Tuesday, 27 May 2025

వేంటేశ్వరునిపై సాహిత్య కీర్తన(01నుండి 09 వరకు ) రచన మల్లా ప్రగడ రామకృష్ణ





శ్రీ వేంటేశ్వరునిపై సాహిత్య కీర్తన(01)

మల్లా ప్రగడ రామకృష్ణ


చిందే సాహిత్య మ్ము శీ ఘ్ర సంతోషమ్మున్ గా

పొందే శ్రీ వెంకన్న పోరు దేవీ శ్రీదేవీ గా.... (2)


మందారం నీప్రేమ మాస సంబా రమ్మున్ గా

విందారం నీ సేవ విద్య సంభావ్యమ్మున్ గా

చిందే సాహిత్య మ్ము శీ ఘ్ర సంతోషమ్మున్ గా

పొందే శ్రీ వెంకన్న పోరు దేవీ శ్రీదేవీ..గా.... (2)


కావ్యం మే మీ ధర్మమై సహాయమ్మున్ సేవే

 భావ్యం మే మీ మర్మమై విధానమ్మున్ సేవే

శ్రావ్యం మే మీ స్వర్ణమై నిదానమ్మన్ సేవే

దివ్యా మీ శక్తీ కళా నిజమ్ము  దేవీ శ్రీ దేవీ.... (2)


కార్యార్థం తత్భావ కావ్యమే పాఠంమౌళే 

సర్వార్ధం విశ్వాస సాధనే ప్రేమమ్మౌళే 

సౌర్యార్ధం వెంకన్న సౌఖ్యమే నిత్యమ్మేలే

పూర్వార్ధం స్నేహంమ్ము పూజ్యమై సేవా దేవీ.. (2)


చిందే సాహిత్య మ్ము శీ ఘ్ర సంతోషమ్మున్ గా

పొందే శ్రీ వెంకన్న పోరు దేవీ శ్రీదేవీ.... (2)

****


శ్రీ వేంకటేశ్వరునిపై సాహిత్య కీర్తన (2/528)

మల్లాప్రగడ రామకృష్ణ


మీరు లేకపోతే భౌతిక అంధకారం 

 ఆత జ్ఞానం లేకపోతే ఆధ్యాత్మిక అంధకారం 

 అనుభవం పోవాలంటే సాధ్యాయ సాధన, సజ్జన సాంగత్య సాధన, మీ సాంగత్య సాధన తప్పదే..తప్పదే మాకున్.. (అంటూ శ్రీదేవీ భూదేవి ఆలాపణలు)

 

మనసు  మౌనమ్ము గానే, పలుకు తత్త్వమ్ముగానున్ ...

ధనసు తన్మాయ గానే, తలపు తాత్పర్య మౌనున్ ...

అణువు నీమాయ గానే, అలుపు ఆశ్చర్య గానున్ 

కణము వెంకన్న గానే, కలువు శ్రీదేవి దేవి గానున్ 


క్షణము ధ్యానమ్ము గానే, చిలుకు వెన్నెల్లుగానున్ ....

ధనము మార్గమ్ము గానే, తలుపు శోభల్లె గానున్ ....

ఋణము నీ మాయ గానే, రజని రమ్యత్వ గానున్ 

క్షణము వెంకన్న గానే, కలువు శ్రీదేవి దేవి గానున్ 


మనవు వైనమ్ము దేవీ, మలుపు మోక్ష్యమ్ము గానున్ ....

 తనువు మౌనమ్ము దేవీ, తపన దాహమ్ము గానున్ ....

ప్రణవ మూలమ్ము దేవీ, ప్రభల కాలమ్ము గానున్ 

ఋణము వెంకన్న గానే, కలువు శ్రీదేవి దేవి గానున్ 


క్షణము వెంకన్న లీల, క్షమయ దీక్షల్లె గానున్ ...

గుణము వెంకన్న లీల, గడప గమ్యమ్ము గానున్ ...

గణము వెంకన్న లీల,  కావ్యమ్ము గానున్ ...

కణము వెంకన్న గానే, కలువు శ్రీదేవి దేవి గానున్


మీరు లేకపోతే భౌతిక అంధకారం 

 ఆత జ్ఞానం లేకపోతే ఆధ్యాత్మిక అంధకారం 

 అనుభవం పోవాలంటే సాధ్యాయ సాధన, సజ్జన సాంగత్య సాధన, మీ సాంగత్య సాధన తప్పదే..తప్పదే..

మాకున్.. (అంటూ శ్రీదేవీ భూదేవి ఆలాపణలు)

****

"శ్రీ వేంకటేశ్వరునిపై సాహిత్య కీర్తన (3)

మల్లాప్రగడ రామకృష్ణ


 జగద్రక్షణశ్రీధరం,జగదీశం,

   జగద్ధరమ్..జగన్మోహినిభర్తారం


వేంకట రమణ పిలుపు మనసు గెలుపు 

సంకట హరణ సమయ మలుపు తలపు 


కదలికలగు కదమ్మున్, సారమ్మున్, లోకమ్మున్,  శాంతినివ్వ 

చెదరని కల సమేఖ్యా, జీవమ్మున్, జ్ఞానమ్మున్, క్షేత్రమ్మున్, శాంతి నివ్వ 

బెదురునరులు వినీలాకాసంమ్మున్, విశ్వాసమ్, విశ్వమ్మున్ శాంతి నివ్వ 

యదరణి కళ సయోధ్యా శ్రీదేవీ, శ్రీశక్తి, శ్రీయుక్తి, శాంతి నివ్వ 


 మనమదినిధి మనో నేత్రమ్మేలే, మానమ్మున్, కాలమ్మున్ శాంతి నివ్వ 

 గణవిధిగను కళా వైభోగమ్మున్, గమ్యమ్మున్, సవ్యమ్మున్ శాంతి నివ్వ 

 గుణమనుగడ గురూ నైవేద్యమ్మున్, నిత్యమ్మున్, సత్యమ్మున్, శాంతి నివ్వ 

 క్షణముమలుపు క్షమా శ్రీ శ్రీ దేవీ, శ్రీ భక్తి, శ్రీ రక్తి శాంతి నివ్వ 


వేంకట రమా మదియు వెన్నలగు నాకవిత ప్రంజలలు వేల్పులగు దేవా 

వేంకట మనో గతిగ విద్యయిది యీ కృతిని పుచ్చుకొని యేలుకొను మీశా 

దేవిసహమిత్రమయదేవి కలకాలమును కాపురము చేయవలె స్వామీ

వేంకట సుసంపదలు వెల్లువ చిరాయువు వెన్నెలలు మాకొసగు దేవా 


వేంకట రమణ పిలుపు మనసు గెలుపు 

సంకట హరణ సమయ మలుపు తలపు 


" జగద్రక్షణశ్రీధరం,జగదీశం,

   జగద్ధరమ్..జగన్మోహినిభర్తారం

   

****


వేంటేశ్వరునిపై సాహిత్య కీర్తన(04)

రచన..మల్లా ప్రగడ రామకృష్ణ


గణము గుణము నందించియు బ్రతికించే 

జనన మరణ చక్రాలను నడిపించే 

తృణము మనసు భక్తిగాను కలిపించే 

కణము బంధాలను కలుపు నీమాయే 

శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశాయ నమో నమః 


వనము లాగ అరమరికలు లేకుండా 

ధనము లాగ ముడిగలిపియు తోడుండా 

మనము లాగ మనసు గలిపి మాటుండా 

గుణము లాగ సహనముగను నీమాయే 

శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశాయ నమో నమః 


తనువులు గనే తపనలుగా మురిపించే

అణువణువునే తలపులుగా పలికించే 

ఋణమగుటనే రకములుగా వణికించే 

మనుషులనే జతకలిపే నీమాయే  

శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశాయ నమో నమః 


ఒకరికొరకు ఒకరంటూ తోడంటూ

సకలముకళ సమమంటూ నీడo టూ

మకతిక తికమక యంటూ పోరంటూ 

 ప్రకటితకళ సుఖమంటూ నీమాయే

శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశాయ నమో నమః

*****

వేంటేశ్వరునిపై సాహిత్య కీర్తన(05)

నమో శ్రీవేంకటేశాయ

నమో నమో శ్రీ తిరుమల తిరుపతిశ్రీవేంకటేశాయ

నమోనమ:


శ్రీ రమణీ మనో రమణ

శ్రీకరమౌని హృదబ్జ భృంగ

శృంగార గుణాన్వితా

విమలకాంచన రత్న విభూషణా  .....


లసద్వారిద మంజులాంగ

సురవందిత కోటి మనోజ్ఞరూప

లాక్షారుణ పాదపంకజ

వృషాచలమందిర వేంకటేశ్వరా! .....


శ్రీ కరుణా మనో రమణ

శ్రీపదలక్ష్య మనోజ్ఞ బృంగ

శృంగార దళాన్వితా

వినయపోషణ రత్న విభూషణా ......


హిమప్రేరిత మంజులాంగ

నవపూజిత కోటి మనోజ్ఞ రూప

శ్రావ్యాశృతి పాదపంకజా

కృపాకర వందిత వేంకటేశ్వరా ......


శ్రీ వినయా మనో రమణ

శ్రీమతిలక్ష్య మనోజ్ఞ బృంగ

శృంగార బలాన్వితా

మదిని దోచిన రత్న విభూషణా ......


గుణజ్యోతియు మంజులాంగ

సమభావిత కోటి మనోజ్ఞ రూప

ప్రేమాన్విత పాదపంకజా

వృకోదర సమ్మతి వేంకటేశ్వరా .....


శ్రీ పతిగా మనో రమణ  

శ్రీ గుణభాష్య పదాబ్జ బృంగ

శృంగార రమాన్వితా

మమత పంచిన రత్న విభూషణా .....


కలాన్వేషిత మంజులాంగ    

తులసీదళకోటి మనోజ్ఞ రూప

సత్యాన్విత పాదపంకజా

గృహాలయ పూజిత వేంకటేశ్వరా ....


నమో శ్రీవేంకటేశాయ

నమో నమో శ్రీ తిరుమల తిరుపతిశ్రీవేంకటేశాయ

నమోనమ:

*****

శ్రీ వేంకటేశ్వరునిపై సాహిత్య కీర్తన (6)

రచన..మల్లాప్రగడ రామకృష్ణ


హరియే దైవమని అందరూ పాడాళిలే

హరి నామమే అమృతమని తాగలిలే

గోవిందుని కొలువ జీవిత భాగ్యమని చెప్పాలిలే

కేశవుని నామము దురిత నాశనమని మొక్కా లిలే

                  ||   హరియే     ||

కడలీ దాటగల సాహిత్య మేనులే

కడువేగంమగుట ప్రావీణ్య మేనులే

గడు వైనమ్మగుట ధ్యానమ్ము మేలులే

కడకే కావ్యమగుట కాలమ్ము మేలులే...

                        !!హరియే!!

అణువు లన్నియు గూడను నద్భుతములే

కణము లన్నియు గూడను కారణములే

క్షణము లన్నియు గూడను సార్థకములే

మనము ననుమానము లేని బ్రతుకు గోవిందుని లీలలే

                           !!హరియే!!

ఇడుములపడిన,  కలవర పడిన కాల మాయలే

ఖర్మ బంధాలజిక్కి తల రాతలు మారిన జీవ మాయలే

తగవుల లంపాటాల తల తెగిపడిన ప్రేమ మాయలే

తనువున జీవుడు ఉన్నంత వరకు ప్రాణ మాయలే

                     ||    హరియే     ||

గోవిందా అనిన బంధములు వీడేను తోడుండు ధ్యాన మేలే

ఓ రక్షకా అనిన జన్మ రాహిత్యమేను అన్నా నీడిచ్చు మూలమేలే

తగిలిన ఈ తనువుకు తానే దైవమాయే లే

తలపున ఏమారక , ఊపిరి కడదాకా నుండేనులే

                         ||  హరియే!!


హరియే దైవమని అందరూ పాడాళిలే

హరి నామమే అమృతమని తాగలిలే

హరియే దైవమని అందరూ పాడాళిలే

హరి నామమే అమృతమని తాగలిలే

***:+:


శ్రీ వేంకటేశ్వరునిపై సాహిత్య కీర్తన (7)

రచన..మల్లాప్రగడ రామకృష్ణ


కాలము బట్టి శక్తి నివ్వు దేవరా 

గాలము మల్లె పాశమయ్యె శ్రీకరా 

మేళము వంటిబత్కు మాది కావరా 

తాళము వేయు దుష్టబుద్ధి నాదిరా 

రా రా అని వేడుకుంటున్నా శ్రీ శ్రీ శ్రీ వేంకటేశ్వరా


వెల్గుల నింప చందమామ రమ్మురా 

జిల్గుల బట్టలందు శ్యామ రమ్మురా 

అల్గిడ వద్దు నన్ను జూడ లేనిచో 

మూల్గిడుచుంటి శాంతిధామ రమ్మురా 

రా రా అని వేడుకుంటున్నా శ్రీ శ్రీ శ్రీ వేంకటేశ్వరా


కల్లలు లేని జీవితమ్ము నాదిరా 

యెల్లలు దాటలేని తత్త్వమేనురా 

చల్లని చూపు కాలమౌను నాకురా 

ఎల్లరి సేవ నాకు నీవు దిక్కురా 

రా రా అని వేడుకుంటున్నా శ్రీ శ్రీ శ్రీ వేంకటేశ్వరా


ఈమహిలోన నాకు నీవె యెల్లరా 

నామదిలోని కీర్తినామ రమ్మురా 

కోమలమైన రాత్రిలోన నొంటిరా 

సోమరసమ్ము నిచ్చువామ రమ్మురా 

రా రా అని వేడుకుంటున్నా శ్రీ శ్రీ శ్రీ వేంకటేశ్వరా


కాముని వేషమేను నాకు నుండెరా 

శోముని లీలలౌను నాదు బుద్ధిరా 

ఆమని సేవలేను నిత్య మావ్వురా 

ప్రేమకు సర్వమందు సత్య మేనురా 

రా రా అని వేడుకుంటున్నా శ్రీ శ్రీ శ్రీ వేంకటేశ్వరా


నీరధియో నభమ్ము రత్నరాశిరా 

కోరిక దీర్చ సత్యకామ రమ్మురా 

వేఱెవరిందు నాకు లేరు దేవరా 

చేరి యొసంగ ప్రేమ రామ రమ్మురా 

రా రా అని వేడుకుంటున్నా శ్రీ శ్రీ శ్రీ వేంకటేశ్వరా

రా రా అని వేడుకుంటున్నా శ్రీ శ్రీ శ్రీ వేంకటేశ్వరా

****

వేంకటేశ్వరునిపై సాహిత్య కీర్తన (8)

రచన..మల్లాప్రగడ రామకృష్ణ


పల్లవి

వరాలిచ్చితీ స్వామీ ఎలావుంటివో 

ఎలావుంటివోస్వామీ ఎలావుంటివో


ఎల్లవేళలా మమ్మేలలసి ఉంటివో. మాబాధ-

లెల్లఁ బాపి బడిలక యుంటివో!!

చల్లచూపులే కమ్మే కథలు వింటివో 

మాభాధ.

లెల్లఁ బాపి బడిలక యుంటివో!!


1.చరణం


వేకువనే మేలుకొని వేవేలుగా

ఆకలినే మైమరచు నీవీలుగా 

మాకష్టములన్నీ కడతొలిగించి

మా ఇష్టములన్నీ సరిగమనించి 


కోకొల్లల భక్తుల కోర్కెలెల్ల దీర్చి

వేనోళ్ల గ సేవలు చేయబుద్ధి మార్చి 

లోకాలనెల్లగా లాలించుచు పాలించుచు

దీపాల మాదిరే కాంతుళ్లను అందించుచు 


2చరణం


సకల జీవుల సంక్షేమము జూసీ

ప్రకటనే నన సాంకేతము తెల్పీ 

విగత జీవుల వేదనలను బాపీ

నగల భావము నాశనమని తెల్పీ 


అఖిలాండమంతా ఆలించుచూ

సకలమ్ము నీడా గావించుచూ 

శీఘ్రమే శ్రీనివాసదాసులనేలుచూ

ప్రేమతో నీదు భక్త దాసుల నేలుచూ


వరాలిచ్చితీ స్వామీ ఎలావుంటివో 

ఎలావుంటివోస్వామీ ఎలావుంటివో

******


వేంకటేశ్వరునిపై సాహిత్య కీర్తన (9)

రచన..మల్లాప్రగడ రామకృష్ణ


దేవరా కనరావా... కనరావా

నిరాశ బూనితినని యనకు

నిర్లక్ష్యం గా యున్నానని యనకు 

కాల మాయలు తోడిపుడు నాకు 

సర్వం నీకేరుకే దేవరా కనరావా 

సర్వం నీకేరుకే దేవరా కనరావా 


చరణం (1)

ఏ నదుల చెంత, యే కొండల, యే కోణల, మధ్య నున్నవా

నా తనువు మనసు నీదేనని బాస చేసినాను దేవరా 

నిన్ను చేర దారి యేదియో తెలియక నున్నా 

అర్ధం పరమార్ధం నీవే నాకు దిక్కు దేవరా.... దే 

చరణం (2)

దేవుడే పగబడితే దిక్కెవ్వరు మనిషికి

సత్యానికి నోరు రాని స్థితియే జీవికి 

ధర్మానికి కాళ్ళు రాని గతియే ప్రాణికి 

న్యాయ్యానికి నీతి లేని విధియే విలువకి....దే 

చరణం (3)

సూర్యునకే గ్రహణం బడితే వెలుగుకు దారేది 

చంద్రునకే గ్రహణం బడితే వెన్నెలకు దారేది 

దేవునకే గ్రహణం బడితే పూజారికి దారేది 

బంధానికే గ్రహణం బడితేదారేది దేవరా  


దేవరా కనరావా... కనరావా

నిరాశ బూనితినని యనకు

నిర్లక్ష్యం గా యున్నానని యనకు 

కాల మాయలు తోడిపుడు నాకు 

సర్వం నీకేరుకే దేవరా కనరావా 

సర్వం నీకేరుకే దేవరా కనరావా 

******


వేంటేశ్వరునిపై సాహిత్య కీర్తనలు (01 to 09)

మల్లా ప్రగడ రామకృష్ణ



No comments:

Post a Comment