Friday, 13 October 2017

శ్రీకృష్ణ లీలామృతం - 3

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ: - శ్రీ కృష్ణాయనమ:

ప్రాంజలి ప్రభ శ్రీ కృష్ణామృతం  (3 /1) 

శ్రీకృష్ణుని జననము 

భగవానుని అవతారము ప్రారంభ సమయంలో సమస్త దిక్కులు శాంతి సౌభాగ్యములతో కూడిన వాతావరణము నెలకొనెను. అసమాయమున అన్నీ శుభ శకునములు ఏర్పడెను, ఆకాశములోను శుభ నక్షత్రములు కనిపించెను. సరోవరములు వికసించిన పద్మములతో సుందరముగా ఉండెను. పక్షలు మధుర స్వరంతో గానము చేస్తుండగా మొగనెమళ్ళూ ఆడనెమళ్లతో కలసి అంనందముగా నాట్య మాడు చుండెను. వాయువు వివిధ సుఘాంధ పరిమళాలతో దేహమును సుఖ స్పర్శ కలిగించు చుండెను. చల్లని గాలులు వీచు చుండెను. మేఘములు పుష్పములవలె జల్లులు కురిపించు చుండెను.   రాక్షసుల భయము వలన ఆగిన యజ్ఞములు మరలా బ్రాహ్మణులు  ప్రాంభించిరి. రోహిణి నక్షత్రమున భగవాన్ శ్రీకృష్టుడు జన్మిస్తున్నాడని మహర్షులు దేవతలు సంతోషముతో పుష్ప వర్షమును కురిపించ సాగిరి. గంధర్వులు, కిన్నెరులు గానము చేయసాగిరి. సిద్దులు, చరణులు దేవాది దేవునిని స్తుతించ సాగిరి. స్వర్గ వాసులంతా ఆనంద పారవశ్యములో మునిగి పోయారు.            

సమస్త ప్రజానీకానికి ఈరోజు ఎంతో శుభదినము, ఒక మహనీయుడు ఉద్భవిస్తున్నాడు, ప్రజల కష్టాలు తెలుసుకొనే మహాత్ముడు జన్మిస్తున్నాడు, దివ్య ధ్వనులు ఆకాశము నుండి వెలుబడు తున్నాయి.       

దేవకీ దేవి భగవాన్ విష్ణువుని వేడుకుంటున్నది. నీకు గౌరవ పూర్వక మైన ప్రణామములు సమర్పించు కొను చున్నాను. నీవు సర్వ అవ్యక్త శక్తికిని నిర్దేశకుడవు, భౌతిక ప్రకృతికి చివరి ఆశ్రయమవు ప్రభు. కనుక నన్ను ఉగ్రసేన పుత్రుడైన కంసుని క్రూర హస్తముల నుండి రక్షించమని ప్రార్ధించు తున్నాను. ఈ భయంకర విపత్తునుండి దయతో ఉద్దరించమని కోరుచున్నాను. నీవు తాత్కాలికంగా మా చర్మచక్షువులకు అదృశ్యముగా ఉండుమని ప్రార్ధించు చున్నాను. మరోమాట నీవు సాధారణ శిశువు రూపమున జన్మించ మని కోరుచున్నాను. నీవు అవ్యాజ కృపచేత నా గర్భము నుండి ఉదయించ బోతున్నావు. నీ భక్తులను ఆనంద పరచుట కొరకై  నీవు సామాన్య మానవుల చర్యలను అనుకరించుట నాకు ఆశ్చర్యము కలిగిస్తున్నది. 

ప్రాంజలి ప్రభ శ్రీ కృష్ణామృతం  (3 /2) 
శ్రీకృష్ణుని జననము 

ఓ పరమాత్మా మీ లీలామృతం ఏమిటో నేను అర్ధం చేసుకొనే శక్తి నాకు లేదు, నీవే మమ్ము కలిపావు పుత్రులను కనే వీలు కలిపించావు, ఆరుగురు పుత్రులను నీ దగ్గరకే తీసుకెల్లఁవు, నాకు గర్భ శోకం ఎందుకు కల్పించావు, ఇది మేము చేసుకున్న కర్మ ఫలితమని అనుకుంటున్నాము, అయినా నిరంతరం నీ ధ్యానంలోనే ఉన్నాము నాకు సప్తమ గర్భం కల్పించి అంతలోనే గర్భాన్ని మార్పించావు. మాములుగా బిడ్డల జననం వీర్యం గర్భసంచిలో చేరి పిండంగా మారి నవమాసాలు మోసిన అనంతరం భూమిపై ఉద్భవించటం జరుగుతుంది. కానీ నీ జన్మ విషయం మాకు అర్ధం కావటం లేదు.

వసుదేవుని నిస్కల్ముషమైన హృదయంలో నెలకొనిన భగవానుని స్వరూపము ఉజ్జ్వలంగా ప్రకాశిస్తున్న సూర్యునివలె సంపూర్ణ శక్తులతో సహా వసుదేవుని హృదయం నుండి నా  హృదయమునకు పంపబడెను, అస్తమిస్తున్న సూర్యకిరణములు తూరుపున ఉదయించినట్లుగా                 
నాలో జీవం పోసుకున్నావా పరమాత్మా.  

పరమాత్మ నీవు నాలో నిగురుకప్పిన నిప్పువలె, కుండలో ఉంచిన అగ్నివలె ఉన్నావు నీ లీలామృతము ఎవరు తెలుసుకోగలరో వారు పుణ్యాత్ములు. 

ఓ కమలాక్షా సుద్ధసత్యమునకు మూలస్థానము.  మహర్షులు కేవలము నీ పాద పద్మములనే ధ్యానించి అజ్ణానమనే మహాసముద్రమును సులభముగా దాట గలుగు తున్నారు. భౌతిక సంసారమనే మహా సాగరమును దాట గలుగు తున్నారు. నేను ఎంతో పుణ్యము చేసుకొని ఉన్నాను నిన్ను మోసే శక్తి నాకు ఇచ్చావు, నీవు నాలో చేసే అల్లరి నాకు ఎంతో తృప్తి కలిగిస్తున్నది, గతంలో పెరిగిన బిడ్డలకు నీకు చాలా వ్యత్యాసం ఉన్నది, ఎందుకంటే నీవు నాలో పెరుగుతుంటే నాకు చాలా సంతోషముగ ఉన్నది. నీఅంతరం నాలో ఉంటె నాకు ఎంతో తృప్తిగా ఉంటుంది. 

హృదయంలో ఉన్న పరమాత్ముడు ఆ రాత్రి సమయంలో భగవంతుని సేవ కొరకే అవతరించిన దేవత అయినట్టి దేవకి మాత ఎదుట దేవాది దేవుడైన పరమాత్ముడు అవతరించెను. 
" నాలుగు భుజములలో శంఖ, చక్ర, గదా, పద్మమును మరియు శ్రీ వత్స చిహ్నముతో కౌస్తు  భదారి పీతాంబరుడు, నీలమేఘశ్యాముడిగా, ఉజ్జ్వలంగా, వైడూర్య కిరీటి అముల్యమైన కంకణ కుండల కేయూరములను అనేక భూషణములతో సర్వాంగ సుందరముగా అందమైన నీలికురులతో  అద్భుతమైన అవతారము దేవకీ వసుదేవులకు కని పించెను. 

దేవకీ వసుదేవుల ప్రార్ధించిరి, భౌతిక శక్తికూడా నీ నుండి వెలు బడుటచేత నివే మూలాధారము. నిన్ను త్రిగుణాలు కప్పలేవు, బ్రహ్మజ్యోతి నుండి సమస్త సృష్టి సంభవిస్తుంది. దానికి మూలం నీవే. నీవే మమ్ము ఉద్ధరించే మహానుభావుడవు, అన్నమాటలు వింటూ పరమాత్ముడు అంతర్ధాన మయ్యెను. 

అప్పుడే బ్రహ్మదేవుడు, ఇతరులైన ఇంద్రాది దేవతలు, నారదాది మునీస్వరులు, మొదలైన వారందరు ఆపరాత్పరుని స్తుతించుట మొదలు పెట్టిరి. అపారమైన తేజస్సుతో ఉన్న తనయొక్క భౌతిక రూపముతో, భూదేవి భారమును, మోయు దుఃఖమును తొలగించుకు దుష్టసంహారము శిష్ట రక్షణకు శ్రావణ మాసం కృష్ణ పక్షంలో అష్టమి తిధినాడు అర్ధరాత్రిన పరమాత్మ ఉదయించాడు. 

తన గర్భాన ఉదయించిన పరమాత్మను దర్శించుకొని పరవశయైన దేవాకి కంసుని విషయం  గుర్తుకు రావడంతో కంపించి పోయి స్వామితో " కృష్ణా నువ్వు జన్మించిన విషయం కంసునికి తెలియ నివ్వవద్దు, గతంలో అందరిని చంపినట్లు నిన్ను కూడా చంపేస్తాడు అంటూ మొరలిడింది" నిజ రూపముతో ఈ విషయమై మీరేమి భయపడ నవసరంలేదు అంటూ అభయ మిచ్చి పుట్టిన పురిటి కందులా మారిపోయాడు. ఆ సమయంలో దేవకి వసుదేవుల కుడా ఓ విధమైన మాయకు లోనౌయ్యారు. ఆ ప్రభావంవల్ల అంతకు ముందు స్వామి తమకు దర్శనమిచ్చిన సంగతిని మరిచిపోయి, ఆమెకు ఎనిమిదవ సంతానం కలిగందను కున్నారు.           
                                                                                               సశేషం  
ప్రాంజలి ప్రభ శ్రీ కృష్ణామృతం  (3 /3) 
శ్రీకృష్ణుని జననము 


మాతా స్వయంభువ మన్వ0తరంలో న తండ్రిఐన వసుదేవుడు ప్రజాపతులలో ఒక్కడు అతని పేరు సుతపుడు. నీవు అతని భార్య పృశ్ని . మీరు నాకోసం 1200  సంవత్సరములు తపస్సు చేసినారు. మీ తపస్సుకు మెచ్చి నేను వరము కోరుకోమనగా మీరు నాతో మూడుసార్లు పుత్రులుగా జన్మిమ్చమని కోరినారు అదే విధముగా నేను మీకు పుత్రులుగా జన్మిస్తున్నాను " మొదట జన్మలో మీకు నేను పుత్రుడగా జన్మించాను, అప్పుడు నాపేరు పృశ్నిగర్భుడు, తరువాత జన్మలో మీరు అదితి కశ్యపులుగా జన్మిమ్చారు, మీకు పుత్రునిగా జన్మిమ్చాను, అప్పుడు నాపేరు ఉపేంద్రుడు పొట్టివాడుగా ఉండుటవల్ల వామనుడు అన్నారు. ఆ తరువాత ఈ జన్మ లో మీకు జన్మిస్తున్నాను. ఈజన్మలో నాపేరు కృష్ణుడుగా  పిలుస్తారు. నాప్రియమైన జనకులారా మీరు నన్ను పెక్కుసార్లు ప్రేమాదరములతో పెంచినందున నేను సంతోషించి క్రుతజ్ఞతా బద్ధుడనైతిని. మీరు మీ కర్తవ్యము నెరవేరగానే భగవద్ధామమును పొందగలరు. ఇక మీకు కంసుని వలన భయము అవసరములేదు. కనుక నన్ను వెంటనే గోకులమునకు తీసుకెళ్లి యశోదకు ఇప్పుడే జన్మించిన ఆడ శిశువుతో నన్ను మార్పిడి చేయుడని ఆదేశిస్తున్నాను అని తెలిపి అంతర్ధాన మయ్యెను. 

దేవాది దేవుని ఆదేశాను ప్రకారము అప్పుడే పుట్టిన బాలుని ఒక తట్టలో పెట్టి దానిని నెత్తిపై  పెట్టుకొని కారాగారమునుండి బయటకు వచ్చుటకు ప్రయత్ని0చెను. యోగమాయ శక్తి వలన కంసుని అంత:పుర వాసులందరు గాఢ నిద్దర్లోకి జారుకొనగా, ద్వారాల గడియలన్నీ ఊడగా
అప్పుడే పెద్ద వెలుగు వచ్చింది, బ్రహ్మాండమైన వర్షము మొదలైనది, అయిన బయటకు నడుస్తూ ఉన్న వసుదేవుని తట్టలో ఉన్న శ్రీ కృష్ణుడు తడవ కుండా శేషుడు పడగ కప్పగా, యమునా నది చేరగా, నది రెండుగా చీలి దారి చూపెను.  ఆవల గట్టున ఉన్న గోకులంలో ఉన్న నంద మహారాజు గృహమును చేరెను. అక్కడ దేవమాయ వళ్ళ అందరు నిద్రలో మునిగి ఉన్నారు శ్రీ కృష్ణనిని యశోద వడిలో ఉంచి, అప్పుడే పుట్టిన ఆడ శిశువును బుట్టలో పెట్టుకొని వచ్చన మార్గమున వెనక్కు వచ్చి చెరసాలలో చేరి యధావిధిగా ఇనుప సంకెళ్లను తగిలించుకొని  ఉండెను.

యోగమాయ చేసినవి ఎవరూ తెలుసు కోలేక ఉన్నారు. అప్పుడే చెరసాలలో  పిల్ల ఏడుపు వినగా సైనికులు మేల్కొన్నారు ఆవిషయం కంసుని తెలపాలని వెళ్లారు 

                                                         మిగతా కధలో కంసుని కూర చర్యలు తెలుసుకుందాం                                 
                       
   

1 comment: