Sunday, 8 October 2017

శ్రీ కృష్ణ లీలామృతం -1

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ: - శ్రీ కృష్ణాయనమ:
ప్రాంజలి ప్రభ -1
వినుడు  వినుడు శ్రీ భాగవతం
శ్రీకృష్ణ పరమాత్ముని దివ్య చరితం
శ్రీకృష్ణ లీలామృతం -1


1. శ్రీ కృష్ణభగవానుని అవతరణము.

ఒకప్పుడు రాక్షస ప్రవృత్తిగల రాజులుండెను, పరిపాలనా భరించలేక భూమి కృంగి పోచుండెను, భూదేవి రాజులవల్ల వచ్చు చున్న ఉపద్రవమును, గమనించి గో రూపమును ధరించి కన్నుల వెంబడి నీరు కారుస్తూ నిస్సహాయు రాలుగా బ్రహ్మ లోకమునకు చేరి  విన్న వించెను. బ్రహ్మ, శివ, భూదేవి అందరు కలసి  పాల సముద్రముచేరి పూర్వము దివ్య వరాహావతారమును దాల్చి భూమి ఉద్ధరించిన విష్ణు భగవానుని స్తుతింప సాగెను.  

బ్రహ్మ దేవునకు విష్ణు భగవానుడు ఒక సందేశము ప్రసారము చేసెను, దుష్టశిక్షణ శిష్టరక్షణ కోసం భూలోకంలో అవతరిస్తాను, దేవతలందరు తమతమ అంశాలతో భూలోకంలో జన్మించాలని సూచనలను అందించెను.    
ఆవిధముగా భూదేవికి ఓదార్పు కల్పించి తిరిగి పంపి వేసెను

ఆకాలంలో యదువంశములో ప్రముఖుడైన  సూరసేన మహారాజు మధుర దేశమును, సూరసేన మండలమును పరిపాలిస్తూ ఉండెవాడు.  ఒకప్పుడు సూరసేన మహారాజు పుతృడైన వసుదేవుడు దేవకిని వివాహమాడి నూతన వధువుతో పాటు తన రథములో రాచ నగరమునకు వెడుతుండెను. ఆసమయంలో ఉగ్రసేన పుత్రుడైన కంసుడు  (కంసుని తండ్రి ఉగ్రసేనుడును దేవకి తండ్రి  దేవకుడును అహకుని పుత్రులై నందున వారు సోదరులు. కనుక దేవకి కంసునికి వరుసకు మాత్రమే సోదరి అయినను ఆవిడ సొంత సోదరిగానే చలామణి అయినది.)
కనుక సోదరుడు సోదరి అత్తవారింటి వరకు వెళ్లదలచి వాసుదేవుని రధమును కంసుడే స్వయముగా రధమును తోలుచుండెను.రంగ రంగ వైభవముగా ఊరేగింపు సాగు చుండెను. 

కంసుడు సంతోషముతో రధమును తోలుతున్న సమయమున హఠాత్తుగా ఆకాశమునుండి ఆశ్చర్యకరమైన ఓ అశరీరవాణి వినిపించెను. ప్రత్యేకించి కంసుని సంభోదిస్తూ ఆ వాక్కు ఇట్లనెను "కంసా నీవు ఎంతటి  అవివేకివి? నీవు నీ  సోదరి, నీ బావ ప్రయాణిస్తున్నట్టు రధమును తొలుచున్నావు. కానీ నీ  సోదరి అష్టమ గర్భములో జన్మించు శిశువు నిను చంపునని నీకు తెలియదు ". అని పలికెను. 

భోజ వంశమునకు చెందిన రాక్షస ప్రవృత్తిగల కంసుడు "భవిష్యవాణి" మాటలు విని ఉగ్రుడై వెంటనే దేవకీ దేవి కేశములు పట్టుకొని కత్తితో వధించుకు సిద్ధ పడెను . కంసుని శాంతపరుచుటకు వసుదేవుడు ఈవిధముగా పలికెను.  
                                                                                                                                  సశేషం 
వసుదేవుడు కంసునితో ఈ విధముగా పలికెను

కంసా నీవు పుట్టిన నాడే మరణం వ్రాసి ఉన్నది, ఇప్పుడు నీ మరణ విషయము తెలియగానే భయము నీలో ప్రవేశించినదా, కర్మానుసారము జీవితాన్ని నీవు అనుభవించ వలసినదే. గొంగళి పురుగులాగా శరీరమును మార్చుకుంటూ కొమ్మ కొమ్మ తిరగ వలసినదే, నీకు ఒక అడుగు బలము తెలిసాకా మరో అడుగు వేయక తప్పదు, అదేవిధముగా జీవుడు ఈ భౌతిక ప్రపంచములో బద్ధుడై ప్రకృతిని అనుసరించి ఒక శరీరము అనుభవించి మరణానంతరము మరొక శరీరమునకు పోక తప్పదు, చావు బ్రతుకుల తప్ప వేరొక మార్గము లేదు, నీవు ప్రేమించిన చెల్లినే కిరాతముగా చంపాలని పూనుకున్నావు.

అట్లే నీవు నిద్రలో అనేక కలలు కంటావు ఆ సమయంలో దేహము ఆకాశములో సంచరించినట్లు, ఎవరో చంపుతున్నట్లు, బంగారము మనకు ఇస్తున్నట్లు స్వప్నములో చూస్తాము, అప్పుడు మనదేహము పూర్తిగా విస్మరిస్తాము, నూతన దేహములతో సంబంధము కలగవచ్చును నిద్రలో, మేల్కొన్నాక వాటినన్నింటిని విస్మరిస్తాము. ఈ భౌతిక దేహాలన్నీ మానసిక కల్పనల సృష్టియే.

మనస్సు చంచలమైనది ఇది ఒక సమయాన ఒక విషయాన్ని క్షణంలో సమర్ధిస్తుంది  మరోక్షణంలో దాన్నే విమర్శిస్తుంది. మానసిక కల్పనలచేత జీవుడు విభిన్న మార్గాలద్వారా ప్రయాణం చేయుట మొదలు పెడుతాడు, న్యాయం అన్యాయం అనేది గమనించాడు, తక్షణం పని పూర్తి చేయాలని ఆలోచన అప్ప వేరో ఆలోచన రానే రాదు, అందుకే ఒక్క నిముషము ఆలో చించి ఏ పని నైనా చేయమన్నారు.
కంసా నీ దేహము మరియు మనస్సుల ఆదేశములకు వసుడవు కావలదని ప్రార్ధించు చున్నాను.                        
ఎవరు యితరుల పట్ల అసూయ చెంద వలదు, పెంచిన మొక్కని పీకుటకు ప్రయత్నం చేయ వలదు,
దేవకి నీ సోదారి ఆమెను చంపుట పూనుకొనుట మంచిది కాదు, ఏమైనను పరిస్థితి చాలా సున్నితమైనది వివాహ శుభ సమయము కావున నీవు దేవకిని వధించినచో నీ గొప్ప కీర్తికి భంగము వాటిల్లును అనియు వాసుదేవుడు విన్న వించెను.

కంసుడు రాక్షస స్వభాము ఉండుటవల్ల ఎటువంటి మంచి మాటలు తలకెక్కలేదు.
వసుదేవుడు కంసునితో ఈ విధముగా పలికెను " ప్రియమైన బావా నీ సోదరి నుండి నీకు ఎట్టి అపాయము కలగదని దయచేసి విశ్వసింపుము, నీకు కలగబోయే అపాయము సోదరి పుతృనివలన కదా ఆలోచించు నీవు సురక్షితుడవు ఆమెకు పుతృలు కలిగినప్ప్పుడు , నీవు సముచితమైన నిర్ణయము తీసుకొనవచ్చును, వారిని నీకు సమర్పించునని వాగ్దానము చేయుచున్ననుఁ

కంసుడు చివరికి వసుదేవుని వాగ్దాన మాటలు విని తాత్కాలికంగా సోదరిని వధించుట అనే  పాపకర్మకు పూనుకొనుట మానుకొనెను, ఇద్దరినీ తన గృహమునకు తీసుకోని వెళ్లెను.          
                                                                                                                                   సశేషం

కంసుడు దేవకీ వసుదేవులకు సాధారణముగా ఆహ్వానించి తన మందిరములో సకల సదుపాయాలు ఏర్పాటు చేసి కట్టు దిట్టమైన రక్షణ ఏర్పాటు చేసి వాగ్దానమును నెరవేర్చు కోమని హెచ్చరించి రక్షక భటులకు తగు సూచనలు ఇచ్చి వెళ్లి పోయెను.

దేవకీ వసుదేవులకు మొదటి పుత్రుడు పుట్టగానే వసుదేవుడు తన వాగ్దాణము ప్రకారము కంసునకు అప్పగించెను. కంసుడు ఆశ్చర్యపడి అతడి ప్రవర్తనకు సంతోషించి ఇట్లు పలికెను " ప్రియమైన వసుదేవ ఈ శిశువు వలన నాకు ఎటువంటి అపాయము లేదు, నాకు ఎనిమదవ సంతానము వళ్ళ మరణము అని భవిష్య వాణి చెప్పినది, నీవు ఈ శిశువును తీసుకోని వెళ్లుము అనెను.
నారదుడు అప్పుడే ప్రత్యక్షమై బృందావనంలో నందమహరాజు, గోపాలురు, గోపికలుగా దేవతలు, ఋషులు  పుట్టారు.
Image result for sri krishna paramatma images

ఆమాటలకు కంసుడు దేవతలవల్ల రాక్షసులకు ఎప్పటికైనా హాని కలుగునని భావించి కోపము తెచ్చుకొని ఏ శిశువులో నైనా శ్రీకృషుడు ఉండవచ్చునని భావించి వసుదేవుని పుతృని వధించుటకు నిర్ణయించి దేవకీ వసుదేవులకు కారాగారంలో బంధించి ఉంచెను. మొదటి పుత్రుని వధించెను.

నారదుడు ద్వారా కంసుడు పూర్వజన్మ వృత్తాంతము తెలుసుకొనెను. పూర్వజన్మలో కాలనేమి అను రాక్షసుడని విష్ణువు చేతిలో మరణించినట్లు తెలుసుకొనెను. ఈ జన్మలో అదే కృష్ణుని చేతిలో నాకు మృత్యువు వున్నదని గ్రహించెను.

కంసుడు అనతండ్రి యైన ఉగ్రసేనుణ్ణి చెరసాలలో పెట్టెను,వసుసుదేవుని తండ్రి అయన సూరసేనుణ్ణి బందించి అతని రాజ్యము కూడా ఆక్రమించెను. ఆరాజ్యము కూడా తనదే నని చెప్పి పాలించు చుండెను.
వసుదేవునితో ధర్మము తప్పక పుట్టిన పుత్రులను నాకు అప్పగించుము అనెను. అట్లేనని దేవకీ వసుదేవుల చెరసాలలో భాదతో ఉండేను.  

                                                                                                                                      సశేషం    


2 comments: