Thursday, 12 November 2020

[03/12, 02:39] +91 95058 13235: *శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

సంసారమును ఒక మహావృక్షముగా  - వేదవ్యాసకృత శ్రీమద్భాగవతము, దశమస్కంధము - పూర్వార్థము - రెండవ అధ్యాయము - ఇరువది ఏడవ శ్లోకములో చెప్పబడిన విధానమును పరిశీలించుదాము

*ఏకాయనోఽసౌ ద్విఫలస్త్రిమూలశ్చతూరసః పంచవిధః షడాత్మా|*

*సప్తత్వగష్టవిటపో నవాక్షో  దశచ్ఛదీ ద్విఖగో హ్యాదివృక్షః॥*

సంసారము (ప్రపంచము) అనెడి వృక్షమునకు మూలప్రకృతియే పాదు (ఆలవాలము). సుఖదుఃఖములు రెండును దీని ఫలములు. సత్త్వరజస్తమో గుణములు మూడును దీని వ్రేళ్ళు. ధర్మార్థకామమోక్షములనెడి చతుర్విధ పురుషార్థములు దీని రుచులు. త్వక్చక్షుశ్శ్రోత్రజిహ్వాఘ్రాణములు అను పంచేంద్రియములు దీనిని తెలియు సాధనములు. ఉత్పత్తి, అస్తిత్వము, వృద్ధి, విపరిణామము, అపక్షయము, వినాశము అను ఆరును దీని స్వభావములు. చర్మము, రక్తము, మాంసము, క్రొవ్వు, ఎముకలు, మజ్జ (ఎముకలయందుండు జిడ్డు పదార్థము), శుక్రము అను ఏడు ధాతువులును దీని పై పొరలు. పంచమహా భూతములును, బుద్ధి, మనస్సు, అహంకారము - అను ఎనిమిదియు దీని కొమ్మల మొదళ్ళు (రెండు చేతులు, రెండు పాదములు, శిరస్సు, కంఠము, వక్షస్థలము, జఠరము అను ఎనిమిదియు దీని కొమ్మలు), నవరంధ్రములు దీని కోటరములు (తొర్రలు). దశప్రాణములు (ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానములనెడి మహాప్రాణములు ఐదును, నాగ, కూర్మ, క్రుకర, దేవదత్త, ధనంజయములు అను ఉపప్రాణములు ఐదును - వెరసి పదిప్రాణములు దీని పత్రములు. జీవుడు, ఈశ్వరుడు (జీవేశ్వరులు) అను రెండును ఈ సంసార రూప వృక్షమునకు పక్షులు. ఇట్టి సంసారమను వృక్షమునకు కార్చిచ్చు వచ్చినప్పుడు జగన్మాత అమృతవర్షిణియై శాంతింపజేయును.

సంసారి తన జీవిత భాగస్వామి (భార్య లేదా భర్త) తో బంధమేర్పడిన తరువాత నుండి బిడ్డలు, బిడ్డల పెంపకం, మనస్పర్థలు, అనారోగ్యం, ఆదాయం చాలకపోతే అప్పులు, పిల్లల విద్య, వైద్యం...ఇలా ఎన్నో ఉంటాయి. కష్టాలు తెరలు తెరలుగా వస్తాయి. అందులోనే తాత్కాలిక సంతోషాలు, పండుగలు, పబ్బాలు, బంధువుల రాకపోకలు...ఒకటేమిటి సంసారమంటే తెరలు తెరలుగా వచ్చేసంతోషాలు వాటి వెనుక వచ్చే ఇబ్బందులు, ఆపదలు మొదలైనవి.  సంసారసాగరానికి ఆటుపోట్ల వంటి సుఖదుఃఖముల కెరటాలు వస్తూనే ఉంటాయి. సంసారంలో కలిగే దుంఖములన్నియూ సంసారమనే మహారణ్యంలో పెద్దకార్చిచ్చు వంటివి. అటువంటి కార్చిచ్చును ఉపశమింపజేయు అమృతవృష్టియే జగన్మాత కరుణాకటాక్షములు.

భవుడు అనగా మహాశివుడు. పవిత్రతకే పవిత్రమైనవాడు’ శివుని పేరు ఉచ్చరించినా చాలు మనసుకు శాంతి చేకూరుతుంది. ఆయనను ఆరాధించుటవలన మనస్సునకు సుఖశాంతులు లభిస్తాయి.  పరమశివుడు దేవతలకే దేవుడు, మహాదేవుడుగా కూడా అభివర్ణిస్తారు. అంటే ఆయన సూర్యుడు, భూమి, నీరు మరియు గాలిని (పంచభూతములను) మించిన దేవుడని అర్థం. అటువంటి పరమశివుని సాన్నిధ్యము అనగా మోక్షమును ప్రసాదించునది జగన్మాత. ఆయన భోళా శంకరుడు. భక్తసులభుడు. జగన్మాతను ఆరాధిస్తే ఆయన అనుగ్రహం లభిస్తుంది. శివుని ఆస్తి రత్నాలు, ధనరాసులు. అన్నిటికీ మించి మహాశివుని ఆస్తి జ్ఞానము. వీటిని జగన్మాత తన భక్తులకు పంచుతుంది. అటువంటి జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం భవదావసుధావృష్ట్యై నమః* అని అనవలెను.

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*168వ నామ మంత్రము*

*ఓం నిష్క్రోధాయై నమః*

జగన్మాత బ్రహ్మజ్ఞాన స్వరూపిణి. అరిషడ్వర్గములకు అతీతురాలు. కాబట్టి రాగద్వేషాదులు కూడా ఆమె దరిచేరవు. అట్టి జగన్మాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *నిష్క్రోధా* యను మూడక్షరముల (త్ర్యక్షరీ) నామ మంత్రమును *ఓం నిష్క్రోధాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ జగదాంబను ఉపాసించు సాధకులు రాగద్వేషరహితులై, అరిషడ్వర్గములు దరిజేరక, సదా లలితాంబ పాదసేవయే పరమావధిగా జీవించి తరించుదురు.

జగన్మాత పరమాత్మ స్వరూపిణి. ఆ తల్లి అరిషడ్వర్గములకు అతీతురాలు. బ్రహ్మజ్ఞాన స్వరూపిణి గనుక క్రోధమునకు కూడా అతీతురాలు. అందుచే *నిష్క్రోధా* యను నామ మంత్రముతో భక్తులచే స్తుతింపబడుచున్నది.

కామ, క్రోధ లోభ, మోహ మదమాత్సర్యములనేవి మనస్సుకు సంబంధించినవి. ఆత్మకు సంబంధించినవి కావు. జగన్మాత పరమాత్మస్వరూపిణి గనుక క్రోధరహితురాలు. గనుక *నిష్క్రోధా* యసు నామ మంత్రముతో స్మరించబడుతున్నది.

పుత్రుడు ఎంతటి దుర్మార్గుడైనను తల్లికి ప్రేమ తప్పక్రోధము ఉండదు. పుత్రునిపై తల్లికి కోపం వచ్చినా, అది ప్రేమపూరితమైనకోపము మరియు తాత్కాలికమే అవుతుంది. ఆ కోపము ద్వేషపూరితము కాదు. అలాంటి కోపం క్రోధమనిపించుకోదు.  క్రోధమనేది అజ్ఞానం వల్ల వస్తుంది. ఆ కోపంలో ఆలోచన నశించి వినాశనానికి దారితీస్తుంది.

మహిషాసురాది రాక్షసులు జగన్మాతకు బిడ్డలవంటివారే. వారి రాక్షసకృత్యములకు జగన్మాత వారిలోని క్రోధప్రవృత్తిని సంహరించి వారి ఆత్మలను తనలో లీనంచేసుకున్నది. కోపం శరీరంతోటే  అంతమవుతుంది తప్ప ఆత్మతో శరీరంనుండి శరీరానికి ప్రయాణంచేయదు.

కోపం తాత్కాలికమైతే, అటువంటి వారు ఉత్తములు. కొన్ని క్షణాలు ఉంటే మధ్యములు అంటారు. అదే కోపం పగగా మారి, తమ ప్రాణం పోయేవరకూ అవతలి వారిపై కోపం ఉంటే అది క్రోధము మరియు అట్టివారు పాపాత్ములు అని అనబడతారు. వీలయినంతవరకూ తమ కోపకారణం అవతలి వారికి వివరించి, మార్పుకోసం ప్రయత్నించాలి. అవతలివారిలో మార్పురాకపోతే వారి కర్మకు వారిని  విడచిపెట్టి మౌనం పాటించాలి. ఒక వేళ వారు మనసులో మెదిలితే చిన్న చిరునవ్వుతో తమ కోపాన్ని అదిమిపట్టాలి. ఇది ఉత్తమ లక్షణం.

జగన్మాతకు బ్రహ్మజ్ఞాన స్వరూపిణి గనుక కోపం ఉండదు. దుష్టులైనా వారిపై కోపంకన్నా, వారిపై జాలి ఉంటుంది.  జగన్మాత క్రోధము లేనిది గనుక *నిష్క్రోధా* యని నామ ప్రసిద్ధమైనది. 

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం నిష్క్రోధాయై నమః* అని అనవలెను.

[03/12, 02:39] +91 95058 13235: *3.12.2020   ప్రాతః కాల సందేశము*

*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*

*దశమస్కంధము - పూర్వార్ధము -  పండ్రెండవ అధ్యాయము*

*అఘాసురసంహారము*

*ఓం నమో భగవతే వాసుదేవాయ*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*శ్రీశుక ఉవాచ*

*12.1 (ప్రథమ శ్లోకము)*

*క్వచిద్వనాశాయ మనో దధద్వ్రజాత్ప్రాతః సముత్థాయ వయస్యవత్సపాన్|*

*ప్రబోధయంఛృంగరవేణ చారుణా వినిర్గతో వత్సపురఃసరో హరిః॥8721॥*

*శ్రీశుకుడు పలికెను* ఒకనాడు శ్రీకృష్ణుడు వనభోజనమునకు సంకల్పించి, ప్రాతఃకాలమునందే నిద్రనుండి మేల్కొనెను. పిమ్మట ఆ స్వామి ఇంపైన కొమ్మువాద్య ధ్వనితో తన మిత్రులైన గోపబాలురను మేల్కల్పి, ఆవుదూడలను ముందుభాగమున నడుపుచు వ్రజభూమి (బృందావనము) నుండి బయలుదేరెను.

*12.2 (రెండవ శ్లోకము)*

*తేనైవ సాకం పృథుకాః సహస్రశః స్నిగ్ధాః సుశిగ్వేత్రవిషాణవేణవః|*

*స్వాన్స్వాన్సహస్రోపరి సంఖ్యయాన్వితాన్వత్సాన్ పురస్కృత్య వినిర్యయుర్ముదా॥8722॥*

*12.3 (మూడవ శ్లోకము)*

*కృష్ణవత్సైరసంఖ్యాతైర్యూథీకృత్య స్వవత్సకాన్|*

*చారయంతోఽర్భలీలాభిర్విజహ్రుస్తత్ర తత్ర హ॥8723॥*

అప్పుడు పరస్పర ప్రేమానురాగములుగల వేలకొలది గోపబాలురు చక్కని చిక్కములను, బెత్తములను, కొమ్ములను, పిల్లనగ్రోవులను తీసికొని, అసంఖ్యాకములైన తమ తమ గోవత్సములను ముందుభాగమున నడిపించుచు, శ్రీకృష్ణునితోపాటు సంతోషముగా బయలుదేరిరి. వారు కృష్ణునియొక్క అసంఖ్యాకములైన వత్సములతో పాటు తమ వత్సములనుగూడ కలిపి గుంపుగా చేర్చి మేపుచు, అక్కడక్కడ బాల్యక్రీడలను నెఱపుచు హాయిగా సంచరింపసాగిరి.

*12.4 (నాలుగవ శ్లోకము)*

*ఫలప్రవాలస్తబకసుమనఃపిచ్ఛధాతుభిః|*

*కాచగుంజామణిస్వర్ణభూషితా అప్యభూషయన్॥8724॥*

వనమునకు వెళ్ళుచునప్పుడు గోపబాలుర తల్లులు వారిని గాజు, గురివెందలు, మణులు పొదిగిన బంగారునగలు మున్నగువాటిచే అలంకరించియుండిరి. ఐనను వనమునందు ప్రవేశించినపిమ్మట వారు అచటలభించెడి పక్వముసకు వచ్చిన రంగురంగుల దోరపండ్లతో, చిగురుటాకుల గుత్తులతో, పలువన్నెల పూవులతో, నెమలి పింఛములతో, గైరికాది ధాతువులతో తమను అలంకరించుకొనిరి.

*12.5 (ఐదవ శ్లోకము)*

*ముష్ణంతోఽన్యోన్యశిక్యాదీన్ జ్ఞాతానారాచ్చ చిక్షిపుః|*

*తత్రత్యాశ్చ పునర్దూరాద్ధసంతశ్చ పునర్దదుః॥8725॥*

వారు పరస్పరము ఇతర మిత్రులకు సంబంధించిన చిక్కములను, బెత్తములను, కొమ్ములను, వేణువులను దొంగిలించుచు, దూరముగా విసరివేయుచుండిరి. ఆ వస్తువులకు సంబంధించిన బాలురు ఆ విషయమును గమనించు లోపలనే ఆయా వస్తువులను చిక్కించుకొనినవారు వాటిని ఒకరినుండి మఱియొకరి కడకు దూరముగా విసరివేయుచుండిరి. ఆ వస్తువుల బాలురు తమ వస్తువులకొఱకై బిక్కమొగముతో ఏడ్చుచుండగా తక్కినవారు నవ్వుకొనుచు ఎవరి వస్తువులను వారికి తిరిగి ఇచ్చివేయుచుండిరి.

*12.6 (ఆరవ శ్లోకము)*

*యది దూరం గతః కృష్ణో వనశోభేక్షణాయ తమ్|*

*అహం పూర్వమహం పూర్వమితి సంస్పృశ్య రేమిరే॥8726॥*

శ్రీకృష్ణుడు వనశోభలను తిలకించుటకై దూరముగా వెళ్ళినప్పుడు తక్కిన బాలురు 'నేను ముందు, నేను ముందు'  అని పోటీ పడుచు పరుగుపరుగున ఆ స్వామిని జేరి, అతనిని స్పృశించి ఆనందించుచుండిరి.

*12.7 (ఏడవ శ్లోకము)*

*కేచిద్వేణూన్ వాదయంతో ధ్మాంతః శృంగాణి కేచన|*

*కేచిద్భృంగైః ప్రగాయంతః కూజంతః కోకిలైః పరే॥8727॥*

*12.8 (ఎనిమిదవ శ్లోకము)*

*విచ్ఛాయాభిః ప్రధావంతో గచ్ఛంతః సాధు హంసకైః|*

*బకైరుపవిశంతశ్చ నృత్యంతశ్చ కలాపిభిః॥8728॥*

*12.9 (తొమ్మిదవ శ్లోకము)*

*వికర్షంతః కీశబాలానారోహంతశ్చ తైర్ద్రుమాన్|*

*వికుర్వంతశ్చ తైః సాకం ప్లవంతశ్చ పలాశిషు॥8729॥*

*12.10 (పదియవ శ్లోకము)*

*సాకం భేకైర్విలంఘంతః సరిత్ప్రస్రవసంప్లుతాః|*

*విహసంతః ప్రతిచ్ఛాయాః శపంతశ్చ ప్రతిస్వనాన్॥8730॥*

అచట చేరిన బాలురు ఒనర్చిన కేరింతలు, ఆటలు, పాటలు చిత్రవిచిత్రముగా నుండెను. కొంతమంది వేణువులను ఊదుచుండిరి. మరికొందరు కొమ్ము వాద్యములను పూరించుచుండిరి. అట్లే తక్కినవారు తమ ఇష్టానుసారము తుమ్మెదల ఝంకారములతో కంఠములను కలుపుచుండిరి. కోకిలతోజేరి పంచమస్వరములను ఆలపించుచుండిరి. ఆకాశమున విహరించుచున్న పక్షుల నీడలను అనుసరించుచు పరుగెత్తుచుండిరి. అందమైన హంసల నడకలను అనుకరించుచుండిరి. కొంగలవలె కన్నులు మూసికొని, దొంగజపము చేయుచుండిరి. నెమళ్ళరీతిగా క్రేంకారము లొనర్చుచు నృత్యములు ఒనర్చుచుండిరి. చెట్లకొమ్మలను పట్టుకొని వ్రేలాడుచున్న కోతుల తోకలను అందుకొని లాగుచుండిరి. వాటితోపాటు ఆయా వృక్షములను ఎక్కుచుండిరి. కోతులవలె మూతులుపెట్టుచు, పండ్లిగిలించుచు, కనుబొమలను ఎగురవేయుచు వాటిని అనుకరించుచుండిరి. వానరములరీతిగా ఒక కొమ్మనుండి మఱియొక కొమ్మమీదికి దుముకుచుండిరి. కప్ఫలతోపాటు యమునానదీ జలములలో తడియుచు వాటివలె గంతులు వేయుచుండిరి. నీళ్ళలో ఒకరి ప్రతిబింబమును మఱియొకరు చూచుచు నవ్వుచు, పలురీతుల వెక్కిరించుకొనుచుండిరి".

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి   పండ్రెండవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

:: పోతన భాగవతము - ఆష్టమ స్కంధము, గజేంద్ర మోక్షము ::

వినువీధిం జనుదేరఁ గాంచి రమరుల్ విష్ణున్ సురారాతి జీ

వనసంపత్తి నిరాకరిష్ణుఁ గరుణావర్ధిష్ణు యోగీంద్ర హృ

ద్వనవర్తిష్ణు సహిష్ణు భక్తజనబృంద ప్రాభావాలంకరి

ష్ణు నవోఢోల్లసదిందిరా పరిచరిష్ణున్ జిష్ణు రోచిష్ణునిన్‌.

రాక్షసుల బ్రతుకు తెరువులను తొలగద్రోసేవాడూ, నిండు దయతో యోగీంద్రుల మనస్సులలో నివాసం చేసేవాడూ, ఓర్పుతో భక్తుల గొప్పతనాన్ని పెంపొందించేవాడూ, తొలి ప్రాయంతో చెలువొందే లక్ష్మీదేవిని సేవించేవాడూ, జయశీలుడూ, కాంతిమంతుడూ అయిన విష్ణుదేవుడు ఆకాశమార్గంలో వస్తుండగా దేవతలు చూచినారు.

సశేషం... 

🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 145  / Vishnu Sahasranama Contemplation - 145 🌹*

📚. ప్రసాద్ భరద్వాజ 

*🌻145. జగదాదిజః, जगदादिजः, Jagadādijaḥ🌻*

*ఓం జగదాదిజాయ నమః | ॐ जगदादिजाय नमः | OM Jagadādijāya namaḥ*

జగదాదిజః, जगदादिजः, Jagadādijaḥ

జగత్తులకు ఆదియందు జనించువాడు శ్రీ మహా విష్ణువు; హిరణ్యగర్భుడు మొదలగు తత్త్వముల రూపమున ఉండువాడు.

:: పోతన భాగవతము - తృతీయ స్కంధము ::

సీ. గురుశక్తితో విరాట్పురుషుండు సంభవం బయ్యే, నయ్యండంబు నర్థిఁబొదివి

యంబు ముఖావరణంబు లొక్కొకటికి దశగుణీతంబులై తవిలి యావ

రణములై యుండును, గ్రమమున లోకంబులకు "మేలుకట్లు" పోలికఁ దనర్చి పంకజోదరుని రూపము విలసించును, లోలత జలములోఁ దేలుచున్న

తే. హేమ మయమైన యండంబులో మహాను, భావుఁ డభవుండు హరి దేవదేవుఁ డఖిల

జేత నారాయణుఁడు ప్రవేశించి యపుడు, విష్ణుపద భేదనంబు గావించి యందు.

ఆ అండంలో మహత్తరమైన శక్తితో విరాట్‍పురుషుడు విరాజిల్లు తుంటాడు. ఆ అండాన్ని పొదువుకొని పృథివి, జలం, అగ్ని, వాయువు, ఆకాశం, అహంకారం, మహత్తు అనే ఆవరణాలు ఒకదానికంటే ఒకటి పదింతలు ప్రమాణం కలిగి ఉంటాయి. లోకాలకు మేల్కట్టు చాందినీవలె ఒప్పియున్న ఆ పొరలలోనుంచి విష్ణుదేవుని తేజస్సు ప్రకాశిస్తూ ఉంటుంది. జలంలో తేలుతూ ఉన్న బంగారుమయమైన ఆ అండంలో మహానుభావుడు, అభవుడు, శ్రీహరి, దేవదేవుడు, విశ్వవిజేత అయిన నారాయణుడు ప్రవేశించి గగనమండలాన్ని భేదించి వేస్తాడు.

సశేషం... 

భ్రాజిష్ణుర్భోజనం భోక్తా సహిష్ణుర్జగదాదిజః ।

అనఘో విజయో జేతా విశ్వయోనిః పునర్వసుః ॥ ౧౬ ॥

Bhrājiṣṇurbhojanaṃ bhoktā sahiṣṇurjagadādijaḥ ।

Anagho vijayo jetā viśvayoniḥ punarvasuḥ ॥ 16 ॥

Continues....

🌹 🌹 🌹 🌹 🌹

[03/12, 06:48] +91 98494 71690: *🌹. కఠోపనిషత్‌ వివరణ  - చలాచలభోధ  - 120 🌹*

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ 

📚. ప్రసాద్ భరద్వాజ

*🌻.   ఆత్మను తెలుసుకొను విధము - 50 🌻*

శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ గుణములు గల పృథ్వి స్థూలమైనది. శబ్ద, స్పర్శ, రూప, రస గుణములు గల జలము పృథ్వి కన్న సూక్ష్మము. శబ్ద, స్పర్శ, రూప గుణములు గల అగ్ని జలము కన్న సూక్ష్మము. శబ్ద, స్పర్శ గుణములు గల వాయువు అగ్ని కన్న సూక్ష్మము. శబ్ద గుణమే గల ఆకాశము వాయువు కన్న సూక్ష్మము. 

పంచభూతములు ఒక్కొక్క గుణము తగ్గిన కొలదీ సూక్ష్మమగుచున్నది. ‘నిశ్శబ్దోబ్రహ్మముచ్యతే’ అని చెప్పబడినటుల ఏ గుణము లేని పరమాత్మ అతిసూక్ష్మము. ఈ విధముగా స్థూలమైన పృథ్వికంటే ఆకాశము సూక్ష్మమని గ్రహించగలుగుచున్నాము. 

అదే విధముగా శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములను ఏ గుణము లేని పరమాత్మ సూక్ష్మాతి సూక్ష్మమని గ్రహింపవచ్చును కదా! అవ్యక్తము విత్తనము వంటిది. ఆ విత్తనము ఉబ్బినట్లు ఉండునది మహతత్త్వము. దాని నుండి బయటకు వచ్చిన మొలకవంటిది అహంకార తత్వము. కాండము, కొమ్మలు, ఆకులు మొదలగునవి ఆకాశాది పంచభూతములుగా యున్నవి. 

మరియు ఇవి కార్యకారణరూపముగా నున్నవి. మరియు ఆద్యంతములు కలిగియున్నవి. ఏ కారణము లేని ఆత్మ, ఆద్యంతములు లేనిదిగాను, అవ్యయము నిత్యమునై యున్నది. శాశ్వతమైన ఇట్టి తత్త్వమును తెలుసుకున్నవారు ముక్తులగుదురు.

        చాలా స్పష్టంగా రెండు ఉపమానాలను తీసుకున్నారు. ఒక్కటేమిటి అంటే, పంచభూత విచారణ. 

రెండవది ఎట్లా సృష్టి క్రమము ఏర్పడుతున్నది? ఈ రెండు అంశాలని ఇక్కడ బోధించే ప్రయత్నము చేస్తున్నారు. మనందరమూ దేని మీద ఆధారపడి ఉన్నాము అంటే, భూమి మీద ఆధారపడి ఉన్నాము అని, ప్రతీ ఒక్కరూ చెబుతారు. కారణము ఈ నేల మీదే ఉన్నాం కాబట్టి. భూమి మీద ఆధారపడి ఉన్నాము అంటున్నామా? పరమాత్మ మీద ఆధారపడి ఉన్నాము అంటున్నామా? అనేది ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే, ఈ నేలే కదండీ మనకు ఆధారము. 

ఈ నేల లేకపోతే మనం ఏం చేయగలుగుతాము? ఎక్కడ ఉంటాము? ఏ రకంగా జీవిస్తాము? ఏ రకమైన అవకాశాలున్నాయి మనకు. ఈ భూమిలేకపోతే? ఏమీ లేదండీ అని అన్నామనుకో, అప్పుడు మనము శబ్ద స్పర్శ రూప రస గంధాలనే ఐదు గుణాలతోనూ, ఈ పృథ్వి మీద జీవిస్తున్నటువంటి వాళ్ళము.

   అయితే ఈ పంచభూతాలు.. ఏవయ్యా? భూమి ఉంటే సరిపోతుందా? భూమి మీద నీళ్ళు అవసరం లేదా? అని అడిగామనుకోండి? అయ్యో! నీళ్ళు లేకపోతే ఎట్లా జీవిస్తామండీ? నీరే ప్రాణాధారము. నీళ్ళు లేకపోతే అసలు ప్రాణ శక్తే లేదు. నీళ్ళు త్రాగకుండా ఒక గంట కూడా ఉండలేమండీ. నీళ్ళు ప్రతీ గంట గంటకూ అవసరమేనండీ! నీళ్ళు లేకపోతే ఏ జీవ లక్షణమూ కుదరదండీ! అబ్బో నీళ్ళు చాలా ఇంపార్టెంట్‌ అండీ! నీళ్ళు లేకపోతే నడవదండీ. 

మరి ఇందాక ఏమన్నావయ్యా? పృథ్వే ఇంపార్టెంట్‌ అన్నావు కదా! పృథ్వే లేకపోతే నీళ్ళే లేవు కదండీ అంటావు! కాబట్టి, మానవులందరూ, ఇప్పుడు ఏమైపోయిందీ అంటే, నీకు ఆకాశం ప్రధానమా? పృథ్వి ప్రధానమా? అంటే, పృథ్వే ప్రధానం. ఎందుకంటే ఆకాశము వలన నేను జీవించడం లేదు అనుకుంటున్నాడు కాబట్టి.

        ఏమయ్యా! మరి నీకు నీళ్ళు అవసరం లేదా? నిప్పు అవసరం లేదా గాలి అవసరం లేదా? అంటే, అవి లేకుండా ఎట్లా జీవిస్తామండీ అంటాడు. 

కాబట్టి, నీవు జీవన పర్యంతమూ దేని మీద ఆధారపడియున్నావయ్యా అంటే, పంచభూతాల మీద ఆధారపడియున్నావు. అందుకని, ఈ దేహం పేరేమిటి? పాంచభౌతిక దేహము. పంచభూత లక్షణ సముదాయము చేత, నీకు దేహంలో ఉన్నటువంటి ఆర్గాన్స్‌ అన్నీ ఏర్పడ్డాయి. నీ దేహములో వున్న ఇంద్రియాలు అన్నీ ఏర్పడ్డాయి. నీ దేహలో ఉన్న గోళకాలన్నీ ఏర్పడ్డాయి. 

నీ వ్యవహారమంతా ఈ పంచభూతాలపై ఆధారపడే జరగుతుంది. ఎట్లా జరుగుతుంది అనే విచారణ మాత్రం చేయావు. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలనే ఐదు తన్మాత్రల యొక్క జ్ఞానాన్ని పూర్తిగా కలిగియున్నటువంటిది, పూర్తి విషయ వ్యావృత్తి కలిగినటువంటిదీ పృథ్వి తత్వము సాత్వికమైనటువంటి బోధను ప్రారంభిస్తున్నారు.

 తత్‌ త్వం ఈ పృథ్వి దేని మీద ఆధారపడి ఉంది? దీనకంటే సూక్ష్మమైనటువంటి, స్థూలమంతా సూక్ష్మం మీద ఆధారపడి యున్నది. సూక్ష్మము సూక్ష్మతరంమీద ఆధారపడి యున్నది. 

ఆ సూక్ష్మతరం సూక్ష్మతమమైనటువంటి పరమాత్మ మీద ఆధారపడి యున్నది. ఈ ఆధార ఆధేయ విమర్శని చెబుతున్నారన్నమాట! కాబట్టి, ఆకాశంలో నుంచి మొట్టమొదట వాయువు వచ్చింది. వాయువు నుంచి అగ్ని వచ్చింది. 

అగ్ని నుంచి జలము వచ్చింది. జలము నుంచి పృథ్వి వచ్చింది. ఎందుకు చెప్పారు అంటే, రేపు విరమణ సమయంలో కూడా ఇదే రీతిగా విరమించబడుతుంది.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

[03/12, 06:48] +91 98494 71690: *🌹 . శ్రీ శివ మహా పురాణము - 285 🌹* 

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి

📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - సతీఖండః  🌴* 

69. అధ్యాయము - 24

*🌻. శ్రీరామునకు పరీక్ష  - 1 🌻*

నారదుడిట్లు పలికెను -

ఓ బ్రహ్మా! విధీ! ప్రజాపతీ! మహాప్రాజ్ఞా! కృపాసింధో! సతీపరమేశ్వరుల మంగళకరమగు యశస్సును వినిపించితివి (1). ఇపుడు పవిత్రము, ఉత్తమము అగు ఆ యశస్సును ప్రీతితో ఇంకనూ చెప్పుము. ఆ దంపతులైన సతీపరమేశ్వరులు అచట ఉన్నవారై ఏమి చరితమును చేసిరి?(2).

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఓ మహర్షీ! నేను సతీశివుల చరిత్రను చెప్పెదను. ప్రేమతో వినుము. వారు అచట ప్రతిదినము అన్నివేళలా లోకపు పోకడను అనుసరించి క్రీడించిరి (3). ఓ మహర్షీ! అపుడు మహాదేవి యగు సతి శంకరుడు నిద్రించు చుండగా వియోగమును పొందినదని కొందరు ప్రాజ్ఞులు చెప్పుచున్నారు (4). ఓ మహర్షీ! శబ్దార్ధముల వలె కలిసి ఉండే చిత్స్వరూపులగు ఆ శక్తీశులకు ఏ కాలమునందైననూ వాస్తవమగు వియోగము ఎట్లు సంభవమగును?(5). కాని లీలల యందు అభిరుచి గల వారిద్దరికి సర్వము సంభవమే యగును. ఏలయన, సతీశివులు లోకమర్యాదననుసరించి లీలలను ప్రకటించెదరు (6). 

ఆ దక్ష పుత్రి తన తండ్రి చేసిన యజ్ఞములో శంభునకు ఆదరము లేకుండుటను గని, శంభునిచే విడువ బడి, ఆ యజ్ఞశాలయందు దేహత్యాగమును చేసెను (7).

ఆ సతీ దేవి మరల హిమవంతునకు కుమారై యై జన్మించి, పార్వతి యను పేరును బడసి, తీవ్రమగు తపస్సును ఆచరించి, శివుని వివాహమాడెను (8).

సూతుడిట్లునెను -

ఆ నారదుడు ఆ బ్రహ్మ యొక్క ఈ మాటను విని, శివాశివుల గొప్ప యశస్సును గురించి బ్రహ్మను ప్రశ్నించెను (9).

నారుదుడిట్లు పలికెను -

ఓ విష్ణు శిష్యా! మహాత్మా! విధీ! లోకాచారమును అనుకరించే శివాశివుల చరిత్రమును నాకు విస్తరముగా చెప్పుము (10). శంకరుడు ప్రాణములకంటె ప్రియతరమగు భార్యను విడనాడుటకు కారణమేమి? తండ్రీ! ఇది నాకు విచిత్రముగ తోచుచున్నది. కాన చెప్పుము (11). 

నీ కుమారుడు యజ్ఞమునందు శివుని అనాదరము చేయుటకు కారణమేమి? తండ్రి చేయుచున్న యజ్ఞమునకు వెళ్లిన ఆ సతి దేహమునెట్లు త్యజించెను? (12). తరువాత ఏమాయెను? మహేశ్వరుడేమి చేసెను? ఆ వృత్తాంతమునంతనూ నాకు చక్కగా చెప్పుము. నేను ఆవృత్తాంతమును వినుట యందు శ్రద్ధ గలవాడను (13).

బ్రహ్మ ఇట్లు పలికెను -

కుమారా! నారాదా! నీవు నా కుమారులలో శ్రేష్ఠుడవు. గొప్ప బుద్ధి శాలివి.చంద్ర శేఖరుని చరితమును మునులతో గూడి పరమప్రీతితో వినుము (14). విష్ణువు మొదలగు దేవతలచే సేవింపబడే, పరబ్రహ్మయగు మహేశ్వరునకు నమస్కరించి, అత్యద్భుతమగు ఆయన చరితమును చెప్పెదను (15). ఇదంతా శివలీల. స్వతంత్రుడు, నిర్వికారుడునగు ఆ ప్రభువు అనేక లీలలను ప్రదర్శించును. ఆ సతీదేవియూ ఆయనవలెనే లీలలను ప్రదర్శించును (16). 

ఓ మహర్షీ! ఆయన తక్క మరియెవ్వరు ఆయన చేసిన కర్మలను చేయగల్గుదురు? ఆయనయే పరమాత్మ, పరబ్రహ్మ, పరమేశ్వరుడు (17).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

*🍀. పూర్తి శ్లోకము :*

*భక్తిప్రియా, భక్తిగమ్యా, భక్తివశ్యా, భయాపహా |*

*శాంభవీ, శారదారాధ్యా, శర్వాణీ, శర్మదాయినీ ‖ 42 ‖*

*🌻 125. 'శర్మదాయినీ'🌻*

సుఖము నొసగునది శ్రీలలిత అని అర్థము.

శర్మ అను బిరుదు నిర్దిష్టముగను, నిశితముగను క్రతువులను ఆచరించు వారి కొసగుదురు. క్రతువనగా నియత జీవనము. శ్రీలలితను ఆరాధించువారు క్రమబద్ధములగు జీవితములను నడుపుట జరుగును. ఆరాధన యందలి ఆర్ధత, క్రతుబద్ధత కారణములుగ మనసు అట్టి క్రమమును పొంది జీవితమున అన్ని విషయముల యందు అదే క్రమమును వ్యాపింపచేయును. 

అట్టివారి ఆహారము, వ్యవహారము, భాషణము అంతయు సహజముగ క్రమబద్ధమగును. దానివలన అంతఃసుఖము కలుగును. వారిని బాహ్య సన్నివేశములు చలింప చేయవు. ఈ విధముగ శ్రీలలిత శాశ్వతమగు సుఖమును ఒసగునది అగుచున్నది.

 'సురేశః శరణం శర్మ' అనుచు విష్ణు సహస్రనామము నందు కూడ శర్మ శబ్దము కలదు. ఏ దేవత నారాధించినను, విధివిధానముగ ఆరాధించినచో సుఖము కలుగును. రజోగుణ ఆరాధనము, తమోగుణ ఆరాధనము అట్టి సుఖము నీయజాలవు. ఆరాధనయందు సాత్విక గుణమే సుఖమునకు ముఖద్వారము. 

సశేషం...

*🍁. ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀. పూర్తి శ్లోకము :*

*శాంకరీ, శ్రీకరీ, సాధ్వీ, శరచ్చంద్రనిభాననా |*

*శాతోదరీ, శాంతిమతీ, నిరాధారా, నిరంజనా ‖ 43 ‖*

*🌻 126. 'శాంకరీ 🌻*

శంకరుని భార్య శ్రీలలిత అని అర్థము.

శంకరుడనగా సుఖకరుడు అని అర్థము. రజస్తమో గుణములను విసర్జించి సత్వము నాశ్రయించి ప్రసన్న వదనుడైన దైవమును ధ్యానించుట వలన సుఖము కలుగును. 

శంకరుడు ప్రసన్న  వదనుడైన నారాయణుని సతతము ఆరాధించుచు నుండుట వలన శంకరత్వమును, మయస్కరత్వమును పొందినాడు.

 అందువలన శంకరుని ముఖమున నిరుపమానమగు ప్రశాంతత యుండునని పురాణములు తెలుపుచున్నవి. అట్టి శంకరుని ఆరాధించి ఆయనను పొందినది పార్వతీదేవి. అందువలన ఆమె శాంకరి అయినది.

శంకరుడు ఏకాదశ రుద్రులలో నొకడు. రుద్రమూర్తి సైతము తపస్సు వలన శాంతమును, సుఖమును పొందెను. 

అందువలన శాంతమును, సుఖమును పొందగోరువారు అర్ధనిమీలిత నేత్రుడై చిరుదరహాసముతో ధ్యానము చేయుచున్న శివుని శ్రీగురువుగ ఆశ్రయింతురు. లేదా భగవద్గీతయందు భగవంతునిచే పేర్కొనబడిన సత్వగుణము నుపాసించి కూడ శాంతమును పొందవచ్చును. 

శ్రీలలిత అట్టి సత్వగుణ సముదాయమునకు కూడ అధిదేవత. ఆమె సుందర సుమనోహర రూపమును ఆరాధించుచు సత్వగుణము నాశ్రయించి జీవించువారికి ఆమెయే స్వయముగ సుఖ శాంతులను ప్రసాదించ గలదు.

సశేషం...

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

దశమస్కంధము - పూర్వార్ధము - మూడవ అధ్యాయము

శ్రీకృష్ణభగవానుడు ఆవిర్భవించుట

ఓం నమో భగవతే వాసుదేవాయ

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

శ్రీశుక ఉవాచ

శ్రీశుకుడు నుడివెను పరీక్షిన్మహారాజా! జన్మరహితుడైన శ్రీహరి అవతరించు సమయము ఆసన్నమయ్యెను. ఆ కాలము సర్వశుభలక్షణములతో ఒప్పుచు, మిగుల ఆహ్లాదకరముగా ఉండెను. చంద్రుడు రోహిణీ నక్షత్రమున అడుగిడెను. అశ్విని మొదలగు నక్షత్రములు, రవి మున్నగు గ్రహములు తదితరములగు తారకలు సౌమ్యముగా ఉండెను. దిశలు అన్నియును ప్రసన్నముగా ఉండెను. ఆకాశమంతయు నక్షత్రములతో మిలమిలలాడుచు నిర్మలముగా నుండెను. భూతలమునగల పురములు, గ్రామములు, గోకులములు మొదలగునవి అన్నియును మంగళమయములై యుండెను. అవి సకలసంపదలతో తులతూగుచు, పాడిపంటలతో వర్ధిల్లుచు, హాయిగా ఒప్పారుచుండెను.

అప్ఫుడు సమస్త నదులు నిర్మల జలములతో ప్రవహించుచుండెను. సరస్సులన్నియు కమలములు, కలువలు మొదలగు పుష్పముల శోభలతో కళకళలాడుచుండెను. వనముల యందలి సకల వృక్షములును చక్కని కుసుమ రాజితో నిండి, పండ్లగుత్తులతో కనువిందు గావించుచుండెను. వాటిపైగల వివిధములగు పక్షులు చేయుచున్న కలకలారావములు వినసొంపుగా నుండెను. తుమ్మెదలు ఝంకారములు హాయిని గలిగించు చుండెను.

వాయువులు సుఖస్పర్శను గూర్చుచు, పరిమళములను వెదజల్లుచు, నిర్మలముగా (దుమ్ములేకుండా) వీచుచుండెను. కంసుని భయముతో బ్రాహ్మణాది ద్విజుల గృహములలో ఆగిపోయిన అగ్నిజ్వాలలు ఇప్పుడు చక్కగా ప్రజ్వలింపసాగెను.అంతట అసురులవలన బాధలకు లోనైన దేవతల, సాధుపురుషుల మనస్సులయందు సంతోషము వెల్లివిరిసెను. భగవంతుడు అవతరింపనున్న ఆ శుభ సమయమునందు ఆకాశమున దేవదుందుభులు మ్రోగెను. కిన్నరులు, గంధర్వులు మధురగానములను ఆలపించిరి. సిద్ధులు, చారణులు భగవంతుని కల్యాణగుణములను ప్రస్తుతింపదొడగిరి. విద్యాధర స్త్రీలు అప్సరసలతో గూడి ఆహ్లాదకరముగా నాట్యములు చేసిరి.

అప్ఫుడు మునులు, దేవతలు సంతోషముతో పుష్పములను వర్షించిరి. సకలమేఘములును సముద్ర తరంగ ఘోషలకు అనుగుణముగా మెల్లమెల్లగా గర్జించెను. 

జననమరణ చక్రమునుండి సకల ప్రాణులను ఉద్ధరించెడి శ్రీహరి అవతరింపనున్న ఆ అర్ధరాత్రివేళ నలుదెసల యందును చీకట్లు అలముకొనియుండెను. అంతట సకలజీవరాసులలో అంతర్యామియై వెలుగొందు చుండెడి శ్రీమహావిష్ణువు దివ్యాంశశోభితయైన దేవకీదేవి గర్భమున, తూర్పుదిశయందు పరిపూర్ణ కళలతో తేజరిల్లుచుండెడి నిండుపున్నమి చంద్రునివలె ఆవిర్భవించెను.

అప్పుడు ఆ పరమపురుషుడు అద్భుత బాలకుడై విరాజిల్లు చుండెను. ఆ స్వామి నేత్రములు కమలములవలె శోభిల్లుచుండెను. ఆ ప్రభువు చతుర్భుజముల యందును శంఖచక్రములను, గదాపద్మములను ధరించి యుండెను. ఆయన వక్షస్థలము నందలి శ్రీవత్సచిహ్నము పరమరమణీయముగా నుండెను. కంఠమునగల కౌస్తుభమణి మిలమిల మెఱయుచుండెను. దట్టముగానున్న మేఘమువలె ఒప్పుచున్న ఆ శ్యామసుందరుడు ధరించియున్న పీతాంబర కాంతులు  మనోజ్ఞముగా ఉండెను. అమూల్యములగు వైడూర్య మణులు పొదిగిన ఆ ప్రభువు కిరీటముయొక్క కుండలముల యొక్క కాంతులు ముంగురులపై తేజరిల్లుచు ఇంపు గొలుపు చుండెను. అప్పుడు అవి (ముంగురుల శోభలు) సూర్యకిరణములవలె భాసిల్లుచుండెను. ఆ స్వామి (శ్యామసుందరుడు) దాల్చిన మొలనూలు, భుజకీర్తులు, కంకణములు శ్లాఘ్యములై ఒప్పుచుండగా దేదీప్యమానముగా విరాజిల్లుచున్న ఆ శ్రీహరిని వసుదేవుడు దర్శించెను.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి మూడవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమ

11.11.2020   ప్రాతః కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

దశమస్కంధము - పూర్వార్ధము - మూడవ అధ్యాయము

శ్రీకృష్ణభగవానుడు ఆవిర్భవించుట

ఓం నమో భగవతే వాసుదేవాయ

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

శ్రీశుక ఉవాచ

3.1 (ప్రథమ శ్లోకము)

అథ సర్వగుణోపేతః కాలః పరమశోభనః|

యర్హ్యేవాజనజన్మర్క్షం శాంతర్క్షగ్రహతారకమ్॥8332॥

3.2 (రెండవ శ్లోకము)

దిశః ప్రసేదుర్గగనం నిర్మలోడుగణోదయమ్|

మహీ మంగలభూయిష్ఠపురగ్రామవ్రజాకరా॥8333॥

శ్రీశుకుడు నుడివెను పరీక్షిన్మహారాజా! జన్మరహితుడైన శ్రీహరి అవతరించు సమయము ఆసన్నమయ్యెను. ఆ కాలము సర్వశుభలక్షణములతో ఒప్పుచు, మిగుల ఆహ్లాదకరముగా ఉండెను. చంద్రుడు రోహిణీ నక్షత్రమున అడుగిడెను. అశ్విని మొదలగు నక్షత్రములు, రవి మున్నగు గ్రహములు తదితరములగు తారకలు సౌమ్యముగా ఉండెను. దిశలు అన్నియును ప్రసన్నముగా ఉండెను. ఆకాశమంతయు నక్షత్రములతో మిలమిలలాడుచు నిర్మలముగా నుండెను. భూతలమునగల పురములు, గ్రామములు, గోకులములు మొదలగునవి అన్నియును మంగళమయములై యుండెను. అవి సకలసంపదలతో తులతూగుచు, పాడిపంటలతో వర్ధిల్లుచు, హాయిగా ఒప్పారుచుండెను.

3.3 (మూడవ శ్లోకము)

నద్యః ప్రసన్నసలిలా హ్రదా జలరుహశ్రియః|

ద్విజాలికులసన్నాదస్తబకా వనరాజయః॥8334॥

అప్ఫుడు సమస్త నదులు నిర్మల జలములతో ప్రవహించుచుండెను. సరస్సులన్నియు కమలములు, కలువలు మొదలగు పుష్పముల శోభలతో కళకళలాడుచుండెను. వనముల యందలి సకల వృక్షములును చక్కని కుసుమ రాజితో నిండి, పండ్లగుత్తులతో కనువిందు గావించుచుండెను. వాటిపైగల వివిధములగు పక్షులు చేయుచున్న కలకలారావములు వినసొంపుగా నుండెను. తుమ్మెదలు ఝంకారములు హాయిని గలిగించు చుండెను.

3.4 (నాలుగవ శ్లోకము)

వవౌ వాయుః సుఖస్పర్శః పుణ్యగంధవహః శుచిః|

అగ్నయశ్చ ద్విజాతీనాం శాంతాస్తత్ర సమింధత॥8335॥

3.5 (ఐదవ శ్లోకము)

మనాంస్యాసన్ ప్రసన్నాని సాధూనామసురద్రుహామ్|

జాయమానేఽజనే తస్మిన్ నేదుర్దుందుభయో దివి॥8336॥

3.6 (ఆరవ శ్లోకము)

జగుః కిన్నరగంధర్వాస్తుష్టువుః సిద్ధచారణాః|

విద్యాధర్యశ్చ ననృతురప్సరోభిః సమం తదా॥8337॥

వాయువులు సుఖస్పర్శను గూర్చుచు, పరిమళములను వెదజల్లుచు, నిర్మలముగా (దుమ్ములేకుండా) వీచుచుండెను. కంసుని భయముతో బ్రాహ్మణాది ద్విజుల గృహములలో ఆగిపోయిన అగ్నిజ్వాలలు ఇప్పుడు చక్కగా ప్రజ్వలింపసాగెను.అంతట అసురులవలన బాధలకు లోనైన దేవతల, సాధుపురుషుల మనస్సులయందు సంతోషము వెల్లివిరిసెను. భగవంతుడు అవతరింపనున్న ఆ శుభ సమయమునందు ఆకాశమున దేవదుందుభులు మ్రోగెను. కిన్నరులు, గంధర్వులు మధురగానములను ఆలపించిరి. సిద్ధులు, చారణులు భగవంతుని కల్యాణగుణములను ప్రస్తుతింపదొడగిరి. విద్యాధర స్త్రీలు అప్సరసలతో గూడి ఆహ్లాదకరముగా నాట్యములు చేసిరి.

3.7 (ఏడవ శ్లోకము)

ముముచుర్మునయో దేవాః సుమనాంసి ముదాన్వితాః|

మందం మందం జలధరా జగర్జురనుసాగరమ్॥8338॥

అప్ఫుడు మునులు, దేవతలు సంతోషముతో పుష్పములను వర్షించిరి. సకలమేఘములును సముద్ర తరంగ ఘోషలకు అనుగుణముగా మెల్లమెల్లగా గర్జించెను. 

3.8 (ఎనిమిదవ శ్లోకము)

నిశీథే తమ ఉద్భూతే జాయమానే జనార్దనే|

దేవక్యాం దేవరూపిణ్యాం విష్ణుః సర్వగుహాశయః|

ఆవిరాసీద్యథా ప్రాచ్యాం దిశీందురివ పుష్కలః॥8339॥

జననమరణ చక్రమునుండి సకల ప్రాణులను ఉద్ధరించెడి శ్రీహరి అవతరింపనున్న ఆ అర్ధరాత్రివేళ నలుదెసల యందును చీకట్లు అలముకొనియుండెను. అంతట సకలజీవరాసులలో అంతర్యామియై వెలుగొందు చుండెడి శ్రీమహావిష్ణువు దివ్యాంశశోభితయైన దేవకీదేవి గర్భమున, తూర్పుదిశయందు పరిపూర్ణ కళలతో తేజరిల్లుచుండెడి నిండుపున్నమి చంద్రునివలె ఆవిర్భవించెను.

3.9 (తొమ్మిదవ శ్లోకము)

తమద్భుతం బాలకమంబుజేక్షణం  చతుర్భుజం శంఖగదాద్యుదాయుధమ్|

శ్రీవత్సలక్ష్మం గలశోభికౌస్తుభం  పీతాంబరం సాంద్రపయోదసౌభగమ్॥8340॥

3.10 (పదియవ శ్లోకము)

మహార్హవైదూర్యకిరీటకుండలత్విషా  పరిష్వక్తసహస్రకుంతలమ్|

ఉద్దామకాంచ్యంగదకంకణాదిభిర్విరోచమానం వసుదేవ ఐక్షత॥8341॥

అప్పుడు ఆ పరమపురుషుడు అద్భుత బాలకుడై విరాజిల్లు చుండెను. ఆ స్వామి నేత్రములు కమలములవలె శోభిల్లుచుండెను. ఆ ప్రభువు చతుర్భుజముల యందును శంఖచక్రములను, గదాపద్మములను ధరించి యుండెను. ఆయన వక్షస్థలము నందలి శ్రీవత్సచిహ్నము పరమరమణీయముగా నుండెను. కంఠమునగల కౌస్తుభమణి మిలమిల మెఱయుచుండెను. దట్టముగానున్న మేఘమువలె ఒప్పుచున్న ఆ శ్యామసుందరుడు ధరించియున్న పీతాంబర కాంతులు  మనోజ్ఞముగా ఉండెను. అమూల్యములగు వైడూర్య మణులు పొదిగిన ఆ ప్రభువు కిరీటముయొక్క కుండలముల యొక్క కాంతులు ముంగురులపై తేజరిల్లుచు ఇంపు గొలుపు చుండెను. అప్పుడు అవి (ముంగురుల శోభలు) సూర్యకిరణములవలె భాసిల్లుచుండెను. ఆ స్వామి (శ్యామసుందరుడు) దాల్చిన మొలనూలు, భుజకీర్తులు, కంకణములు శ్లాఘ్యములై ఒప్పుచుండగా దేదీప్యమానముగా విరాజిల్లుచున్న ఆ శ్రీహరిని వసుదేవుడు దర్శించెను.

3.11 (పదకొండవ శ్లోకము)

అప్పుడు ఆ వసుదేవుడు తనకు కుమారుడై అవతరించిన ఆ శ్రీహరిని చూచినంతనే ఆయన యొక్క నేత్రములు బాగుగా వికసించిన పద్మములవలె సంభ్రమాశ్చర్యములతో వెలుగొందెను. పరమానందముతో ఆయన తనువు పులకించెను. శ్రీకృష్ణుడు అవతరించిన ఆ శుభసందర్భమును పురస్కరించుకొని, వసుదేవుడు నిండు సంతోషముతో బ్రాహ్మణులకు వేలకొలది గోవులను దానము చేయుటకు మనస్సులో సంకల్పించెను.

 పరీక్షిన్మహారాజా! ఆ పరమపురుషుడు అవతరించినంతనే ఆ సూతికాగృహము (చెఱసాల)  అంతయును ఆ స్వామియొక్క శరీర శోభలతో నిండిపోయెను. అంతట ఆ ప్రభువుయొక్క ప్రభావమును గుర్తించిన వసుదేవునిలో కంసుని వలన కలిగిన భయము మటుమాయమయ్యెను. అప్పుడు అతడు ధైర్యము వహించి, వినమ్రతతో అంజలి ఘటించి, ఆ పురుషోత్తముని ఇట్లు ప్రస్తుతింప దొడంగెను.

వసుదేవ ఉవాచ

వసుదేవుడు ఇట్లు స్తుతించెను "ఓ పరమాత్మా! నీవు ప్రకృతికి అతీతుడవైన పరమపురుషుడవని నాకు బోధపడినది. నీవు ఆనందస్వరూపుడవు. కేవలము అనుభవైకవేద్యుడవు (అవాఙ్మానసగోచరుడవు). సకల బుద్ధులకు సాక్షీభూతుడవు.

 ప్రభూ! అట్టి మహానుభావుడవైన నీవు నీ యోగమాయచేత ముందుగా త్రిగుణాత్మకమైన ఈ జగత్తును (సకల ప్రాణులను సత్త్వరజస్తమోగుణ మిశ్రితముగా) సృజించితివి. నీవు దానియందు ప్రవేశించియున్నట్లుగా భాసిల్లు చుందువు, కాని యథార్థముగా దానికి అతీతుడవై యుందువు. అనగా, నీవు ఈ జగత్తునందు ప్రవేశించినట్లున్నను దాని గుణములు నీకు ఏ మాత్రమూ  అంటవు.

 శ్రీహరీ! నీచే సృజింపబడిన ఈ ప్రపంచమున నీవు ప్రవేశించియు, ప్రవేశింపకయుండుట ఎట్లనగా - మహత్తత్త్వాది కారణతత్త్వములు వేరు-వేరుగా ఉన్నంతవరకు వాటి శక్తులుకూడా వేరువేరుగనే యుండును. వాటి శక్తుల మధ్య పొంతన ఉండదు. కాని, మహదాది కారణతత్త్వములు, ఇంద్రియాదులు  పదునారు అనగా పంచతన్మాత్రలు, పంచకర్మేంద్రియములు, పంచ జ్ఞానేంద్రియములు, ఒక మనస్సు వెరసి పదునారు వికారములతో పరబ్రహ్మయొక్క ప్రేరణనే కలిసినప్పుడు ఈ బ్రహ్మాండమునందు అంతటా నీవు ప్రవేశించియున్నట్లుగా కన్పట్టును. కాని, వాస్తవమునకు అన్నింటిలో నీవు ముందు నుండియే ఉండియున్నావు.

సర్వేశ్వరా! బుద్ధిద్వారా కేవలము గుణముల లక్షణములను మాత్రమే ఊహించుట సంభవము. ఇంద్రియములద్వారా గుణమయములైన విషయములను మాత్రమే గ్రహించుటకు వీలగును. నీవు వాటిలో ఉన్నను, ఆ గుణములను గ్రహించినంత మాత్రమున నిన్ను ఎఱుంగుటకు సాధ్యముకాదు. ఏలనన, నీవు సర్వవ్యాపివి. సర్వాంతర్యామివి. నీవు నిత్యసత్యమైన పరమాత్మవు. నిన్ను ఏ గుణములును కప్పివేయజాలవు. కనుక, సర్వపూర్ణుడవైన నీకు పుట్టుక, ఉనికి, మృత్యువు అనునవి లేవు.

ఈ గుణములు తనకంటెను వేరనియు, అవి నిత్యసత్యములు అనియు భావించువాడు నిజముగా మూర్ఖుడు. తర్కించి చూచినప్ఫుడు ఈ దేహము, గేహము మొదలగునవి వాగ్విలాసములేగాని (వాక్పరికల్పితములేగాని) వేరుగావు. తర్కమునకు నిలువజాలని వస్తువులను (దేహగేహాదులను) నిత్యసత్యములని భావించువాడు బుద్ధిమంతుడు కాడు. అనగా జ్ఞానహీనుడు.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి మూడవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

11.11.2020   సాయం కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

దశమస్కంధము - పూర్వార్ధము - మూడవ అధ్యాయము

శ్రీకృష్ణభగవానుడు ఆవిర్భవించుట

ఓం నమో భగవతే వాసుదేవాయ

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

3.11 (పదకొండవ శ్లోకము)

స విస్మయోత్ఫుల్లవిలోచనో హరిం సుతం విలోక్యానకదుందుభిస్తదా|

కృష్ణావతారోత్సవసంభ్రమోఽస్పృశన్ముదా  ద్విజేభ్యోఽయుతమాప్లుతో గవామ్॥8342॥

అప్పుడు ఆ వసుదేవుడు తనకు కుమారుడై అవతరించిన ఆ శ్రీహరిని చూచినంతనే ఆయన యొక్క నేత్రములు బాగుగా వికసించిన పద్మములవలె సంభ్రమాశ్చర్యములతో వెలుగొందెను. పరమానందముతో ఆయన తనువు పులకించెను. శ్రీకృష్ణుడు అవతరించిన ఆ శుభసందర్భమును పురస్కరించుకొని, వసుదేవుడు నిండు సంతోషముతో బ్రాహ్మణులకు వేలకొలది గోవులను దానము చేయుటకు మనస్సులో సంకల్పించెను.

 3.12 (పండ్రెండవ శ్లోకము)

అథైనమస్తౌదవధార్య పూరుషం పరం నతాంగః కృతధీః కృతాంజలిః|

స్వరోచిషా భారత సూతికాగృహం విరోచయంతం గతభీః ప్రభావవిత్॥8343॥

పరీక్షిన్మహారాజా! ఆ పరమపురుషుడు అవతరించినంతనే ఆ సూతికాగృహము (చెఱసాల)  అంతయును ఆ స్వామియొక్క శరీర శోభలతో నిండిపోయెను. అంతట ఆ ప్రభువుయొక్క ప్రభావమును గుర్తించిన వసుదేవునిలో కంసుని వలన కలిగిన భయము మటుమాయమయ్యెను. అప్పుడు అతడు ధైర్యము వహించి, వినమ్రతతో అంజలి ఘటించి, ఆ పురుషోత్తముని ఇట్లు ప్రస్తుతింప దొడంగెను.

వసుదేవ ఉవాచ

 3.13 (పదకొండవ శ్లోకము)

విదితోఽసి భవాన్ సాక్షాత్పురుషః ప్రకృతేః పరః|

కేవలానుభవానందస్వరూపః సర్వబుద్ధిదృక్॥8344॥

వసుదేవుడు ఇట్లు స్తుతించెను "ఓ పరమాత్మా! నీవు ప్రకృతికి అతీతుడవైన పరమపురుషుడవని నాకు బోధపడినది. నీవు ఆనందస్వరూపుడవు. కేవలము అనుభవైకవేద్యుడవు (అవాఙ్మానసగోచరుడవు). సకల బుద్ధులకు సాక్షీభూతుడవు.

 3.14 (పదునాలుగవ శ్లోకము)

స ఏవ స్వప్రకృత్యేదం సృష్ట్వాగ్రే త్రిగుణాత్మకమ్|

తదను త్వం హ్యప్రవిష్టః ప్రవిష్ట ఇవ భావ్యసే॥8345॥

ప్రభూ! అట్టి మహానుభావుడవైన నీవు నీ యోగమాయచేత ముందుగా త్రిగుణాత్మకమైన ఈ జగత్తును (సకల ప్రాణులను సత్త్వరజస్తమోగుణ మిశ్రితముగా) సృజించితివి. నీవు దానియందు ప్రవేశించియున్నట్లుగా భాసిల్లు చుందువు, కాని యథార్థముగా దానికి అతీతుడవై యుందువు. అనగా, నీవు ఈ జగత్తునందు ప్రవేశించినట్లున్నను దాని గుణములు నీకు ఏ మాత్రమూ  అంటవు.

 3.15 (పదునైదవ శ్లోకము)

యథేమేఽవికృతా భావాస్తథా తే వికృతైః సహ|

నానావీర్యాః పృథగ్భూతా విరాజం జనయంతి హి॥8346॥

సన్నిపత్య సముత్పాద్య దృశ్యంతేఽనుగతా ఇవ|

ప్రాగేవ విద్యమానత్వాన్న తేషామిహ సంభవః॥8347॥

శ్రీహరీ! నీచే సృజింపబడిన ఈ ప్రపంచమున నీవు ప్రవేశించియు, ప్రవేశింపకయుండుట ఎట్లనగా - మహత్తత్త్వాది కారణతత్త్వములు వేరు-వేరుగా ఉన్నంతవరకు వాటి శక్తులుకూడా వేరువేరుగనే యుండును. వాటి శక్తుల మధ్య పొంతన ఉండదు. కాని, మహదాది కారణతత్త్వములు, ఇంద్రియాదులు  పదునారు అనగా పంచతన్మాత్రలు, పంచకర్మేంద్రియములు, పంచ జ్ఞానేంద్రియములు, ఒక మనస్సు వెరసి పదునారు వికారములతో పరబ్రహ్మయొక్క ప్రేరణనే కలిసినప్పుడు ఈ బ్రహ్మాండమునందు అంతటా నీవు ప్రవేశించియున్నట్లుగా కన్పట్టును. కాని, వాస్తవమునకు అన్నింటిలో నీవు ముందు నుండియే ఉండియున్నావు.

3.17 (పదిహేడవ శ్లోకము)

ఏవం భవాన్ బుద్ధ్యనుమేయలక్షణైర్గ్రాహ్యైర్గుణైః సన్నపి తద్గుణాగ్రహః|

అనావృతత్వాద్బహిరంతరం న తే సర్వస్య సర్వాత్మన ఆత్మవస్తునః॥8348॥

సర్వేశ్వరా! బుద్ధిద్వారా కేవలము గుణముల లక్షణములను మాత్రమే ఊహించుట సంభవము. ఇంద్రియములద్వారా గుణమయములైన విషయములను మాత్రమే గ్రహించుటకు వీలగును. నీవు వాటిలో ఉన్నను, ఆ గుణములను గ్రహించినంత మాత్రమున నిన్ను ఎఱుంగుటకు సాధ్యముకాదు. ఏలనన, నీవు సర్వవ్యాపివి. సర్వాంతర్యామివి. నీవు నిత్యసత్యమైన పరమాత్మవు. నిన్ను ఏ గుణములును కప్పివేయజాలవు. కనుక, సర్వపూర్ణుడవైన నీకు పుట్టుక, ఉనికి, మృత్యువు అనునవి లేవు.

3.18 (పదునెనిమిదవ శ్లోకము)

య ఆత్మనో దృశ్యగుణేషు సన్నితి వ్యవస్యతే స్వవ్యతిరేకతోఽబుధః|

వినానువాదం న చ తన్మనీషితం  సమ్యగ్యతస్త్యక్తముపాదదత్పుమాన్॥8349॥

ఈ గుణములు తనకంటెను వేరనియు, అవి నిత్యసత్యములు అనియు భావించువాడు నిజముగా మూర్ఖుడు. తర్కించి చూచినప్ఫుడు ఈ దేహము, గేహము మొదలగునవి వాగ్విలాసములేగాని (వాక్పరికల్పితములేగాని) వేరుగావు. తర్కమునకు నిలువజాలని వస్తువులను (దేహగేహాదులను) నిత్యసత్యములని భావించువాడు బుద్ధిమంతుడు కాడు. అనగా జ్ఞానహీనుడు.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి మూడవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

3.19 (పందొమ్మిదవ శ్లోకము)

ప్రభూ! నీవు ఎట్టి కోరికలును లేనివాడవు. సత్త్వాది గుణములకు అతీతుడవు. నీవు దేనికిని కర్తవుగావు. ఐనను నీవలననే ఈ జగత్తుయొక్క సృష్టి, స్థితి, లయములు జరుగుచుండునని పేర్కొందురు. ఇట్లనుట పూర్వాపరవిరుద్ధము గదా! కానీ, బాగుగా ఆలోచించి చూచినచో ఇందు ఏ మాత్రమూ వైరుధ్యము కన్పట్టదు. నీవు సర్వసమర్థుడవు, పరబ్రహ్మవు. త్రిగుణములు నిన్ను ఆశ్రయించియుండును. కనుక ఆ త్రిగుణముల కార్యములు నీ యందు ఆరోపింపబడుచున్నవి.

భటుల శౌర్యాది లక్షణములు అన్నియును రాజునందు ఆపాదింపబడుచుండునట్లు, 'ఈ గుణముల వైభవములు అన్నియును ఆ భగవంతునకు చెందినవే' అని తోచుచుండును.

ఈ ముల్లోకములను రక్షించుటకొఱకై నీవు నీ మాయవలన సత్ప్వమయ (విశుద్ధమైన) శుక్ల వర్ణమును, అనగా విష్ణురూపమును ధరింతువు. అట్లే జగత్సృష్టి చేయుటకై రజోగుణ ప్రధానమైన రక్త వర్ణముసు - అనగా బ్రహ్మరూపమును స్వీకరింతువు. ఆ విధముగనే జగత్తును లయింపజేయుటకై తమోగుణప్రధానమైన కృష్ణ వర్ణమును - అనగా రుద్రరూపమును తాల్చుచుందువు.

సర్వేశ్వరా! నీవు సర్వశక్తిమంతుడవు, ఈ భూమండలమును రక్షించుటకు సంకల్పించినవాడవై నా ధర్మపత్ని  (దేవకి) యందు అవతరించితివి. ప్రస్తుతము అసురస్వభావముగల పెక్కుమంది రాజన్యులు కోట్లకొలది సైన్యములతో గూడి విశృంఖలముగా ప్రవర్తించుచున్నారు. నీవు వారిని అందరిని సంహరించెదవు.

దేవాధిదేవా! ఈ కంసుడు మిగుల దుష్టుడు. నీవు మా యింట అవతరించెదవని విని, భయముతో  నీ అగ్రజులను అందరిని వధించెను. ఇప్పుడు నీవు అవతరించిన విషయమును దూతలద్వారా విన్నంతనే అతడు ఆయుధములను చేబూని నిన్ను వధించుటకై పరుగెత్తుకొని ఇచటికి వచ్చును".

శ్రీశుక ఉవాచ

శ్రీశుకుడు పలికెను పరీక్షిన్మహారాజా! దేవకీదేవి శంఖచక్రగదాపద్మములు మొదలగు అసాధారణ లక్షణములతో విరాజిల్లుచున్న తన కుమారుని జూచి, అతడు శ్రీమన్నారాయణుడేయని గ్రహించెను. ఇంతవరకును ఆ దేవి కంసునివలన ఎట్టి ముప్పు వాటిల్లనున్నదోయని భయపడుచున్నను (పురుషోత్తముడు తనకు  పుత్రుడైనందులకు ఆనందించుచు) స్వచ్ఛమైన మందహాసముతో ఆ శ్రీహరిని ఇట్లు స్తుతింపసాగెను-

దేవక్యువాచ

దేవకి ఇట్లు స్తుతించెను "దేవా! నీ రూపము 'ఇట్టిది-అట్టిది' అని వర్ణింపనలవికానిది. అది అవ్యక్తము (ఇంద్రియాతీతము). అది సృష్టికి ముందే యున్నది (సృష్టికి మూలమైనది). సత్త్వాది త్రిగుణములు లేనిది. వికారరహితమైనది (శోకమోహాది వికారములు లేనిది). సర్వకాలములయందును వృద్ధిక్షయాది వికారములు లేనిది. శబ్దస్పర్శాదిపంచతన్మాత్రల ఊసులు లేనిది. పుణ్యపాపక్రియలు లేనిది. అవాఙ్ఙానసగోచరమైనది. అట్టి రూపముగల నీవు సకల ప్రాణులయందునుజ్యోతిస్వరూపుడవై వెలుగొందు శ్రీవిష్ణుడవే' అని వేదములు నుడువుచున్నవి.

చతుర్ముఖ బ్రహ్మయొక్క ద్వితీయ పరార్ధమునకు అంత్యమున జగములన్నియును అంతరించును. పంచమహాభూతములు తమకు కారణమగు మహత్తత్త్వము మొదలగు ఈ దృశ్యజగత్తు అంతయును మూలప్రకృతియందు లీనమగును. అప్పుడు అద్వితీయుడగు నీవు ఒక్కడవే మిగిలియుందువు. అట్టి నీవు శేషుడు అను పేరుతో విరాజిల్లుచుందువు.

ప్రభూ! నీ వలననే ప్రకృతి ఈ విశ్వమును ప్రవర్తిల్లజేయుచున్నది. కాలము నీ లీలామాత్ర విశేషము. నిమేషము మొదలుకొని, సంవత్సరమునకు అనేక విభాగములతో ఒప్పుచుండెడి ఈ కాలము అనంతమైనది. ఈ కాలగమనమున అనుసరించియే విశ్వము చైతన్యవంతమగుచున్నది. నీవు సర్వశక్తిమంతుడవు. సకల శుభములకును నెలవైనవాడవు. అట్టి నిన్ను శరణుజొచ్చుచున్నాను.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి మూడవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

12.11.2020   ప్రాతః కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

దశమస్కంధము - పూర్వార్ధము - మూడవ అధ్యాయము

శ్రీకృష్ణభగవానుడు ఆవిర్భవించుట

ఓం నమో భగవతే వాసుదేవాయ

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

3.19 (పందొమ్మిదవ శ్లోకము)

త్వత్తోఽస్య జన్మస్థితిసంయమాన్ విభో  వదంత్యనీహాదగుణాదవిక్రియాత్|

త్వయీశ్వరే బ్రహ్మణి నో విరుధ్యతే  త్వదాశ్రయత్వాదుపచర్యతే గుణైః॥8350॥

ప్రభూ! నీవు ఎట్టి కోరికలును లేనివాడవు. సత్త్వాది గుణములకు అతీతుడవు. నీవు దేనికిని కర్తవుగావు. ఐనను నీవలననే ఈ జగత్తుయొక్క సృష్టి, స్థితి, లయములు జరుగుచుండునని పేర్కొందురు. ఇట్లనుట పూర్వాపరవిరుద్ధము గదా! కానీ, బాగుగా ఆలోచించి చూచినచో ఇందు ఏ మాత్రమూ వైరుధ్యము కన్పట్టదు. నీవు సర్వసమర్థుడవు, పరబ్రహ్మవు. త్రిగుణములు నిన్ను ఆశ్రయించియుండును. కనుక ఆ త్రిగుణముల కార్యములు నీ యందు ఆరోపింపబడుచున్నవి.

భటుల శౌర్యాది లక్షణములు అన్నియును రాజునందు ఆపాదింపబడుచుండునట్లు, 'ఈ గుణముల వైభవములు అన్నియును ఆ భగవంతునకు చెందినవే' అని తోచుచుండును.

3.20 (ఇరువదియవ శ్లోకము)

స త్వం త్రిలోకస్థితయే స్వమాయయా బిభర్షి శుక్లం ఖలు వర్ణమాత్మనః|

సర్గాయ రక్తం రజసోపబృంహితం కృష్ణం చ వర్ణం తమసా జనాత్యయే॥8351॥

ఈ ముల్లోకములను రక్షించుటకొఱకై నీవు నీ మాయవలన సత్ప్వమయ (విశుద్ధమైన) శుక్ల వర్ణమును, అనగా విష్ణురూపమును ధరింతువు. అట్లే జగత్సృష్టి చేయుటకై రజోగుణ ప్రధానమైన రక్త వర్ణముసు - అనగా బ్రహ్మరూపమును స్వీకరింతువు. ఆ విధముగనే జగత్తును లయింపజేయుటకై తమోగుణప్రధానమైన కృష్ణ వర్ణమును - అనగా రుద్రరూపమును తాల్చుచుందువు.

3.21 (ఇరువది ఒకటవ శ్లోకము)

త్వమస్య లోకస్య విభో రిరక్షిషుర్గృహేఽవతీర్ణోఽసి మమాఖిలేశ్వర|

రాజన్యసంజ్ఞాసురకోటియూథపైర్నిర్వ్యూహ్యమానా నిహనిష్యసే చమూః॥8352॥

సర్వేశ్వరా! నీవు సర్వశక్తిమంతుడవు, ఈ భూమండలమును రక్షించుటకు సంకల్పించినవాడవై నా ధర్మపత్ని  (దేవకి) యందు అవతరించితివి. ప్రస్తుతము అసురస్వభావముగల పెక్కుమంది రాజన్యులు కోట్లకొలది సైన్యములతో గూడి విశృంఖలముగా ప్రవర్తించుచున్నారు. నీవు వారిని అందరిని సంహరించెదవు.

3.22  (ఇరువది రెండవ శ్లోకము)

అయం త్వసభ్యస్తవ జన్మ నౌ గృహే శ్రుత్వాగ్రజాంస్తే న్యవధీత్సురేశ్వర|

స తేఽవతారం పురుషైః సమర్పితం శ్రుత్వాధునైవాభిసరత్యుదాయుధః8353॥

దేవాధిదేవా! ఈ కంసుడు మిగుల దుష్టుడు. నీవు మా యింట అవతరించెదవని విని, భయముతో  నీ అగ్రజులను అందరిని వధించెను. ఇప్పుడు నీవు అవతరించిన విషయమును దూతలద్వారా విన్నంతనే అతడు ఆయుధములను చేబూని నిన్ను వధించుటకై పరుగెత్తుకొని ఇచటికి వచ్చును".

శ్రీశుక ఉవాచ

3.23 (ఇరువది మూడవ శ్లోకము)

అథైనమాత్మజం వీక్ష్య మహాపురుషలక్షణమ్|

దేవకీ తముపాధావత్కంసాద్భీతా శుచిస్మితా॥8354॥

శ్రీశుకుడు పలికెను పరీక్షిన్మహారాజా! దేవకీదేవి శంఖచక్రగదాపద్మములు మొదలగు అసాధారణ లక్షణములతో విరాజిల్లుచున్న తన కుమారుని జూచి, అతడు శ్రీమన్నారాయణుడేయని గ్రహించెను. ఇంతవరకును ఆ దేవి కంసునివలన ఎట్టి ముప్పు వాటిల్లనున్నదోయని భయపడుచున్నను (పురుషోత్తముడు తనకు  పుత్రుడైనందులకు ఆనందించుచు) స్వచ్ఛమైన మందహాసముతో ఆ శ్రీహరిని ఇట్లు స్తుతింపసాగెను-

దేవక్యువాచ

3.24 (ఇరువది నాలుగవ శ్లోకము)

రూపం యత్తత్ప్రాహురవ్యక్తమాద్యం  బ్రహ్మ జ్యోతిర్నిర్గుణం నిర్వికారమ్|

సత్తామాత్రం నిర్విశేషం నిరీహం  స త్వం సాక్షాద్విష్ణురధ్యాత్మదీపః॥8355॥

దేవకి ఇట్లు స్తుతించెను "దేవా! నీ రూపము 'ఇట్టిది-అట్టిది' అని వర్ణింపనలవికానిది. అది అవ్యక్తము (ఇంద్రియాతీతము). అది సృష్టికి ముందే యున్నది (సృష్టికి మూలమైనది). సత్త్వాది త్రిగుణములు లేనిది. వికారరహితమైనది (శోకమోహాది వికారములు లేనిది). సర్వకాలములయందును వృద్ధిక్షయాది వికారములు లేనిది. శబ్దస్పర్శాదిపంచతన్మాత్రల ఊసులు లేనిది. పుణ్యపాపక్రియలు లేనిది. అవాఙ్ఙానసగోచరమైనది. అట్టి రూపముగల నీవు సకల ప్రాణులయందునుజ్యోతిస్వరూపుడవై వెలుగొందు శ్రీవిష్ణుడవే' అని వేదములు నుడువుచున్నవి.

3.25 (ఇరువది ఐదవ శ్లోకము)

నష్టే లోకే ద్విపరార్ధావసానే  మహాభూతేష్వాదిభూతం గతేషు|

వ్యక్తేఽవ్యక్తం కాలవేగేన యాతే   భవానేకః శిష్యతే శేషసంజ్ఞః॥8356॥

చతుర్ముఖ బ్రహ్మయొక్క ద్వితీయ పరార్ధమునకు అంత్యమున జగములన్నియును అంతరించును. పంచమహాభూతములు తమకు కారణమగు మహత్తత్త్వము మొదలగు ఈ దృశ్యజగత్తు అంతయును మూలప్రకృతియందు లీనమగును. అప్పుడు అద్వితీయుడగు నీవు ఒక్కడవే మిగిలియుందువు. అట్టి నీవు శేషుడు అను పేరుతో విరాజిల్లుచుందువు.

3.26 (ఇరువది ఆరవ శ్లోకము)

యోఽయం కాలస్తస్య తేఽవ్యక్తబంధో  చేష్టామాహుశ్చేష్టతే యేన విశ్వమ్|

నిమేషాదిర్వత్సరాంతో మహీయాంస్తం త్వేశానం క్షేమధామ ప్రపద్యే॥8357॥

ప్రభూ! నీ వలననే ప్రకృతి ఈ విశ్వమును ప్రవర్తిల్లజేయుచున్నది. కాలము నీ లీలామాత్ర విశేషము. నిమేషము మొదలుకొని, సంవత్సరమునకు అనేక విభాగములతో ఒప్పుచుండెడి ఈ కాలము అనంతమైనది. ఈ కాలగమనమున అనుసరించియే విశ్వము చైతన్యవంతమగుచున్నది. నీవు సర్వశక్తిమంతుడవు. సకల శుభములకును నెలవైనవాడవు. అట్టి నిన్ను శరణుజొచ్చుచున్నాను.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి మూడవ అధ్యాయము ఇంకను కొనసాగును)

3.37 (ముప్పది ఏడవ శ్లోకము)

అమ్మా! అత్యంత భక్తిశ్రద్ధలతో నిరంతరము నన్నే మీ హృదయములయందు స్మరించుచు నిరాహారపూర్వకముగా తీవ్రమైన తపస్సునొనర్చితిరి. అంతట మీ తపశ్చర్యలకు మిగుల పరితుష్టుడనై, వరప్రదుడనైన నేను మీ మనోరథములను ఈడేర్చుటకై ఈ చతుర్భుజరూపమున మీకు సాక్షాత్కరించితిని. 'వరములను కోరుడు' అని పలుకగా, మీరు నావంటి కుమారుని ప్రసాదించవలసినదిగా కాంక్షించితిరి.

మీరు తుచ్ఛములైన విషయసుఖముల స్పర్శలేనట్టి పవిత్ర దంపతులు. అట్టి మీరు మోక్షప్రదుడనైన నేను ప్రత్యక్షమైనప్పుడు ముక్తిని కోరక సంతానములేని కారణమున, నా మాయలోబడి పుత్రుడనే వాంఛించితిరి.

జననీ! మీరు నా వంటి పుత్రుని వరముగా కోరుకొనిన పిదప నేను అచటినుండి అంతర్ధానమైతిని. ఇట్లు సఫలమనోరథులైన పిమ్మట మీరు లౌకిక విషయసుఖములను ఆదరించితిరి.

మాతా! శీలము, ఔదార్యము మొదలగు ఉదాత్త లక్షణములు గలవాడు నా యంతటి వాడు మఱి యొకడు లేనందున నేనే మీకు సుతుడనై పృశ్నిగర్భుడు అను పేరుతో ఖ్యాతి వహించితిని.

తరువాతి జన్మమున నీవు అదితి విగను, సుతపుడు కశ్యపుడు గను పుట్టితిరి. అప్పుడు మీకు నేను ఉపేంద్రుడు అను పేరుతో పుత్రుడనైతిని. పొట్టివాడను అగుట వలన వామనుడు అను పేరున వ్యవహరింపబడితిని.

సాధ్వీమణీ! ఈ మూడవజన్మమున నేను మీయందు అదే చతుర్భుజ రూపముతో ఆచరించితిని. నా మాట ముమ్మాటికిని సత్యము (నా మాటను నేను నిలబెట్టుకొంటిని). నా పూర్వజన్మల గూర్చి మీకు తెలుపుటకొరకే నా చతుర్భుజ రూపమున ప్రదర్శించితిని. లేనిచో (నేను మానవ శరీరముతో జన్మించినచో) నా అవతారవైశిష్ట్యమును మీరు గుర్తింపజాలరు. మీరు ఎల్లప్పుడును నన్ను పుత్రభావము తోడనే వాత్సల్యపూర్వకముగా ఆదరించుచున్నను, అప్ఫుడప్ఫుడు నన్ను పరబ్రహ్మముగా భావించినచో (స్మరించినచో) నా పరమగతిని (నా పరంధామమును) పొందగలరు".

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి మూడవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

13.11.2020   ప్రాతః కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

దశమస్కంధము - పూర్వార్ధము - మూడవ అధ్యాయము

శ్రీకృష్ణభగవానుడు ఆవిర్భవించుట

ఓం నమో భగవతే వాసుదేవాయ

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

3.37 (ముప్పది ఏడవ శ్లోకము)

తదా వాం పరితుష్టోఽహమమునా వపుషానఘే|

తపసా శ్రద్ధయా నిత్యం భక్త్యా చ హృది భావితః॥8368॥

3.38 (ముప్పది ఎనిమిదవ శ్లోకము)

ప్రాదురాసం వరదరాడ్ యువయోః కామదిత్సయా|

వ్రియతాం వర ఇత్యుక్తే మాదృశో వాం వృతః సుతః॥8369॥

అమ్మా! అత్యంత భక్తిశ్రద్ధలతో నిరంతరము నన్నే మీ హృదయములయందు స్మరించుచు నిరాహారపూర్వకముగా తీవ్రమైన తపస్సునొనర్చితిరి. అంతట మీ తపశ్చర్యలకు మిగుల పరితుష్టుడనై, వరప్రదుడనైన నేను మీ మనోరథములను ఈడేర్చుటకై ఈ చతుర్భుజరూపమున మీకు సాక్షాత్కరించితిని. 'వరములను కోరుడు' అని పలుకగా, మీరు నావంటి కుమారుని ప్రసాదించవలసినదిగా కాంక్షించితిరి.

3.39 (ముప్పది తొమ్మిదవ శ్లోకము)

అజుష్టగ్రామ్యవిషయావనపత్యౌ చ దంపతీ|

న వవ్రాథేఽపవర్గం మే మోహితౌ మమ మాయయా॥8370॥

మీరు తుచ్ఛములైన విషయసుఖముల స్పర్శలేనట్టి పవిత్ర దంపతులు. అట్టి మీరు మోక్షప్రదుడనైన నేను ప్రత్యక్షమైనప్పుడు ముక్తిని కోరక సంతానములేని కారణమున, నా మాయలోబడి పుత్రుడనే వాంఛించితిరి.

3.40 (నలుబదియవ శ్లోకము)

గతే మయి యువాం లబ్ధ్వా వరం మత్సదృశం సుతమ్|

గ్రామ్యాన్ భోగానభుంజాథాం యువాం ప్రాప్తమనోరథౌ॥8371॥

జననీ! మీరు నా వంటి పుత్రుని వరముగా కోరుకొనిన పిదప నేను అచటినుండి అంతర్ధానమైతిని. ఇట్లు సఫలమనోరథులైన పిమ్మట మీరు లౌకిక విషయసుఖములను ఆదరించితిరి.

3.41 (నలుబది ఒకటవ శ్లోకము)

అదృష్ట్వాన్యతమం లోకే శీలౌదార్యగుణైః సమమ్|

అహం సుతో వామభవం పృశ్నిగర్భ ఇతి శ్రుతః॥8372॥

మాతా! శీలము, ఔదార్యము మొదలగు ఉదాత్త లక్షణములు గలవాడు నా యంతటి వాడు మఱి యొకడు లేనందున నేనే మీకు సుతుడనై పృశ్నిగర్భుడు అను పేరుతో ఖ్యాతి వహించితిని.

3.42 (నలుబది రెండవ శ్లోకము)

తయోర్వాం పునరేవాహమదిత్యామాస కశ్యపాత్|

ఉపేంద్ర ఇతి విఖ్యాతో వామనత్వాచ్చ వామనః॥8373॥

తరువాతి జన్మమున నీవు అదితి విగను, సుతపుడు కశ్యపుడు గను పుట్టితిరి. అప్పుడు మీకు నేను ఉపేంద్రుడు అను పేరుతో పుత్రుడనైతిని. పొట్టివాడను అగుట వలన వామనుడు అను పేరున వ్యవహరింపబడితిని.

3.43 (నలుబది మూడవ శ్లోకము)

తృతీయేఽస్మిన్ భవేఽహం వై తేనైవ వపుషాథ వామ్|

జాతో భూయస్తయోరేవ సత్యం మే వ్యాహృతం సతి॥8374॥

3.44 (నలుబది నాలుగవ శ్లోకము)

ఏతద్వాం దర్శితం రూపం ప్రాగ్జన్మస్మరణాయ మే|

నాన్యథా మద్భవం జ్ఞానం మర్త్యలింగేన జాయతే॥8375॥

3.45 (నలుబది ఐదవ శ్లోకము)

యువాం మాం పుత్రభావేన బ్రహ్మభావేన చాసకృత్|

చింతయంతౌ కృతస్నేహౌ యాస్యేథే మద్గతిం పరామ్॥8376॥

సాధ్వీమణీ! ఈ మూడవజన్మమున నేను మీయందు అదే చతుర్భుజ రూపముతో ఆచరించితిని. నా మాట ముమ్మాటికిని సత్యము (నా మాటను నేను నిలబెట్టుకొంటిని). నా పూర్వజన్మల గూర్చి మీకు తెలుపుటకొరకే నా చతుర్భుజ రూపమున ప్రదర్శించితిని. లేనిచో (నేను మానవ శరీరముతో జన్మించినచో) నా అవతారవైశిష్ట్యమును మీరు గుర్తింపజాలరు. మీరు ఎల్లప్పుడును నన్ను పుత్రభావము తోడనే వాత్సల్యపూర్వకముగా ఆదరించుచున్నను, అప్ఫుడప్ఫుడు నన్ను పరబ్రహ్మముగా భావించినచో (స్మరించినచో) నా పరమగతిని (నా పరంధామమును) పొందగలరు".

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి మూడవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి మూడవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

No comments:

Post a Comment