Monday, 30 August 2021

oooo


572. 'పరాశక్తిః' 

ప్రళయమునకు ఆవల పరముగా నుండు శక్తి స్వరూపిణి శ్రీమాత అని అర్థము. సృష్టి యందు శ్రీమాత నవశక్తులుగ, నవదుర్గలుగా నవావర్ణము లను నడిపించుచూ ఈశ్వరిగా పనిచేయు చుండును. సృష్టికావల పరమైన శక్తిగా నుండును. అనగా శివునితో ఐక్యముచెంది యుండును. శివుడు లేక శివమునకు అంకె పది. అది సత్యము, సుందరము, శాశ్వతము, మార్పున కతీతము అయిన స్థితి. అది అవ్యయము, అవ్యక్తము, మరి యొకటి లేని అనన్య స్థితి. అందు శ్రీమాత “పరా” అయి వున్నది. పరదేవత అని కూడ పిలుతురు. 'పరావాక్కు' అందురు

శ్రీమాతను 'పరమ ఈశ్వరీ' అందురు. సృష్టి యందామెయే దేవత. అనగా వెలుగు రూపము. అట్టి దేవతకు పరమైనది గనుక పరదేవత. సృష్టి యందామెయే సంకల్పమై వర్తించును. సృష్టి అంతయూ ఆమె ఉచ్ఛారణమే. సంకల్పము గాను, భావముగాను, భాషగాను, భాషణముగాను ఆమెయే వ్యక్తమగు చుండును. ఇట్టి వ్యక్తమగు తత్త్వమును ఋగ్వేదమందు వాక్కు అనిరి. అట్టి వాక్కునకు కూడ పరమై శ్రీమాత యున్నది. అందువలన పరావాక్కు అట్లే శక్తికి పరమై యున్నది. అనగా నవశక్తులకు పరమై యుండునది. సృష్టియందామె ఈశ్వరి, అనగా యజమాని.

సృష్టికి పరమైన తత్వము నందు వసించును గనుక ఈశ్వరీ తత్త్వమునకు కూడ పరమైనది. ఇట్లు తెలిసిన దానికెల్ల పరమైనదిగా 'పరమ పథము' వున్నది. 'పరా' శబ్దము అతీతమును, అవ్యక్తమును, అప్రజ్ఞాతమును, అవిజ్ఞేయమును, అప్రతర్క్యమును, అనిర్వచనీయమును సూచించును. సృష్టి యందు మూల ప్రకృతిగను, త్రిగుణములుగను, పంచ భూతములుగను వున్న శ్రీమాత సృష్టికావల పదియవదిగ పరాశక్తి అయి వున్నది. మన దేహమందు కూడ పదియవ ధాతువు పరాశక్తి అని చెప్పబడుచున్నది.

జీవుని యందు సప్త ధాతువులతో పాటు ప్రాణము, జీవుడు కలిపి నవధాతువులు యేర్పడుటకు కారణము పదియవ ధాతువు. ఈ ధాతువును మన యందలి పరాశక్తి అందురు. దేహమందు ఐదు ధాతువులు శక్తి మూలకములు. అవి ఆరోహణ క్రమమున ఎముకలు, చర్మము, రక్తము, మాంసము, మెదడు. నాలుగు ధాతువులు శివ మూలకములు. అవి వరుసగా మజ్జ, శుక్లము, ప్రాణము, జీవుడు. శక్తి మూలకము లనగా ప్రధానముగ శక్తి కలిగి యుండునవి. శివ మూలకము లనగా ప్రధానముగ శివుడుండు స్థానములు. నిజమున కన్నియునూ శివశక్తి సమ్మేళన స్థితులే.

శివ మూలకములగు ధాతువులు సూక్ష్మముగ నుండును. శక్తి మూలకములగు ధాతువులు ముందు వాటికన్న స్థూలమై యుండును. అన్నింటినీ శక్తియే నిర్మాణము చేయును. శివ మూలకములు నాలుగు, శక్తి మూలకములు ఐదుగా నవధాతువులు నిర్మాణమై మానవదేహ మున్నది. అందు వసించునది కూడ శివశక్తులే. ఈ రహస్యము తెలుపుటకే శ్రీచక్ర రాజము ఋషులు అందించినారు. శ్రీ చక్రమందు ఐదు త్రిభుజములు అధో ముఖములు, నాలుగు త్రిభుజములు ఊర్ధ్వ ముఖములు అయి ఒక దానిపై నొకటి పేర్చబడి యుండును. మేరువు నందు శివశక్తులు వసించి యుందురు.

దేహమందలి శిఖరమే శ్రీచక్ర మేరువు. అచ్చట సహస్రార చక్రము కలదు. అందు శివశక్తులు పరమై యుందురు. అచ్చట నుండి శ్రీమాత మూలాధారము వరకు అవరోహణ క్రమమున నవావర్ణ దేహమును నిర్మించును. అట్లు నిర్మించి మూలాధారమున కుండలినిగ వసించును. ఆరోహణ క్రమమున మొదటి ఐదు ఆవరణములు శక్త్యానుభూతిని, తరువాత నాలుగు ఆవరణలు శివశక్త్యానుభూతిని కలిగించ గలవు. అటుపైన మేరువు నందు జీవుడు ఐక్యము చెందును. పరాశక్తిని చేరుట యనగా తానుండక శివశక్తి స్వరూపముగ మిగులుట. పరాశక్తి ధ్యానము చేయువారు ఈ మార్గము నంతనూ ఎరిగినవారై యుందురు.

573. 'పరానిష్ఠా'

పరము నందే నిష్ఠ గలది శ్రీమాత అని అర్థము. పరమే శివము, సత్యము అని మరల మరల చెప్పవలసి యున్నది. పరమే శ్రీమాత స్వస్థానము. ఆమె పరమును వీడి యుండజాలదు, వుండుట కిచ్చపడదు. శివునితో అవినాభావ సమ్యక్ బంధము కలది. అట్టి శ్రీమాత కేవలము జీవకోట్ల కోసము, వారిపై తనకు గల అపార ప్రేమ కారణముగ నవావరణ సృష్టి గావించును. సృష్టి నిర్మాణము, పాలనము, ఇత్యాదివి గావించుట మహత్తరమగు ఇచ్ఛా, జ్ఞాన, క్రియా కలాపము. ఇట్టి కలాప మందున్ననూ శివుని వీడక యుండును. శివునితో నుండియే సర్వమునూ నిర్వహించును. ఇది అనుపమానము. అనన్య సాధ్యము. శివుని యందుండి సృష్టిగా వ్యాప్తిచెంది అందు జీవులను ప్రవేశింపజేసి వారి పరిణామ కథను నిర్వర్తించుచూ కాలానుసారము ప్రళయములను గావించుచూ అత్యద్భుతమగు విన్యాసమును శ్రీమాత నేర్పుచు నుండును.

క్రియ యందున్నప్పుడు జ్ఞాన మందుండ కుండుట జీవుల కెంత సహజమో, శ్రీమాతకు శివ జ్ఞానము నందుండుట అంత సహజము. శివజ్ఞానము నందు తిష్ఠవేసి ఆ నిష్ఠతో ఇచ్ఛా జ్ఞాన శక్తులను తన నుండి వ్యక్తము గావించి, మహదహంకారము నేర్పరచి, పంచ భూతముల నేర్పరచి ఈ మొత్తమునందు జీవులను  ప్రవేశింప జేసి, సూర్యాది మండలములను నిర్వహించుచూ కూడ ఎల్లప్పుడును శివునితోనే కూడియుండును. ఇట్టి నిష్ఠ అనన్య సాధ్యము. ఆమె నిష్ఠకు కూడ పరమే. దీక్షలు, నిష్ఠలు స్వీకరించువారు శ్రీమాత ఆరాధనముననే వాని యందు నిలచి కృతకృత్యులు కావలెను. శ్రీమాత అనుగ్రహము లేనిచో దీక్షలు, నిష్ఠలు భంగమగు చుండును.

574. 'ప్రజ్ఞాన ఘనరూపిణీ'

ఘనీభవించిన ప్రజ్ఞానరూపిణి శ్రీమాత అని అర్థము. ఘనము పరిపూర్ణరూపము. గోళము మరియొక పరిపూర్ణ రూపము. శ్రీమాత ఘనరూపిణి అనగా అవతరణము చెంది ఘనమై నిలచిన ప్రజ్ఞ అని అర్థము. చతురస్రము అవతరణమునకు, వృత్తము తిరోగమనమునకు సంకేతములు. దేవతల నారాధించినపుడు వారి నాహ్వానించుటకు, వారి అవతరణకు చతురస్రములగు పీఠముల నేర్పరచ వలెను. ఊర్ధ్వలోకములకు ఆరోహణము చేయువారు వృత్తాకారమును వినియోగింతురు. సృష్టి నేర్పరచు శ్రీమాత ఘనరూపము వహించును. సృష్టి మొదట గోళముగ వ్యక్తమైననూ అటుపైన ఘన రూపము దాల్చును. తిరోధానమందు మరల ఘనము గోళమై, గోళము అవ్యక్తమును చేరును.

*శ్రీమాత ప్రకటింపబడిన జ్ఞానరూపిణి. లవలేశమైననూ అజ్ఞాన ముచే తాక బడనది. లోపల వెలుపల ఒకే విధమగు ప్రజ్ఞతో కూడి యుండునది. ఈ కారణము చేత కూడ ఆమెను 'ప్రజ్ఞాన ఘనరూపిణి' అని కీర్తింతురు. శ్రీమాత ఘనరూపము దాల్చును అనుటలో విశేషార్థ మున్నది. ఘనమునకు ఆరు ముఖము లుండును. ఒక్కొక్క ముఖము ఒక్కొక్క చతురస్రముగ నేర్పడును. ఒక చతురస్రమున నాలుగు లంబకోణము లుండును. ఆరు చతురస్రములందు ఇరువది నాలుగు లంబకోణము లుండును. మొత్తము ఇరువది నాలుగు (24) లంబకోణములుగ ఘనము వున్నది. ఈ ఇరువది నాలుగు తత్త్వములుగనే సృష్టి ఏర్పడును. ఇట్లు తాను ఘనరూపమై తత్వార్థ వర్ణాత్మికయై సృష్టిగ యేర్పడును. *

సృష్టి యందు ఇరువది నాలుగు తత్త్వములు, ఇరువది నాలుగు అర్థములు, వర్ణములు (అనగా అక్షరములు, శబ్దములు, రంగులు) గుర్తించిన ఋషులు శ్రీమాతను గాయత్రిగా, తత్వార్థ వర్ణాత్మికగ కీర్తించిరి. "చతుర్ వింశతి అక్షర, త్రిపథ, షట్కుక్షి" అని కూడ ప్రశంసించిరి. శ్రీమాతయే చతుర్ వింశతి (24) అక్షరములుగ యేర్పడినది. త్రిపథగ ప్రవహించును. అవియే మూడు శక్తులు, మూడు గుణములు. ఆమె షట్కుక్షి అనగా ఆరు. ఆరు కేంద్రముల నేర్పరచి, ఉత్పత్తి గావించును. ఘనమును గూర్చి విశిష్టమగు జ్ఞానమును ఋషులు దర్శించి అందించిరి. కాలమును కూడ ఘనముతో పోల్చి చెప్పిరి. 24 గంటల కాలము, ఇరువది నాలుగు పక్షములతో కూడిన సంవత్సర కాలము. ఇట్లు ఇరువది నాలుగు సంఖ్యతో సృష్టి నెఱుగు విధానమును ఋషులు యేర్పరచిరి.

ఇరువది నాలుగు సంఖ్య యందు రెండు ద్వాదశము లున్నవి. నాలుగు షట్కము లున్నవి. ఆరు చతురస్రము లున్నవి. ఎనిమిది త్రిభుజము లున్నవి. మూడు అష్ట భుజు లున్నవి. వీని రహస్యముల నెఱుగు గుప్తవిద్య యున్నది. ఘనము నందలి రహస్యముల నెఱుగుట ఘనవిద్య యగును. ఈ విద్యకు కూడ శ్రీమాత అనుగ్రహము ప్రధానము. ఇటీవలి కాలమున ఈ ఘనవిద్య నావిష్కరించిన సిద్దురాలు రష్యాదేశపు వనితయైన హెలీనా పెట్రోవా బ్లావెట్స్కీ ఆమె అందించిన గుప్తవిద్య యందు సృష్టి విజ్ఞాన మంతయూ యిమిడి యున్నది. మన్వంతర రహస్యము లన్నియూ విడమరచినది. శ్రీమాత విజ్ఞాన ఘన రూపత్వము విశదముగ వివరించి ఆధునిక యుగమున ప్రాక్ - పశ్చిమ దేశములలో జ్ఞానమాతగ కీర్తింపబడు చున్నది. ఘనమగు రహస్యములతో కూడినది ఘనవిద్య. శ్రీమాత ఘనవిద్యా స్వరూపిణి కూడను


575, 576. 'మాధ్వీపానాలసా, మత్తా'- 1 🌻

మధుపానము గ్రోలి మత్తెక్కినట్లు గోచరించు శ్రీమాత అని అర్థము. మధు వనగా మధ్యము కాదు మధువు మేలుజాతి పుష్పములందేర్పడు అత్యంత మధురమైన రసము. ఆ రసమును గ్రోలి మత్తుగా నున్న కన్నులతో తన్మయత్వమున నుండునది శ్రీమాత. మధువు గ్రోలుట బాలకృష్ణుడు వెన్న దొంగిలించుట వంటిది. భక్తులు భగవదారాధనమున కరగి తన్మయులై యుండగా వారి హృదయ పద్మముల నుండి భక్తిరస ముద్భవించును. అట్టి భక్తిని మధురభక్తి అందురు. అట్టి భక్తియందు కలుగు రసము మధురసము. దానిని భగవంతుడు స్వీకరించి నపుడు భక్తులకు మహదానందము కలుగును.

భక్తుల హృదయమందు జనించు మధువును భ్రమరము వలె శ్రీమాత గ్రోలును గనుక ఆమెను భ్రమరాంబిక అని కీర్తింతురు. ఏయే పుష్పముల యందు మధువు యేర్పడు చున్నదో పర్యవేక్షించుచూ తేనెటీగ మధువు స్రవించు పుష్పములపై వ్రాలి ఆ మధువును గ్రోలును. అట్లే శ్రీమాత కూడ భక్తుల హృదయములందు జనించు భక్తిరసమును గ్రోలును. అట్టి మాధ్వీపానమందు అనురక్తి కలిగియున్నది శ్రీదేవి. మానవ హృదయములు కఠినములై కల్మషములతో కూడి యున్నప్పుడు వానిని పుష్పములతో పోల్చలేము. తమ కల్మషములను హరించి, కఠినత్వమును దమించి కారుణ్య హృదయులుగ తీర్చిదిద్దమని శ్రీమాతను ప్రార్థింప వలయును.

శ్రీమాతను క్రోధము, మాత్సర్యము, లోభము, మోహము, అశుభ భావనలు పారద్రోలు మని వేడుకొనవలెను. నిర్మల హృదయులను గావింపుమని సదా ప్రార్థింప వలయును.  అట్టి ప్రార్థనలు ఫలించినపుడు చెట్టు కొమ్మయొక్క రెమ్మనుండి పుష్పము వికసించినట్లు అనాహత చక్రము అనాహత పద్మముగ మారును. అనాహత చక్రముగ నున్నంత కాలము హృదయము వికాసము పొంద జాలదు. జనన మరణములను చక్రము నందు జీవుడు తిరుగాడుచునే యుండును. చక్రములు పద్మములు కావలయును (మార్పు చెంద వలెను). లేనిచో జీవితము అంధకార బంధురమే. అట్టి మార్పు కలుగుటకు దైవీ తత్త్వము నందు భక్తి, ప్రేమ ప్రధానము. పరహిత జీవనము భక్తి వికసించుటకు అనుపానమై నిలచును.

స్వాధ్యాయము గతి తప్పకుండ కాపాడును. ఈ మూడు ఉపాయములు జీవుని మధురమగు భక్తియందు చేర్చగలవు. దైవీతత్వము నందుగల రుచి క్రమముగ వృద్ధి చెందుచు భక్తి అనురక్తిగ మారును. అట్టి అనురక్తియే దైవము నందలి ప్రేమ కారణముగ అనన్య భక్తి యేర్పడును. అపు డన్యభావము లేర్పడవు. గోపిక లట్టివారు. వారి ప్రార్థన లన్నియూ భ్రమర గీతికలే. అట్టి ఆత్మసమర్పణ బుద్ధితో హృదయములు నర్పించు విశేష భక్తులు హృదయముల నుండి పుట్టు భక్తిరసమును గ్రోలుటయందు శ్రీమాత అమితాసక్తితో యుండును. అట్టి మధువును గ్రోలి గ్రోలి మత్తెక్కి సోలిన కన్నులు గలదిగా గోచరించును. ఇట్టి మత్తు ఇతర పానీయముల నుండి లభింపదు.

 577. 'మాతృకా వర్ణరూపిణీ' 
వర్ణాక్షరముల రూపమున నుండనది శ్రీమాత అని అర్థము. మాతృక లనగా అక్షరములు. అనగా క్షరము గానివి. నాశనము లేనివి. అవి శబ్దములు. ఆ శబ్దములకు శ్రీమాత రూప మేర్పరచును. అ, ఇ, ఉ అను శబ్దములకు అక్షర రూపము లున్నవి కదా! అపుడే వానిని వ్రాయగలము. అక్షరములు వేరు, అక్షర రూపములు వేరు. అక్షరములకు శబ్దము, రంగు, రూపము యిచ్చునది శ్రీమాత. అంతియే కాదు, వానికి అర్థమును కూడ నిచ్చును. ఉదాహరణకు 'అ' అను శబ్దమున్నది. దాని అర్థము పరతత్వము. (అక్షరములలో 'అ' నేను అని శ్రీకృష్ణుడు పలికినాడు.) దాని వర్ణము (రంగు) నీలము వలె గోచరించును.

లోతు తెలియలేని తత్త్వము గనుక నలుపు నీలమందురు. దానికి రూపము ఒక్కొక్క భాషయందు ఒక్కొక్క విధముగ నున్నది. తెలుగున 'అ', సంస్కృతమున 'అ', తమిళమున 'అ', పాశ్చాత్య భాషల యందు 'అ' వేరు వేరు రూపములు ధరించిననూ శబ్ద మొక్కటియే, అర్థ మొక్కటియే, రంగు ఒక్కటియే. ఆకారములు వేరు. ఇట్లు వివిధాకారములతో శ్రీమాత సృష్టి గావించుచున్నది. కాని లో అర్ధము వర్ణము, శబ్దము, అక్షరత్వము వైపునకు నడిపించును. పైకి వైవిధ్యముగ కనిపించిననూ, లోన ఏకత్వము గోచరించును. శబ్దము, అర్ధము, రంగు, రూపము అను నాలుగింటిలో మొదటి మూడు దివ్యమని, నాలుగవది మార్పు చెందునదని పురుష సూక్తము సూచించుచున్నది.

(త్రిపాదస్య అమృతందివి) రూపమునకు మరణ మున్నది. శబ్దము, అర్థము, రంగు మరణించవు. ఇట్లు సృష్టి అంతయూ అక్షర స్వరూపమే. మాతృకావర్ణ రూపమే అని తెలియవలెను. సప్త మాతృకలు అనగా సప్త లోకముల నేర్పరచు శబ్దము. వానిని బీజాక్షరములు అని కూడ పిలుతురు. సహ్రసారము నుండి మూలాధారము వరకు యం, హం, సం, కం, లం, రం, డం శబ్దములు కలవు. ఈ శబ్దము లత్యంత కాంతివంతములు. వజ్రకాంతి నుండి భూకాంతి (మట్టిరంగు) వరకు వివిధమగు కాంతులలో సప్తలోకములు ప్రకాశించు చుండును. శబ్దాచ్చారణమును నుండి రంగులు పుట్టును. అవి కాంతి వంతములు.

మెఱపు వంటి అ కార, క్ష కార శబ్దములున్నవి. బంగారు కాంతి గల ల, శ, ష, స శబ్దము లున్నవి. అట్లే అరుణ వర్ణము లున్నవి. గౌర వర్ణము లున్నవి. ధూమ్రము, సిందూర వర్ణములు కూడ నున్నవి. ఆయా లోకములలో ఆ యా శబ్దముల ప్రభావము వలన ఆయా కాంతులు పుట్టుచుండును. తత్కారణముగనే శ్రీమాత వివిధ కాంతులతో శోభిల్లుచుండును. భక్తుల పరిపక్వతను బట్టి సాధారణ కాంతుల నుండి కన్నులు మిరుమిట్లు గొలుపు మెఱపు కాంతుల వరకు దర్శనములు జరుగుచుండును. నాదములు వినపడు చుండును. రహస్యార్థములు తెలియుచుండును. ఇట్లు తెలియుచుండగా ఆరాధకులు పరవశము చెంది నిర్ఘాంతబోవుచు ఆమె దివ్య రూపమును చూచుటకే అశ్రాంతము కోరుచుందురు.

అక్షరములు అనగా అక్ష + రములు అని కూడ పెద్దలు తెలుపుదురు. అనగా మూలమును అక్షముగ గొనువచ్చు శక్తి అని అర్థము. 'అ' అను పరతత్వమును మూలము లేక కేంద్రము లేక పరము నుండి అక్షముగ శ్రీమాత గొనివచ్చును. క్షరము కాని పరతత్వమును, అక్షముగా గొనివచ్చుచూ సృష్టి నిర్మాణము చేయును. ఆమె అక్షరి. ఇట్లు గొనివచ్చి ఏడు లోకముల సృష్టిని చేయును. కేంద్రము నుండి పరిధి వరకు లేక పరము నుండి పదార్థము వరకు సృష్టిని యేర్పరచు శ్రీమాతకు శబ్దములు, వర్ణములు, అర్థములు ఉపకరణములు. వానికి రూపము లేర్పరచునది కూడ ఆమెయే.

మాతృకా వర్ణములు ఆమె నుండియే పుట్టును. నాదముగ జనించి శబ్దములుగ వ్యాప్తిచేయును. శబ్దముల నుండి వెలుగులు వ్యాప్తి యగును. అటుపైన రూపములుగ యేర్పడును. ఇట్లు శబ్దము, రంగు, రూపముగ సృష్టి నేర్పరచును. తత్సంబంధిత శక్తులు, సామర్థ్యములు కూడ పుట్టుచుండును. అక్షరములు అనగా 'అ' నుండి 'క్ష' వరకు కొనిరాబడినవి అని మరియొక అర్థము. దేవ భాషయైన సంస్కృతము నందు 'అ' మొదటి అక్షరము. 'క్ష' చివరి అక్షరము. అట్లు 'అ' నుండి 'క్ష' వరకు సృష్టి నిర్మాణము చేయు శ్రీమాత ఆ మొత్తము రూపముగ తానే యుండును. ఆమెయే అక్షరమాల. స్కందుని పుట్టించుటచే ఆమె మాతృక అయినది.

'అ' నుండి 'క్ష' వరకు సృష్టి నిర్మాణము చేయు శ్రీమాత ఆ మొత్తము రూపముగ తానే యుండును. ఆమెయే అక్షరమాల. స్కందుని పుట్టించుటచే ఆమె మాతృక అయినది.  శివ తత్వమును అవతరింప జేయుటతో శ్రీమాత మాతృక అయినదని తెలుపుదురు. అంతేకాక ఈ మాతృకా వర్ణముల సమూహమే శ్రీమాత శ్రీచక్ర రూపమని కూడ తెలుపుదురు. శ్రీ చక్ర మందలి బీజాక్షరములు, ఇతర అక్షరములు సృష్టి ప్రజ్ఞలుగ శ్రీమాత యేర్పడి యున్నది. సంస్కృతమున గల యాబది యొక్క అక్షరములు సృష్టి నిర్మాణ ప్రజ్ఞలు.

నలుబది తొమ్మిది అక్షరములతో సప్తసప్తిగా లోక నిర్మాణము చేసి అందుపై శివశక్తులు అధిష్ఠించి యుందురు. అందువలన యాబది యొక్క అక్షరముల దేవ భాషగ సంస్కృతము యేర్పడినది. పరదేవతగ శ్రీమాత మాతృకలను, వాని వర్ణములను కూడ దాటి యున్నది గనుక ఆమెను మాతృక అవర్ణ రూపిణి అని కూడ తెలియవలెను. తాను వస్తుతః మాతృకలు కాదు. ఆమెకు వర్ణములు లేవు. రూపములు లేవు. అన్నియూ తానై వర్తించును.

578. 'మహాకైలాస నిలయా' 
మహాకైలాసము నందుండునది శ్రీమాత అని అర్ధము. కైలాసము ఉత్తరము నందుండెడి శిఖరము. ఆర్యావర్తమునకు ఉత్తరమున, బ్రహ్మ మానస సరోవరమునకు కూడ ఉత్తరమున కైలాస శిఖర మున్నది. “శ్రీ చక్ర మేరువు" వలె లేక 'పిరమిడ్' వలే యేర్పడు శిఖరమును కైలాస మందురు. అచ్చట తత్త్వమొక్కటే యుండును. ఆ తత్త్వము యొక్క లాస్యముగ ఉత్తరము నుండి దిగువకు క్రమ పద్ధతిలో రూప మేర్పడును. ఇట్లు ఒకే తత్త్వము నుండి అనేకత్త్వ మేర్పడుటకు సూచనగ శ్రీచక్ర మేరువు నుండి శ్రీ చక్ర మేర్పడును.

కానుక చీకటింటకళ కాంతులు సర్వ మనోన్నతీయగున్ 
మేనుకు మోహతాపమున మేలుగ సఖ్యత సంభవమ్ముగన్
 తానుగ తత్వబోధయగుతన్మయ లక్ష్యముదేహతృప్తిగన్
ఆనతి శాఖ్యతన్ యగుట ఆమని సంపద శాంభవీ 
భావం:
అజ్ఞానం అనే చీకటి ఇంట్లో (లేదా మన అంతరంగంలో) వెలుగొందే కళా కాంతులు (ఆత్మజ్ఞానం లేదా అంతర్గత ప్రకాశం) అన్ని మనస్సులకూ అత్యున్నత స్థితిగా మారుతాయి.
శరీరానికి కలిగే కోరికల వేడిమిలో కూడా మంచి స్నేహం లేదా సామరస్యం సంభవిస్తుంది (అంటే, కోరికలను అర్థం చేసుకుని, వాటిని సమన్వయం చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి).
దానంతటదే తత్వజ్ఞానం (ఆత్మబోధ) కలుగుతుంది, అది కేవలం శరీరాన్ని సంతృప్తిపరిచే లక్ష్యం లాగా అనిపించినా, వాస్తవానికి ఒక తన్మయమైన, ఉన్నతమైన లక్ష్యంగా ఉంటుంది.
ఆ శాంతిని (లేదా సామరస్యాన్ని) పొందడం వల్ల, ఓ శాంభవీ (పార్వతీ దేవీ), వసంత కాలపు సంపద వంటి సమృద్ధి, ఆనందం లభిస్తాయి.

శిఖరము నుండి పర్వత మేర్పడును. సూక్ష్మము నుండి స్థూలమునకు సృష్టి యేర్పడును. శిశు జననము కూడ శిరస్సు, శిఖ కేంద్రముగ రూపమై వ్యాప్తము చెందును. సర్వమునకు ఉత్పత్తి స్థానము కైలాసమని తెలియవలెను. అట్టి కైలాస శిఖరము నందు వసించునది శ్రీమాత అని తెలియవలెను. మన శరీరమున శిఖను కైలాసముతో పోల్చెదరు. శ్రీచక్ర మేరువుతో పోల్చెదరు. అచ్చట కేవలము శివశక్తి తత్త్వమే యుండును.

కైలాసమున శివశక్తులు నిత్యమూ నృత్యము సలుపుచు నుందురు. లాస్యము నందుందురు. శివ శక్తుల లాస్యస్థానమే కైలాసము. ప్రతి జీవుని యందు కైలాస స్థాన మున్నది. అట్లే భూమికిని కైలాస స్థానము కలదు. అది ఉత్తర ధృవమునకు పైన యున్నది. అట్లే సూర్యునికి కూడ నున్నది. మొత్తము సృష్టికి కూడ కైలాస స్థాన మున్నది. దానినే మహా కైలాస మందురు. అట్టి మహా కైలాసమున వసించునది శ్రీమాత అని అర్ధము. ఉత్తరమునగల కైలాసమును కుబేర స్థానమని కూడ పలుకుదురు.

579. 'మృణాల మృదుదోర్లతా' 

తామర తూడువంటి మెత్తనైన భుజములు కలది శ్రీమాత అని అర్దము. తామరతూడు మెత్తనైన దారములతో సున్నితముగ నుండును. ముట్టుకుంటే కందిపోవు నట్లుండును. మృదువైన భుజములు స్త్రీకి సౌందర్య కారకములు. బలమైన భుజములు పురుషునికి సౌందర్య కారకములు. భుజ బలము శౌర్యమునకు చిహ్నము. సుకుమారమగు భుజములు సౌందర్యమునకు చిహ్నములు. శ్రీమాత ఎంత శక్తివంతురాలో అంత సౌందర్యరూపిణి కూడను. సౌందర్యము, శౌర్యము రెంటి యందును అత్యధికురాలైన శ్రీమాత రూపము మాత్రము సౌమ్యముగనే యుండును. లలితముగనే యుండును. భుజములు సుకుమారమైనంత మాత్రమున బలహీన అనుకొన రాదు.

చిందిన ఎప్పుడూ మనసు, చెప్పు నిరాశగ యొప్పదైననున్
చెంద ధనమ్ముతో కలుగు చింతయహమ్ముయు చూపదైననున్
చంద భయమ్ముతో కలుగు చత్వర ధైర్యము నుంచగల్గగన్
పొందిక సజ్జనుండుగను, పోరు సుఖమ్ముయు దుఃఖ శాంభవీ

🔹భావార్థం:
చంచలమైన మనస్సు ఎప్పుడూ నిరాశను వ్యక్తం చేస్తూ ఉంటుంది. కానీ అది వాస్తవంగా అంగీకరించదు — ఎందుకంటే అది స్థిరం కాదు.
ధనాన్ని సంపాదించినప్పటికీ, దానితో వచ్చే బాధను, ఆందోళనను మనసు పూర్తిగా గ్రహించదు.
భయం కలిగిన పరిస్థితిలోనూ, ఒక్కసారిగా ధైర్యం ఉద్భవించగలదు — అదే మానసిక స్థైర్యం.
అయితే, మంచి వ్యక్తిగా స్థిరంగా ఉండగలిగిన వాడికి, పోరాటం ద్వారా వచ్చిన సుఖం కూడా ఒక దుఃఖంలా మారుతుంది — ఎందుకంటే అది శాంభవీ, పరాశక్తి, దుఃఖాన్ని వరముగా మలచగలదే

మహత్తరమగు బలము కలిగియు తామరతూడువంటి మృదువైన భుజములు కలిగియుండుట అద్భుతమైన విషయము. త్రిమూర్తులు కూడ గెలువలేని భండాసుర, మహిషాసురాది అసురులను తన భుజ శక్తితోనే సంహరించినది కదా! అమిత శక్తివంతమైననూ సుకుమారముగ నుండుట వైభవమునకు చిహ్నము. కావుననే ప్రత్యేకించి హయగ్రీవుడు శ్రీమాత భుజములను కీర్తించుచూ ఈ నామము తెలిపినాడు. శ్రీమాత రూప సౌందర్య సందర్భమున గాక ఆమె మాహాత్మ్యమును తెలుపు సందర్భముగ తెలిపినాడు. మహాకైలాసమందు శివునితో నృత్యము చేయు శ్రీమాత భుజములను, మాహాత్మ్యమును వర్ణించుచున్నాడు. కావుననే తరువాతి నామము 'మహనీయా' అని పేర్కొనినాడు. 

580. 'మహనీయా' 

మహనీయమైనది శ్రీమాత అని అర్థము. అత్యంత వైభవోపేతము, అత్యంత ప్రశంసనీయము, అత్యంత కాంతివంతము, అత్యంత కీర్తివంతము, అత్యంత బలోపేతము, శక్తి వంతము, పుష్కలము, ఆనందదాయకము, స్ఫూర్తిమంతము, త్యాగ నీయము అగుటచే సమస్త లోకముల నుండి పూజలందుకొను దేవి కావున 'మహనీయా' అని శ్రీమాతను హయగ్రీవుడు కీర్తించుచున్నాడు.

మహనీయులను పదమును సామాన్యముగ నుచ్చరించరాదు. పొగడ్తలకు “మహనీయులు” అని వాడుట ఆచారమైనది. శ్రీమాతయే 'మహనీయా'. ఆమె భక్తులగు ఋషులు, సనక సనందనాదులు మహనీయులు. అట్లే శ్రీమాతకు సర్వ సమర్పణము చేసి శ్రీమాత మహనీయత్వమునకు దర్పణముగ నిలచినవారే మహనీయులు, అరకొర శక్తి, యుక్తి, జ్ఞానము కలవారిని మహనీయులని పొగడుట అసత్యమే అగును. అసత్య భాషణము వర్ణనీయము.

581. 'దయామూర్తి' 

మూర్తీభవించిన దయారూపము శ్రీమాత అని అర్ధము. భక్తుల యందు శ్రీమాతకు దయ మెండు. ఆర్తితో ఆరాధించు భక్తుల యెడల దయ కలిగియుండును. ఆర్తులను, బలహీనులను రక్షించును. అహంకారుల యందు ఉపేక్ష భావము చూపిననూ వారు నిరహంకారులై ప్రార్థించిన వెంటనే ప్రసన్న మగును. శ్రీమాతను మరచిన వారిని శ్రీమాత కూడ ఉపేక్షించును. స్మరించిన వారిపై దృష్టి సారించును. కష్టములందు దయ చూపును. ఆపదల యందు ఆదు కొనును.

జీవననాటకశ్రీ
మ.
మనమధ్యా విధి యాడు నాటకము యేమచ్చల్లె ప్రేమమ్ము యే
గుణమా నన్నుగ నీవు నుంచగలిగే గుప్తమ్ము గానౌను చూ
సినిమా కా ముని చెప్పె నేడు వదగునే సీతమ్మ గంగాతటిన్
తృణమే జీవిత భాగ్యమవ్వగలిగే తృప్తౌనులే శాంభవీ
మన మధ్య జరుగుతున్నదంతా విధి ఆడిస్తున్న నాటకం మాత్రమే. కానీ అందులో ప్రేమ మాత్రమే కలుషిత రహితంగా – మచ్చల్లేదుగా – నిలుస్తుంది.
నన్ను గుణవంతుడిగా నిలిపే శక్తి నీవు సమర్పించిన ఒక అంతర్ముఖ గుప్తమయ్య శక్తి – అది నీ చైతన్యమే.
ఈ జీవితం ఒక సినిమా మాత్రమే అని ఓ జ్ఞానముని నేడు గంగాతటంపై ఉపదేశించాడు – అంటే జీవనానుభవాన్ని తాత్త్వికంగా పరిశీలించిన వాడికి ఇది మాయానాటకమైంది.
జీవిత భాగ్యాలన్నీ తృణసమమైపోవగలవి – తృప్తి వుండినపుడే అవి మాధుర్యమవుతాయి. అటువంటి తృప్తిని ప్రసాదించగలదీ శాంభవీ (అమ్మవారి) అనుగ్రహమే.


తల్లి ప్రేమ, తల్లిదయ, అనుగ్రహము పొందినవారు నిజమగు అదృష్టవంతులు. పిలిచినంతనే పలుకు శ్రీమాతను పిలువకుండుట దురదృష్టము. పూజ, అర్చనలు చేయుట వలన సులభముగా ప్రసన్నత కలిగి బ్రోచును. శ్రీమాత అనుగ్రహము లేనిదే శివానుగ్రహము కలుగదు. తత్వదర్శనాభిలాషులు కూడ శ్రీమాత అనుగ్రహము చేతనే శివాను గ్రహమును పొందగలరు. శ్రీమాత దయను గూర్చి భక్తుల కెల్లరకునూ విదితమే.       

582. *'మహాసామ్రాజ్యశాలినీ'* 
మహా సామ్రాజ్యమును అనుగ్రహించునది శ్రీమాత అని అర్ధము. మహా సామ్రాజ్యమగు సృష్టి నిర్మాణము చేసి పాలించు శ్రీమాత తన అనుగ్రహమున వారికి అట్టి సామ్రాజ్యముపై అధికారము నీయగలదు. పరిపాలనా వైభవమును కలిగించగలదు. మహా సామ్రాజ్య పాలకులగు సామ్రాట్ లందరూ శ్రీమాత అనుగ్రహముననే అంతటి సామ్రాజ్యముల నేర్పరచి పరిపాలించిరి. పరిపాలనమున అహంకరించి శ్రీమాతను మరచినపుడు పతనము చెందిరి.

తరుణమాతవసాధనంమది తాప తన్మయ మౌనులే
కరుణగమ్యముమూలమున్ గతికాల మాయలు నీడలే 
తరువులన్నియుసాయమున్ విధి సానుకూలత మేలులే 
చెరువు నీరుగ దాహమున్ స్థితి చిత్తమౌను సాధన శాంభవీ

నా మనస్సు ఇప్పుడు శక్తిమాత సాధనలో తపస్సుతో నిమగ్నమైంది.
ఆ మాత కరుణే నా లక్ష్యం. ఆమె మూలతత్వం – కాలమూ, మాయలూ ఆమె నీడలు మాత్రమే.
ప్రకృతిలోని అన్ని వృక్షాలూ మానవుడికి సాయపడతాయి, ఎందుకంటే అవి విధి అనుకూలంగా ఎదుగుతాయి.
ఒక చెరువులో నీరిలా, ఆమె సాధన నా దాహానికి తృప్తిని ఇస్తోంది.
నా చిత్తం స్థిరమై శాంతమవుతోంది — ఇదే శాంభవీ సాధనఫలం.


ఎవ్వరికైననూ వారి అంగ బలము, ధనబలము, యశోబలము పెరుగుట వారియందలి నిగూఢమై యున్న శ్రీమాత శక్తి సామర్థ్యములే. తన నుండి వ్యాప్తి చెందుచున్న రాజ్యము, బలము, వైభవము శ్రీమాత అనుగ్రహమే అని భావింపవలెను గాని తనదిగా భావింపరాదు. చిన్న బీజము మహా వృక్షమై శాఖోప శాఖలతో విస్తరించుట బీజము గొప్పతనము గాదు. బీజమున అంతర్హితముగ నున్న అంకుర శక్తి. అది అనంతశక్తి. బీజము వాహికగ అంకుర శక్తి  వ్యాప్తి చెందుచూ మహా వృక్షమై నిలచినది.

అట్లే ఎవరి నుండి ఎట్టి మహా కార్యములు జరిగిననూ వారు బీజప్రాయులే. అందుండి వికాసము చెందునది శ్రీమాత యొక్క ఇచ్ఛా జ్ఞాన శక్తులే. ఎవ్వరి కేమి కలిగిననూ, అవి అన్నియూ ఆమె సమకూర్చినవే. ఆమెయే 'దాయిని', అనగా ఇచ్చునది. రాజ్యదాయిని కూడ ఆమెయే. సామ్రాజ్యదాయిని కూడ ఆమెయే. ఆమె దయ లేక ఎవ్వరునూ ఏమియూ పొందలేరు. ఆమె దాయిత్వమూర్తి. దానము లిచ్చు చేయి మాత్రమే కాదు, ఆమె మూర్తి మొత్తము అట్టి దాయిత్వ గుణముతో ప్రకాశించును.

583. 'ఆత్మవిద్యా’ 
ఆత్మజ్ఞాన రూపము గలది శ్రీమాత అని అర్థము. తా నెవరు? తా నుండుట అనగా ఏమి? తా నుండు టెట్లు సంభవించినది? యిత్యాది జ్ఞానము ఆత్మ జ్ఞానమని పలుకుదురు. ఈ జ్ఞానము పొందు విధానము, శాస్త్రము ఆత్మవిద్యగా భాసించును. శ్రీమాత విశ్వాత్మ. ఆమె నుండి పుట్టిన త్రిగుణముల నుండి జీవులు జనింతురు. జీవులు తాము ప్రత్యేకముగా వున్నామని భావించుట వలన అహంకారము ఆవహించును. అటుపైన జీవునకు తనదైన స్వభావ మేర్పడును. స్వభావము ననుసరించి పంచభూతాత్మకమైన శరీర మేర్పడును.

మన్నేముఖ్యముమానవత్వముగనే మానమ్ముజీవమ్ముగన్  మిన్నేసఖ్యతగానువర్షముగసమ్మోహమ్ము ప్రాణమ్ముగన్ 
జున్నేతీపిపదార్ధమవ్వుటగనే జూపుల్లు ఆహారమున్ 
నిన్నేనేనుగనే సహాయముగనేనీడల్లె గా శాంభవీ 

మన్నే ముఖ్యము — మానవతే నిజమైన ప్రాధాన్యత,
మానవత్వముగనే మానమ్ము జీవము — మానవత్వమే మన ప్రాణానికి మూలమైన జీవతత్వం.
మిన్నే సఖ్యతగా అనువర్షముగా సమ్మోహము ప్రాణమ్ము — మృదుత్వం సఖ్యతగా (స్నేహంగా) ప్రవహిస్తూ మమకారంగా ప్రాణంగా మారుతుంది.
జున్నే తీపి పదార్థమవ్వుటగనే జూపులు ఆహారమున్ — ప్రేమగా పలుకిన మాటలు తీపి పదార్థాలుగా మనసుకు ఆహారంగా మారతాయి.
నిన్నే నేనుగనే సహాయముగనే నీడల్లెగా శాంభవీ — నీవు నేనే, నేనే నీవు — ఈ సహజ సహాయసంబంధం జీవితం, నీడలా పరస్పరం నిలిచే శాంతి రూపిణి (శాంభవీ)ను సూచిస్తుంది.

జీవుడు తన నిజ స్వరూపము తెలియక తన శరీరమే తాననుకొనును. అటుపైన తన కోరికల సముదాయమే తానుగా జీవించును. ఆ తరువాత తన భావ సముదాయమే తానుగా నుండును. అటుపైన తానెరిగిన విద్యలే తానుగా నుండును. ఎన్ని నేర్చిననూ, ఆ విద్యలన్నియూ తన నిజస్థితిని ఆవిష్కరింపవు. తనను గూర్చి, తన నిజస్థితిని గూర్చి అవలోకనము చేయుట తనను తా నభ్యసించుట. తన శరీరము, తన కోరికలు, తన భావములు, తన విద్యలు కాక, తా నెట్లున్నాడు? తా నున్నాడని తనకెట్లు తెలిసినది? తాను నిత్యమెట్లు స్పందించు చున్నాడు - యిత్యాది విషయముల యందు శోధన చేయుట ఆత్మవిద్య ఉపాసించుట యగును.

తనయందు జరుగు స్పందనము, ప్రతి నిత్యము కలుగు ఎఱుక- ఈ రెంటి మూలమేమి? అని భావించుట ప్రారంభమగును. తాను మూలముగ తన యందు, తన ద్వారా చాల వ్యాపారము (activity) జరుగుచుండును. తనకు మూలమేమి? తా నెచ్చట నుండి మేల్కాంచు చున్నాడు? ఏమి ఆధారముగ ప్రాణస్పందన జరుగు చున్నది? తన స్పందనలో స్పందించు తత్త్వమేమి? తన ఎఱుకలోని ఎఱుక యేది? ఇట్టి శోధనలో లోపలికి జీవుని గొనిపోవును. తన మూలమునకు తనను చేర్చును. అప్పుడు తానెఱుగునది అపరిమితమగు వెలుగు. అది కన్నులకు గోచరింపని వెలుగు వెలుగు చీకట్లకు కూడ వెలుగు.

అట్టి వెలుగు అపరిమితము. అట్టి అపరిమితము, అప్రమేయము వెలుగు నందు తాను బిందువై (నామ మాత్రమై) గోచరించును. ఆ అపరిమితమగు చైతన్యమే శ్రీమాత. ఆమె యందలి ఒక బిందువే తానని తెలియును. ఈ మొత్తమును తెలియబరచుటకు తెలివి యుండవలెను గదా! అట్టి తెలివిగ శ్రీమాతయే యున్నది. తెలివికి మూలముగ కూడ ఆమెయే యున్నది. ఆమె నెఱిగినవాడు ఆత్మవంతుడు. ఆమె నెఱుగు ప్రయత్నము ఆత్మవిద్య. శ్రీమాతయే విద్యగ జీవులను తమ మూలమునకు చేర్చును. ఈ కారణముగ శ్రీమాత 'ఆత్మవిద్య' అని ప్రశంసింపబడినది.

*701వ నామ మంత్రము* *ఓం దేశకాలాపరిచ్ఛిన్నాయై నమః*

    

దేశ+కాల+అపరిచ్ఛిన్నా అనగా *దేశకాలాపరిచ్ఛిన్నా* అని చదువవలెను. అంతేగాని *దేశకాలపరిచ్ఛిన్నా*  అనగా ల అనే అక్షరం *లా* గా కాకుండా *ల* గా చదువకూడదు. అర్థం మారుతుంది. 

సకల ప్రపంచములకు తానే ముందుగా, సకల కాలములకు పూర్వముగాను, వస్తుభేదములు లేక, సకలభావములకు అభావముగా,  సమస్త చరాచర జగత్తులు, కాలములు తన వల్లనే ఏర్పడి, అన్నిటికీ తానే ఆదిగా, ఆదిపరాశక్తిగా విరాజిల్లు జగన్మాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *దేశకాలాపరిచ్ఛిన్నా* యను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును *ఓం దేశకాలాపరిచ్ఛిన్నాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని ఉపాసించు భక్తులు ఆ తల్లి కరుణచే సర్వాభీష్టసిద్ధికలిగి బ్రహ్మానందభరితులై తరించుదురు.

స్రగ్విణి .. (ర ర ర ర యతి 6 )


దేశకాలాపరిచ్ఛిన్నమానమ్ముగన్

ఆశపాశమ్ము ఆకాంక్షమూలమ్ముగన్ 

ధ్యాసదానమ్ము దాతృత్వభావమ్ముగన్         

దాసదమ్మమ్ము దాశ్యమ్ము ఆకాంక్షగన్ 


ఈ పద్యం, దేశకాలములకు అతీతమైన, అపరిమితమైన దేవతను కీర్తిస్తుంది. ఆ దేవతే సకల ఆశలకు, కోరికలకు మూలకారణం. ఆమె సమస్త దానగుణానికి, దాతృత్వానికి ప్రతీక. భక్తులు ఆమెకు దాస్యం చేయాలనే ఆకాంక్షను కలిగి ఉండటం ద్వారా ఆమెను చేరుకోవచ్చని ఈ పద్యం యొక్క అంతరార్థం. ఇది భక్తుని యొక్క సమర్పణా భావాన్ని, దేవత యొక్క సర్వవ్యాపకత్వం, దయాగుణాన్ని చాటి చెబుతుంది.

జగన్మాత ఎక్కడనుంచి వచ్చినది, ఎప్పుడు వచ్చినది, ఎప్పటివరకూ ఉంటుంది అని గానీ, ఎన్నాళ్ళు ఉంటుంది అని గానీ వివరించే కాల వ్యవధులు, ఎల్లలులేవు. ఆ తల్లి *అనాదినిధనా* పుట్టుక, పోవుట ఏమియు లేనిది. సకల ప్రపంచములకూ తానే ముందు. కాలములన్నిటికీ తానే పూర్వము. వస్తుభేదములేదు. *భావాభావ వివర్జితా* భావములుచేత, అభావములచేత విడచిపెట్టబడి సకల భావములకు అభావమైనది. బ్రహ్మాదులకందరికీ కాలపరిమాణము గలదు. మానవుని ఆయువు నూరు వరకూ, బ్రహ్మఆయువు ఒక కల్పము. పరబ్రహ్మ అయిన జగన్మాతకు ఆయువు, ఆ ఆయువు ఇంత అనిఏమీ లేదు.  ఎందుకంటే ఆది, అంతము లేనిది.  జగన్మాతకు ఆయుఃపరిమాణము అనగా *కాలాపరిచ్ఛేదము* (కాలపరిమాణము) లేదు, ఇక్కడలేదు అక్కడ ఉంది అనే దేశాపరిచ్ఛేదము లేదు. ఆవిధంగా జగన్మాత *దేశకాలాపరిచ్ఛిన్నా* అను నామప్రసిద్ధమైనది. ఆ జగన్మాత అనిత్యమైన శరీరాలమధ్య శరీరం లేనిదిగా, అశాశ్వతమైన వాటి మధ్య శాశ్వతమైనదిగా ఉంటుంది. ఆత్మ అనేది నిత్యము. సత్యము. సర్వవ్యాపకము. 

జగన్మాత పంచభూతాలలో భూమిలో ఉందని గాని, ఆకాశములో ఉందనిగాని, లేక వాయువు ఉందని గాని,ఇంకా నిప్పు, నీరు ఎక్కడ ఉన్నది? అంటే సర్వత్రా ఉన్నది.   అటువంటి *దేశాపరిచ్ఛిన్నము లేనిది*. ఇంతకు ముందు లేదు. ఇప్పుడు ఉంటుంది. తరువాత ఏమో! అనేది కూడా లేదు. నిత్యమైనది.

సృష్టికి పూర్వమే తానున్నది.బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను తానే నియమించింది. మహాప్రళయం తరువాత కూడా ఉంటుంది. అప్ఫుడు సృష్టి అన్నది లేక పోతే త్రిమూర్తులతో పనిఏముంది. వారు కూడా ఉండరు. సమస్త సృష్టిని ప్రళయకాలంలో తనలో లయంచేసుకున్న జగన్మాత ఉంటుంది. అందుకే జగన్మాత ఎప్పటి నుండి ఎప్పటి వరకూ అనే కాలాపరచ్ఛేదం లేనిది. అనగా సృష్టికిముందు, తరువాత కూడా ఉంటుంది గనుక *కాలాపరిచ్ఛేదం లేదు*.  కాబట్టి జగన్మాత *దేశకాలాపరిచ్ఛిన్నా* అని నామ ప్రసిద్ధమైనది. 

జగన్మాతకు నమస్కరించునపుడు  *ఓం దేశకాలాపరిచ్ఛిన్నాయై నమః* అని అనవలెను.

***

741వ నామ మంత్రము ....ఓం రంభాదివందితాయై నమః

రంభ, ఊర్వశి, మేనక మొదలైన అప్సరాంగనలచే నమస్కరింపబడు   జగదీశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి రంభాదివందితా యను ఆరక్షరముల (షడక్షరీ) నామ మంత్రమును ఓం రంభాదివందితాయై నమః అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని అత్యంత భక్తిప్రపత్తులతో ఉపాసించు సాధకునకు స్వర్గసుఖములంతటి సుఖసంతోషములను ప్రస్తుత జీవనమునందు ప్రసాదించి, ఆధ్యాత్మికతయందు, భగవన్మామ సంకీర్తనమునందుగూడ మనసును నిలుపును.

 ఇంద్ద్రవంశ (త ర జ ర .. యతి 7 ) 

రంభాదివందితా రసమ్ము దేవతా 

గంభీర చంద్రికా గళమ్ము  దేవతా 

సంభంద ముద్రికా సమమ్ము దేవతా       

ముంబా యనా మదీ ముఖ్యమ్ము దేవతా     

ఓం రంభాదివందితాయై నమః  ఒక దేవతను కీర్తిస్తుంది. ఆమె రంభ వంటి అప్సరసలచే పూజింపబడే సారవంతమైన శక్తిని కలిగి ఉంది. ఆమె స్వరం లేదా ఉనికి లోతైన వెన్నెల వలె ప్రశాంతంగా, కాంతివంతంగా ఉంటుంది. దేవత బంధాలను ధృవీకరించే పవిత్రమైన ముద్రిక వంటిది. చివరగా, కవికి ఆమె ముఖ్యమైన నామం "అంబా " అని తెలుపుతారు (అమ్మలగన్న అమ్మ) ,  దేవతను ఒక నిర్దిష్ట ఆధునిక ప్రదేశంతో అనుసంధానిస్తుంది అట్టి అమ్మకు మా నమస్కారములు  

రంభ మొదలైన అప్సరసలచే నమస్కరింపబడుచున్నది జగన్మాత.

సప్త-అప్సరసలు 1. రంభ, 2. ఘృతాచి, 3. మేనక, 4. తిలోత్తమ, 5. మంజుఘోష, 6. ఊర్వశి, 7. సుకేశి.

ద్వాదశ-అప్సరసలు

1. కృతస్థల, 2. పుంజికస్థల, 3. మేనక, 4. సహజన్య, 5. నీప్రమ్లోచ, 6. అనుమ్లోచ, 7. ఘృతాచి, 8. విశ్వాచి, 9. పూర్వజితి, 10. తిలోత్తమ, 11. రంభ.

షోడశ-అప్సరసలు

1. పాథాసూత, 2. మహాభాగ, 3. దేవి, 4. దేవర్షిత, 5. అలంబుష, 6. మిశ్రకేళి, 7. విద్యుత్పర్ణ, 8. తిలోత్తమ, 9. అరుణ, 10. రక్షిత, 11. రంభ, 12. మనోరమ, 13. కేశిని, 14. సుబాహువు, 15. సురత, 16. సురజ.

 అప్సరసలు కశ్యపుడను మునియందు పుట్టినట్లును, పాలసముద్రమునందు పుట్టినట్లును చెప్పుదురు. బ్రహ్మదేవునికి పిక్కలనుండి పుట్టినవారుగా కూడా చెబుతారు.

వీరు ఇంద్రుని కొలువులో ఉండెడి దేవవేశ్యలు. అవివాహితలు. ఇంద్రుడు వీరిని విశ్వామిత్రుని వంటి  మునుల తపస్సులను భగ్నము చేయడానికి, హరిశ్చంద్రుని వంటి సత్యశీలుర వ్రతభంగము చెరచడానికి భూలోకానికి పంపుతుండేవాడని అంటారు. ఊర్వశి అర్జునుని మోహించి, అర్జునునిచే తిరస్కరింపబడి, అతనిని నపుంసకునిగా కొంతకాలము జీవించమని శాపమిచ్చినది. ఆ శాపము అర్జునునికి వరమై, అజ్ఞాతవాసంలో ఉపయోగపడినది.

అప్సరసలు సంగీతము, నృత్యము వంటి కళలందు ప్రావీణ్యత గలవారు.  ఇంద్రుని సభలో వీరు నృత్యప్రదర్శనలు, సంగీత సభలు నిర్వహించేవారు. 

జగన్మాత చతుష్షష్టి కళామయి. సంగీతప్రియ, సామగానప్రియ, లాస్యప్రియ.  సహజముగా కళాకారిణులైన రంభ,ఊర్వశి మొదలైన అప్సరసలు వాగ్దేవీ స్వరూపిణియైన అమ్మవారిని ఆరాధించి వారి కళాకౌశలమును మరింత రాణింపననుగ్రహించమని కోరుకొంటూ నమస్కరించేవారు. కాబట్టి జగన్మాతకు రంభాదివందితా యను నామ మంత్రమొకటి సార్థకమైనది.

రంభ అనగా హృల్లేఖ హ్రీంకారము. పరమేశ్వరి హ్రీం కారముచే జపింపబడుచున్నది.

జగన్మాతకు నమస్కరించునపుడు ఓం రంభాది వందితాయై నమః అని అనవలెను.

****


*742వ నామ మంత్రము* *ఓం భవదావసుధావృష్ట్యై నమః*

సంసార దావానలంమధ్య చిక్కుకుపోయి, అట్టి దావానలాన్ని యధిగమించలేక  అలమటించే జీవులను  అమృతవర్షిణియై రక్షించు పరమేశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *భవధావసుధావృవ్టిః* యను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును *ఓం భవదావసుధావృష్ట్యై నమః* అని ఉచ్చరించుచూ, ఆ జగజ్జననిని ఆరాధించు భక్తులకు సంసారసంబంధమైన దుఃఖములు లేకుండా చేయును మరియు సుఖసంతోషమయమైన జీవితమును అనుగ్రహించును. పునర్జన్మరాహిత్యమైన మోక్షమును కలుగజేయును.

దైవ బలంబుగానులె మదీయబలమ్మునుజూప యత్నమున్ 

భావపరంపరాగతిగ భాగ్యమనస్సునుతెల్ప యుక్తిగన్ 

సేవ యనేదిగామనసు సీతల లక్ష్యము పొందగల్గుటన్ 

సావ సమాగుణమ్మును విశాలము పర్చగ శాంతి శాంభవీ

భగవద్బలం లేకుండా నాది ఏమాత్రం బలం లేదని, నేను చేసే ప్రయత్నమంతా దైవబలంతో కూడినదే అని తెలియజేస్తున్నాను.

భావాల పరంపరలో ప్రవహిస్తూ, అదృష్టానికి లోనైన నా మనస్సును సమర్థతతో అర్థవంతం చేయాలని ప్రయత్నించుచున్నాను.

సేవ అనే శాశ్వత మార్గాన్ని మనసుతో ఆశ్రయించి, చల్లదనమైన, శాంతియుతమైన లక్ష్యాన్ని సాధించగలగాలనే కోరిక.

సావధానంగా సమగుణతను (సమతా, సహనం, దయ మొదలైన గుణాలను) విస్తరింపజేసేలా శాంతియుతమైన శాంభవీ స్వరూపినీ అనుగ్రహించు.

**

భవ అనగా సంసారము. దావ అనగా కార్చిచ్చు (అడవిలో చెలరేగు  అగ్ని) సుధ అనగా అమృతము. వృష్టిః అనగా వర్షపుజల్లు. సంసారమను కార్చిచ్చుపై అమృతవృష్టిని కురిపించును జగన్మాత.

****


831వ నామ మంత్రము  ....ఓం ప్రాణేశ్వర్యై నమః

ముఖ్యప్రాణము మరియు ఇంద్రియాలకు అధిష్ఠాన దేవతయై విరాజిల్లు శ్రీమాతకు నమస్కారము. 

శ్రీలలితా  సహస్ర నామావళి యందలి ప్రాణేశ్వరీ యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును ఓం ప్రాణేశ్వర్యై నమః అని ఉచ్చరించుచూ, ఆ జగదీశ్వరియైన లలితాంబను ఆరాధించు సాధకులకు ఆయురారోగ్యములు, శాంతిసౌఖ్యములు, భగవదారాధనయందు ఏకాగ్రత సంప్రాప్తమగును.

ప్రాణములకు ఆధారమైనది. ప్రాణములనగా ఇంద్రియములు.  అట్టి ఇంద్రియములకు అధిష్ఠాత్రి. గనుకనే ప్రాణేశ్వరీ యని అనబడినది.

ప్రాణములు అయిదు.  1. ప్రాణము (హృదయమున నుండునది), 2. అపానము (గుదమున నుండునది), 3. సమానము (నాభి మండలమున నుండునది), 4. ఉదానము (కంఠమున నుండునది), 5. వ్యానము (శరీరమంతట వ్యాపించి యుండునది).

చం. 

హృదయమునుండుకాంక్షలుసహాయఅపానము ప్రాణ మూలమున్

ఉదయ మనస్సు కంఠమునయున్నతిగాను కళే సుహాసి మానమున్

పదము యశస్సు నాభిగను పాఠమునేస్తమయమ్ము జీవమున్

విధము శరీరమంతటయు విద్యల ధర్మ ప్రవర్త ప్రాణమున్

ఈ పద్యం, మానవ శరీరం కేవలం ఒక భౌతిక నిర్మాణం కాదని, అది కోరికలు, ప్రాణం, మనస్సు, కీర్తి, జ్ఞానం, ధర్మం వంటి అనేక సూక్ష్మ శక్తులకు, భావాలకు నిలయమని వివరిస్తుంది. హృదయంలో కోరికలు ఉంటే, అపాన వాయువు ప్రాణానికి మూలం. కంఠం మనస్సు యొక్క ఉన్నతమైన వ్యక్తీకరణకు, జ్ఞానానికి, ఆనందానికి వేదిక. నాభి కీర్తికి, శక్తికి కేంద్రం, జ్ఞానం జీవితానికి శాశ్వత మార్గదర్శి. చివరిగా, మొత్తం శరీరంలో విద్యలు (జ్ఞానం) మరియు ధర్మం (సదాచారం) వ్యాపించి, అవి జీవితాన్ని నడిపించే ప్రాణశక్తిగా పనిచేస్తాయి.

ఇది మానవ ఉనికి యొక్క సంక్లిష్టతను, ఆధ్యాత్మికతను, మరియు శరీరం, మనస్సు, ఆత్మల మధ్య ఉన్న సమన్వయాన్ని సూచించే ఒక అద్భుతమైన పద్యం.

ఉపప్రాణములు కూడా అయిదు. అవి:

 1. నాగము(వాక్కు నందుండునది), 2. కూర్మము (కంటిరెప్పల యందుండునది), 3. కృకరము (నేత్రముల యందుండునది), 4. దేవదత్తము (కంఠద్వారమున నుండునది), 5. ధనంజయము (హృదయమున నుండునది).

ఈ ప్రాణములకు పరమేశ్వరి అధిష్ఠాత్రి.

వేదమునందు ప్రాణమునకే ప్రాణము అనికూడా చెప్పబడినది. అనగా ప్రాణములకు అధిష్ఠాత్రి అయిన శ్రీమాత లేకుంటే ప్రాణములుకూడా నిలువలేవు. అందుకే అంటారు శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని.  ప్ర + ఆణ అనగా  ప్రాణ. ప్రాణ అనగా శబ్దము అను  అర్థము గలదు. ఇక్కడ శబ్దము అనగా వేదశబ్దము. అనగా వేదము.  వేదరాశికి దేవత. అనగా వేదముచే ప్రతిపాదింప బడినది. వేదము అనగా పరబ్రహ్మము. అట్టి పరబ్రహ్మ స్వరూపిణియైన అమ్మవారు ప్రాణేశ్వరీ యని అనబడినది.

సృష్టి సకల జీవరాసులు కర్మలు చేస్తుంటాయి. ఆ కర్మలఫలితంగా పునర్జన్మలు పొందడం జరుగుతుంది. ఈ పునర్జన్మ అనేది పరమేశ్వరి ఆజ్ఞయే. అనగా సకల జీవకోటికి (ప్రాణికోటికి) అధికారిణి గనుకనే అమ్మవారు ప్రాణేశ్వరీ యని అనబడినది. శ్రీమాత ప్రాణేశ్వరి యగుట చేతనే ముక్కంటి  మూడవ కంటి మంటలకు మన్మథుడు భస్మమయిపోయాడు. పరమేశ్వరి ప్రాణేశ్వరి గనుకనే మన్మథుని సజీవునిగా చేసినది. హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవ నౌషధిః (84వ నామ మంత్రము) శివుని నేత్రాగ్నిచే భస్మమయిపోయిన మన్మథుని సజీవుని చేయుటకు సంజీవనౌషధిగా జగన్మాత ఒప్పారినది.

మహిషుడు, భండాసురుడు మొదలైన రాక్షసుల ప్రాణములను హరించివేసినది యంటే ఆ తల్లి ప్రాణేశ్వరి యే గదా!

జగన్మాతకు నమస్కరించునపుడు ఓం ప్రాణేశ్వర్యై నమః అని యనవలెను.

*****

832వ నామ మంత్రము . ఓం ప్రాణదాత్ర్యై నమః

జీవులకు ప్రాణములను ఇచ్చి జీవింపజేయు పరమేశ్వరికి నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి ప్రాణదాత్రీ యను నాలుగు అక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును ఓం ప్రాణదాత్ర్యై నమః అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధించు సాధకులకు ఆ జగన్మాత అకాలమృత్యువులనుండి, ఆకస్మిక ప్రమాదములనుండి కాపాడును. ఆయురారోగ్యములు ప్రసాదించును. భౌతిక జీవనమునందు శాంతిసౌఖ్యములు ప్రసాదించి అనంతమైన బ్రహ్మజ్ఞాన సాధన దిశగా అడుగులు వేయించును.
జీవుల శరీరంలో ప్రాణములుంటేనే ఇంద్రియవ్యాపారం కొనసాగుతుంది.   ఇంద్రియముల కదలికలు గోచరమవుతాయి. దేహంలోని ప్రాణం చూడడానికి గోచరించదు. ప్రాణం యొక్క ఉనికి ఇంద్రియముల  కదలికననుసరించియే తెలియుచుండును. గనుక ప్రాణము  అంటే ఇంద్రియములు అని కూడా ఇచ్చట చెప్పుకొనవచ్చును. ప్రాణములుఅనగా పంచ ప్రాణములు, ఇంకను పంచ ఉప ప్రాణములను జగన్మాత జీవులకు ఇచ్చును. అలాగే జ్ఞానేంద్రియములు ఐదు, కర్మేంద్రియములు ఐదు, మనసు (వెరసి పదకొండు ఇంద్రియములను) కూడా ఇచ్చును.

మ.
మనమధ్యా విధి యాడు నాటకము యేమచ్చల్లె ప్రేమమ్ము యే
గుణమా నన్నుగ నీవు నుంచగలిగే గుప్తమ్ము గానౌను చూ
సినిమా కా ముని చెప్పె నేడు వదగునే సీతమ్మ గంగాతటిన్
తృణమే జీవిత భాగ్యమవ్వగలిగే తృప్తౌనులే శాంభవీ

మన మధ్య జరుగుతున్నదంతా విధి ఆడిస్తున్న నాటకం మాత్రమే. కానీ అందులో ప్రేమ మాత్రమే కలుషిత రహితంగా – మచ్చల్లేదుగా – నిలుస్తుంది. నన్ను గుణవంతుడిగా నిలిపే శక్తి నీవు సమర్పించిన ఒక అంతర్ముఖ గుప్తమయ్య శక్తి – అది నీ చైతన్యమే.
ఈ జీవితం ఒక సినిమా మాత్రమే అని ఓ జ్ఞానముని నేడు గంగాతటంపై ఉపదేశించాడు – అంటే జీవనానుభవాన్ని తాత్త్వికంగా పరిశీలించిన వాడికి ఇది మాయానాటకమైంది.
జీవిత భాగ్యాలన్నీ తృణసమమైపోవగలవి – తృప్తి వుండినపుడే అవి మాధుర్యమవుతాయి. అటువంటి తృప్తిని ప్రసాదించగలదీ శాంభవీ (అమ్మవారి) అనుగ్రహమే.

 శరీరం పుట్టిన తరువాత పదకొండు ఇంద్రియములు ఉంటాయి. మరి అవి అమ్మవారు ఇవ్వడమేమిటి? అనే ప్రశ్న ఉత్పన్నము కవచ్చును. ఇంద్రియములకు ఆయా పనితనములను ప్రసాదించునని భావించదగును. జీవుని పాత్ర తీరిపోగానే ప్రధాన ప్రాణము పయనమై పోవును. ఆ వెంట మిగిలిన ప్రాణములు కూడా తరలిపోవును. ప్రాణములు శరీరమును విడచిన వెంటనే ఇంద్రియములు కూడా చచ్చుబడిపోవును. అప్పుడు ఆ దేహాన్ని శవము అన్నారు. ఒక్క ప్రధాన ప్రాణమును అమ్మవారు జీవునికి పోయగానే మొత్తము ప్రాణములు, ఇంద్రియముల కార్యనిర్వాహకత్వము కూడా శరీరంలో స్థాపింపబడి పంచభూతాత్మకమైన ఆ శరీరము కదలును. లోకములో తనకున్న పాత్రనిర్వహణను కొనసాగించును. అందు చేతనే ప్రాణుల చేతనావస్థకు  వలసిన ప్రాణమును అమ్మవారు ప్రసాదించును గనుక ఆ తల్లి ప్రాణదాత్రీ యని అనబడినది.

జగన్మాతకు నమస్కరించునపుడు ఓం ప్రాణదాత్ర్యై నమః అని యనవలెను.
***


833వ నామ మంత్రము ... ఓం పంచాశత్పీఠ రూపిణ్యై నమః

ఏబదియొక్క పీఠములు (మాతృకావర్ణాధిదేవతల) స్వరూపిణిగా విరాజిల్లు జగన్మాతకు నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి పంచాశత్పీఠరూపిణీ యను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును ఓం పంచాశత్పీఠ రూపిణ్యై నమః అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను అత్యంత భక్తిప్రపత్తులతో ఉపాసించు సాధకునికి మానవజన్మకు, మానవేతర జన్మకు గల భేదము, మానవజన్మను పొందినందుకు ఆ పరమేశ్వరి నామమంత్రస్మరణతో కైవల్యమునందడానికి గల మార్గము    ఆ తల్లి అనుగ్రహము వలన తెలియును.

శార్దూలం :--
ప్రాణంబుల్ పదిలంబుగా తనువులన్ రాజిల్లుచు న్నుండగా
త్రాణోత్సాహములందజేయ తనదౌధర్మంబుపాటించుచున్
వీణావాదనమట్లు వాయువ హహా! వీచుల్ప్రపంచించునే!
రాణింపేర్పడ మేనులందు పులకల్ తైతక్కలా యీశ్వరీ  

ఈ పంక్తి పద్యానికి ముగింపు, ఇది దేవతకు (ఈశ్వరీ) సంబోధిస్తుంది. ప్రాణం, వాయువు, ధర్మం సరిగ్గా పనిచేస్తున్నప్పుడు, శరీరంలో ఆనందం, భక్తి, లేదా ఏదైనా దివ్య అనుభూతి వల్ల పులకింతలు (గూస్ బంప్స్/రోమాంచం) ఏర్పడతాయి. ఈ పులకింతలు "తైతక్కలా" (నాట్యంలోని ఒక శబ్దం) అన్నట్లుగా, అంటే ఒక లయబద్ధమైన నృత్యం వలె శరీరంలో ఆనందంగా ప్రకంపించి, ఆనందాన్ని పంచుతాయని కవి వర్ణించారు. ఇది దేవతానుగ్రహం వల్ల కలిగే దైవిక అనుభూతిని సూచిస్తుంది.


జగన్మాత ఏబదియొక్క శక్తిపీఠముల స్వరూపిణిగా విరాజిల్లుతున్నది అని భావము. 
పంచాశత్పీఠ యనగా ఏబది (50) మాత్రమే యథార్థమైన అర్థము. కాని ఏబదికి దగ్గరగా ఉన్నసంఖ్య ఏబది ఒకటిని గ్రహించినచో ఈ నామ మంత్రమునకు సరైన భావము మనకు తెలియును. భాస్కరరాయలు వారు ఏబది ఒకటి అని తీసుకోవడానికి చాలా ప్రమాణాలు తెలియజేశారు. కాని, కొన్ని ప్రమాణములను మాత్రమే గ్రహించి వివరణచేయు ప్రయత్నము జరిగినది.
దక్షయజ్ఞంలో సతీదేవి భర్త అయిన పరమేశ్వరునకు అవమానం జరిగి, సతీదేవి ఆత్మత్యాగముచేయగా, పరమేశ్వరుడు సతీదేవి దేహంతో ప్రళయతాండవము ప్రారంభించాడు. లోకాలు ఆ రుద్రుని తాండవమునకు తల్లడిల్లిపోతుంటే, నారాయణుడు తన సుదర్శనంతో సతీదేవి దేహాన్ని ఖండించగా, ఆ ఖండములు ఏబది ఒక్కచోట పడి, శక్తిపీఠములుగా వెలసినవి. గనుక శ్రీమాత పంచాశత్పీఠరూపిణీ యని అనబడినది.
జగన్మాత అకారాది క్షకారాంత మాతృకా వర్ణరూపిణి. మాతృకా వర్ణములు ఏబది ఒకటి (51) అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ౠ ఌ ౡ ఎ ఐ ఒ ఔ అం అః క ఖ గ ఘ ఙ చ ఛ జ ఝ ఞ ట ఠ డ ఢ ణ త థ ద ధ న ప ఫ బ భ మ య ర ల వ శ ష స హ ళ క్ష).  ఈ అక్షరములకు అధిదేవతలు (శక్తిలు) గలరు. వారు నెలకొని యున్న ప్రతీ ఒకటి ఒక్కొక్క శక్తి పీఠమై విలసిల్లుచున్నవి. అటువంటి ఏబదిఒక శక్తిపీఠముల స్వరూపము  తనదిగా భాసిల్లు పరమేశ్వరి పంచాశత్పీఠరూపిణీ యని అనబడినది🙏🙏🙏
ఈ అధిదేవతలకు, మనదేహంలో ఉన్న షట్చక్రములకు, లలితాసహస్ర నామస్తోత్రంలోని కొన్ని శ్లోకములతో సమన్వయించి ఇక్కడ వివరణ చేయబడినది.
*****


Wednesday, 2 June 2021





 రోజూ చదవండి. చదవమని చెప్పండి

ప్రాంజలి ప్రభ *02.06.2021  ప్రాతః కాల సందేశము*

*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*

*దశమస్కంధము - ఉత్తరార్ధము -  అరువది నాలుగవ అధ్యాయము*

*నృగమహారాజు వృత్తాంతము*

కొంత వాదోపవాదములు జరిగిన పిమ్మట ఆ ఇరువురును నా కడకు వచ్చి, తమ పంతములను నెగ్గించుకొనుటకై తమ వాదములను వినిపించిరి. ఒక బ్రాహ్మణుడు 'మహారాజా! ఇప్పుడే ఈ గోవును నీవు నాకు దానము చేసితివి. దీనిని నేను నా ఇంటికి  తోలుకొనిపోవుచుంటిని' అనెను. అంతట రెండవ బ్రాహ్మణుడు 'రాజా! అట్లైనచో నీవు నా ఆవును దొంగిలించితివి' అని పలికెను. వారి మాటలను విన్నంతనే నేను దిగ్భ్రమకు లోనైతిని.

ధర్మసంకటములో పడిన నేను ఈ ఈ ఇరువురు విప్రులను అనునయించుచు వారితో ఇట్లంటిని. 'బ్రాహ్మాణోత్తములారా! ఈ గోవునకు బదులుగా మీకు ఒక్కొక్కరికి శ్రేష్ఠమైన లక్షగోవులను ఇచ్చెదను. తెలియక అపరాధము చేసిన ఈ సేవకుని అనుగ్రహింపుడు. ఘోరమైన నరకముపాలు గాకుండా ఈ సంకటమునుండి నన్ను గట్టెక్కించుడు'

అంతట ఆ గోవుయజమాని 'మహారాజా! నాకు ఇదియే కావలయును. దీనికి మాఱుగా ఏమిచ్చినను పుచ్చుకొనను' అని పలికి అచటినుండి వెళ్ళిపోయెను. ఆ రెండవ బ్రాహ్మణుడు 'రాజా! లక్షగోవులనే గాదు, ఇంకను పదివేల గోవులను అదనముగా ఇచ్చినను నాకు అక్కరలేదు. నాకును ఈ గోవేకావలయును' అని నుడివి వెళ్ళిపోయెను.

"దేవదేవా!జగదీశ్వరా! కృష్ణా! అంతట నా ఆయువు ముగిసిన పిమ్మట యమకింకరులు వచ్చి నన్ను యమలోకమునకు తీసికొనివెళ్ళిరి. అచటయమధర్మరాజు నన్ను ఇట్లడిగెను. 'నృగమహారాజా! మొదట నీవు పాపకర్మఫలమును అనుభవించెదవా? లేక పుణ్యకర్మ ఫలితమునా? నీవు చేసిన అంతులేని దానములకు ఫలితముగా నీకు దివ్యలోకము ప్రాప్తించును' అనెను.

అప్పుడు నేను దేవా! మొట్టమొదట నా పాపకర్మఫలమునే అనుభవించెదను అంటిని. అంతట యముడు ఐనచో పడిపొమ్ము' అనెను. తత్ క్షణమే నేను ఊసరవెల్లినై, నీరులేని ఈ బావిలో పడిపోయితిని.. కేశవా! నేను బ్రాహ్మణులకు సేవకుడను. దాతను. నీ దాసుడను. నీ నందర్శనార్థమై ఇచటనే పడియుంటిని. ఇంతవఱకును నీ కృపచే నా పూర్వజన్మస్మృతి తొలగిపోలేదు.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని ఉత్తరార్ధమునందలి     అరువది నాలుగవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

* రేపటి కధలో కలుద్దాం...

[

02.06.2021  సాయం కాల సందేశము వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

దశమస్కంధము - ఉత్తరార్ధము -  అరువది నాలుగవ అధ్యాయము

నృగమహారాజు వృత్తాంతము

అధోక్షజా! కృష్ణప్రభూ! ఉపనిషన్మార్గము ననుసరించి నిన్ను   ధ్యానించునట్టి యోగీశ్వరుల నిర్మల హృదయములయందే పరాత్పరుడవైన నీవు గోచరించుచుందువు. అంతేగాదు, సంసారచక్రమునుండి విముక్తి పొందెడి సమయముననే నీ దర్శనము ప్రాప్తించుచుండును. నేనైతే పెద్ద ఆపదచే అధిక దుఃఖముతో వివేకమును కోల్పోయి అంధకారకూపమున పడియున్నాను. అట్టి నా యొక్క కన్నులకు ఎట్లు గోచరుడవైతివి?

దేవదేవా! జగన్నాథా! గోవిందా! పురుషోత్తమా! నారాయణా! హృషీకేశా! పుణ్యశ్లోకా! అచ్యుతా! అవ్యయా! కృష్ణప్రభూ! దేవలోకమునకు వెళ్ళుటకు నన్ను అనుమతింపుము. అక్కడగూడ సర్వదా నీ చరణకమలముల యందే నా చిత్తము నిల్చునట్లు దయజూడుము. నీవు సమస్తకార్యకారణరూపములలో విరాజమానుడవు అగుచుందువు. నీవు అనంతశక్తిమంతుడవైన పరబ్రహ్మవు. నీవు సచ్చిదానందస్వరూపుడవు. సర్వాంతర్యామివి. మహాయోగేశ్వరుడవు. నీకు పదేపదే నమస్కరించుచున్నాను".

నృగమహారాజు ఈ విధముగా శ్రీకృష్ణుని ప్రస్తుతించి, ఆ ప్రభువుయొక్క పాదములకు సాష్టాంగముగా ప్రణమిల్లెను. పిదప ఆ స్వామి అనుమతిని పొంది, విమానమును అధిరోహించి, జనులు ఎల్లరును చూచుచుండగా దివమునకు చేరెను.

దేవకీసుతుడైన శ్రీకృష్ణభగవానుడు ధర్మాత్ముడు, బ్రాహ్మణుల యెడ ఆదరాభిమానములు గలవాడు. నృగమహారాజు వెళ్ళిపోయిన పిదప ఆ స్వామి అచటగల రాజన్యులకును, పరిజనులకును ధర్మసూక్ష్మములను బోధించుచు ఇట్లువచించెను-

మిత్రులారా! అగ్నివలె తేజోమూర్తులైనవారు కూడా బ్రాహ్మణుని సొత్తును ఏ కొంచముగా అపహరించినను దానిని వారుజీర్ణించుకొనలేరు. ఇంక తమను తామే ప్రభువులము అని విర్రవీగుచున్న గర్వాంధుల విషయము చెప్పనేల? నేను హాలాహలమును విషముగా భావింపను. బ్రాహ్మణుని సంపద విషముకంటెను ప్రమాదకరమైనది. ఏలయన, విషమనకు విరుగుడు గలదు. కాని, బ్రాహ్మణుని సొత్తును అపహరింపదలచినందువలన కలిగెడి పాపములకు ప్రాయశ్చిత్తములేదు.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని ఉత్తరార్ధమునందలి     అరువది నాలుగవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

03.06.2021  ప్రాతః కాల సందేశము వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

దశమస్కంధము - ఉత్తరార్ధము -  అరువది నాలుగవ అధ్యాయము

నృగమహారాజు వృత్తాంతము

విషము, భుజించిన వానిని మాత్రమే హతమార్చును. అగ్ని జలములతో చల్లాఱును. కాని బ్రాహ్మణుని సొత్తు అనెడి అరణివహ్ని  వాని వంశమునే సమూలము దహించివేయును.

అరణి వహ్ని అనగా అరణిని మథింపగా పుట్టెడి అగ్ని.న విషం విషమిత్యాహుః బ్రహ్మస్వం విషముచ్యతే| విషమ్ ఏకాకినం హంతి బ్రహ్మస్వం పుత్రపౌత్రకమ్॥ (నీతిశాస్త్రము)

విషము అంతగా ప్రమాదకరమైనది కాదు. బ్రాహ్మణుని సొత్తు నిజముగా   ప్రాణాంతకమైనది. విషము దానిని తిన్నవానినే చంపును. విప్రుని సొత్తు   అనెడి విషము దానిని అపహరించిన వారి పుత్రులతో సహా, వారి వారి వంశములనే నశంపజేయును.

బ్రాహ్మణుని సొమ్మును అతని అనుమతిలేకుండా అనుభవించినచో, వారి మూడుతరముల వారిని అది నశింపజేయును. రాజాశ్రయము యొక్క బలము చూచుకొని, బలవంతముగా లాగికొని అనుభవించినచో వారికి సంబంధించిన పదితరముల పూర్వీకులను (పితృపితామహాదులను) నరకమున పడవేయును. అంతేగాక వారి తరువాత పదితరములవారిని (పుత్రపౌత్రాదులను) నశింపజేయును.

రాజ్యాధికారముచే కన్నుమిన్నుగానక ఏ రాజులైతే మూర్ఖులై బ్రాహ్మణుని సొత్తునుగూడ అపహరింతురో, వారు తమకు పతనావస్థ తప్పదని ఎఱుగరు. అట్టివారు నరకమున ఘోరయాతనల పాలగుట తథ్యము.

రాజులు నిరంకుశులై తమ వృత్తులపై (జీవనాధారములపై) దెబ్బతీసినప్పుడు ఉదారచరితులు, గృహస్థులు ఐన బ్రాహ్మణులు మిగుల దుఃఖింతురు. వారి కన్నీటి బిందువులకు ఎన్ని భూరేణువులు తడియునో అన్ని సంవత్సరములు, బ్రాహ్మణుల సంపదలను అపహరించిన ఆ రాజులు, వారి వంశములవారు కుంభీపాకనరకములో బడి తీవ్రవేదనల పాలగుదురు.

బ్రాహ్మణులకు తాముగాని, ఇతరులుగాని ఇచ్చిన భూములను, లేక ఆ భూములద్వారా సమకూరిన ధనధాన్యాదికములను ఎవ్వరును హరింపరాదు. లోభబుద్ధితో అట్లొనర్చినవారు అరువేదివేల సంవత్సరములు మలమునందు క్రిములై జీవింతురు.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని ఉత్తరార్ధమునందలి     అరువది నాలుగవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏


Friday, 5 March 2021





 [04:27, 01/03/2021] +91 95058 13235: శ్రీమాత్రేనమః


శ్రీలలితా సహస్రనామ భాష్యము

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

[04:27, 01/03/2021] +91 95058 13235: శ్రీమాత్రేనమః


శ్రీలలితా సహస్రనామ భాష్యము


256వ నామ మంత్రము 01.03.2021


ఓం విశ్వరూపాయై నమః


విశ్వ అనగా జాగ్రత దశను పొందిన, స్థూలభూతత్త్వాన్ని పొందిన చైతన్యంతో కూడిన జీవుల అర్థం. అటువంటి వైశ్వానర రూపిణి అయివున్న పరమేశ్వరికి నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి విశ్వరూపా యను నాలుగక్షరముల(చతురక్షరీ) నామ మంత్రమును ఉచ్చరించుచూ, ఆ అఖిలాండేశ్వరిని ఉపాసించు సాధకునకు భౌతికపరమైన కోర్కెలను పరిత్యజించి, బ్రహ్మజ్ఞాన సముపార్జనకై సాధనను మరింత పటుత్వమునందజేయు దిశగా బుద్ధిని పయనింపజేయును. జన్మతరించినదను పరమానందానుభూతినందును.


ఈ నామ మంత్రము మొదలు పందొమ్మిది నామ మంత్రముల వరకూ, జీవునికి పరమేశ్వరునికి గల భేదములు తెలియుటయేగాక శ్రీమాత జీవేశ్వర స్వరూపురాలను భావముకూడా  ఆవిష్కరింపబడును. సృష్టిలో ముందుగా తమస్సు అనగా అజ్ఞానము లేక అవ్యక్తము ఆవిర్భవించినది. అట్టి తమస్సునుండి మహత్తత్త్వము, దానినుండి అహంకారము పుట్టినవి.  ఈ అహంకారము త్రిగుణాత్మకమైనది అనగా సత్వరజస్తమోగుణాత్మకమైనది.  అహంకారము నుండి పంచతన్మాత్రలు (1. రూపము, 2. రసము, 3. గంధము, 4. స్పర్శ, 5. శబ్దము) ఏర్పడినవి. వీనినే సూక్ష్మభూతములని యందురు. వీనియందు అయిదు జ్ఞానశక్తులు,  అయిదు క్రియాశక్తులు గలవు. జ్ఞానశక్తులనగా జ్ఞానతన్మాత్రలు (శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు).  ఈ జ్ఞాన తన్మాత్రలనుండి వరుసగా చెవి, చర్మము, కన్ను, నాలుక మరియు నాసిక అను జ్ఞానేంద్రియము ఏర్పడినవి.  అదేవిధంగా పంచతన్మాత్రలలో జ్ణానశక్తులు అయిదుతోబాటు, క్రియాశక్తులయిదు కూడా గలవు. క్రియాశక్తులయిదింటి నుండి వాక్, పాణి, పాద, పాయు, ఉపస్థలని అయిదు కర్మేంద్రియములు కలిగినవి. ఈ క్రియాశక్తులయిదింటి సమూహంనుండి ప్రాణములు (1. ప్రాణము (హృదయమున నుండునది), 2. అపానము (గుదమున నుండునది), 3. సమానము (నాభి మండలమున నుండునది), 4. ఉదానము (కంఠమునందుండునది), 5. వ్యానము (శరీరమంతట వ్యాపించి యుండునది). సూక్ష్మభూతములయిన శబ్దాదులనుండి స్థూలములయిన పంచభూతములు (భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము) పుట్టినవి. ఇది సృష్టియొక్క యథార్థత.


ఆత్మచైతన్యము జీవులలోని స్థూలభూతములతో కలిసినప్పుడు విశ్వుడనియు, సూక్ష్మభూతములతో గలిసినప్పుడు తైజసుడనియు, కారణోపాధితో గూడినప్పుడు ప్రాజ్ఞుడనబడును. దీనినే జీవుల వ్యష్టివిషయము.  ఆత్మచైతన్యము స్థూలభూత (పంచభూత) సమిష్టితో గూడియున్నప్పుడు వైశ్వానరుడనియు (విరాట్టు అనియు), సూక్ష్మభూతములయిన శబ్దాదులసమిష్టితో గూడినప్పుడు హిరణ్యగర్భుడనియు, కారణోపాధి సమిష్టితో గలిసినప్పుడు ఈశ్వరుడనియు చెప్పబడును.  పరమాత్మ అంతఃకరణరూపమగు కారణోపాధితో గలసినప్పుడు హిరణ్యగర్భుడనియు  (బ్రహ్మ) ప్రాణములతో గూడినప్పుడు సూత్రాత్మ (విష్ణువు) యనియు, ప్రాణాన్తఃకరణములు రెండును కలిసియున్నప్పుడు,ఆ సముదాయముతో గూడిన పరమాత్మకు అంతర్యామి (రుద్రుడు) అనియు చెప్పబడుచున్నది. ఈ విధముగా  వ్యష్టి జీవాత్మ స్థులసూక్ష్మకారణ భేదములచే విశ్వ-తైజస-ప్రాజ్ఞులని మూడు విధములని చెప్పబడుచున్నది. సమిష్టి జీవాత్మ స్థూలసూక్ష్మకారణ భేదములచే విరాట్(వైశ్వానర), హిరణ్యగర్భ, ఈశ్వర నామములతో  విరాజిల్లుట జరుగుచున్నది.  


పరమాత్మ అంతఃకరణముతో కలసినప్పుడు హిరణ్యగర్భుడనియు, అంతఃకరణము ప్రాణసముదాయముతో కలసినప్పుడు సూత్రాత్మ యనియు, ప్రాణసముదాయము (పంచప్రాణములు మరియు పంచ ఉపప్రాణములతో) కలసినప్పుడు అంతర్యామియు అని చెప్పడం జరుగుచున్నది. ఈ పద్ధతియంతయు వేదాంతుల మతమనియు, ఈ మతమునందు జాగ్రత్స్వప్నసుషుప్తులనెడి మూడు అవస్థలును, సృష్టిస్థితిసంహారములనెడి మూడు కృత్యములు మాత్రమే గలవు. తాంత్రికుల విషయములోనయితే, జాగ్రత్స్వప్నసుషుప్తావస్థలతోబాటు తురీయము, తురీయాతీతము అను రెండు అవస్థలును, సృష్టిస్థితిలయలతోబాటు తిరోధానము, అనుగ్రహము అను రెండు కృత్యములును అధికముగా అంగీకరించబడినవి. గాన తాంత్రికుల విషయములో అయిదు అవస్థలు, అయిదు కృత్యములు చెప్పబడినవి. ఈ అయిదు అవస్థలను పొందిన జీవులు అయిదు విధములు. అలాగే పరమాత్మయు అయిదు విధములు.  అలగే కృత్యములనుజేయు జీవులు కూడా అయిదు విధములు, పరమాత్మయు అయిదు విధములుగా గ్రహింపబడుటచే ఉపనిషణ్మతమునకును, తాంత్రిక మతమునకును భేదముగలదని మాత్రము భావింపకూడదు.


విశ్వరూప అనగా పదహారవ కళాస్వరూపురాలు అయిన త్రిపుర సుందరిగా చెప్పుట గలదు. శ్రీమాత షోడశకళారూపురాలని వాసన సుభగోదయమందు గలదు. దర్శ (అమావాస్య) నుండి పూర్ణిమ వరకు పదునైదు కళలు కాగా, పదహారవ కళ సచ్చిదానందరూపిణి అయిన పరమేశ్వరి. చంద్రమండలమునందు వృద్ధి క్షయములు లేకుండ సదా అను కళ గలదు. ఆ సదా కళాస్వరూపురాలైన శ్రీమాతకు చిద్రూపయను కళగూడ కలదు. ఆ చిద్రూపకళనే త్రిపురసుందరి అనియందురు. మిగిని పదునైదు కళలు తిథులు క్రమంలో కామేశ్వరి మొదలు కొని చిత్ర వరకు పరివర్తనము పొందుదురు. అది ఎలాగ అనగా:-


చంద్రకళలను సూచించే తిథులకు - అమ్మవారి కళలకు సమన్వయం ఉన్నది. శుక్లపక్షమి చంద్రుడు, పాడ్యమి నుండి క్రమంగా ఒక్కొక్క కళ పెరుగుతూ పూర్ణిమ వరకు నిండు చంద్రుడౌతాడు. చంద్రునియొక్క పదహారు కళలు శ్రీవిద్యలో నిత్య లని అంటారు. రెండు పక్షాలలోని తిథులకు నిత్యలని సమన్వయం చేయడమైనది

 

శుక్ల పక్షము


  1. పాడ్యమి - కామేశ్వరి

  2. విదియ    - భగమాలిని

  3. తదియ    - నిత్యక్లిన్నా

  4. చవితి      - భేరుండా

  5. పంచమి  - వహ్నివాసినీ

  6. షష్టి        - మహావజ్రేశ్వరీ

  7. సప్తమి   -  శివదూతీ

  8. అష్టమి  -   త్వరతా

  9. నవమి  -   కులసుందరీ

10. దశమి   -   నిత్యా

11. ఏకాదశి -   నీలపతాకా

12. ద్వాదశి -   విజయ

13. త్రయోదశి-సర్వమంగళా

14. చతుర్దశి  - జ్వాలామాలిని

15. పూర్ణిమ  -  చిత్రా


కృష్ణ పక్షము


  1. పాడ్యమి - చిత్రా

  2. విదియ    - జ్వాలామాలిని

  3. తదియ    - సర్వమంగళా

  4. చవితి      - విజయా 

  5. పంచమి  - నీలపతాకా

  6. షష్టి        - నిత్యా

  7. సప్తమి   -  కులసుందరీ

  8. అష్టమి  -   త్వరితా

  9. నవమి  -   శివదూతీ

10. దశమి   -   మహావజ్రేశ్వరి

11. ఏకాదశి -   వహ్నివాసిని

12. ద్వాదశి -   భేరుండా

13. త్రయోదశి-నిత్యక్లిన్నా

14. చతుర్దశి  - భగమాలిని

15. అమావాస్య  -  కామేశ్వరీ


ఇక్కడ గమనించవలసిన విషయం ఏమంటే శుక్లపక్షము నందలి  నిత్యాదేవతలు పాడ్యమి నుండి పౌర్ణమి వరకు అనులోమక్రమం అనగా పాడ్యమి నాడు కామేశ్వరి నుండి పౌర్ణమి నాడు చిత్రాగా గమనిస్తే, కృష్ణపక్షంలో విలోమము అనగా పౌర్ణమి నాటి నిత్యాదేవత చిత్ర కాగా కృష్ణపక్ష పాడ్యమికి కూడా నిత్యాదేవత చిత్రాతో ప్రారంభమై విలోమక్రమంలో అమావాస్యనాటికి  నిత్యాదేవత కామేశ్వరి అవుతుంది. ఇది చంద్రకళల క్రమంలో ఏర్పడింది. కాని శుక్లపక్షమునందు, కృష్ణ పక్షము  నందు అష్టమి నాటి నిత్యాదేవత  త్వరితా అగును. అంటే అష్టమీచంద్రవిభ్రాజదళకస్థల శోభితా అను నామ మంత్రములో వశిన్యాది దేవతలు చెప్పిన అష్టమి చంద్రుడు శుక్లపక్షమైనా, కృష్ణపక్షమైనా ఒకే విధముగా ఉంటాడు అంటే అంతటి అష్టమి చంద్ర శోభతో జగన్మాత ఫాలభాగము శోభాయమానమై ఉన్నదని వశిన్యాది దేవతలు చెప్పారంటే అమ్మను వారు తిలకించియున్నారు గదా!🌹🌹🌹ఈ పదిహేను నిత్యలలో - శుక్లపక్షములో ఒక్కొక్క కళ పెరుగుతూ ఉంటుంది. కృష్ణపక్షములో ఒక్కొక్క కళ తగ్గుతూ ఉన్న మూలభూతమైన కళను మహానిత్యయని అందురు. దీనినే లలితకళ, ఆద్యకళ, చిత్కళ, సంవిత్కళ అని అంటారు. ఈ మహానిత్య లలితాంగిగా ఉన్నందున మిగతా కళలు నిత్యల యందు అంగభాగములుగా ఉండును.


ఈ పదునైదు తిథులే పంచదశిలోని పదునైదు అక్షరములు. ఈ పదునైదక్షరముల స్వరూపమయిన పంచదశిలోని చిద్రూపమైన పదహారవ అక్షరము కలిపితే శ్రీవిద్యయని అందురు. దీనిననుసరించియే చంద్రమండలమునకును, శ్రీమాతకు, పంచదశీ మంత్రమునకు సమన్వయించబడినది. చంద్రమండల కళలకును, పంచదశాక్షరములకును ఐక్యము వచ్చినది. అందుచేతనే తిథులు పదునైదింటికిని, పంచదశీ మంత్రములోని పదునైదు అక్షరములకును త్రిఖండత్వము సిద్ధించినది.తిథులలోని  మూడు భాగములకు నంద, భద్రజయరిక్త, పూర్ణయను మూడు విధములయితే, పంచదశి లోని పదునైదు అక్షరమలు మూడు భాగములను వాగ్భవకూటము, కామరాజకూటము మరియు శక్తికూటము అని చెప్పబడినది. ఈ విధమైన భావము వలననే తైత్తరీయ బ్రాహ్మణంలో శుక్లపక్షరాత్రులు పదునైదింటిని ఇలా చెప్పారు. 1) దర్శ, 2) దృష్టా, 3) దర్శతా, 4) విశ్వరూపా, 5) సుదర్శనా, 6) అప్యాయమానా, 7) ఆప్యాయమానా, 8) ఆప్యాయా, 9)  సూనృతా, 10) ఇరా, 11) అపూర్వమాణా, 12) ఆపూర్వమాణా, 13) పూరయన్తి, 14) పూర్ణ, 15) పౌర్ణమాసి.


అలాగే శుక్లపక్ష పగళ్ళకు కూడ పేర్లు గలవు.అవి: 1) సంజ్ఞానము, 2) విజ్ఞానము, 3) ప్రజ్ఞానము, 4) జానత్, 5) అభిజానత్, 6) సంకల్పమానము, 7) ప్రకల్పమానము, 8) ఉపకల్పమానము, 9) ఉపక్లుప్తము,  10) క్లుప్తము, 11) శ్రేయము, 12) వశీయము, 13) ఆయత్, 14) పంచభూతము, 15) భూతము.  


పై వివరణ ప్రకారము శుక్లపక్షములో నాలుగవ నాటి రాత్రిపేరు విశ్వరూపా యని గమనార్హము. దీని వలననే జగనన్మాత విశ్వరూపా యని అనడంలో సముచితగలదని భావము. దీనిని బట్టి తిథులు మూడు ఖండములు సమానముగా నున్నవి. అయినను దశమి వేధ గలిగిన ఏకాదశితిథి దశమియే యగును. ఆరోజు ఉపవాసము పనికిరాదు. ద్వాదశినాడే ఏకాదశి పర్వమగును, ఉపవాసము ఉండవచ్చునని ధర్మశాస్త్రము తెలియజేయుచున్నది


తిథులు పదిహేనింటికిని, పంచదశీ మంత్రాక్షరములకును అభేదము సిద్ధించినది. 


అది ఎలాగ అనగా పంచదశీమంత్రం (క ఏ ఈ ల హ్రీం-హ స క హ ల హ్రీం-స క ల హ్రీం), లోని మొదటి ఖండమునకు (వాగ్భవకూటము) అయిదు అక్షరములు  (క, ఏ, ఈ, ల, హ్రీం), రెండవ ఖండమునకు (కామరాజకూటము) ఆరు అక్షరములు (హ, స, క, హ, ల, హ్రీం), మూడవ ఖండమునకు (శక్తికూటము) నాలుగు అక్షరములు (స, క, ల, హ్రీం) ఉన్నవి.


అలాగే తిథులు కూడా మూడుభాగములు చేసినప్పుడు మొదటి భాగంలో అయిదు తిథులు, రెండవ భాగంలో దశమి చివరి తిథి అయినప్పటికిని దశమి, ఏకాదశి తిథులను ఒకటిగా భావించూటచే, ఏకాదశి తిథి రెండువభాగములో చేరును గాన రెండవభాగము ఆరుతిథులు ఉండును, అందుచే మూడవ భాగమునకు నాలుగు తిథులు గలవు. గాన పంచదశి మంత్రములోని మూడు ఖండములు, తిథులలోని మూడుభాగములతో సమన్వయం చేయబడినది. ఈ విధముగా విశ్వరూప యను నామ మంత్రముచే శ్రీమాత అహోరాత్రస్వరూపురాలనియు, కాలస్వరూపిణిగాను, శుక్లపక్షరాత్రులలో నాలుగవ రాత్రి విశ్వరూపా యని యనబడుట సముచితమైనది.


శ్రీమాతకు నమస్కరించు నపుడు ఓం విశ్వరూపాయైనమః అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

[04:27, 01/03/2021] +91 95058 13235: 01.03.2021  ప్రాతః కాల సందేశము


వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం


దశమస్కంధము - పూర్వార్ధము -  నలుబది ఏడవ అధ్యాయము


గోపికలతో ఉద్ధవుని సంభాషము - భ్రమరగీతలు


🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

శ్రీశుక ఉవాచ


47.1 (ప్రథమ శ్లోకము)


తం వీక్ష్య కృష్ణానుచరం వ్రజస్త్రియః ప్రలంబబాహుం నవకంజలోచనమ్|


పీతాంబరం పుష్కరమాలినం లసన్ముఖారవిందం పరిమృష్టకుండలమ్॥10098॥  


శ్రీశుకుడు నుడివెను పిమ్మట గోపవనితలు కృష్ణుని మిత్రుడైన ఉద్ధవుని జూచిరి. అ ఆజానుబాహువుయొక్క నేత్రములు అప్పుడే వికసించిన కమలములవలె అలరారుచుండెను. పట్టుపీతాంబరమును దాల్చియున్న  అతని యొక్క మెడలో పద్మములమాల విలసిల్లుచుండెను. మణికుండలములతో అతని ముఖారవిందము మనోజ్ఞముగా ఉండెను.


47.2 (రెండవ శ్లోకము)


శుచిస్మితాః కోఽయమపీచ్యదర్శనః కుతశ్చ కస్యాచ్యుతవేషభూషణః|


ఇతి స్మ సర్వాః పరివవ్రురుత్సుకాస్తముత్తమశ్లోకపదాంబుజాశ్రయమ్॥ 10099॥


అంతట ఆ గోపికలు దరహాసమొనర్చుచు తమలో తాము ఇట్లనుకొనిరి. 'చూడముచ్చట గొలుపుచున్న ఈ సుందరుడు ఎవరు? ఇతడు ఎచటినుండి వచ్చెను? ఎవరిదూత! ఇతడు పూర్తిగా శ్రీకృష్ణునివలె వేషభూషలు కలిగియున్నాడు'. ఇట్లు తలపోయుచు వారు ఆయనను గూర్చి తెలిసికొనుటకై మిగుల కుతూహలముతో ఉండిరి. అనంతరము వారు జగత్ప్రసిద్ధుడగు శ్రీకృష్ణుని యొక్క పాదపద్మములను ఆశ్రయించిన ఆ మహాపురుషుని చుట్టును చేరిరి.


47.3 (మూడవ శ్లోకము)


తం ప్రశ్రయేణావనతాః సుసత్కృతం  సవ్రీడహాసేక్షణసూనృతాదిభిః|


రహస్యపృచ్ఛన్నుపవిష్టమాసనే  విజ్ఞాయ సందేశహరం రమాపతేః॥10100॥


ఆ వచ్చిన మహాత్ముడు శ్రీకృష్ణుని సందేశమును తీసికొనివచ్చినవాడని ఆ గోపికలకు తెలిపెను. అప్పుడు వారు సవినయముగా నమస్కరించిరి. దరహాసమొనర్చుచు, అర్ఘ్యపాద్యాది పూర్వకముగా ఆయనకు సత్కారములను నెఱపిరి. పిమ్మట సముచితమైన ఆసనముపై ఉద్ధవుని కూర్చుండజేసి, బిడియపడుచు ఆ గోపాంగనలు ఏకాంతమున ఇట్లు ప్రశ్నించిరి.


47.4  (నాలుగవ శ్లోకము)


జానీమస్త్వాం యదుపతేః పార్షదం సముపాగతమ్|


భర్త్రేహ ప్రేషితః పిత్రోర్భవాన్ ప్రియచికీర్షయా॥10101॥


47.5  (ఐదవ శ్లోకము)


అన్యథా గోవ్రజే తస్య స్మరణీయం న చక్ష్మహే|


స్నేహానుబంధో బంధూనాం మునేరపి సుదుస్త్యజః॥10102॥


47.6  (ఆరవ శ్లోకము)


అన్యేష్వర్థకృతా మైత్రీ యావదర్థవిడంబనమ్|


పుంభిః స్త్రీషు కృతా యద్వత్సుమనఃస్వివ షట్పదైః॥10103॥


47.7 (ఏడవ శ్లోకము)


నిఃస్వం త్యజంతి గణికా అకల్పం నృపతిం ప్రజాః|


అధీతవిద్యా ఆచార్యం ఋత్విజో దత్తదక్షిణమ్॥10104॥


47.8 (ఎనిమిదవ శ్లోకము)


ఖగా వీతఫలం వృక్షం భుక్త్వా చాతిథయో గృహమ్|


దగ్ధం మృగాస్తథారణ్యం జారో భుక్త్వా రతాం స్త్రియమ్॥10105॥


"మహాత్మా! నీవు శ్రీకృష్ణప్రభువు యొక్క అనుచరుడవని మేము ఎఱుగుదుము. ఆ స్వామి తన మాతాపితరులైన యశోదా నందులకు ప్రియమును గూర్చుటకై ఇచటికి పంపగా వచ్చితివని మేముగ్రహించితిమి. అట్లుగాక (తల్లిదండ్రులు దప్ప) ఆ పూర్ణకామునకు ఈ నందగోకులమున స్మరింప దగినవారు ఎవరున్నారు? జననీజనకులు మొదలగువారితో గల అనుబంధమును (ప్రేమపాశమును) వీడుటకు తపోజీవనులైన మునులకు సైతము సాధ్యము కాదు. మానవులు ఏదో ఒక ప్రయోజనమును ఆశించి ఇతరులపట్ల స్నేహమును కలిగియుందురు. పని నెరవేరునంతవరకే స్నేహము నిలుచును. తుమ్మెదలు పూలయందు, పురుషులు స్త్రీలయందు ఇట్టి స్వార్థపూరిత ప్రేమనే కలిగియుందురు. వేశ్యలు నిర్ధనుని త్యజింతురు. సరియైన రక్షణ కల్పింపని రాజును ప్రజలు పట్టించుకొనరు. యజ్ఞదక్షిణలు ముట్టినంతనే ఋత్విజులు ఆ యజమానిని వదలి వెళ్ళుచుందురు. విద్యాభ్యాసము పూర్తియైన పిదప ఎంతమంది శిష్యులు తమ గురువును సేవించుచుందురు? ఫలములు లేని చెట్టును పక్షులు విడిచిపెట్టును. అతిథులు అన్నము తినిన పిదప ఆ ఇంటిని  విడిచిపెట్టెదరు. మృగములు కాలిపోయిన అడవిని వదలిపెట్టును. జారులు అనుభవించిన పిమ్మట స్త్రీలను విడిచిపెట్టుదురు".


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి     నలుబది ఏడవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏


పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం

7702090319, 9505813235

[21:06, 01/03/2021] +91 95058 13235: 01.03.2021  సాయం కాల సందేశము


వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం


దశమస్కంధము - పూర్వార్ధము -  నలుబది ఏడవ అధ్యాయము


గోపికలతో ఉద్ధవుని సంభాషము - భ్రమరగీతలు


🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉


47.9 (తొమ్మిదవ శ్లోకము)


ఇతి గోప్యో హి గోవిందే గతవాక్కాయమానసాః|


కృష్ణదూతే వ్రజం యాతే ఉద్ధవే త్యక్తలౌకికాః॥10106॥


47.10 (పదియవ శ్లోకము)


గాయంత్యః ప్రియకర్మాణి రుదత్యశ్చ గతహ్రియః|


తస్య సంస్మృత్య సంస్మృత్య యాని కైశోరబాల్యయోః॥10107


గోపికలు త్రికరణశుద్ధిగా శ్రీకృష్ణుని తమ సర్వస్వముగా భావించు చుండిరి (భాషణములలో, క్రియలలో, మనస్సులలోను ఆ స్వామియందే నిరతిగలిగి యుండిరి) . శ్రీకృష్ణుని దూతయగు ఉద్ధవుడు గోకులమునకు వచ్చినపిదప వారు తమ లౌకిక కుృత్యములను అన్నింటిని ప్రక్కనబెట్టి, ఆ ప్రభువుయొక్క బాల్యమునుండి కిశోరదశవఱకుగల ప్రియకార్యములను (మధురలీలలను) పదే పదే స్మరించుకొనుచు పారవశ్యముతో గానము చేయదొడంగిరి. క్రమక్రమముగా వారు ఆ ఆవేశములో మునిగి సిగ్గువిడచి వెక్కి వెక్కి ఏడువసాగిరి.


47.11 (పదకొండవ శ్లోకము)


కాచిన్మధుకరం దృష్ట్వా ధ్యాయంతీ కృష్ణసంగమమ్|


ప్రియప్రస్థాపితం దూతం కల్పయిత్వేదమబ్రవీత్॥10108॥


అప్పుడు వారిలో ఒక గోపిక శ్రీకృష్ణుని తోడి తన సాంగత్యమును ధ్యానించుచు ఒక భ్రమరమును చూచెను. దానిని కృష్ణప్రభువు తన కడకు పంపిన దూతనుగా తలపోయుచు ఇట్లు పలికెను (గండు తుమ్మెదను సాకుగా గైకొని ఉద్ధవునితో ఇట్లు నుడివెను.


గోప్యువాచ


47.12 (పండ్రెండవ శ్లోకము)


మధుప కితవబంధో మా స్పృశాంఘ్రిం సపత్న్యాః  కుచవిలులితమాలాకుంకుమశ్మశ్రుభిర్నః|


వహతు మధుపతిస్తన్మానినీనాం ప్రసాదం  యదుసదసి విడంబ్యం యస్య దూతస్త్వమీదృక్॥10109॥


గోపిక ఇట్లనెను ఓ తుమ్మెదా! నీవు నయవంచకుని మిత్రుడవు! కనుక, నీవు కూడ కపటివేసుమా! నా పాదములను నీవు తాకవద్దు. శ్రీకృష్ణుడు ధరించిన వనమాల మా సవతుల వక్షస్థలముల స్పర్శతో నొక్కబడి మలినమై యున్నది. నీవు  ఆ వనమాలపై వాలుటచే, మా సవతి వక్షస్థలమునందలి కుంకుమ నీ మీసములకు అంటుకొన్నది. ఒక పూవునుండి మరొక పూవుమీదికి ఎగిరిపోయే దానివి నీవు. ఆ విధంగా నీవు ఏ ఒక్క పూవును కూడా ప్రత్యేకంగా ప్రేమించే దానివికాదు. నీ స్వామి ఎటువంటివాడో, నీవు కూడా అట్టివాడివేలే! మథురాపుర భామినులను మురిపించుటకై వారి ప్రసాదమైన  ఆ కుంకుమను మథురాపతియగు  శ్రీకృష్ణుడే ధరించి యాదవుల సభలో అపహాస్యములపాలైన అగునుగాక! అట్టి కుంకుమప్రసాదము ఆ మథురాభామినులకే చెందుగాక! దానిని నీ ద్వారా ఇక్కడికి పంపించుటెందులకు? 


47.13 (పదమూడవ శ్లోకము)


సకృదధరసుధాం స్వాం మోహినీం పాయయిత్వా సుమనస ఇవ సద్యస్తత్యజేఽస్మాన్ భవాదృక్|


పరిచరతి కథం తత్పాదపద్మం తు పద్మా హ్యపి బత హృతచేతా హ్యుత్తమశ్లోకజల్పైః॥10110॥


తుమ్మెదా! నీవు పూవులలోని మకరందమును ద్రాగిన పిమ్మట ఆ పువ్వులను వదలివేయుచుందువు. అట్లే మా విభుడు (శ్రీకృష్ణుడు) మోహమును కలిగించే తన అధరసుధారసమును ఒక్కసారి మాకు రుచి చూపి, వెంటనే మమ్ములను వదలివేసెను. నయవంచకుడగు అట్టి శ్రీహరియొక్క పాదపద్మములను లక్ష్మీదేవి ఎట్లు సేవించుచున్నదో యేమో? బహుశా ఆమె ఆయన ఇచ్చకపు మాటలను నమ్మి ఆ చిత్తచోరుని వలలో బడియుండవచ్చును.


47.14 (పదునాలుగవ శ్లోకము)


కిమిహ బహు షడంఘ్రే గాయసి త్వం యదూనామధిపతిమగృహాణామగ్రతో నః పురాణమ్|


విజయసఖసఖీనాం గీయతాం తత్ప్రసంగః క్షపితకుచరుజస్తే కల్పయంతీష్టమిష్టాః॥10111॥


షట్పదమా! ఆ యదువిభుని (శ్రీకృష్ణుని) యొక్క గుణములను మా యెదుట ఎందులకు గానము చేసెదవు? మేము వనవాసులము. మాకు ఇండ్లు, వాకిండ్లును లేవు. అతడు మాకు పాతచుట్టమే. అతని  కథలన్నియును మేము ఎఱిగినవే.  నీ పాటలను అన్నింటిని శ్రీకృష్ణుని ప్రియులైన మథురానగర భామినుల ముందు అతని గుణములను పాడుకొనుము. అతడు ఆ వనితల హృదయతాపములను తీర్చినవాడు. వారి ముందు ఆయనను గూర్చి గానము చేసినచో వారు ఉబ్బితబ్బిబ్బై నీకు ఇష్టమైన పదార్థములను పెట్టెదరు.


47.15 (పదునైదవ శ్లోకము)


దివి భువి చ రసాయాం కాః స్త్రియస్తద్దురాపాః  కపటరుచిరహాసభ్రూవిజృంభస్య యాః స్యుః|


చరణరజ ఉపాస్తే యస్య భూతిర్వయం కాః అపి చ కృపణపక్షే హ్యుత్తమశ్లోకశబ్దః॥10112॥


'తల్లులారా! మీరు ఇట్లు అనవలదు. శ్రీకృష్ణుడు ఎల్లప్పుడును మిమ్ముగూర్చి ఎల్లప్పుడు  స్మరించుకొనుచునే యుండును. మీ ఎడబాటువలన పరితపించుచున్న ఆ స్వామి మిమ్ములను ఆనందింపజేయుటకే నన్ను ఇచటికి పంపినాడు' అని తుమ్మెద తన ఝంకారముద్వారా తెలుపుచున్నట్లు ఊహించుకొని ఆ గోపిక ఇట్లనెను. భో! మాతః మైవం వోచ స్త్వామసుస్మృత్యానుస్మృత్య అనంగవిక్లబస్త్యాం ప్రసాదయితుం మామ్ ఆదిష్టవాన్ ఇత్యత - ఆహ (శ్రీధరీయ వ్యాఖ్య)


భ్రమరమా! మనోహరమైన చిఱునవ్వులతో, చక్కని కనుబొమల విలాసములతో ఒప్పెడి, నయవంచకుడగు శ్రీకృష్ణుని సోయగములకు స్వర్గమర్త్యపాతాళ లోకములయందు గల ముదితలలో కఱగిపోనివారు ఎవ్వరు? లక్ష్మీదేవియంతటి వనితారత్నమే వాని (శ్రీహరి/శ్రీకృష్ణుని) అందచందములకు ముగ్ధురాలై, ఆ ప్రభువుయొక్క పాదములను సేవించు చున్నదిగదా! ఇక మేము ఎంతటివారము? దీనులపక్షమున నిలచి, వారిని ఆదుకొనుచుండువానినే ఉత్తమశ్లోకుడు అని పేర్కొనుట సమంజసము. అంతేగాని దయచూపలేని వారిని ఉత్తమ శ్లోకుడనుట వ్యర్థమేసుమా!


47.16 (పదహారవ శ్లోకము)


విసృజ శిరసి పాదం వేద్మ్యహం చాటుకారైరనునయవిదుషస్తేఽభ్యేత్య దౌత్యైర్ముకుందాత్|


స్వకృత ఇహ విసృష్టాపత్యపత్యన్యలోకాః  వ్యసృజదకృతచేతాః కిం ను సంధేయమస్మిన్॥10113॥


ఝంకారము చేయుచు, తన పాదములచెంత అటునిటు తిరుగుచున్న తుమ్మెదనుజూచి, అది ప్రియోక్తులతో తనను ఓదార్చుటకై యత్నించుచున్నదని భావించి ఆ గోపిక ఇట్లు వచించెను- "భ్రమరమా! వినయంగా అనునయ పూర్వకంగా తీయని మాటలతో నీ శిరసును నా పాదములపై పెట్టవద్దు. క్షమింపుమని అర్థించుటలో నీవు చాకచక్యముగల వాడవని నేను ఎఱుగుదును. కల్లబొల్లి మాటలతో దూతను ఎట్లు బుజ్జగింపవలెను - అను విద్యను నీవు ఆ శ్రీకృష్ణుని దగ్గర బాగుగా నేర్చుకొని వచ్చినట్లు కనబడుచున్నది. కాని, మేము మా పతులను, పిల్లలను, ఇతర బంధువులను, లోక మర్యాదలను పట్టించుకొనక శ్రీకృష్ణుడే సర్వస్వమని భావించి ఆయనను చేరితిమి. ఐతే, ఆ నిర్మోహి ఏమాత్రమూ కృతజ్ఞత చూపక మమ్ములను త్యజించి వెళ్ళిపోయినాడు. అట్టి కృతఘ్నునితో మాకు సంధి ఎట్లు పొసగును? ఇంకను ఆయనపై విశ్వాసము ఉంచవలెనా? నీవే తెలుపుము.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి     నలుబది ఏడవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏


పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం

7702090319, 9505813235

[05:31, 02/03/2021] +91 95058 13235: శ్రీమాత్రేనమః


[05:31, 02/03/2021] +91 95058 13235: శ్రీమాత్రేనమః


శ్రీలలితా సహస్రనామ భాష్యము


257వ నామ మంత్రము 02.03.2021


ఓం జాగరిణ్యై నమః 


జాగ్రదావస్థను పొందిన జీవాభిన్నస్వరూపురాలు అయిన పరాత్పరికి నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి జాగరిణీ యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును ఓం జాగరిణ్యై నమః అని ఉచ్చరించుచూ, ఆ జగదీశ్వరిని అత్యంత భక్తిప్రపత్తులతో పూజించు భక్తులకు, ఆ తల్లి కరుణచే అనంతమైన సుఖసంతోషములు, ఆయురారోగ్యములు సంప్రాప్తమగుటయేగాక, శాశ్వతమైన పరమానందమును పొందు ధ్యాననిమగ్నత సంప్రాప్తమగును.


మనిషి జీవితంలో అనుభవించేవి మూడు అవస్థలు. అవి 1.జాగ్రదావస్థ, 2. స్వప్నావస్థ, 3.సుషుప్తావస్థ. వీటినే అవస్థత్రయమని అందురు.


స్థూలదేహమునకు సంబంధించినవే అనగా  బుద్ధిపరమైనవే గాని, ఆత్మకు సంబంధించినవి కావని విజ్ఞులు చెబుతారు. చీకటిలో నేలపై పడి ఉన్న తాడును చూసి పాము అనుకొని భయపడటం సహజం. వెలుతురులో చూసినప్పుడు- అది పాము కాదని, తాడు అని నిర్ధారించుకోవడమూ సహజమే. పాము కాని తాడు పాములా ఎలా కనపడిందో, అలాగే ఆత్మలో లేని మూడు అవస్థలు ఆత్మలో ఉన్నట్లు అనిపిస్తాయి. వెలుతురు వంటి జ్ఞానంతో చూసినప్పుడు- ఆ మూడు అవస్థలూ బుద్ధికి సంబంధించినవే గాని, ఆత్మకు చెందినవి కావని తేలుతుంది.

 

జాగ్రదావస్థ మేల్కొని ఉండుటనే జాగ్రదావస్ఠ అందురు.

జాగ్రదవస్థలో అంటే మేలుకొని ఉన్న వేళలో  తన చుట్టూ ఉన్న వాటిని, పదార్థాలను తెలుసుకోవటానికి సూర్యుడు, దీపం, ఇంద్రియాలు, బుద్ధి తోడ్పడతాయి. అవి లేకుంటే మనిషి ఏ పదార్థాన్నీ చూడలేడు. తెలుసుకోలేడు. దీనినే ప్రబోధాత్మకమైన సర్వేంద్రియ జ్ఞానముగల విశ్వుడు అనే జీవుని అవస్థ (జాగరము). ఇటువంటి అవస్థలో పరమేశ్వరి ఉంటుంది.  స్థూలశరీరాభిమాని అయిన శ్రీమాత విశ్వుని రూపంలో ఉంటుంది.


గృహస్థుడు అనగా గృహమునందు ఉండువాడు. స్థూలదేహానికి ప్రతినిధి వైశ్వానరుడు. ఆత్మ చైతన్యము జీవుల స్థూలభూతములతో కలిసినప్పుడు విశ్వుడు అని చెప్పబడును. అదే ఆత్మచైతన్యము సూక్ష్మభూతములతో కలిసినప్పుడు  తైజసుడు అని చెప్పబడును. ఆత్మచైతన్యము కారణోపాధితో కూడినప్ఫుడు ప్రాజ్ఞుడు అని  చెపుతారు. ఈ విషయము 256వ నామ మంత్రములో చెప్పుకోవడం జరిగినది. కాబట్టి బాహ్యముగా నుండి, అన్ని ఇంద్రియములకు గోచరించునది సర్వసాధారణమై, అందరికిని బయట ఇష్టమయిన సృష్టిని కలుగజేసెడి అవస్థ అయిన జాగ్రదావస్థలో ఉండు జీవస్వరూపురాలైన  జగన్మాత జాగరిణీ యని అనబడినది.


జగన్మాతకు నమస్కరించునపుడు ఓం జాగరిణ్యై నమః అని అనవలెను.

[05:31, 02/03/2021] +91 95058 13235: 02.03.2021  ప్రాతః కాల సందేశము


వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం


దశమస్కంధము - పూర్వార్ధము -  నలుబది ఏడవ అధ్యాయము


గోపికలతో ఉద్ధవుని సంభాషము - భ్రమరగీతలు


🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

47.17 (పదిహేడవ శ్లోకము)


మృగయురివ కపీంద్రం వివ్యధే లుబ్ధధర్మా స్త్రియమకృత విరూపాం స్త్రీజితః కామయానామ్|


బలిమపి బలిమత్త్వావేష్టయద్ధ్వాంక్షవద్యః తదలమసితసఖ్యైర్దుస్త్యజస్తత్కథార్థః॥10114॥


తుమ్మెదా! శ్రీహరి (శ్రీకృష్ణుడు) రామావతారమున వేటగానివలె క్రౌర్య, కాఠిన్య స్వభావముతో నిరపరాధియైన వాలిని వధించెను. తన భార్యపైగల వ్యామోహములో మునిగి ఆ దాశరథి తనమీద కోరిక పడివచ్చిన శూర్పణఖను స్త్రీ అనియు చూడక ముక్కుచెవులను కోసి విరూపను గావించెను. కాకి బల్యన్నమును స్వీకరించిన పిమ్మట తోడి కాకులతోకూడి ఆ అన్నదాత చుట్టునూ తిరుగుచు వానిని ఎట్లు వేధించునో, అట్లే వామనావతారమున ఇతడు బలిచక్రవర్తి సమర్పించిన సర్వస్వమును స్వీకరించి వరుణపాశముతో ఆ చక్రవర్తిని యుక్తిగా బంధించెను. అట్టి నల్లనయ్య చెలిమిని ఎంతగానో రుచి చూచితిమి. చాలును, ఇంక, అతనిమాట ఎత్తవద్దు. ఓ భ్రమరమా! మేము నిజము పలికెదము. ఒక్క సారి అతనిపై ప్రేమ కలిగితే చాలు, అతనిని విడిచిపెట్టలేము సుమా! అందువలన, మేము ఎంత ప్రయత్నించినప్పటికినీ, అతని గురుంచిన చర్చను విడిచిపెట్టలేకున్నాము.


47.18 (పదునెనిమిదవ శ్లోకము)


యదనుచరితలీలాకర్ణపీయూషవిప్రుట్సకృదదనవిధూతద్వంద్వధర్మా వినష్టాః|


సపది గృహకుటుంబం దీనముత్సృజ్య దీనా బహవ ఇహ విహంగా భిక్షుచర్యాం చరంతి॥10115॥


ఓ తుమ్మెదా! ఆ శ్రీకృష్ణభగవానుని లీలలు చెవులకు అమృతతుల్యములు. ఆ కథామృతముయొక్క ఒక్క బిందువైననూ చాలు, దానిని రుచిచూసిన వ్యక్తికి సుఖ దుఃఖాది ద్వంద్వములు, సాంసారికమైన ఆసక్తి నశించిపోవును. వెంటనే వారు కామరహితులై తుచ్ఛమైన గృహ-కుటుంబములను వదలివేసి హంసలవలె సారసార వివేకమును పొంది, అనన్యభావముతో భగవంతుని భజించెదరు. ఆ విధంగా వారలు సరళమైన జీవనమును సాగించెదరు.


47.19 (పందొమ్మిదవ శ్లోకము)


వయమృతమివ జిహ్మవ్యాహృతం శ్రద్దధానాః కులికరుతమివాజ్ఞాః కృష్ణవధ్వో హరిణ్యః|


దదృశురసకృదేతత్తన్నఖస్పర్శతీవ్రస్మరరుజ ఉపమంత్రిన్ భణ్యతామన్యవార్తా॥10116॥


దూతా! వేటగాడు మృగములను ఆకర్షించుటకై చేయు అనుకరణధ్వనులను విని, అమాయకములైన నల్లజింకలు వాని వలలో చిక్కుపడి వెతలపాలైనట్లు, కపటమెఱుగని మేమును ఆనల్లనయ్య యొక్క కుటిలమైన తీయని మాచటలను నిజములని విశ్వసించి, మోసపోయితిమి. మఱియు ఆయన అందచందాలకు పొంగిపోయి, అతని కలయికను ఆకాంక్షించి ఎంతగానో వ్యథచెందితిమి. ఇంక అతనియొక్క అట్టి ఊసులు మాని, మఱి ఏ ఇతర విషయములనైనను తెలుపుము.


47.20 (ఇరువదియవ శ్లోకము)


ప్రియసఖ పునరాగాః ప్రేయసా ప్రేషితః కిం వరయ కిమనురుంధే మాననీయోఽసి మేఽఙ్గ|


నయసి కథమిహాస్మాన్ దుస్త్యజద్వంద్వపార్శ్వం  సతతమురసి సౌమ్య శ్రీర్వధూః సాకమాస్తే॥10117॥


శ్రీకృష్ణుని ప్రియమిత్రుడా! నీవు మాకు ప్రియతముడైన శ్రీకృష్ణుడు పంపగా ఇచటికి వచ్చినట్లున్నది. ఐనచో మాకు మిగుల ఆదరణీయుడవు. నీకు ఇష్టమైనదానిని కోరుకొనుము. అది సరే! మమ్ములను ఆయన కడకు తీసికొనివెళ్ళుటకు వచ్చితివా? ఆ ప్రభువు దగ్గఱకు వెళ్ళినచో, ఆయన సాహచర్యమును వీడి, తిరిగివచ్చుట కష్టము. ఐనను సౌమ్యుడా! మమ్ము అచటికి తీసికొనివెళ్ళినచో మాకు ఏమి ప్రయోజనము. ఆయన వక్షస్థలమందు లక్ష్మీదేవి నిరంతరము నివసించుచునే యుండును. ఇంక అచట మేము ఎట్లు ఉండగలము?


47.21 (ఇరువది ఒకటవ శ్లోకము)


అపి బత మధుపుర్యామార్యపుత్రోఽధునాఽఽస్తే స్మరతి స పితృగేహాన్ సౌమ్య బంధూంశ్చ గోపాన్|


క్వచిదపి స కథా నః కింకరీణాం గృణీతే భుజమగురుసుగంధం మూర్ధ్న్యధాస్యత్కదా ను॥10118॥


అది సరే! ప్రియమిత్రమా! ఆ ప్రభువు గురుకులమునుండి మథురాపురమునకు చేరి హాయిగా ఉన్నాడా? ఎప్పుడైనను అతడు తన జననీ జనకులైన యశోదానందులను, గోకులమునగల బంధువులను, గోపాలురను గుర్తు చేసికొనుచున్నాడా? ఆయన దాసీలమైన మమ్ములను గూర్చి ఎప్పుడైనను ప్రస్తావించుచున్నాడా? తెలుపుము. ఆ స్వామి సుగంధభరితములైన తన చేతులను మా శిరస్సులపై ఉంచి ఇకముందు మాకా సుఖస్పర్శ కలిగించునా! జీవితములో ఎప్పుడైనను మాకు అట్టి భాగ్యము లభించునా?"


శ్రీశుక ఉవాచ


47.22 (ఇరువది రెండవ శ్లోకము)


అథోద్ధవో నిశమ్యైవం కృష్ణదర్శనలాలసాః|


సాంత్వయన్ ప్రియసందేశైర్గోపీరిదమభాషత॥10119॥


శ్రీశుకుడు నుడివెను పరీక్షిన్మహారాజా! ఉద్ధవుడు కృష్ణదర్శనమునకై ఉత్కంఠతోనున్న గోపికల మాటలను విన్న పిదప వారికి ప్రాణప్రియుడగు శ్రీకృష్ణప్రభువునుండి తీసికొనివచ్చిన సందేశవచనములతో వారిని ఓదార్చుచు ఇట్లనెను.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి     నలుబది ఏడవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏


పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం

7702090319, 9505813235

[20:53, 02/03/2021] +91 95058 13235: 02.03.2021  సాయం కాల సందేశము


వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం


దశమస్కంధము - పూర్వార్ధము -  నలుబది ఏడవ అధ్యాయము


గోపికలతో ఉద్ధవుని సంభాషము - భ్రమరగీతలు


🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉


ఉద్ధవ ఉవాచ


47.23 (ఇరువది మూడవ శ్లోకము)


అహో యూయం స్మ పూర్ణార్థా భవత్యో లోకపూజితాః|


వాసుదేవే భగవతి యాసామిత్యర్పితం మనః॥10120॥


47.24 (ఇరువది నాలుగవ శ్లోకము)


దానవ్రతతపోహోమజపస్వాధ్యాయసంయమైః|


శ్రేయోభిర్వివిధైశ్చాన్యైః కృష్ణే భక్తిర్హి సాధ్యతే॥10121॥


47.25 (ఇరువది ఐదవ శ్లోకము)


భగవత్యుత్తమశ్లోకే భవతీభిరనుత్తమా|


భక్తిః ప్రవర్తితా దిష్ట్యా మునీనామపి దుర్లభా॥10122॥


47.26 (ఇరువది  ఆరవ శ్లోకము)


దిష్ట్యా పుత్రాన్ పతీన్ దేహాన్ స్వజనాన్ భవనాని చ|


హిత్వావృణీత యూయం యత్కృష్ణాఖ్యం పురుషం పరమ్॥10123॥


47.27 (ఇరువది ఏడవ శ్లోకము)


సర్వాత్మభావోఽధికృతో భవతీనామధోక్షజే|


విరహేణ మహాభాగా మహాన్ మేఽనుగ్రహః కృతః॥10124॥


47.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)


శ్రూయతాం ప్రియసందేశో భవతీనాం సుఖావహః|


యమాదాయాగతో భద్రా అహం భర్తూ రహస్కరః॥10125॥


ఉద్దవుడు ఇట్లు పలికెను  "గోపికలారా! మీరు మిగుల ధన్యురాండ్రు. మీ జీవితములు సఫలములైనవి. మీ హృదయములను, సర్వస్వమును కృష్ణపరమాత్మునకు సమర్పించితిరి. కనుక మీరు లోకమునకే పూజ్యులు. దానములు, వ్రతములు, తపస్సులు, హోమములు, జపములు, వేదాధ్యయనము, ఇంద్రియనిగ్రహము మొదలగువాటిచేతను, శ్రేయోదాయకములైన వివిధ సాధనములవలనను శ్రీకృష్ణునియందు భక్తి కుదురుకొనుటకై ప్రయత్నింపబడును. కాని, మీకు శ్రీకృష్ణపరమాత్మ యందు సర్వోత్తమమైన ప్రేమ లభించినది. అది మునీశ్వరులకును అత్యంత దుర్లభము. మీ భక్తినిరతిని జూచిన పిదప నాకు మిగుల ఆనందముగా ఉస్నది. గోపాంగనలారా! మీరు మీ పుత్రులను, సతులను, దేహములను, ఆత్మబంధువులను, గృహములను పరిత్యజించి, పరమపురుషుడైన శ్రీకృష్ణునకే మీ జీవితములను అంకితమొనర్చితిరి. నిజముగా మీ భాగ్యమే భాగ్యము. గొప్ప భాగ్యవతులారా! వియోగకారణముగా ఇంద్రియాతీతుడైన ఆ పురుషోత్తముని (శ్రీకృష్ణుని) యందు   త్రికరణశుద్ధిగా సర్వాత్మభావమును ప్రకటించితిరి (లోకములోని ప్రతి వస్తువునందును శ్రీకష్ణుని దర్శించు భావమును పొంది, దానిని నా ముందు ప్రకటించితిరి). ఇది మీరు నా యెడ చూపిన అనుగ్రహము. ఆ స్వామిని స్మరించి, నన్నును కృతార్థుని గావించితిరి. గోపకాంతలారా! నేను కృష్ణప్రభువునకు అంతరంగికుడను, ఆయనను సేవించుచుండువాడను. మీకు అత్యంతప్రియుడైన ఆస్వామినుండి సందేశమును తీసికొనివచ్చితిని. అది మీకు ఎంతయును సుఖావహము. దానిని   మీరు సావధానముగా ఆలకింపుడు.


శ్రీభగవానువాచ


47.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)


భవతీనాం వియోగో మే న హి సర్వాత్మనా క్వచిత్|


యథా భూతాని భూతేషు ఖం వాయ్వగ్నిర్జలం మహీ|


తథాఽహం చ మనః ప్రాణభూతేంద్రియగుణాశ్రయః॥10126॥


47.30 (ముప్పదియవ శ్లోకము)


ఆత్మన్యేవాత్మనాఽఽత్మానం సృజే హన్మ్యనుపాలయే|


ఆత్మమాయానుభావేన భూతేంద్రియగుణాత్మనా॥10127॥


శ్రీకృష్ణభగవానుడు పలికెను) ఆ భగవానుడు పంపిన సందేశము ఇది. "గోపవనితలారా! సమస్త కార్యములకును నేనే ప్రధాన కారణము. సర్వమునకు ఆత్మను నేనే. సకల చరాచర ప్రాణులలో 'భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశము' అను పంచమహాభూతములు నిలిచియుండునట్లు నేను విశ్వమునందు అంతటను వ్యాపించియే యుందును. కాబట్టి మీకు నా వియోగము ఏవిధముగను ఉండదు. సకల జీవులయొక్క మనస్సులు, ప్రాణములు, బుద్ధులు, గుణములు, ఇంద్రియములు, ఆత్మస్వరూపుడనైన నన్ను ఆశ్రయించుకొనియే యుండును. నా మాయాశక్తిద్వారా నేనే పంచభూతములు, ఇంద్రియములు, వాటి విషయముల రూపముగా మారి, వాటి ఆశ్రయముగా అగుదును. స్వయంగా నేనే కారణముగానై నన్ను సృజించెదను. పాలించెదను, మరియు లయమొనర్చెదను.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి     నలుబది ఏడవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏


పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం

7702090319, 9505813235

[05:13, 03/03/2021] +91 95058 13235: శ్రీమాత్రేనమః



శ్రీలలితా సహస్ర నామస్తోత్రంలోని


98వ శ్లోకము:-


విశుద్ధచక్రనిలయాఽఽరక్తవర్ణా త్రిలోచనా|


ఖట్వాంగాది ప్రహరణా వదనైక సమన్వితా॥98॥


99వ శ్లోకము:-


పాయసాన్నప్రియా త్వక్-స్థా పశులోక భయంకరీ|


అమృతాది మహాశక్తి సంవృతా డాకినీశ్వరీ॥99॥


కంఠస్థానమునందున్న విశుద్ధిచక్రములో పదహారు (16) దళముల పద్మము మధ్యగల కర్ణికలో డాకినీదేవి ఏకముఖముతో పాటలవర్ణము (ఎరుపు-తెలుపు కలిసిన వర్ణము) లో భాసిల్లుచున్నది.  ఈ తల్లి మనశరీరంలోని చర్మధాతువు (త్వక్) నందు శక్తిని ప్రసాదించును. పాయసాన్నము అనిన ఈ దేవతకు ఇష్టము.  ఈ విశుద్ధిచక్రంలోని పదహారు దళములందు గల పదహారు దేవతలు డాకినీ దేవతను సేవిస్తూ ఉంటారు. ఈ పదహారు మంది మాతృకావర్ణములలోని అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ౠ ఌ ౡ ఎ ఐ ఒ ఔ అను పదహారు అక్షరములకు అధిదేవతలు.   వారు:-   1. అమృతా, 2. ఆకర్షిణి, 3. ఇంద్రాణి, 4.ఈశాని, 5. ఉమా, 6. ఊర్థ్వకేశి, 7. ఋద్ధిర, 8. ౠకార, 9. ఌకార, 10. ౡకార, 11. ఏకపదా, 12. ఐశ్వర్యా, 13. ఓంకారి, 14. ఔషధి, 15. అంబికా, 15. అఃక్షర.


100వ శ్లోకము:-


అనాహతాబ్జ నిలయా శ్యామాభావదన ద్వయా|


దంష్ట్రోజ్జ్వలాఽక్షమాలాది ధరా రుధిర సంస్థితా॥100॥


101వ శ్లోకము:-


కాళరాత్ర్యాదిశక్త్యౌఘ వృతా స్నిగ్ధౌదన ప్రియా|


మహావీరేంద్రవరదా రాకిణ్యంబా స్వరూపిణీ॥101॥


హృదయస్థానము నందున్న అనాహతచక్రములో గల  పండ్రెండు (12) దళముల పద్మము మధ్యగల కర్ణికలో రాకినీదేవి రెండు ముఖములతో శ్యామలవర్ణము (ఎరుపుతో కూడిన నలుపు) లో భాసిల్లుచున్నది.  ఈ తల్లి మనశరీరంలోని రక్త ధాతువు నందు శక్తిగా ఉన్నది. నేతితో  కలిపిన అన్నము ఈమెకు ఇష్టము. ఈ అనాహతచక్రంలోని పండ్రెండు దళములందు గల పండ్రెండు దేవతలు రాకినీ దేవతను సేవిస్తూ ఉంటారు. ఈ పండ్రెండు దేవతలు మాతృకావర్ణములలోని క ఖ గ ఘ ఙ చ ఛ జ ఝ ఞ ట ఠ అను పండ్రెండు అక్షరములకు అధిదేవతలు.   వారు 1. కాళరాత్రి, .2. ఖాతీత, 3. గాయత్రి, 4. ఘంటాధారిణి, 5. ఙామిని, 6. చంద్ర, 7. ఛాయా, 8. జయా, 9. ఝంకారి, 10. ఙ్ఞానరూపా, 11. టంకహస్తా, 12. ఠంకారిణి.


102వ శ్లోకము


మణిపూరాబ్జ నిలయా, వదనత్రయ సంయుతా|


వజ్రాధికాయుధోపేతా, డామర్యాదిభి రావృతా॥102॥


రక్తవర్ణా, మాంసనిష్ఠా, గుడాన్న ప్రీతమానసా|


సమస్త భక్తసుఖదా, లాకిన్యంబా స్వరూపిణీ॥103॥


నాభిస్థానమునందున్న మణిపూరచక్రములో పది దళముల పద్మమందలి  మధ్య కర్ణికలో లాకినీదేవి మూడు ముఖములతో ఎరుపు వర్ణములో విరాజిల్లుచున్నది.  ఈ తల్లి మనశరీరంలోని మాంసధాతువు నందు శక్తిగా ఉన్నది. ఈమెకు బెల్లము  కలిపిన అన్నము అనిన ఇష్టము. ఈ మణిపూరచక్రంలోని పద్మమునకు పది దళములు ఉంటాయి. ఈ పది దళములందు గల పది దేవతలు లాకినీ దేవతను సేవిస్తూ ఉంటారు. ఈ పది దేవతలు మాతృకావర్ణములలోని డ ఢ ణ త థ ద ధ న ప ఫ అను పది అక్షరములకు అధిదేవతలు. వారు :- 1.డామరి, 2. ఢంకారిణి, 3. ణామిరి, 4. తామసి, 5. స్థాణ్వి, 6. దాక్షాయిణి, 7. ధాత్రి, 8. నందా, 9. పార్వతి, 10. ఫట్కారిణి


104వ శ్లోకము


స్వాధిష్ఠానాంబు జగతా, చతుర్వక్త్ర మనోహరా|


శూలాద్యాయుధ సంపన్నా, పీతవర్ణాఽతిగర్వితా॥104॥


105వ శ్లోకము


మేదోనిష్ఠా, మధుప్రీతా, బందిన్యాది సమన్వితా|


దధ్యన్నాసక్త హృదయా, కాకినీ రూపధారిణీ॥105॥


ఉదరస్థానము నందున్న స్వాధిష్ఠానచక్రములో ఆరు దళముల పద్మమునందు మధ్య కర్ణికలో కాకినీదేవి నాలుగు ముఖములతో పచ్చని వర్ణములో భాసిల్లుచున్నది.  ఈ దేవత మనశరీరంలోని మేధస్సు ధాతువు నందు శక్తిగా ఉన్నది. ఈమెకు పెరుగు కలిపిన అన్నము అనిన ఇష్టము. ఈపద్మములోని ఆరు దళములందు గల ఆరు దేవతలు కాకినీ దేవతను సేవిస్తూ ఉంటారు. ఈ ఆరు దేవతలు మాతృకావర్ణములలోని బ భ మ య ర ల అను ఆరు అక్షరములకు అధిదేవతలు.  వారు:- 1. బందిని, 2. భద్రకాళి, 3. మహామాయ, 4. యశస్విని, 5. రమా, 6. లంబోష్టితా.


106వ శ్లోకము


మూలా ధారాంబుజారూఢా, పంచవక్త్రాఽస్థి సంస్థితా|


అంకుశాది ప్రహరణా, వరదాది నిషేవితా॥106॥


107వ శ్లోకం (మొదటి పాదం)


ముద్గౌదనాసక్త చిత్తా, సాకిన్యంబాస్వరూపిణీ| (107వ శ్లోకం, మొదటిపాదము)


పిరుదుల స్థానమునకు పైన, జననేంద్రియ స్థానమునకు క్రిందను గల మూలాధార చక్రములో నాలుగు దళముల పద్మమందలి కర్ణికలో సాకినీదేవి నాలుగు ముఖములతో దూమ్ర వర్ణములో భాసిల్లుచున్నది.  ఈ తల్లి మనశరీరంలోని అస్థి (ఎముకల) ధాతువు నందు శక్తిగా ఉన్నది. ఈమెకు పప్పు కలిపిన అన్నము అనిన ఇష్టము.  ఈ మూలాధార చక్రంలోని పద్మమునకు నాలుగు దళములు ఉంటాయి. ఈ నాలుగు దళములందు గల నాలుగు దేవతలు సాకినీ దేవతను సేవిస్తూ ఉంటారు. ఈ నాలుగు దేవతలు మాతృకావర్ణములలోని  వ శ ష స అను నాలుగు అక్షరములకు అధిదేవతలు.  వారు:- 1. వరదా, 2. శ్రీ, 3. షండా, 4. సరస్వతి.


107వ శ్లోకం (రెండవ పాదము)


ఆఙ్ఞా చక్రాబ్జనిలయా, శుక్లవర్ణా, షడాననా॥107॥ (రెండవ పాదము)


మజ్జాసంస్థా, హంసవతీ ముఖ్యశక్తి సమన్వితా|


హరిద్రాన్నైక రసికా, హాకినీ రూపధారిణీ॥108॥


భ్రూమధ్యమునందు గల ఆఙ్ఞా  చక్రము. ఇది గంగ, యమున, సరస్వతి సంగమ స్థానము. ఇడ, పింగళ, సుషుమ్నసంగమ స్థానము, వాగ్భవ కూటమి, కామరాజ కూటమి, శక్తి కూటమి సంగమస్థానము, చంద్రఖండము, సూర్యఖండము, అగ్నిఖండము సంగమ స్థానము, చంద్రమండలము, సూర్యమండలము, అగ్నిమండలము సంగమ స్థానము. 

ఇక్కడ గల ద్విదళ పద్మమునందు హాకినీ దేవి రూపములో భ్రూమద్యస్థానమందున్న ఆఙ్ఞా  చక్రములో  రెండు దళములుగల పద్మము యొక్క కర్ణిక యందు ఆరు ముఖములతో శుక్ల (తెల్లని) వర్ణము కలిగి భాసిల్లుతున్నది.

ఈ దేవి మజ్జ (ఎముకల మద్య ఉండు) ధాతువు నందు శక్తి రూపమై ఉంటుంది. ఈమెకు పసుపుఅన్నము (పులిహోర) అనిన ఇష్టము. ఇక్కడ హంసవతీ, క్షమావతి అను ఇద్దరు శక్తి దేవతలు హాకినీ దేవిని సదా సేవిస్తూ ఉంటారు. భ్రూమధ్యమునందు హ క్ష అను అక్షరములతోబాటు మధ్య ళ (ద్రవిడభాషల ప్రకారము) అను అక్షరముగూడ గలదని కొందరు పండితులుచెబుతుంటారు.


ఇంతవరకూ మనం తెలుసుకున్న వివరముల ప్రకారం



విశుద్ధి చక్రంలో         -  16


అనాహత చక్రంలో   -   12


మణిపూర చక్రంలో  -    10


స్వాధిష్ఠాన చక్రంలో  -      6


మూలాధార చక్రంలో -     4


ఆజ్ఞా చక్రంలో           -        2


వెరసి 50 అక్షరములు, 50 దేవతలు


(కాని ఆజ్ఞా చక్రంలో హ, క్ష అను అక్షరముల మాత్రమేగాక ద్రవిడ భాషలప్రకారం మధ్యలో ళ అను అక్షరం కూడా తీసుకొనవచ్చునని విజ్ఞులు వివరించారు) 


గనుక వెరసి అక్షరములు 51 గా భావించవచ్చును.


వీటినే పంచాశత్పీఠములు  అందురు. ఆయాపీఠములలో ఆయాదేవతల రూపంలో పరమేశ్వరి విరాజిల్లుతున్నది గనుక అమ్మవారు పంచాశత్పీఠరూపిణీ యని అనబడినది.


ఇక్కడ ఒక సందేహం రావచ్చు. విశుద్ధిచక్రం నుండి క్రిందికి వచ్చి మరల ఆజ్ఞాచక్రమును చెప్పుకొనుటలో ఔచిత్యమేమిటి అనగా, ఇక్కడి వివరణ: 


మాతృకావర్ణ వివరణ అ కారం నుండి ప్రారంభ అయినది గనుక, కంఠస్థానములో నున్న విశుద్ధిచక్రం నుండి వివరణ ప్రారంభమయినది. భ్రూమధ్యంలో గల ఆజ్ఞాచక్రంలో గల    హ క్ష అను అక్షరములు చివరలో చెప్పబడినవి గనుక మూలాధార చక్ర వివరణ అయిన తరువాత ఆజ్ఞాచక్రవివరణ చెప్పబడినది.


వేరొక కారణమేమిటి అంటే - కంఠస్థానములో నున్న విశుద్ధిచక్రము ఆకాశతత్త్వము, తరువాత అనాహతచక్రము వాయుతత్త్వము, ఆ తరువాత మణిపూర చక్రము అగ్నితత్త్వము, స్వాధిష్ఠాన చక్రము జలతత్త్వము, మూలాధార చక్రము పృథ్వీతత్త్వము. అందుచే పంచభూతముల క్రమం ప్రకారం ఈ  వివరణలో విశుద్ధిచక్రం నుండి ప్రారంభించడమైనది.  చివరగా వివరించిన ఆజ్ఞాచక్రము మనస్సుకు సంబంధించినది. శరీరంలోని పంచభూతములను నియంత్రించేది ఆజ్ఞాచక్రము. అందుచే వివరణ ఈ క్రమంలో జరిగినది.


జగన్మాతకు నమస్కరించునపుడు ఓం పంచాశత్పీఠరూపిణ్యై నమః అని అనవలెను.

[05:13, 03/03/2021] +91 95058 13235: శ్రీమాత్రేనమః


శ్రీలలితా సహస్రనామ భాష్యము


258వ నామ మంత్రము 03.03.2021


ఓం స్వపన్త్యై నమః


ఆత్మచైతన్యము సూక్ష్మభూతములతో కలిసి, తైజసుడుగా చెప్పబడుచూ, ఇంద్రియములు విశ్రాంతిబొందు నిద్రావస్థయందు, మనసు ఇంద్రియ కార్యములను నిర్వర్తించు స్వప్నావస్థయందుండు పరమేశ్వరికి నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి స్వపన్తీ  యను మూడక్షరముల (త్ర్యక్షరీ) నామమంత్రమును ఓం స్వపన్త్యై నమః అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను భక్తిశ్రద్ధలతో ఉపాసించు సాధకునికి ఆ తల్లి కరుణచే సర్వాభీష్టసిద్ధి కలుగును.


నిద్రావస్థయందు ఇంద్రియములు విశ్రాంతి తీసుకుంటూ ఉంటాయి. కాని మనసు మాత్రం ఇంద్రియములు చేయు పనిని నిర్వర్తిస్తూ ఉంటుంది. ఆ సమయంలో మనసు మేలుకొని ఉంటుంది. ఎక్కడికో నడచి వెళ్ళినట్లు, ఏవేవో చూసినట్లు, ఎవరితోనో మాట్లాడినట్లు, ఏదో నందనోద్యానవనంలో సుమసౌరభాలను ఆఘ్రాణించినట్లు, మంచి మంచి ఫలములు తినినట్లు అనిపిస్తుంది. నిద్రావస్థలో ఇంద్రియములు విశ్రాంతినందుతుంటే, కన్ను, నోరు, ముక్కు, చెవి, కాళ్ళు, చేతులు చేయుపనులను మనసే చేస్తుంది. దీనిసే స్వప్నావస్థ అంటారు. ఇది సూక్ష్మశరీరానికి సంబంధించినది. ఆ సమయంలో బాహ్యజగత్తులో వేరొకరికి గోచరించవు. జాగ్రదావస్థలో ఇంద్రియములకు ఉండు స్థిరమైన జ్ఞానము స్వప్నివస్థలో ఉండదు. ఉదాహరణకు స్వప్నంలో భయంకరమైన దృశ్యం చూడడం, కెవ్వున అరవడం జరుగుతుంది. అంతటితో మెలకువ వచ్చేస్తుంది బాహ్యజగత్తులో ఆ భయంకరమైన దృశ్యం గోచరించదు. కొన్ని సార్లు జీవితంలో చూడనవి, అనుభవించనివి, చేయనివి కూడా స్వప్నావస్థలో జరుగుతాయి. జరుగుతూ జరుగుతూ ఉండగా మెలుకవ వస్తే అవన్నీ చెదరిపోతాయి. అంటే స్వప్నావస్థలో ఇంద్రియజ్ఞానం అస్థిరము అన్నమాట.  మళ్ళీ చూడాలంటే కూడా అసాధ్యమే. దీనినే స్వప్నావస్థ అంటారు. ఇది కేవలము మానసిక వ్యాపారము మాత్రమే.  అది స్థూలశరీరానికి చెందినది కాదు. సూక్ష్మశరీరానికి చెందినది మాత్రమే.  ఇటు వంటి సూక్ష్మశరీరాను భూతికి బాహ్యజగత్తులోని వారు ఎవరూ సాక్షీభూతులు కానేరరు. కాని జగన్మాత మాత్రము స్వప్నావస్థలో కలిగిన అనుభూతులకు సాక్షీభూతురాలుగా ఉంటుంది గనుక అమ్మవారు స్వపన్తీ యని అనబడినది. ఆత్మచైతన్యము సూక్ష్మభూతములతో కలిసియుండేదే స్వప్నావస్థ.


జగన్మాతకు నమస్కరించునపుడు ఓం స్వపన్త్యై నమః అని అనవలెను.

[05:13, 03/03/2021] +91 95058 13235: 03.03.2021  ప్రాతః కాల సందేశము


వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం


దశమస్కంధము - పూర్వార్ధము -  నలుబది ఏడవ అధ్యాయము


గోపికలతో ఉద్ధవుని సంభాషము - భ్రమరగీతలు


🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

ఉద్దవుని ద్వారా గోపవనితలకు శ్రీకృష్ణభగవానుడు పంపిన సందేశము


47.31 (ముప్పది ఒకటవ శ్లోకము)


ఆత్మా జ్ఞానమయః శుద్ధో వ్యతిరిక్తోఽగుణాన్వయః|


సుషుప్తిస్వప్నజాగ్రద్భిర్మాయావృత్తిభిరీయతే॥10128॥


మాయగాని, దాని కార్యములుగాని ఆత్మను అంటవు. అది విశుద్ధజ్ఞానస్వరూపము. అది జడప్రకృతికిని, అనేక జీవులయొక్క అవాంతర భేదములకును అతీతమైనది. త్రిగుణములు దానిని స్పృశింపవు. 'సుషుప్తి, స్వప్నము, జాగ్రదవస్థ' అనునవి మాయావృత్తులు. వాటిద్వారా అఖండ, అనంత బోధస్వరూపమైన ఈ ఆత్మ వేర్వేఱు సమయములయందు, ప్రాజ్ఞ, తైజస, విశ్వరూపములలో ప్రతీతమగుచుండును.


47.32 (ముప్పది రెండవ శ్లోకము)


యేనేంద్రియార్థాన్ ధ్యాయేత మృషా స్వప్నవదుత్థితః|


తన్నిరుంధ్యాదింద్రియాణి వినిద్రః ప్రత్యపద్యత॥10129॥


నిద్రించినపుడు కలలోగాంచిన దృశ్యములు అన్నియును నిజముగా తోచును. కాని, మేలుకొనిన పిమ్మట అవి అన్నియును అసత్యములని బోధపడును. అట్లే తత్త్వమును ఎఱుగక ముందు సమస్తమైన ఇంద్రియ సుఖములను నిత్యములని భ్రమపడినను, మనోనిగ్రహము ద్వారా తత్త్వము బోధపడిన పిదప ప్రాపించిక విషయములు అన్నియును స్వప్నదృశ్యములవలె అసత్యములని ఎఱుకయగును. ఈ విధముగా జగత్తు అంతయును స్వప్నసదృశమని భావించి, విషయాసక్తిని వీడి నా యందే మనస్సును లగ్నము చేయవలెను.


47.33 (ముప్పది మూడవ శ్లోకము)


ఏతదంతః సమామ్నాయో యోగః సాంఖ్యం మనీషిణామ్|


త్యాగస్తపో దమః సత్యం సముద్రాంతా ఇవాపగాః॥10130॥


నదీనదములు అన్నియును వేర్వేఱు దిశలలో ప్రవహించినను, అవి అన్నియును సముద్రమును చేరుటతో అంతమగును. అంతటితో వాటి నామ, రూపభేదములు అంతరించును. అట్లే జ్ఞాని (మనస్వి) యొక్క వేదాభ్యాసము, యోగసాధనము, ఆత్మానాత్మ వివేకము, త్యాగము, తపస్సు, ఇంద్రియనిగ్రహము, సత్యము మొదలగు సకల ధర్మములు మున్నగునవి అన్నియును అతడు నన్ను పొందుటతో సమాప్తములగును. ఈ సాధనముల ఫలము నా సాక్షాత్కారప్రాప్తియే.


47.34 (ముప్పది నాలుగవ శ్లోకము)


యత్త్వహం భవతీనాం వై దూరే వర్తే ప్రియో దృశామ్|


మనసః సన్నికర్షార్థం మదనుధ్యానకామ్యయా॥10131॥


నేను మీ నయనములకు ధ్రువతారను. మీ జీవితములకు సర్వస్వమును, కాని, మీరు నన్ను నిరంతరము ధ్యానించుచుండుటకే నేను మీకు దూరముగా ఉంటిని. దూరమున ఉన్నప్పుడే నేను మీకు చేరువలో ఉన్నట్లు మీరు మానసికానుభవమును పొందుచుండుటయేగాక, నా పట్లగల ప్రేమ మరింతగా దృఢము కాగలదు.


47.38 (ముప్పది ఐదవ శ్లోకము)


యథా దూరచరే ప్రేష్ఠే మన ఆవిశ్య వర్తతే|


స్త్రీణాం చ న తథా చేతః సన్నికృష్టేఽక్షిగోచరే॥10132॥


తమకు దూరముగా వెళ్ళిన ప్రియునియందు  స్త్రీలకు ఏరీతిగా మనస్సు ఏకాగ్రము చెంది నిలకడగా నిలుచునో, అదేరీతిగా కనులకు దగ్గరగా కనబడేవారిపై మనస్సు నిలువదు.


47.36 (ముప్పది ఆరవ శ్లోకము)


మయ్యావేశ్య మనః కృత్స్నం విముక్తాశేషవృత్తి యత్|


అనుస్మరంత్యో మాం నిత్యమచిరాన్మాముపైష్యథ॥10133॥


మీ మనస్సులను పూర్తిగా ఇతర వృత్తులనుండి మరల్చి, నా యందే లగ్నమొనర్చి, నిరంతరము నన్ను స్మరించుచుండుడు. అప్పుడు మీరు నన్ను శీఘ్రముగనే పొందుదురు.


47.37 (ముప్పది ఏడవ శ్లోకము)


యా మయా క్రీడతా రాత్ర్యాం వనేఽస్మిన్ వ్రజ ఆస్థితాః|


అలబ్ధరాసాః కల్యాణ్యో మాఽఽపుర్మద్వీర్యచింతయా॥10134॥


సౌభాగ్యవతులారా! శరత్కాలరాత్రియందు బృందావనమున నేను రాసక్రీడలు సలుపుచున్నప్పుడు కొందఱు గోపాంగనలు తమ వారిచే నిరోధింపబడి నాతో రాసక్రీడలు సలుపజాలకపోయిరి. ఐనను వారు గోకులములోనే ఉన్నప్పటికిని నా లీలాప్రభావమును చింతించుచుండుటచే వారు నన్ను పొందగలిగిరి. మీరు గూడ నన్ను తప్పక పొందగలరు. నారాశపడవలదు".


శ్రీశుక ఉవాచ


47.38 (ముప్పది ఎనిమిదవ శ్లోకము)


ఏవం ప్రియతమాదిష్టమాకర్ణ్య వ్రజయోషితః|


తా ఊచురుద్ధవం ప్రీతాస్తత్సందేశాగతస్మృతీః॥10135॥


శ్రీశుకుడు వచించెను పరీక్షిన్మహారాజా! తమకు ప్రియతముడైన శ్రీకృష్ణుని సందేశమును విని గోపికలు ఎంతయు ఆనందించిరి. ఆ ప్రభువుతో తమకుగల మధురస్మృతులను నెమరు వేసికొనుచు, వారు ఉద్ధవునితో ఇట్లు నుడివిరి.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి     నలుబది ఏడవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏


పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం

7702090319, 9505813235

[20:52, 03/03/2021] +91 95058 13235: 3.2.2021  సాయం కాల సందేశము


వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం


దశమస్కంధము - పూర్వార్ధము -  ముప్పది ఎనిమిదవ అధ్యాయము


అక్రూరుడు రథముపై గోకులమునకు చేరుట


🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉


38.15 (పదునైదవ శ్లోకము)


అథావరూఢః సపదీశయో రథాత్ప్రధానపుంసోశ్చరణం స్వలబ్ధయే|


ధియా ధృతం యోగిభిరప్యహం ధ్రువం నమస్య ఆభ్యాం చ సఖీన్ వనౌకసః॥9701॥


మహాత్ములును, పురుషోత్తములును ఐన బలరామకృష్ణులు దర్శనభాగ్యము కలిగిన వెంటనే రథము నుండి క్రిందికి దిగి, వారి చరణకమలములకు ప్రణమిల్లుదును. మహాయోగులు సైతము ఆత్మసాక్షాత్కారమునకై వారి పాదపద్మములను తమ హృదయములయందు నిలిపి నిరంతరము ధ్యానించుచుందురు. నేను మాత్రము ఆ మహానుభావుల పాదారవిందములను ప్రత్యక్షముగా దర్శించి, వాటిపై సాగిలపడుదును. అంతేగాదు వారి మిత్రులైన గోపాలురకును నమస్కరింతును.


38.16 (పదునారవ శ్లోకము)


అప్యంఘ్రిమూలే పతితస్య మే విభుః శిరస్యధాస్యన్నిజహస్తపంకజమ్|


దత్తాభయం కాలభుజంగరంహసా  ప్రోద్వేజితానాం శరణైషిణాం నృణామ్॥9702॥


నేను శ్రీకృష్ణుని సన్నిధికి చేరి, సాష్టాంగముగా నమస్కరించి, ఆ ప్రభువు పాదారవిందములకు ప్రణమిల్లెదను. అప్పుడు ఆ పురుషోత్తముడు తన అమృతహస్తమును నా శిరస్సుపై ఉంచి, కృపతో నిమురుచు నాకు తప్పక అభయమునిచ్చును. ఏలయన, అనుక్షణము వేగముగా వెంటాడుచుండెడి మృత్యువు అనెడి సర్పధాటికి తపించుచు శరణుజొచ్చుచుండెడి భక్తులయొక్క భయమును తొలగించుచుండెడిది గదా, ఆ స్వామియొక్క దివ్యహస్తము!


38.17 (పదిహేడవ శ్లోకము)


సమర్హణం యత్ర నిధాయ కౌశికస్తథా బలిశ్చాప జగత్త్రయేంద్రతామ్|


యద్వా విహారే వ్రజయోషితాం శ్రమం స్పర్శేన సౌగంధికగంధ్యపానుదత్॥9703॥


శ్రీహరి (శ్రీకృష్ణుని) హస్తము మహిమాన్వితమైనది. అట్టి హస్తమునందు పూర్వము ఇంద్రుడును, బలిచక్రవర్తియు భక్తిశ్రద్ధలతో పూజాద్రవ్యములను సమర్పించి, ముల్లోకాధిపత్యమును పొందగలిగిరి. సౌగంధిక పుష్పమువలె పరిమళభరితమైన ఆ కరముయొక్క స్పర్శచేతనే ఆ స్వామి రాసలీలా విహారములయందు గోపాంగనల బడలికలను తొలగించెను.


38.18 (పదునెనిమిదవ శ్లోకము)


న మయ్యుపైష్యత్యరిబుద్ధిమచ్యుతః కంసస్య దూతః ప్రహితోఽపి విశ్వదృక్|


యోఽన్తర్బహిశ్చేతస ఏతదీహితం క్షేత్రజ్ఞ ఈక్షత్యమలేన చక్షుషా॥9704॥


తన యెడ వైరభావమును కలిగియున్న కంసుడు పంపుటవలన నేను తన కడకు దూతగా వచ్చితినని ఎఱింగియు, ఆ స్వామి నాపై ఏ మాత్రమూ శత్రుభావమును కలిగియుండడు. ఏలయన, అతడు సర్వసాక్షి; అనగా  ఆ ప్రభువు సకల జనుల హృదయములయందును అంతర్యామియై విలసిల్లుచు వారి సదసద్భావములను గుర్తించునట్టి క్షేత్రజ్ఞుడు, వికారరహితుడు. నేను బాహ్యముగా కంసుని దూతనే యైనను, త్రికరణశుద్ధిగా ఆ మహాత్మునకు పరమ భక్తుడను. కనుక జ్ఞానస్వరూపుడైన ఆ దేవదేవుడు ఎట్టి సంకోచ భావమునకును తావీయక నన్ను అనుగ్రహదృష్టితోనే చూచును.


38.19 (పందొమ్మిదవ శ్లోకము)


అప్యంఘ్రిమూలేఽవహితం కృతాంజలిం మామీక్షితా సస్మితమార్ద్రయా దృశా|


సపద్యపధ్వస్తసమస్తకిల్బిషో  వోఢా ముదం వీతవిశంక ఊర్జితామ్॥9705॥


నేను అంజలి ఘటించి వినమ్రుడనై, ఆ స్వామిపాదములచెంత మోకరిల్లెదను. అప్పుడు ఆ ప్రభువు దరహాసమొనర్చుచు దయార్ధ్ర హృదయుడై తన చల్లని చూపులను నాపై ప్రసరింపజేయును. పాపములు అన్నియును అప్పుడు నశించిపోవును. నేను నిస్సందేహముగా అంతులేని ఆనందమున మునిగెదను.


 38.20 (ఇరువదియవ శ్లోకము)


సుహృత్తమం జ్ఞాతిమనన్యదైవతం దోర్భ్యాం బృహద్భ్యాం పరిరప్స్యతేఽథ మామ్|


ఆత్మా హి తీర్థీక్రియతే తదైవ మే బంధశ్చ కర్మాత్మక ఉచ్ఛ్వసిత్యతః॥9706॥


నేను ఆ మహాత్ముని వంశమునకు చెందినవాడను, ఆయనకు హితైషిని. ఆ పురుషోత్తముడే నాకు పరమదైవము. కనుక నేను ఆయన పాదములపై వ్రాలినంతనే ఆ మహానుభావుడు తన దీర్ఘబాహువులతో నన్ను ఆత్మీయముగా అక్కున జేర్ఛుకొనును. ఆ దివ్యస్పర్శతో నేను పునీతుడనయ్యెదను. అంతేగాక నా శరీరము ఇతరులను పవిత్రము చేయునదగును. తద్ద్వారా కర్మబంధములన్నియు నశించిపోవును.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి     ముప్పది ఎనిమిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏


పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం

7702090319, 9505813235

[04:57, 04/03/2021] +91 95058 13235: శ్రీమాత్రేనమః


శ్రీలలితా సహస్రనామ భాష్యము


834వ నామ మంత్రము 04.03.2021


ఓం విశృంఖలాయై నమః


కర్మబంధములు, విధినిషేధములు లేక సర్వ స్వతంత్రురాలుగాను, దిగంబర స్వరూపురాలిగాను భాసిల్లు  పరమేశ్వరికి నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి విశృంఖలా యను నాలుగక్షరముల నామ మంత్రమును ఓం విశృంఖలాయై నమః అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను భక్తిశ్రద్ధలతో ఉపాసించు సాధకుడు  జీవనగమ్యంలో కొనసాగించు సత్కర్మలకు ఏర్పడు ప్రతిబంధకములు నిరోధింపడి, తలచిన కార్యములు నిర్విఘ్నము నెరవేరినవాడగును


ఐహిక బంధములే సంసార శృంఖలములు. జగన్మాత ప్రసాదించు జ్ఞానజ్యోతులచే భక్తుల సంసార శృంఖలములు ఛేదింపబడును. యోగులకు వారి యోగసాధనలో బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథి, రుద్రగ్రంథి యను శృంఖలములు త్రెంచబడి సహస్రారమునకు చేరు మార్గము సుగమము అగును. పాపకర్మలు చేయుటచే నీచపుజన్మలు మరల మరల కలుగుచునేయుండును. అట్లే పుణ్యకర్మలు చేసినను మంచిజన్మలు కలుగుచునేయుండును గాని జన్మరాహిత్యమైన ముక్తి లభించదు.. పరమేశ్వరి యందు సంపూర్ణమైన ధ్యానదీక్ష కలిగి, కేవలము ముక్తియే తమ పరమార్థంగా సాధనచేయు సాధకులకు శ్రీమాత జన్మరాహిత్యమైన కైవల్యమును ప్రసాదించి పునరపిజననం, పునరపిమరణం అను  శృంఖలములను ఛేదింపజేయును గనుకనే ఆ తల్లి విశృంఖలా యని అనబడినది.


అలంపురి జోగులాంబ వంటి కొన్ని శక్తిపీఠములలో నగ్నమూర్తులు గలవు. విశృంఖలా యను పదమునకు దిగంబరి యను అర్థమున్నది. గనుకనే జగన్మాత విశృంఖలా యని అనబడినది. ఎముకలు, మాంసము, రక్తము నింపిన తోలుతిత్తివంటిది ఈ శరీరము. అటువంటి తోలుతిత్తికి అలంకరింపబడిన వస్త్రములు, సుగంధభరితములైన పుష్పమాలలు, కాంచనమణి భూషణములు వంటి అలంకారములు మనోవికారములను పెల్లుబికించే అజ్ఞాన శృంఖలములవంటివి. పరబ్రహ్మస్వరూపిణియైన జగన్మాత తానొక జ్ఞానజ్యోతిగా ఆ శృంఖలములను తెగటార్చి కైవల్యమార్గము దిశగా సాధకులను నడిపించును గనుక పరమేశ్వరి విశృంఖలా యని అనబడినది.


జగన్మాతకు నమస్కరించునపుడు ఓం విశృంఖలాయై నమః అని అనవలెను.

[04:57, 04/03/2021] +91 95058 13235: శ్రీమాత్రేనమః


శ్రీలలితా సహస్రనామ భాష్యము


259వ నామ మంత్రము 04.03.2021


ఓం తైజసాత్మికాయై నమః


జీవుల సమిష్టి రూపుణ్ణి తైజసుడు అంటారు. ఈ జగత్తు అంతా ఆయన స్వప్నమే. తైజసుని అనగా హిరణ్యగర్భుని ఆత్మస్వరూపిణిగా తేజరిల్లు జగన్మాతకు నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి తైజసాత్మికా యను ఐదక్షరముల (పంచాక్షరీ) నామ మంత్రమును ఓం తైజసాత్మికాయై నమః అని ఉచ్చరించుచూ, ఆ శ్రీమాతను అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధించు భక్తులకు ఆ పరమేశ్వరి అంతులేని బ్రహ్మజ్ఞాన సంపదలు, భౌతిక పరమైన శాంతిసౌఖ్యములు ఆ పరమేశ్వరి ప్రసాదించును.


ఆత్మచైతన్యము సూక్ష్మభూతములతో కలిసినప్పుడు  తైజసుడు అని యందురు. అనగా స్వప్నమును పొందిన జీవునకు తైజసుడని పేరు. ఆ జీవుల సమిష్టి స్వరూపునకు హిరణ్యగర్భుడు అనగా విరించి అనగా త్రిమూర్తములో ఒకడైన బ్రహ్మ.  పరబ్రహ్మ స్వరూపిణియైన జగన్మాత తైజసుని ఆత్మగా తేజరిల్లుతున్నది గనుక తైజసాత్మికా యని అనబడినది.   తైజసుడు అంతర్ముఖ చేతనుడు. అనగా నిద్రావస్థలో ఇంద్రియములు విశ్రాంతినందుతుంటే, మనసు ఇంద్రియముల కార్యములు నిర్వహించుచుండును. ఆ స్థితిలో బాహ్యప్రపంచములో నున్నవారికి ఆ మనసు నిర్వర్తించు ఇంద్రియ కార్యములు గోచరించవు. తైజసుడు  స్వప్నంలో జరిగే విషయములను మాత్రమే గ్రహించ గలడు. పరమేశ్వరి జీవుల స్వప్నసంబంధమైన విషయములను తైజసాత్మిక స్వరూపిణియై గ్రహిస్తుంది గనుక అమ్మవారు తైజసాత్మికా యని అనబడినది.


స్వప్నః స్థానో న్తః ప్రజ్ఞః సప్తాంగ ఏకోనవింశతి ముఖః|


ప్రవివిక్తభుక్ తైజసో ద్వితీయః పాదః ||


ఆత్మయొక్క రెండవ పరిమాణం తైజసుడు అనబడుతున్నాడు. దీని చేతన అంతర్ముఖమైనది. ఏడు అవ్యవాలు, పందొమ్మిది నోళ్ళుగల తైజసుడు స్వప్నావస్థలో మానసిక లోకాన్ని అనుభవిస్తాడు


తైజసుడు కూడా రెండు విధములైన పనులు చేయును.  మొదటిది బాహ్య పదార్థముల అనగా ఇంద్రియములకు విశ్రాంతినిచ్చును. ఇంద్రియకార్యములను మనసుచేత చేయించును. అనగా బాహ్య జ్ఞానము లేకుండా నిదురించునట్లు చేయును. రెండవది స్వప్నావస్థలో ఉన్న వ్యక్తికి మాత్రమే స్వప్నావస్థలోని పదార్థముల యొక్క అనుభవాన్ని కలుగజేయును.  అందుచేతనే  తైజసుడు ఉభయత్వం కలవాడు. ఉభయత్వమంటే మరొక అర్థం ఉన్నది. ఇద్దిరివలె చేయువాడు అని. ఒకపని వైశ్వానరుడివలె, మరొకటి  ప్రాజ్ఞుడివలె చేయువాడు కనుక తైజసుడు ఉభయత్వం కలవాడు అని చెప్పుకోవచ్చు. ఆ పనులు ఏమిటంటే పనులు వైశ్వానరుడు జాగ్రదావస్థలోదశలో పదార్థజ్ఞానాన్ని కల్గిస్తాడో అదే విధంగా తైజసుడు కూడా స్వప్నదశలోనూ పదార్థజ్ఞానాన్ని కల్గిస్తాడు. అయితే పదార్థజ్ఞానం మాత్రమే ఈ ఇరువురికీ సామ్యము.

ఇక రెండవ పని ఆంతః పదార్థ జ్ఞానము. ఇదేమిటంటే స్వప్నావస్థయందున్న వ్యక్తి మాత్రమే అనుభవించగలిగే పదార్థజ్ఞానాన్ని కల్గించడం, ఇక ఏమాత్రం బాహ్యపదార్థములపై దృష్టి లేకుండా చేయుట ప్రాజ్ఞుడిలాగా చేస్తాడు. ప్రాజ్ఞుడు సుషుప్తి నిర్వాహకుడు. బాహ్మస్మరణ లేకుండా చేసి ఆయా జీవికి తన స్వరూపాన్నే దర్శింపచేస్తాడు. ఈ అనుభవం కూడా ఏకవ్యక్తికిమాత్రమే. అలాగే తైజసుడు కూడా బాహ్యస్మరణ లేకుండా చేసి, ఆ వ్యక్తి మాత్రమే అనుభవించగలిగేట్టు పదార్థాలను సృష్టించి స్వాప్నానుభవం కలిగించుతాడు.


జగన్మాతకు నమస్కరించునపుడు ఓం తైజసాత్మికాయై నమః యని అనవలెను.

[04:57, 04/03/2021] +91 95058 13235: 04.03.2021  ప్రాతః కాల సందేశము


వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం


దశమస్కంధము - పూర్వార్ధము -  నలుబది ఏడవ అధ్యాయము


గోపికలతో ఉద్ధవుని సంభాషము - భ్రమరగీతలు


🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉


47.49 (నలుబది తొమ్మిదవ శ్లోకము)


సరిచ్ఛైలవనోద్దేశా గావో వేణురవా ఇమే|


సంకర్షణసహాయేన కృష్ణేనాచరితాః ప్రభో॥10146॥


47.50 (ఏబదియవ శ్లోకము)


పునః పునః స్మారయంతి నందగోపసుతం బత|


శ్రీనికేతైస్తత్పదకైర్విస్మర్తుం నైవ శక్నుమః॥10147॥


ఉద్దవ మహోదయా! శ్రీకృష్ణుడు బలరామసహితుడై ఈ బృందావనమున ఆవులను మేపుచు వేణుగానమొనర్చెను. ఆ స్వామి మురళీరవామృతముతో తడిసి, ఇచటి ఈ నదీతీరములు, పర్వతప్రాంతములు, వనప్రదేశములు అన్నియును పరమపునీతములైనవి. అట్టి వేణుగానలోలుని విడిచి, మేము ఎట్లు మనగలము? కృష్ణాను గ్రహముతో పవిత్రములైన ఈ నదులు మున్నగువానిని జూచినప్పుడెల్లను ఆ యశోదానందుల ముద్దులపట్టియే మాకు జ్ఞప్తికి వచ్చుచుండును. ఇచటి ప్రతి ధూళికణము శుభప్రదములైన ఆ స్వామి పాదముద్రల స్పర్శకు నోచుకొని ఎల్లరకును పూజ్యార్హమైనది. అట్టి పరమపురుషుని మేము మఱవజాలము.


47.51 (ఏబది ఒకటవ శ్లోకము)


గత్యా లలితయోదారహాసలీలావలోకనైః|


మాధ్వ్యా గిరా హృతధియః కథం తం విస్మరామహే॥10148॥


మహాత్మా! ఉద్ధవా! ఆ ప్రభువుయొక్క గంభీరమైన (ఇంపైన) నడకలు, మురిపించు చిఱునవ్వులు, విలాసశోభితములైన ఓరచూపులు, మధురమైన భాషణములు మా మనస్సులను, మా చిత్తములను మిగుల రంజింపజేసినవి. ఇప్పుడు మా మనస్సులు మా వశములో లేవు. అట్టి ప్రియతముని మేము ఎట్లు మఱచిపోగలము?"


47.52 (ఏబది రెండవ శ్లోకము)


హే నాథ హే రమానాథ వ్రజనాథార్తినాశన|


మగ్నముద్ధర గోవింద గోకులం వృజినార్ణవాత్॥10149॥


ఇట్లు ఉద్ధవునితో పలికిన పిదప గోపికలు ఆ కృష్ణప్రభువు తమ సమక్షముననే ఉన్నట్లుగా భావించుకొనుచు ఇట్లు విన్నవించుకొనిరి- "మాకు ప్రియతముడవైన కృష్ణా! నీవే మాకు ప్రాణనాథుడవు. నీవు లక్ష్మీనాథుడవే కావచ్చును. మా దృష్టిలో మాత్రము నీవు వ్రజనాథుడవే. అంతేగాదు మా గోపవనితలకు మాత్రము నీవు ఏకైక ప్రభుడవు. శ్యామసుందరా! నీవు పెక్కు పర్యాయములు మా సంకటములను తొలగించి, మా దుఃఖములను రూపుమాపితివి. గోవిందా! నీకు గోవులపైగల ప్రేమ అపారమైనది. మేము ఆ గోవులవంటి వారము కామా! గోపబాలురతో, యశోదా నందులతో, గోవులతో, గోపవనితలతో గూడిన ఈ గోకులమంతయును అనంతమైన దుఃఖసాగరములో మునిగియున్నది. నీవు స్వయముగా వచ్చి ఈ స్థితినుండి మమ్ము అందఱను ఉద్ధరింపుము.


శ్రీశుక ఉవాచ


47.53 (ఏబది మూడవ శ్లోకము)


తతస్తాః కృష్ణసందేశైర్వ్యపేతవిరహజ్వరాః|


ఉద్ధవం పూజయాంచక్రుర్జ్ఞాత్వాఽఽత్మానమధోక్షజమ్॥10150॥


శ్రీశుకుడు నుడివెను పరీక్షిన్మహారాజా! ఉద్ధవుని వలన శ్రీకృష్ణసందేశము వినిన పిమ్మట గోపికల విరహబాధలు తొలగిపోయెను. ఆ సందేశవచనములలోని పరమార్థమును బట్టి వారు 'ఇంద్రియాతీతుడైన శ్రీకృష్ణుని సర్వాంతర్యామియైన పరమాత్మునిగను, తమ ఆత్మస్వరూపునిగను గ్రహించిరి. అనంతరము ఆ గోపకాంతలు కృష్ణసందేశముద్వారా తమ మనస్తాపములను తీర్చిన ఉద్ధవుని సాదరముగా పూజించిరి.


47.54 (ఏబది నాలుగవ శ్లోకము)


ఉవాస కతిచిన్మాసాన్ గోపీనాం వినుదన్ శుచః|


కృష్ణలీలాకథాం గాయన్ రమయామాస గోకులమ్॥10151॥


ఉద్ధవుడు గోపికల విరహవ్యథను తొలగించుచు కొన్ని మాసములపాటు గోకులమునందే ఉండెను. అతడు శ్రీకృష్ణుని లీలలను గానము చేయుచు వ్రజవాసులను అందఱిని ఆనందింపజేసెను.


47.55 (ఏబది ఐదవ శ్లోకము)


యావంత్యహాని నందస్య వ్రజేఽవాత్సీత్స ఉద్ధవః|


వ్రజౌకసాం క్షణప్రాయాణ్యాసన్ కృష్ణస్య వార్తయా॥10152॥


ఉద్ధవుడు నందగోకులమునందు శ్రీకృష్ణుని అద్భుతలీలలను మధురముగా వినిపించుచు గడపిన పెక్కుమాసముల కాలము ఆ వ్రజవాసులకు ఒక్కక్షణమువలె తోచెను.


47.56 (ఏబది ఆరవ శ్లోకము)


సరిద్వనగిరిద్రోణీర్వీక్షన్ కుసుమితాన్ ద్రుమాన్|


కృష్ణం సంస్మారయన్ రేమే హరిదాసో వ్రజౌకసామ్॥10153॥


కృష్ణభక్తుడైన ఉద్ధవుడు అచటి నదీతీరములను, వనప్రదేశములను, గిరులను, లోయలను బాగుగా వికసించిన పూవులతో అలరారుచున్న వృక్షములను వీక్షించినప్పుడు ప్రతిప్రదేశమునందును కృష్ణలీలా వైభవములకు సంబంధించిన ప్రశ్నలద్వారా వ్రజవాసులకు కృష్ణస్మృతిని కలిగించుచు ఆనందించెను.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి     నలుబది ఏడవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏


పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం

7702090319, 9505813235

[21:13, 04/03/2021] +91 95058 13235: 04.03.2021  సాయం కాల సందేశము


వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం


దశమస్కంధము - పూర్వార్ధము -  నలుబది ఏడవ అధ్యాయము


గోపికలతో ఉద్ధవుని సంభాషము - భ్రమరగీతలు


🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉


47.57 (ఏబది ఏడవ శ్లోకము)


దృష్ట్వైవమాది గోపీనాం కృష్ణావేశాత్మవిక్లవమ్|


ఉద్ధవః పరమప్రీతస్తా నమస్యన్నిదం జగౌ॥10154॥


కృష్ణభక్త్యావేశముతో గోపికలు చిత్తవైకల్యమునకు లోనగుట చూచి, ఉద్ధవుడు వారి పరమభక్తికి ఎంతయు పరవశించి పోయెను. పిమ్మట అతడు వారికి నమస్కరించుచు ఇట్లు గానము చేయసాగెను.


47.58 (ఏబది ఎనిమిదవ శ్లోకము)


ఏతాః పరం తనుభృతో భువి గోపవధ్వో గోవింద ఏవ నిఖిలాత్మని రూఢభావాః|


వాంఛంతి యద్భవభియో మునయో వయం చ కిం బ్రహ్మజన్మభిరనంతకథారసస్య॥10156॥


సకల ప్రాణుల యందును కేవలము గోవిందుడే అంతరాత్మగా భాసిల్లుచున్నాడు అను భక్తిభావము స్థిరముగా గలవారు గోపికలు. అందువలన ఈ భూతలమున వారి జన్మలు సఫలములు. దుఃఖకారకములైన సంసార బంధములకు వెఱచి, వాటినుండి విముక్తిని గోరెడి ముముక్షువులకును (మోక్షేచ్ఛగలవారికిని), మహామునులకును, మావంటి సామాన్యభక్తులకును స్థిరమైన కృష్ణప్రేమభావమే వాంఛనీయము. వాస్తవముగా శ్రీకృష్ణుని లీలాకథామృతమును చవిచూచినవారికి ఉత్తమవంశమున జన్మించుటతోగాని, ద్విజాతి సముచిత సంస్కారములతో గాని, యజ్ఞయాగాదుల దీక్షతోగాని పనియేలేదు. కాని, భగవంతుని యొక్క కథామృతమును ఆస్వాదింపనివారు పెక్కు మహాకల్పములవరకు పదేపదే బ్రహ్మజన్మ (బ్రాహ్మణజన్మ) యెత్తినను వ్యర్థమే.


47.59 (ఏబది తొమ్మిదవ శ్లోకము)


క్వేమాః స్త్రియో వనచరీర్వ్యభిచారదుష్టాః కృష్ణే క్వ చైష పరమాత్మని రూఢభావః|


నన్వీశ్వరోఽనుభజతోఽవిదుషోపి సాక్షాచ్ఛ్రేయస్తనోత్యగదరాజ ఇవోపయుక్తః॥10156॥


ఈ గోపవనితలు యథార్థముగా ఉన్నతవంశమునకు చెందినవారుగాని, వర్ణాశ్రమ ధర్మములను ఎఱిగినవారుగాని కారు. పైగా శాస్త్రజ్ఞానము  ఏ కొంచమును లేనివారు. సత్సంగాది సాధనలకు నోచుకోని ఈ వనచరులెక్కడ? సచ్చిదానందరూపుడైన శ్రీకృష్ణభగవానునియందు నిశ్చలమైన అనన్యభక్తిభావము కలిగియుండుట ఎక్కడ? నిజముగా  మీరు మిగుల ధన్యలు. ఔషదప్రభావమును ఏమాత్రమూ ఎఱగకున్నను దానిని సేవించినవారికి చక్కని ఆరోగ్యము చేకూరునట్లు భగవంతునియొక్క స్వరూపమును గూర్చి, తత్త్వరహస్యమును గుఱించి ఎఱుగనివారు కూడ ఆ స్వామియెడ ఏవిధముగనైనను గాఢమైన భక్తిభావమును కలిగియున్నచో వారికి శ్రేయస్సులు ఒనగూడుట తథ్యము.


47.60 (అరువదియవ శ్లోకము)


నాయం శ్రియోఽఙ్గ ఉ నితాంతరతేః ప్రసాదః స్వర్యోషితాం నలినగంధరుచాం కుతోఽన్యాః|


రాసోత్సవేఽస్య భుజదండగృహీతకంఠలబ్ధాశిషాం య ఉదగాద్వ్రజవల్లవీనామ్10157॥


శ్రీకృష్ణుని తమ సర్వస్వముగా భావించిన గోపకాంతలు రాసక్రీడయందు ఆ ప్రభువుయొక్క సుకుమార బాహుస్పర్శను, ఆలింగన సౌఖ్యములను అనుభవించు భాగ్యమును పొందగల్గిరి. అట్టి అదృష్టము కమలముల పరిమళములను, శోభలను కలిగియున్న సురభామినులకుగాని, సర్వదా ఆ పరమపురుషుని వక్షస్థలమునందు నివసించుచుండెడి లక్ష్మీదేవికి గాని అబ్బలేదు. ఇంక ఇతర స్త్రీలకు ఎట్లు దక్కును? 


47.61 (అరువది ఒకటవ శ్లోకము)


ఆసామహో చరణరేణుజుషామహం స్యాం  వృందావనే కిమపి గుల్మలతౌషధీనామ్|


యా దుస్త్యజం స్వజనమార్యపథం చ హిత్వా  భేజుర్ముకుందపదవీం శ్రుతిభిర్విమృగ్యామ్॥10158॥^


గోపాంగనలు ఏమాత్రమూ త్యజించుటకు సాధ్యముకాని పతిపుత్రాది బంధుజనమును, లోకసహజమైన ధర్మమార్గమును విడిచిపెట్టి, శ్రీకృష్ణునియొక్క స్వభావ, రూప, గుణములను నిరంతరము స్మరించుచుండెడి అదృష్టముగలవారైరి. భగవద్వాణియైన వేదములు, ఉపనిషత్తులుగూడ ఇంతవఱకును ఆ పురుషోత్తముని స్వరూప స్వభావములను తెలిసికొనుటకు వెదకుచున్నవేగాని, పూర్తిగా గ్రహింపలేకపోయినవి. భక్తికి పరాకాష్ఠలైన అట్టి గోపికల పాదధూళిచే పునీతములైన బృందావనమునందలి పొదలు, తీగెలు, వృక్షములలో ఏదో ఒకదానినిగా, జన్మించు భాగ్యము  నాకు అబ్బినచో ఎంతబాగుండెడిది?


47.62 (అరువది రెండవ శ్లోకము)


యా వై శ్రియార్చితమజాదిభిరాప్తకామైర్యోగేశ్వరైరపి యదాత్మని రాసగోష్ఠ్యామ్|


కృష్ణస్య తద్భగవతశ్చరణారవిందం  న్యస్తం స్తనేషు విజహుః పరిరభ్య తాపమ్॥10159॥


శ్రీహరి (శ్రీకృష్ణుని) పాదములు మహిమాన్వితములు. అట్టి దివ్యపాదములను జగజ్జననియైన లక్ష్మీదేవి అనవరతము సేవించుచుండును. బ్రహ్మాదిదేవతలు, యోగీశ్వరులు భక్తితత్పరులై ఆ పవిత్ర పాదములను తమ హృదయములయందు ధ్యానించుచు సఫలమనోరథులైరి. అట్టి ఆ స్వామి చరణారవిందములను గోపికలు రాసలీలా సమయమునందు తమ వక్షస్థలములయందు నిలుపుకొని, ఆలింగనమొనర్చుకొని తమ విరహతాపములను చల్లార్చుకొనిరి.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి     నలుబది ఏడవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏


పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం

7702090319, 9505813235

[06:24, 05/03/2021] +91 95058 13235: శ్రీమాత్రేనమః


శ్రీలలితా సహస్రనామ భాష్యము


835వ నామ మంత్రము 05.03.2021


ఓం వివిక్తస్థాయై నమః 


జనులు లేని పవిత్రప్రదేశముల యందు లేదా ఆత్మానాత్మ వివేకము గల వారి యందు విలసిల్లు జగన్మాతకు నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి వివిక్తస్థా యను నాలుగక్షరముల చతురక్షరీ నామ మంత్రమును ఓం వివిక్తస్థాయై నమః అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని  ఆరాధించు భక్తులను ఆ తల్లి వారి మనస్సులందు పవిత్ర భావములు, వారి మాటలయందు పవిత్ర భాషణము, వారి చేతలలో సత్కర్మాచరణమును సుస్థాపితము జేస్తూ, వారి యునికితోనే వారుండుప్రదేశము ఒకపుణ్యక్షేత్రముగా భావింపజేస్తూ వారిని తరింపజేయును.


పరమేశ్వరి పరమేశుని రాణి. ఆ పరమేశ్వరుడు స్మశానవాటికయందు ఉంటాడు. ఎందుకో తెలుసా? ఈ మాటే పరమేశ్వరి పరమేశ్వరుని అడిగింది.     అందుకు పరమేశ్వరుడు ఇలాచెప్పాడు. పార్వతీ! మానవుడు  వజ్రవైడూర్యాది రత్నములు పొదిగిన కాంచనాభరణములు, భవనములు, రాజ్యములు, ధనరాశులు కూడబెడతాడు. జీవుడు పోతాడు అంటే భవనంలోంచి బయటకు తీసేస్తారు. ప్రాణాలు పోతే అందరూ స్మశానం వరకూ వస్తారు. గంధపుచెక్కలలో శరీరాన్ని పెట్టి, పుత్రునిచే నిప్పు పెట్టిస్తారు. అంతే అంతవరకూ వచ్చిన బంధుజనం అంతా స్మశానం విడిచి వెళ్ళిపోతారు. చివరకు కపాలమోక్షం కాగానే కొరవి పెట్టిన కొడుకు కూడా స్మశానం వదలి వెళ్ళిపోతాడు. ఆ కట్టెలలో కాలుతున్న దేహం దిక్కులేక కాలుతూ తనకోసం ఎవరూ లేరా అని ఏడుస్తూ ఉంటే, కనీసం నేనైనా ఉండవద్దా పార్వతీ! అని పరమేశ్వరికి పరమార్థాన్ని తెలియజేశాడు. అప్పటినుండి పరమేశ్వరికూడా అక్కడే ఆయనతో  ఉంటుంది. ఆయన వెండి కొండపైకి వెళ్ళినప్పుడు వెళుతూ, మళ్ళీ ఆయనతో వల్లకాటిలోనికే వస్తూ ఉంటుంది. అందుకే బ్రహ్మోపేంద్ర మహేంద్రాదులు ఆ అమ్మ దర్శనం కోసం వల్లకాటిలోనికే వస్తున్నారు. ఆ తల్లి ఎక్కడ ఉంటే అక్కడే పవిత్రత. ఆ వల్లకాడే విజనప్రదేశం. పరమేశ్వరుడున్న పవిత్రప్రదేశం. అటువంటి చోటనే అమ్మ ఉంటుంది.    వెండికొండ (కైలాసం కూడా) అంతే కదా. విజన ప్రదేశమేకదా. మనుష్యులు లేని ప్రదేశమంతయు పవిత్రమయినది అని హరీతస్మృతిలో చెప్పబడినది. అంటే? మనుష్యులు లేని ప్రదేశం పవిత్రమైనదని అర్థము. కారణం? నరుడు నడచిన మార్గంలో గడ్డికూడా ఎండి పోతుంది. ఒకసారి ఆది శంకరుడు భిక్షాటనముకు వెళ్ళాడు. బాగా పొద్దుపోయింది. ఒక ఇల్లాలు ఆయనకు భిక్షవేసినది. బాగా పొద్దుపోయింది. వెళ్ళవద్దు. ఊరి బయట మహాకాళి తిరుగుచున్నది. నరసంచారం అయితే ఆ తల్లికి కోపంవచ్చి చంపేస్తుంది అని చెప్పింది.  రాత్రి అయితే మరింత ప్రశాంతంగా ఉంటుందని పరమేశ్వరునితో  విహరిస్తూ ఉంటుంది. ఆ సమయంలో నరుడు కంటబడితే ఆమెకు కోపంవచ్చి నరుడిని చంపేసి కపాలం మెడలో వేసుకుంటుంది. అందుకని ఆది శంకరుడిని వెళ్ళవద్దంది. ఆ తల్లిచేతిలో చావైనా మహావరమని ఆదిశంకరుడు విజనప్రదేశంలో మహాకాళి సంచరిస్తున్న ప్రదేశానికి వెళతాడు.  మహాకాళి రూపంలో ఉన్న పరమేశ్వరి ఆదిశంకరుడిని చూసి హుంకరిస్తుంది. కళ్ళనుండి నిప్పులు కురిపిస్తుంది. తన చేతిలోని మహాఖడ్గాన్ని ఆదిశంకరునిపైకి తీసుకువెళుతుంది. అప్పుడు ఆదిశంకరులు కదలకమెదలక చిరునవ్వు నవ్వుతూ ఆ తల్లిని . మూకాంబికా స్తోత్రంతో శాంతపరచుతాడు. ఆ మహాకాళి ఉగ్రరూపం నుండి శాంతస్వరూపానికి మార్చుతాడు.  తల్లీ! నీవెక్కడ ఉంటే అక్కడే పవిత్రమైన ప్రదేశం. నిన్ను సేవించేవారెవరైననూ ఆత్మానాత్మ వివేకము గలవారగుదురు. నిన్ను దర్శించడానికి వచ్చేవారి చూపులకు నీవు ప్రసన్నవదనంతో ఉండాలి గాని ప్రళయభీకరమైన హుంకరింపులు వద్దమ్మా యని విన్నవించుకుంటాడు. అమ్మవారు ఆదిశంకరులు చెప్పినట్లు మూకాంబికాదేవిగా శాంతస్వరూపిణిగా విలసిల్లినది.


మన పవిత్రతను బట్టి పరమేశ్వరి మనకు గోచరిస్తుంది. ఆ తల్లి ఉగ్రరూపిణి కాళీమాత కావచ్చు, శాంతరూపిణియైన పరమేశ్వరి కావచ్చు చూచువారికి చూడగలిగినంత, ప్రాప్తియున్న వారికి ప్రాప్తియున్నంత.


జగన్మాతకు నమస్కరించునపుడు ఓం వివిక్తస్తాయై నమః అని అనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

[06:24, 05/03/2021] +91 95058 13235: శ్రీమాత్రేనమః


శ్రీలలితా సహస్రనామ భాష్యము


260వ నామ మంత్రము  05.03.2021


ఓం సుప్తాయై నమః


గాఢనిద్రలో ఉన్నప్పుడు జీవులకు ఉండు అజ్ఞానము కూడా తానే అయి తేజరిల్లు జగన్మాతకు నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి సుప్తా యను రెండక్షరముల (ద్వ్యక్షరీ) నామ మంత్రమును ఓం సుప్తాయై నమః అని ఉచ్చరించుచూ, ఆ పరాత్పరిని ఉపాసించు సాధకులకు   భౌతిక ప్రాపంచిక పరమైన అజ్ఞానము మరియు భౌతిక సౌఖ్యములపై అభిమానమును తొలగి కేవలం పరబ్రహ్మ తత్త్వమును మాత్రమే తెలియగోరు జ్ఞానమార్గమున ప్రవేశింతురు.


సుప్తా అనగా ఇంద్రియములు తమ కార్యక్రమములను ప్రక్కన బెట్టి విశ్రాంతియందుండు గాఢ నిద్రావస్థ. అట్టి గాఢనిద్రావస్థలో జ్ఞానము కోల్పోయి జీవుడు ఉండును.  ఇది ఒక ఆనందావస్థ. శివసూత్రములలో సుప్తావస్థకు ఉండు అవిద్యావృత్తులయిన అవివేకము, మాయ, సౌషుప్తము అనునవి స్పష్టమౌతాయి. ఈ అవస్థలో నాకేమియు తెలియదను అజ్ఞానము, నేను అను అహంకారము, భౌతికపరమైన సుఖము ఇమిడి ఉంటాయి. ఈ సుప్తావస్థలో జీవుడు కారణశరీరాభిమాని అయిన ప్రాజ్ఞుడుగా పిలువబడతాడు. సుప్తావస్థలో మనసు, బుద్ధి లయమయిపోతాయి. అయినను సుప్తావస్థనుండి బయటపడిన పిదప తాను సుఖంగా నిద్రించానని అని భావించును. సాధకుడు యోగసాధనకు పూర్వం మూలాధారంలో కుండలినీ శక్తిస్వరూపంలో ఉన్న పరమేశ్వరి నిద్రావస్థలో ఉంటుంది. అందుకే శ్రీమాత సుప్తా యని అనబడినది.


జగన్మాతకు నమస్కరించునపుడు ఓం సుప్తాయై నమః అని అనవలెను.

[06:24, 05/03/2021] +91 95058 13235: 05.03.2021  ప్రాతః కాల సందేశము


వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం


దశమస్కంధము - పూర్వార్ధము -  నలుబది ఏడవ అధ్యాయము


గోపికలతో ఉద్ధవుని సంభాషము - భ్రమరగీతలు


🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

ఉద్ధవుడు గోపికల భక్తికి పరవశించి పలికిన పలుకులు


47.63 (అరువది మూడవ శ్లోకము)


వందే నందవ్రజస్త్రీణాం పాదరేణుమభీక్ష్ణశః|


యాసాం హరికథోద్గీతం పునాతి భువనత్రయమ్॥10160॥


శ్రీకృష్ణుని లీలావైభవములను ప్రస్తుతించుచు గోపికలు చేసిన గానము ముల్లోకములను పవిత్రమొనర్చుచునే యుండును. అట్టి భాగ్యవతులైన నందవ్రజ స్త్రీలయొక్క పాదధూళులను శిరస్సున దాల్చిన వారికి పదే పదే ప్రణమిల్లుచుందును".


శ్రీశుక ఉవాచ


47.64 (అరువది నాలుగవ శ్లోకము)


అథ గోపీరనుజ్ఞాప్య యశోదాం నందమేవ చ|


గోపానామంత్ర్య దాశార్హో యాస్యన్నారురుహే రథమ్॥10161॥


శ్రీశుకుడు నుడివెను పరీక్షిన్మహారాజా! ఉద్ధవుడు పెక్కు మాసములు గోకులమునందు గడపి, తాను మథురానగరమునకు వెళ్ళుటకై గోపికల నుండియు, యశోదానందులనుండియు, గోపాలురనుండియు అనుమతిని పొందెను. పిదప ఆ మహాత్ముడు వారి నందఱిని వీడ్కొని, బయలుదేఱుచు రథమును అధిరోహించెను.


47.65 (అరువది ఐదవ శ్లోకము)


తం నిర్గతం సమాసాద్య నానోపాయనపాణయః|


నందాదయోఽనురాగేణ ప్రావోచన్నశ్రులోచనాః॥10162॥


ఉద్ధవుడు మథురకు బయలుదేఱుచుండగా నందాది గోపాలురు అందఱును వివిధములగు కానుకలను చేబూని, ఆయనను సమీపించిరి. పిదప వారు కంటతడిబెట్టుచు, ప్రేమానురాగములతో ఇట్లనిరి.


47.66 (అరువది ఆరవ శ్లోకము)


మనసో వృత్తయో నః స్యుః కృష్ణపాదాంబుజాశ్రయాః|


వాచోఽభిధాయినీర్నామ్నాం కాయస్తత్ప్రహ్వణాదిషు॥10163॥


47.67 (అరువది ఏడవ శ్లోకము)


కర్మభిర్భ్రామ్యమాణానాం యత్ర క్వాపీశ్వరేచ్ఛయా|


మంగలాచరితైర్దానై రతిర్నః కృష్ణ ఈశ్వరే॥10164॥


"మహాత్మా! ఉద్ధవా! మా మనస్సంకల్పములు అన్నియును, శ్రీకృష్ణుని పాదారవిందములయందే నిలిచియుండుగాక! మా వాక్కులు ఆ స్వామి నామములనే కీర్తించుచుండుగాక! మా శరీరములు వినమ్రతతో నమస్కరించుచు, ఆయన ఆజ్ఞను పాలించుచు, సేవించుచుండుగాక! మా సుకృత దుష్కృతములనుబట్టి ఈశ్వరేచ్ఛానుసారము ప్రాప్తించిన ప్రతిజన్మమునందు, దానాది శుభకర్మలను చేయుటయందు ఆసక్తి, కృష్ణపరమాత్మయందు భక్తిప్రపత్తులు అంతకంతకును వృద్ధిచెందుగాక!"


47.68 (అరువది ఎనిమిదవ శ్లోకము)


ఏవం సభాజితో గోపైః కృష్ణభక్త్యా నరాధిప|


ఉద్ధవః పునరాగచ్ఛన్మథురాం కృష్ణపాలితామ్॥10165॥


పరీక్షిన్మహారాజా! గోపాలురు కృష్ణభక్తి తత్పరులై ఉద్ధవునకు ఇట్లు పూజాసత్కారములను నెఱపిన పిమ్మట అతడు శ్రీకృష్ణుని పాలనలో ఉన్న మథురానగరమునకు చేరెను.


47.69 (అరువది మూడవ శ్లోకము)


కృష్ణాయ ప్రణిపత్యాహ భక్త్యుద్రేకం వ్రజౌకసామ్|


వసుదేవాయ రామాయ రాజ్ఞే చోపాయనాన్యదాత్॥10166॥


అనంతరము ఉద్ధవుడు శ్రీకృష్ణునకు ప్రణమిల్లి, వ్రజవాసులయొక్క ప్రగాఢమైన భక్తిప్రపత్తులను గూర్చి వివరించెను. నందాది గోపాలురు ఇచ్చిపంపిన వివిధములగు కానుకలను వసుదేవునకును, బలరామకృష్ణులకును, ఉగ్రసేనమహారాజునకును సమర్పించెను.


ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కంధే పూర్వార్ధే ఉద్ధవప్రతియానే సప్తచత్వారింశోఽధ్యాయః (47)


ఇది భాగవత మహాపురాణమునందలి దశమస్కంధము, పూర్వభాగమునందలి గోపికలతో ఉద్ధవుని సంభాషణము - భ్రమరగీతలు యను నలుబది ఏడవ అధ్యాయము (47)

 

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏


పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం

7702090319, 9505813235

[21:20, 05/03/2021] +91 95058 13235: 05.03.2021  సాయం కాల సందేశము


వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం


దశమస్కంధము - పూర్వార్ధము -  నలుబది ఎనిమిదవ అధ్యాయము


శ్రీకృష్ణుడు కుబ్జగృహమునకును, అక్రూరుని ఇంటికిని వెళ్ళుట


🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉


శ్రీశుక ఉవాచ


48.1 (ప్రథమ శ్లోకము)


అథ విజ్ఞాయ భగవాన్ సర్వాత్మా సర్వదర్శనః|


సైరంధ్ర్యాః కామతప్తాయాః ప్రియమిచ్ఛన్ గృహం యయౌ॥10167॥


శ్రీశుకుడు వచించెను ఉద్ధవుడు గోకులమునుండి వచ్చిన అనంతరము సర్వదర్శనుడైన శ్రీకృష్ణభగవానుడు లోగడ తాను కుబ్జకును, అక్రూరునకును చేసిన వాగ్దానములను గుర్తుకు తెచ్చుకొనెను. సకల ప్రాణులకు ఆత్మస్వరూపుడైన ఆ స్వామి తన రాకకై వ్యాకులపడుచున్న కుబ్జకు ప్రియమును గూర్చుటకు ఆమె యింటికి వెళ్ళెను.


48.2 (రెండవ శ్లోకము)


మహార్హోపస్కరైరాఢ్యం కామోపాయోపబృంహితమ్|


ముక్తాదామపతాకాభిర్వితానశయనాసనైః|


ధూపైః సురభిభిర్దీపైః స్రగ్గంధైరపి మండితమ్॥10168॥


కుబ్జయొక్క భవనము అమూల్యములైన (గృహోపకరణములతో) సుసంపన్నమైయుండెను. శృంగార రసోద్దీపములైన వస్తువులతో శోభిల్లుచుండెను. ముత్యాలసరులతో అలంకృతమైయుండెను. అక్కడక్కడ పతాకములు విలసిల్లుచుండెను. ఉన్నతములైన ఆసనములతో, విశాలములైన తల్పములతో అలరారుచుండెను. ధూపముల యొక్క పరిమళములు అంతటను గుబాళించుచుండెను. దీపకాంతుల శోభలు కనువిందు గావించుచుండెను. ఆ భవనము సువాసనలు వెదజల్లుచున్న పూలదండలతో వెల్లివిరియుచుండెను.


48.3 (మూడవ శ్లోకము)


గృహం తమాయాంతమవేక్ష్య సాఽఽసనాత్సద్యః సముత్థాయ హి జాతసంభ్రమా|


యథోపసంగమ్య సఖీభిరచ్యుతం  సభాజయామాస సదాసనాదిభిః॥10169॥


తన గృహమునకు విచ్చేసిన కృష్ణపరమాత్మను జూచినంతనే కుబ్జ సంభ్రమాశ్చర్యములకు లోనై, వెంటనే తన ఆసనమునుండి లేచెను. పిమ్మట ఆమె తన చెలులతోగూడి ఆ స్వామికి స్వాగతమర్యాదలను నెఱపెను. అనంతరము కుబ్జ ఆ ప్రభువును సముచితాసనమున కూర్చుండజేసి, అర్ఘ్యపాద్యాదులతో పూజించెను.


48.4 (నాలుగవ శ్లోకము)


తథోద్ధవః సాధుతయాభిపూజితో  న్యషీదదుర్వ్యామభిమృశ్య చాసనమ్|


కృష్ణోఽపి తూర్ణం శయనం మహాధనం వివేశ లోకాచరితాన్యనువ్రతః॥10170॥


అట్లే ఆమె కృష్ణభక్తుడైన ఉద్ధవునిగూడ యథోచితముగా పూజించెను. పిమ్మట అతడు తనకై ఏర్పాటు చేయబడిన ఉన్నతాసనమును జూచియు, తన స్వామికి సమానముగా అట్లు కూర్చుండుట సముచితముగాదని భావించి, ఆ ఆసనమును ఒకమాఱు స్పృశించి, నేలపై కూర్చుండెను. తదుపరి శ్రీకృష్ణుడు సచ్చిదానందస్వరూపుడైనను లోకమర్యాదను అనుసరించి, అమూల్యమైన మృదుశయ్యపై (హంసతూలికాతల్పముపై) ఆసీనుడయ్యెను.


48.5 (ఐదవ శ్లోకము)


సా మజ్జనాలేపదుకూలభూషణస్రగ్గంధతాంబూలసుధాసవాదిభిః|


ప్రసాధితాత్మోపససార మాధవం  సవ్రీడలీలోత్స్మితవిభ్రమేక్షితైః॥10171॥


పిమ్మట అందాలరాశియైన కుబ్జస్నానమును ముగించుకొని, అంగరాగములను అలదుకొనెను. పట్టువస్త్రములను, చక్కని ఆభరణములను, పూలమాలలను ధరించెను. ఇట్లు అలంకృతయైన ఆ సుందరి పరిమళభరితములైన తాంబూలములను, మధుర పానీయములను దీసికొని, సిగ్గుపడుచు, దరహాసముతో, ఓరచూపులతో ఆ ప్రభువును సమీపించెను.


48.6 (ఆరవ శ్లోకము)


ఆహూయ కాంతాం నవసంగమహ్రియా విశంకితాం కంకణభూషితే కరే|


ప్రగృహ్య శయ్యామధివేశ్య రామయా రేమేఽనులేపార్పణపుణ్యలేశయా॥10172॥


కొత్త కలయికవలన ఆమె సిగ్గుపడుచుండెను. అప్పుడు శ్రీకృష్ణుడు ఆమెను దగ్గరకు పిలిచి, ఆనందింపజేసెను. ఒక్క పర్యాయము ఆ ప్రభువునకు అనురాగముతో మైపూతలను సమర్పించిన పుణ్యఫలితముగా ఆమెకు ఇంతటి మహాభాగ్యము అబ్బెను.


48.7 (ఏడవ శ్లోకము)


సానంగతప్తకుచయోరురసస్తథాక్ష్ణోర్జిఘ్రంత్యనంతచరణేన రుజో మృజంతీ|


దోర్భ్యాం స్తనాంతరగతం పరిరభ్య కాంతమానందమూర్తిమజహాదతిదీర్ఘతాపమ్॥10173॥


అంతట కుబ్జ శ్రీకృష్ణభగవానుని పాదారవిందములను తన హృదయమునందు చేర్చుకొని, కన్నులకు అద్దుకొనుచు చరణపరిమళములను ఆఘ్రాణించుచు, పరవశించిపోయెను. ఎంతోకాలమునుండి ఎదురుచూచిన ఆ ప్రభువు అనుగ్రహము లభించినందులకు ఆమె మిగుల ఆనందమును అనుభవించెను.


48.8 (ఎనిమిదవ శ్లోకము)


సైవం కైవల్యనాథం తం ప్రాప్య దుష్ప్రాపమీశ్వరమ్|


అంగరాగార్పణేనాహో దుర్భగేదమయాచత॥10174॥


పరీక్షిన్మహారాజా! ఆ కుబ్జ అంగరాగసమర్పణము చేతనే పరమయోగీశ్వరులకును అలభ్యుడైన ఆ సర్వేశ్వరుని అనుగ్రహమును పొందగల్గెను. కాని,  మోక్షప్రదుడైన ఆ పురుషోత్తముని కైవల్యమును (ప్రకృతి సంబంధరాహిత్యమును) లేదా గోపాంగనలవలె సేవాభాగ్యమును కోరుకొనక దురదృష్టవశమున ఈ విధముగా కోరుకొనెను-


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి     నలుబది ఎనిమిద అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏


పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం

7702090319, 9505813235

[21:20, 05/03/2021] +91 95058 13235: 🕉️🕉️శ్రీ దుర్గాసప్తశతి🕉️🕉️


ప్రథమాధ్యాయము 05.03.2021


🙏🙏🙏ఓం నమశ్చండికాయై🙏🙏🙏


కరోమి కిం యన్న మనస్తేష్వప్రీతిషు  నిష్ఠురమ్|


అయినను వారియెడల నా మనసు కఠినత్వము చెందదు. ఏమిచేయుదును?


మార్కండేయ ఉవాచ|॥


మార్కండేయుడిట్లనెసు.


తతస్తౌ సహితౌ తం మునిం సముపస్థితౌ|


సమాధిర్నామ వైశ్యోఽసౌ స చ పార్థిసత్తమః|

కృత్వాా తు తౌ యథాన్యాయం యథార్హం తేన సంవిదమ్|


అంత నా సమాధియు సురథుడును ఇరవురు కూడి ఆ ఋషియొద్దకు వెడలిరి.


ఉపవిష్టౌ కథాః కాశ్చిచ్ఛక్రతుర్వైశ్యపార్థివౌ|


వారు ఆ మునికి మర్యాదగావించి, కూర్చుండి ప్రసంగములు చేసిరి.


రాజోవాచ॥


అంత రాజు ఋషితో ఇట్లనెను-


భగవంస్త్వామహం ప్రష్టుమిచ్ఛామ్యేకం వదస్వ తత్|


"మహర్షీ! మిమ్మొక విషయము అడగదలచితిని. దయతో దానికి సమాధానమిండు.


దుఃఖాయ యన్మే మనసః స్వచిత్తాయత్తతాం వినా|

మమత్వం గతరాజ్యస్య రాజ్యాంగేష్వఖిలేష్వపి|


నా మనస్సు నా స్వాధీనము తప్పి దుఃఖముల వశమగునట్లు చేయునదేది?


జానతోఽపి యథాజ్ఞస్య కిమేతన్మునిసత్తమ|

అయం చ నికృతః పుత్రైర్దారైర్భృత్యైస్తథోజ్ ఝితః|


నా రాజ్యము పోయినను రాజ్యాంగము లన్నిటియందు మమకారమున్నది. తెలిసియు తెలియనివానివలె నగుచున్నాను. ఇదేమి?


స్వజనేన చ సంత్యక్తస్తేషు హార్దీ తథాప్యతి|

ఏవమేష తథాహం చ ద్వావప్యత్యంతదుంఖితౌ|


ఇతడును భార్యాపుత్రులచేతను సేవక స్వజనులచేతను విడువబడికూడ వారియందు మిక్కిలి ప్రీతి (స్నేహము) కలిగియున్నాడు.


దృష్టదోషేఽపి విషయే మమత్వాకృష్టమానసౌ|

తత్కిమేత న్మహాభాగ యన్మోహో జ్ఞానినోరపి|


ఇట్లు మేమిరువురమును దోషుల విషయమున మమత్వముచే ఆకర్షింపబడి మిక్కిలి దుఃఖించుచున్నాము.


మమాస్య చ భవత్యేషా వివేకాంధస్య మూఢతా|


ఓ మహానుభావా! జ్ఞానము గలిగిన మేమిరువురమును వివేకము చాలని వాని మూఢత్వమునకు మోహమునకు గురియగుచున్నామిదేమి?"


(తరువాయి వచ్చే శుక్రవారం)


పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం

[04:51, 06/03/2021] +91 95058 13235: శ్రీమాత్రేనమః


శ్రీలలితా సహస్రనామ భాష్యము


836వ నామ మంత్రము 06.03.2021


ఓం వీరమాత్రే నమః


ఉపాసుకులలో గొప్పవారికిని, యుద్ధమునందు అభిముఖముగా చనిపోయినవారికిని జననిగా విరాజిల్లు పరమేశ్వరికి నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి వీరమాతా యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును ఓం వీరమాత్రే నమః అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధించు భక్తులకు ఆ తల్లి  సకలాభీష్టములు సిద్ధింపజేయును. 


శ్రీవిద్యలో నిష్ణాతులైన ఉపాసకులు వీరులతో సమానము. శ్రీవిద్యోపాసకులు పండ్రెండు మంది గలరు. వారు మహావీరులుగా పరిగణింపబడుదురు. వారి వల్లనే శ్రీవిద్య వ్యాప్తిచెందినది. 


శ్రీవిద్యోపాసకులు మొత్తం పద్నాలుగు మంది ప్రధానంగా ఉన్నారు. కొందరు పన్నెండు అంటారు కానీ మరొక ఇద్దరిని కూడా ప్రముఖంగా తీసుకొచ్చి పధ్నాలుగురు గురించి మానసోల్లాస గ్రంథం చెప్పింది. శ్రీవిద్యను మనదాకా తీసుకువచ్చిన మహానుభావులు వీరు. వీళ్ళందరూ కూడా దేవతా స్థాయి వాళ్ళు. మానవ స్థాయిలో ఉన్న ఋషులు చాలామంది ఉన్నారు. శంకరులు మొదలైన వారెందరో. కానీ దేవతలకు సంబంధించిన మనం వారిని సిద్ధ్యౌఘ, దివ్యౌఘ, పాదౌఘ అని కూడా అంటూంటాం. ఇలా అనేకమంది ఉన్నారు. కానీ ప్రధానంగా పద్నాలుగు మంది. వీరిని ఎప్పుడూ తలంచుకోవాలి. వీళ్ళు శ్రీవిద్య ఉపాసన వల్ల శక్తి పొంది జగద్రచన చేస్తారు. వాళ్ళు ముందుగా శివుడు - ఆయనొక పెద్ద భక్తుడు. అందుకే శివారాధ్యా అని అంటున్నాం. ఇంకా...విష్ణువు, బ్రహ్మ, మనువులు, చంద్రుడు, కుబేరుడు, లోపాముద్ర, అగస్త్యుడు, స్కందుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి, మన్మథుడు - మన్మథుడు ఉపాసించిన శ్రీవిద్యే మనకు ప్రసిద్ధి. ఇప్పుడు చేస్తున్న పంచదశీ విద్య అంతా మన్మథుడు చేసినదే. వాళ్ళయొక్క మంత్రవిద్యలు వేరు. వాళ్ళందరూ అమ్మను ఉపాసించారు అని తెలుసు  మనం ఉపాసిస్తున్నది మన్మథ విద్య - కామరాజ విద్య. అదే ఆత్మ విద్యా మహావిద్యా శ్రీవిద్యా కామసేవితా అమ్మ ఇచ్చాశక్తి స్వరూపిణి కదా! ఆవిడ అనుగ్రహం లేకపోతే మన్మథుడు ఈ ప్రపంచం నడపలేడు. ఇంద్రుడు, బలరాముడు, దత్తాత్రేయుడు, దూర్వాసుడు, ఇందులో మన్మథుడు వరకు చెప్పి ఊరుకుంటారు కొందరు. దత్తాత్రేయుడు పెద్ద శ్రీవిద్యోపాసకుడు. ఆయన పరశురాముడికి శ్రీవిద్యోపాసన తెలియజేశాడు. కనుక అమ్మను ఆరాధించేవాళ్ళు ఎంతమంది చూడందిక్కడ! వీరంతా మహావీరులు అనబడతారు.  వీరందరికీ జనని వంటిది గనుక పరమేశ్వరి వీరమాతా యని అనబడినది. మద్యపానపాత్రకు వీరమని విశ్వనిఘంటువులో చెప్పబడినది. అట్టి పానపాత్ర కొలచునది లేదా చేతిలో ధరించునది గనుక వీరమాతా యని అనబడినది. వీరుడను పేరుగల గణపతికి తల్లి యని పద్మపురాణమునందు గలదు. పరమేశ్వరుడు పార్వతితో ఇట్లు చెప్పెను: పార్వతీ! ఈ వీరకుడు నా హృదయమునకు ఇష్టమయినవాడు. ఇతడు నా ద్వారమందలి  గణములచే పూజింపబడువాడు అని యనగా, పార్వతి అప్పుడు ఓ పరమేశ్వరా! ఇట్టి బాలుడు నాకు పుత్రుడుగా కావలయునని నాకు కోరిక గలదు. నాకు ఆ కోరిక ఎప్పుడు తీరును? అని యన్నది. శంకరుడు పార్వతితో ఈ బాలకుడే  నీకు పుత్రుడు కాగలడని పలికెను. ఆ విధముగా ఆ వీరకునికి పరమేశ్వరి మాత అయినది గనుక, జగన్మాత వీరమాతా యని అనబడినది.


ఇంకను పూర్ణదీక్షాపరులు, శ్రీవిద్యోపాసనయందు కఠోరదీక్ష సలపువారును వీరులుగా చెప్పుదురు. అందుచే జగన్మాత వీరమాతా యని అనబడినది.


పరమేశ్వరికి నమస్కరించునపుడు ఓం వీరమాత్రే నమః అని యనవలెను.

[04:51, 06/03/2021] +91 95058 13235: శ్రీమాత్రేనమః


శ్రీలలితా సహస్రనామ భాష్యము


261వ నామ మంత్రము 06.03.2021


ఓం ప్రాజ్ఞాత్మికాయై నమః


సుషుప్తిలో ఆనందమును పొందు  ప్రాజ్ఞుల సమిష్టియగు ఈశ్వరుని స్వరూపము గలిగిన జగదీశ్వరికి నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి ప్రాజ్ఞాత్మికా యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును ఓం ప్రాజ్ఞాత్మికాయై నమః అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాత పరిపూర్ణమైన భక్తినివేదనతో ఆరాధించు భక్తులకు ఆ పరమేశ్వరి కరుణతో భౌతిక సౌఖ్యములను ప్రసాదించును మరియు వారికి పరమానందదాయకమైన భగవన్నామసంకీర్తనయందు ఆసక్తి నేర్పరచి వారిని తరింపఙేయును.


అవివేకము, మాయ, సౌషుప్తము అను లక్షణములు గలిగిన సుప్తావస్తను అనుభవించు ప్రాజ్ఞుల సమిష్టిరూపము గలిగినది శ్రీమాత. అందుకే ఆ పరమేశ్వరి ప్రాజ్ఞాత్మికా యని అనబడినది. ఇంతకు ముందు విశ్వరూపా యను 256వ నామంలో విశ్వుడు, తైజసుడు, ప్రాజ్ఞుడు అను జీవుని స్థితులను ప్రస్తావించుకున్నాము. ఇంకొకసారి మననం చేసుకుందాము. ఆత్మచైతన్యము జీవుల స్థూలభూతములతో కలసినప్పుడు విశ్వుడనియు, సూక్ష్మభూతములతో నున్నప్పుడు తైజసుడనియు, కారణోపాధితో గూడియున్నప్పుడు ప్రాజ్ఞుడనియు భాస్కరరాయలువారు తెలియజేశారు. దీనినే మరింత ముందుకు వెళ్ళి ఆత్మచైతన్యము స్థులభూతసమిష్టితో గలసినప్పుడు వైశ్వానరుడని యు (విరాట్), సూక్ష్మభూతసమిష్టితో గూడినప్పుడు  హిరణ్యగర్భుడని యు, కారణోపాధి సమిష్టితో గలసినప్పుడు ఈశ్వరు డనియు చెప్పడం జరిగినది. ఇంకను ఇలా కూడా చెప్పబడినది- పరమాత్మ అంతఃకరణరూపమగు కారణోపాధితో గూడినపుడు హిరణ్యగర్భుడు అనియు, ప్రాణములతో గూడినపుడు సూత్రాత్మ యనియు, ప్రాణాన్తఃకరణములు రెండును కలసిన సముదాయంతో గూడిన పరమాత్మ అంతర్యామి యనియు చెప్పియున్నారు. ఈ హిరణ్యగర్భ, సూత్రాత్మ, అంతర్యాము లే క్రమముగా బ్రహ్మ, విష్ణు, రుద్రులు అని పిలువబడినారు. ఈ విధమైన వ్యష్టి జీవాత్మ స్థూలసూక్ష్మ కారణభేదములచే విశ్వ-తైజస-ప్రాజ్ఞులు అని మూడు విధములుగా వివరించుట జరిగినది. ఈ మూడింటిలో మూడవ వాడయిన ప్రాజ్ఞుడే సుషుప్తిలో ఆనందము పొందిన జీవులయొక్క సమిష్టిరూపమైన జగన్మాత. అందుచేతనే శ్రీమాత ప్రాజ్ఞాత్మికా యని అనబడినది.


అటువంటి జగన్మాతకు నమస్కరించునపుడు ఓం ప్రాజ్ఞాత్మికాయై నమః అని అనవలెను.

[04:51, 06/03/2021] +91 95058 13235: 06.03.2021  ప్రాతః కాల సందేశము


వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం


దశమస్కంధము - పూర్వార్ధము -  నలుబది ఎనిమిదవ అధ్యాయము


శ్రీకృష్ణుడు కుబ్జగృహమునకును, అక్రూరుని ఇంటికిని వెళ్ళుట


🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

48.9 (తొమ్మిదవ శ్లోకము)


ఆహోష్యతామిహ ప్రేష్ఠ దినాని కతిచిన్మయా|


రమస్వ నోత్సహే త్యక్తుం సంగం తేఽమ్బురుహేక్షణ॥10175॥


 "కమలాక్షా! ప్రియతమా! కొన్నిదినములు ఇచటనే ఉండుము. నీ కలయికను విడువజాలను" అని కుబ్జ ఆ స్వామిని వేడుకొనెను.


 48.10 (పదియవ శ్లోకము)


తస్యై కామవరం దత్త్వా మానయిత్వా చ మానదః|


సహోద్ధవేన సర్వేశః స్వధామాగమదర్చితమ్॥10176॥


అంతట భక్తులకోర్కెలను ఈడేర్చునట్టి ఆ మహానుభావుడు  ''నీ అభీష్టమును దీర్చుటకై మఱలవచ్చెదను' అని మృదుమధురముగా పలికి, ఆమె పూజలను స్వీకరించెను. పిమ్మట ఆ కృష్ణభగవానుడు ఉద్ధవునితోగూడి, సకల సంపదలతో తులతూగుచున్న  తన సదనమునకు చేఱెను.


 48.11 (పదకొండవ శ్లోకము)


దురారార్ధ్యం సమారాధ్య విష్ణుం సర్వేశ్వరేశ్వరమ్|


యో వృణీతే మనోగ్రాహ్యమసత్త్వాత్కుమనీష్యసౌ॥10177॥


శ్రీమహావిష్ణువు (శ్రీకృష్ణుడు) బ్రహ్మాది సకల దేవతలకును ప్రభువు. భక్తిప్రత్తులతోగాక ఇతర ఉపాయములచే ఆ స్వామిని ప్రసన్నుని చేసికొనుట కష్టము. అట్టి పరమపురుషుని ఆరాధించి, ఆయన అనుగ్రహమును పొందియు, క్షణికములైన శబ్దాది విషయసుఖములను కోరుకొనినవాడు బుద్ధిహీనుడు.


 48.12 (పండ్రెండవ శ్లోకము)


అక్రూరభవనం కృష్ణః సహరామోద్ధవః ప్రభుః|


కించిచ్చికీర్షయన్ ప్రాగాదక్రూరప్రియకామ్యయా॥10178॥


పిమ్మట శ్రీకృష్ణుడు అక్రూరునకు ప్రియమును గూర్చుటకును, పాండవులకు మేలు చేయుటకై  ఆయనను హస్తినాపురమునకు పంపుటకును నిశ్చయించుకొనెను. అందువలన ఒకనాడు ఆ ప్రభువు బలరామునితో, ఉద్ధవునితో గూడి ఆయన (అక్రూరుని) భవనమునకు వెళ్ళెను.


 48.13 (పదమూడవ శ్లోకము)


స తాన్ నరవరశ్రేష్ఠానారాద్వీక్ష్య స్వబాంధవాన్|


ప్రత్యుత్థాయ ప్రముదితః పరిష్వజ్యాభ్యనందత॥10179॥


అప్పుడు అక్రూరుడు తనకు ఆత్మీయులు, సత్పురుషశ్రేష్ఠులు ఐన శ్రీకృష్ణ, బలరామ, ఉద్ధవులను దూరమునుండియే చూచి, మిగుల సంతోషించెను. వెంటనే అతడు ఆసనమునుండి లేచి, ఎదురేగి, క్రమముగా వారిని అందఱిని అక్కునకుజేర్చుకొని అభినందించెను.


 48.14 (పదునాలుగవ శ్లోకము)


ననామ కృష్ణం రామం చ స తైరప్యభివాదితః|


పూజయామాస విధివత్కృతాసనపరిగ్రహాన్॥10180॥


పిదప అక్రూరుడు బలరామకృష్ణులకును, ఉద్ధవునకును నమస్కరించెను. అంతట వారును అక్రూరునకు ప్రత్యభివాదములను ఆచరించిరి. అనంతరము అతడు శ్రీకృష్ణాదులను సుఖాసీనులను గావించి, విధ్యుక్తముగా అర్ఘ్యపాద్యాదులతో పూజించెను.


 48.15 (పదిహేనవ శ్లోకము)


పాదావనేజనీరాపో ధారయన్ శిరసా నృప|


అర్హణేనాంబరైర్దివ్యైర్గంధస్రగ్భూషణోత్తమైః॥10181॥


 48.16 (పదహారవ శ్లోకము)


అర్చిత్వా శిరసాఽఽనమ్య పాదావంకగతౌ మృజన్|


ప్రశ్రయావనతోఽక్రూరః కృష్ణరామావభాషత॥10182॥


మహారాజా! తదుపరి అక్రూరుడు బలరామకృష్ణులకు పాదప్రక్షాళనమొనర్చి, ఆ శ్రీపాదజలములను తన శిరమున దాల్చెను. పిమ్మట అతడు వివిధములగు పూజా సామాగ్రులతోను, అమూల్యములగు వస్త్రాభరణములతోను, దివ్యములైన పరిమళ ద్రవ్యములతోను, పుష్పమాలలతోడను వారిని అర్చించెను. పిదప భక్తితో ప్రణమిల్లి వారి చరణములను తన యొడిలో చేర్చుకొని సేవలొనర్చెను. అంతట అతడు వినమ్రుడై బలరామకృష్ణులతో ఇట్లు వచించెను-


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి     నలుబది ఎనిమిద అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏