శ్రీశుక ఉవాచ
శ్రీశుకుడు పలికెను - "పరీక్షిన్మహారాజా! యయాతి ఈ విధముగా స్త్రీలోలుడై సుఖభోగములలో మునిగి తేలుచుండెను. ఒకనాడు అతడు తన జీవితము పతనోన్ముఖమై సాగుచున్నట్లు గ్రహించి, విరక్తిని పొందెను. అంతట అతడు తనకు ప్రియమైన దేవయానికి ఈ గాథను తెలిపెను.
భృగువంశజురాలైన దేవయానీ! నావలె విషయసుఖ లోలుడైన వానియొక్క గాథను తెలిపెదను వినుము. ఇట్టి గృహస్థులను ఉద్ధరించుటకై, జితేంద్రియులైన వనవాసులు (మునులు; వారికై జాలిపడుచు) ఆలోచించుచుందురు.
ఒకానొక మేకపోతు వనములలో తనకు ఇష్టమైన వస్తువుకొఱకై వెదకుచు అటునిటు సంచరించు చుండెను. అప్పుడు అది కర్మవశముస బావిలో పడియున్న ఒక మేకను చూచెను.
పిమ్మట మేకపోతు ఆ మేకను బావిలోనుండి గట్టెక్కించుటకై ప్రేమతో ఉపాయమును ఆలోచించెను. అది తన కొమ్ముల కొనలతో ఒడ్డున త్రవ్వి బావిలోనికి మార్గమును ఏర్పరచెను.
పొందికగా ఉన్న ఆ మేక బావిలో నుండి బయటికి వచ్చిన పిదప ఆ మేకపోతును వరించెను. యౌవనములో నున్న ఆ మేకపోతు చక్కని మీసములుగలిగి దృఢముగా ఉండెను. రతిక్రీడకై ఉత్సాహపడుచు మేకలకు హాయిని కొల్పునదై యుండెను. అట్టి మేకపోతును జూచి, తక్కిన మేకలన్నియును దానిపై మోహపడసాగెను. అంతట ఆ ఒక్క మేకపోతే అచటి మేకలన్నింటితో క్రీడించుచు వాటిని సుఖపెట్టుచుండెను. కామాతురయైన ఆ మేకపోతు ఆ పిచ్చిలోబడి తన వివేకమును పూర్తిగా కోల్పోయెను.
అప్పుడు బావిలోనుండి బయటపడిన మేక, తన భర్తయైన పోతుపై మరులుగొనిన మరియొక మేకతో తన పతి (పోతు) క్రీడించుట చూచి, దాని చేష్టలను సహింపలేకపోయెను. అంతట అది 'ఈ మేకపోతు మిక్కిలి కామాతుర. దీని ప్రేమ క్షణికమైనది. కనుక, దీనిని విశ్వసింపరాదు. ఇది మిత్రరూపములో ఉన్న శత్రువు. అనగా - పయోముఖ విషకుంభము' అని భావించి ఇంద్రియలోలుడైన తన భర్తను త్యజించి, కుమలిపోవుచు తన పాలకుని కడకు వెళ్ళిపోయెను.
అంతట ఆ మేకపై మోహములో మునిగియున్న ఆ పోతు దైన్యముతో ఒప్పుచు దానిని (ఆ మేకను) సానుకూలముగా జేసికొనుటకై బ్రతిమాలుచు వెంటబడెను. ఎంతగా ఆ పోతు 'మే-మే' అని అఱచుచు వెంబడించినను అది (ఆ పోతు) దానిని (ఆ మేకను) దారికి తీసికొని రాలేకపోయెను.
ఆమె యజమాని ఒక బ్రాహ్మణుడు. అతడు జరిగిన విషయమును విని మిగుల క్రుద్ధుడై ఆ మేకపోతు యొక్క వృషణములను కోసివేసెను. పిమ్మట శక్తిమంతుడైన ఆ ద్విజుడు తన కూతురైన ఆ మేకకు మేలు చేయుటకొఱకై వాటిని ఎప్పటివలె సంధించెను. ప్రియురాలా! అట్లు వృషణములు జోడింపబడిన పిదప ఆ మేకపోతు బావినుండి లభించిన ఆ మేకతో పెద్దకాలము తనివిదీర సుఖించెను. ఐనను నేటికిని ఆ పోతుకు తృప్తి తీరకుండెను.
చక్కని కనుతీరుగల సుందరీ! ప్రస్తుతము నా పరిస్థితి గూడ ఆ మేకపోతువలె ఉన్నది. నేను నీ ప్రేమ పిచ్చిలోపడి మిక్కిలి దీనుడనై యున్నాను. నీ మాయలో చిక్కుపడియుండుటచే నేను ఇప్పటికిని నా శ్రేయస్సును గూర్చి నేను ఆలోచింపకున్నాను.
లోకమున అంతులేని కోరికలతో కొట్టుమిట్టాడుచున్న మానవునకు ధనధాన్యములు, వెండి బంగారములు, పశుసంపదలు, భార్యాపుత్రులు ఇవి యేమియు మనస్సునకు తృప్తిని ఇయ్యజాలవు. మానవుడు విషయభోగములను ఎంతగా అనుభవించినను ఆ భోగవాసనలు చల్లారవు (వదలవు) సరిగదా, అతనిలో అవి వృద్ధిచెందుచునే యుండును. ఎట్లనగా, ఎంతగా ఆహుతులను సమర్పించినను అగ్నిజ్వాలలు తగ్గకుండుటయే గాక, అవి ఇంకను ఎగసిపడుచుండునుగదా!
మనుష్యుడు సకల ప్రాణుల యెడలను, వస్తువులమీదను రాగద్వేష వైషమ్యములను వీడినప్పుడే అతడు సమదృష్టి కలవాడగును. అనగా సమదర్శియగును. అప్పుడు అతనికి అన్ని దిక్కులును సుఖమయములుగా తోచును.
మందబుద్ధులు (అజ్ఞానులు) అంత సులభముగా తృష్ణను త్యజింపజాలరు. శరీరమున వార్ధక్యము ప్రవేశించుచుండగా అది శిథిలమగుచుండును. కాని, అతనిలో తృష్ణమాత్రము నిత్యనూతనముగా పెంపగుచునే యుండును. కావున శ్రేయస్సును (శాంతిని) కోరుకొనువాడు వెంటనే తృష్ణను వీడవలెను.
తల్లితో, తోబుట్టువుతో, కూతురుతో ఒకే ఆసనముపై కూర్చుండరాదు. ఏలయన, ఇంద్రియముల శక్తి బలీయమైనది. అవి ఎంతటి విద్వాంసుని ఐనను చలింపజేయును. కనుక, స్త్రీలు సాన్నిహిత్యమును సర్వదా త్యజింపవలెను.
నేను పూర్తిగా వేయిసంవత్సరముల నుండి తరచుగా విషయసుఖములను అనుభవించుచునే యుంటిని. ఐనను వాటియందు (సుఖభోగములయందలి) లాలస అనుక్షణము వృద్ధి చెందుచునే యున్నది.
అందువలన నేను అట్టి భోగతృష్ణను త్యజించి, మనస్సును భగవంతునిపై నిలిపెదను. శీతోష్ణ సుఖదుఃఖాది ద్వంద్వములకు అతీతుడనై, అహంకార మమకారములు లేనివాడనై వనములలో మృగములతో గూడి నివసింతును.
ఇహలోక సుఖములుగాని, పరలోక సుఖములుగాని (ఐహికాముష్మిక సుఖములలో ఏవైనను) శ్రేయస్కరములుగావు. కనుక, ఎవ్వడైనను వాటిని గూర్చి ఆలోచింపరాదు. వాటికి లోనుకారాదు. చింతించుటవలన జననమరణ చక్రమున చిక్కుపడవలసి వచ్చును. అనుభవించుటవలన ఆత్మనాశము సంభవించును. ఈ రహస్యమును ఎరిగి, వీటికి దూరముగా ఉన్నవాడే నిజమైన ఆత్మజ్ఞాని".
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి నవమ స్కంధములోని పందొమ్మిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏 ..... (1)
విషయసుఖములయెడ విరక్తుడైన యయాతి తన భార్యయగు దేవయానితో ఇట్లు పలికిన పిదప పూరునకు అతని యౌవనమును అప్పగించి, అతనినుండి తన వార్ధక్యమును స్వీకరించెను. పిమ్మట ఆ మహారాజు తన రాజ్యమునకు ఆగ్నేయ భాగమునగల ప్రదేశమునకు ద్రుహ్యుని, దక్షిణమునగల ప్రదేశమునకు యదువును, పశ్చిమభాగమునకు తుర్వసును, ఉత్తరభాగమునకు అనువును ప్రభువులనుగా జేసెను. సర్వసమర్థుడైన పూరును సమస్త భూమండలమునకు పట్టాభిషిక్తుని గావించి, ప్రజాపాలన భారమును, ఆయనకు అప్ఫగించెను. అతని సోదరులు అందరును అతని వశములో ఉండునట్లు గావించి, తాను వనములకు వెళ్ళెను.
ఆ యయాతి పెక్కు సంవత్సరముల పాటు విషయసుఖ భోగములను అనుభవించియుండెను. ఐనను ఱెక్కలు వచ్చిన పక్షి గూటినివలె, అతడు విరక్తుడై క్షణములో తన సర్వస్వమును త్యజించి వెళ్ళిపోయెను.
యయాతి వనములకు చేరిన పిమ్మట సర్వసంగపరిత్యాగియై ఆత్మసాక్షాత్కారమును పొంది త్రిగుణమయమైన లింగదేహమును వీడెను. ప్రశస్తుడైన అతడు మాయకు అతీతమగు పరబ్రహ్మమైన వాసుదేవుని యందు లీనమై, భాగవతోత్తములకు ప్రాప్యమైన మోక్షమును పొందెను.
యయాతి చెప్పిన మేకపోతు గాథను విన్న పిమ్మట - దేవయాని ఇట్లు తలపోసెను. 'పరస్పరానురాగముగల స్త్రీ పురుషులకు విరహబాధ ఏర్పడినప్పుడు మనస్సులు వికలమగుచుండునని తెలుపుటకే పరిహాసపూర్వకముగా అతడు ఈ గాథను చెప్ఫెను. కాని ఇది పరిహాస ప్రస్తావన ఏమాత్రమూ గాదు. వాస్తవముగా తనలో అంతర్మథనము జరుగుటకై అనగా - తనను నివృత్తి మార్గమునకు మళ్ళించుటకై ఈ కథను చెప్పెను. స్వజనులు (పతి, పత్నీపుత్రాదులు) అందరుసు భగవధీనములోనివారు. వీరి కలయిక దాహార్తులై చలివేంద్రమునకు వచ్చి చేరిన బాటసారుల సమాగమము వంటిది. అని భగవన్మాయా విలసితము, స్వప్నసదృశము. ఇట్లు భావించిన పిమ్మట దేవయాని లౌకికములైన సమస్త విషయములయెడ ఆసక్తిని వీడెను. కృష్ణపరమాత్మయందే మనస్సును నిలిపి ఆమె తన స్థూలదేహమును పరిత్యజించెను.
వాసుదేవుడు జగతృష్టికారకుడు. ఆ స్వామి సకలప్రాణులలో అంతర్యామిగా వెలుగొందుచుండును. ఆయన పరమశాంత స్వరూపుడు. విరాట్ స్వరూపుడు. సకలలోకములకును ఆధారభూతుడు. అట్టిభగవంతునకు నమస్కరించుచున్నాను. ఈ ప్రార్థనను శుకమహర్షిగాని, సూతుడుగాని చేసినట్లు భావింపనగును.
ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం నవమస్కంధే ఏకోనవింశోఽధ్యాయః (19)
ఇది భాగవత మహాపురాణమునందలి నవమ స్కంధమునందు పందొమ్మిదవ అధ్యాయము (19)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
శ్రీశుక ఉవాచ
19.1 (ప్రథమ శ్లోకము)
స ఇత్థమాచరన్ కామాన్ స్త్రైణోఽపహ్నవమాత్మనః|
బుద్ధ్వా ప్రియాయై నిర్విణ్ణో గాథామేతామగాయత॥7961॥
శ్రీశుకుడు పలికెను - "పరీక్షిన్మహారాజా! యయాతి ఈ విధముగా స్త్రీలోలుడై సుఖభోగములలో మునిగి తేలుచుండెను. ఒకనాడు అతడు తన జీవితము పతనోన్ముఖమై సాగుచున్నట్లు గ్రహించి, విరక్తిని పొందెను. అంతట అతడు తనకు ప్రియమైన దేవయానికి ఈ గాథను తెలిపెను.
19.2 (రెండవ శ్లోకము)
శృణు భార్గవ్యమూం గాథాం మద్విధాచరితాం భువి|
ధీరా యస్యానుశోచంతి వనే గ్రామనివాసినః॥7962॥
భృగువంశజురాలైన దేవయానీ! నావలె విషయసుఖ లోలుడైన వానియొక్క గాథను తెలిపెదను వినుము. ఇట్టి గృహస్థులను ఉద్ధరించుటకై, జితేంద్రియులైన వనవాసులు (మునులు; వారికై జాలిపడుచు) ఆలోచించుచుందురు.
19.3 (మూడవ శ్లోకము)
బస్త ఏకో వనే కశ్చిద్విచిన్వన్ ప్రియమాత్మనః|
దదర్శ కూపే పతితాం స్వకర్మవశగామజామ్॥7963॥
ఒకానొక మేకపోతు వనములలో తనకు ఇష్టమైన వస్తువుకొఱకై వెదకుచు అటునిటు సంచరించు చుండెను. అప్పుడు అది కర్మవశముస బావిలో పడియున్న ఒక మేకను చూచెను.
19.4 (నాలుగవ శ్లోకము)
తస్యా ఉద్ధరణోపాయం బస్తః కామీ విచింతయన్|
వ్యధత్త తీర్థముద్ధృత్య విషాణాగ్రేణ రోధసీ॥7964॥
పిమ్మట మేకపోతు ఆ మేకను బావిలోనుండి గట్టెక్కించుటకై ప్రేమతో ఉపాయమును ఆలోచించెను. అది తన కొమ్ముల కొనలతో ఒడ్డున త్రవ్వి బావిలోనికి మార్గమును ఏర్పరచెను.
19.5 (ఐదవ శ్లోకము)
సోత్తీర్య కూపాత్సుశ్రోణీ తమేవ చకమే కిల|
తయా వృతం సముద్వీక్ష్య బహ్వ్యోఽజాః కాంతకామినీః॥7965॥
19.6 (ఆరవ శ్లోకము)
పీవానం శ్మశ్రులం ప్రేష్ఠం మీఢ్వాంసం యాభకోవిదమ్|
స ఏకోఽజవృషస్తాసాం బహ్వీనాం రతివర్ధనః|
రేమే కామగ్రహగ్రస్త ఆత్మానం నావబుధ్యత॥7966॥
పొందికగా ఉన్న ఆ మేక బావిలో నుండి బయటికి వచ్చిన పిదప ఆ మేకపోతును వరించెను. యౌవనములో నున్న ఆ మేకపోతు చక్కని మీసములుగలిగి దృఢముగా ఉండెను. రతిక్రీడకై ఉత్సాహపడుచు మేకలకు హాయిని కొల్పునదై యుండెను. అట్టి మేకపోతును జూచి, తక్కిన మేకలన్నియును దానిపై మోహపడసాగెను. అంతట ఆ ఒక్క మేకపోతే అచటి మేకలన్నింటితో క్రీడించుచు వాటిని సుఖపెట్టుచుండెను. కామాతురయైన ఆ మేకపోతు ఆ పిచ్చిలోబడి తన వివేకమును పూర్తిగా కోల్పోయెను.
19.7 (ఏడవ శ్లోకము)
తమేవ ప్రేష్ఠతమయా రమమాణమజాన్యయా|
విలోక్య కూపసంవిగ్నా నామృష్యద్బస్తకర్మ తత్॥7967॥
19.8 (ఎనిమిదవ శ్లోకము)
తం దుర్హృదం సుహృద్రూపం కామినం క్షణసౌహృదమ్|
ఇంద్రియారామముత్సృజ్య స్వామినం దుఃఖితా యయౌ॥7968॥
అప్పుడు బావిలోనుండి బయటపడిన మేక, తన భర్తయైన పోతుపై మరులుగొనిన మరియొక మేకతో తన పతి (పోతు) క్రీడించుట చూచి, దాని చేష్టలను సహింపలేకపోయెను. అంతట అది 'ఈ మేకపోతు మిక్కిలి కామాతుర. దీని ప్రేమ క్షణికమైనది. కనుక, దీనిని విశ్వసింపరాదు. ఇది మిత్రరూపములో ఉన్న శత్రువు. అనగా - పయోముఖ విషకుంభము' అని భావించి ఇంద్రియలోలుడైన తన భర్తను త్యజించి, కుమలిపోవుచు తన పాలకుని కడకు వెళ్ళిపోయెను.
19.9 (తొమ్మిదవ శ్లోకము)
సోఽపి చానుగతః స్త్రైణః కృపణస్తాం ప్రసాదితుమ్|
కుర్వన్నిడవిడాకారం నాశక్నోత్పథి సంధితుమ్॥7969॥
అంతట ఆ మేకపై మోహములో మునిగియున్న ఆ పోతు దైన్యముతో ఒప్పుచు దానిని (ఆ మేకను) సానుకూలముగా జేసికొనుటకై బ్రతిమాలుచు వెంటబడెను. ఎంతగా ఆ పోతు 'మే-మే' అని అఱచుచు వెంబడించినను అది (ఆ పోతు) దానిని (ఆ మేకను) దారికి తీసికొని రాలేకపోయెను.
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి నవమ స్కంధములోని పందొమ్మిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
21.10.2020 ప్రాతః కాల సందేశము
వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం
నవమ స్కంధము - పందొమ్మిదవ అధ్యాయము
యయాతి గృహత్యాగము చేయుట
ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
19.10 (పదియవ శ్లోకము)
తస్యాస్తత్ర ద్విజః కశ్చిదజాస్వామ్యచ్ఛినద్రుషా|
లంబంతం వృషణం భూయః సందధేఽర్థాయ యోగవిత్॥7970॥
19.11 (పదకొండవ శ్లోకము)
సంబద్ధవృషణః సోఽపి హ్యజయా కూపలబ్ధయా|
కాలం బహుతిథం భద్రే కామైర్నాద్యాపి తుష్యతి॥7971॥
ఆమె యజమాని ఒక బ్రాహ్మణుడు. అతడు జరిగిన విషయమును విని మిగుల క్రుద్ధుడై ఆ మేకపోతు యొక్క వృషణములను కోసివేసెను. పిమ్మట శక్తిమంతుడైన ఆ ద్విజుడు తన కూతురైన ఆ మేకకు మేలు చేయుటకొఱకై వాటిని ఎప్పటివలె సంధించెను. ప్రియురాలా! అట్లు వృషణములు జోడింపబడిన పిదప ఆ మేకపోతు బావినుండి లభించిన ఆ మేకతో పెద్దకాలము తనివిదీర సుఖించెను. ఐనను నేటికిని ఆ పోతుకు తృప్తి తీరకుండెను.
19.12 (పండ్రెండవ శ్లోకము)
తథాహం కృపణః సుభ్రు భవత్యాః ప్రేమయంత్రితః|
ఆత్మానం నాభిజానామి మోహితస్తవ మాయయా॥7972॥
చక్కని కనుతీరుగల సుందరీ! ప్రస్తుతము నా పరిస్థితి గూడ ఆ మేకపోతువలె ఉన్నది. నేను నీ ప్రేమ పిచ్చిలోపడి మిక్కిలి దీనుడనై యున్నాను. నీ మాయలో చిక్కుపడియుండుటచే నేను ఇప్పటికిని నా శ్రేయస్సును గూర్చి నేను ఆలోచింపకున్నాను.
19.13 (పదమూడవ శ్లోకము)
యత్పృథివ్యాం వ్రీహియవం హిరణ్యం పశవః స్త్రియః|
న దుహ్యంతి మనఃప్రీతిం పుంసః కామహతస్య తే॥7973॥
19.14 (పదునాలుగవ శ్లోకము)
న జాతు కామః కామానాముపభోగేన శామ్యతి|
హవిషా కృష్ణవర్త్మేవ భూయ ఏవాభివర్ధతే॥7974॥
లోకమున అంతులేని కోరికలతో కొట్టుమిట్టాడుచున్న మానవునకు ధనధాన్యములు, వెండి బంగారములు, పశుసంపదలు, భార్యాపుత్రులు ఇవి యేమియు మనస్సునకు తృప్తిని ఇయ్యజాలవు. మానవుడు విషయభోగములను ఎంతగా అనుభవించినను ఆ భోగవాసనలు చల్లారవు (వదలవు) సరిగదా, అతనిలో అవి వృద్ధిచెందుచునే యుండును. ఎట్లనగా, ఎంతగా ఆహుతులను సమర్పించినను అగ్నిజ్వాలలు తగ్గకుండుటయే గాక, అవి ఇంకను ఎగసిపడుచుండునుగదా!
19.15 (పదిహేనవ శ్లోకము)
యదా న కురుతే భావం సర్వభూతేష్వమంగళమ్|
సమదృష్టేస్తదా పుంసః సర్వాః సుఖమయా దిశః॥7975॥
మనుష్యుడు సకల ప్రాణుల యెడలను, వస్తువులమీదను రాగద్వేష వైషమ్యములను వీడినప్పుడే అతడు సమదృష్టి కలవాడగును. అనగా సమదర్శియగును. అప్పుడు అతనికి అన్ని దిక్కులును సుఖమయములుగా తోచును.
19.16 (పదహారవ శ్లోకము)
యా దుస్త్యజా దుర్మతిభిర్జీర్యతో యా న జీర్యతే|
తాం తృష్ణాం దుఃఖనివహాం శర్మకామో ద్రుతం త్యజేత్॥7976॥
మందబుద్ధులు (అజ్ఞానులు) అంత సులభముగా తృష్ణను త్యజింపజాలరు. శరీరమున వార్ధక్యము ప్రవేశించుచుండగా అది శిథిలమగుచుండును. కాని, అతనిలో తృష్ణమాత్రము నిత్యనూతనముగా పెంపగుచునే యుండును. కావున శ్రేయస్సును (శాంతిని) కోరుకొనువాడు వెంటనే తృష్ణను వీడవలెను.
19.17 (పదిహేడవ శ్లోకము)
మాత్రా స్వస్రా దుహిత్రా వా నావివిక్తాసనో భవేత్|
బలవానింద్రియగ్రామో విద్వాంసమపి కర్షతి॥7977॥
తల్లితో, తోబుట్టువుతో, కూతురుతో ఒకే ఆసనముపై కూర్చుండరాదు. ఏలయన, ఇంద్రియముల శక్తి బలీయమైనది. అవి ఎంతటి విద్వాంసుని ఐనను చలింపజేయును. కనుక, స్త్రీలు సాన్నిహిత్యమును సర్వదా త్యజింపవలెను.
19.18 (పదునెనిమిదవ శ్లోకము)
పూర్ణం వర్షసహస్రం మే విషయాన్ సేవతోఽసకృత్|
తథాపి చానుసవనం తృష్ణా తేషూపజాయతే॥7978॥
నేను పూర్తిగా వేయిసంవత్సరముల నుండి తరచుగా విషయసుఖములను అనుభవించుచునే యుంటిని. ఐనను వాటియందు (సుఖభోగములయందలి) లాలస అనుక్షణము వృద్ధి చెందుచునే యున్నది.
19.19 (పందొమ్మిదవ శ్లోకము)
తస్మాదేతామహం త్యక్త్వా బ్రహ్మణ్యాధాయ మానసమ్|
నిర్ద్వంద్వో నిరహంకారశ్చరిష్యామి మృగైః సహ॥7979॥
అందువలన నేను అట్టి భోగతృష్ణను త్యజించి, మనస్సును భగవంతునిపై నిలిపెదను. శీతోష్ణ సుఖదుఃఖాది ద్వంద్వములకు అతీతుడనై, అహంకార మమకారములు లేనివాడనై వనములలో మృగములతో గూడి నివసింతును.
19.20 (ఇరువదియవ శ్లోకము)
దృష్టం శ్రుతమసద్బుద్ధ్వా నానుధ్యాయేన్న సంవిశేత్|
సంసృతిం చాత్మనాశం చ తత్ర విద్వాన్ స ఆత్మదృక్॥7980॥
ఇహలోక సుఖములుగాని, పరలోక సుఖములుగాని (ఐహికాముష్మిక సుఖములలో ఏవైనను) శ్రేయస్కరములుగావు. కనుక, ఎవ్వడైనను వాటిని గూర్చి ఆలోచింపరాదు. వాటికి లోనుకారాదు. చింతించుటవలన జననమరణ చక్రమున చిక్కుపడవలసి వచ్చును. అనుభవించుటవలన ఆత్మనాశము సంభవించును. ఈ రహస్యమును ఎరిగి, వీటికి దూరముగా ఉన్నవాడే నిజమైన ఆత్మజ్ఞాని".
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి నవమ స్కంధములోని పందొమ్మిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
19.21 (ఇరువది ఒకటవ శ్లోకము)
ఇత్యుక్త్వా నాహుషో జాయాం తదీయం పూరవే వయః|
దత్త్వా స్వాం జరసం తస్మాదాదదే విగతస్పృహః॥7981॥
19.22 (ఇరువది రెండవ శ్లోకము)
దిశి దక్షిణపూర్వస్యాం ద్రుహ్యుం దక్షిణతో యదుమ్|
ప్రతీచ్యాం తుర్వసుం చక్రే ఉదీచ్యామనుమీశ్వరమ్॥7982॥
19.23 (ఇరువది మూడవ శ్లోకము)
భూమండలస్య సర్వస్య పూరుమర్హత్తమం విశామ్|
అభిషిచ్యాగ్రజాంస్తస్య వశే స్థాప్య వనం యయౌ॥7983॥
విషయసుఖములయెడ విరక్తుడైన యయాతి తన భార్యయగు దేవయానితో ఇట్లు పలికిన పిదప పూరునకు అతని యౌవనమును అప్పగించి, అతనినుండి తన వార్ధక్యమును స్వీకరించెను. పిమ్మట ఆ మహారాజు తన రాజ్యమునకు ఆగ్నేయ భాగమునగల ప్రదేశమునకు ద్రుహ్యుని, దక్షిణమునగల ప్రదేశమునకు యదువును, పశ్చిమభాగమునకు తుర్వసును, ఉత్తరభాగమునకు అనువును ప్రభువులనుగా జేసెను. సర్వసమర్థుడైన పూరును సమస్త భూమండలమునకు పట్టాభిషిక్తుని గావించి, ప్రజాపాలన భారమును, ఆయనకు అప్ఫగించెను. అతని సోదరులు అందరును అతని వశములో ఉండునట్లు గావించి, తాను వనములకు వెళ్ళెను.
19.24 (ఇరువది నాలుగవ శ్లోకము)
ఆసేవితం వర్షపూగాన్ షడ్వర్గం విషయేషు సః|
క్షణేన ముముచే నీడం జాతపక్ష ఇవ ద్విజః॥7984॥
ఆ యయాతి పెక్కు సంవత్సరముల పాటు విషయసుఖ భోగములను అనుభవించియుండెను. ఐనను ఱెక్కలు వచ్చిన పక్షి గూటినివలె, అతడు విరక్తుడై క్షణములో తన సర్వస్వమును త్యజించి వెళ్ళిపోయెను.
19.25 (ఇరువది ఐదవ శ్లోకము)
స తత్ర నిర్ముక్తసమస్తసంగ ఆత్మానుభూత్యా విధుతత్రిలింగః|
పరేఽమలే బ్రహ్మణి వాసుదేవే లేభే గతిం భాగవతీం ప్రతీతః॥7985॥
యయాతి వనములకు చేరిన పిమ్మట సర్వసంగపరిత్యాగియై ఆత్మసాక్షాత్కారమును పొంది త్రిగుణమయమైన లింగదేహమును వీడెను. ప్రశస్తుడైన అతడు మాయకు అతీతమగు పరబ్రహ్మమైన వాసుదేవుని యందు లీనమై, భాగవతోత్తములకు ప్రాప్యమైన మోక్షమును పొందెను.
19.26 (ఇరువది ఆరవ శ్లోకము)
శ్రుత్వా గాథాం దేవయానీ మేనే ప్రస్తోభమాత్మనః|
స్త్రీపుంసోః స్నేహవైక్లవ్యాత్పరిహాసమివేరితమ్॥7986॥
19.27 (ఇరువది ఏడవ శ్లోకము)
సా సన్నివాసం సుహృదాం ప్రపాయామివ గచ్ఛతామ్|
విజ్ఞాయేశ్వరతంత్రాణాం మాయావిరచితం ప్రభోః॥7987॥
19.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)
సర్వత్ర సంగముత్సృజ్య స్వప్నౌపమ్యేన భార్గవీ|
కృష్ణే మనః సమావేశ్య వ్యధునోల్లింగమాత్మనః॥7988॥
యయాతి చెప్పిన మేకపోతు గాథను విన్న పిమ్మట - దేవయాని ఇట్లు తలపోసెను. 'పరస్పరానురాగముగల స్త్రీ పురుషులకు విరహబాధ ఏర్పడినప్పుడు మనస్సులు వికలమగుచుండునని తెలుపుటకే పరిహాసపూర్వకముగా అతడు ఈ గాథను చెప్ఫెను. కాని ఇది పరిహాస ప్రస్తావన ఏమాత్రమూ గాదు. వాస్తవముగా తనలో అంతర్మథనము జరుగుటకై అనగా - తనను నివృత్తి మార్గమునకు మళ్ళించుటకై ఈ కథను చెప్పెను. స్వజనులు (పతి, పత్నీపుత్రాదులు) అందరుసు భగవధీనములోనివారు. వీరి కలయిక దాహార్తులై చలివేంద్రమునకు వచ్చి చేరిన బాటసారుల సమాగమము వంటిది. అని భగవన్మాయా విలసితము, స్వప్నసదృశము. ఇట్లు భావించిన పిమ్మట దేవయాని లౌకికములైన సమస్త విషయములయెడ ఆసక్తిని వీడెను. కృష్ణపరమాత్మయందే మనస్సును నిలిపి ఆమె తన స్థూలదేహమును పరిత్యజించెను.
19.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)
నమస్తుభ్యం భగవతే వాసుదేవాయ వేధసే|
సర్వభూతాధివాసాయ శాంతాయ బృహతే నమః॥7989॥
వాసుదేవుడు జగతృష్టికారకుడు. ఆ స్వామి సకలప్రాణులలో అంతర్యామిగా వెలుగొందుచుండును. ఆయన పరమశాంత స్వరూపుడు. విరాట్ స్వరూపుడు. సకలలోకములకును ఆధారభూతుడు. అట్టిభగవంతునకు నమస్కరించుచున్నాను. ఈ ప్రార్థనను శుకమహర్షిగాని, సూతుడుగాని చేసినట్లు భావింపనగును.
ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం నవమస్కంధే ఏకోనవింశోఽధ్యాయః (19)
ఇది భాగవత మహాపురాణమునందలి నవమ స్కంధమునందు పందొమ్మిదవ అధ్యాయము (19)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
No comments:
Post a Comment