వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం, సప్తమ స్కంధము - ఎనిమిదవ అధ్యాయము నృసింహ భగవానుని ప్రాదుర్భావము - హిరణ్యకశిపుని వధ - బ్రహ్మాదిదేవతలు భగవంతుని స్తుతించుట
ఓం నమో భగవతే వాసుదేవాయ
***
నారద ఉవాచ
నారదుడు నుడివెను ప్రహ్లాదుని ప్రవచనమును విన్న పిదప దైత్యబాలురు అప్పటినుండి నిర్మల మనస్సుతో అతని ఉపదేశమును పాటింపసాగిరి. గురువుల భౌతిక విద్యపై వారు ఏమాత్రమూ శ్రద్ధ చూపకుండిరి.
విద్యార్థులయొక్క అందరి బుద్ధి భగవంతుని యందే స్థిరమై యుండుటను గురుపుత్రులు గమనించిరి. వారు భయముతో హిరణ్యకశిపుని కడకేగి విషయమును అంతయు యథాతథముగా ఆయనకు నివేదించిరి.
తన పుత్రుడైన ప్రహ్లాదుని ప్రవర్తన హిరణ్యకశిపునకు అప్రియముగా, అవిధేయతగా, సహింపరానిదిగా తోచెను. గురుపుత్రుల మాటలను విన్నపిదప క్రోధావేశముతో అతని శరీరము గడగడ వణకసాగెను. కనుక, అతడు తన చేతులతోనే పుత్రుని వధించుటకు నిశ్చయించుకొనెను.
మనస్సును, ఇంద్రియములను వశమునందు ఉంచుకొనిన ప్రహ్లాదుడు వినమ్రతతో చేతులు జోడించుకొని తండ్రియందు మౌనముగా నిలబడియుండెను. అతడు తృణీకారమునకు ఎంత మాత్రము తగదు. కాని హిరణ్యకశిపుడు సహజముగనే క్రూరుడు, అతడు కోపముతో తోక
ద్రొక్కిన పామువలె బుసలు కొట్ట సాగెను. అతడు తన కుమారుని పాపదృష్టితో చూచుచు కఠోరముగా ఇట్లు పలుకసాగెను. "మూర్ఖుడా! దుర్బుద్ధీ! నీవు అవిధేయుడవైతివి.నీవు చెడిపోవుటయేగాక, తోడిబాలురను గూడ చెడగొట్టుచున్నావు. మన వంశమునకు కళంకమును దెచ్చుచున్నావు. పట్టుదలతో నా ఆజ్ఞను ఉల్లంఘించు చున్నావు. నేడే నిన్ను యమలోకమునకు పంపెదను. నేను క్రుద్ధుడనైనచో ముల్లోకములును, లోకపాలురును గడగడ వణుకుదురు. మూఢుడా! నీవు ఎవరి బలము చూచుకొని నిర్భయుడవై, నా ఆజ్ఞను ఉల్లంఘించుచుంటివి"
ప్రహ్లాద ఉవాచ
ప్రహ్లాదుడు వచించెను రాజా! బ్రహ్మమొదలుకొని గడ్డిపోచవరకు చిన్న-పెద్ద చరాచరజీవులు అన్నియును ఆ భగవంతుని అధీనములోనే యున్నవి. నాకేగాదు, నీకును, జగత్తులోన సకల బలశాలులకును కేవలము అతడే బలము. తండ్రీ! ఆ శ్రీహరియే మహాపరాక్రమశాలి. సర్వశక్తిమంతుడైన కాలస్వరూపుడు. సమస్త ప్రాణులయొక్క దేహేంద్రియ మనోబలములకు అతడే మూలము. ధైర్యము, ఇంద్రియములు గూడ అతడే. ఆ పరమేశ్వరుడే తన శక్తులద్వారా ఈ విశ్వమును సృజించి పాలించి, లయమొనర్చుచున్నాడు. త్రిగుణములకు అతడే స్వామి. రాజా! మీరు మీ అసుర భావమును త్యజింపుడు. మనస్సులో అందరియెడల సమాన భావమును కలిగియుండుడు. మనస్సు చెడు మార్గములయందు పోవుచుండును. ఈ మనోనిగ్రహము లేనివానికి ప్రపంచములో అది తప్ప వేరే శత్రువు ఎవ్వరును లేడు. అందరీనీ సమానభావముతో చూచుటయే భగవంతునకు చేయు గొప్ప ఆరాధన. తండ్రీ! తమ సర్వస్వమును కొల్లగొట్టునట్టి ఇంద్రియములు అనెడి బందిపోటు దొంగలపై విజయమును సాధింపనివాడు 'నేను దశదిశలనూ జయించితిని' అని భావించువాడు మూర్ఖుడు. జితేంద్రియులైన మహాత్ములగు జ్ఞానులు సమస్త ప్రాణులయెడ సమభావమును కలిగియుండి వారు అజ్ఞానజనితమైన కామక్రోదాధి అంతశ్శత్రువులను నిర్మూలించెదరు. ఇంక వారికి బాహ్యశత్రువులు ఎట్లు ఉందురూ?ఉండరుగదా!"
హిరణ్యకశిపురువాచ
హిరణ్యకశిపుడు పలికెను-ఓరీ! మందబుద్ధీ! నీవు అతిగా వాగుచున్నావు. దీనివలన నీవు చావగోరుచున్నట్లు స్పష్టమగుచున్నది. ఏలయన, చావుమూడినవారే ఇట్లు వదరుచుందురు.
మందభాగ్యుడా! ఈ జగత్తునకు మరియొక ప్రభువు ఉన్నాడని నీవు పలుకు చున్నావు. అతడు ఎక్కడ ఉన్నాడో, ఇప్పుడే చూచేదను గాక. అతడు సర్వత్ర ఉన్నచో ఈ స్తంభమునందు ఏలకనబడడు?
ఈ స్తంభమునందు గూడ అతడు ఉన్నట్లు బీరములు పలుకుచున్నావు. ఇప్ఫుడే నీ శిరస్సును మొండెమునుండి వేరుచేసెదను.నీవు ఇంతగా విశ్వసించు సర్వవ్యాపియైన ఆ హరి నిన్ను ఎట్లు రక్షించునో చూచెదనుగాక!
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి సప్తమస్కంధములోని ఎనిమిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
***
వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం
సప్తమ స్కంధము - ఎనిమిదవ అధ్యాయము
నృసింహ భగవానుని ప్రాదుర్భావము - హిరణ్యకశిపుని వధ - బ్రహ్మాదిదేవతలు భగవంతుని స్తుతించుట
ఓం నమో భగవతే వాసుదేవాయ
***
అత్యంత బలశాలియైన హిరణ్యకశిపుడు భాగవతోత్తముడైన ప్రహ్లాదుని ఈ విధముగా పరుషోక్తులతో బాధించెను. అతడు తన కోపావేశమును పట్టలేకపోయెను.వెంటనే ఖడ్గమును చేబూని తన సింహాసనమునుండి లేచి వేగముగా ఆ స్తంభమును తన పిడికిలితో గ్రుద్దెను.
ధర్మరాజా! అదే సమయమున బ్రహ్మాండము బ్రద్దలగుచున్నట్లు ఆ స్తంమునుండి ఫట, ఫట, ఫెళ, ఫెళ, ఛట ఛట యను భీకరమైన శబ్దములు వెలువడెను. దానిని వినినంతనే బ్రహ్మాదిదేవతలు తమ లోకమునందు ప్రళయము కలుగుచున్నదా! యని భావించిరి.
హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని వధించుటకై వేగముగా ముందునకు దుమికెను. కాని, దైత్యసేనాపతులు ఆ భయంకర శబ్దమును విని, భీతితో వణికి పోవుచున్నట్లు అతడు గమనించెను. అతడు గూడ కొద్దిగా తొట్రుపడుచు ఈ శబ్దమును చేయుచున్నదెవరు? అని అటునిటు చూచెను. కాని, ఆ సభామధ్యమున అతనికి ఏమియు కనబడలేదు.
అదే సమయమున భగవంతుడైన శ్రీహరి తన భక్తుడైన ప్రహ్లాదుని, బ్రహ్మదేవుని మరియు సనకాదుల మాటలను నిలబెట్టుటకును, తన సర్వవ్యాపకత్వమును నిరూపించుటకును భగవంతుడు ఆ స్తంభమునుండియే ఒక విచిత్రరూపముతో ప్రకటితుడు అయ్యెను. అతడు పూర్తిగా సింహముగాదు, నరుడుగాదు.
బోలో, శ్రీ నృసింహస్వామి భగవాన్ కీ జై!!
హిరణ్య కశిపుడు ఈ శబ్దమును చేయుచున్నది ఎవరు? అని ఇటునటు వెదుకసాగెను. అప్పుడు ఆ స్తంభము నుండి బయటికి వచ్చుచున్న ఒక అద్భుతప్రాణిని అతడు చూచెను. అప్పుడతడు "అహో! ఈ ప్రాణి మనుష్యుడు కాదు, మృగము కాదు. ఈ నృసింహరూపము ఏ అలౌకిక ప్రాణి ఇదై ఉండవచ్చును?"
ఆ విచిత్రప్రాణి ఎవరని హిరణ్యకశిపుడు ఆలోచించుచుండగా నృసింహ భగవానుడు అతని కట్టెదుట నిలచెను. ఆయన రూపము మిగుల భయావహముగా ఉండెను. కన్నులు పుటము పెట్టిన బంగారమువలె పచ్చగా భయావహముగా ఉండెను. విస్ఫారిత ముఖముతో ఆ స్వామి జూలు విదల్చుచు మెడను అటునిటు త్రిప్పసాగెను. ఆ భగవానుని కోరలు భయంకరముగా ఉండెను. ఖడ్గమువలె వాడియైన నాలుకను చాచి, త్రిప్పుచుండెను. ముడిచిన బొమముడితో ముఖము అంతను దారుణముగా ఉండెను. చెవులు నిశ్చలమై నిక్కపొడచుకొని యుండెను. వెడల్పైన నాసా పుటములు తెరచియున్న నోరు గుహలవలె అద్భుతముగా ఉండెను. విప్పుకొని దవుడలతో ఆయన వదనము భీషణముగా ఉండెను. శరీరము మిక్కిలి పొడవై ఆకాశమును తాకు చుండెను. మెడ బలిష్టమై లావుగా నుండెను. వెడల్పైన వక్షస్థలముతో, సన్నని నడుముతో విరాజిల్లుచుండెను. చంద్రకిరణములవలె తెల్లని రోమములు ఆయనశరీరముపై మెరయుచుండెను. వందలకొలది భుజములు అన్నివైపుల యందును వ్యాపించియుండెను. గోళ్ళు ఆయుధములవలె పొడవై పదును దేలియుండెను.
అట్టి స్వామిని సమీపించుటకు ఎవరికినీ శక్యము గాకుండెను. సుదర్శనచక్రము మొదలగు ఆయుధములతో, వజ్రాయుధము వంటి మెరుగైన శస్త్రములతో ఆ నృసింహ భగవానుడు దైత్య దానవులను అందరిని తరిమికొట్టెను. అప్పుడు హిరణ్యకశిపుడు బహుశః మహామాయావియైన విష్ణువే నన్ను వధించుటకై ఈ రూపములో వచ్చియుండెను. కాని, ఇతని పన్నాగములు నన్ను ఏమియును చేయజాలవు అని తర్కించుకొనసాగెను.
ఈ విధముగా పలుకుచు దైత్యశ్రేష్ఠుడైన హిరణ్యకశిపుడు గదను చేబూని, సింహనాదముచేయుచు నృసింహుని మీదికి విజృభించెను. కాని, అగ్నిలో దూకిన మిడుతవలె అతడు నృసింహుని తేజస్సులో అదృశ్యమాయెను.
మహాతేజశ్శాలి, శక్తిమంతుడైన భగవంతుని విషయములో ఈ సంఘటనము అంతగా ఆశ్చర్యకరముగాదు. ఏలయన, సృష్ట్యారంభములో ఆ స్వామి తన తేజస్సుతో తమోగుణ ప్రధానమైన అంధకారమును త్రాగివేసియుండెను. పిమ్మట ఆ దైత్యుడు కృద్ధుడై ఆ స్వామిని ఎదిరించి గదను వేగముగా త్రిప్పుచు దానిని విసరివేసెను.
అంతట గరుత్మంతుడు పామునువలె భగవానుడు గదతో పోరుచున్న ఆ హిరణ్యకశిపుని ఒడిసి పట్టుకొనెను. ఆటలాడుచున్న గరుత్మంతుని పట్టునుండి సర్పమువలె భగవంతునిచేతినుండి ఆ దైత్యుడు విడీపించుకొనెను.
ధర్మారాజా! స్వర్గరాజ్యమును హిరణ్యకశిపుడు ఇంతకు ముందే చేజిక్కుంచుకొనియుండెను. కావున, అప్పుడు ఆ దైత్యరాజు తమను ఎక్కడజూచునేమో! అను భయముతో లోకపాలురు అందరును మేఘములలో దాగికొని ఆ యుద్ధమును చూచుచుండిరి. అంతట దైత్యుడు భగవంతుని పట్టునుండి జారిపోవుటను జూచుటతో వారి ధైర్యములు సడలి పోసాగెను. హిరణ్యకశిపుడు గూడ 'ఈ నరసింహుడు నా బల పరాక్రమములను జూచి, భయపడీ నన్ను తన చేతినుండి విడిచి పెట్టినాడు' అని భావించెను. అంతట అతడు తన శ్రమను మరచి, డాలు, ఖడ్గమును తీసికొని యుద్ధమొనర్చుటకై మరల ఆ స్వామి మీదికి వేగముగా విజృభించెను.
అప్పుడు ఆ దైత్యుడు డేగవలె మిక్కిలి వేగముతో క్రిందికి పైకి ఎగురుచు తన డాలును, ఖడ్గమును త్రిప్పసాగెను. అందువలన అతనిని ఆక్రమించుటకు శ్రీహరికి వీలుపడలేదు. అప్పుడు ఆప్రభువు బిగ్గరగా భయంకరమైన అట్టహాసము చేసెను. దానికిహిరణ్యకశిపుని కన్నులు మూతపడెను.

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం, సప్తమ స్కంధము - ఎనిమిదవ అధ్యాయము
నృసింహ భగవానుని ప్రాదుర్భావము - హిరణ్యకశిపుని వధ - బ్రహ్మాదిదేవతలు భగవంతుని స్తుతించుట
ఓం నమో భగవతే వాసుదేవాయ
***
అంతట భగవానుడు వేగముగా ముందుకు ఉరికి పాము ఎలుకనువలె అతనిని పట్టుకొనెను. వజ్రాయుధము యొక్క దెబ్బకు గూడ ఆ హిరణ్యకశిపుని చర్మముపై ఎట్టి గాయములును ఏర్పడలేదు. అట్టి ఆ దైత్యుడే ఇప్పుడు భగవానుని పట్టునుండి బయట పడుటకు గిలగిలలాడ సాగెను. నృసింహుడు అతనిని సభాద్వారము కడకు తీసికొనిపోయి తన తొడలపై చేర్చుకొనెను. పిమ్మట అవలీలగా తన నఖములతో గరుత్మంతుడు మహావిషసర్పమునువలె చీల్చివేసెను.
ఆ సమయమున క్రుద్ధుడైయున్న భగవానుని కన్నులు చూడశక్యము గాకుండెను. ఆయన నోరు తెరచి, నాలుకతో చప్పరించుచుండెను. రక్త బిందువులతో తడిసి ఆయన నోరు, జూలు ఎరుపెక్కెను. ఏనుగును చంపి, దాని ప్రేవులను మాలగా ధరించిన మృగరాజు వలె ఆయన శోభాయమానుడయ్యెను.
ఆ ప్రభువు హిరణ్యకశిపుని వక్షః స్థలమున వాడియైన తన గోళ్ళతో చీల్చి, అతనిని నేలపై పడద్రోసెను. ఆ సమయమున వేలకొలది దైత్యులు, దానవులు శస్త్రములను చేబూని, ఆ భగవంతుని దెబ్బతీయుటకై సిద్ధపడిరి. అప్పుడు ఆ దేవదేవుడు తన భుజములనెడి సేనతో, నఖములనెడి శస్త్రములతో కాలిమడమలతో తన్ని వారిని నలువైపుల చెల్లా చెదురుగావించి సంహరించెను.
యుధిష్ఠర మహారాజా! నృసింహభగవానుడు జూలు విదిల్చినంతలో మేఘములు చెల్లా చెదరైపోయినవి. ఆ స్వామి నేత్రజ్వాలలకు సూర్యాది గ్రహముల తేజస్సులు వెలవెల బోయినవి. ఆ ప్రభువు నిశ్వాసలకు సముద్రములు క్షోభకు గురియైనవి. ఆయన గర్జనలకు భీతిల్లి దిగ్గజములు ఆక్రోశించినవి.
ఆ ప్రభువు జూలు విదలింపుల ధాటికి దేవతల విమానములు అస్తవ్యస్తములాయెను. స్వర్గలోకము ఊగిపోయెను. ఆ స్వామి పాద ఘట్టములకు భూమి కంపించెను. కొండ ఎగిరిపడెను. ఆ ప్రభువు తేజస్సునుకు ఆకాశము, దిక్కులు కాంతి హీనములయ్యెను.
అట్టి సమయమున ఆ భగవానుని ఎదిరించుటకు ఎవ్వరును ముందుకు రాలేకపోయిరి. క్రోధము మిక్కుటమయి ఆయన హిరణ్యకశిపుని రాజసభయందలి ఉన్నత సింహాసనముపై విరాజిల్లెను. అప్పుడు ఆ ప్రభువు ముఖము మిక్కిలి తేజఃపూర్ణమై క్రోధముతో నిండి మిగుల భయంకరముగా కనవచ్చుచుండెను. దానిని జూచి ఎవ్వరును ఆయనకడకు వెళ్ళి సేవలొనర్చుటకు సాహసింపరైరి.
ధర్మరాజా! ముల్లోకములను గడగడలాడించు హిరణ్యకశిపుడు యుద్ధమున శ్రీహరిచే హతుడైన వార్తను విని, దేవాంగనలు సంతోషమును పట్టలేకపోయిరి. వారి ముఖములు వికసించెను. వారు పదే పదే ఆ స్వామిపై పూలవర్షమును కురుపించిరి.
భగవంతుని దర్శనము కొరకై విమానములలో వచ్చిన దేవతా సమూహములతో ఆకాశము నిండిపోయెను. వారు డోళ్ళు, నగారాలు మ్రోగించిరి. గంధర్వప్రముఖులు మధురముగా గాన మొనర్చిరి. అప్సరసలు నాట్యము చేసిరి.
నాయనా! ధర్మరాజా! ఆసమయమున బ్రహ్మ ఇంద్రుడు, శంకరుడు మొదలగు దేవతలును, ఋషులు, పితృదేవతలు, సిద్ధులు, విద్యాధరులు, మహానాగులు, మనువులు, ప్రజాపతులు, గంధర్వులు, అప్సరసలు, చారణులు, యక్షులు, కింపురుషులు, భేతాళులు, సిద్ధులు, కిన్నరులు, సునందుడు, కుముదుడు మున్నగు శ్రీహరి పార్షదులు అందరును అచటికి చేరిరి. వారు అందరును, నతమస్తకులై అంజలి ఘటించిరి. సింహాసనముపై విరాజిల్లుచున్న తేజోమూర్తియగు నృసింహభగవానునకు కొద్ది దూరములొ నిలిచి వేర్వేరుగా ప్రస్తుతింపసాగిరి.
బ్రహ్మోవాచ
బ్రహ్మదేవుడు పలికెను- ప్రభూ! నీవు అనంతుడవు. నీ శక్తి అపారమైనది. నీ బలపరాక్రమములు అద్భుతములు, నీవు చేయు కర్మలు పవిత్రములు, త్రిగుణముల ద్వారా నీవు సృష్టి, స్థితి, లయములను అవలీలగా నెఱపుచుందువు. ఐనను నీవు ఆ త్రిగుణములకు అతీతుడవు, నిర్వికారుడవు, శాశ్వతుడవు. నీకు నమస్కారములు.
శ్రీరుద్ర ఉవాచ
శంకరుడు నుడివెను-భక్తవత్సలా! నీవు కోపగించినచో కల్పాంతమగును. తుచ్ఛుడైన దైత్యుని హతమార్చుటకై నీవు క్రోధమూర్తివైతివి. ఇప్పుడు ఆ దైత్యుడు మరణించెను. అతని కుమారుడైన ఈ ప్రహ్లాదుడు మహాభక్తుడు. నిన్ను శరణు జొచ్చినాడు. అతనిని కాపాడుము.
ఇంద్ర ఉవాచ
ఇంద్రుడు వచించెను దేవాదిదేవా! నీవు దయతో మమ్ములను రక్షించితివి. మా యజ్ఞభాగములను మేము మరల పొందునట్లు చేసితివి. వాస్తవముగా అవి అంతర్యామివైన నీకే చెందును. దైత్యుల ఆగడములకు మా హృదయకమలములు ముడుచుకొనిపోయినవి. అవి ఇప్పుడు వికసించి నీకు నివాసస్థానము లాయెను. నాథా! నారసింహా! స్వర్గాదిరాజ్యములు మాకు మరల ప్రాప్తించినవి. కాని, అవి కాలక్రమమున నశించునవి. నీకు సేవకులైన వారికి మోక్షముకూడ అక్కరయే లేదు. ఇంక ఇతర భోగములను గూర్చి చెప్పనేల?
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి సప్తమస్కంధములోని ఎనిమిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
***
వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం సప్తమ స్కంధము - ఎనిమిదవ అధ్యాయము
నృసింహ భగవానుని ప్రాదుర్భావము - హిరణ్యకశిపుని వధ - బ్రహ్మాదిదేవతలు భగవంతుని స్తుతించుట
ఓం నమో భగవతే వాసుదేవాయ
***
ఋషయ ఊచుః
మహర్షులు పలికిరి పురుషోత్తమా! శరణాగతరక్షకా! నీవు నీ తపస్సు ద్వారానే నీలో లీనమైయున్న జగత్తును మరల బహిర్గత మొనర్చియుంటివి. నీ తేజోరూపమైస ఆ తపస్సులను దయతో మా కొరకు ఉపదేశించితివి. అట్టి తపస్సులను దయతో మా కొరకు ఉపదేశించితివి. అట్టి తపస్సును ఈ దైత్యుడు విచ్ఛేదమొనర్చియుండెను.ఇపుడు ఆ దైత్యుడు మరణించెను. ఆ తపస్సును రక్షించుటకై ఈ అవతారమును దాల్చి, దానిని మరల మాకు అనుగ్రహించితివి.
పితర ఊచుః
పితృదేవతలు పలికిరి- ప్రభూ! మా కుమారులు మాకు పిండప్రదానము చేయుచుండిరి. ఈ దుర్మార్గుడు వాటిని మానుండి బలవంతముగ లాగికొని తిని వేయుచుండెను. మా కుమారులు పవిత్ర తీర్థముల యందుగాని, సంక్రాంతి మొదలగు పర్వదినములలోగానీ నైమిత్తిక తర్పణము చేయుచు తిలాంజలులను ఇచ్చుచుండిరి. ఈ దైత్యుడు వాటిని గూడ త్రాగి వేయుచుండెను. నేడు నీవు నీ నఖములతో వాని పొట్టను చీల్చివేసితివి. మా పుత్రులు సమర్పించిన పిండములను మాకు తిరిగి ఇచ్చి వేసినట్లైనది. నీవు సకలధర్మములను రక్షించువాడవు. నృసింహస్వామీ! నీకు నమస్కారములు.
సిద్ధా ఊచుః
సిద్ధులు వచించిరి-నృసింహస్వామీ! మేము మా యోగముల, తపస్సుల ద్వారా పొందిన సిద్ధులను ఈ దుష్టుడు బలవంతముగా అపహరించెను. ఇప్పుడు నీవు నీ నఖములచే ఈ గర్వితుని చీల్చి చెండాడితివి. నీ పాదములకు ప్రణమిల్లుచున్నాము.
విద్యాధరా ఊచుః
విద్యాధరులు వచించిరి- స్వామీ! మేము వివిధ యోగసాధనలచే విద్యలను అభ్యసించియుంటిమి. 'మూర్ఖుడైన ఈ హిరణ్యకశిపుడు తన బల పరాక్రమములతో గర్వితుడై ఆ విద్యలను నష్టపరచెను. యుద్ధమున నీవు వానిని యజ్ఞపశువునువలె హతమార్చితివి. నీమాయద్వారా ఈ నృసింహరూపమును ధరించితివి. నిత్యము నిరంతరము నీకు ప్రణమిల్లెదము'
నాగా ఊచుః
నాగులు నుడివిరి- దేవా! ఈ పాపాత్ముడు మా పడగల పై గల మణులను, మా యువతీమణులను గూడ అపహరించి యుండెను. నేడు నీవు వాని వక్ష స్థలమును చీల్చి మా పత్నులకు ఆనందమును గూర్చితివి. నీకు నమస్కరించు చున్నాము.
మనవ ఊచుః
మనువులు ఇట్లు పలికిరి దేవాధిదేవా! మేము నీ ఆజ్ఞలను శిరసావహించు మనువులము. ఈ దైత్యుడు మా ధర్మ మర్యాదులను అన్నింటిని భంగపరచెను. నీవు ఈ దుష్టుని పరిమార్చి మాకు మహోపకారము చేసితిమి. మేము నీ సేవకులము. మేము ఏమి చేయవలనో ఆజ్ఞాపింపుము.
ప్రజాపతయ ఊచుః
ప్రజాపతులు ఇట్లు పలికిరి- పరమేశ్వరా! నీవు మమ్ములను ప్రజాపతులనగా నియమించితివి. కాని, ఈ దుష్టుడు అవరోధములను కల్పించుటచే మేము ప్రజాసృష్టిని చేయలేకపోయితిమి. నీవు వీని వక్షస్థలమును చీల్చి వైచితివి. ఇతడు శాశ్వతముగా దీర్ఘ నిద్రపోయెను. సత్త్వమయమైన ఈ అవతారమును లోక కల్యాణము కొరకు దాల్చితివి. నీకు నమస్కారము.
గంధర్వా ఊచుః
గంధర్వులు వచించిరి- ప్రభూ! మేము నీయెదుట నాట్యము, అభినయము చేయువారము. నీకు సంగీతమును వినిపించు సేవకులము. ఈ దైత్యుడు తన బల వీర్య పరాక్రమములచే మమ్ము తన బానిసలుగా చేసికొనెను. నేడు నీవు వానికి ఈ దుర్దశను కలిగించితివి. చెడు మార్గములో సంచరించు వానికి ఎన్నడైనను తగిన శాస్తి జరుగక మానదు.
చారణా ఊచుః
చారణులు నుడివిరి- శ్రీహరీ! సజ్జనుల మనస్సులను బాధించునట్టి ఈ దుష్టుని అంతమొందించి, లోకములకు మేలు చేసితివి. ప్రభూ! జీవులకు జననమరణ రూప సంసారచక్రము నుండి ముక్తిని ప్రసాదించునట్టి నీ చరణ కమలములను ఆశ్రయించుచున్మాము.
యక్షా ఊచుః
యక్షులు పలికిరి- నృసింహప్రభూ! శ్రేష్ఠమైన మా కర్మల కారణముగా మేము నీ అనుచరులలో ముఖ్యులమైతిమి. కాని, ఈ దైత్యుడు మమ్ములను తన పల్లకీని మోసే బోయీలుగా మార్చినాడు. నీవు ఇరువది నాలుగు తత్త్వములుగల ప్రకృతికి నియామకుడవు. అందువలన నీ నిత్య సేవకులమగు మా కష్టములను తెలిసికొని, ఇతనిని వధించితివి. మా కష్టములసు తొలగించిన పరమేశ్వరా! నీకు నమస్కారము.
కింపురుషా ఊచుః
కింపురుషులు పలికిరి- దేవా! మేము అల్పజీవులమైన కింపురుషులము. నీవు సర్వశక్తిమంతుడవైన పరమపురుషుడవు. ఈ అసురాధముడు ఇదివరకే సత్పురుషుల ధిక్కారమునకు గురియయ్యెను. అట్టి వీనిని నేడు హతమార్చితివి.
వైతాలికా ఊచుః
వైతాళికులు వచించిరి- ప్రభూ! గొప్ప గొప్ప సభలయందును, జ్ఞానయజ్ఞముల యందును మీ నిర్మలయశస్సులను గానముచేసి, మేము కీర్తి ప్రతిష్టలను గౌరవములను పొందితిమి. ఈ దుష్టుడు మా గానములను అడ్డుకొని మాజీవనోపాధిని నశింపజేసెను. అదృష్టవశమున మహారోగమును వలె ఈ దుష్టుని నీవు నిర్మూలించి మమ్ము కాపాడితివి.
కిన్నరా ఊచుః
కిన్నరులు నుడివిరి నృసింహదేవా! కిన్నరులమైన మేము నీ సేవకులము. ఈ దైత్యుడు మాచే వెట్టి చాకిరి చేయించుచుండెను. నేడు నీవు వీనిని వధించి, మమ్ము కరుణించితివి. ఈ విధముగా మాకు అభ్యుదయమును ప్రసాదించితివి.
విష్ణుపార్షదా ఊచుః
విష్ణుపార్షదులు వచించిరి శరణాగతవత్సలా! నీవు సర్వలోకములకు శాంతిని చేకూర్చువాడవు. అద్భుతమైన నీ నృసింహరూపమును మేము నేడు గాంచితిమి. పరమాత్మా! ఈ దైత్యుడు మీ ఆజ్ఞలను పాలించునట్టి సేవకుడుగా ఉండెను. సనకాది మునులు వీనిని శపించి యుండిరి. కృపతో ఇతనిని ఉద్ధరించుటకే వధించితివని మేము తలంచుచున్నాము.
ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం సప్తమస్కంధే అష్టమోఽధ్యాయః (8)
ఇది భాగవత మహాపురాణమునందలి సప్తమ స్కంధమునందు ఎనిమిదవ అధ్యాయము (8)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
***
30.6.2020 సాయం కాల సందేశము
వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం
సప్తమ స్కంధము - ఎనిమిదవ అధ్యాయము
నృసింహ భగవానుని ప్రాదుర్భావము - హిరణ్యకశిపుని వధ - బ్రహ్మాదిదేవతలు భగవంతుని స్తుతించుట
ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
నారద ఉవాచ
8.1 (ప్రథమ శ్లోకము)
అథ దైత్యసుతాః సర్వే శ్రుత్వా తదనువర్ణితమ్|
జగృహుర్నిరవద్యత్వాన్నైవ గుర్వనుశిక్షితమ్॥5910॥
నారదుడు నుడివెను ప్రహ్లాదుని ప్రవచనమును విన్న పిదప దైత్యబాలురు అప్పటినుండి నిర్మల మనస్సుతో అతని ఉపదేశమును పాటింపసాగిరి. గురువుల భౌతిక విద్యపై వారు ఏమాత్రమూ శ్రద్ధ చూపకుండిరి.
8.2 (రెండవ శ్లోకము)
అథాచార్యసుతస్తేషాం బుద్ధిమేకాంతసంస్థితామ్|
ఆలక్ష్య భీతస్త్వరితో రాజ్ఞ ఆవేదయద్యథా॥5911॥
విద్యార్థులయొక్క అందరి బుద్ధి భగవంతుని యందే స్థిరమై యుండుటను గురుపుత్రులు గమనించిరి. వారు భయముతో హిరణ్యకశిపుని కడకేగి విషయమును అంతయు యథాతథముగా ఆయనకు నివేదించిరి.
8.3 (మూడవ శ్లోకము)
శ్రుత్వా తదప్రియం దైత్యో దుఃసహం తనయానయమ్|
కోపావేశచలద్గాత్రః పుత్రం హంతుం మనో దధే॥5912॥
తన పుత్రుడైన ప్రహ్లాదుని ప్రవర్తన హిరణ్యకశిపునకు అప్రియముగా, అవిధేయతగా, సహింపరానిదిగా తోచెను. గురుపుత్రుల మాటలను విన్నపిదప క్రోధావేశముతో అతని శరీరము గడగడ వణకసాగెను. కనుక, అతడు తన చేతులతోనే పుత్రుని వధించుటకు నిశ్చయించుకొనెను.
8.4 (నాలుగవ శ్లోకము)
క్షిప్త్వా పరుషయా వాచా ప్రహ్లాదమతదర్హణమ్|
ఆహేక్షమాణః పాపేన తిరశ్చీనేన చక్షుషా॥5913॥
8.5 (ఐదవ శ్లోకము)
ప్రశ్రయావనతం దాంతం బద్ధాంజలిమవస్థితమ్
సర్పః పదాహత ఇవ శ్వసన్ ప్రకృతిదారుణః॥5914॥
8.6 (ఆరవ శ్లోకము)
హే దుర్వినీత మందాత్మన్ కులభేదకరాధమ|
స్తబ్ధం మచ్ఛాసనోద్ధూతం నేష్యే త్వాద్య యమక్షయమ్॥5915॥
8.7 (ఏడవ శ్లోకము)
క్రుద్ధస్య యస్య కంపంతే త్రయో లోకాః సహేశ్వరాః|
తస్య మేఽభీతవన్మూఢ శాసనం కిం బలోఽత్యగాః॥5916॥
మనస్సును, ఇంద్రియములను వశమునందు ఉంచుకొనిన ప్రహ్లాదుడు వినమ్రతతో చేతులు జోడించుకొని తండ్రియందు మౌనముగా నిలబడియుండెను. అతడు తృణీకారమునకు ఎంత మాత్రము తగదు. కాని హిరణ్యకశిపుడు సహజముగనే క్రూరుడు, అతడు కోపముతో తోక
ద్రొక్కిన పామువలె బుసలు కొట్ట సాగెను. అతడు తన కుమారుని పాపదృష్టితో చూచుచు కఠోరముగా ఇట్లు పలుకసాగెను. "మూర్ఖుడా! దుర్బుద్ధీ! నీవు అవిధేయుడవైతివి.నీవు చెడిపోవుటయేగాక, తోడిబాలురను గూడ చెడగొట్టుచున్నావు. మన వంశమునకు కళంకమును దెచ్చుచున్నావు. పట్టుదలతో నా ఆజ్ఞను ఉల్లంఘించు చున్నావు. నేడే నిన్ను యమలోకమునకు పంపెదను. నేను క్రుద్ధుడనైనచో ముల్లోకములును, లోకపాలురును గడగడ వణుకుదురు. మూఢుడా! నీవు ఎవరి బలము చూచుకొని నిర్భయుడవై, నా ఆజ్ఞను ఉల్లంఘించుచుంటివి"
ప్రహ్లాద ఉవాచ
8.8 (ఎనిమిదవ శ్లోకము)
న కేవలం మే భవతశ్చ రాజన్ స వై బలం బలినాం చాపరేషామ్|
పరేఽవరేఽమీ స్థిరజంగమా యే బ్రహ్మాదయో యేన వశం ప్రణీతాః॥5917॥
8.9 (తొమ్మిదవ శ్లోకము)
స ఈశ్వరః కాల ఉరుక్రమోఽసా- వోజఃసహఃసత్త్వబలేంద్రియాత్మా|
స ఏవ విశ్వం పరమః స్వశక్తిభిః సృజత్యవత్యత్తి గుణత్రయేశః॥5918॥
8.10 (పదియవ శ్లోకము)
జహ్యాసురం భావమిమం త్వమాత్మనః సమం మనో ధత్స్వ న సంతి విద్విషః|
ఋతేఽజితాదాత్మన ఉత్పథస్థితాత్తద్ధి హ్యనంతస్య మహత్సమర్హణమ్॥5919॥
8.11 (పదకొండవ శ్లోకము)
దస్యూన్ పురా షణ్ న విజిత్య లుంపతో మన్యంత ఏకే స్వజితా దిశో దశ|
జితాత్మనో జ్ఞస్య సమస్య దేహినాం సాధోః స్వమోహప్రభవాః కుతః పరే॥5920॥
ప్రహ్లాదుడు వచించెను రాజా! బ్రహ్మమొదలుకొని గడ్డిపోచవరకు చిన్న-పెద్ద చరాచరజీవులు అన్నియును ఆ భగవంతుని అధీనములోనే యున్నవి. నాకేగాదు, నీకును, జగత్తులోన సకల బలశాలులకును కేవలము అతడే బలము. తండ్రీ! ఆ శ్రీహరియే మహాపరాక్రమశాలి. సర్వశక్తిమంతుడైన కాలస్వరూపుడు. సమస్త ప్రాణులయొక్క దేహేంద్రియ మనోబలములకు అతడే మూలము. ధైర్యము, ఇంద్రియములు గూడ అతడే. ఆ పరమేశ్వరుడే తన శక్తులద్వారా ఈ విశ్వమును సృజించి పాలించి, లయమొనర్చుచున్నాడు. త్రిగుణములకు అతడే స్వామి. రాజా! మీరు మీ అసుర భావమును త్యజింపుడు. మనస్సులో అందరియెడల సమాన భావమును కలిగియుండుడు. మనస్సు చెడు మార్గములయందు పోవుచుండును. ఈ మనోనిగ్రహము లేనివానికి ప్రపంచములో అది తప్ప వేరే శత్రువు ఎవ్వరును లేడు. అందరీనీ సమానభావముతో చూచుటయే భగవంతునకు చేయు గొప్ప ఆరాధన. తండ్రీ! తమ సర్వస్వమును కొల్లగొట్టునట్టి ఇంద్రియములు అనెడి బందిపోటు దొంగలపై విజయమును సాధింపనివాడు 'నేను దశదిశలనూ జయించితిని' అని భావించువాడు మూర్ఖుడు. జితేంద్రియులైన మహాత్ములగు జ్ఞానులు సమస్త ప్రాణులయెడ సమభావమును కలిగియుండి వారు అజ్ఞానజనితమైన కామక్రోదాధి అంతశ్శత్రువులను నిర్మూలించెదరు. ఇంక వారికి బాహ్యశత్రువులు ఎట్లు ఉందురూ?ఉండరుగదా!"
హిరణ్యకశిపురువాచ
8.12 (పండ్రెండవ శ్లోకము)
వ్యక్తం త్వం మర్తుకామోఽసి యోఽతిమాత్రం వికత్థసే|
ముమూర్షూణాం హి మందాత్మన్ నను స్యుర్విప్లవా గిరః॥5921॥
హిరణ్యకశిపుడు పలికెను-ఓరీ! మందబుద్ధీ! నీవు అతిగా వాగుచున్నావు. దీనివలన నీవు చావగోరుచున్నట్లు స్పష్టమగుచున్నది. ఏలయన, చావుమూడినవారే ఇట్లు వదరుచుందురు.
8.13 (పదమూడవ శ్లోకము)
యస్త్వయా మందభాగ్యోక్తో మదన్యో జగదీశ్వరః|
క్వాసౌ యది స సర్వత్ర కస్మాత్స్తంభే న దృశ్యతే॥5922॥
మందభాగ్యుడా! ఈ జగత్తునకు మరియొక ప్రభువు ఉన్నాడని నీవు పలుకు చున్నావు. అతడు ఎక్కడ ఉన్నాడో, ఇప్పుడే చూచేదను గాక. అతడు సర్వత్ర ఉన్నచో ఈ స్తంభమునందు ఏలకనబడడు?
8.14 (పదునాలుగవ శ్లోకము)
సోఽహం వికత్థమానస్య శిరః కాయాద్ధరామి తే|
గోపాయేత హరిస్త్వాద్య యస్తే శరణమీప్సితమ్॥5923॥
ఈ స్తంభమునందు గూడ అతడు ఉన్నట్లు బీరములు పలుకుచున్నావు. ఇప్ఫుడే నీ శిరస్సును మొండెమునుండి వేరుచేసెదను.నీవు ఇంతగా విశ్వసించు సర్వవ్యాపియైన ఆ హరి నిన్ను ఎట్లు రక్షించునో చూచెదనుగాక!
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి సప్తమస్కంధములోని ఎనిమిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
1.7.2020 ప్రాతః కాల సందేశము
వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం
సప్తమ స్కంధము - ఎనిమిదవ అధ్యాయము
నృసింహ భగవానుని ప్రాదుర్భావము - హిరణ్యకశిపుని వధ - బ్రహ్మాదిదేవతలు భగవంతుని స్తుతించుట
ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
8.15 (పదునైదవ శ్లోకము)
ఏవం దురుక్తైర్ముహురర్దయన్ రుషా సుతం మహాభాగవతం మహాసురః|
ఖడ్గం ప్రగృహ్యోత్పతితో వరాసనాత్స్తంభం తతాడాతిబలః స్వముష్టినా ॥5924॥
అత్యంత బలశాలియైన హిరణ్యకశిపుడు భాగవతోత్తముడైన ప్రహ్లాదుని ఈ విధముగా పరుషోక్తులతో బాధించెను. అతడు తన కోపావేశమును పట్టలేకపోయెను.వెంటనే ఖడ్గమును చేబూని తన సింహాసనమునుండి లేచి వేగముగా ఆ స్తంభమును తన పిడికిలితో గ్రుద్దెను.
8.16 (పదునారవ శ్లోకము)
తదైవ తస్మిన్నినదోఽతిభీషణో బభూవ యేనాండకటాహమస్ఫుటత్|
యం వై స్వధిష్ణ్యోపగతం త్వజాదయః శ్రుత్వా స్వధామాత్యయమంగ మేనిరే॥5925॥
ధర్మరాజా! అదే సమయమున బ్రహ్మాండము బ్రద్దలగుచున్నట్లు ఆ స్తంమునుండి ఫట, ఫట, ఫెళ, ఫెళ, ఛట ఛట యను భీకరమైన శబ్దములు వెలువడెను. దానిని వినినంతనే బ్రహ్మాదిదేవతలు తమ లోకమునందు ప్రళయము కలుగుచున్నదా! యని భావించిరి.
8.17 (పదిహేడవ శ్లోకము)
స విక్రమన్ పుత్రవధేప్సురోజసా నిశమ్య నిర్హ్రాదమపూర్వమద్భుతం |
అంతఃసభాయాం న దదర్శ తత్పదం వితత్రసుర్యేన సురారియూథపాః॥5926॥
హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని వధించుటకై వేగముగా ముందునకు దుమికెను. కాని, దైత్యసేనాపతులు ఆ భయంకర శబ్దమును విని, భీతితో వణికి పోవుచున్నట్లు అతడు గమనించెను. అతడు గూడ కొద్దిగా తొట్రుపడుచు ఈ శబ్దమును చేయుచున్నదెవరు? అని అటునిటు చూచెను. కాని, ఆ సభామధ్యమున అతనికి ఏమియు కనబడలేదు.
8.18 (పదునెనిమిదవ శ్లోకము)
సత్యం విధాతుం నిజభృత్యభాషితం వ్యాప్తిం చ భూతేష్వఖిలేషు చాత్మనః|
అదృశ్యతాత్యద్భుతరూపముద్వహన్ స్తంభే సభాయాం న మృగం న మానుషమ్॥5927॥
అదే సమయమున భగవంతుడైన శ్రీహరి తన భక్తుడైన ప్రహ్లాదుని, బ్రహ్మదేవుని మరియు సనకాదుల మాటలను నిలబెట్టుటకును, తన సర్వవ్యాపకత్వమును నిరూపించుటకును భగవంతుడు ఆ స్తంభమునుండియే ఒక విచిత్రరూపముతో ప్రకటితుడు అయ్యెను. అతడు పూర్తిగా సింహముగాదు, నరుడుగాదు.
8.19 (పందొమ్మిదవ శ్లోకము)
సగోన స సత్త్వమేనం పరితోఽపి పశ్యన్ స్తంభస్య మధ్యాదను నిర్జిహానమ్|
నాయం మృగో నాపి నరో విచిత్రమహో కిమేతన్నృమృగేంద్రరూపమ్॥5988॥
బోలో, శ్రీ నృసింహస్వామి భగవాన్ కీ జై!!
హిరణ్య కశిపుడు ఈ శబ్దమును చేయుచున్నది ఎవరు? అని ఇటునటు వెదుకసాగెను. అప్పుడు ఆ స్తంభము నుండి బయటికి వచ్చుచున్న ఒక అద్భుతప్రాణిని అతడు చూచెను. అప్పుడతడు "అహో! ఈ ప్రాణి మనుష్యుడు కాదు, మృగము కాదు. ఈ నృసింహరూపము ఏ అలౌకిక ప్రాణి ఇదై ఉండవచ్చును?"
8.20 (ఇరువదియవ శ్లోకము)
మీమాంసమానస్య సముత్థితోఽగ్రతో నృసింహరూపస్తదలం భయానకమ్|
ప్రతప్తచామీకరచండలోచనం స్ఫురత్సటాకేసరజృంభితాననం॥5929॥
8.21 (ఇరువది ఒకటవ శ్లోకము)
కరాలదంష్ట్రం కరవాలచంచలక్షురాంతజిహ్వం భ్రుకుటీముఖోల్బణమ్|
స్తబ్ధోర్ధ్వకర్ణం గిరికందరాద్భుతవ్యాత్తాస్యనాసం హనుభేదభీషణమ్॥5930॥
8.22 (ఇరువది రెండవ శ్లోకము)
దివిస్పృశత్కాయమదీర్ఘపీవగ్రీవోరువక్షఃస్థలమల్పమధ్యమమ్|
చంద్రాంశుగౌరైశ్ఛురితం తనూరుహైర్విష్వగ్భుజానీకశతం నఖాయుధమ్॥5931॥
ఆ విచిత్రప్రాణి ఎవరని హిరణ్యకశిపుడు ఆలోచించుచుండగా నృసింహ భగవానుడు అతని కట్టెదుట నిలచెను. ఆయన రూపము మిగుల భయావహముగా ఉండెను. కన్నులు పుటము పెట్టిన బంగారమువలె పచ్చగా భయావహముగా ఉండెను. విస్ఫారిత ముఖముతో ఆ స్వామి జూలు విదల్చుచు మెడను అటునిటు త్రిప్పసాగెను. ఆ భగవానుని కోరలు భయంకరముగా ఉండెను. ఖడ్గమువలె వాడియైన నాలుకను చాచి, త్రిప్పుచుండెను. ముడిచిన బొమముడితో ముఖము అంతను దారుణముగా ఉండెను. చెవులు నిశ్చలమై నిక్కపొడచుకొని యుండెను. వెడల్పైన నాసా పుటములు తెరచియున్న నోరు గుహలవలె అద్భుతముగా ఉండెను. విప్పుకొని దవుడలతో ఆయన వదనము భీషణముగా ఉండెను. శరీరము మిక్కిలి పొడవై ఆకాశమును తాకు చుండెను. మెడ బలిష్టమై లావుగా నుండెను. వెడల్పైన వక్షస్థలముతో, సన్నని నడుముతో విరాజిల్లుచుండెను. చంద్రకిరణములవలె తెల్లని రోమములు ఆయనశరీరముపై మెరయుచుండెను. వందలకొలది భుజములు అన్నివైపుల యందును వ్యాపించియుండెను. గోళ్ళు ఆయుధములవలె పొడవై పదును దేలియుండెను.
8.23 (ఇరువది ఒకటవ శ్లోకము)
దురాసదం సర్వనిజేతరాయుధప్రవేకవిద్రావితదైత్యదానవం|
ప్రాయేణ మేఽయం హరిణోరుమాయినా వధః స్మృతోఽనేన సముద్యతేన కిమ్॥5932॥
అట్టి స్వామిని సమీపించుటకు ఎవరికినీ శక్యము గాకుండెను. సుదర్శనచక్రము మొదలగు ఆయుధములతో, వజ్రాయుధము వంటి మెరుగైన శస్త్రములతో ఆ నృసింహ భగవానుడు దైత్య దానవులను అందరిని తరిమికొట్టెను. అప్పుడు హిరణ్యకశిపుడు బహుశః మహామాయావియైన విష్ణువే నన్ను వధించుటకై ఈ రూపములో వచ్చియుండెను. కాని, ఇతని పన్నాగములు నన్ను ఏమియును చేయజాలవు అని తర్కించుకొనసాగెను.
8.24 (ఇరువది నాలుగవ శ్లోకము)
ఏవం బ్రువంస్త్వభ్యపతద్గదాయుధో నదన్ నృసింహం ప్రతి దైత్యకుంజరః|
అలక్షితోఽగ్నౌ పతితః పతంగమో యథా నృసింహౌజసి సోఽసురస్తదా ॥5933॥
ఈ విధముగా పలుకుచు దైత్యశ్రేష్ఠుడైన హిరణ్యకశిపుడు గదను చేబూని, సింహనాదముచేయుచు నృసింహుని మీదికి విజృభించెను. కాని, అగ్నిలో దూకిన మిడుతవలె అతడు నృసింహుని తేజస్సులో అదృశ్యమాయెను.
8.25 (ఇరువది ఐదవశ్లోకము)
న తద్విచిత్రం ఖలు సత్త్వధామని స్వతేజసా యో ను పురాపిబత్తమః|
తతోఽభిపద్యాభ్యహనన్మహాసురో రుషా నృసింహం గదయోరువేగయా ॥5924॥
మహాతేజశ్శాలి, శక్తిమంతుడైన భగవంతుని విషయములో ఈ సంఘటనము అంతగా ఆశ్చర్యకరముగాదు. ఏలయన, సృష్ట్యారంభములో ఆ స్వామి తన తేజస్సుతో తమోగుణ ప్రధానమైన అంధకారమును త్రాగివేసియుండెను. పిమ్మట ఆ దైత్యుడు కృద్ధుడై ఆ స్వామిని ఎదిరించి గదను వేగముగా త్రిప్పుచు దానిని విసరివేసెను.
8.26 (ఇరువది ఆరవ శ్లోకము)
తం విక్రమంతం సగదం గదాధరో మహోరగం తార్క్ష్యసుతో యథాగ్రహీత్|
స తస్య హస్తోత్కలితస్తదాసురో విక్రీడతో యద్వదహిర్గరుత్మతః॥5935॥
అంతట గరుత్మంతుడు పామునువలె భగవానుడు గదతో పోరుచున్న ఆ హిరణ్యకశిపుని ఒడిసి పట్టుకొనెను. ఆటలాడుచున్న గరుత్మంతుని పట్టునుండి సర్పమువలె భగవంతునిచేతినుండి ఆ దైత్యుడు విడీపించుకొనెను.
8.27 (ఇరువది ఆరవ శ్లోకము)
అసాధ్వమన్యంత హృతౌకసోఽమరాః ఘనచ్ఛదా భారత సర్వధిష్ణ్యపాః|/
తం మన్యమానో నిజవీర్యశంకితం యద్ధస్తముక్తో నృహరిం మహాసురః
పునస్తమాసజ్జత ఖడ్గచర్మణీ ప్రగృహ్య వేగేన జితశ్రమో మృధే॥5936॥
ధర్మారాజా! స్వర్గరాజ్యమును హిరణ్యకశిపుడు ఇంతకు ముందే చేజిక్కుంచుకొనియుండెను. కావున, అప్పుడు ఆ దైత్యరాజు తమను ఎక్కడజూచునేమో! అను భయముతో లోకపాలురు అందరును మేఘములలో దాగికొని ఆ యుద్ధమును చూచుచుండిరి. అంతట దైత్యుడు భగవంతుని పట్టునుండి జారిపోవుటను జూచుటతో వారి ధైర్యములు సడలి పోసాగెను. హిరణ్యకశిపుడు గూడ 'ఈ నరసింహుడు నా బల పరాక్రమములను జూచి, భయపడీ నన్ను తన చేతినుండి విడిచి పెట్టినాడు' అని భావించెను. అంతట అతడు తన శ్రమను మరచి, డాలు, ఖడ్గమును తీసికొని యుద్ధమొనర్చుటకై మరల ఆ స్వామి మీదికి వేగముగా విజృభించెను.
8.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)
తం శ్యేనవేగం శతచంద్రవర్త్మభిశ్చరంతమచ్ఛిద్రముపర్యధో హరిః|
కృత్వాట్టహాసం ఖరముత్స్వనోల్బణంనిమీలితాక్షం జగృహే మహాజవః॥5937॥
అప్పుడు ఆ దైత్యుడు డేగవలె మిక్కిలి వేగముతో క్రిందికి పైకి ఎగురుచు తన డాలును, ఖడ్గమును త్రిప్పసాగెను. అందువలన అతనిని ఆక్రమించుటకు శ్రీహరికి వీలుపడలేదు. అప్పుడు ఆప్రభువు బిగ్గరగా భయంకరమైన అట్టహాసము చేసెను. దానికిహిరణ్యకశిపుని కన్నులు మూతపడెను.
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి సప్తమస్కంధములోని ఎనిమిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
1.7.2020 సాయం కాల సందేశము
వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం
సప్తమ స్కంధము - ఎనిమిదవ అధ్యాయము
నృసింహ భగవానుని ప్రాదుర్భావము - హిరణ్యకశిపుని వధ - బ్రహ్మాదిదేవతలు భగవంతుని స్తుతించుట
ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
8.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)
విష్వక్స్ఫురంతం గ్రహణాతురం హరిర్వ్యాలో యథాఽఽఖుం కులిశాక్షతత్వచమ్|
ద్వార్యూర ఆపాత్య దదార లీలయా నఖైర్యథాహిం గరుడో మహావిషమ్॥2938॥
అంతట భగవానుడు వేగముగా ముందుకు ఉరికి పాము ఎలుకనువలె అతనిని పట్టుకొనెను. వజ్రాయుధము యొక్క దెబ్బకు గూడ ఆ హిరణ్యకశిపుని చర్మముపై ఎట్టి గాయములును ఏర్పడలేదు. అట్టి ఆ దైత్యుడే ఇప్పుడు భగవానుని పట్టునుండి బయట పడుటకు గిలగిలలాడ సాగెను. నృసింహుడు అతనిని సభాద్వారము కడకు తీసికొనిపోయి తన తొడలపై చేర్చుకొనెను. పిమ్మట అవలీలగా తన నఖములతో గరుత్మంతుడు మహావిషసర్పమునువలె చీల్చివేసెను.
8.30 (ముప్పదియవ శ్లోకము)
సంరంభదుష్ప్రేక్ష్యకరాలలోచనో వ్యాత్తాననాంతం విలిహన్ స్వజిహ్వయా|
అసృగ్లవాక్తారుణకేసరాననో యథాంత్రమాలీ ద్విపహత్యయా హరిః॥5939॥
ఆ సమయమున క్రుద్ధుడైయున్న భగవానుని కన్నులు చూడశక్యము గాకుండెను. ఆయన నోరు తెరచి, నాలుకతో చప్పరించుచుండెను. రక్త బిందువులతో తడిసి ఆయన నోరు, జూలు ఎరుపెక్కెను. ఏనుగును చంపి, దాని ప్రేవులను మాలగా ధరించిన మృగరాజు వలె ఆయన శోభాయమానుడయ్యెను.
8.31 (ముప్పది ఒకటవ శ్లోకము)
నఖాంకురోత్పాటితహృత్సరోరుహం విసృజ్ తస్యానుచరానుదాయుధాన్|
అహన్ సమంతాన్నఖశస్త్రపార్ష్ణిభిర్దోర్దండయూథోఽనుపథాన్ సహస్రశః॥5940॥
ఆ ప్రభువు హిరణ్యకశిపుని వక్షః స్థలమున వాడియైన తన గోళ్ళతో చీల్చి, అతనిని నేలపై పడద్రోసెను. ఆ సమయమున వేలకొలది దైత్యులు, దానవులు శస్త్రములను చేబూని, ఆ భగవంతుని దెబ్బతీయుటకై సిద్ధపడిరి. అప్పుడు ఆ దేవదేవుడు తన భుజములనెడి సేనతో, నఖములనెడి శస్త్రములతో కాలిమడమలతో తన్ని వారిని నలువైపుల చెల్లా చెదురుగావించి సంహరించెను.
8.32 (ముప్పది రెండవ శ్లోకము)
సటావధూతా జలదాః పరాపతన్ గ్రహాశ్చ తద్దృష్టివిముష్టరోచిషః|
అంభోధయః శ్వాసహతా విచుక్షుభుర్నిర్హ్రాదభీతా దిగిభా విచుక్రుశుః॥5941॥
యుధిష్ఠర మహారాజా! నృసింహభగవానుడు జూలు విదిల్చినంతలో మేఘములు చెల్లా చెదరైపోయినవి. ఆ స్వామి నేత్రజ్వాలలకు సూర్యాది గ్రహముల తేజస్సులు వెలవెల బోయినవి. ఆ ప్రభువు నిశ్వాసలకు సముద్రములు క్షోభకు గురియైనవి. ఆయన గర్జనలకు భీతిల్లి దిగ్గజములు ఆక్రోశించినవి.
8.33 (ముప్పది మూడవ శ్లోకము)
ద్యౌస్తత్సటోత్క్షిప్తవిమానసంకులా ప్రోత్సర్పత క్ష్మా చ పదాభిపీడితా|
శైలాః సముత్పేతురముష్య రంహసా తత్తేజసా ఖం కకుభో న రేజిరే॥5942॥
ఆ ప్రభువు జూలు విదలింపుల ధాటికి దేవతల విమానములు అస్తవ్యస్తములాయెను. స్వర్గలోకము ఊగిపోయెను. ఆ స్వామి పాద ఘట్టములకు భూమి కంపించెను. కొండ ఎగిరిపడెను. ఆ ప్రభువు తేజస్సునుకు ఆకాశము, దిక్కులు కాంతి హీనములయ్యెను.
8.34 (నలుబది మూడవ శ్లోకము)
తతః సభాయాముపవిష్టముత్తమే నృపాసనే సంభృతతేజసం విభుం|.
అలక్షితద్వైరథమత్యమర్షణం ప్రచండవక్త్రం న బభాజ కశ్చన॥5943॥
అట్టి సమయమున ఆ భగవానుని ఎదిరించుటకు ఎవ్వరును ముందుకు రాలేకపోయిరి. క్రోధము మిక్కుటమయి ఆయన హిరణ్యకశిపుని రాజసభయందలి ఉన్నత సింహాసనముపై విరాజిల్లెను. అప్పుడు ఆ ప్రభువు ముఖము మిక్కిలి తేజఃపూర్ణమై క్రోధముతో నిండి మిగుల భయంకరముగా కనవచ్చుచుండెను. దానిని జూచి ఎవ్వరును ఆయనకడకు వెళ్ళి సేవలొనర్చుటకు సాహసింపరైరి.
8.35 (ముప్పది ఐదవ శ్లోకము)
నిశామ్య లోకత్రయమస్తకజ్వరం తమాదిదైత్యం హరిణా హతం మృధే|
ప్రహర్ష వేగోత్కలితాననా ముహుః ప్రసూనవర్షైర్వవృషుః సురస్త్రియః॥5944॥
ధర్మరాజా! ముల్లోకములను గడగడలాడించు హిరణ్యకశిపుడు యుద్ధమున శ్రీహరిచే హతుడైన వార్తను విని, దేవాంగనలు సంతోషమును పట్టలేకపోయిరి. వారి ముఖములు వికసించెను. వారు పదే పదే ఆ స్వామిపై పూలవర్షమును కురుపించిరి.
8.36 (ముప్పది ఆరవ శ్లోకము)
తదా విమానావళిభిర్నభస్తలం దిదృక్షతాం సంకులమాస నాకినామ్|
సురానకా దుందుభయోఽథ జఘ్నిరే గంధర్వముఖ్యా ననృతుర్జగుః స్త్రియః॥5945॥
భగవంతుని దర్శనము కొరకై విమానములలో వచ్చిన దేవతా సమూహములతో ఆకాశము నిండిపోయెను. వారు డోళ్ళు, నగారాలు మ్రోగించిరి. గంధర్వప్రముఖులు మధురముగా గాన మొనర్చిరి. అప్సరసలు నాట్యము చేసిరి.
8.37 (ముప్పది ఏడవ శ్లోకము)
తత్రోపవ్రజ్య విబుధాః బ్రహ్మేంద్రగిరిశాదయః|
ఋషయః పితరః సిద్ధా విద్యాధరమహోరగాః॥5946॥
8.38 (ముప్ఫది ఎనిమిదవ శ్లోకము)
మనవః ప్రజానాం పతయో గంధర్వాప్సరచారణాః|
యక్షాః కింపురుషాస్తాత వేతాలాః సిద్ధకిన్నరాః॥5947॥
8.39 (ముప్పది తొమ్మిదవ శ్లోకము)
తే విష్ణుపార్షదాః సర్వే సునందకుముదాదయః|
మూర్ధ్ని బద్ధాంజలిపుటాః ఆసీనం తీవ్రతేజసమ్|
ఈడిరే నరశార్దూలం నాతిదూరచరాః పృథక్॥5948॥
నాయనా! ధర్మరాజా! ఆసమయమున బ్రహ్మ ఇంద్రుడు, శంకరుడు మొదలగు దేవతలును, ఋషులు, పితృదేవతలు, సిద్ధులు, విద్యాధరులు, మహానాగులు, మనువులు, ప్రజాపతులు, గంధర్వులు, అప్సరసలు, చారణులు, యక్షులు, కింపురుషులు, భేతాళులు, సిద్ధులు, కిన్నరులు, సునందుడు, కుముదుడు మున్నగు శ్రీహరి పార్షదులు అందరును అచటికి చేరిరి. వారు అందరును, నతమస్తకులై అంజలి ఘటించిరి. సింహాసనముపై విరాజిల్లుచున్న తేజోమూర్తియగు నృసింహభగవానునకు కొద్ది దూరములొ నిలిచి వేర్వేరుగా ప్రస్తుతింపసాగిరి.
బ్రహ్మోవాచ
8.40 (నలుబదియవ శ్లోకము)
నతోఽస్మ్యనంతాయ దురంతశక్తయే విచిత్రవీర్యాయ పవిత్రకర్మణే|
విశ్వస్య సర్గస్థితిసంయమాన్ గుణైః స్వలీలయా సందధతేఽవ్యయాత్మనే ॥5949॥
బ్రహ్మదేవుడు పలికెను- ప్రభూ! నీవు అనంతుడవు. నీ శక్తి అపారమైనది. నీ బలపరాక్రమములు అద్భుతములు, నీవు చేయు కర్మలు పవిత్రములు, త్రిగుణముల ద్వారా నీవు సృష్టి, స్థితి, లయములను అవలీలగా నెఱపుచుందువు. ఐనను నీవు ఆ త్రిగుణములకు అతీతుడవు, నిర్వికారుడవు, శాశ్వతుడవు. నీకు నమస్కారములు.
శ్రీరుద్ర ఉవాచ
8.41 (నలుబది ఒకటవ శ్లోకము)
కోపకాలో యుగాంతస్తే హతోఽయమసురోఽల్పకః|
తత్సుతం పాహ్యుపసృతం భక్తం తే భక్తవత్సల॥5950॥
శంకరుడు నుడివెను-భక్తవత్సలా! నీవు కోపగించినచో కల్పాంతమగును. తుచ్ఛుడైన దైత్యుని హతమార్చుటకై నీవు క్రోధమూర్తివైతివి. ఇప్పుడు ఆ దైత్యుడు మరణించెను. అతని కుమారుడైన ఈ ప్రహ్లాదుడు మహాభక్తుడు. నిన్ను శరణు జొచ్చినాడు. అతనిని కాపాడుము.
ఇంద్ర ఉవాచ
8.42 (నలుబది రెండవ శ్లోకము)
ప్రత్యానీతాః పరమ భవతా త్రాయతా నః స్వభాగాః|
దైత్యాక్రాంతం హృదయకమలం త్వద్గృహం ప్రత్యబోధి|
కాలగ్రస్తం కియదిదమహో నాథ శుశ్రూషతాం తే|
ముక్తిస్తేషాం న హి బహుమతా నారసింహాపరైః కిమ్॥5951॥
ఇంద్రుడు వచించెను దేవాదిదేవా! నీవు దయతో మమ్ములను రక్షించితివి. మా యజ్ఞభాగములను మేము మరల పొందునట్లు చేసితివి. వాస్తవముగా అవి అంతర్యామివైన నీకే చెందును. దైత్యుల ఆగడములకు మా హృదయకమలములు ముడుచుకొనిపోయినవి. అవి ఇప్పుడు వికసించి నీకు నివాసస్థానము లాయెను. నాథా! నారసింహా! స్వర్గాదిరాజ్యములు మాకు మరల ప్రాప్తించినవి. కాని, అవి కాలక్రమమున నశించునవి. నీకు సేవకులైన వారికి మోక్షముకూడ అక్కరయే లేదు. ఇంక ఇతర భోగములను గూర్చి చెప్పనేల?
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి సప్తమస్కంధములోని ఎనిమిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
2.7.2020 ప్రాతః కాల సందేశము
వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం
సప్తమ స్కంధము - ఎనిమిదవ అధ్యాయము
నృసింహ భగవానుని ప్రాదుర్భావము - హిరణ్యకశిపుని వధ - బ్రహ్మాదిదేవతలు భగవంతుని స్తుతించుట
ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
ఋషయ ఊచుః
8.43 (నలుబది మూడవ శ్లోకము)
త్వం నస్తపః పరమమాత్థ యదాత్మతేజో యేనేదమాదిపురుషాత్మగతం ససర్జ |
తద్విప్రలుప్తమమునాద్య శరణ్యపాల రక్షాగృహీతవపుషా పునరన్వమంస్థాః॥5952॥
మహర్షులు పలికిరి పురుషోత్తమా! శరణాగతరక్షకా! నీవు నీ తపస్సు ద్వారానే నీలో లీనమైయున్న జగత్తును మరల బహిర్గత మొనర్చియుంటివి. నీ తేజోరూపమైస ఆ తపస్సులను దయతో మా కొరకు ఉపదేశించితివి. అట్టి తపస్సులను దయతో మా కొరకు ఉపదేశించితివి. అట్టి తపస్సును ఈ దైత్యుడు విచ్ఛేదమొనర్చియుండెను.ఇపుడు ఆ దైత్యుడు మరణించెను. ఆ తపస్సును రక్షించుటకై ఈ అవతారమును దాల్చి, దానిని మరల మాకు అనుగ్రహించితివి.
పితర ఊచుః
8.44 (నలుబది నాలుగవ శ్లోకము)
శ్రాద్ధాని నోఽధిబుభుజే ప్రసభం తనూజైర్దత్తాని తీర్థసమయేఽప్యపిబత్తిలాంబు|
తస్యోదరాన్నఖవిదీర్ణవపాద్య ఆర్చ్ఛత్తస్మై నమో నృహరయేఽఖిలధర్మగోప్త్రే॥5953॥
పితృదేవతలు పలికిరి- ప్రభూ! మా కుమారులు మాకు పిండప్రదానము చేయుచుండిరి. ఈ దుర్మార్గుడు వాటిని మానుండి బలవంతముగ లాగికొని తిని వేయుచుండెను. మా కుమారులు పవిత్ర తీర్థముల యందుగాని, సంక్రాంతి మొదలగు పర్వదినములలోగానీ నైమిత్తిక తర్పణము చేయుచు తిలాంజలులను ఇచ్చుచుండిరి. ఈ దైత్యుడు వాటిని గూడ త్రాగి వేయుచుండెను. నేడు నీవు నీ నఖములతో వాని పొట్టను చీల్చివేసితివి. మా పుత్రులు సమర్పించిన పిండములను మాకు తిరిగి ఇచ్చి వేసినట్లైనది. నీవు సకలధర్మములను రక్షించువాడవు. నృసింహస్వామీ! నీకు నమస్కారములు.
సిద్ధా ఊచుః
8.45 (నలుబది ఐదవ శ్లోకము)
యో నో గతిం యోగసిద్ధామసాధురహార్షీద్యోగతపోబలేన|
నానాదర్పం తం నఖైర్నిర్దదార తస్మై తుభ్యం ప్రణతాః స్మో నృసింహ॥5554॥
సిద్ధులు వచించిరి-నృసింహస్వామీ! మేము మా యోగముల, తపస్సుల ద్వారా పొందిన సిద్ధులను ఈ దుష్టుడు బలవంతముగా అపహరించెను. ఇప్పుడు నీవు నీ నఖములచే ఈ గర్వితుని చీల్చి చెండాడితివి. నీ పాదములకు ప్రణమిల్లుచున్నాము.
విద్యాధరా ఊచుః
8.46 (నలుబది ఆరవ శ్లోకము)
విద్యాం పృథగ్ధారణయానురాద్ధాం న్యషేధదజ్ఞో బలవీర్యదృప్తః|
స యేన సంఖ్యే పశువద్ధతస్తం మాయానృసింహం ప్రణతాః స్మ నిత్యమ్॥5955॥
విద్యాధరులు వచించిరి- స్వామీ! మేము వివిధ యోగసాధనలచే విద్యలను అభ్యసించియుంటిమి. 'మూర్ఖుడైన ఈ హిరణ్యకశిపుడు తన బల పరాక్రమములతో గర్వితుడై ఆ విద్యలను నష్టపరచెను. యుద్ధమున నీవు వానిని యజ్ఞపశువునువలె హతమార్చితివి. నీమాయద్వారా ఈ నృసింహరూపమును ధరించితివి. నిత్యము నిరంతరము నీకు ప్రణమిల్లెదము'
నాగా ఊచుః
8.47 (నలుబది ఏడవ శ్లోకము)
యేన పాపేన రత్నాని స్త్రీరత్నాని హృతాని నః|
తద్వక్షఃపాటనేనాసాం దత్తానంద నమోస్తు తే॥5956॥
నాగులు నుడివిరి- దేవా! ఈ పాపాత్ముడు మా పడగల పై గల మణులను, మా యువతీమణులను గూడ అపహరించి యుండెను. నేడు నీవు వాని వక్ష స్థలమును చీల్చి మా పత్నులకు ఆనందమును గూర్చితివి. నీకు నమస్కరించు చున్నాము.
మనవ ఊచుః
8.48 (నలుబది ఎనిమిదవ శ్లోకము)
మనవో వయం తవ నిదేశకారిణో దితిజేన దేవ పరిభూతసేతవః|
భవతా ఖలః స ఉపసంహృతః ప్రభో కరవామ తే కిమనుశాధి కింకరాన్॥5957॥
మనువులు ఇట్లు పలికిరి దేవాధిదేవా! మేము నీ ఆజ్ఞలను శిరసావహించు మనువులము. ఈ దైత్యుడు మా ధర్మ మర్యాదులను అన్నింటిని భంగపరచెను. నీవు ఈ దుష్టుని పరిమార్చి మాకు మహోపకారము చేసితిమి. మేము నీ సేవకులము. మేము ఏమి చేయవలనో ఆజ్ఞాపింపుము.
ప్రజాపతయ ఊచుః
8.49 (నలుబది ఐదవ శ్లోకము)
ప్రజేశా వయం తే పరేశాభిసృష్టా న యేన ప్రజా వై సృజామో నిషిద్ధాః|
స ఏష త్వయా భిన్నవక్షా ను శేతే జగన్మంగలం సత్త్వమూర్తేఽవతారః॥5958॥
ప్రజాపతులు ఇట్లు పలికిరి- పరమేశ్వరా! నీవు మమ్ములను ప్రజాపతులనగా నియమించితివి. కాని, ఈ దుష్టుడు అవరోధములను కల్పించుటచే మేము ప్రజాసృష్టిని చేయలేకపోయితిమి. నీవు వీని వక్షస్థలమును చీల్చి వైచితివి. ఇతడు శాశ్వతముగా దీర్ఘ నిద్రపోయెను. సత్త్వమయమైన ఈ అవతారమును లోక కల్యాణము కొరకు దాల్చితివి. నీకు నమస్కారము.
గంధర్వా ఊచుః
8.50 (ఏబదియవ శ్లోకము)
వయం విభో తే నటనాట్యగాయకాః యేనాత్మసాద్వీర్యబలౌజసా కృతాః|
స ఏష నీతో భవతా దశామిమాం కిముత్పథస్థః కుశలాయ కల్పతే॥5559॥
గంధర్వులు వచించిరి- ప్రభూ! మేము నీయెదుట నాట్యము, అభినయము చేయువారము. నీకు సంగీతమును వినిపించు సేవకులము. ఈ దైత్యుడు తన బల వీర్య పరాక్రమములచే మమ్ము తన బానిసలుగా చేసికొనెను. నేడు నీవు వానికి ఈ దుర్దశను కలిగించితివి. చెడు మార్గములో సంచరించు వానికి ఎన్నడైనను తగిన శాస్తి జరుగక మానదు.
చారణా ఊచుః
8.51 (ఏబది ఒకటవ శ్లోకము)
హరే తవాంఘ్రిపంకజం భవాపవర్గమాశ్రితాః|
యదేష సాధుహృచ్ఛయస్త్వయాసురః సమాపితః॥5960॥
చారణులు నుడివిరి- శ్రీహరీ! సజ్జనుల మనస్సులను బాధించునట్టి ఈ దుష్టుని అంతమొందించి, లోకములకు మేలు చేసితివి. ప్రభూ! జీవులకు జననమరణ రూప సంసారచక్రము నుండి ముక్తిని ప్రసాదించునట్టి నీ చరణ కమలములను ఆశ్రయించుచున్మాము.
యక్షా ఊచుః
8.52 (ఏబది రెండవ శ్లోకము)
వయమనుచరముఖ్యాః కర్మభిస్తే మనోజ్ఞైస్త ఇహ దితిసుతేన ప్రాపితా వాహకత్వం |
స తు జనపరితాపం తత్కృతం జానతా తే నరహర ఉపనీతః పంచతాం పంచవింశ॥5961॥
యక్షులు పలికిరి- నృసింహప్రభూ! శ్రేష్ఠమైన మా కర్మల కారణముగా మేము నీ అనుచరులలో ముఖ్యులమైతిమి. కాని, ఈ దైత్యుడు మమ్ములను తన పల్లకీని మోసే బోయీలుగా మార్చినాడు. నీవు ఇరువది నాలుగు తత్త్వములుగల ప్రకృతికి నియామకుడవు. అందువలన నీ నిత్య సేవకులమగు మా కష్టములను తెలిసికొని, ఇతనిని వధించితివి. మా కష్టములసు తొలగించిన పరమేశ్వరా! నీకు నమస్కారము.
కింపురుషా ఊచుః
8.53 (ఏబది మూడవ శ్లోకము)
వయం కింపురుషాస్త్వం తు మహాపురుష ఈశ్వరః|
అయం కుపురుషో నష్టో ధిక్కృతః సాధుభిర్యదా॥5962॥
కింపురుషులు పలికిరి- దేవా! మేము అల్పజీవులమైన కింపురుషులము. నీవు సర్వశక్తిమంతుడవైన పరమపురుషుడవు. ఈ అసురాధముడు ఇదివరకే సత్పురుషుల ధిక్కారమునకు గురియయ్యెను. అట్టి వీనిని నేడు హతమార్చితివి.
వైతాలికా ఊచుః
8.54 (ఏబది నాలుగవ శ్లోకము)
సభాసు సత్రేషు తవామలం యశో గీత్వా సపర్యాం మహతీం లభామహే|
యస్తాం వ్యనైషీద్భృశమేష దుర్జనో దిష్ట్యా హతస్తే భగవన్యథాఽఽమయః॥5963॥
వైతాళికులు వచించిరి- ప్రభూ! గొప్ప గొప్ప సభలయందును, జ్ఞానయజ్ఞముల యందును మీ నిర్మలయశస్సులను గానముచేసి, మేము కీర్తి ప్రతిష్టలను గౌరవములను పొందితిమి. ఈ దుష్టుడు మా గానములను అడ్డుకొని మాజీవనోపాధిని నశింపజేసెను. అదృష్టవశమున మహారోగమును వలె ఈ దుష్టుని నీవు నిర్మూలించి మమ్ము కాపాడితివి.
కిన్నరా ఊచుః
8.55 (ఏబది ఐదవ శ్లోకము)
వయమీశ కిన్నరగణాస్తవానుగా దితిజేన విష్టిమమునానుకారితాః|
భవతా హరే స వృజినోఽవసాదితో నరసింహ నాథ విభవాయ నో భవ॥5964॥
కిన్నరులు నుడివిరి నృసింహదేవా! కిన్నరులమైన మేము నీ సేవకులము. ఈ దైత్యుడు మాచే వెట్టి చాకిరి చేయించుచుండెను. నేడు నీవు వీనిని వధించి, మమ్ము కరుణించితివి. ఈ విధముగా మాకు అభ్యుదయమును ప్రసాదించితివి.
విష్ణుపార్షదా ఊచుః
8.56 (ఏబది ఆరవ శ్లోకము)
అద్యైతద్ధరినరరూపమద్భుతం తే దృష్టం నః శరణద సర్వలోకశర్మ|
సోఽయం తే విధికర ఈశ విప్రశప్తస్తస్యేదం నిధనమనుగ్రహాయ విద్మః॥5965॥
విష్ణుపార్షదులు వచించిరి శరణాగతవత్సలా! నీవు సర్వలోకములకు శాంతిని చేకూర్చువాడవు. అద్భుతమైన నీ నృసింహరూపమును మేము నేడు గాంచితిమి. పరమాత్మా! ఈ దైత్యుడు మీ ఆజ్ఞలను పాలించునట్టి సేవకుడుగా ఉండెను. సనకాది మునులు వీనిని శపించి యుండిరి. కృపతో ఇతనిని ఉద్ధరించుటకే వధించితివని మేము తలంచుచున్నాము.
ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం సప్తమస్కంధే అష్టమోఽధ్యాయః (8)
ఇది భాగవత మహాపురాణమునందలి సప్తమ స్కంధమునందు ఎనిమిదవ అధ్యాయము (8)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
No comments:
Post a Comment