Thursday, 5 June 2025


 శ్రీదేవీ భూదేవి మధ్య శ్రీ శ్రీనివాసు లీలలు(37)

దేవీ రమ్యము...దాహము గదా..రాత్రంత ఉండేదవా
దేవీవేగము...దాహచరితం...సొమ్మంత ఇచ్చేదవా
చిత్తం మందును ... చిన్మయముగా.. సేద్యమ్ము చేసేదవా
మత్తింతేనులె...మానసికమే...మధ్యమ్మే చేసేదవా

ఈప్రాణమ్మున..ఈమనసులో ...ఈయంధకారమ్ములో
ఈప్రాముఖ్యము... ఈ వయసులో.. ఈఆశ ప్రేమమ్ములో
ఈ ప్రాబల్యము...ఈసొగసులో...ఈవిద్య సంతృప్తి లో
ఈప్రోత్సాహము...ఈమనసులో... ఈ లక్ష్య భావమ్ముయే

రా దేవీనిను .. ప్రార్ధనలతో ... రక్షించగా వేడెదన్
రా దేవీ విను.. ఆశయముతో..రంజిల్ల పర్చేనులే
రా దేవీ కను... రాత్రికలలో... రమ్యమ్ముగా చూపెదన్
రా దేవీ కళ... రాటుతనతో... రాజ్యమ్ముగా ఎలెవన్

రమ్యమ్మే ఇది... రమ్యతలతో. ...ప్రారబ్ధ మేలే సదన్
కామ్యమ్మే ఇది... కమ్మనిదియే...కారుణ్య భావమ్ముగన్
సౌమ్యమ్మే ఇది సమ్మతముయే...సారూప్య దేహమ్ముగన్
చిన్మాయే ఇది .. చిత్రములు యే.. సామర్ధ్య దాహమ్ముగన్

*****
శ్రీదేవీ భూదేవి మధ్య శ్రీ శ్రీనివాసు లీలలు(38)

గుండె గూటి దివ్య మాట గునపంలా గుచ్చిందా  
మండె మంట గుడ్డి ఆట వెలుగంతా కమ్మిందా

దేవీ కొంత ఓర్పు ఉంచి ప్రేమనంతా చూపించు 
పెదవిచాటు మౌన మాట దీపంలా వెలిగిందా   

కనులమాటు కాంతియాట వేదంలా మిగిలిందా 
కళలు వేటు కొంత యాట ప్రేమల్లే ఇక దేవీ 

మండె మాట మబ్బు మాట చినుకుల్లా వచ్చిందా
ఆశ యందు సేద తీట ఆట బతుకంతా విచ్చిందా 

దేవీ ముందు ఆశ వల్ల నేమి మనసంతా ప్రేమేగా  
పొదలమాటు ప్రేమయేట కోపంలా నలిగిందా   

మరులు గొల్పు ప్రేమ ఆట వినయంగను ఉందా  
తరుణమాయ ప్రేమవేట దాహమ్మే  ఇది దేవీ

ఉండె ఘాటు ప్రేమ మాట మనసుల్లా తాకిందా
కారు మబ్బు ప్రేమ ఆట  వయసంతా పాకిందా 

దేవీ నీవు స్వేశ్చ కోరి తనువంతా కోరిందా 
వెసులుబాటు చెప్పుఆట తాపంలా మిగిలిందా 

కరుణమాయ ఒప్పుఆట  పాపంలా మనదందా  
మనసు మాటు చూపు ఓర్పు స్నేహంలా ఇది దేవీ 

తిండి దక్కె ఆశ మాట  తనువల్లా వణికిందా 
ఒట్టి మాట ఒప్పుమాట కామంతో పిలిచిందా     

గట్టి పట్టు చూపి నావు నాకెంతో ఇది దేవీ 
ఒక ఘాటు సరసం మాట అర్ధ మైతే వర్ష0 కాదా   

ఇక ఘాటు విరహం మొహ మయ్యే ఐతే దాహం కాదా  
చక చిక్కి చరితం మంత తెల్పే ప్రేమే హర్షం దేవీ  

*****
*మౌనతలో మంగళం*(39)

చూస్తూ చూడనట్లున్నావా, కాస్తూ కాయనట్లున్నావా,
రాస్తూ రాయనట్లున్నావా, జ్యాస్తీ  కన నట్లున్నావా,
ఎందుకు మారేందుకు మౌనంగా నున్నావే శ్రీ వేంకటేశ్వరా....

సుఖాలు  దు:ఖాలూ వసుధన కాలాలు
భయమ్ము జయమ్మున్ య భయము మూలాలు
గులాబి జిలేబీ రుచులుగ మోహాలు
కులాలు మతాలూ మనుషుల మౌనాలు
 ఎందుకో మరి ఎందుకో తెలియదు వెంకటేశ్వరా

అలాగ యిలాగౌను కలియు పంతాలు
ఎ మాయ యెరోగం తెలియుట వింతేలు
నసాధ్యము గాకుండ నడుగు న్యాయాలు
 అసాధ్యము ఏకంగ సమము తాళాలు
ఎందుకో మరి ఎందుకో తెలియదు వెంకటేశ్వరా
  
సకాలము రాగాలు సమత భావాలు 
ప్రమాణము గానుండు పలుకులక్ష్యాలు 
సమానము గా నుండు సరయు దు:ఖాలు 
ప్రయాణములో కొంతబడయు కష్టాలు        
ఎందుకో మరి ఎందుకో తెలియదు వెంకటేశ్వరా
        
 అకాలము మాధుర్య మధుర రాగాలు
వికారము ఏనాడు  వినని  భావాలు 
యుగాలలొ పాఠాలు కులుకు భాగాలు 
మనుష్యులలో ప్రేమ మగువ తీరాలు
ఎందుకో మరి ఎందుకో తెలియదు వెంకటేశ్వరా

చూస్తూ చూడనట్లున్నావా, కాస్తూ కాయనట్లున్నావా,
రాస్తూ రాయనట్లున్నావా, జ్యాస్తీ  కన నట్లున్నావా,
ఎందుకు మారేందుకు మౌనంగా నున్నావే శ్రీ వేంకటేశ్వరా....
గోవిందా.. గోవిందా.. గోవింద
******
చక్రీ.. చక్రవ్యూహం...(40)

పువ్వు నవ్వు గనలేని గoధాన్ని సృష్టించావు దేవరా
నవ్వు మోము స్త్రీకి ఇచ్చి బంధాన్ని సృష్టిస్తావు దేవరా 

భగవంతుడా…
నువ్వు కూడా తమాషాలు చేస్తావు ..
కనులు చూస్తే ….
తెలుపు, నలుపు 
మరి కలలను రంగులలో చూపిస్తావు!! 

కనుల చూచినవన్నీ వాస్తవాలు కావని నమ్మిస్తావు
వినిన విషయాలన్నీ యథార్థాలు కావని నమ్మిస్తావు

కాలమే కదా ..
 అందరి అసలు స్వరూపం అని నమ్మిస్తావు 
 కాలం చెడ్డదని  ఎలా చెప్తావు
ఎండమావులూ నీటిమడులై అగుపించి నమ్మిస్తావు
కల్లను నిజంచేస్తూ కనులను మోసంచేస్తూ ఊరుకున్నావు

మనసు కంటే …సున్నిత మైనది 
ఈ విశ్వం లోనే లేదు  అని నమ్మిస్తావు

లోకులు పలుగాకులు 
నిందలు వేసేరు సులువుగా 
తాము చూచినదే సత్యమని నమ్మిస్తావు
దూరాన నీడలు కూడా కనికట్టుగా  చూపిస్తావు
లేనిది ఉన్నట్లు ఉన్నది లేనట్టు చిత్రంగానమ్మిస్తావు 

రూడీగాక పరులపై అపనింద వేయ తగదని  చూపిస్తావు
పుకార్ల షికార్ల వేగం అధికమే కావచ్చు
కాని ధైర్యాన్ని ఇస్తావు
నిర్ధారణలో కాలం తీర్పుతో తేలిపోతూ. చూపిస్తావు        
మిత్రమా మాటల తో దాడి కూడా..      
ఈటెలు లా గుచ్చుతూ నమ్మిస్తావు

పువ్వు నవ్వు గనలేని గoధాన్ని సృష్టించావు దేవరా
నవ్వు మోము స్త్రీకి ఇచ్చి బంధాన్ని సృష్టిస్తావు దేవరా 
****
శ్రీ వేంకటేశ్వరుని లీలలు ...(41)
 
నేస్తమా నే నున్నా తోడుగా...నేస్త  మాయె దెపుడు
నీడగా లాభమే ఇస్తాను... తోడు గుంటి నీకు
అంబరమ్ము కు సాక్షి గ వినుము... సంబరమ్ము ఇకను

మక్కువే గా తీపి చేదుగా... మొక్కు వైనదియును
తేనలా తీపిగా హాయిగా ....తేట మలుపు నీకు
ధైపమా మా కోర్కలను తీర్చు  .... దేవ పిలుపు లాగ
 
కోపమా  మాదరి రాకుమా  .... ... కోప తాప మొవ్వు  
లోపము చేయక ఉంచుము .... ... లోప మైన దిద్దు  
శాపము  మమ్ము కమ్మి నదిలే ... .. శాప మాప వలెను 

భయముగా మామధ్య రాకుము  ,,  భయమును తొలగించు 
కాలమా మంచి చేయుము మాకు ...  తాళ లేక ఉండె  . 
వేదమా పల్కు నేర్పుము మాకు  ....  వేద మోక్ష మొవ్వు 

మిత్రునిగా నన్ను కొలిచితి ...... మిత్ర సేవ కొరకు .  .  
ధర్మమే మాకు మార్గము దేవ .... ధర్మ సేవ చేయు 
సత్యమే మాలొ వాక్కులు దేవ  ... సతము నిరతి మాలొ  

న్యాయమే మాకు రక్షగ దేవ ... ...  న్యాయ దేవతవులె  
దేశ రక్షగ వేంకట రమణా   ... .... దేశ శాంతి కొరకు   
ప్రాంజలి ప్రభ సోయగములు - నిత్య సత్య దేవ 
--(()) - -

ప్రాంజలి ప్రభను ఆదరిస్తున్న ప్రతిఒక్కరికి పాదాభివందనములు తెలియపరుస్తూ
శ్రీ వేంకటేశ్వరుని ఆరాధిస్తూ  భావకవితలు వ్రాస్తున్నా 
 నాకు సంగీతం రాదు సంగీత స్వరాలతో పాడేవారు ఎవరైనా సహకరిస్తే ఆభగవంతుని కృపకు ప్రతిఒక్కరికి అందించాలని ఒక ఆశ
******
శ్రీ వేంకటేశ్వర లీల లు (42 )
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ

వెనువెంటనే వేంకట రమణా ...  వెనక బంధ మవ్వు 
సంస్కరించే శక్తి యు రమణా .... సంక టమ్ము తీర్చు  
విక్సష్ సేనగను నీవు రమణా ..... విశ్వ విజయ నేత 
చేయలేను ఉపచారములు దేవ....  మొయ లేను ఎపుడు  

నమస్కార ములు తెల్పితిని దేవ ... సమము గాను చూడు  
కలశాభిషేకమ్ము యే దేవ .... .... .  కళలు తీర్చ వయ్య  
కర్పూరం వెలిగించి తిని దేవ  ... ఓర్పు ఇవ్వు మాకు  
తొలగించు జన్మపాపము దేవ  .... అలలు లాగ ఉన్న 

కోరను నే వరాలను దేవ .....  కోరికలను తీర్చు  
సకల జీవులను రక్షగా దేవ ...... వికటకవిని నేను    
దూరాన ఉన్నావు గా దేవ ....... నేరములను మాపు   
చిరకాల హృదయమందున దేవ ..... కరములు కలిపితిని   

అంతర్మధనము చూడుము దేవ  - పంత మేమి లేదు 
సర్వమ్ము అర్పించితిని  దేవ  .... సర్వ మాయ తుంచు 
నిత్యమూ వేడుచుంటిని దేవ  --- నిత్య సత్య దేవ    
ప్రాంజలి ప్రభ సోయగములు ... శ్రీ శ్రీ శ్రీ వెంకట రమణా 
--(())--


కృష్ణం కలయ సఖి ముఖారి రాగం (43)
తాళం: ఆది నారాయణ తీర్ధ

పల్లవి
కృష్ణం కలయ సఖి సుందరం బాల
(కృష్ణం)

చరణం 1
కృష్ణం గతవిషయ తృష్ణం జగత్ప్రభ విష్ణుం సురారిగణ జిష్ణుం సదా బాల
(కృష్ణం)

చరణం 2
నృత్యం తమిహ ముహుర్త్యంతం అపరిమిత బృత్యానుకూలం అఖిల సత్యం సదా బాల
(కృష్ణం)

చరణం 3
ధీరం భవజల భారం సకల వేదసారం సమస్త యోగిధారం సదా బాల
(కృష్ణం)

చరణం 4
శృంగార రసభర సంగీత సాహిత్య గంగాలహరి కేళ సంగం సదా బాల
(కృష్ణం)

చరణం 5
రామేణ జగదభిరామేణ బల భద్రరామేణ సమవాప్త కామేన సహ బాల
(కృష్ణం)

చరణం 6
దామోదరం అఖిల కామాకరంగన శ్యామాకృతిం అసుర భీమం సదా బాల
(కృష్ణం)

చరణం 7
రాధారుణాధర సుధాపం సచ్చిదానంద రూపం జగత్రయ భూపం సదా బాల
(కృష్ణం)

చరణం 8
అర్థం శిథిలీకృతానర్థం శ్రీ నారాయణ తీర్థం పరమపురుషార్థం సదా బాల
(కృష్ణం)

No comments:

Post a Comment