షష్ఠ స్కంధము - మూడవ అధ్యాయము
యమునికిని, యమదూతలకును మధ్య జరిగిన సంవాదము
ఓం నమో భగవతే వాసుదేవాయ
రాజోవాచ
పరీక్షిన్మహారాజు పలికెను- మహాత్మా! సకలజీవులు యమధర్మరాజు వశములో నుందురు. శ్రీహరిపార్షదులు అతని ఆజ్ఞను కాదని యమ భటులను అవమానించిరి. వారు యమపురికి పోయి యమునకు నివేదించిరి. దానిని విన్న పిమ్మట అతడు దూతలతో ఏమని పలికెను?
ఋషీశ్వరా! యమధర్మరాజు యొక్క శాసనమును ఎవ్వరును, ఏకారణము చేతనైనను ఉల్లంఘించినట్లు నేను ఇంతవఱకును వినియుండలేదు. ఈ విషయమున జనులకు సందేహము కలుగవచ్చును. ఆ సంశయమును నీవు తప్ప మరి యెవ్వరును తీర్చజాలరు. ఇది మా నిశ్చితాభిప్రాయము.
శ్రీ శుక ఉవాచ
శ్రీశుకుడు వచించెను- మహారాజా! శ్రీహరి పార్షదులు యమదూతల ప్రయత్నమును విఫలమొనర్చిరి. పిమ్మట యమభటులు సంయమనీ పురమునకు చేరి తమ ప్రభువైన యమధర్మరాజునకు ఇట్లు నివేదించిరి.
యమదూతా ఊచుః
యమదూతలిట్లనిరి - ప్రభూ! లోకమున జీవులు పాపకర్మలను, పుణ్యకార్యములను, పాపపుణ్యమిశ్రిత కృత్యములు అని మూడువిధముల కర్మలను చేయుచుందురు. ఈ జీవులయొక్క కర్మలకు దగిన ఫలములను ఇచ్చెడి శాసకులు ఎందరు గలరు?
లోకమున శిక్షలను విధించు శాసకులు పెక్కుమంది యున్నచో ఎవరికి సుఖము లభించును? ఎవరికి దుఃఖము ప్రాప్తించును? ఈ వ్యవస్థ ఒక్కరీతిగా ఉండదుగదా?
ఈ లోకమునందు కర్మలను ఆచరించువారు పలువురు ఉండుటవలన శాసకులుగూడ పెక్కుమంది యున్నచో, ఒక చక్రవర్తి ఆధీనములో పెక్కుమంది సామంత రాజులు ఉన్నట్లు వారి శాసనాధికారము గూడ నామమాత్రమే యగునుకదా!
నీవు ఒక్కడవే సకల ప్రాణులకును, వారి ప్రభువులకును అధీశ్వరుడవని మేము భావించుచుంటిమి. మానవులపాపపుణ్యములను నిర్ణయించువాడవు, దండించువాడవు, శాసించువాడవు నీ వొక్కడవే యని మా అభిప్రాయము.
ప్రభూ! ఇంతవరకును నీవు విధించిన శిక్షలను ఎవ్వరును ఉల్లంఘింపలేదు. కానీ, ఇప్పుడు అద్భుతాకారములుగల నలుగురు సిద్ధులు నీ యాజ్ఞను త్రోసిపుచ్చిరి.
స్వామీ! నీ యాజ్ఞ ప్రకారము మేము ఒక పాపాత్ముని యాతనాగృహమునకు తీసుకొని వెళ్ళుచుంటిమి. కాని ఈ సిద్ధులు బలవంతముగా మా పాశములను ఛేదించి, అతనిని బంధవిముక్తుని గావించిరి.
స్వామీ! అజామిళుని నోట నారాయణ అను మాట రాగానే ఆ సిద్ధులు భయపడకుము, భయపడకుము అని పలుకుచు వెంటనే అచటికి వచ్చిరి. ఇది చాల ఆశ్చర్యకరమైన విషయము. ఈ రహస్యమును మేము తెలిసికొన గోరుచున్నాము. మేము వినుటకు అర్హులమైనచో దయచేసి, తెలుపుము.
శ్రీ శుక ఉవాచ
శ్రీ శుకమహర్షి ఇట్లు వచించెను-
దూతలు ఈ విధముగాప్రశ్నించినంతనే ఆ దేవతాశ్రేష్ఠుడు, ప్రజాశాసకుడు ఐన యమధర్మరాజు ప్రసన్నుడయ్యెను. పిమ్మట శ్రీహరి పాదములను స్మరించుచు వారితో ఇట్ణనెను'
యమ ఉవాచ
యముడు ఇట్లు పలికెను- దూతలారా! ఈ చరాచర జగత్తునకు నేను గాక మరియొక ప్రభువు గలడు. ఆయనయందే ఈ జగత్తు దారములలో వస్త్రమువలె ఓతప్రోతమైయున్నది. ఆ ప్రభువు యొక్క అంశలైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, ఈ జగత్తు యొక్క ఉత్పత్తి, స్థితి, లయములను గావింతురు. ఆ స్వామి ఈ జగత్తును ముక్కుత్రాడును వేసిన యెద్దువలె తన అధీనములో ఉంచుకొని అందరిని శాసించును.
ప్రియమైన దూతలారా! రైతు ముందుగా ఎద్దులను చిన్న చిన్న త్రాళ్ళతో బంధించును. పిమ్మట ఆ త్రాళ్ళను ఒక పెద్దత్రాడుతో ముడి వేయును. అట్లే జగదీశ్వరుడైన పరమాత్మకూడా బ్రాహ్మణాది వర్ణములు, బ్రహ్మచర్యము మొదలగు ఆశ్రమములు, వాటి నియమములు అనెడి త్రాళ్ళచే లోకమును బంధించును. పిదప అన్నింటిని వేదవాణి అనెడి పెద్ద త్రాళ్ళచే బంధించును. ఈ విధముగా జీవులందరును నామ, కర్మ, రూప బంధనములలో కట్టబడి, భయపడుచు తమసర్వస్వమును అతనికే సమర్పించెదరు.
దూతలారా! నేను (యముడు), ఇంద్రుడు, నిరృతి, వరుణుడు, చంద్రుడు, అగ్ని, శంకరుడు, వాయువు, సూర్యుడు, బ్రహ్మ, ద్వాదశాదిత్యులు, విశ్వేదేవతలు, అష్టవసువులు, సాధ్యులు, నలుబది తొమ్మిదిమంది మరుత్తులు, సిద్ధులు, ఏకాదశ రుద్రులు, రజస్తమోగుణరహితులైన భృగువు మొదలగు ప్రజాపతులు, ముఖ్యులైన దేవతలు అందరును సత్త్వగుణప్రధానులైనను ఆ పరమాత్మమాయకు అధీనులై యున్నారు. ఆ భగవంతుడు ఎప్పుడు, ఏరూపములో, ఏమి చేయదలచునో, ఎవ్వరును ఎరుంగరు. ఇంక ఇతరుల విషయము చెప్పనేల?
దూతలారా! ఘట పటాది రూపములుగల పదార్థములు తమను ప్రకాశింపజేయు నేత్రములను చూడలేవు. అట్లే అంతఃకరణమునందు సాక్షి రూపముగానున్న పరమాత్మను ఏ ప్రాణియు, ఇంద్రియములు, మనస్సు, ప్రాణములు, హృదయము, వాక్కు, మొదలగు ఏ సాధనముల ద్వారాను తెలిసికొనజాలరు.
ఆ ప్రభువు అందరికిని స్వామి, తాను పరమస్వతంత్రుడు. మాయాపతియైన ఆ పురుషోత్తముని దూతలును ఆయనవలె మనోహర రూపములను, గుణస్వభావములను కలిగియుండి, ఈ లోకమునందు సంచరించుచుందురు.
శ్రీమహావిష్ణువు యొక్క పార్షదులు దేవతలకు గూడ పూజ్యులు, వారి దివ్యరూపముల దర్శనము మిగుల దుర్లభము. వారు శత్రువులవలనను, నా వలనను, అగ్ని మొదలగువాటి వలనను కలుగు ఆపదలనుండి భగవద్భక్తులను రక్షించుదురు.
భగవంతుడే స్వయముగా ధర్మ మర్యాదలను నెలకొల్పెను. వాటిని ఋషులుగాని, దేవతలుగాని, సిద్ధులుగాని ఎరుగరు. అట్టిస్థితిలో మానవులు, విద్యాధరులు, చారణులు, అసురులు మొదలగువారు ఎట్లు తెలిసికొనగలరు?
భగవన్నిర్మితమైన భాగవత ధర్మములు, పరమపవిత్రములు, మిక్కిలి గోప్యములు. వాటిని తెలిసికొనుట చాలా కష్టము. తెలిసికొనిన వారికి భగవత్స్వరూపము ప్రాప్తించును. ఆ భాగవత ధర్మ రహస్యమును బ్రహ్మదేవుడు, దేవర్షియైన నారదుడు, శంకరభగవానుడు, సనత్కుమారుడు, కపిలదేవుడు, స్వాయంభువమనువు, ప్రహ్లాదుడు, జనకుడు, భీష్మపితామహుడు, బలిచక్రవర్తి, శ్రీశుకుడును, నేను (యమధర్మరాజు) అను పండ్రెండు మంది మాత్రమే ఎరుగుదుము.
ఈ లోకమున భగవన్నామ సంకీర్తనాదులే జీవులకు పరమధర్మమనియు, భక్తిభావముతో భగవంతుని పాదారవిందములను పొందుటకు అదియే తగిన ఉపాయము అనియు మహర్షులు పేర్కొనిరి.
ప్రియదూతలారా! భగవంతుని నామోచ్చారణ మహిమ ఎంత గొప్పదో, పరికించి చూడుడు. అజామిళునివంటి పాపాత్ముడు కూడా నామోచ్చారణ చేయుటచే మృత్యుపాశము నుండి విముక్తుడయ్యెను.
భగవంతుని లీలలను, గుణములను, కర్మలను, నామములను చక్కగా కీర్తించుట వలన మానవుల పాపములన్నియును నిర్మూల మగునని పలుకుట అతిశయోక్తిగాదు. మిక్కిలి పాపాత్ముడైన అజామిళుడు మరణసమయమున వివశుడై నారాయణా యని తన పుత్రుని నామమును ఉచ్చరించెను. కేవలము ఈ నామోచ్చారణము చేతనే అతని పాపములన్నియును నశించుటయే గాక, అతడు పరమపదమును గూడ పొందెను.
గొప్ప గొప్ప విద్వాంసుల బుద్ధియు అప్పుడప్పుడు భగవంతుని మాయచే మోహితమగుచుండును. ఆకర్షణీయ ఫలములను వర్ణించు కర్మలను పేర్కొను నట్టి వేదవాక్యముల యందే వారు మోహితులగుచుందురు. యజ్ఞయాగాది గొప్ప కర్మలయందే మునిగి యుందురు. అతి సులభమైన భగవన్నామోచ్చారణమహిమను వారెరుగరు ఇది ఎంతయో శోచింపదగిన విషయము సుమా!
ప్రియదూతలారా! వివేకము గలవారు చక్కగా ఆలోచించి అనంతమహిమాన్వితుడైన తమ అంతఃకరణమందు భక్తి భావముతో నిలుపుకొందురు. అందువలన, వీరు దండనార్హులు గారు. వీరు పాపములనే చేయరు. కాని, ఒకవేళ ఎప్పుడైనను యాదృచ్చికముగా (తలవని తలంపుగా) ఏదైనను వారిచే పాపకార్యము జరిగినను, భగవంతుని గుణగానముచే అది వెంటనే నశించును.
సమదృష్టిని గలిగి, భగవంతుని శరణుజొచ్చినట్టి సాధుపురుషుల పవిత్రగాథలను దేవతలు, సిద్ధులు కూడా గానము చేయుచుందురు. పరమాత్ముని గదయే వారిని సర్వదా రక్షించుచుండును. కనుక, మీరు ఎన్నడును, పొరపాటుననైనను వారికడకు చేరవలదు. వారిని దండించు సామర్థ్యము మనకు గాని, సాక్షాత్తు మృత్యుదేవతకు గాని లేదు.
పరమహంసలు, దేవదేవుడైన ముకుందుని పాదారవింద మకరందమును గ్రోలు కోరికతో జగత్తునందును, శరీరాదుల యందును అహంకారమమకారములను వీడి, అకించనులై నిరంతరము ఆ పరమపురుషునే ధ్యానించుచుందురు. అట్టి మహాత్ములవద్దకు వెళ్ళవద్దు. కాని, దుష్టులు ఆ దివ్యామృతమునకు విముఖులై నరకమునకు ద్వారమైన, గృహసంబంధమైన కార్యములయందే తృష్ణగలవారై ఆ భారములను వహించుచుందురు. అట్టి వారినే నా యొద్దకు తీసుకొనిరండు.
భగవత్సేవలకు విముఖులగు వారి నాలుకలు భగవంతుని గుణనామములను ఎన్నడును ఉచ్చరింపవు. వారి చిత్తములు ఆ ముకుందుని చరణారవిందములను ధ్యానింపవు. వారి శిరములు శ్రీహరియొక్క పాదములకు మోకరిల్లవు. అట్టి పాపాత్ములనే నా యొద్దకు తీసికొనిరండు.
నేడు నా దూతలు శ్రీహరి పార్షదులయెడ అపరాధమొనర్చి, స్వయముగా భగవంతుని యెడనే అపరాధమొనర్చిరి. అది నా దోషమేయగును. పురాణపురుషుడైన శ్రీమన్నారాయణుడు మా అపరాధములను క్షమించుగాక! మేము అజ్ఞానులమైనను ఆ ప్రభువు యొక్క ఆజ్ఞను, భగవద్భక్తుల ఆజ్ఞలను శిరసావహించుటకు ఉత్సాహముతో అంజలి ఘటించియుందుము. కనుక, మహామహిమాన్వితుడైన ఆ భగవంతుడు మమ్ములను క్షమించుగాక! సర్వాంతర్యామియు, జగత్తునకు ఏకైక ప్రభువైన ఆ భగవంతునకు నమస్కరించుచున్నాము అని ఇట్లు యమధర్మరాజు పలికెను.
శ్రీశుకయోగిపలికెను) పరీక్షిన్మహారాజా! కేవలము భగవంతుని గుణములను. లీలలను, నామములను కీర్తించుటవలన గొప్పగొప్ప పాపములు, వాటివాసనలు నిర్మూలమగుననియు, అదియే పాపములకు ప్రాయశ్చిత్తమనియు తెలిసికొనుము. శ్రీహరి నామసంకీర్తనయే లోక కల్యాణకారకము.
భగవంతుని చరితములు ఉదారములైనవి, కృపాపూర్ణములైనవి. వాటిని విని, కీర్తన చేయువారి హృదయముల యందు అనన్య భక్తి పెంపొందును. అట్టి భక్తివలన కలుగు అంతఃకరణశుద్ధి కృచ్ఛ్రచాంద్రాయణాది వ్రతముల వలన గూడ కలుగదు.
విషయసుఖములు సహజముగనే భగవన్మాయచే రమ్యముగా కనబడును. పరిణామమున అవి దుఃఖహేతువులే యగును. అట్టి విషయములకు విముఖుడై శ్రీకృష్ణ పరమాత్ముని పాదారవింద మకరందమును గ్రోలు నట్టి మనుజుడు మరల వాటి జోలికేపోడు. కాని, భగవన్నామ రసామృత పానమునకు విముఖుడైన వాని వివేకబుద్ధి కోరికలకు వశమైపోవును. అట్టి వారుతమ పాపములను కడిగివేసికొనుటకై మరల ప్రాయశ్చిత్తరూప కర్మలను ఆచరించుచుందురు. కాని వీరి కర్మవాసనలు తొలగిపోవు. కనుక వారు కర్మ పరంపరలోనే మునిగిపోయి దోషములనే చేయుచుందురు.
మహారాజా! యమదూతలు తమ ప్రభువైన యమధర్మరాజు ఈ విధముగా వర్ణించిన భగవన్మహిమను విని, దానినే స్మరించుచు ఆశ్చర్యమగ్నులైరి. అప్ఫటి నుండి యమధర్మరాజు యొక్క పలుకులపై విశ్వాసము ఉంచి, భగవంతుని ఆశ్రయించిన భక్తుల జోలికి వెళ్ళుట ప్రమాదకరముగా భావించిరి. అంతేగాదు, వారివైపు కన్నెత్తి చూచుటకైనను వారు భయపడుచుండిరి.
రాజా! అజామిళోపాఖ్యానము, యమునకును ఆయన దూతలకును మధ్య జరిగిన సంవాదము అత్యంత గోప్యమైనది. మలయపర్వతముపై విరాజమానుడై యున్న అగస్త్య మహర్షి శ్రీహరిని ఆరాధించు సమయమున నాకు ఈ కథను వినిపించియుండెను.
ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం షష్ఠస్కంధే తృతీయోఽధ్యాయః (3)
ఇది శ్రీమద్భాగవత మహాపురాణమునందలి షష్ఠ స్కంధమునందు మూడవ అధ్యాయము (3)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
22.5.2020 సాయంకాల సందేశము
వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం
షష్ఠ స్కంధము - మూడవ అధ్యాయము
యమునికిని, యమదూతలకును మధ్య జరిగిన సంవాదము
ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
రాజోవాచ
3.1 (ప్రథమ శ్లోకము)
నిశమ్య దేవః స్వభటోపవర్ణితం ప్రత్యాహ కిం తాన్ ప్రతి ధర్మరాజః|
ఏవం హతాజ్ఞో విహతాన్ మురారేః నైదేశికైర్యస్య వశే జనోఽయమ్॥4842॥
పరీక్షిన్మహారాజు పలికెను- మహాత్మా! సకలజీవులు యమధర్మరాజు వశములో నుందురు. శ్రీహరిపార్షదులు అతని ఆజ్ఞను కాదని యమ భటులను అవమానించిరి. వారు యమపురికి పోయి యమునకు నివేదించిరి. దానిని విన్న పిమ్మట అతడు దూతలతో ఏమని పలికెను?
3.2 (రెండవ శ్లోకము)
యమస్య దేవస్య న దండభంగః కుతశ్చనర్షే శ్రుతపూర్వ ఆసీత్|
ఏతన్మునే వృశ్చతి లోకసంశయః న హి త్వదస్య ఇతి మే వినిశ్చితమ్॥4843॥
ఋషీశ్వరా! యమధర్మరాజు యొక్క శాసనమును ఎవ్వరును, ఏకారణము చేతనైనను ఉల్లంఘించినట్లు నేను ఇంతవఱకును వినియుండలేదు. ఈ విషయమున జనులకు సందేహము కలుగవచ్చును. ఆ సంశయమును నీవు తప్ప మరి యెవ్వరును తీర్చజాలరు. ఇది మా నిశ్చితాభిప్రాయము.
శ్రీ శుక ఉవాచ
3.3 (మూడవ శ్లోకము)
భగవత్పరుషై రాజన్ యామ్యాః ప్రతిహతోద్యమాః|
పతిం విజ్ఞాపయామాసుర్యమం సంయమనీపతిమ్॥4844॥
శ్రీశుకుడు వచించెను- మహారాజా! శ్రీహరి పార్షదులు యమదూతల ప్రయత్నమును విఫలమొనర్చిరి. పిమ్మట యమభటులు సంయమనీ పురమునకు చేరి తమ ప్రభువైన యమధర్మరాజునకు ఇట్లు నివేదించిరి.
యమదూతా ఊచుః
3.4 (నాలుగవ శ్లోకము)
కతి సంతీహ శాస్తారో జీవలోకస్య వై ప్రభో|
త్రైవిధ్యం కుర్వతః కర్మ ఫలాభివ్యక్తి హేతవః॥4845॥
యమదూతలిట్లనిరి - ప్రభూ! లోకమున జీవులు పాపకర్మలను, పుణ్యకార్యములను, పాపపుణ్యమిశ్రిత కృత్యములు అని మూడువిధముల కర్మలను చేయుచుందురు. ఈ జీవులయొక్క కర్మలకు దగిన ఫలములను ఇచ్చెడి శాసకులు ఎందరు గలరు?
3.5 (ఐదవ శ్లోకము)
యది స్యుర్బహవో లోకే శాస్తారో దండధారిణః|
కస్య స్యాతాం న వా కస్య మృత్యుశ్చామృతమేవ వా॥4846॥
లోకమున శిక్షలను విధించు శాసకులు పెక్కుమంది యున్నచో ఎవరికి సుఖము లభించును? ఎవరికి దుఃఖము ప్రాప్తించును? ఈ వ్యవస్థ ఒక్కరీతిగా ఉండదుగదా?
3.6 (ఆరవ శ్లోకము)
కింతు శాస్తృ బహుత్వే స్యాద్బహూనామిహ కర్మిణామ్|
శాస్తృత్వముపచారో హి యథా మండలవర్తినామ్॥4847॥
ఈ లోకమునందు కర్మలను ఆచరించువారు పలువురు ఉండుటవలన శాసకులుగూడ పెక్కుమంది యున్నచో, ఒక చక్రవర్తి ఆధీనములో పెక్కుమంది సామంత రాజులు ఉన్నట్లు వారి శాసనాధికారము గూడ నామమాత్రమే యగునుకదా!
3.7 (ఏడవ శ్లోకము)
అతస్త్వమేకో భూతానాం సేశ్వరాణామధీశ్వరః|
శాస్తా దండధరో నౄణాం శుభాశుభవివేచనః॥4848॥
నీవు ఒక్కడవే సకల ప్రాణులకును, వారి ప్రభువులకును అధీశ్వరుడవని మేము భావించుచుంటిమి. మానవులపాపపుణ్యములను నిర్ణయించువాడవు, దండించువాడవు, శాసించువాడవు నీ వొక్కడవే యని మా అభిప్రాయము.
3.8 (ఎనిమిదవ శ్లోకము)
తస్య తే విహతో దండో న లోకే వర్తతేఽధునా|
చతుర్భిరద్భుతైః సిద్ధైరాజ్ఞా తే విప్రలమ్బితా॥4849॥
ప్రభూ! ఇంతవరకును నీవు విధించిన శిక్షలను ఎవ్వరును ఉల్లంఘింపలేదు. కానీ, ఇప్పుడు అద్భుతాకారములుగల నలుగురు సిద్ధులు నీ యాజ్ఞను త్రోసిపుచ్చిరి.
3.9 (తొమ్మిదవ శ్లోకము)
నీయమానం తవాదేశాదస్మాభిర్యాతనాగృహాన్|
వ్యమోచయన్ పాతకినం ఛిత్వా పాశాన్ ప్రసహ్య తే॥4850॥
స్వామీ! నీ యాజ్ఞ ప్రకారము మేము ఒక పాపాత్ముని యాతనాగృహమునకు తీసుకొని వెళ్ళుచుంటిమి. కాని ఈ సిద్ధులు బలవంతముగా మా పాశములను ఛేదించి, అతనిని బంధవిముక్తుని గావించిరి.
3.10 (పదియవ శ్లోకము)
తాం స్తే వేదితుమిచ్ఛామో యది నో మన్య సే క్షమమ్|
నారాయణేత్యభిహితే మా భైరిత్యాయయుర్ద్రుతమ్॥4851॥
స్వామీ! అజామిళుని నోట నారాయణ అను మాట రాగానే ఆ సిద్ధులు భయపడకుము, భయపడకుము అని పలుకుచు వెంటనే అచటికి వచ్చిరి. ఇది చాల ఆశ్చర్యకరమైన విషయము. ఈ రహస్యమును మేము తెలిసికొన గోరుచున్నాము. మేము వినుటకు అర్హులమైనచో దయచేసి, తెలుపుము.
శ్రీ శుక ఉవాచ
3.11 (పదకొండవ శ్లోకము)
ఇతి దేవః స ఆపృష్టః ప్రజాసంయమనో యమః|
ప్రీతః స్వదూతాన్ ప్రత్యాహ స్మరన్ పాదాంబుజం హరేః॥4852॥
శ్రీ శుకమహర్షి ఇట్లు వచించెను-
దూతలు ఈ విధముగాప్రశ్నించినంతనే ఆ దేవతాశ్రేష్ఠుడు, ప్రజాశాసకుడు ఐన యమధర్మరాజు ప్రసన్నుడయ్యెను. పిమ్మట శ్రీహరి పాదములను స్మరించుచు వారితో ఇట్ణనెను'
యమ ఉవాచ
3.12 (పండ్రెండవ శ్లోకము)
పరో మదన్యో జగతస్తస్థుషశ్చ ఓతం ప్రోతం పటవద్యత్ర విశ్వమ్|
యదంశతోఽస్య స్థితిజన్మనాశా నస్యోతవద్యస్య వశే చ లోకః॥4853॥
యముడు ఇట్లు పలికెను- దూతలారా! ఈ చరాచర జగత్తునకు నేను గాక మరియొక ప్రభువు గలడు. ఆయనయందే ఈ జగత్తు దారములలో వస్త్రమువలె ఓతప్రోతమైయున్నది. ఆ ప్రభువు యొక్క అంశలైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, ఈ జగత్తు యొక్క ఉత్పత్తి, స్థితి, లయములను గావింతురు. ఆ స్వామి ఈ జగత్తును ముక్కుత్రాడును వేసిన యెద్దువలె తన అధీనములో ఉంచుకొని అందరిని శాసించును.
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి షష్ఠస్కంధములోని మూడవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
--(())--
ప్రాతః కాల సందేశము
వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం
షష్ఠ స్కంధము - మూడవ అధ్యాయము
యమునికిని, యమదూతలకును మధ్య జరిగిన సంవాదము
ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
3.13 (పదమూడవ శ్లోకము)
యో నామభిర్వాచి జనాన్నిజాయాం బధ్నాతి తంత్యామివ దామభిర్గాః॥4854॥
ప్రియమైన దూతలారా! రైతు ముందుగా ఎద్దులను చిన్న చిన్న త్రాళ్ళతో బంధించును. పిమ్మట ఆ త్రాళ్ళను ఒక పెద్దత్రాడుతో ముడి వేయును. అట్లే జగదీశ్వరుడైన పరమాత్మకూడా బ్రాహ్మణాది వర్ణములు, బ్రహ్మచర్యము మొదలగు ఆశ్రమములు, వాటి నియమములు అనెడి త్రాళ్ళచే లోకమును బంధించును. పిదప అన్నింటిని వేదవాణి అనెడి పెద్ద త్రాళ్ళచే బంధించును. ఈ విధముగా జీవులందరును నామ, కర్మ, రూప బంధనములలో కట్టబడి, భయపడుచు తమసర్వస్వమును అతనికే సమర్పించెదరు.
3.14 (పదు నాలుగవ శ్లోకము)
అహం మహేంద్రో నిరృతిః ప్రచేతాః సోమోఽగ్రిరీశః పవనోఽర్కో విరించః|
ఆదిత్యవిశ్వేవసవోఽథసాధ్యా మరుద్గణా రుద్రగణాః ససిద్ధాః॥4855॥
3.15 (పదునైదవ శ్లోకము)
అన్యే చ యే విశ్వసృజోఽమరేశాః భృగ్వాదయోఽస్పృష్టరజస్తమస్కాః|
య స్యేహితం న విదుః స్పృష్టమాయాః సత్త్వప్రధానా అపి కిం తతోఽన్యే॥4856॥
దూతలారా! నేను (యముడు), ఇంద్రుడు, నిరృతి, వరుణుడు, చంద్రుడు, అగ్ని, శంకరుడు, వాయువు, సూర్యుడు, బ్రహ్మ, ద్వాదశాదిత్యులు, విశ్వేదేవతలు, అష్టవసువులు, సాధ్యులు, నలుబది తొమ్మిదిమంది మరుత్తులు, సిద్ధులు, ఏకాదశ రుద్రులు, రజస్తమోగుణరహితులైన భృగువు మొదలగు ప్రజాపతులు, ముఖ్యులైన దేవతలు అందరును సత్త్వగుణప్రధానులైనను ఆ పరమాత్మమాయకు అధీనులై యున్నారు. ఆ భగవంతుడు ఎప్పుడు, ఏరూపములో, ఏమి చేయదలచునో, ఎవ్వరును ఎరుంగరు. ఇంక ఇతరుల విషయము చెప్పనేల?
3.16 (పదునారవ శ్లోకము)
యం వైాన గోభిర్మనసాఽసుభిర్వా హృదా గిరా వాఽసుభృతో విచక్షతే|
ఆత్మానమంతర్హృది సంతమాత్మానాం చక్షుర్యథైవాకృతయస్తతః పరమ్॥4857॥|
దూతలారా! ఘట పటాది రూపములుగల పదార్థములు తమను ప్రకాశింపజేయు నేత్రములను చూడలేవు. అట్లే అంతఃకరణమునందు సాక్షి రూపముగానున్న పరమాత్మను ఏ ప్రాణియు, ఇంద్రియములు, మనస్సు, ప్రాణములు, హృదయము, వాక్కు, మొదలగు ఏ సాధనముల ద్వారాను తెలిసికొనజాలరు.
3.17 (పదునేడవ శ్లోకము)
తస్యాత్మతంత్ర్యస్య హరేరధీశితుః పరస్య మాయాధిపతేర్మహాత్మనః|
ప్రాయేణ దూతా ఇహ వై మనోహరాః చరంతి తద్రూపగుణస్వభావాః॥4858॥
ఆ ప్రభువు అందరికిని స్వామి, తాను పరమస్వతంత్రుడు. మాయాపతియైన ఆ పురుషోత్తముని దూతలును ఆయనవలె మనోహర రూపములను, గుణస్వభావములను కలిగియుండి, ఈ లోకమునందు సంచరించుచుందురు.
3.18 (పదునెనిమిదవ శ్లోకము)
భూతాని విష్ణోః సురపూజితాని దుర్దర్శలింగాని మహాద్భుతాని|
రక్షంతి తద్భక్తి మతః పరేభ్యో మత్తశ్చ మర్త్యాసథ సర్వతశ్చ॥4859॥
శ్రీమహావిష్ణువు యొక్క పార్షదులు దేవతలకు గూడ పూజ్యులు, వారి దివ్యరూపముల దర్శనము మిగుల దుర్లభము. వారు శత్రువులవలనను, నా వలనను, అగ్ని మొదలగువాటి వలనను కలుగు ఆపదలనుండి భగవద్భక్తులను రక్షించుదురు.
3.19 (పందొమ్మిదవ శ్లోకము)
ధర్మం తు సాక్షాద్భగత్ప్రణీతం న వై విదురృషయో నాపి దేవాః|
న సిద్ధముఖ్యా అసురా మనుష్యాః కుతో ను విద్యాధరచారణాదయః॥4860॥
భగవంతుడే స్వయముగా ధర్మ మర్యాదలను నెలకొల్పెను. వాటిని ఋషులుగాని, దేవతలుగాని, సిద్ధులుగాని ఎరుగరు. అట్టిస్థితిలో మానవులు, విద్యాధరులు, చారణులు, అసురులు మొదలగువారు ఎట్లు తెలిసికొనగలరు?
3.20 (ఇరువదియవ శ్లోకము)
స్వయంభూర్నారదః శంభుః కుమారః కపిలో మనుః|
ప్రహ్లాదో జనతో భీష్మో బలిర్వైయాసకిర్వయమ్॥4861॥
3.21 (ఇరువది ఒకటవ శ్లోకము)
ద్వాదశైతే విజానీమో ధర్మం భాగవతం భటాః|
గుహ్యం విశుద్ధం దుర్బోధం యం జ్ఞిత్వాఽమృత మశ్నుతే॥4862॥
భగవన్నిర్మితమైన భాగవత ధర్మములు, పరమపవిత్రములు, మిక్కిలి గోప్యములు. వాటిని తెలిసికొనుట చాలా కష్టము. తెలిసికొనిన వారికి భగవత్స్వరూపము ప్రాప్తించును. ఆ భాగవత ధర్మ రహస్యమును బ్రహ్మదేవుడు, దేవర్షియైన నారదుడు, శంకరభగవానుడు, సనత్కుమారుడు, కపిలదేవుడు, స్వాయంభువమనువు, ప్రహ్లాదుడు, జనకుడు, భీష్మపితామహుడు, బలిచక్రవర్తి, శ్రీశుకుడును, నేను (యమధర్మరాజు) అను పండ్రెండు మంది మాత్రమే ఎరుగుదుము.
3.22 (ఇరువది రెండవ శ్లోకము)
ఏతావానేవ లోకేఽస్మిన్ పుంసాం ధర్మః పరః స్మృతః|
భక్తియోగో భగవతి తన్నామగ్రహణాదిభిః॥4863॥

[21:59, 23/05/2020] +91 95058 13235: 23.5.2020 సాయం కాల సందేశము

3.23 (ఇరువది మూడవ శ్లోకము)
నామోచ్చారణమాహాత్మ్యం హరేః పశ్యత పుత్రకాః|
అజామిళోఽపి యేనైవ మృత్యుపాశాదముచ్యత॥4864॥
ప్రియదూతలారా! భగవంతుని నామోచ్చారణ మహిమ ఎంత గొప్పదో, పరికించి చూడుడు. అజామిళునివంటి పాపాత్ముడు కూడా నామోచ్చారణ చేయుటచే మృత్యుపాశము నుండి విముక్తుడయ్యెను.
3.24 (ఇరువది నాలుగవ శ్లోకము)
ఏతావతాలమఘనిర్హరణాయ పుంసాం సంకీర్తనం భగవతో గుణకర్మనామ్నామ్|
విక్రుశ్య పుత్రమఘవాన్ యదజామళోఽపి నారాయణేతి మ్రియమాణ ఇయాయ ముక్తిమ్॥4865॥
భగవంతుని లీలలను, గుణములను, కర్మలను, నామములను చక్కగా కీర్తించుట వలన మానవుల పాపములన్నియును నిర్మూల మగునని పలుకుట అతిశయోక్తిగాదు. మిక్కిలి పాపాత్ముడైన అజామిళుడు మరణసమయమున వివశుడై నారాయణా యని తన పుత్రుని నామమును ఉచ్చరించెను. కేవలము ఈ నామోచ్చారణము చేతనే అతని పాపములన్నియును నశించుటయే గాక, అతడు పరమపదమును గూడ పొందెను.
3.25 (ఇరువది ఐదవ శ్లోకము)
ప్రాయేణ వేద తదిదం న మహాజనోఽయం దేవ్యా విమోహితమతిర్బత మాయయాలమ్|
త్రయ్యాం జడీకృతమతిర్మధుపుష్పితాయాం వైతానికే మహతి కర్మణి యుజ్యమానః॥4866॥
గొప్ప గొప్ప విద్వాంసుల బుద్ధియు అప్పుడప్పుడు భగవంతుని మాయచే మోహితమగుచుండును. ఆకర్షణీయ ఫలములను వర్ణించు కర్మలను పేర్కొను నట్టి వేదవాక్యముల యందే వారు మోహితులగుచుందురు. యజ్ఞయాగాది గొప్ప కర్మలయందే మునిగి యుందురు. అతి సులభమైన భగవన్నామోచ్చారణమహిమను వారెరుగరు ఇది ఎంతయో శోచింపదగిన విషయము సుమా!
3.26 (ఇరువది ఆరవ శ్లోకము)
ఏవం విమృశ్య సుధియో భగవత్యనంతే సర్వాత్మనా విదధతే ఖలు భావయోగమ్|
తే మే న దండమర్హంత్యథ యద్యమీషాం స్యాత్పాతకం తదపి హంత్యురుగాయవాదః॥4867॥
ప్రియదూతలారా! వివేకము గలవారు చక్కగా ఆలోచించి అనంతమహిమాన్వితుడైన తమ అంతఃకరణమందు భక్తి భావముతో నిలుపుకొందురు. అందువలన, వీరు దండనార్హులు గారు. వీరు పాపములనే చేయరు. కాని, ఒకవేళ ఎప్పుడైనను యాదృచ్చికముగా (తలవని తలంపుగా) ఏదైనను వారిచే పాపకార్యము జరిగినను, భగవంతుని గుణగానముచే అది వెంటనే నశించును.
3.27 (ఇరువది ఏడవ శ్లోకము)
తే దేవసిద్ధపరిగీతపవిత్రగాథాః యే సాధనః సమదృశో భగవత్ప్రపన్నాః|
తాన్ నోపసీదత హరేర్గదయాభిగుప్తాన్ నైషాం వయం న చ వయః ప్రభవామ దండే॥4868॥
సమదృష్టిని గలిగి, భగవంతుని శరణుజొచ్చినట్టి సాధుపురుషుల పవిత్రగాథలను దేవతలు, సిద్ధులు కూడా గానము చేయుచుందురు. పరమాత్ముని గదయే వారిని సర్వదా రక్షించుచుండును. కనుక, మీరు ఎన్నడును, పొరపాటుననైనను వారికడకు చేరవలదు. వారిని దండించు సామర్థ్యము మనకు గాని, సాక్షాత్తు మృత్యుదేవతకు గాని లేదు.
3.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)
తానానయధ్వమసతో విముఖాన్ ముకుందపాదారవిందమకరందసాదజస్రమ్|
నిష్కించనైః పరమహంసకులై రసజ్ఞైః జుష్టాద్గృ హే నిరయవర్త్మని బద్ధతృష్ణాన్॥4869॥
పరమహంసలు, దేవదేవుడైన ముకుందుని పాదారవింద మకరందమును గ్రోలు కోరికతో జగత్తునందును, శరీరాదుల యందును అహంకారమమకారములను వీడి, అకించనులై నిరంతరము ఆ పరమపురుషునే ధ్యానించుచుందురు. అట్టి మహాత్ములవద్దకు వెళ్ళవద్దు. కాని, దుష్టులు ఆ దివ్యామృతమునకు విముఖులై నరకమునకు ద్వారమైన, గృహసంబంధమైన కార్యములయందే తృష్ణగలవారై ఆ భారములను వహించుచుందురు. అట్టి వారినే నా యొద్దకు తీసుకొనిరండు.
3.29 (ఇరువది తొమ్ళిదవ శ్లోకము)
జిహ్వా న వక్తి భగవద్గుణనామధేయం చేతశ్చ న స్మరతి తచ్చరణారవిందమ్|
కృష్ణాయ నో నమతి యచ్చిర ఏకదాపి తానానయ- ధ్వమసతోఽకృతవిష్ణుకృత్యాన్॥4870॥
భగవత్సేవలకు విముఖులగు వారి నాలుకలు భగవంతుని గుణనామములను ఎన్నడును ఉచ్చరింపవు. వారి చిత్తములు ఆ ముకుందుని చరణారవిందములను ధ్యానింపవు. వారి శిరములు శ్రీహరియొక్క పాదములకు మోకరిల్లవు. అట్టి పాపాత్ములనే నా యొద్దకు తీసికొనిరండు.
3.30 (ముప్పదియవ శ్లోకము)
తత్ క్షమ్యతాం స భగవాన్ పురుషః పురాణో నారాయణః స్వపురుషైర్యదసత్కృతం నః|
స్వానామహో న విదుషాం రచితాంజలీనాం క్షాంతిర్గరీయసి నమః పురుషాయ భూమ్నే॥4871॥
నేడు నా దూతలు శ్రీహరి పార్షదులయెడ అపరాధమొనర్చి, స్వయముగా భగవంతుని యెడనే అపరాధమొనర్చిరి. అది నా దోషమేయగును. పురాణపురుషుడైన శ్రీమన్నారాయణుడు మా అపరాధములను క్షమించుగాక! మేము అజ్ఞానులమైనను ఆ ప్రభువు యొక్క ఆజ్ఞను, భగవద్భక్తుల ఆజ్ఞలను శిరసావహించుటకు ఉత్సాహముతో అంజలి ఘటించియుందుము. కనుక, మహామహిమాన్వితుడైన ఆ భగవంతుడు మమ్ములను క్షమించుగాక! సర్వాంతర్యామియు, జగత్తునకు ఏకైక ప్రభువైన ఆ భగవంతునకు నమస్కరించుచున్నాము అని ఇట్లు యమధర్మరాజు పలికెను.
3.31 (ముప్పది ఒకటవ శ్లోకము)
తస్మాత్సంకీర్తనం విష్ణోర్జగన్మంగళమంహసామ్|
మహతామపి కౌరవ్య విద్ద్యైకాంతికనిష్కృతిమ్॥4872॥
శ్రీశుకయోగిపలికెను) పరీక్షిన్మహారాజా! కేవలము భగవంతుని గుణములను. లీలలను, నామములను కీర్తించుటవలన గొప్పగొప్ప పాపములు, వాటివాసనలు నిర్మూలమగుననియు, అదియే పాపములకు ప్రాయశ్చిత్తమనియు తెలిసికొనుము. శ్రీహరి నామసంకీర్తనయే లోక కల్యాణకారకము.
3.32 (ముప్పది రెండవ శ్లోకము)
శృణ్వతాం గృణతాం వీర్యాణ్యుద్దామాని హరేర్ముహుః |
యథా సుజాతయా భక్త్యా శుద్ధ్యేన్నాత్మా వ్రతాదిభిః॥4873॥
భగవంతుని చరితములు ఉదారములైనవి, కృపాపూర్ణములైనవి. వాటిని విని, కీర్తన చేయువారి హృదయముల యందు అనన్య భక్తి పెంపొందును. అట్టి భక్తివలన కలుగు అంతఃకరణశుద్ధి కృచ్ఛ్రచాంద్రాయణాది వ్రతముల వలన గూడ కలుగదు.
3.33 (ముప్పది నాలుగవ శ్లోకము)
కృష్ణాంఘ్రిపద్మమధులిణ్ న పునర్విసృష్టమాయాగుణేషు రమతే వృజినావహేషు|
అన్యస్తు కామహత ఆత్మరజః ప్రమార్-ష్టుం ఈహేత కర్మ యత ఏవ రజః పునః స్యాత్॥4874॥
విషయసుఖములు సహజముగనే భగవన్మాయచే రమ్యముగా కనబడును. పరిణామమున అవి దుఃఖహేతువులే యగును. అట్టి విషయములకు విముఖుడై శ్రీకృష్ణ పరమాత్ముని పాదారవింద మకరందమును గ్రోలు నట్టి మనుజుడు మరల వాటి జోలికేపోడు. కాని, భగవన్నామ రసామృత పానమునకు విముఖుడైన వాని వివేకబుద్ధి కోరికలకు వశమైపోవును. అట్టి వారుతమ పాపములను కడిగివేసికొనుటకై మరల ప్రాయశ్చిత్తరూప కర్మలను ఆచరించుచుందురు. కాని వీరి కర్మవాసనలు తొలగిపోవు. కనుక వారు కర్మ పరంపరలోనే మునిగిపోయి దోషములనే చేయుచుందురు.
3.34 (ముప్పది నాలుగవ శ్లోకము)
ఇత్థం స్వభర్తృగదితం భగవన్మిహిత్వం సంస్మృత్య విస్మితధియో యమకింకరాస్తే|
నైనాచ్యుతాశ్రయజనం ప్రతి శంకమానాః ద్రష్టుం చ బిభ్యతి తతః ప్రభృతి స్మ రాజన్॥4875॥
మహారాజా! యమదూతలు తమ ప్రభువైన యమధర్మరాజు ఈ విధముగా వర్ణించిన భగవన్మహిమను విని, దానినే స్మరించుచు ఆశ్చర్యమగ్నులైరి. అప్ఫటి నుండి యమధర్మరాజు యొక్క పలుకులపై విశ్వాసము ఉంచి, భగవంతుని ఆశ్రయించిన భక్తుల జోలికి వెళ్ళుట ప్రమాదకరముగా భావించిరి. అంతేగాదు, వారివైపు కన్నెత్తి చూచుటకైనను వారు భయపడుచుండిరి.
3.35 (ముప్పది ఐదవ శ్లోకము)
ఇతిహాసమిమం గుహ్యం భగవాన్ కుంభసంభవః|
కథయామాస మలయే ఆసీనో హరిమర్చయన్॥4876॥

శ్రీవేదవ్యాస విరచిత శ్రీమద్భాగవతంలోని షష్ఠ స్కంధం ప్రథమ,ద్వితీయ,తృతీయ అధ్యాయముల సారాంశము (అజామిళుని కథ, అవసానకాలంలో భగవన్నామ స్మరణ ఫలితము) - ఈ కథాసంగ్రహము మరొకసారి మీకోసం
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
అజామిళోపాఖ్యానం ఈ కథ చదవండి. భగవన్నామస్మరణ, అదికూడా అవసానకాలంలో చేస్తే పరమపదం లభించడం నిశ్చయమని తెలుస్తుంది. కాని అంతవరకు వద్దు రోజూ శ్రీమద్భాగవతం మీవద్దకు కొంచం కొంచం వస్తోంది. 5 నిమిషాలు కేటాయించండి. అంతే పరమేశ్వరుని అనుగ్రహం పొందండి. మనలోని కలిదోషములను పోగొట్టుకోవడానికి ఇదే అవకాశం. ఇదిసత్యం.
ఇది శ్రీ మహాభాగవతంలోని కధ. భగవద్గీతలో శ్రీ కృష్ణుడు చెప్పిన ఒక శ్లోకం యొక్క అంతరార్ధం ఈ కధలో ఇమిడి ఉంది.ఆ శ్లోకం ఏమిటంటే–
యం యం వాపి స్మరన్భావం త్యజత్యంతే కళేబరం, తం తమే వైతి కౌంతేయ సదా తద్భావభావితః
అంటే ,జీవుడు దేనిని గూర్చి స్మరించుచు శరీరమును చాలించునో అద్దానిని గూర్చియే పునర్జన్మమును పొందుచున్నాడని అర్ధం! ఈశ్వర స్మరణతో దేహాన్ని వదిలినట్లయితే ఈశ్వర స్వరూపంలో ఐక్యమవుతాము.జడభరతుని కధ దీనికి చక్కని ఉదాహరణ.
జడభరతుడు యోగియైనప్పటికిని మరణ సమయమున ప్రగాఢముగనున్న మమకారము వలన జింకనుగూర్చి యోచించుచు ప్రాణములను చాలించినందువలన మరుజన్మమున జింకయై జన్మించెను. దాదాపుగా అటువంటిదే ఈ అజామిళుడి కధ కూడా! కేవలం మరణ సమయంలో మాత్రమే నారాయణ నామ స్మరణ చేయటంవలన అజామిళుడు మోక్షాన్ని పొందాడు.ఇక అజామిళుడి కథను గురించి తెలుసుకుందాం!
కన్యాకుబ్జం అనే పట్టణంలో అజామిళుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు పాపాత్ముడు, సదాచారాలను విడిచిపెట్టిన దౌర్భాగ్యుడు.జూదరి,దొంగతనాలను చేసేవాడు .యౌవనపు మదంతో ఒక దాసిని భార్యగా చేసికొని ఆమె వలన పదిమంది కొడుకులను కన్నాడు. సంసార వ్యామోహంలో పడి చాలాకాలం సుఖాలు అనుభవించి వృద్ధుడయ్యాడు. అజామిళుని నల్లని వెండ్రుకలు తెల్లబడ్డాయి. అవయవాలు పట్టుదప్పాయి . ఇంద్రియ వాంఛలు ఇక వద్దు అన్నట్లుగా తల అడ్డంగా వణకసాగింది. కంటిచూపు తగ్గిపోయింది. నోటికి రుచితెలియటం లేదు . దంతాలు ఊడిపోయాయి. అజామిళుడికి ఎనబై ఎనిమిదేండ్లు నిండాయి. కాని భ్రాంతి వదలలేదు . అతని చిన్న కొడుకు పేరు నారాయణ. చిన్నకొడుకంటే అతనికి ప్రాణం .ఎక్కువగా అతనితోనే త్రాగుతూ, తింటూ జీవితాన్ని గడుపుతున్న అజామిళుడు దరిచేరుతున్న మృత్యువును గురించి తెలుసుకోలేకపోయాడు. ఆ వయసులో అతను ముగ్గురు యమకింకరులను గుండెలు అదిరిపోగా దూరంగా చూశాడు. వాళ్ళు కోపాన్ని ప్రదర్శిస్తున్నారు. చేతుల్లో భయంకరంగా ఉన్న పాశాలను పట్టుకొని ప్రాణాలు తీయడానికి సిద్ధంగా ఉన్నారు.దూరంగా ఆడుకుంటున్న కుమారుడు అతని హృదయసీమలో గోచరించగా “ నారాయణా! నారాయణా! నారాయణా!” అంటూ కొడుకును పిలిచాడు.
అజామిళుడు మరణ సమయంలో నారాయణ నామస్మరణ చేస్తుండగా ఆ పరిసరాలలో తిరుగుతున్న విష్ణుదూతలు తమ ప్రభువు నామాన్ని విని అక్కడికి వచ్చారు. వెంటనే యమకింకరులను వారించారు .ఆ బ్రాహ్మణుని శరీరం నుండి ప్రాణాలను బయటికి గుంజుతున్న యమభటులను విష్ణుదూతలు బలవంతంగా త్రోసి అవతల పడవేశారు.తమ ప్రయత్నం విఫలం కాగా యమదూతలు ఇలా అన్నారు.“మీరెవరు? ఇలా మా చేతికి చిక్కినవాణ్ణి ఎందుకు బలవంతంగా విడిపించారు? యముని శాసనాలను నవ్వులపాలు చేస్తారా? శాంతంతో కూడిన మీ శరీర కాంతులు చీకట్లను పారద్రోలుతూ సంతోషాన్ని కలిగిస్తున్నాయి. మీరు మమ్మల్ని అడ్డగించడానికి కారణమేమిటి?” అని యమదూతలు పలుకగా ఆ విష్ణుదూతలు,“మీరు యమదూతలైతే పుణ్య లక్షణాన్ని, పాప స్వరూపాన్ని, దండనీతిని వివరించండి. ఇతడు ఉండవలసిన స్థానాన్ని వెల్లడించండి. దండింపదగినవారెవరు? లోకంలోని సర్వ ప్రాణులా? లేక పాపకర్ములైన కొందరా?”అనగా, యమభటులు ,”వేదాలలో ఏది చెప్పబడిందో అదే అందరికీ ఆమోదకరమైన ధర్మం. దానికంటే భిన్నమైనది అధర్మం. వేదాలన్నీ విష్ణుస్వరూపాలని విన్నాము కదా! నారాయణుడు అంతర్యామియై సర్వప్రాణులలో నిండి ఉన్నాడు. అంతటా నిండి ఉన్నాడు. అంటే సూర్యుడు, అగ్ని, ఆకాశం, గాలి, గోవులు, చంద్రుడు, సంధ్యలు, పగళ్ళు, రాత్రులు, కాలాలు, భూమి మొదలైనవి. కర్మబద్ధులైన జీవులందరూ దండింపదగినవారే. కావాలని కర్మలను చేసేవారికి ఆ కర్మల ననుసరించి శుభాలు, అశుభాలు కలుగుతూ ఉంటాయి.”
“ఈ లోకంలో ప్రాణులు గుణత్రయ సంబంధం చేత శాంత స్వభావులు, ఘోర స్వభావులు, మూఢ స్వభావులు అని మూడు విధాలుగా విభజించబడ్డారు . వీరిలో శాంతస్వభావులు ధర్మమార్గంలో ప్రవర్తిస్తూ సుఖపడతారు. ఘోరస్వభావులు చెడు మార్గాలలో నడచి నానా కష్టాల పాలవుతారు. మూఢస్వభావులు కొంత మంచిగా కొంత చెడుగా ప్రవర్తిస్తూ సుఖ దుఃఖాలను అనుభవిస్తారు . వారి ప్రవర్తనలకు అనుగుణంగానే వారికి రాబోయే జన్మలు లభిస్తాయి. ధర్మస్వరూపుడైన యముడు సమస్త జీవులలో అంతర్యామిగా ఉంటాడు. అలా ఉండి ఆయా జీవుల ధర్మాధర్మాల స్వరూపాలను విశేష దృష్టితో గమనిస్తూ వాటికి అనురూపమైన మార్గాలను కల్పిస్తుంటాడు. అజ్ఞానం, తమోగుణంతో కూడినవాడైన జీవుడు పూర్వకర్మల చేత ఏర్పడిన ఇప్పటి ఈ దేహమే తానని భావిస్తాడు. అందువల్ల పూర్వజన్మ స్మృతిని కోల్పోతాడు. సంసార బంధాలలో చిక్కుకొని ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉంటాడు.కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనే అరిషడ్వర్గాన్ని జయించలేక సంసార బద్ధుడైన జీవుడు కర్మలు బంధహేతువులని తెలిసి కూడా పూర్వజన్మ సంస్కార ప్రాబల్యం వల్ల ఇష్టం లేకపోయినా బలవంతంగా కర్మలు చేస్తున్నాడు. “
“పట్టుపురుగు తన నోటిలో నుండి వచ్చిన దారాలతోనే తనచుట్టూ ఒక గూడు అల్లుకొని దానిలోనుండి బయటపడే మార్గంలేక నశించినట్లే జీవుడు స్వయంగా తనచుట్టూ ఏర్పరచుకొన్న కర్మబంధాలలో చిక్కి నలిగిపోతున్నాడు. జీవుని వర్తమాన జీవితంలోని నడవడిని బట్టి అతడు పూర్వ జన్మంలో ఎట్లా ఉండేవాడో రాబోయే జన్మలో ఎలా ఉంటాడో నిర్ణయింపవచ్చు. ఏ జీవి అయినా ఒక్క క్షణకాలం కూడా కర్మ చేయకుండా ఉండలేడు. పూర్వజన్మ సంస్కారానికి అనుగుణంగానే పురుషుని గుణాలు ఉంటాయి.అవ్యక్తమైన ఆ పూర్వజన్మ సంస్కారం నుండి జీవుని స్థూల సూక్ష్మ శరీరాలు ఏర్పడుతుంటాయి. అవి అప్పటి తల్లిదండ్రుల పోలికలను సంతరించుకుంటాయి.”
“ఈ అజామిళుడు పూర్వజన్మంలో చేసిన సత్కర్మల వలన బ్రాహ్మణ కులంలో జన్మించాడు. ఎల్లప్పుడు సదాచారాన్ని పాటించే బుద్ధి కలవాడై ఉత్తమమైన జ్ఞానమార్గాన్ని అవలంబించే సమయంలో మదనోన్మాదాన్ని కలిగించే నవయౌవనం అతని హృదయంలో జొరబడింది. ఆ సమయంలో అజామిళుడు తన తండ్రి ఆజ్ఞానుసారం దర్భలు, సమిధలు, పుష్పాలు, పండ్లు తీసుకొని రావటం కోసం తోటలోనికి వెళ్ళి తిరిగి వస్తూ ఒక దట్టమైన పొదరింట్లో… రతిక్రీడలో చతురురాలైన తన ప్రియురాలైన స్వైరిణి వృషలితో ఆనందిస్తున్న ఒక కాముకుణ్ణి చూశాడు. దిగంబరంగా ఉన్న కటిప్రదేశం కల విటుణ్ణి చూశాడు. కాముకత్వం మూర్తీభవించిన ప్రియురాలితో శృంగారకేళిలో తేలియాడుచున్నవాణ్ణి అజామిళుడు చూశాడు. అతని పులకించిన రోమాలు నిక్కబొడుచుకున్నాయి.”
“ఆ వెలయాలిని చూచి అజామిళుడు కామోద్రేకంతో ఉవ్విళ్ళూరాడు.మాటిమాటికి ఏపు మీరిన ఆమె చూపులనే మోహపాశాలలో చిక్కుకొన్న ఆ బ్రాహ్మణ కుమారుడు నిత్యకృత్యాలైన వైదిక కర్మలను, శాస్త్ర పాఠాలను, జపతపాలను మరిచిపోయాడు. అతని మనస్సనే అరణ్యంలో కామేద్రేకమనే కార్చిచ్చు చెలరేగ సాగింది. అప్పటినుండి అతని మనస్సులో ఆమెను పొందాలనే కోరిక చెలరేగింది. దిగులుతో క్రుంగిపోయాడు. విచారించాడు. కామావేశానికి లోనయ్యాడు.అజామిళుడు కులాచార మర్యాదలను కూలద్రోశాడు. తండ్రి సంపాదించిన ఆస్తినంతటినీ దాని పాలు చేశాడు. సద్గుణాలను విడనాడాడు. బాగా రుచి మరిగి ఆ వాలుగన్నుల వెలయాలి అందచందాలకు లొంగిపోయాడు. సుగుణవతి, సౌందర్యవతి అయిన తన భార్యను ఇష్టపడక, నీచుడై తెలివితక్కువతనంతో ఆ వెలయాలి ఇంటికి వెళ్ళసాగాడు. బంధువులను తిట్టి, సజ్జనులను బాధించి, దిక్కులేని దీనులను చిక్కులపాలు చేసి, దారులు కొట్టి దోచుకొనడంలో దిట్టయై, నిందలను లెక్క చేయకుండా జీవింపసాగాడు. ఈ విధంగా చాలాకాలం అజామిళుడు భ్రష్టాచారుడై ఆ వేశ్య కుటుంబాన్ని పోషిస్తూ ఆమెనే భార్యగా భావిస్తూ చెడుమార్గంలో ప్రవర్తింపసాగాడు. అందువల్ల ఈ పాపాత్ముడు, కుటిల చిత్తుడు, సజ్జన కంటకుడు, ధూర్తుడు అయిన ఈ క్రూరుణ్ణి బలవంతంగా తీసుకొని పోతున్నాము. తరువాత ఇతడు తగిన దండనం పొంది ధన్యుడౌతాడు ”.
ఈ విధంగా మాట్లాడుతున్న యమదూతలతో విష్ణుదూతలు ఇలా అన్నారు.“ఔరా! మీ ధర్మాధర్మ విచక్షణా సామర్థ్యం తెలిసిపోయింది. అజ్ఞానంతో మీరు పుణ్యాత్ములను, దండింపరాని వారిని దండిస్తారన్న విషయం వెల్లడి అయింది. యమదూతలారా! ఇతడు మరణ సమయంలో అమృతమయమైన అక్షరాలతో కూడిన భగవంతుని పుణ్యనామాన్ని స్వీకరించడం వలన కోటి కంటే ఎక్కువ జన్మాలలో చేసిన పాపాల నన్నింటినీ పోగొట్టుకున్నాడు. హరినామ కీర్తనలు ముక్తికాంత ఏకాంత మోహన విహారాలు, సత్యలోక నివాసాన్ని ప్రసాదించే ఆనంద సౌభాగ్య విలాసాలు.ఇతడు “నారాయణా!” అని పిలిచినప్పుడు ఇతని మనస్సు కుమారుని మీద ఆసక్తమై ఉన్నదని మీరు అనుకోవద్దు. భగవంతుని పేరును ఏ విధంగా పలికినా శ్రీహరి రక్షకుడై అందులోనే ఉంటాడు. కుమారుని పేరు పెట్టి పిలిచినా, విశ్రాంతి వేళలోనైనా, ఆటలోనైనా, పరిహాసంగానైనా, పద్య వచన గీత భావార్థాలతోనైనా కమలాక్షుణ్ణి స్మరిస్తే పాపాలు తొలగిపోతాయి. ఆ ప్రాయశ్చిత్తాల వల్ల ఆ పాపాలు తాత్కాలికంగా ఉపశమిస్తాయి తప్ప పూర్తిగా పరిహారం కావు.”
“అంత్యకాలంలో ధైర్యం సన్నగిల్లినప్పుడు పూర్వజన్మ పుణ్య విశేషం ఉంటేనే కాని కేశవుడు మనస్సుకు తోచడు.శ్రీహరి నామమనే అమృతాన్ని ఈ అజామిళుడు ప్రత్యక్షంగా సేవించాడు. ఈ హరినామ స్మరణమనే ధర్మం ఈ సత్పురుషుని మరణానంతరం ఎందుకు వృథా అవుతుంది?”అని ఈ విధంగా విష్ణుదూతలు భాగవత ధర్మాన్ని నిరూపించి “ఈ విషయంలో మీకు సందేహం ఉంటే మీ యమధర్మరాజును అడగండి. పొండి” అని చెప్పి, బ్రాహ్మణుడైన అజామిళుని భయంకరమైన యమపాశాల నుండి విడిపించి యమభటుల వల్ల కలిగిన భయాన్ని పోగొట్టారు. అప్పుడు ఆ యమదూతలు శాంతించి, చేసేది లేక యమలోకానికి వెళ్ళి, యమునికి జరిగినదంతా తెలియజేశారు.
అప్పుడు,ఆ అజామిళుడు యమపాశాలనుండి బయటపడి ధైర్యాన్ని పొంది ఎదుట ఉన్న విష్ణుదూతలకు ఎంతో ఆనందంతో నమస్కరించాడు.ఆ అజామిళుడు నిలబడి చేతులెత్తి నమస్కరించి ఏదో చెప్పడానికి ప్రయత్నించాడు. విష్ణుభటులు అతని మనస్సులోని భావాన్ని తెలుసుకొని అంతర్ధానం చెంది ఆ దేవదేవుని సన్నిధికి వెళ్ళిపోయారు.మూడు వేదాల సారమూ, విష్ణుదూతల యమభటుల సంవాదాన్ని అజామిళుడు సమగ్రంగా వింటూ… అతని మనస్సులో అణిచిపెట్టబడినవి అయిన పాపాలు మాటిమాటికి తలంపుకు వచ్చి, పశ్చాత్తాపంతో క్రుంగిపోయి, ఆ బ్రాహ్మణుడు పరమేశ్వరుడైన శ్రీహరిని ఆశ్రయించి తనలో ఇలా అనుకున్నాడు.వేశ్య మీద మోహం పెంచుకొని సంతానాన్ని కన్నాను. కులగౌరవాన్ని గోదావరిలో కలిపాను. నా బ్రతుకును రచ్చ కెక్కించాను. సిగ్గుమాలిన పనులు చేసి సాటివారిలో తలవంపులు తెచ్చుకున్నాను. వార్ధక్యం పైబడినా సంసార బంధాలనుండి బయట పడలేక, లోకనిందలను లెక్కచేయక, నా జీవితాన్ని భస్మం చేసుకున్నాను. చదువు చట్టుబండలైపోయింది. శాస్త్రజ్ఞానం మట్టిపాలయింది. పుణ్యం నశించింది. తెలివి నశించింది. స్వచ్ఛమైన జ్ఞానం మొత్తానికే లేకుండా పోయింది.చక్కని సౌందర్యంతో నన్ను ఇష్టపడే ఇల్లాలిని విడిచి మద్యం త్రాగే ఈ డొక్కు మాయలాడికి విటుణ్ణై చెడిపోయాను.నా భయంకర పాపాగ్ని జ్వాలలు నన్ను చుట్టుముట్టి కాల్చి భస్మం చెయ్యకుండా ఎందుకు విడిచి పెట్టాయో కదా! నేను తప్ప మరో దిక్కు లేని వృద్ధులైన నా తల్లి దండ్రులను ఎన్నెన్నో బాధలు పెట్టి ఇంటినుండి వెళ్ళగొట్టాను.
ఎన్నెన్నో పాపాలకు ఒడిగట్టి అత్యంత భయంకరమైన నరకంలో పడి కొట్టుకొని పోతున్న నన్ను దయతలచి అడ్డుకొని ఆపదలు బాపి రక్షించిన ఆ పుణ్యపురుషు లెవరో? ఎక్కడివారో? భయంకరమైన పాశబంధాలతో నరక సముద్రంలో పడుతున్న నన్ను నాశనం కాకుండా రక్షించిన పుణ్యమూర్తులు, అయిన ఆ నలుగురు ఎక్కడికి వెళ్ళిపోయారో?పాపాత్ముడనైన నాకు ఆ దేవతా శ్రేష్ఠుల సందర్శనం పూర్వ జన్మలో చేసిన పుణ్యవిశేషం వల్లనే కాని లభించదు. వాళ్ళ దర్శనం నా ఆత్మకు ఎంతో ఆనందాన్ని చేకూర్చింది.మరణిస్తున్న సమయంలో నా నాలుకకు భగవంతుని నామాన్ని ఉచ్చరించే భాగ్యం ఎలా అబ్బుతుంది?నేను పాపాత్ముణ్ణి.నిందలకు నిలయమైనవాణ్ణి, గుణహీనుణ్ణి, దురదృష్టవంతుణ్ణి నే నెక్కడ? భగవంతుని పవిత్ర నామాన్ని ఆలపించడం ఎక్కడ? ఇదంతా పూర్వపుణ్యం లేనిదే ఎలా సాధ్యం? భవబంధాలను విడిచివేశాను. మాయతో కూడిన అజ్ఞానాంధకారాన్ని అణచివేశాను. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అనే ఆరుగురు శత్రువులను జయించాను. జనన మరణాలనే సముద్రాన్ని తరించాను.అని ఈ విధంగా హృదయంలో ఆత్మజ్ఞానమనే తైలంతో బ్రహ్మజ్ఞానమనే దీపం ప్రకాశించిగా ఆ బ్రాహ్మణుడు…గొప్ప తత్త్వజ్ఞానియై, సంసార బంధాలన్నిటినీ పారద్రోలి గంగా ద్వారానికి వెళ్ళిపోయాడు. అక్కడ ఉన్న ఒక దేవాలయంలో కూర్చొని యోగమార్గాన్ని ఆశ్రయించాడు. దేహం ఇంద్రియాలు మొదలైన వాని మార్గం నుండి విడివడి తన యోగ సమాధి ద్వారా పరతత్త్వంతో జోడించాడు. త్రిగుణాతీతుడై తన ఆత్మను పరమాత్మలో లీనం చేశాడు. అప్పుడు అతనికి మొదట తనను రక్షించిన ఆ దివ్యపురుషులు కనిపించారు. అతడు వారికి నమస్కరించాడు.ఈ విధంగా అజామిళుడు యోగమార్గం ద్వారా తన శరీరాన్ని విడిచి దివ్యమైన పుణ్యశరీరం ధరించినవాడై తన ఎదుట పూర్వం తనను రక్షించిన విష్ణుకింకరులను చూశాడు. అతని దేహం ఆనందంతో పులకించింది. అజామిళుడు విష్ణుదూతలకు చేతులు మోడ్చుతూ గంగాతీరంలో శరీరం విడిచాడు. వెనువెంటనే అతనికి నారాయణ పార్శ్వచరులైన మహాభక్తుల స్వరూపం ప్రాప్తించింది. అనంతరం అతడు విష్ణుదూతలతో కలిసి వైకుంఠ నగరంలో ప్రవేశించి శ్రీమన్నారాయణుని పాదపద్మాలను సేవించే పరిణత దశకు చేరుకున్నాడు.
యం యం వాపిస్మరన్ భావం త్యజత్యన్తే కళేబరమ్
తం తేమవైతి కొన్తేయ సదా తద్భావ భావితః
No comments:
Post a Comment