Saturday, 21 October 2017

శ్రీ కృష్ణ లీలామృతం- 6



 ప్రాంజలి ప్రభ - ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ: - శ్రీ కృష్ణాయనమ:
కృష్ణం కలయ సఖి
ముఖారి రాగం
తాళం: ఆది
నారాయణ తీర్ధ

పల్లవి
కృష్ణం కలయ సఖి సుందరం బాల
(కృష్ణం)

చరణం 1
కృష్ణం గతవిషయ తృష్ణం జగత్ప్రభ విష్ణుం సురారిగణ జిష్ణుం సదా బాల
(కృష్ణం)

(కృష్ణ, ఇంద్రియాల యొక్క దాహం, విశ్వానికి ప్రభువు
గణాల అన్నింటికీ ప్రభువు మరియు దెయ్యాల మీద విజేత,
ఎప్పుడూ చిన్న పిల్లవాడు కృష్ణ!)

చరణం 2
నృత్యం తమిహ ముహుర్త్యంతం అపరిమిత బృత్యానుకూలం అఖిల సత్యం సదా బాల
(కృష్ణం)

(అతను మించిపోయే మరియు అపరిమితమైన ఆనందంతో ఇక్కడ నృత్యం చేస్తాడు
ఎప్పుడూ దయతో మరియు భక్తులకు అనుకూలంగా ఉండే ప్రభువు ,
ఎప్పుడూ అతను చిన్న పిల్లవాడు కృష్ణ!)

చరణం 3
ధీరం భవజల భారం సకల వేదసారం సమస్త యోగిధారం సదా బాల
(కృష్ణం)

ఈ విశ్వం యొక్క సారాంశం,  అన్నీ వేదాల యొక్క సారాంశం జీవితం యొక్క సముద్ర మార్పిడిని అన్ని యోగిల సహాయం  (ఎప్పుడూ చిన్న పిల్లవాడు కృష్ణ!)

చరణం 4
శృంగార రసభర సంగీత సాహిత్య గంగాలహరి కేళ సంగం సదా బాల
(కృష్ణం)

ప్రేమ శృంగార, సంగీతం మరియు అక్షరాలతో నిండి ఉంటుంది
ఆ ప్రవహించే గంగా తరంగాలను ఆడుతూ ...
(సఖి! చాలా మనోహరమైన కృష్ణ చూడండి)

చరణం 5
రామేణ జగదభిరామేణ బల భద్రరామేణ సమవాప్త కామేన సహ బాల
(కృష్ణం)

(చాలా మనోహరమైన, అత్యంత ప్రేమను పంచే అన్న బలరాముడు తోడుగా
అందరికీ ఉత్తమమైనది అందించే ప్రభువు ,
సఖి! చాలా మనోహరమైన కృష్ణ చూడండి)

చరణం 6
దామోదరం అఖిల కామాకరంగన శ్యామాకృతిం అసుర భీమం సదా బాల
(కృష్ణం)

(అతను తన కడుపులో విశ్వం మొత్తాన్ని మోస్తున్నాడు, రాక్షసులను సంహరించటానికి ఉద్భవిచాడు, ఎప్పుడూ చిన్న పిల్లవాడు కృష్ణ! సఖి! చాలా మనోహరమైన కృష్ణ చూడండి!)

చరణం 7
రాధారుణాధర సుధాపం సచ్చిదానంద రూపం జగత్రయ భూపం సదా బాల
(కృష్ణం)

(అందరినీ అధిగమించే సుఖమైన పెదవుల ఎరుపు గొప్ప కాంతితో ఉన్న రూపం, ప్రశాంతముగా ఆనందముగా ఉన్న రూపం, ఎప్పుడూ చిన్న పిల్లవాడు కృష్ణ! సఖి! చాలా మనోహరమైన కృష్ణ చూడండి!)

చరణం 8
అర్థం శిథిలీకృతానర్థం శ్రీ నారాయణ తీర్థం పరమపురుషార్థం సదా బాల
(కృష్ణం)
ధర్మాన్ని రక్షించి దుష్టుల్ని శిక్షించే పరమ పురుషార్థం కలిగి ఉన్న ఎప్పుడూ చిన్న పిల్లవాడు కృష్ణ! సఖి! చాలా మనోహరమైన కృష్ణ చూడండి!)
-((*))--


*కన్నయ్యా .... ఓ కన్నయ్యా



కలవపూల కళ్ళు గల కన్నయ్యా
కోమలమైన చూపుతో ఉన్నావు గదయ్యా
కమ్మనైన పత్రపాన్పుపై  శయనించి నావయ్యా 
మమ్ము కమ్ముకున్న చీకట్లు తొలగించవేమయ్యా  



అమృత ధారను మాకు పంచవయ్యా  
నోటియందు వామ పాదంను వదలవయ్యా   
కమ్మని ఆవు పాలుతాగవయ్యా
నమ్మువయ్యా  నీ నవ్వే మాకు స్వర్గ మయ్యా 



కన్నయ్యా నిను కనలేని ఈ కనులెందుకయ్యా
హృదయం లోపల, వెలుపల ఆనందాన్ని పంచుతున్నావుగదయ్యా
హద్దు లేని ప్రార్ధనా శక్తి, సంపదను, ఇచ్చావుగదయ్యా
రాగా ద్వేషాలకు అతీతంగా బతకమంటున్నావయ్యా



యమున యందు విహరిస్తున్నావయ్యా
వ్యామోహాలనుండి మమ్ము రక్షించవేమయ్యా
సమ్మోహనాస్త్రం ఉండు నట్లు చేయవయ్యా 
రామ-కృష్ణామృతాన్ని  ధన్యం చేయవయ్యా
--((*))--

శ్రీకృష్ణుని జననము - 2 (కస్తూరి రంగరంగా - నాయన్న - కావేటి రంగరంగా)

ప్రేమ కృష్ణుణ్ణి చూచీ - పూతకి - ప్రియముతో బుజ్జగించి

నాయన్న ఊరుకోర - నాతండ్రి - పాలు ఇచ్చెదను రార

మూడు గుక్కలు పీల్చగా - పూతకి - భూమిపైకొరిగి పడగా

గోపెమ్మ చూచి అపుడూ - బంగారు - గిన్నెలో బువ్వపెట్టి

ప్రొదున్న ఉగ్గుపోసి - కృష్ణుణ్ణి - యొడలోను పందవేస

అంతలో కంసహితుడూ - బండిరూ - పై యెదురుగవచ్చెనూ

పాదములు రెండు పిడుగు - లావలే - దడదడా విసిరెనపుడూ

వృషభమై వచ్చినిలువ - ఒక్కలఘు - వున చంపివేసెనపుడూ

చల్లమ్ము వారలెల్లా - ఈకబురు - చల్లగా చెప్పిరపుడు

రేపల్లె వాడలోను - ఉన్నట్టి - గోపికల గుంపుగూడి

"మాయిళ్ళ కొచ్చునమ్మా - కృష్ణూడు - మమురవ్వ చేసునమ్మా

తాళలేమమ్మ మేము - మీ సుతుడు - తాలిమితొ ఉండడమ్మా

మగనివలె పనులుసేయా - నీ సుతుడు - మా యిండ్లలోకి వచ్చూ

ఇనైకన బుద్ధిచెప్పీ - ఇంతిరో - పదిలమ్ము సేయుమమ్మా"

అనుచును గట్టిగానూ - మనమంత - గోపెమ్మ కడకుబోయి

చెప్పుదామనుచు వారు - గోపెమ్మ - చెంతకేగగ నప్పుడు

గోపాలకృష్ణు డపుడూ - అచటనే - పాలుత్రాగుచు నుండెనూ

ఇదియేమి యాశ్చర్యమే - ఓ చెలియ - ఇదియేమి చోద్యమమ్మ

కనుపాపలను దీసునే - కృష్ణుడు - దొంగతనములు చేసునే

ఇకనేమి చేసునోను - మన ముబులు - పాటమున వస్తిమమ్మా

అమ్మనే నెరుగనమ్మా - నాత్రోవ - నేబోవు చుండగాను

ననురవ్వ చేసిరమ్మ - నేనంత - భయపడీ వస్తినమ్మా

కొబ్బరి కుడకలనుచు - గోపికలు - గొబ్బున పిలువబోవ

కొబ్బరి కుడకలనుచు - గోపికలు - గుబ్బలను చూపినారు

పొరుణమి రోజులందు - జలజాక్షు - లందరూ కూడకోనీ

చీరలటు తీసివేసి - గోపికలు - జలకమాడుచు నుండగా

తీసివుంచిన చీరలు - కృష్ణుండు - వేసె ఆ పొన్నమీద

వేసియూ వేణునాదం - వూదుచూ - వుండె నా మాధవుండూ

జలమమ్ము చాలించియూ - గోపికలు - మన చీర లేమాయెనే

నమ్మరాదమ్మ కృష్ణుని - ఇకను ఈ - చినగొల్లవాని నెపుడూ

ఎంతపని చేసెనమ్మా - ఓ చెలియ - ఏమి యాశ్చర్యమమ్మా

వెదకుచూ కొందరుండీ - నీళ్ళలో - మునిగియుండిరి కొందరూ

అప్పుడూ గోపికలో - ఒకయింతి - తాజూచి శ్రీకృష్ణునీ

ఇవ్వరా మా చీరెలూ - ఓ కృష్ణ - ఇవ్వరా మా రవికలూ

దండంబు పెట్టెదార - కృష్ణయ్య - దయయుంచి దయచేయరా

అందరూ ఒకచేతితో - దండంబు - పెట్టగా చూచితాను

పొందుగా మీరందరూ - దండంబు - రెండుచేతుల బెట్టరే

ఎంతపని వచ్చెననుచూ - గోపికలు - మానభంగము నొందిరీ

వసుదేవ తనయునకునూ - దండంబు - రెండుచేతుల బెట్టిరీ

పొందుగా వలువలన్నీ - కృష్ణుండు - పేరుపేరున ఇచ్చెను

నాయత్త తిట్టునేమో - యనుచు నొక - రొకరితో వగచిరపుడూ

మాయాడు బిడ్డ యిపుడూ - కొట్టునో - నా బావ దండించునో

నా మగడు నన్ను బ్రతుక - నివ్వడూ - నేనేమి చేతునమ్మా

కస్తూరి రంగరంగా - నా యన్న - కావేటిరంగ రంగా

శ్రీరంగ రంగరంగ - నిను బాసి - యెట్లు నేమరుచుందురా



Monday, 16 October 2017

శ్రీ కృష్ణ లీలామృతం- 5


ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:- శ్రీ కృష్ణాయ నమ: 
శ్రీ కృష్ణ లీలామృతం- 5

కంసుని లీలలు

ఒక్కసారిగా పసిపిల్ల గొంతు వినగానే రక్షక భటులు వేగంగా లేచి చెరసాలలో జననం అని చెప్పారు అప్పడు ఒక్కసారిగా లేచి కంసుడు గట్టిగా " నాప్రాణమును కబళించు భయంకరమైన మృత్యువు జన్మించెను " అని అరచి చేతితో కరవాలము పట్టుకొని దేవకీ వసుదేవుని వద్దకు వచ్చి స్వవయముగా ఏడుస్తున్న పసి కందుని చేత పట్టి వికటాట్టహాసము చేస్త్తూ బిగరగా అరుస్తూ " నీవా నా ప్రాణాల్ని హరించేది నీవా నా ప్రాణాల్ని హరించేది అంటుండగా,  దేవకీ పాదాలను పట్టుకొని అన్నని వేడు కుంటున్నది .

"ప్రియసోదర దయచేసి ఆడబిడ్డను వధించకము, నిన్ను చంపువాడు మొగ శిశివు అని కదా భవిష్య వాణి చెప్పింది. అయిన క్రూరుడైన కంసుడు కోపముతో పాపను గాలిలోకి విసిరి కరవాలము పెట్టెను
గాలిలో చేరిన పాప గొప్ప వెలుగుగా మారి ఒక దివ్య రూపముగా ఆకాశములో ఆదిపరాశక్తి ప్రత్యక్ష మయ్యెను.

"ఎనిమిది హస్తములలో విల్లు, సూల, బాణ, ఘంటా, శంఖ, చక్ర, గదా, కవచములు ధరించి ఉండెను"

"ఓరి దుర్మార్గుడా నీవు నన్నెట్లు చంపగలవు? నిన్ను చంపు శిశివు నాకు పూర్వమే ఈ ప్రపంచము లో జన్మించెను, దీనురాలైనట్టి నీ సోదరి పట్ల క్రూరముగా ప్రవర్తించకము" హెచ్చరించి అంతర్ధాన మయ్యెను.            

ప్రియమైన సోదరి, బావా నేను మీ పుత్రులను సంహరించితిని, బ్రహ్మహత్యా పాతకము మూటకట్టు కొంటిని, మనల్ని ఎదో మాయ శక్తి కమ్ము కుంటున్నది, మిమ్మల్ని భాదపెట్టి నందుకు నన్ను క్షమించండి, ఈ రోజు మిమ్మల్ని కారాగారము నుండి విముక్తి చేస్తున్నాను, మీరు స్వేశ్చగా జీవించవచ్చు అని పలికి వారికీ ఉన్న గొలుసులను తొలగించెను.

"కంసా మనము అజ్ఞానము వలన మిత్రులను శత్రువులుగా, శత్రువులను మిత్రులుగా చూస్తున్నాము. సుఖము, దుఃఖము, భయము, ద్వేషము, లోభము, మోహము ఉన్మాదం అనునవి వాటి వళ్ళ భౌతిక శరీరము ద్వేషభావముతో నలిగి పోవును. కనుక వీటిని తొలగించు కోవాలంటే మనము ప్రేమ భక్తి భావాన్ని విస్తరించు కోవటమే మార్గము అని వాసుదేవుడు తెలియపరిచేను "

అట్లాగే బావ నేను మారి పోయాను, మీరు సుఖముగా ఉండండి అని చెప్పి వెడలి పోయాను.
                                                                                                       

కంసుడు అసలే రాక్షసుడు ఆలోచనలు ఎలా మారుతాయో ఎవరు చెప్పలేరు, వెంటనే అధికారులను పిలిపించి  తెలియపరిచేను,   రాక్షసులు కొందరు మీ మృత్యువు పుట్టిందని తెలుపారు  పది రోజుల మొగపిల్లలలందరిని సంహరిస్తే మంచిది, అసలు దేవతలు  మనకు విరోధులు, మనము బ్రాహ్మణులను  యజ్ఞయాగాదులు చేయకుండా ఆపుదాము, వారందరు విష్ణువుని మొరపెట్టుకొందురు అప్పుడు  ప్రత్యక్షము కాగలరు, మీరు ఇంద్రున్ని జయించినవారు, తపస్సంపన్నులు మీరు  ఏది చెపితే అది మేము ఆచరిస్తాము అన్నారు.
మరి కొందరు మేధావులు మహారాజా దేవకీ వసుదేవుల కుమారుడు ఎక్కడ పెరుగుతున్నాడో అక్కడ ససస్యశ్యామలంగా పుష్కలంగా వర్షాలు, నవగ్రహాలన్నీ సమంగా నడుస్తాయి అది గమనించండి. ఆ ప్రాంతము   తెలుసుకొని నీకు నమ్మన బంటులుగా ఉన్న అనేక మంది రాక్షసులను పంపితే  విషయము తెలుస్తుంది అన్నారు .
రాక్షసులు మరింకను ఇట్లా పలక సాగిరి: దేహము వ్యాధి గ్రస్తమైనప్పుడు ఆ వ్యాధిని అశ్రద్దచేసినచో ఆ వ్యాధిని నివారించలేము. ఆవిదఃముగానే ఇంద్రియ నియంత్రణ విషయములో అశ్రద్ధను కనపరచి ఇంద్రియములను  స్వేశ్చగా విడిచినచో తిరిగి వాటిని నియంత్రించలేము. కనుక దేవతలు మనకన్నా బాలవంతులు కాకుండా  మనము జాగ్రత్త పడవలెను. బ్రాహ్మణులు, వేదపఠనం,  గోవులు, వ్రతములు, యజ్ఞములు, దానములు మొదలైనవన్నీ విష్ణువుకు సంతృప్తి పరిచేవి అవి చేయకుండా ఆపగలిగితే మీ బలము పెరుగు తుంది.     
కంసుడు ఒకవైపు విష్ణు భక్తులను హింసించమని ఆజ్ఞ ఇస్తూ, మరోవైపు బాలుని వెతకమని రాక్షసులను పంపాడు, కంసుడు పిచ్చి పట్టిన వాడులా మారాడు, చిన్న పిల్లలను చంపమని ఆజ్ఞఇచ్చెను. బ్రాహ్మణులను హిసించమని ఆజ్ఞ ఇచ్చెను         

                                                           తరువాత కధలో నంద వసుదేవుల అక్లయక లీలలు తెలుసుకుందాము 

Saturday, 14 October 2017

శ్రీ కృష్ణ లీలామృతం -4


శ్రీ కృష్ణ లీలామృతం -4
బాల కృష్ణుని లాలి పాటలు 
ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ:శ్రీ కృష్ణాయనమ:

Image may contain: 2 people, people sitting
ప్రాంజలి ప్రభ "గోవిందా"

ఊహల ఊయల సడిలో
ఆకలి ఆరాట మదిలో
తియ్యని తలపుల తడిలో
నీరూపే నా మదిలో నిలిచింది

లతలా అల్లుకోవాలని
పరిమళాలందించాలని
విరిసిన పువ్వగా ఉండాలని
నీ తలుపు నన్ను పులుస్తున్నది

కురిసేను విరిజల్లులు
మెరిసెను హరివిల్లు సౌరభములు
నాట్యమాడెను మయూరములు
నామది ఆనందంతో ఉన్నది
 

మదిలో నిండే మధుర భావాలు
పెదాలు పలికే మధుర గీతాలు
నాలో చెరగని నీ ప్రాతి రూపాలు
అడుగుల సవ్వడికే పరవసిస్తున్న ముకుందా

నీ మధుర పావన తలపులు
ఈ రాధను వరించే కళలు
అందుకో పూల మకరందాలు
ఆదుకో ఆరాధించి
న  వారిని గోవిందా


ప్రాంజలి ప్రభ 
భక్తులు శ్రీకృష్ణుని ఈవిధంగా ప్రార్ధించుతున్నారు 

అంతర్మధనానికి అర్ధం ఏమిటో 
ఆంత రరంగాల భావ మేమిటో
అనురాగ బంధాల భేదమేమిటో 
మాకు తెలపవయ్యా కృష్ణయ్యా 

కాలమార్పుకు అవసర మేమిటో
కాపురానికి కాంచనానికి ప్రమఏమిటో
కాని దవుతుంది, అవ్వాల్సింది కాదేమిటో 
మాకు తెలపవయ్యా బాల కృష్ణయ్యా 

అకాల వర్షాలకు కారణాలేమిటో 
ఆత్మలకు తృప్తి కలుగుట లేదేమిటో
ఆకలి మనిషికి తగ్గకున్నదేమిటో 
మాకు తెలపవయ్యా ముద్దులకృష్ణయ్యా 

గాలిలో మాటలు తరలి వస్తున్నాయేమిటో 
గాఁపు లేకుండా ప్రార్ధించినా కరుణించవేమిటో 
గిరి గీసినా దాటివచ్చి మనిషి ప్రశ్న లేమిటో       
మాకు తెలపవయ్యా గోపాల కృష్ణయ్యా 

చిత్తశుద్ధి కల్పించి నిగ్రహాన్ని ఇవ్వవేమిటో 
చింతలు తొలగించి ఐక్యత్వజ్ఞానమివ్వమేమిటో
చిరునవ్వులతో జితేంద్రియత్వము కల్పించవేమిటో 
మాలో తప్పులు తెలపవయ్యా మువ్వగోపాలయ్యా 

ఇంద్రియసుఖములందలి ఆసక్తిని విడువలేకున్నావేమిటో 
కర్మల యందలి అభిమానము వదలి లేకున్నావేమిటో 
సమస్త వాసనలను, సుఖాలను మరువలేకున్నావేమిటో 
మాతప్పులు మన్నించి నీలో ఐక్యం చేసుకో కృష్ణయ్యా    
ప్రాంజలి ప్రభ

కన్నెల మనసు సుతారం
రంజిల్లును నిత్య సుకుమారం
రంగు బంగారం, రసరమ్య సౌభాగ్యంతో
రమా రమ మనసు నర్పించే శ్రీకృష్ణకు

తాంబూల పెదాల ఎరుపు దనంతో
వంటిమీద పుత్తడిపూత మెరుపుతో 
వెన్నెల వెలుగులో కళ్ళ చూపులతో
కవ్వించి నవ్వించి సంతోషం పంచె శ్రీకృష్ణకు   

ఆనందపు మాటలన్ మిపుల నందపు టాటాలన్
బాటలాన్ ముద మందంచుచు సుఖంబులన్
సందియము ఏమి లేక సర్వంబు అర్పించుటకున్
పోటీపడి ప్రియంబు కల్పించే కన్యలు బాలకృష్ణకు

లలిమనోహర రూప విలాస హావా భావములచే
యతిశయాను భవవిద్యా గోచర పరమార్ధముచే
గాత్ర కంపన గద్గదా లాపవిధులవయ్యారములచే  
కన్యలందరు నింపారు గాచి ప్రేమను పంచె శ్రీకృష్ణకు 

__((*))--    
ప్రాంజలి ప్రభ  

చిరు  నగవుల  చిన్మయ రూపం
చింతలు తొలగించే విశ్వరూపం 
చంచలాన్ని తొలగించే రూపం 
చిరస్మరణీయులకు దివ్య రూపం 

ఆత్మీయుల ఆదుకొనే ఆదర్శ రూపం   
అంధకారాన్ని తొలగిన్చే రత్న రూపం 
అక్షయ పాత్ర నందించిన రూపం 
అన్నార్తులను ఆదుకొనే రూపం 

ఉజ్వల భవషత్తును చూపే రూపం 
ఉత్తేజాన్ని శాంతపరిచే రూపం 
ఉన్మత్త, అప్రమత్తలను మార్చేరూపం
ఉషోదయ వెలుగును పంచె రూపం 

దృఢసంకల్పాన్ని పెంచే రూపం 
దుష్టత్వాన్ని అరికట్టే రూపం 
దుర్మార్గులను సంహరించే రూపం 
దు:ఖాలను దరి చేర నీయని రూపం  

పరబ్రహ్మపరమాత్మ ప్రాప్తి రూపం
అపరిమితానంద హాయిగొలిపే రూపం
ఆత్మా పరమాత్మా యందె లగ్న పరిచే రూపం
అఖిలాండకోటికి ఆనందం పంచే శ్రీ కృష్ణ రూపం

ప్రాంజలి ప్రభ

అమ్మా యశోదమ్మా
అల్లరి తట్టుకోలేకున్నామమ్మా
ఆలూమగలమధ్య తగువులమ్మా
ఆ అంటే ఆ అంటూ పరుగెడుతాడమ్మా

పాలు, పెరుగు, వెన్న, ఉంచడమ్మా
పాఠాలు నేర్పి మాయ మౌతాడమ్మా
పాదాలు పట్టుకుందామన్న చిక్కడమ్మా
పాదారసాన్ని అయినా పట్టుకోగలమామ్మా
కానీ కృష్ణుడి ఆగడాలు ఆపలేకున్నామమ్మా

అల్ల్లరి చేసినా అలుపనేది ఎరుగని వాడమ్మా 
ఆడపడుచులతో ఆటలాడుతాడమ్మా
ఆశలు చూపి అంతలో కనబడడమ్మా
అల్లరి పిల్లలతో చేరి ఆడుతాడమ్మా

తామరాకుమీద నీటి బిందువుల ఉంటాడమ్మా
వజ్రంలా మెరిసే కళ్ళతో మాయను చేస్తాడమ్మా
మన్ను తింటున్నాడు ఒక్కసారి గమనించమ్మా
బాల కృష్ణ నోరు తెరిచి చూస్తే తెలుస్తుందమ్మా

అమ్మ చూడమ్మా వాళ్ళ మాటలు నమ్మకమ్మా
సమస్త సుఖాలకు కారణం పుణ్యం కదమ్మా          
పాపం చేసిన వారికి దుఃఖం వాస్తుంది కాదమ్మా    
నా నోరుని చూడమ్మా ఏమి తప్పు చేయలేదమ్మా

కృష్ణుని నోటిలో సమస్తలోకాలు చూసింది యశోదమ్మా 
ఆనంద పారవశ్యంతో మునిగి పరమాత్మను చూసిదమ్మా 


ముద్దుగారే యశోదముంగిట ముత్యము
ప్రార్ధించిన వారికి మన:శాంతి నిత్యము
ఓర్పుతో ప్రార్ధిస్తూ చేయాలి పత్యము
శ్రీకృష్ణుని పలుకులు ఎప్పుడు సత్యము

ఆపద వచ్చినప్పుడు ధైర్యము కల్పించు
శ్రేయస్సు కలిగినపుడు సహనం వహించు
వాక్చాతుర్యంతో మనస్సును  ఆకర్షించు
శ్రీకృష్ణుని పలుకులు ఎప్పుడు సత్యము
 

నమో వెంకటేశాయ
 


అండ పిండ  బ్రహ్మా౦డ చక్ర ధారి 
ఆత్మీయత తో ఆదుకున్న ధారి 
అరవీర భయంకరుల గుండెను కూడా
కరుణ రసముతో దయ చూపిన ధారి
ఆణువణువూ ఆవరించిన శ్రీ వెంకటేశ్వరా
నమో నమో శ్రీ వెంకటేశ్వరాయ
నమో నమో శ్రీనివాసయా నమో నమ:

చిత్ర విచిత్రాల దర్శకేంద్రా
శృంగారా సాహిత్య అభిలాషా
ప్రార్ధనకై మోక్షము నందించి
మనస్సును ప్రశాంత పరిచి
సుఖ శాంతులను అందించి
ఆదుకుంటావు శ్రీ వెంకటేశ్వర
ఓం నమో వేంకటేశాయ
నమో నమ:
ఓం నమో శ్రీనివాసాయ
నమో నమ:
గోవిందా గోవిందా గోవిందా         


చిన్నప్పుడు మా అమ్మగారు ఉయ్యాలలో కృష్ణుని బొమ్మ పెట్టి ఊపుతూ పాడేది ఈ పాట గుర్తుకు
వచ్చి ఇందు పొందు పరిచా (రచయత ఎవరో తెలియదు)
శ్రీకృష్ణుని  జననము - 1 (కస్తూరి రంగరంగా - నాయన్న - కావేటి రంగరంగా)  

కస్తూరి రంగరంగా - నాయన్న - కావేటి రంగరంగా 
శ్రీరంగ రంగరంగా - నినుబాసి - యెట్లునే మరచుందురా
కంసుణ్ణి సంహరింపా - సద్గురుడు - అవతారమెత్తెనపుడూ
దేవకీ గర్భముననూ - కృష్ణావ - తారమై జన్మించెనూ

యేడు రత్రులు చేరిచీ - ఒకరాత్రి - యేకరాత్రిగజేసెను
ఆదివారము పూటనూ - అష్టమీ - దినమందు జన్మించెను
తలతోను జన్మమైతే - తనకు బహు - మోసంబు వచ్చుననుచు
ఎదురు కాళ్ళను బ్ట్టెను - ఏడుగురు - దాదులను జంపెనపుడు

నెత్తురుతొవుండి యపుడూ - ఆబాల - కావుకావున ఏడ్చుచు
నన్నేల యెత్తుకొనవే - ఓతల్లి - దేవకీ వందనంబు
ఒళ్ళెల్ల హీనంబుతో - ఈరీతి - నున్నాను కన్నతండ్రి
నిన్నెట్లు ఎత్తుకొందూ - నీవొక్క - నిముషంబు తాళరన్నా

గంగనూ ప్రార్ధించెనూ - జలనిధుల - గంగతా నుప్పొంగెను
గంగనదిలో నప్పుడూ - దేవకీ - జలకంబు లాడెనపుడు
ఇకనైన యెత్తుకొనవే - నాతల్లి - దేవకీ వందనంబు
కాని బాలుని వలెను - నన్నిట్లు - యెడబాసి యుండతగునా

నీ పుణ్యమయె కొడకా - యింకొక్క - నిముషంబు తాళుమనుచూ
కామధేనువు నప్పుడూ - దేవకీ - కడగి ప్రార్థించగాను
పాలవర్షము గురిసెను - అప్పుడా - బాలుపై చల్లగానూ
తడివస్త్రములు విడచెనూ - దేవకి - పొడివస్త్రమును కట్టెను

పొత్తిళ్ళమీద నపుడూ - బాలుండు - చక్కగా పవళించెను
తనరెండు హస్తములతో - దేవకి - తనయుణ్ణి యెత్తుకొనెను
అడ్డాలపై వేసుక _ ఆబాలు - నందచందము చూచెను
వసుదేవు పుత్రుడమ్మా - ఈబిడ్డ - వైకుంఠ వాసుడమ్మా

నవనీత చోరుడమ్మా - ఈబిడ్డ - నందగోపాలుడమ్మ
సితపత్ర నేత్రుడమ్మా - ఈబిడ్డ - శ్రీరామచంద్రుడమ్మ
శిరమున చింతామణి - నాతండ్రి - నాలుకను నక్షత్రము
పండ్లను పరుసవేది - భుజమున - శంఖచక్రములు గలవు

వీపున వింజామరం - నాతండ్రి -బొడ్డున పారిజాతం
అరికాళ్ళ పద్మములను - అన్నియూ - అమరెను కన్నతండ్రీ
నీరూపు నీచక్కనా - ఆ బ్రహ్మ - యెన్నాళ్ళు వ్రసెతండ్రీ
అన్నెకరి కడుపునా - ఓ అయ్య - ఏల జన్మిస్తివయ్య

మా యన్న కంసరాజు - ఇప్పుడూ - వచ్చు వేళాయెరన్నా
నిన్ను నే నెత్తుకోని - ఏ త్రోవ - నేగుదుర కన్నతండ్రి
ఆ చక్కదనము జూచి - దేవకి -శోకింపసాగె నపుడు
తల్లి శోకము మాంపగా - మాధవుడు - గట్టిగా ఏడ్వసాగె

శోకంబు చాలించియూ - దేవకి - బాలుణ్ణి యెత్తుకొనెను
నాయన్న వూరుకోరా - నాతండ్రి - గోపాల పవళించరా
అల్లడుగొ బూచివాడు - నాతండ్రి - వస్తాడు పవళించరా
బూచులను మర్ధించనూ - నలినాక్షి - బుద్ధిమంతుడను అమ్మా

బూచేమి చేసునమ్మా - నాతల్లి - బూచి నన్నెరుగు నమ్మా
నీ పుణ్యమాయె కొడుక - నీవొక్క - నిముషంబు తాళుమనుచు
అల్లడుగొ జోగివాడూ - నాతండ్రి - వస్తాడు పవళించరా
జోగి మందుల సంచులూ - ఏవేళ - నాచంక నుండగాను

జోగేమి చేసునమ్మా - నా తల్లి - జోగి నన్నెరుగునమ్మా
నీ పుణ్యమాయె కొడకా - నీవొక్క - నిముషంబు తాళుమనుచు
అల్లదుగొ పాము వచ్చె - నాతండ్రి - గోపాల పవళించరా
పాముల్ల రాజె అయిన - శేషుండు - పానుపై యుండగానూ

పామేమి చేసునమ్మా - నళినాక్షి - భయము నీకేలనమ్మా
నీలి మేఘపు చాయలూ - నీమేను - నీలాల హరములునూ
సద్గురుడు వ్రాసె నాడు - నాతండ్రి - నీరూపు నీచక్కన
నిన్ను నే నెత్తుకోనీ - యే త్రోవ - పొదురా కన్నతండ్రీ

నాకేమి భయములేదే - నాతల్లి - నకేమి కొదువలేదే
మా మామ కంసుకుండు - ఈ వేళ - నన్ను వెరపించవస్తే
మా మామ నాచేతనూ - మరణామై - పొయ్యేది నిజముసుమ్మూ
వచ్చు వేళాయెననుచూ - నాతల్లి - వసుదేవు పిలువనంపూ

గోపెమ్మ బిడ్డ నిపుడ్ - శీఘ్రముగ - తెచ్చి నీవుంచవమ్మా
అంతలో వసుదేవుడూ - బాలుణ్ణి - తలమీద ఎత్తుకొనెనూ
రేపల్లె వాదలోనూ - గోపెమ్మ - ఇంటనూ వచ్చెనపుడూ
గోపెమ్మ పుత్రినపూడూ - వసుదేవు - భుజముపై నెక్కించుకూ

దేవకీ తనయు డపుడు - పుట్టెనని - కంసునకు కబురాయెను
ఝల్లుమని గుండెలదర - కంసుండు - పీఠంబు దుమికె నపుడూ
జాతకంబులు చూచెనూ - గండంబు - తగిలెనని కంసుకుండు
చంద్రాయుధము దూసుకా - శీఘ్రముగ - దేవకి వద్దకొచ్చె

తెమ్మని సుతునడిగెను - దేవకి - అన్నదీ అన్నతోనూ
మగవాడు కాదురన్న - ఈ పిల్ల - ఆడపిల్ల నమ్మరా
ఉపవాసములు నోములూ - నోచి ఈ - పుత్రికను గంటినన్నా
పుత్రి దానము చేయరా - నాయన్న - పుణ్యవంతుడవురన్నా

దేవాదిదేవులైన - బ్రహ్మ రు - ద్రాదులకు పూజచేసి
పూజ ఫలములచేతనూ - వారికృప - వల్ల పుత్రికను గంటీ
నీ పుణ్యమాయెరన్న - నీవు పు - త్రికను దయచేయుమన్నా
నిర్దయాత్మకుడవగుచు - నీవిట్లు - చేయుటతగదురన్నా

ప్రేమతో చెల్లెలపుడు - అన్నను - చెయిబట్టి బ్రతిమాలెనూ
గంగాది నదులయందూ - పుత్ర దా - నము చేయమని వేడెనూ
కాదు కాదని కంసుడు - దేవకి - పుత్రికను అడిగె నపుడు
అడ్డాలపై బాలనూ - పుచ్చుకొని - ఎగరేశి నరకబోయె

అంబరమునకు ఎగురగా - వేయునపు - డా బాల కంసు జూచి
నన్నేల చంపెదవురా - నీయబ్బ - రేపల్లె వాడలోను
పెరుగుతున్నాడ వినరా - కృష్ణావ - తారమై జన్మించెనూ
నిజముగా దోచెనపుడూ - కంసుండు - యేతెంచి పవళించెనూ

రేపల్లె వాడలోనూ - పెరుగుచు - న్నాడనీ దిగులొందెను
నీ యబ్బ నీ తాతరా - కంసుడా - కృష్ణుండు పుట్టెననుచూ
చల్లమ్ము వారలెల్లా - ఆకబురు - చక్కగా చెప్పగాను
పూతకికి కబురాయెను - అప్పుడా - పూతకి చనుదెంచెను

శృంగారముగ పూతకీ - స్తనములకు - విషధార పూసుకొనెను
రేపల్లె వాడలందూ - కృష్ణుండు -  తిరుగుచున్నా చోటకూ
చనుదెంచి విషపు పాలూ - ఇవ్వనూ - సమకట్టి ఇవ్వగానూ
బాలురతొ బంతులాడ - కృష్ణూని - బాలురందరు కొట్టగా
కావుకావున ఏడ్చుచు - పరుగెత్తి - వీధినడుమన నిలచెనూ
--((*))--
 మీదగ్గర బ్లాగుల్లో నిక్షిప్తంగా శ్రీకృష్ణుని పాటలు ఉంటె నాకు పంపితే నేను ఈ వెబ్ సైట్ లో పొందు పరుస్తాను 
శ్రీకృష్ణుని లీల చదువుతన్న వారందరికీ కృతజ్ఞతలు - ఆభగవానుడు ఆయురారోగ్యములు కల్పిస్తాడని నా నమ్మకం 

Friday, 13 October 2017

శ్రీకృష్ణ లీలామృతం - 3

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ: - శ్రీ కృష్ణాయనమ:

ప్రాంజలి ప్రభ శ్రీ కృష్ణామృతం  (3 /1) 

శ్రీకృష్ణుని జననము 

భగవానుని అవతారము ప్రారంభ సమయంలో సమస్త దిక్కులు శాంతి సౌభాగ్యములతో కూడిన వాతావరణము నెలకొనెను. అసమాయమున అన్నీ శుభ శకునములు ఏర్పడెను, ఆకాశములోను శుభ నక్షత్రములు కనిపించెను. సరోవరములు వికసించిన పద్మములతో సుందరముగా ఉండెను. పక్షలు మధుర స్వరంతో గానము చేస్తుండగా మొగనెమళ్ళూ ఆడనెమళ్లతో కలసి అంనందముగా నాట్య మాడు చుండెను. వాయువు వివిధ సుఘాంధ పరిమళాలతో దేహమును సుఖ స్పర్శ కలిగించు చుండెను. చల్లని గాలులు వీచు చుండెను. మేఘములు పుష్పములవలె జల్లులు కురిపించు చుండెను.   రాక్షసుల భయము వలన ఆగిన యజ్ఞములు మరలా బ్రాహ్మణులు  ప్రాంభించిరి. రోహిణి నక్షత్రమున భగవాన్ శ్రీకృష్టుడు జన్మిస్తున్నాడని మహర్షులు దేవతలు సంతోషముతో పుష్ప వర్షమును కురిపించ సాగిరి. గంధర్వులు, కిన్నెరులు గానము చేయసాగిరి. సిద్దులు, చరణులు దేవాది దేవునిని స్తుతించ సాగిరి. స్వర్గ వాసులంతా ఆనంద పారవశ్యములో మునిగి పోయారు.            

సమస్త ప్రజానీకానికి ఈరోజు ఎంతో శుభదినము, ఒక మహనీయుడు ఉద్భవిస్తున్నాడు, ప్రజల కష్టాలు తెలుసుకొనే మహాత్ముడు జన్మిస్తున్నాడు, దివ్య ధ్వనులు ఆకాశము నుండి వెలుబడు తున్నాయి.       

దేవకీ దేవి భగవాన్ విష్ణువుని వేడుకుంటున్నది. నీకు గౌరవ పూర్వక మైన ప్రణామములు సమర్పించు కొను చున్నాను. నీవు సర్వ అవ్యక్త శక్తికిని నిర్దేశకుడవు, భౌతిక ప్రకృతికి చివరి ఆశ్రయమవు ప్రభు. కనుక నన్ను ఉగ్రసేన పుత్రుడైన కంసుని క్రూర హస్తముల నుండి రక్షించమని ప్రార్ధించు తున్నాను. ఈ భయంకర విపత్తునుండి దయతో ఉద్దరించమని కోరుచున్నాను. నీవు తాత్కాలికంగా మా చర్మచక్షువులకు అదృశ్యముగా ఉండుమని ప్రార్ధించు చున్నాను. మరోమాట నీవు సాధారణ శిశువు రూపమున జన్మించ మని కోరుచున్నాను. నీవు అవ్యాజ కృపచేత నా గర్భము నుండి ఉదయించ బోతున్నావు. నీ భక్తులను ఆనంద పరచుట కొరకై  నీవు సామాన్య మానవుల చర్యలను అనుకరించుట నాకు ఆశ్చర్యము కలిగిస్తున్నది. 

ప్రాంజలి ప్రభ శ్రీ కృష్ణామృతం  (3 /2) 
శ్రీకృష్ణుని జననము 

ఓ పరమాత్మా మీ లీలామృతం ఏమిటో నేను అర్ధం చేసుకొనే శక్తి నాకు లేదు, నీవే మమ్ము కలిపావు పుత్రులను కనే వీలు కలిపించావు, ఆరుగురు పుత్రులను నీ దగ్గరకే తీసుకెల్లఁవు, నాకు గర్భ శోకం ఎందుకు కల్పించావు, ఇది మేము చేసుకున్న కర్మ ఫలితమని అనుకుంటున్నాము, అయినా నిరంతరం నీ ధ్యానంలోనే ఉన్నాము నాకు సప్తమ గర్భం కల్పించి అంతలోనే గర్భాన్ని మార్పించావు. మాములుగా బిడ్డల జననం వీర్యం గర్భసంచిలో చేరి పిండంగా మారి నవమాసాలు మోసిన అనంతరం భూమిపై ఉద్భవించటం జరుగుతుంది. కానీ నీ జన్మ విషయం మాకు అర్ధం కావటం లేదు.

వసుదేవుని నిస్కల్ముషమైన హృదయంలో నెలకొనిన భగవానుని స్వరూపము ఉజ్జ్వలంగా ప్రకాశిస్తున్న సూర్యునివలె సంపూర్ణ శక్తులతో సహా వసుదేవుని హృదయం నుండి నా  హృదయమునకు పంపబడెను, అస్తమిస్తున్న సూర్యకిరణములు తూరుపున ఉదయించినట్లుగా                 
నాలో జీవం పోసుకున్నావా పరమాత్మా.  

పరమాత్మ నీవు నాలో నిగురుకప్పిన నిప్పువలె, కుండలో ఉంచిన అగ్నివలె ఉన్నావు నీ లీలామృతము ఎవరు తెలుసుకోగలరో వారు పుణ్యాత్ములు. 

ఓ కమలాక్షా సుద్ధసత్యమునకు మూలస్థానము.  మహర్షులు కేవలము నీ పాద పద్మములనే ధ్యానించి అజ్ణానమనే మహాసముద్రమును సులభముగా దాట గలుగు తున్నారు. భౌతిక సంసారమనే మహా సాగరమును దాట గలుగు తున్నారు. నేను ఎంతో పుణ్యము చేసుకొని ఉన్నాను నిన్ను మోసే శక్తి నాకు ఇచ్చావు, నీవు నాలో చేసే అల్లరి నాకు ఎంతో తృప్తి కలిగిస్తున్నది, గతంలో పెరిగిన బిడ్డలకు నీకు చాలా వ్యత్యాసం ఉన్నది, ఎందుకంటే నీవు నాలో పెరుగుతుంటే నాకు చాలా సంతోషముగ ఉన్నది. నీఅంతరం నాలో ఉంటె నాకు ఎంతో తృప్తిగా ఉంటుంది. 

హృదయంలో ఉన్న పరమాత్ముడు ఆ రాత్రి సమయంలో భగవంతుని సేవ కొరకే అవతరించిన దేవత అయినట్టి దేవకి మాత ఎదుట దేవాది దేవుడైన పరమాత్ముడు అవతరించెను. 
" నాలుగు భుజములలో శంఖ, చక్ర, గదా, పద్మమును మరియు శ్రీ వత్స చిహ్నముతో కౌస్తు  భదారి పీతాంబరుడు, నీలమేఘశ్యాముడిగా, ఉజ్జ్వలంగా, వైడూర్య కిరీటి అముల్యమైన కంకణ కుండల కేయూరములను అనేక భూషణములతో సర్వాంగ సుందరముగా అందమైన నీలికురులతో  అద్భుతమైన అవతారము దేవకీ వసుదేవులకు కని పించెను. 

దేవకీ వసుదేవుల ప్రార్ధించిరి, భౌతిక శక్తికూడా నీ నుండి వెలు బడుటచేత నివే మూలాధారము. నిన్ను త్రిగుణాలు కప్పలేవు, బ్రహ్మజ్యోతి నుండి సమస్త సృష్టి సంభవిస్తుంది. దానికి మూలం నీవే. నీవే మమ్ము ఉద్ధరించే మహానుభావుడవు, అన్నమాటలు వింటూ పరమాత్ముడు అంతర్ధాన మయ్యెను. 

అప్పుడే బ్రహ్మదేవుడు, ఇతరులైన ఇంద్రాది దేవతలు, నారదాది మునీస్వరులు, మొదలైన వారందరు ఆపరాత్పరుని స్తుతించుట మొదలు పెట్టిరి. అపారమైన తేజస్సుతో ఉన్న తనయొక్క భౌతిక రూపముతో, భూదేవి భారమును, మోయు దుఃఖమును తొలగించుకు దుష్టసంహారము శిష్ట రక్షణకు శ్రావణ మాసం కృష్ణ పక్షంలో అష్టమి తిధినాడు అర్ధరాత్రిన పరమాత్మ ఉదయించాడు. 

తన గర్భాన ఉదయించిన పరమాత్మను దర్శించుకొని పరవశయైన దేవాకి కంసుని విషయం  గుర్తుకు రావడంతో కంపించి పోయి స్వామితో " కృష్ణా నువ్వు జన్మించిన విషయం కంసునికి తెలియ నివ్వవద్దు, గతంలో అందరిని చంపినట్లు నిన్ను కూడా చంపేస్తాడు అంటూ మొరలిడింది" నిజ రూపముతో ఈ విషయమై మీరేమి భయపడ నవసరంలేదు అంటూ అభయ మిచ్చి పుట్టిన పురిటి కందులా మారిపోయాడు. ఆ సమయంలో దేవకి వసుదేవుల కుడా ఓ విధమైన మాయకు లోనౌయ్యారు. ఆ ప్రభావంవల్ల అంతకు ముందు స్వామి తమకు దర్శనమిచ్చిన సంగతిని మరిచిపోయి, ఆమెకు ఎనిమిదవ సంతానం కలిగందను కున్నారు.           
                                                                                               సశేషం  
ప్రాంజలి ప్రభ శ్రీ కృష్ణామృతం  (3 /3) 
శ్రీకృష్ణుని జననము 


మాతా స్వయంభువ మన్వ0తరంలో న తండ్రిఐన వసుదేవుడు ప్రజాపతులలో ఒక్కడు అతని పేరు సుతపుడు. నీవు అతని భార్య పృశ్ని . మీరు నాకోసం 1200  సంవత్సరములు తపస్సు చేసినారు. మీ తపస్సుకు మెచ్చి నేను వరము కోరుకోమనగా మీరు నాతో మూడుసార్లు పుత్రులుగా జన్మిమ్చమని కోరినారు అదే విధముగా నేను మీకు పుత్రులుగా జన్మిస్తున్నాను " మొదట జన్మలో మీకు నేను పుత్రుడగా జన్మించాను, అప్పుడు నాపేరు పృశ్నిగర్భుడు, తరువాత జన్మలో మీరు అదితి కశ్యపులుగా జన్మిమ్చారు, మీకు పుత్రునిగా జన్మిమ్చాను, అప్పుడు నాపేరు ఉపేంద్రుడు పొట్టివాడుగా ఉండుటవల్ల వామనుడు అన్నారు. ఆ తరువాత ఈ జన్మ లో మీకు జన్మిస్తున్నాను. ఈజన్మలో నాపేరు కృష్ణుడుగా  పిలుస్తారు. నాప్రియమైన జనకులారా మీరు నన్ను పెక్కుసార్లు ప్రేమాదరములతో పెంచినందున నేను సంతోషించి క్రుతజ్ఞతా బద్ధుడనైతిని. మీరు మీ కర్తవ్యము నెరవేరగానే భగవద్ధామమును పొందగలరు. ఇక మీకు కంసుని వలన భయము అవసరములేదు. కనుక నన్ను వెంటనే గోకులమునకు తీసుకెళ్లి యశోదకు ఇప్పుడే జన్మించిన ఆడ శిశువుతో నన్ను మార్పిడి చేయుడని ఆదేశిస్తున్నాను అని తెలిపి అంతర్ధాన మయ్యెను. 

దేవాది దేవుని ఆదేశాను ప్రకారము అప్పుడే పుట్టిన బాలుని ఒక తట్టలో పెట్టి దానిని నెత్తిపై  పెట్టుకొని కారాగారమునుండి బయటకు వచ్చుటకు ప్రయత్ని0చెను. యోగమాయ శక్తి వలన కంసుని అంత:పుర వాసులందరు గాఢ నిద్దర్లోకి జారుకొనగా, ద్వారాల గడియలన్నీ ఊడగా
అప్పుడే పెద్ద వెలుగు వచ్చింది, బ్రహ్మాండమైన వర్షము మొదలైనది, అయిన బయటకు నడుస్తూ ఉన్న వసుదేవుని తట్టలో ఉన్న శ్రీ కృష్ణుడు తడవ కుండా శేషుడు పడగ కప్పగా, యమునా నది చేరగా, నది రెండుగా చీలి దారి చూపెను.  ఆవల గట్టున ఉన్న గోకులంలో ఉన్న నంద మహారాజు గృహమును చేరెను. అక్కడ దేవమాయ వళ్ళ అందరు నిద్రలో మునిగి ఉన్నారు శ్రీ కృష్ణనిని యశోద వడిలో ఉంచి, అప్పుడే పుట్టిన ఆడ శిశువును బుట్టలో పెట్టుకొని వచ్చన మార్గమున వెనక్కు వచ్చి చెరసాలలో చేరి యధావిధిగా ఇనుప సంకెళ్లను తగిలించుకొని  ఉండెను.

యోగమాయ చేసినవి ఎవరూ తెలుసు కోలేక ఉన్నారు. అప్పుడే చెరసాలలో  పిల్ల ఏడుపు వినగా సైనికులు మేల్కొన్నారు ఆవిషయం కంసుని తెలపాలని వెళ్లారు 

                                                         మిగతా కధలో కంసుని కూర చర్యలు తెలుసుకుందాం                                 
                       
   

Thursday, 12 October 2017

శ్రీకృష్ణ లీలామృతం - 2

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ: - శ్రీ కృష్ణాయనమ:

ప్రాంజలిప్రభ . బలరామ జననం -2

కంసుడు యదుభోజాంధక వంశములవారి రాజ్యములను ఆక్రమించుకొనుటయేకాక . కొందరని ఒప్పందంతో లోబరుచు కొనెను జరాసంధునితో సంధి చేసుకొని, అత్యంత శక్తి మంతుడుగా మారెను.

వశుదేవుడు కంసుడు పెట్టె భాదలు భరిస్తూ పుట్టిన ప్రతి శిశువును కంసునికీ ఇవ్వగా ప్రతివక్కరిని గాలిలోకి విసీరి కత్తి నిలువుగా ఉంచి ఆరుగురు పుత్రులను హతమార్ఛెను. అమితమైన గర్వముతో ఉండెను.

దేవాదిదేవుడు యౌగమాయతో ఈవిధముగా పలికెను.
దేవకీవసుదేవులు కంసుని నిర్భంధములో ఉన్నారు. నా స్వాంశరూపమైన శేషుడు దేవకీ గర్భములో ఉన్నాడు 
శేషుని దేవకీ గర్భము నుండి రోహిణీ గర్భములో నికి మార్చము. నేను అనంతరం సంపూర్మశక్తులతో దేవకీ గర్భములో ప్రవేశింతును.నీవు వ్రృందావనములో నందయశోదలకు పుత్రికగా జన్మించవలెను అని పలికెను.

దేవకీ వసుదేవుల కన్నబిడ్డలను (దేవతలు కీర్తిమంతులను) కంసునకు అప్పచెప్పటం కిరాతంగా హతమార్చడం ఏడవ గర్భం కోసం వేచి ఉండటం జరిగింది. శాపమగర్భము యోగమాయ దేవకీ గర్భమునుండి పిండాన్ని రోహిణి గర్భములో ప్రవేశపెట్టి నందున బలరాముని జన్మ ఉద్బవించెను, పౌరజనులు దేవకికి గర్భ పాతమైనదేమో అని ఆచర్య చికితులైనవారు. కంసుడికి మాత్రం అనుమానం వచ్చింది. ఇక్కడేదో మాయ జరిగింది. ఎం జరిగింది , ఎం జరిగింది, అష్టమ గర్భము రాకముందే ఏమిటి ఈ మాయ, మేధావులైన వారిని విచారించాడు, నిద్రపట్టుటలేదు, కాళ్ళునిల బడుటలేదు, ఎవరు ఏమి చెప్పిన వినిపించుకోలేని స్థితి లో ఉన్నాడు కంసుడు.  

కంసుడు కోపాన్ని చూసి ఋషులు యిట్లా అన్నారు, "గొప్ప కారూరుడైనట్టి వ్యక్తి జీవించినను అతడు మృతునితో సమానుడే. కౄరుడైనట్టి వ్యక్తిని ఎవరును జీవితకాలములో ప్రేమించరు, మరణించిన  పిదప శపింతురు. అతడు దేహమే తానను దేహాత్మబుద్ధి కలవాడగుట చేత గాఢాంధకారమైనట్టి నరకములో త్రోయుదురు అన్న ఋషుల మాటలకు చాలా కోపముతో కంసుడు వారిని చిత్రవధ చేయగా కృష్ణ కృష్ణ అని ఆరవ సాగారు. 

ఆ సమయములో బ్రహ్మదేవుడు,పరమశివుడు, నారదాది మహర్షులు పెక్కుమంది దేవతలు  అదృస్యముగా కంసుని భవనమునకు చేరిరి. వారి రాకతో అమోఘమైన వెలుగు ఆప్రాంతమంతా వ్యాపించింది. అక్కడున్న కొందరు హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే మాటలు మారుమ్రోగినాయి.     
దేవకీమాత వద్దకు దేవతలు వెళ్లి కంసునివల్ల మీరు భయపడ నవసరము లేదు, అష్టమగగ్ర్భమున శ్రీకృష్ణ పరమాత్ముడు జన్మించ బోతున్నాడు. కనుక తల్లీ ఇవుడు ధైర్యముగా ఉండగలవు. దేవాదిదేవుడు తన సమస్త పూర్ణాంశ  విస్తరణలతో అవతరిస్తున్నాడు. ఆయన ఆది పురుషుడైన దేవాదిదేవుడు.  లోకకళ్యాణము కొరకై అవతరిస్తున్నాడు. కనుక నీవు భోజవంశపు రాజైన నీ  సోదరుణ్ణి చూచి భయపడ నవసరము లేదు.  ఆదిపురుషుడు, దేవాది దేవుడు అయినట్టి నీ  పుత్రుడు  శ్రీకృష్ణుడు పవిత్ర మైన యదువంశమును రక్షించుటకు అవతరిస్తున్నాడు.  దేవాది దేవుడు ఒంటరిగా కాకుండా తన స్వా౦శావతారమైన బలరామునితో సహా అవతరిస్తున్నాడు.బలరాముడు ముందుగా జన్మించాడు. రుక్మినివద్ద పెరుగుతున్నాడు అతడే నిష్పమా గర్భమున పుట్టినవాడు దేవమాయతో అక్కడ పెరుగుతున్నాడు. అని చెప్పారు 

శ్రీ కృష్ణుడి భూభారమును తగ్గించుటకే కాకుండా యదువంశ లక్ష్యములను పరి రక్షించుటకును, మిమ్ము రక్షించుటకును అవతరిస్తున్నాడు.  సమస్త ప్రజల హృదయాలలో ఉండి వారి కోర్కెలను తీర్చుటకు అవతరిస్తున్నాడు. సమస్త దేవతలు శ్రీకృష్ణుని ఆరాధిస్తూ వారి ష్వర్గధామాలకు బయలుదేరిరి.                                                                                                                                   
                                                                                                                                    సశేషం 

...


Sunday, 8 October 2017

శ్రీ కృష్ణ లీలామృతం -1

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ: - శ్రీ కృష్ణాయనమ:
ప్రాంజలి ప్రభ -1
వినుడు  వినుడు శ్రీ భాగవతం
శ్రీకృష్ణ పరమాత్ముని దివ్య చరితం
శ్రీకృష్ణ లీలామృతం -1


1. శ్రీ కృష్ణభగవానుని అవతరణము.

ఒకప్పుడు రాక్షస ప్రవృత్తిగల రాజులుండెను, పరిపాలనా భరించలేక భూమి కృంగి పోచుండెను, భూదేవి రాజులవల్ల వచ్చు చున్న ఉపద్రవమును, గమనించి గో రూపమును ధరించి కన్నుల వెంబడి నీరు కారుస్తూ నిస్సహాయు రాలుగా బ్రహ్మ లోకమునకు చేరి  విన్న వించెను. బ్రహ్మ, శివ, భూదేవి అందరు కలసి  పాల సముద్రముచేరి పూర్వము దివ్య వరాహావతారమును దాల్చి భూమి ఉద్ధరించిన విష్ణు భగవానుని స్తుతింప సాగెను.  

బ్రహ్మ దేవునకు విష్ణు భగవానుడు ఒక సందేశము ప్రసారము చేసెను, దుష్టశిక్షణ శిష్టరక్షణ కోసం భూలోకంలో అవతరిస్తాను, దేవతలందరు తమతమ అంశాలతో భూలోకంలో జన్మించాలని సూచనలను అందించెను.    
ఆవిధముగా భూదేవికి ఓదార్పు కల్పించి తిరిగి పంపి వేసెను

ఆకాలంలో యదువంశములో ప్రముఖుడైన  సూరసేన మహారాజు మధుర దేశమును, సూరసేన మండలమును పరిపాలిస్తూ ఉండెవాడు.  ఒకప్పుడు సూరసేన మహారాజు పుతృడైన వసుదేవుడు దేవకిని వివాహమాడి నూతన వధువుతో పాటు తన రథములో రాచ నగరమునకు వెడుతుండెను. ఆసమయంలో ఉగ్రసేన పుత్రుడైన కంసుడు  (కంసుని తండ్రి ఉగ్రసేనుడును దేవకి తండ్రి  దేవకుడును అహకుని పుత్రులై నందున వారు సోదరులు. కనుక దేవకి కంసునికి వరుసకు మాత్రమే సోదరి అయినను ఆవిడ సొంత సోదరిగానే చలామణి అయినది.)
కనుక సోదరుడు సోదరి అత్తవారింటి వరకు వెళ్లదలచి వాసుదేవుని రధమును కంసుడే స్వయముగా రధమును తోలుచుండెను.రంగ రంగ వైభవముగా ఊరేగింపు సాగు చుండెను. 

కంసుడు సంతోషముతో రధమును తోలుతున్న సమయమున హఠాత్తుగా ఆకాశమునుండి ఆశ్చర్యకరమైన ఓ అశరీరవాణి వినిపించెను. ప్రత్యేకించి కంసుని సంభోదిస్తూ ఆ వాక్కు ఇట్లనెను "కంసా నీవు ఎంతటి  అవివేకివి? నీవు నీ  సోదరి, నీ బావ ప్రయాణిస్తున్నట్టు రధమును తొలుచున్నావు. కానీ నీ  సోదరి అష్టమ గర్భములో జన్మించు శిశువు నిను చంపునని నీకు తెలియదు ". అని పలికెను. 

భోజ వంశమునకు చెందిన రాక్షస ప్రవృత్తిగల కంసుడు "భవిష్యవాణి" మాటలు విని ఉగ్రుడై వెంటనే దేవకీ దేవి కేశములు పట్టుకొని కత్తితో వధించుకు సిద్ధ పడెను . కంసుని శాంతపరుచుటకు వసుదేవుడు ఈవిధముగా పలికెను.  
                                                                                                                                  సశేషం 
వసుదేవుడు కంసునితో ఈ విధముగా పలికెను

కంసా నీవు పుట్టిన నాడే మరణం వ్రాసి ఉన్నది, ఇప్పుడు నీ మరణ విషయము తెలియగానే భయము నీలో ప్రవేశించినదా, కర్మానుసారము జీవితాన్ని నీవు అనుభవించ వలసినదే. గొంగళి పురుగులాగా శరీరమును మార్చుకుంటూ కొమ్మ కొమ్మ తిరగ వలసినదే, నీకు ఒక అడుగు బలము తెలిసాకా మరో అడుగు వేయక తప్పదు, అదేవిధముగా జీవుడు ఈ భౌతిక ప్రపంచములో బద్ధుడై ప్రకృతిని అనుసరించి ఒక శరీరము అనుభవించి మరణానంతరము మరొక శరీరమునకు పోక తప్పదు, చావు బ్రతుకుల తప్ప వేరొక మార్గము లేదు, నీవు ప్రేమించిన చెల్లినే కిరాతముగా చంపాలని పూనుకున్నావు.

అట్లే నీవు నిద్రలో అనేక కలలు కంటావు ఆ సమయంలో దేహము ఆకాశములో సంచరించినట్లు, ఎవరో చంపుతున్నట్లు, బంగారము మనకు ఇస్తున్నట్లు స్వప్నములో చూస్తాము, అప్పుడు మనదేహము పూర్తిగా విస్మరిస్తాము, నూతన దేహములతో సంబంధము కలగవచ్చును నిద్రలో, మేల్కొన్నాక వాటినన్నింటిని విస్మరిస్తాము. ఈ భౌతిక దేహాలన్నీ మానసిక కల్పనల సృష్టియే.

మనస్సు చంచలమైనది ఇది ఒక సమయాన ఒక విషయాన్ని క్షణంలో సమర్ధిస్తుంది  మరోక్షణంలో దాన్నే విమర్శిస్తుంది. మానసిక కల్పనలచేత జీవుడు విభిన్న మార్గాలద్వారా ప్రయాణం చేయుట మొదలు పెడుతాడు, న్యాయం అన్యాయం అనేది గమనించాడు, తక్షణం పని పూర్తి చేయాలని ఆలోచన అప్ప వేరో ఆలోచన రానే రాదు, అందుకే ఒక్క నిముషము ఆలో చించి ఏ పని నైనా చేయమన్నారు.
కంసా నీ దేహము మరియు మనస్సుల ఆదేశములకు వసుడవు కావలదని ప్రార్ధించు చున్నాను.                        
ఎవరు యితరుల పట్ల అసూయ చెంద వలదు, పెంచిన మొక్కని పీకుటకు ప్రయత్నం చేయ వలదు,
దేవకి నీ సోదారి ఆమెను చంపుట పూనుకొనుట మంచిది కాదు, ఏమైనను పరిస్థితి చాలా సున్నితమైనది వివాహ శుభ సమయము కావున నీవు దేవకిని వధించినచో నీ గొప్ప కీర్తికి భంగము వాటిల్లును అనియు వాసుదేవుడు విన్న వించెను.

కంసుడు రాక్షస స్వభాము ఉండుటవల్ల ఎటువంటి మంచి మాటలు తలకెక్కలేదు.
వసుదేవుడు కంసునితో ఈ విధముగా పలికెను " ప్రియమైన బావా నీ సోదరి నుండి నీకు ఎట్టి అపాయము కలగదని దయచేసి విశ్వసింపుము, నీకు కలగబోయే అపాయము సోదరి పుతృనివలన కదా ఆలోచించు నీవు సురక్షితుడవు ఆమెకు పుతృలు కలిగినప్ప్పుడు , నీవు సముచితమైన నిర్ణయము తీసుకొనవచ్చును, వారిని నీకు సమర్పించునని వాగ్దానము చేయుచున్ననుఁ

కంసుడు చివరికి వసుదేవుని వాగ్దాన మాటలు విని తాత్కాలికంగా సోదరిని వధించుట అనే  పాపకర్మకు పూనుకొనుట మానుకొనెను, ఇద్దరినీ తన గృహమునకు తీసుకోని వెళ్లెను.          
                                                                                                                                   సశేషం

కంసుడు దేవకీ వసుదేవులకు సాధారణముగా ఆహ్వానించి తన మందిరములో సకల సదుపాయాలు ఏర్పాటు చేసి కట్టు దిట్టమైన రక్షణ ఏర్పాటు చేసి వాగ్దానమును నెరవేర్చు కోమని హెచ్చరించి రక్షక భటులకు తగు సూచనలు ఇచ్చి వెళ్లి పోయెను.

దేవకీ వసుదేవులకు మొదటి పుత్రుడు పుట్టగానే వసుదేవుడు తన వాగ్దాణము ప్రకారము కంసునకు అప్పగించెను. కంసుడు ఆశ్చర్యపడి అతడి ప్రవర్తనకు సంతోషించి ఇట్లు పలికెను " ప్రియమైన వసుదేవ ఈ శిశువు వలన నాకు ఎటువంటి అపాయము లేదు, నాకు ఎనిమదవ సంతానము వళ్ళ మరణము అని భవిష్య వాణి చెప్పినది, నీవు ఈ శిశువును తీసుకోని వెళ్లుము అనెను.
నారదుడు అప్పుడే ప్రత్యక్షమై బృందావనంలో నందమహరాజు, గోపాలురు, గోపికలుగా దేవతలు, ఋషులు  పుట్టారు.
Image result for sri krishna paramatma images

ఆమాటలకు కంసుడు దేవతలవల్ల రాక్షసులకు ఎప్పటికైనా హాని కలుగునని భావించి కోపము తెచ్చుకొని ఏ శిశువులో నైనా శ్రీకృషుడు ఉండవచ్చునని భావించి వసుదేవుని పుతృని వధించుటకు నిర్ణయించి దేవకీ వసుదేవులకు కారాగారంలో బంధించి ఉంచెను. మొదటి పుత్రుని వధించెను.

నారదుడు ద్వారా కంసుడు పూర్వజన్మ వృత్తాంతము తెలుసుకొనెను. పూర్వజన్మలో కాలనేమి అను రాక్షసుడని విష్ణువు చేతిలో మరణించినట్లు తెలుసుకొనెను. ఈ జన్మలో అదే కృష్ణుని చేతిలో నాకు మృత్యువు వున్నదని గ్రహించెను.

కంసుడు అనతండ్రి యైన ఉగ్రసేనుణ్ణి చెరసాలలో పెట్టెను,వసుసుదేవుని తండ్రి అయన సూరసేనుణ్ణి బందించి అతని రాజ్యము కూడా ఆక్రమించెను. ఆరాజ్యము కూడా తనదే నని చెప్పి పాలించు చుండెను.
వసుదేవునితో ధర్మము తప్పక పుట్టిన పుత్రులను నాకు అప్పగించుము అనెను. అట్లేనని దేవకీ వసుదేవుల చెరసాలలో భాదతో ఉండేను.  

                                                                                                                                      సశేషం