[20:56, 16/09/2020] +91 95058 13235: 16.9.2020 సాయం కాల సందేశము
వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం
నవమ స్కంధము - మూడవ అధ్యాయము
సుకన్యా చ్యవనమహర్షుల చరితము - శర్యాతిమహారాజు వంశవివరణము
ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
శ్రీశుక ఉవాచ
3.1 (ప్రథమ శ్లోకము)
శర్యాతిర్మానవో రాజా బ్రహ్మిష్ఠః స బభూవ హ|
యో వా అంగిరసాం సత్రే ద్వితీయమహ ఊచివాన్॥7335॥
3.2 (రెండవ శ్లోకము)
సుకన్యా నామ తస్యాసీత్కన్యా కమలలోచనా|
తయా సార్ధం వనగతో హ్యగమచ్చ్యవనాశ్రమమ్॥7336॥
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను వైవస్వతమనువు (శ్రాద్ధదేవుని) కుమారుడైన శర్యాతిమహారాజు వేదార్థనిష్ఠగలవాడు. విధ్వాంసుడు. అంగిరస గోత్రజులైన ఋషుల యొక్క యజ్ఞమునందు రెండవనాటి కార్యక్రమములను గూర్చి అతడు వివరించెను. ఆ శర్యాతికి సౌందర్యవతియైన సుకన్యయను కూతురు గలదు. అతడు ఒకనాడు తన కుమార్తెతో గూడి వనములయందు సంచరించుచు చ్యవనమహర్షి యొక్క ఆశ్రమమునకు చేరెను.
3.3 (మూడవ శ్లోకము)
సా సఖీభిః పరివృతా విచిన్వంత్యంఘ్రిపాన్ వనే|
వల్మీకరంధ్రే దదృశే ఖద్యోతే ఇవ జ్యోతిషీ॥7337॥
3.4 (నాలుగవ శ్లోకము)
తే దైవచోదితా బాలా జ్యోతిషీ కంటకేన వై|
అవిధ్యన్ముగ్ధభావేన సుస్రావాసృక్ తతో బహు॥7338॥
సుకన్య తన చెలికత్తెలతోగూడి వనమునందు అటునిటు తిరుగుచు వృక్షముల శోభలను తిలకించుచుండెను. ఆ సమయమున ఒక పుట్టయొక్క రెండు రంధ్రముల నుండి ప్రసరించుచున్న మిణుగురు పురుగుల వంటి కాంతులు ఆమె కంటబడెను. అమాయకురాలైన ఆ సుకన్య బాల్యచాపల్యముచే విధివశమున ఒక ముల్లుతో ఆ కాంతులపై పొడిచెను. అంతట ఆ పుట్ట రంధ్రములనుండి అధికముగా రక్తము ప్రవహింపసాగెను.
3.5 (ఐదవ అధ్యాయము)
శకృన్మూత్రనిరోధోఽభూత్సైనికానాం చ తత్క్షణాత్|
రాజర్షిస్తముపాలక్ష్య పురుషాన్ విస్మితోఽబ్రవీత్॥7339॥
మరుక్షణముననే శర్యాతి మహారాజుయొక్క సైనికులకు మలమూత్రములు ఆగిపోయెను. ఆ సంఘటనను గమనించిన శర్యాతి మహారాజు ఆశ్చర్యచకితుడై ఆ సైనికులతో ఇట్లనెను-
3.6 (ఆరవ శ్లోకము)
అప్యభద్రం న యుష్మాభిర్భార్గవస్య విచేష్టితమ్|
వ్యక్తం కేనాపి నస్తస్య కృతమాశ్రమదూషణమ్॥7340॥
వీరులారా! మీరు భృగువంశజుడైన చ్యవనమహర్షియెడాఏదైనను అపరాధము చేసియుండలేదుగదా? మనలో ఎవరో ఒకరు ఆయన ఆశ్రమమునందు దోషము (పాపము) ఒనర్చియుండును. లేనిచో, ఇట్టి విపత్కర పరిస్థితి సంభవించియుండదు".
3.7 (ఏడవ శ్లోకము)
సుకన్యా ప్రాహ పితరం భీతా కించిత్కృతం మయా|
ద్వే జ్యోతిషీ అజానంత్యా నిర్భిన్నే కంటకేన వై॥7341॥
అప్ఫుడు సుకన్య మిగుల భయపడుచు 'తండ్రీ! నేను ఒక చిన్న తప్పు చేసియుంటిని. ఒక పుట్టయొక్క రెండు రంధ్రములనుండి ప్రసరించుచున్న రెండు కాంతులపై అజ్ఞానముచే ముల్లుతో పొడిచితిని' అని పలికెను.
3.8 (ఎనిమిదవ శ్లోకము)
దుహితుస్తద్వచః శ్రుత్వా శర్యాతిర్జాతసాధ్వసః|
మునిం ప్రసాదయామాస వల్మీకాంతర్హితం శనైః॥7342॥
అంతట శర్యాతి తన కూతురు మాటలను విన్నంతనే మిగుల ఆందోళనకు గురియయ్యెను. వెంటనే అతడు ఆ పుట్టలోనున్న చ్యవనమహర్షిని స్తుతించుచు ఆ మునిని ప్రసన్నునిగా చేసికొనెను.
3.9 (తొమ్మిదవ శ్లోకము)
తదభిప్రాయమాజ్ఞాయ ప్రాదాద్దుహితరం మునేః|
కృచ్ఛ్రాన్ముక్తస్తమామంత్ర్య పురం ప్రాయాత్సమాహితః॥7343॥
3.10 (పదియవ శ్లోకము)
సుకన్యా చ్యవనం ప్రాప్య పతిం పరమకోపనమ్|
ప్రీణయామాస చిత్తజ్ఞా అప్రమత్తానువృత్తిభిః॥7344॥
పిదప చ్యవనమహర్షియొక్క అభిప్రాయమును గుర్తించి ఆ శర్యాతి తన కుమార్తెను (సుకన్యను) ఆయనకు ఇచ్చి వివాహము చేసెను. ఆ విధముగా అతడు ఆ సంకటస్థితినుండి బయటపడి, ఆ ముని అనుమతితో సావధానుడై, తన నగరమునకు చేరెను. అంతట చ్యవనమహర్షిని పతిగా పొందిన సుకన్య, మిక్కిలి కోపస్వభావముగల తన భర్తయొక్క మనస్సును ఎరిగినదై, తగు జాగరూకతతో ప్రవర్తించుచు ఆయనను ప్రసన్నునిగా చేసికొనెను.
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి నవమ స్కంధములోని మూడవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుఫ🙏🙏
పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం
7702090319, 9505813235
[20:27, 03/10/2020] +91 95058 13235: 3.10.2020 సాయం కాల సందేశము
వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం
నవమ స్కంధము - పదియవ అధ్యాయము
పరమాత్మూడైన శ్రీరామచంద్రుని లీలావర్ణనము
ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
10.13 (పదమూడవ శ్లోకము)
యద్రోషవిభ్రమవివృత్తకటాక్షపాతసంభ్రాంతనక్రమకరో భయగీర్ణఘోషః |
సింధుః శిరస్యర్హణం పరిగృహ్య రూపీ పాదారవిందముపగమ్య బభాష ఏతత్॥7643॥
అచట శ్రీరామచంద్రుడు మూడురాత్రులు ఉపవసించి, దారి ఇమ్మని సముద్రుని ప్రార్థించెను. అందులకు సముద్రుడు స్పందించకపోవుటచే ఆ ప్రభువు లీలగా క్రోధమును ప్రదర్శించెను. ఆ స్వామియొక్క రోషవీక్షణములు పడినంతనే సముద్రజలముల యందలి మొసళ్ళు, చేపలు మొదలగు జలచరములన్నియును భయభ్రాంతములయ్యెను. ఎగసిపడుచున్న తరంగముల ఘోష (సముద్రఘోష) శాంతించెను. పిదప సముద్రుడు ప్రసన్నభావముతో మానవాకృతిని దాల్చి, అర్ఘ్యపాద్యాది ద్రవ్యములను శిరస్సున ధరించి ఆ స్వామిని సమీపించెను. అనంతరము అతడు ఆయన పాదములకు ప్రణమిల్లి, శరణాగతుడై ఇట్లు విన్నవించుకొనెను-
10.14 (పదునాలుగవ శ్లోకము)
న త్వాం వయం జడధియో ను విదామ భూమన్ కూటస్థమాదిపురుషం జగతామధీశమ్|
యత్సత్త్వతః సురగణా రజసః ప్రజేశా మన్యోశ్చ భూతపతయః స భవాన్ గుణేశః॥7644॥
"స్వామీ! మేము అజ్ఞానులము. అందువలన నీ మహత్త్వమును తెలిసికొనలేకపోయితిని. నిజముగా నీవు నిర్వికారుడవు. ఆదిపురుషుడవు, జగదీశ్వరుడవు. సత్త్వరజస్తమో గుణములు త్రిలోకపూజ్యుడవైన నీ అధీనములో ఉండును. నీ సత్త్వగుణము వలన సురగణములు, రజోగుణమువలన ప్రజాపతులు, తమోగుణమువలన రుద్రగణములు ఉత్పన్నము లగుచుండును.
10.15 (పదునైదవ శ్లోకము)
కామం ప్రయాహి జహి విశ్రవసోఽవమేహం త్రైలోక్యరావణమవాప్నుహి వీర పత్నీమ్|
బధ్నీహి సేతుమిహ తే యశసో వితత్యై గాయంతి దిగ్విజయినో యముపేత్య భూపాః॥7645॥
మహావీరా! నీవు ఇక స్వేచ్ఛగా ఈ సముద్రజలములను దాటిపొమ్ము విశ్రవసుని కుమారులలో దుష్టుడు, త్రిలోక కంటకుడు ఐన రావణుని జయింపుము (వధింపుము). నీ ధర్మపత్నిని (సీతాదేవిని) మరల స్వీకరింపుము. కాని, నా ఈ మనవిని ఆలకింపుము. నీవు లంకకు చేరుటకు నిజముగా ఈ సముద్రజలములు ఏ మాత్రమూ ప్రతిబంధకములు కాజాలవు. ఐనను, నాపై (ఈ సముద్రజలములపై) సేతువును నిర్మింపుము. దీనివలన నీ కీర్తప్రతిష్ఠలు ఇనుమడించును. నీవు ఒనర్చిన ఈ అద్భుత కార్యమును జూచి, పేరు మోసిన చక్రవర్తులు సైతము మున్ముందు నీ యశస్సును వేనోళ్ళ కొనియాడుదురు".
10.16 (పదహారవ శ్లోకము)
బద్ధ్వోదధౌ రఘుపతిర్వివిధాద్రికూటైః సేతుం కపీంద్రకరకంపితభూరుహాంగైః|
సుగ్రీవనీలహనుమత్ప్రముఖైరనీకైర్లంకాం విభీషణదృశాఽఽవిశదగ్రదగ్ధామ్॥7646॥
సముచితములగు సూచనలను ఇచ్చినందులకు శ్రీరాముడు సముద్రుని అభినందించెను. పిమ్మట వానర శ్రేష్ఠులు పెకలించి తీసుకువచ్చిన వివిధములగు మహావృక్షముల కొమ్మలతోడను, పెద్దపెద్ద పర్వత శిఖరములతోను ఆ ప్రభువు సముద్రముపై సేతువును నిర్మింపజేసెను. అనంతరము సుగ్రీవుడు, నీలుడు, హనుమంతుడు మొదలగు ప్రముఖ వానరులతో, సైన్యములతోగూడి శ్రీరామచంద్రుడు విభీషణుడు తెలిపిన మార్గమున లంకలో ప్రవేశించెను. ఆ లంకానగరము ఇంతకుముందే సీతాన్వేషణ సమయమున మహానుభావుడైన హనుమంతునిచే కొంతమేరకు దగ్ధమై యుండెను.
10.17 (పదిహేడవ శ్లోకము)
సా వానరేంద్రబలరుద్ధవిహారకోష్ఠశ్రీద్వారగోపురసదోవలభీవిటంకా|
నిర్భజ్యమానధిషణధ్వజహేమకుంభశృంగాటకా గజకులైర్హ్రదినీవ ఘూర్ణా॥7647॥
అంతట మహాయోధులతో నిండిన వానర సైన్యములు లంకానగరము నందలి విహారవనములను, ధాన్యాగారములను, ధనాగారములను, గృహద్వారములను, పురద్వారములను, సభామందిరములను, ప్రాసాదాది (రాజభవనములు మొదలగువాటి) పురోభాగములను, పావురములు నివసించెడి ప్రదేశములను (విటంకములను) చుట్టుముట్టెను. ఇంకను ఆ సేనలు అచటి వేదికలను, ధ్వజపతాకములను, భవనములపై గల బంగారు కలశములను, రాజవీధుల కూడళ్ళను ధ్వంసమొనర్చెను. అప్ఫుడు ఆ నగరము ఏనుగుల గుంపులచే కల్లోలితమైన నదివలె ఒప్పారెను.
10.18 (పదునెనిమిదవ శ్లోకము)
రక్షఃపతిస్తదవలోక్య నికుంభకుంభధూమ్రాక్షదుర్ముఖసురాంతకనరాంతకాదీన్|
పుత్రం ప్రహస్తమతికాయవికంపనాదీన్ సర్వానుగాన్ సమహినోదథ కుంభకర్ణమ్॥7648॥
అప్పుడు రాక్షస రాజైన రావణుడు మిగుల దెబ్భతిని అల్లకల్లోలమైయున్న లంక పరిస్థితిని జూచి, నికుంభుడు, కుంభుడు, ధూమ్రాక్షుడు, దుర్ముఖుడు, సురాంతకుడు, నరాంతకుడు, ప్రహస్తుడు, అతికాయుడు, వికంపనుడు మున్నగు యోధులను, పిమ్మట తన కుమారుడైన ఇంద్రజిత్తును, వారి వారి అనుచరగణములతో సహా వానరయోధులను ఎదుర్కొనుటకై పంపెను. పిమ్మట తన సోదరుడైన కుంభకర్ణుని గూడ యుద్ధరంగమునకు పంపెను.
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి నవమ స్కంధములోని పదియవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
[02:49, 04/10/2020] +91 95058 13235: 4.10.2020 ప్రాతః కాల సందేశము
వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం
నవమ స్కంధము - పదియవ అధ్యాయము
పరమాత్మూడైన శ్రీరామచంద్రుని లీలావర్ణనము
ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
10.19 (పందొమ్మిదవ శ్లోకము)
తాం యాతుధానపృతనామసిశూలచాపప్రాసర్ష్టిశక్తిశరతోమరఖడ్గయదుర్గామ్|
సుగ్రీవలక్ష్మణమరుత్సుతగంధమాదనీలాంగదర్క్షపనసాదిభిరన్వితోఽగాత్॥7649॥
ఖడ్గములను, శూలములను, ధనుస్సులను, ఈటెలను, కత్తులను, బల్లెములను బాణములను, ఇనుపగుదియలను, మహాఖడ్గములను చేబూనిన అపారమగు రాక్షససైన్యము రావణపక్షమున పోరాడుటకు యుద్ధరంగమున నిలిచి యుండెను. ఆ సేనలను ఎదుర్కొనుటకై సుగ్రీవుడు, లక్ష్మణుడు, హనుమంతుడు, గంధమాదనుడు, నీలుడు, అంగదుడు, జాంబవంతుడు, పనసుడు మొదలగు మహాయోధులతో గూడి శ్రీరాముడు ఆ సమరభూమియందు సర్వసన్నద్ధుడై యుండెను.
10.20 (ఇరువదియవ శ్లోకము)
తేఽనీకపా రఘుపతేరభిపత్య సర్వే ద్వంద్వం వరూథమిభపత్తిరథాశ్వయోధైః|
జఘ్నుర్ద్రుమైర్గిరిగదేషుభిరంగదాద్యాః సీతాభిమర్శహతమంగలరావణేశాన్॥7650॥
సమరరంగమున శ్రీరాముని పక్షమున నిలిచియున్న అంగదాది సేనానాయకులు రాక్షసపక్షమునందలి రథాశ్వగజపదాతిదళ యోధులతో (చతురంగబలములతో) భీకరయుద్ధమునకు తలపడిరి. సీతాదేవిని స్పృశించుటతో అధోగతిపాలైన రావణునియొక్క అనుచరులగు నికుంభాదులపై ఆ అంగదాది వానరవీరులు వృక్షములతో, పర్వతములతో, గదలతో, బాణములతో దెబ్బతీసి, వారిని పరిమార్చిరి.
10.21 (ఇరువది ఒకటవ శ్లోకము)
రక్షఃపతిః స్వబలనష్టిమవేక్ష్య రుష్ట ఆరుహ్య యానకమథాభిససార రామమ్|
స్వఃస్యందనే ద్యుమతి మాతలినోపనీతే విభ్రాజమానమహనన్నిశితైః క్షురప్రైః॥7651॥
అప్పుడు రావణుడు కదనరంగమున అపారమైన తన సైన్యము నేలపాలగుట చూచి ఎంతయు క్రుద్ధుడయ్యెను. పిమ్మట, అతడు పుష్పకవిమానమును అధిరోహించి, రాముని ఎదుర్కొనెను. ఇంద్రుని ఆదేశముతో మాతలి తీసికొనివచ్చిన దివ్యరథమునందు విరాజమానుడై యున్న రఘువీరునిపై ఆ రాక్షసరాజు వాడియైన తన అర్ధచంద్రాకార శరములతో విజృభించి ఆయనను దెబ్బతీయ సాగెను.
10.22 (ఇరువది రెండవ శ్లోకము)
రామస్తమాహ పురుషాదపురీష యన్నః కాంతాసమక్షమసతాపహృతా శ్వవత్తే|
త్యక్తత్రపస్య ఫలమద్య జుగుప్సితస్య యచ్ఛామి కాల ఇవ కర్తురలంఘ్యవీర్యః॥7652॥
తనపై శరపరంపరతో విజృభించుచున్న రావణునితో శ్రీరాముడు ఇట్లనెను- "ఓరీ! రాక్షసాధమా! దుష్టుడవైన నీవు, మేము (నేను, మా తమ్ముడగు లక్ష్మణుడు) లేని సమయము చూచుకొని, ఒక కుక్కవలె మా కుటీరమును సమీపించి, నా భార్యయగు సీతాదేవిని అపహరించుకొని వచ్చితివి. నేను తిరుగులేని పరాక్రమశాలిని, నీ పాలిటి మృత్యుదేవతను (మృత్యుదేవత ఆయా వ్యక్తులొనర్చిన శుభాశుభ కర్మలకు తగిన ఫలములను తప్పక ఇచ్చును) సిగ్గువిడిచి, నీవు ఒడిగట్టిన ఈ జుగుప్సిత కృత్యమునకు (దుష్కార్యమునకు) తగిన ఫలమును ఇప్పుడే ఇచ్చెదను" (రుచిచూపెదను).
10.23 (ఇరువది మూడవ శ్లోకము)
ఏవం క్షిపన్ ధనుషి సంధితముత్ససర్జ బాణం స వజ్రమివ తద్ధృదయం బిభేద|
సోఽసృగ్వమన్ దశముఖైర్న్యపతద్విమానాద్ధాహేతి జల్పతి జనే సుకృతీవ రిక్తః॥7653॥
శ్రీరామచంద్రప్రభువు రావణుని ఈ విధముగా ఆక్షేపించుచు, ధనుస్సునందు బాణమును సంధించి అతనిపై ప్రయోగించెను. ఆ శరము వజ్రాయుధమువలె ఆ రాక్షసరాజుయొక్క హృదయమును బ్రద్దలుగావించెను. అంతట ఆ అధముడు తన పదిముఖములనుండి రక్తమును గ్రక్కుచు, క్షీణపుణ్యుడు (పుణ్యము నశించినవాడు) దివినుండి భువిపై పడినట్లు పుష్పకవిమానమునుండి నేలకు రాలెను. ఆ సమయమున అతని అనుచరులు అందరును ఒనర్చిన హాహాకారములు మిన్నుముట్టెను.
తే తం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణపుణ్యే మర్త్యలోకం విశంతి (గీత. 9/21)
10.24 (ఇరువది నాలుగవ శ్లోకము)
తతో నిష్క్రమ్య లంకాయా యాతుధాన్యః సహస్రశః|
మందోదర్యా సమం తస్మిన్ ప్రరుదత్య ఉపాద్రవన్॥7654॥
అంతట మండోదరి మొదలగు వేలకొలది రాక్షసస్త్రీలు లంకనుండి బయలుదేరి, బిగ్గరగా లబలబ మొత్తుకొనుచు, సమరభూమియందు రావణుడు పడియున్నచోటికి వచ్చిరి.
10.25 (ఇరువది ఐదవ శ్లోకము)
స్వాన్ స్వాన్ బంధూన్ పరిష్వజ్య లక్ష్మణేషుభిరర్దితాన్|
రురుదుః సుస్వరం దీనా ఘ్నంత్య ఆత్మానమాత్మనా॥7655॥
అప్పుడు ఆ రాక్షస వనితలు లక్ష్మణుని బాణములకు హతులైన తమతమ బంధువులను (బంధువుల కళేబరములను) కౌగలించుకొని, గుండెలు బాదుకొనుచు దైన్యముతో బిగ్గఱగా ఇట్లు విలపింపసాగిరి.
10.26 (ఇరువది ఆరవ శ్లోకము)
హా హతాః స్మ వయం నాథ లోకరావణ రావణ|
కం యాయాచ్ఛరణం లంకా త్వద్విహీనా పరార్దితా॥7656॥
"ప్రభూ! రావణా! ఇదివరలో లోకములన్నియును నీకు భయపడి గడగడలాడినవి. నీవు హతుడవగుటతో మేము మృతప్రాయులము ఐతిమి. లంక పరులవశమైనది. నిన్ను కోల్పోయిన ఈ లంకవాసులు ఇప్పుడు ఎవరిని శరణువేడవలెను?
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి నవమ స్కంధములోని పదియవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
శ్రీశుక ఉవాచ
21.1 నుండి 36 శ్లోకాల తాత్పర్యము
శ్రీశుకుడు పలికెను పరీక్షిన్మహారాజా! వితథుని (భరద్వాజుని) యొక్క సుతుడు మన్యువు. ఆయనకు బృహత్ క్షత్రుడు, జయుడు, మహావీర్యుడు, నరుడు, గర్గుడు అను ఐదుగురు కుమారులు గలిగిరి. నరుని తనయుడు సంకృతి. సంకృతియొక్క పుత్రులు గురుడు, రంతిదేవుడు. వీరిరువురిలో రంతిదేవుని కీర్తిప్రతిష్ఠలు ఇహపరలోకముల యందును వాసి గాంచినవి.
రంతిదేవుడు అప్రయత్నముగా (దైవికముగా) లభించిన దాని తోడనే జీవితమును గడపు చుండెడివాడు. లభించిన వస్తువులనుగూడ ఇతరులకు దానము చేయుచుండెడి వాడు. క్రమముగా నిర్ధనుడైన అతడు కుటుంబసభ్యులతోగూడ ఆకలిదప్పులతో బాధపడుచుండెడివాడు. ధనమును కూడబెట్టుటగాని, ఇతరుల నుండి స్వీకరించుటగాని చేసెడివాడు కాదు. ఈ విధముగా ఒకసారి అతనికి వరుసగా నలుబది ఎనిమిది దినములు నీరుకూడ లభింపలేదు. ఆ మరునాటి ఉదయమున ఆయనకు నేయి, పాయసము, అన్నము (భక్ష్యవిశేషములు), జలము లభించెను.
అంతవరకును రంతిదేవుని కుటుంబము ఆకలి దప్పులతో అలమటించుచు సంకటములపాలై యుండెను. ప్రాతఃకాలమున లభించిన ఆహార పదార్థములను భుజించుటకు సిద్ధమైరి. ఇంతలో ఒక బ్రాహ్మణుడు వారి ఇంటికి అతిథిగా వచ్చెను. సకల ప్రాణులలోను భగవంతునే దర్శించుచుండెడి రంతిదేవుడు ఆ ఆహారపదార్థములలో కొంతభాగమును ఆ అతిథికి భక్తిశ్రద్ధలతో సమర్పించెను. పరీక్షిన్మహారాజా! రంతిదేవుడు తన కుటుంబ సభ్యులతో గూడి మిగిలిన ఆహారపదార్థములను తినబోవుచుండగా ఇంతలో ఒక శూద్రుడు భోజనార్థమై అచటికి వచ్చెను. అప్పుడు రంతిదేవుడు శ్రీహరిని స్మరించుచు అందులో కొంతభాగమును అతనికి సమర్పించెను.
శూద్రుడు భుజించి వెళ్ళిన పిమ్మట మరియొక వ్యక్తి కొన్ని కుక్కలను వెంటబెట్టుకొని, అతిథిగా వచ్చి ఇట్లనెను - 'రంతిదేవమహారాజా! నేనును, నా శునకములును మిగుల ఆకలి గొనియున్నాము. మాకు ఆహారపదార్థములను ఇప్పింపుము'.
అంతట రంతిదేవుడు ఆ వచ్చిన వ్యక్తిని, అతని వెంటనున్న కుక్కలను భగవత్స్వరూపములుగా భావించి, నమస్కరించుచు మిగిలిన ఆహారపదార్థములను సాదరముగా సంతోషముతో ఇచ్చివేసెను.
పిమ్మట రంతిదేవుని కడ నీరు మాత్రమే మిగిలియుండెను. అవియును ఒక్కని దాహమును తీర్చుటకు మాత్రమే సరిపోవునట్లుండెను. ఆ స్థితిలో రంతిదేవుడు తన కుటుంబ సభ్యులతోగూడి ఆ జలములతో తమ దాహమును తీర్చుకొనుటకు సిద్ధపడుచుండగా, ఇంతలో దప్పిగొనియున్న ఒక చండాలుడు అచటికి వచ్చి - 'అయ్యా! ఈ అల్పునకు కొన్ని నీళ్ళు ఇచ్చి పుణ్యము గట్టుకొనుము' అని అర్థించెను.
మిక్కిలి అలసిపోయి, దీనస్వరముతో పలుకుచున్న అతని తడబాటు మాటలను వినినంతనే అతనిపై రంతిదేవునకు మిగులజాలి కలిగెను. పిమ్మట ఆ మహారాజు అతనితో మృదుమధురముగా ఇట్లనెను-
'అయ్యా! నేను భగవంతుని నుండి అణిమాది అష్టసిద్ధులనుగాని, అష్టైశ్వర్యములనుగాని కోరుకొనను. అంతేగాదు, బ్రహ్మపదవినిగాని, కడకు మోక్షమును సైతము అభిలషింపను. సకల ప్రాణులకును నా ఆత్మస్వరూపులని భావించి, వారి దుఃఖములను నేనే అనుభవించుటకు ఇష్టపడుదురు. వారియొక్క వివిధములగు దుఃఖములను నావిగా భావింతును. అందువలన వారు తమ దుఃఖములనుండి దూరమగుదురు.
తీవ్రమగు దాహముతో మిగుల బాధపడుచున్న ఒక దీనునకు జలమును ఇచ్చుటవలన అనగా అతని దప్పిక తీర్చుటవలన అతని ప్రాణములు నిలబడును. అప్ఫుడు నా ఆకలిదప్పుల బాధలు, శరీరముయొక్క పరిశ్రమలు (బడలికలు), దైన్యము, అలసట, శోకము, విషాదము, మోహము మొదలగునవి అన్నియును తొలగిపోవును. అంతట నేను హాయిగా ఉందును'. సున్నితమైన మనస్సుగలవాడు (సహజముగా దయాళువు), ధీరుడు (ఎట్టికష్టములనైనను ధైర్యముతో ఎదుర్కొనగలవాడు) ఐన రంతిదేవుడు తాను ప్రాణములు పోవునంతగా దప్పిగొని యున్నను, ఈ విధముగా పలికి ఆ అల్పునకు తనకడనున్న ఆ మధురజలములను ఇచ్చి, అతని దాహమును తీర్చెను.
రంతిదేవునికడకు అతిథులుగా వచ్చినవారు (బ్రాహ్మణుడు, శూద్రుడు మొదలగువారు) విష్ణుమాయా కల్పితులై వేర్వేరు రూపములలో ఏతెంచినవారే. భక్తులయొక్క మనోరథములను ఈడేర్చుచుండెడి బ్రహ్మవిష్ణుమహేశ్వరులు ఆ మహారాజును ఈ విధముగా పరీక్షించిన పిదప ఆయనకు సాక్షాత్కరించిరి.
రంతిదేవుడు దేనియందును ఎట్టి మమకారమూ లేనివాడు. అంతేగాదు, ఐహికాముష్మిక ఫలములను ఏమాత్రమూ ఆశింపనివాడు. అట్టి ఆ మహాపురుషుడు తనకు ప్రత్యక్షమైన త్రిమూర్తులకు నమస్కరించెను. అతడు ఆ మహాత్ములను ఏమియు కోరిక సర్వేశ్వరుడైన శ్రీహరియందే భక్తిపూర్వకముగా తన మనస్సును పూర్తిగా లగ్నమొనర్చి తన్మయుడైయుండెను.
రాజా! రంతిదేవుడు భగవత్సేవను దప్ప తదితర ప్రయోజనమును దేనినీ ఆశింపనివాడు. అతడు తన మనస్సును పూర్తిగా భగదధీనము గావించెను. కనుక, మేల్కొన్నవానికి స్వప్నమువలె త్రిగుణాత్మకమైన మాయ అతనిపై ఎట్టి ప్రభావమును గూడ చూపలేకపోయెను.
రంతిదేవుని అనుసరించియుండెడి వారందరును ఆయన సాంగత్య ప్రభావముచే శ్రీహరి భక్తి తత్పరులై, మహాయోగులై సిద్ధిని పొందిరి. .......... (1)
మన్యు కుమారులలో ఒకడైన గర్గునియొక్క పుత్రుడు శిని. అతని తనయుడు గార్గ్యుడు. క్షత్రియుడైన గార్గ్యునినుండి బ్రాహ్మణవంశములు వృద్ధిచెందెను. మన్యుకుమారులలో ఒకడైన మహావీర్యునికు దురితక్షయుడు జన్మించెను. ఆ దురితక్షయునివలన త్రయ్యారుణి, కవి, పుష్కలారుణి అను వారు కలిగిరి. ఆ ముగ్గురును బ్రాహ్మణ మార్గములను అనుసరించిరి. మన్యు కుమారులలో జ్యేష్ఠుడైన బృహత్ క్షత్రునకు హస్తి అనువాడు కలిగెను. అతడు హస్తినాపురమును నిర్మించెను..
హస్తి అను వానికి అజమీఢుడు, ద్విమీఢుడు, పురుమీఢుడు అను ముగ్గురు సుతులు కలిగిరి. అజమీఢుని పరంపరలోని వారైన ప్రియమేధుడు మొదలగు వారు బ్రాహ్మణులైరి. అజమీఢుని కుమారుడు బృహదిషువు. అతని పుత్రుడు బృహద్ధనువు. బృహద్ధనువు తనయుడు బృహత్కాయుడు. అతని సుతుడు జయద్రథుడు.
జయద్రథుని వలన విశకరుడు కలిగెను. అతనికి జన్మించినవాడు సేనజిత్తు. సేనజిత్తు తనయులు రుచిరాశ్వుడు, దృఢహనువు, కాశ్యుడు, వత్సుడు.
రుచిరాశ్వుని కుమారుడు పారుడు. ఆ పారునకు పృథుసేనుడు, నీపుడు అను ఇరువురు కలిగిరి. నీపునకు వందమంది పుత్రులు కలిగిరి.
ఈ నీపుని వలన శుకుని (శుకుడు సర్వసంగ పరిత్యాగి. ఇతడు ఛాయాశుకుడు అని తెలియ మనవి) కుమార్తెయగు కృత్వి యందు బ్రహ్మదత్తుడు అనువాడు జన్మించెను. మహాయోగియైన ఈ బ్రహ్మదత్తుని భార్య సరస్వతియందు విష్వక్సేనుడు కలిగెను.
ఛాయాశుకుని గూర్చి సంక్షిప్తముగా
వ్యాసుని కుమారుడైన శుకుడు సర్వసంగపరిత్యాగి. అతడు వనములకు వెళ్ళు సమయమున ఒక ఛాయాశుకుని సృష్టించెను. ఆ ఛాయాశుకుడు గృహస్థాశ్రమమును స్వీకరించెను. ఆ ఛాయాశుకుని కుమార్తెయగు కృత్వి యందు నీపుని వలన బ్రహ్మదత్తుడు జన్మించెను.
అతడు జైగీషవ్యమునియొక్క ఉపదేశప్రభావమున యోగ తంత్రమును రచించెను. విష్వక్సేనుని తనయుడు ఉదక్స్వనుడు. అతని సుతుడు భల్లాదుడు. వీరు అందరును బృహదిషుని పరంపరలోని వారు.
హస్తి కుమారులలో రెండవవాడైన ద్విమీఢుని తనయుడు యవనీరుడు. అతని సుతుడు కృతిమంతుడు. కృతిమంతుని పుత్రుడు సత్యధృతి. అతని సూనుడు దృఢనేమి. దృఢనేమికి కలిగినవాడు సుపార్శ్వుడు.
సుపార్శ్వునకు సుమతి జన్మించెను. అతని తనూజుడు సన్నుతిమంతుడు. అతని పుత్రుడు కృతి. ఈ కృతి యనువాడు బ్రహ్మదేవుని వలన యోగమును సాధనచేసి (శక్తిని పొంది) ప్రాచ్యసామము నందలి ఆరు సంహితలను అధ్యయనము చేసెను. కృతియొక్క కుమారుడు నీపుడు. అతని తనయుడు ఉగ్రాయుధుడు. అతని పుత్రుడు క్షేమ్యుడు. క్షేమ్యుని వలన జన్మించినవాడు సువీరుడు. అతని వలన కలిగినవాడు రిపుంజయుడు.
రిపుంజయుని తనయుడు బహురథుడు. హస్తియొక్క మూడవ కుమారుడైన పురుమీఢునకు సంతానము కలుగలేదు. హస్తి యొక్క జ్యేష్ఠపుత్రుడగు అజమీఢుని వలన నళిని అను నామెయందు నీలుడు పుట్టెను. అతని తనయుడు శాంతి.
శాంతి అను వాని తనూజుడు సుశాంతి. అతని సుతుడు పురుజుడు. పురుజుని కొడుకు అర్కుడు. అతని తనయుడు భర్మ్యాశ్వుడు, అతనికి ముద్గలుడు, యవీనరుడు, బృహదిషువు, కాంపిల్యుడు, సంజయుడు అను ఐదుగురు కుమారులు కల్గిరి. భర్మ్యాశ్వుడు తన పుత్రులతో - 'కుమారులారా! మీరు నా అధీనములో నున్న ఐదు దేశములను రక్షించుటకు సర్వసమర్థులు' అని పలికి ఆ రాజ్యములను రక్షించు బాధ్యతను వారికి అప్పగించెను. అప్పటి ఆ ఐదుగురు పంచాలురు అని వ్యవహరింపబడిరి. ఈ ఐదుమందిలో పెద్దవాడైన ముద్గలుని వలన మౌద్గల్య గోత్రముతో బ్రాహ్మణ వంశము ఏర్పడెను.
భర్మ్యాశ్వుని కుమారుడైన ముద్గలుని వలన దివోదాసుడు అను పుత్రుడును, అహల్య అను పుత్రికయు (కవలలు) జన్మించిరి. ఆ అహల్యకు గౌతమమహాముని వలన శతానందుడు అను కుమారుడు కలిగెను.
శతానందుని కుమారుడు సత్యధృతి. అతడు ధనుర్విద్యలో ఆఱితేఱినవాడు. సత్యధృతి యొక్క తనయుడు శరద్వంతుడు. అతిలోకసుందరి యగు ఊర్వశిని చూచినంతనే శరద్వంతునకు రేతస్సు పతనమయ్యెను. ఆ రేతస్సు ఱెల్లుదుబ్బు పైబడి రెండుగా విభక్తమయ్యెను. అందుండి ఒక బాలుడును, ఒక బాలికయు రూపొందిరి. వేటాడు నిమిత్తమై వచ్చిన శంతనుడు ఆ మార్గముననే వెళ్ళుచు శుభలక్షణ సంపన్నులైన ఆ ఇద్దరు శిశువులను చూచి కనికరముతో వారిని తన వెంట తీసికొనిపోయి పెంచి పెద్ద చేసెను. ఆ బాలుని పేరు కృపుడు (కృపాచార్యుడు), బాలిక పేరు కృపి. ఆ కృపి యను కన్య ద్రోణాచార్యునకు ధర్మపత్ని అయ్యెను.
కృపాచార్యుడు ద్రోణాచార్యునితోబాటు కురుపాండవులకు అస్త్రవిద్యా గురువు అయ్యెను.
శంతనుని కృపకు పాత్రులైనందుననే బాలునకు కృపుడు అనియు, బాలికకు కృపి అను పేర్లు ఏర్పడెను.
ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం నవమస్కంధే ఏకవింశోఽధ్యాయః (21)
ఇది భాగవత మహాపురాణమునందలి నవమ స్కంధమునందు ఇరువది ఒకటవ అధ్యాయము (21)
--(())--
శ్రీశుక ఉవాచ
21.1 (ప్రథమ శ్లోకము)
వితథస్య సుతో మన్యుర్బృహత్క్షత్రో జయస్తతః|
మహావీర్యో నరో గర్గః సంకృతిస్తు నరాత్మజః॥8029॥
21.2 (రెండవ శ్లోకము)
గురుశ్చ రంతిదేవశ్చ సంకృతేః పాండునందన|
రంతిదేవస్య హి యశ ఇహాముత్ర చ గీయతే॥8030॥
శ్రీశుకుడు పలికెను పరీక్షిన్మహారాజా! వితథుని (భరద్వాజుని) యొక్క సుతుడు మన్యువు. ఆయనకు బృహత్ క్షత్రుడు, జయుడు, మహావీర్యుడు, నరుడు, గర్గుడు అను ఐదుగురు కుమారులు గలిగిరి. నరుని తనయుడు సంకృతి. సంకృతియొక్క పుత్రులు గురుడు, రంతిదేవుడు. వీరిరువురిలో రంతిదేవుని కీర్తిప్రతిష్ఠలు ఇహపరలోకముల యందును వాసి గాంచినవి.
21.3 (మూడవ శ్లోకము)
వియద్విత్తస్య దదతో లబ్ధం లబ్ధం బుభుక్షతః|
నిష్కించనస్య ధీరస్య సకుటుంబస్య సీదతః॥8031॥
21.4 (నాలుగవ శ్లోకము)
వ్యతీయురష్టచత్వారింశదహాన్యపిబతః కిల|
ఘృతపాయససంయావం తోయం ప్రాతరుపస్థితమ్॥8032॥
రంతిదేవుడు అప్రయత్నముగా (దైవికముగా) లభించిన దాని తోడనే జీవితమును గడపు చుండెడివాడు. లభించిన వస్తువులనుగూడ ఇతరులకు దానము చేయుచుండెడి వాడు. క్రమముగా నిర్ధనుడైన అతడు కుటుంబసభ్యులతోగూడ ఆకలిదప్పులతో బాధపడుచుండెడివాడు. ధనమును కూడబెట్టుటగాని, ఇతరుల నుండి స్వీకరించుటగాని చేసెడివాడు కాదు. ఈ విధముగా ఒకసారి అతనికి వరుసగా నలుబది ఎనిమిది దినములు నీరుకూడ లభింపలేదు. ఆ మరునాటి ఉదయమున ఆయనకు నేయి, పాయసము, అన్నము (భక్ష్యవిశేషములు), జలము లభించెను.
21.5 (ఐదవ శ్లోకము)
కృచ్ఛ్రప్రాప్తకుటుంబస్య క్షుత్తృడ్భ్యాం జాతవేపథోః|
అతిథిర్బ్రాహ్మణః కాలే భోక్తుకామస్య చాగమత్॥8033॥
21.6 (ఆరవ శ్లోకము)
తస్మై సంవ్యభజత్సోఽన్నమాదృత్య శ్రద్ధయాన్వితః|
హరిం సర్వత్ర సంపశ్యన్ స భుక్త్వా ప్రయయౌ ద్విజః॥8034॥
21.7 (ఏడవ శ్లోకము)
అథాన్యో భోక్ష్యమాణస్య విభక్తస్య మహీపతే|
విభక్తం వ్యభజత్తస్మై వృషలాయ హరిం స్మరన్॥8034॥
అంతవరకును రంతిదేవుని కుటుంబము ఆకలి దప్పులతో అలమటించుచు సంకటములపాలై యుండెను. ప్రాతఃకాలమున లభించిన ఆహార పదార్థములను భుజించుటకు సిద్ధమైరి. ఇంతలో ఒక బ్రాహ్మణుడు వారి ఇంటికి అతిథిగా వచ్చెను. సకల ప్రాణులలోను భగవంతునే దర్శించుచుండెడి రంతిదేవుడు ఆ ఆహారపదార్థములలో కొంతభాగమును ఆ అతిథికి భక్తిశ్రద్ధలతో సమర్పించెను. పరీక్షిన్మహారాజా! రంతిదేవుడు తన కుటుంబ సభ్యులతో గూడి మిగిలిన ఆహారపదార్థములను తినబోవుచుండగా ఇంతలో ఒక శూద్రుడు భోజనార్థమై అచటికి వచ్చెను. అప్పుడు రంతిదేవుడు శ్రీహరిని స్మరించుచు అందులో కొంతభాగమును అతనికి సమర్పించెను.
21.8 (ఎనిమిదవ శ్లోకము)
యాతే శూద్రే తమన్యోఽగాదతిథిః శ్వభిరావృతః|
రాజన్ మే దీయతామన్నం సగణాయ బుభుక్షతే॥8036॥
శూద్రుడు భుజించి వెళ్ళిన పిమ్మట మరియొక వ్యక్తి కొన్ని కుక్కలను వెంటబెట్టుకొని, అతిథిగా వచ్చి ఇట్లనెను - 'రంతిదేవమహారాజా! నేనును, నా శునకములును మిగుల ఆకలి గొనియున్నాము. మాకు ఆహారపదార్థములను ఇప్పింపుము'.
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి నవమ స్కంధములోని ఇరువది ఒకటవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
21.9 (తొమ్మిదవ శ్లోకము)
స ఆదృత్యావశిష్టం యద్బహుమానపురస్కృతమ్|
తచ్చ దత్త్వా నమశ్చక్రే శ్వభ్యః శ్వపతయే విభుః॥8037॥
అంతట రంతిదేవుడు ఆ వచ్చిన వ్యక్తిని, అతని వెంటనున్న కుక్కలను భగవత్స్వరూపములుగా భావించి, నమస్కరించుచు మిగిలిన ఆహారపదార్థములను సాదరముగా సంతోషముతో ఇచ్చివేసెను.
21.10 (పదియవ శ్లోకము)
పానీయమాత్రముచ్ఛేషం తచ్చైకపరితర్పణమ్|
పాస్యతః పుల్కసోఽభ్యాగాదపో దేహ్యశుభస్య మే॥8038॥
పిమ్మట రంతిదేవుని కడ నీరు మాత్రమే మిగిలియుండెను. అవియును ఒక్కని దాహమును తీర్చుటకు మాత్రమే సరిపోవునట్లుండెను. ఆ స్థితిలో రంతిదేవుడు తన కుటుంబ సభ్యులతోగూడి ఆ జలములతో తమ దాహమును తీర్చుకొనుటకు సిద్ధపడుచుండగా, ఇంతలో దప్పిగొనియున్న ఒక చండాలుడు అచటికి వచ్చి - 'అయ్యా! ఈ అల్పునకు కొన్ని నీళ్ళు ఇచ్చి పుణ్యము గట్టుకొనుము' అని అర్థించెను.
21.11 (పదకొండవ శ్లోకము)
తస్య తాం కరుణాం వాచం నిశమ్య విపులశ్రమామ్|
కృపయా భృశసంతప్త ఇదమాహామృతం వచః॥8039॥
మిక్కిలి అలసిపోయి, దీనస్వరముతో పలుకుచున్న అతని తడబాటు మాటలను వినినంతనే అతనిపై రంతిదేవునకు మిగులజాలి కలిగెను. పిమ్మట ఆ మహారాజు అతనితో మృదుమధురముగా ఇట్లనెను-
21.12 (పండ్రెండవ శ్లోకము)
న కామయేఽహం గతిమీశ్వరాత్పరామష్టర్ద్ధియుక్తామపునర్భవం వా|
ఆర్తిం ప్రపద్యేఽఖిలదేహభాజామంతఃస్థితో యేన భవంత్యదుఃఖాః॥8040॥
'అయ్యా! నేను భగవంతుని నుండి అణిమాది అష్టసిద్ధులనుగాని, అష్టైశ్వర్యములనుగాని కోరుకొనను. అంతేగాదు, బ్రహ్మపదవినిగాని, కడకు మోక్షమును సైతము అభిలషింపను. సకల ప్రాణులకును నా ఆత్మస్వరూపులని భావించి, వారి దుఃఖములను నేనే అనుభవించుటకు ఇష్టపడుదురు. వారియొక్క వివిధములగు దుఃఖములను నావిగా భావింతును. అందువలన వారు తమ దుఃఖములనుండి దూరమగుదురు.
21.13 (పదమూడవ శ్లోకము)
క్షుత్తృట్ శ్రమో గాత్రపరిశ్రమశ్చ దైన్యం క్లమః శోకవిషాదమోహాః|
సర్వే నివృత్తాః కృపణస్య జంతోర్జిజీవిషోర్జీవజలార్పణాన్మే॥8041॥
21.14 (పదునాలుగవ శ్లోకము)
ఇతి ప్రభాష్య పానీయం మ్రియమాణః పిపాసయా|
పుల్కసాయాదదాద్ధీరో నిసర్గకరుణో నృపః॥8042॥
తీవ్రమగు దాహముతో మిగుల బాధపడుచున్న ఒక దీనునకు జలమును ఇచ్చుటవలన అనగా అతని దప్పిక తీర్చుటవలన అతని ప్రాణములు నిలబడును. అప్ఫుడు నా ఆకలిదప్పుల బాధలు, శరీరముయొక్క పరిశ్రమలు (బడలికలు), దైన్యము, అలసట, శోకము, విషాదము, మోహము మొదలగునవి అన్నియును తొలగిపోవును. అంతట నేను హాయిగా ఉందును'. సున్నితమైన మనస్సుగలవాడు (సహజముగా దయాళువు), ధీరుడు (ఎట్టికష్టములనైనను ధైర్యముతో ఎదుర్కొనగలవాడు) ఐన రంతిదేవుడు తాను ప్రాణములు పోవునంతగా దప్పిగొని యున్నను, ఈ విధముగా పలికి ఆ అల్పునకు తనకడనున్న ఆ మధురజలములను ఇచ్చి, అతని దాహమును తీర్చెను.
21.15(పదిహేనవ శ్లోకము)
తస్య త్రిభువనాధీశాః ఫలదాః ఫలమిచ్ఛతామ్|
ఆత్మానం దర్శయాంచక్రుర్మాయా విష్ణువినిర్మితాః॥8043॥
రంతిదేవునికడకు అతిథులుగా వచ్చినవారు (బ్రాహ్మణుడు, శూద్రుడు మొదలగువారు) విష్ణుమాయా కల్పితులై వేర్వేరు రూపములలో ఏతెంచినవారే. భక్తులయొక్క మనోరథములను ఈడేర్చుచుండెడి బ్రహ్మవిష్ణుమహేశ్వరులు ఆ మహారాజును ఈ విధముగా పరీక్షించిన పిదప ఆయనకు సాక్షాత్కరించిరి.
21.16 (పదహారవ శ్లోకము)
స వై తేభ్యో నమస్కృత్య నిఃసంగో విగతస్పృహః|
వాసుదేవే భగవతి భక్త్యా చక్రే మనః పరమ్॥8044॥
రంతిదేవుడు దేనియందును ఎట్టి మమకారమూ లేనివాడు. అంతేగాదు, ఐహికాముష్మిక ఫలములను ఏమాత్రమూ ఆశింపనివాడు. అట్టి ఆ మహాపురుషుడు తనకు ప్రత్యక్షమైన త్రిమూర్తులకు నమస్కరించెను. అతడు ఆ మహాత్ములను ఏమియు కోరిక సర్వేశ్వరుడైన శ్రీహరియందే భక్తిపూర్వకముగా తన మనస్సును పూర్తిగా లగ్నమొనర్చి తన్మయుడైయుండెను.
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి నవమ స్కంధములోని ఇరువది ఒకటవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
21.17 (పదిహేడవ శ్లోకము)
ఈశ్వరాలంబనం చిత్తం కుర్వతోఽనన్యరాధసః|
మాయా గుణమయీ రాజన్ స్వప్నవత్ప్రత్యలీయత॥8045॥
రాజా! రంతిదేవుడు భగవత్సేవను దప్ప తదితర ప్రయోజనమును దేనినీ ఆశింపనివాడు. అతడు తన మనస్సును పూర్తిగా భగదధీనము గావించెను. కనుక, మేల్కొన్నవానికి స్వప్నమువలె త్రిగుణాత్మకమైన మాయ అతనిపై ఎట్టి ప్రభావమును గూడ చూపలేకపోయెను.
21.18 (పదునెనిమిదవ శ్లోకము)
తత్ప్రసంగానుభావేన రంతిదేవానువర్తినః|
అభవన్ యోగినః సర్వే నారాయణపరాయణాః॥8046॥
రంతిదేవుని అనుసరించియుండెడి వారందరును ఆయన సాంగత్య ప్రభావముచే శ్రీహరి భక్తి తత్పరులై, మహాయోగులై సిద్ధిని పొందిరి.
21.19 (పందొమ్మిదవ శ్లోకము)
గర్గాచ్ఛినిస్తతో గార్గ్యః క్షత్రాద్బ్రహ్మ హ్యవర్తత|
దురితక్షయో మహావీర్యాత్తస్య త్రయ్యారుణిః కవిః॥8047॥
21.20 (ఇరువదియవ శ్లోకము)
పుష్కరారుణిరిత్యత్ర యే బ్రాహ్మణగతిం గతాః|
బృహత్క్షత్రస్య పుత్రోఽభూద్ధస్తీ యద్ధస్తినాపురమ్॥8048॥
మన్యు కుమారులలో ఒకడైన గర్గునియొక్క పుత్రుడు శిని. అతని తనయుడు గార్గ్యుడు. క్షత్రియుడైన గార్గ్యునినుండి బ్రాహ్మణవంశములు వృద్ధిచెందెను. మన్యుకుమారులలో ఒకడైన మహావీర్యునికు దురితక్షయుడు జన్మించెను. ఆ దురితక్షయునివలన త్రయ్యారుణి, కవి, పుష్కలారుణి అను వారు కలిగిరి. ఆ ముగ్గురును బ్రాహ్మణ మార్గములను అనుసరించిరి. మన్యు కుమారులలో జ్యేష్ఠుడైన బృహత్ క్షత్రునకు హస్తి అనువాడు కలిగెను. అతడు హస్తినాపురమును నిర్మించెను.
21.21 (ఇరువది ఒకటవ శ్లోకము)
అజమీఢో ద్విమీఢశ్చ పురుమీఢశ్చ హస్తినః|
అజమీఢస్య వంశ్యాః స్యుః ప్రియమేధాదయో ద్విజాః॥8049॥
21.22 (పందొమ్మిదవ శ్లోకము)
అజమీఢాద్బృహదిషుస్తస్య పుత్రో బృహద్ధనుః|
బృహత్కాయస్తతస్తస్య పుత్ర ఆసీజ్జయద్రథః॥8050॥
హస్తి అను వానికి అజమీఢుడు, ద్విమీఢుడు, పురుమీఢుడు అను ముగ్గురు సుతులు కలిగిరి. అజమీఢుని పరంపరలోని వారైన ప్రియమేధుడు మొదలగు వారు బ్రాహ్మణులైరి. అజమీఢుని కుమారుడు బృహదిషువు. అతని పుత్రుడు బృహద్ధనువు. బృహద్ధనువు తనయుడు బృహత్కాయుడు. అతని సుతుడు జయద్రథుడు.
21.23 (ఇరువది మూడవ శ్లోకము)
తత్సుతో విశదస్తస్య సేనజిత్సమజాయత|
రుచిరాశ్వో దృఢహనుః కాశ్యో వత్సశ్చ తత్సుతాః॥8051॥
జయద్రథుని వలన విశకరుడు కలిగెను. అతనికి జన్మించినవాడు సేనజిత్తు. సేనజిత్తు తనయులు రుచిరాశ్వుడు, దృఢహనువు, కాశ్యుడు, వత్సుడు.
21.24 (ఇరువది నాలుగవ శ్లోకము)
రుచిరాశ్వసుతః పారః పృథుసేనస్తదాత్మజః|
పారస్య తనయో నీపస్తస్య పుత్రశతం త్వభూత్॥8052॥
రుచిరాశ్వుని కుమారుడు పారుడు. ఆ పారునకు పృథుసేనుడు, నీపుడు అను ఇరువురు కలిగిరి. నీపునకు వందమంది పుత్రులు కలిగిరి.
21.25 (ఇరువది ఐదవ శ్లోకము)
స కృత్వ్యాం శుకకన్యాయాం బ్రహ్మదత్తమజీజనత్|
స యోగీ గవి భార్యాయాం విష్వక్సేనమధాత్సుతమ్॥8053॥
ఈ నీపుని వలన శుకుని (శుకుడు సర్వసంగ పరిత్యాగి. ఇతడు ఛాయాశుకుడు అని తెలియ మనవి) కుమార్తెయగు కృత్వి యందు బ్రహ్మదత్తుడు అనువాడు జన్మించెను. మహాయోగియైన ఈ బ్రహ్మదత్తుని భార్య సరస్వతియందు విష్వక్సేనుడు కలిగెను.
ఛాయాశుకుని గూర్చి సంక్షిప్తముగా
వ్యాసుని కుమారుడైన శుకుడు సర్వసంగపరిత్యాగి. అతడు వనములకు వెళ్ళు సమయమున ఒక ఛాయాశుకుని సృష్టించెను. ఆ ఛాయాశుకుడు గృహస్థాశ్రమమును స్వీకరించెను. ఆ ఛాయాశుకుని కుమార్తెయగు కృత్వి యందు నీపుని వలన బ్రహ్మదత్తుడు జన్మించెను.
21.26 (ఇరువది ఆరవ శ్లోకము)
జైగీషవ్యోపదేశేన యోగతంత్రం చకార హ|
ఉదక్స్వనస్తతస్తస్మాద్భల్లాదో బార్హదీషవాః॥8054॥
అతడు జైగీషవ్యమునియొక్క ఉపదేశప్రభావమున యోగ తంత్రమును రచించెను. విష్వక్సేనుని తనయుడు ఉదక్స్వనుడు. అతని సుతుడు భల్లాదుడు. వీరు అందరును బృహదిషుని పరంపరలోని వారు.
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి నవమ స్కంధములోని ఇరువది ఒకటవ అధ్యాయము ఇంకను కొనసాగును)
21.27 (ఇరువది ఏడవ శ్లోకము)
యవీనరో ద్విమీఢస్య కృతిమాంస్తత్సుతః స్మృతః|
నామ్నా సత్యధృతిర్యస్య దృఢనేమిః సుపార్శ్వకృత్॥8055॥
హస్తి కుమారులలో రెండవవాడైన ద్విమీఢుని తనయుడు యవనీరుడు. అతని సుతుడు కృతిమంతుడు. కృతిమంతుని పుత్రుడు సత్యధృతి. అతని సూనుడు దృఢనేమి. దృఢనేమికి కలిగినవాడు సుపార్శ్వుడు.
21.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)
సుపార్శ్వాత్సుమతిస్తస్య పుత్రః సన్నతిమాంస్తతః|
కృతిర్హిరణ్యనాభాద్యో యోగం ప్రాప్య జగౌ స్మ షట్॥8056॥
21.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)
సంహితాః ప్రాచ్యసామ్నాం వై నీపో హ్యుగ్రాయుధస్తతః|
తస్య క్షేమ్యః సువీరోఽథ సువీరస్య రిపుంజయః॥8057॥
సుపార్శ్వునకు సుమతి జన్మించెను. అతని తనూజుడు సన్నుతిమంతుడు. అతని పుత్రుడు కృతి. ఈ కృతి యనువాడు బ్రహ్మదేవుని వలన యోగమును సాధనచేసి (శక్తిని పొంది) ప్రాచ్యసామము నందలి ఆరు సంహితలను అధ్యయనము చేసెను. కృతియొక్క కుమారుడు నీపుడు. అతని తనయుడు ఉగ్రాయుధుడు. అతని పుత్రుడు క్షేమ్యుడు. క్షేమ్యుని వలన జన్మించినవాడు సువీరుడు. అతని వలన కలిగినవాడు రిపుంజయుడు.
21.30 (ముప్పదియవ శ్లోకము)
తతో బహురథో నామ పురమీఢోఽప్రజోఽభవత్|
నలిన్యామజమీఢస్య నీలః శాంతిః సుతస్తతః॥8058॥
రిపుంజయుని తనయుడు బహురథుడు. హస్తియొక్క మూడవ కుమారుడైన పురుమీఢునకు సంతానము కలుగలేదు. హస్తి యొక్క జ్యేష్ఠపుత్రుడగు అజమీఢుని వలన నళిని అను నామెయందు నీలుడు పుట్టెను. అతని తనయుడు శాంతి.
21.31 (ముప్పది ఒకటవ శ్లోకము)
శాంతేః సుశాంతిస్తత్పుత్రః పురుజోఽర్కస్తతోఽభవత్|
భర్మ్యాశ్వస్తనయస్తస్య పంచాసన్ ముద్గలాదయః॥8059॥
21.32 (ముప్పది రెండవ శ్లోకము)
యవీనరో బృహదిషుః కాంపిల్యః సంజయః సుతాః|
భర్మ్యాశ్వః ప్రాహ పుత్రా మే పంచానాం రక్షణాయ హి॥8060॥
21.33 (ముప్పది మూడవ శ్లోకము)
విషయాణామలమిమే ఇతి పంచాలసంజ్ఞితాః|
ముద్గలాద్బ్రహ్మ నిర్వృత్తం గోత్రం మౌద్గల్యసంజ్ఞితమ్॥8061॥
శాంతి అను వాని తనూజుడు సుశాంతి. అతని సుతుడు పురుజుడు. పురుజుని కొడుకు అర్కుడు. అతని తనయుడు భర్మ్యాశ్వుడు, అతనికి ముద్గలుడు, యవీనరుడు, బృహదిషువు, కాంపిల్యుడు, సంజయుడు అను ఐదుగురు కుమారులు కల్గిరి. భర్మ్యాశ్వుడు తన పుత్రులతో - 'కుమారులారా! మీరు నా అధీనములో నున్న ఐదు దేశములను రక్షించుటకు సర్వసమర్థులు' అని పలికి ఆ రాజ్యములను రక్షించు బాధ్యతను వారికి అప్పగించెను. అప్పటి ఆ ఐదుగురు పంచాలురు అని వ్యవహరింపబడిరి. ఈ ఐదుమందిలో పెద్దవాడైన ముద్గలుని వలన మౌద్గల్య గోత్రముతో బ్రాహ్మణ వంశము ఏర్పడెను.
21.34 (ముప్పది నాలుగవ శ్లోకము)
మిథునం ముద్గలాద్భార్మ్యాద్దివోదాసః పుమానభూత్|
అహల్యా కన్యకా యస్యాం శతానందస్తు గౌతమాత్॥8062॥
భర్మ్యాశ్వుని కుమారుడైన ముద్గలుని వలన దివోదాసుడు అను పుత్రుడును, అహల్య అను పుత్రికయు (కవలలు) జన్మించిరి. ఆ అహల్యకు గౌతమమహాముని వలన శతానందుడు అను కుమారుడు కలిగెను.
21.35 (ముప్పది ఐదవ శ్లోకము)
తస్య సత్యధృతిః పుత్రో ధనుర్వేదవిశారదః|
శరద్వాంస్తత్సుతో యస్మాదుర్వశీదర్శనాత్కిల॥8063॥
21.36 (ముప్పది ఆరవ శ్లోకము)
శరస్తంబేఽపతద్రేతో మిథునం తదభూచ్ఛుభమ్|
తద్దృష్ట్వా కృపయాగృహ్ణాచ్ఛంతనుర్మృగయాం చరన్|
కృపః కుమారః కన్యా చ ద్రోణపత్న్యభవత్కృపీ॥8064॥
శతానందుని కుమారుడు సత్యధృతి. అతడు ధనుర్విద్యలో ఆఱితేఱినవాడు. సత్యధృతి యొక్క తనయుడు శరద్వంతుడు. అతిలోకసుందరి యగు ఊర్వశిని చూచినంతనే శరద్వంతునకు రేతస్సు పతనమయ్యెను. ఆ రేతస్సు ఱెల్లుదుబ్బు పైబడి రెండుగా విభక్తమయ్యెను. అందుండి ఒక బాలుడును, ఒక బాలికయు రూపొందిరి. వేటాడు నిమిత్తమై వచ్చిన శంతనుడు ఆ మార్గముననే వెళ్ళుచు శుభలక్షణ సంపన్నులైన ఆ ఇద్దరు శిశువులను చూచి కనికరముతో వారిని తన వెంట తీసికొనిపోయి పెంచి పెద్ద చేసెను. ఆ బాలుని పేరు కృపుడు (కృపాచార్యుడు), బాలిక పేరు కృపి. ఆ కృపి యను కన్య ద్రోణాచార్యునకు ధర్మపత్ని అయ్యెను.
కృపాచార్యుడు ద్రోణాచార్యునితోబాటు కురుపాండవులకు అస్త్రవిద్యా గురువు అయ్యెను.
శంతనుని కృపకు పాత్రులైనందుననే బాలునకు కృపుడు అనియు, బాలికకు కృపి అను పేర్లు ఏర్పడెను.
ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం నవమస్కంధే ఏకవింశోఽధ్యాయః (21)
ఇది భాగవత మహాపురాణమునందలి నవమ స్కంధమునందు ఇరువది ఒకటవ అధ్యాయము (21)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
No comments:
Post a Comment