Saturday, 31 May 2025

 



వేంకటేశాయ నమః (19)

సామర్ద్యసేవలు విశాల సహాయమా శించి నే నిన్ను చేరే 
సామాన్య పోరులు యసోవిధిమార్గమే యాసించి నే నిన్నుచేరే 
ప్రామాణికమ్మగు యుపాయ  విధానమే యాసించి నే నిన్ను చేరే 
క్షేమమ్ము కామది నిక్షేప జయమ్ము నివ్వా నీపాద సన్నిధి చేరే వేంకటేశాయ నమః 

దేహమ్ము యర్పణ మదీయ సమర్ధతతో నిన్ను ప్రార్ధించెదా 
దాహమ్ము తప్పదుప్రధానసుచిత్ర మేలుగానిన్ను ప్రార్ధించెదా 
స్నేహమ్ము జేయుటసుశీలసహాయమేలుగానిన్ను ప్రార్ధించెదా 
ప్యూహమ్ము మాదిరె సుపూజ్య సుదీక్ష గనేనిన్ను ప్రార్ధించెదా వేంకటేశాయ నమః 

ప్రాణమ్ము తప్పదు సుపాధ్య సుధర్మమార్గమ్ నిన్ను వేడెదా 
ధ్యానమ్ము నిత్యము విధానయుపాస వైనమ్ నిన్ను వేడెదా 
మౌనమ్ము దారగు విమోచనమేను మూలమ్ నిన్ను వేడెదా 
జ్ఞానమ్ము  దానము విజ్ఞానము నస్సు నీ దయ కృపయే 
వేంకటేశాయ నమ:

 ప్రీతల్లె నీవగు సుపేక్ష సుఖమ్ముగానేమాకోరికలు తీరుస్తావు 
ఖ్యాతల్లె నీకళ విఖ్యాతభవమ్ముగానేమాకోర్కెలు తీరుస్తావు 
శ్వేతల్లె రూపగు ప్రసిద్ధి ప్రభావ మోనేమాకోరకలు తీరుస్తావు 
స్వాతి ల్లె హృద్యము ప్రశాంతి మనస్సు నీ దయ కృపయే వేంకటేశాయ నమః
******
వేంకటేశాయ నమః (20)

ఇన్నియు చదువనేల యింతా వెదక నేల 
కన్నడు సరివిధాన మంతా చదవ జూడ 
కన్నుదెరచుటొకటె కనుమూయుటొకటే 
మన్ను మరచునొకటె మనసైనదొకటే 
||..పల్లవి..
చరణం(01)
వలెననే దొకమాట వలదనేదొకమాట 
ఫలమనే నొకపంట నిష్పలమనే పంట 
గళమనె నొక యాట పోరుగనునె మాట 
మనసున విధి వేట మలుపు కళల తోట 
 || ..చరణం...
పుట్టెడిదొకటె పోయెడిదొకటే
పట్టెడి దొకటె పారెడి దొకటే 
గుట్టుగ నొకటె గుప్పెట నొకటే 
రట్టుగ నొకటె రమ్యత నొకటే 
వొట్టిన విజ్ఞానులకు నుపమిదియొకటే || .
..చరణం..
పరమమనే దొక్కటె ప్రపంచమొక్కటే
తరుణమనే దొకటె తన్మయ మనేదొకటే 
శరణా గతులకెల్ల సతమీతడొకడే.
కరుణా మదిగనెల్ల కతనౌనుడొకడే 
 శ్రీ వేంకటేశు డిహపరములతడే 
సర్వ జన రక్ష,దీక్ష, శిక్షకు డతడే 
****

#everyonehighlights

శ్రీ శ్రీ శ్రీ వెంకటేశాయనమః (21)

కష్టాల చీకట్లెన్నో చూచిన ప్రాయం 
ఇష్టాలు తరుణంలో తీర్చిన ప్రాయం
నష్టాలు సంపదలో చూచిన ప్రాయం
ఎలా చెప్పేది, ఏమి చెప్పేది వేంకటేశా

కలతల తీరాలనెంటినో దాటిన హృదయం 
కొలతలు మార్చాలనెంటినో ధాటిగ హృదయo
అలకలు తీర్చేగతేంటినో నేటిగ హృదయం
ఎలా చెప్పేది, ఏమి చెప్పేది వేంకటేశా

కన్నీళ్ళ కడలిని మదిలోన దాచిన నిబ్బరం 
పన్నీరు బడలిక విధిగాను చూచిన నిబ్బరం
మున్నీరు మునకగు జతగాను వేచిన నిబ్బరం
ఎలా చెప్పేది, ఏమి చెప్పేది వేంకటేశా

సుఖాల భోగాలను త్యజించిన జీవితం 
వికాశ భావాలనె త్యజించిన జీవితo
ప్రకాశ మై చీకటి త్వజించిన జీవితం
ఎలా చెప్పేది, ఏమి చెప్పేది వేంకటేశా

భిన్న మనస్తత్వాలను చదివిన అనుభవం 
కన్న గుణ స్తత్వాలను తెలిపిన అనుభవం
ఉన్న రుణస్తత్వాలను మలిపిన అనుభవం
ఎలా చెప్పేది, ఏమి చెప్పేది వేంకటేశా

బతుకులో ఢక్కామక్కీలెన్నో తిన్న కాయం 
మెతుకుకై చెక్కా ముక్కా లెన్నో తిన్న కాయం
అతుకుకై ఆశా పాశా లెన్నో మార్చే కాయం
ఎలా చెప్పేది, ఏమి చెప్పేది వేంకటేశా

బాధలెదురీతతో సంసారాన్నీదిన సహనం
మోదమది మాయతో సాహిత్యాన్నీదిన సహనం
బేధ విధి దేహితో దాహత్వాన్నీ దిన సహనం
ఎలా చెప్పేది, ఏమి చెప్పేది వేంకటేశా

మంచిచెడుల లోక నైజాన్ని తెలసిన జ్ఞానం
ఎంచిన గతి ద్రోహ వైనాన్ని తెలిపిన జ్ఞానం
సంచిత మది దాన ధర్మమ్ము తలపుల జ్ఞానం
ఎలా చెప్పేది, ఏమి చెప్పేది వేంకటేశా

ఎంతచెప్పినా తక్కువే వేంకటేశా
ఎలా చెప్పేది, ఏమి చెప్పేది వేంకటేశా

@మల్లాప్రగడ రామకృష్ణ
*******
శ్రీ వెంకటేశ్వర నమః (22)

నా జన్మకలయిది నాస్వామి దీవించుమయా 
 ఈ జన్మకిది సరి యీనాడు నవ్వించుమయా 
 ఈ జన్మ కథ ఇది శ్రీ స్వామి మన్నించుమయా 
ఆజన్మ విధియన ఆ స్వామి ప్రేమించుమయా 

 మాయా లోకమిది మర్మం తెలియక వేడుకుంటున్నాను స్వామి 

హృదయములు నయనాలు కలిసె రహస్యమ్ 
వినుము దేవా పరామరహస్యమ్ 
మరిఒకరు తెలియరాని మధుర రహస్యమ్ 
మనమధ్య నిలిచి పోయే ముఖ్యరహస్యమ్

 జీవిత రహస్యాలు మీకే తెలియపరుస్తున్నా స్వామి 

డెందమున అందమైన నటనలు యనకుమా 
పందెమున పొందికేను మమతలు కలుపుమా 
సందడిగ బంధమేను బ్రతుకులు తెలుపుమా 
చిందెనులె చందనమ్ము మనసునె కలుపుమా 

 మన మధ్య బేధాలు లేవు కేవలం అంతర్ మదనమే స్వామి 

 నోరు మూసుకుని కూర్చున్నా ముని కాలేకపోతిని 
 కళ్ళు మూసుకుని కూర్చున్న యోగి కాలేకపోతిని 
 చెవులు మూసుకుని అంతరజ్ఞానాన్నివింటే జ్ఞాని కాలేకపోతిని 
 సత్యం ధర్మం న్యాయం తెలిసిన ఆచరించలేకపోతిని 

 అన్నీ మీకే చెప్పా మీ ఆజ్ఞ కోసం వేచి ఉన్నాను స్వామి 

 గోవిందా గోవిందా గోవిందా నమో నమో వెంకటేశాయ నమః
#everyonehighlights
*****

శ్రీ వెంకటేశాయ నమః(23)

మమ్ము ఆడిస్తావు మంత్ర, తంత్ర, కుతంత్రాలతో ఎందుకు వేంకటేశా..
ఈ మనసు మాయ మార్చలేవా వెంకటేశా...

అందమంటే నీదే.. అందం అది చిత్రమే
ఆదమరచలేని అద్భుతం.. అదీ విచిత్రమే
అందరి నాదు కొనే ప్రాణం... అది పవిత్రమే
ఆత్మ బంధువు గానేవైనం..అదీ తంత్రమే

మమ్ము ఆడిస్తావు మంత్ర, తంత్ర, కుతంత్రాలతో ఎందుకు వేంకటేశా..
ఈ మనసు మాయ మార్చలేవా వెంకటేశా...

ప్రాణమున్న పైడిబొమ్మను నేను,పారిజాత పూల కొమ్మను నేను,
పగడాల పుత్తడి బొమ్మవు నీవు, ముత్యాల నవ్వుల మోము నీవు

ఈ మనసు ఆడిస్తుంది దేవా, ఎలా ఎలా చెప్పాలి నీకు దేవా

చరణం
నాకు ఆకలుండదే, దాహముండదే.. ఆకతాయి కోరిక కొరుక్కు తంటదే.. మనసు... ఓ దేవా

నన్ను ఎదో చేయ మంటదే, ఆగ మంటదే, ఆశలొద్దoటదే, అద్దమల్లె ఉంటదే... మనసు...ఓ దేవా..      మ
చరణం
వేయి చెప్పిన, లక్ష చెప్పిన,
లక్ష్య పెట్టదే, ఇదేమి తొందరా అంటుందే మనసు.. ఓ దేవా

నిలవనీదు, నిదురపోదు, వగలమారి, వయసుపోరు, ముసుగు తీయమంటదే.. మనసు.. ఓదేవా..      మ

చరణం
చిలిపి ఆశలు తీర్చమంటదే, చిత్తమందు చిత్రమంటదే, విచిత్రం చూడమంటదే... మనసు
ఓ దేవా

కనుచూపు కనికరమంటదే, కరుణ కాల మీదే నoటదే, కావలసిన వన్నీ దోచమంటదే మనసు.. ఓదేవా...       మ

ఒకరితో యేగలేకయున్నా, ఇరువురితో యేల నున్నవయ్యా వేంకటేశా

మమ్ము ఆడిస్తావు మంత్ర, తంత్ర, కుతంత్రాలతో ఎందుకు వేంకటేశా..
ఈ మనసు మాయ మార్చలేవా వెంకటేశా...

గోవిందా గోవిందా గోవిందా
#



శ్రీ వెంకటేశ్వరాయనమః(24)

ఎన్ని యుగాలైన నీకోసం ధ్యానమ్ చేస్తూ వేచివుంటా
కడ ఊపిరి ఆగు వరకు నిలిచివుంటావా... వేంకటేశా

సమాధాన మే లేని ఓ ప్రశ్నలా నేను మిగిలిపోతుంటా
నువ్వొచ్చునంతవరకు పొగిలివుండమంటా... వేంకటేశా

నువు నడిచిన దారులన్ని నీ గురుతులుగా నేను దాస్తుoటా
నినువెదుకుతు నాచూపుల మలిగివుండ మంటా... వేంకటేశా

విరిని తావి వీడనట్లు నిను వీడక నీదు చెలిమినై నుంటా
చెలమలో ఊట నీరుగ ఉబికి వుండమంటా...వేంకటేశా

విధి చేసిన చేదు వింత ఎడబాటును నేను కోరనంటా
కలత అలల ఎగసి పడిన కృంగివుండమంటా...వేంకటేశా

చల్లని వెన్నెల ఉన్నా వెలుగునే జాడగా నుంటా
నేను వచ్చు నిశీధిలో తెలిసి వుండమంటా...వేంకటేశా

మమతలన్ని మాయమైన తలచి తలచి వగపేనుంటా
శిశిరంలో మోడువోలె మగ్గి వుండమంటా... వేంకటేశా

ప్రేమ పల్లకి మోయగ నే  బోయీనై ఉంటా 
నీ దరికే చేరుదాకా ఒదిగివుండమంటా... వేంకటేశా

ఒకనాటిది పూలబాట నేడది నాకు ఓ ముళ్ళబాటా
నెత్తురులను చిందిస్తూ నడిచి వుండమంటా... వేంకటేశా

స్వర్గమో, నరకమో నీ చెంతనె ఉండాలని ఉంటా
నేను లేని తావులలో ఆగివుండమంటా... వేంకటేశా

నీ ధ్యాసే ఉసురు నిలుపు పూర్ణసుధా 'మధు కలశం'నంటా
సతతము నీ నామమునే తలిచియే వుండమంటా ... వేంకటేశా
*-****

ఓం శ్రీ రామ శ్రీ మాత్రే నమః.. 25.

శరణ్య రామా చరాచరాధిప రమ్యుని భావ రామా
తపోధనుల చెంత వెలిసిన తేజోమయ రామా
జ్ఞానదాయకునై వెలుగుని పంచు గుణాతీత రామా
దీనజనుల పాలనకున్ దయార్ద్ర హృదయ రామా

వేదాంత సారస్వతికి వెలుగు నీవై రామా
నాదబ్రహ్మ స్వరూపముని నిను నలుపెనా రామా
ధర్మమార్గం చూపెడువాడవు జగదాధార రామా
సీతాసహితుడవు సర్వలోకానుగ్రహ రామా

రావణకుళమున్ రణరంగమున కణగణించిన రామా
అనరఘవీర్యుడవై అహంకారవిధ్వంస రామా
కరుణాసంధానవదనమున కలిసిన దివ్య రామా
సర్వజనుల హృదయమున వెలసిన సత్య రామా

రామ విరామ రామ శుభ రాజ జగమ్మున రామ భద్రుడా
 భీమ పరాత్తరా సుగుణ భీకరలాంబుది రామ చంద్రుడా
 శ్యామ శుభాభిరామ గణ సంతస శోభిత రామ మిత్రుడా
ప్రేమ సు సత్య ధామ గతి ప్రీతి సు సంచిత రామ ధన్యుడా

మది రామా జయ భాష్య భావపరసుఖమ్మా ధ్యానాభి రామా సహా 
న్నిధి రామా సకలమ్ము శోభ కళమున్నీశ్వామా భి రామా ప్రభా
వ్విధి రామాస్థితి నీపదాల మనసేవిశ్వాస రామా నిజ 
మ్మది రామాప్రతి యర్పితాశుభగుణమ్మాయాభి రామా సుధీ

వరమనికోరరామ మది వాక్కుల మూర్తికి భూరి కీర్తికిన్
తరముననంతరామనిధి తాండవమౌనిమనోజ్ఞసంపదన్
కరములుతీరుశక్తిగను కాలము బాసర ధర్మతీరుగన్
నిరతము చేయునామనసు నిర్మల ధ్యానము రామ భక్తిగన్
******
-శ్రీ వెంకటేశ్వరాయనమః..26

కొసిరి కొసిరి అన్నం పెట్టే తల్లి
కసిరి కసిరి మంచి చెప్పె తండ్రి
విసిరి విసిరి ప్రేమ చూపె భార్య
రసిక హృదయమమ్ము  చూడుదేవ

చదివి చదివి విద్య నేర్పె గురువు
చెదిరి చెదిరి నీరు పొంగు చెరువు
ఎదిగి ఎదిగి వంగి పోవు తరువు
ఒదిగి ఒదిగి ప్రేమ జూపు దేవ

తెలిసి తెలిసి తప్పు చేస్తే తప్పు
వలచి వలచి ప్రేమ వద్దంటె తప్పు
వనికి వనికి చలిని ప్రేమిస్తే తప్పు
పరువు పరువు అంటూ ఉంటే తప్పు
తప్పు ఒప్పుల ముప్పు మార్చు దేవ

ఒకటి ఒకటి కలిస్తే వచ్చేది ఒప్పు
మనసు మనసు కలిస్తే వచ్చేది ని ప్పు
తనువు తనువు తడిస్తే వచ్చేది రొ ప్పు
వయసు వయసు తపిస్తే వచ్చేది మెప్పు
ఒప్పు నిప్పు గా మెప్పు తప్పేల దేవ

కలసి బతికి బతికిస్తే అదొక నేర్పు
అలసిన మనసును మన్నిస్తే ఓర్పు 
తలచి ఏకమైతే జీవితమంతా కూ ర్పు 
వలచి మప్పును తప్పును తప్పిస్తే తీర్పు 
మార్పులలో సుఖదుఃఖములు దేవ

కదిరిలా తిర్గు జీవితo చూడుము దేవ 
కుదిరిక లేని జీవితం చూడుము దేవ 

 గోవిందా గోవిందా గోవిందా 
శ్రీ వెంకటేశ్వరాయనమః
*****
*****
శ్రీ వెన్మటేశ్వరాయనమః
.. (27)
ఏ వేళ వొచ్చినా జన హేళ వేంకటేశ్వరా
నా వేళ నాకే తెలియదు స్వామి నీ లీల

భాను కిరణాలకు కమలం విచ్చిన వేళ
తాను తణువంతయి తకధిo తెచ్చిన వేళ
చందమామకు చందనమద్ది గోగుపూలు  కోసినవేళ
అందగత్తెకు అద్దమును జూపి ఆగి పూలు వేసినవేళ
నిన్ను కలుద్దామని అనుకున్నాను వేంకటేశ్వరా

కొలనులో కలువ పూసిన వేళ
మలుపులో మగువ కూసిన వేళ
అద్దంలో జాబిలిని చూసి మురిసిన వేళ
యుద్ధంలో ఆకలిని చూసి మెరిసిన వేళ
నిన్ను కలుద్దామని అనుకున్నాను వేంకటేశ్వరా

పొద్దున్నే మందారం పూసి నవ్విన వేళ
హద్దుల్లొ చిందాడే భామ నవ్విన వేళ
ఉదయ సంధ్య వేళలో
మాణిక్య దీపం వెలుగుతున్న వేళ
నిన్ను కలుద్దామని అనుకున్నాను వేంకటేశ్వరా

పుత్తడి ఆభరణాలకు మెరుగులద్దిన వేళ
ఆకాశం వెండి వెన్నెల ఒలకబోసిన వేళ
గగనాల తార భువిని చేరినవేళ
ఉదయకాంతి చూసిన వేళ
నిన్ను కలుద్దామని అనుకున్నాను వేంకటేశ్వరా

మరుమల్లిక నవ్విన వేళ
హేమంతంలో చే మంతులు పూసినవేళ
మంచులో గులాబి తడిసినవేళ 
ఎన్నో వర్ణాల పూలు కలిపి మాల కట్టినవేళ
నిన్ను కలుద్దామని అనుకున్నాను వేంకటేశ్వరా

ఎంత అందంగా ఉంది నీ వదనం యీ వేళ
నిజంలో నిజాయితీ బ్రతికిన యీ వేళ
ఎంత చూడ ముచ్చటగా ఉంది నీ వదనం యీ వేళ
అప్సరసలను  మరిపించేలా యీ వేళ
చూసే కొద్ది చూడాలనిపించేలా యీ వేళ 
నిన్ను కలుద్దామని అనుకున్నాను వేంకటేశ్వరా
****

No comments:

Post a Comment