షష్ఠ స్కంధము - ఆరవ అధ్యాయము
దక్షప్రజాపతి యొక్క అరువది మంది పుత్రికల వంశవర్ణనము
ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
శ్రీ శుక ఉవాచ
శ్రీ శుకుడు వచించెను- పరీక్షిన్మహారాజా! పిమ్మట బ్రహ్మదేవుడు దక్ష ప్రజాపతిని మిగుల ఊరడించెను. దక్షుని వలన తన భార్యయైన అసిక్ని యందు అరువదిమంది కుమార్తెలు కలిగిరి. వారు అందరును తమ తండ్రి మీద మిగుల అనురాగము కలిగియుండిరి.
దక్షప్రజాపతి వారిలో పదిమంది కన్యలను ధర్మునకును, పదముగ్గురిని కశ్యపునకును, ఇరువది ఏడుగురిని చంద్రునకును, ఇద్దరిని భూతునకును, ఇరువురిని అంగిరసునకును, ఇద్దరిని కృశాశ్వునకును, మిగిలిన నలువురిని తార్ క్ష్యుడు అను పేరుగల కశ్యపునకును ఇచ్చి వివాహములు చేసెను.
మహారాజా! ఈ దక్షకన్యల పేర్లను, వారికి కలిగిన సంతానము యొక్క పేర్లను వినుము. వీరికి కలిగిన వంశపరంపరయే ముల్లోకములయందును వ్యాపించినది.
ధర్మునియొక్క పదిమంది భార్యల పేర్లు భాను, లంబ, కకుభ, జామి, విశ్వ, సాధ్య, మరుత్వతి, వసు, ముహూర్త, సంకల్ప అనునవి - ఇంక వీరి పుత్రుల పేర్లను వినుము.
మహారాజా! భాను అను నామెకు దేవఋషభుడు కలిగెను. అతనికి ఇంద్రసేనుడు జన్మించెను. లంబ అను నామె పుత్రుడు విద్యోతుడు. అతనికి మేఘగణములు జన్మించెను.
కకుభునకు సంకటుడు, అతనికి కికటుడు జన్మించిరి. కికటునకు భూతలమునందలి సకల దుర్గముల అభిమానదేవతలు జన్మించిరి. జామి అను నామె పుత్రుడు స్వర్గుడు, అతనికి నంది అను సుతుడు జన్మించెను.
విశ్వ అనునామెకు విశ్వదేవతలు కలిగిరి. వారికి ఎట్టి సంతానమూ లేకుండెను. సాధ్య అను నామెకు సాధ్యగణములు జన్మించిరి. వారి పుత్రుడు, అర్థసిద్ధి.
మరుత్వతి అను నామెకు మరుత్వంతుడు, జయంతుడు అను ఇద్దరు తనయులు కలిగిరి. జయంతుడు వాసుదేవుని అంశము. అతనిని జనులు ఉపేంద్రుడు అనియు వ్యవహరింతురు.
ముహూర్త అను నామెకు ముహూర్తాభిమాన దేవతలు కలిగిరి. వారు ఆయా ముహూర్తములయందు జీవులకు వారి, వారి కర్మలను అనుసరించి, ఫలములను ఇచ్చుచుందురు.
సంకల్ప అను నామెకు ఎనిమిది మంది వసువులు జన్మించిరి. ద్రోణుడు, ప్రాణుడు, ధ్రువుడు, అర్కుడు, అగ్ని, దోషుడు, వసువు, విభావసువు అనువారు వసుకుమారులు. ద్రోణుని పత్ని పేరు అభిమతి. ఆమె యందు హర్ష, శోక, భయాదులు అభిమాన దేవతలు ఉదయించిరి.
ప్రాణుని భార్య ఉర్జస్వతి, ఆమెయందు సహుడు, ఆయువు, పురోజవుడు అను మువ్వురు కుమారులు కలిగిరి. ధ్రువుని పత్నియైస ధరణి యందు పెక్కు నగరముల అభిమాన దేవతలు జన్మించిరి.
అర్కుని భార్య వాసన. ఆమెకు తర్షుడు(తృష్ణ) మొదలగువారు కలిగిరి. అగ్ని అను పేరుగల వసువు యొక్క పత్ని ధార. ఆమె యందు ద్రవిణకుడు మొదలగు పెక్కుమంది కలిగిరి.
కృత్తిక పుత్రుడగు స్కంధుడు గూడ అగ్ని వలననే జన్మించెను. అతనికి విశాఖుడు మొదలగువారు కలిగిరి. దోషుని పత్ని శర్వరి. ఆమె యందు శిశుమారుడు జన్మించెను. అతడు భగవంతుని కలావతారము.
వసువు యొక్క పత్నియైన అంగిరసి యందు శిల్పకళకు అధిపతియైస విశ్వకర్మ జన్మించెను. విశ్వకర్మ భార్యయైన కృతి యందు చాక్షుష మనువు కలిగెను. అతనికి విశ్వేదేవతలు, సాధ్యగణములు కలిగిరి.
విభావసుని పత్నియైన ఉష యందు వ్యుష్టుడు, రోచిషుడు, ఆతపుడు జన్మించిరి. వారిలో ఆతపునకు పంచయాముడు (దినము) అను పుత్రుడు కలిగెను. అతని వలననే సకల జీవులు తమ తమ కార్యముల యందు నిమగ్నులగుదురు.
దక్షుని కూతురు, భూతుని భార్యయగు సరూప యందు కోట్లకొలది రుద్రగణములు జన్మించెను. వారిలో రైవతుడు, అజుడు, భవుడు, భీముడు, వాముడు, ఉగ్రుడు, వృషాకపి, అజైకపాదుడు, అహిర్బుధ్న్యుడు, బహురూపుడు, మహంతుడు అను పదకొండుమంది ముఖ్యులు, భూతుని రెండవభార్యయైన భూతయందు భయంకరుడై, భూతుడు, వినాయకుడు మున్నగువారు జన్మించిరి. వీరు అందరు పదకొండుమంది రుద్రులలో ముఖ్యుడైన మహంతునకు పార్షదులైరి.
ప్రజాపతియైన అంగిరసుని మొదటిభార్య పేరు స్వధ, ఆమె పితృగణములకు జన్మనిచ్చెను. రెండవ భార్యయైన సతి అధర్వాంగిరసము అను వేదమునే పుత్రరూపమున స్వీకరించెను.
కృశాశ్వుని భార్యయగు అర్చి యందు ధూమ్రకేశుడు అనువాడు జన్మించెను. రెండవ భార్యయగు ధిషణకు వేదశిరుడు, దేవలుడు, వయునుడు, మనువు అను నల్వురు పుత్రులు కలిగిరి.
తార్ క్ష్యుడు అను పేరుగల కశ్యపునకు వినత, కద్రువ, పతంగి, యామిని అను నలుగురు భార్యలుండిరి. పతంగి అను నామెకు పక్షులు జన్మించెను. యామినికి శలభములు (మిడుతలు) జన్మించెను.
వినతయందు గరుత్మంతుడు ఉదయించెను. అతడు శ్రీమహావిష్ణువునకు వాహనమయ్యెను. వినత యొక్క రెండవ కుమారుడైన అనూరుడు సూర్యభగవానునికి సారథి అయ్యెను. కద్రువవలన అనేక నాగులు ఉత్పన్నమయ్యెను.
పరీక్షిన్మహారాజా! కృత్తిక మొదలగు ఇరువదియేడు మంది నక్షత్రాభిమాన దేవతలు చంద్రుని భార్యలైరి. చంద్రుడు రోహిణిపై ఇతర పత్నులకంటె ఎక్కువ మక్కువ కలిగియుండెను. ఆకారణముగా దక్షుడు అతనిని శపించగా అతడు క్షయరోగ పీడితుడయ్యెను. అతనికి ఎట్టి సంతానమూ కలుగకుండెను.
చంద్రుడు దక్షుని ప్రసన్నునిగా చేసికొనుట వలన కృష్ణపక్షము అతని కళలు క్షీణించుచుండునట్లుగను, శుక్లపక్షమునందు ఆయనకళలు వృద్ధి చెందుచుండునట్లుగను వరమును పొందెను. కాని, నక్షత్రాభి మానదేవతలలో ఎవ్వరి యందును అతని వలన సంతానము కలుగకుండెను. ఇప్పుడు కశ్యపప్రజాపతియొక్క పత్నుల పేర్లను వినుము - వారందరును శుభంకరులు, లోకమునకు తల్లుల వంటివారు; వారి వలననే ఈ జగత్తు అంతయు సృష్టింపబడినది. వారిపేర్లు అదితి, దితి, దనువు, కాష్ఠ, అరిష్ట, సురస, ఇల, ముని, క్రోధవశ, తామ్ర, సురభి, సరమ, తిమి అనువారు. తిమియందు జలచర జంతువులు, సరమయందు పులులు మొదలగు హింసించు జంతువులు ఉత్పన్నమాయెను.
సురభియందు గోవులు, ఎద్దులు ఇంకను, రెండు గిట్టలు గల ఇతర పశువులు జన్మించెను. తామ్ర అను నామెకు రాబందులు, గ్రద్దలు మొదలగు వేటాడు పక్షులు కలిగెను. ముని అను నామెకు అప్సరసలు జన్మించిరి.
క్రోధవశకు పాములు, త్రేళ్ళు మొదలగు విషజంతువులు కలిగెను. ఇల అను నామెకు వృక్షములు, లతలు మొదలగునవియును, భూమియందు ఉత్పన్నములగు వసస్పతులు ఉదయించెను. సురస అను నామెకు యాతుధానులు (రాక్షసులు) జన్మించిరి.
అరిష్టయందు గంధర్వులు, కాష్టయందు గుర్రములు, మొదలగు ఒక్క గిట్టగల పశువులు జన్మించెను. దనువునకు అరువదియొక్క పుత్రులు జన్మించిరి. వారిలో ముఖ్యులైనవారి పేర్లను వినుము-
ద్విమూర్ధుడు, శంబరుడు, అరిష్టుడు, హయగ్రీవుడు, విభావసుడు, అయోముఖుడు, శంకుశిరుడు, స్వర్భానుడు, కపిలుడు, అరుణుడు, పులోముడు, వృషపర్వుడు, ఏకచక్రుడు, అనుతాపనుడు, ధూమ్రకేతుడు, విరూపాక్షడు, విప్రచిత్తి, దుర్జయుడు అనువారు కలిగిరి.
స్వర్భానుయొక్క కుమార్తెయైన సుప్రభకు సుముచియను వానితో వివాహమయ్యెను. వృషపర్వుని కూతురైన శర్మిష్ఠను నహుషనందనుడు, మహాబలవంతుడైన యయాతి వివాహమాడెను.
దనువు పుత్రుడైన వైశ్వానరునకు అందమైన నలువురు కుమార్తెలు గలిగిరి. వారిపేర్లు ఉపదానవి, హయశిర, పులోమ, కాలక.
ఉపదానవిని హిరణ్యాక్షుడు, హయశిరను క్రతువు పెండ్లియాడిరి. బ్రహ్మదేవుని ఆజ్ఞ మేరకు కశ్యపప్రజాపతి, వైశ్వానరుని కుమార్తెలైన పులోమను, కాలకను పెండ్లియాడెను. వారి యందు పౌలోములు, మరియు కాలకేయులు అను పేరుగల అరువదివేలమంది దానవులు కలిగిరి. వారు గొప్ప యుద్ధవీరులు. వారే నివాత కవచులు అను పేర్లతో ప్రసిద్ధి చెందిరి. వారు యజ్ఞకార్యములకు విఘ్నములను కలిగించుచుండిరి. కనుక, పరీక్షిన్మహారాజా! మీ తాతయైన అర్జునుడు ఒక్కడే ఇంద్రునకు ప్రియమును గూర్చుటకై వారిని వధించెను. ఆ సమయమున అర్జునుడు స్వర్గమునందు ఉండెను.
విప్రచిత్తి పత్నియైన సింహికయందు నూట ఒక్క మంది పుత్రులు ఉదయించిరి. వారిలో జ్యేష్ఠుడు రాహువు. అతడు గ్రహములలో ఒకడుగా లెక్కింపబడెను. మిగిలిన వందమంది పుత్రులు కేతువులుగా వ్యవహరింపబడిరి.
రాజా! ఇప్పుడు క్రమముగా అదితి యొక్క వంశపరంపరను గూర్చి వినుము- ఈ వంశమునందు సర్వవ్యాపకుడు, దేవాదిదేవుడు ఐన శ్రీమన్నారాయణుడు తన అంశతో వామనరూపమున అవతరించెను.
అదితికి వివస్వంతుడు, అర్యముడు, పూష, త్వష్ట, సవిత, భగుడు, ధాత, విధాత, వరుణుడు, మిత్రుడు, ఇంద్రుడు, త్రివిక్రముడు (వామనుడు) అను పుత్రులు ఉదయించిరి. ఈ పన్నెండు మంది ఆదిత్యులు అని వ్యవహరింపబడిరి.
వివస్వంతుని పత్నియైన సంజ్ఞ మహాభాగ్యశాలిని. ఆమెయందు శ్రాద్ధదేవుడు (వైవస్వతుడు) అనుమనువు, ఇంకను, యముడు, యమున అను కవలలు జన్మించిరి. సంజ్ఞయే గుర్రము రూపమును ధరించి, సూర్యభగవానుని ద్వారా భూలోకముస అశ్వినీకుమారులు అను ఇరువురికి జన్మనిచ్చెను.
వివస్వంతుని రెండవ భార్య ఫేరు ఛాయ. ఆమె యందు శనైశ్చరుడు సావర్ణి అను మనువు, తపతి యను కూతురు జన్మించిరి. తపతి సంవరణుని భార్యయయ్యెను.
అర్యముని పత్ని మాతృక, ఆమె యందు చర్షణులు అను పుత్రులు గలిగిరి. వారు కర్తవ్య-అకర్తవ్య అను జ్ఞానము గలవారు. అందువలన బ్రహ్మదేవుడు వారిని ఆధారముగా చేసికొని బ్రాహ్మణాది వర్ణములను ఏర్పరచెను.
పూషకు సంతానము లేకుండెను. పూర్వకాలమున పరమశివుడు దక్షునిపై కుపితుడైనప్ఫుడు పూష వికృతముగానవ్వెను. అందు వలన వీరభద్రుడు అతని పండ్లూడగొట్టెను. అప్పటి నుండి పూష పిండిని ఆహారముగా తీసికొనసాగెను.
త్వష్టుని భార్య పేరు రచన. ఆమె దైత్యుల చెల్లెలు. రచనకు సన్నివేశుడు, పరాక్రమశాలియైన విశ్వరూపుడు అను ఇద్దరు కుమారులు కలిగిరి.
ఒకానొకప్పుడు దేవగురువైన బృహస్పతి ఇంద్రునిచే అవమానింపబడి దేవతలను పరిత్యజించెను. అప్ఫుడు దేవతలు దైత్యులకు మేనల్లుడాయెనని విశ్వరూపుని తమకు పురోహితునిగా చేసికొనిరి.
ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం షష్ఠస్కంధే షష్డోఽధ్యాయః (6)
ఇది శ్రీమద్భాగవత మహాపురాణమునందలి షష్ఠ స్కంధమునందు ఆరవ అధ్యాయము (6)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
27.5.2020 ప్రాతః కాల సందేశము
వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం
షష్ఠ స్కంధము - ఆరవ అధ్యాయము
దక్షప్రజాపతి యొక్క అరువది మంది పుత్రికల వంశవర్ణనము
ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
శ్రీ శుక ఉవాచ
6.1 (ప్రథమ శ్లోకము)
తతః ప్రాచేతసోఽసిక్న్యా మనునీతః స్వయంభువా|
షష్టిం సంజనయామాస దుహితౄః పితృవత్సలాః॥4975॥
శ్రీ శుకుడు వచించెను- పరీక్షిన్మహారాజా! పిమ్మట బ్రహ్మదేవుడు దక్ష ప్రజాపతిని మిగుల ఊరడించెను. దక్షుని వలన తన భార్యయైన అసిక్ని యందు అరువదిమంది కుమార్తెలు కలిగిరి. వారు అందరును తమ తండ్రి మీద మిగుల అనురాగము కలిగియుండిరి.
6.2 (రెండవ శ్లోకము)
దశ ధర్మాయ కాయేంధోః ద్విషట్ త్రిణవ దత్తవాన్|
భూతాంగిరః కృశాశ్వేభ్యో ద్వే ద్వే తార్ క్ష్యాయ చాపరాః॥4976॥
దక్షప్రజాపతి వారిలో పదిమంది కన్యలను ధర్మునకును, పదముగ్గురిని కశ్యపునకును, ఇరువది ఏడుగురిని చంద్రునకును, ఇద్దరిని భూతునకును, ఇరువురిని అంగిరసునకును, ఇద్దరిని కృశాశ్వునకును, మిగిలిన నలువురిని తార్ క్ష్యుడు అను పేరుగల కశ్యపునకును ఇచ్చి వివాహములు చేసెను.
6.3 (మూడవ శ్లోకము)
నామధేయాన్యమూషాం త్వం సాపత్యానాం చ మే శృణు|
యాసాం ప్రసూతిప్రసవైర్లోకా ఆపూరితాస్త్రయః॥4977॥
మహారాజా! ఈ దక్షకన్యల పేర్లను, వారికి కలిగిన సంతానము యొక్క పేర్లను వినుము. వీరికి కలిగిన వంశపరంపరయే ముల్లోకములయందును వ్యాపించినది.
6.4 (నాలుగవ శ్లోకము)
భానుర్లంబా కకుబ్జామిర్విశ్వా సాధ్యా మరుత్వతీ|
వసుర్ముహూర్తా సంకల్పా ధర్మపత్న్యం సుతాన్ శృణు॥4978॥
ధర్మునియొక్క పదిమంది భార్యల పేర్లు భాను, లంబ, కకుభ, జామి, విశ్వ, సాధ్య, మరుత్వతి, వసు, ముహూర్త, సంకల్ప అనునవి - ఇంక వీరి పుత్రుల పేర్లను వినుము.
6.5 (ఐదవ శ్లోకము)
భావోస్తు దేవఋషభః ఇంధ్రసేనస్తతో నృప|
విద్యోత ఆసీల్లంబాయాస్తతశ్చ స్తనయిత్నవః॥4979॥
మహారాజా! భాను అను నామెకు దేవఋషభుడు కలిగెను. అతనికి ఇంద్రసేనుడు జన్మించెను. లంబ అను నామె పుత్రుడు విద్యోతుడు. అతనికి మేఘగణములు జన్మించెను.
6.6 (ఆరవ శ్లోకము)
.కకుభః సంకటస్తస్య కీకటస్తనయో యతః|
భువో దుర్గాణి జామేయః స్వర్గో నందిస్తతోఽభవత్॥4980॥
కకుభునకు సంకటుడు, అతనికి కికటుడు జన్మించిరి. కికటునకు భూతలమునందలి సకల దుర్గముల అభిమానదేవతలు జన్మించిరి. జామి అను నామె పుత్రుడు స్వర్గుడు, అతనికి నంది అను సుతుడు జన్మించెను.
6.7 (ఏడవ శ్లోకము)
విశ్వే దేవాస్తు విశ్వాయా అప్రజాంస్తాన్ ప్రచక్షతే|
సాధ్యోగణశ్చ సాధ్యాయాః అర్థసిద్ధిస్తు తత్సుతః॥4981॥
విశ్వ అనునామెకు విశ్వదేవతలు కలిగిరి. వారికి ఎట్టి సంతానమూ లేకుండెను. సాధ్య అను నామెకు సాధ్యగణములు జన్మించిరి. వారి పుత్రుడు, అర్థసిద్ధి.
6.8 (ఎనిమిదవ శ్లోకము)
మరుత్వాంశ్చ జయంతశ్చ మరుత్వత్యాం బభూవతుః|
జయంతో వాసుదేవాంశ ఉపేంద్ర ఇతి యం విదుః॥4982॥
మరుత్వతి అను నామెకు మరుత్వంతుడు, జయంతుడు అను ఇద్దరు తనయులు కలిగిరి. జయంతుడు వాసుదేవుని అంశము. అతనిని జనులు ఉపేంద్రుడు అనియు వ్యవహరింతురు.
6.9 (తొమ్మిదవ శ్లోకము)
మౌహూర్తికా దేవగణా ముహూర్తాయాశ్చ జజ్ఞిరే|
యే వై ఫలం ప్రయచ్ఛంతి భూతానాం స్వస్వకాలజమ్॥4983॥
ముహూర్త అను నామెకు ముహూర్తాభిమాన దేవతలు కలిగిరి. వారు ఆయా ముహూర్తములయందు జీవులకు వారి, వారి కర్మలను అనుసరించి, ఫలములను ఇచ్చుచుందురు.
6.10 (పదియవ శ్లోకము)
సంకల్పాయాశ్చ సంకల్పః కామః సంకల్పజః స్మృతః|
వసవోఽష్టౌ వసోః పుత్రాస్తేషాం నామాని మే శృణు॥4984॥
6.11 (పదకొంఢవ శ్లోకము)
ద్రోణః ప్రాణో ధ్రువోఽర్మోఽగ్నిర్దోషో వసుర్విభావసుః|
ద్రోణస్యాభిమతేః పత్న్యాః హర్షశోకభయాదయః॥4985॥
సంకల్ప అను నామెకు ఎనిమిది మంది వసువులు జన్మించిరి. ద్రోణుడు, ప్రాణుడు, ధ్రువుడు, అర్కుడు, అగ్ని, దోషుడు, వసువు, విభావసువు అనువారు వసుకుమారులు. ద్రోణుని పత్ని పేరు అభిమతి. ఆమె యందు హర్ష, శోక, భయాదులు అభిమాన దేవతలు ఉదయించిరి.
6.12 (పండ్రెండవ శ్లోకము)
ఫ్రాణస్రోర్జస్వతీ భార్యా సహ ఆయుః పురోజనః|
ధ్రువస్య భార్యా ధరణిరసూత వివిధాః పురః॥4986॥
ప్రాణుని భార్య ఉర్జస్వతి, ఆమెయందు సహుడు, ఆయువు, పురోజవుడు అను మువ్వురు కుమారులు కలిగిరి. ధ్రువుని పత్నియైస ధరణి యందు పెక్కు నగరముల అభిమాన దేవతలు జన్మించిరి.
6.13 (పధమూడవ శ్లోకము)
అర్కస్య వాసనా భార్యా పుత్రాస్తర్షాదయః స్మృతాః|
అగ్నేర్భార్యాః వసోర్ధారా పుత్రా ద్రవిణకాదయః॥4987॥
అర్కుని భార్య వాసన. ఆమెకు తర్షుడు(తృష్ణ) మొదలగువారు కలిగిరి. అగ్ని అను పేరుగల వసువు యొక్క పత్ని ధార. ఆమె యందు ద్రవిణకుడు మొదలగు పెక్కుమంది కలిగిరి.
6.14 (పదునాలుగవ శ్లోకము)
స్కందశ్చ కృత్తికాపుత్రో యే విశాఖాదయస్తతః|
దోషస్య శర్వరీపుత్రః శిశుమారో హరేఃకలా॥4988॥
కృత్తిక పుత్రుడగు స్కంధుడు గూడ అగ్ని వలననే జన్మించెను. అతనికి విశాఖుడు మొదలగువారు కలిగిరి. దోషుని పత్ని శర్వరి. ఆమె యందు శిశుమారుడు జన్మించెను. అతడు భగవంతుని కలావతారము.
6.15 (పదునైదవ శ్లోకము)
వసోరాంగిరసీ పుత్రో విశ్వకర్మాకృతీపతిః|
తతో మనుశ్చాక్షుషోఽభూత్ విశ్వే సాధ్యా మనోఃసుతాః॥4989॥
వసువు యొక్క పత్నియైన అంగిరసి యందు శిల్పకళకు అధిపతియైస విశ్వకర్మ జన్మించెను. విశ్వకర్మ భార్యయైన కృతి యందు చాక్షుష మనువు కలిగెను. అతనికి విశ్వేదేవతలు, సాధ్యగణములు కలిగిరి.
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి షష్ఠస్కంధములోని ఆరవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
27.5.2020 సాయం కాల సందేశము
వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం
షష్ఠ స్కంధము - ఆరవ అధ్యాయము
దక్షప్రజాపతి యొక్క అరువది మంది పుత్రికల వంశవర్ణనము
ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
6.16 (పదునారవ శ్లోకము)
విభావసోరసూతోషా వ్యుష్టం రోచిషమాతపమ్|
పంచయోమోఽథ భూతాని యేన జాగ్రతి కర్మసు॥4990॥
విభావసుని పత్నియైన ఉష యందు వ్యుష్టుడు, రోచిషుడు, ఆతపుడు జన్మించిరి. వారిలో ఆతపునకు పంచయాముడు (దినము) అను పుత్రుడు కలిగెను. అతని వలననే సకల జీవులు తమ తమ కార్యముల యందు నిమగ్నులగుదురు.
6.17 (పదునేడవ శ్లోకము)
సరూపాఽసూత భూతస్య భార్యా రుద్రాంశ్చ కోటిశః|
రైవతోఽజో భవో భీమో వామ ఉగ్రో వృషాకపిః॥4991॥
6.18 (పదునెనిమిదవ శ్లోకము)
అజైకపాదహిర్భుధ్న్యో బహురూపో మహానితి|
రుద్రస్య పార్షదాశ్చన్యే ఘోరాః భూతవినాయకాః॥4992॥
దక్షుని కూతురు, భూతుని భార్యయగు సరూప యందు కోట్లకొలది రుద్రగణములు జన్మించెను. వారిలో రైవతుడు, అజుడు, భవుడు, భీముడు, వాముడు, ఉగ్రుడు, వృషాకపి, అజైకపాదుడు, అహిర్బుధ్న్యుడు, బహురూపుడు, మహంతుడు అను పదకొండుమంది ముఖ్యులు, భూతుని రెండవభార్యయైన భూతయందు భయంకరుడై, భూతుడు, వినాయకుడు మున్నగువారు జన్మించిరి. వీరు అందరు పదకొండుమంది రుద్రులలో ముఖ్యుడైన మహంతునకు పార్షదులైరి.
6.19 (పందొమ్మిదవ శ్లోకము)
ప్రజాపతేరంగిరసః స్వధా పత్నీ పితౄనథ|
అథర్వాంగిరసం వేదం పుత్రత్వే చాకరోత్సతీ॥4993॥
ప్రజాపతియైన అంగిరసుని మొదటిభార్య పేరు స్వధ, ఆమె పితృగణములకు జన్మనిచ్చెను. రెండవ భార్యయైన సతి అధర్వాంగిరసము అను వేదమునే పుత్రరూపమున స్వీకరించెను.
6.20 (ఇరువదియవ శ్లోకము)
కృశాశ్వోఽర్చిషి భార్యాయాం ధూమ్రకేశమజీజనత్|
ధిషణాయాం వేదశిరో దేవలం వయునం మనుమ్॥4994॥
కృశాశ్వుని భార్యయగు అర్చి యందు ధూమ్రకేశుడు అనువాడు జన్మించెను. రెండవ భార్యయగు ధిషణకు వేదశిరుడు, దేవలుడు, వయునుడు, మనువు అను నల్వురు పుత్రులు కలిగిరి.
6.21 (ఇరువధి ఒకటవ శ్లోకము)
తార్ క్ష్యస్య వినతా కద్రూః పతంగీ యామినీతి చ|
పతంగ్యసూత పతగాన్ యామనీ శలభానథ॥4995॥
తార్ క్ష్యుడు అను పేరుగల కశ్యపునకు వినత, కద్రువ, పతంగి, యామిని అను నలుగురు భార్యలుండిరి. పతంగి అను నామెకు పక్షులు జన్మించెను. యామినికి శలభములు (మిడుతలు) జన్మించెను.
6.22 (ఇరువది రెండవ శ్లోకము)
సుపర్ణాసూత గరుడం సాక్షాద్యజ్ఞేశవాహనమ్|
సూర్యసూతమనూరుం చ కద్రూర్నాగాననేకశః॥4996॥
వినతయందు గరుత్మంతుడు ఉదయించెను. అతడు శ్రీమహావిష్ణువునకు వాహనమయ్యెను. వినత యొక్క రెండవ కుమారుడైన అనూరుడు సూర్యభగవానునికి సారథి అయ్యెను. కద్రువవలన అనేక నాగులు ఉత్పన్నమయ్యెను.
6.23 (ఇరువది మూడవ శ్లోకము)
కృత్తికాదీని నక్షత్రాశణీందోః పత్న్యస్తు భారత|
దక్షశాపాత్ సోఽనపత్యస్తాసు యక్ష్మగ్రహార్దితః॥4997॥
పరీక్షిన్మహారాజా! కృత్తిక మొదలగు ఇరువదియేడు మంది నక్షత్రాభిమాన దేవతలు చంద్రుని భార్యలైరి. చంద్రుడు రోహిణిపై ఇతర పత్నులకంటె ఎక్కువ మక్కువ కలిగియుండెను. ఆకారణముగా దక్షుడు అతనిని శపించగా అతడు క్షయరోగ పీడితుడయ్యెను. అతనికి ఎట్టి సంతానమూ కలుగకుండెను.
6.24 (ఇరువది నాలుగవ శ్లోకము)
పునః ప్రసాద్య తం సోమః కళా లేఖే క్షయే దితాః|
శృణు నామాని లోకానాం మాతౄణాం శంకరాణి చ॥4998॥
6.25 (ఇరువది ఐదవ శ్లోకము)
అథ కశ్యపపత్నీనాం యత్ప్రసూతమిదం జగత్|
అదితిర్దితిర్దనుః కాష్ఠా అరిష్టా సురసా ఇలా॥4999॥
6.26 (ఇరువది ఆరవ శ్లోకము)
మునిః క్రోధవశా తామ్రా సురభిః సరమా తిమిః|
తిమేర్యాదోగణా ఆసన్ శ్వాపదాః సరమాసుతాః॥5000॥
చంద్రుడు దక్షుని ప్రసన్నునిగా చేసికొనుట వలన కృష్ణపక్షము అతని కళలు క్షీణించుచుండునట్లుగను, శుక్లపక్షమునందు ఆయనకళలు వృద్ధి చెందుచుండునట్లుగను వరమును పొందెను. కాని, నక్షత్రాభి మానదేవతలలో ఎవ్వరి యందును అతని వలన సంతానము కలుగకుండెను. ఇప్పుడు కశ్యపప్రజాపతియొక్క పత్నుల పేర్లను వినుము - వారందరును శుభంకరులు, లోకమునకు తల్లుల వంటివారు; వారి వలననే ఈ జగత్తు అంతయు సృష్టింపబడినది. వారిపేర్లు అదితి, దితి, దనువు, కాష్ఠ, అరిష్ట, సురస, ఇల, ముని, క్రోధవశ, తామ్ర, సురభి, సరమ, తిమి అనువారు. తిమియందు జలచర జంతువులు, సరమయందు పులులు మొదలగు హింసించు జంతువులు ఉత్పన్నమాయెను.
6.27 (ఇరువది ఏడవ శ్లోకము)
సురభేర్మహిషా గావో యే చాన్యే ద్విశఫా నృప|
తామ్రాయాః శ్యేనగృధ్రాద్యా మునేరప్సరసాం గణాః॥5001॥
సురభియందు గోవులు, ఎద్దులు ఇంకను, రెండు గిట్టలు గల ఇతర పశువులు జన్మించెను. తామ్ర అను నామెకు రాబందులు, గ్రద్దలు మొదలగు వేటాడు పక్షులు కలిగెను. ముని అను నామెకు అప్సరసలు జన్మించిరి.
6.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)
దందశూకాదయః సర్పా రాజన్ క్రోధవశాత్మజాః|
ఇలాయా భూరుహాః సర్వే యాతుధానాశ్చ సౌరసాః॥5002॥
క్రోధవశకు పాములు, త్రేళ్ళు మొదలగు విషజంతువులు కలిగెను. ఇల అను నామెకు వృక్షములు, లతలు మొదలగునవియును, భూమియందు ఉత్పన్నములగు వసస్పతులు ఉదయించెను. సురస అను నామెకు యాతుధానులు (రాక్షసులు) జన్మించిరి.
6.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)
అరీష్టాయాశ్చ గంధర్వాః కాష్ఠాయా ద్విశఫేతరాః|
సుతా దనోరేకషష్టిస్తేషాం ప్రాధానికాన్ శృణు॥5003॥
అరిష్టయందు గంధర్వులు, కాష్టయందు గుర్రములు, మొదలగు ఒక్క గిట్టగల పశువులు జన్మించెను. దనువునకు అరువదియొక్క పుత్రులు జన్మించిరి. వారిలో ముఖ్యులైనవారి పేర్లను వినుము-
6.30 (ముప్పదియవ శ్లోకము)
ద్విమూర్ధా శంబరోఽరిష్టో హయగ్రీవో విభావసుః|
అయోముఖః శంకుశిరాః స్వర్భానుః కపిలోఽరుణః॥5004॥
6.31 (ముప్పది ఒకటవ శ్లోకము)
పులోమా వృషపర్వా చ ఏకచక్రోఽనుతాపనః|
ధూమ్రకేశో విరూపాక్షో విప్రచిత్తిశ్చ దుర్జయః॥5005॥
ద్విమూర్ధుడు, శంబరుడు, అరిష్టుడు, హయగ్రీవుడు, విభావసుడు, అయోముఖుడు, శంకుశిరుడు, స్వర్భానుడు, కపిలుడు, అరుణుడు, పులోముడు, వృషపర్వుడు, ఏకచక్రుడు, అనుతాపనుడు, ధూమ్రకేతుడు, విరూపాక్షడు, విప్రచిత్తి, దుర్జయుడు అనువారు కలిగిరి.
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి షష్ఠస్కంధములోని ఆరవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
28.5.2020 ప్రాతః కాల సందేశము
వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం
షష్ఠ స్కంధము - ఆరవ అధ్యాయము
దక్షప్రజాపతి యొక్క అరువది మంది పుత్రికల వంశవర్ణనము
ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
6.32 (ముప్పది రెండవ శ్లోకము)
స్వర్భానోః సుప్రభాం కన్యామువాహ నముచిః కిల|
వృషపర్వణస్తు శర్మిష్ఠాం యయాతిర్నాహుషో బలీ॥5006॥
స్వర్భానుయొక్క కుమార్తెయైన సుప్రభకు సుముచియను వానితో వివాహమయ్యెను. వృషపర్వుని కూతురైన శర్మిష్ఠను నహుషనందనుడు, మహాబలవంతుడైన యయాతి వివాహమాడెను.
6.33 (ముప్పది మూడవ శ్లోకము)
వైశ్వానరసుతా యాశ్చ చతస్రశ్చారుదర్శనాః
ఉపదానవీ హయశిరా పులోమా కాలకా తథా॥5007॥
దనువు పుత్రుడైన వైశ్వానరునకు అందమైన నలువురు కుమార్తెలు గలిగిరి. వారిపేర్లు ఉపదానవి, హయశిర, పులోమ, కాలక.
6.34 (ముప్పది నాలుగవ శ్లోకము)
ఉపదానవీం హిరణ్యాక్షః క్రతుర్హయశిరాం నృప|
పులోమాం కాలకాం చ ద్వే వైశ్వానరసుతే తు కః॥5008॥
6.35 (ముప్పది ఐదవ శ్లోకము)
ఉపయేమేఽథ భగవాన్ కశ్యపో బ్రహ్మచోదితః|
పౌలోమాః కాలకేయాశ్చ దానవా యుద్ధశాలినః॥5009॥
6.36 (ముప్పది ఆరవ శ్లోకము)
తయోః షష్టిసహస్రాణి యజ్ఞఘ్నాంస్తే పితుః పితా|
జఘాన స్వర్గతో రాజన్నేక ఇంద్రప్రియంకరః॥5010॥
ఉపదానవిని హిరణ్యాక్షుడు, హయశిరను క్రతువు పెండ్లియాడిరి. బ్రహ్మదేవుని ఆజ్ఞ మేరకు కశ్యపప్రజాపతి, వైశ్వానరుని కుమార్తెలైన పులోమను, కాలకను పెండ్లియాడెను. వారి యందు పౌలోములు, మరియు కాలకేయులు అను పేరుగల అరువదివేలమంది దానవులు కలిగిరి. వారు గొప్ప యుద్ధవీరులు. వారే నివాత కవచులు అను పేర్లతో ప్రసిద్ధి చెందిరి. వారు యజ్ఞకార్యములకు విఘ్నములను కలిగించుచుండిరి. కనుక, పరీక్షిన్మహారాజా! మీ తాతయైన అర్జునుడు ఒక్కడే ఇంద్రునకు ప్రియమును గూర్చుటకై వారిని వధించెను. ఆ సమయమున అర్జునుడు స్వర్గమునందు ఉండెను.
6.37 (ముప్పది ఏడవ శ్లోకము)
విప్రచిత్తిః సింహికాయాం శతం చైకమజీజనత్|
రాహుజ్యేష్ఠం కేతుశతం గ్రహత్వంాయ ఉపాగతః॥5011॥
విప్రచిత్తి పత్నియైన సింహికయందు నూట ఒక్క మంది పుత్రులు ఉదయించిరి. వారిలో జ్యేష్ఠుడు రాహువు. అతడు గ్రహములలో ఒకడుగా లెక్కింపబడెను. మిగిలిన వందమంది పుత్రులు కేతువులుగా వ్యవహరింపబడిరి.
6.38 (ముప్పది ఎనిమిదవ శ్లోకము)
అథాతః శ్రూయతాం వంశో యోఽదితేరనుపూర్వశః|
యత్ర నారాయణో దేవః స్వాంశేనావతరద్విభుః॥5012॥
రాజా! ఇప్పుడు క్రమముగా అదితి యొక్క వంశపరంపరను గూర్చి వినుము- ఈ వంశమునందు సర్వవ్యాపకుడు, దేవాదిదేవుడు ఐన శ్రీమన్నారాయణుడు తన అంశతో వామనరూపమున అవతరించెను.
6.39 (ముప్పది తొమ్మిదవ శ్లోకము)
వివస్వానర్యమా పూషా త్వష్టాథ సవితా భగః|
ధాతా విధాతా వరుణో మిత్రః శుక్ర ఉరుక్రమః॥5013॥
అదితికి వివస్వంతుడు, అర్యముడు, పూష, త్వష్ట, సవిత, భగుడు, ధాత, విధాత, వరుణుడు, మిత్రుడు, ఇంద్రుడు, త్రివిక్రముడు (వామనుడు) అను పుత్రులు ఉదయించిరి. ఈ పన్నెండు మంది ఆదిత్యులు అని వ్యవహరింపబడిరి.
6.40 (నలుబదియవ శ్లోకము)
వివస్వతః శ్రాద్ధదేవం సంజ్ఞాసూయత వై మనుమ్|
మిథునం చ మహాభాగా యమం దేవం యపీం తథా|
సైవ భూత్వాథ బడబా నాసత్యౌ సుషువే భువి॥5014॥
వివస్వంతుని పత్నియైన సంజ్ఞ మహాభాగ్యశాలిని. ఆమెయందు శ్రాద్ధదేవుడు (వైవస్వతుడు) అనుమనువు, ఇంకను, యముడు, యమున అను కవలలు జన్మించిరి. సంజ్ఞయే గుర్రము రూపమును ధరించి, సూర్యభగవానుని ద్వారా భూలోకముస అశ్వినీకుమారులు అను ఇరువురికి జన్మనిచ్చెను.
6.41 (నలుబది ఒకటవ శ్లోకము)
ఛాయా శనైశ్చరం లేభే సావర్ణిం చ మనుం తతః|
కన్యాం చ తపతీం యా వై వవ్రే సంవరణం పతిమ్॥5015॥
వివస్వంతుని రెండవ భార్య ఫేరు ఛాయ. ఆమె యందు శనైశ్చరుడు సావర్ణి అను మనువు, తపతి యను కూతురు జన్మించిరి. తపతి సంవరణుని భార్యయయ్యెను.
6.42 (నలుబది రెండవ శ్లోకము)
అర్యమ్ణో మాతృకా పత్నీ తయోశ్చర్షణయః సుతాః|
యత్ర వై మానుషీ జాతిర్బ్రహ్మణా చోపకల్పితా॥5016॥
అర్యముని పత్ని మాతృక, ఆమె యందు చర్షణులు అను పుత్రులు గలిగిరి. వారు కర్తవ్య-అకర్తవ్య అను జ్ఞానము గలవారు. అందువలన బ్రహ్మదేవుడు వారిని ఆధారముగా చేసికొని బ్రాహ్మణాది వర్ణములను ఏర్పరచెను.
6.43 (నలుబది మూడవ శ్లోకము)
పూషానపత్యః పిష్టాదో భగ్నదంతోఽభవత్పురా|
యోఽసౌ దక్షాయ కుపితం జహాస వివృతద్విజః॥5017॥
పూషకు సంతానము లేకుండెను. పూర్వకాలమున పరమశివుడు దక్షునిపై కుపితుడైనప్ఫుడు పూష వికృతముగానవ్వెను. అందు వలన వీరభద్రుడు అతని పండ్లూడగొట్టెను. అప్పటి నుండి పూష పిండిని ఆహారముగా తీసికొనసాగెను.
6.44 (నలుబది నాలుగవ శ్లోకము)
త్వష్టుర్దైత్యానుజా భార్యా రచనా నామ కన్యకా|
సన్నవేశస్తయోర్జజ్ఞే విశ్వరూపశ్చ వీర్యవాన్॥5018॥
త్వష్టుని భార్య పేరు రచన. ఆమె దైత్యుల చెల్లెలు. రచనకు సన్నివేశుడు, పరాక్రమశాలియైన విశ్వరూపుడు అను ఇద్దరు కుమారులు కలిగిరి.
6.45 (నలుబది ఐదవ శ్లోకము)
తం వవ్రిరే సురగణాః స్వస్రీయం ద్విషతామపి|
విమతేన పరిత్యక్తా గురుణాఽఽంగిరసేన యత్॥5019॥
ఒకానొకప్పుడు దేవగురువైన బృహస్పతి ఇంద్రునిచే అవమానింపబడి దేవతలను పరిత్యజించెను. అప్ఫుడు దేవతలు దైత్యులకు మేనల్లుడాయెనని విశ్వరూపుని తమకు పురోహితునిగా చేసికొనిరి.
ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం షష్ఠస్కంధే షష్డోఽధ్యాయః (6)
ఇది శ్రీమద్భాగవత మహాపురాణమునందలి షష్ఠ స్కంధమునందు ఆరవ అధ్యాయము (6)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
No comments:
Post a Comment