ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:- శ్రీ కృష్ణాయ నమ:
శ్రీ కృష్ణ లీలామృతం- 5
కంసుని లీలలు
ఒక్కసారిగా పసిపిల్ల గొంతు వినగానే రక్షక భటులు వేగంగా లేచి చెరసాలలో జననం అని చెప్పారు అప్పడు ఒక్కసారిగా లేచి కంసుడు గట్టిగా " నాప్రాణమును కబళించు భయంకరమైన మృత్యువు జన్మించెను " అని అరచి చేతితో కరవాలము పట్టుకొని దేవకీ వసుదేవుని వద్దకు వచ్చి స్వవయముగా ఏడుస్తున్న పసి కందుని చేత పట్టి వికటాట్టహాసము చేస్త్తూ బిగరగా అరుస్తూ " నీవా నా ప్రాణాల్ని హరించేది నీవా నా ప్రాణాల్ని హరించేది అంటుండగా, దేవకీ పాదాలను పట్టుకొని అన్నని వేడు కుంటున్నది .
"ప్రియసోదర దయచేసి ఆడబిడ్డను వధించకము, నిన్ను చంపువాడు మొగ శిశివు అని కదా భవిష్య వాణి చెప్పింది. అయిన క్రూరుడైన కంసుడు కోపముతో పాపను గాలిలోకి విసిరి కరవాలము పెట్టెను
గాలిలో చేరిన పాప గొప్ప వెలుగుగా మారి ఒక దివ్య రూపముగా ఆకాశములో ఆదిపరాశక్తి ప్రత్యక్ష మయ్యెను.
"ఎనిమిది హస్తములలో విల్లు, సూల, బాణ, ఘంటా, శంఖ, చక్ర, గదా, కవచములు ధరించి ఉండెను"
"ఓరి దుర్మార్గుడా నీవు నన్నెట్లు చంపగలవు? నిన్ను చంపు శిశివు నాకు పూర్వమే ఈ ప్రపంచము లో జన్మించెను, దీనురాలైనట్టి నీ సోదరి పట్ల క్రూరముగా ప్రవర్తించకము" హెచ్చరించి అంతర్ధాన మయ్యెను.
ప్రియమైన సోదరి, బావా నేను మీ పుత్రులను సంహరించితిని, బ్రహ్మహత్యా పాతకము మూటకట్టు కొంటిని, మనల్ని ఎదో మాయ శక్తి కమ్ము కుంటున్నది, మిమ్మల్ని భాదపెట్టి నందుకు నన్ను క్షమించండి, ఈ రోజు మిమ్మల్ని కారాగారము నుండి విముక్తి చేస్తున్నాను, మీరు స్వేశ్చగా జీవించవచ్చు అని పలికి వారికీ ఉన్న గొలుసులను తొలగించెను.
"కంసా మనము అజ్ఞానము వలన మిత్రులను శత్రువులుగా, శత్రువులను మిత్రులుగా చూస్తున్నాము. సుఖము, దుఃఖము, భయము, ద్వేషము, లోభము, మోహము ఉన్మాదం అనునవి వాటి వళ్ళ భౌతిక శరీరము ద్వేషభావముతో నలిగి పోవును. కనుక వీటిని తొలగించు కోవాలంటే మనము ప్రేమ భక్తి భావాన్ని విస్తరించు కోవటమే మార్గము అని వాసుదేవుడు తెలియపరిచేను "
అట్లాగే బావ నేను మారి పోయాను, మీరు సుఖముగా ఉండండి అని చెప్పి వెడలి పోయాను.
తరువాత కధలో నంద వసుదేవుల అక్లయక లీలలు తెలుసుకుందాము

కంసుడు అసలే రాక్షసుడు ఆలోచనలు ఎలా మారుతాయో ఎవరు చెప్పలేరు, వెంటనే అధికారులను పిలిపించి తెలియపరిచేను, రాక్షసులు కొందరు మీ మృత్యువు పుట్టిందని తెలుపారు పది రోజుల మొగపిల్లలలందరిని సంహరిస్తే మంచిది, అసలు దేవతలు మనకు విరోధులు, మనము బ్రాహ్మణులను యజ్ఞయాగాదులు చేయకుండా ఆపుదాము, వారందరు విష్ణువుని మొరపెట్టుకొందురు అప్పుడు ప్రత్యక్షము కాగలరు, మీరు ఇంద్రున్ని జయించినవారు, తపస్సంపన్నులు మీరు ఏది చెపితే అది మేము ఆచరిస్తాము అన్నారు.
మరి కొందరు మేధావులు మహారాజా దేవకీ వసుదేవుల కుమారుడు ఎక్కడ పెరుగుతున్నాడో అక్కడ ససస్యశ్యామలంగా పుష్కలంగా వర్షాలు, నవగ్రహాలన్నీ సమంగా నడుస్తాయి అది గమనించండి. ఆ ప్రాంతము తెలుసుకొని నీకు నమ్మన బంటులుగా ఉన్న అనేక మంది రాక్షసులను పంపితే విషయము తెలుస్తుంది అన్నారు .
రాక్షసులు మరింకను ఇట్లా పలక సాగిరి: దేహము వ్యాధి గ్రస్తమైనప్పుడు ఆ వ్యాధిని అశ్రద్దచేసినచో ఆ వ్యాధిని నివారించలేము. ఆవిదఃముగానే ఇంద్రియ నియంత్రణ విషయములో అశ్రద్ధను కనపరచి ఇంద్రియములను స్వేశ్చగా విడిచినచో తిరిగి వాటిని నియంత్రించలేము. కనుక దేవతలు మనకన్నా బాలవంతులు కాకుండా మనము జాగ్రత్త పడవలెను. బ్రాహ్మణులు, వేదపఠనం, గోవులు, వ్రతములు, యజ్ఞములు, దానములు మొదలైనవన్నీ విష్ణువుకు సంతృప్తి పరిచేవి అవి చేయకుండా ఆపగలిగితే మీ బలము పెరుగు తుంది.
కంసుడు ఒకవైపు విష్ణు భక్తులను హింసించమని ఆజ్ఞ ఇస్తూ, మరోవైపు బాలుని వెతకమని రాక్షసులను పంపాడు, కంసుడు పిచ్చి పట్టిన వాడులా మారాడు, చిన్న పిల్లలను చంపమని ఆజ్ఞఇచ్చెను. బ్రాహ్మణులను హిసించమని ఆజ్ఞ ఇచ్చెను

om
ReplyDelete