ఓం శ్రీ రాం ఓం శ్రీ రాం ఓం శ్రీ రాం
ప్రాంజలి ప్రభ - శ్రీ కృష్ణ " జన్మాష్టమి". .......
సర్వేజనాసుఖినోభావంతు
ఆ శ్రీ కృష్ణ పరమాత్ముని ఆశిస్సులు అందరికి కలగాలని, అందరు సుఖ సౌఖ్యాలతో జీవంచాలని, శ్రీ కృష్ణని పుట్టుక సందర్బముగా ప్రపంచ ప్రజలందరికి, ముఖ్య్యముగా తెలుగు ప్రజలందరికి ప్రాంజలి వారి శుభాకాంక్షలు
నమస్కారం....మిత్రులందరికి " శుభోదయం " ,....
కృష్ణం వందే జగద్గురుం..." జన్మాష్టమి". ........
సృష్టి స్థితి కారుడైన శ్రీకృష్ణుడి జన్మ దినాన్ని ''కృష్ణాష్టమి''గా వేడుక చేసుకుంటాం. శ్రావణ బహుళ అష్టమి రాత్రి రోహిణీ నక్షత్రంలో శ్రీకృష్ణుడు జన్మించాడు. కృష్ణాష్టమిని గోకులాష్టమ,శ్రీకృష్ణ జయంతి అని రకరకాలుగా వ్యవహరిస్తారు. శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున కృష్ణుడు ఇంట్లోకి రావాలని ఆశిస్తూ వాకిట్లో బియ్యప్పిండి లేదా ముగ్గుతో బాల గోపాలుడి పాదాలను తీర్చిదిద్దడంతో పండుగ వాతావరణం మొదలవుతుంది. ద్వారాలకు మావిడాకులు, వివిధ పూవులతో తోరణాలు కట్టి, కృష్ణుని విగ్రహాన్ని తడి వస్త్రంతో శుభ్రపరచి, చందనం, కుంకుమలతో తిలకం దిద్దుతారు. కృష్ణుని విగ్రహాన్ని, పూజా మందిరాన్ని పూవులతో అలంకరిస్తారు. అక్షింతలు, ధూపదీపాలతో పూజిస్తారు. ..
సృష్టి స్థితి కారుడైన శ్రీకృష్ణుడి జన్మ దినాన్ని ''కృష్ణాష్టమి''గా వేడుక చేసుకుంటాం. శ్రావణ బహుళ అష్టమి రాత్రి రోహిణీ నక్షత్రంలో శ్రీకృష్ణుడు జన్మించాడు. కృష్ణాష్టమిని గోకులాష్టమ,శ్రీకృష్ణ జయంతి అని రకరకాలుగా వ్యవహరిస్తారు. శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున కృష్ణుడు ఇంట్లోకి రావాలని ఆశిస్తూ వాకిట్లో బియ్యప్పిండి లేదా ముగ్గుతో బాల గోపాలుడి పాదాలను తీర్చిదిద్దడంతో పండుగ వాతావరణం మొదలవుతుంది. ద్వారాలకు మావిడాకులు, వివిధ పూవులతో తోరణాలు కట్టి, కృష్ణుని విగ్రహాన్ని తడి వస్త్రంతో శుభ్రపరచి, చందనం, కుంకుమలతో తిలకం దిద్దుతారు. కృష్ణుని విగ్రహాన్ని, పూజా మందిరాన్ని పూవులతో అలంకరిస్తారు. అక్షింతలు, ధూపదీపాలతో పూజిస్తారు. ,
శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని కృష్ణ లీలల్ని స్మరించుకుందాం..
* ద్రౌపది, తనకు వస్త్రాపహరణం జరుగుతున్నప్పుడు తన భర్తలను సాయం అర్ధించలేదు. మరెవర్నీ ప్రాధేయపడలేదు. "కృష్ణా.. నన్ను నువ్వే కాపాడాలి" అంటూ శ్రీకృష్ణుని వేడుకుంది. తనను నమ్మి, శరణు వేడినవారిని దైవం ఎన్నడూ విడిచిపెట్టదు. కృష్ణుడు అందించిన దివ్య వస్త్రంతో ద్రౌపది అవమానం నుండి బయటపడింది.
* కాళియ నాగుపాము యమునా నదిలో నివాసం ఏర్పరచుకుంది. ఆ పాము చిందించే విషంతో యమునా జలం కలుషితం అయింది. అంతేనా.. ఆ విషపు వేడికి నీలు మరుగుతూ, నదిపై ఎగిరే పక్షులకు కూడా హాని చేస్తోంది. ఆ వేడి సెగలకు తట్టుకోలేక పక్షులు, నదిలో పడి చనిపోయేవి. ఇది చూసిన బాల కృష్ణుని మనసు ఆర్ద్రమైంది. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ దైవ లక్షణం కదా! యమునా జలాలకు కాలుష్యం నుండి విముక్తి ప్రసాదించాలని, కాళీయుని కోరల్లోంచి వెలువడుతోన్న విషం నుండి పశుపక్ష్యాదులను కాపాడాలని, యమునా జలాన్ని తిరిగి మంచినీటిగా మార్చాలని అనుకున్నాడు. వెంటనే శ్రీకృష్ణుడు యమునా నదిలో దూకాడు. కాళీయ సర్పం కృష్ణుని చూసింది. తనకు అపకారం తలపెట్టిన బాలకుడు ఎవరు అని ఆశ్చర్యపోయింది. తక్షణం బుద్ధి చెప్పాలని, తన పొడవాటి శరీరంతో కృష్ణుని చుట్టేసింది.ఒడ్డున ఉన్నగోప బాలికలు, యశోదమ్మ అందరూ కంగారుపడ్డారు. భయాందోళనలకు లోనయ్యారు. దాంతో కృష్ణుడు నవ్వుతూ తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. శ్రీకృష్ణుని ఆకృతి పెరగడంతో కాళీయ సర్పం పట్టు విడిపోయి, కోపంతో బుసలు కొట్టింది. ఇక కృష్ణుడు కాళీయుని నూరు పడగలపై నృత్యం చేశాడు. శ్రీకృష్ణుడు ఒక్కో పడగమీదికి లంఘిస్తూ కాళియ మర్దనం చేస్తోంటే కాళీయుడు తగ్గిపోయాడు. పడగలు దెబ్బతిన్నాయి. రక్తం ధారలు కట్టింది. కాళీయుడు పశ్చాత్తాపానికి లోనయ్యాడు. శ్రీకృష్ణుని శరణు వేడాడు. కాళీయుని భార్యలు కూడా కృష్ణుని పాదాలపై పడి, కాళీయుని క్షమించమని కోరాయి. కృష్ణుడు దయ తలచాడు.. కాళీయుని వెంటనే యమునానది వదిలి వెళ్ళి, రమణక ద్వీపానికి వెళ్ళమన్నాడు. కాళీయుడు కుటుంబ సమేతంగా యమున వదిలి వెళ్లడంతో యమునాజలం పవిత్రమైంది. అందరూ ఆనందించారు. ,.
కృష్ణ లీలలకు అంతేముంది? ఎవరైనా, ఎన్నయినా తలచుకోవచ్చు. ,...
కృష్ణ పరమాత్మ అంటే అపరితమైన ఆనందం. ఇంత అని కొలవడానికి అవకాశం లేనిది. దేన్నైతే పొందాక ఇక మరొకటి కావాలని అనిపించదో అదే అపరిమిత ఆనందం అంటే. శ్రీమద్భాగవతంలో "దేవకీ పూర్వ సంధ్యాయాం అవిర్భూతం మహాత్మనం" అని చెబుతారు. పరమాత్మ దేవకీదేవికి పుట్టాడు అని చెబుతారు. ఆయన అవతరించాడు అని చెప్పరు, అవతరించాడు అంటే ఆయన ఎక్కడి నుండో దిగి రావడం. నేను పుడతాను అని మాట ఇచ్చాడు దేవకీదేవికి. ఆయన తన మాటకే కాదు తన భక్తుల మాటని కూడా తప్పు కానివ్వడు. నృసింహ అవతారం వచ్చింది ప్రహ్లాదుని మాటని నిజం చేయడానికే కదా. అట్లా పుట్టాడు స్వామి. ఆయన పుట్టగానే ఎట్లా ఉన్నాడు అని సేవించిన వసుదేవుని మాట, ఆయన అవతారాన్ని వర్ణించిన వ్యాసుని మాట "తమద్భుతం బాలకం". ఇతను పరమాత్మే అని గుర్తించడానికి పుండరీకాక్షుడై, నాలుడు భుజములు కలిగి, శంఖచక్రగద ధారియై, వక్షస్థలంపై శ్రీవత్స చిహ్నం కలిగి, కౌస్తుభమణి ధరించి ఉన్నాడు. అట్లాంటి స్వామిని వసుదేవుడు చూసాడు. కారాగారంలో అర్దరాత్రి దేవకీ వసుదేవులకు పుట్టాడు. కంసునికి తెలిస్తే ఏం చేస్తాడో అని దేవకీదేవి చేసిన ప్రార్థనకి తన రూపాన్ని ఉపసంహరించుకున్నాడు. మోక్షాన్ని ప్రసాదించడానికి వచ్చిన అవతరం శ్రీకృష్ణ అవతారం. అనంత కోటి బ్రహ్మాండములని తన పొట్టలో దాచుకున్న స్వామిని మనం కట్టి వేయగలామా! కానీ ఆయన యశోదమ్మ ప్రేమకు కట్టించుకొని తన సౌశీల్యాన్ని చూపించాడు. అట్లాంటి స్వామిని మనం సేవించుకోగలిగే అవకాశం స్వామి మనకు ప్రసాదించడమే మన అదృష్టం. -

శ్రీ కృష్ణ జయంతి , Sri Krishna Jayanthi
ఎప్పుడు ధర్మానికి చ్యుతి , అధర్మానికి విజ్రుంభన కలుగుతాయో అప్పుడు భగవంతుడు అవతరించి ధర్మ సంస్థాపనం చేస్తాడని భగవద్గీత చెబుతోంది . ఉపనిషత్తుల కాలం లో ఉద్భవించిన 'సత్యం , శివం , సుందరం ' ప్రేమ వచనాలు అనంతర కాలం లో ఒకే మహామహితాత్మునిలో కేంద్రీకృతమై భారత దేశాన్ని ఆధ్యాత్మికం గా , రాజకీయం గా స్పందింపజేసాయి. శ్రీ కృష్ణుడు ఒక గురువు ,నేత , రాజకీయవేత్త , మహర్షి , విశ్వసారధి , యోగేస్వరేస్వరుడు ,మహానుభావుడు అయిన ఈతని పుట్టిన రోజునే పండగ గా హిందువులు జరుపుకొంటారు .
సృష్టికర్త అయిన మహావిష్ణువు బ్రహ్మాండాన్ని ఉద్ధరించడానికి శ్రీకృష్ణుడిగా జన్మించిన కృష్ణ జన్మాష్టమిని "కృష్ణాష్టమి", "గోకులాష్టమి" లేదా అష్టమి రోహిణి అని పిలుస్తారు. ఉట్ల పండుగ అనికూడా పిలువబడే శ్రీకృష్ణ జన్మాష్టమిని గురించి తొలి తెలుగు వాగ్గేయకారుడు తాళ్ళపాక అన్నమాచార్యుడు ఒక కీర్తనలో ఇలా సెలవిచ్చాడు
"పైకొని చూడరె వుట్ల పండుగ నేడు
ఆకడ గొల్లెతకు ననందము నేడు అడర శ్రావణబహుళాష్టమి నేడితడు నడురేయి జనియించినాడు చూడ గదరే. మహాభారత యుద్ధంలో పాండవ పక్షపాతిగా నిలిచి శతసోదరులైన కౌరవులను వారి సైన్యాన్ని సంహరింపజేయడం ద్వారా లోక కళ్యాణానికి బాటలు వేసిన శ్రీకృష్ణుని దర్శిస్తే మన పాపాలు సైతం సంహరించబడుతాయి. హిందూమతానికి ఆదర్శప్రాయ గ్రంధమైన గీతా సారాంశాన్ని అందించిన శ్రీకృష్ణ భగవానుడి జన్మ దినమైన శ్రీకృష్ణాష్టమి వేళ శ్రీ కృష్ణ దేవాలయాలను దర్శిస్తే జన్మ జన్మలకు సరిపోయే పుణ్యఫలం భక్తుల సొంతమౌతుంది. అందుకే కృష్ణాష్టమి వేళ శ్రీకృష్ణ దేవాలయాలను గానీ, గౌడీయ మఠాలను గానీ దర్శిస్తే చాలా శుభప్రదం. శ్రీకృష్ణుని దేవాలయాన్ని సందర్శించిన సమయంలో కృష్ణ ధ్యాన శ్లోకములు పఠిస్తే చాలా మంచిది. అలాగే ఆ దేవదేవుని సన్నిధిలో అష్టోత్తర పూజను చేయిస్తే చేయించిన వారికి సఖల సుఖాలు సొంతమౌతాయి. దీనితోపాటు కృష్ణ సహస్రనామ పూజను కూడా చేయిస్తే చాలా మంచిది. | ||||
298. ఇతరములైన అడ్డంకులను గుర్తించి, వ్యక్తి ఆత్మవైపుకు మార్పు చెందవలెను. అడ్డంకులకు మూల కారణము నీ యొక్క అహంకారముతో కూడిన భౌతిక భావన మాత్రమే అని తెలుసుకొని దానిని మార్పు చేయాలి.
299. ఎవరికైన ఈ అహంకారముతో సంబంధమున్నచో అట్టి వ్యక్తి విముక్తిని గూర్చి మాట్లాడవలసిన పని లేదు. విముక్తి అనేది తిరుగులేనిది.
300. అహంకారము యొక్క బంధనాల నుండి స్వేచ్ఛను పొందాలంటే వ్యక్తి తన యొక్క అసలు సత్యమైన, స్వచ్ఛమైన, శాశ్వతమైన ఎల్లపుడు ఆనంద స్థితిలో ఉండేది, స్వయంప్రకాశవంతమైన ఆత్మను పొందాలి. ఎలానంటే రాహుగ్రహము నుండి విముక్తి పొందిన చంద్రుడు ఎలా ప్రకాశిస్తాడో అలాగా.
301. బుద్ది వలన మాలిణ్యముతో కూడిన భౌతిక సంబంధములు ఎలా సృష్టించబడినవో, అవి శరీరానికి కళంకము తెచ్చి, నేనుబలవంతుడును, నేను అమాయకుడను, నేను సంతోషముతో ఉన్నాను అనే భావనలు అహంతో చోటుచేసుకొను చున్నాయి. ఎపుడైతే ఈ అహంభావము నాశనం అయిపోతుందో అపుడే ఏ అడ్డంకులు లేకుండా బ్రహ్మమును పొందగలడు.
302. బ్రహ్మానందమనే ధనాగారము చుట్టూ శక్తివంతమైన, భయంకమైన, 'అహం' అనే సర్పము చుట్టలు చుట్టుకొని తన స్వలాభము కొరకు రక్షించుచున్నది. అందువలన దానికి సత్వ, రజో, తమో గుణములనే మూడు పడగలు కాపలా కాస్తున్నవి. కేవలము జ్ఞాని అయిన యోగి మాత్రమే ఆ త్రిగుణములనే పడగలను తన యొక్క ఆత్మ జ్ఞానమనే ఖడ్గంతో నాశనము చేయగలడని సృతులు పల్కుచున్నవి. అపుడు మాత్రమే బ్రహ్మానందమనే ధనగారమును అనుభవించగలడు.
303. శరీరములో ఏ మాత్రము విష చిహ్నములున్న అట్టి వ్యక్తి ఎలా దాని ప్రభావము నుండి విముక్తి పొందగలడు. యోగి యొక్క అహంకారము కూడా అలానే యోగి యొక్క విముక్తికి అడ్డుగా ఉంటున్నది.
304. పూర్తిగా అహంకారము తొలగిపోయినప్పుడే (అందుకు తత్‌సంబంధమైన మానసిక భావనలు తొలగాలి). అంతర్గత సత్యము యొక్క పూర్ణ జ్ఞానము పొంది, సత్యాసత్యముల విచక్షణ జ్ఞానము వలన 'ఇదే నేను' అను సత్యమును గ్రహించగలడు.
305. అందువలన అహంకారము యొక్క పూర్తి గుర్తింపును వెంటనే వదలివేసి, అది కేవలము మాలిన్యము యొక్క స్వభావమని, తన యొక్క తెలివితేటలని, ఆత్మ యొక్క ప్రతిబింబమని గ్రహించి, దాని నుండి మనస్సును మరలించి ఆత్మ వైపుకు త్రిప్పవలెను. నీవు ఆ అహంకారము వలననే సంసార సాగరమనే ఈ ప్రపంచములో చిక్కుకున్నట్లు తెలుసుకొని, అది కేవలము పుట్టుక, క్షీణత, చావులని గ్రహించి అసలైన బ్రహ్మానంద స్థితి యొక్క ఆనందమును దర్శించవలెను.
306. అయితే నీ యొక్క గుర్తింపు అహంకారమైనచో, ఎప్పటికి నీవు శాశ్వతమైన పరమాత్మ యొక్క ఔన్నత్యమును, ఎల్లప్రదేశములందు విస్తరించి ఉన్న పరిపూర్ణ ఆనంద స్థితిని, మరుగులేని ఉన్నత స్థితిని పొందలేవు.
307. అందువలన నీ యొక్క అహంకారమును నాశనం చేసి; అది నీ శత్రువు ఎందువలనంటే అది మనిషి యొక్క గొంతులో గుచ్చుకొన్న ముల్లువలె, నీవు ఆహారమును స్వీకరించలేని స్థితిని కలిగించునది కాన; నీవు దానిని నీ పదునైన వివేచన అనే ఖడ్గముతో నీ శత్రువును వదించినట్లు నాశనము చేసి నీ యొక్క అసలు స్థితిని తెలుసుకొని నేరుగా బ్రహ్మానందమనే ఆత్మ సామ్రాజ్యమును పొందుము.
308. అహంకారము యొక్క పనులను అడ్డుకొని, అన్ని బంధనాలను తెంచుకొనుట ద్వారా బ్రహ్మాన్ని తెలుసుకొని సత్యాన్ని గ్రహించి ద్వంద్వాతీత స్థితిని చేరుకొని, ఆత్మానందమును పొంది, బ్రహ్మములో శాశ్వతముగా ఐక్యము కమ్ము. నీవు ఆ స్థితిని పొందియున్నావు.
309. భయంకరమైన అహంభావమును పూర్తిగా మూలముతో సహా నిర్మూలించినప్పటికి, మనస్సులో ఒక క్షణమైన జీవన సృతులు జ్ఞాపకమునకు వచ్చిన, వందలకొలది కష్టాలను కొనితెస్తుంది. ఎలానంటే వర్షాకాలంలో గాలి వేగానికి మబ్బులు చెదిరిపోయినట్లు.
310. అత్యంత శక్తితో అహంభావమనే శత్రువును ఓడించినప్పటికి ఒక్క క్షణము నీవు జ్ఞానేంద్రియాలకు అనుగుణముగా ఆలోచించినప్పటికి, ఆ కారణముగా తిరిగి నీవు సంసార జీవితములోనికి వచ్చినట్లు అవుతుంది. చిట్రాన్‌వృక్షము పూర్తిగా ఎండిపోయినప్పటికి అందులోంచి నీరు బయటకు వస్తుంది
కోరికలు, కర్మలు
311. ఎవడైతే శరీరముతో దురాశతో ఏకమవుతాడో అతడు జ్ఞానేంద్రియాల సుఖాలకు లోనవుతాడు. అతడు శరీర భావనను ఎలా తొలగించు కొనగలడు, దురాశలో ఉన్నట్లే. అందువలన జ్ఞానేంద్రియ భావన అనేది ముఖ్య కారణముగా అతడు మరల ద్వంద్వ స్థితిలోకి చేరుకొన్నట్లు భావించాలి.
312. ఎపుడైతే స్వార్థ భావముతో కూడిన చర్యలు మొదలవుతాయో అపుడు జ్ఞానేంద్రియ సంబంధ వస్తువులపై భావనలు పెంపొంది, అవి మొలకెత్తగా అట్టి కోరికలను గుర్తించి వాటిని నాశనం చేసినచో ఆ విత్తనం కూడా నాశనం అవుతుంది. అందువలన ప్రతి వ్యక్తి అట్టి స్వార్థ భావనలను వెంటనే అణచి వేయాలి.
313. కోరికలు పెరుగుట ద్వారా, స్వార్థ పరత్వం పెరిగి కోరికలు కూడా పెరుగుతాయి. అపుడు మనిషిలో మార్పును మనం గమనించము.
314. మార్పులతో కూడిన ఇనుప గొలుసును తెంపివేయుటకు సన్యాసి రెండు విధములైన ఆలోచనలు: 1) వస్తువులపై కోరికలను తొలగించుకొనుట 2) స్వార్థ పూరితమైన పనులు చేయుట అనువాటిని కాల్చి బూడిద చేయాలి. లేనిచో కోరికలు పెచ్చుపెరుగుతాయి
315, 316. ఒక వ్యక్తి మార్పు చెందుటకు చేసే ప్రయత్నంలో అడ్డువచ్చే కోరికలు, స్వార్థము అనే వాటిని తొలగించుకోవాలంటే, తనకెదురయ్యే అన్ని పరిస్థితుల్లో, ఎల్లపుడు, ప్రతిచోట, అన్ని విషయాల్లో బ్రహ్మము, బ్రహ్మమని భావిస్తుండాలి. ఆ బ్రహ్మ భావన యొక్క కోరికకు, అదే కావాలనే భావన వలన పై స్థితులన్ని మాయమవుతాయి
కోరికలు - కర్మలు
317 స్వార్థ పూరితమైన పనులు ఎపుడైతే ఆగిపోతాయో అపుడు జ్ఞానేంద్రియ వస్తు సముదాయము ప్రోగగుట ఆగిపోతుంది. దాని ఫలితముగా కోరికలు అంతమవుతాయి. కోరికలు అంతమగుటయే విముక్తి మొదలగుటకు కారణము. అదే వ్యక్తి జీవితములో విముక్తిగా భావించబడుతుంది.
318. ఎపుడైతే బ్రహ్మాన్ని తెలుసుకోవాలని కోరిక స్థిరమవుతుందో, అపుడు అహం యొక్క భావనలు వెంటనే తొలగిపోతాయి. ఉదయిస్తున్న సూర్యుని ప్రకాశము వలన గాఢమైన చీకటి పూర్తిగా తొలగిపోతుంది కదా!
319. చీకటి, దానినంటి ఉన్న అనేకమైన చెడులు సూర్యోదయము తరువాత కనిపించవు. అదే విధముగా పరమాత్మ స్థితిని పొందిన తరువాత బంధనాలు మరియు దుఃఖాలు పూర్తిగా తొలగిపోతాయి.
320. బాహ్యమైన, అంతర్గతమైన విశ్వ భావనలు ఏవైన ఉన్నవో అవన్ని తొలగిపోతాయి. అందుకు సత్యమైన బ్రహ్మానంద స్థితిని గూర్చి ధ్యానము చేయాలి. ప్రతి వ్యక్తి, ప్రతి క్షణాన్ని జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నచో, ప్రారబ్దము వలన మిగిలి ఉన్న కర్మఫలితాన్ని తొలగిపోతాయి.
321. ప్రతి సాధకుడు ఎల్లపుడు బ్రహ్మా జ్ఞానాన్ని గూర్చిన స్థిరమైన వేగవంతమైన భావనలో అజాగ్రత్తగా ఉండకూడదు. బ్రహ్మ దేవుని కుమారుడైన సనత్ కుమారుడు ఏమరు పాటుగా ఉన్న 'చావు' ను కూడా పిలచినాడు. ఈ మాట రాజైన ధార్తరాష్ణునికి, సనత్ కుమారునికి మధ్య జరిగిన సంభాషణలో వ్యక్తపర్చినాడు. అనగా ఏమర పాటు కూడదని అర్థము.
324. తుంగ ను అడ్డు తొలగించినప్పటికి అది ఒక క్షణమైనను ఆగదు. మరల అది నీటిని అల్లుకుంటుంది. అలానే మాయ లేక మాలిన్యము జ్ఞానినైనను ఆవహిస్తుంది. ఎపుడైతే అతడు ఆత్మను గూర్చి ధ్యానము చేయడో అంతకాలము ఆ మాయ అతని నుండి తొలగదు.
325. ఎపుడైతే మనస్సు బ్రహ్మము నుండి ఏ కొంచమైనను బయటకు వెళ్ళుటకు మొదలైందంటే అది క్రమముగా ఒక్కొక్క అడుగు క్రిందికి దిగుతుంది. ఎలా నంటే మెట్ల పై నుండి బంతి క్రిందికి జారిన అది ఒక్కొక్క మెట్టు క్రిందపడుతుంది కదా!
326. మనస్సు ఎపుడైతే బాహ్య వస్తు సముదాయమునకు అంటిపెట్టుకొని ఉంటుందో, వాని లక్షణాలు ఆ మనస్సును ఆకర్షించి, వాటిపై కోరికను పుట్టిస్తుంది. ఆ కోరిక వలన వ్యక్తి దాన్ని తీర్చుకొనుటకు ప్రయత్నం చేస్తాడు.
327. ఎవరైతే బ్రహ్మాన్ని గూర్చిన జ్ఞానాన్ని పూర్తిగా అవగాహన చేసుకుంటారో వారికి దుష్టమైన చావుల భయం ఉండదు. అందుకు కారణము అతడు మనస్సును బ్రహ్మము పై కేంద్రీకరించి ఉంటాడు. ఎవరైతే మనస్సును బ్రహ్మముపై లగ్నము చేస్తారో అతడు సదా విజయాన్ని సాధిస్తారు. అందువలన జాగ్రత్తగా నీవు నీ మనస్సును బ్రహ్మముపై కేంద్రీకరించుము.
328. వ్యతిరేఖ భావముతో వ్యక్తి తన స్వస్వరూపము నుండి విడిపోయినచో, అట్టి వ్యక్తి పతనము చెందుతాడు. పతనమైన వ్యక్తి పతితుడై తిరిగి మరల కోలుకోలేడు.
329. అందువలన ఏ వ్యక్తి తాను బాహ్య వస్తు సముధాయములపై తన మనస్సును మళ్ళించుట చేయరాదు. ఎవరైతే వాటికి పూర్తిగా జీవించినంత కాలము దూరముగా ఉంటారో, వారు చనిపోయిన తరువాత కూడా అలానే ఉంటారు. యజుర్వేదము ప్రకారము ఎవరైతే ఉన్నత గౌరవం పొందుతారో వారు తిరిగి పతనమవటానికి భయపడతారు.
330. ఎపుడైతే వ్యక్తి ఏ కొంచము బ్రహ్మము నుండి విడిపోయిన, వెంటనే అతడు తాను చేసిన పొరపాటు గమనించి భయానికి లోనవుతాడు.
331. ఎవరైతే తాను విశ్వములోని బాహ్య వస్తు విశేషములకు అనుగుణముగా నడుచుకుంటాడో అతడు దుఃఖాలకు ఒకటి తరువాత ఇంకొకటి ఎదుర్కొంటూ, దొంగ తాను చేసిన తప్పుకు భయపడినట్లు, చిక్కుల్లో పడతాడు. ఈ విషయాలు సృతులలోనూ, అనుభవాల ద్వారా గ్రహించగలరు.
332. ఎవరైతే ధ్యానవిధానమునకు విధేయులై ఉంటారో వారు మాయకు అతీతులవుతారు. మరియు ఉన్నతమైన ఆత్మోన్నతిని పొందగలరు. అయితే ఎవరైతే అశాశ్వతమైన విశ్వ పదార్థములకు, కోరికలకు లోనవుతారో వారు నాశనం అవుతారు. అందుకు ఉదాహరణగా దొంగతనము చేసినవాడు భయపడుతూ ఉంటే చేయని వాడు నిర్భయముగా సంచరించగలడు.
333. సన్యాసులు తాము అసత్య వ్యవహారములలో పాల్గోనరాదు. అలా జరిగిన అతడు బంధనాలలో చిక్కుకొనును. అందువలన అతడు తన మనస్సును ఎల్లప్పుడు నేనే బ్రహ్మాన్నని, అంత బ్రహ్మమేనని భావిస్తూ ఎల్లప్పుడు బ్రహ్మానంద స్థితిలో ఉంటూ, పాపాలకు, దుఃఖాలకు, మాయకు వ్యతిరేఖముగా జీవిస్తాడు. ఎందువలనంటే అవన్ని అతడు ముందే అజ్ఞానములో ఉన్నప్పుడు
.334. బాహ్య వస్తు సముధాయముపై ఆధారపడి జీవించిన, వాటి చెడు ఫలితాలు ఇంకా ఇంకా పెరిగిపోతుంటాయి. ఈ విషయాన్ని గ్రహించి బాహ్య వస్తువులపై వ్యామోహమును తొలగించి, స్థిరముగా వ్యక్తి బ్రహ్మమును గూర్చి ధ్యానములో నిమగ్నుడై ఉండవలెను.
335. ఎపుడైతే బాహ్య ప్రపంచము మూసివేయబడుతుందో, మనస్సు ఆనందముతో నిండి ఉంటుంది. ఆ ఆనంద స్థితిలో మనస్సుకు బ్రహ్మానంద స్థితి లేక పరమాత్మ స్థితి అనుభవమవుతుంది. ఎపుడైతే ఖచ్చితముగా అట్టి అనుభవమవుతుందో అపుడు చావు పుట్టుకల గొలుసు తెగిపోతుంది. అందువలన విముక్తికి మొదటి మెట్టు బాహ్య ప్రపంచము వైపు తెరచి ఉన్న తలుపులను మూసివేయుట.
336. విద్యావంతడైన వ్యక్తి ఎచ్చట ఉంటే అచ్చట ఆ వ్యక్తి సత్యాసత్యముల విచక్షణా జ్ఞానముతో వేదాలను నమ్మి తన దృష్టిని అతని వైపు మళ్ళించగలుగుతాడు. అదే అత్యున్నతమైన సత్యము. సాధకుడు అట్టి స్థితిని పొందిన తరువాత చిన్న పిల్లల వలె కాక జాగ్రత్తగా అసత్యమైన విశ్వానికి దూరముగా ఉంటాడు. లేనిచో అది అతని పతనానికి కారణమవుతుంది.
337. శరీరానికి కట్టుబడి ఉన్న వ్యక్తికి విముక్తి లేదు. అలానే విముక్తి పొందిన వ్యక్తికి శరీరముతో ఏవిధమైన గుర్తింపు ఉండదు. నిద్రించు వ్యక్తి మెలుకవలో ఉండడు. మెలుకవలో ఉన్న వ్యక్తి నిద్రించడు. ఈ రెండు వ్యతిరేక ప్రభావము కలిగి ఉన్నవి. 338. ఎవడైతే తన మనస్సుతో తన ఆత్మను తెలుసుకొంటాడో అతడు స్వేచ్ఛను పొందుతాడు. అలా కాక కదులుచున్న, స్థిరముగా ఉన్న వస్తు సముదాయముపై దృష్టిని ఉంచి గమనిస్తుంటాడో, అది అతని పతనము. అందువలన అన్ని మోసాలను అధికమించి వ్యక్తి తన యొక్క ఆత్మిక స్థితిలో స్థిరపడాలి.
23. ఆత్మ స్థితిని చేరుట
339. విశ్వమంతా ఒకే ఆత్మ అని తెలుసుకొనుటయే బంధనాల నుండి విముక్తిని పొందుటకు మార్గము. విశ్వాన్ని ఆత్మతో సమానమని గుర్తించుట కంటే ఉన్నతమైనది ఏదీ లేదు. ఎవడైతే ఈ వస్తు ప్రపంచాన్ని వదలివేసి ఆత్మను గుర్తిస్తాడో, అందుకు శాశ్వతమైన ఆత్మవైపు స్థిరముగా మరలాలి. అతని కంటే ఉన్నతుడు ఎవడు ఉండడు.
340. ఎవడైతే తాను శరీరముగా భావిస్తారో అతడు ఈ వస్తు ప్రపంచానికి దూరముగా ఉండుట ఎలా సాధ్యమవుతుంది. అతని మనస్సు ఎల్లపుడు ఈ బాహ్య వస్తు సముదాయముపై లగ్నమై ఉంటుంది. తత్‌ఫలితముగా అతడు వాటిని పొందుటకు అనేక కార్యములు కొనసాగిస్తుంటాడు. సాధువు ఈ విధమైన వస్తు సముదాయముపై వ్యామోహము జాగ్రత్తగా గమనిస్తూ వాటికి దూరముగా ఉంటూ అలాంటి పనులను, విధులను, వస్తువులను వదలివేసి, ఉన్నతముగా ఆత్మ యందు నిమగ్నమై ఉంటారు. అపుడే వారికి నిరంతర ఆత్మానందము చేకూరుతుంది.
341. సాధువులు ఎవరైతే తమ గురువుల బోధనలు, సృతులను వింటారో వారు నిశ్చబ్దముగా, శాంతముగా, స్థితప్రజ్ఞతలో ఉంటూ సమాధి స్థితిలో ఉండి పరిపూర్ణానంద స్థితిలో నిమగ్నమై ఉంటారు.
342. జ్ఞానులు సహితము అకస్మాత్తుగా తమ యొక్క అహంకారమును నాశనం చేయలేరు. ఒక పర్యాయము స్థిరముగా బలపడిన తరువాత అడ్డంకులన్ని పూర్తిగా తొలగిపోయి, శాంతిని పొంది, నిర్వికల్ప సమాధి స్థితిలోకి చేరగల్గుతారు. కోరికలే అనంతమైన పుట్టుక, చావులకు కారణమవుతాయి.
343. అంతర్గత శక్తి వ్యక్తమై అది ప్రస్ఫుటమైనప్పడు, అహం యొక్క భావనలు పెంపొంది దాని ప్రభావముతో వ్యక్తిని చెడు మార్గము వైపు మళ్ళించి నేనే అన్నింటికి కారణమను భావన కలిగి పతనమవుతాడు.

344.
వ్యక్తమవుతున్న అంతర్గత శక్తిని జయించుట చాలా కష్టము. అట్టి శక్తిని
సంమూలముగా నాశనం చేయాలి. అపుడు అది ఆత్మను ఆవరించుట మాని ఖచ్చితముగా మంచి,
చెడుల వస్తు వివేకములను గ్రహించి అతన్ని చెడు మార్గము నుండి మారునట్లు
చేస్తుంది. అపుడు విజయము ఏమాత్రము అనుమానము లేకుండా లభించి, వస్తు విశేషముల
నుండి దృష్టి మరల్చి ఊగిసరాట లేకుండా మనస్సును అసత్యమైన వస్తు సముదాయము
నుండి మరల్చుతుంది.
345. ఖచ్చితమైన మంచి, చెడుల విచక్షణ వలన నేరుగా విషయము యొక్క సత్య స్వభావమును గ్రహించగలము. అపుడే బంధాలు తొలగి మాయ వలన ఏర్పడిన భ్రమలు వీడిపోయి మరల ఏ మార్పు లేకుండా, అతడు స్వేచ్ఛను పొందుతాడు.
346. జీవ బ్రహ్మముల ఏకత్వమును తెలిసిన జ్ఞానము వలన పూర్తిగా దట్టమైన అజ్ఞానమనే అడవిని ఛేదించి మాయను గుర్తించగలుగుతాడు. ఎవరైతే రెండింటి ఏకత్వమును తెలుసుకొంటాడో అతనిలోని అజ్ఞానము సమూలముగా తొలగి మార్పులకు లోనుకాకుండా ఉంటాడు.
347. సత్యాన్ని కప్పివేసిన తెర తొలగిపోవాలంటే కేవలము సత్యాన్ని గూర్చిన పూర్తి జ్ఞానము తెలుసుకోవాలి. అపుడు అజ్ఞానము నాశనం అవుతుంది. జ్ఞానము వ్యక్తమవుతుంది. అపుడే దారి తప్పినందువలన కలిగే దుఃఖాలు తొలగిపోతాయి.
348. మనం బంధనాలను గమనించినపుడు అవి తాడు వలె చుట్టుకొని, పెనవేసి, ముడి వేయుట తెలుస్తుంది. అందువలన జ్ఞాని తప్పక గ్రహించాలి, సత్యమైన బాహ్య వస్తు స్వభావమును తాను వాటి బంధనాల నుండి ఎలా బయటపడాలో
363. ఈ సమాధి వలన ముడుల వంటి అన్ని కోరికలు నాశనమై, సాధన పూర్తయి, లోపల మరియు బయట అన్ని చోట్ల ఎల్లపుడు నిరంతరం వ్యక్తి యొక్క నిజ స్థితి స్థిరపడుతుంది.
364. వినేదానికంటే ప్రతి స్పందన వంద రెట్లు అధికంగా ఉంటుంది మరియు ధ్యానము ప్రతి స్పందన కంటే వేయి రెట్లు అధికము. అయితే నిర్వికల్ప సమాధి స్థితి శాశ్వతమైనది. అది అన్నింటి కంటే ఇంకా అనేక రెట్లు అధికము.
365. నిర్వికల్ప సమాధి స్థితి వలన బ్రహ్మ జ్ఞానము యొక్క సత్యము ఖచ్చితముగా తెలుసుకొనవచ్చు. ఇంకొక మార్గమేమిలేదు. అలా కాకుండా మనస్సు యొక్క స్వభావము అస్థిరమగుటచే అది ఎల్లప్పుడు ఇతర భావనలలో నిమగ్నమై ఉంటుంది.
366. అందువలన మనస్సును స్థిరపర్చి, ఇంద్రియాలను అదుపులో ఉంచి, దానిని సత్యమైన ఆత్మ స్థితిలో నిమగ్నము చేయాలి. అపుడు ఆత్మను గ్రహించి ఆ సత్యముతో మాయ ద్వారా సృష్టించబడిన మాలిన్యమును ద్వంసము చేయును.
367. యోగా యొక్క మొదటి అడుగులు:- వాక్‌ను అదుపులో ఉంచాలి, బహుమతులను స్వీకరించరాదు, ఏవిధమైన కోరికలకు అవకాశము ఇవ్వరాదు, కర్మల నుండి స్వేచ్ఛను పొందాలి, ఎల్లప్పుడు విశ్రాంతి ప్రదేశములో జీవించాలి.
395. ముందు అహంకారము వలన ఏర్పడిన ఈ స్థూల, సూక్ష్మ ప్రపంచ భావనలను నాశనం చేసి, అపుడు బలవంతముగా గాలి వంటి పదార్థముతో ఏర్పడిన ఈ స్థూల శరీరమును కూడా నాశనం చేసి బ్రహ్మాన్ని గుర్తెరిగి దివ్యానందమును పొందుము. ఆ బ్రహ్మము యొక్క ఔనత్యమును శాస్త్రాలు పొగిడినాయి. ఆ బ్రహ్మము నీ ఆత్మ ఒక్కటే అని బ్రహ్మముతో జీవించమని పలికినారు.
396. ఎముకల ప్రోగువంటిది, అపవిత్రమైన ఈ భౌతిక శరీరముపై ఏ మాత్రమైన గౌరవమున్నా, ఈ శరీరమునకు శత్రువులైన పుట్టుక, చావు, రోగాల నుండి విముక్తి పొందాలనుకున్నా; అట్టి వ్యక్తి తాను నిజముగా స్వచ్ఛమైన, పవిత్రమైన, భగవంతుని యొక్క సారమని గ్రహించి, పైవాటన్నింటి నుండి స్వేచ్ఛను పొందవలయును అని సృతులు పల్కుచున్నవి.
397. అహంకారము, బాహ్య వస్తువులపై కోరికలు ముందుగా తొలగించుకొని అవన్నీ ఆత్మకు అంటబెట్టినవిగా భావించి, ఉన్నతమైన బ్రహ్మమునందు దృష్టి పెట్టి, అది ఏకము, రెండవది లేనిదిగా తెలుసుకొని దాని వలె మారవలెను.
398. మానసిక క్రియలన్ని బ్రహ్మములో కలసిపోయినపుడు (అందుకు నిర్వికల్ప సమాధి పొందవలెను) బ్రహ్మము అనంతమైన ఆత్మను పొందినపుడు ఈ భౌతిక ప్రపంచము యొక్క వ్యవహారములేవి కనిపించవు. అవి కేవలము మాటలకు మాత్రమే పరిమితము.
399. ఏకమైన బ్రహ్మములో విశ్వము యొక్క భావన కేవలము భ్రమ మాత్రమే. ఈ బ్రహ్మములో రెండవది ఏదీ లేదు. ఇది మార్పులేనిది. ఆకారములేనిది మరియు శాశ్వతమైనది.
345. ఖచ్చితమైన మంచి, చెడుల విచక్షణ వలన నేరుగా విషయము యొక్క సత్య స్వభావమును గ్రహించగలము. అపుడే బంధాలు తొలగి మాయ వలన ఏర్పడిన భ్రమలు వీడిపోయి మరల ఏ మార్పు లేకుండా, అతడు స్వేచ్ఛను పొందుతాడు.
346. జీవ బ్రహ్మముల ఏకత్వమును తెలిసిన జ్ఞానము వలన పూర్తిగా దట్టమైన అజ్ఞానమనే అడవిని ఛేదించి మాయను గుర్తించగలుగుతాడు. ఎవరైతే రెండింటి ఏకత్వమును తెలుసుకొంటాడో అతనిలోని అజ్ఞానము సమూలముగా తొలగి మార్పులకు లోనుకాకుండా ఉంటాడు.
347. సత్యాన్ని కప్పివేసిన తెర తొలగిపోవాలంటే కేవలము సత్యాన్ని గూర్చిన పూర్తి జ్ఞానము తెలుసుకోవాలి. అపుడు అజ్ఞానము నాశనం అవుతుంది. జ్ఞానము వ్యక్తమవుతుంది. అపుడే దారి తప్పినందువలన కలిగే దుఃఖాలు తొలగిపోతాయి.
348. మనం బంధనాలను గమనించినపుడు అవి తాడు వలె చుట్టుకొని, పెనవేసి, ముడి వేయుట తెలుస్తుంది. అందువలన జ్ఞాని తప్పక గ్రహించాలి, సత్యమైన బాహ్య వస్తు స్వభావమును తాను వాటి బంధనాల నుండి ఎలా బయటపడాలో
సమాధి స్థితి
353. ఎప్పుడూ ఒక్కటే అయిన రెండవది ఏదీలేని ఆత్మను తెలుసుకొని, అందుకు నిర్వికల్ప సమాధిని పొంది, హృదయములో అజ్ఞానమనే ముడిని పూర్తిగా ద్వంసము చేయాలి.
354. బుద్ది యొక్క లోపాల వలన దాని ఊహలైన 'నీవు' 'నేను' 'ఇది' అనే వివిధ భావనలు చేయుట జరుగుచున్నది. అయితే ఎపుడైతే ఏకమైన, రెండవది ఏదీలేని పరమాత్మను తన సమాధి స్థితిలో స్థాపించగలుగుతారు, అలాంటి ఊహలన్ని కరిగిపోయి, సాధకుడు బ్రహ్మము యొక్క సత్యాన్ని తెలుసుకొనగలడు.
355. సన్యాసి నిశ్చలముగా, శాంతముగా స్థితప్రజ్ఞుడై, బాహ్య ప్రపంచ వస్తు సముధాయమును పూర్తిగా అడ్డు తొలగించుకొని, సమాధి స్థితి కొరకు తనను తాను అంకితము చేసుకొని, ఎల్లప్పుడు విశ్వాత్మయే తన ఆత్మ అను భావముతో ఉండగలుగుచున్నాడు. అజ్ఞానము వలన రూపొందిన భావనలను పూర్తిగా నాశనం చేసి అతడు బ్రహ్మనంద స్థితిలో ఉంటూ మనస్సు యొక్క ఊగిసలాటలతో కూడిన పనులను నాశనం చేయుచున్నాడు.
356. ఎవరైతే సమాధి స్థితిని చేరగలడో వారి తనలోని మార్పులనే బానిసత్వము నుండి స్వేచ్ఛను పొందగలడు వారు ఈ వస్తు ప్రపంచాన్ని, మనస్సును, అహంకారమును ఆత్మలో లయము చేసి అత్యున్నత విజ్ఞానమును పొంది ఇతరములైన పుస్తక జ్ఞానమును త్రోసిపుచ్చును.
357. ఎన్ని విధములైన ఉపాదులు ఉన్నప్పటికి మనిషి ఖచ్చితముగా తనను గూర్చి తాను ఆలోచించి అట్టి ఇతర భావనలనుతొలగించుకొని శాశ్వతమైన ఆత్మను పొందలగడు. అందువలన తెలివి గల వ్యక్తి ఎల్లపుడు నిర్వికల్ప సమాధి సాధనకు కృషి చేసి తనను అంటి పెట్టుకొని ఉన్న ఉపాధులను తొలగించుకొనగలడు.
363. ఈ సమాధి వలన ముడుల వంటి అన్ని కోరికలు నాశనమై, సాధన పూర్తయి, లోపల మరియు బయట అన్ని చోట్ల ఎల్లపుడు నిరంతరం వ్యక్తి యొక్క నిజ స్థితి స్థిరపడుతుంది.
364. వినేదానికంటే ప్రతి స్పందన వంద రెట్లు అధికంగా ఉంటుంది మరియు ధ్యానము ప్రతి స్పందన కంటే వేయి రెట్లు అధికము. అయితే నిర్వికల్ప సమాధి స్థితి శాశ్వతమైనది. అది అన్నింటి కంటే ఇంకా అనేక రెట్లు అధికము.
365. నిర్వికల్ప సమాధి స్థితి వలన బ్రహ్మ జ్ఞానము యొక్క సత్యము ఖచ్చితముగా తెలుసుకొనవచ్చు. ఇంకొక మార్గమేమిలేదు. అలా కాకుండా మనస్సు యొక్క స్వభావము అస్థిరమగుటచే అది ఎల్లప్పుడు ఇతర భావనలలో నిమగ్నమై ఉంటుంది.
366. అందువలన మనస్సును స్థిరపర్చి, ఇంద్రియాలను అదుపులో ఉంచి, దానిని సత్యమైన ఆత్మ స్థితిలో నిమగ్నము చేయాలి. అపుడు ఆత్మను గ్రహించి ఆ సత్యముతో మాయ ద్వారా సృష్టించబడిన మాలిన్యమును ద్వంసము చేయును.
367. యోగా యొక్క మొదటి అడుగులు:- వాక్‌ను అదుపులో ఉంచాలి, బహుమతులను స్వీకరించరాదు, ఏవిధమైన కోరికలకు అవకాశము ఇవ్వరాదు, కర్మల నుండి స్వేచ్ఛను పొందాలి, ఎల్లప్పుడు విశ్రాంతి ప్రదేశములో జీవించాలి.
368.
విశ్రాంతి ప్రదేశములో జీవించుట వలన జ్ఞానేంద్రియములను అదుపులో ఉంచవచ్చు.
ఇంద్రియాలను అదుపులో ఉంచిన మనస్సు అదుపులో ఉంటుంది. మనస్సు అదుపులో ఉండుట
వలన అహంభావము నశిస్తుంది. అందువలన యోగి ఏవిధమైన అడ్డంకిలేని బ్రహ్మానంద
స్థితిని చేరవచ్చును. ఆ కారణముగా ప్రతిస్పందన ఉన్న వ్యక్తి ఎల్లప్పుడు తన
మనస్సును అదుపులో ఉంచుకొనుటకు ప్రయత్నించాలి.
369. వాక్‌ను అదుపులో
ఉంచుకొనుట వలన బుద్దిలోని మనో స్థితులను అదుపులో ఉంచుకొనవచ్చు. మనో
స్థితులు అదుపులో ఉంచుకొనుట వలన బుద్ది అదుపులో ఉంటుంది. అపుడు ఆ బుద్దిని కూడా అదుపులో ఉంచి దానిని శాశ్వతమైన ఆత్మలోకలిపివేయాలి. అపుడే ఉన్నతమైన శాంతి లభిస్తుంది. అదే సమాధి స్థితి.
370. శరీరము, ప్రాణము, శరీర భాగాలు, మనస్సు, బుద్ది మరియు మనస్సు యొక్క
పరిధిలో ఉన్న ఇతరములు అన్నింటిని యోగి వాటి మూల స్థితి అయిన పరమాత్మలో లీనం
చేయాలి.
371. ఎపుడైతే ఇవన్నీ విలీనమవుతాయో అపుడు మనిషి యొక్క
స్పందనలు తెలికగా బాహ్యము నుండి విడిపోయి అంతములేని బ్రహ్మానంద స్థితి
అనుభవములోనికి వస్తుంది.
వైరాగ్య స్థితి
372. వైరాగ్య స్థితిని చేరుకొన్న వ్యక్తి మాత్రమే, అంతర్గమైన, బాహ్యమైన
విముక్తి అర్హుడు. అట్టి వైరాగ్యము వలన కోరికలు నశించి బాహ్యాభ్యంతర
సంబంధాలను, అహమును వదలగలడు.
373. విరాగి అయిన వ్యక్తి మాత్రమే తాను
పూర్తిగా బ్రహ్మములోకి చేరి, బాహ్యమైన బంధనాలను బాహ్య వస్తు సముదాయమును,
అంతర్గతమైన అహమును వదులుకొనగలడు.
374. ఓ జ్ఞాని తెలుసుకో! వైరాగ్యము,
విచక్షణ అనేవి పక్షి యొక్క రెండు రెక్కలు. అవే సాధకునికి తోడ్పడేవి.
ఒకదానికొకటి తోడ్పడుతూ విముక్తి అనే తీగ ప్రాకి ముక్తికాంతను అందుకోగలడు.
375. పూర్తిగా వైరాగ్యమును పొందిన వ్యక్తి మాత్రమే సమాధి స్థితిని చేరగలడు
మరియు స్థిరమైన జ్ఞానాన్ని పొందగలడు. అట్టి జ్ఞాని మాత్రమే సత్యాన్ని
గ్రహించి బంధనాల నుండి విముక్తి పొందగలడు. అతడే స్వేచ్ఛను పొందిన
ఆత్మానుభవముతో ఆనంద స్థితిని చేరగలడు.
376. స్థితప్రజ్ఞత కలిగిన
వ్యక్తి ఏమంటాడంటే ''నాకు ఏవిధమైన ఇతర పరికరము, ఆనందమును పొందుటకు
లభించలేదు, ఒక్క వైరాగ్యము తప్ప''. ఆ వైరాగ్యముతో ఆత్మ జ్ఞానము పొందిన, అది
తిరుగులేని స్వేచ్ఛను కలుగజేస్తుంది. దాని ప్రభావముతో అంతములేని
విముక్తిని పొందగలడు. అందువలన వ్యక్తి క్షేమము కొరకు బాహ్యాభ్యంతర్గత
వ్యవహారములలో తన మనస్సును శాశ్వతమైన ఆత్మ పై ఉంచుము
ఆత్మ మార్పులేనిది
380. బుద్దిని స్థిరముగా ఆత్మపై ఉంచినప్పుడు అది
శాశ్వతముగా ప్రకాశమును వెదజల్లుతూ స్వయం ప్రకాశమైన సాక్షిగా అన్నింటిని
దర్శిస్తుంది. ఈ ఆత్మ అసత్య వస్తు సముదాయము కంటే వేరుగా ఉంటూ, లక్ష్యమును
చేరుటకు ఆత్మపై ధ్యానము చేయుము. ఇతర ఆలోచనలను వదలివేయుము.
381.
నిరంతరముగా ఆత్మపై స్పందిస్తూ ఏవిధమైన ఇతర ఆలోచనలు మధ్యలో అడ్డుపడకుండా,
ప్రతి వ్యక్తి ఖచ్చితముగా బ్రహ్మామే తన నిజమైన ఆత్మ అని తెలుసుకోవాలి.
382.
ప్రతి వ్యక్తి తన గుర్తింపును ఆత్మతో జోడించి, అహమును ఇతర భౌతిక వస్తువులను
వదలి, వాటితో ఎట్టి సంబంధమును పెట్టుకోకుండా, (ఎందువలనంటే అవి చిక్కులతో
కూడినవి, పగిలిన కుండ ముక్కల వంటివి.) అలా ఆత్మను దర్శించాలి.
383.
స్వచ్ఛమైన మనస్సును ఆత్మపై స్థిరపర్చి తమ ఖచ్చిమైన ఆత్మ విజ్ఞానమును
పొందుతూ, నిదానముగా అట్టి స్థితిపై మనస్సును నిల్పిన అట్టి వ్యక్తి తన
శాశ్వతమైన ఆత్మను తాను తెలుసుకొనగలడు.
384. ప్రతి వ్యక్తి
తన ఆత్మను తాను దర్శించవలెను. అది విభజించుటకు వీలులేని, శాశ్వతమైనది.
అన్ని పరిమితులకు అతీతమైనది. అది శరీరము, శరీర భాగాలు, ప్రాణాలు, అహమును తన
యొక్క అజ్ఞానము వలన సృష్టించబడినవని గ్రహించి, అవన్నీ ఆకాశముతో నిండి
యున్నవని తెలుసుకోవాలి.
396. ఎముకల ప్రోగువంటిది, అపవిత్రమైన ఈ భౌతిక శరీరముపై ఏ మాత్రమైన గౌరవమున్నా, ఈ శరీరమునకు శత్రువులైన పుట్టుక, చావు, రోగాల నుండి విముక్తి పొందాలనుకున్నా; అట్టి వ్యక్తి తాను నిజముగా స్వచ్ఛమైన, పవిత్రమైన, భగవంతుని యొక్క సారమని గ్రహించి, పైవాటన్నింటి నుండి స్వేచ్ఛను పొందవలయును అని సృతులు పల్కుచున్నవి.
397. అహంకారము, బాహ్య వస్తువులపై కోరికలు ముందుగా తొలగించుకొని అవన్నీ ఆత్మకు అంటబెట్టినవిగా భావించి, ఉన్నతమైన బ్రహ్మమునందు దృష్టి పెట్టి, అది ఏకము, రెండవది లేనిదిగా తెలుసుకొని దాని వలె మారవలెను.
398. మానసిక క్రియలన్ని బ్రహ్మములో కలసిపోయినపుడు (అందుకు నిర్వికల్ప సమాధి పొందవలెను) బ్రహ్మము అనంతమైన ఆత్మను పొందినపుడు ఈ భౌతిక ప్రపంచము యొక్క వ్యవహారములేవి కనిపించవు. అవి కేవలము మాటలకు మాత్రమే పరిమితము.
399. ఏకమైన బ్రహ్మములో విశ్వము యొక్క భావన కేవలము భ్రమ మాత్రమే. ఈ బ్రహ్మములో రెండవది ఏదీ లేదు. ఇది మార్పులేనిది. ఆకారములేనిది మరియు శాశ్వతమైనది.
No comments:
Post a Comment