శ్రీ వెంకటేశ్వరాయనమః.. 28
నీదెంత కఠిన హృదయమో
నేనంత మొండి మనిషినే
కలతలను సృష్టిస్తున్నావేమో
నీపై నమ్మకంతో బ్రతికేస్తున్నా....
నవ్వుతూ వెన్నముద్దారాగిస్తున్నావా గోపాలా.. గోపాలా గోపాలా
పైరు పచ్చగుంటే ముంచేస్తా వేమో
నూరేళ్ళ జీవితం నలిపేస్తావేమో
అంతులేని విషాదాన్ని దించేస్తావేమో
అయినా నీపై నమ్మకంతో బ్రతికేస్తున్నా.....
నవ్వుతూ వెన్నముద్దారాగిస్తున్నావా గోపాలా.. గోపాలా గోపాలా
జంటలను దూరం చేస్తున్నావేమో
పసిమోగ్గల ఊపిరితో ఆడుతున్నావేమో
ఆశల వలవేసి అల్లాడిసిస్తున్నా వేమో
అయినా నీపై నమ్మకంతో బ్రతికేస్తున్నా....
నవ్వుతూ వెన్నముద్దారాగిస్తున్నావా గోపాలా.. గోపాలా గోపాలా
కొరివిలా న్యాయ్యాన్ని కాల్చేస్తున్నా వేమో
ధర్మాన్ని చీకటిలో తోసేస్తున్నావేమో
సత్యాన్ని వక్రంగా మార్చేస్తున్నావేమో
అయినా నీపై నమ్మకంతో బ్రతికేస్తున్నా....
నవ్వుతూ వెన్నముద్దారాగిస్తున్నావా గోపాలా.. గోపాలా గోపాలా
జీవుల్ని బొమ్మలు చేసి ఆడిస్తున్నావేమో
అహాన్ని పెంచి...
కడలి కెరటంలా ఎగదోస్తున్నావేమో
అంతలోనే...
నిర్దయగా పడదోస్తున్నావేమో
అయినా నీపై నమ్మకంతో బ్రతికేస్తున్నా...
నవ్వుతూ వెన్నముద్దారాగిస్తున్నావా గోపాలా.. గోపాలా గోపాలా
గోవిందా గోవిందా గోవిందా
శ్రీ వెంకటేశ్వర నమో నమః
****
శ్రీ వెంకటేశ్వరాయణమోనమః..29
పగల పొగలైనా రగిలే సెగలైనా
మగువే తెగువైనా మనసే జిగురైనా
పగలే వికృతమ్మున్ పరువే జతకైనా
వగలే వరదమ్మున్ వలెపే జతకైనా
ఏమి చిత్రము ఇది ఏమి విచిత్రము జగన్నాధ
మమకారం మరచి, నుపకారం మరిచే
యపకారం మరిగె, యపవాదం పెరిగే
జవసత్వం తరిగె, జపహోమం పెరిగే
అవకాశం పరుగె, అనుకూలం విరిగే
ఏమి చిత్రము ఇది ఏమి విచిత్రము జగన్నాధ
ప్రజ్ఞా ప్రాభవం యంటూ యుత్తే జం
విజ్ఞానం అంటూ అర్ధం కాని అయ్యేమయ్యం
ఆజ్ఞ అంటూ రాజకీయ దుర్మదాంధం
అజ్ఞానం అంటూ అగమ్య గోచరం
ఏమి చిత్రము ఇది ఏమి విచిత్రము జగన్నాధ
శిల్పానికి పూజ లొకవైపు, ప్రేమతో పూజ యేమిటో
అందానికి పూజ మరోవైపు, కామంతో పూజ యేమిటో
పందానికి పూజ నొకవైపు, ఆశలతో పూజ యేమిటో
ఉద్రేకాన్ని పూజ మరోవైపు, భయంతో పూజ లేమిటో
ఏమి చిత్రము ఇది ఏమి విచిత్రము జగన్నాధ
కళ్ళలోని నీరు కళ్ళకు తెలవదే
గుళ్ళలోని పూజ మాయలు తెలవదే
ఇళ్లలోని సౌక్య మెవ్వరికి తెలవదే
ముళ్లలో జీవితమ్ముగుట తెలవదే
ఏమి చిత్రము ఇది ఏమి విచిత్రము జగన్నాధ
సిద్ధం అంటూ బంధం తప్పదే
యుద్ధం అంటూ జీవితం తప్పదే
భద్దం అంటూ మౌనం తప్పదే
బుద్ధం శరణం గచ్చామి
ధర్మం శరణం గచ్చామి
సంఘం శరణం గచ్చామి
సర్వం శరణం గచ్చామ... అంటూ
ఏమి చిత్రము ఇది ఏమి విచిత్రము జగన్నాధ యీ లోకం
ఏమి చిత్రము ఇది ఏమి విచిత్రము జగన్నాధ యీ వైనం
ఏమి చిత్రము ఇది ఏమి విచిత్రము జగన్నాధ యీ మౌనo
ఏమి చిత్రము ఇది ఏమి విచిత్రము జగన్నాధ యీ ధ్యానం
గోవిందా గోవిందా గోవిందా
శ్రీ వెంకటేశ్వరరాయ నమో నమః
....
వేళల శతకం..30
మేఘాలు మురిసిన వేళ, పైరుల్లు కులికిన వేళ
యాగాలు తడిసిన వేళ, రోగాలు కలియుట వేళ
త్యాగాలు జరిపిన వేళ, మొక్షాలు మరచిన వేళ
వేగాలు ముదిరిన వేళ, పాపాలు కలిగిన వేళ
స్నేహాలు కలసిన వేళ, భావాలు కలిపిన వేళ
దేహాలు కలసిన వేళ, దాహాలు కలిపిన వేళ
మోహాలు మెరిసిన వేళ, మౌనాలు వగసిన వేళ
స్వాహాలు పెరిగిన వేళ, సాధ్యమ్ము మనసున వేళ
అలాగే నండి మన తీరు బ్రతుకుగా సాగే వేళ
చలాకీ గుండి సహ నమ్ము గతులుగా మారే వేళ
విలాసం మండి గుణసమ్ము వినతగా చేరే వేళ
కులాసం గుండి గతి తీరు మెతుకుగా కూరే వేళ
" రాజబాల ~~ జ ర స ర గ..17/7..
అనింద్యవాహనంహరకారుణ్యలబ్ధమ్ము వేళ
మనస్సు సాధనే మమతా సంభవమ్మువేళ
వినాయకంశుభంవిమలస్వచ్ఛరూపమ్ము వేళ
క్షణమ్ముకాలమేక్షమయాచుంబ నమ్ము వేళ
గణాధిపంబృహత్కరిమస్తకంహరిం వేళ గుణమ్ము సర్వమేకులుకేమూలనమ్మువేళ
మనోజ్ఞవాక్ప్రదంస్మరణేనౌమినిత్యమ్ వేళ
తృణమ్ము మాదిరే కృషిగా మూల గర్వ వేళ
----
దేవర శ్రీశ్రీశ్రీ వెంకటేశ్వర ఆయ నమః (31)
నాడి పట్టియు నమ్మకమ్మున నాంది పల్కులు నావిరా
గాడి తప్పిన వాడి నైతిని గాయమాపము నీవురా
తాడి చెట్టున నీడ గుంటిని తప్పు నాదియు కాదురా
కాడి మోపగు నాదు మార్గము కాలమాయణ దేవరా
ఆడలేడని యీడనున్నను కాన రాడని చీకటై
తోడునీడగ కళ్ళు మాయగ తొట్రు పాటగు వెన్నలై
ఆడు లీలలు వర్ణనెందుకు ఆశపూజ్యము హృద్యమై
వాడ వాడల దొంగిలించెడి వాసుదేవుడు దేవరా
మాడవీధిన మేలుచేయక మాయనందున నుండిరా
వేడినందున గాలి నందున వీడలేకయు నుండిరా
తాడలేకయు నుండలేకయు తప్పు చేయక నుంటిరా
నీడపట్టున వేడిపుట్టిన నేను నీదయ దేవరా
దండమే మతి దేవరాగతి దాస్యమైతిని నీకు రా
కండ లేదును కాల మందున కానలేనగు నిన్నురా
మొండిగాస్థితి నాది నైనది మాత్రమేమియు లేదురా
గండమున్నను నిన్నుమాత్రము గాంచ వచ్చితి దేవరా
అండగుండెయు తోడు నీడగ ఆట పట్టుగ ఆత్మగా
పిండ మార్పుయు యెల్లవేళల పెంపకమ్మున అమ్మగా
చెండ నిప్పులు కమ్ముకున్నను చింతచేయక సేవగా
బండమారక తిండి పెట్టెది బంధమయ్యిద దేవరా
గురువుమాటల నౌదలమ్ము నగుహ్యవోలె పదమ్ముగన్
సరసిపీఠము సేవలవ్వగ సల్పనిష్ఠ గ తథ్యమై
విరివిపూలతొ మాలలవ్వగ విశ్వ మాయలు చేయఁగా
మఱియువిద్యల మౌనరాగము మానసమ్మది దేవరా
అందు కో మనసౌను తీరగు ఆదరమ్మగు జీవమున్
ఎందు కో మరి చేరువే గతి ఎల్ల లవ్వుట మార్పుగన్
పొంది కే కళ నిత్యసత్యము పోరు యేలను నాకుగన్ చందనమ్మును తెచ్చి చేరువ చింతబాసెద దేవరా
-****
----శ్రీ వెన్మటేశ్వరాయనమః(32)
ఏ వేళ వొచ్చినా జన హేళ వేంకటేశ్వరా
నా వేళ నాకే తెలియదు స్వామి నీ లీల
భాను కిరణాలకు కమలం విచ్చిన వేళ
తాను తణువంతయి తకధిo తెచ్చిన వేళ
చందమామకు చందనమద్ది గోగుపూలు కోసినవేళ
అందగత్తెకు అద్దమును జూపి ఆగి పూలు వేసినవేళ
నిన్ను కలుద్దామని అనుకున్నాను వేంకటేశ్వరా
కొలనులో కలువ పూసిన వేళ
మలుపులో మగువ కూసిన వేళ
అద్దంలో జాబిలిని చూసి మురిసిన వేళ
యుద్ధంలో ఆకలిని చూసి మెరిసిన వేళ
నిన్ను కలుద్దామని అనుకున్నాను వేంకటేశ్వరా
పొద్దున్నే మందారం పూసి నవ్విన వేళ
హద్దుల్లొ చిందాడే భామ నవ్విన వేళ
ఉదయ సంధ్య వేళలో
మాణిక్య దీపం వెలుగుతున్న వేళ
నిన్ను కలుద్దామని అనుకున్నాను వేంకటేశ్వరా
పుత్తడి ఆభరణాలకు మెరుగులద్దిన వేళ
ఆకాశం వెండి వెన్నెల ఒలకబోసిన వేళ
గగనాల తార భువిని చేరినవేళ
ఉదయకాంతి చూసిన వేళ
నిన్ను కలుద్దామని అనుకున్నాను వేంకటేశ్వరా
మరుమల్లిక నవ్విన వేళ
హేమంతంలో చే మంతులు పూసినవేళ
మంచులో గులాబి తడిసినవేళ
ఎన్నో వర్ణాల పూలు కలిపి మాల కట్టినవేళ
నిన్ను కలుద్దామని అనుకున్నాను వేంకటేశ్వరా
ఎంత అందంగా ఉంది నీ వదనం యీ వేళ
నిజంలో నిజాయితీ బ్రతికిన యీ వేళ
ఎంత చూడ ముచ్చటగా ఉంది నీ వదనం యీ వేళ
అప్సరసలను మరిపించేలా యీ వేళ
చూసే కొద్ది చూడాలనిపించేలా యీ వేళ
నిన్ను కలుద్దామని అనుకున్నాను వేంకటేశ్వరా
*****
33..
కనులు అడిగే అనుక్షణం నీ రూపం చూడాలని
తనువు మరిగే అనుక్షణం నీ దేహం తాకాలని
మనసు కలిగే అణుక్షణం నీ దాహం తీర్చాలని
తృణము కరిగే అనుక్షణం నీ నిన్నే చేరాలని
ఆత్మబంధువా అనుక్షణం తప్పిస్తున్నాను అర్థం చేసుకో
చిరుగాలి అనుక్షణం నన్ను తాకుతూ కదిలించింది
విరహాన అనుక్షణం నన్ను నుంచుతూ ఉడికించింది
దరహాసి అనుక్షణం నన్ను దంచుతూ దడ పెంచింది
విరజాజి అనుక్షణం నన్ను వంచుతూ వలపించింది
ఆత్మబంధువా అనుక్షణం తప్పిస్తున్నాను అర్థం చేసుకో
అలలుగా అనుక్షణం నిన్ను తాకుతూ ఉండాలనుంది
కలలుగా అనుక్షణం నిన్ను చేరుతూ నుండాలనుంది
వలపుగా అనుక్షణం నిన్ను మోహమై కల్వా లనుంది
తలపుగా అనుక్షణం నిన్ను తత్త్వమై చేరా లనుంది
ఆత్మబంధువా అనుక్షణం తప్పిస్తున్నాను అర్థం చేసుకో
******
పద్యం:(34)
రక్షగన్సేవ రాజ్యమ్ముగన్సంతసన్
శిక్షనేసర్వ శీఘ్ర్oసమాధానమున్
దక్షతేధర్మ దానంగనే మూలమున్
అక్షరoస్నేహభావమ్ముగన్ శాంభవీ
శాంభవీ
రక్షణ సేవ చేసే వారు రాజ్యానికి శ్రేయస్సుగా, అందుకు ప్రజలు సంతోషిoచగా, పాలనలో శిక్షా విధానం సరైనదై, స్పందన వేగంగా ఉంటే ప్రజాసంతృప్తిగా, శ్రేయస్సు సాధించటానికి దక్షతతో కూడిన ధర్మచర్యలుగా, దాన మార్గాలే పునాదిగా., విద్యలో ప్రేమ, స్నేహం ఉంటే అది శివసంబంధమైన శుభ ఫలితాన్నిస్తుందన్న సంకేతంగా అమ్మ దయ.
*****
ఏకరూపాసయోద్యా మహాజ్గీరగన్
శ్రీకరాంబావశీకృత్వమున్ స్వీకరన్
ఘీమ్ కరమ్మున్ వినీతల్ విధంబు ల్గనున్
ఆకసంబున్ గవాక్షంబుగన్ తీర్పుగనున్
కాలమే నీతిగ మ్యమ్ముగా జ్ఞానమున్
జ్వాలయేసర్వజాడ్యమ్ముగన్వైనమున్
మాలయేముఖ్యమాయాసుఖమ్మున్నున్
మూలమే సర్వమూర్తీ సహాయమ్ముగన్
మాటయే నిల్పు మానమ్ముగా నిత్యమున్
తీట తెచ్చేను తిప్పల్ గనేపైత్యమున్
ఘాటువాక్కౌనుగండమ్ముగాసత్యమున్
మోటుభావమ్ముమోహమ్ముయేదేహమున్
రోసమున్ నింతరొప్పేయనా రూకలన్
మోసమున్ జేయ మోక్షమ్ముగా జేరియున్
వాసమున్ లాగి వాక్కే నివాసమ్ముగన్
కోసినన్ కొమ్మ కోర్కేయిదీగమ్యమున్
తెల్విగన్ విద్యతెల్పేస్థితీరాజుగన్
నిల్వగన్ దాననీడల్ గనే యాస్తిగన్
తల్వగన్ సేవ తన్మాయ విధ్వాo గన్
కల్వగన్ స్త్రీగ గమ్యంగ గుఱ్ఱంయగున్
******
శ్రీ వెంకటేశ్వరాయనమః(35)
ఎన్ని యుగాలైన నీకోసం ధ్యానమ్ చేస్తూ వేచివుంటా
కడ ఊపిరి ఆగు వరకు నిలిచివుంటావా... వేంకటేశా
సమాధాన మే లేని ఓ ప్రశ్నలా నేను మిగిలిపోతుంటా
నువ్వొచ్చునంతవరకు పొగిలివుండమంటా... వేంకటేశా
నువు నడిచిన దారులన్ని నీ గురుతులుగా నేను దాస్తుoటా
నినువెదుకుతు నాచూపుల మలిగివుండ మంటా... వేంకటేశా
విరిని తావి వీడనట్లు నిను వీడక నీదు చెలిమినై నుంటా
చెలమలో ఊట నీరుగ ఉబికి వుండమంటా...వేంకటేశా
విధి చేసిన చేదు వింత ఎడబాటును నేను కోరనంటా
కలత అలల ఎగసి పడిన కృంగివుండమంటా...వేంకటేశా
చల్లని వెన్నెల ఉన్నా వెలుగునే జాడగా నుంటా
నేను వచ్చు నిశీధిలో తెలిసి వుండమంటా...వేంకటేశా
మమతలన్ని మాయమైన తలచి తలచి వగపేనుంటా
శిశిరంలో మోడువోలె మగ్గి వుండమంటా... వేంకటేశా
ప్రేమ పల్లకి మోయగ నే బోయీనై ఉంటా
నీ దరికే చేరుదాకా ఒదిగివుండమంటా... వేంకటేశా
ఒకనాటిది పూలబాట నేడది నాకు ఓ ముళ్ళబాటా
నెత్తురులను చిందిస్తూ నడిచి వుండమంటా... వేంకటేశా
స్వర్గమో, నరకమో నీ చెంతనె ఉండాలని ఉంటా
నేను లేని తావులలో ఆగివుండమంటా... వేంకటేశా
నీ ధ్యాసే ఉసురు నిలుపు పూర్ణసుధా 'మధు కలశం'నంటా
సతతము నీ నామమునే తలిచియే వుండమంటా ... వేంకటేశా
*****
నమో నమో శ్రీ వెంకటేశ్వర నమః
మోసపోవుట తప్పుకాదు
మోసం నుంచి బయట పడకపోవడం తప్పు కాదా వేంకటేశ్వరా
భార్యకు చెప్పడం తప్పు కాదు
భార్య మాటలను నమ్మి బయటపడక పోవడం తప్పు కాదా వేంకటేశ్వరా
చేప యెడ వాసన తగిలి చిక్కుట తప్పు కాదు
వాసనా రుచి గమనించ లేకపోవడం తప్పు కాదా వేంకటేశ్వరా
మంటను చూడగానే మిడత పడటం తప్పు కాదు
కర్నూలు మోసం చేస్తున్నాయని తెలుసుకో లేకపోవడం తప్పు కాదా వేంకటేశ్వరా
సంపెంగ మకరందానికి చిక్కడం భ్రమరం తప్పు కాదు
ముక్కు విష పదార్థము గ్రహించి మోసపోవడం తప్పు కాదా వేంకటేశ్వరా
ఆడేనుకు మగ ఏనుగు తాగడం తప్ప కాదు
దేహ స్పర్శ తాపానికి లుంగీ మోసపోవడం తప్పు కాదా వేంకటేశ్వరా
వేణు గాన న్నీ ఆలకించడం లేడికి తప్పు కాదు
గానా నీకు ఇవ్వలే మోసపోయి చిక్కి పోవడం తప్పు కాదా వేంకటేశ్వరా
జ్ఞానేంద్రియాలకు ప్రాణులు మోసపోవడం తప్పు కదా వేంకటేశ్వరా
వెంకన్న నీ దగ్గరికి కష్టపడి రావడం తప్పు కాదు
మొక్కలు తీర్చక, నిన్ను చూడక అహంతొ వెళ్లిపోవటమే తప్పు కాదా వేంకటేశ్వరా
కదా వేంకటేశ్వరా, కాదా వేంకటేశ్వరా
కదా వేంకటేశ్వరా, కాదా వేంకటేశ్వరా
****
నమో వెంకటేశాయ నమో నమః (36)
అంతు పట్టని ఆత్మ నీది, ఆదుకో ఆనందనిలయా
సంతసంబున ఖ్యాతి నీది, ఆదుకో ఆనంద నిలయా
అర్థమవ్వని జాతి నాది, అర్ధ మెరుగని స్థితియు నాది
వంతు చుట్టముకర్మ నాది, వంత పలుకులు గతియు నాది
వ్యర్థమయ్యడి ఖ్యాతి నాది, వ్యసన పరుల స్థితియు నాది
పంత ముందున ధర్మ మది, పదవి ఎసరు విధిగ నాది
అన్నివేళలా ఒకేలా ఉండాలా? ఆనంద నిలయా సందర్భానుసారంగా నడుచుకోవాలా? ఆనంద నిలయా
చెప్పలేనిది ఉన్నదైనది చెప్పుకున్నా ఫలితమేది
ఒప్పు నయినది నమ్మకమైనది, నమ్ముకున్నా ఫలితమేది
అప్పు అయినది అర్థమైనది ఆదుకున్నా ఫలితమేది
చెప్పకుడైనది చెప్పు గతైనది చెత్త మందు ఫలితమేది
లోపల ఉండవలసిన విధానం. తెలియలేదు
వెలుపల ఉండవలసిన విధానం.తెలియలేదు
అంతా
జగన్నాటకం అని తెలిసాక ధర్మసంకటం
సంకటం కలిగిందంటే ఇదంతా 'నాటకం'
గోవిందా గోవిందా గోవిందా
నమో వెంకటేశాయ నమో నమః
****
No comments:
Post a Comment