విష్ణు సహస్త్ర నామమ్ కధలు
హరిః ಓమ్
12) శ్లోకము
వసుర్వసుమనాః సత్యః సమాత్మాసమ్మిత స్సమః!
ఈ శ్లోకమునందు పది హరినామములు వెలయుౘున్నవి.
104)(1) వసుః ఓం వసవేనమః
(1) సమస్త భూతములును తనయందే వసింౘుౘున్నవి. గాన శ్రీహరి "వసు" అని స్తవనీయుడగు ౘున్నాడు.
(2) "వసూనాంపావకశ్చాస్మి" అని గీతావాణి (10_23) "అష్టవసువులలో నేను పావకుడను" అని భగవద్వాక్యము.
(3) వాయువంతటనూ వ్యాపించి యున్నట్లు నేను అన్ని భూతములయందును వ్యాపించి యున్నాను (గీత 9_6). పై విషయ మును అనుభవపూర్వకముగా గ్రహంచినచో మానవులందరునూ
105).(2) వసుమనాః ఓం వసుమనసేనమః
శ్రేష్ఠమయిన మనస్సుగలవాడని భావము. రాగద్వేష రహితమును, మాలిన్య శూన్యమును, మాయా రహితమును నగు మనస్సే శ్రేష్ఠమగు మనస్సు. ఇట్టి మనస్సు గలవారలే భగవత్స్వ
106)(3) సత్యః ఓం సత్యాయనమః
"సత్యమ్ జ్ఞానమనంతంబ్రహ్మ" అను తైత్తరీయోపనిషద్ వాక్యానుసారముగ పరమాత్మ సత్యమును జ్ఞానమును అనంతము నునై యున్నందున "సత్యః అని గానము చేయబడెను.
సత్యమనగా మూడు కాలములందును నుండునది. నాశనరహితమైనది. మార్పులేనిది అదియే "పరబ్రహ్మము". ఈనామమునకు మరిరెండు భావములుకూడా తెలుపబడు ౘున్నవి. (సత్+తి+యమ్) = సత్త్యమ్.
"సత్". అనగా ప్రాణములు_ "తి" అనగా అన్నము, "యమ్" అనగా సూర్యుడు ప్రాణ, అన్న, సూర్యరూపములతో గూడినవాడగుటచే భగవానుడు "సత్యమ్" అని చెప్పబడెను. సాధు సజ్జనులయందలి సత్ప్రవర్తనమే సత్యమని జ్ఞానులు వచింతురు. కావున శ్రీహరి "సత్యమ్" అని పిలువబడుౘున్నాడు. సత్యశీలమే పరమాత్మ ప్రాప్తికి సాధనమని భావము.
ఇంటి బయట నిలబడి మనవుడు .....గట్టిగా అరిచాడు.. "ఓ తాతగారు .. నాతొ వచ్చిన బాబాజీకి ఆకలిగా ఉంది..కాస్త భోజనం పెట్టి పుణ్యం కట్టుకో ." ఇంట్లోనుండి ఓ పురుషకంఠం రీసౌండ్ లో వినిపించింది. "మీ అమ్మొమ్మ బ్యూటీపార్లర్ కి వెళ్లి ఇంకా తిరిగి రాలేదు..ఇంట్లో నాకూడా . కాలుతోంది. కాయో,పండో జోలిలో ఉంటే అక్కడ పెట్టేసి బయలుదేరమని అన్నాడు తాతగారు ."
సమ ఆత్మేతి విద్యాత్ అను శ్రుతి వాక్యానుసారముగా అన్నిటియందును సమానముగా నున్నవాడు పరమాత్మయని భావము. "సమోహం సర్వభూతేషు" (గీత 9_29) సమం సర్వేషు భూతేషు (అ13_27) అను గీతావాక్యములు స్మరణీయములు.
సకలభూతములందును పరమాత్మను దర్శింౘుటయే జ్ఞానము. అదియే పరాభక్తి, అదియే యోగము. దీనిని పొందుటయే ఈ స్తవరాజము యొక్క లక్ష్యమగుటచే ఈ భావమునే వ్యక్తము
చేయు నామములు మరల మరలా గానము చేయబడుౘున్నవి.
108)(5) సమ్మితః ఓం సమ్మితాయనమః
(1) సకలపదార్థములచేతను పరిచ్ఛేదము పొందినవాడు గాన "సమ్మితః" అనబడును.
(2) సకలపదార్థముల చేతను పరిచ్ఛేదమును బొందక యున్న వాడగుటచేత "అసమ్మితః" అని చెప్పబడును.
సమ్మితః, అసమ్మితః అను రెండు పాఠాంతరములును గణనీయములే.
109)(6) సమః ఓం సమాయనమః
వికార రహితుడై అన్నింటియందును సముడైయుండువాడు బల్బులయొక్క రంగులను బట్టియును తరతమభేదములను బట్టియును కాంతి భేదింౘుౘున్నట్లు గానవచ్చిననూ విద్యుచ్ఛక్తి మాత్రమూ అన్నిటియందును సమానముగా నుండునుగదా. అదేరీతిని ఉపాధులు భిన్న భిన్నములుగా నున్ననూ అందున్న ఆత్మ సమానమే యగును.
మయా= లక్ష్మితో సహవర్తత్= గూడినవాడగుటచేత శ్రీహరి సమః అని అనబడును.
మనస్సు ను అన్ని పరిస్థితులయందును సమత్వస్థితిలో నుంౘుటయే "బ్రాహ్మీస్థితి" యగును. సమత్వ యోగఉచ్యతే (గీత 6_48). "సమదుఃఖ సుఖంధీరం సో√మృతత్వాయ కల్పతే
(అ_2_15). సమత్వమే యోగము. సుఖదుఃఖాది ద్వంద్వములలో సమత్వస్థితిని బొందు చిత్తము గలవాడే అమృతత్వమును బొందుట కర్హుడని గీతాచార్యుని వాణి. ఇట్టి సమచిత్తత్వమును బేధింౘు నామములీ స్తవరాజములో పెక్కులు గలవు. పాఠకులు గమనింప ప్రార్థన.
--((**))--
110) (7) అమోఘః ఓం అమోఘాయైనమః
భగవదాశ్రయములో వ్యర్థమైనది లేనేలేదు. తనను గుఱించి చింతన స్మరణకీర్తన, ఆరాధన నమస్కారాదులాచరించి న మాత్రముననే భక్తులకు సర్వార్థములను ప్రసాదింౘువాడు. చాంద్యోగ్యోపనిషత్తులో "సత్యసంకల్పః" అని గానము చేయబడెను. గనుక భగవానుడు "అమోఘః " అని కీర్తింపబడెను.
111)(8) పుండరీకాక్షః ఓం పుండరీకాక్షాయనమః
పుండరీకమనగా తామరపువ్వు. అట్టి నేత్రములు కలవాడగుటచేత "పుండరీకాక్షః" అనబడును. మఱియును హృదయపద్మమున నివసింౘువాడును, హృదయ పద్మమునందు ధ్యానింప బడువాడును నగుటచేత "పుండరీకాక్షః " అనిచెప్పబడెను. నారాయణోపనిషత్తు ఈ విషయమును ౘక్కగా తెలియజేయును.
40వ నామముయొక్క వివరణమును కూడా ౘూడవలసినదిగా పాఠకులకు వినతి..
40) పుష్కరాక్షః ఓం పుష్కరాక్షాయనమః
పుష్కరమనగా తామరపూవు. అట్టి నేత్రము గలవాడగుటచేత పుష్కరాక్షః అని భగవానుడు పిలువబడును. భారతీయ వేదాంత సంస్కృతిలో పద్మమునకు గల స్థానము మహనీయ మైనది. పద్మము సౌందర్యమునకు, సౌకుమార్యమునకు ప్రసన్నతకు, ప్రశాంతికి చిహ్నము. పద్మము సంగరాహిత్యమును తెలుపును. తామర జలములలో సంగమమును బొందదు. సంగ రాహిత్యమే జ్ఞానము. నిస్సంగము, నిర్లిప్తత, మహానుభావ చిహ్నములగుట చేతనే శ్రీమహావిష్ణువు తన హస్తమునందు పద్మమును ధరింౘుట కానవచ్చును. అంతమాత్రమేగాక భగవంతుడు పద్మమువలె " నిస్సంగుడు_ నిర్లిప్తుడు " అని తెలుపుటకే ఆయన అవయవములన్నియును పద్మముతోనే వర్ణింపబడుౘుండుట గమనార్హము. ఉదా:- పద్మనేత్రుడు, పద్మముఖుడు, పద్మనాభుడు, పద్మహస్తుడు, పద్మపాదుడు మున్నగునవి గమనింౘునది. ఇచ్చట. " పుష్కరాక్ష " నామము శ్రీహరియొక్క ప్రశాంత నేత్రములను సూచింౘును. ఆయన నేత్రములు ప్రేమామృత ప్రపూర్ణములు. కరుణారసభరితములు. ఆయన ౘల్లని ౘూపులచేత భక్తుల సకల తాపములను హరింౘును గాన భగవానుడు పుష్కరాక్షుడుగా కీర్తింపబడును. ఈ ఈనామముయొక్క పర్యాయపదములే ముందు రానున్న నామము లలో గూడా పాఠకులు ౘూడగలరు.
112)(9) వృషకర్మ. ఓం వృషకర్మణేనమః
"వృషః" అనగా ధర్మము. ధర్మమే తన నిజకర్మముగా గలిగిన వాడును, ధర్మసంస్థాపనార్థముగా అవతరింౘువాడును, ధర్మమునే అనుష్ఠానము చేయువాడును శ్రీహరి యే యగుటచే "వృషకర్మా" యని స్తుతింపబడెను.
113)(10) వృషాకృతిః ఓం వృషాకృతయేనమః
ధర్మమే ఆకారముగా గలవాడు. మూర్తీభవించిన ధర్మ స్వరూపుడు. " రామో విగ్రహవాన్ ధర్మః". అని రామాయణము తెలుపును.భగవానుడు తన అవతారములయందు ధర్మమును ప్రబోధము చేయుటయేగాక వానిని ౘక్కగా అనుష్ఠించి ౘూపినవాడు గదా 112, 113 నామములలో ధర్మప్రాశస్త్యము తెలుపబడెను. సారాంశమేమన మానవుడు ధర్మమార్గములో నడచినపుడే ధర్మ
స్వరూపుండగు భగవానుని పొందును. ధర్మమే దైవసావరూపము. "ధర్మోరక్షతిరక్షితః". .ధర్మానుష్ఠాన పరుని ధర్మమే రక్షింౘును.
--((**))--
హరిః ಓమ్
12) శ్లోకము
వసుర్వసుమనాః సత్యః సమాత్మాసమ్మిత స్సమః!
అమోఘః పుండరీకాక్షో వృషకర్మా వృషాకృతిః !!
ఈ శ్లోకమునందు పది హరినామములు వెలయుౘున్నవి.
104)(1) వసుః ఓం వసవేనమః
(1) సమస్త భూతములును తనయందే వసింౘుౘున్నవి. గాన శ్రీహరి "వసు" అని స్తవనీయుడగు ౘున్నాడు.
(2) "వసూనాంపావకశ్చాస్మి" అని గీతావాణి (10_23) "అష్టవసువులలో నేను పావకుడను" అని భగవద్వాక్యము.
(3) వాయువంతటనూ వ్యాపించి యున్నట్లు నేను అన్ని భూతములయందును వ్యాపించి యున్నాను (గీత 9_6). పై విషయ మును అనుభవపూర్వకముగా గ్రహంచినచో మానవులందరునూ
ధర్మప్రవృత్తులే యగుదురు.
105).(2) వసుమనాః ఓం వసుమనసేనమః
శ్రేష్ఠమయిన మనస్సుగలవాడని భావము. రాగద్వేష రహితమును, మాలిన్య శూన్యమును, మాయా రహితమును నగు మనస్సే శ్రేష్ఠమగు మనస్సు. ఇట్టి మనస్సు గలవారలే భగవత్స్వ
రూపులగుదురు. మాలిన్యచిత్తము నశించినచో మానవుడే మాధవు డగును. మనస్సే మానవునకు బంధువు. మనస్సే మానవునకు శత్రువు. అని గీతా శాస్త్రం వచింౘును. మాలిన్యరహితమగు
చిత్తమేమానవునకు బంధువు, గురువు, సారథి యగునుకాన "వసుమనాః" యని శ్రీహరి కీర్తనీయుడు.
106)(3) సత్యః ఓం సత్యాయనమః
"సత్యమ్ జ్ఞానమనంతంబ్రహ్మ" అను తైత్తరీయోపనిషద్ వాక్యానుసారముగ పరమాత్మ సత్యమును జ్ఞానమును అనంతము నునై యున్నందున "సత్యః అని గానము చేయబడెను.
సత్యమనగా మూడు కాలములందును నుండునది. నాశనరహితమైనది. మార్పులేనిది అదియే "పరబ్రహ్మము". ఈనామమునకు మరిరెండు భావములుకూడా తెలుపబడు ౘున్నవి. (సత్+తి+యమ్) = సత్త్యమ్.
"సత్". అనగా ప్రాణములు_ "తి" అనగా అన్నము, "యమ్" అనగా సూర్యుడు ప్రాణ, అన్న, సూర్యరూపములతో గూడినవాడగుటచే భగవానుడు "సత్యమ్" అని చెప్పబడెను. సాధు సజ్జనులయందలి సత్ప్రవర్తనమే సత్యమని జ్ఞానులు వచింతురు. కావున శ్రీహరి "సత్యమ్" అని పిలువబడుౘున్నాడు. సత్యశీలమే పరమాత్మ ప్రాప్తికి సాధనమని భావము.
ఇంటి బయట నిలబడి మనవుడు .....గట్టిగా అరిచాడు.. "ఓ తాతగారు .. నాతొ వచ్చిన బాబాజీకి ఆకలిగా ఉంది..కాస్త భోజనం పెట్టి పుణ్యం కట్టుకో ." ఇంట్లోనుండి ఓ పురుషకంఠం రీసౌండ్ లో వినిపించింది. "మీ అమ్మొమ్మ బ్యూటీపార్లర్ కి వెళ్లి ఇంకా తిరిగి రాలేదు..ఇంట్లో నాకూడా . కాలుతోంది. కాయో,పండో జోలిలో ఉంటే అక్కడ పెట్టేసి బయలుదేరమని అన్నాడు తాతగారు ."
--((**))--
107)(4) సమాత్మా ఓం సమాత్మనేనమఃసమ ఆత్మేతి విద్యాత్ అను శ్రుతి వాక్యానుసారముగా అన్నిటియందును సమానముగా నున్నవాడు పరమాత్మయని భావము. "సమోహం సర్వభూతేషు" (గీత 9_29) సమం సర్వేషు భూతేషు (అ13_27) అను గీతావాక్యములు స్మరణీయములు.
సకలభూతములందును పరమాత్మను దర్శింౘుటయే జ్ఞానము. అదియే పరాభక్తి, అదియే యోగము. దీనిని పొందుటయే ఈ స్తవరాజము యొక్క లక్ష్యమగుటచే ఈ భావమునే వ్యక్తము
చేయు నామములు మరల మరలా గానము చేయబడుౘున్నవి.
108)(5) సమ్మితః ఓం సమ్మితాయనమః
(1) సకలపదార్థములచేతను పరిచ్ఛేదము పొందినవాడు గాన "సమ్మితః" అనబడును.
(2) సకలపదార్థముల చేతను పరిచ్ఛేదమును బొందక యున్న వాడగుటచేత "అసమ్మితః" అని చెప్పబడును.
సమ్మితః, అసమ్మితః అను రెండు పాఠాంతరములును గణనీయములే.
109)(6) సమః ఓం సమాయనమః
వికార రహితుడై అన్నింటియందును సముడైయుండువాడు బల్బులయొక్క రంగులను బట్టియును తరతమభేదములను బట్టియును కాంతి భేదింౘుౘున్నట్లు గానవచ్చిననూ విద్యుచ్ఛక్తి మాత్రమూ అన్నిటియందును సమానముగా నుండునుగదా. అదేరీతిని ఉపాధులు భిన్న భిన్నములుగా నున్ననూ అందున్న ఆత్మ సమానమే యగును.
మయా= లక్ష్మితో సహవర్తత్= గూడినవాడగుటచేత శ్రీహరి సమః అని అనబడును.
మనస్సు ను అన్ని పరిస్థితులయందును సమత్వస్థితిలో నుంౘుటయే "బ్రాహ్మీస్థితి" యగును. సమత్వ యోగఉచ్యతే (గీత 6_48). "సమదుఃఖ సుఖంధీరం సో√మృతత్వాయ కల్పతే
(అ_2_15). సమత్వమే యోగము. సుఖదుఃఖాది ద్వంద్వములలో సమత్వస్థితిని బొందు చిత్తము గలవాడే అమృతత్వమును బొందుట కర్హుడని గీతాచార్యుని వాణి. ఇట్టి సమచిత్తత్వమును బేధింౘు నామములీ స్తవరాజములో పెక్కులు గలవు. పాఠకులు గమనింప ప్రార్థన.
--((**))--
110) (7) అమోఘః ఓం అమోఘాయైనమః
భగవదాశ్రయములో వ్యర్థమైనది లేనేలేదు. తనను గుఱించి చింతన స్మరణకీర్తన, ఆరాధన నమస్కారాదులాచరించి న మాత్రముననే భక్తులకు సర్వార్థములను ప్రసాదింౘువాడు. చాంద్యోగ్యోపనిషత్తులో "సత్యసంకల్పః" అని గానము చేయబడెను. గనుక భగవానుడు "అమోఘః " అని కీర్తింపబడెను.
111)(8) పుండరీకాక్షః ఓం పుండరీకాక్షాయనమః
పుండరీకమనగా తామరపువ్వు. అట్టి నేత్రములు కలవాడగుటచేత "పుండరీకాక్షః" అనబడును. మఱియును హృదయపద్మమున నివసింౘువాడును, హృదయ పద్మమునందు ధ్యానింప బడువాడును నగుటచేత "పుండరీకాక్షః " అనిచెప్పబడెను. నారాయణోపనిషత్తు ఈ విషయమును ౘక్కగా తెలియజేయును.
40వ నామముయొక్క వివరణమును కూడా ౘూడవలసినదిగా పాఠకులకు వినతి..
40) పుష్కరాక్షః ఓం పుష్కరాక్షాయనమః
పుష్కరమనగా తామరపూవు. అట్టి నేత్రము గలవాడగుటచేత పుష్కరాక్షః అని భగవానుడు పిలువబడును. భారతీయ వేదాంత సంస్కృతిలో పద్మమునకు గల స్థానము మహనీయ మైనది. పద్మము సౌందర్యమునకు, సౌకుమార్యమునకు ప్రసన్నతకు, ప్రశాంతికి చిహ్నము. పద్మము సంగరాహిత్యమును తెలుపును. తామర జలములలో సంగమమును బొందదు. సంగ రాహిత్యమే జ్ఞానము. నిస్సంగము, నిర్లిప్తత, మహానుభావ చిహ్నములగుట చేతనే శ్రీమహావిష్ణువు తన హస్తమునందు పద్మమును ధరింౘుట కానవచ్చును. అంతమాత్రమేగాక భగవంతుడు పద్మమువలె " నిస్సంగుడు_ నిర్లిప్తుడు " అని తెలుపుటకే ఆయన అవయవములన్నియును పద్మముతోనే వర్ణింపబడుౘుండుట గమనార్హము. ఉదా:- పద్మనేత్రుడు, పద్మముఖుడు, పద్మనాభుడు, పద్మహస్తుడు, పద్మపాదుడు మున్నగునవి గమనింౘునది. ఇచ్చట. " పుష్కరాక్ష " నామము శ్రీహరియొక్క ప్రశాంత నేత్రములను సూచింౘును. ఆయన నేత్రములు ప్రేమామృత ప్రపూర్ణములు. కరుణారసభరితములు. ఆయన ౘల్లని ౘూపులచేత భక్తుల సకల తాపములను హరింౘును గాన భగవానుడు పుష్కరాక్షుడుగా కీర్తింపబడును. ఈ ఈనామముయొక్క పర్యాయపదములే ముందు రానున్న నామము లలో గూడా పాఠకులు ౘూడగలరు.
112)(9) వృషకర్మ. ఓం వృషకర్మణేనమః
"వృషః" అనగా ధర్మము. ధర్మమే తన నిజకర్మముగా గలిగిన వాడును, ధర్మసంస్థాపనార్థముగా అవతరింౘువాడును, ధర్మమునే అనుష్ఠానము చేయువాడును శ్రీహరి యే యగుటచే "వృషకర్మా" యని స్తుతింపబడెను.
113)(10) వృషాకృతిః ఓం వృషాకృతయేనమః
ధర్మమే ఆకారముగా గలవాడు. మూర్తీభవించిన ధర్మ స్వరూపుడు. " రామో విగ్రహవాన్ ధర్మః". అని రామాయణము తెలుపును.భగవానుడు తన అవతారములయందు ధర్మమును ప్రబోధము చేయుటయేగాక వానిని ౘక్కగా అనుష్ఠించి ౘూపినవాడు గదా 112, 113 నామములలో ధర్మప్రాశస్త్యము తెలుపబడెను. సారాంశమేమన మానవుడు ధర్మమార్గములో నడచినపుడే ధర్మ
స్వరూపుండగు భగవానుని పొందును. ధర్మమే దైవసావరూపము. "ధర్మోరక్షతిరక్షితః". .ధర్మానుష్ఠాన పరుని ధర్మమే రక్షింౘును.
--((**))--
హరిః ಓమ్
13) శ్లోకము
రుద్రో బహుశిరా బభ్రుః విశ్వయోనిః శుచిశ్రవాః !
అమృతః శాశ్వతః స్థాణుర్వరారోహో మహాతపాః !!
తొమ్మిది హరినామములు ఈ పుణ్యశ్లోకములో విలసిల్లుౘున్నవి.
114) (1) రుద్రః ఓం రుద్రాయనమః
1) రోదయతీతి రుద్రః ప్రళయకాలము నందు సకల ప్రాణులను లయము గావింౘుౘు వారలకు దుఃఖమును గలిగింౘు వాడు గావున రుద్రు డన బడుౘున్నాడు.
2) "రుద్ర ఇత్యుచ్యతే తస్మాచ్చివః పరమకారణం " అని శివపురాణమునందు చెప్పబడి యుండుటచేత తన్నాశ్రయించిన భక్తుల యొక్క సమస్త దుఃఖములను, దుఃఖహేతువులను కూడా
పోగొట్టి సుఖములను వర్షింపజేయువాడగుటచేత "రుద్రః" అని భగవానుడు పిలువబడు ౘున్నాడు. ఆయన భక్తులకు మంగళకరుడు దుర్మార్గులకు భయంకరుడు.
" రుద్రాణాం శంకరశ్చాస్మి ". ఏకాదశ రుద్రులలో శుభప్రదాతయగు శంకరుడను నేనని గీతా చార్యుడు తెలిపెను. (గీత 10_23). "శం". కరోతి ఇతి శంకరః. శుభములను కలుగజేయువా
డగుటచేత శంకరుడనబడుౘున్నాడు. రుద్రాభిషేకము సర్వా రిష్టములను తొలగింౘు నని శాస్త్ర వాక్యము. శ్రీ మహావిష్ణువే "రుద్ర" నామముతో ఇౘట స్తవము చేయబడుౘున్నాడు. శివాయ విష్ణు
రూపాయ శివరూపాయ విష్ణవే, శివస్య హృదయం విష్ణుః విష్ణోశ్చ హృదయగ్ం శివః" అను పవిత్ర శాస్త్ర వాక్యము స్మరణీయము. శివకేశవులకు భేదమెంతమాత్రమును లేదు. ఆయన (కాశీ) విశ్వనాథుడు. ఈయన (పూరీ) జగన్నాథుడు. ఆయన సర్ప హారములు గలవాడు ఈయన సర్ప శయ్యగలవాడు. కావున శివ కేశవులకు భేదములేదు.
115) (2 ) బహుశిరాః ఓం బహుశిరసేనమః
అనేక శిరస్సు లు గలవాడు. "సహస్ర శీర్షాపురుషః" అని పురుష సూక్త వర్ణనము. "అనేక వక్త్ర నయనం", " అనేక బాహు దరవక్త్రనేత్రం". అని గీతలో 11వ అధ్యాయమునందును, "సర్వ
తోక్షి శిరోముఖం". అని 13వ అధ్యాయమునందలి వర్ణనములును భగవానుని విశ్వరూపమును వివరింౘుౘున్నవి గదా. విశ్వము నందు గానవచ్చు శిరస్సు లన్నియును భగవంతుని శిరస్సు లే,
ప్రాణి కోటియంతయును భగవత్స్వరూపమే అని భావము. ఇట్టి భావనయే మోక్షసిద్ధికి మూలము. కనుకనే శ్రీహరి "బహుశిరా; అని స్తుతింపబడుౘున్నాడు.
116)(3 ) బభ్రుః ఓం బభ్రవేనమః
లోకములను, లోకేశులను, సకలప్రాణికోటులను భరింౘు వాడు, రక్షింౘువాడు, ఆధారమైనవాడు, సర్వస్వమునైయున్నవాడు ఈశ్వరుడేయగుటచేత "బభ్రుః" అను నామ వాచ్యుడయ్యెను.
--((**))--
117) (4) విశ్వయోనిః ఓం విశ్వయోనయేనమః
ఈ అనంత విశ్వమున కంతకునూ కారణమైనవాడని అర్థము.
"మమయోనిర్మహద్బ్రహ్మ తస్మిన్ గర్భం దధామ్యహం --
సంభవః సర్వభూతానాం తతో భవతి భారత" (గీత 14_3) గొప్పది యైన ఈ మూలప్రకృతి (మాయ) సర్వభూతోత్పత్తికిని స్థానము దానియందు నేను గర్భకారణమగు, చైతన్యరూపమగు బీజము
నుంౘుౘున్నాను. దీనివలననే సకల ప్రాణికోటులకును ఉత్పత్తి కలుగుౘున్నది.
"తాసాంబ్రహ్మమహద్యోనిః" _ "అహం బీజప్రదఃపితా" (14_4).
మూలప్రకృతి మాతృస్థానము _ నేను బీజప్రదానము చేయు తండ్రిని" అను భగవద్వాక్యములు స్మరణీయములు.
118).(5) శుచిశ్రవాః ఓం శుచిశ్రవసేనమః
1) శుచియిను, మంగళకరములునునగు అనేక నామములు గలవాడుగావున శ్రీహరి "శుచిశ్రవాః" అని కీర్తనీయుడు (శుచి = పవిత్రము, శ్రవః = నామము) భగవన్నామములు అన్నియూ మంగళ కరములే వీని కీర్తనముచేత మానవులకు సర్వశుభములు కలుగును. వేయి భగవన్నామములు ఈ స్తవరాజము యొక్క విశిష్టత ను వేరుగా చెప్పవలయునా ?
2). కొందరు భక్తులు ఈవిధంగా ఈనామమును వివరింౘుౘున్నారు. శుచి = శక్తివంతము పవిత్రమునైన, శ్రవః = చెవి గలిగినవాడు. భగవానుని శ్రవణశక్తి అనంతమైనది. "సర్వతః శ్రుతి
మత్ లోకే" విశ్వమంతయును నా శ్రవణేంద్రియములే (చెవులు) గలవని గీతాచార్యునివాణి (అ_13_13). సారాంశ మేమన మానవు ల యొక్క సమస్త రహస్యములను భగవానుడు వినుౘునే యుండును. కావున అసభ్య, అసత్య, దురాలోచనలు మానవలెనని సూచన.
119) (6) అమృతః ఓం అమృతాయనమః
మరణములేనివాడు , షడ్వికారశూన్యుడు అమృత సేవనముచేత సకల వ్యాధులును, జనన మరణ క్లేశములును హరింౘును గాన ఆయన "అమృతః" అని పిలువబడును. అమృత మనగా మోక్షమనియును అర్థము. అనగా మోక్షప్రదాత శ్రీహరి.
126) (4) జనార్దనః ఓం జనార్దనాయనమః
తన్నాశ్రయించి ధర్మమార్గమున చరింౘువారికందరకును వారి వారి సంస్కారానుసారముగా ధర్మార్థకామమోక్షములను ప్రసాదింౘువాడు. మఱియు శాస్త్ర విరుద్ధముగా ఉన్నది చరింౘు
దుర్మార్గులకు దుఃఖములను కలిగించి శిక్షింౘువాడు కనుకనే "జనార్దనః" అని ఈశ్వరుడు స్తవనీయుడగును.
127) (5) వేదః ఓం వేదాయనమః
"విద్" = తెలిసికొనుట, విద్ అను ధాతువునుండి "వేదః " అను శబ్దము కలిగినందున,వేదః అనగా " జ్ఞానభాండారము" అని అర్థము."యోగోజ్ఞానంతథాసాంఖ్యం విద్యాశ్శిల్పాది కర్మచ, వేదా
శ్శాస్త్రాణి విజ్ఞానమేతత్సర్వం జనార్దనాత్". అనగా యోగము, జ్ఞానము, సాంఖ్యము, విద్య, సర్వశాస్త్రములును జనార్దనుని నుండియేకలిగినవని వ్యాసవాక్యము.
128) (6) వేదవిత్ ఓంవేదవిదేనమః
వేదసారమంతయు బాగుగా నెరింగినవాడు. " వేదైశ్చ సర్వై రహమేవవేద్యో వేదాంతకృత్, వేదవిదేవచాహం ". సకల వేదములను పూర్తిగా నెరింగినవాడను నేనే. వేదాంత నిర్మాతను నేను. వేదవిదుడను నేను అను గీతావాక్యము (15_15) స్మరణీయము. కావున ఈశ్వరుడి "వేదవిత్" అనబడును.
129) (7) అవ్యంగః ఓం అవ్యంగాయనమః
జ్ఞానము చేత పరిపూర్ణుడైనవాడు. "వ్యంగ" మనగా "ఆకారము" అవ్యంగుడనగా ఆకారరహితుడు. "అవ్యక్తో√యం" అని గీతావాక్యము (2_25). ఇంద్రియములచేతగాని, మనస్సుచే గానీ తెలియబడనివాడగుటచేత "అవ్యంగః" అనబడును.
--((**))--
130) (8) వేదాంగః ఓం వేదాంగాయనమః
వేదములే తన శరీరావయవములు గా కలిగినవాడు, వేదపురుషుడే పరబ్రహ్మము.
131) (9) వేదవిత్ ఓం వేదవిదేనమః
వేదమును ౘక్కగా విచారము చేయువాడని భావము. కేవలము శబ్దార్థమును మాత్రమేకాక దాని సంపూర్ణ భావమును ౘక్కగా గ్రహించి నిత్య దైనందిన జీవితంలో అనుష్ఠింౘువాడని
అర్థము. వేదమును కేవలముగా కంఠస్థము చేయుటకంటే దాని శబ్దార్థము ను గ్రహింౘుట మేలు. శబ్దార్థ గ్రహణముకంటే అతరార్థమును సారాంశమును గ్రహింౘుట మరింతమేలు. సారము
ను గ్రహించి అనుష్ఠింౘువాడు మరింత శ్రేష్ఠుడైనవాడు. అతడే వేదవిదుడు కావున శ్రీపతి "వేదవిత్" అని కీర్తింపబడెను.
132) (10) కవిః ఓం కవయేనమః
"కవిః". అనగా క్రాంత దర్శి. సర్వజ్ఞమూర్తి యని భావము. అతియేగానీ కేవలము పద్యములను, గ్రంథములను రచింౘువాడు గాదు. గీతాశాస్త్రము న భగవానుడు "కవి" యను నామముచే స్తవనీయుడయ్యెను (అ_8_9).
--((**))--
15) శ్లోకము
లోకాధ్యక్షః సురాధ్యక్షో ధర్మాధ్యక్షః కృతాకృతః !
చతురాత్మా చతుర్వూహః చతుర్దంష్ట్రః చతుర్భుజః !!
ఈ శ్లోకమునందు యెనిమిది భగవన్నామములు తెలుపబడుౘున్నవి.
133) (1) లోకాధ్యక్షః ఓం లోకాధ్యక్షాయనమః
"సర్వలోక మహేశ్వరః" ( గీత అ-5_29) భగవానుడు సర్వలోకములకును మహేశ్వరుండగుటచేత "లోకాధ్యక్షః" అనబడు ౘున్నాడు. సకలలోకములకును సాక్షి యైనవాడు. మన శరీరము నందున్న ఆత్మయును ఉదాసీనుడై సాక్షిమాత్రుడై యుండునని గీతావాక్యము (13_22) . కావున లోకాధ్యక్షుడని శ్రీహరి గానము చేయబడెను.
134) (2) సురాధ్యక్షః ఓం సురాధ్యక్షాయనమః
ఆయన దేవతలకును దిక్పాలకులకును కూడా అధ్యక్షుడై దైత్యులబాధలనుండి కాపాడును. అట్లే మనదేహమందు అధ్యక్షుడు ను మన మనస్సు నందు జనించి అసురభావనా శక్తులను సంపూర్ణంగా నాశనము చేయును. మనము భగవానునకు సంపూర్ణ శరణాగతిని చేసినపుడే ఇట్టి రక్షణ మనకు లభింౘును.
135) (3) ధర్మాధ్యక్షః ఓం ధర్మాధ్యక్షాయనమః
జీవులాచరించిన ధర్మాధర్మముల నన్నింటిని ౘక్కగా పరిశీలించి ఫలముల నొసంగువాడు గాన విష్ణువు ధర్మాధ్యక్షుడనబడును.
136) (4) కృతాకృతః ఓం కృతాకృతాయనమః
కృతము= వ్యక్తము అనగా సృష్టింపబడినది లేక కార్యరూపమున ధరింపబడినది యని యర్థము. అకృతమనగా అవ్యక్తము , సృష్టింపబడనిది, కారణరూపమున నుండునది యని యర్థము. వ్యక్తావ్యక్త స్వరూపుడగుటచే శ్రీవిష్ణువు "కృతాకృతః" యని గానము చేయబడును.
--((**))--
137) (5) చతురాత్మా ఓం చతురాత్మనేనమః
సృష్టిచేయుటయందు వేరువేరైన నాలుగు విభూతులతో నొప్పువాడు గావున మహావిష్ణువు " చతురాత్మా" అనబడును.
(1) బ్రహ్మ, 2) దక్షుడు మున్నగు ప్రజాపతులు 3) కాలము 4) ప్రాణులు ఈ నాలుగును సృష్టికి హేతువులగు శ్రీహరి యొక్క నాలుగు విభాగాలుగా పురాణ ప్రసిద్ధములు. విష్ణువు మన్వాదులు, కాలము, సకలభూతములు ఈ నాలుగును జగత్తు యొక్క స్థితికి కారణములగు చతుర్విభూతులు, రుద్రుడు, కాలము, యముడు, ప్రాణులు ఈనాలుగును ప్రణయకారములగు చతుర్విధ
విభూతులు. (విష్ణుపురాణం).
జాగ్రత్- స్వప్న_సుషుప్తి_తురీయములు ఈనాలుగు 4 విభూతులుగా చెప్పుదురు.
138)(6) చతుర్వ్యూహః ఓం చతుర్వ్యూహాయనమః
1) వాసుదేవుడు (పరమాత్మ) (2) సంకర్షణుడు (జీవుడు) (3) ప్రద్యుమ్నుడు (మనస్సు) (4) అనిరుద్ధుడు (అహంకారము) ఈ నాలుగు వ్యూహముల నాధారముగా సృష్టికార్యము చేయబడెనని వ్యాసవాక్యము. అందుచేతనే " చతుర్వ్యూహః" అనబడుౘున్నాడు.
--((**))--
139) (7) చతుర్దంష్ట్రః ఓం చతుర్దంష్ట్రాయనమః
నరసింహావతారమున నాలుగు భయంకరములగు కోరలతో నవతరించినవాడు కావున విష్ణువు "చతుర్దంష్ట్రః" అనబడును. వేదాంతపరంగా జాగ్రత్- స్వప్న_సుషుప్తి_తురీయావస్థలను సూచింౘును.
"ఐరావతం గజేద్రాణాం" ఏనుగులలో ఐరావతము తన విభూతిగా గీతాచార్యుడు వచించెను (10_27).
జాగ్రత్- స్వప్న_సుషుప్తి_తురీయావస్థలను ఈ నాలుగు అవస్థలను గూడ పైనామము సూచింౘుౘున్నదని కొందరి వ్యాఖ్యాతల భావమైయున్నది. అందుచేత భగవానుడు "చతుర్దంష్ట్రః" అని అర్చనీయుడగుౘున్నాడు.
140) (8) చతుర్భుజః ఓం చతుర్భుజాయనమః
నాలుగు బాహువులతో విలసిల్లువాడని భావము. 1) శంఖము 2) చక్రము 3) గద 4) పద్మము తన నాలుగు బాహువులలోను ధరించియుండునని పురాణ ప్రసిద్ధి.
శంఖము ప్రణవమును, చక్రము కాలమును, గద దుష్టశిక్షణమును, పద్మము పవిత్రతను సూచింౘుౘున్నదని విజ్ఞుల అభిప్రాయము. ఈ చిహ్నములు మనస్సు, బుద్ధి , చిత్తము, అహంకారములను అంతఃకరణ చతుష్టయమును సూచింౘుౘున్నవని మరికొందరి అభిప్రాయము.
--((**))--
16) శ్లోకము
భ్రాజిష్ణుః భోజనం భోక్తాసహిష్ణుర్జగదాదిజః !
అనఘోవిజయోజేతా విశ్వయోనిః పునర్వసుః !!
ఈ శ్లోకము నందు పది హరినామములు వర్ణితములు.
141) (1) భ్రాజిష్ణుః ఓం భ్రాజిష్ణవేనమః
సర్వమువు ప్రకాశింపజేయు స్వయంప్రకాశ స్వరూపుడు ఈయన వలననే సూర్యచంద్రాగ్నులు ప్రకాశమును చెందుదురు. (గీత 15_18)జ్యోతిషామపితజ్జ్యోతిః (13_17).
142) (2) భోజనమ్ ఓం భోజనాయనమః
మనము తినునట్టి ఆహారమునకు "భోజనమ్" అని పేరు. వేదాంతపరి భాషలో నోటితో తిను పదార్థములనేగాక జ్ఞానేంద్రియ ములతో స్వీకరింౘు ( శబ్ద, స్పర్శ రూప రస గంధాదు లన్నియును) విషయములన్నియును భోజనమేయగును. కనుక ఈ ప్రకృతి (మాయ) యంతయును భోజనమేయగుటచేత విష్ణువు "భోజన" రూపుడగు మాయాస్వరూపు డనబడెను.
143)(౩) భోక్తా ఓం భోక్త్రేనమః
పై నామములో వివరించబడిన భోజన రూపమగు ప్రకృతి లేక మాయను పురుషరూపమున అనుభవింౘువాడును శ్రీహరియే యగుటచేత "భోక్తా" యని స్తవనీయుడగును.
" అహంవైశ్వానరోభూత్వా ప్రాణినాందేహమాశ్రితః ప్రాణాపానసమాయుక్తః పచామ్యన్నంచతుర్విధం" అను గీతా వాక్యము స్మరణీయము (అ 15_14). నేను ప్రాణుల దేహమందు వైశ్వానరరూపుడనై (జఠరాగ్నిరూపుడనై) చతుర్విధములగు నాహారపదార్థములను పచనము చేయుౘున్నానని భగవద్వాక్యము
--((**))--
144) (4) సహిష్ణుః ఓం సహిష్ణవేనమః
(1) హిరణ్యాక్షాది దుష్టరాక్షసులను సంహరించిన వాడగుటచేత "సహిష్ణుః" అనబడును. "వినాశాయచ దుష్కృతాం". (అ_4_4) అను గీతావాక్యము స్మరణీయము.
(2) క్షమాస్వరూపుడనియును కూడా ఈ నామమునకు అర్థము చెప్పబడినది. తన్నాశ్రయించిన భక్తుల యొక్క దోషములను క్షమింౘువాడు మనస్సు లోని దుర్గుణాదులను నాశనము చేయు క్షమాస్వరూపుడు భగవానుడే, యగుటచేత "సహిష్ణుః" అని చెప్పబడును. అనగా భగవానుని నామస్మరణ చింతనాదులచేతనే మానవుల పాపములన్నియును నశింౘు నని సారాంశము.
145) (5) జగదాదిజః ఓం జగదాదిజాయనమః
జగత్తునకు ప్రారంభమునందే ముందుగానున్న వాడని భావము. హిరణ్యగర్భుని రూపమున సృష్టి యొక్క ప్రారంభమునందే యున్నవాడు. సర్వసృష్టి కి మూలమాయనయే. ఈ పరమసత్యమును గ్రహించిన మహనీయుడు మోహన రహితుడయి సకల పాపవిముక్తుడగునని గీతాచార్యుని వాక్యమై యున్నది (అ 10_3).
146) (6) అనఘః ఓం అనఘాయనమః
అఘము అనగా పాపము. పాపరహితుడగుటచేత. శ్రీహరి "అనఘ" నామ వాచ్యుడగును. సాధకులు తమతమ మనస్సులు పాపరహితముగా (ఈర్ష్యాద్వేషాది విషయమాలిన్యములు లేకుండా) చేసికొన్నచో వారును అనఘులే యగుదురని సారాంశము. మానవుని నుండి మాయ తొలగినచో అతడే భగవంతుడు కదా.
147) (7) విజయః ఓం విజయాయనమః
ప్రకృతిని జయించినవాడు, జ్ఞాన+ఐశ్వర్యాది శక్తులచేత విశ్వమును జయించినవాడు, కావున "విజయః" అని శ్రీహరి చెప్పబడును. "ఎవడు ఇంద్రియములను జయింౘునో వాడు విజయుడు " అని సాధకులు గమనింౘ వలయును. అర్జునునకు కూడా విజయుడను నామము కలదు. "పాండవానాం ధనంజయః" అని గీతావాక్యము (అ_10_37).
వాసుదేవాశ్రయమును బొందినవాడు నిరంతరమును, నిత్య దైనందిన జీవితము నందును విజయుడేయగునని ఉత్తరపీఠిక తెలుపుౘున్నది.
--((**))--
148) (8) జేతా ఓం జేత్రేనమః
నిరంతరమూ జయశీలుడే, తన అవతారములలో రాక్షస సంహారాదులయందు అపజయమన్నది స్వామికి లేనేలేదుకదా!
" సత్యమేవజయతే _నానృతమ్" సత్యమే నిరంతరమును జయింౘును, అసత్యమెన్నడును జయింౘదు. అని ఉపనిషద్వాక్యము. భగవదాశ్రయమును బొందినవాడు నిరంతరము జయశీలుడే యని ఈ నామము భక్తులకు బోధింౘును.
149) (9) విశ్వయోనిః ఓం విశ్వయోనయేనమః
విశ్వమునకు జన్మస్థానమై యున్నందున శ్రీహరి "విశ్వయోని" యని కీర్తింపబడును.
150) (10) పునర్వసుః ఓం పునర్వసవేనమః
తానే అనేక నామరూపములతో మఱల మఱల అవతరింౘు వాడును క్షేత్రజ్ఞరూపమున సకల శరీరముల యందును విలసిల్లువాడును భగవానుడే యగుటచేత "పునర్వసుః" అని పిలువబడుౘున్నాడు. " క్షేత్రజ్ఞంచాపి మాం విద్దిసర్వక్షేత్రేషు భారత" అన్ని క్షేత్రముల యందును నేను క్షేత్రజ్ఞుడనై యున్నాను (గీత అ 13_3).

14) శ్లోకము
సర్వగః సర్వవిద్భానుః విష్వక్సేనో జనార్దనః !
వేదోవేద విదవ్యంగో వేదాంగో వేదవిత్కవిః !!
ఈ రమణీయ శ్లోకమున శ్రీహరి దశవిధ పుణ్యనామములతో శోభిల్లుౘున్నాడు.
123) (1) సర్వగః ఓం సర్వగాయనమః
అంతటను గమనముకల్గినవాడు. "సర్వతఃపాణిపాదం" అనగా అంతటనూ నాయొక్క హస్తములే పాదములే విస్తరించి యున్నవి". అని గీతాశాస్త్రవాక్యము (13_13) అణువణువునందు నిండియున్న వాడని సారాంశము. ఆభరణములలో బంగారమువలె భాండములలో మృత్తికవలె, తరంగములలో సాగరమువలె, వస్త్రములలో దూదివలె పరమాత్మ సర్వవ్యాపకుడని భావము.
124) (2) సర్వవిద్భానుః ఓమ సర్వవిద్భానవేనమః
సర్వవిత్ + భానుః = సర్వవిద్భానుః అనునది ఏకనామము.
"సర్వవిత్"అనగా సర్వమునూ ఎఱింగినవాడనియు"భానుః" అనగా కాంతిస్వరూపుడనియును భావము. "జ్యోతిషామపితజ్జ్యోతిః" (గీత 13_13) సూర్యచంద్రాదిజ్యోతులకంటెను దివ్యప్రకాశ
సంపన్నుడు. "సూర్యచంద్రాగ్నులయందుగల తేజస్సంతయునూ నాదే" అని భగవద్వాక్యము (15_12) "జ్ఞానమయదివ్యజ్యోతి" యగుటచేత భగవానుడు "సర్వవిద్భానుః" అని కీర్తింపబడును.
125) (3) విష్వక్సేనః ఓం విష్వక్సేనాయనమః
తన తలంపు మాత్రముచేతనే సర్వ దానవ సైన్య సమూహములను నాశనము గావింౘు వాడగుటచేత. శ్రీహరి "విష్వక్సేన" నామమున గానము చేయబడును. శ్రీహరి నామ చింతన ధ్యానముల తలంపు కలిగినంత మాత్రముచేత నీ మనస్సును ఆవరించియున్న దుష్టరాక్షసులు (అసురవిషయ వాసనాదులు) నశించి పోవుదురని నామముయొక్క అర్థము.

17) శ్లోకము
ఉపేంద్రో వామనః ప్రాంశురమోఘః శుచిరూర్జితః !
అతీంద్రః సంగ్రహః సర్గోధృతాత్మా నియమోయమః !!
ఈ శ్లోకము ద్వాదశ నామములతో వెలయుౘున్నది.
151) ఉపేంద్రః ఓం ఉపేంద్రాయనమః
1) ఇంద్రునకు తమ్ముడగుటచేత. "ఉపేంద్రః" అనబడును. ఇంద్రుని తల్లియగు "అదితి" కి జన్మించినవాడగుటచేత "ఉపేంద్రః" అని పురాణప్రసిద్ధి.
2) "ఉప" అను పదమునకు "పైన" అను అర్థము చెప్పబడును. ఈ అర్థముతో సమన్వయించినచో "ఇంద్రుని కంటే పైన ఉండువాడు " " ఇంద్రుని కంటే అధికుడు " = ఉపేంద్రః యని కీర్తింప బడును.
3) " ఓ కృష్ణా నీవు గోవులకు ఈశ్వరుండవగుటచేత" "ఇంద్రుడవు" గా విలసిల్లితివి. ఈ కారణంగా దేవతలు నిన్ను "ఉపేంద్రః" అని పిలుతురు" అని హరివంశమునందు వర్ణింపబడి యున్నందున శ్రీహరి ఉపేమద్రు అనబడుౘున్నాడు. (హరివంశము 76_47).
4). ఇక ఈనామము వేదాంతపరముగా అన్వయించినచో, ఇంద్రుడనగా ఇంద్రియములకు అధిపతియగు " మనస్సు " అని అర్థము. "ఉప" అను పదముచేత మనస్సుకంటెను మిక్కిలినేని పైగా నున్నది. అనగా మనస్సు కంటెను శ్రేష్ఠమైనది ఆత్మ అగునుకదా! శరీరము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి సర్వమును ఆత్మచేతనే చైతన్యము బొందుౘున్నవని ఉపనిషద్వాక్యము
కనుక భగవానుడు "ఉపేంద్రః" అనబడుౘున్నాడు.
152) వామనః ఓం వామనాయనమః
1) శ్రీ మహావిష్ణువు తన ఐదవ అవతారమున పొట్టివాడై బలిచక్రవర్తిని యాచించి మూడడుగులతో ముల్లోకములను ఆక్రమించిన పౌరాణికగాథ ఈ నామము చేత స్మరణీయమగును.
2) ౘక్కగా ఊహింౘదగిన వాడగుటచేత "వామనుడు" అనబడు ౘున్నాడు . "మధ్యే వామన మాసీనం విశ్వేదేవా ఉపాసతే". హృదయకమలము యొక్క మధ్య భాగమున విలసిల్లుౘున్న వామనుని సకలదేవతలును ఉపాసింౘు ౘున్నారు (కఠోపనిషత్తు 3_5).
" సర్వస్యచాహం హృదిసన్నివిష్టః" (గీత 15_15) అను గీతావాక్యము స్మరణీయము.

No comments:
Post a Comment