Friday, 23 June 2017

`100`


-----------శుభోదయం-------సుభాషితాలు-------------------
కారణమైన కర్మములు కాక దిగంబడ వెన్ని గొందుల౦
దూరిన నెంతవారలకు, దొల్లి పరీక్షితు శాపభీతుడై
వారిధి నొప్పు నుప్పరిగపై బదిలంబుగ డాగియుండినన్
గ్రూర భుజంగ దంతహతి గూలఁడె లోకు లెఱుంగ భాస్కరా!
శాప భయమున సముద్రమందు గట్టబడిన మేడలో జాగ్రత్తగా నుండిననూ పరీక్షిత్తు
పాము కాటుచే మరణించినట్లు కారణభూతములైన కర్మములు పూనుకొనిననే గాని ఎన్ని ప్రయత్నములు చేసిననూ కావాలినవి కాకమానవు. మనము ఎక్కడ చావవలెనని వ్రాసి వుండిన కర్మ మనలను అక్కడికి కొనిపోవును.
"రాకన్మానవు హానివృద్ధులు మహారణ్యంబులో డాగినన్
పోకన్మానదు దేహమేవిధమునన్ బోషించి రక్షించినన్
గాకన్మానవు పూర్వజన్మకృతముల్ గాగల్గు నర్థంబులున్
లేకన్మానవదెంత జాలిబడినన్ లేముల్ సిరుల్ రాఘవా !--
పిలువకుండ వచ్చి పెద్దమాటలు చెప్పు
వానినెపుడు నమ్మ వలదు,వలదు
మేలు కలుగబోదు మెరమెచ్చుల కతండు
తప్పు చెప్పుచుండు గుప్పుస్వామి
చెప్పుడు మాటలు వింటే చెడిపోతారు. దానివల్ల మేలు జరగదు.కీడు జరుగును అంటున్నాడు కవి.
గుణి యెఱుగు గుణుల గుణములు
గుణహీనుండేమి యెఱుంగు గుణులగుణంబుల్
గుణనిధి తుమ్మెద కమలము
గుణమెఱుఁగునుగాక, కప్పు, గుణమేమెఱుఁగున్
గుణవంతుడైన వాడికే గుణవంతుల గుణములు తెలుస్తాయి. గుణహీనుడికేలా
తెలుస్తాయి?కమలము యొక్క సువాసన,అందులోని మధువు తెలివైన తుమ్మెద గ్రహిస్తుందికానీ కప్పకేమి తెలుస్తుంది?
మూడుం డెఱుగునె సత్కవి
గూఢోక్తుల సారమెల్ల గోవిదుని వలెన్
గాఢాలింగన సౌఖ్యము
ప్రౌఢా౦గన యెఱుంగు గాక బాలేమెఱుఁగున్
---------------------------------
బరువు సంచులు మోస్తారు బాల్యమందే మెడలు.వీపులు, నడుములు సడలి పోవ
యెంత చదివేరో యీ మోత కేమి ఫలమో పాప మనిపించు పసివారి పాటు చూసి
పుస్తకాల సంచి బువ్వ డబ్బా, నీళ్ళు, సాక్సు, బూట్సు, టైలు చాల కలవు
యింటి ముందు కొచ్చి యెక్కించుకొని పోవు వాహనాలు కలవు

No comments:

Post a Comment