Sunday, 9 September 2018

01--102

ఓం శ్రీ రాం ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం 
ప్రాంజలి ప్రభ -  శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర భాష్యం  -1
సర్వేజన సుఖినోభవంతు

ఎందరో మహానుభావులు అందరికి వందనములు (3)
ప్రాంజలి ప్రభను ఆదరిస్తున్నవారికి మరియు ప్రపంచ తెలుగు ప్రజలందరికి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర భాష్యంను వ్రాసి ఇందు పొందు పరుస్తున్నాను . 
ఇట్లు మీ విధేయుడు మల్లాప్రగడ రామకృష్ణ 
  
శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రమ్

( సంగ్రహ తాత్పర్య వివరణము)
(31_7_2018)
శ్లోకం

1) శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్ !
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే!!

స్వచ్చములగు తెల్లని వస్త్రములను ధరించిన వాడునూ, అంతటనూ వ్యాపించియున్న వాడునూ, చంద్రుని వంటి మనోహరమగు శోభతో కూడినవాడునూ, నాలుగు బాహువులతో నొప్పు వాడునూ, మంగళకరమగు నవ్వు మొగముతో ప్రకాశింౘు వాడునూయగు విఘ్నేశ్వరుని సర్వ విఘ్నముల నివారణార్థమై ధ్యానింౘవలెను.

2) వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్ర మకల్మషమ్
పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్!!

పరమపవిత్ర మూర్తియగు వసిష్ఠమహర్షి యొక్క మునిమనుమడునూ, మహాపురుషుడగు పరాశరుని ప్రియనందనుండునూ, జ్ఞనసాగరుండగు శుకదేవుని తండ్రియునగు వ్యాస భగవానునకు వందనములు.

3) అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మ నే
సదైక రూప రూపాయ విష్ణవే ప్రభవిష్ణవే !!

జననమరణాది షడ్భావవికార శూన్యుండు పరమపవిత్రుండునూ నిర్మల నిత్య స్వరూపుండునూ, పరబ్రహ్మము సచ్చిదానంద స్వరూపుండునూ, మంగళమహనీయ దివ్య స్వరూపుండునూ నగు శ్రీ విష్ణు భగవానునకు ప్రణామములు.

4) యస్య స్మరణ మాత్రేణ జన్మసంసార బంధనాత్
విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభవిష్ణవే ఓం నమో విష్ణవే ప్రభవిష్ణవే

ఏ మహనీయుని స్మరణచింతన కీర్తన మాత్రము చేతనే , జననమరణ క్లేశములతో కూడిన భయంకరమైన సంసార మహాబంధనము లన్నియునూ సమసిపోవునో , అటువంటి
సర్వాంతర్యామి అయిన శ్రీ విష్ణు భగవానునకు వినయపూర్వకము
గా నమస్కరింౘు ౘున్నాను.

--((**))--

పూర్వపీఠిక

శ్రీ వైశంపాయన ఉవాచ:-
శ్లోకం:

1) శ్రుత్వా ధర్మానశేషేణ పావనానిచ సర్వశః
యుధిష్ఠిర శ్శాంతనవం పునరేవాభ్యభాషత!!

వైశంపాయనమహర్షి జనమేజయ మహారాజుతో  నీ రీతిగా పలుకుౘున్నాడు.
అభ్యుదయ పరంపరలను గలిగింౘుౘు, మోక్షప్రదములను ధర్మములను పాప భంజనములగు ధర్మరహస్యములను - అంపశయ్య పై పరుండి ప్రబోధము చేయుౘున్నపరమశాంత గంభీరమూర్తి జ్ఞానసాగరుండగు భీష్మపితామహుని తో ధర్మజిజ్ఞాసువగు యుధిష్ఠిరుండిట్లు ప్రశ్నింౘుౘున్నాడు. సర్వ ధర్మనిధియగు భీష్మపితామహుడు ఎన్నెన్నియో ధర్మములు - ధర్మసూక్ష్మములు అనుష్టానములు- మున్నగునవి తెలిపియున్నాడే గాని, సకల పురుషార్థ సాధనమై - మిక్కిలి తక్కువ ప్రయాసతో, అనంతమగు మహాఫలమును, మిక్కిలి తేలికగా, సుఖంగా బొందునట్టి విషయమును గూర్చి యింతవఱకునూ చెప్పియుండ లేదే - యని సంశయించి - ధర్మరాజు ఈదిగువ నుదాహరించిన ఆరు ప్రశ్న లను గూర్చి భీష్ములవారితో పలుకుౘున్నాడు.

-ఇంకావుంది -

ధ్యానమ్

శ్లోకం:-

1) క్షీరోదన్వత్ప్రదేశే శుచిమణి విలసత్సైకతే మౌక్తికానాం
మాలాక్లుప్తాసనస్థః స్పటికమణి నిభైర్మౌక్తికై ర్మండితాంగః !
శుభ్రైరభ్రైరదభ్రై రుపరివిరచితైర్ముక్త పీయూష వర్షై
రానందీ నః పునీయాదరి నలిన గదా శంఖపాణిర్ముకుందః !!

పవిత్రమైన క్షీరసాగరమున--- స్వచ్ఛములగు వివిధ మణిసమూహముల దివ్య కాంతులచేత ప్రకాశింౘు ౘున్న ఇసుకతిన్నె పైని----- ముత్యముల మాలలతో పొదగబడి శోభాయమానముగా నలంకరింపబడి యున్న దివ్యసింహాసనము నందున్నవాడై -- స్పటిక మణికోటి దివ్యప్రకాశము లతో కూడిన మణిహారములతో నలంకరింపబడి యున్న అవయవములతో శోభిల్లుౘు -- స్వచ్ఛము లగు మేఘములు అమృతవర్షము కురిపింౘుౘుండగా --- దివ్యానందమూర్తియై -- శంఖ,చక్ర‌,గదా పద్మముల ధరించి ---ప్రకాశింౘుౘున్న కల్యణమూర్తి యగు ముకుందుడు మనలను పవిత్రుల గావింౘు గాక!

2) భూఃపాదౌ యస్యనాభిర్వియదసురనిలశ్చంద్రసూర్యౌచనేత్రే
కర్ణావాశాశ్శిరోద్యౌర్ముఖమపి దహనోయస్యవాస్తోయమబ్ధిః!
అంతస్థ్సంయస్య విశ్వం సురనరఖగగోభోగిగంధర్వదైత్యైః
చిత్రం రంరమ్యతే తం త్రిభువనవపుషం విష్ణుమీశం నమామి!!

ఏ మహాత్మునమఱియునుపాదములో -- ఆకాశము నాభియో వాయువే ప్రాణమో -- చంద్రసూర్యులే నేత్రములో -- దిక్కులే చెవులో స్వర్గమే శిరస్సో -- అగ్నియే ముఖమో- సముద్రమే దివ్యమందిరమో -- మఱియును_ ఏమహామూర్తి యందు భాసిల్లు ౘున్న అనంతవిశ్వము దేవతలు ,నరులు,పక్షులు, గోవులు, సర్పములు గంధర్వులు,దైత్యులు మున్నగు వారితో ఆయా లోకము లతో గూడి చిత్ర విచిత్రముగా, శోభిల్లుౘున్నదో_ మఱియు నెవ్వాడు మూడులోకములనూ తన శరీరముగా గలిగి యున్నాడో-- అట్టి సర్వవ్యాపియూ, సర్వేశ్వరుడు నూ--నగు నా సచ్చిదానంద పరబ్రహ్మమును నమస్కరింౘుౘున్నాను.

3) శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం
విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగమ్!
లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్ధ్యానగమ్యం
వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథమ్ !!

పరమశాంతి స్వరూపుండునూ, శేషశాయియునూ పద్మము నాభియందు విలసిల్లినవాడునూ, సర్వదేవతా చక్రవర్తి యునూ, సమస్త సృష్టికిని ఆధారభూతుండునూ, సర్వవ్యాపి యయ్యునూ నిస్సంగుడునూ, శ్యామసుందరుడునూ, సకల మంగళ సుందరాంగ శోభితుండునూ, లక్ష్మీపతియు, పద్మనేత్రుండునూ, యోగిపుంగవుల హృదయపద్మముల విరాజిల్లు వాడునూ,  జన్మమరణ జరావ్యాధి భయములను పోగొట్టువాడునూ, సర్వలోకైక చక్రవర్తి యునూ నగు శ్రీవిష్ణుభగవానునకు వినయపూర్వకము గా నమస్కరింౘుౘున్నాను.

4) మేఘశ్యామం పీతకౌశేయవాసః
శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగమ్ !
పుణ్యోపేతం పుండరీకాయతాక్షం
విష్ణుం వందే సర్వలోకైకనాథమ్ !!

మేఘమువలె శ్యామల వర్ణముతో భాసిల్లు వాడునూ పీతాంబర ధారియునూ, శ్రీవత్సలాంఛనముతో వెలయువాడునూ, కౌస్తుభమాణిక్యము యొక్క దివ్యకాంతి పుంజములతో వెలుగు వాడునూ, పుణ్యమూర్తియునూ, తామర రేకులవలె విశాలమగు నేత్రములతో నొప్పువాడునూ, సర్వ లోకేశ్వరేశ్వరుండునూ అయిన శ్రీవిష్ణుభగవానుని హృదయపూర్వకముగా ధ్యానింౘుౘున్నాను.

5) సశంఖచక్రం సకిరీటకుండలం
సపీతవస్త్రం సరసీరుహేక్షణం!
సహారవక్షస్థ్సల శోభికౌస్తుభం
నమామి విష్ణుం శిరసాచతుర్భుజమ్ !!

శంఖచక్రముల ధరించినవాడునూ, కిరీటకుండల భూషితుండునూ, పీతాంబర ధారియునూ, తామరరేకులవంటి సుందరనేత్రములు గలవాడునూ, వక్షస్థలమునందు కౌస్తుభ మణిహారాది శోభితుండునూ అగు శ్రీ మహావిష్ణువునకు శిరస్సు వంచి వినయపూర్వకము గా నమస్కరింౘు ౘున్నాను.
--((**))--

విష్ణు సహస్రనామ ప్రారంభము
హరిః ಓమ్

1) శ్లోకం

విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్య భవత్ప్రభుః!
భూతకృద్భూత భృద్భావో భూతాత్మా భూతభావనః !!

ఈ పుణ్యశ్లోకమునందు శ్రీ మహావిష్ణువు తొమ్మిది ప్రసిద్ధ నామములతో గానము చేయబడుౘున్నాడు.

ఈ స్తవరాజము "ಓమ్" అను పవిత్రాక్షర ముతో ప్రారంభమగుౘున్నది. ఓం కారము మంగళ ప్రదము పవత్రమును అగుటచేత ఆరంభమున అంతముననూ ఈ దివ్య మంత్రము గానము చేయబడును. ఇది ప్రణవమని పిలువబడును.

"ఓం". అను మంత్రముతో భగవానుని ఉపాసింౘువాడు ముక్తిని బొందునని ప్రశ్నోపనిషత్తు తెలుపుౘున్నది

" ఓమిత్యేకాక్షరమిదగ్ం సర్వం" అని మాండుక్యోపనిషత్తు గానము చేయును.

" ఓం తత్బ్రహ్మ-- ఓంతద్వాయుః-- ఓంతదాత్మా-- ఓంతత్సత్యం-- ఓంతత్సర్వం ". అని నారాయ ణోపనిషత్తు గానము చేయుౘున్నది.

" ಓమిత్యే కాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్"
యః ప్రయాతి త్యజన్ దేహం సయాతిపరమాగతిమ్"

" ఎవ్వడు ఓంకారము నుచ్ఛరింౘుౘు దేహత్యాగము చేయునో వాడు పరమగతిని బొందును" అను గీతావాక్యము స్మరణీయము. (గీత అ_8 శ్లో. 11)

"ప్రణవః సర్వవేదేషు" సర్వవేదసారము ప్రణవమై యున్నది. (గీత అ 7_శ్లో 8)

"గిరామస్మ్యేక మక్షరం" వాక్కులయందు నేన ఓంకారమై యున్నాను (గీత అ10_25)


"ఓం_అథ". అను ఈ రెండు శబ్దములును సృష్టి ప్రారంభమున బ్రహ్మ దేవుని కంఠము నుండి ఆవిర్భవించిన మంగళ శబ్దములని శ్రుతి గానము చేయును. కావున మంగళప్రదమగు ఓంకార పుణ్య శబ్దముతో మంగళప్రదమగు ఈ స్తవరాజము ప్రారంభమగుౘున్నది.

తస్యవాచకఃప్రణవః _ భగవానుని నామముగా ప్రణవమని పతంజలి మహర్షి తెలిపి యున్నాడు. " ఓం " అనునది భగవానుని నామముగా గీతాశాస్త్రమున(అ 17_23) తెలుపబడి యున్నది. "ఓం" అని పిలిచినౘో "ఓ". యని భగవానుడు పలుకు నని భక్తులయొక్క విశ్వాసము కనుకనే "ఓం" అను దివ్య నామము తో ఈ స్తవరాజము మంగళకరముగా ప్రారంభమగుౘున్నది.

1. విశ్వమ్ ఓం విశ్వాయనమః

ఈ స్తవరాజము యొక్క ప్రారంభ శ్లోకములోని ప్రథమ భగవన్నామము " విశ్వమ్ ".అని గానము చేయబడుౘున్నది. విశ్వమనగా ప్రపంచమని యర్థము. నామరూపాత్మకమై_ చిత్రాతి చిత్రమై_ వికసించి, విస్తరించి, విరాజిల్లుౘు గానవచ్చుౘున్న సర్వ ప్రపంచమునకును పరబ్రహ్మమే మూలకారణ మగుటచేత "విశ్వమ్" అను నామముతో భగవానుడు గానము చేయబడుౘున్నాడు.

"బ్రహ్మైవేదం విశ్వమిదం వరిష్ఠం పురుష ఏ వేదం విశ్వమ్"_


ఈ విశ్వము పరబ్రహ్మమే ఈ విశ్వము పురుషుడే" అని శృతి గానము చేయుౘున్నది.

" విశతీతి విశ్వం బ్రహ్మ " అనగా భగవానుడీ విశ్వమును సృజించి దానియందలి అణువణువు నందునూ ఆయనయే వ్యాపించి వున్నాడని శృతివాక్యము స్మరణీయము. "
 హరిమయము విశ్వమంతయు_హరివిశ్వమయుండు_సంశయిందర్శింౘదు_హరిమయముగాని వస్తువు పరమాణువు లేదు". అని భాగవతము గానము చేయుౘున్నది. ఈ విశ్వమంతయు భగవానుని విరాట్ స్వరూపమేయని గీతాచార్యుడు గానము చేసెను.

"మత్తః పరతరంనాన్యత్ కించిదస్తి ధనంజయ" (గీత_7_శ్లో7)

విశ్వమందుగల అన్నింటియందు విశ్వేశ్వరుని దర్శింౘుటయే మహాజ్ఞానము.

"వాసుదేవస్సర్వమితి సమహాత్మాసుదుర్లభః".

సర్వమునందును వాసుదేవుడే నిండియున్నాడని గ్రహింౘు జ్ఞాని సుదుర్లభుడు 

(గీత_7_ శ్లో_19) సకల భూతములయందునూ నారాయణుని దర్శింౘుటయే " భక్తి " అదియే మహాజ్ఞానము_

అదయే యోగము అని శాస్త్ర వాక్యము. అట్టి మహాజ్ఞాన ప్రాప్తియే ఈ స్తవరాజము యొక్క పరమలక్ష్య మగుటచేత. " విశ్వమ్ " అను సుప్రసిద్ధ మహానామముతో శ్రీ హరి గానము చేయ బడుౘున్నాడు. విశ్వమందెల్లనూ విశ్వేశ్వర దర్శనమే మహా తపస్సు. ఈ పవిత్రసాధనమును ఈ నామము సాధకులకు బోధింౘుౘున్నది. రామ భక్తుడు విశ్వమందన్ని రూపములయందునూ రామునే దర్శింౘ వలయును. ఇదియే భక్తి సాధన ఈనామము జ్ఞానికిని భక్తునకునూ గూడా ఉపాసనా విధానమును సూచింౘుౘున్నది.
--((**))--


2) విష్ణుః ఓం విష్ణవేనమః 

"అంతటనూ వ్యాపించియున్న వాడని". ఈ నామముయొక్క 
తాత్పర్యము. 

"వేవేష్టి వ్యాప్నోతి ఇతివిష్ణుః" 
సర్వవ్యాపకమూ, దేశకాల వస్తుపరిచ్ఛేద శూన్యమునూ అగు మహాస్వరూపము స్వామిదని దీనిభావము. 

" ఈశావాస్యమిదంసర్వం ". సమస్తమునూ ఈశ్వరునిచేతనే ఆచ్ఛాదింప బడియున్నదని ఈశావాస్యోపనిషత్తు గానము చేయును. 

"విశ్" అనగా "ప్రవేశింౘుట" అని అర్థము. పరమాత్మయొక్కశక్తి విశ్వమందు ప్రతి అణువునందునూ ప్రతిష్ఠితమై యున్నదని భావము. 


తొలినామము వలెనే ఈ నామముగూడా " ఆత్మసర్వగతము ". అను భావమునే వ్యక్తీకరింౘుౘూ సాధకులను సర్వప్రపంచము నందునూ ఆత్మతత్వమును గుర్తెరుంగుటకు ప్రోత్సహింౘు ౘున్నది. 


" యచ్చకించిత్ జగత్సర్వం దృశ్యతే శ్రూయతే పివా 

అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్యనారాయణః స్థితః" 

నయనేంద్రియ, శ్రవణేంద్రియ గోచరమగు సకల ప్రపంచము నందునూ _ లోపలను వెలుపలను వ్యాపించి యున్న వాడు నారాయణుడే యని శ్రుతిగానము చేయుౘున్నందున సర్వవ్యాపక పరబ్రహ్మము " విష్ణుః " అను నామముతో గానము చేయబడుౘున్నది. అణువణువు లోనూ పరమాత్మ విరాజిల్లు ౘున్నాడను దివ్యభావన కలిగిన సాధకుడు ఇక అధర్మ మార్గంలో 
ప్రవేశింపనే లేడు. అతడు ధర్మాత్ముడు_యోగి_భక్తుడు_జ్ఞాని. ఈనామోపాసన మట్టి దివ్యశక్తిని ప్రసాదింౘును. 

3) వషట్కారః ఓం వషట్కారాయనమః 

ఇది వేదోక్తమగు పుణ్యనామము. వేదోక్తములగు యజ్ఞములను యథావిధి గా నాచరింౘు నపుడు " వషట్ " అను మంత్రముతో హోమము గావింపబడును. " వషట్ " క్రియను ఎవ్వరినుద్దేశించి చేయబడుౘున్నదో అట్టి భగవత్స్వరూపము " వషట్కార " మనబడును. ఈ కారణము చేత యజ్ఞస్వరూపుడైన పరమాత్మ  " వషట్కారః" అను దివ్యనామముతో గానము చేయబడుౘున్నాడు. 

యజ్ఞోవై విష్ణుః, భగవానుడు యజ్ఞస్వరూపుడు యజ్ఞములద్వారా ఉపాసింప బడు వాడు. యజ్ఞములనగా పరమేశ్వరుని ప్రీతి కొఱకు, విశ్వశ్రేయస్సుకొఱకు, పరోపకారార్థము గా నిష్కామ కర్మానుష్ఠానముగా చేయబడు పుణ్యకర్మలు లేక సేవా కార్యక్రమములు. భగవత్ప్రాప్తికి నిష్కామ కర్మానుష్ఠానము ముఖ్యసాధన మగుటచే ఈ పవిత్రనామము జిజ్ఞాసువులకు యజ్ఞాచరణమును ( అనగా నిష్కామ కర్మానుష్ఠాన పూర్వక పుణ్య కర్మలను) ప్రోత్సహింౘుౘున్నది.

4) భూతభవ్యభవత్ప్రభుః ఓం భూతభవ్యభవత్ప్రభ వేనమః

" త్రికాలమునకు అధిపతి" అని ఈ నామముయొక్క తాత్పర్యము. కాలములుమూడు.  భూతకాలము, వర్తమానకాలము, భవిష్యత్కాలము _ ఈ కాలత్రయమునకు అధీశ్వరుడైన వాడు పరమేశ్వరుడే. ఆయన కాలస్వరూపుడు_కాలాతీతుడు, కాలచక్రమును భ్రమణము చేయువాడు పరమాత్మ యే . కావున కాలము నారాధింౘుటయే భగవదారాధనము. అహమేవాక్షయఃకాలః: అక్షయమగు కాలము నేనే. అను గీతా వాక్యము స్మరణీయము. కాలమును వృథాసేయక భగవదారాధన రూపమగు పుణ్యకార్యములలో వినియోగింపుమని ఈ నామము యొక్క ప్రబోధము. 

" కాలఃక్రీడతి గచ్ఛత్యాయుః తదపినముంచతి ఆశావాయుః 

భజగోవిందం భజగోవిందం గోవిందం భజమూఢమతే". యని శంకరాచార్యులవారి దివ్య గానమును స్మరింపవలయును. సూర్యోదయ సూర్యాస్తమయాలు జరిగిపోవుౘున్నవి. రాత్రింబవళ్ళు పరుగెత్తుౘున్నవి. ఋతువులు త్వరత్వరగా పరుగెత్తుౘున్నవి. కాలమను వేశ్యాంగన ఈ రీతిగా నృత్యము చేయుౘండగా మానవుని ఆయుర్దాయమంతయు నశించి పోవుౘున్నది. కానీ అతనికి విషయభోగలాలసత్వము నశింౘుట లేదు. కావున ಓ మూఢుడా గోవింద భజనము గావింౘుౘు కాలమును సద్వినియోగము చేయుమని శ్రీ శంకరుల ప్రబోధము. కావుననే భగవానుడు భూత భవ్యభవత్ప్రభుః " అని స్తవనీయుడగుౘున్నాడు. 

5) భూతకృత్ ఓం భూతకృతేనమః

ఈ నామమునకు రెండు అర్థములు గలవు.

1) భూతములను సృష్టింౘువాడు 2) భూతములను నాశనము చేయువాడు. రజోగుణము నాశ్రయించి చతుర్ముఖ బ్రహ్మ రూపమున సకల ప్రాణులను సృజింౘువాడు మహావిష్ణువేయగును ( భూత=ప్రాణులను, కృత్=సృష్టింౘువాడు). తమోగుణము నాశ్రయించి రుద్రరూపమున సకలప్రాణులను సంహరింౘువాడు కూడ ఆ భగవానుడే ( భూతాని = ప్రాణులను, కృన్తతి = నాశనము చేయును). కనుక భూతకృత్ అను దివ్యనామముతో స్తవనీయు డగుౘున్నాడు. అట్టి సర్వశక్తి స్వరూపుడగు పరమాత్మను ధ్యానింౘుమని సాధకునకు తెలుపును.

6) భూతభృత్ ఓం భూతభృతేనమః

ప్రాణులను పోషింౘువాడని ఈ నామముయొక్క తాత్పర్యము. " గామా విశ్వచ భూతాని ధారయామ్యహ మోజసా పుష్ణామి చౌషధీః సర్వాః సోమోభూత్వారసాత్మకః " అని గీతా వాక్యము స్మరణీయము. ( అ_15_శ్లోకం_13).

నేను భూమినాశ్రయించి యుండి సమస్త భూతములను ధారణ చేయుౘున్నాను. మఱియు రసాత్మకుండగు చంద్రుడనై సకల సస్యములను పండింౘుౘు భూతములను పోషింౘు ౘున్నాను, అని గీతాచార్యుని దివ్యవాణి. సత్త్వగుణము నాశ్రయించి సకలప్రాణి కోటులను, పోషించి, రక్షించి,కాపాడువాడు శ్రీహరియే యగుటచేత. " భూతభృత్ " అను భగవానుడు కీర్తనీయుడగు ౘున్నాడు అట్టి పరమాత్మనాశ్రయింౘుట యే మానవుని ధర్మము.

7). భావః ఓం భావాయనమః

" భవతి " ఇతిభావః. ఉనికియై యున్నవాడనిదీని భావార్థము . నామ రూపాత్మకమైన చరాచరాత్మక మగు నీయనంత. విశ్వమందంతటనూ విస్తరించి, విరాజిల్లు నది. శాశ్వత మగు " ఆత్మ " యొక్కటి యే యగుటచే భగవానుడు భావః అను పుణ్యనామము న ప్రసిద్దుడగుౘున్నాడు. 

" యస్స సర్వేషు భూతేషు నశ్యత్సున న వినశ్యతి "(గీతా8_20)

సకల భూతజాలములూ నశించిననూ నాశనము లేనట్టిది ఆత్మయొక్కటియే యని భావము.

8) భూతాత్మా ఓం భూతాత్మనేనమః

సకల భూతములకు ఆత్మయైయున్న వాడని ఈ నామము యొక్క భావము. ప్రతివానియందు ఆత్మకలదు. తాను నశింౘునట్టి శరీరము కాదనియు, నాశనరహితమగు " ఆత్మ " యనియు, భావించి, చింతించి, ధ్యానించి మానవుడు కృతకృత్యుడు గావలయును. ఈ మహా సందేశమునిచ్చు
పుణ్యనామమే " భూతాత్మా " యని శ్రీహరి గానము చేయబడెను.

9) భూతభావనః ఓం భూతబబావనాయనమః

" సకల బూతకోటులనూ సృష్టించి పోషింౘు వాడని"
ఈ నామముయొక్క తాత్పర్యము. మానవుడు అహంకరించి తనవల్లనే సృష్టి కలుగుౘున్న దనియును. తానే తన పురుషకార ప్రయోజనముల చేత వృద్ధి ని పొందుౘున్నాననియును భావింౘును కానీ ఇది సత్యము కాదు. ఈశ్వరుడే సృష్టి కి మూలముగానీ స్త్రీ పురుష సమాగమము కాదు. భగవంతుడే పోషణకర్త గాని మానవుడు గాదు. కావున. ఈ పరమసత్యమును బోధించు
దివ్యనామముతో శ్రీహరి కీర్తనీయుడగుౘున్నాడు.

--((**))--

2) శ్లోకం

పూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతిః!
అవ్యయః పురుష స్సాక్షీ క్షేత్రజ్ఞో క్షర ఏవచ !!

ఈ పవిత్ర శ్లోకమునందు శ్రీహరి ఎనిమిది పుణ్యనామము లతో కీర్తనీయుడగుౘున్నాడు.

10) పూతాత్మా ఓం పూతాత్మనేనమః

" పవిత్రమగు ఆత్మస్వరూపుడని " ఈ నామముయొక్క భావార్థము. ఆత్మనిర్లిప్తము, నిర్గుణము, నిస్సంగము, శుద్ధము, పరమ పవిత్రమునై యున్నది. మాయా ప్రభావరహితమయినది. మాలిన్యములు వికారము లేనిది. కావున భగవానుడు "పూతాత్మా" అని కీర్తనీయుడగుౘున్నాడు. సాధకుడు తన మనస్సును ప్రశాంతము, ప్రసన్నము గావింౘుకొనవలెను. ఈర్ష్యాద్వేషములు
కామక్రోధాది మాలిన్యములు లేకుండా సాధనము చేసికొన్నౘో అతడు పూతాత్ముడు కాగలడని ఈనామము మనకు ప్రబోధింౘుౘున్నది. 

" నిర్దోషం హి సమం బ్రహ్మ_తస్మాత్ బ్రహ్మణి తేస్థితాః " (గీత 5_19) 

పరబ్రహ్మము దోషరహితమైనది. సమత్వమునందుండినది కనుక ఇట్టి గుణములుగలవారు పరబ్రహ్మమునందున్నవారే యగుదురని గీతాచార్యుడు వచించెను.

11) పరమాత్మా ఓం పరమాత్మనేనమః

కార్యకారణములకు విలక్షణమైన వాడునూ, నిత్య, శుద్ధ,బుద్ధ ముక్తస్వరూపుడు, స్థూల, సూక్ష్మ లింగములకతీతుడునూ,సమస్త చైతన్య భాండారమును నగుటచేత శ్రీహరి "పరమాత్మ"
యని గానము చేయబడును. ఆయన చైతన్యము చేతనే సమస్తమునూ చైతన్యవంతమగుౘున్నది. అట్టి ఆత్మస్వరూపుడేజీవుడైయున్నాడు. కానీ మాయయొక్క ఆవరణముచేతనూ
విషయాభిలాషల చేతనూ _ వాంఛాసహస్రపాశముల చేతనూౘుట్టబడి మాలిన్యమును చెందుౘున్నాడు.

వివేక. విచారణాదుల చేతనూ, భక్తిజ్ఞాన యోగసాధనలచేత మాయావరణాదులను తొలగింౘు కొన్నచో, జీవుడుపరమాత్మ యే యగునని ఈ నామము బోధింౘును.

12) ముక్తానాం పరమాగతిః ఓం ముక్తానాం పరమగతయేనమః 

‌ ముక్తులైన మహనీయులకు పరమాశ్రయమైన వాడు భగవానుడేయని ఈనామము యొక్క భావార్థము. ముక్తులనగా నెవరు ?

శ్లోకం 
నిర్మానమోహాః జితసంగదోషాః అధ్యాత్మనిత్యాఃవినివృత్తకామాః 
ద్వంద్వైర్విముక్తాః సుఖదుఃఖ సంజ్ఞైఃగచ్ఛంత్యమూఢాఃపదమవ్య యంతత్!! (గీత 15_5) 

అహంకారము ను మోహమును విడిచి పెట్టినవారు, సంగదోషములను వదలినవారు, నిరంతరమూ పరమాత్మ యొక్క దివ్య భావన కలిగియున్న వారు, వాంఛారహితులు, సుఖదుఃఖాలు మానావ మానములు మున్నగు ద్వంద్వములు లేనివారు. ఇట్టి వారే ముక్తులు వీరే అమూఢులు. ఇట్టివారే పరమగతిని బొందుదురని భావము. కావున మానవులు పైన వివరించిన సాధనలు చేయ 
వలయును. 

" ఎవ్వరు మరణకాలమున నన్ను స్మరింతురో వారునూ పరమపదమును చెందుదురు". అని గీతాచార్యుని వాక్యము (గీత అ 8_5). 

" యద్గత్వా న నివర్తంతే తద్దామ పరమంమమ" (గీత అ_15_6). 
ఆ పరమధామమును బొందినవారికి మరలా జన్మము లేదని గీతావాణి. 

13) అవ్యయః ఓం అవ్యయాయనమః 

"వ్యయ" మనగా నాశనము. అవ్యయుడనగా నాశనములేనివాడని భావము. అనగా షడ్వికార రహితుడని భావము. షడ్వికార ములనగా 1) ఒకప్పుడుండుట 2). పుట్టుట 3) పెరుగుట 4) మార్పుచెందుట 5) క్షీణింౘుట 6) నశింౘుట. ఈ యారు గుణములును లేనివాడే పరమాత్మ యగుటచేత " అవ్యయః" అను నామముచేత స్తవనీయుడగుౘున్నాడు. 

శరీరము వ్యయమగునది , కానీ అంతటా నున్న ఆత్మ అవ్యయమైనది. శరీరము నశించిననూ శరీరి "ఆత్మ" నశింపదు. కాన. ఆత్మ అవ్యయము. ఇట్టి ఆత్మభావమును నిరంతరమూ చేయువాడే అవ్యయుండగు నని ఈ నామము సందేశమిౘ్చును. 

14) పురుషః ఓం పురుషాయనమః 

" శరీరమను పురమునందున్న వాడగుటచేత. ఆత్మ " పురుషః". అని పిలువబడును. ఈ శరీరమును నవద్వారములు గల పురముగా గీతాశాస్త్రము వర్ణించినది. ( అ_ 5_13). కంటి ద్వారములు రెండు ముక్కు ద్వారములు రెండు, శ్రవణేంద్రియ ద్వారములు రెండు, నోటిద్వారమొకటి, మలద్వారమొకటి, మూత్రద్వారం మరియొకటి మొత్తం తొమ్మిది ద్వారములు గల శరీరమను పురములో నఖశిఖపర్యంతమూ వ్యాపించి యున్నవాడే పురుషుడు. పురిశేతే ఇతిపురుషః.
 " పురా ఆసీత్ ఇతిపురుషః" 
సకల భూతములు జన్మింౘుటకు పూర్వమే యున్న వాడగుటచేత 
పురుషు" డని ‌చెప్పబడుౘున్నాడు. 

" పూరయతి ఇతిపురుషః". ఎవ్వనిచేత జగత్తు 

పరిపూర్తిని బొందుౘున్నదో అతడే పురుషుడనియును చెప్పబడు ౘున్నాడు. అయ్యది ఆత్మయేగదా  కనుక ఆత్మ లేనిదే పరిపూర్ణ మేదియునూ గాజాలదు. అట్టి పురుషుడు తానేయని సాధన చేయవలయును.
--౦౦-- 

2) శ్లోకం

పూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతిః!
అవ్యయః పురుష స్సాక్షీ క్షేత్రజ్ఞో క్షర ఏవచ !!

15) సాక్షీ ఓం సాక్షిణేనమః

సర్వమునూ ౘూౘుౘుండు వాడని భావము. భగవానుడు ప్రతి మానవుని హృదయక్షేత్రము నందుందురు. అందు జరుగుతున్న శారీరక, మానసిక, కాయిక సకల కార్యకలాపములను
ౘూౘుౘుండు ను. సూర్యుడు అన్ని వస్తువుల యందునూ ౘక్కగా ప్రకాశింౘుౘున్ననూ ఆయా వస్తువుల గుణదోషములతో సంబంధము లేని వాడయినట్లు ఆత్మ సర్వమునూ ౘూౘుౘున్ననూ
ఆయా కర్మల గుణదోషములతో సంబంధము లేకయే యుండును. కనుక ఆత్మసాక్షియని చెప్పబడును.

ధర్మమార్గమున ప్రవర్తింపవలెనని ఈ నామము బోధింౘుౘున్నది. ఇతరులెవ్వరూ ౘూౘుటలేదని ధర్మవిరుద్ధ కార్యములలో రహస్య ముగా ప్రవర్తింౘుౘున్ననూ ఆత్మసాక్షియై
సర్వమునూ గ్రహింౘుౘునే యున్నదను జ్ఞానముగలిగి ప్రవర్తింపవలెనని ఈ నామముయొక్క ప్రబోధమైయున్నది.

16) క్షేత్రజ్ఞః ఓం క్షేత్రజ్ఞాయనమః

ఈ శరీరమునకు క్షేత్రమని పేరు. (గీత అ13_2)

ఈ శరీరము శుభాశుభ కర్మములవలన కలుగుౘున్న ది. ప్రతి క్షేత్రమునందునూ క్షేత్రజ్ఞుడగు పరమాత్మ విలసిల్లుౘుండును. (గీత 13_2)

 క్షేత్ర ములు నశింౘుౘున్ననూ క్షేత్రజ్ఞుడు నశింపడు. క్షేత్రమునకు క్షేత్రజ్ఞునకు గల భేదములను గుర్తించి గ్రహింౘుటయే జ్ఞానమని చెప్పబడును (గీత అ13_3)

క్షేత్రజ్ఞుడగు పరమాత్మ ను గుర్తింౘుటయే జీవిత పరమలక్ష్యము. ఈ లక్ష్యసాధనమునే ఈ
నామము బోధింౘుౘున్నది.

17) అక్షరః ఓం అక్షరాయనమః

అక్షరుడనగా నాశనములేని పరమాత్మ యని భావము. సర్వమునూ నశించిననూ నాశనము లేనిది పరబ్రహ్మము అక్షరంబ్రహ్మ పరమం అని గీతావచనము. (అ 8_3)

శ్లోకం:-

నైనం ఛిందంతి శస్త్రాణి నైనందహతి పావకః !
న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః !!

ఆత్మ శస్త్రములచేత ఛేదింపబడునది కాదు అగ్నిచేత దహింపబడునది కాదు. జలములచేత తడుపబడునది కాదు, వాయువుచేత శోషింపబడునది కాదు. కావున ఆత్మ అక్షరః అను దివ్యనామముతో శ్రీహరి గానముచేయబడును. అట్టి అక్షర పరబ్రహ్మము నీవేయని ఈ నామము మరల బోధింౘుౘున్నది.

ఈ శ్లోకమునందు " ఏవచ " అను పదము ఆ. ప్రయోగములచేత 16వ నామమగు "క్షేత్రజ్ఞుడను" నామమును 17వ. నామమగు " అక్షరుడను" నామము ను రెండునూ ఒక్కటియే యని గ్రహింప వలయును.
--((**))--

హరిః ಓమ్

3) శ్లోకం

యోగో యోగవిదాం నేతా ప్రధాన పురుషేశ్వరః,
నారసింహవపుః శ్రీమాన్ కేశవః పురుషోత్తమః !!

18) యోగః ఓం యోగాయనమః

" యోగ". మనగా కలయిక ( union ) అని అర్థము.
ఇంద్రియములను మనస్సును ౘక్కగా నిగ్రహించి పరమాత్మయందు లగ్నం చేయుటయే యోగమన బడును. జీవిత్మ పరమాత్మ లయొక్క సంయోగమే " యోగము ". కర్మ, భక్తి, జ్ఞాన మార్గము లన్నియునూ ఆత్మపరమాత్మలను కలుపు యోగములే యగుటచేత పరమాత్మ యోగసాధనము చేత పొందబడు వాడు గాన యోగః అను నామముచే జెప్పబడును.

పైన వివరించిన యోగములను ౘక్కగా అనుష్ఠానము చేసి పరమాత్మ ను బొందుమని ఈ నామము మనకు బోధింౘుౘున్నది.

19) యోగవిదాం నేతా ఓం యోగవిదాం నేత్రేనమః

యోగవిదులు అనగా యోగమును బాగుగా నెఱింగినవారు. యోగానుష్ఠానము లందు ౘక్కని యనుభవమును బొందినవారు. నిరంతరమూ భగవంతుని యందే తమ మనస్సును లగ్నం గావించిన మహనీయులు. అట్టి వారి యోగక్షేమములను తానే వహింతునని గీతాచార్యుడు వాగ్దానము చేసినాడు(అ9_22) కావుననే శ్రీహరి యోగవిదాంనేతా అని గానము చేయబడుౘున్నాడు.
నన్ను శరణాగతిని బొందినవారిని మృత్యు, సంసారసాగరము నుండి సముద్ధరణము గావింతునని గీతాచార్యుని వాగ్దానము స్మరణీయము(అ12_7) నీ చిత్తమును నాయందుంచి నీవు నా
యనుగ్రహంచేత సకల కష్టములను తఱించిపోగలవు. అని గీతాచార్యుడు ఆనతిచ్చెను గదా (అ 18_53)

"నమేభక్తఃప్రణశ్యతి".

నా భక్తునకు పతనము లేదని , శ్యామసుందరుని శరణాగతిని బొందినౘో వారికెట్టిభయమునూ లేదని ఈ నామముయొక్క పుణ్యప్రబోధనము.
 --((**))--

20) ప్రధానపురుషేశ్వరః ఓం ప్రధానపురుషేశ్వ రాయనమః

ప్రధాన మను శబ్దమునకు ప్రకృతి లేక మాయ యని యర్థము. పురుషః అను శబ్దమునకు ప్రాణుల యందు గల చైతన్య స్వరూపుడగు జీవుడు అని అర్థము. ఈ రెంటికిని అనగా ప్రకృతి
పురుషులకు అతీతుడైన వాడు పరమాత్మ యగుటచేత ఆయన ప్రధానపురుషేశ్వరః యని గానము చేయబడును.

నశింౘు స్వభావముగలది ప్రకృతి గదా  జీవుడు మాయాబద్దుడు, ప్రకృతితో కూడియున్న వాడగును. కావున త్రిగుణాత్మకమగు మాయను దాటినపుడే జీవుడు పరిశుద్ధుడై ఈశ్వరుడగు ౘున్నాడని భావము.

నన్ను భక్తియోగముతో, శ్రద్ధాభక్తులతో సేవింౘువాడు త్రిగుణాత్మకమగు మాయను దాటిపోయి పరబ్రహ్మ స్వరూపుడగు ౘున్నాడు. అని పార్థసారథియొక్క అనుష్ఠాన వేదాంత వాణి
స్మరణీయము. (అ14_26). ఇదియే ఈ దివ్యనామము బోధింౘు సాధన.

21) నారసింహవపుః ఓం నారసింహ రవపుషేనమః

ఇయ్యది శ్రీమహావిష్ణువు యొక్క నాలుగవ అవతారమగు నృసింహావతారమును సూచింౘు పౌరాణికనామము ఈ స్తవరాజము లో అన్ని అవతారముల నామములనూ మున్ముందు సాధకులు ౘూడగలరు. ప్రహ్లాదకుమారుని భక్తి పారవశ్యమునకు మెచ్చి సాక్షాత్కరించిన నృసింహావతార ఘట్టమిది. భాగవతములో మహాద్భుతముగా వర్ణింపబడియున్నది. అహంకారముగల హిరణ్యకశిపునకు యెంతగా వెదికిననూ శ్రీహరి కానరాడయ్యెను. భక్తిప్రపత్తులతో పిలిచినంత మాత్రముచేతనే తనకు కావలసినచోటుల యందెల్లా శ్రీహరి సాక్షాత్కరించెను. అనన్య భక్తియే శ్రీహరి సాక్షాత్కారమునకు సాధనమని ఈ నామము బోధింౘుౘున్నది. " అడుగడుగునకును మాధవానుచింతన సుధామాధుర్యమున మేనుమఱౘువాడు" ప్రహ్లాదుడు. పానీయములు ద్రావుౘు, గుడుౘుౘు, భాషింౘుౘూ, హాసలీలానిద్రాదులు సేయుౘు సంతత శ్రీ నారాయణ పాద పద్మ యుగళీ చింతామృతాస్వాద సంధానుండై భౌతికప్రపంచమును మఱచిన వాడు ప్రహ్లాదుడు. అట్టి వారికే ఈశ్వర సాక్షాతాకారమని ఈ యుగళనామము బోధింౘును.

--((**))--


 హరిః ಓమ్

3) శ్లోకం

యోగో యోగవిదాం నేతా ప్రధాన పురుషేశ్వరః,
నారసింహవపుః శ్రీమాన్ కేశవః పురుషోత్తమః !!

22) శ్రీమాన్ ఓం శ్రీమతేనమః

ఈ పవిత్రనామము ను ఈ స్తవరాజము లో నాలుగు పర్యాయములు వ్యాసదేవుడు తనశ్రీమాన్తో గానము చేసియున్నాడు. ఇది యెంతయో సుప్రసిద్ధ నామమని భక్తులు భావింతురు. సమస్త శ్రీ లను వర్షింప చేయువాడు కనుకనే శ్రీహరి శ్రీమాన్ అని కీర్తనీయుడగుౘున్నాడు. శ్రీ అనగా లక్ష్మి, విద్య, ధనము , ఐశ్వర్యము, వైభవము, ధృతి, క్షమ, ఓజస్సు, తేజస్సు, మున్నగు దివ్యవిభూతులని భావము.వీనినన్నిటిని తన్నాశ్రయించిన భక్తులకు వారి వారి అర్హతలననుసరించి దయతో ప్రసాదింౘువాడు శ్రీహరి యే యగుటచేత శ్రీమాన్ అనబడుౘున్నాడు. భక్తితో ఈస్తవరాజము ను నిత్యమును పారాయణము చేయువారలకు శ్రీధృతిస్మృతికీర్తి మున్నగు సకల విభూతులను వర్షింౘునని వ్యాసదేవుడు ఉత్తర పీఠికయందు తెలిపియే యున్నాడు గదా!

23) కేశవః ఓం కేశవాయనమః

ఇది మఱియొక సుప్రసిద్ధ నామముగా భక్తులు భావింతురు. ఆస్తికులగు భారతీయులు మత సంబంధ ములగు ఏ స్వల్పములగు అనుష్ఠానములు ప్రారంభించినను " కేశవ " నామముతోనే ప్రారంభింౘుట గమనార్హము.

1) సుందరములగు కేశములతో భాసిల్లుౘుండుట చేత శ్రీహరి కేశవనామమున ప్రసిద్ధుడయ్యెను. శ్యామసుందరుడగు శ్రీకృష్ణుడు కుటిలాలక సంయుక్తుడుగా, నీలాలకవ్రజ సంయుక్త
ముఖారవిందుడుగా భక్తులచే వర్ణింపబడినాడు.

2) " కేశి ". యను రాక్షసుని సంహరించిన కారణాన కేశవుడని పేరుగాంచెనని భక్తులు తెలుపుదురు. కేశములనగా "కిరణములు" అని కూడా యర్థము గలదు. సూర్యచంద్రుల దివ్యకిరణములే కేశములుగా కలిగి విశ్వమును మహాచైతన్య వంతముగావింౘువాడు పరమాత్మ యే యగుటచేత " కేశవ " నామము తో అర్చనీయుడగుౘున్నాడు.
క+అ+ఈశ+వ = కేశవ. అని పెద్దలు చెబుతారు." క " అను అక్షరము సృష్టికర్తయగు చతుర్ముఖ బ్రహ్మను సూచింౘును. " అ " అను అక్షరము విష్ణువును సూచింౘుౘున్నది. ఈశ అను పదము శివస్వరూప సూచకము, " వ "అనగా " వపుః " అనగా మూడు స్వరూపములను శరీరముగా గలిగినవాడని భావము. త్రిమూర్తి స్వరూపుడగు టచేత కేశవుడగుౘున్నాడు.
ఈ పుణ్యభావములతో ఈ పవిత్రమగు మంత్రో పాసనము సర్వ జీవులకూ వర్తింౘును.

24) పురుషోత్తమః ఓం పురుషోత్త మాయనమః

పురుష+ఉత్తముడు = పురుషోత్తముడు

పురుషుల లో మిక్కిలి శ్రేష్టమైన వాడగుటచేత శ్రీహరి పురుషోత్తముడని పిలువబడుౘున్నాడు. ఈ లోకమునందు ముగ్గురు పురుషులు గలరు. 1) క్షరపురుషుడు 2)అక్షరపురుషుడు 3) పురుషోత్తముడు. నశింౘునట్టి స్వభావముగల శరీరములన్నీ క్షరపురుషుడని చెప్పబడును. జలములలో ప్రతిబింబింౘు సూర్యబింబమువలె గానవచ్చునట్టి జీవుడు అక్షరపురుషుడు
అనబడును. క్షరాక్షర పురుషులకంటే సర్వశ్రేష్ఠుడై సర్వమునకాధార మై వెలుంగు మహాపురుషుడే పురుషోత్తముడని పిలువబడును.

(భగవద్గీత లోని 15వ అధ్యాయం లోని 16,17,18,19 శ్లోకముల
భావమును పాఠకులు గమనింప ప్రార్థన). ఇట్టి పురుషోత్తమ ప్రాప్తి యోగమే గీత లోని 15వ అధ్యాయమై యున్నది. ఈ రీతిగా గ్రహించినవాడే సర్వజ్ఞుడని గీతావాక్యము.
--((**))--


హరిః ಓమ్

4) శ్లోకము

సర్వః శర్వః శివః స్థాణుః భూతాదిర్నిధిరవ్యః !
సంభవో భావనో భర్తా ప్రభవః ప్రభురీశ్వరః !!

ఈ శ్లోకమునందు శ్రీమన్నారాయణమూర్తి ద్వాదశ దివ్యనామముల చేత ప్రస్తుతింప బడుౘున్నాడు.

25) సర్వః ఓం సర్వాయనమః

సర్వమునూ తానై యున్నవాడని ఈ శబ్దముయొక్క అర్థము. ఈ విశ్వమంతయునూ ఈశ్వరుడొక్కడే ఉపాదాన నిమిత్త కారణములుగా ఓతప్రోతముగా విస్తరించి, వికసించి, వ్యాపించి, విరాజిల్లి యున్నందున శ్రీహరి సర్వః అను పుణ్యనామమున స్తవనీయుడు. ఈ స్తవరాజము లోని 1, 2 నామములు కూడా ఇదే భావమును తెలుపుౘున్నందున పాఠకులు వానినిగూడా గమనింప ప్రార్థన.

26) శర్వః ఓం శర్వాయనమః

సకల శుభములు కల్గింౘు వాడని యర్థము. భగవానుడు కల్పవృక్షము, కామధేనువు, చింతామణి యునై యున్నందున తనను కీర్తించిన, స్మరించిన, ధ్యానించిన, భావించిన, స్తుతించిన, నమస్కరించిన భక్తులెల్లరకును ప్రీతితో వారివారి అర్హతల కనుకూలములగు ఫలములను ప్రసాదింౘు వాడు శ్రీహరి యే యగుటచేత. " శర్వః " అని గానము చేయబడును.

27) శివః ఓం శివాయనమః

మంగళప్రదుడని ఈనామము నకర్థము. త్రిగుణాతీతుడు, పరమపవిత్రుడును, మంగళకరుండును
నగుటచేత శ్రీపతి "శివః" అను దివ్యనామముచేత స్తవనీయుడగును శివకేశవుల కెట్టి భేదమునూ లేదని ఈ స్తవరాజము లో స్పష్టముగా తెలుపబడియున్నది.

శైవసంప్రదాయ శబ్దములెన్నియో దీనియందు గలవని పాఠకులు గమనింౘగలరు . అటులనే శివసహస్రనామావళి యందుకూడా వైష్ణవనామము లెన్నియో గమనింౘగలరు. శివకేశవులకు భేదముౘూపువాడు అవివేకి, అతడు మహానరకము నకు పోవునని మనశాస్త్ర పురాణాదులలో స్పష్టంగా తెలుపబడి యున్నది.

28) స్థాణుః ఓం స్థాణవేనమః

" స్థిరముగా నుండువాడని శబ్దార్థము"
" నిత్యస్సర్వగతః స్థాణు రచలో యంసనాతనః (గీత 2_24)
పరబ్రహ్మము నిత్యమై సర్వవ్యాపకమై, అచలమై, సనాతనమై యున్నదని చెప్పబడును. అదియే సర్వమునకు ఆధారమగుటచేత " స్థాణుః" అను దివ్యనామముతో ఆ పరబ్రహ్మ స్వరూపుడేయగు
స్వామి స్తవనీయుడగుౘున్నాడు.
--((**))--

హరిః ಓమ్

4) శ్లోకము

సర్వః శర్వః శివః స్థాణుః భూతాదిర్నిధిరవ్యః !
సంభవో భావనో భర్తా ప్రభవః ప్రభురీశ్వరః !!

ఈ శ్లోకమునందు శ్రీమన్నారాయణమూర్తి ద్వాదశ దివ్యనామముల చేత ప్రస్తుతింప బడుౘున్నాడు.

29) భూతాదిః ఓం భూతాదయేనమః

సకల భూతములకూ ప్రప్రథముడుగా నున్నాడని శబ్దార్థము. భూతములైదు. 1) భూమి ,2) జలము, ౩) తేజస్సు 4) వాయువు, 5) ఆకాశము ఈ పంచభూతములచేతనే నామ రూపాత్మకమగు విశ్వమంతయు సృష్టింపబడి యున్నది. ఈ పంచభూతములను సృష్టించినవాడు పరమేశ్వరుడే యగుటచేత ఆయన భూతాదిః అను నామమున చెప్పబడుౘున్నాడు.

30) నిధిరవ్యయః ఓం అవ్యయాయ నిధయేనమః

అవ్యయమగు నిధి(నాశనములేని నిధి) యని శబ్దార్థము. ఇది విశేషముతో కూడిన పదము. ఇందు "అవ్యయ" మను పదము "నిధి" యను పదమునకు విశేషణము. "నిధి" అనగా నిలయమని భావము . మిక్కిలి విలువైన వస్తు సముదాయము లన్నియునూ భద్రముగా నిలువజేసుకొను స్థలమును నిధి యని పిలుతుము. అటులనే సమస్త ప్రాణికోటులనూ ప్రళయకాలమునందు తనయందే భద్రపఱౘుకొని యుండువాడు కావున " శ్రీహరి" "నిధి" యని పిలువబడును. మరియును
ఆయన నాశనరహితుడు అగుటచేత. "నిధిః అవ్యయః" అను ప్రసిద్ధ నామమున గానము చేయబడును.

31) సంభవః ఓం సంభవాయనమః

తనకు తానుగానే పుట్టినవాడని శబ్దార్థము సూచింౘును. సమస్త ప్రాణికోటులనూ తమతమ శుభాశుభ కర్మానుసారముగా జన్మించి సుఖదుంఖముల ననుభవింౘు ౘుండును. కానీ భగవానుని కర్మము అట్టిదికాదు. ఆయన కర్మసిద్ధాంతమునకతీతుడు. ఆయనజన్మకు కర్మ కారణముగాదు.
తనంతటతాను తన ఇచ్ఛానుసారముగా అవతరింౘును. జనన మరణ రహితుండగు పరమాత్మ భూమండలమున ధర్మమునకు గ్లాని కలిగినపుడు అధర్మం విస్తరిల్లిన సమయమునందును_
సాధు సంరక్షణార్థమును, దుర్మార్గుల వినాశనము కొఱకును ధర్మసంస్థాపనము కొఱకును తనకు తానుగానే అవతరింౘు ౘుండును.

ఈ సంధర్భమున ప్రసిద్ధములగు గీతావాక్యములు అ 4,6, 7,8 శ్లోకములు స్మరణీయములు..

32) భావనః ఓం భావనాయనమః

ఈ పవిత్రమగు శబ్దమునకు " ఇచ్చుట" యని అర్థము. భగవంతుడు ప్రేమ స్వరూపుండగు వరప్రదాత. తనను స్మరించి చింతించి ధ్యానించి,కీర్తింౘు భక్తకోటులకు సమస్త కామితార్థములను ఇచ్చుౘుండును. అతడు మహాదాత. _ ఆయన అనుగ్రహం వలన నే సర్వమునూ సిద్ధింౘును. కావున" భావనః " అను దివ్యనామ వాచ్యుడగుౘున్నాడు.

కావున కామితార్థములకొఱకు భగవంతునే ఆశ్రయింౘ వలయునని సూచన.

--((**))--

హరిః ಓమ్


4) శ్లోకము

సర్వః శర్వః శివః స్థాణుః భూతాదిర్నిధిరవ్యః !
సంభవో భావనో భర్తా ప్రభవః ప్రభురీశ్వరః !!

ఈ శ్లోకమునందు శ్రీమన్నారాయణమూర్తి ద్వాదశ దివ్యనామముల చేత ప్రస్తుతింప బడుౘున్నాడు.

33) భర్తా ఓం భర్త్రేనమః

" భరింౘు వాడు " అని శబ్దార్థము. లోకములను, లోకేశులను, సకల ప్రాణికోటులను భరింౘువాడు పరమేశ్వరుడే కదా ! అందరి భారములనూ మోయునట్టి దయాసాగరుడా పరమేశ్వరుడే. సకల ధర్మములనూ విడనాడి నాయందు పూర్ణ విశ్వాసముతో నన్నే శరణు బొందుము నిన్ను సకల పాప భారములనుండియును విముక్తుని చేసి కాపాడుదును. అని గీతాచార్యుడు వాగ్దానము జేసి యున్నాడు కదా ( గీత అ 18స్లో66)
జగద్భర్తను ఆశ్రయింౘక నీచమానవుల నాశ్రయింౘువాడు అజ్ఞుడే కదా, కావున వాత్సల్య మూర్తియగు భగవానుడు "భర్తా" అను పుణ్యనామ వాచ్యుడయ్యెను.

34) ప్రభవః ఓం ప్రభవాయనమః

ఈనామమునకు " జన్మకారణుడు" అనిభావార్థము సమస్తమునకునూ ఉత్పత్తి కారణము భగవానుడే యను విషయముమఱియొక పర్యాయము వ్యాసదేవుడే ప్రసిద్ధ నామముద్వారాభక్తులకు గుర్తు చేయుౘున్నాడు.ఇట్టి భావము లొసంగు నామములు లోగడ చెప్పబడియున్ననూ మఱల అదియే భావార్థము నొసంగు నామము చెప్పబడినది. ఇది పునరుక్తి కాదు ఇట్టి పర్యాయపదములు దృఢ భావమును భక్తివిశ్వాసము లను భగవంతునియందు కలిగింౘుటకేయగును. స్తవరాజములలో
పునరుక్తి సంప్రదాయమును మనోహరముగా గాన నగుౘుండును.

35) ప్రభుః ఓం ప్రభవేనమః

" అధిపతి " అని ఈ నామమునకర్థము. భగవానుడు సర్వలోకమహేశ్వరుడు. సర్వలోకనియంత, సర్వ శాసనకర్త , రాజులకు రాజచంద్రుడు, చక్రవర్తులకు మహాచక్రవర్తి. సార్వభౌములకెల్ల మహా సార్వభౌముడగుట వల్ల "ప్రభు " నామము చేత కీర్తింపబడును. ఆ మహాప్రభువు అనుగ్రహము వలననే సర్వమునూ ప్రవర్తిల్లుౘున్నదని భావము.

36) ఈశ్వరః ఓం ఈశ్వరాయనమః

మహా శక్తిసంపన్నుడని ఈనామముయొక్క భావార్థము. షడ్గుణైశ్వర్య సంపన్నుడే ఈశ్వరుడు. మరెవ్వరి సాహాయ్యముతోనూ ఏ ఇతర సాధనములతోనూ నిమిత్తము లేకుండగనే సర్వమును దక్షతతో దీక్ష తో నిర్వహింౘు సర్వసమర్థ సర్వశక్తి స్వరూపుడే భగవానుడగుటచే ఈశ్వర నామముతో ప్రసిద్దుడగుౘున్నాడు. అట్టి ఈశ్వర కటాక్షము బొందినవారికి అసాధ్య మేదియూ నుడదని భావార్థము.
 --((**))--

హరిః ಓమ్

5) శ్లోకము

స్వయంభు శంభురాదిత్యః పుష్కరాక్షో మహాస్వనః !
అనాది నిధనో ధాతా విధాతా ధాతు రుత్తమః !!

తొమ్మిది పుణ్యనామముల తో శ్రీహరి ఈ పుణ్యశ్లోకము నస్తవనీయుడు.

37) స్వయంభూః ఓం స్వయంభువేనమః

తనంతటతాను గానే ఉత్పన్నమైన వాడని భావము.31, 34 నామముల వివరణమును తిలకింప ప్రార్థన.

ప్రపంచములో ఏకార్యము జరిగిననూ దానికి తప్పక యేదియో కారణముండి తీరవలయును. కార్యకారణ సంబంధం విశ్వమంతటనూ కానవచ్చును . కానీ భగవానుడీ నియమమున కతీతుడు .

"అజో పిసన్, ప్రకృతిం స్వామధిష్ఠాయ సంభవామి ఆత్మమాయయా". అను గీతావాక్యము స్మరణీయము( అ4_శ్లో6).

నేను పుట్టుక లేనివాడనే అయ్యునూ, నాశనరహితుడనైననూ, సర్వనియామక సార్వభౌముడ నయ్యును నా ఇచ్ఛానుసారముగా నా ప్రకృతి ఆధారంగా నేను అవతరింౘు ౘుందునని గీతాశాస్త్రవాణి

38) శంభుః ఓం శంభవేనమః


శుభముల ప్రసాదింౘు వాడని ఈ నామము యొక్క భావము. శైవసంప్రదాయము నందునూ దివ్యనామముల లో "శంభుః" నామము మరియొక సుప్రసిద్ధ నామము. (27వ నామ వివరణమును తిలకింపుడు.). తమ పవిత్రనామమును స్మరించి నంత మాత్రముననే భక్తులకు వారి కోర్కెలనెల్లా వర్షింప చేయువాడు పరమశివుడు. శివకేశవులకు తారతమ్యము లేదు. శ్రీమహావిష్ణువే ఇచ్చట శంభునామముతో గానము చేయబడుౘున్నాడు. సకలకోరికల పరిపూర్తి కొఱకు భగవన్నామమును ఆశ్రయింౘవలయునని భావము. అనగా ఈ స్తవరాజము యొక్క సంకీర్తనము సకలాభీష్ట
సిద్ధి వ్రతమని భావము.

27వ. నామవివరణము


మంగళప్రదుడని ఈనామము నకర్థము. త్రిగుణాతీతుడు, పరమపవిత్రుడును, మంగళకరుండును నగుటచేత శ్రీపతి "శివః" అను దివ్యనామముచేత స్తవనీయుడగును శివకేశవుల కెట్టి భేదమునూ లేదని ఈ స్తవరాజము లో స్పష్టముగా తెలుపబడియున్నది.
శైవసంప్రదాయ శబ్దములెన్నియో దీనియందు గలవని పాఠకులు గమనింౘగలరు . అటులనే శివసహస్రనామావళి యందుకూడా వైష్ణవనామము లెన్నియో గమనింౘగలరు. శివకేశవులకు భేదముౘూపువాడు అవివేకి, అతడు మహానరకము నకు పోవునని మనశాస్త్ర పురాణాదులలో స్పష్టంగా తెలుపబడి యున్నది.

39) ఆదిత్యః ఓం ఆదిత్యాయనమః

ఈ నామము సూర్యభగవానుని సూచింౘుౘున్నది.

1) సూర్యమండల మధ్యభాగమున బంగారు వర్ణముతో ప్రకాశింౘు ౘున్న మహాపురుషుడే పరబ్రహ్మ మగుట చేత. ఆ దివ్యనామముతో గానము చేయబడుౘున్నాడు.

2) భూమికి "అదితిః" అను పేరు కలదు. గనుక ఆదిత్యు డనగా భూమికి భర్తయగు శ్రీమన్నారాయణ మూర్తి యగును.

3) " ఆదిత్యానాం ఆహం విష్ణుః" ద్వాదశాదిత్యుల యందు నేను విష్ణువును అని గీతాచార్యుని వచనము(అ10_21).

4) ఆదిత్యుడనగా "అదితి" కుమారుడనియును అర్థము కలదు. అదితి యొక్క కుమారుడు వామనుడు కనుక శ్రీమహావిష్ణువు యొక్క ఐదవ అవతారమును తెలుపుౘున్నది. కావున భగవానుడు ఆదిత్యనామ వాచ్యుడగుౘున్నాడు. సూర్యోపాసనము సర్వరోగహర మని తెలియదగును. ఇట్టి
నామముతో కూడిన కారణముచేతనే ఈ స్తవరాజపారాయణ "రోగార్తో ముచ్యతే రోగాత్" సర్వరోగహరమని ఉత్తర పీఠికలో వ్రాయబడియున్నది.

5) ఒక్కడేయగు సూర్యుడు అనేక జలపాత్రలయందు అనేకములుగా ప్రతిబింబింౘు నట్లు ఒక్కటేయగు ఆత్మ అనేక శరీరములయందు అనేకములుగా నుండునట్లు తోౘు ౘుండును. ఇట్టి సూర్యునివంటి పోలిక కలిగియున్న కారణం చేతనే శ్రీహరి "ఆదిత్య" అనుమహనీయ నామమున
అర్చనీయుడగుౘున్నాడు.

--((**))--


హరిః ಓమ్

5) శ్లోకము

స్వయంభు శంభురాదిత్యః పుష్కరాక్షో మహాస్వనః !
అనాది నిధనో ధాతా విధాతా ధాతు రుత్తమః !!

తొమ్మిది పుణ్యనామముల తో శ్రీహరి ఈ పుణ్యశ్లోకము నస్తవనీయుడు.

40) పుష్కరాక్షః ఓం పుష్కరాక్షాయనమః

పుష్కరమనగా తామరపూవు. అట్టి నేత్రము గలవాడగుటచేత పుష్కరాక్షః అని భగవానుడు పిలువబడును. భారతీయ వేదాంత సంస్కృతిలో పద్మమునకు గల స్థానము మహనీయమైనది. పద్మము సౌందర్యమునకు, సౌకుమార్యమునకు ప్రసన్నతకు, ప్రశాంతికి చిహ్నము. పద్మము సంగరాహిత్యమును తెలుపును. తామర జలములలో సంగమమును బొందదు. సంగరాహిత్యమే జ్ఞానము. నిస్సంగము, నిర్లిప్తత, మహానుభావ చిహ్నములగుట చేతనే శ్రీమహావిష్ణువు తన హస్తమునందు పద్మమును ధరింౘుట కానవచ్చును. అంతమాత్రమేగాక భగవంతుడు పద్మమువలె " నిస్సంగుడు_ నిర్లిప్తుడు " అని తెలుపుటకే ఆయన అవయవములన్నియును పద్మముతోనే వర్ణింపబడుౘుండుట గమనార్హము. ఉదా:- పద్మనేత్రుడు, పద్మముఖుడు, పద్మనాభుడు, పద్మహస్తుడు, పద్మపాదుడు మున్నగునవి గమనింౘునది. ఇచ్చట. " పుష్కరాక్ష " నామము శ్రీహరియొక్క ప్రశాంత నేత్రములను సూచింౘును. ఆయన నేత్రములు ప్రేమామృత ప్రపూర్ణములు. కరుణారసభరితములు. ఆయన ౘల్లని ౘూపులచేత భక్తుల సకల తాపములను హరింౘును గాన భగవానుడు పుష్కరాక్షుడుగా కీర్తింపబడును. ఈ ఈనామముయొక్క పర్యాయ పదములే ముందు రానున్న నామము లే గూడా పాఠకులు ౘూడగలరు.

41) మహాస్వనః ఓం మహాస్వనాయనమః

" స్వన " మనగా " ధ్వని " లేక " నాదము " అనియర్థము మహాస్వనుడనగా గంభీరమగు దివ్య నాదస్వరూపుడని భావార్థము ప్రతిమానవుని హృదయకుహర మందును దివ్యనాదమును
గావింౘువాడు పరమేశ్వరుడే గదా. " స్వన " మనగా నిశ్శ్వాసమనియును అర్థము. చతుర్వేద ములును భగవానునియొక్క నిశ్వాసములుగా చెప్పబడి యున్నవి. (బృహదారణ్యకము 4_4_10) వేదస్వరూపుడగుట చేతను_ వేదప్రియుడగుట చేతను శ్రీహరి మహాస్వనః అను నామమున ప్రసిద్దుడాయెను. ఈ నామము వేదగానమును ప్రోత్సహింౘుౘున్నది.

42) అనాదినిధనః ఓం అనాదినిధనాయనః

ఆది (జననము). మఱియు నిధనము (నాశనము) లేనివాడగుట చేత భగవానుడు " అనాదినిధనః " అని పూజనీయు డగుౘున్నాడు. జననమరణ రహితుడు _ ఆద్యంత శూన్యుడని భావము.
--((**))--
హరిః ಓమ్

5) శ్లోకము

స్వయంభు శంభురాదిత్యః పుష్కరాక్షో మహాస్వనః !
అనాది నిధనో ధాతా విధాతా ధాతు రుత్తమః !!

తొమ్మిది పుణ్యనామముల తో శ్రీహరి ఈ పుణ్యశ్లోకము నస్తవనీయుడు.

43) ధాతా ఓం ధాత్రేనమః

నామరూపాత్మకమైన. ఈచరాచర విశ్వమునంతయూ ధరించిన మహామహుడగుట చేత శ్రీహరి "ధాతా" అను నామమున ప్రసిద్దుడగుౘున్నాడు.

44) విధాతా ఓం విధాత్రేనమః

" ౘక్కని విధానములను గావించినవాడు " అని ఈ శబ్దముయొక్క సామాన్యార్థ మైయున్నది. వేదములయందు ౘక్కని కర్మ విధానములను ఏర్పాటు గావింౘిన వాడాపరమేశ్వరుడే. అట్టి
వేదోక్తమగు కర్మలకు తగిన ఫలములను నిర్ణయించిన వాడునూ ఆ పురుషోత్తముడే. కర్మ ఫలదాతయును ఆ పరమేశ్వరుడే. ఆయనే వేదములు -- శాస్త్రములను‌ నిర్మించినవాడు. శాస్త్ర విధానములను ధిక్కరించిన వారిని దండింౘువాడును శ్రీహరియే". ఆయన భయము
చేతనే సూర్యుడు ప్రకాశింౘును. చంద్రుడునూ ఆయన భీతిచేతనే విరాజిల్లు ౘున్నాడు. చండశాసనుండగు ఈశ్వరుని భయముచేతనే వాయువు వీౘును _ అగ్ని ప్రజ్వరిల్లును. ఈ రీతిగా కఠోపనిషత్తు లో వివరింపబడి యున్నది. కనుకనే ఆయన. " విధాతా " యని స్థవనీయుడు.

45) ధాతురుత్తమః ఓం ధాతురుత్తమా యనమః

ప్రపంచోత్పత్తికి కారణభూతములగు పృథివ్యాది సమస్త భూతములకంటెనూ మిక్కిలి శ్రేష్ఠుడు, ప్రధానుడు, ముఖ్యుడు పరమేశ్వరుడే యగుటచేత " ధాతురుత్తమః " అని భగవానుడు గానము చేయబడుౘున్నాడు. 
--((**))--


హరిః ಓమ్

6) శ్లోకము

అప్రమేయో హృషీకేశః పద్మనాభో మరప్రభుః !
విశ్వకర్మా ! మనుస్త్వష్టాస్థవిష్ఠః స్థవిరోధ్రువః !!

ఈ శ్లోకమున తొమ్మిది నామములుగలవు.

46) అప్రమేయః ఓం అప్రమేయాయనమః

ప్రమాణములచేత తెలియబడువాడు కాడు.

భగవంతుడు నిరాకారుడు నిర్గుణుడు నిస్సంగుడు అగుటచేత, ఒక వస్తువును గూర్చి నిర్ణయింౘుటకు శాస్త్రము చెప్పిన (1) శబ్దప్రమాణము చేతగాని, ప్రత్యక్షప్రమాణము చేతగాని, అనుమాన ప్రమాణంచేతగాని భగవంతుడు తెలియబడువాడు కాదు.  మానవులకు గల జ్ఞానేంద్రియ కర్మేంద్రియము లెవ్వియును పరబ్రహ్మము ను పట్టజాలవు.

"బుద్ధి గ్రాహ్యమతీంద్రియమ్" అని గీతాశాస్త్రము వచించినది. అనగా పరమాత్మ ఇంద్రియములకు గోచరింపని వాడని యు పరిశుద్ధమగు నిర్మలశుద్ధబుద్ధి చేత మాత్రము గ్రాహ్యుడగు
ననియు భావము. కావున నిష్కామ కర్మానుష్ఠానము ద్వారా చిత్తశుద్ధి బడసిన వారలకు మాత్రమే పరమాత్మ జ్ఞానము గలుగు నను భావము సూచింౘబడుౘున్నది.

47) హృషీకేశః ఓం హృషీకేశాయనమః

1) హృషీకములు అనగా ఇంద్రియములు. వానికి (ఈశః) ప్రభుడగుటచేత భగవానుడు హృషీకేశుడని పిలువబడుౘున్నాడు. ఆయన అనుగ్రహం లేనిదే కండ్లు ౘూడజాలవు. చెవులు వినజాలవు
నాలుక భాషింపజాలదు, కాళ్ళుచేతులు కదలవు, కనుక సర్వేంద్రియాది నాథుండగు హృషీకేశుని శరణు బొందుము.

2). కేశములనగా " కిరణము" లని అర్థము గలదు. ఈ యర్థభావములతో సమన్వయించినపుడు మనోహరములగు కిరణములతో గూడియున్న వాడని ఈ నామమునకు అర్థమగును. శ్రీహరి సూర్యచంద్రులయొక్క దివ్యకిరణములచే భాసిల్లుౘున్నాడని శ్రుతియొక్క భావము. సూర్యకిరణములతో విశ్వమును మేల్కొల్పు ౘున్నాడనియు చంద్రకిరణములతో విశ్వమును నిద్రబుచ్చుౘున్నా డనియును మహాభారత శాంతిపర్వము వివరింౘుౘున్నది. కనుక
శ్రీహరి హృషీకేశుడైనాడు.

3) పద్మనాభః ఓం పద్మనాభాయనమః

పద్మము నాభియందు గలవాడు. పద్మముయొక్క విశిష్టతను గూర్చి లోగడ 40వ నామముయొక్క వివరణమున ౘూడ ప్రార్థన. శ్రీహరి యొక్క నాభిపద్మమునుండి చతుర్ముఖబ్రహ్మ జన్మించి విశ్వసృష్టిని గావించినాడని పురాణశాస్త్రముల కథనము గదా. సర్వక్రియాత్మక శక్తులకు నాభియేకేంద్రమని యోగశాస్త్రము వచింౘును. ఈ కారణములచే శ్రీహరి పద్మనాభుడని వాసిగాంచెను.


--((**))--

6) శ్లోకము

అప్రమేయో హృషీకేశః పద్మనాభో మరప్రభుః !
విశ్వకర్మా ! మనుస్త్వష్టాస్థవిష్ఠః స్థవిరోధ్రువః !!

ఈ శ్లోకమున తొమ్మిది నామములుగలవు.

49) అమరప్రభుః ఓం అమరప్రభ వేనమః

అమరులనగా దేవతలు. వీరికి అధిపతి యగుటచేత శ్రీహరి " అమరప్రభు " డగుౘున్నాడు. తమ్మాశ్రయించిన భక్తులకు దేవతలు అనేక వరములను శక్తులను ప్రసాదింౘు ౘుందురు. అట్టి
శక్తి సంపన్నులగు దేవతలకు కూడా ప్రభువు శ్రీహరి యగుటచేత అమరప్రభుడని కీర్తిగాంచెను. కనుక వివిధ దేవతారాధనలకంటే సర్వదేవతాగణ స్వరూపుండగు పరబ్రహ్మము ను సేవింౘుట యే 
సర్వశ్రేష్ఠమను బోధను ఈనామము ప్రసాదింౘుౘున్నది. ఈ సందర్భమున గీతాశాస్త్రము నందలి ఈదిగువ శ్లోకము లు స్మరణీయములు.

భగవద్గీత అధ్యాయం 9
శ్లోకము__23

యే ప్యన్యదేవతా భక్తా యజన్తే శ్రద్ధయాన్వితాః!
తే పి మామేవ కౌంతేయ యజంత్య విధిపూర్వకమ్!!

ఇతర దేవతలను పూజించినప్పటికీ వారు నన్ను పూజించినట్లే. కానీ వారిపూజలు అవిధి పూర్వకములైనవి. అనగా అజ్ఞానముతో కూడినవి.

శ్లోకము__24

అహం హి సర్వయజ్ఞానాం భోక్తాచ ప్రభురేవ చ !
న తు మామభిజానంతి తత్త్వేనాతశ్చ్యవంతి తే!!

ఏలనన సకలయజ్ఞములకునూ భోక్తను, స్వామిని గూడ నేనే. వారు నాపరమేశ్వర తత్త్వమును ఎఱుంగరు. కావున పతనమగుదురు అనగా పునర్జన్మను పొందుదురు.

శ్లోకము__25

యాంతి దేవవ్రతా దేవాన్ పితృూన్ యాంతి పితృవ్రతాః !
భూతాని యాంతి భూతేజ్యా యాంతి మద్యాజినో పి మామ్!!

దేవతలనారాధింౘువారు దేవతలను, పితృదేవతల నారాధింౘు వారు పితృదేవతలను, భూతముల నారాధింౘువారు భూతముల పొందుదురు. సర్వదేవతా చక్రవర్తినగు నన్నారాధింౘువారు నన్నే పొందుదురు.

50). విశ్వకర్మా ఓం విశ్వకర్మ ణేనమః

చిత్రవిచిత్రమై  వివిధ నామరూపకాత్మకమై గానవచ్చు  ఈ యనంత చరాచరాత్మక విశ్వ సృష్టి యంతయు తన యొక్కయే కర్మగా కలిగియున్న వాడగుటచే శ్రీహరి విశ్వకర్మాయను సుప్రసిద్ధ
నామముచే గానము చేయబడును. ఇంతటి మహాద్భుత కర్మ కలాపములను గావింౘుౘున్నాడు అతడే కర్మమును చేయనివాడు. అతడు నిస్సంగుడు, నిర్లిప్తుడు.

" మత్ స్థాని సర్వ భూతాని,నచాహంతేష్వవస్థితః"అనిగీతావాక్యము " సకల భూతములును నాయందే యున్నను నేనుమాత్రం వానియందు లేను " ( అ_9_4).

51) మనుః ఓం మనవేనమః

మననము, చింతనమును చేయువాడగుటచేత "మనుః" అనబడును. ప్రజాపతిస్వరూపుడు అగుట చేత మనుః అనబడును.
--((**))--

హరిః ಓమ్
6) శ్లోకము

అప్రమేయో హృషీకేశః పద్మనాభో మరప్రభుః !
విశ్వకర్మా ! మనుస్త్వష్టాస్థవిష్ఠః స్థవిరోధ్రువః !!

ఈ శ్లోకమున తొమ్మిది నామములుగలవు.

52) త్వష్టా ఓంత్వష్ట్రేనమః

బృహత్పదార్థములను (మిక్కిలి పెద్ద స్వరూపములను) మిక్కిలి చిన్నవిగానుండు అణువులుగా చేయువాడని ఈ శబ్దము యొక్క భావార్థము.. (ప్రళయకాలమునందు సమస్త భూతకోటులనూ మిక్కిలి సూక్ష్మరూపమున తనయందే యిముడ్చు కొనువాడగుటచేత శ్రీహరి త్వష్టాఅను పుణ్యనామ వాచ్యుడయ్యెను.

53). స్థవిష్ఠః ఓం స్థవిష్ఠాయనమః

మిక్కిలి స్థూలస్వరూపమని ఈ శబ్దార్థము. భగవాను డన్నిటికంటే మిక్కిలి బృహద్రూపుడు. అంతట నిండి, విస్తరించి, బాగుగా వ్యాపించి యున్నవాడు. సర్వవ్యాపి మహేశ్వరుడు భగవద్గీతలో ని 11వ అధ్యాయమైన విశ్వరూపసందర్శన యోగమున పార్థుడు భగవానునియొక్క యిట్టి హత్స్వరూపము
నే గాంచియున్నాడు. ఇట్టి మహాస్థూల బృహద్రూపుడగుట చేతనే శ్రీహరి "స్థవిష్ఠః " అని గానము చేయబడును.

54) స్థవిరోధ్రువః ఓంస్థవిరాయ ధ్రువాయనమః

స్థవిరమనగా సనాతనము. ధ్రువమనగా స్థిరము. "స్థవిరోధ్రువః " అను నీ శబ్దము శేషణముతోకూడిన ఏకపదము స్థిరుడై, నిత్యుడై సర్వాధారుడైన సనాతనపురుషుడు అగుటచేత శ్రీమన్నారాయణుడు " స్థవిరోధ్రువః " అని గానము చేయబడును.
--(**)--

హరిః ಓమ్

7) శ్లోకము

అగ్రాహ్యః శాశ్వతః కృష్ణో లోహితాక్షః ప్రతర్దనః !
ప్రభూత స్త్రికకుబ్ధామ పవిత్రం మంగళం పరం !!

ఈ శ్లోకము నందు పరమాత్మ తొమ్మిది పుణ్యనామములతో
స్తవనీయుడగుౘున్నాడు.

55) అగ్రాహ్యః ఓం అగ్రాహ్యాయనమః

పరమాత్మ చక్షురాదియింద్రియములకగోచరుడు "యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసానహ" వాక్కులచేత గానీ మనస్సు చేతగానీ తెలుపుటకు సాధ్యముగానిది పరబ్రహ్మమని శ్రుతి గానము చేయును.

ఆశ్చర్యవత్ పశ్చతి కశ్చిదేనం ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్యః !
ఆశ్చర్య వచ్చైన మన్య శ్శృణోతి శ్రుత్వాప్యేనం వేద నచైవకశ్చిత్ !!
( గీత అ 2_29)

ఒకానొకడీ యాత్మను ఆశ్చర్యకరమైనదిగా ౘూౘుౘున్నాడు. మరి యొకడీయాత్మను ఆశ్చర్యమైన దానివలె వినుౘున్నాడ. కానీ ఇందొక్కడునూ ఈ యాత్మను గూర్చి పూర్తిగా గ్రహించినవాడు గాదు.
అని గీతాచార్యుడు పలుకును.

ఆత్మజ్ఞానము నిరంతర ధ్యానయోగసాధనము చేత సర్వేంద్రియ నిగ్రహమువలన సంపూర్ణమైన చిత్తసుద్ది గలవారికిమాత్రమేకలుగును " బుద్ధి గ్రాహ్య మతీంద్రియమ్ " (గీత. అ6_21)

కావున భగవానుడు "' అగ్రాహ్యః" అను మహత్తర పుణ్యనామము న‌ గానము చేయబడును. 46వ నామముయొక్క వివరణమును గూడాౘూడనగును)

46) అప్రమేయః ఓం అప్రమేయాయనమః

ప్రమాణములచేత తెలియబడువాడు కాడు.

భగవంతుడు నిరాకారుడు నిర్గుణుడు నిస్సంగుడు అగుటచేత, ఒక వస్తువును గూర్చి నిర్ణ యింౘుటకు శాస్త్రము చెప్పిన
(1) శబ్దప్రమాణము చేతగాని, ప్రత్యక్షప్రమాణము చేతగాని, అనుమాన ప్రమాణంచేతగాని భగవంతుడు తెలియబడువాడు కాదు.

మానవులకు గల జ్ఞానేంద్రియ కర్మేంద్రియము లెవ్వియును పరబ్రహ్మము ను పట్టజాలవు.

"బుద్ధి గ్రాహ్యమతీంద్రియమ్" అని గీతాశాస్త్రము వచించినది. అనగా పరమాత్మ ఇంద్రియములకు గోచరింపని వాడని యు పరిశుద్ధమగు నిర్మలశుద్ధబుద్ధి చేత మాత్రము గ్రాహ్యుడగు ననియు భావము. కావున నిష్కామ కర్మానుష్ఠానము ద్వారా చిత్తశుద్ధి బడసిన వారలకు మాత్రమే పరమాత్మ జ్ఞానము గలుగు నను భావము సూచింౘబడుౘున్నది.

56) శాశ్వతః ఓం శాశ్వతాయనమః

అన్ని కాలములందునూ ఉన్నవాడు. నాశనరహితుడు, వికారసూన్యుడు, అచలుడు, స్థిరుడు అని భావార్థము. 

"శాశ్వతగ్ం శివమచ్యుతం". అని శ్రుతి గానము చేయును. అనగా శ్రీహరి శాశ్వతుడు, మంగళకరుడు, అవినాశి యని తెలుపబడెను.
--((**))--

హరిః ಓమ్ 

7) శ్లోకము 

అగ్రాహ్యః శాశ్వతః కృష్ణో లోహితాక్షః ప్రతర్దనః ! 
ప్రభూత స్త్రికకుబ్ధామ పవిత్రం మంగళం పరం !! 

ఈ శ్లోకము నందు పరమాత్మ తొమ్మిది పుణ్యనామములతో స్తవనీయుడగుౘున్నాడు. 

57) కృష్ణః ఓం కృష్ణాయనమః 

పవిత్రమగు మంగళనామముగా భక్తులు నిరంతరమునూ గానము చేయు దివ్యనామ మిది. 

1) " కృష్ణస్తు భగవాన్ స్వయమ్ " శ్రీకృష్ణుడు సర్వకళా పరిపూర్ణుడగు భగవంతుడని భాగవత వాక్యము. 

2) కురుక్షేత్ర రణరంగంలో పార్థుని నిమిత్త మాత్రునిగా నుంౘు కొని అద్భుతమగు గీతోపదేశమును చేసిన కారణమున శ్రీకృష్ణుడు జగద్గురువయ్యెను. భారతీయులకు మాత్రమే కాకుండా ఖండ ఖండాంతర పుణ్యసీమ కెల్లా విశ్వమునకెల్లా గీతోపదేశము శిరోధార్యమై యున్నందున శ్రీకృష్ణుడు విశ్వగురువు. 

3) కృష్ణునకు ఒక్క ప్రణామము చేసినంత మాత్రముచేతనే దశాశ్వమేథయాగఫలము ప్రాప్తింౘునని భారతము వచింౘును. కృష్ణస్మరణము కోటిజన్మకృత పాపహరణమని శాస్త్రవాక్యము. 

4) " కృష్ " అనగా నిరతిశయమైన (Infinite) అని అర్థము. "నః " అనగా ఆనందము (Bliss) అనగా సచ్చిదానంద స్వరూపుడు (Infinite Bliss). 

5) సర్వమునూ ఆకర్షింౘువాడగుట చేత " కృష్ణు " డన బరగెననియూ మరియొక అర్థముగలదు. 

6) శ్యామసుందరుడగు కృష్ణుఁడు మానవకోటికి దివ్య వాగ్దానములు, అభయప్రదానములు గావించినాడు. " యోగ క్షేమం వహామ్యహం , నీయొక్క యోగక్షేమములను వహింౘు వాడను నేను 

నివసిష్య " మామేకం శరణవ్రజ " నన్నే శరణుబొందుము. నిన్ను సకల పాపములనుండి విముక్తుని చేసెదను. (అ_18_66) 

" మచ్చిత్తః సర్వదుర్గాణి _ తరిష్యసి " నీ మనస్సు ను నాకర్పించిన సకల దుఃఖములనుండియు దాటిపోగలవు. (అ_18_55) 

" మయ్యేవ మనఆధత్స్వ నివసిష్యసిమయ్యేవ " నాయందే మనస్సునుంౘుము _ నన్నేపొందెదవు. (అ 12_8) మన్మనాభవ_ మామేవైష్యసి " నీమనస్సు నాయందుంచిన నన్నేపొందెదవు. 

(అ 18_65). ఈ రీతిగా విశ్వమానవకోటికి ఎన్నియోరీతుల వాగ్దానములు, ప్రమాణములు గావించిన కృష్ణుడు సాక్షాత్తు పరమాత్మయేకదా.అందుచే ఈ స్తవరాజము నందు దేవకీనందనుడు 
అధిష్ఠాన దివ్యదేవతగా తెలుపబడెను. 

58) లోహితాక్షః ఓం లోహితాక్షాయనమః 

" ఎఱ్ఱని నేత్రములు గలవాడు" అని భావము. ఎరుపు రజోగుణము ను సూచింౘును. ఎఱ్ఱని నేత్రములు క్రోధమును సూచింౘును. భగవంతుడు ప్రేమస్వరూపుడే యయ్యును, తన 
కుమారులు అక్రమమార్గములలో,ధర్మవిరుద్ధముగా ప్రవర్తింౘు నపుడు వారిని సరిదిద్దుటకు క్రోధపూరితుడగుౘుండును. కనుక శ్రీహరి లోహితాక్షుడనబడు ౘున్నాడు. దుష్టులపట్లనూ, దుర్మార్గుల పట్లనూ ఆయన కోపమువహింౘును. మానవులందరూ పరమేశ్వ రానుగ్రహమును పొందవలయునన్నచో వారు తప్పక ధర్మమార్గాన శాస్త్రం చెప్పిన చొప్పున నడౘుకొనవలెనని ఈ నామము యొక్క ప్రబోధము. అట్టి ధర్మప్రవర్తకులకే భగవదనుగ్రహము లభింౘును. 
దుర్మార్గులు ఆయన యొక్క లోహితాక్షములకు గుఱియై దుఃఖ భాజనులగుదురు.

 --((**))--

59 ప్రతర్దనః ఓం ప్రతర్దనాయనమః 

"తర్దనః" "అనగా నాశనము చేయువాడు". అని భావము. " ప్రతర్దనః" అనగా విశేషముగా నాశనము చేయువాడు. భగవానుడు ప్రళయకాలమునందు తమోగుణము నాశ్రయించి రుద్ర రూపుడై సకల ప్రాణులనునాశనము చేయువాడగుటచేత శ్రీహరి " ప్రతర్దనః". అని కీర్తింపబడెను. 

60) ప్రభూతః ఓం ప్రభూతాయనమః 

" పరిపూర్ణుడై పుట్టినవాడని " భావార్థము. అనగా పూర్ణపురుషుడై , సర్వకళాసమన్వితుడై, ఐశ్వర్యాది షడ్గుణైశ్వర్య సంపన్నుడై భువినవతరించిన పరబ్రహ్మమని భావము. శ్రీకృష్ణావతారమున పరిపూర్ణరూపుడై అవతరించినాడు ఆయవతారమున ఆయన ౘూపిన విభూతులు, లీలలు , అద్భుతా ద్భుతములు గదా, పూతనాసంహారము, కాళియభంజనము, గోవర్ధనోద్ధరణము, రాసలీలాసన్నివేశము, విశ్వరూపదర్శనం, గీతోపదేశము, మున్నగు మహాద్భుత దివ్యలీలా, ప్రదర్శనములతో గూడినవాడగుటచేత శ్రీహరి " ప్రభూతః " అను దివ్యనామముతో స్తవ నీయుడగును. 

61) త్రికకుబ్థామ. ఓం త్రికకుబ్థామ్నేనమః 

మూడుభాగముల యందు ఆశ్రయమై యున్న వాడని ఈనామముయొక్క భావార్థము. 

ఊర్థ్వభాగమునందును, మధ్యభాగమునందును అధోభాగమునందును ౘక్కగా వ్యాపించి యున్నవాడు. మఱియును మూడు అవస్థలయందును అనగా జాగ్రత్, స్వప్న, సుషుప్తుల యందు నున్నవాడనియుచెప్పబడును. అందుచేత శ్రీహరి "త్రికకుబ్థామ" మను నామముతో కీర్తింపబడెను.

--((**))--

హరి: ఓం

విశ్వo విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ప్రభుః:
భూతకృద్భూతబృద్భావో భూతాత్మా భూతభావన: !!1 !!


ఓం = అనునీయక్షరమె బ్రహ్మము: ఇది సర్వ శ్రేష్టము, స్మరనచేసినచో  దేనిని కోరిన  అది,సిద్ధించును,    

విశ్వం = చరాచర జగత్తు నందు వ్యాపించు యున్నవాడు,
విష్ణుః = సర్వ వ్యాపకం గలవాడు,
వషట్కారః =వశము నందుంచు కున్నవాడు,
భూత భవ్య భవత్ప్రభుః = భూత భవిష్యద్వర్తమానాలకు తానే అధిపతిగా ఉన్నవాడు,
భూతకృత్ = సకల భూతాలను సృజించిన వాడు,
భూత భృత్ =. భూతాలను భరించేవాడు ,
భావః=సమతా భావం కలిగిన వాడు,
 భూతాత్మా= భూతాలన్నిటా ఆత్మయై ప్రకాశిస్తున్నవాడు,
భూత భావన=భూతాలకు శుభము కల్పించు వాడు.

భాష్యం : ప్రపంచమంతా :"ఓం " కార నాదం తో పరిప్రబ్రమిస్తుంది, దీనిని విన్నా,  స్మరణ చేసినా మనస్సు ఏకాగ్ర చిత్తముగా మారుతుంది, దేనిని కోరిన అది సిద్ది స్తుంది. ఆనాడు హనుమంతుడు " ఓం శ్రీరాం " ఏకాగ్రచిత్తంతో జపం చేసి రామచంద్రుని మన్నన  పొందాడు .  ఈ నాడు యోగాభ్యాసంతో అనేకమంది చరిత్రసృష్టించినాట్లు తెలుస్తున్నది.   

అట్లాగే శ్రీ మహావిష్ణువు చరాచర జగత్తు నందు వ్యాపించి, సర్వ వ్యాపకం కలిగి, భూత భవిష్యద్వర్తమానాలకు తానే అధిపతిగా ఉండి, సర్వము వశము చేసుకొని, సకల భూతాలను సృజించి, భూతాలను భరించి, సమతా భావం కలిగి ఉన్నవాడు. సకలప్రాణుల యందు, భుతాలన్నిటియందు, ఆత్మగా ప్రకాశిస్తూ సకల శుభములు కల్గించే పరమాత్మునికి ప్రణామములు.        
  
--((**))--

హరిః ಓమ్ 

8) శ్లోకము 

ఈశానః ప్రాణదః ప్రాణో జ్యేష్ఠః ప్రజాపతిః ! 
హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనః !! 

ఈ పవిత్ర శ్లోకమునందు శ్రీహరి పదివిధములగు మంగళనామములతో గానము చేయబడు ౘున్నాడు. 

64) ఈశానః ఓం ఈశానాయనమః 

సర్వమునూ శాశింౘువాడు ఈయన భయము వలననే సూర్యాగ్నిచంద్రులునూ వాయువు మున్నగు నవి తమతమ నిత్యకార్యక్రమములలో మిగుల జాగ్రత్తగా ప్రవర్తింౘు ౘుందురు గావున " ఈశానః" అని శ్రీహరి కీర్తనీయుడగుౘున్నాడు. 

65). ప్రాణదః ఓంప్రాణదాయనమః 

1). ప్రాణులకు చైతన్యమును ప్రసాదింౘు వాడు 

2). కాలుని రూపమున ప్రాణులను సంహరింౘువాడు. 

3). ప్రాణులను శోధింౘువాడు 

4) ప్రాణులను ఛేదింౘువాడు. 

సంస్కృతభాషలో "దః" అనునది "ఇచ్చుట" అనియును, నాశనము చేయుటయును అను రెండు విధములగు అర్థములను సూచింౘును. కనుక ప్రాణ+దః = ప్రాణశక్తిని ఇచ్చువాడు అనియును 
ప్రాణ+దః = పారాణులను నశింపచేయువాడనియును కూడా అర్థమేయగును. భగవానుడు సర్వశక్తిమంతుడని ఈనామము సూచింౘును. ఖండింౘువాడును అతడే, రక్షించి పోషింౘు వాడునూ అతడేయను భావమును ఈనామము సూచింౘుటచేత శ్రీహరి "ప్రాణదః" అను నామముచే గీర్తనీయుడు. 

66) ప్రాణః ఓం ప్రాణాయనమః 

ఉౘ్ఛ్వాసనిశ్వాసములను కల్గింౘు వాడు. ప్రాణులకు ప్రాణమై యున్నవాడని బృహదారణ్య కోపనిషత్తు తెలుపుౘున్నది. 
(ప్రాణస్య ప్రాణః). ఈ శ్రుతివాక్యము ననుసరించి ప్రాణః అనగా క్షేత్రజ్ఞుడు లేక పరమాత్మయని చెప్పబడును.

 --((**))--

హరిః ಓమ్

8) శ్లోకము

ఈశానః ప్రాణదః ప్రాణో జ్యేష్ఠః ప్రజాపతిః !
భూగర్భో మాధవో మధుసూదనః !!

ఈ పవిత్ర శ్లోకమునందు శ్రీహరి పదివిధములగు మంగళ నామములతో గానము చేయబడు ౘున్నాడు.

67) జ్యేష్ఠః ఓం జ్యేష్ఠాయనమః

అన్నిటికంటే మిక్కిలి పెద్దవాడు అని భావార్థము.

68) శ్రేష్ఠః ఓం శ్రేష్ఠాయనమః

అన్నిటికంటే మిక్కిలి ప్రశంశనీయుడు అని అర్థము.

69) ప్రజాపతిః ఓం ప్రజాపతయేనమః

ప్రజలకు అధిపతి. ప్రజలనగా సంతానమని యర్థము. కాన ప్రజాపతియనగా "పరమపితా" వాత్సల్యస్వరూపుడగు తండ్రి. " పితా√హమస్య జగతః" అను గీతావాక్యము స్మరణీయము (అ_9_17).

70) హిరణ్యగర్భః ఓంహిరణ్యగర్భాయనమః

విశ్వరూపమగు హిరణ్యమును గర్భమునందు ధరించినవాడగుటచే హిరణ్యగర్భుడగును. బ్రహ్మాండ స్వరూప మయిన హిరణ్మయాండమునందు వ్యాపించి ఉన్న సృష్టికర్త యగు బ్రహ్మదేవుడు హిరణ్యగర్భుడగును. అట్టి వానికి ఆత్మయై యున్నందున శ్రీహరి " హిరణ్యగర్భః" అని పిలువ బడును.

71) భూగర్భః ఓం భూగర్భాయనమః

భూమినంతనూ తన గర్భమునందు ధరించినవాడగుటచే శ్రీహరి " భూగర్భః " అని కీర్తనీయుడు.
--((**))--

హరిః ಓమ్

8) శ్లోకము

ఈశానః ప్రాణదః ప్రాణో జ్యేష్ఠః ప్రజాపతిః !
హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనః !!

ఈ పవిత్ర శ్లోకమునందు శ్రీహరి పదివిధములగు మంగళనామములతో గానము చేయబడు ౘున్నాడు.

72) మాధవః ఓం మాధవాయనమః

మాధవ శబ్దము భక్తులకత్యంత ప్రియమైనది.

1) మా+ధవః= మాధవః "మా" అనగా లక్ష్మి యనియర్థము లక్ష్మికి భర్తయైనవాడు.

2) "మా" యనగా మాయ లేక ప్రకృతి. ప్రకృతి కి అధిపతి యగుటచే భగవానుడు మాధవిడగును.

3) మాధవ శబ్దము మౌనమునకు చిహ్నము. ఆత్మ (మాధవః) నిస్సంగము.నిర్లిప్తము గనుక భగవానుడు మాధవు డగును .

4) మౌనమువలననూ , ధ్యానమువలననూ, యోగము వలననూ, పొందబడువాడు మాధవుడని మహాభారతములో వ్యాసమహర్షి వాక్యము. ( మౌనాత్, ధ్యానాచ్చ, యోగాచ్చ విద్ది భారత మాధవమ్). (మహా భా _ఉ.ప.70-4)

5) బృహదారణ్యక శ్రుతి యందు చెప్పబడిన రీతిగా మధు విద్యద్వారా తెలిసికొనబడువాడు కనుక మాధవుడగును. 

6). సకల విభూతులకును అధిపతి యగుటచేత మాధవుడయ్యెను. ఆయనను ఆశ్రయించినవారికి సర్వ శుభము లునూ కలుగునని తాత్పర్యము.

73) మధుసూదనః ఓంమధుసూదనాయనమః

1) మధుకైటబులను రాక్షసులను సంహరించి న కారణమున భగవానుడు మధుసూదనుడాయెను.

2) మధుకైటబాది రాక్షసులు బాహ్యములుగానున్నరాక్షసులు మాత్రమే కాదు.మానవుల హృదయ క్షేత్రాలలోనివసిస్తున్నఅహంకార మమకారములే మహారాక్షసులు.హరిచింతన ధ్యానాదుల వలన
యిట్టి రాక్షసులు నశింతురు. కనుక శ్రీహరి మధుసూదనుడాయెనని లాక్షణికార్థము.

3) మధువనగా మాధుర్యము. వేదములందలి కర్మకాండల యొక్క ఫలితములు తాత్కాలికంగా మాధుర్యముగా నుండును. అవి జన్మపరంపరలనే కల్గింౘు నుగానీ మోక్షమునీయజాలవు.
హరిచరణధ్యానమున కర్మఫలవాసనలు నశించి మోక్షము సిద్ధంబగును.కావున "మధుసూదనః" అని కీర్తనీయుడగుౘున్నాడు.

--((**))--


హరిః ಓమ్

9) శ్లోకము

ఈశ్వరో విక్రమీ ధన్వీ మేధావీ విక్రమః క్రమః !
అనుత్తమో దురాధర్షః కృతజ్ఞః కృతిరాత్మవాన్ !!

ఈ శ్లోకమునందు పదునొకండు హరినామములు గానముచేయ బడుౘున్నవి.

74) ఈశ్వరః ఓం ఈశ్వరాయనమః

సర్వమునూ శాశింౘువాడును , సర్వశక్తిసంపన్నుడు సర్వులకును అధిపతియును, తన్నా శ్రయించినచో శక్తులను ప్రసాదింౘు వాడు నగుటచేత శ్రీహరి "ఈశ్వరుడని " పిలువబడు ౘున్నాడు.

75) విక్రమీ ఓం విక్రమిణేనమః

1) బలము, తేజస్సు, ఓజస్సు, పరాక్రమము, సాహసము మున్నగు దివ్యగుణములతో గూడిన వాడగుటచేత భగవానుడు "విక్రమీ" యని అర్చనీయుడగును.

2) "విక్రమీ" అను ఈనామమునకు ప్రత్యేక పాదచిహ్నములు గలవాడనియు‌, అర్థము చెప్పబడుౘున్నది. తనయొక్క మూడు పాదములతోను ముల్లోకములను నింపిన శ్రీహరి యొక్క వామనావతారమును ఈనామము సూచింౘుౘున్నది యని భక్తులయొక్క భావము.

76) ధన్వీ ఓం ధన్వినేనమః

ధనస్సు ను ధరించినవాడని భావము. ధనస్సు గలవాడగుటచేత, ధన్వీయనబడును. విష్ణుదేవుని ధనస్సును " శార్ఙ్గ " మని పిలుతురు. రామావతారమున శ్రీహరి ధనస్సును ధరించి దుష్టరాక్షస సంహారము గావించెను. ఆయన కోదండపాణి, ధనుర్ధారియని ప్రసిద్ధి గాంచెను. " ధనుర్ధారులలో రాముడను నేను" అను గీతావాక్యము స్మరణీయము(10_31).

77) మేధావీ ఓం మేధావినేనమః

మహాజ్ఞాన భాండారము, సర్వమునూ గ్రహింౘగల సర్వశక్తినిధి యగుటచే శ్రీపతి మేధావియని పిలువబడెను. 
--((**))--

హరిః ಓమ్

9) శ్లోకము

ఈశ్వరో విక్రమీ ధన్వీ మేధావీ విక్రమః క్రమః !
అనుత్తమో దురాధర్షః కృతజ్ఞః కృతిరాత్మవాన్ !!

ఈ శ్లోకమునందు పదునొకండు హరినామములు గానముచేయ బడుౘున్నవి.

78) విక్రమః ఓం విక్రమాయనమః

వామనావతార వైభవమును దెలుపు పవిత్రనామము (75 వ ఈనామముయొక్క వివరణమును ౘూడనగును.)

75) విక్రమీ ఓం విక్రమిణేనమః

{ 1) బలము, తేజస్సు, ఓజస్సు, పరాక్రమము, సాహసము మున్నగు దివ్యగుణములతో గూడిన వాడగుటచేత భగవానుడు "విక్రమీ" యని అర్చనీయుడగును.

2) "విక్రమీ" అను ఈనామమునకు ప్రత్యేక పాదచిహ్నములు గలవాడనియు‌, అర్థము చెప్ప బడుౘున్నది. తనయొక్క మూడు పాదములతోను ముల్లోకములను నింపిన శ్రీహరి యొక్క వామనావతారమును ఈనామము సూచింౘుౘున్నది యని భక్తులయొక్క భావము.}

మఱియొక వివరణము. "వి". యనగాపక్షిరాజగు గరుత్మంతుడని యర్థము. "క్రమ" మనగా పాదములని యర్థము. అనగా గరుత్మంతుని మూపుపై పాదములుంచి పయనింౘు విష్ణువు ఈ
నామము చే సూచింపబడుౘున్నాడని భక్తులయొక్క భావమై యున్నది.

79) క్రమః ‌‌‌‌ఓం క్రమాయనమః

విశ్వమంతయూ నిండి విస్తరించి, వికసించి, వ్యాప్తి చెందిన పరబ్రహ్మము "క్రమః" అను దివ్యనామముతో గానము చేయబడును.

80). అనుత్తమః ఓం అనుత్తమాయనమః

" ఈయన కంటే మరియొక శ్రేష్ఠుడైనవాడు వేరొకడులేడని" ఈనామముయొక్క గంభీర భావ మైయున్నది.

"యస్మాత్ పరం నాపరమస్తికశ్చిత్" అని శ్రుతి గానము చేయును. ఈయనకంటే శ్రేష్టమైనది లేదని భావము.

"నత్వత్సమో√స్త్యభ్యధికః కుతో√న్యః" (గీత 11_4).

నీతో సమానుడే లేడుకదా, మరి నీకంటే గొప్ప వాడింకెవరుందురు ? అని భావము. అట్టి సర్వశ్రేష్ఠుని శరణు బొందుటే కర్తవ్యమని భక్తులకు ప్రబోధము.

--((**))--


9) శ్లోకము

ఈశ్వరో విక్రమీ ధన్వీ మేధావీ విక్రమః క్రమః !
అనుత్తమో దురాధర్షః కృతజ్ఞః కృతిరాత్మవాన్ !!

ఈ శ్లోకమునందు పదునొకండు హరినామములు గానముచేయ బడుౘున్నవి.

81) దురాధర్షః ఓం దురాదర్షాయనమః

" తన్నెదిరింపగల శక్తిసంపన్నుడెవడును లేనేలేడని "
ఈ నామముయొక్క భావము. సమస్త రాక్షస దైత్యవీర సమూహ ములను జయించినవాడు శ్రీహరియే కదా ! ఆయనను జయించిన వారెవ్వరునూ లేరు.

ఈ నామమును ఆధ్యాత్మికముగా నన్వయించినచో మనఃక్షేత్రమునందుగల విషయవాసనలు, అసురతత్వములు మున్నగునవన్నియును శ్రీహరిచింతన , జపధ్యానములచేత నశింౘునని భావము.

82) కృతజ్ఞః ఓం కృతజ్ఞాయనమః

భగవానుడు సర్వజ్ఞుడగుటచే ప్రతివాని మనస్సు నందును గలుగుౘుండు సమస్తబబావములు, ఆలోచనలు గ్రహింపగలిగినవాడై వారి సంస్కారములకును భక్తిశ్రద్ధలకును అనుగుణముగా ఫలములను ప్రసాదింౘువాడగుటచేత "కృతజ్ఞః"అను నామముతో స్తవనీయుడగును. భక్తులు స్వల్పములగుపత్రపుష్ప ఫలాదులు సమర్పించినను, ఆయా వస్తువుల బాహ్య స్వరూపములను బట్టిగాక వారియొక్క హృదయగత భక్తిభావములకనుగుణంగా మహత్తర పుణ్యఫలములును, మహోన్నతమునగుమోక్షమునుగూడా ప్రసాదింౘు "కృతజ్ఞమూర్తి" భగవానుడని భావం.

83) కృతిః ఓం కృతయేనమః

పురుషప్రయత్నమునకు "కృతి" అని పేరు. ఇదియు
ను దైవస్వరూపమేయని గీతావాక్యమగుటచేత. ఈశ్వరుడు "కృతి"యని గానము చేయబడును. " వ్యవసాయోస్మి" (అ10_36) ఆత్మసాక్షాత్కారమునకు భక్తుడాచరింౘు పుణ్యసాధనములన్నియూ
భగవత్స్వరూపములే యగునని భావింౘనగును.

84) ఆత్మవాన్ ఓం ఆత్మవతేనమః

చరాచరాత్మకమగు విశ్వమందంతటనూ ఆత్మస్వరూపుడై భాసిల్లు పూర్ణస్వరూపుడే భగవానుడు. నిరంతరమునూతనదివ్యమహామహిమయందే యున్నవాడగుటచే "ఆత్మవాన్" ్నబడియెనని చాందోగ్యోపనిషత్తు తెలుపును.

హరిః ಓమ్

10) శ్లోకము

సురేశః శరణం శర్మ విశ్వరేతాః ప్రజాభవః !
అహః సంవత్సరో వ్యాళః ప్రత్యయః సర్వదర్శనః !!

ఈశ్లోకమునందు పది హరినామములు గలవు.

85) సురేశః ఓం సురేశాయనమః

సురలనగా స్వర్గలోకవాసులగు దేవతలు. వీరును శక్తి సంపన్నులగుట చేత. తమ్మాశ్రయించిన భక్తులకు వరముల నొసంగు ౘుందురు. శ్రీమన్నారాయణమూర్తి భక్తులకును, దేవతలకునూ
గూడ వరప్రదాతయగుట చేత. "సురేశః" అనునామమున ప్రసిద్ధుడయ్యెను.

(49వ నామవివరణమును గమనింప ప్రార్థన)

86) శరణం ఓం శరణాయనమః

తనను హృదయపూర్వకముగా శరణు జొచ్చిన భక్తుల నందరినీ రక్షింౘువాడు గనుక. శ్రీహరి శరణం అని పిలువబడు ౘున్నాడు . 

" ఎంతటి పాపియైననూ నేను నీవాడను రక్షింపుము" అని శరణుబొందిన వారినెల్ల కాపాడుటయే నా వ్రతము " అని శ్రీరాముని శపథము స్మరణీయము.
( శ్రీమద్రామాయణము, యుద్ధ కాండ- విభీషణశరణాగతి)

" రక్షమాంశరణాగతాం " అని ద్రౌపది ఆక్రందనము చేసి నంతనే అక్షయవస్త్రదాన మిచ్చినాడు శ్రీకృష్ణుడు " నీవేతప్ప నితః పరం బెరుగ మన్నింపందగున్ " యను గజరాజు మొరలాల కించిన
వాడు భగవానుడే. " నన్ను ఆశ్రయించిన వారందఱునూ పరమగతినే పొందుదురు " అను గీతావాక్యములు స్మరణీయములు 
(గీత అ_9 శ్లో 30,31,32,33).

87) శర్మ. ఓం శర్మణేనమః

పరమానంద స్వరూపుడనియును, సత్ + చిత్ + ఆనంద మూర్తి యనియును " సత్యం , శివం , సుందరమ్ ". అనియును ఉపనిషద్వర్ణనము.తన్నాశ్రయించిన వారందఱకును పరమా
నందమును ప్రసాదింౘు వాడగుటచే " శర్మ " అని భగవానుడు ఆరాధ్యుడగును.

--((**))--


హరిః ಓమ్

10) శ్లోకము

సురేశః శరణం శర్మ విశ్వరేతాః ప్రజాభవః !
అహః సంవత్సరో వ్యాళః ప్రత్యయః సర్వదర్శనః !!

ఈశ్లోకమునందు పది హరినామములు గలవు.

88) విశ్వరేతాః ఓం విశ్వరేతసేనమః

రేతస్సు అనగా "బీజము" అని అర్థము. సంసారమను మహావృక్షమునకు భగవానుడే బీజమగుట చేత "విశ్వరేతా" యని పిలువబడును. (గీత అ 15_శ్లో_1,2 స్మరణీయములు)

89) ప్రజాభవః ఓం ప్రజాభవాయనమః

సకలప్రాణికోటులకును భగవానుడే జన్మకారణము. ఆయన నుండియే చరాచరాత్మక మగు సర్వసృష్ఠియును కలిగిన కారణమున "ప్రజాభవః" అనబడెను.

90) అహః ఓం అహ్నేనమః

ఈ పుణ్యనామము రెండు భావములను సూచింౘుౘున్నది

1). అహః అనగా పండ్రెండుగంటల కాలప్రమాణముగల పగటికాలమని భావము. ఈ భావాను సారముగా భగవానుడు పగటికాలమువలె ప్రకాశస్వరూపుడని భావము. సూర్యకాంతిలో సర్వ వస్తువులను మనము ౘూడగలుగునట్లు ఆత్మప్రకాశమున సర్వమును ప్రకాశింౘు ౘున్న దని భావార్థము.

2) ఇరువది నాలుగుగంటలుప్రమాణముగల ఒకదినముకూడా "అహః" అని పిలువబడును. ఈ భావము ననుస రించి భగవానుడు కాలస్వరూపుడని సూచన. "దినము" అనునది
కాలము యొక్క గణనకు ఒక ప్మాణమగుటచేత "అహః" అనునది భగవన్నామమగును.

3) అ+హః అనగా తన్నాశ్రయించిన భక్తులనెన్నడును నాశనము చేయువాడు కాడు అని భావార్థము.

" నమే భక్తణ ప్రణశ్యతి". నా భక్తు డెన్నడునూ నాశనముకాడు. అను భగవద్వాక్యము స్మరణీయము.(గీత అ9_32).

విష్ణు సహస్రనామ స్తోత్రమ్

( సంగ్రహ తాత్పర్య వివరణము)

(04_9_2018)

హరిః ಓమ్

10) శ్లోకము

సురేశః శరణం శర్మ విశ్వరేతాః ప్రజాభవః !
అహః సంవత్సరో వ్యాళః ప్రత్యయః సర్వదర్శనః !!

ఈశ్లోకమునందు పది హరినామములు గలవు.

91) సంవత్సరః ఓం సంవత్సరాయనమః

ఈ నామము కూడా కాల ప్రమాణమునే తెలుపుౘున్నది. భగవానుడు కాలస్వరూపుడనియు ఆయన నుండి యే కాలముయొక్క గణనము ఆరంభమైనదనియు శాస్త్ర వాక్యము. "కాలః కలయతామహం" గణన చేయువానియందు కాలమునునేను.
గీత (10_30) అహమేవాక్షయః కాలః(గీత 10_33) నేను నాశనము
లేని కాలస్వరూపుడను " అని గీతావాణి.

92). వ్యాళః _ఓం వ్యాళాయనమః

వ్యాళమనగా సర్పమని అర్థము. భక్తిహీనులకును మూఢులకును, దుర్మార్గులకును భగవానుడు సర్పమువలె మహా భయంకరుడని భావము.

నేర్పరితనముగాని, మంత్రనియమముగాని లేని సామాన్యులకు భయంకరమగు విషసర్పమును బట్టుట సాధ్యము గాని రీతిగా ఆధ్యాత్మిక సాధనోపాయములు సాధింౘని మూఢులకు
ను భగవానునిపట్టు కొనుటయు దుర్లభమే యను భావమును గ్రహింపనగును.

 --((**))--

హరిః ಓమ్

10) శ్లోకము

సురేశః శరణం శర్మ విశ్వరేతాః ప్రజాభవః !
అహః సంవత్సరో వ్యాళః ప్రత్యయః సర్వదర్శనః !!

ఈశ్లోకమునందు పది హరినామములు గలవు.

93) ప్రత్యయః ఓం ప్రత్యయాయనమః

జ్ఞాన స్వరూపుడని ఈ శబ్దముయొక్క భావము " ప్రజ్ఞానం బ్రహ్మ", "ప్రజ్ఞానమే బ్రహ్మమ" ని శ్రుతి వాక్యము స్మరణీయము. "జ్ఞానాదేవతుకైవల్యమ్". జ్ఞానమువలననే మోక్షము గలుగునని
చెప్పుటచేత జ్ఞాన ప్రాప్తికి సాధనములగు నిష్కామ కర్మానుష్ఠానము, భక్తియోగమును అభ్యసింౘవలెనని సాధకులకు సూచన.

94) సర్వదర్శనః ఓం సర్వదర్శనాయనమః

"సమస్తమునూ ౘక్కగాౘూౘువాడు"

(1) మానవుని మనస్సులోని అంతరాంతరములో కలుగు సకల భావములను, సర్వేంద్రియ కార్యకలాపములను సమస్తమును సదా ౘూౘుౘున్నవాడు ఈశ్వరుడే యగుటచేత "సర్వదర్శనః" అని పిలువబడుౘున్నాడు. కావున ప్రతి వారును పాపము చేయక ధర్మ వరాతనులై యండవలెనని హెచ్చరిక.

(2) హిందూ వేదాంత సాహిత్య మున భగవత్ప్రాప్తికి ఆరు ప్రధాన సూత్ర విజ్ఞానములను మహర్షులు వివరించిరి. వీనినే " షడ్దర్శనము" లందురు. 1)న్యాయదర్శనము, 2) వైశేషిక దర్శనము 3) సాంఖ్యదర్శనము 4) యోగదర్శనము 5) పూర్వ మీమాంసదర్శనము 6) ఉత్తరమీమాంసదర్శనము ఈషడ్దర్శన ముల ద్వారా దర్శింపదగినవాడు పరమాత్మయే గనిక "సర్వదర్శనః" అనబడెను.

(3) "దర్శన" శబ్దమునకు నేత్రమని యర్థముగలదు.
ఆయన విశ్వనేత్రుడు. "అనేక వక్త్రనయనమ్". (11_10) తత్సర్వ తోక్షి శిరోముఖమ్(11_13). శశిసూర్యనేత్రమ్ (11_19) అను గీతా వాక్యము లు స్మరణీయములు.

హరిః ಓమ్ 

11) శ్లోకము 

అజః సర్వేశ్వరః సిద్ధః సిధ్ధిః సర్వాదిరచ్యుతః ! 
వృషాకపిరమేయాత్మా సర్వయోగ వినిస్రుతః !! 

ఈ శ్లోకము తొమ్మిది హరినామములతో వెలయుౘున్నది. 

95) అజః ఓం అజాయనమః 

పుట్టువులేనివాడు. "నజాతో- నజనిష్యతే", "నహిజాతో- నజాయేహ_ నజనిష్యేకదాచన" అని శ్రుతిగానము చేయును.. 

క్షేత్రజ్ఞః సర్వభూతానాం- తస్మాదహమజఃస్మృతః (భారతము శాంతి పర్వము). 
నేనెన్నడును పుట్టినవాడనుకాను. పుట్టికయునాకు లేదు. ఇక ముందును  పుట్టువాడను కాను. నేనుసకల భూతములయందునున్న క్షేత్రజ్ఞుడను గనుక "అజః" అని పిలువబడుౘున్నాను. 

96) సర్వేశ్వరః ఓం సర్వేశ్వరాయనమః 

ఈశ్వరులకెల్ల ఈశ్వరుడు, ప్రభువులకెల్ల ప్రభువు, "ఏష సర్వేశ్వరః". ఈతడే సర్వేశ్వరుడని శ్రుతిమాత గానముచేయును. 

97). సిద్ధః ఓం సిద్ధాయనమః 

పొందదగిన సమస్త సిద్ధులనొందియే యున్నవాడు. ఇక ఈయన పొందదగిన సిద్ధులేవియును లేనేలేవని భావము. " నానవాప్త మవాప్తవ్యమ్ ". అని గీతావాణి (3_22) 

98) సిద్ధిః ఓం సిద్ధయేనమః 

ఫలస్వరూపుడు. తన్నాశ్రయించిన భక్తులకు వారివారి సంస్కారసాధనాదుల ననుసరించి సర్వసిద్దులను (అనగా స్వర్గా దులగు నశింౘునట్టి ఫలములేగాక నాశనములేని మోక్షమును) 
ప్రసాదింౘు వాడు ఈశ్వరుడే గనుక సిద్ధిః అను పుణ్యనామము తో ప్రసిద్దుడగుౘున్నాడు. 

99) సర్వాదిః ఓం సర్వాదయేనమః 

మూలకారణస్వరూపమగు పరబ్రహ్మయే "సర్వాదిః"  అనబడును. సకలసృష్టికి పూర్వమందే యున్న పరమాత్మ సర్వాదియగును.

--((**))__


హరిః ಓమ్ 

11) శ్లోకము 

అజః సర్వేశ్వరః సిద్ధః సిధ్ధిః సర్వాదిరచ్యుతః ! 
వృషాకపిరమేయాత్మా సర్వయోగ వినిస్రుతః !! 

ఈ శ్లోకము తొమ్మిది హరినామములతో వెలయుౘున్నది. 

100) అచ్యుతః ఓం అచ్యుతాయనమః 

"చ్యుతి" యనగా "పతనము" అని అర్థము. చ్యుతి లేని వాడు గనుక భగవానుడు "అచ్యుతుడు" అని ప్రసిద్ధి గాంచెను. తన దివ్య తేజో విభూతి శక్తి సంపన్నత్వముల నుండి యెన్నడునూ జారనివాడు గాన శ్రీహరి అచ్యుతుడయ్యెను. " శాస్వతగ్ం శివమచ్యుతమ్" అని శ్రుతిగానము. అనగా నిత్యుడు, మంగళకరుడు, అచ్యుతుడని భావము. 

భగవంతుని ఆశ్రయించిన భక్తులకుకూడా యెన్నడూ పతనముగానీ, పరాభవముగానీ, నాశనము గానీ లేదని ఈ నామము భక్తులకు అభయదానము నిచ్చుచున్నది. 

101). వృషాకపిః ఓం వృషాకపయేనమః 

"కపి" యను శబ్దమునకు మునిగిపోవుదానిని ఉద్ధరింౘు ట అని అర్థము. 

(1) జలములలో మునిగిపోవు భూమినియుద్ధరించిన మహావిష్ణువుయొక్క ప్రథమావతారమును ఈనామము తెలుపుౘున్నది. 

(2) "కపిః" అనగా వరాఙమూర్తి. "వృషః". అనగా ధర్మము అందుచేత కశ్యపుడు నన్ను "వృషాకపి" యని పిలచెను. అని మహాభారతమున చెప్పబడియున్నది. కోరికలను వర్షింపజేయునది 
యగుట చేత ధర్మమునకు "వృషః" అను నామము గలిగెను. 

కాత్ -- ఉదకములనుండి భూమిని "అపాత్" అనగా రక్షించెనుగనుక వరాహమూర్తి "కపి" అనబడును. "వృషః" ధర్మ స్వరూపుడును "కపి" వరాహస్వరూపుండును నగుటచేత శ్రీహరి 
"వృషాకపి" యని స్తవనీయుడయ్యెను. అధర్మముతో నున్న భూమిని ఉద్ధరింౘు వాడగుటచేత శ్రీహరి "వృషాకపి" యనబడును. 

"జనన మరణ జరా వ్యాధి భరితమగు భయంకర సంసార సాగరమునుండి ఉద్ధరింౘు వాడను నేను అని భగవద్వాక్యము గలదు. (గీత అ12_7).

--((**))--

హరిః ಓమ్ 

11) శ్లోకము 

అజః సర్వేశ్వరః సిద్ధః సిధ్ధిః సర్వాదిరచ్యుతః ! 
వృషాకపిరమేయాత్మా సర్వయోగ వినిస్రుతః !! 

ఈ శ్లోకము తొమ్మిది హరినామములతో వెలయుౘున్నది. 

102) అమేయాత్మా ఓం అమేయాత్మనేనమః 

ఆత్మస్వరూపముయొక్క ప్రమాణమును కొలిచి చెప్పుటకు సాధ్యముకాదు కనిక అమేయాత్మాయని పిలువబడును. 

మరియొకభావము _ అనేకరూపములతో, అనేక  లీలావిభూతి విశేషములతో, అనేకతావులందు, అనేకకాలముల యందు విస్తరించి, వికసించి, వెలుంగు విరాట్ పురుషుడే "అమేయాత్మా" అనబడుౘున్నాడని భావము. సాగరమునుండి జనించిన తరంగము లన్నియును తిరిగి సాగరమునందే లయించు నట్లు, విశ్వాత్మునినుండి జనించిన సర్వసృష్టి విలాసములును తిరిగి 
ఆయనయందే లయింౘును. కాన "అమేయాత్మా" అని శ్రీహరి గానము చేయబడెను. 

103) సర్వయోగవినిస్రుతః 

ఓం సర్వయోగవినిస్రుతాయనమః 

దేనితోనూ సంగము లేనివాడని దీని భావార్థము. "అసంగో హ్యయం" అని శ్రుతి (బృ.ఉపనిషత్ 4_8_45) అంతయు ను ఆత్మపదార్థమేయై యుండగా మఱిదేనితో సంగము పొంద గలవని ఉపనిషత్ ప్రశ్నము. 

సంగరహితముగా జీవంౘువాడే అసంగుడగు పరమాత్మను బొందునను భావము గ్రహింౘదగును. 
మఱియొక భావము : వివిధ శాస్త్రములందు చెప్పబడిన అనుష్ఠానములద్వారా పొందుటకు వీలుకానివాడనియును జ్ఞానులు భావింతురు. కారణమేమన సమస్త కర్మలును చిత్తశుద్దిని మాత్రము కలిగింౘుటకే. కర్మలు సాక్షాత్తుగా జ్ఞానప్రదములు కాజాలవని గ్రాహ్యము.
--((**))--


No comments:

Post a Comment