సప్తమ స్కంధము - తొమ్మిదవ అధ్యాయము
ప్రహ్లాదుడు నృసింహభగవానుని స్తుతించుట
ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
నారద ఉవాచ
నారదుడు వచించెను- నృసింహ భగవానుడు క్రోధావేశముతోనుండెను. అట్టి స్థితిలో బ్రహ్మదేవుడు, శంకరుడు మొదలగు దేవతలు ఎల్లరును ఆ స్వామి సమీపమునకు వెళ్ళలేకపోయిరి. ఆయన కోపమును ఎట్లు చల్లార్చవలయునో తెలియలేకపోయిరి.
ఆ స్వామిని శాంతపరచుటకై వారు సాక్షాత్తు లక్ష్మీదేవిని ప్రార్థించిరి. ఆమె వెళ్ళి ఆ భగవానుని అద్భుతమైన రూపమును చూచి ఆయన దగ్గరకు వెళ్ళుటకు వెనుకాడెను. ఆ భీకర రూపమును ఆమె ఇంతవరకు ఎన్నడును చూచి యుండలేదు, వినియుండలేదు.
అంతట బ్రహ్మదేవుడు తన సమీపమున నిలిచియున్న ప్రహ్లాదునితో 'నాయనా! ప్రహ్లాదా! భగవానుడు నీ తండ్రి పైననే కుపితుడై యున్నాడు. ఇప్పుడు నీవే ఆయనను సమీపించి శాంతపరచుము' అని పలికి ప్రహ్లాదుని ఆ ప్రభువుకడకు పంపెను.
భాగవతోత్తముడైన ప్రహ్లాదుడు 'అట్లే' యని పలికి తిన్నగా భగవానుని సమీపించి, బద్ధాంజలియై సాష్టాంగముగా నమస్కరించెను.
పసివాడైన ప్రహ్లాదుడు తన పాదముల కడ వ్రాలియుండుటను చూచి నృసింహభగవానుని హృదయము దయతో నిండిపోయెను. అంతట ఆయన ప్రహ్లాదుని లేవ నెత్తి, ఆ బాలుని శిరస్సుపై తన కరకమలముతో నిమిరెను. ఆ స్వామి హస్తము కాలసర్పమువలన భీతిల్లిన పురుషులకు అభయ దానమును ఇచ్చునట్టిది.
భగవానుడు తన కరకమలములతో స్పృశించినంతనే ప్రహ్లాదుని అశుభసంస్కారములు అన్నియును ప్రక్షాళితములయ్యెను. వెంటనే అతనికి పరమాత్మ తత్త్వము ప్రత్యక్షమాయెను. అప్పుడు అతడు ఆనంద మగ్నుడై భగవానుని పాదారవిందములను తన హృదయము నందు నిలుపుకొనెను. ఆయన హృదయము భక్త్యావేశముతో నిండెను. తనువు పులకరించెను. నేత్రములనుండి ఆనందాశ్రువులు స్రవించెను.
హృదయమున భక్తిభావము నిండగా ప్రహ్లాదుడు కన్నులార్పకుండ భగవానుని దర్శింపసాగెను. ఏకాగ్రచిత్తుడై భావసమాధిలో మునుగుటతో కంఠము గద్గదమాయెను. అంతట అతడు భగవానుని ఇట్లు ప్రస్తుతింపసాగెను.
ప్రహ్లాద ఉవాచ
ప్రహ్లాదుడు ఇట్లు ప్రార్థించెను - బ్రహ్మాదిదేవతలు, ఋషులు, మునులు, సిద్ధపురుషులు మొదలగువారి బుద్ధి నిరంతరము సత్త్వ గుణముతో నిండియుండెను. ఐనను వారు తమ స్తోత్ర ధారా ప్రవాహము వలన అనంతకల్యాణ గుణములు గల నిన్ను ఇంతవరకును సంతుష్టపరచలేక పోయిరి. నేనైతే క్రూరమైన అసురవంశము నందు జన్మించినవాడను. నేను, నిన్ను సంతుష్టి పరుచగలనా?
ప్రహ్లాదుడు ఉగ్రస్వరూపుడైన నృసింహ భగవానుని ఇంకను ఇట్లు ప్రార్థించుచుండెను
'ధనము, సద్వంశమున జన్మించుట (అభిజాత్యము), రూపము, తపస్సు, విద్య, ఓజస్సు, తేజస్సు, ప్రభావము, బలపౌరుషములు, జ్ఞానము, యోగము మున్నగు గుణములు ఏవియును పరమపురుషుని సంతుష్టి చేయజాలవు అని నేను తలంతును. కాని, భగవానుడు భక్తి ద్వారానే గజేంద్రునకు ప్రసన్నుడయ్యెను. ఏలయన, భక్తిప్రియోమాధవ అనినట్లు భక్తి ఒక్కటే నీకు ప్రియమైనది.

పైన పేర్కొనబడిన పన్నెండుగుణములు ఉన్నను బ్రాహ్మణుడు పద్మనాభుని పాదారవిందములయెడ విముఖుడైనచో, అతని కంటెను తన మనస్సు, వాక్కు, కర్మలు, ధనము, ప్రాణములు (జీవనము), భగవంతునకు సమర్పించిన చండాలుడు శ్రేష్ఠుడు. ఏలయన, అట్టి చండాలుడు తన వంశమును పవిత్రమొనర్చును. తానే గొప్పవాడనను గర్వముగల బ్రాహ్మణుడు తనను కూడ పవిత్రము చేసికొనలేడు.

సర్వశక్తిమంతుడైన ప్రభువు తన స్వరూపసాక్షాత్కారముచే పరిపూర్ణుడగును. సామాన్యజనులు చేయు పూజలు అంగీకరింపవలసిన అవసరము ఆయనకు లేదు. ఐనను, కరుణాళువు ఐన భగవానుడు భక్తుల హితము కొరకే వారి పూజలుగూడ అంగీకరించును. మానవుని ముఖ సౌందర్యమును అద్దములోని ప్రతిబింబము ప్రకటించును. అట్లే భగవానునియెడ భక్తులు సమర్పించే పూజాదికము వారికే (భక్తులకే) ప్రాప్తించును.
నిజమునకు, కరుణామూర్తియగు భగవంతుడు భక్తులు సమర్పించే పత్రపుష్పాదులను కూడా అపేక్షింపడు. ఒక్కసారి తనను స్మరించినంతలోనే భక్తులను అనుగ్రహించును

కనుక, అన్ని విధములుగా అయోగ్యుడను, అనర్హుడను ఐన నేనుగూడ ఎట్టి భయము, సందేహము లేకుండ పూర్ణప్రయత్నముతో నా బుద్ధికి తోచినట్లు భగవంతుని మహిమను వర్ణించుచున్నాను. ఈ మహిమను వర్ణించిన ప్రభావముచే అజ్ఞాన కారణముగా సంసార చక్రములో బడిన జీవుడు వెంటనే పునీతుడగును.
పరమపురుషా! నీవు సత్త్వగుణములకు ఆశ్రయుడవు. బ్రహ్మాదిదేవతలు అందరు నీ యాజ్ఞను శిరసావహించునట్టి భక్తులు. వీరు దైత్యులమైన మావలె నిన్ను ద్వేషింపరు. ప్రభూ! నీవు జగత్కల్యాణమునకై మనోహరమైన అవతారములను దాల్చుచుందువు. అట్లే జనుల ఆత్మానందప్రాప్తికై పెక్కులీలలను నెరపుచుందువు.
ఈ అసురుని వధించుటకే నీవు ఉగ్రరూపమును దాల్చి యుంటివి. ఇపుడు ఆ దైత్యుడు నిహతుడయ్యెను. కనుక నీవు నీ కోపమును శాతింపజేయుము. ముప్పును కలిగించే తేలుగాని, పాముగాని మరణించినపుడు సజ్జనులుగూడ సంతసింతురు. అట్లే, ఈ దైత్యుని మృతిచే సకలలోకముల వారికిని సుఖము లభించినది. ఇప్పుడు అందరును నీ శాంత స్వరూపమును దర్శించుటకై నిరీక్షించుచున్నారు. నృసింహస్వామీ! భయమునుండి బయట పడుటకు భక్తులు నీ ఈ రూపమును స్మరింపగలరు.
ప్రభూ! అపరాజితా! నీముఖము భయంకరమైనది. నీ పొడవైన జిహ్వ అధరములపై అటునిటు కదలుచున్నది. నేత్రములు సూర్యునివలె వెలుగొందు చున్నవి. ముఖమున బొమముడి భీకరముగా ఉన్నది. కోరలు భయావహముగా ఉన్నవి. ప్రేవులను మెడలో హారముగా ధరించియున్నావు. మెడ యందలి జూలు రక్తసిక్తమై యున్నది. కర్ణములు బల్లెపు కొనలవలె నిక్కపొడుచుకొనియున్నవి. దిక్కులను పిక్కటిల్లజేయు నీ సింహగర్జనమునకును, శత్రువులను చీల్చి చెండాడు నీ గోళ్ళకును నేను ఏ మాత్రమూ భయపడుటలేదు.
కానీ, దీనబంధూ! నేను కేవలము దుర్భరమైన ఉగ్రసంసార చక్రమునందు నలిగిపోవుదునేమోయని భయపడుచున్నాను. నేను నా పురాకృతకర్మల కారణముగా భయంకరమైన ఈ జంతువుల మధ్య చిక్కుపడియున్నాను. సర్వశ్రేష్ఠుడవైన నా స్వామీ! నీవు ప్రసన్నుడవై నీ పాదారవిందముల కడకు నన్ను ఎప్పుడు చేర్చెదవు? అవి సకల జీవులకును శరణ్యములు. మోక్షదాయకములు కదా!
అనంతా! నేను ఇంతవరకు పొందిన జన్మలన్నింటిలోను ప్రియవస్తువుల వియోగముతోను, అప్రియవస్తు సంయోగముతోను కలుగు దుఃఖాగ్నిలో మాడి మసియైతిని. ఆ దుఃఖములను నశింపజేయు ఔషధముకూడా దుఃఖరూపమే అయియున్నదికదా! నేను ఇతర వస్తువులను అన్నింటిని (దేహాదులను) ఆత్మగా భావించి, ఇటునటు తిరుగుచుంటిని. అందువలన, స్వామీ! నిరంతరము భక్తితో నీ చరణములను సేవించు ఉపాయమును నాకు ప్రసాదింపుము.
ప్రభూ! నీవు నాకు అత్యంత ప్రియుడవు, అహైతుక హితైషివి. సుహృదుడవు. వాస్తవముగా ఎల్లరకును పరమ ఆరాధ్యుడవు. బ్రహ్మదేవుడు నీ లీలాగాథలను నిరంతరము గానము చేయుచుండును. ఆ గాథలను విని రాగాది ప్రకృతి గుణములనుండి సులభముగా ముక్తుడనై ఈ సంసారదుఃఖముల నుండి తరింపవలెను. నీ పాదయుగమును ఆశ్రయించునట్టి మహాత్ముల సాంగత్యము నాకు ఎల్లప్పుడు లభించుచుండవలెను. ఆ విధముగా నన్ను అనుగ్రహింపుము.
నృసింహప్రభూ! సంసార తాపత్రయములో పరితపించు జీవిని నీవు ఉపేక్షించినచో, వారిని ఉద్ధరించుటకు వేరే వారెవ్వరును సమర్థులు గారు. అంతెందుకు, నీ కృప లేకుండా తలిదండ్రులు తమ బాలుని రక్షింపలేరు. వైద్యుడిచ్చిన ఔషధము రోగిని బ్రతికింపజాలదు. సముద్రములో మునిగిపోవుచున్నవానిని నౌక కాపాడలేదు. నీ శరణు గోరిన జీవుల దుఃఖము వెంటనే దూరమై పోవును.
సత్త్వాది గుణత్రయ కారణముగా వేర్వేరు స్వభావములు గల బ్రహ్మాది శ్రేష్ఠులు, కాలాది కనిష్ఠులు నీచే ప్రేరితులై తమ తమ కార్యములను నెరవేర్చుకొందరు. నీ ప్రేరణచే ఏ ఆధారము నిలిచి యున్నదో, ఏకారణముగా మట్టి మొదలగు ఉపకరణముల ద్వారా ఏ సమయమున ఏయే సాధనములలో, ఏ అదృష్టాదుల సహాయముతో, ఏ ప్రయోజనమునకై ఏ రీతిగా ఉత్పన్నము చేయునట్టి, రూపాంతరము ఒనర్చునట్టి అన్నియును నీ స్వరూపములే- బ్రహ్మాదులు సృష్టించుటకును, రూపాంతరము చేయుటకును ప్రేరకుడవు నీవే. వాటికి ఆధారము, నిమిత్త కారణము, ఉపకరణములు, సాధనములు, సహాయకములు, ప్రయోజనములు, ప్రీతులు అన్నియును నీ స్వరూపములే.
పరమపురుషుడు, జన్మరహితుడు అగు పరమాత్మ కాలము ద్వారా గుణముల యందు క్షోభ కలిగినప్పుడు మాయ మనఃప్రధానమైన లింగ శరీరమును నిర్మించును. ఆ లింగశరీరము బలీయమైనది. ఇది కర్మమయమై పెక్కు నామరూపములయందు ఆసక్తమై వేదోక్తమగు కామ్యకర్మలను చేయుచుండును. అవిద్య ద్వారా కల్పితమైన మనస్సు, పది ఇంద్రియములు, ఐదు తన్మాత్రలు, అను పదహారు అంచులుగల సంసారచక్రము ఇదియే. నిన్ను సేవింపనివాడు ఎవ్వడును ఈ సంసార చక్రమును తరింపజాలడు.
సర్వశక్తిమంతుడవైన ప్రభూ! మాయ పదునారు అంచులు గల ఈ సంసార చక్రమునందు పడవేసి, చెరకును పిండినట్లు నన్ను పిండుచున్నది. నీవు నీ చైతన్య శక్తిచే బుద్ధి యొక్క సమస్త గుణములను సర్వ పరాజితులను గావించుచుందువు. కాలరూపములైన సాధ్యాసాధ్యములు అన్నింటిని నీవు నీ అధీనములో ఉంచుకొందువు. నేను నిన్ను శరణు జొచ్చితిని. నన్ను ఈ సంసార చక్రమునుండి రక్షించి, నీ సన్నిధికి చేర్చుకొనుము.
పరమాత్మా! స్వర్గములో లభించు లోకపాలుర ఆయువును, సంపదలను, వైభవములను సాంసారికులు కోరుకొనుచుందురు. వాటిని అన్నింటిని నేను చూచితిని. నా తండ్రి కుపితుడై నవ్వుచు కొద్దిగా బొమముడిచివైచినపుడు ఆ స్వర్గసంపదలు అన్నియును రూపుమాసిపోవు చుండెను. కాని, ఇప్పుడు నా తండ్రిని నీవు వధించితివి. అందువలన సాంసారికులైన జీవులు కోరుకొను నట్టీ బ్రహ్మలోక పర్యంతముగల ఆయువును, సంపదలను, వైభవములను నేను కోరుకొనుట లేదు. ఏలయన, మిగుల శక్తిశాలివగు నీవు కాలస్వరూపుడవై, వాటిని గ్రసించితివి (మ్రింగివేసితివి). కనుక, నన్ను నీ దాసుల సన్నిధికి చేర్చుము.
విషయభోగములు వినుటకు ఇంపుగా కనబడును. వాస్తవముగా అవి ఎండమావులలోని నీటివలె అసత్యములు. వివిధ భోగములను అనుభవించునట్టి ఈ శరీరము గూడ లెక్కలేని రోగములకు జన్మస్థానము. ఈ మిథ్యా విషయభోగములు, రోగముల పుట్టయైన శరీరము క్షణభంగురములు, నిస్సారములు అను విషయమును ఎరిగియు, మానవుడు తాను పండితుడైనను వాటినుండి విరక్తుడుగాడు. మిగుల శ్రమపడి పొందిన భోగములనెడి, చిన్న, చిన్న తేనె బిందువులతో మానవుడు తన కామాగ్నిని చల్లార్చు కొనుటకు ప్రయత్నించును.
దేవా! తమోగుణప్రధానమైన అసురవంశములో రజోగుణముచే జన్మించిన నేనెక్కడ? దుర్లభమైన నీ అనుగ్రహమెక్కడ? నేను ధన్యుడను. నీవు దయాస్వరూపమైన నీ కరమును నా శిరస్సుపై ఉంచితివి. అది సకల సంతాపములను హరించును. అట్టి అదృష్టము బ్రహ్మ, శంకరుడు, లక్ష్మీదేవి మున్నగువారికి గూడ అబ్బలేదు.
సంసారికులైన ఇతర జీవులవలె చిన్న, పెద్ద అను భేదభావము నీలో లేదు. ఎందుకనగా, నీవు అందరికిని ఆత్మవు, అవ్యాజప్రేమస్వరూపుడవు. ఐనను, కల్పవృక్షము వలె నిన్ను సేవించుట ద్వారానే నీ అనుగ్రహము గూడ ప్రాప్తించును. సేవలను అసుసరించియే జీవులపై నీ కృప ప్రసరించుచుండును. అంతేగాని, ఉచ్చ, నీచ జాతి భేదములవలన కాదు.
ప్రభూ! ఈ సంసారము ఒక అంధకారకూపము. అందు కాలమనెడి సర్పము కాటు వేయుటకు సర్వదా సిద్ధముగ నుండును. విషయ భోగలాలసులైన వారు అందులోనే పడియుందురు. నేను గూడ నా వంశప్రభావమున అందులో పడబోవుచుంటిని. కాని, దేవర్షియైన నారదుడు నన్ను అందుండి ఉద్ధరించెను. ఇంకనేను నీ భక్తులను సేవించుట ఎట్లు మానగలను?
అనంతా! నా తండ్రి అన్యాయముగా నడుము బిగించి ఖడ్గముచేబూని 'నన్ను కాదని నిన్ను రక్షించువాడు ఎవరైనను ఉన్నచో అతడు కాపాడుగాక! నేను నీ శిరమును ఇప్పుడే ఖండించెదను' అని ఇట్లు పలికెను- అప్పుడు నీవు నా తండ్రిని వధించి నా ప్రాణములను రక్షించితివి. నీ భక్తులైన సనకాది ఋషుల వచనము సత్యము చేయుటకే నీవు అట్లొనర్చితివి అని నేను భావింతును.
పరమాత్మా! ఈ జగత్తు అంతయును నీ స్వరూపమే. ఏలయన, దీనికి నీవే ఆదికారణుడవు. దీనిని లయమొనర్చు వాడవు కూడ నీవే. మధ్యలో ప్రతీతమగు ఈ జగత్తుగూడ నీ స్వరూపమే. నీవు నీ మాయ ద్వారా గుణముల పరిణామ రూపమైన జగత్తును సృష్టించి, అందులో ప్రవేశించి, ఆ గుణములతో గూడి అనేకములుగా గోచరించుచుందువు. ఇది యంతయును నీ లీలయే సుమా!
దేవా! కార్య కారణ రూపమగు జగత్తు వాస్తవముగా నీవే. కాని, నీవు దాని కంటెను విలక్షణుడవు. అనగా జగత్తులోని గుణ దోషములు పరబ్రహ్మవగు నిన్ను స్పృశింపవు. నా వాడు, పరాయివాడు అను భేదభావము అర్థహీనము, అజ్ఞానము. ఏలయన, వస్తువుయొక్క ఉత్పత్తి, స్థితి, లయములు ఆ వస్తు స్వరూపమే యగును. ఎట్లనగా, వృక్షము, బీజము కార్యకారణ దృష్టితో వేర్వేరుగ గోచరించినను పృథ్వీ తన్మాత్రదృష్టితో ఆ రెండును ఒకటియే.
పురుషోత్తమా! నీవు ఈ సంపూర్ణ విశ్వమును నీలో లీనమొనర్చుకొని, నిష్క్రియాపరుడవై ఆత్మసుఖమును అనుభవించుచు ప్రళయకాల జలములలో శయనించు చుండెదవు. ఆ సమయమున నీవు స్వయంసిద్ధ యోగము ద్వారా బాహ్యదృష్టిని విరమించి, నీ స్వరూపమగు ప్రకాశమునందు నిద్రను విలీన మొనర్చి, తురీయమగు బ్రహ్మస్థితి యందు ఉందువు. ఆ సమయమున నీవు తమోగుణయుక్తుడవు కావు. గుణాతీతుదవై యుందువు.
నీవు నీకాలశక్తిచే ప్రకృతి గుణములకు ప్రేరణను కలిగింతువు. కనుక ఆ బ్రహ్మాంఢమంతయు నీ శరీరమే. మొదట అది నీలోనే లీనమైయుండును. ప్రళయకాల జలములయందు శేషునిపై శయనించిన నీవు నీ యోగనిద్రా సమాధిని పరిత్యజించెదవు. అప్పుడు బీజమునుండి వటవృక్షము వలె నీ నాభి నుండి, బ్రహ్మాండమైన కమలము ఉద్భవించినది.
ఆ కమలమున సూక్ష్మదర్శియగు బ్రహ్మదేవుడు ప్రకటమయ్యెను. అతనికి కమలము తప్ప మరి ఏవియును కనబడలేదు. అప్పుడు తన బీజరూపమున ఉన్న నిన్ను తెలిసికొనలేక నీవు తన కంటెను వేరుగా భావించి, జలములో మునిగి వంద సంవత్సరములు నిన్ను అన్వేషింపసాగెను. ఇది వాస్తవమే, బీజము అంకురించి, వృక్షముగా వ్యాప్తమైనప్పుడు బయట ఆ బీజము దాని కంటెను వేరుగా ఎట్లు కనబడును?
చాలకాలము వరకు తీవ్రమైన తపస్సును ఆచరించెను. అప్పుడు అతని హృదయము పరిశుద్ధమాయెను. అంతట భూమియందు అతి సూక్ష్మమైన గంధకము వ్యాపించియున్నట్లుగా సూక్ష్మాతిసూక్ష్ముడవగు నీవు సర్వమునందు సత్తారూపముగ వ్యాపించియున్నావు. అట్టి నిన్ను ఆ బ్రహ్మదేవుడు, పంచభూతములు, ఇంద్రియములు, అంతఃకరణముల సంఘాతమైన తన శరీరమునందే సత్తారూపమున వ్యాపించియున్న వానినిగా దర్శించెను.
అప్పుడు బ్రహ్మదేవుడు భగవంతుని లీలామయ స్వరూపమైన విరాట్ పురుషుని దర్శించి, మిగుల ఆనందించెను. ఆ విరాట్ పురుషుడు అసంఖ్యాకములైన ముఖములు, పాదములు, శిరస్సులు, చేతులు, తొడలు, ముక్కులు, నోళ్ళు, చెవులు, నేత్రములు, ఆభరణములు, ఆయుధములు కలిగియుండెను. పదునాలుగు లోకములు ఆ విరాట్ పురుషుని అంగములుగ శోభిల్లు చుండెను.
రజస్తమోగుణ రూపులైన మధుకైటభులు అను గొప్ప బలశాలులైన ఇద్దరు దైత్యులు వేదములను దొంగిలించి, తీసికొనిపోయిరి. అప్పుడు నీవు హయగ్రీవ అవతారమును దాల్చి, వారిద్దరిని చంపి, సత్త్వగుణ రూపములైన శ్రుతులను బ్రహ్మదేవునకు తిరిగి ఇచ్చితివి. ఆ సత్త్వగుణమే నీకు అత్యంత ప్రియమైన శరీరము అని మహాత్ములు వర్ణించిరి.
పురుషోత్తమా! ఈ విధముగా నీవు మానవులు, పశు పక్ష్యాదులు, ఋషులు, దేవతలు, మత్స్యములు మొదలగు అవతారములను దాల్చి, విశ్వమునకు ద్రోహమొనర్చువారిని సంహరించి, లోకములను పాలించితివి. ఆ అవతారముల ద్వారా ప్రతియుగమునందును దాని ధర్మములను రక్షించుచుందువు. కలియుగమున నీవు గుప్త రూపమున ఉందువు.అందువలన నీవు త్రియుగుడు (మూడు యుగములలో ప్రకటమగువాడు) అను పేర ప్రసిద్ధికెక్కితివి.
వైకుంఠనాథా! నామనస్సు మిక్కిలి దుర్దశకులోనై యున్నది. అది స్వయముగా మిగుల దుఃఖస్వభావము గలది. పైగా పాప వాసనలచే కలుషితమైనది. తరచుగ కోరికల కారణమున ఆతురత చెంది యున్నది. హర్షశోకములు, భయము, ఇహపరలోకములు, ధనము, భార్యాపుత్రులు మొదలగు చింతలతో వ్యాకులమై యుండును. దానికి నీ లీలాగాథలయందు రుచి గలుగదు. అట్టి మనస్సుతో నేను దీనుడనై యున్నాను. ఈ స్థితిలో నేను నీ స్వరూపమును ఎట్లు ధ్యానింపగలను?
అచ్యుతా! ఎన్నటికిని సంతృప్తి చెందని నాలుక రుచ్యములగు పదార్థములవైపునకు నన్ను లాగుచున్నది. జననేంద్రియము అందమైన స్త్రీలకై, చర్మము కోమలమైన స్పర్శకై, ఉదరము మధుర భోజనమునకై, చెవులు శ్రావ్య సంగీతమునకై, నాసిక సుగంధభరిత వస్తువులకై, చపలములైన నేత్రములు సుందర దృశ్యములకై ఆరాటపడుచుండును. అంతేగాక, కర్మేంద్రియములు గూడ తమతమ విషయసుఖములవైపు తీసికొనిపోవుటకై ఒత్తిడి చేయుచుండును. పెక్కుమంది భార్యలుగల పురుషుని సవతులు అందరును అన్నివైపుల నుండి బాధించునట్లు, ఈ జ్ఞానేంద్రియ కర్మేంద్రియములు నన్ను దుర్దశల పాలు చేయుచున్నవి.
ఈ విధముగా జీవుడు తన కర్మ బంధములలో తగుల్కొని, సంసారరూప వైతరణియందు పడియున్నాడు. ఒక దానివెంట మరియొకటి సంభవించు జనన మరణముల ద్వారా కర్మభోగములను అనుభవించుచు అతడు భయగ్రస్తుడైయున్నాడు. వీడు నా వాడు, వీడు పరాయివాడు అను భేదభావముతో కొందరిని మిత్రులనుగా, మరికొందరిని శత్రువులనుగ తలంచుచున్నాడు. నీవు ఈ భవభంధములకు సర్వదా అతీతుడవు. కావున, మూఢులైన ఈ జీవుల దుర్దశను జూచి, కరుణార్ధ హృదయుడవై ఈ ప్రాణులనుగూడ భవసాగరమునుండి దాటింప జేయుము.
జగద్గురూ! ఈ జగత్తుయొక్క సృష్టి, స్థితి, లయములను లీలగా చేయుచుందువు. అట్టి నీకు ఈ అమాయకులైన జీవులను ఉద్ధరించుటకు ప్రయాస ఏముండును? ఆర్తబంధూ! దారితప్పిన ఈ మూఢజనులే నీ యొక్క విశేషమగు అనుగ్రహమును పొందుటకు పాత్రులగుదురు. మేము మాత్రము మీ ప్రియభక్తుల సేవలద్వారా తరించెదము.
పరమాత్మా! నీవు గొప్పకీర్తి ప్రతిష్టలు గలవాడవు. సత్త్వాది గుణములు, ఆ గుణ పరిణామములైన మహత్తత్త్వాదులు, దేవతలు, మనుష్యులు, అట్లే మనస్సు మొదలగునవి ఏవియు నీ స్వరూపమును తెలిసి కొనుటకు సమర్థములు గావు. ఏలయన, అవి అన్నియును ఆద్యంతములు గలవి. నీవు అనాదివి, అనంతుడవు (ఆద్యంతములు లేనివాడవు). జ్ఞానులు ఇట్లు ఆలోచించియే శబ్దజాలము, అను మాయనుండి ఉపరతులై నిన్ను ఉపాసింతురు.
పరమపూజ్యుడవగు స్వామీ! నమస్కారము, స్తోత్రము, సమస్తకార్యములను నీకు సమర్పించుట, సేవలు - పూజలు చేయుట నీ పాదాబ్జములను స్మరించుట, నీ లీలాగాథలను వినుట అను ఆరును నీ సేవకు అంగములు. ఈ షడంగములు లేకుండ నీ పాదారవిందములపై భక్తి ఎట్లు ఏర్పడును? భక్తి లేనిదే నీ ప్రాప్తి కలుగుట యెట్లు? ప్రభూ! నీవే భాగవతోత్తములకు, పరమహంసలకు సర్వస్వము.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
బమ్మెర పోతన గారి పద్యమొకటి ఈ సందర్భంలో
సప్తమ స్కంధము, 367వ పద్యము
సీస పద్యము
నీ గృహాంగణభూమి నిటలంబు మోవంగ;
మోదించి నిత్యంబు మ్రొక్కఁడేని
నీ మంగళస్తవ నికర వర్ణంబులు;
పలుమాఱు నాలుకఁ బలుకఁడేని
నీ యధీనములుగా నిఖిలకృత్యంబులు;
ప్రియభావమున సమర్పింపఁడేని
నీ పదాంబుజముల నిర్మల హృదయుఁడై;
చింతించి మక్కువఁ జిక్కఁడేని
తేటగీతము
నిన్నుఁ జెవులార వినఁడేని నీకు సేవ
చేయరాఁడేని బ్రహ్మంబు జెందఁ గలఁడె?
యోగి యైనఁ దపోవ్రతయోగి యైన
వేది యైన మహాతత్త్వవేది యైన.
ప్రతిపదార్ధము
భావము
నీ గుడి ప్రాంగణంలో నిత్యం నీకు తలవంచి మ్రొక్కని వాడు; మంగళకరాలైన నీ కీర్తనలు పలుమార్లు నాలుకతో పలుకని వాడూ; కర్మలు సమస్తం నీ అధీనం అని భక్తిభావంతో తలచి సమర్పణ చేయనివాడూ; నీ పాదపద్మాలు నిర్మలమైన మనస్సుతో నిత్యం ధ్యానించి పరవశించని వాడూ; చెవులారా నీ సంకీర్తనలు వినని వాడూ; చేతులారా నీ సేవ జేయనివాడూ; యోగి అయినా, మహా తపశ్శక్తిశాలి యైన యోగి అయినా, ఎంతటి పండితుడైనా, ఎంతటి తత్వవేత్త అయినా ఎప్పటికీ పరమపదం అందుకోలేడు.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
నారద ఉవాచ
నారదుడు వచించెను-భగవానుడు ప్రాకృత గుణరహితుడు. ఐనను, పరమ భక్తుడైన ప్రహ్లాదుడు మిక్కిలి ప్రేమతో ఆ స్వామి స్వరూప గుణములను వర్ణించెను. అనంతరము అతడు భగవానుని చరణములకు శిరసా నమస్కరించెను. అంతట నృసింహ భగవానుని కోపము శాంతించెను. అప్పుడు ఆ ప్రభువు ప్రహ్లాదునితో ఇట్లు పలికెను.
శ్రీభగవానువాచ
శ్రీభగవానుడు నుడివెను-ప్రహ్లాదా! నీవు పరమ కల్యాణ స్వరూపుడవు. నీకు శుభమగుగాక. నీకు ప్రసన్నుడనైతిని. అసురోత్తమా! నీకు ఇష్టమైన వరమును కోరుకొనుము. నేను మానవులకు కోరికలను ప్రసాదించువాడను. ఆయుష్మంతుడా! నిన్ను ప్రసన్నుని చేసికొనిన వానికి నా దర్శనము దుర్లభము. నా దర్శనము ఐనంతనే ప్రాణుల హృదయములయందు ఎట్టి పరితాపములు ఉండవు. నేను సమస్త మనోరథములను ఈడేర్చువాడను. కనుక శ్రేయస్కాములు, అదృష్టవంతులైన సత్పురుషులు జితేంద్రియులై తమ వృత్తులయన్నింటి ద్వారా నన్ను ప్రసన్నుని జేసికొనుటకు ప్రయత్నింతురు.
నారద ఉవాచ
నారదుడు పలికెను-జనులు ఎక్కువగా ఆశించునట్టి వరములద్వారా నృసింహ భగవానుడు అసురోత్తముడైన ప్రహ్లాదుని ప్రలోభపెట్టెను. ఐనను, భగవంతునియందు ఏకాంతముగ భక్తి కలిగినట్టి ఆ భక్త శిరోమణి ఎట్టి వరములను కోరుకొనలేదు.
ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం సప్తమస్కంధే నవమోఽధ్యాయః (9)
ఇది భాగవత మహాపురాణమునందలి సప్తమ స్కంధమునందు తొమ్మిదవ అధ్యాయము (9)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
2.7.2020 సాయం కాల సందేశము
వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం
సప్తమ స్కంధము - తొమ్మిదవ అధ్యాయము
ప్రహ్లాదుడు నృసింహభగవానుని స్తుతించుట
ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
నారద ఉవాచ
9.1 (ప్రథమ శ్లోకము)
ఏవం సురాదయః సర్వే బ్రహ్మరుద్రపురఃసరాః|
నోపైతుమశకన్ మన్యుసంరంభం సుదురాసదమ్॥5966॥
నారదుడు వచించెను- నృసింహ భగవానుడు క్రోధావేశముతోనుండెను. అట్టి స్థితిలో బ్రహ్మదేవుడు, శంకరుడు మొదలగు దేవతలు ఎల్లరును ఆ స్వామి సమీపమునకు వెళ్ళలేకపోయిరి. ఆయన కోపమును ఎట్లు చల్లార్చవలయునో తెలియలేకపోయిరి.
9.2 (రెండవ శ్లోకము)
సాక్షాచ్ఛ్రీః ప్రేషితా దేవైర్దృష్ట్వా తన్మహదద్భుతమ్|
అదృష్టాశ్రుతపూర్వత్వాత్సా నోపేయాయ శంకితా॥5967॥
ఆ స్వామిని శాంతపరచుటకై వారు సాక్షాత్తు లక్ష్మీదేవిని ప్రార్థించిరి. ఆమె వెళ్ళి ఆ భగవానుని అద్భుతమైన రూపమును చూచి ఆయన దగ్గరకు వెళ్ళుటకు వెనుకాడెను. ఆ భీకర రూపమును ఆమె ఇంతవరకు ఎన్నడును చూచి యుండలేదు, వినియుండలేదు.
9.3 (మూడవ శ్లోకము)
ప్రహ్లాదం ప్రేషయామాస బ్రహ్మావస్థితమంతికే|
తాత ప్రశమయోపేహి స్వపిత్రే కుపితం ప్రభుమ్॥5968॥
అంతట బ్రహ్మదేవుడు తన సమీపమున నిలిచియున్న ప్రహ్లాదునితో 'నాయనా! ప్రహ్లాదా! భగవానుడు నీ తండ్రి పైననే కుపితుడై యున్నాడు. ఇప్పుడు నీవే ఆయనను సమీపించి శాంతపరచుము' అని పలికి ప్రహ్లాదుని ఆ ప్రభువుకడకు పంపెను.
9.4 (నాలుగవ శ్లోకము)
తథేతి శనకై రాజన్ మహాభాగవతోఽర్భకః|
ఉపేత్య భువి కాయేన ననామ విధృతాంజలిః॥5969॥
భాగవతోత్తముడైన ప్రహ్లాదుడు 'అట్లే' యని పలికి తిన్నగా భగవానుని సమీపించి, బద్ధాంజలియై సాష్టాంగముగా నమస్కరించెను.
9.5 (ఐదవ శ్లోకము)
స్వపాదమూలే పతితం తమర్భకం విలోక్య దేవః కృపయా పరిప్లుతః|
ఉత్థాప్య తచ్ఛీర్ష్ణ్యదధాత్కరాంబుజం కాలాహివిత్రస్తధియాం కృతాభయమ్॥5970॥
పసివాడైన ప్రహ్లాదుడు తన పాదముల కడ వ్రాలియుండుటను చూచి నృసింహభగవానుని హృదయము దయతో నిండిపోయెను. అంతట ఆయన ప్రహ్లాదుని లేవ నెత్తి, ఆ బాలుని శిరస్సుపై తన కరకమలముతో నిమిరెను. ఆ స్వామి హస్తము కాలసర్పమువలన భీతిల్లిన పురుషులకు అభయ దానమును ఇచ్చునట్టిది.
9.6 (ఆరవ శ్లోకము)
స తత్కరస్పర్శధుతాఖిలాశుభః సపద్యభివ్యక్తపరాత్మదర్శనః|
తత్పాదపద్మం హృది నిర్వృతో దధౌ హృష్యత్తనుః క్లిన్నహృదశ్రులోచనః॥5971॥
భగవానుడు తన కరకమలములతో స్పృశించినంతనే ప్రహ్లాదుని అశుభసంస్కారములు అన్నియును ప్రక్షాళితములయ్యెను. వెంటనే అతనికి పరమాత్మ తత్త్వము ప్రత్యక్షమాయెను. అప్పుడు అతడు ఆనంద మగ్నుడై భగవానుని పాదారవిందములను తన హృదయము నందు నిలుపుకొనెను. ఆయన హృదయము భక్త్యావేశముతో నిండెను. తనువు పులకరించెను. నేత్రములనుండి ఆనందాశ్రువులు స్రవించెను.
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి సప్తమస్కంధములోని తొమ్మిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
3.7.2020 ప్రాతః కాల సందేశము
వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం
సప్తమ స్కంధము - తొమ్మిదవ అధ్యాయము
ప్రహ్లాదుడు నృసింహభగవానుని స్తుతించుట
ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
9.7 (ఏడవ శ్లోకము)
అస్తౌషీద్ధరిమేకాగ్రమనసా సుసమాహితః|
ప్రేమగద్గదయా వాచా తన్న్యస్తహృదయేక్షణః॥5972॥
హృదయమున భక్తిభావము నిండగా ప్రహ్లాదుడు కన్నులార్పకుండ భగవానుని దర్శింపసాగెను. ఏకాగ్రచిత్తుడై భావసమాధిలో మునుగుటతో కంఠము గద్గదమాయెను. అంతట అతడు భగవానుని ఇట్లు ప్రస్తుతింపసాగెను.
ప్రహ్లాద ఉవాచ
9.8 (ఎనిమిదవ శ్లోకము)
బ్రహ్మాదయః సురగణా మునయోఽథ సిద్ధాః సత్త్వైకతానమతయో వచసాం ప్రవాహైః|
నారాధితుం పురుగుణైరధునాపి పిప్రుః కిం తోష్టుమర్హతి స మే హరిరుగ్రజాతేః॥5973॥
ప్రహ్లాదుడు ఇట్లు ప్రార్థించెను - బ్రహ్మాదిదేవతలు, ఋషులు, మునులు, సిద్ధపురుషులు మొదలగువారి బుద్ధి నిరంతరము సత్త్వ గుణముతో నిండియుండెను. ఐనను వారు తమ స్తోత్ర ధారా ప్రవాహము వలన అనంతకల్యాణ గుణములు గల నిన్ను ఇంతవరకును సంతుష్టపరచలేక పోయిరి. నేనైతే క్రూరమైన అసురవంశము నందు జన్మించినవాడను. నేను, నిన్ను సంతుష్టి పరుచగలనా?
9.9 (తొమ్మిదవ శ్లోకము)
మన్యే ధనాభిజనరూపతపఃశ్రుతౌజ తేజఃప్రభావబలపౌరుషబుద్ధియోగాః |
నారాధనాయ హి భవంతి పరస్య పుంసో భక్త్యా తుతోష భగవాన్ గజయూథపాయ॥5974॥
ప్రహ్లాదుడు ఉగ్రస్వరూపుడైన నృసింహ భగవానుని ఇంకను ఇట్లు ప్రార్థించుచుండెను
'ధనము, సద్వంశమున జన్మించుట (అభిజాత్యము), రూపము, తపస్సు, విద్య, ఓజస్సు, తేజస్సు, ప్రభావము, బలపౌరుషములు, జ్ఞానము, యోగము మున్నగు గుణములు ఏవియును పరమపురుషుని సంతుష్టి చేయజాలవు అని నేను తలంతును. కాని, భగవానుడు భక్తి ద్వారానే గజేంద్రునకు ప్రసన్నుడయ్యెను. ఏలయన, భక్తిప్రియోమాధవ అనినట్లు భక్తి ఒక్కటే నీకు ప్రియమైనది.
9.10 (పదియవ శ్లోకము)
విప్రాద్ద్విషడ్గుణయుతాదరవిందనాభపాదారవిందవిముఖాచ్ఛ్వపచం వరిష్ఠమ్|
మన్యే తదర్పితమనోవచనేహితార్థప్రాణం పునాతి స కులం న తు భూరిమానః ॥5975॥
ప్రహ్లాదుడు ఉగ్రస్వరూపుడైన నృసింహ భగవానుని ఇంకను ఇట్లు ప్రార్థించుచుండెను
పైన పేర్కొనబడిన పన్నెండుగుణములు ఉన్నను బ్రాహ్మణుడు పద్మనాభుని పాదారవిందములయెడ విముఖుడైనచో, అతని కంటెను తన మనస్సు, వాక్కు, కర్మలు, ధనము, ప్రాణములు (జీవనము), భగవంతునకు సమర్పించిన చండాలుడు శ్రేష్ఠుడు. ఏలయన, అట్టి చండాలుడు తన వంశమును పవిత్రమొనర్చును. తానే గొప్పవాడనను గర్వముగల బ్రాహ్మణుడు తనను కూడ పవిత్రము చేసికొనలేడు.
9.11 (పదకొండవ శ్లోకము)
నైవాత్మనః ప్రభురయం నిజలాభపూర్ణో మానం జనాదవిదుషః కరుణో వృణీతే|
యద్యజ్జనో భగవతే విదధీత మానం తచ్చాత్మనే ప్రతిముఖస్య యథా ముఖశ్రీః॥5976॥
ప్రహ్లాదుడు ఉగ్రస్వరూపుడైన నృసింహ భగవానుని ఇంకను ఇట్లు ప్రార్థించుచుండెను
సర్వశక్తిమంతుడైన ప్రభువు తన స్వరూపసాక్షాత్కారముచే పరిపూర్ణుడగును. సామాన్యజనులు చేయు పూజలు అంగీకరింపవలసిన అవసరము ఆయనకు లేదు. ఐనను, కరుణాళువు ఐన భగవానుడు భక్తుల హితము కొరకే వారి పూజలుగూడ అంగీకరించును. మానవుని ముఖ సౌందర్యమును అద్దములోని ప్రతిబింబము ప్రకటించును. అట్లే భగవానునియెడ భక్తులు సమర్పించే పూజాదికము వారికే (భక్తులకే) ప్రాప్తించును.
నిజమునకు, కరుణామూర్తియగు భగవంతుడు భక్తులు సమర్పించే పత్రపుష్పాదులను కూడా అపేక్షింపడు. ఒక్కసారి తనను స్మరించినంతలోనే భక్తులను అనుగ్రహించును
9.12 (పండ్రెండవ శ్లోకము)
తస్మాదహం విగతవిక్లవ ఈశ్వరస్య సర్వాత్మనా మహి గృణామి యథా మనీషమ్|
నీచోఽజయా గుణవిసర్గమనుప్రవిష్టః పూయేత యేన హి పుమాననువర్ణితేన॥5977॥
ప్రహ్లాదుడు ఉగ్రస్వరూపుడైన నృసింహ భగవానుని ఇంకను ఇట్లు ప్రార్థించుచుండెను
కనుక, అన్ని విధములుగా అయోగ్యుడను, అనర్హుడను ఐన నేనుగూడ ఎట్టి భయము, సందేహము లేకుండ పూర్ణప్రయత్నముతో నా బుద్ధికి తోచినట్లు భగవంతుని మహిమను వర్ణించుచున్నాను. ఈ మహిమను వర్ణించిన ప్రభావముచే అజ్ఞాన కారణముగా సంసార చక్రములో బడిన జీవుడు వెంటనే పునీతుడగును.
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి సప్తమస్కంధములోని తొమ్మిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
3.7.2020 సాయం కాల సందేశము
వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం
సప్తమ స్కంధము - తొమ్మిదవ అధ్యాయము
ప్రహ్లాదుడు నృసింహభగవానుని స్తుతించుట
ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
9.13 (పదమూడవ శ్లోకము)
సర్వే హ్యమీ విధికరాస్తవ సత్త్వధామ్నో బ్రహ్మాదయో వయమివేశ న చోద్విజంతః|
క్షేమాయ భూతయ ఉతాత్మసుఖాయ చాస్య విక్రీడితం భగవతో రుచిరావతారైః॥5978॥
పరమపురుషా! నీవు సత్త్వగుణములకు ఆశ్రయుడవు. బ్రహ్మాదిదేవతలు అందరు నీ యాజ్ఞను శిరసావహించునట్టి భక్తులు. వీరు దైత్యులమైన మావలె నిన్ను ద్వేషింపరు. ప్రభూ! నీవు జగత్కల్యాణమునకై మనోహరమైన అవతారములను దాల్చుచుందువు. అట్లే జనుల ఆత్మానందప్రాప్తికై పెక్కులీలలను నెరపుచుందువు.
9.14 (పదునాలుగవ శ్లోకము)
తద్యచ్ఛ మన్యుమసురశ్చ హతస్త్వయాద్య మోదేత సాధురపి వృశ్చికసర్పహత్యా|
లోకాశ్చ నిర్వృతిమితాః ప్రతియంతి సర్వే రూపం నృసింహ విభయాయ జనాః స్మరంతి॥5979॥
ఈ అసురుని వధించుటకే నీవు ఉగ్రరూపమును దాల్చి యుంటివి. ఇపుడు ఆ దైత్యుడు నిహతుడయ్యెను. కనుక నీవు నీ కోపమును శాతింపజేయుము. ముప్పును కలిగించే తేలుగాని, పాముగాని మరణించినపుడు సజ్జనులుగూడ సంతసింతురు. అట్లే, ఈ దైత్యుని మృతిచే సకలలోకముల వారికిని సుఖము లభించినది. ఇప్పుడు అందరును నీ శాంత స్వరూపమును దర్శించుటకై నిరీక్షించుచున్నారు. నృసింహస్వామీ! భయమునుండి బయట పడుటకు భక్తులు నీ ఈ రూపమును స్మరింపగలరు.
9.15 (పదునైదవ శ్లోకము)
నాహం బిభేమ్యజిత తేఽతిభయానకాస్యజిహ్వార్కనేత్రభ్రుకుటీరభసోగ్రదంష్ట్రాత్|
ఆంత్రస్రజఃక్షతజకేసరశంకుకర్ణాన్నిర్హ్రాదభీతదిగిభాదరిభిన్నఖాగ్రాత్॥5980॥
ప్రభూ! అపరాజితా! నీముఖము భయంకరమైనది. నీ పొడవైన జిహ్వ అధరములపై అటునిటు కదలుచున్నది. నేత్రములు సూర్యునివలె వెలుగొందు చున్నవి. ముఖమున బొమముడి భీకరముగా ఉన్నది. కోరలు భయావహముగా ఉన్నవి. ప్రేవులను మెడలో హారముగా ధరించియున్నావు. మెడ యందలి జూలు రక్తసిక్తమై యున్నది. కర్ణములు బల్లెపు కొనలవలె నిక్కపొడుచుకొనియున్నవి. దిక్కులను పిక్కటిల్లజేయు నీ సింహగర్జనమునకును, శత్రువులను చీల్చి చెండాడు నీ గోళ్ళకును నేను ఏ మాత్రమూ భయపడుటలేదు.
9.16 (పదునారవ శ్లోకము)
త్రస్తోఽస్మ్యహం కృపణవత్సల దుఃసహోగ్రసంసారచక్రకదనాద్గ్రసతాం ప్రణీతః|
బద్ధః స్వకర్మభిరుశత్తమ తేఽఙ్ఘ్రిమూలం ప్రీతోపవర్గశరణం హ్వయసే కదా ను ॥5981॥
కానీ, దీనబంధూ! నేను కేవలము దుర్భరమైన ఉగ్రసంసార చక్రమునందు నలిగిపోవుదునేమోయని భయపడుచున్నాను. నేను నా పురాకృతకర్మల కారణముగా భయంకరమైన ఈ జంతువుల మధ్య చిక్కుపడియున్నాను. సర్వశ్రేష్ఠుడవైన నా స్వామీ! నీవు ప్రసన్నుడవై నీ పాదారవిందముల కడకు నన్ను ఎప్పుడు చేర్చెదవు? అవి సకల జీవులకును శరణ్యములు. మోక్షదాయకములు కదా!
9.17 (పదునేడవ శ్లోకము)
యస్మాత్ప్రియాప్రియవియోగసయోగజన్మశోకాగ్నినా సకలయోనిషు దహ్యమానః|
దుఃఖౌషధం తదపి దుఃఖమతద్ధియాహం భూమన్ భ్రమామి వద మే తవ దాస్యయోగమ్॥5982॥
అనంతా! నేను ఇంతవరకు పొందిన జన్మలన్నింటిలోను ప్రియవస్తువుల వియోగముతోను, అప్రియవస్తు సంయోగముతోను కలుగు దుఃఖాగ్నిలో మాడి మసియైతిని. ఆ దుఃఖములను నశింపజేయు ఔషధముకూడా దుఃఖరూపమే అయియున్నదికదా! నేను ఇతర వస్తువులను అన్నింటిని (దేహాదులను) ఆత్మగా భావించి, ఇటునటు తిరుగుచుంటిని. అందువలన, స్వామీ! నిరంతరము భక్తితో నీ చరణములను సేవించు ఉపాయమును నాకు ప్రసాదింపుము.
9.18 (పదునెనిమిదవ శ్లోకము)
సోఽహం ప్రియస్య సుహృదః పరదేవతాయాః లీలాకథాస్తవ నృసింహ విరించగీతాః|
అంజస్తితర్మ్యనుగృణన్ గుణవిప్రముక్తో దుర్గాణి తే పదయుగాలయహంససంగః॥5983॥
ప్రభూ! నీవు నాకు అత్యంత ప్రియుడవు, అహైతుక హితైషివి. సుహృదుడవు. వాస్తవముగా ఎల్లరకును పరమ ఆరాధ్యుడవు. బ్రహ్మదేవుడు నీ లీలాగాథలను నిరంతరము గానము చేయుచుండును. ఆ గాథలను విని రాగాది ప్రకృతి గుణములనుండి సులభముగా ముక్తుడనై ఈ సంసారదుఃఖముల నుండి తరింపవలెను. నీ పాదయుగమును ఆశ్రయించునట్టి మహాత్ముల సాంగత్యము నాకు ఎల్లప్పుడు లభించుచుండవలెను. ఆ విధముగా నన్ను అనుగ్రహింపుము.
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి సప్తమస్కంధములోని తొమ్మిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
4.7.2020 ప్రాతః కాల సందేశము
వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం
సప్తమ స్కంధము - తొమ్మిదవ అధ్యాయము
ప్రహ్లాదుడు నృసింహభగవానుని స్తుతించుట
ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
9.19 (పందొమ్మిదవ శ్లోకము)
బాలస్య నేహ శరణం పితరౌ నృసింహ నార్తస్య చాగదముదన్వతి మజ్జతో నౌః|
తప్తస్య తత్ప్రతివిధిర్య ఇహాంజసేష్టస్తావద్విభో తనుభృతాం త్వదుపేక్షితానామ్॥5984॥
నృసింహప్రభూ! సంసార తాపత్రయములో పరితపించు జీవిని నీవు ఉపేక్షించినచో, వారిని ఉద్ధరించుటకు వేరే వారెవ్వరును సమర్థులు గారు. అంతెందుకు, నీ కృప లేకుండా తలిదండ్రులు తమ బాలుని రక్షింపలేరు. వైద్యుడిచ్చిన ఔషధము రోగిని బ్రతికింపజాలదు. సముద్రములో మునిగిపోవుచున్నవానిని నౌక కాపాడలేదు. నీ శరణు గోరిన జీవుల దుఃఖము వెంటనే దూరమై పోవును.
9.20 (ఇరువదియవ శ్లోకము)
యస్మిన్ యతో యర్హి యేన చ యస్య యస్మాద్యస్మై యథా యదుత యస్త్వపరః పరో వా|
భావః కరోతి వికరోతి పృథక్స్వభావః సంచోదితస్తదఖిలం భవతః స్వరూపమ్॥5985॥
సత్త్వాది గుణత్రయ కారణముగా వేర్వేరు స్వభావములు గల బ్రహ్మాది శ్రేష్ఠులు, కాలాది కనిష్ఠులు నీచే ప్రేరితులై తమ తమ కార్యములను నెరవేర్చుకొందరు. నీ ప్రేరణచే ఏ ఆధారము నిలిచి యున్నదో, ఏకారణముగా మట్టి మొదలగు ఉపకరణముల ద్వారా ఏ సమయమున ఏయే సాధనములలో, ఏ అదృష్టాదుల సహాయముతో, ఏ ప్రయోజనమునకై ఏ రీతిగా ఉత్పన్నము చేయునట్టి, రూపాంతరము ఒనర్చునట్టి అన్నియును నీ స్వరూపములే- బ్రహ్మాదులు సృష్టించుటకును, రూపాంతరము చేయుటకును ప్రేరకుడవు నీవే. వాటికి ఆధారము, నిమిత్త కారణము, ఉపకరణములు, సాధనములు, సహాయకములు, ప్రయోజనములు, ప్రీతులు అన్నియును నీ స్వరూపములే.
9.21 (ఇరువది ఒకటవ శ్లోకము)
మాయా మనః సృజతి కర్మమయం బలీయః కాలేన చోదితగుణానుమతేన పుంసః॥
ఛందోమయం యదజయార్పితషోడశారం సంసారచక్రమజ కోఽతితరేత్త్వదన్యః॥5986॥
పరమపురుషుడు, జన్మరహితుడు అగు పరమాత్మ కాలము ద్వారా గుణముల యందు క్షోభ కలిగినప్పుడు మాయ మనఃప్రధానమైన లింగ శరీరమును నిర్మించును. ఆ లింగశరీరము బలీయమైనది. ఇది కర్మమయమై పెక్కు నామరూపములయందు ఆసక్తమై వేదోక్తమగు కామ్యకర్మలను చేయుచుండును. అవిద్య ద్వారా కల్పితమైన మనస్సు, పది ఇంద్రియములు, ఐదు తన్మాత్రలు, అను పదహారు అంచులుగల సంసారచక్రము ఇదియే. నిన్ను సేవింపనివాడు ఎవ్వడును ఈ సంసార చక్రమును తరింపజాలడు.
9.22 (ఇరువది రెండవ శ్లోకము)
స త్వం హి నిత్యవిజితాత్మగుణః స్వధామ్నా కాలో వశీకృతవిసృజ్యవిసర్గశక్తిః|
చక్రే విసృష్టమజయేశ్వర షోడశారే నిష్పీడ్యమానముపకర్ష విభో ప్రపన్నమ్॥5987॥
సర్వశక్తిమంతుడవైన ప్రభూ! మాయ పదునారు అంచులు గల ఈ సంసార చక్రమునందు పడవేసి, చెరకును పిండినట్లు నన్ను పిండుచున్నది. నీవు నీ చైతన్య శక్తిచే బుద్ధి యొక్క సమస్త గుణములను సర్వ పరాజితులను గావించుచుందువు. కాలరూపములైన సాధ్యాసాధ్యములు అన్నింటిని నీవు నీ అధీనములో ఉంచుకొందువు. నేను నిన్ను శరణు జొచ్చితిని. నన్ను ఈ సంసార చక్రమునుండి రక్షించి, నీ సన్నిధికి చేర్చుకొనుము.
9.23 (ఇరువది మూడవ శ్లోకము)
దృష్టా మయా దివి విభోఽఖిలధిష్ణ్యపానామాయుః శ్రియో విభవ ఇచ్ఛతి యాన్ జనోఽయమ్|
యేఽస్మత్పితుః కుపితహాసవిజృంభితభ్రూ-విస్ఫూర్జితేన లులితాః స తు తే నిరస్తః॥5988॥
9.24 (ఇరువది నాలుగవ శ్లోకము)
తస్మాదమూస్తనుభృతామహమాశిషో జ్ఞ ఆయుః శ్రియం విభవమైంద్రియమావిరించ్యాత్|
నేచ్ఛామి తే విలులితానురువిక్రమేణ కాలాత్మనోపనయ మాం నిజభృత్యపార్శ్వం॥5989॥
పరమాత్మా! స్వర్గములో లభించు లోకపాలుర ఆయువును, సంపదలను, వైభవములను సాంసారికులు కోరుకొనుచుందురు. వాటిని అన్నింటిని నేను చూచితిని. నా తండ్రి కుపితుడై నవ్వుచు కొద్దిగా బొమముడిచివైచినపుడు ఆ స్వర్గసంపదలు అన్నియును రూపుమాసిపోవు చుండెను. కాని, ఇప్పుడు నా తండ్రిని నీవు వధించితివి. అందువలన సాంసారికులైన జీవులు కోరుకొను నట్టీ బ్రహ్మలోక పర్యంతముగల ఆయువును, సంపదలను, వైభవములను నేను కోరుకొనుట లేదు. ఏలయన, మిగుల శక్తిశాలివగు నీవు కాలస్వరూపుడవై, వాటిని గ్రసించితివి (మ్రింగివేసితివి). కనుక, నన్ను నీ దాసుల సన్నిధికి చేర్చుము.
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి సప్తమస్కంధములోని తొమ్మిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
4.7.2020 సాయం కాల సందేశము
వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం
సప్తమ స్కంధము - తొమ్మిదవ అధ్యాయము
ప్రహ్లాదుడు నృసింహభగవానుని స్తుతించుట
ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
9.25 (ఇరువది ఐదవ శ్లోకము)
కుత్రాశిషః శ్రుతిసుఖా మృగతృష్ణిరూపాః క్వేదం కలేవరమశేషరుజాం విరోహః |
నిర్విద్యతే న తు జనో యదపీతి విద్వాన్ కామానలం మధులవైః శమయన్ దురాపైః॥5990॥
విషయభోగములు వినుటకు ఇంపుగా కనబడును. వాస్తవముగా అవి ఎండమావులలోని నీటివలె అసత్యములు. వివిధ భోగములను అనుభవించునట్టి ఈ శరీరము గూడ లెక్కలేని రోగములకు జన్మస్థానము. ఈ మిథ్యా విషయభోగములు, రోగముల పుట్టయైన శరీరము క్షణభంగురములు, నిస్సారములు అను విషయమును ఎరిగియు, మానవుడు తాను పండితుడైనను వాటినుండి విరక్తుడుగాడు. మిగుల శ్రమపడి పొందిన భోగములనెడి, చిన్న, చిన్న తేనె బిందువులతో మానవుడు తన కామాగ్నిని చల్లార్చు కొనుటకు ప్రయత్నించును.
9.26 (ఇరువది ఆరవ శ్లోకము)
క్వాహం రజఃప్రభవ ఈశ తమోఽధికేఽస్మిన్ జాతః సురేతరకులే క్వ తవానుకంపా|
న బ్రహ్మణో న తు భవస్య న వై రమాయా యన్మేఽర్పితః శిరసి పద్మకరః ప్రసాదః॥5991॥
దేవా! తమోగుణప్రధానమైన అసురవంశములో రజోగుణముచే జన్మించిన నేనెక్కడ? దుర్లభమైన నీ అనుగ్రహమెక్కడ? నేను ధన్యుడను. నీవు దయాస్వరూపమైన నీ కరమును నా శిరస్సుపై ఉంచితివి. అది సకల సంతాపములను హరించును. అట్టి అదృష్టము బ్రహ్మ, శంకరుడు, లక్ష్మీదేవి మున్నగువారికి గూడ అబ్బలేదు.
9.27 (ఇరువది ఏడవ శ్లోకము)
నైషా పరావరమతిర్భవతో నను స్యాత్ జ్జంతోర్యథాఽఽత్మసుహృదో జగతస్తథాపి|
సంసేవయా సురతరోరివ తే ప్రసాదః సేవానురూపముదయో న పరావరత్వమ్॥5992॥
సంసారికులైన ఇతర జీవులవలె చిన్న, పెద్ద అను భేదభావము నీలో లేదు. ఎందుకనగా, నీవు అందరికిని ఆత్మవు, అవ్యాజప్రేమస్వరూపుడవు. ఐనను, కల్పవృక్షము వలె నిన్ను సేవించుట ద్వారానే నీ అనుగ్రహము గూడ ప్రాప్తించును. సేవలను అసుసరించియే జీవులపై నీ కృప ప్రసరించుచుండును. అంతేగాని, ఉచ్చ, నీచ జాతి భేదములవలన కాదు.
9.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)
ఏవం జనం నిపతితం ప్రభవాహికూపే కామాభికామమను యః ప్రపతన్ ప్రసంగాత్|
కృత్వాఽఽత్మసాత్సురర్షిణా భగవన్ గృహీతః సోఽహం కథం ను విసృజే తవ భృత్యసేవామ్॥5993॥
ప్రభూ! ఈ సంసారము ఒక అంధకారకూపము. అందు కాలమనెడి సర్పము కాటు వేయుటకు సర్వదా సిద్ధముగ నుండును. విషయ భోగలాలసులైన వారు అందులోనే పడియుందురు. నేను గూడ నా వంశప్రభావమున అందులో పడబోవుచుంటిని. కాని, దేవర్షియైన నారదుడు నన్ను అందుండి ఉద్ధరించెను. ఇంకనేను నీ భక్తులను సేవించుట ఎట్లు మానగలను?
9.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)
మత్ప్రాణరక్షణమనంత పితుర్వధశ్చ మన్యే స్వభృత్యఋషివాక్యమృతం విధాతుమ్|
ఖడ్గం ప్రగృహ్య యదవోచదసద్విధిత్సుస్త్వామీశ్వరో మదపరోఽవతు కం హరామి॥5994॥
అనంతా! నా తండ్రి అన్యాయముగా నడుము బిగించి ఖడ్గముచేబూని 'నన్ను కాదని నిన్ను రక్షించువాడు ఎవరైనను ఉన్నచో అతడు కాపాడుగాక! నేను నీ శిరమును ఇప్పుడే ఖండించెదను' అని ఇట్లు పలికెను- అప్పుడు నీవు నా తండ్రిని వధించి నా ప్రాణములను రక్షించితివి. నీ భక్తులైన సనకాది ఋషుల వచనము సత్యము చేయుటకే నీవు అట్లొనర్చితివి అని నేను భావింతును.
9.30 (ముప్పదియవ శ్లోకము)
ఏకస్త్వమేవ జగదేతమముష్య యత్త్వమాద్యంతయోః పృథగవస్యసి మధ్యతశ్చ|
సృష్ట్వా గుణవ్యతికరం నిజమాయయేదం నానేవ తైరవసితస్తదనుప్రవిష్టః॥5995॥
పరమాత్మా! ఈ జగత్తు అంతయును నీ స్వరూపమే. ఏలయన, దీనికి నీవే ఆదికారణుడవు. దీనిని లయమొనర్చు వాడవు కూడ నీవే. మధ్యలో ప్రతీతమగు ఈ జగత్తుగూడ నీ స్వరూపమే. నీవు నీ మాయ ద్వారా గుణముల పరిణామ రూపమైన జగత్తును సృష్టించి, అందులో ప్రవేశించి, ఆ గుణములతో గూడి అనేకములుగా గోచరించుచుందువు. ఇది యంతయును నీ లీలయే సుమా!
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి సప్తమస్కంధములోని తొమ్మిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
5.7.2020 ప్రాతః కాల సందేశము
వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం
సప్తమ స్కంధము - తొమ్మిదవ అధ్యాయము
ప్రహ్లాదుడు నృసింహభగవానుని స్తుతించుట
ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
9.31 (ముప్పది ఒకటవ శ్లోకము)
త్వం వా ఇదం సదసదీశ భవాంస్తతోఽన్యో మాయా యదాత్మపరబుద్ధిరియం హ్యపార్థా|
యద్యస్య జన్మ నిధనం స్థితిరీక్షణం చ తద్వై తదేవ వసుకాలవదష్టితర్వోః॥5996॥
దేవా! కార్య కారణ రూపమగు జగత్తు వాస్తవముగా నీవే. కాని, నీవు దాని కంటెను విలక్షణుడవు. అనగా జగత్తులోని గుణ దోషములు పరబ్రహ్మవగు నిన్ను స్పృశింపవు. నా వాడు, పరాయివాడు అను భేదభావము అర్థహీనము, అజ్ఞానము. ఏలయన, వస్తువుయొక్క ఉత్పత్తి, స్థితి, లయములు ఆ వస్తు స్వరూపమే యగును. ఎట్లనగా, వృక్షము, బీజము కార్యకారణ దృష్టితో వేర్వేరుగ గోచరించినను పృథ్వీ తన్మాత్రదృష్టితో ఆ రెండును ఒకటియే.
9.32 (ముప్పది రెండవ శ్లోకము)
న్యస్యేదమాత్మని జగద్విలయాంబుమధ్యే శేషేఽఽత్మనా నిజసుఖానుభవో నిరీహః|
యోగేన మీలితదృగాత్మ నిపీతనిద్రస్తుర్యే స్థితో న తు తమో న గుణాంశ్చ యుంక్షే॥5997॥
పురుషోత్తమా! నీవు ఈ సంపూర్ణ విశ్వమును నీలో లీనమొనర్చుకొని, నిష్క్రియాపరుడవై ఆత్మసుఖమును అనుభవించుచు ప్రళయకాల జలములలో శయనించు చుండెదవు. ఆ సమయమున నీవు స్వయంసిద్ధ యోగము ద్వారా బాహ్యదృష్టిని విరమించి, నీ స్వరూపమగు ప్రకాశమునందు నిద్రను విలీన మొనర్చి, తురీయమగు బ్రహ్మస్థితి యందు ఉందువు. ఆ సమయమున నీవు తమోగుణయుక్తుడవు కావు. గుణాతీతుదవై యుందువు.
9.33 (ముప్పది మూడవ శ్లోకము)
తస్యైవ తే వపురిదం నిజకాలశక్త్యా సంచోదితప్రకృతిధర్మణ ఆత్మగూఢమ్|
అంభస్యనంతశయనాద్విరమత్సమాధేర్నాభేరభూత్స్వకణికావటవన్మహాబ్జమ్॥5998॥
నీవు నీకాలశక్తిచే ప్రకృతి గుణములకు ప్రేరణను కలిగింతువు. కనుక ఆ బ్రహ్మాంఢమంతయు నీ శరీరమే. మొదట అది నీలోనే లీనమైయుండును. ప్రళయకాల జలములయందు శేషునిపై శయనించిన నీవు నీ యోగనిద్రా సమాధిని పరిత్యజించెదవు. అప్పుడు బీజమునుండి వటవృక్షము వలె నీ నాభి నుండి, బ్రహ్మాండమైన కమలము ఉద్భవించినది.
9. 34 (ముప్పది నాలుగవ శ్లోకము)
తత్సంభవః కవిరతోఽన్యదపశ్యమానస్త్వాం బీజమాత్మని తతం స్వబహిర్విచింత్య|
నావిందదబ్దశతమప్సు నిమజ్జమానో జాతేఽఙ్కురే కథము హోపలభేత బీజమ్॥5999॥
ఆ కమలమున సూక్ష్మదర్శియగు బ్రహ్మదేవుడు ప్రకటమయ్యెను. అతనికి కమలము తప్ప మరి ఏవియును కనబడలేదు. అప్పుడు తన బీజరూపమున ఉన్న నిన్ను తెలిసికొనలేక నీవు తన కంటెను వేరుగా భావించి, జలములో మునిగి వంద సంవత్సరములు నిన్ను అన్వేషింపసాగెను. ఇది వాస్తవమే, బీజము అంకురించి, వృక్షముగా వ్యాప్తమైనప్పుడు బయట ఆ బీజము దాని కంటెను వేరుగా ఎట్లు కనబడును?
9.35 (ముప్పది ఐదవ శ్లోకము)
స త్వాత్మయోనిరతివిస్మిత ఆశ్రితోఽబ్జం కాలేన తీవ్రతపసా పరిశుద్ధభావః|
త్వామాత్మనీశ భువి గంధమివాతిసూక్ష్మం భూతేంద్రియాశయమయే వితతం దదర్శ॥6000॥
చాలకాలము వరకు తీవ్రమైన తపస్సును ఆచరించెను. అప్పుడు అతని హృదయము పరిశుద్ధమాయెను. అంతట భూమియందు అతి సూక్ష్మమైన గంధకము వ్యాపించియున్నట్లుగా సూక్ష్మాతిసూక్ష్ముడవగు నీవు సర్వమునందు సత్తారూపముగ వ్యాపించియున్నావు. అట్టి నిన్ను ఆ బ్రహ్మదేవుడు, పంచభూతములు, ఇంద్రియములు, అంతఃకరణముల సంఘాతమైన తన శరీరమునందే సత్తారూపమున వ్యాపించియున్న వానినిగా దర్శించెను.
9.36 (ముప్పది ఆరవ శ్లోకము)
ఏవం సహస్రవదనాంఘ్రిశిరఃకరోరునాసాస్యకర్ణనయనాభరణాయుధాఢ్యమ్|
మాయామయం సదుపలక్షితసన్నివేశం దృష్ట్వా మహాపురుషమాప ముదం విరించః॥6001॥
అప్పుడు బ్రహ్మదేవుడు భగవంతుని లీలామయ స్వరూపమైన విరాట్ పురుషుని దర్శించి, మిగుల ఆనందించెను. ఆ విరాట్ పురుషుడు అసంఖ్యాకములైన ముఖములు, పాదములు, శిరస్సులు, చేతులు, తొడలు, ముక్కులు, నోళ్ళు, చెవులు, నేత్రములు, ఆభరణములు, ఆయుధములు కలిగియుండెను. పదునాలుగు లోకములు ఆ విరాట్ పురుషుని అంగములుగ శోభిల్లు చుండెను.
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి సప్తమస్కంధములోని తొమ్మిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
5.7.2020 సాయం కాల సందేశము
వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం
సప్తమ స్కంధము - తొమ్మిదవ అధ్యాయము
ప్రహ్లాదుడు నృసింహభగవానుని స్తుతించుట
ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
9.37 (ముప్పది ఏడవ శ్లోకము)
తస్మై భవాన్ హయశిరస్తనువం హి బిభ్రద్వేదద్రుహావతిబలౌ మధుకైటభాఖ్యౌ|
హత్వాఽఽనయచ్ఛ్రుతిగణాంస్తు రజస్తమశ్చ సత్త్వం తవ ప్రియతమాం తనుమామనంతి॥6002॥
రజస్తమోగుణ రూపులైన మధుకైటభులు అను గొప్ప బలశాలులైన ఇద్దరు దైత్యులు వేదములను దొంగిలించి, తీసికొనిపోయిరి. అప్పుడు నీవు హయగ్రీవ అవతారమును దాల్చి, వారిద్దరిని చంపి, సత్త్వగుణ రూపములైన శ్రుతులను బ్రహ్మదేవునకు తిరిగి ఇచ్చితివి. ఆ సత్త్వగుణమే నీకు అత్యంత ప్రియమైన శరీరము అని మహాత్ములు వర్ణించిరి.
9.38 (ముప్పది తొమ్మదవ శ్లొకము)
ఇత్థం నృతిర్యగృషిదేవఝషావతారైర్లోకాన్ విభావయసి హంసి జగత్ప్రతీపాన్|
ధర్మం మహాపురుష పాసి యుగానువృత్తం ఛన్నః కలౌ యదభవస్త్రియుగోఽథ స త్వమ్॥6003॥
పురుషోత్తమా! ఈ విధముగా నీవు మానవులు, పశు పక్ష్యాదులు, ఋషులు, దేవతలు, మత్స్యములు మొదలగు అవతారములను దాల్చి, విశ్వమునకు ద్రోహమొనర్చువారిని సంహరించి, లోకములను పాలించితివి. ఆ అవతారముల ద్వారా ప్రతియుగమునందును దాని ధర్మములను రక్షించుచుందువు. కలియుగమున నీవు గుప్త రూపమున ఉందువు.అందువలన నీవు త్రియుగుడు (మూడు యుగములలో ప్రకటమగువాడు) అను పేర ప్రసిద్ధికెక్కితివి.
9.39 (ముప్పది తొమ్మిదవ శ్లోకము)
నైతన్మనస్తవ కథాసు వికుంఠనాథ సంప్రీయతే దురితదుష్టమసాధు తీవ్రమ్|
కామాతురం హర్షశోకభయైషణార్తం తస్మిన్ కథం తవ గతిం విమృశామి దీనః॥6004॥
వైకుంఠనాథా! నామనస్సు మిక్కిలి దుర్దశకులోనై యున్నది. అది స్వయముగా మిగుల దుఃఖస్వభావము గలది. పైగా పాప వాసనలచే కలుషితమైనది. తరచుగ కోరికల కారణమున ఆతురత చెంది యున్నది. హర్షశోకములు, భయము, ఇహపరలోకములు, ధనము, భార్యాపుత్రులు మొదలగు చింతలతో వ్యాకులమై యుండును. దానికి నీ లీలాగాథలయందు రుచి గలుగదు. అట్టి మనస్సుతో నేను దీనుడనై యున్నాను. ఈ స్థితిలో నేను నీ స్వరూపమును ఎట్లు ధ్యానింపగలను?
9.40 (నలుబదియవ శ్లోకము)
జిహ్వైకతోఽచ్యుత వికర్షతి మావితృప్తా శిశ్నోఽన్యతస్త్వగుదరం శ్రవణం కుతశ్చిత్|
ఘ్రాణోఽన్యతశ్చపలదృక్ క్వ చ కర్మశక్తిర్బహ్వ్యః సపత్న్య ఇవ గేహపతిం లునంతి6005॥
అచ్యుతా! ఎన్నటికిని సంతృప్తి చెందని నాలుక రుచ్యములగు పదార్థములవైపునకు నన్ను లాగుచున్నది. జననేంద్రియము అందమైన స్త్రీలకై, చర్మము కోమలమైన స్పర్శకై, ఉదరము మధుర భోజనమునకై, చెవులు శ్రావ్య సంగీతమునకై, నాసిక సుగంధభరిత వస్తువులకై, చపలములైన నేత్రములు సుందర దృశ్యములకై ఆరాటపడుచుండును. అంతేగాక, కర్మేంద్రియములు గూడ తమతమ విషయసుఖములవైపు తీసికొనిపోవుటకై ఒత్తిడి చేయుచుండును. పెక్కుమంది భార్యలుగల పురుషుని సవతులు అందరును అన్నివైపుల నుండి బాధించునట్లు, ఈ జ్ఞానేంద్రియ కర్మేంద్రియములు నన్ను దుర్దశల పాలు చేయుచున్నవి.
9.41 (నలుబది ఒకటవ శ్లోకము)
ఏవం స్వకర్మపతితం భవవైతరణ్యామన్యోన్యజన్మమరణాశనభీతభీతమ్|
పశ్యన్ జనం స్వపరవిగ్రహవైరమైత్రం హంతేతి పారచర పీపృహి మూఢమద్య॥6006॥
ఈ విధముగా జీవుడు తన కర్మ బంధములలో తగుల్కొని, సంసారరూప వైతరణియందు పడియున్నాడు. ఒక దానివెంట మరియొకటి సంభవించు జనన మరణముల ద్వారా కర్మభోగములను అనుభవించుచు అతడు భయగ్రస్తుడైయున్నాడు. వీడు నా వాడు, వీడు పరాయివాడు అను భేదభావముతో కొందరిని మిత్రులనుగా, మరికొందరిని శత్రువులనుగ తలంచుచున్నాడు. నీవు ఈ భవభంధములకు సర్వదా అతీతుడవు. కావున, మూఢులైన ఈ జీవుల దుర్దశను జూచి, కరుణార్ధ హృదయుడవై ఈ ప్రాణులనుగూడ భవసాగరమునుండి దాటింప జేయుము.
9.42 (నలుబది రెండవ శ్లోకము)
కో న్వత్ర తేఽఖిలగురో భగవన్ ప్రయాస ఉత్తారణేఽస్య భవసంభవలోపహేతోః|
మూఢేషు వై మహదనుగ్రహ ఆర్తబంధో కిం తేన తే ప్రియజనాననుసేవతాం నః॥6007॥
జగద్గురూ! ఈ జగత్తుయొక్క సృష్టి, స్థితి, లయములను లీలగా చేయుచుందువు. అట్టి నీకు ఈ అమాయకులైన జీవులను ఉద్ధరించుటకు ప్రయాస ఏముండును? ఆర్తబంధూ! దారితప్పిన ఈ మూఢజనులే నీ యొక్క విశేషమగు అనుగ్రహమును పొందుటకు పాత్రులగుదురు. మేము మాత్రము మీ ప్రియభక్తుల సేవలద్వారా తరించెదము.
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి సప్తమస్కంధములోని తొమ్మిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
6.7.2020 సాయం కాల సందేశము
వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం
సప్తమ స్కంధము - తొమ్మిదవ అధ్యాయము
ప్రహ్లాదుడు నృసింహభగవానుని స్తుతించుట
ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
9.49 (నలుబది తొమ్మిదవ శ్లోకము)
నైతే గుణా న గుణినో మహదాదయో యే సర్వే మనః ప్రభృతయః సహదేవమర్త్యాః|
ఆద్యంతవంత ఉరుగాయ విదంతి హి త్వామేవం విమృశ్య సుధియో విరమంతి శబ్దాత్॥6014॥
పరమాత్మా! నీవు గొప్పకీర్తి ప్రతిష్టలు గలవాడవు. సత్త్వాది గుణములు, ఆ గుణ పరిణామములైన మహత్తత్త్వాదులు, దేవతలు, మనుష్యులు, అట్లే మనస్సు మొదలగునవి ఏవియు నీ స్వరూపమును తెలిసి కొనుటకు సమర్థములు గావు. ఏలయన, అవి అన్నియును ఆద్యంతములు గలవి. నీవు అనాదివి, అనంతుడవు (ఆద్యంతములు లేనివాడవు). జ్ఞానులు ఇట్లు ఆలోచించియే శబ్దజాలము, అను మాయనుండి ఉపరతులై నిన్ను ఉపాసింతురు.
9.50 (ఏబదియవ శ్లోకము)
తత్తేర్హత్తమ నమః స్తుతికర్మపూజాః కర్మ స్మృతిశ్చరణయోః శ్రవణం కథాయామ్|
సంసేవయా త్వయి వినేతి షడంగయా కిం భక్తిం జనః పరమహంసగతౌ లభేత ॥6015॥
పరమపూజ్యుడవగు స్వామీ! నమస్కారము, స్తోత్రము, సమస్తకార్యములను నీకు సమర్పించుట, సేవలు - పూజలు చేయుట నీ పాదాబ్జములను స్మరించుట, నీ లీలాగాథలను వినుట అను ఆరును నీ సేవకు అంగములు. ఈ షడంగములు లేకుండ నీ పాదారవిందములపై భక్తి ఎట్లు ఏర్పడును? భక్తి లేనిదే నీ ప్రాప్తి కలుగుట యెట్లు? ప్రభూ! నీవే భాగవతోత్తములకు, పరమహంసలకు సర్వస్వము.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
బమ్మెర పోతన గారి పద్యమొకటి ఈ సందర్భంలో
సప్తమ స్కంధము, 367వ పద్యము
సీస పద్యము
నీ గృహాంగణభూమి నిటలంబు మోవంగ;
మోదించి నిత్యంబు మ్రొక్కఁడేని
నీ మంగళస్తవ నికర వర్ణంబులు;
పలుమాఱు నాలుకఁ బలుకఁడేని
నీ యధీనములుగా నిఖిలకృత్యంబులు;
ప్రియభావమున సమర్పింపఁడేని
నీ పదాంబుజముల నిర్మల హృదయుఁడై;
చింతించి మక్కువఁ జిక్కఁడేని
తేటగీతము
నిన్నుఁ జెవులార వినఁడేని నీకు సేవ
చేయరాఁడేని బ్రహ్మంబు జెందఁ గలఁడె?
యోగి యైనఁ దపోవ్రతయోగి యైన
వేది యైన మహాతత్త్వవేది యైన.
ప్రతిపదార్ధము
భావము
నీ గుడి ప్రాంగణంలో నిత్యం నీకు తలవంచి మ్రొక్కని వాడు; మంగళకరాలైన నీ కీర్తనలు పలుమార్లు నాలుకతో పలుకని వాడూ; కర్మలు సమస్తం నీ అధీనం అని భక్తిభావంతో తలచి సమర్పణ చేయనివాడూ; నీ పాదపద్మాలు నిర్మలమైన మనస్సుతో నిత్యం ధ్యానించి పరవశించని వాడూ; చెవులారా నీ సంకీర్తనలు వినని వాడూ; చేతులారా నీ సేవ జేయనివాడూ; యోగి అయినా, మహా తపశ్శక్తిశాలి యైన యోగి అయినా, ఎంతటి పండితుడైనా, ఎంతటి తత్వవేత్త అయినా ఎప్పటికీ పరమపదం అందుకోలేడు.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
నారద ఉవాచ
9.51 (ఏబది ఒకటవ శ్లోకము)
ఏతావద్వర్ణితగుణో భక్త్యా భక్తేన నిర్గుణః|
ప్రహ్లాదం ప్రణతం ప్రీతో యతమన్యురభాషత॥6016॥
నారదుడు వచించెను-భగవానుడు ప్రాకృత గుణరహితుడు. ఐనను, పరమ భక్తుడైన ప్రహ్లాదుడు మిక్కిలి ప్రేమతో ఆ స్వామి స్వరూప గుణములను వర్ణించెను. అనంతరము అతడు భగవానుని చరణములకు శిరసా నమస్కరించెను. అంతట నృసింహ భగవానుని కోపము శాంతించెను. అప్పుడు ఆ ప్రభువు ప్రహ్లాదునితో ఇట్లు పలికెను.
శ్రీభగవానువాచ
9.52 (ఏబది రెండవ శ్లోకము)
ప్రహ్లాద భద్ర భద్రం తే ప్రీతోఽహం తేఽసురోత్తమ|
వరం వృణీష్వాభిమతం కామపూరోఽస్మ్యహం నృణామ్॥6017॥
9.53 (ఏబది మూడవ శ్లోకము)
మామప్రీణత ఆయుష్మన్ దర్శనం దుర్లభం హి మే|
దృష్ట్వా మాం న పునర్జంతురాత్మానం తప్తుమర్హతి॥6018॥
9.54 (ఏబది నాలుగవ శ్లోకము)
ప్రీణంతి హ్యథ మాం ధీరాః సర్వభావేన సాధవః|
శ్రేయస్కామా మహాభాగ సర్వాసామాశిషాం పతిమ్॥6019॥
శ్రీభగవానుడు నుడివెను-ప్రహ్లాదా! నీవు పరమ కల్యాణ స్వరూపుడవు. నీకు శుభమగుగాక. నీకు ప్రసన్నుడనైతిని. అసురోత్తమా! నీకు ఇష్టమైన వరమును కోరుకొనుము. నేను మానవులకు కోరికలను ప్రసాదించువాడను. ఆయుష్మంతుడా! నిన్ను ప్రసన్నుని చేసికొనిన వానికి నా దర్శనము దుర్లభము. నా దర్శనము ఐనంతనే ప్రాణుల హృదయములయందు ఎట్టి పరితాపములు ఉండవు. నేను సమస్త మనోరథములను ఈడేర్చువాడను. కనుక శ్రేయస్కాములు, అదృష్టవంతులైన సత్పురుషులు జితేంద్రియులై తమ వృత్తులయన్నింటి ద్వారా నన్ను ప్రసన్నుని జేసికొనుటకు ప్రయత్నింతురు.
నారద ఉవాచ
9.55 (ఏబది ఐదవ శ్లోకము)
ఏవం ప్రలోభ్యమానోఽపి వరైర్లోకప్రలోభనైః|
ఏకాంతిత్వాద్భగవతి నైచ్ఛత్తానసురోత్తమః॥6020

No comments:
Post a Comment