన ;
190) హంస ;
191) సుపర్ణో ;
192) భుజగోత్తమ ;
193) హిరణ్య నాభా;
194) సుతపా;
195) పద్మనాభా;
196) ప్రజాపతి ;
21.సీస పద్యం
వినయ మరీచిగా విశ్వమున దమన
హంసగుణాత్మక హాయి గొలుపు
నిత్య సువర్నో వినీలమయము గాను
భుజగోత్తమ కళలు భుక్తి గొలుపు
సుతపాప్రజాపతి సూత్రధారి గనునే
ఈహిరణ్య సునాభ యిచ్ఛ గొలుపు
ప్రకృతి సమస్థితి ప్రాభవ ధీరుడు
పరమాత్మ మూలమై పద్మ నాభ
ఆంధ్ర పద్యము:
తే. గీ. హంస గుణ సార, అరివైరి, హరి మరీచి
పద్మనాభ, హిరణ్యగర్భ సుతపాద్య
భుజగ శయన ప్రజాపతి భువన భాగ్య
ప్రాణ పరిరక్షక నిన్ను ప్రణుతి జేతు
21. సీస పద్యం — భావసారాంశం
వినయంతో విశ్వాన్ని అదుపులో ఉంచి, హంసవలె సద్గుణాలను ప్రసరింపజేస్తూ, నిత్యమైన సువర్ణ కాంతితో, నీలవర్ణ శోభతో ప్రకాశిస్తూ, భుజగోత్తముని మహిమలతో భోగభాగ్యాలను ప్రసాదిస్తూ, ప్రజాపతి సూత్రధారిగా సంకల్పాలను నెరవేర్చి, ప్రకృతిలో సమస్థితిని నిలిపే ధీరుడై, పరమాత్మ మూలస్వరూపంగా పద్మనాభుడు విరాజిల్లుతున్నాడని భావం.
పద్యపరమార్థము:
హంస గుణశీలంతో, దుష్ట దమనము జేస్తూ,
సూర్యుని వలె అజ్ఞాన తిమిరాలను పారద్రోలే
కాంతిమంతుడై, పద్మసామ్యంగా – సౌభాగ్య
నిధి – (ప్రకృతిని సమస్థితిలో నిలుప గలిగే
విశిష్ట సంస్కృతీ సంపదలను) తనయందు
కలిగిన యోగ నిష్ఠా గరిష్ఠుడు, ప్రకృతికే
అధిపతిగా, సర్వ ప్రాణి రక్షకుడు, ప్రజాపతి
యైన పరమాత్మకు మ్రొక్కెదను ---
– రాజశేఖరు సామల
శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రావళి: -- హరిః ఓం ....
22 వ, శ్లోకము ..
అమృత్యుః సర్వదృక్ సింహః సంధాతా సంధిమాన్ స్థిరః ।
అజో దుర్మర్షణః శాస్తా విశ్రుతాత్మా సురారిహా ॥ 22 ॥
ప్రతిపాదార్థం:
అమృత్యుః = శాశ్వత మైన వాడు.
సర్వదృక్: = అన్నింటికీ సాక్షి.
సింహః=సిచ్యతే (సిఞ్చతి) ఇతి సింహః లేదా సహతే ఇతి సింహః- -
తన బలంతో ఇతరులను లొంగతీసుకునేది, లేదా జగత్తు లోని
అన్ని జీవుల కంటే అపారమైన సామర్థ్యము, సహనము కలిగిన వాడు
సంధాత=కర్మఫల ప్రదాత.
సంధిమాన్= సృష్టిలో అన్ని జీవుల అనుసంధానతతో, సమప్రమాణ సమతుల్యతను నిర్వహించువాడు.
స్థిరః = సుస్థిరుడు
అజః = జన్మము లేని వాడు.
దుర్మర్షణః=వైరి గణం చేత జయించబడనివాడు.
శాస్తా=శ్రుతి, స్మృతుల ద్వారా సకల లోకాలను శాసించేవాడు
మరియు సన్మార్గాన్ని బోధించే గురువు.
విశ్రుతాత్మ= ఎల్లప్పుడూ అందరిచేత కీర్తించబడే పరమాత్మ
సురారిహా= రాక్షస సంహారి.
ఈ శ్లోకం లోని విష్ణు నామావళి:
197) అమృత్యుః
198) సర్వదృక్:
199) సింహః
200) సంధాత:
201) సంధిమాన్
202) స్థిరః
203) అజః
204) దుర్మర్షణః
205) శాస్తా:
206) విశ్రుతాత్మ:
207) సురారిహా
22. సీస పద్యం
సమ శాశ్వతామృత సర్వదృక్ సంధాత
విశ్రుతాత్మ సమ్మోహ విద్య ధాత
సంధిమాన్ సమయాన సర్వజ్ఞ ధీరత
కాలంబు సంస్తిత కళ నితాంత
స్థిర సంజాత సుస్థిర వాస శాస్తాత
ధర్మరక్షణ పరా ధరణి దాత
సింహావ తారగా స్వేచ్చ కల్పనగా
అజ ఆనందతా భాగ్య దాత
ఆంధ్ర పద్యము:
తే. గీ శాశ్వతామృత సంధాత సర్వ దృక్కు,
సింహ, విశ్రుతాత్మ స్థిర సంస్థిత నితాంత,
సంధిమాన్య, స్వయంభువు, శాస్త విధిత
రాక్షసుల జంపు హరి, నీవె రక్ష మాకు!
భావసారాంశం:
సమత్వం, శాశ్వతత్వం, సర్వజ్ఞత, ధర్మరక్షణ వంటి దివ్యగుణాలతో వెలసే పరమాత్మ, కాలానికి అతీతమైన స్థిరత్వాన్ని కలిగి ఉంటాడు. సింహావతారంతో ధర్మాన్ని రక్షించి, స్వేచ్ఛను ప్రసాదిస్తూ, భక్తులకు ఆనందభాగ్యాలను అందించే దైవస్వరూపాన్ని ఈ పద్యం కీర్తిస్తోంది.
పద్య పరమార్థము:
శాశ్వతమై, అన్నింటికీ సాక్షివై, జగత్తు లోని అన్ని జీవుల కంటే
అపారమైన సామర్థ్యము, సహనమూ కలిగిన కర్మఫల ప్రదాతవై,
సృష్టిలో సర్వ జీవుల అనుసంధానతతో, సమప్రమాణ సమ
తుల్యతను నిర్వహించువాడవై, సుస్థిరా, స్వయంభూ, అన్నిటా
విజేతవైన, ప్రసిద్ధ శ్రుతి, స్మృతుల ద్వారా సకల లోకాలను శాసించే
వాడవై, సన్మార్గాన్ని బోధించే గురువువై, ఎల్లప్పుడూ అందరికీ
ఆధారమైన పరమాత్మ, రాక్షస సంహారీ నీవే మాకు రక్ష.
--- – రాజశేఖరు సామల
శుభమస్తు..
శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రావళి: -- హరిః ఓం ....
23 వ, శ్లోకము ..
గురుర్గురుతమో ధామ సత్యః సత్యపరాక్రమః ।
నిమిషోఽనిమిషః స్రగ్వీ వాచస్పతిరుదారధీః ॥ 23 ॥
ప్రతిపదార్థం:
గురుః = సర్వ జ్ఞాన ప్రసాదకుడు;
గురుతమః = స్థిత ప్రజ్ఞతను బోధించు వాడు;
ధామ = అఖిల చరాచర జగత్తుకు ఆశ్రయమిచ్చి కాపాడు వాడు;
సత్యః = శాశ్వతుడు;
సత్యపరాక్రమః=నిత్య సర్వాంతర్యామి;
నిమిషః = (యోగాశ్రయ) నిమీష ( రెప్పలు మూసిన) సమయ సిద్ధుడు;
అనిమిషః = ( రెప్పలు మూయని) నిత్య కర్మ దీక్షకుడు;
స్రగ్వీ = "స్రక్ (పూలమాల) అస్య అస్తి ఇతి స్రగ్వీ"—వైజయంతీ (వివిధ
రకాలైన వన కుసుమాలు) మాలికా ధరుడు కనుక –విష్ణువును వనమాలి (స్రగ్వీ) అనంటారు; {ఆధ్యాతమికంగా భగవంతుడు ధరించే వైజయంతీ మాల కేవలం పూలదండ కాదు. అది ప్రకృతిలోని పంచభూతాలకు, తన్మాత్రలకు (శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు) ప్రతీక. విశ్వమంతటినీ తన మెడలో మాలగా ధరించి పాలించేవాడు కనుక ఆయన 'స్రగ్వీ' అయ్యాడు. ఆదిశంకరాచార్యుల వారు తమ భాష్యంలో దీనిని, "వైజయంత్యాఖ్యాం వనమాలాం నిత్యం వహతీతి స్రగ్వీ" అని వివరించారు.}
వాచస్పతిః = వాచః పతిః (వాచస్పతిః) - వాక్కునకు (మాటకు/విద్యకు) అధిపతి; సర్వ విద్యాధిపతి;
ఉదారధీః (ఉదార+ధీ) = సృష్టి స్థితిలో అత్యంత ఉదారమైన బుద్ధి కలవాడు.
ఈ శ్లోకం లోని విష్ణు నామావళి:
208) గురుః
209) గురుతమః
210) ధామ:
211) సత్యః
212) సత్యపరాక్రమః:
213) నిమిషః
214) అనిమిషః
215) స్రగ్వీ
216) వాచస్పతిః
217) ఉదారధీః
23 సీస పద్యం
అనిమిష వనమాలి అజముడి ఆర్ధత
వాచస్పతి ప్రగ్వి వాక్య వినుతి
నిముష ఉదారధీ నియమ గురుతముగా
సత్య పరాక్రమ సమయ వినుతి
నిత్య పరంధామ నిర్మల పరమాత్మ
విశ్వరూపుడవుగా విజ్ఞ వినుతి
జగదాదిజుడుగాను జగతి విజయుడుగా
ఈ జగత్ కళ్యాణ యిచ్ఛ వినుతి
ఆంధ్ర పద్యము:
తే. గీ. గురుడవు, గురూత్తముడవీవు, చారు ధామ;
నిఖిల సత్య పరాక్రమ, నిజ నిమేష;
అనిమిష, వనమాలీ, వాగ్మి, అజగుడీవె;
విశ్వ రూపుడ, నిన్ను నే వినుతి జేతు
23. సీస పద్యం — భావసారాంశం
ఈ పద్యంలో భగవంతుని దివ్యస్వరూపం, అపారజ్ఞానం, సత్యపరాక్రమం, విశ్వవ్యాపకత్వం, జగత్కల్యాణ సంకల్పం వర్ణించబడ్డాయి.
అనిమిషుడై, వనమాలాధారిగా, వాచస్పతిచే సైతం కొనియాడబడే వాక్ప్రతిభ కలవాడై, నియమబద్ధమైన ఉదారబుద్ధితో సత్యపరాక్రమాన్ని ప్రదర్శించేవాడై, నిత్యమైన పరంధామంగా, నిర్మల పరమాత్మగా, విశ్వరూపుడై, జగత్తుకు ఆదికారణమై, లోకవిజయుడై, సమస్త జగత్తు శ్రేయస్సును కోరే దైవంగా భగవంతుడు ఈ పద్యంలో స్తుతించబడ్డాడు.
పద్య భావం:
సర్వ జ్ఞాన ప్రసాదకుడవు; స్థిత ప్రజ్ఞతను బోధించు వాడవు; అఖిల
చరాచర జగత్తుకు ఆశ్రయమిచ్చి కాపాడు వాడవు; శాశ్వతుడవు; సర్వాంతర్యామివి; (యోగాశ్రయ) నిమీష ( రెప్పలు మూసిన) సమయ సిద్ధుడవు నీవె ; అలాగే (రెప్పలు మూయని) నిత్య కర్మ దీక్షకుడవూ నీవే;
వైజయంతీ (వివిధ రకాలైన వన కుసుమాలతో) మాలికా ధరుడు కనుక –విష్ణువును, వనమాలి (స్రగ్వీ) అనంటారు; {ఆధ్యాతమికంగా భగవంతుడు ధరించే వైజయంతీ మాల కేవలం పూలదండ కాదు. అది ప్రకృతిలోని పంచభూతాలకు, తన్మాత్రలకు (శబ్ద, స్పర్శ, దృష్టి , రస, గంధాలకూ) ప్రతీక. విశ్వమంతటినీ తన మెడలో మాలగా ధరించి పాలించేవాడు కనుక ఆయన 'స్రగ్వీ' అయ్యాడు. వాక్కునకు (మాటకు/విద్యకు) అధిపతి; సర్వ విద్యాధిపతి; సృష్టి స్థితిలో అత్యంత ఉదారమైన బుద్ధి కలవాడవూ, విశ్వరూపుడవూ అయిన నీకు నా నమస్కృతులు. –
రాజశేఖరు సామల ..
శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రావళి: -- హరిః ఓం ....
24 వ, శ్లోకము ..
అగ్రణీగ్రామణీః శ్రీమాన్ న్యాయో నేతా సమీరణః
సహస్రమూర్ధా విశ్వాత్మా సహస్రాక్షః సహస్రపాత్ ॥ 24 ॥
ప్రతిపదార్థము:
218) అగ్రణీ (అగ్రణీ) – అగ్ర (ముందు/మొదటి) + నీ (నడిపించేవాడు/ తీసుకెళ్లేవాడు)= అన్నిటికీ మూలమైన అంతరాత్మ;
219) గ్రామణీః (గ్రామణీ) – "గమ్యతే నివాసార్థిభిః ఇతి గ్రామః" = సర్వవిశ్వానికీ అధిపతి, జగన్నాథుడు;
220) శ్రీమాన్ – శ్రీ + మతుప్ (మాన్)=సర్వ సంపదను
తానే కలిగియున్న వాడు.
221) న్యాయః (న్యాయ) – సృష్టిని, ధర్మస్థాపనతో కాలానుగుణంగా నడిపించే న్యాయ స్వరూపుడు.
222) నేత – విశ్వాన్ని పాలించేవాడు, విశ్వ నాథుడు.
223) సమీరణః (సమీరణ) – ప్రాణవాయువు రూపంలో సమస్త జీవులకు ప్రాణాధారమైనవాడు.
224) సహస్రమూర్ధ – "ముహ్యతి అస్మిన్ ఇతి మూర్ధా" లేదా "మూర్ఛతి (సముచ్ఛ్రితో భవతి) ఇతి మూర్ధా".సహస్ర విధములైన విచక్షణా తలంపులతో సృష్టిని కాపాడువాడు.
225) విశ్వాత్మ – విశ్వమంతటా వ్యాపించి ఉన్న అంతర్యామి.
226) సహస్రాక్షః – "అశ్నుతే వ్యాప్నోతి ఇతి అక్షః"—సర్వాధార;
227) సహస్రపాత్ – అనేక ప్రగతి దారులందు జీవులను ‘ అసతోమా సద్గమయ’ అజ్ఞాన తిమిరం నుంచి జ్ఞాన వెలుగుల్లోకి నడిపించే మహాత్ముడు.
24 సీస
అగ్రణీ గ్రామిణీ ఆత్మ తత్త్పరతగా
నేత సమీరణ నిత్య ధాత
విశ్వాత్మ నిర్దేశ విశ్వసంభవ మౌను
అసతోమ సద్గమ ఆత్మ ధాత
నిత్య సహస్రాక్ష నియమ పరాత్పర
శ్రీమాన్ సహస్ర పాత్ శ్రీ విధాత
జగతి జీవుల రక్ష జాగృతి గానులే
సహస్ర మూర్ధత్వ శాంతి ధాత
ఆంధ్ర పద్యము:
తే. గీ. అగ్రణీ, గ్రామణీ, సృజనాగ్ర నేత,
న్యాయ ధాత, సమీరణ నియతి దూత;
వేయి శిరముల విశ్వాత్మ; విశ్వ సాక్షి;
అమిత పదసూక్త, నావినయార్ద్ర వినుతి
24.భావం:
పరమాత్మ సమస్త జీవులకు మార్గదర్శి, విశ్వానికి నాయకుడు. ఆత్మతత్త్వాన్ని గ్రహించినవారికి సత్యమార్గాన్ని చూపేవాడు. వాయువువలె సర్వత్రా వ్యాపించి, సృష్టికి మూలాధారంగా నిలుస్తాడు. అసత్యాంధకారం నుంచి సత్యజ్ఞాన వెలుగులోకి నడిపించే ఆత్మస్వరూపుడు.
సహస్రాక్షుడై సర్వాన్ని దర్శించేవాడు; పరాత్పరుడై సమస్త నియమాలకు అతీతుడుగా ఉంటాడు. శ్రీమంతుడై, సహస్రపాదుడై విశ్వమంతటా వ్యాపించి, జగత్తులోని జీవుల రక్షణకు నిరంతరం జాగరూకుడై ఉంటాడు. సహస్రశిరస్సుల విశ్వరూపంతో సమస్త లోకాలకు శాంతిని ప్రసాదిస్తాడు.
పద్యభావము:
అన్నిటికీ మూలమైన అంతరాత్మ సర్వవిశ్వానికీ అధిపతియైన జగన్నాథుడు; సర్వ జ్ఞాన సంపదను తానే కలిగియుండి, సృష్టిని, ధర్మస్థాపనతో కాలానుగుణంగా నడిపించే న్యాయ స్వరూపుడవైన
విశ్వ నాథుడవు నీవే. ప్రాణవాయువుగా సమస్త జీవులకు
ప్రాణాధారమై, సహస్ర విధములైన విచక్షణా తలంపులతో సృష్టిని కాపాడువాడవూ, విశ్వమంతటా వ్యాపించి ఉన్న అంతర్యామీ, సర్వాధారా; అనేక ప్రగతి దారులందు జీవులను ‘ అసతోమా సద్గమయ’ తీరున అజ్ఞాన తిమిరం నుంచి జ్ఞాన వెలుగుల్లోకి జగతి జీవులను నడిపించే మహాత్ముడా, నా వినయంతో కూడిన వినతి నీకు స్వామీ---
శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రావళి: -- హరిః ఓం ....
25 వ, శ్లోకము ..
ఆవర్తనో నివృత్తాత్మా సంవృతః సంప్రమర్దనః ।
అహః సంవర్తకో వహ్నిరనిలో ధరణీధరః ॥ 25 ॥
ప్రతిపదార్థము:
228) ఆవర్తనః = సృష్టి లయ వలయ విహిత కర్త
229) నివృత్తాత్మా= ప్రాపంచిక బంధాలు, రాగద్వేషాలు, మరియు ప్రకృతీ
సంక్లిష్ట విభ్రమ సంభ్రమాలక తీతంగా ఉండే నిశ్చల జ్ఞాన పరమ ప్రబల
ప్రభావం కలిగించు వాడు.
230) సంవృతః ="సంవ్రియతే స్మ ఇతి సంవృతః"
చక్కగా కప్పబడినది లేదా పూర్తిగా ఆమోదించబడినది అని అర్థం- మాయామేయ ప్రకృతీ పరమార్థ నివురు.
231) సంప్రమర్దనః = వ్యుత్పత్త్యర్థం: "సంప్రకర్షేణ మర్దనం కరోతి ఇతి సంప్రమర్దనః" (పండుటాకులను రాల్చి, చివురుటాకులను మొలిపించు సామ్యము లాగా, సర్వ ప్రకృతిని సమతుల్యత తో నిర్వహించు వాడు.
232) అహః సంవర్తకః = అహః (అహస్): అనగా 'పగలు' లేదా 'రోజు', +సంవర్తకః: 'సంవర్తకము ' పురాతన సమస్తాన్ని నశింపజేసేవాడు, అంతం చేసేవాడు లేదా తనలో లీనం చేసు కునేవాడు అని అర్థం. సూర్యుడెలా ప్రతిరోజూ ఉదయించి పగటిని కలిగించి, సాయంత్రం కాగానే ఆ పగటిని తనలో ఉపసంహరించుకుంటాడో, అలా దైవ శక్తి కూడా, కొత్త సంతతికి తావిచ్చుటకు పాత సంతతిని తనలో లీనం చేసుకునే ప్రక్రియనే, అహః సంవర్తకమని అంటారు.
233) వహ్నిః = "వహతి హవిః ఇతి వహ్నిః" (వః - ధాతువు), యజ్ఞయాగాదులలో దేవతలకు సమర్పించే హవిస్సులను మోసుకొని వెళ్ళేవాడు, ఆధ్యాతమికంగా, వృద్ధ జీవులను (ఆత్మలను) – (నవ్య సంతతికి తావు కలిగించేందుకు) తనలో విలీనం చేసుకునే వాడని అర్థం.
234) అనిలః = ‘జీవతి అనేన ఇతి అనిలః - వాయు స్వరూపుడై సమస్త ప్రాణులలో ప్రాణశక్తిగా సంచరించేవాడు. అంతా తనలోనే ఉండటం తో, అంతా తానై, తనకంటూ ఏమియు లేని వాడు అనిలుడు. ‘అనవాద్వా అనిల’ ప్రాణులు శ్వాసించి జీవించుటకు ఆధార భూతుడు అయిన పరంధాముడు, అనిలుడు.
235) ధరణీధరః = ‘ధరణీం ధరతీతి - ధరణీధరః -ధరణిని మోయునది/భరించునది. (శేష, కూర్మాది రూపాలలో ఈ భూమండలాన్నంతటినీ మోస్తూ రక్షించేవాడు).
25.సీస
దృష్టి నిశ్చల తత్వ దృతి మతి గానుయే
సృష్టి లయ వలయ శిష్ట కర్త
సంవృత్త సమయ తృప్తి సంధామ నిగమడై
ధరణీధర ఫలమై ధర్మ కర్త
సంప్రదాయసహాయ సమయసంధానుడై
అనిలాధరుడుగాను ఆత్మ కర్త
ఆవర్తన గుణము ఆశయ తత్త్వమై
పరమార్ధ ప్రభలుగా ప్రకృతి కర్త
ఆంధ్ర పద్యము:
తే. గీ. సృష్టి, లయ వలయ వహత శిష్ట కర్త,
నిశ్చల నివృత్త సంవృత నిగమ భావ,
సంప్రమర్దన, సమయ సంధాన సవిత,
వహ్ని, అనిల, ధాత్రీధర, వందనములు.
భావం:
దృష్టిని నిశ్చలంగా ఉంచి, తత్త్వజ్ఞానంతో ధైర్యం, బుద్ధి కలిగినవాడై సృష్టి స్థితి లయలకు కర్తగా, శిష్టులను రక్షించేవాడిగా పరమాత్మ నిలుస్తాడు.
కాలానుగుణమైన తృప్తిని, సమన్వయాన్ని, వేదజ్ఞానాన్ని కలిగి భూమిని ధరించి, ధర్మాన్ని ఆచరింపజేసి, ధర్మఫలాన్ని అందించేవాడవుతాడు.
సంప్రదాయాలకు సహకరిస్తూ, సమయోచితంగా కార్యాలను సమన్వయం చేస్తూ, ప్రాణవాయువుకు ఆధారంగా ఉండి, ఆత్మతత్త్వాన్ని నడిపించే కర్తగా ఉంటాడు.
ఆవర్తన స్వభావంతో, జీవుల ఆశయాలకు, తత్త్వవిచారణకు మూలమై, పరమార్థ జ్ఞానప్రభను ప్రసరింపజేస్తూ ప్రకృతికి కర్తగా విరాజిల్లుతాడు.
పద్య భావము:
సృష్టి లయలనే చక్రభ్రమణ కార్య విధాత; ప్రకృతీ సంక్లిష్ట విభ్రమ సంభ్రమాల
కతీతంగా ఉండే నిశ్చల జ్ఞాన ప్రబల ప్రభవ శక్తి; మాయామేయ ప్రకృతీ పరమార్థ నివురువు, సర్వ సృష్టిని సమతుల్యత తో నిర్వహించు సంప్రమర్దనుడు, కొత్త సంతతికి తావిచ్చుటకు పాత సంతతిని తనలో లీనం చేసుకునే, సంవర్తకుడు, వృద్ధ జీవులను (ఆత్మలను) – (నవ్య సంతతికి చోటిచ్చుటకు) తనలో విలీనం చేసుకునే వహ్ని; అంతా తానై, తనకంటూ ఏమియు లేక, జీవులు శ్వాసించి జీవించుటకు ఆధార భూతుడయిన ప్రాణ శ్వాస పరంధాముడే అనిలుడు; ధరణిని ఎల్లెడలా మోయువాడైన ఆ ధరణీ ధరునకు, వందనములు. ---
రాజశేఖరు సామల
శుభోదయం, శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రావళి: -- హరిః ఓం ....
26 వ, శ్లోకము ..
సుప్రసాదః ప్రసన్నాత్మా విశ్వధృగ్విశ్వభుగ్విభుః ।
సత్కర్తా సత్కృతః సాధుర్జహ్నుర్నారాయణో నరః ॥ 26 ॥
ప్రతిపదార్థం:
236) సుప్రసాదః= "సుష్ఠు ప్రసాదో యాచనాదృతేపి యస్య సః సుప్రసాదః", ఆశించకుండానే, తనంతట తానుగా అర్హతను బట్టి శ్రేష్ఠమైన అనుగ్రహ ప్రసాదాన్ని కురిపించు పరమాత్ముడే "సుప్రసాదుడు "
237) ప్రసన్నాత్మ=సర్వవేళలా ప్రసన్నమైన మనస్సు కలిగి, ప్రకృతీ
సుస్థితిని నిర్వహించువాడు.
238) విశ్వధృక్=ఈ జగత్తునంతా పరిశీలించువాడు.
239) విశ్వభుక్=లోక రక్షకుడు.
240) విభుః ="వివిధేన ప్రకారేణ భవతి (ప్రకాశతే) ఇతి విభుః", =అన్ని
విధములైన జ్ఞాన మార్గములను తన వెలుగులతో ప్రకాశవంతం
చేయువాడు. 241) సత్కర్త=సతాం కర్తా (మేలు సేవాడు/కార్యనిర్వాహకుడు) అంటే సృష్టి స్థితిని ఆదరించేవాడు ఆచరించేవాడు.
242) సత్కృతః=జీవుల పట్ల సదా మేలు జేయు వాడు.
243) సాధుః=సాధ్' (సాధ్ సంసిద్ధౌ)= శిష్ట రక్షణకు, ఎప్పుడూ
సిద్ధుడై యుండు వాడు.
244) జహ్నుః=అజ్ఞానాంధకారం నుంచి విజ్ఞానంవైపు నడిపించు
వాడు.
245) నారాయణః = నార - 'ప్రాణులకు సంబంధించినవారు,
(సర్వ జీవ జగత్తుకు), అయనము- నిలయము, అనగా
సమస్త జీవకోటికి ఆశ్రయుడైనవాడు, నారాయణుడు .
246) నరః=నృత్యతి కర్మసు ఇతి నరః” లేదా “నయతి ఇతి నరః”
'నృ' (నయనే) "నయతి" అంటే తన విధివిధానాలతో
లోకాన్ని సరైన మార్గంలో నడిపించేవాడు అని అర్థం.
26.సీస
సత్కర్త సమయంబు సత్కృత వివరణ
సుప్రపాదసహన శాంతి జహ్ను
నారాయణ కళలు నమ్మ శ్వామ ద్రష్ట
లోక విభుడుగాను లలిత జహ్ను
విజయ ప్రసన్నాత్మ విశ్వబుక్ విభుడుగా
సాధు సత్పురుషడై సమయ జహ్ను
సర్వ జీవజగత్తు సంతృప్తి నిలయుడై
సంక్లిష్ట విభ్రమ సంభ్ర జహ్ను
తే. గీ. సంప్రసాద, ప్రసన్నాత్మ, శ్యామ ద్రష్ట
సర్వ స్రష్ట, లోక విభుడ, సత్కృతి కర,
జహ్ను, సాధు, నారాయణా, జయ ప్రదాత
నయక నాయకా నీకు ప్రణతి ప్రశంస!
భావం26. సీస పద్యం — భావసారాంశం
సత్కార్యాలను సమయోచితంగా నిర్వహిస్తూ, సహనం, శాంతి వంటి సద్గుణాలను కలిగి ఉండాలి. నారాయణుని దివ్యకళలను విశ్వసించి, లోకాన్ని ప్రకాశింపజేసే దైవశక్తిని దర్శించాలి. విజయంతో ప్రసన్నాత్ముడై, విశ్వాన్ని పోషించే విభువుగా, సాధుసత్పురుషునిగా నిలవాలి. సమస్త జీవజగత్తుకు సంతృప్తిని అందిస్తూ, సంక్లిష్టమైన అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞానమార్గాన్ని చూపించాలి.
పద్య భావము:
ఏమీ ఆశించకుండానే, తనంతట తానుగా అర్హతను బట్టి శ్రేష్ఠమైన
అనుగ్రహ ప్రసాదాన్ని కురిపించు పరమాత్ముడే "సుప్రసాదుడు “,
సర్వవేళలా ప్రసన్నమైన మనస్సు కలిగి, ప్రకృతీ సుస్థితిని
నిర్వహించువాడు, సుప్రసన్నాత్మ. ఈ జగత్తునంతా అన్ని
మేళ్ళకూ పరిశీలించువాడే,విశ్వధృక్. సర్వ లోక రక్షకుడే, విశ్వభుక్. అన్ని విధములైన జ్ఞాన మార్గములను తన వెలుగులతో ప్రకాశవంతం చేయువాడు. సృష్టి స్థితిని ఆదరించి, ఆచరించేవాడు, జీవుల పట్ల సదా మేలు జేయు వాడు. ఆ శిష్ట రక్షణకై ఎప్పుడూ సిద్ధుడై యుండు వాడు. అజ్ఞానాంధకారం నుంచి విజ్ఞానంవైపు నడిపించు వాడు. సమస్త జీవకోటికి ఆశ్రయుడైనవాడు ఆ నారాయణుడే సర్వ విధి విధానాలతో లోకాన్ని సరైన మార్గంలో నడిపించే ‘నరుడు’.
అటువంటి నీకు నమస్కృతులు. – రాజశేఖరు సామల
****
శుభోదయం-దసరా పర్వదిన వెదుకసందర్భంగా ----
శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రావళి: -- హరిః ఓం ....
27 వ, శ్లోకము ..
అసంఖ్యేయోఽప్రమేయాత్మా విశిష్టః శిష్టకృచ్ఛుచిః ।
సిద్ధార్థః సిద్ధసంకల్పః సిద్ధిదః సిద్ధి సాధనః ॥ 27 ॥
ప్రతిపదార్థం
247) అసంఖ్యేయః= భగవంతుని రూపాలు, గుణాలు లేదా నామాలు లెక్కింపలేనన్ని కాబట్టి ఆయనను 'అసంఖ్యేయుడు'(అనంతుడు)
అని పిలుస్తారు
248) అప్రమేయాత్మ= "ప్రమాణములకు (కొలతలకు లేదా ఊహలకు) అందని స్వరూపము కలవాడు".
249) విశిష్టః = అందరికంటే సర్వోత్కృష్టుడు, శ్రేష్టుడు అయినవాడు.
250) శిష్టకృత్ = ప్రళయకాలంలో సమస్త సృష్టిని తనలో లయం చేసుకుని, తదుపరి సృష్టి కోసం బీజరూపంలో కొంత శేషముగా (మిగిలి ఉండేలా) చేయువాడు.
251) శుచిః = ఏది నిర్మలంగా (పవిత్రంగా) ఉంటుందో అది శుచి; (నిర్మలాత్ముడు)
252) సిద్ధార్థః = "సిద్ధః అర్థః యస్య సః" – సిద్ధార్థః, ప్రతి జీవికీ ఒక నిమిత్త సిద్ధిని కలిగించు వాడు.
253) సిద్ధసంకల్పః = తా తలచిన విషయాన్ని వెంటనే సిద్ధి పొందునట్లు చేయువాడే 'సిద్ధసంకల్పుడు'.
254) సిద్ధిదః = భక్తులకు వారి అర్హతలను బట్టి సాధ్యాలను ప్రసాదించువాడు.
255) సిద్ధిసాధనః = ఆ సాధన జ్ఞానమూ తానే అయినవాడు.
27.సీస
లెక్కలేని గుణాలు లెక్క నా మాలగూ
అప్రమేయాత్ముడు అక్షరకళ
శిష్ట రక్షణ గాను సిద్ధి శిక్షణగాను
నిర్మల మనసుగా నీడ తీరు
సిద్ధిసంకల్పుడై సిద్దార్ధ కళలుగా
సిద్ధిసాధన తీరు స్వేచ్ఛ పంచ
మంచి బుద్ధి మయము మానస తృప్తియై
సర్వవేళల గాంచ సమయ నాధ
ఆంధ్ర పద్యము:
తే. గీ. అప్రమేయుడనంతుడు, అమల శిష్ట,
సిద్ధుడీవ, సిద్ధార్థుడౌ సిద్ధి దాత
సిద్ధ సంకల్ప, సిద్ధి ప్రసిద్ధ సాధ్య
మంచి బుద్ధి సిద్ధించ గా మమ్ము బ్రోచు!
సరళ భావం:
దైవానికి లెక్కలేనన్ని గుణాలు ఉన్నాయి. ఆయన గుణమాల అపారమైనది. అప్రమేయమైన ఆత్మస్వరూపుడు, అక్షరజ్ఞాన కళలకు మూలాధారుడు. సజ్జనులను రక్షిస్తూ, అవసరమైన శిక్షణ ద్వారా ధర్మమార్గాన్ని చూపిస్తాడు. నిర్మలమైన మనస్సుకు నీడవలె తోడుగా నిలుస్తాడు.
సంకల్పసిద్ధి కలిగిన దైవం సిద్ధార్థ కళల ద్వారా సాధనామార్గాన్ని తెలియజేస్తాడు. స్వేచ్ఛను ప్రసాదిస్తూ, మంచి బుద్ధిని పెంపొందించి, మానసిక తృప్తిని కలిగిస్తాడు. సమయానికి అధిపతియైన ఆ దైవాన్ని సర్వకాలాల్లో స్మరించాలి.
పద్య భావము:
ఆ విష్ణుమూర్తి రూపాలు, గుణాలు లేదా నామాలు లెక్కింపలేనన్ని కాబట్టి ఆయన 'అసంఖ్యేయుడు'(అనంతుడు). ఆయన ఏ ప్రమాణములకు అందే
రూపం కానీ గుణం కానీ లేని అప్రమేయాత్మ. అందరికంటే విశిష్ట మైనవాడు. ప్రళయకాలంలో సమస్త సృష్టిని తనలో లయం చేసుకుని, తదుపరి సృష్టి కోసం బీజరూపంలో కొంత శేషమును సంభావించు, శిష్టకృత్యుడు. నిర్మలాత్ముడైన శుచి ఆయన. ప్రతి జీవికీ ఒక నిమిత్త సిద్ధిని కలిగించు, సిద్ధార్థుడు, తా తలచిన విషయాన్ని వెంటనే సిద్ధి పొందునట్లు జేయు 'సిద్ధసంకల్పుడు', జీవులకు వారి అర్హతలను బట్టి సాధ్యాలను ప్రసాదించు, సిద్ధి ధాత, మరియు, ఆ సాధన జ్ఞానమూ తానే అయిన, సిద్ధి సాధనా ఆయనే. అటువంటి మహాత్మా, మాకు మంచి బుద్ధినిచ్చి, మమ్ము గావు మయ్యా! -- రాజశేఖరు సామల.
సుప్రభాతము ..
శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రావళి: -- హరిః ఓం ....
28 వ, శ్లోకము ..
వృషాహీ వృషభో విష్ణుర్వృషపర్వా వృషోదరః ।
వర్ధనో వర్ధమానశ్చ వివిక్తః శ్రుతిసాగరః ॥ 28 ॥
ప్రతిపదార్థము :
256) వృషాహీ (వృష + అహ + ఇన్)= వృషః అంటే 'ధర్మము'
అని అర్థం. అహ =ప్రకాశించు; ఇన్ =అది, వాడు; (ధర్మాత్మ)
257) వృషభః = వృషః అంటే 'ధర్మము', భః = ప్రకాశింపజేయు; (ధర్మ సంస్థాపకుడు);
258) విష్ణుః = జగత్తు అంతటా, ప్రతి పదార్థాలలోనూ నిండి ఉన్నవాడు.
259) వృషపర్వ= వృష=ధర్మము, పర్వ=సంభవింప జేయువాడు, (ధర్మ
ప్రభువు)
260) వృషోదరః =ధర్మాన్ని తన ఉదరమునందు కలిగినవాడు.
(ధర్మ రక్షకుడు)
261) వర్ధనః =సర్వ ప్రకృతిని సంస్థితి పరచువాడు, (స్థితి కర్త)
262) వర్ధమానః = "వర్థతే ఇతి వర్ధమానః" - సృష్టిని నిరంతరం వృద్ధి చేయువాడు, (వర్ధ మానుడు)
263) వివిక్తః = వి + విచ్ + క్త = వివిక్తః, "వివిచ్యతే స్మ ఇతి వివిక్తః" లేదా "విశిష్టతయా విక్తం (పృథక్కృతం) ఇతి వివిక్తః" దోషాల నుండి వేరు చేయడం;(ముక్తి దాత)
264) శ్రుతిసాగరః =శ్రుతి (వేదజ్ఞానము), సాగరము=అపారమైన నిధి, (సర్వ వేదజ్ఞాననిధి)
28.సీస
ధర్మ సంస్థాపకా ధర్మమూర్తిగసర్వ
ధర్మ ప్రభువుగాను ధర్మ ధరుడు
ధర్మ రక్షక విద్య ధర్మ శిక్షణవిద్య
ధర్మ పోషక విద్య ధరణి విద్య
సర్వప్రకృతిగాను సర్వ సంస్థితిగాను
సర్వ స్థితిగ కర్త సర్వ విద్య
వర్ధమాన చరిత వాక్యసంపదగాను
సర్వ వేదజ్ఞాన సాక్షి గాను
ఆంధ్ర పద్యము:
తే. గీ. ధర్మ సంస్థాపకుడు, సర్వ ధర్మమూర్తి;
ధర్మ ప్రభువు, విష్ణువు, ధర్మ ధర, వివిక్త
ధర్మ రక్షక, సృష్టి స్థిత కర, ప్రగతి
కర్త, శృతి సాగరా, నీకు కీర్తనములు
### 28\. సీస పద్యం – గారి పద్య భావం
సమాజంలో ధర్మాన్ని స్థాపించే పరమాత్మ ధర్మమూర్తిగా దర్శించబడుతున్నాడు. సత్యం, న్యాయం, నీతి వంటి ధర్మసూత్రాలకు ఆయన ప్రతిరూపం.
ధర్మానికి ప్రభువుగా, ధర్మాన్ని ధరించి నిలబెట్టేవాడిగా పరమాత్మను వర్ణిస్తున్నారు. ధర్మమార్గంలో జీవించే వారికి ఆదర్శంగా నిలుస్తాడు.
ధర్మాన్ని రక్షించే జ్ఞానం, ధర్మాన్ని ఆచరించే శిక్షణ జీవులకు అవసరం. ధర్మబద్ధమైన జీవనానికి కావలసిన విద్యను అందించే దైవస్వరూపం.
ధర్మాన్ని పోషించే విద్య, భూమిపై జీవనాన్ని సక్రమంగా నడిపించే జ్ఞానం పరమాత్మ ప్రసాదంగా భావించబడుతున్నాయి. ధరణిపై జీవుల అభివృద్ధికి ధర్మం, విద్య రెండూ ఆధారాలు.
సమస్త ప్రకృతిలోనూ, ప్రకృతి యొక్క అన్ని స్థితులలోనూ పరమాత్మ వ్యాపించి ఉన్నాడు. సృష్టిలోని ప్రతి మార్పు, ప్రతి స్థితి దైవశక్తితో అనుసంధానమై ఉంటుంది.
జగత్తులోని సమస్త స్థితులకు కారణభూతుడైన పరమాత్మ సర్వవిద్యలకు మూలస్వరూపుడు. జీవనానికి అవసరమైన జ్ఞానాన్ని ప్రసాదించే శక్తి ఆయనది.
ప్రస్తుత కాలంలో కొనసాగుతున్న జీవనచరిత్ర, అభివృద్ధి, వాక్కు యొక్క సంపదలో పరమాత్మ ప్రభావం కనిపిస్తుంది. మనిషి అనుభవం, ఆలోచన, మాటల ద్వారా జ్ఞానాన్ని వ్యక్తపరుస్తాడు.
సమస్త వేదజ్ఞానానికి సాక్షిగా పరమాత్మ నిలుస్తాడు. వేదాలలోని ధర్మతత్త్వం, ఆధ్యాత్మిక జ్ఞానం, సత్యస్వరూపం ఆయనలో ప్రతిబింబిస్తాయి.
పద్య భావము:
ధర్మాత్మకుడు(వృషాహీ), ధర్మ సంస్థాపకుడు(వృషభుడు), అంతర్యామి (విష్ణు), వృషపర్వ (ధర్మ ప్రభువు), వృషోదరా (ధర్మ రక్షకుడు), వర్ధన (స్థితి కర్త), సృష్టి ప్రగతీ పరిణామమున వృద్ధి చేయు వాడు(వర్ధ మానుడు); చెడునుండి విముక్తి పరచి మంచివేపు నడిపించువాడా, “మృత్యోర్ మా అమృతంగమయ, (ముక్తిప్రదాత ); సర్వవేదజ్ఞాననిధియైన (శ్రుతిసాగరా), నీకు మా కీర్తనములివిగో. –
సుప్రభాతము ..
శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రావళి: -- హరిః ఓం ....
29 వ, శ్లోకము ..
సుభుజో దుర్ధరో వాగ్మీ మహేంద్రో వసుదో వసుః ।
నైకరూపో బృహద్రూపః శిపివిష్టః ప్రకాశనః ॥ 29 ॥
ప్రతిపదార్థము:
265)సుభుజః= ప్రకృతిని ప్రశాసించుటకు బల భుజ శాఖలున్న విశ్వ శక్తి
265) దుర్ధరః = అజేయుడు;
266) వాగ్మీ=అజ్ఞాన మును పారద్రోలి, మంచి మార్గమున సృష్టిని మరలించ గల సత్య వదావదుడు
267) మహేంద్రః = మహాంశ్చాసౌ ఇంద్రశ్చ" – ఇంద్రుని కూడా
నియంత్రించగల వాడు.
268) వసుదః =వసు-సంపద, ధర= కలిగినవాడు; -మాధవుడు.
269) వసుః=సంపదంతా తానే అయినవాడు; - శ్రీనివాసుడు.
270) నైకరూపః (న + ఏక + రూపః)= ఒకే దైవశక్తి, ‘అనేక’ రూప
సందర్భోచిత అవతారాలతో, ధర్మ సంస్థాపన చేయువాడు.
271) బృహద్రూపః(బృహత్+రూపః) = బ్రహ్మాండమంతటా వ్యాపించిన (బాహ్య నేత్రాల కందని) అత్యంత గొప్ప రూపమున్న శక్తి స్వరూపుడు
272) శిపివిష్టః (శిపి + విష్టః)='శిపి' – ప్రకాశము, విష్టః -వ్యాప్నోతి ఇతి విష్టః"- దూరి వ్యాపించు; - సర్వాంతర్యామియైన మహా శక్తి.
273) ప్రకాశనః = తన వెలుగులను సూర్యాంశ ద్వారా సర్వ జగత్తునూ
ప్రాణ మరియూ జ్ఞాన జ్యోతులను వెలిగించువాడు.
29. సీస
బలభుజ విశ్వాస భాగ్య శక్తి పరుడు
అజ్ఞాన తరిమేటి ఆత్మ పరుడు
సకల నియంత్రణ సమర వీరకళలు
పుడమి సంపదకళ పూజ్యుడతడు
వరమహేంద్రగుణముగా వాగ్మివి సిపి విష్ట
సకల జగత్తున సమ సూర్యడతడు
సందర్బ ధర్మంబు సంస్తాప నార్ధాయ
బ్రహ్మాండ మందున భద్ర రూప
ఆంధ్ర పద్యము:
తే. గీ. సుభుజుడవు, దుర్ధరుడవు, వసుధవు నీవె;
వసుడవీవె వాగ్మివి నీవ, వర మహేంద్ర,
నైక రూప, బృహద్రూప, సకల రూప,
కిరణ శిష్టుడా, శిపివిష్ట శరణు నీకు.
# 29\. సీస పద్యం – భావ విశ్లేషణ
బలమైన భుజశక్తి, విశ్వాసం, భాగ్యాన్ని ప్రసాదించే శక్తి కలిగిన పరమాత్మ. సమస్త జీవులకు ధైర్యాన్ని, విశ్వాసాన్ని కలిగించే దైవశక్తి.
అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానజ్యోతిని వెలిగించేవాడు. ఆత్మస్వరూపాన్ని తెలుసుకునే మార్గాన్ని చూపిస్తూ జీవులలో జ్ఞానాన్ని ప్రసాదించేవాడు.
సమస్త జగత్తును నియంత్రించే శక్తి కలిగినవాడు. ధర్మరక్షణ కోసం అవసరమైన వీరత్వం, సమరశక్తి, కార్యసామర్థ్యాన్ని కలిగిన పరమాత్మ.
భూమిపై ఉన్న ప్రకృతి సంపదలు, జీవన సౌభాగ్యాలు దైవశక్తి ప్రసాదాలుగా భావించబడుతున్నాయి. అందువల్ల సమస్త సంపదలకు మూలమైన పరమాత్మ పూజ్యుడు.
సూర్యుడు అందరికీ సమానంగా వెలుగునిచ్చినట్లుగా, పరమాత్మ సమస్త జగత్తుపై సమదృష్టిని కలిగి ఉంటాడు. భేదభావం లేకుండా జీవులందరికీ తన దైవకాంతిని ప్రసాదిస్తాడు.
కాలానుగుణంగా ధర్మాన్ని స్థాపించడం, అధర్మాన్ని తొలగించడం పరమాత్మ యొక్క ప్రధాన కర్తవ్యంగా భావించబడుతోంది. లోకంలో న్యాయం, సత్యం, ధర్మం నిలబడటానికి దైవశక్తి సహకరిస్తుంది.
సమస్త బ్రహ్మాండంలో శుభాన్ని, రక్షణను ప్రసాదించే భద్రస్వరూపుడు పరమాత్మ. సృష్టి స్థితికి ఆధారంగా ఉండి, సమస్త జీవులకు క్షేమాన్ని కలిగించే దైవస్వరూపం.
పద్య భావము:
ప్రకృతిని శాసించుటకు బలమైన శాఖలు కలిగిన విశ్వశక్తి యా సుభుజుడు, అతడజేయుడు; అజ్ఞాన మును పారద్రోలి, మంచి మార్గమున సృష్టిని మరలించ గల సత్య వదావదుడు, వాగ్మి. ఇంద్రుని కూడా నియంత్రించగల మహేంద్రుడాయన. వసుధరుడా మాధవుడు. సంపదంతా తానే అయినవాడా శ్రీనివాసుడు. ఒకే దైవశక్తియైన ఆ పరమాత్ముడు, ‘అనేక’ రూపములను సందర్భోచితావతారాలతో, ధర్మ సంస్థాపన చేయువాడా నైక రూపుడు; బ్రహ్మాండమంతటా వ్యాపించిన (బాహ్య నేత్రాల కందని) అత్యంత గొప్ప రూపమున్న శక్తి స్వరూపుడా బృహద్రూపుడు, సర్వాంతర్యామియైన మహా శక్తియైన వాడా విపిశిష్ట. తన వెలుగులను సూర్యాంశ ద్వారా సర్వ జగత్తును ప్రాణ మరియూ జ్ఞాన జ్యోతులతో వెలిగించువాడైన ప్రకాశనా, నీకు శరణు.
–
సుప్రభాతము ..
శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రావళి: -- హరిః ఓం ....
30 వ, శ్లోకము ..
ఓజస్తేజోద్యుతిధరః ప్రకాశాత్మా ప్రతాపనః ।
ఋద్ధః స్పష్టాక్షరో మంత్రశ్చంద్రాంశుర్భాస్కరద్యుతిః ॥ 30 ॥
ప్రతిపదార్థం :
274) ఓజస్తేజోద్యుతిధరః (ఓజః-తేజః-ద్యుతి-ధరః) = ఓజస్సు- జీవశక్తి, తేజస్సు – ఆత్మజ్ఞానప్రకాశం, ద్యుతి- కాంతి, ధర – (వీటిని) కలవాడు.
275) ప్రకాశాత్మా= కాంతి స్వరూపుడు.
276) ప్రతాపనః = "ప్రకర్షేణ తాపయతీతి ప్రతాపనః" – విశిష్టమైన రీతిలో సమస్త విశ్వాన్ని విజ్ఞాన వికాశంతో ప్రచోదితుడు, సమవర్తి.
277) ఋద్ధః = "ఋధ్యతే స్మ ఇతి ఋద్ధః" జగత్తంతటికీ మూలమైన – జ్ఞానాత్మ, ధర్మాత్మ, ధనాత్మ మొదలైన సమస్త కల్యాణ గుణస్వరూపుడై సదా పరిపూర్ణుడై యుండు పరమాత్ముడు.
278) స్పష్టాక్షరః = సూటిగా, స్పష్టంగా, ధర్మ పరంగా ఏ విధమైన అస్పష్టత లేకుండా సృష్టిని అక్షర తుల్యంగా నడిపే వాడు - 'స్పష్టాక్షరుడు' .
279) మంత్రః = మననాత్ త్రాయతే ఇతి మంత్రః – దేన్నయితే మననం చేసిన వారిని పరిరక్షణ చేస్తుందో -అది మంత్రము. అలాంటి మంత్ర సమానమైన వాడు.
280) చంద్రాంశుః {చంద్ర+అంశు} = "ఛందతి ఆహ్లాదయతి ఇతి చంద్రః" – (అంశు = కిరణములు) హితవైన కిరణాలతో ఆనందాన్నిచ్చు వాడు.
281) భాస్కరద్యుతిః (భాస్కర్-సూర్యుడు, + ద్యుతి – కాంతి) = సూర్యుని వలె దేదీప్యమానమైన, అపారమైన కాంతితో విరాజిల్లువాడు.
30. సీస
ఆత్మజ్ఞానముతీరు అక్షర సత్యము
కాంతి స్వరూపుడై కాలమందు
సమవర్తి నిత్యము సమయానుకూలుడు
జ్ఞానాత్మ పరిపూర్ణ జ్ఞప్తి నందు
స్పష్టంగ ధర్మమై పరమాత్మ జగతిగా
పరిరక్షణామది ప్రకృతి నందు
హితమైన కిరణాల హిమబిందురూపాన
సూత్రధారి కళలు సూర్యునివలె
తే. గీ. జీవ తేజ ప్రకాశాత్మ, శ్రీవరాఖ్య,
ఋద్ధ పూర్ణ, స్పష్టాక్షర ఋజు వదాన్య,
ధ్యాన సంధాన పరిరక్ష చంద్ర సహిత
భాస్కరద్యుతి పావన ప్రణుతి నీకు.
30.భావం
ఆత్మజ్ఞానమే జీవన పరిపూర్ణతకు మార్గమని, అక్షర సత్యం ఎప్పటికీ నిలిచే జ్ఞాన స్వరూపమని కవి భావిస్తున్నారు. ఆత్మ అనేది కాంతి స్వరూపంగా కాలంలో నిరంతరం వెలుగుతూ, సమయానుకూలంగా ధర్మాన్ని ఆచరించే సమవర్తి స్వభావాన్ని కలిగి ఉంటుంది.
జ్ఞానాత్మ పరిపూర్ణతను పొందినప్పుడు మనిషికి స్పష్టమైన జ్ఞాపకశక్తి, ధర్మబద్ధమైన ఆలోచన, పరమాత్మ తత్వంపై అవగాహన కలుగుతాయి. జగత్తును పరమాత్మ స్వరూపంగా దర్శించడం ద్వారా ప్రకృతిని పరిరక్షించాలనే బాధ్యత కూడా ఏర్పడుతుంది.
ప్రకృతిలోని హితకరమైన కిరణాలు హిమబిందువులపై ప్రసరించినట్లుగా, జ్ఞానపు కాంతి జీవుల హృదయాలలో శాంతిని, సత్యాన్ని, సద్భావనను ప్రసరింపజేస్తుంది. ఈ సమస్త ప్రకృతి వ్యవస్థకు సూత్రధారిగా పరమాత్మ నిలుస్తూ, సూర్యునివలె తన కాంతితో జగత్తును
నడిపిస్తున్నాడనే భావo
జీవశక్తి తేజస్సుతో, ఆత్మజ్ఞాన కాంతితో ప్రకాశించు, ఓజస్తేజో ద్యుతిధరుడు.
కాంతి స్వరూపుడు. విశిష్టమైన రీతిలో సమస్త విశ్వాన్ని విజ్ఞాన వికాశంతో ప్రచోదిత ప్రతాపుడు. జగత్తంతటికీ మూలమైన – జ్ఞానాత్మ, ధర్మాత్మ, ధనాత్మ మొదలైన సమస్త కల్యాణ గుణస్వరూపుడై సదా పరిపూర్ణుడైన పరమాత్ముయే, ఋద్ధుడు. సూటిగా, స్పష్టంగా, ధర్మ పరంగా ఏ విధమైన అస్పష్టత లేకుండా సృష్టిని అక్షర తుల్యంగా నడిపే - 'స్పష్టాక్షరుడు' . మననాత్ త్రాయతే ఇతి మంత్రః – దేన్నయితే మననం చేస్తారో వారిని పరిరక్షణ చేసేదే మంత్రము. అలాంటి మంత్ర సమానమైన వాడు. హితవైన కిరణాలతో ఆనందాన్నిచ్చు చంద్రాంశుడు. సూర్యుని వలె దేదీప్యమానమైన కాంతితో విరాజిల్లు ఓ, భాస్కరద్యుతీ, నీకు నమస్కారము.
సుప్రభాతం .. ..
శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రావళి: -- హరిః ఓం ....31 వ, శ్లోకము ..
అమృతాంశూద్భవో భానుః శశబిందుః సురేశ్వరః ।
ఔషధం జగతః సేతుః సత్యధర్మపరాక్రమః ॥ 31 ॥
ప్రతిపదార్థము:
284) అమృతాంశూద్భవః (అమృతాంశు-ఉద్భవః) = జీవాధార
మైన అమృత కిరాణాలను సంభావించు వాడు (విశ్వకర్ముడు)
285) భానుః = భాసతే ఇతి భానుః – కాంతి రూపుడైన అంబరీషుడు)
286) శశబిందుః= చంద్రుని కిరణాల వలె ఆహ్లాదాన్ని ఇచ్చే అమృత
బిందువులతో సృష్టిని తన చల్లని కరుణతో పోషించేవాడు.
287) సురేశ్వరః (సుర+ఈశ్వరః)=దేవతలకే ప్రభువు(దేవదేవుడు).
288) ఔషధం= "ఓషధిభ్యో జాతమ్ ఔషధమ్"- సర్వ దుష్టములను
నివారించి-మనసుకు శాంతి నిచ్చే వాడు. (విశ్వస్థితి కరుడు)
289) జగతః సేతుః= జగత్తుకు, సేతుః -సితినోత్యనేన ఇతి సేతుః,
290) సత్యధర్మపరాక్రమః=పరమార్థ ధర్మ సామర్థ్యమాయనే.
ఆంధ్ర పద్యము:
31.సీస
అమృత కిరణములు అక్షర సత్యము
కళలు తీర్చ విధిగా కాంతి రూప
చంద్రుని కిరణాల చల్లదనాలుగా
శృతి లయబిందువై సృష్టి రూప
సర్వ దుష్టములను సమయ నివారణ
దేవదేవుడిగాను దీక్ష రూప
పరమార్ధ ధర్మము పరంజ్యోతి గనునే
జాగృతిగానౌను జగతి రూప
తే. గీ. అమృత కిరణాల వేధాత్మ, అంబరీష,
అమల వరదాతు, శశబిందు, అపర మిత్ర,
ఔషధ గుణలీలసురేశ, అచల బంధు;
సత్యధర్మ పరాక్రమా శరణ మయ్య !
### 31\. సీస పద్యము
పద్య భావము
అమృత కిరణాలు జీవులకు ఆనందాన్ని, ఆహ్లాదాన్ని అందించే దివ్య కాంతికి ప్రతీకలు. అక్షర సత్యం అనేది ఎప్పటికీ మారని పరమాత్మ తత్త్వం. ఆ సత్యమే అమృత కిరణాల వలె జీవనానికి వెలుగునిస్తుంది.
చంద్రుని కళలు క్రమంగా వృద్ధి చెందుతూ పూర్ణత్వాన్ని పొందుతాయి. అదేవిధంగా జీవిలోని జ్ఞానం, ఆలోచన, అనుభవం కూడా క్రమశిక్షణతో వికసించాలి. కాంతి రూపం అనేది అజ్ఞానాన్ని తొలగించే జ్ఞానానికి ప్రతీక.
చంద్రకిరణాలు ప్రకృతికి చల్లదనాన్ని అందిస్తాయి. మనిషి హృదయంలో కూడా ప్రేమ, కరుణ, శాంతి అనే చల్లదనం ఉండాలి. జ్ఞానం ఉన్నంత మాత్రాన సరిపోదు; ఆ జ్ఞానం ఇతరులకు సాంత్వన కలిగించాలి.
శృతి, లయలు సంగీతానికి ప్రాణం. సృష్టిలో కూడా ఒక క్రమం, ఒక నియమం, ఒక సమన్వయం ఉంటాయి. ఆ సమన్వయానికి మూలమైన పరమాత్మ తత్త్వాన్ని శృతి లయబిందువుగా కవి భావించారు.
దుష్టత్వం, అధర్మం, అన్యాయం పెరిగినప్పుడు వాటిని నివారించడానికి ధర్మం అవసరం. సమయానుకూలంగా జరిగే ధర్మరక్షణ సమాజానికి శాంతిని అందిస్తుంది.
పరమాత్మ ధర్మరక్షణకు ప్రతీక. దీక్ష అనేది సంకల్పం, నియమం, ఆచరణకు సంబంధించినది. దైవత్వాన్ని పొందాలంటే ధర్మబద్ధమైన జీవనం, నిష్కామ సేవ, ఆత్మనిగ్రహం అవసరం.
పరమార్థ ధర్మం అనేది జీవితం యొక్క అంతిమ సత్యాన్ని తెలుసుకోవడం. పరంజ్యోతి అంటే సమస్త జ్ఞానానికి మూలమైన దివ్య కాంతి. ఆ ధర్మాన్ని తెలుసుకున్నప్పుడు జీవితం సత్యమార్గంలో నడుస్తుంది.
జాగృతి అంటే చైతన్యం, వివేకం, సత్యాన్ని గుర్తించే స్థితి. వ్యక్తిలో జాగృతి కలిగితే కుటుంబంలో, సమాజంలో, ప్రపంచంలో మంచి మార్పులు ఏర్పడతాయి.
పద్యపరమార్థము:
జీవాధార మైన అమృత కిరాణాలను సంభావించు
వాడు, కాంతి రూపుడైన అంబరీషుడు, శశబిందుడు,
సురేశ్వరుడు, ఔషధగుణలీలుడు, జగత్బంధు, సత్యధర్మ
స్థితిని నిలుపుటలో అత్యంత పరాక్రమమును చూపు
వాడవైన నీకు శరణము తండ్రీ.
.సుప్రభాతం .. ..
శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రావళి: -- హరిః ఓం ....32 వ, శ్లోకము ..
భూతభవ్యభవన్నాథః పవనః పావనోఽనలః ।
కామహా కామకృత్కాంతః కామః కామప్రదః ప్రభుః ॥ 32 ॥
ప్రతిపదార్థము (పదాల అర్థాలు)
291) భూతభవ్యభవన్నాథః = భూత (గడిచిన), భవ్య (రాబోయే), భవత్
(ప్రస్తుతం జరుగుతున్న) కాలపతి (త్రికాల విధి విధాత).
292) పవనః= సర్వ జీవులకూ ప్రాణాధారమైన సదాగతి.
293) పావనః = పునాతి ఇతి పావనః-(ఎవరైతే ధర్మమును బోధించి
జీవులను పవిత్రం చేస్తాడో ఆయన పావనుడు).
294) అనలః = అగ్నిగుణ శీలుడై, జీవుల దుష్ట గుణాలను దహించి
మంచిని నిలుపువాడు.
295) కామహా= జీవుల లోని స్వార్థ పరమైన అత్యాశలను నాశనము జేసి
పర జీవులను బ్రతికించు కరుణా గుణమును నెరపు వాడు.
296) కామకృత్= కామం కరోతీతి కామకృత్ – అర్హమైన కోర్కెలను నెరవేర్చువాడు"
297) కాంతః = ‘కామ్యతే ఇతి కాంతా’ సుందర రూప లావణ్యాల కమనీయతలను
తన చుట్టూ పరిసరాలలో నిలిపి , బ్రతుకు మీద ప్రేమను పెంచే వాడు.
298) కామః= "కమ్యతే ఇతి కామః" కోరబడునది ఏదో అది కామము (కోరిక), అలా
జీవనాద్భుతముల రుచులమోహంతో ప్రాణ సంతతీ సంభావాలను పెంచు వాడు.
299) కామప్రదః = కామాన్ ప్రదదాతి ఇతి కామప్రదః, ప్రకృతీ సృజనాత్మకతకు,
ధర్మబద్ధమైన కోరికలను - 'ప్రద' – అనుగ్రహించేవాడు.
300) ప్రభుః = "ప్రభవతి ఇతి ప్రభుః" - అసాధారణమైన శక్తి సామర్థ్యాలతో సర్వమును
శాసించగలిగినవాడు -
ఆంధ్ర పద్యము:
32. సీస
గడచిన కాలము గడవ బోవు నిజము
కాలపతి గమన కళలు రీతి
జీవ ప్రాణ గతిగా దీక్ష పావణుడుగా
అగ్ని నీరు గుణమై ఆంక్ష రీతి
స్వార్ధ యత్యాశలు సాను భావ ఫలమై
నాశన గుణముగా నమ్మ రీతి
కామ మోహము పెంచ మోహినీ రూపుడు
శక్తి సామర్ధ్యత సరయు రీతి
### 32\. సీస పద్యమ
### పద్య భావము
గడిచిన కాలం తిరిగి రాదు. రాబోయే కాలం కూడా గడిచిపోతుంది. కాలం నిరంతరం ముందుకు సాగడం ప్రకృతి ధర్మం. మనిషి కాలాన్ని గుర్తించి జీవించాలి. గతాన్ని అనుభవంగా తీసుకొని, వర్తమానాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
కాలానికి అధిపతి అయిన పరమాత్మ సృష్టి గమనాన్ని నియమబద్ధంగా నడిపిస్తాడు. పగలు, రాత్రి, ఋతువులు, జీవన మార్పులు అన్నీ కాలగమనంలో భాగాలు. కాలం యొక్క ఈ క్రమాన్ని తెలుసుకోవడం జీవన వివేకానికి మార్గం.
జీవప్రాణం అనేది జీవనానికి ఆధారం. ప్రాణశక్తి ఉన్నంతకాలం జీవి తన కర్తవ్యాన్ని నిర్వహించగలడు. దీక్షతో, నియమంతో, పవిత్రమైన సంకల్పంతో జీవించడం ద్వారా జీవితం సార్థకమవుతుంది.
అగ్ని, నీరు ప్రకృతిలో విభిన్న గుణాలను కలిగి ఉంటాయి. అగ్ని వేడిని అందిస్తుంది; నీరు చల్లదనాన్ని, జీవనాధారాన్ని అందిస్తుంది.
ఈ రెండు గుణాలు కూడా పరిమితులు దాటితే హానికరంగా మారవచ్చు. ప్రకృతి గుణాలను అర్థం చేసుకొని, వాటి నియమాలకు అనుగుణంగా జీవించడం అవసరం.
స్వార్థం, అత్యాశ మనిషిలో పెరిగినప్పుడు జీవన సమతుల్యత దెబ్బతింటుంది. అయితే సానుభూతి, సహకారం, మంచి భావనలతో జీవిస్తే మనిషి తన ఆలోచనలను సరిదిద్దుకోగలడు.
స్వార్థాన్ని తగ్గించుకొని, ఇతరుల శ్రేయస్సును కూడా గుర్తించడం మానవత్వానికి మార్గం.
అత్యాశ, స్వార్థం, నియంత్రణలేని కోరికలు చివరకు నాశనానికి దారితీస్తాయని కవి హెచ్చరిస్తున్నారు.
మనిషి తన కోరికలను విచక్షణతో నియంత్రించాలి. తాత్కాలికమైన ఆకర్షణలను శాశ్వతమైన ఆనందంగా భావించకూడదు.
కామము, మోహము మనిషి మనస్సును ఆకర్షించే శక్తులు. మోహం పెరిగినప్పుడు వివేకం తగ్గుతుంది.
మోహినీ రూపం ద్వారా ఆకర్షణ యొక్క ప్రభావాన్ని కవి సూచిస్తున్నారు. ఆకర్షణకు లోనై నిర్ణయాలు తీసుకోకుండా, సత్యాసత్యాలను పరిశీలించి ప్రవర్తించాలి
శక్తి, సామర్థ్యాలు జీవన పురోగతికి అవసరం. వాటిని ధర్మబద్ధంగా ఉపయోగించినప్పుడు వ్యక్తికి, సమాజానికి మేలు కలుగుతుంది.
శక్తి ఉన్నంత మాత్రాన సరిపోదు; దానికి వివేకం, నియమం, మంచి సంకల్పం తోడవాలి. అప్పుడు శక్తి సార్థకమవుతుంది.
తే. గీ. భూత భవ్య, వర్తన కాల నేత నిశితి,
పవన, పావన, భుజిదీప్త, నీవ నిజము
కామహా, కామకృత్కాంత, కామ, కామ్య
విహిత, ప్రభు హిత, నీకు నా వినుత మతులు.
పద్యపరమార్థము:
త్రికాల ధర్మ విధి విధాతవు, సర్వ జీవులకూ ప్రాణాధారమైన శ్వాస
సమీర సత్త్వము, జీవాత్మలకు ధర్మమును బోధించి పవిత్ర పరచు,
పావనుడు, అగ్నిగుణ శీలుడై, జీవుల దుష్ట గుణాలను దహించి
మంచిని నిలుపువాడ వీవె. జీవుల లోని స్వార్థ పరమైన అత్యాశలను
నాశనము జేసి పర జీవులను బ్రతికించు కరుణా గుణమును నెరపు
వాడు, అర్హమైన కోర్కెలను నెరవేర్చువాడు, సుందర రూప లావణ్యాల
కమనీయతలను తన చుట్టూ పరిసరాలలో నిలిపి, ప్రాణికి బ్రతుకు మీద
ప్రేమను పెంచు ఆకర్షక శక్తి; జీవనాద్భుతముల రుచులమోహంతో ప్రాణ
సంతతీ సంభావాలను పెంచు వాడు; ప్రకృతీ సృజనాత్మకతకు, ధర్మ
బద్ధమైన కోరికలను తీర్చువాడవు, అసాధారణమైన శక్తి సామర్థ్య ప్రభల
కలిగినట్టి నీకు నా నమస్కారములు. –
శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రావళి: -- హరిః ఓం ....33 వ, శ్లోకము ..
యుగాది కృద్యుగావర్తో నైకమాయో మహాశనః ।
అదృశ్యో వ్యక్తరూపశ్చ సహస్రజిదనంతజిత్ ॥ 33 ॥
ప్రతిపదార్థము:
301) యుగాది కృత్ = యుగములను – సమయ సంధాన కర్త.
302) యుగావర్తః = కాలచక్ర గమన నియత.
303) నైకమాయః = అనేక భ్రమల సందోహాలతో జీవులను సంభ్రమ
సమ్మోహితం జేసి విశ్వాన్ని సతత సజీవ సంపత్తిగా నిలుపువాడు.
304) మహాశనః= మహత్ అశనం అస్య ఇతి మహాశనః – అశన మనగా
ఆహారము – వ్యాపితము, ఈ సమస్త సృష్టిని తనలో లీనం చేసు
కునేవాడనీ – లేదా సర్వ వ్యాపితుడని విష్ణుమూర్తికి పేరు.
305) అదృశ్యః = చర్మచక్షువులకు (సాధారణ కంటికి) కనిపించనివాడు.
306) వ్యక్తరూపః = తనను నమ్మిన వారి కొరకు కొన్ని సందర్భాలలో,
భవ్యావతారాలతో ధర్మ రక్షణకై వ్యక్తమయ్యేవాడు.
307) సహస్రజిత్= అనేక దుష్టములను నాశనము జేయుటలో సదా
జయించు వాడు.
308) అనంతజిత్= ఓటమే తెలియక – ఎప్పుడూ జయము పొందు వాడు
34.సీస
పరమేష్టి పరమాత్మ సమయాoతర్యామిగా
బేధభావంబుయు భీతి లేని
జీవసమ్మోహతా లీలా పరం ధామ
ఆనంద ప్రాభవ ఆశ్ర నిలయ
ధర్మస్వ రూపుడే ధరణి లీల మయుడు
క్రోధ హరాహరి పూజ్య మవ్వ
విశ్వ బాహు వినయ విజ్ఞా మహీధరా
జనపాల జాగృతి జన్మ రక్ష
ఆంధ్ర పద్యము:
తే. గీ. యుగ కృతార్థ, యుగావర్త యుక్త నియత,
వివిధ వ్యక్త రూప మహాశన విధి విధత,
విక్రమాదృశ్య సమయానువిత్తి రూప
సతత విజితాత్మ నీకు నా వందనములు
34వ సీస పద్యం — సరళ భావం
పరమాత్మ సమస్త జీవులలో అంతర్యామిగా ఉంటూ, భేదభావం, భయం లేని స్థితిని ప్రసాదిస్తాడు. జీవుల మనసులను ఆకర్షించే లీలలకు పరంధామమే నిలయం. ఆనందానికి మూలమైన దైవం అందరికీ ఆశ్రయమిస్తాడు. ధర్మస్వరూపుడై భూమిపై లీలలు సాగిస్తాడు. క్రోధాన్ని హరించే హరిగా పూజలందుకుంటాడు. విశ్వమంతటా వ్యాపించిన బాహువులు కలిగి, వినయం, విజ్ఞానం, స్థిరత్వంతో భూమిని ధరించేవాడై, ప్రజలను పాలిస్తూ, వారి జీవితాలను రక్షిస్తాడు.
పద్య భావము:
యుగముల సమయ సంధాన కర్త. అందులోని కాలచక్ర గమన
నియత. అనేక భ్రమల సందోహాలతో జీవులను సంభ్రమ
సమ్మోహితం జేసి విశ్వాన్ని సతత సజీవ సంపత్తిగా నిలుపువాడు.
మహాశనుడాయన. చర్మచక్షువులకు కనిపించని యదృశ్యు డాయనే.
తనను నమ్మిన వారి కొరకు కొన్ని సందర్భాలలో, భవ్యావతారాలతో
ధర్మ రక్షణకై అవతరించే వ్యక్త రూపుడూ ఆయనే, అనేక దుష్టములను
నాశనము జేయుటలో సదా జయించు వాడు. ఆ జయాన్ని
సతతమూ పొందు వాడవైన నీకు నా వందనములు.
– రాజశేఖరు సామల
శుభోదయము.. .. ..
శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రావళి: -- హరిః ఓం ....35 వ, శ్లోకము ..
అచ్యుతః ప్రథితః ప్రాణః ప్రాణదో వాసవానుజః ।
అపాంనిధిరధిష్ఠానమప్రమత్తః ప్రతిష్ఠితః ॥ 35 ॥
ప్రతిపదార్థము:
291) అచ్యుతః = అ – లేని, చ్యుత-విడుపు, -- విశ్వ సృజనాత్మ
కతలో ఎప్పుడూ పట్టు వీడని వాడు.
292) ప్రథితః = ప్రతిథుడు – ప్రసిద్ధుడు—సృష్టి స్థితి, లయ, పునర్జన్మ
కారణకర్తగా ప్రసిద్ధుడైన పరమాత్ముడు.
293) ప్రాణః =ప్రాణుడు-జీవాత్మ ఐన ‘విష్ణువు’. (హిరణ్యగర్భుని
రూపంలో సకల జీవులను బ్రతికించువాడు).
294) ప్రాణదః= ప్రాణదుడు – జీవాత్మ లోని పరమాత్మ – జీవులను
పోషించి బ్రతికించువాడు.
295) వాసవానుజః=వాసవుడు-ఇంద్రుడు -సోదరుడైన విష్ణుమూర్తి.
296) అపాన్నిధిః = అపాం – జలము, నిధి- సంపద; -సముద్రుడు.
జలము జీవుల ప్రాణాధారము. ఆ జలనిధి రూపమున నున్న
సర్వ జీవులకూ ప్రాణ ప్రదుడు.
297) అధిష్ఠానమ్= అన్నిటికీ మూలమైనది, లేదా అన్నిటికీ ఆధారమైన
పరంధాముడు.
298) అప్రమత్తః = సృష్టి పాలనలో అత్యంత జాగరూకుడై యుండువాడు.
299) ప్రతిష్ఠితః = ‘"బాగా స్థాపించబడినది"- ఎల్లప్పుడూ తన యునికిని
సుస్థిరముగా కలవాడు.
35 సీస
సుజనాత్మ కతలోన శృతిలయలతొ పట్టు
ప్రతిథుడు ప్రకటిత ప్రాణ ధరుడు
జీవాత్మ పరమాత్మ జీవ పరంధామ
వాస వానుజ పర వాక్య ధీర
సంపద జలనిధి సమర సముద్రుడు
మూలం బు చక్రధారి ముఖ్య వీర
సృష్టి పాలనగాను నృత్య తత్త్వముగాను
సుస్థిర యునికిగా సుమ దళుడగు
ఆంధ్ర పద్యము:
తే . గీ. అచ్యుత ప్రతీతి, పరమ మహాత్మ, వాస
వానుజుడవు, జీవుడవు జీవాత్మ వీవు
అప్రమత్త, అపాన్నిధి, అప్రతిహత
స్థిత, అధిష్ఠానమా! నీకు వందనములు.
35వ సీస పద్యం — సరళ భావం
సజ్జన స్వభావం కలిగి, శ్రుతి లయలలో పట్టు సాధించి, తన ప్రాణశక్తితో ప్రసిద్ధి చెందినవాడు. జీవాత్మకు, పరమాత్మకు, జీవులకు, పరంధామానికి సంబంధించిన తత్త్వాన్ని తెలిపేవాడు. వాక్కులో ధైర్యం కలిగి, సంపదలో సముద్రం వంటి విశాలతతో, సమరంలో సముద్రుని వంటి పరాక్రమం కలవాడు. చక్రధారిగా మూలశక్తిని కలిగి, సృష్టి, పాలన, నృత్యతత్త్వాలకు ఆధారంగా నిలిచి, సుస్థిరమైన ఉనికితో విరాజిల్లేవాడు.
పద్య భావము:
విశ్వ సృజనాత్మకతలో ఎప్పుడూ పట్టు వీడని వాడు. సృష్టి స్థితి, లయ, పునర్జన్మ
కారణకర్తగా ప్రసిద్ధుడైన పరమాత్ముడు. జీవాత్మ ఐన ‘విష్ణువు’. జీవాత్మ లోని
పరమాత్మగా, జీవులను పోషించి బ్రతికించువాడు. ఇంద్రుని -సోదరుడైన శ్రీహరి.
జలనిధి రూపమున నున్న సర్వ జీవులకూ ప్రాణ ప్రదుడు. అన్నిటికీ ఆధారమైన
పరంధాముడు. సృష్టి పాలనలో అత్యంత జాగరూకుడై యుండువాడు. ఎల్లప్పుడూ
తన యూనికిని సుస్థిరముగా గల యో జగన్నాథా నీకు వందనములు .
--- రాజశేఖరు సామల
శుభోదయము.. .. ..
శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రావళి: -- హరిః ఓం ....36 వ, శ్లోకము ..
స్కందః స్కందధరో ధుర్యో వరదో వాయువాహనః ।
వాసుదేవో బృహద్భానురాదిదేవః పురందరః ॥ 36 ॥
ప్రతిపదార్థం :
328) స్కందః = స్కందుడు - శివుని తేజస్సు (రేతస్సు) అగ్ని
గర్భము నుండి జారి, గంగానది ద్వారా శరవణ భవము
(దర్భల పొద) లో పడి శరవణ భవుడు గా (కుమారస్వామి గా)
అవతరించిన వాడు కార్తీకేయుడు. దుష్ట సంహారంలో వైరిమీదకు
లంఘించి (స్కందించి - దూకి), వారి బలాన్నినశింపజేసేవాడు
- స్కందుడు.
329) స్కందధరః = స్కందుని- ధరించు – నడుపు -- దైవ సేనాధి
పతియైన స్కందుని తన దుష్ట శిక్షణకై సర్వదా నడిపించు వాడు.
330) ధుర్యః = ధుర్యుడు-మోయువాడు – సృష్టిని మోయువాడు.
331) వరదః = వర – వరములను, ద=ఇచ్చువాడు—అర్హతకు తగిన
వరములను ప్రసాదించువాడు-వరదుడు.
332) వాయువాహనః =వాయువు లాగా అన్ని జీవులయందు చొచ్చి వారి
ప్రాణములు నిలుపు వాడు.
333) వాసుదేవః = సర్వ ప్రపంచమునకు నివాసమైనవాడు.
334) బృహద్భానుః = బృహత్-అమితమైన, భానుః-కాంతిని ప్రసరించు వాడు.
335) ఆదిదేవః = సర్వమునకు మూలమైన వాడు.
336) పురందరః =పురమ్ – పురములను, దర – చీల్చువాడు. స్థూలంగా,
తారకాసురుడి కుమారులు (త్రిపురాసురులు) నిర్మించిన,
ఎవరికీ సాధ్యంకాని మూడు దుష్ట దుర్భేద్య పురములను దహించేందుకు
మహావిష్ణువే అంతర్యామిగా రుద్రునిలోకి ప్రవేశించి, ఆ పురములను
దహించేట్లు (దారణం) చేశాడు కాబట్టి విష్ణువును ‘పురందరుడు' అంటారు.
ఆధ్యాత్మికంగా – జీవులను ఆవరించి ఉండే మూడు ఆవరణలు(పురులు)-
అహంకారం, మమకారం, మరియు అజ్ఞానం- వీటిని, ముక్కలు(దారణం)
చేయు వాడు – మహావిష్ణువు.
36. సీస
స్కoద శిక్షణగాను స్కoదధరుడు గాను
ధుర్య దరందరా సూత్ర ధారి
వరద రాయుడు వాడు వాయువాహన ధారి
వాసుదేవుడుగాను వాక్య ధారి
ఆదిదేవాపరా ఆశ్రిత హృదయేస
నిత్య బృహద్భావ నియమ ధారి
హరి పురందర గాను హరిహరా గుణపరా
ప్రణుతిలివేగుణ పాత్ర ధారి
ఆంధ్ర పద్యము:
తే . గీ. స్కందు డీవ, వరదుడవు, స్కంద ధరుడా,
వాయువాహనా, ధుర్యుడ, వాసుదేవ,
ఆదిదేవ, బృహత్భాను, విదిత వేద్య,
హరి, పురందరా నీకు సౌహార్ద ప్రణుతి
సరళ భావం
స్కందుని శక్తిని, శిక్షణా సామర్థ్యాన్ని ధరించిన దైవ స్వరూపమై, బాధ్యతలను మోసేవాడు, జగన్నియమాల సూత్రధారి
వరాలిచ్చే ప్రభువు, వాయువాహన శక్తిని ధరించినవాడు
వాసుదేవునిగా, వాక్కుకు లేదా వాక్యసత్యానికి ఆధారమైనవాడిగా కీర్తిస్తున్నారు.
ఆదిదేవుడై, ఆశ్రయించిన భక్తుల హృదయాల్లో నిలిచే పరమాత్మ గా,నిత్యమైన విశాల భావాన్ని, సృష్టి నియమాలను ధరించినవాడు.
హరి, పురందరుడు వంటి దైవ స్వరూపాలలోనూ, హరిహర తత్త్వంలోనూ గుణమహిమను దర్శిస్తున్నారు.
స్తుతులకు పాత్రుడై, దైవగుణాలను ధరించినవానికి నమస్కారములు
పద్య భావము:
దుష్ట సంహారంలో వైరిమీదకు స్కందించి – (దూకి), వారిని
నశింపజేసే – స్కందుడవు. దైవ సేనాధి పతియైన ఆ
స్కందుని అంశ నీవుగా, దుష్ట శిక్షణకై ఉపయుక్తమైన వాడవు.
సర్వ సృష్టిని భరించు వాడు. అర్హతకు తగిన వరములను ప్రసాదించు
-వరదుడవు. వాయువై అన్ని జీవులయందు చొచ్చి వారి ప్రాణములు
నిలుపు ప్రాణ దాతవు. సర్వ ప్రపంచమునకు ఆవాసమైనవాడవు.
మహా కాంతి ప్రదాతవు. సర్వమునకు మూలమైన వాడవు. అజ్ఞాన,
మమకారాహంకారములనే మూడు రాక్షస గుణాలను(త్రిపురములను)
అణచి జీవులను మంచి మార్గాన నడిపే, పురందరుడా, నీకు
హృదయ పూర్వక నమస్సులు.--- రాజశేఖరు సామల
శుభోదయము.. .. ..
శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రావళి: -- హరిః ఓం ....37 వ, శ్లోకము ..
అశోకస్తారణస్తారః శూరః శౌరిర్జనేశ్వరః ।
అనుకూలః శతావర్తః పద్మీ పద్మనిభేక్షణః ॥ 37 ॥
ప్రతిపదార్థం:
337) అశోకః = అ-న, శోకః – దుఃఖమును, -- దుఃఖములను పోగొట్టు
వాడు.
338) తారణః ="తారయతి ఇతి తారణః" – జీవులను అజ్ఞాన విముక్తి
జేసి విజ్ఞానం గరిపి – తరింప జేయువాడు.
339) తారః = 'తృ' (ప్లవనతరణయోః) – తరింపజేయుట అని అర్థం—
సంసార నౌకకు దిక్సూచియై జీవులను తరుణ మార్గం వైపు
నడిపించు వాడు.
340) శూరః = అత్యంత శౌర్యం కలవాడు.
341) శౌరిః = ‘శూరస్య అపత్యం పుమాన్’, శౌరిః – శూరుని మనుమడు.
342) జనేశ్వరః = జన-జీవులకు, ఈశ్వరః -ప్రభువు—జీవేశ్వరుడు.
343) అనుకూలః = సృష్టి స్థితికి ఎల్లప్పుడూ అనుగ్రహాన్ని చూపేవాడు.
344) శతావర్తః = సృష్టి ధర్మ రక్షణకై వందలాది అవతారాలనెత్తిన వాడు.
345) పద్మీ= విష్ణువు చేతుల్లోని నాలుగు విధాల సాధనాలూ, చతుర్విధ
ఉపాయాలకూ సూచికలు. సామ – శంఖం, దాన-పద్మం, భేద –
గద, దండం – చక్రం; అలా పద్మమును ఒక చేతిలో గల వాడు.
346) పద్మనిభేక్షణః =పద్మ-పద్మముల, నిభ=సమానమైన, ఈక్షణ-
కన్నులు కలవాడు.—సర్వ జీవ వత్సలాత్ముడైన కమలాక్షుడు.
37. సీస
దుఃఖ విముక్తిగా దూరంధరుని గాను
జీవ విజ్ఞాన తరింప జేయు
సూర జనేశ్వర సూత్రధారుడుగాను
సౌర్య పారక్రమ సూర్యు డేను
అనుకూల ఆత్మీయ ఆకర్ష ఆకాంక్ష
నియమ శతావర్త నిశ్చ యమగు
ధర్మరక్షణకర్త ధరణి లో ధీరుడు
పద్మనిభేక్షణ పద్మనాభ
ఆంధ్ర పద్యము:
తే . గీ. జీవ శోక విముక్తుడ వీవ శౌరి,
తార, తారణానుగల శతావతార
ధర, జనేశ్వర పద్మీ యుదార, పద్మ
సదృశ లోచనా, నీకు మా సన్నుతములు.
1. దుఃఖ విముక్తిగా దూరంధరుని గాను
జీవుల దుఃఖాలను తొలగించి, భారాన్ని భరించే మహాశక్తిగా, సమస్త జీవులకు విముక్తి మార్గం చూపేవాడిగా భగవంతుడు నిలుస్తాడు.
2. జీవ విజ్ఞాన తరింప జేయు
జీవులకు ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించి, అజ్ఞాన సాగరాన్ని దాటి తరించేలా చేసేవాడు.
3. సూర జనేశ్వర సూత్రధారుడుగాను
దేవతలకు అధిపతిగా, సృష్టి నాటకానికి సూత్రధారిగా సమస్త వ్యవస్థను నడిపించేవాడు.
4. సౌర్య పారక్రమ సూర్యు డేను
శౌర్యం, పరాక్రమం కలిగిన సూర్యుని వలె తేజస్సుతో ప్రకాశించేవాడు.
5. అనుకూల ఆత్మీయ ఆకర్ష ఆకాంక్ష
భక్తులకు అనుకూలంగా, ఆత్మీయతతో ఆకర్షించే దైవత్వం; భగవంతుని చేరాలనే ఆకాంక్షను కలిగించే స్వరూపం.
6. నియమ శతావర్త నిశ్చ యమగు
నియమబద్ధమైన విశ్వచక్రాన్ని నడిపిస్తూ, అనేక ఆవర్తనాలలోనూ నిశ్చలమైన నియమాన్ని నిలిపేవాడు.
7. ధర్మరక్షణకర్త ధరణి లో ధీరుడు
భూమిపై ధర్మాన్ని రక్షిస్తూ, అధర్మాన్ని ఎదుర్కొనే ధీరుడు.
8. పద్మనిభేక్షణ పద్మనాభ
పద్మదళాల వంటి నేత్రాలు కలిగినవాడు, నాభిలో పద్మాన్ని ధరించిన పద్మనాభుడు.
పద్య భావము:
జీవుల దుఃఖములను పోగొట్టు, అశోకుడు, జీవుల అజ్ఞాన
విముక్తి జేసి విజ్ఞానం తో తరింప జేయువాడు. సంసార
నౌకకు దిక్సూచియై జీవులను మంచి మార్గం వైపు
నడిపించు వాడు. అత్యంత శౌర్యం కలవాడు. శూరుని
సంతతీ ప్రభువైన, శౌరి. జీవేశ్వరుడు. సృష్టి స్థితికెల్లప్పుడూ
అనుగ్రహము జూపు వాడు. సృష్టి ధర్మ రక్షణకై వందలాది
అవతారాలనెత్తిన వాడు. కమలాకరుడు. సర్వ జీవ
వత్సలాత్ముడైన పద్మాక్షుడైన నీకు మా నమస్కారములు.
--- రాజశేఖరు సామల.
శుభోదయము.. .. ..
శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రావళి: -- హరిః ఓం ....39 వ, శ్లోకము ..
అతులః శరభో భీమః సమయజ్ఞో హవిర్హరిః ।
సర్వలక్షణలక్షణ్యో లక్ష్మీవాన్ సమితింజయః ॥ 39 ॥
ప్రతిపదార్థం:
354) అతులః = అసమానమైన తేజోమయుడు.
355) శరభః = శరభుడు అనేదొక ఎనిమిది పాదాలు కలిగిన ఒక పక్షి
మరియు మృగము కలిసిన రూప విశేషం. అది, హిరణ్యకశిపుడిని
సంహరించిన తర్వాత నరసింహస్వామి ఉగ్రరూపాన్ని శాంతింప
జేయడానికి శివుడు ధరించిన అవతారమే శరభేశ్వరుడు.
356) భీమః = భయంకరుడైనవాడు (దుష్టులకు భయాన్ని కలిగించేవాడు).
357) సమయజ్ఞః = సమయాన్ని తెలిసినవాడు (సృష్టి, స్థితి, లయలను
మరియు భక్తులను అనుగ్రహించే సరైన సమయాన్ని ఎరిగినవాడు).
358) హవిర్హరిః = యజ్ఞ భాగాలను స్వీకరించి, వారి అజ్ఞానాన్ని హరించు
వాడు.
359) సర్వలక్షణలక్షణ్యః = సమస్త శుభ లక్షణాలకు నిలయమైనవాడు.
360) లక్ష్మీవాన్ = లక్ష్మీదేవి ఎల్లప్పుడూ వక్షఃస్థలంలో కలవాడు- లక్ష్మీ
నివాసుడు.
361) సమితింజయః = సమితిం – యుద్ధంలో జయాన్ని సాధించేవాడు.
39.సీస
అతుల శరభుడుగా ఆశ్రిత సమయజ్ఞ
లక్షణ లక్షిణ్య లక్ష్మి నాధ
భీమ పరాక్రమ భీకర ధారిగా
సమితింజయ సహాయ సమయ ధీర
బాహ్యంతర సమాన బంధవిముక్తిగా
భవ్య తాభవముగా భాగ్య వీర
ధర్మార్ధ సఖ్యత ధరణిలో సమరంబు
విశ్వ విశ్వాసము విద్య వీర
ఆంధ్ర పద్యము:
తే . గీ. అతుల తేజోమయ సమర్థ స్తుతుడ వీవ,
శరభుడవు, భీమ, సమయజ్ఞ, సమితి విజయ;
సర్వ లక్షణ లక్షణ్య సగుణ ధరుడు;
శ్రీ నిలయ, హవిర్హరి,నీకు ప్రణిధి ప్రతతి
39.భావం:
అతులమైన శౌర్యంతో శరభుని వంటి పరాక్రమశాలి, ఆశ్రయించినవారి అవసరాలను సమయానుసారం గ్రహించి ఆదుకునే సమయజ్ఞుడు, సకల లక్షణాలు మరియు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగినవాడు. భీముని వంటి పరాక్రమంతో శత్రువులకు భీకరమైన ధారగా నిలిచి, యుద్ధాలలో విజయాన్ని సాధిస్తూ, సహాయకులకు అండగా నిలిచే సమయధీరుడు.
బాహ్యంగా, అంతరంగంలో సమానత్వాన్ని పాటిస్తూ బంధాల నుండి విముక్తి పొందినవాడు. భవ్యమైన శుభత్వాన్ని, భాగ్యవీరత్వాన్ని కలిగినవాడు. ధర్మార్థ సాధనలో సఖ్యతను పాటిస్తూ, ధరణిపై సమరంలోనూ ధర్మాన్ని నిలబెట్టేవాడు. విశ్వవ్యాప్తమైన విశ్వాసాన్ని, విద్యా వీరత్వాన్ని కలిగిన మహనీయుడు.
పద్య భావము:
అసమానమైన తేజోమయుడు; శరభేశ్వరుడు; దుష్టులకు
భయంకరుడు; సృష్టి, స్థితి, లయలను, సమయ న్యాయంగా
సమస్థితిగా సృష్టిని తీర్చువాడు; ప్రాణుల జీవ విధుల
పరిణామాలను సమ్మతించి, వారి అజ్ఞానాన్ని హరించు
హవిర్హరి; సమస్త చైతన్య లక్షణాలతో వర్ధిల్లు వాడు; సమస్త శుభ
లక్షణాలకు నిలయమైనవాడు; లక్ష్మీనివాసుడు; సర్వ పోరాటాల్లో
తానే తప్పక జయాన్ని సాధించేవాడు-అంటే, అన్నివివాదాల్లో
తన నిర్ణయమే అంతిమం-దానికి తిరుగనేదే ఉండదు – అటువంటి నీకు
విరివైన ప్రణామాలు. – రాజశేఖరు సామల.
శుభోదయము.. .. ..
శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రావళి: -- హరిః ఓం ....40 వ, శ్లోకము ..
విక్షరో రోహితో మార్గో హేతుర్దామోదరః సహః ।
మహీధరో మహాభాగో వేగవానమితాశనః ॥ 40 ॥
ప్రతిపదార్థం (నామముల అర్థాలు):
362) విక్షరః (విక్షరాయ ప్రభావం): నాశనము లేదా తరుగుదల
లేనివాడు, అక్షరుడు లాగే, విక్షరుడు.
363) రోహితః = సంస్కృత ధాతువు 'రుహ్' (रुह्) నుండి ఉద్భవించింది.
'రుహ్' అంటే 'పెరగడం', 'ఆరోహణ చేయడం' లేదా 'ఉద్భవించడం' –
ఉదయించే సమయంలో ఎరుపు రంగులో ప్రకాశిస్తూ పైకి ఆరోహణ
చేస్తాడు కాబట్టి సూర్యునికా పేరు - ఆ సూర్యభగవానుడాయనే.
364) మార్గః = ముక్తిజ్ఞానానికి మార్గమైనవాడు.
365) హేతుః = సృష్టి స్థితి లయములకు హేతువైనవాడు.
366) దామోదరః (దామ-బంధనము, ఉదరము=గర్భము) = ఉదరము
నందు సమస్త భువనాలూ ఆకర్షక బంధనంతో కలిసి కట్టుగా కలిగిన వాడు.
367) సహః =అన్నిటినీ సహించు నేర్పు గలవాడు – అందుకే మనం
ఆయన్ని పొగిడినా, తిట్టినా, ఏ స్పందనా చూపని వాడు.
368) మహీధరః (మహీధరాయ): భూదేవిని (ధరణిని) – ఈ సృష్టిని
సర్వకాల సర్వావస్థలయందూ ధరించి, భరించు వాడు.
369) మహాభాగః = మహా భాగుడు, మహాభాగ్యవంతుడు–
మహాలక్ష్మికి పతి.
370) వేగవాన్ = (వేగవాన్' అనే పదాన్ని విడదీస్తే: వేగ + వతు
(మతుప్ ప్రత్యయం) - రూపాంతరం చెంది అది వేగ + వాన్ గా
మారుతుంది) – కాలగమన వేగముతో సృష్టి, స్థితి, లయములను,
నిర్దేశించు పరంధాముడు.
371) అమితాశనః = అమితం ఆశనం యస్య సః అమితాశనః –
అమితమైన జఠరాగ్ని గలవాడు – పురాతనాన్ని భుజించి, నవజీవన
సంభవాలను విశ్వానికందించు అంతర్యామి.
40. సీస
విక్షరాయ భవము విశ్వ గమ్యపు హరి
ఉద్భవించనియము ఉజ్వలంబు
సృష్టి స్థితి లయలు తృప్తి పరచ హేతు
వినయ దామోదరా విద్య తీరు
హితమై మహీధర గీత భవము గాను
కళల మహాభాగ కామ్య పరము
అమితాశన గమన ఆశ్చర్య వేగవాన్
వాన్మహా విద్యగా వాక్య మయము
ఆంధ్ర పద్యము:
తే . గీ. విక్షరుడు, రోహితుడవీవ మోక్ష మార్గ
సూత్ర ధారి, నిమిత్త దామోదరుడ, సోమ గర్భ,
సహ, మహీధర, అమితాశన హరి, వేగ
వాన్మహా భాగ, నీకు మా వందనములు.
స40రళ భావం:
విశ్వమంతటికీ గమ్యమై, సమస్త భవాలకు ఆధారమైన హరి ఉద్భవించిన దైవనియమం ఉజ్వలమైనది. సృష్టి, స్థితి, లయలు సమతుల్యంగా సాగేందుకు ఆయనే కారణభూతుడు. వినయంతో కూడిన దామోదరుని విద్యావైభవం విశిష్టమైనది.
భూమిని ధరించే మహీధరుని గీతభావం హితాన్ని చేకూర్చేది. కళలలో మహాభాగ్యాన్ని, పరమార్థాన్ని ప్రసాదించే శక్తి దైవస్వరూపంలో నిండి ఉంది. అపారమైన శక్తితో, ఆశ్చర్యకరమైన వేగంతో సాగుతూ, వాక్కు మరియు మహావిద్యకు మూలమైన దైవజ్ఞానం విశ్వవ్యాప్తంగా ప్రకాశిస్తుంది.
పద్య భావము:
జీవన్ముక్తిజ్ఞానానికి మార్గమైనవాడు; సృష్టి స్థితి లయములకు హేతు
వైనవాడు; ఉదరము నందు సమస్త భువనాలనూ ఆకర్షక బంధనంతో
కలిసి కట్టుగా కలిగిన వాడు; అన్నిటినీ సహించు నేర్పు గలవాడు; ఈ
సృష్టిని సర్వకాల సర్వావస్థలయందూ ధరించి, భరించు మహీధరుడు;
మహా భాగుడైన మహాలక్ష్మికి పతి; కాలగమన వేగముతో సృష్టి, స్థితి,
లయములను నిర్దేశించు పరంధాముడు; పురాతనాన్ని భుజించి,
నవజీవన సంభవాలను విశ్వానికందించు, అమితాశనుడైన నీకు మా
వందనములు -- రాజశేఖరు సామల