Saturday, 30 May 2020

మహాభాగవతం షష్ఠ స్కంధము - ఎనిమిదవ అధ్యాయము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం
షష్ఠ స్కంధము - ఎనిమిదవ అధ్యాయము
నారాయణ కవచము

ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

పరీక్షిన్మహారాజు నుడివెను - మహాత్మా! శుకయోగీ! నారాయణ కవచ ప్రభావమున దేవేంద్రుడు శత్రువుల చతురంగబలములను అవలీలగా జయించి, త్రైలోక్య రాజ్యసంపదను అనుభవించెనని నీవు తెలిపియుంటివి. ఆ నారాయణ కవచమును నాకు ఉపదేశింపుము. దాని ప్రభావమున దేవేంద్రుడు తనపై దండెత్తిన శత్రువులను జయించిన విధానమును వివరింపుము.

శ్రీ శుక ఉవాచ

శ్రీశుకుడు వచించెను- మహారాజా! దేవతలు త్వష్టపుత్రుడగు విశ్వరూపుని పురోహతునిగా చేసికొనిన పిమ్మట, దేవేంద్రుడు ప్రశ్నింపగా విశ్వరూపుడు ఆయనకు నారాయణ కవచమును ఉపదేశించెను. దానిని సావధానుడవై వినుము.

విశ్వరూప ఉవాచ

విశ్వరూపుడు వచించెను- దేవేంద్రా! భయావహ పరిస్థితి ఏర్పడినప్పుడు నారాయణ కవచమును పఠించి, తమ శరీరమును రక్షించుకొనవలెను. దాని విధానమును తెలిపెదను- కాళ్ళు, చేతులను ప్రక్షాళనమొనర్చుకొని, ఆచమింపపవలెను. పవిత్రమును చేతియందు ధరించి, ఉత్తరముఖముగా కూర్చొనవలెను. అనంతరము కవచధారణ పర్యంతము మౌనము వహించుటకు నిశ్చయించుకొని, శుచియై ఓమ్ నమో నారాయణాయ, ఓమ్ నమో భగవతే వాసుదేవాయ అను మంత్రముల ద్వారా హృదయాది అంగన్యాసమును, అంగుష్ఠాది కరన్యాసములను ఆచరింపవలెను. ఓమ్ నమోనారాయణాయ - అను అష్టాక్షరి మంత్రము యొక్క ఓమ్ మొదలుకొని ఎనిమిది అక్షరములను క్రమముగా కాళ్ళు, మోకాళ్ళు, తొడలు, ఉదరము, హృదయము, వక్షస్థలము, ముఖము, శిరస్సు అను అంగముల యందు న్యాసము చేయవలెను (ఎనిమిది అంగములను స్పృశించుచు మంత్రము నందలి ఎనిమిది అక్షరములను జపించవలెను). లేదా ఇదే మంత్రమును యకారమునుండి ఓంకార పర్యంతము ఎమిమిది అక్షరములను శిరస్సుతో ప్రారంభించి పాదములవరకు, ఎనిమిది అంగములయందు విపరీత (సంహార) క్రమములో న్యాసము చేయవలెను.

అనంతరము ఓం నమో భగవతే వాసుదేవాయ అను ద్వాదశాక్షరి మంత్రముయొక్క ఓం మొదలుకొని పన్నెండు అక్షరముల మంత్రముతో, ఓంకారమును మొదలుకొని, యకారము వరకు ఒక్కొక్క అక్షరమునకు ఓంకారమును జోడించి రెండు చేతుల ఎనిమిది వ్రేళ్ళయందు (బొటన వ్రేళ్ళను మినహాయించి), రెండు బొటన వ్రేళ్ళు యొక్క నాలుగు కణుపులయందు, వెరసి పన్నెండు స్థానములలో కరన్యాసమును చేయవలెను.

పిమ్మట ఓం విష్ణవే నమః అనుమంత్రము యొక్క ఓంకారమును హృదయమునందును, వి కారమును బ్రహ్మరంధ్రమున, ష కారమును కనుబొమల మధ్యయందును, ణ కారమును శిఖయందును, వే కారముసు రెండుకనుల యందును, స కారమును అన్ని కీళ్ళయందును వ్యాసము చేయవలెను. ఓం, మః, అస్త్రాయఫట్ అని చెప్పి దిగ్బంధము చేయవలెను. ఈ విధముగా వివేకియైన సాధకుడు ఓం విష్ణవే నమః అను మంత్రస్వరూపుడగును.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి షష్ఠస్కంధములోని ఎనిమిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

8.11 (పదకొండవ శ్లోకము)

అనంతరము సమగ్రమగు ఐశ్వర్యము, ధర్మము, యశస్సు, సంపద, జ్ఞానము, వైరాగ్యము అను  సద్గుణములచే పరిపూర్ణుడైన శ్రీహరిని ధ్యానింపవలెను. తనను గూడ ఆ రూపములోనే చింతింపవలెను. పిదప విద్య, తేజస్సు,తపస్స్వరూపమైన ఈకవచమునుపఠింపవలెను.

ఆశ్రితుల ఆర్తిని హరించునట్టి భగవంతుడైన శ్రీహరి గరుడుని మూపుపై తన పాదపద్మములను మోపియున్నాడు. అణిమాది అష్టసిద్ధులు ఆ స్వామిని సేవించుచున్నవి. ఎనిమిది చేతుల యందు శంఖము, చక్రము, డాలు, ఖడ్గము, గద, బాణము, ధనుస్సు, పాశము ధరించియున్నాడు. ఓంకారస్వరూపుడైన ఆ ప్రభువే అన్ని విధములుగా అంతటను నన్ను రక్షించుగాక.

శ్రీహరి మత్స్యమూర్తియై, జలముల యందలి జలజంతువుల నుండియు, వరుణపాశము నుండి నన్ను రక్షించుగాక. మాయాబ్రహ్మచారి రూపమునగల వామనమూర్తి భూతలము నందును, విశ్వరూపుడైన త్రివిక్రముడు ఆకాశమునందును నన్ను కాపాడుగాక.

శ్రీహరి, నృసింహప్రభువుగా అవతరించి రాక్షససైన్యములను హతమార్చెను. దిక్కులు పిక్కటిల్లునట్లు ఆ స్వామి యొనర్చిన భయంకరమైన అట్టహాసమునకు దైత్యస్త్రీలయొక్క గర్భములు జారిపోయెను. అట్టి నృసింహ ప్రభువు నన్ను దుర్గములు, అడవులు, రణరంగములు మొదలగు సంకట స్దానములయందు కాపాడుగాక!

శ్రీమన్నారాయణుడు యజ్ఞవరాహమూర్తిగా అవతరించి, పృథ్విని తన దంతములపై ధరించెను. అట్టి ఆ ప్రభువు మార్గములయందు నన్ను కాపాడుగాక! పర్వతశిఖరములపై పరశురాముడుగను, ప్రవాసకాలముల యందు లక్ష్మణ సహితుడైన భరతాగ్రజుడైన శ్రీరామచంద్రుడుగను నన్ను రక్షించుగాక!

శ్రీమన్నారాయణుడు అభిచారహోమముల వంటి భయంకరమైన మారణ హోమములనుండియు, అన్నివిధమలైన ప్రమాదముల నుండియు, నన్ను రక్షించుగాక! ఋషిశ్రేష్ఠుడైన నరుడుగా నా గర్వమును దూరము చేయుగాక! యోగ విఘ్నములనుండి యోగేశ్వరుడైన దత్తాత్రేయుడుగా నన్ను కాపాడుగాక! త్రిగుణాధిపతియైన కపిలభగవానుడుగా కర్మబంధముల నుండి నన్ను రక్షించుగాక!

మహర్షియైన సనత్కుమారుడు కామదేవుని నుండి రక్షించుగాక! హయగ్రీవుడు నేను మార్గమునందు సంచరించుచున్నప్పుడు, దేవతామూర్తులకు నమస్కారములు చేయకుండుట మొదలగు అపరాధముల నుండి నన్ను రక్షించుచుందురుగాక! దేవర్షియైన నారదుడు నేను ఒనర్చెడి సేవాపరాధములనుండి నన్ను రక్షించుచుండుగాక! కూర్మావతారుడైన శ్రీహరి వివిధములగు నరక బాధలనుండి రక్షించుచుండుగాక!

ధన్వంతరి భగవానుడు అనారోగ్యముల నుండి కాపాడుగాక! జితేంద్రియుడైన ఋషభదేవుడు సుఖదుఃఖాది భయంకర బాధలనుండి నన్ను కాపాడుగాక!  యజ్ఞ పురుషుడైన నారాయణుడు లోకాపవాదముల నుండియు, బలరాముడు మానవుల వలన కలుగు కష్టముల నుండియు, ఆదిశేషుడు క్రోధమును సర్పగణములనుండియు నన్ను రక్షించు చుండునుగాక!

వ్యాసభగవానుడు అజ్ఞానవశమున నేను చేయు కార్యములనుండి రక్షించుచుండుగాక! బుద్ధుడు పాషండగణముల నుండియును, ప్రమాదముల నుండియు నాకు రక్షణను ప్రసాదించుచుండుగాక! ధర్మరక్షణకొరకు కల్కి అవతారమును దాల్చి భగవంతుడు పాపసంకులమైన కలికాల దోషములనుండి నన్ను కాపాడుచుండుగాక!

కేశవభగవానుడు ప్రాతఃకాలమున తన గదాయుధము తోడను, ఆసంగవకాలమున (సూర్యోదయానంతర కాలమున) వేణుగానలోలుడగు గోవిందుడు, పూర్వాహ్నమున నారాయణుడు తీవ్రమైన శక్తిని ధరించియు, మధ్యాహ్న కాలమున విష్ణుభగవానుడు సుదర్శన చక్రమును చేబూనియు, నన్ను రక్షించుచుండుగాక!

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి షష్ఠస్కంధములోని ఎనిమిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

8.21 (ఇరువది ఒకటవ శ్లోకము)

అపరాహ్ణకాలమున మధుసూదనుడు ప్రచండమైన తన ధనుస్సుతోడను, సాయంకాలము నందు మాధవుడు బ్రహ్మవిష్ణుమహేశ్వర రూపము తోడను, సూర్యాస్తమయమైన పిదప హృషీకేశునిగను, అర్ధరాత్రముస పద్మనాభునిగను నన్ను కాపాడుగాక!

అపరరాత్రి యందు శ్రీవత్సలాంఛనుడైన శ్రీహరియు, ఉషఃకాలమున ఖడ్గధారియైన జనార్దనుడుగను, సూర్యోదయమునకు పూర్వము దామోదరుడుగను, ఉషఃకాలానంతరము ప్రభాతవేళ కాలస్వరూపుడైన విశ్వేశ్వరుడుగను నన్ను కాపాడుగాక!

తీవ్రమైన అంచులు గల సుదర్శనచక్రము ప్రళయాగ్నిని విరజిమ్ముచు, భగవత్ప్రేరణచే అన్ని వైపుల తిరుగుచుండును. వాయువు తోడగుటతో అగ్ని ఎండుగడ్డిని కాల్చివైచినట్లు ఆ సదర్శనచక్రము మా శత్రుసైన్యములను వెంటనే దగ్ధమొనర్చుగాక!

కౌమోదకీ గదాయుధమా! నీనుండి వెలువడు అగ్ని కణముల స్పర్శ వజ్రాయుధమువలె దుర్భరమైనవిగా నుండును. నీవు అజితుడైన శ్రీహరికి ప్రియమైన దానివి. నేను ఆ ప్రభువునకు సేవకుడను. కనుక, నీవు కూష్మాండ వినాయక, యక్షరాక్షసభూత ప్రేతాది గణములను ఇప్పుడే నుగ్గు నుగ్గు చేయుము. అట్లే నాశత్రువులను పిండి, పిండిగావింపుము.

శ్రేష్ఠమైన శంఖమా! పాంచజన్యమా! శ్రీకృష్ణభగవానునిచే పూరింపబడి, భీకరమైన శబ్దమొనర్చుచు శత్రువుల హృదయములను కంపింపజేయుదువు. అట్లే రాక్షసులు, ప్రమథగణములు, ప్రేతములు, మాతృకలు, పిశాచములు, బ్రహ్మరాక్షసులు మొదలగు భయంకర ప్రాణులను వెంటనే పారద్రోలుము.

శ్రీహరికి ప్రీతి పాత్రమైన ఓ ఖడ్గమా! నీ అంచులు మిగుల తీవ్రమైనవి. భగవంతునిచే ప్రయోగింపబడి నీవు శత్రువులను కకావికలు గావింపుము. నీవు భగవంతునకు మిగుల ప్రియమైన దానివి. నీయందు వందలకొలది చంద్రునివంటి మండలాకారములు గలవు. శత్రువుల పాపదృష్టిని హరించివేయుము.

సూర్యాదిగ్రహములు, ధూమకేతువులు మొదలగునవి, దుష్టమానవులు, సర్పాది విషప్రాణులు, కోఱలుగల క్రూరమృగములు, భూతప్రేతాదులు, అట్లే పాపాత్ములైన ప్రాణులనుండియు నన్ను రక్షింఫుము. మా శ్రేయస్సునకు వీరు అందరు విరోధులు. మేము భగవంతుని నామరూపములను, ఆయుధములను కీర్తించుటవలన ఇవి అన్నియును వెంటనే నశించుగాక!

పూజ్యుడు, వేదమూర్తియు అగు గరుత్మంతుడు బృహద్రధంతరము మొదలగు సామములచే స్తుతింపబడు చుండును. ఆ ప్రభువు అన్ని కష్టములనుండియు మమ్ము కాపాడుచుండుగాక! పార్షదుడైన విష్వక్సేనుడు తన నామోచ్చారణ ప్రభావముచే నన్ను రక్షించుగాక!

శ్రీహరియొక్క నామ, రూపములు, వాహనములు, ఆయుధములు, పార్షదోత్తములు, మా బుద్ధులను, ఇంద్రియములను, మనస్సులను, ప్రాణములను, సకల ఆపదలనుండి  కాపాడుగాక!

8.1 (ప్రథమ శ్లోకము)

యయా గుప్తః సహస్రాక్షః సవాహాన్ రిపుసైనికాన్|
క్రీడన్నివ వినిర్జిత్య త్రిలోక్యా బుభుజే శ్రియమ్॥5060॥

8.2 రెండవ శ్లోకము)

భగవంస్తన్మమాఖ్యాహి వర్మ నారాయణాత్మకమ్|
యథాఽఽతతాయినః శత్రూన్ యేన గుప్తోఽజయన్మృధే॥5061॥

శ్రీ శుక ఉవాచ

8.3 (మూడవ శ్లోకము)

వృతః పురోహితస్త్వాష్ట్రో మహేంద్రాయానుపృచ్ఛతే|
నారాయణాఖ్యం వర్మాహ తదిహైకమనాః శృణు॥5062॥

విశ్వరూప ఉవాచ

8.4 (నాలుగవ శ్లోకము)

ధౌతాంఘ్రిపాణిరాచమ్య సపవిత్ర ఉదఙ్ముఖః|
కృతస్వాంగకరన్యాసో మంత్రాభ్యాం వాగ్యతః శుచిః॥5063॥

8.5 (ఐదవ శ్లోకము)

నారాయణమయం వర్మ సన్నహ్యేద్భయ ఆగతే|
పాదయోర్జానునోరూర్వోరుదరే హృద్యథోరసి॥5064॥

8.6 (ఆరవ శ్లోకము)

ముఖే శిరస్యానుపూర్వ్యాదోంకారాదీని విన్యసేత్|
ఓం నమో నారాయణాయేతి విపర్యయమథాపి వా॥5065॥

8.7 (ఏడవ శ్లోకము)

కరన్యాసం తతః కుర్యాద్ద్వాదశాక్షరవిద్యయా|
ప్రణవాదియకారాస్తమంగుళ్యంగుష్ఠపర్వసు॥5066॥

8.8 (ఎనిమిదవ శ్లోకము)

న్యసేద్ధృదయ ఓంకారం వికారమను మూర్ధని|
షకారం తు భ్రువోర్మధ్యే ణకారం శిఖయా దిశేత్॥5067॥

8.9 (తొమ్మిదవ శ్లోకము)

వేకారం నేత్రయోర్యుంజ్యాన్నకారం సర్వసంధిషు|
మకారమస్త్రముద్దిశ్య మంత్రమూర్తిర్భవేద్బుధః॥5068॥

8.10 (పదియవ శ్లోకము)

సవిసర్గం షదంతం తత్ సర్వదిక్షు వినిర్దిశేత్|
ఓం విష్ణవే నమ ఇతి॥5069॥

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి షష్ఠస్కంధములోని ఎనిమిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

31.5.2020    ప్రాతఃకాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

షష్ఠ స్కంధము - ఎనిమిదవ అధ్యాయము

నారాయణ కవచము

ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

8.11 (పదకొండవ శ్లోకము)

ఆత్మానం పరమం ధ్యాయేద్ధ్యేయం షట్ఛక్తిభిర్యుతమ్|
విద్యాతేజస్తపోమూర్తిమిమం మంత్రముదాహరేత్॥5070॥

8.12 (పండ్రెండవ శ్లోకము)

ఓం హరిర్విదధ్యాన్మమ సర్వరక్షాం న్యస్తాంఘ్రిపద్మః పతగేంద్రపృష్టే|
దరారిచర్మాసిగదేషుచాపపాశాన్ దధానోఽష్టగుణోఽష్టబాహుః॥5071॥

8.13 (పదమూడవ శ్లోకము)

జలేషు మాం రక్షతు మత్స్యమూర్తిః యాదోగణేభ్యో వరుణస్య పాశాత్|
స్థలేషు మాయావటువామనోఽవ్యాత్ త్రివిక్రమః భేఽవతు విశ్వరూపః॥5072॥

8.14 (పదునాలుగవ శ్లోకము)

దుర్గేష్వటవ్యాజిముఖాదిషు ప్రభుః పాయాన్నృసింహోఽసురయూథపారిః|
విముంచతో యస్య మహాట్టహాసం దిశో వినేదుర్న్యపతంశ్చ గర్భాః॥5073॥

8.15 (పదునైదవ శ్లోకము)

రక్షత్వసౌ మాధ్వని యజ్ఞకల్పః స్వదంష్ట్రయోన్నీతధరో వరాహః|
రామోఽద్రికూటేష్వథ విప్రవాసే సలక్ష్మణోఽవ్యాద్భరతాగ్రజోఽస్మాన్॥5074॥

8.16 (పదునారవ శ్లోకము)

మాముగ్రధర్మాదఖిలాత్ప్రమాదాత్  నారాయణః పాతు నరశ్చ హాసాత్|
దత్తస్త్వయోగాదథ యోగనాథః పాయాద్గుణేశః కపిలః కర్మబంధాత్॥5075॥

8.17 (పదునేడవ శ్లోకము)

సనత్కుమరోఽవతు కామదేవాత్ హయశీర్షా మాం పథి దేవహేళనాత్|
దేవర్షివర్యః పురుషార్చనాంతరాత్ కూర్మో హరిర్మాం నిరయాదశేషాత్॥5076॥

8.18 (పదునెనిమిదవ శ్లోకము)

ధన్వన్తరిర్భగవాన్ పాత్వపథ్యాత్ ద్వంద్వాద్భయాదృషభో నిర్జితాత్మా|
యజ్ఞశ్చ లోకాదవతాజ్జనాంతాత్ బలో గణాత్ క్రోధవశాదహీంద్రః॥5077॥

8.19 (పందొమ్మిదవ శ్లోకము)

ద్వైపాయనో భగవానప్రబోధాత్ బుద్ధస్తు పాషండగణాత్ ప్రమాదాత్|
కల్కిః కలేః కాలమలాత్ ప్రపాతు ధర్మావనాయోరుకృతావతారః|

8.20 (ఇరువదియవ శ్లోకము)

మాం కేశవో గదయా ప్రాతరన్యాద్ గోవింద ఆసంగవమాత్తవేణుః|
నారాయణః ప్రాహ్ణ ఉదాత్తశక్తిః మధ్యందినే విష్ణురరీంద్రపాణిః॥5079॥

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి షష్ఠస్కంధములోని ఎనిమిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

31.5.2020    సాయంకాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

షష్ఠ స్కంధము - ఎనిమిదవ అధ్యాయము

నారాయణ కవచము

ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

8.21 (ఇరువది ఒకటవ శ్లోకము)

దేవోఽపరాహ్ణే మధుహోగ్రధన్వా సాయం త్రిధామావతు మాధవో మామ్|

దోషీ హృషీకేశ ఉతార్ధరాత్రే నిశీథ ఏకోఽవతు పద్మనాభః॥5080॥

8.22 (ఇరువది రెండవ శ్లోకము)

శ్రీవత్సధామాపరరాత్ర ఈశః ప్రత్యూష ఈశోఽసిధరో జనార్దనః|

దామోదరోఽవ్యాదనుసంధ్యం ప్రభాతే విశ్వేశ్వరో భగవాన్ కాలమూర్తిః॥5081॥

8.23 (ఇరువది మూడవ శ్లోకము)

చక్రం యుగాన్తానల తిగ్మనేమి భ్రమత్ సమంతాద్భగవత్ప్రయుక్తమ్|

దందగ్థి దందగ్ధ్యరి సైన్యమాశు కక్ష్యం యథా వాతసభో హుతాశః॥5082॥

8.24 (ఇరువది నాలుగవ శ్లోకము)

గదేఽశనిస్పర్శనవిస్ఫులింగే నిష్పింఢీ నిష్పింఢ్యజితప్రియాసి|

కూష్మాండవైనాయక యక్షరక్షోభూతగ్రహాంశ్చూర్ణయ చూర్ణయాదీన్॥5083॥

8.25 (ఇరువది ఐదవ శ్లోకము)

త్వం యాతుధానప్రమథ ప్రేతమాతృపిశాచవిప్రగ్రహఘోరదృష్టీన్| 

దరేంద్ర విద్రావయ కృష్ణపూరితో భీమస్వనోఽరేర్హృదయాని కంపయన్॥5084॥

8.26 (ఇరువది ఆరవ శ్లోకము)

త్వం తిగ్మధారాసివరారిసైన్యమ్ ఈశప్రయుక్తో మమ ఛింధి ఛింధి|

చక్షూంషి చర్మన్ శతచంద్ర ఛాదయ ద్విషామఘోనాం హర పాపచక్షుషామ్॥5085॥

8.27 (ఇరువది ఏడవ శ్లోకము)

యన్నో భయం గ్రహేభ్యోఽభూత్కేతుభ్యో నృభ్య ఏవ చ|

సరీసృపేభ్యో దంష్ట్రిభ్యో భూతేభ్యోఽంహోభ్య ఏవ వా॥5086॥

8.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)

సర్వాణ్యేతాని భగవన్నామరూపాస్త్రకీర్తనాత్|

ప్రయాంతు సంక్షయం సద్యో యే నః శ్రేయః ప్రతీపకాః॥5087॥

8.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)

గరుడో భగవాన్ స్తోత్రస్తోభశ్ఛందోమయః ప్రభుః|

రక్షత్వశేషకృఛ్రేభ్యో విష్వక్సేనః స్వనామభిః॥5088॥

8.30 (ముప్పదియవ శ్లోకము)

సర్వాపద్భ్యో హరేర్నామరూపయానాయుధాని నః|

బుద్ధీంద్రియమనః ప్రాణాన్ పాంతు పార్షదభూషణాః॥5089॥

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి షష్ఠస్కంధములోని ఎనిమిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

1.6.2020    ప్రాతఃకాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

షష్ఠ స్కంధము - ఎనిమిదవ అధ్యాయము

నారాయణ కవచము

ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

8.31 (ముప్పది ఒకటవ శ్లోకము)

యథా హి భగవానేవ వస్తుతః సదసచ్చ యత్|

సత్యేనానేన నః సర్వే యాంతు నాశముపద్రవాః॥5090॥

8.32 (ముప్పది రెండవ శ్లోకము)

యథైకాత్మ్యానుభావానాం వికల్పరహితః స్వయమ్|

భూషణాయుధలింగాఖ్యా ధత్తే శక్తీః స్వమాయయా॥5091॥

8.33 (ముప్పది మూడవ శ్లోకము)

తేనైవ సత్యమానేన సర్వజ్ఞో భగవాన్ హరిః|

పాతు సర్వైః స్వరూపైర్నః సదా సర్వత్ర సర్వగః॥5092॥

8.34 (ముప్పది నాలుగవ శ్లోకము)

విదిక్షు దిక్షూర్ధ్వమధః సమంతాత్ అంతర్బహిర్భగవాన్ నారసింహః|

ప్రహాపయల్లోకభయం స్వనేన స్వతేజసా గ్రస్తసమస్తతేజాః॥5093॥

8.35 (ముప్పది ఐదవ శ్లోకము)

మఘవన్నిదమాఖ్యాతం వర్మ నారాయణాత్మకమ్|

విజేష్యస్యఽంజసా యేన దంశితోఽసురయూథపాన్॥5094॥

8.36 (ముప్పది ఆరవ శ్లోకము)

ఏతద్ధారయమాణస్తు యం యం పశ్యతి చక్షుషా|

పదా వా సంస్పృశేత్సద్యః సాధ్వసాత్స విముచ్యతే॥5095॥

8.37 (ముప్పది ఏడవ శ్లోకము)

న కుతశ్చిద్భయం తస్య విద్యాం ధారయతో భవేత్|

రాజదస్యుగ్రహాదిభ్యో వ్యాఘ్రాదిభ్యశ్చ కర్హిచిత్॥5096॥

8.38 (ముప్పది ఎనిమిదవ శ్లోకము)

ఇమాం  విద్యాం పురా కశ్చిత్ ధారయన్ ద్విజః|

యోగధారణయా స్వాంగం జహౌ స మరుధన్వని॥5097॥

8.39 (ముప్పది తొమ్మిదవ శ్లోకము)

తస్యోపరి విమానేన గంధర్వపతిరేకదా|

యయౌ చిత్రరథః స్త్రీభిర్వతో యత్ర ద్విజక్షయః॥5098॥

8.40 (నలుబదియవ శ్లోకము)

గగనాన్న్యపతత్సద్యః సవిమానో  హ్యవాక్ఛిరాః|

స వాలఖిల్యవచనాదస్థీన్యాదాయ విస్మితః|

ప్రాస్య ప్రాచీనరస్వత్యాం స్నాత్వాధామ స్వమన్వగాత్॥5099॥

శ్రీ శుక ఉవాచ

8.41 (నలుబది ఒకటవ శ్లోకము)

య ఇదం శ్రుణుయత్కాలే యో ధారయతి చాదృతః|

తం నమస్యంతి భూతాని ముచ్యతే సర్వతో భయాత్॥5100॥

8.42 (నలుబది రెండవ శ్లోకము)

ఏతాం విద్యామధిగతో విశ్వరూపాచ్ఛతక్రతుః|

త్రైలోక్యలక్ష్మీం బుభుజే వినిర్జిత్య మృధేఽసురాన్॥5101॥

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం షష్ఠస్కంధే అష్టమోఽధ్యాయః (8)

ఇది శ్రీమద్భాగవత మహాపురాణమునందలి షష్ఠ స్కంధమునందు ఎనిమిదవ అధ్యాయము (8)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

30.5.2020    సాయంకాల సందేశము

కార్యకారణరూపమగు ఈ సకలజగత్తు వాస్తవముగా భగవత్స్వరూపమే. ఇట్టి సత్యప్రభావముచే  ఉపద్రవములు అన్నియును నశించిపోవుగాక!

8.32 (ముప్పది రెండవ శ్లోకము)

యథైకాత్మ్యానుభావానాం వికల్పరహితః స్వయమ్|

భూషణాయుధలింగాఖ్యా ధత్తే శక్తీః స్వమాయయా॥5091॥

8.33 (ముప్పది మూడవ శ్లోకము)

తేనైవ సత్యమానేన సర్వజ్ఞో భగవాన్ హరిః|

పాతు సర్వైః స్వరూపైర్నః సదా సర్వత్ర సర్వగః॥5092॥

బ్రహ్మ-ఆత్మల ఏకత్వమును (అద్వైతస్థితిని) అనుభవించిన వారికి వారి దృష్టిలో భగవత్స్వరూపము సమస్త వికార, భేదరహితము. ఐనను, భగవంతుడు తన మాయాశక్తి ద్వారా భూషణములును, ఆయుధములను, నామ, రూపములను,శక్తులను ధరించుచుండును. ఇది నిశ్చయముగా సత్యము. ఈ కారణము వలన సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడైన శ్రీహరి సదా సర్వత్ర అన్ని రూపములతో మమ్ము రక్షించుచుండుగాక!

8.34 (ముప్పది నాలుగవ శ్లోకము)

విదిక్షు దిక్షూర్ధ్వమధః సమంతాత్ అంతర్బహిర్భగవాన్ నారసింహః|

ప్రహాపయల్లోకభయం స్వనేన స్వతేజసా గ్రస్తసమస్తతేజాః॥5093॥

నృసింహభగవానుడు తన భయంకర అట్టహాసముచే జనులు భీతిల్లి పారిపోవునట్లు చేయును. తన దివ్యతేజస్సుతో అందరి తేజస్సులను గ్రహించును. అట్టి శ్రీహరి దశదిశలయందును, పైన, క్రింద, లోపల, వెలుపలను, అంతటను మమ్ము రక్షించుచుండుగాక.

8.35 (ముప్పది ఐదవ శ్లోకము)

మఘవన్నిదమాఖ్యాతం వర్మ నారాయణాత్మకమ్|

విజేష్యస్యఽంజసా యేన దంశితోఽసురయూథపాన్॥5094॥

దేవేంద్రా! నేను నీకు ఈ నారాయణ కవచమును వినిపించితిని. దీనివలన నీవు సురక్షితుడవు అగుదువు. ఇంక నీవు సులభముగా దైత్య సేనాపతులందరిని జయింపగలవు.

8.36 (ముప్పది ఆరవ శ్లోకము)

ఏతద్ధారయమాణస్తు యం యం పశ్యతి చక్షుషా|

పదా వా సంస్పృశేత్సద్యః సాధ్వసాత్స విముచ్యతే॥5095॥

ఈ నారాయణ కవచమును ధరించినవాడు, నేత్రములతో ఎవరిని చూచినను, తన పాదములతో ఎవరిని తాకినను అతడు కూడా వెంటనే సమస్త భయములనుండి విముక్తుడగును.

8.37 (ముప్పది ఏడవ శ్లోకము)

న కుతశ్చిద్భయం తస్య విద్యాం ధారయతో భవేత్|

రాజదస్యుగ్రహాదిభ్యో వ్యాఘ్రాదిభ్యశ్చ కర్హిచిత్॥5096॥

ఈ వైష్ణవీ విద్యను ధరించిన వానిని రాజులవలన, దొంగలవలన, ప్రేత పిశాచాదుల వలన, వ్యాఘ్రాది క్రూరమృగముల వలన ఎట్టి భయమూ ఉండదు.

8.38 (ముప్పది ఎనిమిదవ శ్లోకము)

ఇమాం  విద్యాం పురా కశ్చిత్ ధారయన్ ద్విజః|

యోగధారణయా స్వాంగం జహౌ స మరుధన్వని॥5097॥

దేవేంద్రా! పూర్వకాలమున కౌశిక గోత్రమునకు చెందిన ఒక బ్రాహ్మణుడు ఈ విద్యసు (నారాయణ కవచమును) ధరించి, యోగధారణచే ఒక మరుభూమియందు తన దేహమును త్యజించెను.

8.39 (ముప్పది తొమ్మిదవ శ్లోకము)

తస్యోపరి విమానేన గంధర్వపతిరేకదా|

యయౌ చిత్రరథః స్త్రీభిర్వతో యత్ర ద్విజక్షయః॥5098॥

ఒకప్పుడు గంధర్వరాజైస చిత్రరథుడు, తన స్త్రీలతో గూడి విమానమును అధిష్ఠించి, ఆకాశమున వెళ్ళుచుండెను. ఆ విమానము ఆ విప్రుని శరీరము పడిన చోటునకు మీదుగా వెళ్ళుచుండెను.

8.40 (నలుబదియవ శ్లోకము)

గగనాన్న్యపతత్సద్యః సవిమానో  హ్యవాక్ఛిరాః|

స వాలఖిల్యవచనాదస్థీన్యాదాయ విస్మితః|

ప్రాస్య ప్రాచీనరస్వత్యాం స్నాత్వాధామ స్వమన్వగాత్॥5099॥

అంతట ఆ గంధర్వరాజు విమానముతో గూడ తలక్రిందులుగా భూమిపై బడెను. ఈ సంఘటన ఆయనకు ఆశ్చర్యమును కలిగించెను. వాలఖిల్యమహర్షులు అది నారాయణ కవచమును ధరించిన బ్రాహ్మణుని యొక్క మహత్త్వము అని తెలిపిరి. అప్పుడు ఆ గంధర్వుడు ఆ బ్రాహ్మణోత్తముని అస్థులను తీసికొనిపోయి పూర్వవాహిన ఐన సరస్వతీ నది యందు కలిపెను. పిమ్మట అతడు స్నానమాచరించి తన లోకమునకు వెళ్ళెను.

శ్రీ శుక ఉవాచ

8.41 (నలుబది ఒకటవ శ్లోకము)

య ఇదం శ్రుణుయత్కాలే యో ధారయతి చాదృతః|

తం నమస్యంతి భూతాని ముచ్యతే సర్వతో భయాత్॥5100॥

శ్రీ శుకుడు వచించెను- పరీక్షిన్మహారాజా! ఈ నారాయణ కవచమును ఎప్పుడైనను వినిన వానికి, సాదరముగా దీనిని గ్రహించిన వానికి సకలప్రాణులు గౌరవముగా నమస్కరించును. వారు సమస్త భయముల నుండియు విముక్తులగుదురు.

8.42 (నలుబది రెండవ శ్లోకము)

ఏతాం విద్యామధిగతో విశ్వరూపాచ్ఛతక్రతుః|

త్రైలోక్యలక్ష్మీం బుభుజే వినిర్జిత్య మృధేఽసురాన్॥5101॥

ఇంద్రుడు తన పురోహితుడైన విశ్వరూపుని ద్వారా ఈ నారాయణ కవచము అను విద్యను పొంది, రణభూమియందు అసురులను జయించెను. ముల్లోకములయందలి సంపదలను అనుభవించెను.

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం షష్ఠస్కంధే అష్టమోఽధ్యాయః (8)

ఇది శ్రీమద్భాగవత మహాపురాణమునందలి షష్ఠ స్కంధమునందు ఎనిమిదవ అధ్యాయము (8)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

Friday, 29 May 2020

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం షష్ఠ స్కంధము - ఏడవ అధ్యాయము

28.5.2020    సాయంకాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

షష్ఠ స్కంధము - ఏడవ అధ్యాయము

బృహస్పతి దేవతలను పరిత్యజించుట - దేవతలు విశ్వరూపుని తమ గురువుగా ఎన్నుకొనుట

ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

రాజోవాచ

7.1 (ప్రథమ శ్లోకము)

కస్య హేతోః పరీత్యక్తా ఆచార్యేణాత్మనః  సురాః|

ఏతదాచక్ష్య భగవన్ శిష్యాణామక్రమం గురౌ॥5020॥

పరీక్షిన్మహారాజు పలికెను-మహాత్మా! దేవగురువైన బృహస్పతి తన ప్రియ శిష్యులైన దేవతలను పరిత్యజించుటకు కారణమేమి? దేవతలు ఆయనయెడ చేసిన అపచారమేమి? దయతో తెలుపుము.

శ్రీశుక ఉవాచ

7.2 (రెండవ శ్లోకము)

ఇంద్రస్త్రిభువనైశ్వర్యమదోల్లంఘితసత్పథః|

మరుద్భిర్వసుభీరుద్రైరాదిత్యైరృభుభిర్నృప॥5021॥

7.3 (మూడవ శ్లోకము)

విశ్వేదేవైశ్చ సాధ్యైశ్చ నాసత్యాభ్యాం పరిశ్రితః|

సిద్ధచారణగందర్వైర్మునిభిర్బ్రహ్మవాదిభిః॥5022॥

7.4 (నాలుగవ శ్లోకము)

విద్యాధరాప్సరోభిశ్చ కిన్నరైైః పతగోరగైః|

నిషేవ్యమాణో మఘవాన్ స్తూయమానశ్చ భారత॥5023॥

శ్రీ శుకుడు నుడివెను- ఇంద్రుడు ముల్లోకముల ఐశ్వర్యములను పొందుటచే గర్వితుడయ్యెను. అందువలన ధర్మమర్యాదలను, సదాచారములను ఉల్లంఘింపసాగెను. ఒకానొకనాడు అతడు తనపత్నియైన శచీదేవితో గూడి నిండుసభలో సింహాసనముపై  ఆసీనుడైయుండెను. నలుబది తొమ్మిది మంది మరుద్గణములు, అష్టవసువులు, ఏకాదశరుద్రులు, ద్వాదశ-ఆదిత్యులు, ఋభుగణములు, విశ్వేదేవతలు, సాధ్యులు, అశ్వినీకుమారులు అతనిని సేవించు చుండిరి. సిద్ధులు,  చారణులు, గంధర్వులు, బ్రహ్మవాదులైన మునులు, విద్యాధరులు, అప్సరసలు, కిన్నరులు, పక్షిగణములు, నాగులు అతనిని సేవించుచు స్తుతించుచుండిరి.

7.5 (ఐదవ శ్లోకము)

ఉపగీయమానో లలితమాస్థానాధ్యాసనాశ్రితః|

పాండురేణాతపత్రేణ చంద్రమండలచారుణా॥5023॥

7.6 (ఆరవ శ్లోకము)

యుక్తశ్చాన్యైః పారమేష్ఠ్యైశ్చామరవ్యజనాదిభిః|

విరాజమానః పౌలోమ్యా సహార్ధాసనయా భృశమ్॥5025॥

వారు అందరును మధురమైన స్వరములతో ఇంద్రుని కీర్తించుచుండిరి. చంద్రమండలము వలె సుందరమైన శ్వేతచ్ఛత్రము శోభిల్లుచుండెను. వింజామరలు, వీవనలు మొదలగు మహారాజోచితమైన మర్యాదలు నిర్వహింపబడు చుండెను.

7.7 (ఏడవ శ్లోకము)

స యదా పరమాచార్యం దేవానామాత్మనశ్చ హ|

నాభ్యనందత సంప్రాప్తం ప్రత్యుత్థానాసనాదిభిః॥5026॥

7.8 (ఎనిమిదవ శ్లోకము)

వాచస్పతిం మునివరం సురాసురనమస్కృతమ్|

నోచ్చచాలాసనాదింద్రః పశ్యన్నపి సభాగతమ్॥5027॥

ఆ సమయమున దేవేంద్రాదిదేవతలకు పరమగురువైన బృహస్పతి అచటికి ఏతెంచెను. అతనికి సురాసురులందరునూ నమస్కరింతురు. అయితే, సురాసురులందరకును పూజ్యుడైన బృహస్పతి సభలో ప్రవేశించుటను ఇంద్రుడు చూచెను. ఐనను, అతడు సింహాసనము నుండి లేచుట గాని, గురువును సత్కరించుటగాని చేయక అటుఇటు కదలకుండా కూర్చొనియుండెను.

7.9 (తొమ్మిదవ శ్లోకము)

తతో నిర్గత్య సహసా కవిరాంగిరసః ప్రభుః|

ఆయయౌ స్వగృహం తూష్ణీం విద్వాన్ శ్రీమదవిక్రియామ్॥5028॥

త్రికాలదర్శి, సమర్థుడు ఐన బృహస్పతి, ఇదీ ఐశ్వర్యమద దోషము అని భావించి, వెంటనే అతడు అచటి నుండి మౌనముగా వెను దిరిగి, తన ఇంటికి చేరెను.

7.10 (పదియవ శ్లోకము)

తర్హ్యేవ ప్రతిబుధ్యేంద్రో గురుహేళనమాత్మనః|

గర్హయామాస సదసి స్వయ మాత్మానమాత్మనా॥5029॥

అంతట ఇంద్రుడు తనవలన బృహస్పతికి అవమానము జరిగినదను విషయమును గ్రహించెను. అప్పుడు నిండు సభలో తనను తాను నిందించుకొనసాగెను.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి షష్ఠస్కంధములోని ఏడవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

29.5.2020   ప్రాతః కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

షష్ఠ స్కంధము - ఏడవ అధ్యాయము

బృహస్పతి దేవతలను పరిత్యజించుట - దేవతలు విశ్వరూపుని తమ గురువుగా ఎన్నుకొనుట

ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

7.11 (పదకొండవ శ్లోకము)

అహో బత మయాఽసాధు కృతం వై దభ్రబుద్ధినా|

యన్మయైశ్వర్యమత్తేన గురుః సదసి కాత్కృతః॥5030॥

బృహస్పతికి నిండుసభలో జరిగిన అవమానమునకు దేవేంద్రుడు తనను తానిట్లు నిందించుకొనసాగెను:

అయ్యో! నేడు ఈ నిండుసభలో నేను ఎంతటి అపరాధమొనర్చితిని? ఐశ్వర్యభమదోన్మత్తుడనై మూర్ఖముగ ప్రవర్తించి గురువునెడ తీరని అపరాధమొనర్చితిని. వాస్తవముగా నేను ఇట్లు వ్యవహరించుట మిగుల గర్హణీయము.

7.12 (పండ్రెండవ శ్లోకము)

కో గృధ్యేత్ పండితో లక్ష్మీం త్రివిష్టపపతేరపి|

యయాహమాసురం భావం నీతోఽద్య విబుధేశ్వరః॥5031॥

దేవేంద్రుడు ఇంకను ఇట్లనుకొనుచుండెను:-

బుద్ధిమంతుడైన వాడెవడు ఈ స్వర్గరాజ్య సంపదలను పొందుటకు ఇష్టపడడు. చూడుడు! నేడు ఈ సంపదయే దేవతలకు ప్రభువైన నన్ను గూడ అనుచరులవలె రజోగుణ భావమునకు గురిచేసినది.

7.13 (పదమూడవ శ్లోకము)

యే పారమేష్ఠ్యం ధిషణమధితిష్ఠన్న కంచన|

ప్రత్యుత్తిష్ఠేదితి బ్రూయుర్ధర్మం తే న పరం విదుః॥5032॥

దేవేంద్రుడు ఇంకను ఇట్లనుకొనసాగెను:

'సార్వభౌమ అధికారముతో రాజ్యసభ సింహాసనముపై కూర్చున్న చక్రవర్తి ఎవరు వచ్చిననూ సింహాసనమునుండి లేవగూడదు' అని కొందరు చెప్ఫెదరు. వారు వాస్తవముగా ధర్మస్వరూపమును ఎరుగనివారే.

17.14 (పదునాలుగవ శ్లోకము)

తేషాం కుపథదేష్టౄణాం పతతాం తమసి హ్యధః|

యే శ్రద్దధ్యుర్వచస్తే వై మజ్జంత్యశ్మప్లవా ఇవ॥5033॥

దేవేంద్రుడు ఇంకను ఇట్లనుకొనుచుండెను:-

ఏలయన, ఇట్లు ఉపదేశించువారు జనులను చెడు మార్గములలో తీసికొనిపోవుదురు. అట్టివారు స్వయముగా ఘోర నరకమున పడుదురు. వారి పలుకులను విశ్వసించినవారు రాతిపడవవలె నీటిలో మునిగిపోవుదురు.

7.15 (పదునైదవ శ్లోకము)

అధాఽహమమరాచార్యమగాధధిషణం ద్విజమ్|

ప్రసాదయిష్యే నిశఠః శీర్ష్ణా తచ్చరణం స్పృశమ్॥5034॥

దేవేంద్రుడు ఇంకను ఇట్లనుకొనుచుండెను:-

నా గురువైన బృహస్పతి అగాధమైన జ్ఞానసముద్రుడు. అట్టి వానియెడ నేను గొప్ప అపరాధమొనర్చితిని. ఇప్పుడు నేను ఆ మహాత్ముని పాదములపై వ్రాలి ఆయనను ప్రసన్నుని చేసికొనుటయే నా కర్తవ్యము".

7.16 (పదునారవ శ్లోకము)

ఏవం చింతయతస్తస్య మఘోనో భగవాన్ గృహాత్|

బృహస్పతిర్గతోఽదృష్టాం గతిమధ్యాత్మమాయయా॥5035॥

అని దేవేంద్రుడు ఈ విధముగా అనుకొనుచుండగనే మహాత్ముడైన బృహస్పతి తన ఇంటినుండి వెడలి యోగబలముచే అంతర్హితుడయ్యెను. 

7.17 (పదునేడవ శ్లోకము)

గురోర్నాధిగతః సంజ్ఞాం పరీక్షన్ భగవాన్ స్వరాట్|

ధ్యాయన్ ధియా సురైర్యుక్తః శర్మ నాలభతాత్మనః॥5036॥

దేవేంద్రుడు తన గురువును తాను స్వయముగ వెదకుటయేగాక, ఇతరులచే వెదకించెను. కాని, ఆయన ఆ చూకీ దొరకలేదు. గురువులేకుండా తనకు రక్షణ యుండదని ఇంద్రుడు భావించెను. అంతట ఇతర దేవతలతో గూడి స్వర్గ రక్షణకై తగిన ఉపాయము కొరకై ఆలోచించెను. కాని, వారి నుండి ఎట్టి ఉపాయము లభింపకుండుటచే అతడు అశాంతికి గురియయ్యెను.

7.18  (పదునెనిమిదవ శ్లోకము)

తచ్ఛ్రుత్వైవాసురాః సర్వే ఆశ్రిత్యౌశనసం మతమ్|

దేవాన్ ప్రత్యుద్యమం చక్రుర్దుర్మదా ఆతతాయినః॥5037॥

దేవగురువైన బృహస్పతి దేవతలను వదలివెళ్ళిన సమాచారము దైత్యులకు తెలిసెను. అప్ఫుడు మదోన్మత్తులు, ఆతతాయులు ఐన దైత్యులు శుక్రాచార్యుని ఆదేశానుసారము దేవతలను జయించుటకు ఉద్యమించిరి.

7.19 (పందొమ్మిదవ శ్లోకము)

తైర్విసృష్టేషుభిస్తీక్ష్ణ్-ణ్యైర్నిర్భిన్నాంగోరుబాహవః|

బ్రహ్మాణం శరణం జగ్ముః సహేంద్రా నతకంధరాః॥5038॥

ఆ దైత్యులు దేవతలపై తీవ్రమైన బాణములను వర్షింపజేసి, వారి మస్తకములు, ఊరువులు, బాహువులు మొదలగు అంగములను భేదింపసాగిరి. అప్పుడు ఇంద్రాదిదేవతలు వినమ్రులై బ్రహ్మదేవుని శరశుజొచ్చిరి.

7.20 (ఇరువదియవ శ్లోకము)

తాంస్తథాభ్యర్ధితాన్ వీక్ష్య భగవానాత్మభూరజః|

కృపయా పరయా దేవ ఉవాచ పరిసాంత్వయన్॥5039॥

సర్వసమర్థుడు, స్వయంభువు ఐన బ్రహ్మదేవుడు వాస్తవముగ దేవతలకు దుర్దశ ఏర్పడినదని గ్రహించెను. అందుకు అతని హృదయము దయార్ద్రమయ్యెను. అంతట దేవతలకు ధైర్యము గొలుపుటకై అతడు ఇట్లు పలికెను.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి షష్ఠస్కంధములోని ఏడవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

29.5.2020    సాయంకాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

షష్ఠ స్కంధము - ఏడవ అధ్యాయము

బృహస్పతి దేవతలను పరిత్యజించుట - దేవతలు విశ్వరూపుని తమ గురువుగా ఎన్నుకొనుట

ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

బ్రహ్మోవాచ

7.21 (ఇరువది ఒకటవ శ్లోకము)

అహో బత సురశ్రేష్డా హ్యభద్రం వ కృతం మహత్|

బ్రహ్మిష్ఠం బ్రాహ్మణం దాంతమైశ్వర్యాన్నాభ్యనందత॥5040॥

7.22 (ఇరువది రెండవ శ్లోకము)

తస్యాయమనయస్యాసీత్ పరేభ్యో వః పరాభవః|

ప్రక్షీణేభ్యః స్వవైరిభ్యః సమృద్ధానాం చ యత్సురాః॥5041॥

బ్రహ్మదేవుడు ఇట్లనెను- దేవతలారా! వాస్తవముగా మీరు గొప్ప తప్పుపని చేసితిరి. ఐశ్వర్యమదముచే కన్ను మిన్ను గానక బ్రహ్మజ్ఞాని జితేంద్రియుడు ఐన బ్రాహ్మణశ్రేష్ఠుని నిరాదరించితిరి. ఇది మిగుల శోచనీయము. మీరొనర్చిన అపరాధమునకు ఇది ఫలితము. మీరు సంపదలతో తులతూగుచున్నను దుర్భలులైన శత్రువులచే పరాభవమును ఎదుర్కొనవలసి వచ్చినది.

7.23 (ఇరువది మూడవ శ్లోకము)

మఘవన్ ద్విషతః పశ్య ప్రక్షీణాన్ గుర్వతిక్రమాత్|

సంప్రత్యుపచితాన్ భూయః కావ్యమారాధ్య భక్తితః|

ఆదదీరన్ నిలయనం మమాపి భృగుదేవతాః॥5042॥

7.24 (ఇరువది నాలుగవ శ్లోకము)

త్రివిష్టపం కిం గణయంత్యభేద్యమంత్రా భృగూణామనుశిక్షితార్థాః|

న విప్రగోవిందగవీశ్వరాణాం భవంత్యభద్రాణి నరేశ్వరాణామ్॥5043॥

ఇంద్రా! చూడుము. నీ శత్రువులు గూడ మొదట తమకు గురువైన శుక్రాచార్యుని అవమాన పరచినందులకు మిక్కిలి బలహీనులైరి. కాని భక్తి భక్తిభావముతో అతనిని ఆరాధించి ధనముతోను, బలముతోను తులతూగిరి. శుక్రుని తమ ఆరాధ్యదైవముగా భావించునట్టి ఈ దైత్యులు కొలది దినములలో నా బ్రహ్మలోకములను గూడ ఆక్రమించెదరని నాకు తోచుచున్నది. భృగువంశీయులు వీరికి అర్థశాస్త్రమునందు పూర్తిగ శిక్షణను ఇచ్చినది. వారి పన్నాగములను త్రిప్పికొట్టు మార్గములు మీకు గూడ తెలియవు. అవి చాల గుప్తముగా ఉండును. ఇట్టి స్థితిలో స్వర్గమునే గాదు, వారు ఏ లోకమునైనను జయింపగలరు. బ్రాహ్మణులను, గోవిందుని, గోవులను తమ సర్వస్వముగా భావించెడు రాజులకు ఎన్నిటికినీ, అశుభము కలుగదు.

7.25 (ఇరువది ఐదవ శ్లోకము)

తద్విశ్వరూపం భజతాశు విప్రం తపస్వినం త్వాష్ట్రమథాత్మవంతమ్|

సభాజితోఽర్థాన్  స విధాస్యతే వో యది క్షమిష్యధ్వమూతాస్య కర్మ॥5044॥

కనుక, ఇప్పుడు మీరు వెంటనే త్వష్టపుత్రుడైన విశ్వరూపునికడకేగి, ఆయనను సేవింపుడు. అతడు విప్రోత్తముడు, తపస్సంపన్నుడు, జితేంద్రియుడు. కాని, అతని తల్లి అసురకులమునకు చెందినది. కనుక, మీరు అసురులను ప్రేమతో క్షమింఛి, అతనిని గౌరవించినచో, అతడు మీకార్యమును నెరవేర్చగలడు.

శ్రీ శుక ఉవాచ

త ఏవముదితా రాజన్ బ్రహ్మణా విగతజ్వరాః|

ఋషిం త్వాష్ట్రముపవ్రజ్య పరిష్వజ్యేదమబ్రువన్॥5045॥

శ్రీ శుకుడు పలికెను- పరీక్షిన్మహాజా! బ్రహ్మదేవుడు ఈ విధముగ సూచించిన పిమ్మట దేవతలకు చింతతొలగి ధైర్యము వచ్చెను. వెంటనే వారు విశ్వరూపమహర్షి కడకేగి, ఆయనను అక్కున జేర్చుకొని ఇట్లు నుడివిరి.

దేవా ఊచుః

7.27 (ఇరువది ఏడవ శ్లోకము)

వయం తేఽతిథయః ప్రాప్తా ఆశ్రమం భద్రమస్తు తే|

కామః సంపాద్యతాం తాత పితౄణాం సమయోచితః॥5046॥

దేవతలు ఇట్లనిరి- నాయనా! విశ్వరూపా! నీకు శుభమగుగాక! మేము నీ ఆశ్రమమునకు అతిథులమై వచ్చితిమి. ఒక విధముగా మేము నీకు పితృతుల్యులము. కనుక సమయోచితమైన మా అభిలాషను నెరవేర్చుము.

7.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)

పుత్రాణాం హి పరో ధర్మః పితృ శుశ్రూణం సతామ్|

అపి పుత్రవతాం బ్రహ్మన్ కిముత బ్రహ్మచారిణామ్॥5047॥

బ్రాహ్మణోత్తమా! సంతానవంతులైన సత్పుత్రులు తమ తల్లిదండ్రులసు, ఇతర గురుజనులను సేవించుటయే పరమధర్మమని భావింతురు. ఇక బ్రహ్మచారిగా ఉన్న నీ విషయము చెప్పనేల?

7.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)

ఆచార్యో బ్రహ్మణో మూర్తిః పితా మూర్తిః ప్రజాపతే|

భ్రాతా మరుత్పతేర్మూర్తిర్మాతా సాక్షాత్ క్షితేస్తనుః॥5048॥

7.30 (ముప్పదియవ శ్లోకము)

దయాయా భగినీ మూర్తిర్ధర్మస్యాత్మాతిథిః స్వయమ్|

అగ్నేరభ్యాగతో మూర్తిః సర్వభూతాని చాత్మనః॥5049॥

గురువు వేదస్వరూపుడు. తండ్రి బ్రహ్మదేవుని వంటివాడు. సోదరుడు ఇంద్రునితో సమానము. ఇంక తల్లి సాక్షాత్తు భూదేవి స్వరూపము. చెల్లెలు దయామూర్తి. అతిథి, సాక్షాత్తు ధర్మమూర్తియే. అభ్యాగతుడు అగ్నితో సమానుడు. జగత్తునందలి సకల ప్రాణులు ఆత్మ స్వరూపులే.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి షష్ఠస్కంధములోని ఏడవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

30.5.2020    ప్రాతః కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

షష్ఠ స్కంధము - ఏడవ అధ్యాయము

బృహస్పతి దేవతలను పరిత్యజించుట - దేవతలు విశ్వరూపుని తమ గురువుగా ఎన్నుకొనుట

ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

7.31 (ముప్పది ఒకటవ శ్లోకము)

తస్మాత్పితౄణామార్తానామార్తిం పరపరాభవమ్|

తపసాపనయంస్తాత సందేశం కర్తుమర్హసి॥5050॥

నాయనా! విశ్వరూపా! మేము నీకు పితృసమానులము. ఇప్పుడు శత్రువులు మమ్ము జయించిరి. మేము ఆపదలపాలైయున్నాము నీవు నీ తపోబలముతో మా దుఃఖమును, దారిద్ర్యమును, పరాజయమును పారద్రోలుము. మా అభిప్రాయమును ఆలకించి, మాకు మేలు చేయుము.

7.32 (ముప్పది రెండవ శ్లోకము)

వృణీమహే త్వోపాధ్యాయం బ్రహ్మిష్ఠం బ్రాహ్మణం గురుమ్|

యథాఽంజసా విజేష్యామః సపత్నాంస్తవ తేజసా॥5051॥

నీవు బ్రహ్మనిష్ఠాపరుడవైన (వేదధర్మజ్ఞుడవైన) విప్రవరుడవు. కావున, జన్మతః మాకు గురుడవు. నిన్ను మేము మా ఆచార్యునిగా ఎన్నుకొనుచున్నాము. నీ తపోబలముతో మేము సులభముగ మా శత్రువులపై విజయమును సాధింపగలము.

7.33 (ముప్పది మూడవ శ్లోకము)

న గర్హయంతి హ్యర్థేషు యవిష్ఠాంఘ్ర్యభివాదనమ్|

చందోభ్యోఽన్యత్ర న బ్రహ్మన్ వయో జైష్ఠ్యస్య కారణమ్॥5052॥

మహాత్మా! సందర్భమును బట్టి తమకంటెను చిన్నవారిపదములకు నమస్కరించుట తప్పుగాదని విజ్ఞులందురు. పెద్దరికము వయస్సునుబట్టిగాక వేదజ్ఞానముబట్టి నిర్ణయింపవలెను. కావున, వయస్సునుబట్టి పెద్దరికము లభింపదు. నీవు వేదజ్ఞానసంపన్నుడవు ఐనందున, మా అందరికి నీవు పెద్దవాడవు ఐతివి.

ఋషిరువాచ

7.34 (ముప్పది నాలుగవ శ్లోకము)

అభ్యర్థితః సురగణైః పౌరోహిత్యే మహాతపాః|

స విశ్వరూపస్తానాహ ప్రహసన్ శ్లక్ష్ణయా గిరా॥5053॥

శ్రీశుకుడు వచించెను- మహారాజా! దేవతలు ఈ విధముగా విశ్వరూపుని తమకు పురోహితునిగా ఉండుమని ప్రార్థించిరి. అప్పుడు పరమతపస్వియైన విశ్వరూపుడు ప్రసన్నుడై వారితో ప్రియముగా, మధురముగా ఇట్లనెను-

విశ్వరూప ఉవాచ

7.35 (ముప్పది ఐదవ శ్లోకము)

విగర్హితం ధర్మశీలైర్బ్రహ్మవర్చ ఉపవ్యయమ్|

కథం ను మద్విధో నాథా లోకేశైరభియాచితమ్|

ప్రత్యాఖ్యాస్యతి తచ్ఛిష్యః స ఏవ స్వార్ధ ఉచ్యతే॥5054॥

విశ్వరూపుడు పలికెను "పెద్దలారా! పౌరోహిత్యము బ్రహ్మతేజస్సును క్షీణింప జేయును. కనుక, అది గర్హింపదగినది అని ధర్మజ్ఞులు నుడువుదురు. కాని, మీరు నాకు పితృతుల్యులు, లోకపాలురు. ఐనను, మీరు నన్ను పురోహితునిగా ఉండుమని వేడుకొనుచున్నారు. ఇట్టి స్థితిలో నా వంటి వాడు మీ కోరికను ఎట్లు తిరస్కరింపగలడు? నేను మీ సేవకుడను. మీ ఆజ్ఞను పాటించుటయే నా ధర్మము.

7.36 (ముప్పది ఆరవ శ్లోకము)

అకించనానాం హి ధనం శిలోంఛనం తేనేహ నిర్వర్తితసాధుసత్క్రియః|

కథం విగర్హ్యం ను కరోమ్యధీశ్వరాః పౌరోధసం హృష్యతి యేన దుర్మతిః॥5055॥

దేవతలారా! మేము అకించనులము. పొలములో పైర్లు కోసిన పిదప రాలిన ధాన్యములను ఏరుకొందుము. దానితో దేవకార్యమును, పితృకార్యమును ఆచరించుచుందుము. ఆ విధముగా శిలోంఛవృత్తితో జీవితమును గడుపునట్టి నేను నింద్యమగు పౌరోహిత్యమును ఎట్లు చేయగలను? అట్టి వృత్తిచే సంతోషించువారు బుద్ధిహీనులు.

7.37 (ముప్పది ఏడవ శ్లోకము)

తథాపి న ప్రతిబ్రూయాం గురుభిః ప్రార్థితం కియత్|

భవతాం ప్రార్థితం సర్వం ప్రాణైరర్థైశ్చ సాధయే॥5056॥

ఐనను, నేను మీ కోరికను తిరస్కరింపజాలను. మీ ప్రార్థన మిగుల స్వల్పమైనది. నా ప్రాణమును, తపోబలమును ఒడ్డియైనను మీ మనోరథమును నెరవేర్చెదను".

శ్రీ శుక ఉవాచ

తేభ్య ఏవం ప్రతిశ్రుత్య విశ్వరూపో మహాతపాః|

పౌరోహిత్యం వృతశ్చక్రే పరమేణ సమాధినా॥5057॥

శ్రీ శుకుడు పలికెను- పరీక్షిన్మహారాజా! మహాతపస్వియైన  విశ్వరూపుడు దేవతలకు ఇట్లు ప్రతిజ్ఞ చేసి, వారిప్రార్థన మేరకు పౌరోహిత్య వృత్తిని చేపట్టెను. మిక్కిలి ఏకాగ్రతతో తన వృత్తిధర్మమును నెరవేర్చెను.

7.39 (ముప్పది తొమ్మిదవ శ్లోకము)

సురద్విషాం శ్రియం గుప్తామౌ శనస్యాపి విద్యయా|

ఆచ్ఛిద్యాదాన్మహేంద్రాయ వైష్ణవ్యా విద్యయా విభుః॥5058॥

శుక్రాచార్యుడు తన నీతి బలముతో అసురుల సంపదను సురక్షితముగా భద్రపరచెను. ఐనను, సర్వసమర్థుడైన విశ్వరూపుడు తన వైష్ణవ విద్య (నారాయణ కవచ) ప్రభావముచే ఆ సంపదలను మరల గ్రహించి, దేవేంద్రునకు అప్పగించెను.

7.40 (నలుబదియవ శ్లోకము)

యయా గుప్తః సహస్రాక్షో జిగ్యేఽసురచమూర్విభుః|

తాం ప్రాహ స మహేంద్రాయ విశ్వరూప ఉదారధీః॥5059॥

రాజా! ఉదారశీలుడైన విశ్వరూపుడు ఆ వైష్ణవి విద్యను దేవేంద్రునకు బోధించెను. తత్ప్రభావమున వేయికన్నుల వేల్పుడగు దేవేంద్రుడు అసురసైన్యములపై విజయమును సాధించెను.

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం షష్ఠస్కంధే సప్తమోఽధ్యాయః (7)

ఇది శ్రీమద్భాగవత మహాపురాణమునందలి షష్ఠ స్కంధమునందు ఏడవ అధ్యాయము (7)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

Tuesday, 26 May 2020

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం షష్ఠ స్కంధము - ఆరవ అధ్యాయము

షష్ఠ స్కంధము - ఆరవ అధ్యాయము
దక్షప్రజాపతి యొక్క అరువది మంది పుత్రికల వంశవర్ణనము
ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
శ్రీ శుక ఉవాచ
శ్రీ శుకుడు వచించెను- పరీక్షిన్మహారాజా! పిమ్మట బ్రహ్మదేవుడు దక్ష ప్రజాపతిని మిగుల ఊరడించెను. దక్షుని వలన తన భార్యయైన అసిక్ని యందు అరువదిమంది కుమార్తెలు కలిగిరి. వారు అందరును తమ తండ్రి మీద మిగుల అనురాగము కలిగియుండిరి.

దక్షప్రజాపతి వారిలో పదిమంది కన్యలను ధర్మునకును, పదముగ్గురిని కశ్యపునకును, ఇరువది ఏడుగురిని చంద్రునకును, ఇద్దరిని భూతునకును, ఇరువురిని అంగిరసునకును, ఇద్దరిని కృశాశ్వునకును, మిగిలిన నలువురిని తార్ క్ష్యుడు అను పేరుగల కశ్యపునకును ఇచ్చి వివాహములు చేసెను. 

మహారాజా! ఈ దక్షకన్యల పేర్లను, వారికి కలిగిన సంతానము యొక్క పేర్లను వినుము. వీరికి కలిగిన వంశపరంపరయే ముల్లోకములయందును వ్యాపించినది.

ధర్మునియొక్క పదిమంది భార్యల పేర్లు భాను, లంబ, కకుభ, జామి, విశ్వ, సాధ్య, మరుత్వతి, వసు, ముహూర్త, సంకల్ప అనునవి - ఇంక వీరి పుత్రుల పేర్లను వినుము.

మహారాజా! భాను అను నామెకు దేవఋషభుడు కలిగెను. అతనికి ఇంద్రసేనుడు జన్మించెను. లంబ అను నామె పుత్రుడు విద్యోతుడు. అతనికి మేఘగణములు జన్మించెను.

కకుభునకు సంకటుడు, అతనికి కికటుడు జన్మించిరి. కికటునకు భూతలమునందలి సకల దుర్గముల అభిమానదేవతలు జన్మించిరి. జామి అను నామె పుత్రుడు స్వర్గుడు, అతనికి నంది అను సుతుడు జన్మించెను.

విశ్వ అనునామెకు విశ్వదేవతలు కలిగిరి. వారికి ఎట్టి సంతానమూ లేకుండెను. సాధ్య అను నామెకు సాధ్యగణములు జన్మించిరి. వారి పుత్రుడు, అర్థసిద్ధి.

మరుత్వతి అను నామెకు మరుత్వంతుడు, జయంతుడు అను ఇద్దరు తనయులు కలిగిరి. జయంతుడు వాసుదేవుని అంశము. అతనిని జనులు ఉపేంద్రుడు అనియు వ్యవహరింతురు.

ముహూర్త అను నామెకు ముహూర్తాభిమాన దేవతలు కలిగిరి. వారు ఆయా ముహూర్తములయందు జీవులకు వారి, వారి కర్మలను అనుసరించి, ఫలములను ఇచ్చుచుందురు.

సంకల్ప అను నామెకు ఎనిమిది మంది వసువులు జన్మించిరి. ద్రోణుడు, ప్రాణుడు, ధ్రువుడు, అర్కుడు, అగ్ని, దోషుడు, వసువు, విభావసువు అనువారు వసుకుమారులు. ద్రోణుని పత్ని పేరు అభిమతి. ఆమె యందు హర్ష, శోక, భయాదులు అభిమాన దేవతలు ఉదయించిరి.

ప్రాణుని భార్య ఉర్జస్వతి, ఆమెయందు సహుడు, ఆయువు, పురోజవుడు అను మువ్వురు కుమారులు కలిగిరి. ధ్రువుని పత్నియైస ధరణి యందు పెక్కు నగరముల అభిమాన దేవతలు జన్మించిరి.

అర్కుని భార్య వాసన. ఆమెకు తర్షుడు(తృష్ణ) మొదలగువారు కలిగిరి. అగ్ని అను పేరుగల వసువు యొక్క పత్ని ధార. ఆమె యందు ద్రవిణకుడు మొదలగు పెక్కుమంది కలిగిరి.

కృత్తిక పుత్రుడగు స్కంధుడు గూడ అగ్ని వలననే జన్మించెను. అతనికి విశాఖుడు మొదలగువారు కలిగిరి. దోషుని పత్ని శర్వరి. ఆమె యందు శిశుమారుడు జన్మించెను. అతడు భగవంతుని కలావతారము.

వసువు యొక్క పత్నియైన అంగిరసి యందు శిల్పకళకు అధిపతియైస విశ్వకర్మ జన్మించెను. విశ్వకర్మ భార్యయైన కృతి యందు చాక్షుష మనువు కలిగెను. అతనికి విశ్వేదేవతలు, సాధ్యగణములు కలిగిరి.

విభావసుని పత్నియైన ఉష యందు వ్యుష్టుడు, రోచిషుడు, ఆతపుడు జన్మించిరి. వారిలో ఆతపునకు పంచయాముడు (దినము) అను పుత్రుడు కలిగెను. అతని వలననే సకల జీవులు తమ తమ కార్యముల యందు నిమగ్నులగుదురు.

దక్షుని కూతురు, భూతుని భార్యయగు సరూప యందు కోట్లకొలది రుద్రగణములు జన్మించెను. వారిలో రైవతుడు, అజుడు, భవుడు, భీముడు, వాముడు, ఉగ్రుడు, వృషాకపి, అజైకపాదుడు, అహిర్బుధ్న్యుడు, బహురూపుడు, మహంతుడు అను పదకొండుమంది ముఖ్యులు, భూతుని రెండవభార్యయైన భూతయందు భయంకరుడై, భూతుడు, వినాయకుడు మున్నగువారు జన్మించిరి. వీరు అందరు పదకొండుమంది రుద్రులలో ముఖ్యుడైన మహంతునకు పార్షదులైరి.

ప్రజాపతియైన అంగిరసుని మొదటిభార్య పేరు స్వధ, ఆమె పితృగణములకు జన్మనిచ్చెను. రెండవ భార్యయైన సతి అధర్వాంగిరసము అను వేదమునే పుత్రరూపమున స్వీకరించెను.

కృశాశ్వుని భార్యయగు అర్చి యందు ధూమ్రకేశుడు అనువాడు జన్మించెను. రెండవ భార్యయగు ధిషణకు వేదశిరుడు, దేవలుడు, వయునుడు, మనువు అను నల్వురు పుత్రులు కలిగిరి.

తార్ క్ష్యుడు అను పేరుగల కశ్యపునకు వినత, కద్రువ, పతంగి, యామిని అను నలుగురు భార్యలుండిరి. పతంగి అను నామెకు పక్షులు జన్మించెను. యామినికి శలభములు (మిడుతలు) జన్మించెను.  

వినతయందు గరుత్మంతుడు ఉదయించెను. అతడు శ్రీమహావిష్ణువునకు వాహనమయ్యెను. వినత యొక్క రెండవ కుమారుడైన అనూరుడు సూర్యభగవానునికి సారథి అయ్యెను. కద్రువవలన అనేక నాగులు ఉత్పన్నమయ్యెను.

పరీక్షిన్మహారాజా! కృత్తిక మొదలగు ఇరువదియేడు మంది నక్షత్రాభిమాన దేవతలు చంద్రుని భార్యలైరి. చంద్రుడు రోహిణిపై ఇతర పత్నులకంటె ఎక్కువ మక్కువ కలిగియుండెను. ఆకారణముగా దక్షుడు అతనిని శపించగా అతడు క్షయరోగ పీడితుడయ్యెను. అతనికి ఎట్టి సంతానమూ కలుగకుండెను.

చంద్రుడు దక్షుని ప్రసన్నునిగా చేసికొనుట వలన కృష్ణపక్షము అతని కళలు క్షీణించుచుండునట్లుగను, శుక్లపక్షమునందు ఆయనకళలు వృద్ధి చెందుచుండునట్లుగను వరమును పొందెను. కాని, నక్షత్రాభి మానదేవతలలో ఎవ్వరి యందును అతని వలన సంతానము కలుగకుండెను. ఇప్పుడు కశ్యపప్రజాపతియొక్క పత్నుల పేర్లను వినుము - వారందరును శుభంకరులు, లోకమునకు తల్లుల వంటివారు; వారి వలననే ఈ జగత్తు అంతయు సృష్టింపబడినది. వారిపేర్లు అదితి, దితి, దనువు, కాష్ఠ, అరిష్ట, సురస, ఇల, ముని, క్రోధవశ, తామ్ర, సురభి, సరమ, తిమి అనువారు. తిమియందు జలచర జంతువులు, సరమయందు పులులు మొదలగు హింసించు జంతువులు ఉత్పన్నమాయెను.

సురభియందు గోవులు, ఎద్దులు ఇంకను, రెండు గిట్టలు గల ఇతర పశువులు జన్మించెను. తామ్ర అను నామెకు రాబందులు, గ్రద్దలు మొదలగు వేటాడు పక్షులు కలిగెను. ముని అను నామెకు అప్సరసలు జన్మించిరి.

క్రోధవశకు పాములు, త్రేళ్ళు మొదలగు విషజంతువులు కలిగెను. ఇల అను నామెకు వృక్షములు, లతలు మొదలగునవియును, భూమియందు ఉత్పన్నములగు వసస్పతులు ఉదయించెను. సురస అను నామెకు యాతుధానులు (రాక్షసులు) జన్మించిరి.

అరిష్టయందు గంధర్వులు, కాష్టయందు గుర్రములు, మొదలగు ఒక్క గిట్టగల పశువులు జన్మించెను. దనువునకు అరువదియొక్క పుత్రులు జన్మించిరి. వారిలో ముఖ్యులైనవారి పేర్లను వినుము-

ద్విమూర్ధుడు, శంబరుడు, అరిష్టుడు, హయగ్రీవుడు, విభావసుడు, అయోముఖుడు, శంకుశిరుడు, స్వర్భానుడు, కపిలుడు, అరుణుడు, పులోముడు, వృషపర్వుడు, ఏకచక్రుడు, అనుతాపనుడు, ధూమ్రకేతుడు, విరూపాక్షడు, విప్రచిత్తి, దుర్జయుడు అనువారు కలిగిరి.

స్వర్భానుయొక్క కుమార్తెయైన సుప్రభకు సుముచియను వానితో వివాహమయ్యెను. వృషపర్వుని కూతురైన శర్మిష్ఠను నహుషనందనుడు, మహాబలవంతుడైన యయాతి వివాహమాడెను.

దనువు పుత్రుడైన వైశ్వానరునకు అందమైన నలువురు కుమార్తెలు గలిగిరి. వారిపేర్లు ఉపదానవి, హయశిర, పులోమ, కాలక.

ఉపదానవిని హిరణ్యాక్షుడు, హయశిరను క్రతువు పెండ్లియాడిరి. బ్రహ్మదేవుని ఆజ్ఞ మేరకు కశ్యపప్రజాపతి, వైశ్వానరుని కుమార్తెలైన పులోమను, కాలకను పెండ్లియాడెను. వారి యందు పౌలోములు, మరియు కాలకేయులు అను పేరుగల అరువదివేలమంది దానవులు కలిగిరి. వారు గొప్ప యుద్ధవీరులు. వారే నివాత కవచులు అను పేర్లతో  ప్రసిద్ధి చెందిరి. వారు యజ్ఞకార్యములకు విఘ్నములను కలిగించుచుండిరి. కనుక, పరీక్షిన్మహారాజా! మీ తాతయైన అర్జునుడు ఒక్కడే ఇంద్రునకు ప్రియమును గూర్చుటకై వారిని వధించెను. ఆ సమయమున అర్జునుడు స్వర్గమునందు ఉండెను.

విప్రచిత్తి పత్నియైన సింహికయందు నూట ఒక్క మంది పుత్రులు ఉదయించిరి. వారిలో జ్యేష్ఠుడు రాహువు. అతడు గ్రహములలో ఒకడుగా లెక్కింపబడెను. మిగిలిన వందమంది పుత్రులు కేతువులుగా వ్యవహరింపబడిరి.

రాజా! ఇప్పుడు క్రమముగా అదితి యొక్క వంశపరంపరను గూర్చి వినుము- ఈ వంశమునందు సర్వవ్యాపకుడు, దేవాదిదేవుడు ఐన శ్రీమన్నారాయణుడు తన అంశతో వామనరూపమున అవతరించెను.

అదితికి వివస్వంతుడు, అర్యముడు, పూష, త్వష్ట, సవిత, భగుడు, ధాత, విధాత, వరుణుడు, మిత్రుడు, ఇంద్రుడు, త్రివిక్రముడు (వామనుడు) అను పుత్రులు ఉదయించిరి. ఈ పన్నెండు మంది ఆదిత్యులు అని వ్యవహరింపబడిరి.

వివస్వంతుని పత్నియైన సంజ్ఞ మహాభాగ్యశాలిని. ఆమెయందు శ్రాద్ధదేవుడు (వైవస్వతుడు) అనుమనువు, ఇంకను, యముడు, యమున అను కవలలు జన్మించిరి. సంజ్ఞయే గుర్రము రూపమును ధరించి, సూర్యభగవానుని ద్వారా భూలోకముస అశ్వినీకుమారులు అను ఇరువురికి జన్మనిచ్చెను.

వివస్వంతుని రెండవ భార్య ఫేరు ఛాయ. ఆమె యందు శనైశ్చరుడు సావర్ణి అను మనువు, తపతి యను కూతురు జన్మించిరి. తపతి సంవరణుని భార్యయయ్యెను.

అర్యముని పత్ని మాతృక, ఆమె యందు చర్షణులు అను పుత్రులు గలిగిరి. వారు కర్తవ్య-అకర్తవ్య అను జ్ఞానము గలవారు. అందువలన బ్రహ్మదేవుడు వారిని ఆధారముగా చేసికొని బ్రాహ్మణాది వర్ణములను ఏర్పరచెను.

పూషకు సంతానము లేకుండెను. పూర్వకాలమున పరమశివుడు దక్షునిపై కుపితుడైనప్ఫుడు పూష వికృతముగానవ్వెను. అందు వలన వీరభద్రుడు అతని పండ్లూడగొట్టెను. అప్పటి నుండి పూష పిండిని ఆహారముగా తీసికొనసాగెను.

త్వష్టుని భార్య పేరు రచన. ఆమె దైత్యుల చెల్లెలు. రచనకు సన్నివేశుడు, పరాక్రమశాలియైన విశ్వరూపుడు అను ఇద్దరు కుమారులు కలిగిరి.

ఒకానొకప్పుడు దేవగురువైన బృహస్పతి ఇంద్రునిచే అవమానింపబడి దేవతలను పరిత్యజించెను. అప్ఫుడు దేవతలు  దైత్యులకు మేనల్లుడాయెనని విశ్వరూపుని తమకు పురోహితునిగా చేసికొనిరి.

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం షష్ఠస్కంధే షష్డోఽధ్యాయః (6)

ఇది శ్రీమద్భాగవత మహాపురాణమునందలి షష్ఠ స్కంధమునందు ఆరవ అధ్యాయము (6)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

27.5.2020    ప్రాతః కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

షష్ఠ స్కంధము - ఆరవ అధ్యాయము

దక్షప్రజాపతి యొక్క అరువది మంది పుత్రికల వంశవర్ణనము

ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

శ్రీ శుక ఉవాచ

6.1 (ప్రథమ శ్లోకము)

తతః ప్రాచేతసోఽసిక్న్యా మనునీతః స్వయంభువా|

షష్టిం సంజనయామాస దుహితౄః  పితృవత్సలాః॥4975॥

శ్రీ శుకుడు వచించెను- పరీక్షిన్మహారాజా! పిమ్మట బ్రహ్మదేవుడు దక్ష ప్రజాపతిని మిగుల ఊరడించెను. దక్షుని వలన తన భార్యయైన అసిక్ని యందు అరువదిమంది కుమార్తెలు కలిగిరి. వారు అందరును తమ తండ్రి మీద మిగుల అనురాగము కలిగియుండిరి.

6.2 (రెండవ శ్లోకము)

దశ ధర్మాయ కాయేంధోః ద్విషట్ త్రిణవ దత్తవాన్|

భూతాంగిరః కృశాశ్వేభ్యో ద్వే ద్వే తార్ క్ష్యాయ చాపరాః॥4976॥

దక్షప్రజాపతి వారిలో పదిమంది కన్యలను ధర్మునకును, పదముగ్గురిని కశ్యపునకును, ఇరువది ఏడుగురిని చంద్రునకును, ఇద్దరిని భూతునకును, ఇరువురిని అంగిరసునకును, ఇద్దరిని కృశాశ్వునకును, మిగిలిన నలువురిని తార్ క్ష్యుడు అను పేరుగల కశ్యపునకును ఇచ్చి వివాహములు చేసెను. 

6.3 (మూడవ శ్లోకము)

నామధేయాన్యమూషాం త్వం సాపత్యానాం చ మే శృణు|

యాసాం ప్రసూతిప్రసవైర్లోకా ఆపూరితాస్త్రయః॥4977॥

మహారాజా! ఈ దక్షకన్యల పేర్లను, వారికి కలిగిన సంతానము యొక్క పేర్లను వినుము. వీరికి కలిగిన వంశపరంపరయే ముల్లోకములయందును వ్యాపించినది.

6.4 (నాలుగవ శ్లోకము)

భానుర్లంబా కకుబ్జామిర్విశ్వా సాధ్యా మరుత్వతీ|

వసుర్ముహూర్తా సంకల్పా ధర్మపత్న్యం సుతాన్ శృణు॥4978॥

ధర్మునియొక్క పదిమంది భార్యల పేర్లు భాను, లంబ, కకుభ, జామి, విశ్వ, సాధ్య, మరుత్వతి, వసు, ముహూర్త, సంకల్ప అనునవి - ఇంక వీరి పుత్రుల పేర్లను వినుము.

6.5 (ఐదవ శ్లోకము)

భావోస్తు దేవఋషభః ఇంధ్రసేనస్తతో నృప|

విద్యోత ఆసీల్లంబాయాస్తతశ్చ స్తనయిత్నవః॥4979॥

మహారాజా! భాను అను నామెకు దేవఋషభుడు కలిగెను. అతనికి ఇంద్రసేనుడు జన్మించెను. లంబ అను నామె పుత్రుడు విద్యోతుడు. అతనికి మేఘగణములు జన్మించెను.

6.6 (ఆరవ శ్లోకము)

.కకుభః సంకటస్తస్య కీకటస్తనయో యతః|

భువో దుర్గాణి జామేయః స్వర్గో నందిస్తతోఽభవత్॥4980॥

కకుభునకు సంకటుడు, అతనికి కికటుడు జన్మించిరి. కికటునకు భూతలమునందలి సకల దుర్గముల అభిమానదేవతలు జన్మించిరి. జామి అను నామె పుత్రుడు స్వర్గుడు, అతనికి నంది అను సుతుడు జన్మించెను.

6.7 (ఏడవ శ్లోకము)

విశ్వే దేవాస్తు విశ్వాయా అప్రజాంస్తాన్ ప్రచక్షతే|

సాధ్యోగణశ్చ సాధ్యాయాః అర్థసిద్ధిస్తు తత్సుతః॥4981॥

విశ్వ అనునామెకు విశ్వదేవతలు కలిగిరి. వారికి ఎట్టి సంతానమూ లేకుండెను. సాధ్య అను నామెకు సాధ్యగణములు జన్మించిరి. వారి పుత్రుడు, అర్థసిద్ధి.

6.8 (ఎనిమిదవ శ్లోకము)

మరుత్వాంశ్చ జయంతశ్చ మరుత్వత్యాం బభూవతుః|

జయంతో వాసుదేవాంశ ఉపేంద్ర ఇతి యం విదుః॥4982॥

మరుత్వతి అను నామెకు మరుత్వంతుడు, జయంతుడు అను ఇద్దరు తనయులు కలిగిరి. జయంతుడు వాసుదేవుని అంశము. అతనిని జనులు ఉపేంద్రుడు అనియు వ్యవహరింతురు.

6.9 (తొమ్మిదవ శ్లోకము)

మౌహూర్తికా దేవగణా ముహూర్తాయాశ్చ జజ్ఞిరే|

యే వై ఫలం ప్రయచ్ఛంతి భూతానాం స్వస్వకాలజమ్॥4983॥

ముహూర్త అను నామెకు ముహూర్తాభిమాన దేవతలు కలిగిరి. వారు ఆయా ముహూర్తములయందు జీవులకు వారి, వారి కర్మలను అనుసరించి, ఫలములను ఇచ్చుచుందురు.

6.10 (పదియవ శ్లోకము)

సంకల్పాయాశ్చ సంకల్పః కామః సంకల్పజః స్మృతః|

వసవోఽష్టౌ వసోః పుత్రాస్తేషాం నామాని మే శృణు॥4984॥

6.11 (పదకొంఢవ శ్లోకము)

ద్రోణః ప్రాణో ధ్రువోఽర్మోఽగ్నిర్దోషో వసుర్విభావసుః|

ద్రోణస్యాభిమతేః పత్న్యాః హర్షశోకభయాదయః॥4985॥

సంకల్ప అను నామెకు ఎనిమిది మంది వసువులు జన్మించిరి. ద్రోణుడు, ప్రాణుడు, ధ్రువుడు, అర్కుడు, అగ్ని, దోషుడు, వసువు, విభావసువు అనువారు వసుకుమారులు. ద్రోణుని పత్ని పేరు అభిమతి. ఆమె యందు హర్ష, శోక, భయాదులు అభిమాన దేవతలు ఉదయించిరి.

6.12 (పండ్రెండవ శ్లోకము)

ఫ్రాణస్రోర్జస్వతీ భార్యా సహ ఆయుః పురోజనః|

ధ్రువస్య భార్యా ధరణిరసూత వివిధాః పురః॥4986॥

ప్రాణుని భార్య ఉర్జస్వతి, ఆమెయందు సహుడు, ఆయువు, పురోజవుడు అను మువ్వురు కుమారులు కలిగిరి. ధ్రువుని పత్నియైస ధరణి యందు పెక్కు నగరముల అభిమాన దేవతలు జన్మించిరి.

6.13 (పధమూడవ శ్లోకము)

అర్కస్య వాసనా భార్యా పుత్రాస్తర్షాదయః స్మృతాః|

అగ్నేర్భార్యాః వసోర్ధారా పుత్రా ద్రవిణకాదయః॥4987॥

అర్కుని భార్య వాసన. ఆమెకు తర్షుడు(తృష్ణ) మొదలగువారు కలిగిరి. అగ్ని అను పేరుగల వసువు యొక్క పత్ని ధార. ఆమె యందు ద్రవిణకుడు మొదలగు పెక్కుమంది కలిగిరి.

6.14 (పదునాలుగవ శ్లోకము)

స్కందశ్చ కృత్తికాపుత్రో యే విశాఖాదయస్తతః|

దోషస్య శర్వరీపుత్రః శిశుమారో హరేఃకలా॥4988॥

కృత్తిక పుత్రుడగు స్కంధుడు గూడ అగ్ని వలననే జన్మించెను. అతనికి విశాఖుడు మొదలగువారు కలిగిరి. దోషుని పత్ని శర్వరి. ఆమె యందు శిశుమారుడు జన్మించెను. అతడు భగవంతుని కలావతారము.

6.15 (పదునైదవ శ్లోకము)

వసోరాంగిరసీ పుత్రో విశ్వకర్మాకృతీపతిః|

తతో మనుశ్చాక్షుషోఽభూత్ విశ్వే సాధ్యా మనోఃసుతాః॥4989॥

వసువు యొక్క పత్నియైన అంగిరసి యందు శిల్పకళకు అధిపతియైస విశ్వకర్మ జన్మించెను. విశ్వకర్మ భార్యయైన కృతి యందు చాక్షుష మనువు కలిగెను. అతనికి విశ్వేదేవతలు, సాధ్యగణములు కలిగిరి.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి షష్ఠస్కంధములోని ఆరవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

27.5.2020    సాయం కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

షష్ఠ స్కంధము - ఆరవ అధ్యాయము

దక్షప్రజాపతి యొక్క అరువది మంది పుత్రికల వంశవర్ణనము

ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

6.16 (పదునారవ శ్లోకము)

విభావసోరసూతోషా వ్యుష్టం రోచిషమాతపమ్|

పంచయోమోఽథ భూతాని యేన జాగ్రతి కర్మసు॥4990॥

విభావసుని పత్నియైన ఉష యందు వ్యుష్టుడు, రోచిషుడు, ఆతపుడు జన్మించిరి. వారిలో ఆతపునకు పంచయాముడు (దినము) అను పుత్రుడు కలిగెను. అతని వలననే సకల జీవులు తమ తమ కార్యముల యందు నిమగ్నులగుదురు.

6.17 (పదునేడవ శ్లోకము)

సరూపాఽసూత భూతస్య భార్యా రుద్రాంశ్చ కోటిశః|

రైవతోఽజో భవో భీమో వామ ఉగ్రో  వృషాకపిః॥4991॥

6.18 (పదునెనిమిదవ శ్లోకము)

అజైకపాదహిర్భుధ్న్యో బహురూపో మహానితి|

రుద్రస్య పార్షదాశ్చన్యే ఘోరాః భూతవినాయకాః॥4992॥

దక్షుని కూతురు, భూతుని భార్యయగు సరూప యందు కోట్లకొలది రుద్రగణములు జన్మించెను. వారిలో రైవతుడు, అజుడు, భవుడు, భీముడు, వాముడు, ఉగ్రుడు, వృషాకపి, అజైకపాదుడు, అహిర్బుధ్న్యుడు, బహురూపుడు, మహంతుడు అను పదకొండుమంది ముఖ్యులు, భూతుని రెండవభార్యయైన భూతయందు భయంకరుడై, భూతుడు, వినాయకుడు మున్నగువారు జన్మించిరి. వీరు అందరు పదకొండుమంది రుద్రులలో ముఖ్యుడైన మహంతునకు పార్షదులైరి.

6.19 (పందొమ్మిదవ శ్లోకము)

ప్రజాపతేరంగిరసః స్వధా పత్నీ పితౄనథ|

అథర్వాంగిరసం వేదం పుత్రత్వే చాకరోత్సతీ॥4993॥

ప్రజాపతియైన అంగిరసుని మొదటిభార్య పేరు స్వధ, ఆమె పితృగణములకు జన్మనిచ్చెను. రెండవ భార్యయైన సతి అధర్వాంగిరసము అను వేదమునే పుత్రరూపమున స్వీకరించెను.

6.20 (ఇరువదియవ శ్లోకము)

కృశాశ్వోఽర్చిషి భార్యాయాం ధూమ్రకేశమజీజనత్|

ధిషణాయాం వేదశిరో దేవలం వయునం మనుమ్॥4994॥

కృశాశ్వుని భార్యయగు అర్చి యందు ధూమ్రకేశుడు అనువాడు జన్మించెను. రెండవ భార్యయగు ధిషణకు వేదశిరుడు, దేవలుడు, వయునుడు, మనువు అను నల్వురు పుత్రులు కలిగిరి.

6.21 (ఇరువధి ఒకటవ శ్లోకము)

తార్ క్ష్యస్య వినతా కద్రూః పతంగీ యామినీతి చ|

పతంగ్యసూత పతగాన్ యామనీ శలభానథ॥4995॥

తార్ క్ష్యుడు అను పేరుగల కశ్యపునకు వినత, కద్రువ, పతంగి, యామిని అను నలుగురు భార్యలుండిరి. పతంగి అను నామెకు పక్షులు జన్మించెను. యామినికి శలభములు (మిడుతలు) జన్మించెను.  

6.22 (ఇరువది రెండవ శ్లోకము)

సుపర్ణాసూత గరుడం సాక్షాద్యజ్ఞేశవాహనమ్|

సూర్యసూతమనూరుం చ కద్రూర్నాగాననేకశః॥4996॥

వినతయందు గరుత్మంతుడు ఉదయించెను. అతడు శ్రీమహావిష్ణువునకు వాహనమయ్యెను. వినత యొక్క రెండవ కుమారుడైన అనూరుడు సూర్యభగవానునికి సారథి అయ్యెను. కద్రువవలన అనేక నాగులు ఉత్పన్నమయ్యెను.

6.23 (ఇరువది మూడవ శ్లోకము)

కృత్తికాదీని నక్షత్రాశణీందోః పత్న్యస్తు భారత|

దక్షశాపాత్ సోఽనపత్యస్తాసు యక్ష్మగ్రహార్దితః॥4997॥

పరీక్షిన్మహారాజా! కృత్తిక మొదలగు ఇరువదియేడు మంది నక్షత్రాభిమాన దేవతలు చంద్రుని భార్యలైరి. చంద్రుడు రోహిణిపై ఇతర పత్నులకంటె ఎక్కువ మక్కువ కలిగియుండెను. ఆకారణముగా దక్షుడు అతనిని శపించగా అతడు క్షయరోగ పీడితుడయ్యెను. అతనికి ఎట్టి సంతానమూ కలుగకుండెను.

6.24 (ఇరువది నాలుగవ శ్లోకము)

పునః ప్రసాద్య తం సోమః కళా లేఖే క్షయే దితాః|

శృణు నామాని లోకానాం మాతౄణాం శంకరాణి చ॥4998॥

6.25 (ఇరువది ఐదవ శ్లోకము)

అథ కశ్యపపత్నీనాం యత్ప్రసూతమిదం జగత్|

అదితిర్దితిర్దనుః కాష్ఠా అరిష్టా సురసా ఇలా॥4999॥

6.26 (ఇరువది ఆరవ శ్లోకము)

మునిః క్రోధవశా తామ్రా సురభిః సరమా తిమిః|

తిమేర్యాదోగణా ఆసన్ శ్వాపదాః సరమాసుతాః॥5000॥

చంద్రుడు దక్షుని ప్రసన్నునిగా చేసికొనుట వలన కృష్ణపక్షము అతని కళలు క్షీణించుచుండునట్లుగను, శుక్లపక్షమునందు ఆయనకళలు వృద్ధి చెందుచుండునట్లుగను వరమును పొందెను. కాని, నక్షత్రాభి మానదేవతలలో ఎవ్వరి యందును అతని వలన సంతానము కలుగకుండెను. ఇప్పుడు కశ్యపప్రజాపతియొక్క పత్నుల పేర్లను వినుము - వారందరును శుభంకరులు, లోకమునకు తల్లుల వంటివారు; వారి వలననే ఈ జగత్తు అంతయు సృష్టింపబడినది. వారిపేర్లు అదితి, దితి, దనువు, కాష్ఠ, అరిష్ట, సురస, ఇల, ముని, క్రోధవశ, తామ్ర, సురభి, సరమ, తిమి అనువారు. తిమియందు జలచర జంతువులు, సరమయందు పులులు మొదలగు హింసించు జంతువులు ఉత్పన్నమాయెను.

6.27 (ఇరువది ఏడవ శ్లోకము)

సురభేర్మహిషా గావో యే చాన్యే ద్విశఫా నృప|

తామ్రాయాః శ్యేనగృధ్రాద్యా మునేరప్సరసాం గణాః॥5001॥

సురభియందు గోవులు, ఎద్దులు ఇంకను, రెండు గిట్టలు గల ఇతర పశువులు జన్మించెను. తామ్ర అను నామెకు రాబందులు, గ్రద్దలు మొదలగు వేటాడు పక్షులు కలిగెను. ముని అను నామెకు అప్సరసలు జన్మించిరి.

6.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)

దందశూకాదయః సర్పా రాజన్ క్రోధవశాత్మజాః|

ఇలాయా భూరుహాః సర్వే యాతుధానాశ్చ సౌరసాః॥5002॥

క్రోధవశకు పాములు, త్రేళ్ళు మొదలగు విషజంతువులు కలిగెను. ఇల అను నామెకు వృక్షములు, లతలు మొదలగునవియును, భూమియందు ఉత్పన్నములగు వసస్పతులు ఉదయించెను. సురస అను నామెకు యాతుధానులు (రాక్షసులు) జన్మించిరి.

6.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)

అరీష్టాయాశ్చ గంధర్వాః కాష్ఠాయా ద్విశఫేతరాః|

సుతా దనోరేకషష్టిస్తేషాం ప్రాధానికాన్ శృణు॥5003॥

అరిష్టయందు గంధర్వులు, కాష్టయందు గుర్రములు, మొదలగు ఒక్క గిట్టగల పశువులు జన్మించెను. దనువునకు అరువదియొక్క పుత్రులు జన్మించిరి. వారిలో ముఖ్యులైనవారి పేర్లను వినుము-

6.30 (ముప్పదియవ శ్లోకము)

ద్విమూర్ధా శంబరోఽరిష్టో హయగ్రీవో విభావసుః|

అయోముఖః శంకుశిరాః స్వర్భానుః కపిలోఽరుణః॥5004॥

6.31 (ముప్పది ఒకటవ శ్లోకము)

పులోమా వృషపర్వా చ ఏకచక్రోఽనుతాపనః|

ధూమ్రకేశో విరూపాక్షో విప్రచిత్తిశ్చ దుర్జయః॥5005॥

ద్విమూర్ధుడు, శంబరుడు, అరిష్టుడు, హయగ్రీవుడు, విభావసుడు, అయోముఖుడు, శంకుశిరుడు, స్వర్భానుడు, కపిలుడు, అరుణుడు, పులోముడు, వృషపర్వుడు, ఏకచక్రుడు, అనుతాపనుడు, ధూమ్రకేతుడు, విరూపాక్షడు, విప్రచిత్తి, దుర్జయుడు అనువారు కలిగిరి.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి షష్ఠస్కంధములోని ఆరవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

28.5.2020    ప్రాతః కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

షష్ఠ స్కంధము - ఆరవ అధ్యాయము

దక్షప్రజాపతి యొక్క అరువది మంది పుత్రికల వంశవర్ణనము

ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

6.32 (ముప్పది రెండవ శ్లోకము)

స్వర్భానోః సుప్రభాం కన్యామువాహ నముచిః కిల|

వృషపర్వణస్తు శర్మిష్ఠాం యయాతిర్నాహుషో బలీ॥5006॥

స్వర్భానుయొక్క కుమార్తెయైన సుప్రభకు సుముచియను వానితో వివాహమయ్యెను. వృషపర్వుని కూతురైన శర్మిష్ఠను నహుషనందనుడు, మహాబలవంతుడైన యయాతి వివాహమాడెను.

6.33 (ముప్పది మూడవ శ్లోకము)

వైశ్వానరసుతా యాశ్చ చతస్రశ్చారుదర్శనాః

ఉపదానవీ హయశిరా పులోమా కాలకా తథా॥5007॥

దనువు పుత్రుడైన వైశ్వానరునకు అందమైన నలువురు కుమార్తెలు గలిగిరి. వారిపేర్లు ఉపదానవి, హయశిర, పులోమ, కాలక.

6.34 (ముప్పది నాలుగవ శ్లోకము)

ఉపదానవీం హిరణ్యాక్షః క్రతుర్హయశిరాం నృప|

పులోమాం కాలకాం చ ద్వే వైశ్వానరసుతే తు కః॥5008॥

6.35 (ముప్పది ఐదవ శ్లోకము)

ఉపయేమేఽథ భగవాన్ కశ్యపో బ్రహ్మచోదితః|

పౌలోమాః కాలకేయాశ్చ దానవా యుద్ధశాలినః॥5009॥

6.36 (ముప్పది ఆరవ శ్లోకము)

తయోః షష్టిసహస్రాణి యజ్ఞఘ్నాంస్తే పితుః పితా|

జఘాన స్వర్గతో రాజన్నేక ఇంద్రప్రియంకరః॥5010॥

ఉపదానవిని హిరణ్యాక్షుడు, హయశిరను క్రతువు పెండ్లియాడిరి. బ్రహ్మదేవుని ఆజ్ఞ మేరకు కశ్యపప్రజాపతి, వైశ్వానరుని కుమార్తెలైన పులోమను, కాలకను పెండ్లియాడెను. వారి యందు పౌలోములు, మరియు కాలకేయులు అను పేరుగల అరువదివేలమంది దానవులు కలిగిరి. వారు గొప్ప యుద్ధవీరులు. వారే నివాత కవచులు అను పేర్లతో  ప్రసిద్ధి చెందిరి. వారు యజ్ఞకార్యములకు విఘ్నములను కలిగించుచుండిరి. కనుక, పరీక్షిన్మహారాజా! మీ తాతయైన అర్జునుడు ఒక్కడే ఇంద్రునకు ప్రియమును గూర్చుటకై వారిని వధించెను. ఆ సమయమున అర్జునుడు స్వర్గమునందు ఉండెను.

6.37 (ముప్పది ఏడవ శ్లోకము)

విప్రచిత్తిః సింహికాయాం శతం చైకమజీజనత్|

రాహుజ్యేష్ఠం కేతుశతం గ్రహత్వంాయ ఉపాగతః॥5011॥

విప్రచిత్తి పత్నియైన సింహికయందు నూట ఒక్క మంది పుత్రులు ఉదయించిరి. వారిలో జ్యేష్ఠుడు రాహువు. అతడు గ్రహములలో ఒకడుగా లెక్కింపబడెను. మిగిలిన వందమంది పుత్రులు కేతువులుగా వ్యవహరింపబడిరి.

6.38 (ముప్పది ఎనిమిదవ శ్లోకము)

అథాతః శ్రూయతాం వంశో యోఽదితేరనుపూర్వశః|

యత్ర నారాయణో దేవః స్వాంశేనావతరద్విభుః॥5012॥

రాజా! ఇప్పుడు క్రమముగా అదితి యొక్క వంశపరంపరను గూర్చి వినుము- ఈ వంశమునందు సర్వవ్యాపకుడు, దేవాదిదేవుడు ఐన శ్రీమన్నారాయణుడు తన అంశతో వామనరూపమున అవతరించెను.

6.39 (ముప్పది తొమ్మిదవ శ్లోకము)

వివస్వానర్యమా పూషా త్వష్టాథ సవితా భగః|

ధాతా విధాతా వరుణో మిత్రః శుక్ర ఉరుక్రమః॥5013॥

అదితికి వివస్వంతుడు, అర్యముడు, పూష, త్వష్ట, సవిత, భగుడు, ధాత, విధాత, వరుణుడు, మిత్రుడు, ఇంద్రుడు, త్రివిక్రముడు (వామనుడు) అను పుత్రులు ఉదయించిరి. ఈ పన్నెండు మంది ఆదిత్యులు అని వ్యవహరింపబడిరి.

6.40 (నలుబదియవ శ్లోకము)

వివస్వతః శ్రాద్ధదేవం సంజ్ఞాసూయత వై మనుమ్|

మిథునం చ మహాభాగా యమం దేవం యపీం తథా|

సైవ భూత్వాథ బడబా నాసత్యౌ సుషువే భువి॥5014॥

వివస్వంతుని పత్నియైన సంజ్ఞ మహాభాగ్యశాలిని. ఆమెయందు శ్రాద్ధదేవుడు (వైవస్వతుడు) అనుమనువు, ఇంకను, యముడు, యమున అను కవలలు జన్మించిరి. సంజ్ఞయే గుర్రము రూపమును ధరించి, సూర్యభగవానుని ద్వారా భూలోకముస అశ్వినీకుమారులు అను ఇరువురికి జన్మనిచ్చెను.

6.41 (నలుబది ఒకటవ శ్లోకము)

ఛాయా శనైశ్చరం లేభే సావర్ణిం చ మనుం తతః|

కన్యాం చ తపతీం యా వై వవ్రే సంవరణం పతిమ్॥5015॥

వివస్వంతుని రెండవ భార్య ఫేరు ఛాయ. ఆమె యందు శనైశ్చరుడు సావర్ణి అను మనువు, తపతి యను కూతురు జన్మించిరి. తపతి సంవరణుని భార్యయయ్యెను.

6.42 (నలుబది రెండవ శ్లోకము)

అర్యమ్ణో మాతృకా పత్నీ తయోశ్చర్షణయః సుతాః|

యత్ర వై మానుషీ జాతిర్బ్రహ్మణా చోపకల్పితా॥5016॥

అర్యముని పత్ని మాతృక, ఆమె యందు చర్షణులు అను పుత్రులు గలిగిరి. వారు కర్తవ్య-అకర్తవ్య అను జ్ఞానము గలవారు. అందువలన బ్రహ్మదేవుడు వారిని ఆధారముగా చేసికొని బ్రాహ్మణాది వర్ణములను ఏర్పరచెను.

6.43 (నలుబది మూడవ శ్లోకము)

పూషానపత్యః పిష్టాదో భగ్నదంతోఽభవత్పురా|

యోఽసౌ దక్షాయ కుపితం జహాస వివృతద్విజః॥5017॥

పూషకు సంతానము లేకుండెను. పూర్వకాలమున పరమశివుడు దక్షునిపై కుపితుడైనప్ఫుడు పూష వికృతముగానవ్వెను. అందు వలన వీరభద్రుడు అతని పండ్లూడగొట్టెను. అప్పటి నుండి పూష పిండిని ఆహారముగా తీసికొనసాగెను.

6.44 (నలుబది నాలుగవ శ్లోకము)

త్వష్టుర్దైత్యానుజా భార్యా రచనా నామ కన్యకా|

సన్నవేశస్తయోర్జజ్ఞే విశ్వరూపశ్చ వీర్యవాన్॥5018॥

త్వష్టుని భార్య పేరు రచన. ఆమె దైత్యుల చెల్లెలు. రచనకు సన్నివేశుడు, పరాక్రమశాలియైన విశ్వరూపుడు అను ఇద్దరు కుమారులు కలిగిరి.

6.45 (నలుబది ఐదవ శ్లోకము)

తం వవ్రిరే సురగణాః స్వస్రీయం ద్విషతామపి|

విమతేన  పరిత్యక్తా గురుణాఽఽంగిరసేన యత్॥5019॥