Saturday, 14 October 2017

శ్రీ కృష్ణ లీలామృతం -4


శ్రీ కృష్ణ లీలామృతం -4
బాల కృష్ణుని లాలి పాటలు 
ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ:శ్రీ కృష్ణాయనమ:

Image may contain: 2 people, people sitting
ప్రాంజలి ప్రభ "గోవిందా"

ఊహల ఊయల సడిలో
ఆకలి ఆరాట మదిలో
తియ్యని తలపుల తడిలో
నీరూపే నా మదిలో నిలిచింది

లతలా అల్లుకోవాలని
పరిమళాలందించాలని
విరిసిన పువ్వగా ఉండాలని
నీ తలుపు నన్ను పులుస్తున్నది

కురిసేను విరిజల్లులు
మెరిసెను హరివిల్లు సౌరభములు
నాట్యమాడెను మయూరములు
నామది ఆనందంతో ఉన్నది
 

మదిలో నిండే మధుర భావాలు
పెదాలు పలికే మధుర గీతాలు
నాలో చెరగని నీ ప్రాతి రూపాలు
అడుగుల సవ్వడికే పరవసిస్తున్న ముకుందా

నీ మధుర పావన తలపులు
ఈ రాధను వరించే కళలు
అందుకో పూల మకరందాలు
ఆదుకో ఆరాధించి
న  వారిని గోవిందా


ప్రాంజలి ప్రభ 
భక్తులు శ్రీకృష్ణుని ఈవిధంగా ప్రార్ధించుతున్నారు 

అంతర్మధనానికి అర్ధం ఏమిటో 
ఆంత రరంగాల భావ మేమిటో
అనురాగ బంధాల భేదమేమిటో 
మాకు తెలపవయ్యా కృష్ణయ్యా 

కాలమార్పుకు అవసర మేమిటో
కాపురానికి కాంచనానికి ప్రమఏమిటో
కాని దవుతుంది, అవ్వాల్సింది కాదేమిటో 
మాకు తెలపవయ్యా బాల కృష్ణయ్యా 

అకాల వర్షాలకు కారణాలేమిటో 
ఆత్మలకు తృప్తి కలుగుట లేదేమిటో
ఆకలి మనిషికి తగ్గకున్నదేమిటో 
మాకు తెలపవయ్యా ముద్దులకృష్ణయ్యా 

గాలిలో మాటలు తరలి వస్తున్నాయేమిటో 
గాఁపు లేకుండా ప్రార్ధించినా కరుణించవేమిటో 
గిరి గీసినా దాటివచ్చి మనిషి ప్రశ్న లేమిటో       
మాకు తెలపవయ్యా గోపాల కృష్ణయ్యా 

చిత్తశుద్ధి కల్పించి నిగ్రహాన్ని ఇవ్వవేమిటో 
చింతలు తొలగించి ఐక్యత్వజ్ఞానమివ్వమేమిటో
చిరునవ్వులతో జితేంద్రియత్వము కల్పించవేమిటో 
మాలో తప్పులు తెలపవయ్యా మువ్వగోపాలయ్యా 

ఇంద్రియసుఖములందలి ఆసక్తిని విడువలేకున్నావేమిటో 
కర్మల యందలి అభిమానము వదలి లేకున్నావేమిటో 
సమస్త వాసనలను, సుఖాలను మరువలేకున్నావేమిటో 
మాతప్పులు మన్నించి నీలో ఐక్యం చేసుకో కృష్ణయ్యా    
ప్రాంజలి ప్రభ

కన్నెల మనసు సుతారం
రంజిల్లును నిత్య సుకుమారం
రంగు బంగారం, రసరమ్య సౌభాగ్యంతో
రమా రమ మనసు నర్పించే శ్రీకృష్ణకు

తాంబూల పెదాల ఎరుపు దనంతో
వంటిమీద పుత్తడిపూత మెరుపుతో 
వెన్నెల వెలుగులో కళ్ళ చూపులతో
కవ్వించి నవ్వించి సంతోషం పంచె శ్రీకృష్ణకు   

ఆనందపు మాటలన్ మిపుల నందపు టాటాలన్
బాటలాన్ ముద మందంచుచు సుఖంబులన్
సందియము ఏమి లేక సర్వంబు అర్పించుటకున్
పోటీపడి ప్రియంబు కల్పించే కన్యలు బాలకృష్ణకు

లలిమనోహర రూప విలాస హావా భావములచే
యతిశయాను భవవిద్యా గోచర పరమార్ధముచే
గాత్ర కంపన గద్గదా లాపవిధులవయ్యారములచే  
కన్యలందరు నింపారు గాచి ప్రేమను పంచె శ్రీకృష్ణకు 

__((*))--    
ప్రాంజలి ప్రభ  

చిరు  నగవుల  చిన్మయ రూపం
చింతలు తొలగించే విశ్వరూపం 
చంచలాన్ని తొలగించే రూపం 
చిరస్మరణీయులకు దివ్య రూపం 

ఆత్మీయుల ఆదుకొనే ఆదర్శ రూపం   
అంధకారాన్ని తొలగిన్చే రత్న రూపం 
అక్షయ పాత్ర నందించిన రూపం 
అన్నార్తులను ఆదుకొనే రూపం 

ఉజ్వల భవషత్తును చూపే రూపం 
ఉత్తేజాన్ని శాంతపరిచే రూపం 
ఉన్మత్త, అప్రమత్తలను మార్చేరూపం
ఉషోదయ వెలుగును పంచె రూపం 

దృఢసంకల్పాన్ని పెంచే రూపం 
దుష్టత్వాన్ని అరికట్టే రూపం 
దుర్మార్గులను సంహరించే రూపం 
దు:ఖాలను దరి చేర నీయని రూపం  

పరబ్రహ్మపరమాత్మ ప్రాప్తి రూపం
అపరిమితానంద హాయిగొలిపే రూపం
ఆత్మా పరమాత్మా యందె లగ్న పరిచే రూపం
అఖిలాండకోటికి ఆనందం పంచే శ్రీ కృష్ణ రూపం

ప్రాంజలి ప్రభ

అమ్మా యశోదమ్మా
అల్లరి తట్టుకోలేకున్నామమ్మా
ఆలూమగలమధ్య తగువులమ్మా
ఆ అంటే ఆ అంటూ పరుగెడుతాడమ్మా

పాలు, పెరుగు, వెన్న, ఉంచడమ్మా
పాఠాలు నేర్పి మాయ మౌతాడమ్మా
పాదాలు పట్టుకుందామన్న చిక్కడమ్మా
పాదారసాన్ని అయినా పట్టుకోగలమామ్మా
కానీ కృష్ణుడి ఆగడాలు ఆపలేకున్నామమ్మా

అల్ల్లరి చేసినా అలుపనేది ఎరుగని వాడమ్మా 
ఆడపడుచులతో ఆటలాడుతాడమ్మా
ఆశలు చూపి అంతలో కనబడడమ్మా
అల్లరి పిల్లలతో చేరి ఆడుతాడమ్మా

తామరాకుమీద నీటి బిందువుల ఉంటాడమ్మా
వజ్రంలా మెరిసే కళ్ళతో మాయను చేస్తాడమ్మా
మన్ను తింటున్నాడు ఒక్కసారి గమనించమ్మా
బాల కృష్ణ నోరు తెరిచి చూస్తే తెలుస్తుందమ్మా

అమ్మ చూడమ్మా వాళ్ళ మాటలు నమ్మకమ్మా
సమస్త సుఖాలకు కారణం పుణ్యం కదమ్మా          
పాపం చేసిన వారికి దుఃఖం వాస్తుంది కాదమ్మా    
నా నోరుని చూడమ్మా ఏమి తప్పు చేయలేదమ్మా

కృష్ణుని నోటిలో సమస్తలోకాలు చూసింది యశోదమ్మా 
ఆనంద పారవశ్యంతో మునిగి పరమాత్మను చూసిదమ్మా 


ముద్దుగారే యశోదముంగిట ముత్యము
ప్రార్ధించిన వారికి మన:శాంతి నిత్యము
ఓర్పుతో ప్రార్ధిస్తూ చేయాలి పత్యము
శ్రీకృష్ణుని పలుకులు ఎప్పుడు సత్యము

ఆపద వచ్చినప్పుడు ధైర్యము కల్పించు
శ్రేయస్సు కలిగినపుడు సహనం వహించు
వాక్చాతుర్యంతో మనస్సును  ఆకర్షించు
శ్రీకృష్ణుని పలుకులు ఎప్పుడు సత్యము
 

నమో వెంకటేశాయ
 


అండ పిండ  బ్రహ్మా౦డ చక్ర ధారి 
ఆత్మీయత తో ఆదుకున్న ధారి 
అరవీర భయంకరుల గుండెను కూడా
కరుణ రసముతో దయ చూపిన ధారి
ఆణువణువూ ఆవరించిన శ్రీ వెంకటేశ్వరా
నమో నమో శ్రీ వెంకటేశ్వరాయ
నమో నమో శ్రీనివాసయా నమో నమ:

చిత్ర విచిత్రాల దర్శకేంద్రా
శృంగారా సాహిత్య అభిలాషా
ప్రార్ధనకై మోక్షము నందించి
మనస్సును ప్రశాంత పరిచి
సుఖ శాంతులను అందించి
ఆదుకుంటావు శ్రీ వెంకటేశ్వర
ఓం నమో వేంకటేశాయ
నమో నమ:
ఓం నమో శ్రీనివాసాయ
నమో నమ:
గోవిందా గోవిందా గోవిందా         


చిన్నప్పుడు మా అమ్మగారు ఉయ్యాలలో కృష్ణుని బొమ్మ పెట్టి ఊపుతూ పాడేది ఈ పాట గుర్తుకు
వచ్చి ఇందు పొందు పరిచా (రచయత ఎవరో తెలియదు)
శ్రీకృష్ణుని  జననము - 1 (కస్తూరి రంగరంగా - నాయన్న - కావేటి రంగరంగా)  

కస్తూరి రంగరంగా - నాయన్న - కావేటి రంగరంగా 
శ్రీరంగ రంగరంగా - నినుబాసి - యెట్లునే మరచుందురా
కంసుణ్ణి సంహరింపా - సద్గురుడు - అవతారమెత్తెనపుడూ
దేవకీ గర్భముననూ - కృష్ణావ - తారమై జన్మించెనూ

యేడు రత్రులు చేరిచీ - ఒకరాత్రి - యేకరాత్రిగజేసెను
ఆదివారము పూటనూ - అష్టమీ - దినమందు జన్మించెను
తలతోను జన్మమైతే - తనకు బహు - మోసంబు వచ్చుననుచు
ఎదురు కాళ్ళను బ్ట్టెను - ఏడుగురు - దాదులను జంపెనపుడు

నెత్తురుతొవుండి యపుడూ - ఆబాల - కావుకావున ఏడ్చుచు
నన్నేల యెత్తుకొనవే - ఓతల్లి - దేవకీ వందనంబు
ఒళ్ళెల్ల హీనంబుతో - ఈరీతి - నున్నాను కన్నతండ్రి
నిన్నెట్లు ఎత్తుకొందూ - నీవొక్క - నిముషంబు తాళరన్నా

గంగనూ ప్రార్ధించెనూ - జలనిధుల - గంగతా నుప్పొంగెను
గంగనదిలో నప్పుడూ - దేవకీ - జలకంబు లాడెనపుడు
ఇకనైన యెత్తుకొనవే - నాతల్లి - దేవకీ వందనంబు
కాని బాలుని వలెను - నన్నిట్లు - యెడబాసి యుండతగునా

నీ పుణ్యమయె కొడకా - యింకొక్క - నిముషంబు తాళుమనుచూ
కామధేనువు నప్పుడూ - దేవకీ - కడగి ప్రార్థించగాను
పాలవర్షము గురిసెను - అప్పుడా - బాలుపై చల్లగానూ
తడివస్త్రములు విడచెనూ - దేవకి - పొడివస్త్రమును కట్టెను

పొత్తిళ్ళమీద నపుడూ - బాలుండు - చక్కగా పవళించెను
తనరెండు హస్తములతో - దేవకి - తనయుణ్ణి యెత్తుకొనెను
అడ్డాలపై వేసుక _ ఆబాలు - నందచందము చూచెను
వసుదేవు పుత్రుడమ్మా - ఈబిడ్డ - వైకుంఠ వాసుడమ్మా

నవనీత చోరుడమ్మా - ఈబిడ్డ - నందగోపాలుడమ్మ
సితపత్ర నేత్రుడమ్మా - ఈబిడ్డ - శ్రీరామచంద్రుడమ్మ
శిరమున చింతామణి - నాతండ్రి - నాలుకను నక్షత్రము
పండ్లను పరుసవేది - భుజమున - శంఖచక్రములు గలవు

వీపున వింజామరం - నాతండ్రి -బొడ్డున పారిజాతం
అరికాళ్ళ పద్మములను - అన్నియూ - అమరెను కన్నతండ్రీ
నీరూపు నీచక్కనా - ఆ బ్రహ్మ - యెన్నాళ్ళు వ్రసెతండ్రీ
అన్నెకరి కడుపునా - ఓ అయ్య - ఏల జన్మిస్తివయ్య

మా యన్న కంసరాజు - ఇప్పుడూ - వచ్చు వేళాయెరన్నా
నిన్ను నే నెత్తుకోని - ఏ త్రోవ - నేగుదుర కన్నతండ్రి
ఆ చక్కదనము జూచి - దేవకి -శోకింపసాగె నపుడు
తల్లి శోకము మాంపగా - మాధవుడు - గట్టిగా ఏడ్వసాగె

శోకంబు చాలించియూ - దేవకి - బాలుణ్ణి యెత్తుకొనెను
నాయన్న వూరుకోరా - నాతండ్రి - గోపాల పవళించరా
అల్లడుగొ బూచివాడు - నాతండ్రి - వస్తాడు పవళించరా
బూచులను మర్ధించనూ - నలినాక్షి - బుద్ధిమంతుడను అమ్మా

బూచేమి చేసునమ్మా - నాతల్లి - బూచి నన్నెరుగు నమ్మా
నీ పుణ్యమాయె కొడుక - నీవొక్క - నిముషంబు తాళుమనుచు
అల్లడుగొ జోగివాడూ - నాతండ్రి - వస్తాడు పవళించరా
జోగి మందుల సంచులూ - ఏవేళ - నాచంక నుండగాను

జోగేమి చేసునమ్మా - నా తల్లి - జోగి నన్నెరుగునమ్మా
నీ పుణ్యమాయె కొడకా - నీవొక్క - నిముషంబు తాళుమనుచు
అల్లదుగొ పాము వచ్చె - నాతండ్రి - గోపాల పవళించరా
పాముల్ల రాజె అయిన - శేషుండు - పానుపై యుండగానూ

పామేమి చేసునమ్మా - నళినాక్షి - భయము నీకేలనమ్మా
నీలి మేఘపు చాయలూ - నీమేను - నీలాల హరములునూ
సద్గురుడు వ్రాసె నాడు - నాతండ్రి - నీరూపు నీచక్కన
నిన్ను నే నెత్తుకోనీ - యే త్రోవ - పొదురా కన్నతండ్రీ

నాకేమి భయములేదే - నాతల్లి - నకేమి కొదువలేదే
మా మామ కంసుకుండు - ఈ వేళ - నన్ను వెరపించవస్తే
మా మామ నాచేతనూ - మరణామై - పొయ్యేది నిజముసుమ్మూ
వచ్చు వేళాయెననుచూ - నాతల్లి - వసుదేవు పిలువనంపూ

గోపెమ్మ బిడ్డ నిపుడ్ - శీఘ్రముగ - తెచ్చి నీవుంచవమ్మా
అంతలో వసుదేవుడూ - బాలుణ్ణి - తలమీద ఎత్తుకొనెనూ
రేపల్లె వాదలోనూ - గోపెమ్మ - ఇంటనూ వచ్చెనపుడూ
గోపెమ్మ పుత్రినపూడూ - వసుదేవు - భుజముపై నెక్కించుకూ

దేవకీ తనయు డపుడు - పుట్టెనని - కంసునకు కబురాయెను
ఝల్లుమని గుండెలదర - కంసుండు - పీఠంబు దుమికె నపుడూ
జాతకంబులు చూచెనూ - గండంబు - తగిలెనని కంసుకుండు
చంద్రాయుధము దూసుకా - శీఘ్రముగ - దేవకి వద్దకొచ్చె

తెమ్మని సుతునడిగెను - దేవకి - అన్నదీ అన్నతోనూ
మగవాడు కాదురన్న - ఈ పిల్ల - ఆడపిల్ల నమ్మరా
ఉపవాసములు నోములూ - నోచి ఈ - పుత్రికను గంటినన్నా
పుత్రి దానము చేయరా - నాయన్న - పుణ్యవంతుడవురన్నా

దేవాదిదేవులైన - బ్రహ్మ రు - ద్రాదులకు పూజచేసి
పూజ ఫలములచేతనూ - వారికృప - వల్ల పుత్రికను గంటీ
నీ పుణ్యమాయెరన్న - నీవు పు - త్రికను దయచేయుమన్నా
నిర్దయాత్మకుడవగుచు - నీవిట్లు - చేయుటతగదురన్నా

ప్రేమతో చెల్లెలపుడు - అన్నను - చెయిబట్టి బ్రతిమాలెనూ
గంగాది నదులయందూ - పుత్ర దా - నము చేయమని వేడెనూ
కాదు కాదని కంసుడు - దేవకి - పుత్రికను అడిగె నపుడు
అడ్డాలపై బాలనూ - పుచ్చుకొని - ఎగరేశి నరకబోయె

అంబరమునకు ఎగురగా - వేయునపు - డా బాల కంసు జూచి
నన్నేల చంపెదవురా - నీయబ్బ - రేపల్లె వాడలోను
పెరుగుతున్నాడ వినరా - కృష్ణావ - తారమై జన్మించెనూ
నిజముగా దోచెనపుడూ - కంసుండు - యేతెంచి పవళించెనూ

రేపల్లె వాడలోనూ - పెరుగుచు - న్నాడనీ దిగులొందెను
నీ యబ్బ నీ తాతరా - కంసుడా - కృష్ణుండు పుట్టెననుచూ
చల్లమ్ము వారలెల్లా - ఆకబురు - చక్కగా చెప్పగాను
పూతకికి కబురాయెను - అప్పుడా - పూతకి చనుదెంచెను

శృంగారముగ పూతకీ - స్తనములకు - విషధార పూసుకొనెను
రేపల్లె వాడలందూ - కృష్ణుండు -  తిరుగుచున్నా చోటకూ
చనుదెంచి విషపు పాలూ - ఇవ్వనూ - సమకట్టి ఇవ్వగానూ
బాలురతొ బంతులాడ - కృష్ణూని - బాలురందరు కొట్టగా
కావుకావున ఏడ్చుచు - పరుగెత్తి - వీధినడుమన నిలచెనూ
--((*))--
 మీదగ్గర బ్లాగుల్లో నిక్షిప్తంగా శ్రీకృష్ణుని పాటలు ఉంటె నాకు పంపితే నేను ఈ వెబ్ సైట్ లో పొందు పరుస్తాను 
శ్రీకృష్ణుని లీల చదువుతన్న వారందరికీ కృతజ్ఞతలు - ఆభగవానుడు ఆయురారోగ్యములు కల్పిస్తాడని నా నమ్మకం 

No comments:

Post a Comment