Saturday, 9 April 2022

: అన్నమయ్య సంకీర్తన

🕉🌞🌎🌙🌟🚩


1478. 01/06/20

అధ్యాత్మ సంకీర్తన

రేకు: 10-5

సంపుటము: 1-65.



తనకర్మవశం బించుక, దైవకృతంబొక యించుక,

మనసు వికారం బించుక, మానదు ప్రాణులకు !! 

॥పల్లవి॥



ఈదైన్యము లీహైన్యము లీచిత్తవికారంబులు

యీదురవస్థలు గతులును యీలంపటములును

యీదాహము లీదేహము లీయను బంధంబులు మరి

యీదేహముగలకాలము యెడయవు ప్రాణులకు  !!

॥తన॥



యీచూపులు యీతీపులు నీనగవులు నీతగవులు-

నీచొక్కులు నీపొక్కులు నీ వెడయలుకలును

యీచెలుములు నీబలువులు నీచనవులు నీఘనతలు-

నీచిత్తముగలకాలము యెడయవు ప్రాణులకు  !!

॥తన॥



యీవెరవులు నీయెరుకవులు యీతలఁపులు నీతెలువులు

దైవశిఖామణి తిరుమల దేవునిమన్ననలు

దైవికమున కిటువగనక తనతలఁ పగ్గలమైనను

దైవము తానౌ తానే దైవంబవుఁగాన !!

॥తన॥


🕉🌞🌎🌙🌟🚩




No comments:

Post a Comment