Friday, 22 May 2020

శ్రీలలితా సహస్రనామ తత్త్వ 0




🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏శ్రీమాత్రేనమః 🙏 🙏🙏 🙏🙏🙏 శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ🌹🌹🌹 557వ నామమంత్రము🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉 ఓం ఐం హ్రీం శ్రీం కాలహంత్ర్యై నమః🙏🙏🙏 కాలమును అనగా మృత్యువును హరించునదైన జగజ్జననికి నమస్కారము🌹🌹🌹సమస్తాన్ని హరించే కాలాన్ని ప్రళయము నందు జగన్మాత తన లోనికి లీనం కావించుకునే తల్లికి నమస్కారము🌻🌻🌻శ్రీలలితా సహస్రనామావళి యందలి కాలహంత్రీ అను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును ఓం ఐం హ్రీం శ్రీం కాలహంత్ర్యై నమః అని ఉచ్చరిస్తూ అత్యంత భక్తిశ్రద్ధలతో ఆ పరమేశ్వరిని ఉపాసించు భక్తులకు అకాల మృత్యుభయం లేకుండా కాపాడి రక్షించును; మరియు తన భక్తజనులకభీష్ట సిద్ధికలుగ జేయును; ఇంకను బ్రహ్మజ్ఞాన సందలనొసంగి అత్యంత దుర్లభమైన తన చిదానందస్వరూపము అనుభవైక వేద్యముజేసి తరింపజేయును🌺🌺🌺 మృత్యుమృత్యుర్మమామ్యహమ్ మృత్యువును చంపునది, మహాప్రళయమునకు తర్వాత నుండి సదా యుండునది; అందుచే శ్రీమాత కాలహంత్రి అని నామ ప్రసిద్ధమైనది; మృత్యువుకే మృత్యువైన (కాలహంత్రి) కారణం చేత కాలహంత్రి అనే నామంతో కీర్తింపబడుతున్నది🌹🌹🌹 కాలోహిదురతిక్రమో మృత్యుః మన మధ్య జరుగు సంభాషణలో వాగ్దేవతగా ఉండి, మాటలలో మరపుగలిగించి కాలాన్ని హరింపజేయునది కావున అమ్మను కాలహంత్రీ అని స్తుతిస్తాము; నిరాకార, నిర్గుణ పరబ్రహ్మమును తాను ఆరాధించుటకు, ఏవిధంగా రామ, కృష్ణ, శివ, దేవి నామ రూపములతో తెలియుచున్నామో, వ్యవహారార్థము విజాతీయమైన పశువులు, పక్షులు అని పలుకుచున్నాము; సజాతీయ భేదముగా రంగనాథం, వేణునాదం అని పిలుచుచున్నామో ఆవిధంగానే నిర్గుణ బ్రహ్మమును కాలస్వరూప పరమేశ్వరుని కలయని, కాష్టయని, ముహూర్తమని, ఘడియయని, దినమని, వారమని, పక్షమని, మాసమని, సంవత్సరమని, యుగమని, కల్పమని చెప్పుచున్నాము🌻🌻🌻శ్రీలలితా పరాత్పరి పరిచ్ఛేద రసితమైనది🌺🌺🌺కాలప్రమాణములు లేనిది; అందుచేతనే ఆ జగదీశ్వరి కాలహంత్రి అనబడుచున్నది🌹🌹🌹అటువంటి కాలహంత్రీ స్వరూపిణికి నమస్కరించునప్ఫుడు ఓం ఐం హ్రీం శ్రీం కాలహంత్ర్యై నమః అని అనవలెను


🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏శ్రీమాత్రేనమః 🙏 🙏🙏 🙏🙏🙏 శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ🌹🌹🌹 558వ నామమంత్రము🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉 ఓం ఐం హ్రీం శ్రీం కమలాక్ష నిషేవితాయై నమః🙏🙏🙏కమలాక్షుని (శ్రీమహావిష్ణుమూర్తి) చేత సేవింపబడు తల్లికి నమస్కారము🌹🌹🌹శ్రీలలితా త్రిపురసుందరీ నామావళి యందలి కమలాక్షనిషేవితా యను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును ఓం ఐం హ్రీం శ్రీం కమలాక్ష నిషేవితాయై నమః అని యెనలేని భక్తిప్రపత్తులతో ఆ జగదీశ్వరిని ఉపాసించు భక్తులకు సకల వేద శాస్త్రసారమైన ముక్తి రూపిణియైన జగన్మాత తన దివ్యమంగళస్వరూపముతో స్పష్టంగా సాక్షాత్కరించిన భావం కలుగుతుంది🌻🌻🌻 ఆ పరమేశ్వరి కమలాక్షునిచే సేవింపబడుతున్నది🌺🌺🌺 ఇంద్రనీలమయాందేవీం విష్ణురర్చయితే సదా  విష్ణుత్వం ప్రాప్తివాన్ దేవదానవులు క్షీరసాగరమున మధించి అమృతమును పొందినారు🌹🌹🌹కాని ఆ అమృతమును పంచుకొనుటలో సమస్య వచ్చినపుడు విష్ణు భగవానుడు మోహినీ అవతారము దాల్చుతాడు🌻🌻🌻అప్పుడు అమ్మ అనుగ్రహం కొరకై హ్రీం అను మంత్రమును జపించి, ధ్యానించి హ్రీం అయిపోయి అమ్మవారి రూపం ఆయనకు ఆవిర్భవించినది🌺🌺🌺 శ్రీలలితాసహస్రనావళి యందలి నామమంత్రములతో విష్ణుమూర్తి శ్రీమాతను స్తోత్రము చేసినట్లు చెప్పబడినది🌻🌻🌻కమలం అనగా పద్మము, అక్షం అంటే ఇరుసు; వెన్నెముక మధ్యనుండి స్రవించు సుషుమ్నా మార్గము మూలాధారమునుండి సహస్రారము వరఖు షట్చక్రములను అధిగమించి ఉన్న సహస్రారమందు బిందు రూపమును సేవించునది కావున కమలాక్ష  నిషేవితా యని భావము🌹🌹🌹విష్ణు భగవానునిచే సేవింపబడునది; వెన్నెముక ననుసరించి షట్చక్రముల ఇరుసును తెలుపునది; సుషుమ్నా మార్గము ద్వారా ధ్యానింపబడునది;

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

నేటి ఈ 558వ నామమంత్రము సందర్భములో ఈ క్రింది నామ మంత్రములను స్మరించుకుందాము:-

1) 80వ నామ మంత్రము - ఓం ఐం హ్రీం శ్రీం కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృత్యై నమః

(తన చేతుల పది వ్రేళ్ళ గోళ్ళ సందుల నుండి నారాయణుని దశావతారములు ప్రభవింపజేసిన తల్లికి నమస్కారము - భండాసురుడు దైత్యులను ఉద్భవింపజేసే సర్వాసురాస్త్రం ప్రయోగించగా, హిరణ్యకశిప రావణాది దైత్యులు ఆవిర్భవించి యుద్ధం చేయనారంభించిరి, అందుకు ప్రతిగా జగజ్జనని నారాయణుని దశావతారములను తనచేతి పది వ్రేళ్ళ గోళ్ళ సందుల నుండి ఉద్భవింపజేసి ఆ రాక్షస సంహారము కావింపజేసినది)

శ్రీమాత బ్రహ్మ,విష్ణు, మహేశ్వరుల (త్రిమూర్తులు) మరియు ఇంద్రాది దేవతలచేతను, సనకాది మహర్షులచేతను, లోపాముద్ర, పులోముని కూతురు అయిన ఇంద్రుని భార్య సచీదేవి మొదలైన వారిచే సేవింప బడుచున్నది

ఈ క్రింది నామములు పరిశీలించగలరు

2) 83వ నామ మంత్రము ఓం ఐం హ్రీం శ్రీం బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్తుత వైభవాయై నమః

 (భండాసుర వధ సమయంలో లలితాంబిక పరాక్రమమునకు బ్రహ్మ,విష్ణు, ఇంద్రాది దేవతలచే జగజ్జనని స్తుతింపబడినది. అట్టి తల్లికి నమస్కారము)

3) 230వ నామ మంత్రము ఓం ఐం హ్రీం శ్రీం మహాయాగ క్రమారాధ్యాయై నమః  (మహాయాగం - అనేక యోగినీ పూజలతో కూడినది మహాయాగం చేత ఆరాధింపబడు తల్లికి నమస్కారము)

4) 231వ నామ మంత్రము ఓం ఐం హ్రీం శ్రీం మహాభైరవ పూజితాయై నమః  (మహాభైరవుని చేత - పరమ శివునిచేత పూజింపబడు తల్లికి నమస్కారము)

5) 297వ నామ మంత్రము ఓం ఐం హ్రీం శ్రీం హరిబ్రహ్మేంద్ర సేవితాయై నమః (హరి, బ్రహ్మ, ఇంద్రాది దేవతలచే సేవింపబడు తల్లికి నమస్కారము)

6) 345వ నామ మంత్రము ఓం ఐం హ్రీం శ్రీం క్షేత్రపాల సమర్చితాయై నమః (క్షేత్రమును అనగా శరీరమును పాలించి జీవుని చేత అర్చించబడు తల్లికి నమస్కారము)

7) 375వ నామ మంత్రము ఓం ఐం హ్రీం శ్రీం కామపూజితాయై నమః (మన్మథునిచే పూజింపబడు తల్లికి నమస్కారము)

8) 545వ నామ మంత్రము ఓం ఐం హ్రీం శ్రీం పులోమజార్చితాయై నమః (పులోముని పుత్రికయైన ఇంద్రాణి - ఇంద్రుని భార్య చేత అర్చింపబడిన తల్లికి నమస్కారము)

9) 586వ నామ మంత్రము ఓం ఐం హ్రీం శ్రీం కామసేవితాయై నమః (మహా కామేశునిచే - శివునిచే లేదా మన్మథునిచే పూజింపబడు తల్లికి నమస్కారము)

10) 590వ నామ మంత్రము  ఓం ఐం హ్రీం శ్రీం కటాక్ష కింకరీ భూత కమలా కోటి సేవితాయై నమః (కేవలం వీక్షణ మాత్రంచే కోటి లక్ష్ములచే సేవింపబడు తల్లికి నమస్కారము. జగన్మాత కటాక్షానికి నోచుకున్న భక్తుడు అనంతకోటి లక్ష్ముల అనుగ్రహానికి పాత్రుడవుతాడని భావము)

11) 614వ నామ మంత్రము ఓం ఐం హ్రీం శ్రీం సచామర రమావాణీ సవ్య దక్షిణ సేవితాయై నమః  (ఎడమ, కుడి భాగములలో వింజామరలతో కూడిన లక్ష్మి, సరస్వతులచే సేవింపబడు తల్లికి నమస్కారము)

12) 636వ నామ మంత్రము ఓం ఐం హ్రీం శ్రీం గంధర్వ సేవితాయై నమః (గంధర్వులచే సేవింపబడు తల్లికి నమస్కారము)

13) 647వ నామ మంత్రము ఓం ఐం హ్రీం శ్రీం లోపాముద్రార్చి తాయై నమః (అగస్త్యుని భార్యయైన లోపాముద్రచే - శ్రీవిద్యా మంత్రంచే పూజింపబడిన తల్లికి నమస్కారము)

14) 726వ నామ మంత్రము ఓం ఐం హ్రీం శ్రీం సనకాది సమారాధ్యాయై నమః (సనకాది మహర్షులచే పూజింపబడు తల్లికి నమస్కారము)

15) 785వ నామ మంత్రము ఓం ఐం హ్రీం శ్రీం మార్తాండ భైరవారాధ్యాయై నమః (మార్తాండభైరవునిచే - శివునిచే ఆరాధింపబడు తల్లికి నమస్కారము)

16) 825వ నామ మంత్రము ఓం ఐం హ్రీం శ్రీం బుధార్చితాయై నమః (బుధజనులచే - జ్ఞానులచే పూజింపబడు తల్లికి నమస్కారము)

అంతటి అఖిలాండేశ్వరికి శతకోటి పాదాభివందనములు

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️


🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏శ్రీమాత్రేనమః 🙏 🙏🙏 🙏🙏🙏 శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ🌹🌹🌹 559వ నామమంత్రము🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉 ఓం ఐం హ్రీం శ్రీం తాంబూల   పూరిత ముఖ్యై నమః🙏🙏🙏తాంబూలముతో పూరింపబడడం వలన ఎర్రబడిన నోరు గల తల్లికి నమస్కారము🌹🌹🌹శ్రీ లలితా సహస్ర నామావళి యందలి తాంబూలపూరిత మూఖీ అను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును ఓం ఐం హ్రీం శ్రీం తాంబూల పూరిత ముఖ్యై నమః అని ఉచ్చరిస్తూ అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ పరాశక్తిని ఉపాసించు సాధకుడు నిశ్చయముగా ఆ తల్లి అనుగ్రహపాత్రుడై తన కఠోర సాధన వలన బ్రహ్మజ్ఞాన సంపన్నుడై, పరిపూర్ణమైన ఆత్మానందము ననుభవించుచు శాశ్వతమైన పరమపదముపై ధ్యాసయుంచి తల్లి కరుణతో దివ్యత్వమునంది తరించును🌻🌻🌻తాంబూల పూరిత మూఖీ అనగా తాంబూలసేవనము చేత పూరితమైన ముఖముతో అమ్మ నోరుమాత్రమే కాక  ముఖమంతయు ఆ ఎర్రనికాంతులతో నిండి ఆ తల్లిని చూడగానే విశ్వమంతయు తన బిడ్డలవలె అనురాగము చూపు పరిపూర్ణమైన మాతృ స్వరూపము కనబరచు చున్నదని భావము🙏🙏🙏 ఈ నామము నుండి నిఖిలేశ్వరీ అను నామ మంత్రము వరకు శ్రీమాతయొక్క కొన్ని లక్షణములు వివరించడమైసది🌺🌺🌺అమ్మను ధ్యానములోనే భావనచేసేందుకు అవసరమైయుండును🌹🌹🌹త్రిభువన సుందరియైన మన అమ్మ తాంబూలపూరితముఖియై ఉండడం మరింత అందం కోసం కాదు..తాంబూల చర్వణంతో ఎన్నో రకాల అన్నములు తన బిడ్డలు (మనం) గుడాన్నం, దధ్యన్నం, చిత్రాన్నం, స్నిగ్ధౌదనము ఇంకా ఇంకా సర్వౌదనప్రీతచిత్తా అన్నట్లు అన్ని రకాల అన్నములు నివేదన చేస్తే జీర్ణశక్తి కోసం (మనభావన) తాంబూలం వేసుకుందేమో?! తాంబూలపూరితముఖంతో అమ్మ ముఖంలో తనబిడ్డలయెడ ప్రేమపూరితమైన అరుణకాంతులతో ప్రకాశిస్తోంది అనికూడా భావిద్దాం🌹🌹🌹అటువంటి శ్రీమాతకు నమస్కరించునపుడు ఓం ఐం హ్రీం శ్రీం తాంబూల పూరిత ముఖ్యై నమః అని అనవలెను🌻🌻🌻🌹🌹ఈ వ్యాఖ్యానము శ్రీవిద్యోపాసకులు, కుండలినీ యోగ సిద్ధులు, లలితాంబిక తపోవన సంస్థాపకులు, శ్రీమళయాళస్వామి మఠాధిపతులు పూజ్యపాద శ్రీశ్రీశ్రీ రామేశ్వరానందగిరి స్వాములవారి అనుగ్రహముతో, వారి విరచితమైన శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ  అను గ్రంథమునుండి, వారికి పాదాభివందనమాచరించుచూ సహకారముగా స్వీకరించడమైనది🙏🙏🕉🕉🕉నేడు సోమ వారము🌻🌻🌻ఇందు వారము అని కూడా అంటాము🔱🔱🔱నీలకంఠుని ఆరాధించు పవిత్రమైన దినము🙏🙏🙏 ఓం నమశ్శివాయ అనే ఈ ప పంచాక్షరిని పదిసార్లు మననం చేసుకుందాము.🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉 🌺🌻🌹🌻🌸  🙏🙏🙏
🌹🌹🌹🌹🌹మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐


🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏శ్రీమాత్రేనమః 🙏 🙏🙏 🙏🙏🙏 శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ🌹🌹🌹 560వ నామమంత్రము🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉 ఓం ఐం హ్రీం శ్రీం దాడిమీ కుసుమ ప్రభాయై నమః🙏🙏🙏దానిమ్మ పుష్పం వంటి కాంతితో ప్రకాశించు తల్లికి నమస్కారము🌹🌹🌹శ్రీలలితాసహస్రనామావళి యందలి దాడిమీ కుసుమ ప్రభా అను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును ఓం ఐం హ్రీం శ్రీం దాడిమీ కుసుమ ప్రభాయై నమః అని ఉచ్చరించుచూ ఆ జగజ్జననిని ఉపాసన చేయు సాధకులు దేవి కరూణచే మాయా బంధ విముక్తులై బ్రహ్మజ్ఞాన సంపన్నులై తరించుచూ ఇతరులను కూడా తరింపజేయుదురు🌻🌻🌻దానిమ్మ పూవు యొక్క చక్కని అరుణవర్ణ వికాసముతో జగదీశ్వరి విరాజిల్లుతున్నదని భావము🌺🌺🌺సౌందర్యమునకు, సుకుమారమునకు, సౌమ్యగుణమలకు, పరిమళానికి, ఆరాధనకు, అర్చనకు, మాధుర్యవికాసమునకు పుష్పములకు స్త్రీలకు చక్కని సమన్వయమున్నది🌸🌸🌸పుష్పములలో దాడీమీ (దానిమ్మ)) కుసుమము చాలా రమణీయముగా, ఆకర్షణీయముగా, అరుణారుణ వర్ణముతో ప్రకాశమయమై ఉంటుంది🌹🌹🌹శ్రీదేవి తేజః, ప్రభ, అరుణారుణమయమై ఉటుంది🌻🌻🌻పూర్ణ వికాసమును వెదజల్లుతుందని భావము🌹🌹🌹జగన్మాత విమర్శరూపిణి అగుటచే శరీరకాంతి కలిగియుండుట సహజము🌺🌺🌺జగన్మాతను దాడిమీ కుసుమ ప్రభా అని కీర్తించాము.  జగజ్జనని సౌందర్యాన్ని కొన్ని పూలతోను, కొన్ని పుష్పములనిన ఆ తల్లికి ప్రీతి అనియు, అలాగే కదంబ కుసుమ వృక్ష వన వాసిని అనియు, కదంబ కుసుమ ప్రియా అంటూ ఎన్నోరకాల  పుష్పసముదాయంతో అమ్మకు గల అనుబంధాన్ని చెప్పుకున్నాము. అన్ని పుష్పముల వర్ణము ఇంచుమించుగా అన్నియు అరుణ వర్ణమే అందుకే అమ్మను ఇలా కూడా కీర్తించాము:-

సర్వారుణాఽనవద్యాంగీ సర్వాభరణ భూషితా అనగా జగన్మాత తాను ధరించిన వస్త్రములు, భూషణములు, పుష్పములు, శరీర కాంతి అన్నియు  అరుణ వర్ణమే కదా, అటువంటి అరుణ వర్ణంతో తేజరిల్లు తల్లికి శత సహస్ర వందనములు🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీలలితా త్రిపురసుందరి సహస్ర నామావళిలో ఈ దిగువ నామ మంత్రములు పరిశీలించుదాము. అమ్మకు, కుసుమములకు గల బంధాన్ని స్మరించుకుని ఆనందంలో తన్మయమై పోదాము.

1) 12వ నామ మంత్రము ఓం ఐం హ్రీం శ్రీం నిజారుణ ప్రభాపూర మజ్జద్బ్రహ్మాండ మండలాయై నమః తన అరుణ (ఎర్రని) శరీర కాంతితో సమస్త బ్రహ్మాండ మండలాలను ప్రకాశింపజేస్తున్న తల్లికి నమస్కారము

2) 13వ నామ మంత్రము 1) 12వ నామ మంత్రము ఓం ఐం హ్రీం శ్రీం నిజారుణ ప్రభాపూర మజ్జద్బ్రహ్మాండ మండలాయై నమః తన అరుణ (ఎర్రని) శరీర కాంతితో సమస్త బ్రహ్మాండ మండలాలను ప్రకాశింపజేస్తున్న తల్లికి నమస్కారము

2) 13వ నామ మంత్రము1) 12వ నామ మంత్రము ఓం ఐం హ్రీం శ్రీం నిజారుణ ప్రభాపూర మజ్జద్బ్రహ్మాండ మండలాయై నమః తన అరుణ (ఎర్రని) శరీర కాంతితో సమస్త బ్రహ్మాండ మండలాలను ప్రకాశింపజేస్తున్న తల్లికి నమస్కారము

2) 13వ నామ మంత్రము1) 12వ నామ మంత్రము ఓం ఐం హ్రీం శ్రీం నిజారుణ ప్రభాపూర మజ్జద్బ్రహ్మాండ మండలాయై నమః తన అరుణ (ఎర్రని) శరీర కాంతితో సమస్త బ్రహ్మాండ మండలాలను ప్రకాశింపజేస్తున్న తల్లికి నమస్కారము

2) 13వ నామ మంత్రము ఓం ఐం హ్రీం శ్రీం చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచాయై నమః చంపక, అశోక, పున్నాగ మొదలైన పుష్పములకు సుగంధాన్ని అందజేసిన తల్లికి నమస్కారము (జగన్మాత శిరోజములు సహజ సుగంధం కలిగినవి. అందుచేత ఆ కేశముల సువాసన అమ్మ ధరించిన చంపకాశోక పున్నాగ మొదలైన పుష్పములకు ఆ తల్లి అందజేస్తున్నది)

3) 21వ నామ మంత్రము ఓం ఐం హ్రీం శ్రీం కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహరాయై నమః - చెవుల పైభాగంలో కడిమి వృక్షపు పూలగుత్తిని ధరించడంచే రమణీయంగా భాసించు తల్లికి నమస్కారము

4) 60వ నామ మంత్రము ఓం ఐం హ్రీం శ్రీం కదంబ వనవాసిన్యై నమః - కడిమి వృక్షముల వనమందు వసించు తల్లికి నమస్కారము. పరమేశ్వరి వసించు   స్థానం - కడిమి (కదంబ) వృక్షముల నడుమ, మణి మండప ప్రాకార మధ్యలో చింతామణి గృహము.

5)  323వ నామ మంత్రము ఓం ఐం హ్రీం శ్రీం కదంబ కుసుమ ప్రియాయై నమః - కడిమి పువ్వుల పట్ల ప్రీతి గల తల్లికి నమస్కారము

6) 435వ నామ మంత్రము ఓం ఐం హ్రీం శ్రీం చాంపేయ కుసుమ ప్రియాయై నమః - చంపక (సంపెంగ) పుష్పంపై ప్రీతిగల తల్లికి నమస్కారము.

7) 560వ నామ మంత్రము ఓం ఐం హ్రీం శ్రీం దాడిమీ కుసుమ ప్రభాయై నమః -  దానిమ్మ పుష్పం వంటి కాంతితో ప్రకాశించు తల్లికి నమస్కారము.

8) 766వ నామ మంత్రము ఓం ఐం హ్రీం శ్రీం జపాపుష్ప నిభాకృత్యై నమః - దాసాని పూవును బోలిన రంగుతో (అరుణ వర్ణముతో)  ప్రకాశించు తల్లికి నమస్కారము.

9) 773వ నామ మంత్రము ఓం ఐం హ్రీం శ్రీం పాటలీ కుసుమ ప్రియాయై నమః - తెలుపు, ఎఱుపు మిశ్రమ వర్ణపు పాటలీపుష్పంపై మక్కువ గల తల్లికి నమస్కారము.

10) 776వ నామ మంత్రము ఓం ఐం హ్రీం శ్రీం మందార కుసుమ ప్రియాయై నమః - దేవ పుష్పమైన  మందారము నందు ప్రీతిగల తల్లికి నమస్కారము.

11) 919వ నామ మంత్రము ఓం ఐం హ్రీం శ్రీం చైతన్య కుసుమ ప్రియాయై నమః - చైతన్య మనే పుష్పం (హృదయ పద్మం) పట్ల ప్రీతి గల తల్లికి నమస్కారము.

12) 964వ నామ మంత్రము ఓం ఐం హ్రీం శ్రీం బంధూక కుసుమ ప్రఖ్యాయై నమః - బంధు జీవక పుష్పం యొక్క కాంతి (రక్తవర్ణం) వంటి కాంతితో ప్రకాశించు తల్లికి నమస్కారము.🌻🌻🌻అటువంటి దాడిమీకుసుమవికాసముతో తేజరిల్లు తల్లకి నమస్కరించునపుడు ఓం ఐం హ్రీం  శ్రీం దాడిమీ కుసుమప్రభాయై నమః అని అనవలెను🌹🌹🌹🌹🌹


🌹🙏🙏🙏శ్రీమాత్రేనమః 🙏 🙏🙏 🙏🙏🙏 శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ🌹🌹🌹 561వ నామమంత్రము🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉 ఓం ఐం హ్రీం శ్రీం మృగాక్ష్యై నమః🙏🙏🙏లేడి కన్నులవంటి కన్నులు గల తల్లికి నమస్కారము🌹🌹🌹శ్రీ లలితా సహస్రనామావళి యందలి మూడక్షరముల (త్ర్యక్షరీ) నామ మంత్రమును ఓం ఐం హ్రీం శ్రీం మృగాక్ష్యై నమః అని ఉచ్చరిస్తూ అత్యంత భక్తి శ్రద్ధలతో  ఆ పరాశక్తిని  ఉపాసించు సాధకులకు ఆ కరుణామయి దయతో సర్వశుభములు చేకూరును, ఆత్మానందము ఏర్పడి తరించుదురు🌻🌻🌻మృగమన లేడి అనే జంతువు; ఆ లేడి కనులు అందముగను, విశాలముగను, చంచలమై, చైతన్యవంతమై ఆకర్షవంతముగా, ఔదార్యముగా, జాగృతి కలిగి ఉండును; ఈ విధమైన చిహ్నములు పరమేశ్వరి కన్నులకు మాత్రమే ఉండును, అందుకనే ఆ జగదీశ్వరి మృగాక్షి అను నామ ప్రసిద్ధ మైనది🌹🌹🌹మృగ అను పదం గమ్యమును సూచించును అంటే ఆ తల్లి కనులు తన భక్తులకు జ్ఞానగమ్యమును నిర్దేశించును అని కూఢా భావించదగును. మృగ అనగా వెదుకుట అనికూడా అర్థము గలదు అంటే మనము అమ్మ కనులలో జ్ఞానసముపార్జనా, మోక్షసిద్ధి మొదలైన ఆధ్యాత్మిక చింతనా మార్గములను వెదుకగలమని భావము🌻🌻🌻భక్త మానవులలో చేయవలసిన పద్ధతులను, మార్గములను ధ్యేయమగు లక్ష్యములను సూచించే కనులు జగజ్జనని కలిగియుందని భావించి అమ్మను మృగాక్షీ అనే నామముతో కీర్తించుచున్నాము🌺🌺🌺వెదుకుట అనగా 1) ఆపదలో తన బిడ్డలగు భక్తులను కాపాడుట కొరకు వెదికే కన్నులుగాను,2) సంపూర్ణముగా తన ఆలన, పాలన, మాతృత్వ మధురిమలు కోరే భక్తులను అమ్మ వెదకుచున్నట్వలు ఏర్పడే భావన కలిగే కన్నులుగాను, 3) సృష్టిలో సర్వజీవుల జీవిత లక్ష్యములను మాతృహృదయంతో వీక్షించు కన్నులు గాను మనకు భావన ఏర్పడుటచే ఆ పరాశక్తి మృగాక్షి అని నామ ప్రసిద్ధ అయినది🌸🌸🌸అటువంటి అఖిలాండేశ్వరికి నమస్కరించునపుడు ఓం ఐం హ్రీం  శ్రీం మృగాక్ష్యై నమః అని అనవలెను🕉

🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏శ్రీమాత్రేనమః 🙏 🙏🙏 🙏🙏🙏 శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ🌹🌹🌹 563వ నామమంత్రము🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉 ఓం ఐం హ్రీం శ్రీం ముఖ్యాయై నమః🙏🙏🙏హిరణ్యగర్భరూపంలో  (నాలుగు ముఖాల బ్రహ్మరూపంలో)  ఈ సృష్టికి ముఖ్యప్రాణంగా ఉన్న తల్లికి నమస్కారము🌹🌹🌹శ్రీలలితా సహస్ర నామావళి యందలి ముఖ్యా అను రెండక్షరముల (ద్వ్యక్షరీ) నామ మంత్రమును ఓం ఐం హ్రీం శ్రీం ముఖ్యాయై నమః అని ఉచ్చరిస్తూ అత్యంత భక్తి శ్రద్ధలతో ఉపాసిస్తే సర్వ సృష్టియును దేవీరూపంగా భాసిస్తుంది మరియు రాగద్వేషములు అంతరించి తరిస్తారు🌻🌻🌻ముఖ్యా అంటే ముఖ్యమైనది, అమ్మ వాగ్దేవతగా విరాజిల్లుతున్నది🌺🌺🌺దేవతలందరిలో అతి ముఖ్యమైన దేవతయగుటచే ముఖ్యా అని నామప్రసిద్ధ అయినది🌹🌹🌹శ్రీమాత ముఖము నుండియే వాక్కు వచ్చినది అందుకే శ్రీమాత వాగ్దేవత అని అనవచ్చును🌻🌻🌻ఈ వాక్ప్రపంచమునకు, భౌతిక ప్రపంచమునకు, ప్రకాశమయ లోకమునకు, దీనికంతటికీ ముందుగా నాదలోకం - ఈ బ్రహ్మమునుండియే సకల జగత్తు ఆవిర్భవించినది🌸🌸🌸శబ్దము ముఖము నుండియే వచ్చుచున్నది🌹🌹🌹పరమేశ్వరి వాగ్దేవత కావున ముఖ్యా అనే నామం బిరుదుగా వచ్చినదని భావము🌻🌻🌻 అహమస్మి ప్రథమజా ఋతస్య అని శ్రుతి వాక్యం🌺🌺🌺సృష్టికి మూల కారణము🌻🌻🌻సర్వకార్య నిర్వాహకురాలు🌸🌸🌸కావున శ్రీమాత ముఖ్యా అని నామప్రసిద్ధమైనది🙏🙏🙏సృష్టి,స్థితి,లయములకును, మువురమ్మలకును మూలపుటమ్మయైన శ్రీమాతకు నమస్కరించునపుడు ఓం ఐం హ్రీం శ్రీం ముఖ్యాయై నమః అని అనవలెను🌹🌹🌹🌹🌹ఈ 




No comments:

Post a Comment