Thursday, 4 January 2024




శ్రీ దేవీ శతకము, ( వివిధ వృత్తములు.. అంత్యాను ప్రాస )


01..శ్రీమతా.. (భ ర భ భ భ మ....10)


సేవలు చేసెదా నిత్యము చేరి భజింతును నీ చెంతన్

భావము బంధమున్ సత్యము భాగ్యము నీదయ శీఘ్రoబున్

నావల జీవిత ధ్యానము నామది శోభల ధైర్యమ్మున్

నీవిధి మార్గమే మాకును నిచ్చ లొ సంగుమ శ్రీదేవీ            1


02..అంగన ( భ భ భ భ భ మ...7,13) 


నిత్యము కాంతిగ నిర్ణయమున్ కడు నిర్మల ధ్యానమ్మున్

సత్యపు పల్కులు సాధ్యముగన్ కడు సమ్మతి బంధమ్మున్

ముత్యము వెల్గులు ముందరగన్ కడు ముఖ్యము సంతృప్తిన్

సత్యము తెల్పితి సాధన శోధన సన్నుతి శ్రీదేవీ               2


03..చిత్ర లేఖా ( మ న న త త మ..12)


తల్లీ నీపదముల కళ వెల్గొంద తేజోమయంబౌచున్

కల్లోలమ్ముల కదలిక కావ్యంగ కామ్యమ్ము పెంపొందున్

సల్లాపంబల సమయము సంతోషమై ప్రేమతో కూడున్

ఉల్లమ్మున్ కదలికయగు విద్యా సుఖమ్మగు శ్రీదేవీ          3


04..ప్రఫుల్ల కదళీ (జ స  మ గ గ..8)..8


త్రి మూర్తుల కళల్లో శ్రీ విద్యా నీ

యమోఘ సహనమ్మున్ హర్షంబౌ నీ

సమోన్నత విదీ విశ్వాసం బౌ నీ

ప్రమోదముగనే పాఠ్యల్ శ్రీదేవీ                                    4


05..శిఖండితం..2( జ స ర గ గ..7)


సువాక్కు సుఖదా భుక్తితీర్ధమ్మున్

సువీక్షణములే సుందరమ్ముగాన్

భవమ్ము కలుగున్ భాగ్య మోక్షమ్మున్ 

నవాభ్యుదయమున్ నాంది శ్రీదేవీ...                            5

శ్రీ దేవీ శతకము, ( వివిధ వృత్తములు.. అంత్యాను ప్రాస ).2


06..వీరాంతా (జ స మ గ. యతి..7)


విహారి విధిగా విధ్యే శాంతీ 

సహాయ మదిగా సాగెన్ జ్యోతీ

మహీన తలపే మాయా ఖ్యాతీ

మహా ముదసౌమ్యా శ్రీదేవీ                                       6


07..అయోఘ మాలిక..2 (జ ర య గ గ.. యతి 7)


త్రిమూర్తులే సహావిధి సద్భావమ్మున్

సమాన కర్తలై సహ సామర్ధ్యమ్మున్

ప్రమాణ మే సుధీ ప్రభ లావణ్యమ్మున్

అమోఘ శక్తి యే జయమే శ్రీదేవీ                               7


08..నీల (భ భ మ గ గ.. యతి 7)


అమ్మవు నీకరుణా లోకాల్ చల్లన్

నమ్మిన వారికి నాణ్యత్వా యుక్తిన్

నెమ్మెద భక్తియు నిర్మాణాత్వమ్మున్

అమ్మగ వేడెద యాశల్ శ్రీదేవీ                                  8


09..ఇంద్ర (జ జ య గా.. యతి..6)


వినోదము గా విలసల్లంగన్

నినాదము గా నిలసంఘమ్మున్

సనాతన విశ్వ సుఖత్వంమ్మున్

మనోహరమై మది శ్రీదేవీ                                       9


10..సంప.. (త న మ మ.. యతి..9)


కారుణ్య సహన సద్భాగ్యా కావ్యమ్మున్

దారిద్ర సమయ సంతోషా దానంమ్మున్

ప్రారంభ ప్రణవ నాదంబే పాశంమ్మున్

శ్రీరంగ చరిత బంధమ్మున్ శ్రీదేవీ                          10


11.. పంక్తి రథ (త జ యగ..యతి..6)


సంక్షోభములన్ సడలించంగన్

సంక్షేమములన్ జరిపించంగన్ 

సంక్షిప్తములై జనయిష్టంమ్మున్ 

సంక్షేమముగన్ జయ శ్రీదేవీ                               11


12..వివర విలసితం ( త న స మ.. యతి..6)


సాంబాసహనమ్ము మదిగా జీవాత్మల్ 

ప్రాబల్య మగు పాఠము కామ్యార్ధ్యంబుల్

శంభో మహిమ సర్వత సాహిత్యంబుల్

అంబా కరుణ హసితమ్మున్ శ్రీదేవీ            


13..ఆరాధినీ (త మ మ గ గ.. యతి..7)


లోకాలు యానందా లోలత్వమ్మేలే

కాలమ్ము సన్మార్గా కామ్యత్వమ్మేలే

జ్వాలా మనోమాయే జడ్యత్వమ్మేలే

లీలా మనస్సేలే లీలా శ్రీదేవీ             


14..లోద్రసిఖా విలంభిత మధ్యా (మ స స గ గ.. యతి 7)


విద్యార్ధీ యనుటే వినయమ్మేలే

హృద్యమ్మే కదిలే యభయమ్మే లే

పద్యమ్మే కళలై పలుకౌయేలే

వేదమ్మే తెలిపే విధి శ్రీదేవీ      


15..మేఘధ్వని పూర: (త య మ గ గ ..యతి..7)


సర్వార్ధము తెల్పా సంఘర్షంమౌలే

గర్వంబునె మర్చే గమ్యం దృష్టేలే

నిర్వేదము చెందే నిర్ముల్యమ్మే లే 

పర్వంబగు ప్రీతిన్ పాఠం శ్రీదేవీ       


16..కువలయమాలా (మ న య గ.. యతి..7)


నీవే సృష్టి జనని హృద్యమ్మున్ 

యావేశంబలను హరింపంగన్

నీవే యుక్తి రమణి విశ్వాసిన్

సేవింపంగ జయము శ్రీదేవీ               


17..బంధక (భ న మ గ.. యతి..6)


నల్లని కరుణ దేహమ్మున్ గా

తెల్లని సుదతి దాహమ్మున్ గా

మల్లెలు తురిమె కాలమ్మున్ గా

సల్లలిత విషయాల్ శ్రీదేవీ             


18..నిర్మేధ (న త మ గ.. యతి.. 7)


సకల ధర్మమ్ము సామర్ధ్యoమున్

ప్రకటనే సత్య ప్రా రబ్దoమ్మున్

వికట మౌనత్వ విశ్వార్ధంమున్ 

మకుటమై నిత్య మార్గం శ్రీదేవీ       


19..విపుల భుజ (న జ య గ.. యతి..7)


తెలుపగ చేసితి కార్యమ్మున్

పలుకగ పంచు పదార్ధమ్మున్

కళలను జూపు కళాత్మాగన్

కలువల కళ్లుగ శ్రీదేవీ               


20..బోధా తారా (య మ య గ.. యతి..7)


సమాధానమ్మున్ గా సహాయమ్మున్

సమాచారమ్మున్ గా సమర్ధ0మ్మున్

క్షేమమ్మున్ నిచ్చున్ గా క్షమార్ధమ్మున్

క్షామoమ్మున్ తొల్చున్ రక్ష శ్రీదేవీ


21.. శేషావలీ(య మ మ గ.. యతి..7)


సహాయమ్మున్ విద్యా సామర్ధ్యమ్మున్

సుహాసంబై సత్యా శోభల్ చేరుణ్

మహాదేవా ప్రేమా మార్గమ్ముగాన్ 

మహీ సాహిత్యమ్మున్ మా శ్రీదేవీ


22.. విద్యున్మాలా (మ మ గ గ  యతి..5)


ప్రారబ్దం మ్మే ప్రామాన్యామౌ

నిర్వేదం మ్మే నిర్మూ లంమౌ

సర్వార్ధం మ్మే సమ్మోహంమౌ

కార్యార్ధం దక్షా శ్రీదేవీ


23..మధ్యా దారః (మ భ  మ గ..7)


పద్యమ్ముల్ గద్యము వ్రాయన్ భక్తీ

హృద్యమ్ముల్ సర్వము హేలన్ యుక్తీ

స్వార్ధమ్ముల్ నిత్యము సాధ్యా ముక్తీ

పాద్యంబుల్ ప్రీతి గనే శ్రీదేవీ


24.. లక్షణలీల(భ త మ గ గ.. యతి..8)


సాధన సాధ్యమ్ము విశ్వాసమ్మే లే

భోధన భోజ్యమ్ము ప్రభోదమ్మేలే

మాధవ సాహిత్యమ్ము మౌనమ్మే లే

శ్రీధర శ్రీ మూర్తి గ శ్రీ శ్రీదేవీ


25 ..రోచక (భ భ ర గ గ ..7 )


కాలమనోభవ కామ్యమే శోభల్    

జ్వాలవినోద సజాతియే శోభల్      

మాల సువాసన మార్గమే శోభల్ 

హేళన డెందము వేడ్క శ్రీదేవీ


26 ..ఉద్ధతికరీ (మ య మ గ గ .. యతి 8 )

     

నుత్సాహంబు దేహమ్మున్ యుత్తేజంబై 

ప్రోత్సాహంబు మార్గమ్మున్ లోలత్వబై 

సత్సా0గత్యమే విద్యా సామర్ద్యంబై 

ఉత్సారించా బుద్ధుల్ ధ్యానో శ్రీదేవీ 


27 .. కందవినోద:(భ మ స గ గ .. యతి ..7 )


భక్తిని పొందే చిత్తముగా చేరన్

యుక్తిని పంచే శ్రీయుతమై కోరెన్

శక్తి నొసంగన్ విశ్వముగా ప్రేరన్

ముక్తిని కోరేజామున శ్రీదేవీ 


28 .. సుధాధార (ర న ర గ గ , యతి ..8 )


ధ్యానయుక్తిగను బోధనే తెల్పే  

ప్రాణశక్తిగను  శోభ నే నిల్పే

మానముక్తిగను ప్రేమనే నిల్పే 

వానమల్లెగతి సేవ శ్రీదేవీ 


29 .. ద్వారవహా ( ర త య గ .. యతి.. 5 )


కోరుచుందున్ కూర్మిని సత్యంమై 

భారముల్ స్వాభావ్యత  ముఖ్యంమై 

నేరముల్ మానమ్ముగ  తత్వం మై

ప్రేరణే సాపేక్షగ శ్రీదేవీ 


౩౦..కూలచారిని (ర జ మ గ గ ..యతి ..6 )


సవ్యదేశమే సమాధానమ్మేలే 

భవ్య మార్గమే బలంబుల్ యాటేలే            

నవ్య నాణ్యతే నయంమౌ సేవేలే

దివ్య సాధనే దినంమౌ శ్రీదేవీ 


31 .. కలాపాంతరిత (య స య గ .. యతి ..7 )

 

సుఖమ్మున్  నవవిశ్వ జీవమ్మున్ 

ప్రకాశమ్ము మదీ ప్రభావంమ్మున్             

 అకాలమ్ము గతీ యధా శక్తిన్     

వికాసమ్ము సుకీర్తి శ్రీదేవీ 


32 .. కోశితకుశలా (భ స  స గ గ .. యతి ..7 )


అందముగతిగా యనకే ప్రేమా 

బిందు నివసితా ప్రియమున్ ప్రేమా 

సుందరవదనా శుభమున్ ప్రేమా 

మందగమన యమ్మవు శ్రీదేవీ    


౩౩.. భూరిఘటకము (మ న మ గ గ ..యతి 7 ) 


చేసేదే పలుకు చేష్టాయిష్టమ్మున్ 

వేసేదే తెలుపు వేషమ్మే సొమ్మున్ 

కూసేదే తలపు సూత్రమ్మే తెల్పున్ 

మేసేదే బ్రతుకు మోక్ష శ్రీదేవీ 


34 .. కడారము (య న య గగ .. యతి ..8 )


సహాయమ్ము గతి సమత్వమ్మేలే

ప్రహాసమ్ము విధి ప్రభావమ్మే లే 

విహారమ్ము నిధి విధానమ్మే లే

సహాయమ్ము మది సతీ శ్రీదేవీ 


35 .. ధూమ్రాలీ (య య మ గ .. యతి .. 8 )


తరంబౌ తమమ్మేలే తత్వా  శ్రీ 

కరంబౌ సమమ్మేలే కామ్యా  శ్రీ 

వారంబౌ క్షమమ్మేలే వత్సా శ్రీ 

మొరాలించుమమ్మేలే శ్రీదేవీ


36..పద్మినీ (ర  మ  య  గ..6)


కాలమున్ సేవల్ కాన రుద్రాణీ

గాళమున్ చెక్కెన్ కాన భవ్యాణీ

జ్వాలగన్ నుండెన్ కాన భద్రాణీ

హేళగన్ కాదున్ కాన శ్రీదేవీ


37..పల్లవీ విలాస ( ర య య గ గ.. యతి..7)


సర్వరక్ష నెంచే సహాయ్యమ్ముగాన్ 

కార్య భారమేనే గళమ్మున్ తెల్పేన్

నిర్వి రామవాక్కే నిజమ్మున శాంతిన్

సర్వ మిచ్చెదన్ సంఘమై శ్రీదేవీ


38.. లలితాలబాలము (స జ య గ గ..9)


పలికించ లోక జనుల్ భావా లే

విలపించ విశ్వ ముదం విద్యా లే

తలపించ తత్త్వమదం తప్పే లే

కళలేను కామ్య యుగం శ్రీదేవీ


39.. సంస్కృత శోభాసారము ( స  త  య  గ గ.. యతి..5)


నిలవంగన్ నిత్యము శోభింపంగన్

తలవంగన్ తత్త్వము వైభోగంబున్

పలకంగన్ పాఠము నేత్రత్వంబున్ 

తలపోయన్ తత్పరగా శ్రీదేవీ


40.. దారదేహ (ర ర ర గ గ.. యతి..7)


ఏవగించే విదీ యేమి చెప్పేనన్

సావధానమ్ మదీ స్వామి తీర్పేనన్

భావ మార్గమ్ యదీ భాగ్య మార్పేనన్ 

సేవ భావమ్ స్థితీ సాధ్య శ్రీదేవీ


సుధాధారా.. (ర న  ర  గ గ  యతి..8)


ధ్యానమేగతివిధీ సుధాశోభల్

మానమేసకల సాధుమౌనమ్ముల్

వైనతీయ విధి విద్య వేషమ్ముల్ 

ప్రాణమై స్వరసు పూజ శ్రీదేవీ  


41..ఉధిత దినేశము (స న య గగ.. యతి..7)

కలి కాలమున కనంగన్ జీవుల్

పలు మాటలగు పరాదీనంబుల్

కలతల్ కలుగు కథా రాగంబుల్

వెలితిన్ భువిన విధీ శ్రీదేవీ


42..సౌదాంఘ్రి 

(స భ య గ గ.. యతి..7)


వెతలన్ దీర్చుము వివేకంమౌనే

సుతులన్ జూడుము సుమంత్రం మౌనే

గతులన్ తప్పవు గవాక్షం మ్మోనే

స్థితులన్ జూడక స్థిరం శ్రీదేవీ


43.. జాల పాదము (స మ ర గ గ.. యతి..7)


వివిధంభౌ సౌఖ్యా విద్యమంత్రమ్మున్ 

వివరంమౌ సేవా విద్య తంత్రమ్మున్

నవరత్నౌ ధర్మా నమ్మ మందీయున్

వివరంచమ్మా సర్వార్ధ శ్రీదేవీ


44.. ఉపయోధ.. (స ర మ గ గ.. యతి 7)


పలుకే నీ దయా ప్రాప్తిన్ భక్తిన్

తలపే నీ కృపా తృప్తిన్ శక్తిన్

మలుపే నీ మదీ మార్గం యుక్తిన్

పిలుపే na గతీ శ్రీ శ్రీదేవీ


45.. లలితాగమనము (స స య గ గ.. యతి..7)


తరుణమ్ము మదీ తపమ్మే యుక్తిన్ 

చరణమ్ము విధీ చరిత్రే సమమ్మున్

కరుణా వివిధా కథల్లే శక్తిన్

అరునోదయ సేవ గన్ శ్రీదేవీ



46 ..విష్టంభ: గగన (స స స గ గ .. యతి ..6 )


తరుణంబున తామసమే పొందెన్ 

కరుణించని కాలమనే పోరున్ 

దరిచేర్చని దానమునే జేయన్

 తరియించెను తానుగ శ్రీదేవీ


47.. అంతర్వణిత ( మా స మా గ గ ..7)


న్యాయంబున్ విడువన్  నాశంబౌ కల్గుణ్

ప్రాయంబంత విధీ పాశంబౌ కల్గుణ్ 

మాయంబంత మధీ మాంద్యంమే కల్గుణ్ 

సాయంబీయుసదా సాద్వీ శ్రీదేవీ 


48 ..ధవళ కరి జ్వాలా(న న భ మ యతి 7 )


క్షణమగు విధి క్షేమము కోరేలే

ఋణమగు నిధి రొక్కము కోరేలే 

మునకలగుచు మోదము కోరేలే 

నినుకొలుతురు నెమ్మిగ శ్రీదేవీ 

      

49 .. కాంతోత్పిడా (భ మ స మ .. యతి 7 )


కాలము సత్యంమే కధగా కావ్యం మై 

గాలము నిత్యంమే గళమే సంతంమై

మేళము మార్గంమై మనసే మంత్రంమై

వేళలు నిత్యంబున్ వసుధన్ శ్రీ దేవీ


50 .. భాసిత భరణం (భ స మ మ యతి ..9 )


మాయల మదిలో ధర్యంమే మార్గమ్మున్ 

న్యాయము విధిగా సత్య్మమే నామమ్మున్ 

ప్రాయము సహజ త్యంమేలే పాశమ్మున్               

సాయము కరుణా కామ్యమ్మేలే శ్రీదేవీ 


.మత్తాలీ (మ త య య... యతి 6)


అందమ్మున్ నీవే యలరారంగా విద్యన్

పందాలై సర్వా పయనంమౌ శక్తిన్ 

చిందాడెన్ శోభల్ స్థిర మాయా మోహమ్మున్

సందర్భా భక్తీ సమ సేవా శ్రీదేవీ


52.. మలయసురభి :(మ న న మ..8)


సేవాభావమగు రసము నిత్యమ్మున్

భావావేశమగు సభలు సత్యమ్మున్

చావోపుట్టుకయు సుజన తత్త్వమ్మున్

తావేదీ తెలప జతకు శ్రీదేవీ


53.. విశాలాంభోజాలీ (త న య మ.. యతి 7)


ధ్యానమ్మగు విధి దాత్రుత్వా సేవల్

వైనమ్మగు మది వాశ్చల్యా శోభల్

మౌనమ్మగు గతి మోహంమౌ మాయల్

ప్రాణంమౌ స్థితి ప్రేమా శ్రీదేవీ


54.. జ ల ధ ర మాల (మ భ స మ.. యతి.9)

స్వేచ్చా బావమ్మగు మనసే మార్గమ్మున్

ఇచ్ఛాబ్రాంతీ మనసుగతీ కర్మమ్మున్ 

ప్రోచ్చాహమ్మగుట సమపోరే నేర్పున్

యుచ్చాహమ్మగుట విధియు శ్రీదేవీ


55.. కింసు కాస్తరణం (ర స య మ.. యతి 7)


సాధనే మనసై సమస్యా తీర్పేలే

వేదనా విధిగా విపంచీ మార్పేలే

శోధనా సమపాశ సొమ్మున్ నేర్పేలే

భేదమే వలదే భయమ్మున్ శ్రీదేవీ

           


 

                  

(తప్పులు తెలుపగలరు) 



Wednesday, 3 January 2024



డాక్టర్ మురుగేశ్:- స్వామి! నా ప్రాక్టీస్ బాగా జరిగేటట్టు ఆశీర్వదించండి?


సద్గురు:- అంటే లోకంలో రోగులు పెరగాలనా నీ ఉద్దేశ్యం? ఈ విధమైన ప్రార్థన సరికాదు. నిన్ను అనుగ్రహించడానికి గాను భగవంతుడే రోగి రూపంలో వస్తాడని ఎరుక కలిగి వైద్యం చేయి.


పట్టెయ్య:- ఈ ఆధ్యాత్మిక జ్ఞానం వలన దేనికి అంటని స్థితి నాకు కలిగిందండీ..‌


సద్గురు:- మంచిది. ఇక పట్టెయ్యను కూడా అంటని స్థితిని సాధించు...

..


➡️ ఒక్క అడుగు ముందుకేసి (బహిర్ముఖం) దేవుడు జీవుడైనాడు.

➡️ ఒక్క అడుగు వెనక్కి వేస్తే చాలు (అంతర్ముఖం) జీవుడు దేవుడవుతాడు.


👉 ఒక్క అడుగు ముందుకేసింది ఎలాగు? 'నేను ప్రవీణ్' అనడంతో....

👉 ఒక్క అడుగు వెనుకకు వేయడం ఎలాగు? 'వీడు ప్రవీణ్' అనడంతో....

..


👉 ఒకరు చెట్టు ఎక్కి ఫలాన్ని పొందుతారు - ఇతను కర్మయోగి. ఉదా:- గౌతమ బుద్ధుడు


👉 ఇంకొకరు వేరొకరి ద్వారా కోయించుకుని ఫలాన్ని పొందుతారు - ఇతను భక్తి యోగి. ఉదా:- శ్రీ రామకృష్ణ పరమహంస 


👉 మరొకరు అప్రయత్నంగా రాలిన పండును పొందుతారు - అతను జ్ఞాన యోగి. ఉదా:- శ్రీరమణమహర్షి

......

👉 జరుగుతున్న వాటికి కర్తృత్వాన్ని నీ నెత్తిన వేసుకున్నప్పుడు వాడే పదం - ప్రారబ్ధం.


👉 దేవుని మీద వేసినప్పుడు వాడే పదం - భగవదిచ్ఛ. 


👉 ఏది అర్థం కాక ఉన్నప్పుడు వాడే పదం - విధి.


 ఈ మూడింటి అర్థం 'నీ చేతిలో ఏమి లేదు' అనే.

......

ధ్యానం మూర్ఖులను కూడా ఋషులుగా మారుస్తుంది.


దురదృష్టవశాత్తు మూర్ఖులు ఎన్నడూ ధ్యానం చేయరు.

.....

ఎలాంటి క్లిష్ట పరిస్థితి అయినా సరే.,

➡️ నీటి మీద గీతలా తీసుకో

➡️ నుదుటి మీద వ్రాతలా తీసుకోకు.

 అదే జ్ఞాని లక్షణం.

......

➡️ చేతన శక్తి (Spirit) తక్కువగా వ్యక్తమవుతున్న దాన్ని జడం (Matter) అని,

➡️ చేతన శక్తి ఎక్కువగా అభివ్యక్తమవుతున్న దాన్ని సజీవం (Living) అని అంటాం.


సర్వకాల సర్వావస్థల్లోనూ అచేతనంగా ఉండేది ఏదీ లేదు.

.....


పదార్థాన్ని అన్వేషిస్తుంది ఆధునిక విజ్ఞానం.


యదార్ధాన్ని ఆవిష్కరిస్తుంది ఆధ్యాత్మిక జ్ఞానం.


..


చావు:-


➡ చనిపోవడం అంటే శరీరాన్ని వదలడమే.

➡ చనిపోవడం అంటే మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మార్చడమే.

➡ చనిపోవడం అంటే మరో నూతన ప్రపంచం చేరడమే.

......


వెలుపల (వ్యవహారంలో) వ్యక్తిగానే ఉండాలి.


లోపల (అనుభవంలో) సర్వత్రా తానే అయి ఉండాలి.

.......

ఇతరులు మన గురించి  ఏమనుకున్నా సరే చలించని స్థితి మనకు కలిగినప్పుడు;


ఇతరుల మనస్సుల్లో ఉన్న తలంపులను(ఆలోచనలను) చదవగలిగే సిద్ధి సహజంగానే  మనకు కలుగుతుంది.

.....

తనువే తాను అనుకోవడమే పెద్ద రోగం.


మిగతా రోగాలన్నీ  రోగానికి(తనువుకి) వచ్చే రోగాలే.

......

➡️ బొమ్మ - కొయ్యను మరిపిస్తుంది;

➡️ ఆభరణం - బంగారాన్ని మరిపిస్తుంది;

➡️ అల - జలాన్ని మరిపిస్తుంది.


అలాగే నామరూపాలు - స్వరూపాన్ని మరిపిస్తుంది.

......

ఈ సృష్టి ఎందుకు జరిగింది? అని అడగడం ఎలాంటిదంటే;


నేను ఎందుకు ఇలాంటి కలను కన్నాను? అని అడగడం లాంటిదే.

......

'నేను ఎవరు'? అన్న ప్రశ్నలోనే సమాధానం ఉంది!


➡️ ప్రశ్న - ఎవరు?

➡️ సమాధానం - నేను.

.......


కర్మం ముందా? జన్మ ముందా?


 👉 అజ్ఞానం ముందు.

అజ్ఞానం వల్ల జన్మ.,  జన్మ వలన కర్మలు.

👉 జ్ఞానం అంతిమం.

 జ్ఞానం వల్ల నిష్కామ కర్మ., నిష్కామ కర్మ వలన జన్మరాహిత్యం.

.......


👉 'వర్తమానం'లో ఉండడమే- పాజిటివ్ ఎనర్జీ 


👉 'భూత, భవిష్యత్తు' లో ఉండడమే- నెగిటివ్ ఎనర్జీ


✳ ఏకంగా కనిపిస్తూ అనేకంగా ఉండేది -- అండం


✳ అనేకంగా కనిపిస్తూ ఏకంగా ఉండేది -- బ్రహ్మాండం


పిచ్చివాడు, అవధూత ఒకలాగే కనిపిస్తారు.


➡ పిచ్చివాడు - ఆలోచన చేయలేనివాడు

➡ అవధూత - ఆలోచనతో పని లేని వాడు


ప్రశ్న:- ఏది బంధం? ఏది మోక్షం?


సద్గురు:- ఉన్నది అంతా భగవద్రూపమే అని ఎరుగుట మోక్షం.,  మరచుట బంధం.


గురువు ఐశ్వర్యం (జ్ఞానము) బిడ్డలకు వెళ్లదు, శిష్యులకు వెళ్ళిపోతుంది.


 బిడ్డ అయినా సరే, శిష్యుడిగా ఉంటేనే జ్ఞాన ఐశ్వర్యం పొందగలరు.


👉 ఊరక ఉండడం మాయకు తెలియదు.

👉 కదలడం పరబ్రహ్మానికి తెలియదు.


 ఈ రెంటి స్పర్శతో పుట్టినవాడే జీవుడు.


 ✳ అందువల్లనే జీవుడు బంధ, మోక్షములకు మధ్య ఊగిసలాడుతుంటాడు.


దేవుడు ఏకమా?  అనేకమా?


'బంగారం'గా(పరమాత్మగా) ఏకం;

'ఆభరణాలు'గా(జీవాత్మలుగా) అనేకం.

.....

దేవుడు ఏకమా?  అనేకమా?


'బంగారం'గా(పరమాత్మగా) ఏకం;

'ఆభరణాలు'గా(జీవాత్మలుగా) అనేకం.


👉 సన్యాసి గృహస్తునకు 'జ్ఞాన భిక్ష' పెడతాడు.

👉 గృహస్తు సన్యాసికి 'అన్న భిక్ష' పెడతాడు.

--- ఇద్దరు గొప్పే.


(జ్ఞాన భిక్షతో 'పూర్ణం' అవుతారు.

అన్న భిక్షతో 'జీర్ణం' అవుతుంది.)


👉 ఊరక ఉండడం మాయకు తెలియదు.

👉 కదలడం పరబ్రహ్మానికి తెలియదు.


 ఈ రెంటి స్పర్శతో పుట్టినవాడే జీవుడు.


 ✳ అందువల్లనే జీవుడు బంధ, మోక్షములకు మధ్య ఊగిసలాడుతుంటాడు.

..


ఆధ్యాత్మికతయే పెద్ద పరీక్ష. ఎవరి ప్రశ్న పత్రం వారిదే.


➡️ నా ప్రశ్న మీకు రాదు., 

➡️ మీ సమాధానం నాకు పనికి రాదు.

......

ఈ సృష్టి అనేది తిరగేసిన వృక్షం లాంటిది:-


👉 మొదలు (కారణం) అనేది పైన (పరబ్రహ్మంలో) ఉంటుంది.

👉 శాఖలు (కార్యం) అనేవి కింద (ప్రపంచంగా) ఉంటాయి.

......

➡️ ఇంగిత జ్ఞానంను (Common sense) అధిగమించి చూస్తుంది శాస్త్రీయత (Scientific sense)

➡️ శాస్త్రీయతను (Scientific sense) అధిగమించి చూస్తుంది తాత్విక భావం (Philosophical Sense)

➡️ తాత్విక భావంను (Philosophical Sense) అధిగమించి చూస్తుంది ఆధ్యాత్మిక దృష్టి (Mystic Vision)


ఆ ఆధ్యాత్మిక దృష్టి (Mystic Vision) దాకా వెళ్తేనే మహర్షులు, శాస్త్రాలు, వేదాలు ప్రకటించిన అంతటి గొప్ప భావాలు మనకు అనుభవం అయ్యేది.

.......

👉 కెరటం దృష్ట్యా ( నామరూపాల ) మనందరం అశాశ్వతులం.


👉 సముద్రం దృష్ట్యా (ఆత్మ ) మనమందరం శాశ్వతులం.

.......

జాగ్రత్-స్వప్న-సుషుప్తు లనే మూడు పురాలలో (శరీరాల్లో) కామన్ గా ఉండేది 'నేనే' (ఆత్మే) అని తెలుసుకోవడమే 'త్రిపురా రహస్యం'.

.......


➡ జన్మనిచ్చేవాడు  - తండ్రి 


➡ జన్మే లేకుండా చేసేవాడు - సద్గురువు

......

ఏకంగా ఉన్న పరమాత్ముడు అనేకం ఎందుకయ్యాడు?


➡️ ఏకం ఏకంగానే ఉన్నది., చూసేవాడు అనేకంగా చూస్తున్నాడు. 

➡️ బంగారం వైపుకు చూస్తే ఏకం.,  ఆభరణాల వైపుకు చూస్తే అనేకం.

.......ఏకంగా ఉన్న పరమాత్ముడు అనేకం ఎందుకయ్యాడు?


......

అంతఃకరణ చతుష్టయం:-


➡️ మనస్సు - సంకల్ప వికల్పాలు చేసేది 

➡️ బుద్ధి - మంచి, చెడు చెప్పేది

➡️ చిత్తం - నిరంతర చింతన చేసేది

➡️ అహంకారం - నేను, నాది అనేది


యోగ చతుష్టయం:-


➡️ సంకల్ప, వికల్పాలను ఎప్పటికప్పుడు సరిచేసుకుంటూ 'మనస్సు'ని శుద్ధి చేసుకోవడమే - కర్మయోగం.

➡️ 'బుద్ధి'ని సునిశితం చేసుకుంటూ, అంటే నిత్యానిత్య విచక్షణాజ్ఞానాన్ని పెంపొందించుకుంటూ పోవడమే - జ్ఞాన యోగం.

➡️ 'చిత్తవృత్తులను' నిరోధించుకుంటూ కావలసినప్పుడల్లా సమాధి ప్రజ్ఞను పొందడమే - రాజయోగం.

➡️ 'నేను', 'నాది' (అహంకారం) అనే భావాలను పూర్తిగా తుడిచి పెట్టుకుంటూ ఉండడమే - భక్తియోగం. 


మన 'అంతఃకరణ చతుష్టయాన్ని' ఎవరైతే 'యోగ చతుష్టయం' ద్వారా బాగు చేసుకుంటారో వారిని "చతుర్ముఖేన బ్రహ్మ" అని పిలవబడతారు.



➡ చలం(అల) వైపు  దృష్టి పెడితే నీవు జీవుడవు.

➡ అచలం(సముద్రం)  వైపు  దృష్టి పెడితే నీవు శివుడవు.


ఏ వైపు దృష్టి పెట్టాలో... అనే విషయంలో సంపూర్ణ స్వేచ్ఛ జీవునికి ఉంది.,

అందుకే పురుష ప్రయత్నానికి అంత ప్రాముఖ్యత ఇచ్చారు మన పెద్దలు.

ఒకరు:-  మీ శిష్యుడు ఎంతో అదృష్టవంతులండి;

 సదా గురు సన్నిధిలో గడుపుతూ తన జీవితాన్ని ధన్యం చేసుకుంటున్నారు.,

 మేము మీకు ఎంతో దూరంలో ఉంటున్నాము.


 గురువు:-

               అవునవును..

➡ అనారోగ్యవంతుడే డాక్టర్ కు దగ్గరగా ఉంటారు.

➡ ఆరోగ్యవంతులు డాక్టర్ కు దూరంగానే ఉంటారు.


"బాహ్యంలో సంగం -  అంతరంలో నిస్సంగం".

 ఇదే సర్వ వేదాంత సారం.


 👉 సంగం = నువ్వు వేరు, నేను వేరు.

👉 నిస్సంగం = నువ్వు, నేను ఒకటే.


1. ఎట్టి మార్పు లేని వస్తువును (పరబ్రహ్మాన్ని)

 మార్పు కలిగిన వస్తువుగా (ప్రపంచంగా) 

చూసే ''శక్తి" నీలో సహజంగా ఉన్నది.

2. తిరిగి ప్రపంచాన్ని,  బ్రహ్మంగా చూసే "శక్తి" కూడా నీలోనే సహజంగా ఉన్నది.


👉 మొదటి శక్తికి 'మాయ' అని పేరు. 

👉 రెండవ శక్తికి 'జ్ఞానము' అని పేరు.


విశ్వ జీవిత కాలం:-


➡️ కలియుగం - 4,32,000 సంవత్సరాలు 

➡️ ద్వాపర యుగం - 8,64,000 సంవత్సరాలు 

➡️ త్రేతా యుగం - 12,96,000 సంవత్సరాలు

➡️ కృతయుగం - 17,28,000 సంవత్సరాలు 

పై నాలుగు యుగాలను కలపగా 43,20,000 సంవత్సరాలు వచ్చును. దీనిని మహా యుగం లేదా చతుర్ యుగం అని పిలుస్తారు.


➡️ 71 చతుర్ యుగాలు - 1 మన్వంతరం 

➡️ 14 మన్వంతరాలు - 1 కల్పం

➡️ 2 కల్పాలు - 1 అహో రాత్రి

➡️ 360 అహోరాత్రులు - 1 భగవంతుని సంవత్సరం

➡️ 100 భగవంతుని  సంవత్సరాలు - భగవంతుని జీవితకాలం (విశ్వ జీవిత కాలం)


ఇప్పుడు మనం 28వ చతుర్ యుగం, 7 వ మన్వంతరం, 51వ భగవంతుని సంవత్సరంలో ఉన్నాము.

 అనగా 3 కోట్ల 9 లక్షల 15 వేల 376 కోట్ల కోట్ల సంవత్సరములు.


Grand Universe


➡️ కొన్ని గ్రహాల కలయిక  - ఒక సౌర కుటుంబం 

➡️ కొన్ని సౌర కుటుంబాల కలయిక - ఒక నక్షత్ర సముదాయం 

➡️ కొన్ని నక్షత్ర సముదాయాలు - ఒక విశ్వము

➡️ కొన్ని ప్రాంతీయ విశ్వాలు - ఒక మైనర్ సెక్టార్ విశ్వం

➡️ కొన్ని మైనర్ సెక్టార్ విశ్వాలు - ఒక మేజర్ సెక్టార్ విశ్వం

➡️ కొన్ని మేజర్ సెక్టార్ విశ్వాలు - ఒక సూపర్ యూనివర్స్ 

➡️ 7 సూపర్ యూనివర్సులు - ఒక మహా మూల చైతన్యం చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాయి. (Idle of Paradise)




 మన విశ్వం నెబడాన్ సూపర్ యూనివర్స్ లోని ప్లిడియన్ నక్షత్ర సముదాయం లో ఉన్నది.


ఒకరు:-  మీ శిష్యుడు ఎంతో అదృష్టవంతులండి;

 సదా గురు సన్నిధిలో గడుపుతూ తన జీవితాన్ని ధన్యం చేసుకుంటున్నారు.,

 మేము మీకు ఎంతో దూరంలో ఉంటున్నాము.


 గురువు:-

               అవునవును..

➡ అనారోగ్యవంతుడే డాక్టర్ కు దగ్గరగా ఉంటారు.

➡ ఆరోగ్యవంతులు డాక్టర్ కు దూరంగానే ఉంటారు.


"బాహ్యంలో సంగం -  అంతరంలో నిస్సంగం".

 ఇదే సర్వ వేదాంత సారం.


 👉 సంగం = నువ్వు వేరు, నేను వేరు.

👉 నిస్సం


గం = నువ్వు, నేను ఒకటే.


1. ఎట్టి మార్పు లేని వస్తువును (పరబ్రహ్మాన్ని)

 మార్పు కలిగిన వస్తువుగా (ప్రపంచంగా) 

చూసే ''శక్తి" నీలో సహజంగా ఉన్నది.

2. తిరిగి ప్రపంచాన్ని,  బ్రహ్మంగా చూసే "శక్తి" కూడా నీలోనే సహజంగా ఉన్నది.


👉 మొదటి శక్తికి 'మాయ' అని పేరు. 

👉 రెండవ శక్తికి 'జ్ఞానము' అని పేరు.


విశ్వ జీవిత కాలం:-


➡️ కలియుగం - 4,32,000 సంవత్సరాలు 

➡️ ద్వాపర యుగం - 8,64,000 సంవత్సరాలు 

➡️ త్రేతా యుగం - 12,96,000 సంవత్సరాలు

➡️ కృతయుగం - 17,28,000 సంవత్సరాలు 

పై నాలుగు యుగాలను కలపగా 43,20,000 సంవత్సరాలు వచ్చును. దీనిని మహా యుగం లేదా చతుర్ యుగం అని పిలుస్తారు.


➡️ 71 చతుర్ యుగాలు - 1 మన్వంతరం 

➡️ 14 మన్వంతరాలు - 1 కల్పం

➡️ 2 కల్పాలు - 1 అహో రాత్రి

➡️ 360 అహోరాత్రులు - 1 భగవంతుని సంవత్సరం

➡️ 100 భగవంతుని  సంవత్సరాలు - భగవంతుని జీవితకాలం (విశ్వ జీవిత కాలం)


ఇప్పుడు మనం 28వ చతుర్ యుగం, 7 వ మన్వంతరం, 51వ భగవంతుని సంవత్సరంలో ఉన్నాము.

 అనగా 3 కోట్ల 9 లక్షల 15 వేల 376 కోట్ల కోట్ల సంవత్సరములు.


Grand Universe


➡️ కొన్ని గ్రహాల కలయిక  - ఒక సౌర కుటుంబం 

➡️ కొన్ని సౌర కుటుంబాల కలయిక - ఒక నక్షత్ర సముదాయం 

➡️ కొన్ని నక్షత్ర సముదాయాలు - ఒక విశ్వము

➡️ కొన్ని ప్రాంతీయ విశ్వాలు - ఒక మైనర్ సెక్టార్ విశ్వం

➡️ కొన్ని మైనర్ సెక్టార్ విశ్వాలు - ఒక మేజర్ సెక్టార్ విశ్వం

➡️ కొన్ని మేజర్ సెక్టార్ విశ్వాలు - ఒక సూపర్ యూనివర్స్ 

➡️ 7 సూపర్ యూనివర్సులు - ఒక మహా మూల చైతన్యం చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాయి. (Idle of Paradise)


 మన విశ్వం నెబడాన్ సూపర్ యూనివర్స్ లోని ప్లిడియన్ నక్షత్ర సముదాయం లో ఉన్నది.


కూర్మ  పురాణం ప్రకారం:-


➡️ 12×12 = 144 సెకండ్లు మనస్సు నిశ్చలం = ధ్యాన స్థితి.

➡️ 144×12 = 1728 సెకండ్లు(28ని||48సెకం||) మనస్సు నిశ్చలం = సమాధి స్థితి.


మనస్సు శ్వాస వేరు వేరు కాదు.


➡️ శ్వాస ఆగితే మనస్సు ఆగుతుంది.

➡️ మనస్సు ఆగితే శ్వాస ఆగుతుంది.


('రమణ' జయంతి శుభాకాంక్షలతో)


రమణ:-

'మరణ'మునే అక్షరాలు మార్చి 'రమణ' మహర్షిగా వచ్చి మా అహన్ని హతమార్చి,  మా ఆలోచన గతినే "నేను" (ఆత్మ) వైపుకు మరల్చిన నీకు అనంత కోటి వందనాలు.


అంతఃకరణ చతుష్టయం:-


➡️ మనస్సు - సంకల్ప వికల్పాలు చేసేది 

➡️ బుద్ధి - మంచి, చెడు చెప్పేది

➡️ చిత్తం - నిరంతర చింతన చేసేది

➡️ అహంకారం - నేను, నాది అనేది


యోగ చతుష్టయం:-


➡️ సంకల్ప, వికల్పాలను ఎప్పటికప్పుడు సరిచేసుకుంటూ 'మనస్సు'ని శుద్ధి చేసుకోవడమే - కర్మయోగం.

➡️ 'బుద్ధి'ని సునిశితం చేసుకుంటూ, అంటే నిత్యానిత్య విచక్షణాజ్ఞానాన్ని పెంపొందించుకుంటూ పోవడమే - జ్ఞాన యోగం.

➡️ 'చిత్తవృత్తులను' నిరోధించుకుంటూ కావలసినప్పుడల్లా సమాధి ప్రజ్ఞను పొందడమే - రాజయోగం.

➡️ 'నేను', 'నాది' (అహంకారం) అనే భావాలను పూర్తిగా తుడిచి పెట్టుకుంటూ ఉండడమే - భక్తియోగం. 


మన 'అంతఃకరణ చతుష్టయాన్ని' ఎవరైతే 'యోగ చతుష్టయం' ద్వారా బాగు చేసుకుంటారో వారిని "చతుర్ముఖేన బ్రహ్మ" అని పిలవబడతారు.


నేను తెలుసుకోవడం వేరు.,

 'నేను' ను తెలుసుకోవడం వేరు.


➡ నేను తెలుసుకునేది - జ్ఞానం 

➡ 'నేను'ను తెలుసుకునేది - ఆత్మజ్ఞానం


జీవ, జగత్, ఈశ్వరుడు మూడింటి సమిష్టి రూపమే తాను.


మూడో వంతు భాగాన్ని మాత్రమే 'తాన'ని అనుకుంటున్నాడు.

ఈ అసంపూర్ణత వలనే తనకు అసంతృప్తి.


నీ చిత్రం చూసి నా చిత్తం చెదిరి నే చిత్తరువునైైతిరయ్యో

నీ ఛత్రం చూసి నా విత్తం కదలి నే మత్తుపరుపైరయ్యో 

నీ మిత్రం చూసి నా నిత్యం మెరిసినే హత్తుకొను పైరయ్యో

నీ పత్రం చూసి నా సత్యం కలగ నే సత్తు ధన వైరయ్యో


➡ గణిత శాస్త్రంలో గొప్ప ఆవిష్కరణ - సున్న 


➡ భౌతిక శాస్త్రంలో గొప్ప ఆవిష్కరణ - చక్రం


➡ ఆధ్యాత్మిక శాస్త్రంలో గొప్ప ఆవిష్కరణ -  ధ్యానం ( శూన్య స్థితి)


మన జీవితంలోని ఏ సమస్యకు ఆధ్యాత్మికం పరిష్కారం చూపదు.


 సమస్యను సమస్యగా తెలియనీకుండా చేసే "మత్తు మందు" (అనస్తీషియా) లాంటిది ఆధ్యాత్మికం.


అమ్మ :-

మనల్ని, ఆధ్యాత్మిక లోకాల నుండి భౌతిక లోకాలలోనికి తీసుకువచ్చే ఉపకరణం.


గురువు:-

 మనల్ని,  భౌతిక లోకాల నుండి ఆధ్యాత్మిక లోకాలలోనికి పంపే ఉపకరణం.


విశ్వ జీవిత కాలం:-


➡️ కలియుగం - 4,32,000 సంవత్సరాలు 

➡️ ద్వాపర యుగం - 8,64,000 సంవత్సరాలు 

➡️ త్రేతా యుగం - 12,96,000 సంవత్సరాలు

➡️ కృతయుగం - 17,28,000 సంవత్సరాలు 

పై నాలుగు యుగాలను కలపగా 43,20,000 సంవత్సరాలు వచ్చును. దీనిని మహా యుగం లేదా చతుర్ యుగం అని పిలుస్తారు.


➡️ 71 చతుర్ యుగాలు - 1 మన్వంతరం 

➡️ 14 మన్వంతరాలు - 1 కల్పం

➡️ 2 కల్పాలు - 1 అహో రాత్రి

➡️ 360 అహోరాత్రులు - 1 భగవంతుని సంవత్సరం

➡️ 100 భగవంతుని  సంవత్సరాలు - భగవంతుని జీవితకాలం (విశ్వ జీవిత కాలం)


ఇప్పుడు మనం 28వ చతుర్ యుగం, 7 వ మన్వంతరం, 51వ భగవంతుని సంవత్సరంలో ఉన్నాము.

 అనగా 3 కోట్ల 9 లక్షల 15 వేల 376 కోట్ల కోట్ల సంవత్సరములు.


నిర్వాణషట్కం


మనసు, బుద్ధి, అహంకారము, చిత్తము నేను కాను...

చెవి, నాలుక, ముక్కు, కన్ను నేను కాను...

ఆకాశము, భూమి, నిప్పు, గాలి నేను కాను...

చిదానంద రూపుడైన శివుడే నేను...శివుడే నేను...

* * *

ప్రాణము నేను కాను...


ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన మనే

పంచప్రాణములూ నేను కాను...


రక్త, మాంస, మేధో, అస్థి, మజ్జా, రస, శుక్రములనే 

సప్తధాతువులూ నేను కాను...


అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయములనే

పంచకోశములూ నేను కాను...


వాక్కు, పాణి, పాద, పాయు, ఉపస్థలనే 

కర్మేంద్రియములూ నేను కాను...


చిదానందరూపుడైన శివుడే నేను...శివుడే నేను.

* * *

నాకు ద్వేషమూ లేదు...అనురాగమూ లేదు...

నాకు లోభమూ లేదు...మోహమూ లేదు...

మదమూ లేదు...మాత్సర్యమూ లేదు...

ధర్మమూ లేదు...అర్థమూ లేదు...

కామమూ లేదు...మోక్షమూ లేదు...

చిదనందరూపుడైన శివుడే నేను...శివుడే నేను...

* * *

నాకు పుణ్యమూ లేదు...పాపమూ లేదు...

సుఖమూ లేదు...దుఃఖమూ లేదు...

మంత్రమూ లేదు...తీర్థమూ లేదు...

వేదములూ లేవు...యజ్ఞములూ లేవు...

నేను భోజనము కాను...తినతగిన పదార్థము కాను...

తినేవాడనూ కాను...

చిదానందరూపుడైన శివుడే నేను...శివుడే నేను...

* * *

నేను మృత్యువునూ కాను...సందేహమూ కాను...

నాకు జాతి భేదమూ లేదు...

నాకు తండ్రీ లేడు...తల్లీ లేదు...జన్మా లేదు...

బంధువూ లేడు...మిత్రుడూ లేడు...

గురువూ లేడు...శిష్యుడూ లేడు...

చిదానందరూపుడైన శివుడే నేను...శివుడే నేను...

* * *

నేను నిర్వికల్పుడను..నిరాకారుడను...

సర్వత్రా వ్యాపించి ఉన్నాను...

ఇంద్రియములతో నాకు సంబంధము లేదు...

మోక్షమూ లేదు...బంధమూ లేదు...

చిదానందరూపుడైన శివుడే నేను...


* * *


ఇది ఆది శంకరుల నిర్వాణషట్కం.....