Sunday, 24 May 2020

మహాభాగవతం షష్ఠ స్కంధము - రెండవ అధ్యాయము

విష్ణుదూతలు భాగవతధర్మములను తెలుపుట - అజామిలుడు పరంధామమునకు చేరుట
శ్రీ శుకుడు వచించెను

శ్రీ శుకుడు ఉవాచ- పరీక్షిన్మహారాజా! నీతికోవిదులైన శ్రీహరి పార్షదులు ధర్మరహస్యములను బాగుగా ఎరిగినవారు. వారు యమదూతలయొక్క వచనములను ఆలకించి ఇట్లు పలికిరి.

విష్ణుదూతా ఊచుః

విష్ణుదూతలు పలికిరి- యమదూతలారా! ధర్మజ్ఞుల సభయందు అధర్మము ప్రవేశించు చున్నది. అచట నిరపరాధులు, శిక్షింపదగని వారుగూడ దండింపబడుచున్నారు. ఇది మిక్కిలి ఆశ్చర్యకరము, శోచనీయము.

ప్రజలను రక్షించువారు, శాసించువారు, సమదర్శనులు, పరోపకారులు ఐన వారే ప్రజలయెడ విపరీతముగా ప్రవర్తించినచో, ఇంక ఆ ప్రజలకు దిక్కెవ్వరు?

సత్పురుషుల ఆచరణమునే సామాన్య ప్రజలుగూడ అనుసరింతురు. తమ ఆచరణము ద్వారా వారు ధర్మానుకూలముగా వ్యవహరించినప్పుడు సామాన్యులు వాటినే ప్రమాణముగా స్వీకరింతురు.

సామాన్యజనులు పశువులవలె ధర్మాధర్మ స్వరూపములను ఎరుగరు. కాని, వారు సత్పురుషులను విశ్వసించి, వారి యొడిలో తలులుంచి, నిర్భయముగా నిశ్చింతగా ఉందురు.

దయాళువులైన ఆ సత్పురుషులు ప్రాణులకు మిగుల విశ్వాసపాత్రులు. వారిని తమహితైషులుగా భావించిన జీవులు మిత్రభావముతో ఆత్మసమర్పణ చేయుదురు. కనుక, దయాళువులైన సత్పురుషులు అజ్ఞానులైన జీవుల విశ్వాసమును ఏల వమ్ము చేయుదురు?

యమదూతలారా! ఈ అజామిళుడు బుద్ధి పూర్వకముగా కాకున్నను, పరమశుభప్రదమైన (మోక్షదాయకమైన) శ్రీహరి నామమును ఉచ్చరించినాడు. అందువలన ఇతడు కోటిజన్మల పాపములకు పూర్తిగా ప్రాయశ్చిత్తమును చేసికొనినట్లే, నారాయణ అను నాలుగు అక్షరములను ఉచ్చరించినంతనే, ఇతని సమస్త పాపములకును ప్రాయశ్చిత్తము చేసికొనినట్లైనది.

దొంగతనము చేసినవాడు, మద్యపాన మొనర్చినవాడు, మిత్ర ద్రోహి, బ్రాహ్మణహంతకుడు, గురుపత్నిని గోరినవాడు. ఇట్టివారితో జత కట్టినవాడు, స్త్రీని, రాజును, తండ్రిని, గోవును చంపినవాడు ఇంకను తదితరములైన ఎంతటి ఘోరపాపములకు ఒడి గట్టినవాడైనను సరే! అట్టి వానికి భగవంతుని నామమును ఉచ్చరించుటయే చక్కటి ప్రాయశ్చిత్తమగును. తద్ద్వారా, అతని సకల పాపములును ప్రక్షాళితములగును. భగవంతుని నామోచ్ఛారణ ప్రభావమున మనుజుని బుద్ధి పునీతమగును. తద్ద్వారా గుణములయందు, పరమాత్ముని. లీలలయందు, స్వరూపమునందు తల్లీనుడు అగును. అతనియెడ పరమాత్మకుగూడ ఆత్మీయత కల్గును.

బ్రహ్మజ్ఞానులైన ఋషులు క్రచ్ఛ్ర, చాంద్రాయణాది వ్రతముల ద్వారా పాపములకు ప్రాయశ్చిత్తము కలుగునని, తెలిపియుండిరి. కాని, ఇట్టి వ్రతాదులను ఆచరించుటవలన మనుజులకు పూర్తిగా పాపవిమోచనము కలుగదు. భగవంతుని నామోచ్చారణము వలన పూర్తిగా పాపములనుండి విముక్తి కలుగును. పవిత్రకీర్తిగల ఆ దేవదేవుని గుణముల జ్ఞానము కలుగును.

మానవులు తమ పాపములకు ప్రాయశ్చిత్తమును చేసికొనిన తరువాత గూడ వారి మనస్సు మరల చెడుమార్గములవైపు పరుగెత్తినచో, అది సంపూర్ణమైన ప్రాయశ్చిత్తము కానేరదు. ప్రాయశ్చిత్తములో వారి పాపకర్మలేగాక, వాటికి మూలములైన వాసనలుగూడ తొలగిపోవలెను. కనుక భగవంతుని గుణగానము చేసినచో వారి చిత్తములు అన్ని విధములుగా పరిశుద్ధములగును.

కావున, యమదూతలారా! మీరు ఇతనిని నరకమునకు తీసికొనిపోవలదు. ఇతడు చనిపోవు సమయమున మంగళకరమైన భగవన్నామమును ఉచ్చరించినాడు. అందువలన ఈతని సకల పాపములకును ప్రాయశ్చిత్తము జరిగినట్లే.

ఇతరులను ఉద్దేశించిగాని, పరిహాసమునకుగాని, గీతాలాపమునందుగాని, లేక ఎవరినైనను అవహేళన చేయు సందర్భమునగాని ఎవ్వరైనను భగవన్నామమును ఉచ్చరించినచో అతని పాపములన్నియు తొలగిపోవునని మహాత్ములు ఎఱుగుదురు.

మనుజుడు క్రిందపడినప్పుడు గాని, జాఱిపడిపోయినప్పుడుగాని, అవయవములు విరిగినప్పుడుగాని, సర్పాదులు కాటు వేసినప్పుడుగాని, మంటలలో చిక్కుపడినప్పుడుగాని, దెబ్బ తగిలినప్పుడుగాని, అవశుడై హరిహరీ అని భగవన్నామమును ఉచ్చరించినచో అతడు యమయాతనలకు గురికాడు.

విష్ణుదూతలు భాగవతధర్మములను తెలుపుట - అజామిలుడు పరంధామమునకు చేరుట

మానవులు తాము చేసిన పాపకర్మలను బట్టి ప్రాయశ్చిత్తమును చేసికొనవలెనని మహర్షులు చక్కగా ఆలోచించి తెలిపిరి.

తపస్సు, దానము, జపము మొదలగు ప్రాయశ్చిత్తముల ద్వారా పాపములు తొలగిపోవును. అందులకు సందేహములేదు. కాని ఆ పాపముచే మలినమైన వాని హృదయము మాత్రము పరిశుద్ధముగాదు. భగవంతుని పాదములను సేవించుట వలన అంతఃకరణము పవిత్రమగును.

యమదూతలారా! తెలిసిగాని, తెలియకగాని పవిత్రకీర్తియగు భగవంతుని నామమును సంకీర్తనము చేసినచో, అతని పాపములు అన్నియును నిప్ఫు, కట్టెలను కాల్చి బూడిద చేసినట్లుగా, భస్మీపటలము అగుట నిశ్చయము.

శక్తిమంతమైన అమృతము యొక్క ప్రభావము తెలియకున్నను దానిని త్రాగినవాడు అవశ్యముగా అమరుడగును. అట్లే భగవన్నామ ప్రభావము తెలియకున్నను ఆ నామమును ఉచ్చరించుటవలన అది సత్ఫలమును ఇచ్చియే తీరును (వస్తుశక్తి శ్రద్ధను గూర్చి ఆలోచింపదు).

శ్రీ శుక ఉవాచ

శ్రీ శుకుడు వచించెను- పరీక్షిన్మహారాజా! శ్రీహరి పార్షదులు ఈ విధముగా భాగవత ధర్మములను పూర్తిగా వివరింపగా యమదూతలు అజామిళుని పాశవిముక్తుని గావంచిరి. అంతేగాక, అతనిని మృత్యుముఖమునుండియు కాపాడిరి.

శత్రుసూధనా! శ్రీహరిపార్షదుల యొక్క మాటలను విన్నపిదప యమదూతలును ధర్మరాజు కడకు వెళ్ళిరి. జరిగిన వృత్తాంతమును అంతయు యమునకు వివరించిరి.

అజామిళుడు యమదూతల పాశములనుండి విముక్తుడై, భయరహితుడయ్యెను, అతనికి స్వస్థత చేకూరెను. శ్రీహరి పార్షదులను దర్శించి. అతడు ఆనంద మగ్నుడాయెను. వారికి శిరసా ప్రణమిల్లెను.

పుణ్యాత్మా! పరీక్షిన్మహారాజా! అజామిళుడు ఏదో చెప్పదలచు కొన్నాడని పార్షదులు గ్రహించిరి. వెంటనే వారు అచటినుండి అంతర్ధానమైరి.

అజామిళుడు శ్రీహరి పార్షదుల వలన పవిత్రమైన భాగవతధర్మములను, యమదూతలద్వారా వేదోక్తములైన సగుణ (ప్రవృతి విషయకములైన) ధర్మములను వినియుండెను.

సర్వపాపములను హరించునట్టి  భగవన్మహిమలను వినుటవలన అజామిళుని హృదయమున శీఘ్రముగా భక్తిభావము ఉదయించెను. అతడు చేసిన పాపకృత్యములను స్మరించుకొని, పశ్చాత్తాపపడసాగెను.

అజామిళుడు తన మనస్సులో ఇట్లు అనుకొనసాగెను - 'అరెరే! నేను ఇంద్రియములకు దాసుడనైతిని కదా! ఒక వేశ్య గర్భమున పుత్రులను పుట్టించి, నా బ్రాహ్మణత్వమును మంట గలిపితిని. ఇది మిక్కిలి శోచనీయము'.

అజామిళుని స్వగతము ఇంకను ఇట్లు కొనసాగెను

'అయ్యోయ్యో! నా ప్రవర్తన గర్హణియము. పాపాత్ముడనైన నన్ను సత్ఫురుషులు నిందించెదరు. నా వంశమునకు కళంకమును దెచ్చితిని. పరమసాధ్వియు, అమాయకురాలు ఐన నాధర్మపత్నిని పరిత్యజించితిని. మద్యపానము చేయు కులటతో సంసారము చేసితిని'.

అజామిళుని స్వగతము ఇంకను ఇట్లు కొనసాగెను

'నా తల్లిదండ్రులు వృద్ధులు, తపస్సంపన్నులు. వారికి సేవలొనర్చుటకు బంధువులు ఎవ్వరును లేరు. అట్టి దిక్కులేనివారిని త్యజించిన కృతఘ్నుడను, నీచుడను'.

అజామిళుని స్వగతము ఇంకను ఇట్లు కొనసాగెను

'ఇప్ఫుడు నాకు భయంకరమైన (దుర్భరమైన) నరకము తప్పదు. విషయలోలురై, ధర్మము తప్పిన పాపాత్ములు నరకము నుండి పెక్కు విధములైన యమయాతనలను అనుభవింతురు'.

అజామిళుని స్వగతము ఇంకను ఇట్లు కొనసాగెను

'నేను ఇప్పుడు చూచిన ఈ అద్భుత దృశ్యము స్వప్నమా? లేక జాగ్రదవస్థలోనే ప్రత్యక్షముగా అనుభవించితినా! చేతులలో పాశములను ధరించి, నన్ను లాగికొనిపోవుచుండెడివారు ఎక్కడికి వెళ్ళినట్లు?'

అజామిళుని స్వగతము ఇంకను ఇట్లు కొనసాగెను

'ఇప్పటికి ఇప్పుడే వారు నన్ను పాశములచే బంధించి, అధోలోకమునకు తీసుకొనిపోవుచుండిరి. కాని, అత్యంత సుందరులై నలుగురు సిద్ధులు వచ్చి, నన్ను విడిపించిరి. వారెక్కడికి పోయిరి'.

అజామిళుని స్వగతము ఇంకను ఇట్లు కొనసాగెను

'ఈ జన్మలో నేను మహాపాపిని. ఐనను, పూర్వజన్మలో తప్పక సత్కర్మలను ఆచరించి యుంటినేమో? అందువలననే కాబోలు, నాకు ఉత్తమదేవతల దర్శనమైనది. వారు జ్ఞప్తికి వచ్చినంతనే నా హృదయము ఆనందముతో పొంగిపోవుచున్నది'

అజామిళుని స్వగతము ఇంకను ఇట్లు కొనసాగెను

'నేను వేశ్యతో జీవితమును గడపితిని. అత్యంతపాపిని. పూర్వజన్మలో నేను ఏదైనను సుకృతమును చేసియుండనిచో, మరణసమయమున నా నోట ఆ భగవంతుని నామము ఎట్లు వచ్చియుండెడిది?'

అజామిళుని స్వగతము ఇంకను ఇట్లు కొనసాగెను

'మహాకపటిని, పాపిని, లజ్జాహీనుడను, బ్రాహ్మణత్వమును మంటగల్పిన వాడను అయిన నేనెక్కడ? పరమశ్రేయస్కరమైన భగవంతుని నారాయణ నామమెక్కడ?'

ఓం నమో భగవతే వాసుదేవాయ

ఇప్పుడు నేను నా మనస్సును, ఇంద్రియములను, ప్రాణములను నియంత్రించుటకు ప్రయత్నించెదను. దాని వలన అంధకారమయమైన ఘోర నరకమునందు పడవలసిన స్థితి మరల సంభవింపదు.

అజ్ఞానవశమున శరీరమే నేను అని భావించి, కోరికలకు బానిసనైతిని. వాటిని అనుభవించు నేను పెక్కుదుష్కర్మలను ఆచరించితిని. వాటి ఫలితమే ఈ బంధనము. ఇప్పుడు దీనిని ఛేదించి సకల ప్రాణులకును హితమొనర్తును. వాసనలను శాంతపరతును. అందరితోను మైత్రి సలిపెదను. దుఃఖితులపై దయచూపెదను. పూర్తిగా జితేంద్రియుడనై యుందును.

భగవంతుని మాయయే స్త్రీరూపమును ధరించి, అధముడనైన నన్ను వేశ్యగా వశపరచుకొనినది. నన్ను ఒక తోలు బొమ్మను జేసి ఆడించినది. ఇప్పుడు నేను ఆ మాయనుండి విముక్తుడనయ్యెదను.

నేను నిత్యసత్య స్వరూఫుడనై భగవంతుని గూర్చి తెలిసికొంటిని. కనుక, శరీరాదులందు అహంకార, మమకార భావములను త్యజించెదను. భగవంతుని నామ కీర్తనాదులచే నా మనస్సును పవిత్ర మొనర్చుకొని, దానిని ఆ పరమాత్మునియందే నిలుపుకొందును.

శ్రీ శుక ఉవాచ

శ్రీ శుకుడు పలికెను- పరీక్షిన్మహారాజా! అజామిళునకు మహర్షులైన శ్రీహరి పార్షదులుతోడి సాంగత్యము జరిగినది క్షణకాలము మాత్రమే. దాని ఫలితముగా అతనిలో వైరాగ్యము ఏర్పడినది. సమస్త బంధములను, మోహమును త్యజించి, అతడు హరిద్వారము చేరెను.

ఆ దివ్యస్థలమునందు భగవంతుని మందిరమున ఆసీనుడయ్యెను. యోగమార్గమును ఆశ్రయించి, ఇంద్రియములను విషయములనుండి మరల్చెను. ఏకాగ్ర చిత్తముతో మనస్సును ఆత్మయందు నిలిపెను.

అనంతరము ఆత్మచింతన ద్వారా బుద్ధిని విషయములనుండి వేరు చేసెను. అప్ఫుడు ఏకాగ్రమొనర్చిన బుద్ధిని జ్ఞానస్వరూపము, సచ్చిదానందాత్మకము అగు పరబ్రహ్మయందు నిలిపెను.

ఈ విధముగా అజామిళుని బుద్ధి త్రిగుణాత్మకమైన ప్రకృతిని అతిక్రమించి, భగవత్స్వరూపమునందు స్థితమయ్యెను. అప్పుడు ఇదివరలో అతడు చూచిన నలుగురు పార్షదులు తన యెదుట నిలిచియున్నట్లు గమనించెను. అంతట అతడు వారికి శిరసా ప్రణమిల్లెను.

పార్హదుల దర్శనము లభించిన పిదప , అజామిళుడు హరిద్వారమున గంగయందు తనదేహమును త్యజించెను. వెంటనే అతనికి పార్షదుల స్వరూపము ప్రాప్తించెను.

అజామిళుడు శ్రీహరి పార్షదులతో గూడి బంగారు విమానమందు ఆరూఢుడయ్యెను. ఆకాశమార్గముస లక్ష్మీపతికి స్థానమైన వైకుంఠమును జేరెను.

పరీక్షిన్మహారాజా! అజామిళుడు వేశ్యతోడి సాంగత్యము వలన సకల ధార్మిక కార్యక్రమములను విడిచిపెట్టెను. నింద్యమైన కర్మల కారణముగా పతితుడాయెను. నియమములను ఉల్లంఘించుటవలన నరకమునందు పడవలసిన దుస్థితి ఎదురయ్యెను. కాని, భగవన్నామమును ఉచ్చరించుటచే వెంటనే ముక్తిని పొందెను.

సంసారబంధములనుండి ముక్తులు కాగోరువారు తీర్థములను కూడా మరింత పవిత్రములను జేయునట్టి భగవంతుని పవిత్రపాదములను స్పృశించుటకంటెను, నామసంకీర్తన  చేయుటకంటెను మరియొక గొప్ప ఉపాయము ఏదియును లేదు. ఏలయన, భగవన్నామమును ఆశ్రయించుట వలన మానవుని మనస్సు మరల లౌకిక కర్మల యందు తగుల్కొనదు. భగవన్నామము కాక వేరొక ప్రాయశ్చిత్త సాధనమును ఆశ్రయించినచో, మనస్సు, రజస్తమోగుణములకు వశమగును. అప్పుడు అతని పాపములు పూర్థిగా నశింపవు.

పరీక్షిన్మహారాజా! ఈ ఇతిహాసము అత్యంత గోప్యమైనది. సమస్త పాపములను హరించునది. భక్తిశ్రద్ధలతో దీనిని వినువాడు, కీర్తించినవాడు నరకమునకు ఎన్నడును పోడు. యమదూతలు అతనివైపు కన్నత్తియైనను చూడజాలరు. ఆ మనుజుని జీవనము ఎంత పాపమయమైనను, అతడు వైకుంఠమున సమ్మానింపబడును.

మహారాజా! అజామిళుని వంటి పాపాత్ముడుగూడ మరణ సమయమున పుత్రుని పిలిచెడి నెపముతో భగవన్నామమును ఉచ్చరించెను. అందువలన అతనికి గూడ పరమపదప్రాప్తి గలిగినది. ఇంక, భక్తి శ్రద్ధలతో పరమాత్ముని నామమును ఉచ్చరించిన వాని సంగతి చెప్పనేల?

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం షష్ఠస్కంధే ద్వితీయోఽధ్యాయః (2)

ఇది శ్రీమద్భాగవత మహాపురాణమునందలి షష్ఠ స్కంధమునందు రెండవ అధ్యాయము (2)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
--(())--

21.5.2020    ప్రాత:కాల భాగవతం  

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

షష్ఠ స్కంధము - రెండవ అధ్యాయము

విష్ణుదూతలు భాగవతధర్మములను తెలుపుట - అజామిలుడు పరంధామమునకు చేరుట

ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

శ్రీ శుకుడు వచించెను

2.1 (ప్రథమ శ్లోకము)

ఏవం తే భగవద్దూతా యమదూతాభిభాషితమ్|

ఉపధార్యాథ తాన్ రాజన్ ప్రత్యాహుర్నయ కోవిదాః॥4793॥

శ్రీ శుకుడు ఉవాచ- పరీక్షిన్మహారాజా! నీతికోవిదులైన శ్రీహరి పార్షదులు ధర్మరహస్యములను బాగుగా ఎరిగినవారు. వారు యమదూతలయొక్క వచనములను ఆలకించి ఇట్లు పలికిరి.

విష్ణుదూతా ఊచుః

2.2 (రెండవ శ్లోకము)

అహో కష్టం ధర్మదృశామధర్మః స్పృశతే సభామ్|

యత్రాదండ్యేష్వపాపేషు దండో యైర్ధ్రియతే వృథా॥4794॥

విష్ణుదూతలు పలికిరి- యమదూతలారా! ధర్మజ్ఞుల సభయందు అధర్మము ప్రవేశించుచున్నది. అచట నిరపరాధులు, శిక్షింపదగని వారుగూడ దండింపబడుచున్నారు. ఇది మిక్కిలి ఆశ్చర్యకరము, శోచనీయము.

2.3 (మూడవ శ్లోకము)

ప్రజానాం పితరో యే చ శాస్తారః సాధనః సమాః|

యది సాక్త్యేషు వైషమ్యం కం యాంతి శరణం ప్రజాః॥4795॥

ప్రజలను రక్షించువారు, శాసించువారు, సమదర్శనులు, పరోపకారులు ఐన వారే ప్రజలయెడ విపరీతముగా ప్రవర్తించినచో, ఇంక ఆ ప్రజలకు దిక్కెవ్వరు?

2.4 (నాలుగవ శ్లోకము)

యద్యదాచరతి శ్రేయోనితరస్తత్తదీహతే|

స యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే॥4796॥

సత్పురుషుల ఆచరణమునే సామాన్య ప్రజలుగూడ అనుసరింతురు. తమ ఆచరణము ద్వారా వారు ధర్మానుకూలముగా వ్యవహరించినప్పుడు సామాన్యులు వాటినే ప్రమాణముగా స్వీకరింతురు.

2.5 (ఐదవ శ్లోకము)

యస్యాంకే శిర ఆధాయ లోకః స్వపితి నిర్వృతః|

స్వయం ధర్మమధర్మం వా న హి వేద యథా పశుః॥4797॥

సామాన్యజనులు పశువులవలె ధర్మాధర్మ స్వరూపములను ఎరుగరు. కాని, వారు సత్పురుషులను విశ్వసించి, వారి యొడిలో తలులుంచి, నిర్భయముగా నిశ్చింతగా ఉందురు.

2.6 (ఆరవ శ్లోకము)

స కథం న్యర్పితాత్మానం కృతమైత్రమచేతనమ్|

విస్రంభణీయో భూతానాం సఘృణో ద్రోగ్ధుమర్హతి॥4798॥

దయాళువులైన ఆ సత్పురుషులు ప్రాణులకు మిగుల విశ్వాసపాత్రులు. వారిని తమహితైషులుగా భావించిన జీవులు మిత్రభావముతో ఆత్మసమర్పణ చేయుదురు. కనుక, దయాళువులైన సత్పురుషులు అజ్ఞానులైన జీవుల విశ్వాసమును ఏల వమ్ము చేయుదురు?

2.7 (ఏడవ శ్లోకము)

అయం హి కృతనిర్వేశో జన్మకోట్యంహసామపి|

యద్వ్యాజహార వివశో నామ స్వస్త్యయనం హరేః॥4799॥

2.8 (ఎనిమిదవ శ్లోకము)

ఏతేనైవ హ్యఘోనోఽస్య కృతం స్యాదఘనిష్కృతమ్|

యదా నారాయణాయేతి జగాద చతురక్షరమ్॥4800॥ 

యమదూతలారా! ఈ అజామిళుడు బుద్ధి పూర్వకముగా కాకున్నను, పరమశుభప్రదమైన (మోక్షదాయకమైన) శ్రీహరి నామమును ఉచ్చరించినాడు. అందువలన ఇతడు కోటిజన్మల పాపములకు పూర్తిగా ప్రాయశ్చిత్తమును చేసికొనినట్లే, నారాయణ అను నాలుగు అక్షరములను ఉచ్చరించినంతనే, ఇతని సమస్త పాపములకును ప్రాయశ్చిత్తము చేసికొనినట్లైనది.

2.9 (తొమ్మిదవ శ్లోకము)

స్తేనః సురాపో మిత్రధ్రుగ్బ్రహ్మహా గురుతల్పగః|

స్త్రీరాజపితృగోహంతా యే చ పాతకినోఽపరే॥4801॥

2.10 (పదియవ శ్లోకము)

సర్వేషామప్యఘవతామిదమేవసునిష్కృతమ్|

నామవ్యాహరణం విష్ణోర్యతస్తద్విషయా మతిః॥4802॥

దొంగతనము చేసినవాడు, మద్యపాన మొనర్చినవాడు, మిత్ర ద్రోహి, బ్రాహ్మణహంతకుడు, గురుపత్నిని గోరినవాడు. ఇట్టివారితో జత కట్టినవాడు, స్త్రీని, రాజును, తండ్రిని, గోవును చంపినవాడు ఇంకను తదితరములైన ఎంతటి ఘోరపాపములకు ఒడి గట్టినవాడైనను సరే! అట్టి వానికి భగవంతుని నామమును ఉచ్చరించుటయే చక్కటి ప్రాయశ్చిత్తమగును. తద్ద్వారా, అతని సకల పాపములును ప్రక్షాళితములగును. భగవంతుని నామోచ్ఛారణ ప్రభావమున మనుజుని బుద్ధి పునీతమగును. తద్ద్వారా గుణములయందు, పరమాత్ముని. లీలలయందు, స్వరూపమునందు తల్లీనుడు అగును. అతనియెడ పరమాత్మకుగూడ ఆత్మీయత కల్గును.

2.11 (పదకొండవ శ్లోకము)

న నిష్కృతైరుదితైర్బ్రహ్మవాదిభిః తథా విశుధ్యత్యఘవాన్ వ్రతాదిభిః|

యథా హరేర్నామపదైరుదాహృతైః తదుత్తమశ్లోకగుణోపలంభకమ్॥4803॥

బ్రహ్మజ్ఞానులైన ఋషులు క్రచ్ఛ్ర, చాంద్రాయణాది వ్రతముల ద్వారా పాపములకు ప్రాయశ్చిత్తము కలుగునని, తెలిపియుండిరి. కాని, ఇట్టి వ్రతాదులను ఆచరించుటవలన మనుజులకు పూర్తిగా పాపవిమోచనము కలుగదు. భగవంతుని నామోచ్చారణము వలన పూర్తిగా పాపములనుండి విముక్తి కలుగును. పవిత్రకీర్తిగల ఆ దేవదేవుని గుణముల జ్ఞానము కలుగును.

2.12 (పండ్రెండవ శ్లోకము)

నైకాంతికం తద్ధి కృతేఽపి నిష్కృతే మనః పునర్ధావతి చేదసత్పథే|

తత్కర్మనిర్హారమభీప్సతాం హరేః గుణానువాదః ఖలు సత్త్వభావనః॥4804॥

మానవులు తమ పాపములకు ప్రాయశ్చిత్తమును చేసికొనిన తరువాత గూడ వారి మనస్సు మరల చెడుమార్గములవైపు పరుగెత్తినచో, అది సంపూర్ణమైన ప్రాయశ్చిత్తము కానేరదు. ప్రాయశ్చిత్తములో వారి పాపకర్మలేగాక, వాటికి మూలములైన వాసనలుగూడ తొలగిపోవలెను. కనుక భగవంతుని గుణగానము చేసినచో వారి చిత్తములు అన్ని విధములుగా పరిశుద్ధములగును.

2.13 (పదమూడవ శ్లోకము)

అథైనం మాపనయత కృతాశేషాఘనిష్కృతమ్|

యదసౌ భగవన్నామ మ్రియమాణః సమగ్రహీత్॥4805॥

కావున, యమదూతలారా! మీరు ఇతనిని నరకమునకు తీసికొనిపోవలదు. ఇతడు చనిపోవు సమయమున మంగళకరమైన భగవన్నామమును ఉచ్చరించినాడు. అందువలన ఈతని సకల పాపములకును ప్రాయశ్చిత్తము జరిగినట్లే.

2.14 (పదునాలుగవ శ్లోకము)

సాంకేత్యం పారిహాస్యం వా స్తోభం హేళనమేవ వా|

వైకుంఠ నామగ్రహణ  మశేషాఘహరం విదుః॥4806॥

ఇతరులను ఉద్దేశించిగాని, పరిహాసమునకుగాని, గీతాలాపమునందుగాని, లేక ఎవరినైనను అవహేళన చేయు సందర్భమునగాని ఎవ్వరైనను భగవన్నామమును ఉచ్చరించినచో అతని పాపములన్నియు తొలగిపోవునని మహాత్ములు ఎఱుగుదురు.

2.15 (పదునైదవ శ్లోకము)

పతితః స్ఖలితో భగ్నుః సందష్టస్తప్త ఆహతః|

హరిరిత్యవశేనాహ పుమాన్ నార్హతి యాతనామ్॥4807॥

మనుజుడు క్రిందపడినప్పుడు గాని, జాఱిపడిపోయినప్పుడుగాని, అవయవములు విరిగినప్పుడుగాని, సర్పాదులు కాటు వేసినప్పుడుగాని, మంటలలో చిక్కుపడినప్పుడుగాని, దెబ్బ తగిలినప్పుడుగాని, అవశుడై హరిహరీ అని భగవన్నామమును ఉచ్చరించినచో అతడు యమయాతనలకు గురికాడు.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి షష్ఠస్కంధములోని రెండవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

--(())--

22.5.2020    ప్రాత: కాల మహాభాగవతం

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

షష్ఠ స్కంధము - రెండవ అధ్యాయము

విష్ణుదూతలు భాగవతధర్మములను తెలుపుట - అజామిలుడు పరంధామమునకు చేరుట

ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

2.16 (పదునారవ శ్లోకము)

గురూణాం చ లఘూనా చ గురూణి చ లఘూని చ|

ప్రాయశ్చిత్తాని పాపానాం జ్ఞాత్వోక్తాని మహర్షిభిః॥4808॥

మానవులు తాము చేసిన పాపకర్మలను బట్టి ప్రాయశ్చిత్తమును చేసికొనవలెనని మహర్షులు చక్కగా ఆలోచించి తెలిపిరి.

2.17 (పదునేడవ శ్లోకము)

తైస్తాన్యఘాని పూయంతే తపోదానజపాదిభిః|

నాధర్మజం తద్ధృదయం తదపీశాంఘ్రిసేవయా॥4809॥

తపస్సు, దానము, జపము మొదలగు ప్రాయశ్చిత్తముల ద్వారా పాపములు తొలగిపోవును. అందులకు సందేహములేదు. కాని ఆ పాపముచే మలినమైన వాని హృదయము మాత్రము పరిశుద్ధముగాదు. భగవంతుని పాదములను సేవించుట వలన అంతఃకరణము పవిత్రమగును.

2.18 (పదునెనిమిదవ శ్లోకము)

అజ్ఞానాదథవా జ్ఞానాదుత్తమశ్లోకనామ యత్|

సంకీర్తతమఘం పుంసో దహేదేధో యథానలం॥4810॥

యమదూతలారా! తెలిసిగాని, తెలియకగాని పవిత్రకీర్తియగు భగవంతుని నామమును సంకీర్తనము చేసినచో, అతని పాపములు అన్నియును నిప్ఫు, కట్టెలను కాల్చి బూడిద చేసినట్లుగా, భస్మీపటలము అగుట నిశ్చయము.

2.19 (పందొమ్మిదవ శ్లోకము)

యథాగదం వీర్యతమముపయుక్తం యదృచ్ఛయా|

అజానతోఽప్యాత్మగుణం కుర్యాన్మంత్రోఽప్యుదాహృతః॥4811॥

శక్తిమంతమైన అమృతము యొక్క ప్రభావము తెలియకున్నను దానిని త్రాగినవాడు అవశ్యముగా అమరుడగును. అట్లే భగవన్నామ ప్రభావము తెలియకున్నను ఆ నామమును ఉచ్చరించుటవలన అది సత్ఫలమును ఇచ్చియే తీరును (వస్తుశక్తి శ్రద్ధను గూర్చి ఆలోచింపదు).

శ్రీ శుక ఉవాచ

2.20 (ఇరువదియవ శ్లోకము)

త ఏవం సువినిర్ణీయ ధర్మం భాగవతం నృప|

తం యామ్యపాశాన్నిర్ముచ్య విప్రం మృత్యోరమూముచన్॥4812॥

శ్రీ శుకుడు వచించెను- పరీక్షిన్మహారాజా! శ్రీహరి పార్షదులు ఈ విధముగా భాగవత ధర్మములను పూర్తిగా వివరింపగా యమదూతలు అజామిళుని పాశవిముక్తుని గావంచిరి. అంతేగాక, అతనిని మృత్యుముఖమునుండియు కాపాడిరి.

2.21 (ఇరువది ఒకటవ శ్లోకము)

ఇతి ప్రత్యుదితా యామ్యా దూశా యాశ్వా యమాంతికే|

యమరాజ్ఞే యథా సర్వమాచచక్షురరిందమ॥4813॥

శత్రుసూధనా! శ్రీహరిపార్షదుల యొక్క మాటలను విన్నపిదప యమదూతలును ధర్మరాజు కడకు వెళ్ళిరి. జరిగిన వృత్తాంతమును అంతయు యమునకు వివరించిరి.

2.22 (ఇరువది రెండవ శ్లోకము)

ద్విజః పాశాద్వినిర్ముక్తో గతభీః ప్రకృతిం గతః|

వవందే శిరసా విష్ణోః కింకరాన్ దర్శనోత్సవః॥4814॥

అజామిళుడు యమదూతల పాశములనుండి విముక్తుడై, భయరహితుడయ్యెను, అతనికి స్వస్థత చేకూరెను. శ్రీహరి పార్షదులను దర్శించి. అతడు ఆనంద మగ్నుడాయెను. వారికి శిరసా ప్రణమిల్లెను.

2.23 (ఇరువది మూడవ శ్లోకము)

తం వివక్షుమభిప్రేత్య మహాపురుషకింకరాః|

సహసా పశ్యతస్తస్య తత్రాంతర్థధిరేఽనఘ॥4815॥

పుణ్యాత్మా! పరీక్షిన్మహారాజా! అజామిళుడు ఏదో చెప్పదలచు కొన్నాడని పార్షదులు గ్రహించిరి. వెంటనే వారు అచటినుండి అంతర్ధానమైరి.

2.24 (ఇరువది నాలుగవ శ్లోకము)

అజామిళోఽప్యథాకర్ణ్య దూతానాం యమకృష్ణయోః|

ధర్మం భాగవతం శుద్ధం త్రైవిద్యం చ గుణాశ్రయమ్॥4816॥

అజామిళుడు శ్రీహరి పార్షదుల వలన పవిత్రమైన భాగవతధర్మములను, యమదూతలద్వారా వేదోక్తములైన సగుణ (ప్రవృతి విషయకములైన) ధర్మములను వినియుండెను.

2.25 (ఇరువది ఐదవ శ్లోకము)

భక్తిమాన్ భగవత్యాశు మహాత్మ్యశ్రవణాద్ధరేః|

అనుతాపో మహానాసీత్ స్మరతోఽశుభమాత్మనః॥4817॥

సర్వపాపములను హరించునట్టి  భగవన్మహిమలను వినుటవలన అజామిళుని హృదయమున శీఘ్రముగా భక్తిభావము ఉదయించెను. అతడు చేసిన పాపకృత్యములను స్మరించుకొని, పశ్చాత్తాపపడసాగెను.

2.26 (ఇరువదియారవ శ్లోకము)

అహో మే పరమం కష్టమభుదవిజితాత్మనః|

యేన విప్లావితం బ్రహ్మ వృషళ్యాం జాయతాఽఽత్మనా॥4818॥

అజామిళుడు తన మనస్సులో ఇట్లు అనుకొనసాగెను - 'అరెరే! నేను ఇంద్రియములకు దాసుడనైతిని కదా! ఒక వేశ్య గర్భమున పుత్రులను పుట్టించి, నా బ్రాహ్మణత్వమును మంట గలిపితిని. ఇది మిక్కిలి శోచనీయము'.

2.27 (ఇరువది ఏడవ శ్లోకము)

ధిఙ్మాం విగర్హితం సద్భిర్దుష్కృతం  కులకజ్జలమ్|

హిత్వా బాలాం సతీం యోఽహం సురాపామసతీమగామ్॥4819॥

అజామిళుని స్వగతము ఇంకను ఇట్లు కొనసాగెను

'అయ్యోయ్యో! నా ప్రవర్తన గర్హణియము. పాపాత్ముడనైన నన్ను సత్ఫురుషులు నిందించెదరు. నా వంశమునకు కళంకమును దెచ్చితిని. పరమసాధ్వియు, అమాయకురాలు ఐన నాధర్మపత్నిని పరిత్యజించితిని. మద్యపానము చేయు కులటతో సంసారము చేసితిని'.

2.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)

వృద్ధావనాథౌ పితరౌ నాన్యబంధూ తపస్వినౌ|

అహో మయాధునా త్యక్తావకృతజ్ఞేన నీచవత్॥4820॥

అజామిళుని స్వగతము ఇంకను ఇట్లు కొనసాగెను

'నా తల్లిదండ్రులు వృద్ధులు, తపస్సంపన్నులు. వారికి సేవలొనర్చుటకు బంధువులు ఎవ్వరును లేరు. అట్టి దిక్కులేనివారిని త్యజించిన కృతఘ్నుడను, నీచుడను'.

2.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)

సోఽహం వ్యక్తం పతిష్యామి నరకే భృశదారుణే|

ధర్మఘ్నాః కామినో యత్ర విందంతి యమయాతనాః॥4821॥

అజామిళుని స్వగతము ఇంకను ఇట్లు కొనసాగెను

'ఇప్ఫుడు నాకు భయంకరమైన (దుర్భరమైన) నరకము తప్పదు. విషయలోలురై, ధర్మము తప్పిన పాపాత్ములు నరకము నుండి పెక్కు విధములైన యమయాతనలను అనుభవింతురు'.

2.30 (ముప్పదియవ శ్లోకము)

కిమిదం స్వప్న ఆహోస్విత్ సాక్షాద్దృష్టమిహాద్భుతమ్|

క్వ యాతా అద్య తే యే మాం వ్యకర్షన్ పాశపాణయః॥4822॥

అజామిళుని స్వగతము ఇంకను ఇట్లు కొనసాగెను

'నేను ఇప్పుడు చూచిన ఈ అద్భుత దృశ్యము స్వప్నమా? లేక జాగ్రదవస్థలోనే ప్రత్యక్షముగా అనుభవించితినా! చేతులలో పాశములను ధరించి, నన్ను లాగికొనిపోవుచుండెడివారు ఎక్కడికి వెళ్ళినట్లు?'

2.31 (ముప్పది ఒకటవ శ్లోకము)

అథ తే క్వ గతాః సిద్ధాశ్చత్వారశ్చారుదర్శనాః|

వ్యమోచయన్నీయమానం బధ్వా పాశైరధో భువః॥4823॥

అజామిళుని స్వగతము ఇంకను ఇట్లు కొనసాగెను

'ఇప్పటికి ఇప్పుడే వారు నన్ను పాశములచే బంధించి, అధోలోకమునకు తీసుకొనిపోవుచుండిరి. కాని, అత్యంత సుందరులై నలుగురు సిద్ధులు వచ్చి, నన్ను విడిపించిరి. వారెక్కడికి పోయిరి'.

2.32 (ముప్పది రెండవ శ్లోకము)

అథాపి మే దుర్భగస్య విబుధోత్తమదర్శనే|

భవితవ్యం మంగళేన యేనాత్మ మే   ప్రసీదతి॥4824॥

అజామిళుని స్వగతము ఇంకను ఇట్లు కొనసాగెను

'ఈ జన్మలో నేను మహాపాపిని. ఐనను, పూర్వజన్మలో తప్పక సత్కర్మలను ఆచరించి యుంటినేమో? అందువలననే కాబోలు, నాకు ఉత్తమదేవతల దర్శనమైనది. వారు జ్ఞప్తికి వచ్చినంతనే నా హృదయము ఆనందముతో పొంగిపోవుచున్నది'

2.33 (ముప్పది మూడవ శ్లోకము)

అన్యథా మ్రియమాణస్య నాశుచేర్వృషలీపతేః|

వైకుంఠనామగ్రహణం జిహ్వా వక్తుమిహార్హతి॥4825॥

అజామిళుని స్వగతము ఇంకను ఇట్లు కొనసాగెను

'నేను వేశ్యతో జీవితమును గడపితిని. అత్యంతపాపిని. పూర్వజన్మలో నేను ఏదైనను సుకృతమును చేసియుండనిచో, మరణసమయమున నా నోట ఆ భగవంతుని నామము ఎట్లు వచ్చియుండెడిది?'

2.34 (ముప్పది నాలుగవ శ్లోకము)

క్వ చాహం కితవః పాపో బ్రహ్మఘ్నో నిరపత్రపః|

క్వ చ నారాయణేత్యేతద్భగవన్నామ మంగళమ్॥4826॥

అజామిళుని స్వగతము ఇంకను ఇట్లు కొనసాగెను

'మహాకపటిని, పాపిని, లజ్జాహీనుడను, బ్రాహ్మణత్వమును మంటగల్పిన వాడను అయిన నేనెక్కడ? పరమశ్రేయస్కరమైన భగవంతుని నారాయణ నామమెక్కడ?'

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి షష్ఠస్కంధములోని రెండవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

23.5.2020    ప్రాతఃకాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

షష్ఠ స్కంధము - రెండవ అధ్యాయము

విష్ణుదూతలు భాగవతధర్మములను తెలుపుట - అజామిలుడు పరంధామమునకు చేరుట

ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

2.35 (ముప్పది ఐదవ శ్లోకము)

సోఽహం తథా యతిష్యామి యతచిత్తేంద్రియయానిలః|

యథా న భూయ ఆత్మానమంధే తమసి మజ్జయే॥4827॥

ఇప్పుడు నేను నా మనస్సును, ఇంద్రియములను, ప్రాణములను నియంత్రించుటకు ప్రయత్నించెదను. దాని వలన అంధకారమయమైన ఘోర నరకమునందు పడవలసిన స్థితి మరల సంభవింపదు.

2.36 (ముప్పది ఆరవ శ్లోకము)

విముచ్య తమిమం బంధమవిద్యాకామకర్మజమ్|

సర్వభూతసుహృచ్ఛాంతో మైత్రః కరుణ ఆత్మవాన్॥4828॥

అజ్ఞానవశమున శరీరమే నేను అని భావించి, కోరికలకు బానిసనైతిని. వాటిని అనుభవించు నేను పెక్కుదుష్కర్మలను ఆచరించితిని. వాటి ఫలితమే ఈ బంధనము. ఇప్పుడు దీనిని ఛేదించి సకల ప్రాణులకును హితమొనర్తును. వాసనలను శాంతపరతును. అందరితోను మైత్రి సలిపెదను. దుఃఖితులపై దయచూపెదను. పూర్తిగా జితేంద్రియుడనై యుందును.

2.37 (ముప్పది ఏడవ శ్లోకము)

మోచయే గ్రస్తమాత్మానం యోషిన్మయ్యాఽఽత్మ మాయయా|

విక్రీడితో యయైవాహం క్రీడామృగ ఇవాధమః॥4829॥

భగవంతుని మాయయే స్త్రీరూపమును ధరించి, అధముడనైన నన్ను వేశ్యగా వశపరచుకొనినది. నన్ను ఒక తోలు బొమ్మను జేసి ఆడించినది. ఇప్పుడు నేను ఆ మాయనుండి విముక్తుడనయ్యెదను.

2.38 (ముప్పది ఎనీమిదవ శ్లోకము)

మమాహమితి దేహిదౌ హిత్వా మిథ్యార్థధీర్మతిమ్|

ధాస్యే మనో భగవతి శుద్ధం తత్కీర్తనాదిభిః॥4830॥

నేను నిత్యసత్య స్వరూఫుడనై భగవంతుని గూర్చి తెలిసికొంటిని. కనుక, శరీరాదులందు అహంకార, మమకార భావములను త్యజించెదను. భగవంతుని నామ కీర్తనాదులచే నా మనస్సును పవిత్ర మొనర్చుకొని, దానిని ఆ పరమాత్మునియందే నిలుపుకొందును.

శ్రీ శుక ఉవాచ

2.39 (ముప్పది తొమ్మిదవ శ్లోకము)

ఇతి జాతసునిర్వేదః క్షణసంగేన సాధుషు|

గంగాద్వారముపేయాయ ముక్తాసర్వానుబంధనః॥4831॥

శ్రీ శుకుడు పలికెను- పరీక్షిన్మహారాజా! అజామిళునకు మహర్షులైన శ్రీహరి పార్షదులుతోడి సాంగత్యము జరిగినది క్షణకాలము మాత్రమే. దాని ఫలితముగా అతనిలో వైరాగ్యము ఏర్పడినది. సమస్త బంధములను, మోహమును త్యజించి, అతడు హరిద్వారము చేరెను.

2.40 (నలుబదియవ శ్లోకము)

స తస్మిన్ దేవసదనే ఆసీనో యోగమాశ్రితః|

ప్రత్యాహృతేంద్రియగ్రామో యుయోజ మన ఆత్మని॥4832॥

ఆ దివ్యస్థలమునందు భగవంతుని మందిరమున ఆసీనుడయ్యెను. యోగమార్గమును ఆశ్రయించి, ఇంద్రియములను విషయములనుండి మరల్చెను. ఏకాగ్ర చిత్తముతో మనస్సును ఆత్మయందు నిలిపెను.

2.41 (నలుబది  యొకటవ శ్లోకము)

తతో గుణేభ్య ఆత్మానం వియుజ్యాత్మసమాధినా|

యుయుజే భగవద్ధామ్ని బ్రహ్మణ్యనుభవాత్మని॥4833॥

అనంతరము ఆత్మచింతన ద్వారా బుద్ధిని విషయములనుండి వేరు చేసెను. అప్ఫుడు ఏకాగ్రమొనర్చిన బుద్ధిని జ్ఞానస్వరూపము, సచ్చిదానందాత్మకము అగు పరబ్రహ్మయందు నిలిపెను.

2.42 (నలుబది రెండవ శ్లోకము)

యర్హ్యుపారతధీస్తస్మిన్నద్రాక్షీత్పురుషాన్ పురః|

ఉపలభ్యోపలబ్ధాన్ ప్రాగ్వవందే శిరసా ద్విజః॥4834॥

ఈ విధముగా అజామిళుని బుద్ధి త్రిగుణాత్మకమైన ప్రకృతిని అతిక్రమించి, భగవత్స్వరూపమునందు స్థితమయ్యెను. అప్పుడు ఇదివరలో అతడు చూచిన నలుగురు పార్షదులు తన యెదుట నిలిచియున్నట్లు గమనించెను. అంతట అతడు వారికి శిరసా ప్రణమిల్లెను.

2.43 (నలుబది మూడవ శ్లోకము)

హిత్వా కళేబరం తీర్థే గంగాయాం దర్శనాదను|

సద్యః స్వరూపం జగృహే భగవత్పార్శ్వవర్తినామ్॥4835॥

పార్హదుల దర్శనము లభించిన పిదప , అజామిళుడు హరిద్వారమున గంగయందు తనదేహమును త్యజించెను. వెంటనే అతనికి పార్షదుల స్వరూపము ప్రాప్తించెను.

2.44 (నలుబది నాలుగవ శ్లోకము)

సాకం విహాయసా విప్రో మహాపురుషకింకరైః|

హైమం విమానమారుహ్య యయౌ  యత్ర శ్రియః పతిః॥4836॥

అజామిళుడు శ్రీహరి పార్షదులతో గూడి బంగారు విమానమందు ఆరూఢుడయ్యెను. ఆకాశమార్గముస లక్ష్మీపతికి స్థానమైన వైకుంఠమును జేరెను.

2.45 (నలుబది ఐదవ శ్లోకము)

ఏవం స విప్లావితసర్వధర్మా దాస్యాః పతిః పతితో గర్హ్యకర్మణా|

నిపాత్యమానో నిరయే హతవ్రతః సద్యో విముక్తో భగవన్నామ గృహ్ణన్॥4837॥

పరీక్షిన్మహారాజా! అజామిళుడు వేశ్యతోడి సాంగత్యము వలన సకల ధార్మిక కార్యక్రమములను విడిచిపెట్టెను. నింద్యమైన కర్మల కారణముగా పతితుడాయెను. నియమములను ఉల్లంఘించుటవలన నరకమునందు పడవలసిన దుస్థితి ఎదురయ్యెను. కాని, భగవన్నామమును ఉచ్చరించుటచే వెంటనే ముక్తిని పొందెను.

2.46 (నలుబదియారవ శ్లోకము)

నాతః పరం కర్మనిబంధకృంతనం ముముక్షతాం తీర్థపదానుకీర్తనాత్|

న యత్పునః కర్మసు సజ్జతే మనో రజస్తమోభ్యాం కలిలం తతోఽన్యథా॥4838॥

సంసారబంధములనుండి ముక్తులు కాగోరువారు తీర్థములను కూడా మరింత పవిత్రములను జేయునట్టి భగవంతుని పవిత్రపాదములను స్పృశించుటకంటెను, నామసంకీర్తన  చేయుటకంటెను మరియొక గొప్ప ఉపాయము ఏదియును లేదు. ఏలయన, భగవన్నామమును ఆశ్రయించుట వలన మానవుని మనస్సు మరల లౌకిక కర్మల యందు తగుల్కొనదు. భగవన్నామము కాక వేరొక ప్రాయశ్చిత్త సాధనమును ఆశ్రయించినచో, మనస్సు, రజస్తమోగుణములకు వశమగును. అప్పుడు అతని పాపములు పూర్థిగా నశింపవు.

2.47 (నలుబది ఏడవ శ్లోకము)

య ఏవం పరమం గుహ్యమితిహాసమఘాపహమ్|

శృణుయాచ్ఛ్రద్ధయా యుక్తో యశ్చ భక్త్యానుకీర్తయేత్॥4839॥

2.48 (నలుబది ఎనిమిదవ శ్లోకము)

న వై స నరకం యాతి నేక్షితో యమకింకరైః|

యద్యప్యమంగళో మర్త్యో విష్ణులోకే మహీయతే॥4840॥

పరీక్షిన్మహారాజా! ఈ ఇతిహాసము అత్యంత గోప్యమైనది. సమస్త పాపములను హరించునది. భక్తిశ్రద్ధలతో దీనిని వినువాడు, కీర్తించినవాడు నరకమునకు ఎన్నడును పోడు. యమదూతలు అతనివైపు కన్నత్తియైనను చూడజాలరు. ఆ మనుజుని జీవనము ఎంత పాపమయమైనను, అతడు వైకుంఠమున సమ్మానింపబడును.

2.49 (నలుబది తొమ్మిదవ శ్లోకము)

మ్రియమాణో హరేర్నామ గృణన్ పుత్రోపచారితమ్|

అజామిళోఽప్యగాద్ధామ కిముత శ్రద్ధయా గృణన్॥4841॥

మహారాజా! అజామిళుని వంటి పాపాత్ముడుగూడ మరణ సమయమున పుత్రుని పిలిచెడి నెపముతో భగవన్నామమును ఉచ్చరించెను. అందువలన అతనికి గూడ పరమపదప్రాప్తి గలిగినది. ఇంక, భక్తి శ్రద్ధలతో పరమాత్ముని నామమును ఉచ్చరించిన వాని సంగతి చెప్పనేల?

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం షష్ఠస్కంధే ద్వితీయోఽధ్యాయః (2)

ఇది శ్రీమద్భాగవత మహాపురాణమునందలి షష్ఠ స్కంధమునందు రెండవ అధ్యాయము (2)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
--(())--

10-04,05-గీతా మకరందము 
      విభూతియోగము
🕉🌞🌎🌙🌟🚩

బుద్ధిర్జ్ఞాన మసమ్మోహః 
క్షమా సత్యం దమశ్శమః | 
సుఖం దుఃఖం భవోఽభావో 
భయం చాభయమేవ చ || 

అహింసా సమతా తుష్టిః
తపో దానం యశోఽయశః | 
భవన్తి భావా భూతానాం 
మత్తఏవ పృథగ్విధాః || 

తా:- బుద్ధి, జ్ఞానము, మోహరాహిత్యము, ఓర్పు, సత్యము, బాహ్యేంద్రియనిగ్రహము, అంతరింద్రియనిగ్రహము, సుఖము, దుఃఖము, పుట్టుక (ఉత్పత్తి), నాశము, భయము, భయములేకుండుట, అహింస, సమత్వము, సంతుష్టి, తపస్సు, దానము, కీర్తి, అపకీర్తి, ప్రాణులయొక్క ఈ ప్రకారములైన నానావిధములగు గుణములు నావలననే కలుగుచున్నవి. 

వ్యాఖ్య:- ఈ రెండుశ్లోకములందును బుద్ధి, జ్ఞానము మున్నగు 16 అనుకూలగుణములున్ను; దుఃఖము, నాశము, భయము, అపకీర్తియను 4 ప్రతికూల గుణములున్ను చెప్పబడినవి. ఇవియన్నియు భగవంతుని వలననే కలుగుచున్నవని పేర్కొనబడినది. దీని భావమేమి?భగవానుడు వాస్తవముగ ప్రతికూలభావములను జీవులకు కలుగజేయుటలేదు. జీవుల ఆ యా కర్మములకు ఫలమొసంగువాడే ఈశ్వరుడు.

 ఈశ్వరుడు కర్మఫల ప్రదాత. జీవులు కర్మకర్తలు. కొందఱికి కీర్తి, మఱికొందఱికి అపకీర్తి, కొందఱికి సుఖము, మఱికొందఱికి దుఃఖము వారివారి పూర్వకృత కర్మలవలననే కలుగుచున్నవి. ఏ విత్తనము వారు నాటిన ఆ ఫలితము వారికి కలుగుచుండును. ఈశ్వరుడు నిమిత్తమాత్రుడు. దుష్కర్మలు చేసినవారికి దుఃఖము, సత్కర్మలు చేసినవారికి సుఖము భగవన్నియతివలననే కలుగుచుండును. ఈ దృష్టితోనే ఆ సుఖదుఃఖాదులన్నియు భగవంతునివలన కలుగుచున్నవని చెప్పబడినది. 

    మఱియు  ఇప్పుడు చెప్పబడిన వికారములన్నియు మనస్సునందు ఉద్భవమగుచుండును.  మనస్సు స్వతః జడమైనది. దానికి ఆధారముగ చైతన్యమగు ఆత్మవస్తువు కలదు.

 సూదంటురాయిసమీపమున సూది కదలునట్లు చైతన్యాత్మయొక్క సన్నిధానమున మనస్సు క్రియాత్మకమగుచున్నది. ఈ ప్రకారముగ మనస్సునకును తద్గతవికారములకును పరమాత్మయే ఆధారముగనుక ఇట్టి దృష్టితోనే - అవి యన్నియును పరమాత్మవలననే కలిగినవని ఇచట చెప్పబడినది. అంతియేకాని వాని సంబంధమైన కర్తృత్వముగాని, ప్రేరకత్వముగాని ఆత్మకు (భగవంతునకు) లేదు. (సూర్యునకు జగత్క్రియలందుగాని, నాటకదీపమునకు నాటకమందుగాని కర్తృత్వములేనట్లు).

🕉🌞🌎🌙🌟🚩

No comments:

Post a Comment