ప్రాంజలి ప్రభ.... సేకరణ : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
నవమ స్కంధము - ఇరువది రెండవ అధ్యాయము
ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
శ్రీశుక ఉవాచ
22.1 నుండి 19 శ్లోకాల భావము
శ్రీశుకుడు పలికెను పరీక్షిన్మహారాజా! ముద్గలుని కుమారుడైన దివోదాసునకు మిత్రేయుడు అను పుత్రుడు పుట్టెను. మిత్రేయునకు చ్యవనుడు, సుదాసుడు, సహదేవుడు, సోమకుడు - అను నలుగురు సుతులు కలిగిరి. వారిలో సోమకునకు వందమంది తనయులు జన్మించిరి. ఆ నూరుగురిలో జంతుడు అనువాడు పెద్దవాడు, పృషతుడు చిన్నవాడు. పృషతుని తనూజుడు ద్రుపదుడు. ద్రుపదునకు ద్రౌపది అను కూతురును, దృష్టద్యుమ్నుడు మొదలగు కుమారులును కలిగిరి.
ధృష్టద్యుమ్నుని తనయుడు ధృష్టకేతువు. భర్మ్యాశ్యుని వంశమునకు చెందిన వీరు అందరును పాంచాలురు అని పిలువబడిరి. అజమీఢుని మరియొక పుత్రుడు ఋక్షుడు. అతని సుతుడు సంవరణుడు. సంవరణుడు సూర్యుని పుత్రికయగు తపతి అను కన్యను వివాహమాడెను. సంవరణునివలన తపతియందు కురువు అనువాడు జన్మించెను. అతడు కురుక్షేత్రము అను ప్రదేశమును పాలించెను. అతనికి పరీక్షిత్తు, సుధన్వుడు, జహ్నువు, విషధాశ్వుడు అను నలుగురు పుత్రులు కలిగిరి.
సుధస్వుని కుమారుడు సుహోత్రుడు, అతని తనయుడు చ్యవనుడు. చ్యవనుని సుతుడు కృతి. కృతియొక్క పుత్రుడు ఉపరిచరవసువు. అతనికి బృహద్రథుడు, కుశాంబుడు, మత్స్యుడు, ప్రత్యగ్రుడు, చేదిపుడు అను ఐదుగురు కొడుకులు కలిగిరి. వారు అందరును చేది దేశమునకు పాలకులైరి. బృహద్రథుని పుత్రుడు కుశాగ్రుడు, అతని తనూజుడు వృషభుడు.
వృషభుని వలన పుట్టినవాడు సత్యహితుడు (సత్యవంతుడు). అతని సుతుడు పుష్పవంతుడు. పుష్పవంతుని తనయుడు జహువు. బృహద్రథుని యొక్క మరియొక భార్య గర్భమునుండి రెండు శకలములు ఉద్భవించెను. ఆ రెండు ఖండములను తల్లి బయట పడవేసెను. జర అను రాక్షసి ఆ రెండు ముక్కలను వినోదముగా జతపరచి జీవింపుము-జీవింపుము అని పలికెను. అట్లు జతపరచబడిన ఆ శరీరము సజీవమయ్యెను. ఆ బాలకుడే జరాసందుడు. జర అను రాక్షసిచే సంధింపబడినాడు కావున, అతడు జరాసంధుడుగా వ్యవహరింపబడెను.
జరాసంధుని కొడుకు సహదేవుడు. అతని సుతుడు సోమాపి. సోమాపి తనయుడు శ్రుతశ్రవుడు. కురువు యొక్క పెద్దకుమారుడగు పరీక్షిత్తునకు ఎట్టి సంతానమూ లేకుండెను. కురువుయొక్క మూడవ కుమారుడైైన జహ్నునకు సురథుడు అనువాడు జన్మించెను. అతని సుతుడు విదూరథుడు. అతని కొడుకు సార్వభౌముడు, సార్వభౌముని పుత్రుడు జయసేనుడు. అతిని వలన రాధికుడు కలిగెను. రాధికుని తనూజుడు ఆయుతుడు.
22.11 (పదకొండవ శ్లోకము)
ఆయుతుని వలన క్రోధనుడు పుట్టెను. అతని కుమారుడు దేవాతిథి. దేవాతిథియొక్క తనయుడు ఋష్యుడు (ఋక్షుడు). ఋష్యుని తనయుడు దిలీపుడు. అతని సుతుడు ప్రతీపుడు. అతని వలన దేవాపి, శంతనుడు, బాహ్లికుడు అను ముగ్గురు కొడుకులు కలిగిరి. వారిలో దేవాపి తండ్రివలన తనకు లభించిన రాజ్యమును (రాజ్యాధికారమును) త్యజించి వనములకు వెళ్ళెను.
దేవాపి వనములకు వెళ్ళుటతో అతని తమ్ముడగు శంతనుడు ఆ దేశమునకు రాజయ్యెను. పూర్వజన్మలో ఈ శంతనుని పేరు మహాభిషుడు. అతడు మహిమాన్వితుడు. అతని కరస్పర్శ ప్రభావమున ముసలివాడు యువకుడై, శాంతిని పొందును. కనుక, అతడు శంతనుడు గా ప్రసిద్ధికెక్కెను. ఈ శంతనుడు పరిపాలించుచున్నప్పుడు అతని రాజ్యమున వరుసగా పన్నెండు సంవత్సరములూ వానలు పడకపోవుటచే తీవ్రమైన కరవు ఏర్పడెను.
కాటక పరిస్థితులకు కారణము అడుగగా బ్రాహ్మణులు శంతనునితో ఇట్లనిరి - "నీవు నీ అన్నయగు దేవాసి బ్రతికియుండగనే వివాహము చేసికొని, రాజ్యాధికారమును పొందితివి. కనుక నీవు పరివేత్త అనబడుదువు.
అన్నకంటెను ముందుగా పెండ్లి చేసికొని, అగ్నికార్యములను ఆచరించినవాడు పరివేత్త అని యనబడును. ఆ స్థితిలో ఉన్న అగ్రజుడు (అన్న) పరివిత్తి అని వ్యవహరింపబడును.
కనుక నీ నగరము, రాష్ట్రము (రాజ్యము) అభివృద్ధిని పొందవలెనని భావించినచో, నీవు వెంటనే నీ అన్నకు రాజ్యమును ఇచ్చివేయుము. అనగా రాజ్యాధికారమును అప్పగింపుము. అట్లొనర్చినచో, నీ రాజ్యము సుభిక్షముగా ఉండును.
బ్రాహ్మణులు ఇట్లు పలికిన పిమ్మట శంతనుడు తన అనుయాయులతో అన్నకడకు (వనములకు) వెళ్ళి రాజ్యమును స్వీకరింపుము అని ప్రార్థించెను. కాని, శంతనునియొక్క మంత్రియైన అశ్మరావ అను వాని ప్రేరణచే కొందరు బ్రాహ్మణులు దేవాపి కడకు వెళ్ళి వేదవిరుద్ధమైన బోధనలను గావించిరి. వారి బోధనల ప్రభావముతో అతడు (దేవాపి) వైదిక సంప్రదాయమును అనుసరించి, గృహస్థాశ్రమమును స్వీకరించుటకు మారుగా వేదములను నిందింపదొడగెను. అందువలన అతడు రాజ్యాధికారమునకు దూరమయ్యెను. అంతట శంతనుని రాజ్యములో వర్షములు కురిసెను. పిమ్మట దేవాపి యోగసాధనను కొనసాగించుచు యోగులకు ప్రముఖ స్థానమైన కలాప గ్రామమును ఆశ్రయించెను. కలియుగమునందు చంద్రవంశము పతనము కాగా, అతడు (దేవాపి) కృతయుగారంభమున ఆ వంశమును మరల స్థాపించును. శంతనుని తమ్ముడైన బాహ్లికుమారుడు సోమదత్తుడు. అతనికి భూరి, భూరిశ్రవుడు, శలుడు అను ముగ్గురు కుమారులు కలిగిరి. శంతనుని వలన గంగాదేవి యందు భీష్ముడు జన్మించెను. అతడు జితేంద్రియుడు, సకలధర్మములను బాగుగా ఎఱిగినవాడు. పరమ భాగవతోత్తముడు, ఉత్తమ జ్ఞానసంపన్నుడు.
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి నవమ స్కంధములోని ఇరువది రెండవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
పాంచాల - కౌరవుల - మగధరాజుల వంశముల వర్ణనము
'భార్యా సంగమము జరిపినచో నీవు మృతి చెందెదవు' అని పాండురాజును కిందమహాముని శపించెను. అందువలన ఆయన పెద్దభార్యయగు కుంతియందు యమధర్మరాజు వలన యుధిష్ఠిరుడు (ధర్మరాజు), వాయుదేవుని వలన భీముడు, ఇంద్రుని వలన అర్జునుడు జన్మించిరి. అట్లే పాండురాజుయొక్క రెండవ భార్యయైన మాద్రియందు అశ్వినీదేవతల (అశ్వినీకుమారుల) వలన నకుల సహదేవులు పుట్టిరి. వీరు అందఱును మహారథులు. ఈ పంచపాండవులవలన ద్రౌపదియందు ఐదుగురు సుతులు కలిగిరి. వీరందరును నీకు (పరీక్షిన్మహారాజునకు) పెదతండ్రులు. రాజా! యుధిష్ఠిరునివలన ప్రతివింధ్యుడు, భీమసేనుని వలన శ్రుతసేనుడు, అర్జునుని వలన శ్రుతకీర్తి, నకులుని వలన శతానీకుడు, సహదేవుని వలన శ్రుతకర్మ అనువారు ద్రౌపదియందు జన్మించిరి. ఇంకను ధర్మరాజునకు పౌరవి అను నామెయందు దేవకుడు, భీమునకు హిడింబియందు ఘటోత్కచుడు, కాళి అను నామెయందు సర్వగతుడు అనువారు జన్మించిరి. అట్లే సహదేవుని వలన పర్వతుని కూతురైన విజయ అను నామెయందు సుహోత్రుడు పుట్టెను.
నకులుని వలన కరేణుమతి అనునామె యందు నిరమిత్రుడు జన్మించెను. అర్జునుని వలన నాగకన్యయైన ఉలూపియందు ఇరావంతుడు, మణిపూరమహారాజు యొక్క పుత్రికయైన చిత్రాంగదయందు బభ్రువాహనుడు జన్మించెను. ఇతడు తన తాతయైన మణిపూరమహారాజు కడనే పెరిగి పెద్దవాడైనందున ఆ మహారాజుచే పుత్రుడుగా పరిగణింపబడెను.
మీ తాతయగు అర్జునునివలన సుభద్రయందు మీ తండ్రియగు అభిమన్యుడు జన్మించెను. ఆ అభిమన్యుడు మహావీరుడు. అతిరథులను అందరిని జయించినవాడు. ఆ వీరాభిమన్యుని వలననే ఉత్తరయందు నీవు పుట్టితివి.
కురుక్షేత్ర యుద్ధమున దుర్యోధనాది కౌరవులు ఎల్లరును మరణించుటచే కృద్ధుడైన అశ్వత్థామ మాతృ గర్భములో నున్న నీపై బ్రహ్మాస్త్రమును ప్రయోగించెను. కాని, శ్రీకృష్ణపరమాత్మ యొక్క అనుగ్రహమున నీవు మృత్యువునుండి రక్షింపబడి సజీవుడవైతివి.
నాయనా! పరీక్షిన్మహారాజా! జనమేజయుడు, శ్రుతసేనుడు, భీమసేనుడు, ఉగ్రసేనుడు అను నీ కుమారులు ఇచ్చటనే యున్నారు. వీరు అందరును మిక్కిలి పరాక్రమవంతులు.
ఇక మున్ముందు జరుగబోవు విషయములను గూడ చెప్పెదను వినుము. నీవు తక్షకుని కాటునకు గుఱియై మృత్యువు పాలగుదువు. అంతట జనమేజయుడు మిగుల క్రుద్ధుడై సర్పయాగమొనర్చి, ఆ అగ్నియందు సర్పములను అన్నింటిని ఆహుతి యొనర్చు
పిదప జనమేజయుడు కవష (కలష) తనయుడగు తురుని పురోహితునిగా జేసికొని అశ్వమేధయాగమును ఆచరించును. అనంతరము సమస్త భూమండలమును జయించి, యజ్ఞములద్వారా భగవంతుని ఆరాధించును.
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి నవమ స్కంధములోని ఇరువది రెండవ అధ్యాయము ఇంకను కొనసాగును)
వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం
నవమ స్కంధము - ఇరువది రెండవ అధ్యాయము
పాంచాల - కౌరవుల - మగధరాజుల వంశముల వర్ణనము
ఓం నమో భగవతే వాసుదేవాయ
జనమేజయుని కుమారుడైన శతానీకుడు యాజ్ఞవల్క్య మహామునినుండి ఋగ్యజుస్సామ వేదములను, కర్మకాండకు సంబంధించిన తదితర మంత్రములను అభ్యసించును. కృపాచార్యుని కడ అస్త్రవిద్యయందు శిక్షణను పొందును. అట్లే శౌనకునివలన ఆత్మజ్ఞానమును సాధించి, తద్ద్వారా పరమేశ్వరుని అనుగ్రహమునకు పాత్రుడగును.
శతానీకుని పుత్రుడు సహాస్రానీకుడు. అతని పుత్రుడు అశ్వమేధజుడు. అశ్వమేధజుని తనయుడు అసీమ కృష్ణుడు. అతని సుతుడు నేమిచక్రుడు.
హస్తినాపురము గంగానదియందు మునిగిపోయినప్పుడు నేమి చక్రుడు తన నివాసమును కౌశాంబి నగరమునకు మార్చుకొని, అచట సుఖముగా ఉండును. నేమిచక్రునకు చిత్రరథుడు అను తనయుడు కలుగును. అతనికి కవిరథుడు అను కొడుకు పుట్టును.
కవిరథునకు వృష్టిమంతుడు, అతనికి సుషేణుడు కలుగుదురు. సుషేణుడు గొప్ప పరిపాలకుడు అగును. సుషేణుని తనయుడు సునీథుడు. అతని పుత్రుడు నృచక్షువు. నృచక్షుని కుమారుడు సుఖీనలుడు.
సుఖీనలునకు పరిప్లవుడు, పరిప్లవునకు సునయుడు, అతనికి మేధాని తనయులగుదురు. మేధాని కుమారుడు నృపంజయుడు, అతని సుతుడు దూర్వుడు. దూర్వునకు తిమి అను తనూజుడు కలుగును.
తిమి యొక్క పుత్రుడు బృహద్రథుడు; అతని కుమారుడు సుదాసుడు. సుదాసుని తనయుడు శతానీకుడు. అతనికి దుర్దమనుడు అను తనయుడు కలుగును. అతని సుతుడు బహీనరుడు.
బహీనరునకు దండపాణి అను సుతుడు కలుగును. అతని కుమారుడు నిమి. నిమికి క్షేమకుడు పుట్టును. అతడు మహారాజుగా ఖ్యాతి వహించును. పరీక్షిన్మహారాజా! ఇంతవరకును చంద్రవంశము నందలి బ్రాహ్మణ, క్షత్రియ గోత్రజులను గూర్చి వివరించితిని. వీరందరును ధర్మనిరతులైనందున దేవతలయొక్క, ఋషులయొక్క అనుగ్రహములకు పాత్రులైరి. వారినుండి ఆశీస్సులను, సత్కారములను పొందిరి.
కలియుగమునందు సోమ (చంద్ర) వంశజుల పరంపరలో క్షేమకుడే చివరివాడు. అతడు మహారాజుగా ప్రసిద్ధి వహించును. ఇక భవిష్యత్తులో మగధదేశమును పరిపాలించెడి రాజులను గూర్చి తెలిపెదను వినుము.
జరాసంధుని కుమారుడైన సహదేవునకు మార్జారి అనువాడు కలుగును. మార్జారి తనూజుడు శ్రుతశ్రవుడు. అతని సుతుడు అయుతాయువు. అయుతాయువునకు నిరమిత్రుడు అను కొడుకు పుట్టును.
నిరమిత్రుని తనయుడు సునక్షత్రుడు. అతని సూనుడు బృహత్సేనుడు. అతనికి కర్మజిత్తు అను కుమారుడు జన్మించును. కర్మజిత్తునకు సుతంజయుడు, అతనికి విప్రుడు, విప్రునకు శుచి అను వారు పుత్రులు అగుదురు.
శుచివలన క్షేముడు, అతని వలన సువ్రతుడు, అతనికి ధర్మసూత్రుడు అనువారు జన్మింతురు. ధర్మసూత్రునకు శముడు, అతనికి ద్యుమత్సేనుడు, అతనివలన సుమతి, సుమతికి సుబలుడు కలుగుదురు.
సుబలుని కుమారుడు సునీథుడు. అతని తనయుడు సత్యజిత్తు. అతని తనూజుడు విశ్వజిత్తు. అతనికి రిపుంజయుడు పుట్టును. వీరు అందరును బృహద్రథుని పరంపరకు చెందిన రాజులు, వీరు రాబోవు వేయి సంవత్సరములవరకును కీర్తిప్రతిష్ఠలతో వర్ధిల్లుదురు.
ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం నవమస్కంధే ద్వావింశోఽధ్యాయః (22)
ఇది భాగవత మహాపురాణమునందలి నవమ స్కంధమునందు ఇరువది రెండవ అధ్యాయము (22)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
సేకరణ
ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
శ్రీశుక ఉవాచ
22.1 (ప్రథమ శ్లోకము)
మిత్రేయుశ్చ దివోదాసాచ్చ్యవనస్తత్సుతో నృప|
సుదాసః సహదేవోఽథ సోమకో జంతుజన్మకృత్॥8065॥
22.2 (రెండవ శ్లోకము)
తస్య పుత్రశతం తేషాం యవీయాన్ పృషతః సుతః|
(స తస్మాద్ద్రుపదో జజ్ఞే సర్వసంపత్సమన్వితః)
ద్రుపదో ద్రౌపదీ తస్య ధృష్టద్యుమ్నాదయః సుతాః॥8066॥
శ్రీశుకుడు పలికెను పరీక్షిన్మహారాజా! ముద్గలుని కుమారుడైన దివోదాసునకు మిత్రేయుడు అను పుత్రుడు పుట్టెను. మిత్రేయునకు చ్యవనుడు, సుదాసుడు, సహదేవుడు, సోమకుడు - అను నలుగురు సుతులు కలిగిరి. వారిలో సోమకునకు వందమంది తనయులు జన్మించిరి. ఆ నూరుగురిలో జంతుడు అనువాడు పెద్దవాడు, పృషతుడు చిన్నవాడు. పృషతుని తనూజుడు ద్రుపదుడు. ద్రుపదునకు ద్రౌపది అను కూతురును, దృష్టద్యుమ్నుడు మొదలగు కుమారులును కలిగిరి.
22.3 (మూడవ శ్లోకము)
ధృష్టద్యుమ్నాద్ధృష్టకేతుర్భార్మ్యాః పంచాలకా ఇమే|
యోఽజమీఢసుతో హ్యన్య ఋక్షః సంవరణస్తతః॥8067॥
22.4 (నాలుగవ శ్లోకము)
తపత్యాం సూర్యకన్యాయాం కురుక్షేత్రపతిః కురుః|
పరీక్షిత్సుధనుర్జహ్నుర్నిషధాశ్వః కురోః సుతాః॥8068॥
ధృష్టద్యుమ్నుని తనయుడు ధృష్టకేతువు. భర్మ్యాశ్యుని వంశమునకు చెందిన వీరు అందరును పాంచాలురు అని పిలువబడిరి. అజమీఢుని మరియొక పుత్రుడు ఋక్షుడు. అతని సుతుడు సంవరణుడు. సంవరణుడు సూర్యుని పుత్రికయగు తపతి అను కన్యను వివాహమాడెను. సంవరణునివలన తపతియందు కురువు అనువాడు జన్మించెను. అతడు కురుక్షేత్రము అను ప్రదేశమును పాలించెను. అతనికి పరీక్షిత్తు, సుధన్వుడు, జహ్నువు, విషధాశ్వుడు అను నలుగురు పుత్రులు కలిగిరి.
22.5 (ఐదవవ శ్లోకము)
సుహోత్రోఽభూత్సుధనుషశ్చ్యవనోఽథ తతః కృతీ|
వసుస్తస్యోపరిచరో బృహద్రథముఖాస్తతః॥8069॥
22.6 (ఆరవ శ్లోకము)
కుశాంబమత్స్యప్రత్యగ్రచేదిపాద్యాశ్చ చేదిపాః|
బృహద్రథాత్కుశాగ్రోఽభూదృషభస్తస్య తత్సుతః॥8070॥
సుధస్వుని కుమారుడు సుహోత్రుడు, అతని తనయుడు చ్యవనుడు. చ్యవనుని సుతుడు కృతి. కృతియొక్క పుత్రుడు ఉపరిచరవసువు. అతనికి బృహద్రథుడు, కుశాంబుడు, మత్స్యుడు, ప్రత్యగ్రుడు, చేదిపుడు అను ఐదుగురు కొడుకులు కలిగిరి. వారు అందరును చేది దేశమునకు పాలకులైరి. బృహద్రథుని పుత్రుడు కుశాగ్రుడు, అతని తనూజుడు వృషభుడు.
22.4 (ఏడవ శ్లోకము)
జజ్ఞే సత్యహితోఽపత్యం పుష్పవాంస్తత్సుతో జహుః|
అన్యస్యాం చాపి భార్యాయాం శకలే ద్వే బృహద్రథాత్॥8071॥
22.8 (ఎనిమిదవ శ్లోకము)
తే మాత్రా బహిరుత్సృష్టే జరయా చాభిసంధితే|
జీవ జీవేతి క్రీడంత్యా జరాసంధోఽభవత్సుతః॥8012॥
వృషభుని వలన పుట్టినవాడు సత్యహితుడు (సత్యవంతుడు). అతని సుతుడు పుష్పవంతుడు. పుష్పవంతుని తనయుడు జహువు. బృహద్రథుని యొక్క మరియొక భార్య గర్భమునుండి రెండు శకలములు ఉద్భవించెను. ఆ రెండు ఖండములను తల్లి బయట పడవేసెను. జర అను రాక్షసి ఆ రెండు ముక్కలను వినోదముగా జతపరచి జీవింపుము-జీవింపుము అని పలికెను. అట్లు జతపరచబడిన ఆ శరీరము సజీవమయ్యెను. ఆ బాలకుడే జరాసందుడు. జర అను రాక్షసిచే సంధింపబడినాడు కావున, అతడు జరాసంధుడుగా వ్యవహరింపబడెను.
22.9 (తొమ్మిదవ శ్లోకము)
తతశ్చ సహదేవోఽభూత్సోమాపిర్చ్ఛ్రుతశ్రవాః|
పరీక్షిదనపత్యోఽభూత్సురథో నామ జాహ్నవః॥8073॥
22.10 (పదియవ శ్లోకము)
తతో విదూరథస్తస్మాత్సార్వభౌమస్తతోఽభవత్|
జయసేనస్తత్తనయో రాధికోఽతోఽయుతో హ్యభూత్॥8074॥
జరాసంధుని కొడుకు సహదేవుడు. అతని సుతుడు సోమాపి. సోమాపి తనయుడు శ్రుతశ్రవుడు. కురువు యొక్క పెద్దకుమారుడగు పరీక్షిత్తునకు ఎట్టి సంతానమూ లేకుండెను. కురువుయొక్క మూడవ కుమారుడైైన జహ్నునకు సురథుడు అనువాడు జన్మించెను. అతని సుతుడు విదూరథుడు. అతని కొడుకు సార్వభౌముడు, సార్వభౌముని పుత్రుడు జయసేనుడు. అతిని వలన రాధికుడు కలిగెను. రాధికుని తనూజుడు ఆయుతుడు.
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి నవమ స్కంధములోని ఇరువది రెండవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
22.11 (పదకొండవ శ్లోకము)
తతశ్చ క్రోధనస్తస్మాద్దేవాతిథిరముష్య చ|
ఋష్యస్తస్య దిలీపోఽభూత్ప్రతీపస్తస్య చాత్మజః॥8075॥
22.12 (పండ్రెండవ శ్లోకము)
దేవాపిః శంతనుస్తస్య బాహ్లీక ఇతి చాత్మజాః|
పితృరాజ్యం పరిత్యజ్య దేవాపిస్తు వనం గతః॥8076॥
ఆయుతుని వలన క్రోధనుడు పుట్టెను. అతని కుమారుడు దేవాతిథి. దేవాతిథియొక్క తనయుడు ఋష్యుడు (ఋక్షుడు). ఋష్యుని తనయుడు దిలీపుడు. అతని సుతుడు ప్రతీపుడు. అతని వలన దేవాపి, శంతనుడు, బాహ్లికుడు అను ముగ్గురు కొడుకులు కలిగిరి. వారిలో దేవాపి తండ్రివలన తనకు లభించిన రాజ్యమును (రాజ్యాధికారమును) త్యజించి వనములకు వెళ్ళెను.
22.13 (పదమూడవ శ్లోకము)
అభవచ్ఛంతనూ రాజా ప్రాఙ్మహాభిషసంజ్ఞితః|
యం యం కరాభ్యాం స్పృశతి జీర్ణం యౌవనమేతి సః॥8077॥
22.14 (పదునాలుగవ శ్లోకము)
శాంతిమాప్నోతి చైవాగ్ర్యాం కర్మణా తేన శంతనుః|
సమా ద్వాదశ తద్రాజ్యే న వవర్ష యదా విభుః॥8078॥
దేవాపి వనములకు వెళ్ళుటతో అతని తమ్ముడగు శంతనుడు ఆ దేశమునకు రాజయ్యెను. పూర్వజన్మలో ఈ శంతనుని పేరు మహాభిషుడు. అతడు మహిమాన్వితుడు. అతని కరస్పర్శ ప్రభావమున ముసలివాడు యువకుడై, శాంతిని పొందును. కనుక, అతడు శంతనుడు గా ప్రసిద్ధికెక్కెను. ఈ శంతనుడు పరిపాలించుచున్నప్పుడు అతని రాజ్యమున వరుసగా పన్నెండు సంవత్సరములూ వానలు పడకపోవుటచే తీవ్రమైన కరవు ఏర్పడెను.
22.15 (పదిహేనవ శ్లోకము)
శంతనుర్బ్రాహ్మణైరుక్తః పరివేత్తాయమగ్రభుక్|
రాజ్యం దేహ్యగ్రజాయాశు పురరాష్ట్రవివృద్ధయే॥8079॥
కాటక పరిస్థితులకు కారణము అడుగగా బ్రాహ్మణులు శంతనునితో ఇట్లనిరి - "నీవు నీ అన్నయగు దేవాసి బ్రతికియుండగనే వివాహము చేసికొని, రాజ్యాధికారమును పొందితివి. కనుక నీవు పరివేత్త అనబడుదువు.
దారాగ్నిహోత్ర సంయోగం కురుతే యోఽగ్రజేస్థితే|
పరివేత్తా సవిజ్ఞేయః పరివిత్తిస్తు పూర్వజః॥ (స్మృతి)
అన్నకంటెను ముందుగా పెండ్లి చేసికొని, అగ్నికార్యములను ఆచరించినవాడు పరివేత్త అని యనబడును. ఆ స్థితిలో ఉన్న అగ్రజుడు (అన్న) పరివిత్తి అని వ్యవహరింపబడును.
కనుక నీ నగరము, రాష్ట్రము (రాజ్యము) అభివృద్ధిని పొందవలెనని భావించినచో, నీవు వెంటనే నీ అన్నకు రాజ్యమును ఇచ్చివేయుము. అనగా రాజ్యాధికారమును అప్పగింపుము. అట్లొనర్చినచో, నీ రాజ్యము సుభిక్షముగా ఉండును.
22.16 (పదహారవ శ్లోకము)
ఏవముక్తో ద్విజైర్జ్యేష్ఠం ఛందయామాస సోఽబ్రవీత్|
తన్మంత్రిప్రహితైర్విప్రైర్వేదాద్విభ్రంశితో గిరా॥8080॥
22.17 (పదిహేడవ శ్లోకము)
వేదవాదాతివాదాన్ వై తదా దేవో వవర్ష హ|
దేవాపిర్యోగమాస్థాయ కలాపగ్రామమాశ్రితః॥8081॥
22.18 (పదునెనిమిదవ శ్లోకము)
సోమవంశే కలౌ నష్టే కృతాదౌ స్థాపయిష్యతి|
బాహ్లీకాత్సోమదత్తోఽభూద్భూరిర్భూరిశ్రవాస్తతః॥8082॥
22.19 (పందొమ్మిదవ శ్లోకము)
శలశ్చ శంతనోరాసీద్గంగాయాం భీష్మ ఆత్మవాన్|
సర్వధర్మవిదాం శ్రేష్ఠో మహాభాగవతః కవిః॥8083॥
బ్రాహ్మణులు ఇట్లు పలికిన పిమ్మట శంతనుడు తన అనుయాయులతో అన్నకడకు (వనములకు) వెళ్ళి రాజ్యమును స్వీకరింపుము అని ప్రార్థించెను. కాని, శంతనునియొక్క మంత్రియైన అశ్మరావ అను వాని ప్రేరణచే కొందరు బ్రాహ్మణులు దేవాపి కడకు వెళ్ళి వేదవిరుద్ధమైన బోధనలను గావించిరి. వారి బోధనల ప్రభావముతో అతడు (దేవాపి) వైదిక సంప్రదాయమును అనుసరించి, గృహస్థాశ్రమమును స్వీకరించుటకు మారుగా వేదములను నిందింపదొడగెను. అందువలన అతడు రాజ్యాధికారమునకు దూరమయ్యెను. అంతట శంతనుని రాజ్యములో వర్షములు కురిసెను. పిమ్మట దేవాపి యోగసాధనను కొనసాగించుచు యోగులకు ప్రముఖ స్థానమైన కలాప గ్రామమును ఆశ్రయించెను. కలియుగమునందు చంద్రవంశము పతనము కాగా, అతడు (దేవాపి) కృతయుగారంభమున ఆ వంశమును మరల స్థాపించును. శంతనుని తమ్ముడైన బాహ్లికుమారుడు సోమదత్తుడు. అతనికి భూరి, భూరిశ్రవుడు, శలుడు అను ముగ్గురు కుమారులు కలిగిరి. శంతనుని వలన గంగాదేవి యందు భీష్ముడు జన్మించెను. అతడు జితేంద్రియుడు, సకలధర్మములను బాగుగా ఎఱిగినవాడు. పరమ భాగవతోత్తముడు, ఉత్తమ జ్ఞానసంపన్నుడు.
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి నవమ స్కంధములోని ఇరువది రెండవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
No comments:
Post a Comment