Friday, 10 July 2020

సప్తమ స్కంధము - పదకొండవ అధ్యాయము
మానవ ధర్మములు - వర్ణ ధర్మములు - స్త్రీ ధర్మములు
ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
శ్రీశుక ఉవాచ
శ్రీ శుకుడు వచించెను- పరీక్షిన్మహారాజా! భగవద్భక్తుడైన ప్రహ్లాదుని కీర్తి సాధుసమాజము నందు ప్రశంసలను అందుకొనెను. అతని పవిత్ర గాథను విని, ధర్మాత్ముడైన యుధిష్ఠిరునకు మిగుల ఆనందము కలిగెను. అతడు నారదుని ఇట్లు ప్రశ్నించెను-

యుధిష్ఠిర ఉవాచ

యుధిష్ఠిరుడు అడిగెను- మహాత్మా! నేను వర్ణాశ్రమ సదాచారములను గూర్చియు, మానవుల సనాతన ధర్మములను గురించియు వినగోరుచున్నాను. ఎందుకనగా, మానవులకు ధర్మము వలననే జ్ఞానము, భగవద్భక్తి కలుగును. వారికి సాక్షాత్తు పరమపురుషుని ప్రాప్తిగూడ కలుగును గదా!

నారదమహర్షీ! నీవు సాక్షాత్తు పరమేష్ఠియైన బ్రహ్మదేవుని సుతుడవు. తపస్సు, యోగము, సమాధి మొదలగువాటి కారణముగా బ్రహ్మదేవుని కుమారులలో ఇతరులకంటె గొప్ప గౌరవమును పొందుదువు.

నీ వంటి నారాయణ పరాయణులు, దయాళువులు, సదాచారసంపన్నులు, శాంత స్వభావులు మరియెవ్వరును లేరు. నీవు ధర్మముల రహస్యములను, యథార్థరూపములను బాగుగా ఎరిగినవాడవు. కానీ, ఇతరులకు ఆ  ధర్మరహస్యములు తెలియవు.

నారద ఉవాచ

నారదుడు వచించెను-ధర్మరాజా! జన్మరహితుడైన భగవంతుడే సకల ధర్మములకు మూలకారణము. ఆ ప్రభువే చరాచర జగత్తుయొక్క శ్రేయస్సుకొరకు ధర్ముడు మరియు దక్షపుత్రికయైన మూర్తి అను దంపతులకు తన అంశముతో అవతరించి, బదరికాశ్రమమునందు తపస్సు చేయుచున్నాడు. ఆ శ్రీమన్నారాయణునకు నమస్కరించి, ఆ స్వామివలన వినిన సనాతన ధర్మములను నీకు వివరించెదను.

శ్రీ హరిభగవానుడు సర్వవేద స్వరూపుడు. ఆయన తత్త్వమును ఎరిగిన మహర్షులచే చెప్పబడినవి స్మృతులు, వాటినుండి ఆత్మజ్ఞానమును పొందుటయే సర్వధర్మములకు మూలము. ఇట్టి ధర్మసంపాదనము వలన అంతఃకరణము ప్రసన్నమగును.

ధర్మరాజా! ధర్మమునకు ముప్పది లక్షణములు గలవని శాస్త్రములయందు పేర్కొనబడినది. అవి ఏవనగా- సత్యము, దయ, తపస్సు, శౌచము, తితిక్ష (ఓర్పు), ఉచితానుచితవిచారము, మనోనిగ్రహము, ఇంద్రియముల సంయమనము, అహింస, బ్రహ్మచర్యము, త్యాగము, స్వాధ్యాయము, సరళత్వము, సంతోషము, సమదృష్టి, మహాత్ములసేవ, మెల్లమెల్లగా సంసార భోగమునుండి నివృత్తి, మనుజునకు అభిమానముతో గూడిన ప్రయత్నముల ఫలము విపరీతముగా ఉండునను విచారము, మౌనము, ఆత్మచింతనము, ప్రాణులకు వాటి యోగ్యతకు, శక్తికి తగినట్లుగా అన్నము మొదలగువాటిని పంచియిచ్చుట, అట్టి ప్రాణులను విశేషించి మనుష్యులను ఆత్మస్వరూపులనియు, ఇష్టదేవతా స్వరూపములనియు భావించుట, సత్పురుషులకు పరమ ఆశ్రయమగు శ్రీకృష్ణుని నామ, గుణ, లీలావైభవములను వినుట, కీర్తించుట, స్మరించుట, సేవలొనర్చుట, పూజించుట, నమస్కరించుట, ఆ ప్రభువునకు దాస్యము, సఖ్యము, ఆత్మసమర్పణము గావించుట అను - ఈ ముప్పది ధర్మములను ఆచరించుటయే మానవుల పరమ ధర్మము. వీటిని పాటించుట వలన సర్వాత్ముడైన భగవంతుడు ప్రసన్నుడగును.

యుధిష్ఠిరా! తమవంశములో పరంపరగా వచ్చెడి సంస్కారవిధులను, వైదిక సంస్కారములను స్వీకరించు వారిని ద్విజులందురని బ్రహ్మదేవుడు చెప్పెను. ద్విజులకు యజ్ఞము, వేదాధ్యయనము, దానములు విధించబడినవి. జన్మ, కర్మలద్వారా పవిత్రులైన ద్విజులకు బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్న్యాసములనెడు ఆశ్రమములకు చెందిన కర్మలు కూడ విధించబడినవి.
అధ్యయనము, అధ్యాపనము, దానములను ఇచ్చుట, పుచ్చుకొనుట, యజ్ఞములను చేయుట, చేయించుట (యజనయాజన అధ్యయన అధ్యాపన దాన ప్రతిగ్రహములు) అను ఆరును బ్రాహ్మణుల యొక్క విధులు. క్షత్రియులు దానమును తీసికొనరాదు. ప్రజారక్షణము చేయునట్టి క్షత్రియుడు విప్రులను దప్ప, మిగిలిన వారినుండి యథాయోగ్యముగా పన్నులను స్వీకరించుట, దోషులకు శిక్షలను, అపరాధపన్నులను విధించుట మొదలగునవి క్షత్రియ (జీవన) ధర్మములు.

వైశ్యుడు సర్వదా బ్రాహ్మణవంశజులకు అనుయాయులై గోరక్షణము, వ్యవసాయము, వ్యాపారముల ద్వారా తన జీవితమును నడుపుకొనవలెను. ద్విజాతి వారిని సేవించుట శూద్రులకు ధర్మము. అతనియొక్క జీవికను అతని యజమాని నడుపును.

బ్రాహ్మణులయొక్క జీవితములు నాలుగు సాధనముల ద్వారా నిర్వహింపబడును. అవి ఏవనగా - 1) వార్త, 2. శాలీనము, 3. యాయవారము, 4. శిలోంఛనము వీటిలో క్రమముగా మొదటి దానికంటె తరువాతది శ్రేష్ఠము.

1) వార్త అనగా యజ్ఞములు, అధ్యయనము మొదలగువాటి ద్వారా ధనము సంపాదించుట. 2) శాలీనము అనగా ఎవ్వరినీ యాచించకుండా లభించినదానితో జీవించుట, 3) యాయవారము అనగా నిత్యము ధాన్యాదులను యాచించి జీవించుట, 4) శిలోంఛనము అనగా రైతులు పైరు కోసినప్పుడు పొలములో జారిపడిన  గింజలను, ధాన్యమును ఇంటికి చేర్చునప్పుడు క్రిందబడిన గింజలను, వ్యాపార గిడ్డంగులచోట క్రిందపడిన గింజలను ఏరుకొని, వాటితో జీవించుట.
నిమ్నవర్ణములవారు ఆపత్కాలమునందు తప్ప అగ్రవర్ణముల వారి వృత్తులను చేపట్టరాదు. క్షత్రియులు దానములను స్వీకరింపక బ్రాహ్మణులయొక్క మిగిలిన ఐదు వృత్తులను అవలబింపవచ్చును. ఆపత్కాలమునందు అందరూ అన్ని వృత్తులను చేపట్టవచ్చును.
ఋతము - అమృతములు, మృతము - ప్రమృతములు, సత్యానృతములు అను వాటిలో దేనినైనను వృత్తిగా ఆచరింపవచ్చును; కాని ఎవ్వరును శ్వవృత్తి అనగా శ్వానవృత్తిని మాత్రము చేపట్టరాదు.

వీధిలోగాని, పొలములలోగాని, పడిన గింజలను ఏరుకొని, ఱాళ్ళను తీసివేసి, శిలోంఛనము అను వృత్తిని చేపట్టుట ఋతము అని యందురు. ఎవ్వరినీ యాచింపకుండ, అయాచితముగా లభించిన దానితో జీవించుటను అమృతము అనియందురు. ప్రతిదినము యాయవారము ద్వారా జీవించుటను మృతము అని యందురు. వ్యవసాయము మున్నగువాటిద్వారా వార్తావృత్తిని చేపట్టి జీవించుటను ప్రమృతము అని యందురు.

వాణిజ్యము సత్యానృతము అనబడును. నిమ్న వర్ణములవారిని సేవించుట శ్వానవృత్తి అనబడును. బ్రాహ్మణులు, క్షత్రియులు నింద్యమైన వృత్తులను స్వీకరింపరాదు. ఏలయన బ్రాహ్మణులు వేదస్వరూపులు, క్షత్రియులు సకల దేవతాస్వరూపులు.

శమము (మనోనిగ్రహము), దమము (ఇంద్రియ నిగ్రహము), తపస్సు, శౌచము, సంతోషము, క్షమ, సరళత్వము, జ్ఞానము, దయ, భగవత్పరాయణత్వము, సత్యము అనునవి బ్రాహ్మణుని లక్షణములు.

యుద్ధమునందు ఉత్సాహము, పరాక్రమము, ధైర్యము, తేజస్సు, త్యాగము, మనోనిగ్రహము, క్షమ, బ్రాహ్మణుల యెడ భక్తి, ఆర్తులయెడ అనుగ్రహము, ప్రజారక్షణము- అనునవి క్షత్రియుల లక్షణములు.

దేవతలయెడ, గురువులయెడ, భగవంతుని యెడ భక్తి, ధర్మార్థకామము లనెడి పురుషార్థములను పాటించుట, ఆస్తిక్యము, సర్వదా కార్యశూరత్వము, వ్యావహారిక నైపుణ్యము అనునవి వైశ్యుల లక్షణములు.

అగ్రవర్ణములవారియెడ వినమ్రుడై యుండుట, పవిత్రతను కలిగియుండుట, యజమానికి నిష్కపట సేవలను అందించుట, వైదిక మంత్రములు లేకున్నను ఈశ్వరుని ఆరాధించుట, దొంగతనమును చేయకుండుట సత్యమును చెప్పుట, గోవులను, విప్రులను రక్షించుట - అనునవి శూద్రుని లక్షణములు.

పతిని సేవించుట, అతనికి అనుకూలముగా ప్రవర్తించుట, అతని బంధువుల యెడ ప్రసన్న భావమును కలిగియుండుట, సర్వదా పతియొక్క నియమములను రక్షించుట - అనునవి పతివ్రత లక్షణములు.

సాధ్వియైన స్త్రీ తన యింటిని ఊడ్చి, తుడిచి శుభ్రముగా ఉంచి, రంగవల్లులను దిద్దవలెను. నిత్యము తనను అలంకరించుకొని, ఇంటిని, సామాగ్రిని (గృహోపకరణములను)  శుభ్రముగా ఉంచుకొనవలయును. సమయానుసారముగా వినయముతో భర్త యొక్క చిన్స, పెద్ద అవసరాలను నెరవేర్పవలెను. వినయమును, ఇంద్రియనిగ్రహమును కలిగి, సత్యమైన, ప్రియమైన మాటలతో ప్రేమపూర్వకముగా పతిదేవుని సేవింపవలెను.

ఆమె లభించిన దానితో తృప్తి చెందవలెను. ఏ వస్తువు కొఱకైనను పేరాశ కలిగి యుండరాదు. అన్ని పనులయందును దక్షతను కలిగి, ధర్మములను ఎరిగి యుండవలెను. అందరితోను సత్యముగా, ప్రియముగా భాషించవలెను. తన కర్తవ్యమునందు అప్రమత్తముగా ఉండవలెను. తాను పవిత్రయై, తన పతిని పతితుడు గాకుండ ప్రేమతో సేవించుచుండవలెను.

లక్ష్మి దేవివలె పతిసేవా పరాయణయై, పతిని సాక్షాత్తు భగవత్స్వరూపునిగా భావింపవలెను. అందుకు ఆమె పతిదేవుడు వైకుంఠమున భగవత్సారూప్యమును పొందును. ఆమెయు లక్ష్మీదేవివలె అతనితోకూడి ఆనందించును.

ధర్మరాజా! చౌర్యము, అన్యాయము మొదలగు పాపకర్మలు చేయని అంత్యజులు, చండాలురు మున్నగు వర్ణసంకర జాతుల వృత్తులు, వారివారి కుల పరంపరను బట్టి ఉండును.

వేదవేత్తలైన ఋషులు, మునులు బహుశా ప్రతియుగమునందు మనుష్యుల స్వభావములను బట్టి వారి వారి ధర్మముల వ్యవస్థలను రూపొందించిరి. జనులు ఆయా ధర్మములను పాటించుటవలన ఇహపర శుభములను పొందగలరు.

మానవులు తమ స్వాభావిక వృత్తులను ఆశ్రయించి, స్వధర్మ పాలన చేసినచో, వారు క్రమక్రమముగా ఆ కర్మబంధములనుండి ముక్తులై, గుణాతీతులు అగుదురు.

ధర్మరాజా! మాటిమాటికిని సాగుచేసిన పొలము శక్తిహీనము అగును. అందు విత్తనములు మొలకెత్తవు సరిగదా, నాటిన విత్తనములుగూడ నష్టమగును. అట్లే కామ్యవాసనలకు నిలయమైన చిత్తము విషయభోగములను అతిగా అనుభవించుటచే స్వయముగా, దుఃఖమును పొంది విరక్తిని చెందును. ఉదాహరణముగా ఒక్కొక్క నేతిచుక్కను వేయుటవలన మండుచున్న అగ్ని చల్లారదు. కాని, మొత్తంగా ఒకేసారి నేతిని కుమ్మరించినచో, ఆ అగ్ని వెంటనే చల్లారిపోవునుగదా!

ఇంతవరకును వివిధ వర్ణములవారి యందుగూడ మరియొక వర్ణమునకు చెందిన లక్షణములే యున్నచో, వారిని ఆ వర్ణములకు చెందిన వారినిగా భావింపవలెను. అనగా, వ్యక్తి జన్మను బట్టిగాక, అతని గుణములను బట్టి వర్ణములను నిర్ణయింపవలెను.

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం సప్తమస్కంధే ఏకాదశోఽధ్యాయః (11)
ఇది భాగవత మహాపురాణమునందలి సప్తమ స్కంధమునందు పదకొండవ అధ్యాయము (11)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

10.7.2020    సాయం కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

సప్తమ స్కంధము - పదకొండవ అధ్యాయము

మానవ ధర్మములు - వర్ణ ధర్మములు - స్త్రీ ధర్మములు

ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

శ్రీశుక ఉవాచ

11.1 (ప్రథమ శ్లోకము)

శ్రుత్వేహితం సాధుసభాసభాజితం మహత్తమాగ్రణ్య ఉరుక్రమాత్మనః|

యుధిష్ఠిరో దైత్యపతేర్ముదా యుతః పప్రచ్ఛ భూయస్తనయం స్వయంభువః॥6092॥

శ్రీ శుకుడు వచించెను- పరీక్షిన్మహారాజా! భగవద్భక్తుడైన ప్రహ్లాదుని కీర్తి సాధుసమాజము నందు ప్రశంసలను అందుకొనెను. అతని పవిత్ర గాథను విని, ధర్మాత్ముడైన యుధిష్ఠిరునకు మిగుల ఆనందము కలిగెను. అతడు నారదుని ఇట్లు ప్రశ్నించెను-

యుధిష్ఠిర ఉవాచ

11.2 (రెండవ శ్లోకము)

భగవన్ శ్రోతుమిచ్ఛామి నృణాం ధర్మం సనాతనమ్|

వర్ణాశ్రమాచారయుతం యత్పుమాన్ విందతే పరమ్॥6093॥

యుధిష్ఠిరుడు అడిగెను- మహాత్మా! నేను వర్ణాశ్రమ సదాచారములను గూర్చియు, మానవుల సనాతన ధర్మములను గురించియు వినగోరుచున్నాను. ఎందుకనగా, మానవులకు ధర్మము వలననే జ్ఞానము, భగవద్భక్తి కలుగును. వారికి సాక్షాత్తు పరమపురుషుని ప్రాప్తిగూడ కలుగును గదా!

11.3 (మూడవ శ్లోకము)

భవాన్ ప్రజాపతేః సాక్షాదాత్మజః పరమేష్ఠినః|

సుతానాం సమ్మతో బ్రహ్మంస్తపోయోగసమాధిభిః॥6094॥

నారదమహర్షీ! నీవు సాక్షాత్తు పరమేష్ఠియైన బ్రహ్మదేవుని సుతుడవు. తపస్సు, యోగము, సమాధి మొదలగువాటి కారణముగా బ్రహ్మదేవుని కుమారులలో ఇతరులకంటె గొప్ప గౌరవమును పొందుదువు.

11.4 (నాలుగవ శ్లోకము)

నారాయణపరా విప్రా ధర్మ గుహ్యం పరం విదుః|

కరుణాః సాధవః శాంతాస్త్వద్విధా న తథాపరే॥6095॥

నీ వంటి నారాయణ పరాయణులు, దయాళువులు, సదాచారసంపన్నులు, శాంత స్వభావులు మరియెవ్వరును లేరు. నీవు ధర్మముల రహస్యములను, యథార్థరూపములను బాగుగా ఎరిగినవాడవు. కానీ, ఇతరులకు ఆ  ధర్మరహస్యములు తెలియవు.

నారద ఉవాచ

11.5 (ఐదవ శ్లోకము)

నత్వా భగవతేఽజాయ లోకానాం ధర్మహేతవే|

వక్ష్యే సనాతనం ధర్మం నారాయణముఖాచ్ఛ్రుతమ్॥6096॥

11.6 (ఆరవ శ్లోకము)

యోఽవతీర్యాత్మనోంఽశేన దాక్షాయణ్యాం తు ధర్మతః|

లోకానాం స్వస్తయేఽధ్యాస్తే తపో బదరికాశ్రమే॥6097॥

నారదుడు వచించెను-ధర్మరాజా! జన్మరహితుడైన భగవంతుడే సకల ధర్మములకు మూలకారణము. ఆ ప్రభువే చరాచర జగత్తుయొక్క శ్రేయస్సుకొరకు ధర్ముడు మరియు దక్షపుత్రికయైన మూర్తి అను దంపతులకు తన అంశముతో అవతరించి, బదరికాశ్రమమునందు తపస్సు చేయుచున్నాడు. ఆ శ్రీమన్నారాయణునకు నమస్కరించి, ఆ స్వామివలన వినిన సనాతన ధర్మములను నీకు వివరించెదను.

11.7 (ఏడవ శ్లోకము)

ధర్మమూలం హి భగవాన్ సర్వవేదమయో హరిః|

స్మృతం చ తద్విదాం రాజన్ యేన చాత్మా ప్రసీదతి॥6098॥

శ్రీ హరిభగవానుడు సర్వవేద స్వరూపుడు. ఆయన తత్త్వమును ఎరిగిన మహర్షులచే చెప్పబడినవి స్మృతులు, వాటినుండి ఆత్మజ్ఞానమును పొందుటయే సర్వధర్మములకు మూలము. ఇట్టి ధర్మసంపాదనము వలన అంతఃకరణము ప్రసన్నమగును.

11.8 (ఎనిమిదవ శ్లోకము)

సత్యం దయా తపః శౌచం తితిక్షేక్షా శమో దమః|

అహింసా బ్రహ్మచర్యం చ త్యాగః స్వాధ్యాయ ఆర్జవమ్॥6099॥

11.9 (తొమ్మిదవ శ్లోకము)

సంతోషః సమదృక్సేవా గ్రామ్యేహోపరమః శనైః|

నృణాం విపర్యయేహేక్షా మౌనమాత్మవిమర్శనమ్॥6100॥

11.10 (పదియవ శ్లోకము)

అన్నాద్యాదేః సంవిభాగో భూతేభ్యశ్చ యథార్హతః|

తేష్వాత్మదేవతాబుద్ధిః సుతరాం నృషు పాండవ॥6101॥

11.11 (పదకొండవ శ్లోకము)

శ్రవణం కీర్తనం చాస్య స్మరణం మహతాం గతేః|

సేవేజ్యావనతిర్దాస్యం సఖ్యమాత్మసమర్పణమ్॥6102॥

11.12 (పండ్రెండవ శ్లోకము)

నృణామయం పరో ధర్మః సర్వేషాం సముదాహృతః|

త్రింశల్లక్షణవాన్ రాజన్ సర్వాత్మా యేన తుష్యతి॥6103॥

ధర్మరాజా! ధర్మమునకు ముప్పది లక్షణములు గలవని శాస్త్రములయందు పేర్కొనబడినది. అవి ఏవనగా- సత్యము, దయ, తపస్సు, శౌచము, తితిక్ష (ఓర్పు), ఉచితానుచితవిచారము, మనోనిగ్రహము, ఇంద్రియముల సంయమనము, అహింస, బ్రహ్మచర్యము, త్యాగము, స్వాధ్యాయము, సరళత్వము, సంతోషము, సమదృష్టి, మహాత్ములసేవ, మెల్లమెల్లగా సంసార భోగమునుండి నివృత్తి, మనుజునకు అభిమానముతో గూడిన ప్రయత్నముల ఫలము విపరీతముగా ఉండునను విచారము, మౌనము, ఆత్మచింతనము, ప్రాణులకు వాటి యోగ్యతకు, శక్తికి తగినట్లుగా అన్నము మొదలగువాటిని పంచియిచ్చుట, అట్టి ప్రాణులను విశేషించి మనుష్యులను ఆత్మస్వరూపులనియు, ఇష్టదేవతా స్వరూపములనియు భావించుట, సత్పురుషులకు పరమ ఆశ్రయమగు శ్రీకృష్ణుని నామ, గుణ, లీలావైభవములను వినుట, కీర్తించుట, స్మరించుట, సేవలొనర్చుట, పూజించుట, నమస్కరించుట, ఆ ప్రభువునకు దాస్యము, సఖ్యము, ఆత్మసమర్పణము గావించుట అను - ఈ ముప్పది ధర్మములను ఆచరించుటయే మానవుల పరమ ధర్మము. వీటిని పాటించుట వలన సర్వాత్ముడైన భగవంతుడు ప్రసన్నుడగును.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి సప్తమస్కంధములోని పదకొండవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

11.7.2020    ప్రాతః కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

సప్తమ స్కంధము - పదకొండవ అధ్యాయము

మానవ ధర్మములు - వర్ణ ధర్మములు - స్త్రీ ధర్మములు

ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

11.13 (పదమూడవ శ్లోకము)

సంస్కారా యదవిచ్ఛిన్నాః స ద్విజోఽజో జగాద యమ్|

ఇజ్యాధ్యయనదానాని విహితాని ద్విజన్మనామ్|

జన్మకర్మావదాతానాం క్రియాశ్చాశ్రమచోదితాః॥6104॥

యుధిష్ఠిరా! తమవంశములో పరంపరగా వచ్చెడి సంస్కారవిధులను, వైదిక సంస్కారములను స్వీకరించు వారిని ద్విజులందురని బ్రహ్మదేవుడు చెప్పెను. ద్విజులకు యజ్ఞము, వేదాధ్యయనము, దానములు విధించబడినవి. జన్మ, కర్మలద్వారా పవిత్రులైన ద్విజులకు బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్న్యాసములనెడు ఆశ్రమములకు చెందిన కర్మలు కూడ విధించబడినవి.

11.14 (పదునాలుగవ శ్లోకము)

విప్రస్యాధ్యయనాదీని షడన్యస్యాప్రతిగ్రహః|

రాజ్ఞో వృత్తిః ప్రజాగోప్తురవిప్రాద్వా కరాదిభిః॥6105॥

అధ్యయనము, అధ్యాపనము, దానములను ఇచ్చుట, పుచ్చుకొనుట, యజ్ఞములను చేయుట, చేయించుట (యజనయాజన అధ్యయన అధ్యాపన దాన ప్రతిగ్రహములు) అను ఆరును బ్రాహ్మణుల యొక్క విధులు. క్షత్రియులు దానమును తీసికొనరాదు. ప్రజారక్షణము చేయునట్టి క్షత్రియుడు విప్రులను దప్ప, మిగిలిన వారినుండి యథాయోగ్యముగా పన్నులను స్వీకరించుట, దోషులకు శిక్షలను, అపరాధపన్నులను విధించుట మొదలగునవి క్షత్రియ (జీవన) ధర్మములు.

11.15 (పదునైదవ శ్లోకము)

వైశ్యస్తు వార్తావృత్తిశ్చ నిత్యం బ్రహ్మకులానుగః|

శూద్రస్య ద్విజశుశ్రూషా వృత్తిశ్చ స్వామినో భవేత్॥6106॥

వైశ్యుడు సర్వదా బ్రాహ్మణవంశజులకు అనుయాయులై గోరక్షణము, వ్యవసాయము, వ్యాపారముల ద్వారా తన జీవితమును నడుపుకొనవలెను. ద్విజాతి వారిని సేవించుట శూద్రులకు ధర్మము. అతనియొక్క జీవికను అతని యజమాని నడుపును.

11.16 (పదునారవ శ్లోకము)

వార్తా విచిత్రా శాలీనయాయావరశిలోంఛనమ్|

విప్రవృత్తిశ్చతుర్ధేయం శ్రేయసీ చోత్తరోత్తరా॥6107॥

బ్రాహ్మణులయొక్క జీవితములు నాలుగు సాధనముల ద్వారా నిర్వహింపబడును. అవి ఏవనగా - 1) వార్త, 2. శాలీనము, 3. యాయవారము, 4. శిలోంఛనము వీటిలో క్రమముగా మొదటి దానికంటె తరువాతది శ్రేష్ఠము.

1) వార్త అనగా యజ్ఞములు, అధ్యయనము మొదలగువాటి ద్వారా ధనము సంపాదించుట. 2) శాలీనము అనగా ఎవ్వరినీ యాచించకుండా లభించినదానితో జీవించుట, 3) యాయవారము అనగా నిత్యము ధాన్యాదులను యాచించి జీవించుట, 4) శిలోంఛనము అనగా రైతులు పైరు కోసినప్పుడు పొలములో జారిపడిన  గింజలను, ధాన్యమును ఇంటికి చేర్చునప్పుడు క్రిందబడిన గింజలను, వ్యాపార గిడ్డంగులచోట క్రిందపడిన గింజలను ఏరుకొని, వాటితో జీవించుట.

11.17 (పదునేడవ శ్లోకము)

జఘన్యో నోత్తమాం వృత్తిమనాపది భజేన్నరః|

ఋతే రాజన్యమాపత్సు సర్వేషామపి సర్వశః॥6108॥

నిమ్నవర్ణములవారు ఆపత్కాలమునందు తప్ప అగ్రవర్ణముల వారి వృత్తులను చేపట్టరాదు. క్షత్రియులు దానములను స్వీకరింపక బ్రాహ్మణులయొక్క మిగిలిన ఐదు వృత్తులను అవలబింపవచ్చును. ఆపత్కాలమునందు అందరూ అన్ని వృత్తులను చేపట్టవచ్చును.

11.18 (పదునెనిమిదవ శ్లోకము)

ఋతామృతాభ్యాం జీవేత మృతేన ప్రమృతేన వా|

సత్యానృతాభ్యాం జీవేత న శ్వవృత్త్యా కథంచన॥6109॥

ఋతము - అమృతములు, మృతము - ప్రమృతములు, సత్యానృతములు అను వాటిలో దేనినైనను వృత్తిగా ఆచరింపవచ్చును; కాని ఎవ్వరును శ్వవృత్తి అనగా శ్వానవృత్తిని మాత్రము చేపట్టరాదు.

11.19 (పందొమ్మిదవ శ్లోకము)

ఋతముంఛశిలం ప్రోక్తమమృతం యదయాచితమ్|

మృతం తు నిత్యయాచ్ఞా స్యాత్ప్రమృతం కర్షణం స్మృతమ్॥6110॥

వీధిలోగాని, పొలములలోగాని, పడిన గింజలను ఏరుకొని, ఱాళ్ళను తీసివేసి, శిలోంఛనము అను వృత్తిని చేపట్టుట ఋతము అని యందురు. ఎవ్వరినీ యాచింపకుండ, అయాచితముగా లభించిన దానితో జీవించుటను అమృతము అనియందురు. ప్రతిదినము యాయవారము ద్వారా జీవించుటను మృతము అని యందురు. వ్యవసాయము మున్నగువాటిద్వారా వార్తావృత్తిని చేపట్టి జీవించుటను ప్రమృతము అని యందురు.

11.21 (ఇరువది ఒకటవ శ్లోకము)

సత్యానృతం తు వాణిజ్యం శ్వవృత్తిర్నీచసేవనమ్|

వర్జయేత్తాం సదా విప్రో రాజన్యశ్చ జుగుప్సితామ్|

సర్వవేదమయో విప్రః సర్వదేవమయో నృపః॥6111॥

వాణిజ్యము సత్యానృతము అనబడును. నిమ్న వర్ణములవారిని సేవించుట శ్వానవృత్తి అనబడును. బ్రాహ్మణులు, క్షత్రియులు నింద్యమైన వృత్తులను స్వీకరింపరాదు. ఏలయన బ్రాహ్మణులు వేదస్వరూపులు, క్షత్రియులు సకల దేవతాస్వరూపులు.

11.21 (ఇరువది ఒకటవ శ్లోకము)

శమో దమస్తపః శౌచం సంతోషః క్షాంతిరార్జవమ్|

జ్ఞానం దయాచ్యుతాత్మత్వం సత్యం చ బ్రహ్మలక్షణమ్॥6112॥

శమము (మనోనిగ్రహము), దమము (ఇంద్రియ నిగ్రహము), తపస్సు, శౌచము, సంతోషము, క్షమ, సరళత్వము, జ్ఞానము, దయ, భగవత్పరాయణత్వము, సత్యము అనునవి బ్రాహ్మణుని లక్షణములు.

11.22 (ఇరువది రెండవ శ్లోకము)

శౌర్యం వీర్యం ధృతిస్తేజస్త్యాగ ఆత్మజయః క్షమా|

బ్రహ్మణ్యతా ప్రసాదశ్చ రక్షా చ క్షత్రలక్షణమ్॥6113॥

యుద్ధమునందు ఉత్సాహము, పరాక్రమము, ధైర్యము, తేజస్సు, త్యాగము, మనోనిగ్రహము, క్షమ, బ్రాహ్మణుల యెడ భక్తి, ఆర్తులయెడ అనుగ్రహము, ప్రజారక్షణము- అనునవి క్షత్రియుల లక్షణములు.

11.23 (ఇరువది మూడవ శ్లోకము)

దేవగుర్వచ్యుతే భక్తిస్త్రివర్గపరిపోషణమ్|

ఆస్తిక్యముద్యమో నిత్యం నైపుణ్యం వైశ్యలక్షణమ్॥6114॥

దేవతలయెడ, గురువులయెడ, భగవంతుని యెడ భక్తి, ధర్మార్థకామము లనెడి పురుషార్థములను పాటించుట, ఆస్తిక్యము, సర్వదా కార్యశూరత్వము, వ్యావహారిక నైపుణ్యము అనునవి వైశ్యుల లక్షణములు.

11.24 (ఇరువది నాలుగవ శ్లోకము)

శూద్రస్య సన్నతిః శౌచం సేవా స్వామిన్యమాయయా|

అమంత్రయజ్ఞో హ్యస్తేయం సత్యం గోవిప్రరక్షణమ్॥6115॥

అగ్రవర్ణములవారియెడ వినమ్రుడై యుండుట, పవిత్రతను కలిగియుండుట, యజమానికి నిష్కపట సేవలను అందించుట, వైదిక మంత్రములు లేకున్నను ఈశ్వరుని ఆరాధించుట, దొంగతనమును చేయకుండుట సత్యమును చెప్పుట, గోవులను, విప్రులను రక్షించుట - అనునవి శూద్రుని లక్షణములు.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి సప్తమస్కంధములోని పదకొండవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

11.7.2020    సాయం కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

సప్తమ స్కంధము - పదకొండవ అధ్యాయము

మానవ ధర్మములు - వర్ణ ధర్మములు - స్త్రీ ధర్మములు

ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

11.25 (ఇరువది ఐదవ శ్లోకము)

స్త్రీణాం చ పతిదేవానాం తచ్ఛుశ్రూషానుకూలతా|

తద్బంధుష్వనువృత్తిశ్చ నిత్యం తద్వ్రతధారణమ్॥6116॥

పతిని సేవించుట, అతనికి అనుకూలముగా ప్రవర్తించుట, అతని బంధువుల యెడ ప్రసన్న భావమును కలిగియుండుట, సర్వదా పతియొక్క నియమములను రక్షించుట - అనునవి పతివ్రత లక్షణములు.

11.26 (ఇరువది ఆరవ శ్లోకము)

సమ్మార్జనోపలేపాభ్యాం గృహమండలవర్తనైః|

స్వయం చ మండితా నిత్యం పరిమృష్టపరిచ్ఛదా॥6117॥

11.27 (ఇరువది ఏడవ శ్లోకము)

కామైరుచ్చావచైః సాధ్వీ ప్రశ్రయేణ దమేన చ|

వాక్యైః సత్యైః ప్రియైః ప్రేమ్ణా కాలే కాలే భజేత్పతిమ్॥6118॥

సాధ్వియైన స్త్రీ తన యింటిని ఊడ్చి, తుడిచి శుభ్రముగా ఉంచి, రంగవల్లులను దిద్దవలెను. నిత్యము తనను అలంకరించుకొని, ఇంటిని, సామాగ్రిని (గృహోపకరణములను)  శుభ్రముగా ఉంచుకొనవలయును. సమయానుసారముగా వినయముతో భర్త యొక్క చిన్స, పెద్ద అవసరాలను నెరవేర్పవలెను. వినయమును, ఇంద్రియనిగ్రహమును కలిగి, సత్యమైన, ప్రియమైన మాటలతో ప్రేమపూర్వకముగా పతిదేవుని సేవింపవలెను.

11.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)

సంతుష్టాలోలుపా దక్షా ధర్మజ్ఞా ప్రియసత్యవాక్|

అప్రమత్తా శుచిః స్నిగ్ధా పతిం త్వపతితం భజేత్॥6119॥

ఆమె లభించిన దానితో తృప్తి చెందవలెను. ఏ వస్తువు కొఱకైనను పేరాశ కలిగి యుండరాదు. అన్ని పనులయందును దక్షతను కలిగి, ధర్మములను ఎరిగి యుండవలెను. అందరితోను సత్యముగా, ప్రియముగా భాషించవలెను. తన కర్తవ్యమునందు అప్రమత్తముగా ఉండవలెను. తాను పవిత్రయై, తన పతిని పతితుడు గాకుండ ప్రేమతో సేవించుచుండవలెను.

11.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)

యా పతిం హరిభావేన భజేచ్ఛ్రీరివ తత్పరా|

హర్యాత్మనా హరేర్లోకే పత్యా శ్రీరివ మోదతే॥6120॥

లక్ష్మి దేవివలె పతిసేవా పరాయణయై, పతిని సాక్షాత్తు భగవత్స్వరూపునిగా భావింపవలెను. అందుకు ఆమె పతిదేవుడు వైకుంఠమున భగవత్సారూప్యమును పొందును. ఆమెయు లక్ష్మీదేవివలె అతనితోకూడి ఆనందించును.

11.30 (ముప్పదియవ శ్లోకము)

వృత్తిః సంకరజాతీనాం తత్తత్కులకృతా భవేత్|

అచౌరాణామపాపానామంత్యజాంతేవసాయినామ్॥6121॥

ధర్మరాజా! చౌర్యము, అన్యాయము మొదలగు పాపకర్మలు చేయని అంత్యజులు, చండాలురు మున్నగు వర్ణసంకర జాతుల వృత్తులు, వారివారి కుల పరంపరను బట్టి ఉండును.

11.31 (ముప్పది ఒకటవ శ్లోకము)

ప్రాయః స్వభావవిహితో నృణాం ధర్మో యుగే యుగే|

వేదదృగ్భిః స్మృతో రాజన్ ప్రేత్య చేహ చ శర్మకృత్॥6122॥

వేదవేత్తలైన ఋషులు, మునులు బహుశా ప్రతియుగమునందు మనుష్యుల స్వభావములను బట్టి వారి వారి ధర్మముల వ్యవస్థలను రూపొందించిరి. జనులు ఆయా ధర్మములను పాటించుటవలన ఇహపర శుభములను పొందగలరు.

11.32 (ముప్పది రెండవ శ్లోకము)

వృత్త్యా స్వభావకృతయా వర్తమానః స్వకర్మకృత్|

హిత్వా స్వభావజం కర్మ శనైర్నిర్గుణతామియాత్॥6123॥

మానవులు తమ స్వాభావిక వృత్తులను ఆశ్రయించి, స్వధర్మ పాలన చేసినచో, వారు క్రమక్రమముగా ఆ కర్మబంధములనుండి ముక్తులై, గుణాతీతులు అగుదురు.

11.33 (ముప్పది మూడవ శ్లోకము)

ఉప్యమానం ముహుః క్షేత్రం స్వయం నిర్వీర్యతామియాత్|

న కల్పతే పునః సూత్యై ఉప్తం బీజం చ నశ్యతి॥6124॥

11.34 (ముప్పది నాలుగవ శ్లోకము)

ఏవం కామాశయం చిత్తం కామానామతిసేవయా|

విరజ్యేత యథా రాజన్నాగ్నివత్కామబిందుభిః॥6125॥

ధర్మరాజా! మాటిమాటికిని సాగుచేసిన పొలము శక్తిహీనము అగును. అందు విత్తనములు మొలకెత్తవు సరిగదా, నాటిన విత్తనములుగూడ నష్టమగును. అట్లే కామ్యవాసనలకు నిలయమైన చిత్తము విషయభోగములను అతిగా అనుభవించుటచే స్వయముగా, దుఃఖమును పొంది విరక్తిని చెందును. ఉదాహరణముగా ఒక్కొక్క నేతిచుక్కను వేయుటవలన మండుచున్న అగ్ని చల్లారదు. కాని, మొత్తంగా ఒకేసారి నేతిని కుమ్మరించినచో, ఆ అగ్ని వెంటనే చల్లారిపోవునుగదా!

11.35 (ముప్పది ఐదవ శ్లోకము)

యస్య యల్లక్షణం ప్రోక్తం పుంసో వర్ణాభివ్యంజకమ్|

యదన్యత్రాపి దృశ్యేత తత్తేనైవ వినిర్దిశేత్॥6126॥

ఇంతవరకును వివిధ వర్ణములవారి యందుగూడ మరియొక వర్ణమునకు చెందిన లక్షణములే యున్నచో, వారిని ఆ వర్ణములకు చెందిన వారినిగా భావింపవలెను. అనగా, వ్యక్తి జన్మను బట్టిగాక, అతని గుణములను బట్టి వర్ణములను నిర్ణయింపవలెను.

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం సప్తమస్కంధే ఏకాదశోఽధ్యాయః (11)

ఇది భాగవత మహాపురాణమునందలి సప్తమ స్కంధమునందు పదకొండవ అధ్యాయము (11)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

No comments:

Post a Comment