
ప్రాంజలి ప్రభ ...అంతర్జాల పత్రిక
*🌹. విష్ణు సహస్ర నామములు - 1 / Vishnu Sahasra Namavali - 1 🌹*
*నామము - భావము, సీస పద్యము
రచయత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
🌻. ప్రారంభము 🌻
*పాలకడలిలో శంఖ చక్ర గదా పద్మములు ధరించిన వాడు, భూమియే పాదములుగా గలవాడు, సూర్యచంద్రములు నేత్రములైన వాడు, దిక్కులే చెవులైన వాడు, త్రిభువనములు శరీరముగా గలవాడు, శేషశాయి, విశ్వరూపుడు, శ్రీవత్సాంక కౌస్తుభ పీతాంబరధారి, నీలమేఘ వర్ణుడు అయిన రుక్మిణీ సత్యభామా సమేతుడు, ముకుందుడు, పరమాత్ముడు అయిన దేవునకు ధ్యానము చెప్పబడుతుంది.*
*"హరిః ఓం" అంటూ వేయి నామాల జపం మొదలవుతుంది.*
*విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్యభవత్ప్రభుః |*
*భూతకృద్భూతభృద్భావో భూతాత్మా భూతభావనః ‖ 1 ‖*
1) విశ్వం :- మనకు గోచరమగు దృశ్యమాన జగత్తంతయు తానైన వాడు.
2) విష్ణు: - విశ్వమంతయు వ్యాపించి ఉన్నవాడు.
3) వషట్కార: - వేద స్వరూపుడు.
4) భూత భవ్య భవత్ ప్రభు: - భూత భవిష్యత్ వర్త మానము లందలి సర్వమునకు ప్రభువైన వాడు.
5) భూత కృద్ - భూతములను సృష్టించిన వాడు.
6) భూత భృత్ - జీవులందరిని పోషించు వాడు.
7) భావ: - సమస్త చరాచర ప్రపంచమంతయు తానే వ్యాపించిన వాడు.
8) భూతాత్మా - సర్వ జీవ కోటి యందు అంతర్యామిగ ఉండువాడు.
9) భూత భావన: జీవులు పుట్టి పెరుగుటకు కారణమైన వాడు.
సీస పద్యము
దృశ్యమాన జగత్తు అంతయు తానైన
భూమిని రక్షణ చేయు వాడు
విశ్వమంతయు ఉన్న వేదస్వరూపుడు
జగతికి ప్రభువైన వాడు విష్ణు
భూతభవిష్యత్ జరుగు కాలమును నిర్ణ
యము చేయు శక్తిని పెంచు వాడు
భూతములను సృష్టి , జీవు లందరిని పో
షణ చేసి వేదస్వ రూప విష్ణు
తేట గీతి
జగతి నందుసమస్త ప్రజలకు తానె
సర్వ జీవుల అంతర్యామిగను ఉండి
పుట్టి పెరుగుట కారణ మైన విష్ణు
తెల్పు మల్లాప్రగడ వినయపు తృప్తి
--(***)--
సశేషం...
🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 2 / Sri Vishnu Sahasra Namavali - 2 🌹
నామము - భావము, సీస పద్యము
రచయత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
🌻. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌻
పూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతిః |
అవ్యయః పురుషః సాక్షీ క్షేత్రజ్ఞోఽక్షర ఏవ చ ‖ 2 ‖
10) పూతాత్మా - పవిత్రాత్ముడు.పూత - పవిత్రమైన, ఆత్మ- స్వరూపముగలవాడు,
11) పరమాత్మ - నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపమై కార్య కారణముల కంటే విలక్షణమైన వాడు.
12) ముక్తానాం పరమాగతి: - ముక్త పురుషులకు పరమ గమ్యమైన వాడు.ముక్తులగు వారికి
సర్వోత్తముడు, పరమాంగతి= పునర్జన్మ యనునది లేకుండా చేయువాడు,
13) అవ్యయ: - వినాశము కానివాడు. వినాశము లేని వాడు.
14) పురుష: - నవద్వారములు కలిగిన పురము నందు ఉండువాడు శరీరమనెడి పురమున సయనించు వాడు, గొప్పవి యగు ఫలములను ఇచ్చువాడు,.
15) సాక్షీ - చక్కగా సమస్తమును దర్శించువాడు.సాక్షాత్తుగా తన స్వరూపమే యైన జ్ఞానము చేత సమస్తమును చూడు వాడు,
16) క్షేత్రజ్ఞ: - శరీరము లో జరుగు క్రియలన్నింటిని గ్రహించువాడు.శరీరములను వీనికి బీజమైన శుభా శుభ కర్మలను తెలిసి కొను చున్నవాడు,
17) అక్షర: - నాశరహితుడు.తరుగులేనివాడు, నక్షరతీతి అక్షరా: - గుణములు పై పైని అభివృద్ధి చెందునే కాని తరగని వాడు
సశేషం... 🌹 🌹 🌹 🌹 🌹
సీస పధ్యము
నాశర హితుడు, తిరుగులేని గుణములు
అభిరుద్ది పరిచేటి ముక్త పురుష
దేహములో జరుగు పవిత్ర మైనట్టి
ఆత్మస్వ రూపము కలిగి నోడు
నిత్యము శుద్ధము బుద్ధము ముక్తము
రూపమైన ప్రాణి కన్న మిన్న
గొప్పవి యగుఫల ములు ఇచ్చి చక్కగా
సమముగా కర్మలు తెలుపు వాడు
ఆటవెలది
నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపమై
కార్య సంభవమ్ము చేయు వాడు
జ్ఞాన బీజమైన శుభకర్మలను తెల్పి
నాస రహిత సాక్షి గున్న వాడు
--(())--
🌻. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌻
🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 3 / Sri Vishnu Sahasra Namavali - 3 🌹
నామము - భావము - సీసా పద్యము
రచయత : మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ
యోగో యోగవిదాం నేతా ప్రధాన పురుషేశ్వరః |
నారసింహవపుః శ్రీమాన్ కేశవః పురుషోత్తమః ‖ 3 ‖
18) యోగ: - యోగము చే పొందదగిన వాడు.ఉపాయమైన వాడు
19) యోగ విదాంనేతా - యోగ విదులకు ప్రభువైన వాడు జ్ఞానుల యోగ క్షేమాదులను వహించేడి వాడు.
20) ప్రధాన పురుషేశ్వర: - ప్రకృతి పురుషులకు అధినేత, ప్రధానం అంటే పకృతి, పురుష: అంటే జీవుడు, ప్రకృతిని జీవుడ్ని నియమించే వాడు.
21) నారసింహవపు: - నరుని సింహమును బోలిన అవయువములు గల వాడు.
22) శ్రీమాన్ - సదా లక్ష్మీ దేవితో కూడి యుండువాడు.అత్యంత మనో హరుడు, తన వక్ష స్థలమున శ్రీదేవి ని ధరించిన వాడు
23) కేశవ: - కేశి యనెడి అసురుని వధించిన వాడు.మనోహరమైన కేశ (సిరోజ)ములు కలవాడు
24) పురుషోత్తమ: - పురుషులందరిలోను ఉత్తముడు.
సీస పద్యము
పురుషులం దరిలోను ఉత్తము డు మనో హ
రుడు హృదయమునందు లక్ష్మి ఉన్న
నరుని సింహమును బోలిన అవ యవములు
కలిగిన ప్రకృతిని జీవములను
నియమించి యోగవి ధులకు ప్ర భువుగాను
జ్ఞాన సంపదలను వృద్ధి చేయు
సకలఉపాయము లకునిల యముగల
మనసును పంచేటి లోకనాధ
ఆటవెలది
భాద్యతా యుత మగు పనులలో బంధుత్వ
మైత్రి బుద్ధి గుణము పంచు వాడు
ధరణి కలుష మంత దహియింప గలదయా
పరుడు తెల్పు చుండె మల్లాప్రగడ వారు
--(())--
🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 4 / Sri Vishnu Sahasra Namavali - 4 🌹
నామము - భావము - సీస పద్యము
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
*4. సర్వః శర్వః శివః స్థాణుర్భూతాదిర్నిధిరవ్యయః |
సంభవో భావనో భర్తా ప్రభవః ప్రభురీశ్వరః ‖ 4 ‖ *
25) సర్వ: - సమస్తమును తానై అయినవాడు.సర్వమునకు సృష్టి స్థితి లయ కారణముగా ఉండిన
వాడు
26) శర్వ: - సకల జీవులను సంహరింప జేయువాడు.అసుభా లను పోగొట్టేవాడు,
27) శివ: శాశ్వతుడు. సర్వులకు భగవత్ ప్రాప్తి కలుగ చేయువాడు,
28) స్థాణు: స్థిరమైనవాడు.స్థాణువు స్తిరమైనవాడు,
29) భూతాది: - భూతములకు ఆదికారణమైన వాడు.సమస్త ప్రాణుల చేత గ్రహిం
బడుచున్నవాడు,
30) అవ్యయనిధి: - నశించని ఐశ్వర్యము గల వాడు.నాశనములేని నిధిని దాచి వాడు
31) సంభవ: - వివిధ అవతారములను ఎత్తినవాడు.అంతట అవతరించేవాడు,
32) భావన: - సర్వ జీవులకు సమస్త ఫలముల నొసగువాడు.సమస్త భోక్తలకు ఫలములను
గలిగిన్చు వాడు,
33) భర్తా: - సకలములను కనిపెట్టి, పోషించువాడు. సకలమును భరించువాడు.అధిష్టానముగా ఉండి ప్రపంచమును భరించు వాడు
34) ప్రభవ: - పంచభూతములకు, దేశకాలాదులకు మూలమైనవాడు.మహాభూతములు వీని నుండియే ఉద్భవించు చున్నవి, అందువలన ఉత్కృష్టమైన జన్మగలవాడు,
35) ప్రభు: - సర్వశక్తి సమన్వితమైనవాడు.సమస్త కార్యములలో మహా సామర్ధ్యము గలవాడు
36) ఈశ్వర: - ఒకరి సహాయములేకనే సమస్త కార్యములు నెరవేర్చగల్గిన వాడు.నిరుపాదిక మైన ఐశ్వర్యము గలవాడు,
సీసా పద్యము
సకలజీవుల అసుభాలను పోగొట్టి
సర్వులకు భగవత్ ప్రాప్తి ఇచ్చి
స్థిరమైన వాడు ఒకరి సహాయము లేక
కార్యము లన్నియు చేసి ఉంచి
ఐశ్వర్య మున్నట్టి సర్వశ క్తి సమన్వి
త,సమస్త కార్యంలొ సామరస్య
ముతొ సకలములను కనిపెట్టి పోషణ
చేసియు ఫలములు పంచి ఇచ్చు
తేటగీతి
శాశ్వతుడు సర్వులకు మోక్ష మిచ్చు వాడు
వివిధ అవతార ములు ఎత్తి రక్షకుండు
దేశ కాలాదు లకు మూల మైన వాడు
నిత్య మనుషుల హృదయాన కల్సి ఉండు
--(())--
🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 5 / Sri Vishnu Sahasra Namavali - 5 🌹
నామము - భావము - సీస పధ్యము
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
5. స్వయంభూః శంభురాదిత్యః పుష్కరాక్షో మహాస్వనః |
అనాదినిధనో ధాతా విధాతా ధాతురుత్తమః ‖ 5 ‖
37) స్వయంభూ :- తనంతట తానే ఉద్భవించిన వాడు. ఇచ్చు చేతనే తనకే అసాధారణ మైనటు వంటి విదంగా అవతరించు వాడు
38) శంభు: - సర్వశ్రేయములకు మూలపురుషుడు.భక్తులకు సుఖమును కలిగించు వాడు,
39) ఆదిత్య: - సూర్యుని యందు స్వర్ణకాంతితో ప్రకాశించువాడు.ఆదిత్య మండలాంతర్గతుడైన హిరన్మయ పురుషుడు
40) పుష్కరాక్ష: - పద్మముల వంటి కన్నులు గలవాడు.కమలముల వంటి కళ్ళు గలవాడు,
41) మహాస్వన: - గొప్పదియగు వేదరూప నాదము గలవాడు.
42) అనాదినిధన: - ఆద్యంతములు లేని వాడు.జన్మము, వినాశము లేనివాడు,
43) ధాతా - నామరూపాత్మకమైన ఈ జగత్తునకు అద్వితీయుడై ఆధారమై యున్నవాడు.ప్రకృతి యందు బ్రహ్మాను గర్భము ధరించు వాడు,
44) విధాతా - కర్మఫలముల నందించువాడు.గర్భాన్ని ఆవిర్భవింప చేసేవాడు,
45) ధాతురుత్తమ: - సర్వ ధాతువులలో ఉత్తమమైన చిద్రూప ధాతువు తానైనవాడు. కార్యా కారణ రూపమైన సమస్త ప్రపంచమును ధరించుట వలన చైతన్యము పరుచువాడు
🌹 🌹 🌹 🌹 🌹
సీస పద్యము
తనకుతానుగ ఉద్భ వించిన చైతన్య
రూపమై న సమస్త లోకమేలు
కర్మఫలములను అందించి ఆద్యంత
ముయు లేని జన్మము గలిగి నోడు
గొప్పది యగు వేద రూప నాదముగల
వాడు, సూర్యునియందు కాంతి గలిగి
జగతినం తయును చైతన్య పరిచియు
భక్తుల సుఖమును కలుగ చేసె
తేటగీత
స్వర్ణ కాంతితో జగతిని ఏలు వాడు
కర్మ ఫలమును వెంటనే తీర్చువాడు
సర్వ ధాతువు లలొశక్తి కలిగి నోడు
విష్ణు లీలలు నరులను కమ్మి వేయు
--(())--
🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 6 / Sri Vishnu Sahasra Namavali - 6 🌹
నామము - భావము - సీసా పద్యము
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
అప్రమేయో హృషీకేశః పద్మనాభోఽమరప్రభుః |
విశ్వకర్మా మనుస్త్వష్టా స్థవిష్ఠః స్థవిరో ధ్రువః ‖ 6 ‖
46) అప్రమేయ: - ఏ విధమైన ప్రమాణములకు అందనివాడు.*
47) హృషీకేశ: - ఇంద్రియములకు ప్రభువు.
48) పద్మనాభ: - నాభియందు పద్మము గలవాడు.బ్రహ్మాదేవుని ఉత్పత్తి స్థానమైన పద్మమునాభి యందు కలవాడు
49) అమరప్రభు: -దేవతలకు ప్రభువైనవాడు.
50) విశ్వకర్మా - విశ్వరచన చేయగల్గినవాడు.విశ్వము కర్మగా గలవాడు, విశ్వకర్మతో సాదృశ్యము గలవాడు
51) మను: - మననము(ఆలోచన) చేయువాడు. సంకల్పం చేతనే పనులన్నీ చేసేవాడు,
52) త్వష్టా - ప్రళయకాలమున సమస్త భూతములను కృశింపజేసి నశింపజేయువాడు.
53) స్థవిష్ఠ: - అతిశయ స్థూలమైన వాడు.మిక్కిలి స్థూలమైన వాడు,
54) స్థవిరోధ్రువ: - సనాతనుడు, శాశ్వతుడైనవాడు.స్థావిరుడు అనగా పురాణ పురుషుడు,స్థిరత్వము గలవాడు
*అప్రమేయ=శబ్దాది గుణములు లేనివాడు, గావున ప్రత్యక్ష ప్రమాణము నకు గోచరింపడు, అనుమాన విషయము గాడు, ఏలన ఇయ్యది వ్యాపింప దగిన లింగమితని యందు లేదు, ఉపమాన ప్రమాణముచేతను సిద్ధించువాడు కాడు, ఏమన ఒక భాగము అను నదే వీనియందు లేదు , అందువలన సాదృశ్యమే కుదరదు, కనుక బ్రహ్మ రుద్రాదుల కరణములతో తెలుసుకొన సాద్యము కానివాడు,
ఇంద్రియములకు,దేవతలకు ప్రమాణ
ములకు అందనివాడు విశ్వరచన
చేయగల్గినవాడు శబ్దాది గుణములు
శాశ్వతుడైనవాడు లేనివాడు
అతిశయ స్థూలమైన పురాణ పురుషుడు
నాభి యందును పద్మము గలవాడు
ప్రళయకాలమున సమస్త భూతములను
నాశనము సృష్టింప జేయువాడు.
తేటగీత
విశ్వకర్మతో సాదృశ్యము గలవాడు
దైవ శక్తియు ఇదియు అదియు అనిన ఏల
సర్వ సర్వాంతర్యామిగ కలిగి నోడు
నరులు బ్రహ్మ రుద్రాదుల పూజ్యు డితఁడు
--(())--
. శ్రీ విష్ణు సహస్ర నామములు - 7 / Sri Vishnu Sahasra Namavali - 7 🌹
నామము - భావము - సీస పద్యము
రచయత:మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
అగ్రాహ్యః శాశ్వతో కృష్ణో లోహితాక్షః ప్రతర్దనః |
ప్రభూతస్త్రికకుబ్ధామ పవిత్రం మంగళం పరమ్ ‖ 7 ‖
55) అగ్రాహ్య: - ఇంద్రియ మనోబుద్ధులచే గ్రహించుటకు వీలులేనివాడు.కర్మేన్ద్రియముల చేత గ్రహింప బడనివాడు
56) శాశ్వత: - సర్వ కాలములందున్నవాడు.
57) కృష్ణ: - సచ్చిదానంద స్వరూపుడైన భగవానుడు. సర్వమును ఆకర్షించువాడు.నీలి వర్ణము శరీరము గలవాడు,
58) లోహితాక్ష: - ఎఱ్ఱని నేత్రములు గలవాడు.
59) ప్రతర్దన: - ప్రళయకాలమున సర్వమును నశింపచేయువాడు.
60) ప్రభూత: - జ్ఞానైశ్వర్యాది గుణసంపన్నుడు.
61) త్రికకుబ్ధామ - ముల్లోకములకు ఆధారభూతమైనవాడు.అధో మద్య భేదము చేత మూడు దిశలకును స్థానముగా నున్నవాడు
62) పవిత్రం - పరిశుద్ధుడైనవాడు.సమస్త హేయ గుణములకు ఎదురు కోటి అయిన వాడు కనుక పరిశుద్దుడు,
63) పరం మంగళం - స్మరణ మాత్రముచే అద్భుతముల నంతమొందించి శుభముల నందించువాడు. స్వయం ప్రకాశక ఆనందరూపి అయి, కళ్యాణ రూపిగా నుండేవాడు,
సీస పద్యము
స్మరణ మాత్రముచే అద్భుతములను
నంతమొందించియు స్థితి బుద్ధి
శుభములు కల్పించు ఆనంద రూపము
కలిగియు పరిశుద్ధుడైన వాడు
ముల్లోకాలను ఏలు జ్ఞానైశ్వర్యాదిగ
గుణసంపద కలిగి నీలి వర్ణ
ప్రళయ కాలమున సర్వమును నశింపచే
యగలిగి సర్వము తెలుపు వాడు
తేటగీతి
సచ్చి దానంద వెలుగులు కనులు గలిగి
నిత్య సర్వము నిర్వాహ కమును గలిగి
సృష్టి సక్రమ పధ్ధతి నడప గలిగి
సర్వ లోకాల్ని రక్షణ చేయు వాడు
--(())--
🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 8 / Sri Vishnu Sahasra Namavali - 8 🌹
నామము - భావము - సీస పద్యము
రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ :
ఈశానః ప్రాణదః ప్రాణో జ్యేష్ఠః శ్రేష్ఠః ప్రజాపతిః |
హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనః ‖ 8 ‖
64) ఈశాన: - సర్వ భూతములను శాసించువాడు.
65) ప్రాణద: - ప్రాణి కోటికి ప్రాణశక్తి నొసగువాడు, ప్రాణదానము చేయువాడు,.
66) ప్రాణ: - ప్రాణశక్తి స్వరూపమైనవాడు.ఉచ్చ్వాస నిశ్స్వాసలు సలుపు జీవుడు,
67) జ్యేష్ఠ: - వృద్ధతముడు. (సృష్టికి పూర్వమునుండే ఉన్నవాడు) అత్యంత వృద్ధుడు,
68) శ్రేష్ఠ: - అత్యంత ప్రశంసాపాత్రుడు.
69) ప్రజాపతి: - సమస్త ప్రజలకు పతి.సమస్త ప్రజలకు అధిపతియై ఉన్నవాడు
70) హిరణ్యగర్భ: - విశ్వగర్భమున నుండువాడు.హిరణ్మయమైన అండము లోపల నుండు వాడు
71) భూగర్భ: - భూమిని తన గర్భమునందు ఉంచుకొన్నవాడు.భూదేవికి సర్వదా తన అనుభవము నిచ్చి గర్భము వలే కాపాడేవాడు
72) మాధవ: - శ్రీదేవికి భర్తయైనవాడు.మా అనగా శ్రీదేవి, ధవుడు అనగా భర్త , శ్రీదేవికి భర్త యైన వాడు
73) మధుసూదన: - మధువను రాక్షసుని వధించినవాడు.మధు వనేడి అసురుని సంహరించిన వాడు
మధువనే అసురుని సంహరించిన వాడు
భూమిని గర్భము నందు ఉంచి
సర్వ భూతములను శాసించువాడవు
ప్రాణకో టికి నిజ శక్తి నొసగి
విశ్వగర్భమున లోపల నుండిన
అత్యంత వృద్ధుడు అదిపతియును
ఉచ్చ్వాస నిశ్స్వాసలు సలుపు జీవుడు
తన అనుభవములు తెల్పు వాడు
ఆటవెలది
నాడు మనసు విడక ననుబట్టియున్నాడు
కనులకేమో వాడు కాన రాడు
నాదు కన్నులకును మోదంబు గొల్పుచు
నెపుడు కాన బడునొ ? యింపు గాగ
--(())--
9. ఈశ్వరో విక్రమీధన్వీ మేధావీ విక్రమః క్రమః |
అనుత్తమో దురాధర్షః కృతజ్ఞః కృతిరాత్మవాన్‖ 9 ‖
74) ఈశ్వర: - సర్వశక్తి సంపన్నుడైనవాడు.
75) విక్రమీ - శౌర్యము గలవాడు.
76) ధన్వీ - ధనస్సును ధరించినవాడు.
77) మేధావీ - ఏకకాలములో సర్వవిషయగ్రహణ సామర్ధ్యము కలిగినవాడు.
78) విక్రమ: - గరుడుని వీపుపై ఎక్కి ఇచ్ఛామాత్రముచే ఎచ్చటైనను విహరించగలవాడు.
79) క్రమ: - నియమానుసారము చరించువాడు.
80) అనుత్తమ: - తనకంటె ఉత్తములు లేనివాడు.
81) దురాధర్ష: - రాక్షసులు కూడా ఎదుర్కోను శక్యము గానివాడు.
82) కృతజ్ఞ: - ప్రాణులు చేయు కర్మములను చేయువాడు.
83) కృతి: - కర్మకు లేదా పురుష ప్రయత్నమునకు ఆధారభూతుడై యున్నవాడు.
84) ఆత్మవాన్ - తన వైభవమునందే సర్వదా సుప్రతిష్ఠుడై యుండువాడు.
శౌర్యము గలవాడు. పురుష ప్రయత్నము
నందున ఆధార భూతుడైన
తనకంటె ఉత్తము లైనట్టి వారెవ
రునులేని వాడు , గరుడుని వీపు
పైనఎక్కివిహరిం చేటి వైభవముతొ
నియమాను సారము యున్నవాడు
రాక్షసు లకు కూడ శక్యము గానివా
డు,విషయ గ్రాహ్యము గలిగి నోడు
ఆటవెలద
ప్రాణు లన్ని కర్మ ల ఫలము పొందియు
సర్వ విషయములను తెలుసు కొనియు
ఏక కాలము సర్వము తెలుపు వాడు
సుప్ర తిష్టుడై అందర్ని ఆదు కొనెను
--(())--
🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 10 / Sri Vishnu Sahasra Namavali - 10 🌹
నామము - భావము
మేషరాశి - కృత్తిక నక్షత్ర ద్వితీయ పాద శ్లోకం
10. సురేశః శరణం శర్మ విశ్వరేతాః ప్రజాభవః |
అహస్సంవత్సరో వ్యాళః ప్రత్యయః సర్వదర్శనః ‖ 10 ‖
85) సురేశ: - దేవతలకు ప్రభువైనవాడు.
86) శరణ: - దు:ఖార్తులను బ్రోచువాడై, వారి ఆర్తిని హరించువాడు.
87) శర్మ - పరమానంద స్వరూపుడు.
88) విశ్వరేతా: - సర్వ ప్రపంచమునకు కారణమైన పరంధాముడు.
89) ప్రజాభవ: - ప్రజోత్పత్తికి కారణభూతుడైన వాడు.
90) అహ: - పగలువలె ప్రకాశించు వాడు.
91) సంవత్సర: - కాలస్వరూపుడైనవాడు.
92) వ్యాళ: - పామువలె పట్టశక్యము గానివాడు.
93) ప్రత్యయ: - ప్రజ్ఞా స్వరూపుడైనవాడు.
94) సర్వదర్శన: - సమస్తమును దర్శించగలవాడు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
సీస పద్యము
ముల్లోకములకు సమ్మదము గూర్చెడు వాడు
చల్లని లోచనా బ్జములు వాడు
దు:ఖార్తులను చూసి ఆర్తిని హరించి
రక్షించె ప్రజ్ఞా స్వ రూపుడైన
వాడు, పగలువలె ప్రకాశ ముగలిగి
కాలము స్వరూపు డైన వాడు
పరమాత్మ నంద స్వరూపుడు లోకాన్ని.
దర్శించగలగిన యశుడు
తేటగీతి
పాము వలె పట్ట శక్యము గానివాడు
నరుల కారణ భూతుడై నట్టి వాడు
గోప్యముతెలిసి ఉండేటి విశ్వ హరుడు
సమము చేసియు సంకల్ప ముగల వాడు
.
--(())--
🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 13 / Sri Vishnu Sahasra Namavali - 13 🌹
నామము - భావము
మేషరాశి - రోహిణి నక్షత్ర 1వ పాద శ్లోకం
13. రుద్రో బహుశిరా బభ్రుః విశ్వయోని శుచిశ్రవాః|
అమృత శాశ్వతః స్థాణుః వరారోహో మహాతపాః|| 13
114) రుద్రః - అన్నింటినీ తనలో లయము/విలీనము చేయువాడు.
115) బహుశిరాః - అనేక శిరములు గలవాడు, అనంతుడు.
116) బభ్రుః - అన్నింటికీ ఆధారమైనవాడు, అన్నింటినీ భరించువాడు.
117) విశ్వయోనిః - విశ్వ ఆవిర్భావానికి కారణమైనవాడు.
118) శుచిశ్రవాః - తన నామాలను విన్నంత మాత్రమునే జీవులను పవిత్రులను చేయువాడు.
119) అమృతః - తనివి తీరని అమృతమూర్తి, అమరుడు.
120) శాశ్వత స్థాణుః - ఎల్లప్పుడూ సత్యమై, నిత్యమై, నిరంతరంగా వెలుగొందువాడు.
121 ) వరారోహః - శ్రేష్టమగు, పరమోత్కృష్ట స్థానమున వసించువాడు.
122) మహాతపాః - మహత్తరమైన జ్ఞానము గలవాడు, ప్రసాదించువాడు.
సీస పద్యము
జ్ఞానము గలవాడు, ఉత్కృష్ట స్థానము
నవసించు, సత్యమై నట్టి వాడు
తనివి తీరని మహోత్తరమైన, నిత్యమై,
వెలుగొందు అమరుడు, అమృత మూర్తి
జీవుల నుపవిత్రు లను చేయు, అన్నింటి
ని భరించి ఆధార మైన వాడు
విశ్వ ఆవిర్భావానికి కారణ మైనవాడు
బహుశిర ములుగల సవ్య సాచి
తేటగీతి
కరుణ వెదజల్లు కన్నులు గాంచువాడు
నెల్ల దిశలందు గనబడు విశ్వమూర్తి
కుచితమగు నలంకారము లేనివాడు .
రండు రారండు జోహారు లిందు వేగ
--(())--
--(())--
7 సీస పద్యాలు
చీకట్లు తొలగించి చింతలు మాపియు
వెలుగును పంచేటి సూర్యుడగును
బ్రహ్మదేవుని సృష్టి బాధ్యత పెంచియు
ఉదయమే ఆకాంక్ష సూర్యుడగును
మధ్యాన్నఈశ్వర మనసున హాయియే
ఆహారమును పంచు సూర్యుడగును
సాయంసమయమున సాక్షి విష్ణువుగాను
సర్వసౌ ఖ్యముఇచ్చు సూర్యుడగును
సూర్యుడు తన రథం దిశ మనసు మార్పు
సకల కాలాలు అధిపతి సమయ మార్పు
విశ్వ చైతన్య బుద్ధియు విజయ మార్పు
ప్రాంజలి ప్రభ వెలుగులు ప్రేమ తీర్పు
*****
8 సకలవిధ్యావ్యాప్తి సాధన లక్ష్యమే
శారదాంబకు నమస్కారములిడి
యైహికానంద ప్రవాహపూర్వకమైన
శృంగార మలుపులే శ్రుతియు మతియు
సింహాసనారూడి సింహగర్జన విద్య
సహజమే సంతోష సంపదగుటె
సకలమ్ము సహనము సేవల ధర్మము
సమస్యపరిష్కారం సవ్య తృప్తి
వివిధ విద్యల కలయిక విలువ పెంచె
కళల సంతృప్తి సంసారి కధలుపెంచె
వినయ విశ్వాస మనసుయే విధిని పెంచె
ప్రాంజలి ప్రభ ఉద్దేశ్య ప్రతిభ పెంచె
9
మధ్యపానముతోను మత్తుచిలికె వేళ
బడలిక తోనడి జొచ్చు వేళ
సుఖముకొరకు కోప సూక్తులున్న వేళ
ఒప్పు తప్పని వాద ఓడు వేళ
ఒంటరిగా చింత ఓర్పులేకయు వేళ
నాలుక తోనులే నటన వేళ
దొర మనసున దాగు దిగులుచూపిన వేళ
భక్తితో నూ రక్తి బడయు వేళ
ఆశ భావమీ సలక్షణ ఆకలగుట
లాభ భావము కనబాబు లాలీ యగుట
వెన్నెలతొ శక్తి యుక్తును వేల్పు యగుట
ప్రాంజలి ప్రభ గోపాల ప్రేమ యగుట
10
సౌందర్య మతి దృఢ శక్తి విలాసంబు
సంగీత సాహిత్య సౌఖ్య మంబుఁ
అగ్రజన్మ మతియే ఆత్రుత వాసంబు
యుక్త వయసు మతి యస్య మంబు
సంపన్నతయుబంధు సంరక్షజనణంబు
అనుకూల సతి నిత్య మానసంబు
సౌందర్య మతి దృఢ సౌఖ్యమంబు
నిత్యనిష్ఠ జ్ఞాన నిర్మలంబు
ఇన్నియుకలిగి వర్తించు చున్న నరుడు
భూతల స్వరమునుపొంది భూమి చూడు
అక్షరము సత్యమనినమ్మి యుండు చుండు
ప్రాంజలి ప్రభ గోపాల ప్రేమ చూడు
(11) సీస పద్యాలు
జీవిత మనునది జీవసాహిత్యము
రంగుల పుస్తకం రవ్వ వెలుగు
వ్యత్యాస మింతేను వలపుల జీవితం
ప్రతిపేజి చదవాలి ప్రగతి వెలుగు
మనసు క్షణముమారు మమతానురాగమే
తృప్తి అసంతృప్తి తోడు వెలుగు
జ్ఞాన అజ్ఞానము జయఅపజయములే
జీవిత సమరమై జీవి వెలుగు
తేటగీతి
శక్తి మీలోన దాగేను శ్రమయుగతియు
అవధులు ల్లేని సంద్రము ఆత్ర మదియు
తోడు గాసమ ర్థత చూపు తంత్ర మదియు
ప్రాంజలి ప్రభ సౌభాగ్య ప్రేమ యదియు
****
(12)
శ్రీమించు జడదారి చికిలి చెందపుటాట
పట్టువాడ పరంజి పట్టు వాడు
తనభక్తు లగువారి తప్పులన్నియును మ
న్నించువాడను కంప నించువాడు
తలనుంచి జాలుబాతకము లన్నియు రాచు
పేరువాడరదంపు బేరువాడు
తఱచులెవ్వియులేక తానయై త్రైలోక్య
మేలువాడిందిరా యేలువాడు
తేట గీతి
సర్వ మూల పరాత్పర స్వర్ణ వెలుగు
విశ్వ వ్యాప్తిగా విలసిల్లు విజయ వెలుగు
భక్తుల కళలు తీర్చేటి భవ్య వెలుగు
ప్రాంజలి ప్రభ ఈశ్వరా ప్రతిభ వెలుగు
___((()))__
13..సీస పద్యాలు--ప్రాంజలి ప్రభ
మూన్నాళ్ళ వెలుగులే .. ముచ్చట జీవితం
పుట్టుక మరణమే పుడమి తీరు
బాల్యము పఠనము బంధము విద్యయే
యవ్వన ప్రాయము ఆశ చేరు
వృద్ధాప్య సందడి వినయ విజయ నిధి
కాల నిర్ణయ మేను కథల తీరు
జన్మజన్మల బంధ జాగృతి ఇదియే ను
పరమాత్మ లీలగా ప్రేమ చేరు
గాలి పటముయే జీవితం గాలిగమ్ము
సంత సంబున నీ కీర్తి శాశ్వతమ్ము
పాప పుణ్యాల ఫలితాలు బ్రతుకు నిమ్ము
గాలిలో వెలుగేదీప జీవితమ్ము
ప్రాంజలి ప్రభ జీవితం పఠన వెలుగు ఈశ్వరీ
*"""*
14..సీస పద్యము
మన మేలు కోరేది మనమున తల్లియే
మనము యే నమ్మకం మనసు చుట్టు
మౌనమే సమయము మౌనమే ప్రేమ యే
మనుగడ మంత్రము మనసు చుట్టు
మమత యు స్థిరముగా మానవత్వ బ్రతుకు
మనము మౌనము గాను మనసు చుట్టు
హృదయమే మనమౌను హాయిగొను వయసు
మధుర మాధుర్యం ము మనసు చుట్టు
తేటగీతి
నిన్ను వర్ణింప గవులకు నేర్పు గలదె
జీవిత విషయం గోప్యమే జీత మవదె
వైరి వెర్రి జనాలు గా విజయ మవదె
బ్రేమ దళుకొత్త జయకాంత పెండ్లి యవదె
ప్రాంజలి ప్రభ మనము గా ప్రేమ అగుటె ఈశ్వరీ
***"""**
15..సీస పద్యాలు
భానుడు తగ నీక భవ్య తేజం బిచ్చు
కరుణ చంద్రుడు మీకు కాంతి నిచ్చు
అంగారకుడు మీకు మంగళంబులనిచ్చు
బుధుడు నెమ్మది మీకు బుద్ధి నిచ్చి
నెరి బృహస్పతి మీకు నిర్మల మతి యిచ్చు
నరయు శుక్రుడు మీకు హర్ష మిచ్చు
రాహువెప్పుడు మీకు బాహుబలం బిచ్చు
కేతువు మీకు విఖ్యాతి నిచ్చు
తేటగీతి
ఘనత కెక్కిన యీ నవ గ్రహము లెపుడు
బుత్ర పౌత్రాభి వృద్ధిచే భూమి యిపుడు
మీరు వర్ధిల్లు పుడమి నా మేలు ఎపుడు
సర్వ సృష్టిలో కదలిక సమయ మిపుడు
మేము చేసెడు ప్రార్ధనే ఆదు కొనుడు ఈశ్వరీ
--(())--
16..
ఆలోచన కెరటం అంతుచిక్కని ఒడ్డు
అర్ధాంతరంగము ఆశ నీడ
సుడిగుండము బుధ్ధి సుడులు తిరుగే ను
గాలిగుమ్మటముల గోల నీడ
పిడికెడు హృదయము రెపరెప లాడేను
శ్వాసలో ఊపిరి శ్రమకు నీడ
ప్రశ్నల వర్షమే ప్రధమ జీవితము యే
బ్రతుకు జీవనములో ... పలుకు నీడ
తేటగీతి
మస్తకము వంచి సౌభాగ్య మహిమ మించి
గౌరవం పదములు తెల్పి గార వించి
తీపి చేదు పలుకులు లే దీర్పు పెంచి
కరుణ చిరునవ్వులో సిరి కూర్పు నుంచి
నీకు మ్రొక్కెద నాలింపు నిర్మ లముయె ఈశ్వరీ
--(())--
17
తండ్రి భరించక తృప్తిగ లేకైన
మోహంబుతో తల్లి మూగదైన
అల్లుడు రాక్షస బద్దుడు ఉండిన
కూతురు పెను రంకు బూతు ఐన ।
కోపము గలవాడు కొడుకు తస్కరుడైన
తమ్ముడు పిచ్చిగా తప్పు డైన
ఎవరికి వారుగా ఏదోవ్యాపకమున
విధిన బడ్డనచెల్లె వీధి గమన
నరుని బేధంబు వర్ణించు నయన తరము
కాల మెదురేగి మననులో కామ్య పరము
అందరూ మార లేకయె ఆట తరము
ఓర్పు ఓదార్చు లేకయే ఒడుపు తరము
ప్రాంజలి ప్రభ జీవితం ప్రేమ పరము ఈశ్వరీ
18
కనకుపగటి కలలు కడకునిజము కావు
కళలు కను మరుగే కథలు గాను
కాలమే నేర్పు ను కమ్మనైన బ్రతుకు
మనకు ఒక ధర్మ మేను గాను
వయసు బాష నెఱుగు మానవతావాది
మహిమ లిచ్చుగురువు మనసుగాను
ఘనత పెంచు మహిన గగనమంతయు ప్రేమ
మార్గదర్శకుడు గా మహిమ గాను
ఆటవెలది
చిన్న పెద్ద కలిసి చింతలు తొలగించి
కొన్న ప్రేమ తీపి కరుణ జూపు
చరిత తీర్పు కోరి చిత్రమే చిరునవ్వె
కలలు ననుభ వించె కాల మగుటె
19।।।సీస పద్యాలు
(నేటి జీవి)
పనులు చేపట్టక పగటికలలు కంటు
కట్టినబట్టను కట్ట కుండ
చక్కగా కలలుగా నిద్రలో గుఱకేను
ముట్టి ముట్టకనుండి ముడుచి నుండ
తపన వెట్టక జీవితమున కాసు ముట్టక
సత్వసంపద జాప సాగ కుండ
వికటాట్ట హాసము వింత పోకడ గుండ
వట్టి మాటల తోను వంగు చుండ
జీవితాన సుఖము జపము యే సాఫల్యం
జనన మరణ సంఘ జాతి నెంచె
కలలు పెరిగి సహజ కరుణ వైఫల్యము
నిత్య సత్య మగుట నిజము పోటు
****
।20 సీస పద్యము
(మలములచే తాకబడినది విమలా।।ఆకలిదప్పులు దరిద్రం మూలము)
అష్టదరిద్రము ఆశ మూల మగుటే
కామక్రోధాదియే కామ్య చరిత
అన్నియూ మలములే అతిమదము గనులే
అవినీతి ఆక్రమ ఆశ చరిత
మనసు వికారము మదనభావములుగా
మలము అవిద్యయె మదన చరిత
ఆజ్ణానము అహము ఆత్రము ఆకలి
విమలడగుటయేను వీధి చరిత
అమ్మ మనసు వల్ల ఆత్ర మోద్దు నిజము
చెప్ప గలిగె జనని యే తీర్పు గా
దైవ కన్ను మనలొ ధనము చుట్టు బ్రతుకు
తెరువు నిజము తెలపగల జననీ
21--
త్రిపురసుందరి ఉమా త్రినయిని ఈశ్వరీ
బాల సూర్యుని వలే బాధ్య తగను
ఉజ్వల దేహము ఉయ్యాలగ త్రినేత్రి
నిన్నుధ్యానించెను నియమముగను
భూలోక వాసులు పూజలు చేసెను
వికసించె నయనాలు వినయమేను
ఆదేశమును పొంది అమ్మకు సేవను
జాజి పువ్వుల మాల వేసి నాము
నిండు పున్నమి చంద్రుని నేటి కళయె
కాంతి సారము అమృతము కళలు నిండె
తెల్లనైన పుస్తకము చేతలొ ధరించె
మల్లె మాల వెలుగులో మేను మెఱుపు
నిత్య ప్రార్ధనా మాదీక్ష నియమమేను ఈశ్వరీ
22
ఏపని మధ్యలో ।। ఎప్పుడు ఆపకు
సోమరిగా ఉన్న ।।।। సొమ్ము ఖర్చు
పనియందు చిన్నదా ।। పెద్దదా అనుకోకు
సంకల్పముండినా ।।। సొమ్ము ఖర్చు
ఉయ్యాలలా సాగు ।।। ఉన్నచోటమనసు
సహకార మున్నను ।।।।।।సొమ్ము ఖర్చు
మిత్రద్రోహమెపుడు ।।। ముప్పును తెచ్చును
సహవాస మున్నను ।।। సొమ్ము ఖర్చు
ఆటవెలది
ఎవరు ఏమి అన్న జరిగేది జరుగును
నిత్య వెలుగు వెనక ముందు ఉండు
ధర్మ మొకటి నిన్ను రక్షించు నిత్యము
దాము ఎపుడు కాదు సొమ్ము ఖర్చు
****
22.. సీస పద్యం
కెరటాల పరుగులు కేరింత జన గోల
పరుగు నా పను లేరు ప్రజల లీల
తీరాన్ని చేరి యు చెలిమి కలి పెపృథ్వి
మనిషి లో ఉప్పెన మంట లీల
గర్భాన దా చేను కలల రత్న ములు లే
కుళ్ళు కుతంత్రాలు కులము లీల
మేఘాలు ఏర్పాటు మేలు చేయు పయనం
సంపద గర్వమే సాగు లీల
సంద్ర నీరుత్రాగను లేము సమయ మందు
అయిన సర్వుల శ్రేయస్సు ఆశ ముందు
మనిషి నా అనే అహము తో మాయ యందు
మనసు నమ్మకం లేనట్టి మౌన మందు
23..సీస పద్యం
సమయ మే దైననూ సహనము ఆయుధమే
మారని మనిషి గా మనసు వద్దు
బాధ భంధములోన బాద్యత తెలుపుటే
సమయము తగినట్టు సాగ వద్దు
మనవాళ్లు ఇకరారు మనసులో సతి తప్ప
మారిపోయి బ్రతుకు మనకు వద్దు
ప్రాణము విలు వేది ప్రతిభకు చోటేది
కామ క్రోదమదమే అసలు వద్దు
ఘోరదురితంబు లెటునన్ను చేరనీకు
మాయురుభివృధ్ధి కృపసేయుమయ్య నాకు
కాల నిర్ణయం బట్టియే మనసు నాకు
బ్రతుకు మార్గము నీదేను పలుకు నాకు
0 Com
24..సీసపద్యాలు
చరవాణి చిక్కెను చేతిలో సరిపడే
తెల్పేను వార్తలు జిహ్వ జిహ్వ
చరవాణి రక్కసి చేయు చేష్టలు అన్ని
వినిపించె గాత్రము జిహ్వ జిహ్వ
చరవాణి వైరును చెవులలో వుంచేను
వినుచూ చూసేవి జిహ్వ జిహ్వ
తల్లి బిడ్డ ముఖాలు తండ్రి చెప్పు పలుకు
చూసేటి చరవాణి జిహ్వ జిహ్వ
పచ్చి బాలింత చర వాణి పలుకు వింత
అమ్మ తనమునే చూపేను ఆట వింత
పువ్వు కన్నాను సుకుమార పుడమి వింత
అంబరం నుండి ఆకర్షి అసలు వింత
25
సమయ మే దైననూ సహనము ఆయుధమే
మారేటి మనిషి గా మనసు వద్దు
బాధ భంధములోన బాద్యత తెలుపుటే
సమయము తగినట్టు సాగ వద్దు
మనవాళ్లు ఇకరారు మనసులో సతి తప్ప
మారిపోయి బ్రతుకు మనకు వద్దు
ప్రాణము విలు వేది ప్రతిభకు చోటేది
కామ క్రోదమదమే అసలు వద్దు
ఘోరదురితంబు లెటునన్ను చేరనీకు
మాయురుభివృధ్ధి కృపసేయుమయ్య నాకు
కాల నిర్ణయం బట్టియే మనసు నాకు
బ్రతుకు మార్గము నీదేను పలుకు నాకు
26... సీస పద్యం
కెరటాల పరుగులు కేరింత జన గోల
పరుగు నా పను లేరు ప్రజల లీల
తీరాన్ని చేరి యు చెలిమి కలి పెపృథ్వి
మనిషి లో ఉప్పెన మంట లీల
గర్భాన దా చేను కలల రత్న ములు లే
కుళ్ళు కుతంత్రాలు కులము లీల
మేఘాలు ఏర్పాటు మేలు చేయు పయనం
సంపద గర్వమే సాగు లీల
సంద్ర నీరుత్రాగను లేము సమయ మందు
అయిన సర్వుల శ్రేయస్సు ఆశ ముందు
మనిషి నా అనే అహము తో మాయ యందు
మనసు నమ్మకం లేనట్టి మౌన మందు
27
సీస పద్యము
యేమని చెప్పను యునికి యో హృదయేశ
ఆమని పిల్పు లే అలక ఆశ
కోమలి తెల్పె నే మనసు కమ్మని యాశ
భామిని పల్కె నే బడయు ఆశ
కామిని చూపు లే వలదు కాలమ్ము యాశ
కమ్మిన వేష మే కలలు ఆశ
దామిని ఆట లే వలదు ధర్మమే యాశ
మామిడి కాయలే మలుపు యాశ
నిన్ విడిచి పూజ చెయ్యను నిన్ను కోరి
నిన్ తలచి సేవ చేసెద నిన్ను కోరి
నిన్ ఋషిగ నేను చూడను నిన్ను కోరి
నీతొ పుణ్య గృహాలకు నిన్ను కోరి
నీడ లాగ ప్రశాంతిని నీకు ఇవ్వ ఈశ్వరీ
****
28
పూట కూలమ్మకు పుణ్యమే వచ్చునా
వజ్రపు గమ్ము ఆరవ చెవుల కేల
గ్రుడ్డి తరుణికి గొప్ప యుద్ధమే వచ్చునా
కుంటి కాలుకి గొప్ప నాట్యమేల
ఊరబంతులకు ఊపిరే వచ్చునా
చెవిటివానితొ వీణపాట లేల
ఊరు తొత్తుకువిటుం డూపిరే అవ్వునా
నాయకునియె నమ్మి నటన లేల
మతినె చెడకొట్టె రండకు మన్న నేల
కాల మార్చులు ఎవ్వరి కాలమవదు
నమ్మి మోసపోకయె ఉండుట నింగి నేల
ప్రాంజలి ప్రభ వెలుగుల ప్రాంత మిదియు
సీస పద్యం..ప్రేమ (ప్రేమికుల రోజు)
లక్ష్మి యై నిజసేవ లాలనే పాలనై
కలిమాయ చిక్కిన భామ ప్రేమ
ప్రేమయాట తెలిపే ప్రేమచూపులుగాను
బృందావనమ్మేమొ బృంద ప్రేమ
మదిలో పులకరింత మధుమాస పిలుపుగా
కెటుల తెలియ దని కలయు ప్రేమ
నగవు మెరయుచుండె నమ్మిన ట్టి పిలుపే
నటన కాదు మనసు నమ్ము ప్రేమ
గున్న మామిగుబురులోన గుర్తు ప్రేమ
సేద తీరువేళ శుభము దీక్ష ప్రేమ
పూల పరిమళాలతొ గంధ పూత ప్రేమ
వివర మంత ప్రేమికుల తో పిచ్చి ప్రేమ
***""""**
అమ్మ నాన్నల లోను ఆశయం ప్రేమగా
తొలినాటి ముచ్చట్లె తెలుపు ప్రేమ
అణువణువులోన ఆరాధ్య ప్రేమగా
చంటి బిడ్డకు చెప్పు చరిత ప్రేమ
గువ్వ గోరింకలై గమ్యమ్ము ప్రేమగా
పుడమిన పంచేటి భక్తి ప్రేమ
హృదయంలొ ఆత్మగా హృదయమై ప్రేమగా
ఘడియ ఘడియ సేవ ఘనత ప్రేమ
ఊహ కందని భావమై ఉండు ప్రేమ
భర్తని మురిపించె మనసు భ్రాంతి ప్రేమ
చెలిమి పంచియు చేయూత చెలియ ప్రేమ
సేవలో తరించు సతిగానె సరయు ప్రేమ
___((()))____
సీస పద్యము
యేమని చెప్పను యునికి యో హృదయేశ
ఆమని పిల్పు లే అలక ఆశ
కోమలి తెల్పె నే మనసు కమ్మని యాశ
భామిని పల్కె నే బడయు ఆశ
కామిని చూపు లే వలదు కాలమ్ము యాశ
కమ్మిన వేష మే కలలు ఆశ
దామిని ఆట లే వలదు ధర్మమే యాశ
మామిడి కాయలే మలుపు యాశ
నిన్ విడిచి పూజ చెయ్యను నిన్ను కోరి
నిన్ తలచి సేవ చేసెద నిన్ను కోరి
నిన్ ఋషిగ నేను చూడను నిన్ను కోరి
నీతొ పుణ్య గృహాలకు నిన్ను కోరి
నీడ లాగ ప్రశాంతిని నీకు ఇవ్వ ఈశ్వరీ
0
13 లక్ష్మీ పతికి నేస్త మైనప్పటికీ
- శివుడు బిచ్చమెత్త వలసి వచ్చే .
పువ్వు మక రందాన్ని ఇచ్చి నప్పటికీ
- తుమ్మెద బువ్వులవెంట పడవలసి వచ్చే
పాల సముద్రములో చేరి నప్పటికీ
- నత్తగుళ్ల తిండికి తిప్పలు పడవలసి వచ్చే
రాజ్యాన్ని ఏలిన రాజైనప్పటికీ
- భార్య కోరిక తీర్చుటకు కష్టపడవలసి వచ్చే
స్నేహ సంతృప్తిని చెప్పలేక - పొందిన మకరందానితో తృప్తి పడలేక
అనువుగాని చోట ఆహారం పొందలేక - ఎంత ధనమున్న తిండి తినలేక
ఒకరి మేలుచూసి నేడ్వగ రాదు - ఇది వేణుగోపాల ప్రేమ సుమా
14 .
సీస పద్యము
అల్పుని తెచ్చియు అధికున్ని చేసిన
కుక్క బుద్దియు కులుకు ఉండు
మగనికి చలి ఉంటె గంబలి కప్పిన
పడతి పొందులొ బుద్ది పడక ఉండు
గుబ్బలను చూసియే గుబులుతో ఉన్నను
చనువు చేసియు చంక చేరు చుండు
బలముంద ని సరసం బయట చూప దలిచే
మంత్రిగా మారిన మోహ ముండు
కనుక నేచెప్పునది బుద్ధి కళల పంట
బుద్ధి మరచి దేశంలోన బద్ధు డన్న
సందియము సమరముగాను సంక గుండె
అల్పుని అధికారానికి ఆది అనుటె
--((**))-
15 . అల్పుడు చెప్పిన పలుకు అధికముగా నుండు
- గొద్ది తొత్తుల పొందు రద్ది కీడ్చు చుండు
స్త్రీ చెప్పిన మాట వేదమనిపించు చుండు
- ముద్దు చేసిన కుక్క మూతి నాకు చుండు
బంధువులు వచ్చిన కొంప నాశనమగుచుండు
- బలుపుతో సరసం ప్రాణహాని కలుగు చుండు
దుష్టుడు మంత్రిగాఉంటె మంచి బుద్దిమారుచుండు
- చనువిస్తే ఎవడైనా చంక నెక్కుచుండు
కనుక ఎల్లరు జాగా రూకత ముఖ్యం
ఆశకు పోక ఉంటె అదే సౌఖ్యం
అందరితో మంచిగా ఉంటె అదే లౌఖ్యం
ఇది వేణుగోపాల ప్రేమ సుమా
--((**))--
16 యజమాని మందు వాడైన తాగొద్దని చెప్పు
- అమ్మువాన్ని ఇవ్వ వద్దని చెప్పు
మనిషికి పక్షులకు తాగుపోతని చెప్పు
- మానక పోతే తలతిప్పి మౌనభాష చెప్పు
చెవిలో కలియుట కష్టమని మొరిగి చెప్పు
- మానక పోతే నమ్మిన వకీలుకు చెప్పు
వైద్యుని వద్దకు పోయి చూపించి మరీ చెప్పు
- మారకపోతే నీవు కూడా తాగటమే ఒప్పు
మార్చటానికి ప్రయత్నాలు అనేకం
మగువమార్చే ప్రయత్నమే మమేకం
స్థల, స్నేహ మార్పిడి తెస్తే వివేకం
ఇది వేణుగోపాల ప్రేమ సుమా
17. లోన రోగమున్న వాడికి పైన హుషారు మెండు
- కళ్ల పసిండికి గాంతి మెండు
నేర రంకులాడికి నిష్ఠ మెండు
- పాలు పిండిని గొడ్డు బఱ్ఱె కీతలు మెండు
ఆత్మ గానని యోగి కద్వైతములు మెండు
- గెలవని రాజుకు కోతలు మెండు
తత్తర పాటుకు తలతిప్పుట మెండు
- వంచిచు దానికి భర్తపై వలపు మెండు
వండ లేనమ్మకు వగపులు మెండు
కూటికియ్యని విటకాని కోర్క మెండు
మాహాకమ్మకు మనసున మరులు మెండు
ఇది వేణుగోపాల ప్రేమ సుమా
18. ఆలి ఆశ తీర్చుటకు తలవంచి
బ్రతిమాలుకొను వాని బ్రతుకు రోత
నర్తనాంగనల వెనుక చేరి తాళముల్
వాయించు వాని జీవనము రోత
వ్యభిచరించు వారవనిత గర్భమ్మున
పురుషత్వము వహించు పుట్టురోత
కుటుంబానికి సరిపడు సంపాదన లేని
మనుజుని బతుకు నడక రోత
సంగీత సాహిత్యాల విలువ లేని రోత
కృతులు రచించిన కవుల గీత రోత
మదనుని మానసము నిత్యము రోత
ఇది వేణుగోపాల ప్రేమ సుమా
19. అల్ప విద్వాన్సుడు నాక్షేపణకు పెద్ద
- మూర్ఖచిత్తుడు కోపమునకు పెద్ద
పెట్టనేరని రండ పెక్కు నీతులు బెద్ద
- గొడ్రాలి పెళ్ళానికి గొంతు పెద్ద
డబ్బురాని వకీలుకు దంబంబు పెద్ద
- రిక్తుని మనస్సుకు కోరికలు పెద్ద
వెలయు నాబోతుకు కండలు పెద్ద
- మధ్య వైష్ణువులకు నామములు పెద్ద
అప్పు ఇచ్చి వద్దన్న వాడు అందరిలో పెద్ద
ఆలస్యముగా వచ్చువాడు అందరిలో పెద్ద
ఆదమరవక అందరితో సహకారించేవాడే పెద్ద
ఇది వేణుగోపాల ప్రేమ సుమా
ఓం
ReplyDelete