ప్రాంజలి ప్రభ ... అంతర్జాల పత్రిక (1)
ప్రాతః కాల సందేశము, వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం, అష్టమ స్కంధము - ప్రథమాధ్యాయము, మన్వంతరముల వర్ణనము
మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
రాజోవాచ
పరీక్షిన్మహారాజు అడిగెను- గురుదేవా! స్వాయంభువ మనువుయొక్క వంశ విస్తృతిని గూర్చి నేను వింటిని. అదే వంశమునందు అతని కుమార్తెల ద్వారా మరీచి మొదలగు ప్రజాపతులను తమవంశ పరంపరను కొనసాగించిరి. ఇప్పుడు ఇతర మనువులను గురుంచి వర్ణింపుడు.
మహాత్మా! జ్ఞానులు ఏయే మన్వంతరములలో మహిమాన్వితుడైన భగవంతుని యొక్క అవతారములను, లీలలను వర్ణించిరో, వాటిని నాకు తప్పక వినిపింపుము. నేను శ్రద్ధగా వాటిని వినగోరుచున్నాను.
జగత్పతియైన శ్రీహరి గడచిన మన్వంతరములలో చేసిన, వర్తమానమునందు చేయుచున్న, భవిష్యన్మన్వంతరములలో చేయబోవు లీలలను వినిపింపుము.
ఋషిరువాచ
శ్రీశుకుడు వచించెను మహారాజా! ఈ కల్పమునందు స్వాయంభువుడు మున్నగు ఆరుగురు మనువుల యొక్క మన్వంతరములు గడచిపోయెను. వాటిలో మొదటి మన్వంతరమును గూర్చి నేను వర్ణించితిని. అందులో దేవతలు మొదలగు వారి యొక్క ఉత్పత్తి జరిగినది.
స్వాయంభువమనువు కుమార్తెయైన ఆకూతియందు యజ్ఞపురుషుని రూపములో భగవానుడు జన్మించి, ధర్మములను ఉపదేశించెను. అట్లే దేవహూతియందు ఆ ప్రభువు కపిల భగవానునిగా అవతరించి, జ్ఞానోపదేశమును చేసెను.
పరీక్షిన్మహారాజా! కఫిల భగవానునిగూర్చి మూడవ స్కంధములో వర్ణింపబడినది. ఇప్పుడు ఆకూతియందు యజ్ఞపురుషుడుగా అవతరించి చేసిన లీలలను వివరించెదను.
స్వాయంభువమనువు సకల విషయ భోగముల యెడ విరక్తుడై రాజ్యమును పరిత్యజించెను. పిమ్మట, తన భార్యయైన శతరూపతో గూడి తపమాచరించుటకై వనములకు వెళ్ళెను.
అతడు సునందానదీ తీరమున ఒంటి కాలిపై నిలబడి నూరు సంవత్సరములు తీవ్రమైన తపమొనర్చెను. ఆ సమయమున అతడు నిత్యము ఈ విధముగా భగవంతుని స్తుతించెను.
మనురువాచ
మనువు పలికెను పరమాత్మ చేతనను పొంది విశ్వము చైతన్యవంతమగును. కాని, విశ్వము మాత్రము ఆయనను చైతన్యవంతునిగా చేయజాలదు. ఆ ప్రభువు ప్రళయకాలమున నిద్రించు చున్నను మేల్కొనియే యుండును. ఆ విషయమును ఆయన ఎరుగును. కాని, విశ్వము మాత్రము తెలియజాలదు. కనుకనే, అతడు పరమాత్ముడు.
ఈ సమస్త విశ్వమునందును, అందలి చరాచరప్రాణుల యందును ఆ పరమాత్మయే వ్యాపించియున్నాడు. కనుక, ఈ జగత్తునందలి యే పదార్థము నందును వ్యామోహమును పొందక ఆ ప్రభువు అనుగ్రహించిన వాటిచేతనే జీవితమును గడపవలెను. ఈ జగత్తునందలి సంపదలు ఏ యొక్కని సొంతము కాదు. కనుక, సర్వదా వాటిపై తృష్ణను విడిచి పెట్టవలెను. సమస్తకర్మలను భగవదర్పణ బుద్ధితో ఆచరింపవలెను.
అన్నింటికిని సాక్షి ఆ భగవంతుడే, బుద్ధి యొక్క వృత్తులు నేత్రములు మొదలగు ఇంద్రియములు ఆయనను చూడజాలవు. కాని, ఆయన జ్ఞానశక్తి అఖండమైనది. సకల ప్రాణుల హృదయములలో నివసించువాడును, సంగరహితుడును, స్వయంప్రకాశకుడును ఐన ఆ పరమాత్మను శరణు పొందవలెను.
ఆ పరమాత్మకు ఆది, మధ్యాంతములు లేవు. ఆయనకు తనవాడు, పరాయివాడు అను భేదములు లేవు. ఆయన ఉనికివలననే విశ్వము అంతయును నిలిచియున్నది. ఈ విరాట్ బ్రహ్మాండము పరమాత్మ స్వరూపము అగుటచే అదికూడా ఋతమనబడును.
ఈ విశ్వము ఆ పరబ్రహ్మ స్వరూపమే. అసంఖ్యాకములగు పేర్లు అన్నియును ఆయనవే. సర్వశక్తిమంతుడైన ఆయనయే సత్యము. ఆయన స్వయంప్రకాశకుడు, పుట్టుకలేనివాడు, పురాణ పురుషుడు. తన మాయాశక్తిచే ఈ విశ్వమును సృజించి, తాను స్వీకరించెను. విద్యాశక్తి ద్వారా దానిని త్యజించి (మాయాతీతుడై) నిష్క్రియుడై సత్స్వరూపముతో నిలిచియున్నాడు.
ఋషులు, మునులు నైష్కర్మ్యస్థితికై - అనగా పరబ్రహ్మముతో ఏకత్వమును పొందుటకై మొదట కర్మయోగమును అనుష్ఠించెదరు. తరచుగా కర్మలను ఆచరించు పురుషుడే చివరకు నిష్క్రియుడై కర్మలనుండి బయటపడును.
సర్వశక్తిమంతుడైన భగవంతుడు కూడా కర్మలను ఆచరించును. కాని, ఆ ప్రభువు పూర్ణకాముడగుటచే స్వలాభమునకై ఆ కర్మలయందు ఆసక్తుడుకాడు. కనుక, ఆయనను అనుసరించి అనాసక్తులై, కర్మలను ఆచరించువారు కూడా కర్మబంధము నుండి ముక్తులగుదురు.
భగవంతుడు జ్ఞానస్వరూపుడు. కనుక, ఆయనలో లేశమాత్రము అహంకారము లేదు. ఆయన అన్ని విధములుగా పరిపూర్ణుడు. అందువలనను ఆయనకు ఏ వస్తువుపైనను కోరికలేదు. ఆ ప్రభువు ఎవ్వరి ప్రేరణ లేకుండగనే స్వచ్ఛందముగా కర్మలను ఆచరించు చుండును. తాను స్థాపించిన మర్యాదలయందే నిలచి తన కర్మల ద్వారా మానవులకు శిక్షణను ఇచ్చుచుండును. ఆయన సమస్త ధర్మములకు ప్రవర్తకుడు. జీవన దాత. నేను ఆ స్వామిని శరణువేడుచున్నాను.
శ్రీశుక ఉవాచ
శ్రీశుకుడు వచించెను- పరీక్షిన్మహారాజా! ఒకసారి స్వాయంభువమనువు ఏకాగ్రచిత్తములో ఉపనిషద్రూపమైన ఈ వేదమంత్రమును పఠించుచుండెను. అతడు నిద్రలో అచేతనుడుగా ఉన్నాడని భావించి ఆకలి గొన్న రాక్షసులు అతనిని భక్షించుటకై అతనిపై విజృంభించిరి.
అట్లు మనువును భక్షించుటకై ఏతెంచిన రాక్షసులను జూచి, అంతర్యామియు, యజ్ఞపురుషుడు ఐన శ్రీహరి, యాములు అను తన పుత్రులైన దేవతలతోగూడి అచటికి విచ్చేసెను. పిమ్మట ఆ అసురులను సంహరించి యజ్ఞపురుషుడైన శ్రీహరియే ఇంద్రపదవిని అధిష్ఠించి, స్వర్గమును పరిపాలింపసాగెను.
మహారాజా! స్వారోచిషుడు రెండవమనువు. అతడు అగ్నిపుత్రుడు. అతనికి ద్యుమంతుడు, సుషేణుడు, రోచిష్మంతుడు మొదలగు పుత్రులు కలిగిరి.
ఆ మన్వంతరమున ఇంద్రుని పేరు రోచనుడు. ఇంకను తుషితులు మొదలగు దేవతాగుణములు ఊర్జస్తంభుడు మొదలగు వేదవేత్తలైన సప్తర్షులు ఉండిరి.
ఆ మన్వంతరమున వేదశిరుడు అను ఋషివలన అతని పత్నియైన తుషిత యందు భగవంతుడు అవతరించి, విభువు అను పేరుతో ప్రసిద్ధిగాంచెను.
అతడు తన జీవిత పర్యంతము బ్రహ్మచర్యవ్రతమును పాటించెను. అతని ఆచరణనుండి శిక్షణను పొందిన ఎనుబది ఎనిమిదివేల మంది ఋషులుగూడ వ్రతనిష్ఠతో బ్రహ్మచర్యమును పాటించిరి.
ప్రియవ్రతుని కుమారుడైన ఉత్తముడు మూడవ మనువు. అతనికి పవనుడు, సృంజయుడు, యజ్ఞహోత్రుడు మొదలగు కుమారులు కలిగిరి.
ఆ మన్వంతరమున వసిష్ఠునకు ప్రమదుడు మొదలగు ఏడుగురు సప్తర్షులు సుతులుగా జన్మించిరి. సత్యుడు, వేదశ్రుతుడు, భద్రుడు అనువారు దేవతలలో ప్రముఖులు. సత్యజిత్తు అనువాడు ఇంద్ర పదవిని చేపట్టెను.
ఆ సమయమున ధర్ముని పత్నియైన సూనృతయందు ఫురుషోత్తముడైన భగవంతుడు సత్యసేనుడు అను పేరున అవతరించెను. అతనితో గూడి సత్యవ్రతులు అను దేవతలుగూడ ఉండిరి.
ఆ సమయమున భగవంతుడు, ఇంద్రుడగు సత్యజిత్తునకు మిత్రుడై, అసత్యపరాయణులును, దుశ్శీలురును, దుష్టులును ఐన యక్షరాక్షసులను, జీవ ద్రోహులైన భూతగణములను సంహరించెను.
తామసుడు అనువాడు నాల్గవ మనువు. అతడు మూడవ మనువైన ఉత్తమునకు సోదరుడు. అతనికి పృథువు, ఖ్యాతి, నరుడు, కేతువు మొదలగు పదిమంది సుతులు కలిగిరి.
సత్యకుడు, హరి, వీరుడు అనువారు దేవతలలో ముఖ్యులు. ఆ మన్వంతరమున త్రిశిఖుడు అనువాడు ఇంద్రుడు. జ్యోతిర్ధాముడు మొదలగువారు సప్త ఋషులుగా ఉండిరి.
మహారాజా! ఆ తామస మన్వంతరమున విధృతికి పుత్రులై వైధృతులు అను దేవతలు గూడ ఉండిరి. వారు కాల ప్రభావమున నష్టప్రాయమైన వేదములను తమ శక్తిద్వారా రక్షించిరి. అందువలన వారు వైధృతులు- అని ప్రసిద్ధిగాంచిరి.
ఆ మన్వంతరమున హరిమేధుడు అను ఋషివలన హరిణి అను పేరుగల అతని పత్నియందు భగవంతుడు హరి యను పేర అవతరించెను. ఈ అవతారమున గజేంద్రుని మొసలి బారినుండి భగవంతుడు రక్షించెను.
రాజోవాచ
పరీక్షిన్మహారాజు ప్రశ్నించెను శుకమహర్షీ! భగవంతుడైన శ్రీహరి గజేంద్రుని మొసలి పట్టునుండి ఎట్లు విడిపించెనో నేను వినగోరుచున్నాను.
ఆ గజేంద్ర మోక్షణ వత్తాంతము అన్ని కథలలో ఉత్తమమైనది, అది పవిత్రము, ప్రశస్తము, శుభ ప్రదము. మహాత్ములు ఆ కథను గానము చేయుచు శ్రీహరిభగవానుని పవిత్రకీర్తిని ప్రశంసింతురు కదా!
సూత ఉవాచ
సూతుడు వచించెను శౌనకాదిమహర్షులారా! పరీక్షిన్మహారాజు శ్రీహరి కథలను వినుటకై ప్రాయోపవేశమునకు పూనుకొనెను. ఆ మహారాజు శ్రీశుకమహర్షిని ఇట్లు ప్రశ్నించగా ఆ మునీశ్వరుడు సంతోషించి, అతనిని అభినందించెను. పిమ్మట మహర్షులసభలో గజేంద్రమోక్షణ కథను వినిపించసాగెను.
ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం అష్టమస్కంధే ప్రథమోఽధ్యాయః (1)
ఇది భాగవత మహాపురాణమునందలి అష్టమ స్కంధమునందు ప్రథమాధ్యాయము (1)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
ప్రాంజలి ప్రభ ... అంతర్జాల పత్రిక (1)
: 22.7.2020 ప్రాతః కాల సందేశము, వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం
అష్టమ స్కంధము - ప్రథమాధ్యాయము, మన్వంతరముల వర్ణనము
పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం మరియు మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
(1 నుండి 10 శ్లోకాల తెలుగు తాత్పర్యము) ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
రాజోవాచ
పరీక్షిన్మహారాజు అడిగెను- గురుదేవా! స్వాయంభువ మనువుయొక్క వంశ విస్తృతిని గూర్చి నేను వింటిని. అదే వంశమునందు అతని కుమార్తెల ద్వారా మరీచి మొదలగు ప్రజాపతులను తమవంశ పరంపరను కొనసాగించిరి. ఇప్పుడు ఇతర మనువులను గురుంచి వర్ణింపుడు.
మహాత్మా! జ్ఞానులు ఏయే మన్వంతరములలో మహిమాన్వితుడైన భగవంతుని యొక్క అవతారములను, లీలలను వర్ణించిరో, వాటిని నాకు తప్పక వినిపింపుము. నేను శ్రద్ధగా వాటిని వినగోరుచున్నాను.
జగత్పతియైన శ్రీహరి గడచిన మన్వంతరములలో చేసిన, వర్తమానమునందు చేయుచున్న, భవిష్యన్మన్వంతరములలో చేయబోవు లీలలను వినిపింపుము.
ఋషిరువాచ
శ్రీశుకుడు వచించెను మహారాజా! ఈ కల్పమునందు స్వాయంభువుడు మున్నగు ఆరుగురు మనువుల యొక్క మన్వంతరములు గడచిపోయెను. వాటిలో మొదటి మన్వంతరమును గూర్చి నేను వర్ణించితిని. అందులో దేవతలు మొదలగు వారి యొక్క ఉత్పత్తి జరిగినది.
స్వాయంభువమనువు కుమార్తెయైన ఆకూతియందు యజ్ఞపురుషుని రూపములో భగవానుడు జన్మించి, ధర్మములను ఉపదేశించెను. అట్లే దేవహూతియందు ఆ ప్రభువు కపిలభగవానునిగా అవతరించి, జ్ఞానోపదేశమును చేసెను.
పరీక్షిన్మహారాజా! కఫిల భగవానునిగూర్చి మూడవ స్కంధములో వర్ణింపబడినది. ఇప్పుడు ఆకూతియందు యజ్ఞపురుషుడుగా అవతరించి చేసిన లీలలను వివరించెదను.
స్వాయంభువమనువు సకల విషయ భోగముల యెడ విరక్తుడై రాజ్యమును పరిత్యజించెను. పిమ్మట, తన భార్యయైన శతరూపతో గూడి తపమాచరించుటకై వనములకు వెళ్ళెను.
అతడు సునందానదీ తీరమున ఒంటి కాలిపై నిలబడి నూరు సంవత్సరములు తీవ్రమైన తపమొనర్చెను. ఆ సమయమున అతడు నిత్యము ఈ విధముగా భగవంతుని స్తుతించెను.
మనురువాచ
మనువు పలికెను పరమాత్మ చేతనను పొంది విశ్వము చైతన్యవంతమగును. కాని, విశ్వము మాత్రము ఆయనను చైతన్యవంతునిగా చేయజాలదు. ఆ ప్రభువు ప్రళయకాలమున నిద్రించు చున్నను మేల్కొనియే యుండును. ఆ విషయమును ఆయన ఎరుగును. కాని, విశ్వము మాత్రము తెలియజాలదు. కనుకనే, అతడు పరమాత్ముడు.
ఈ సమస్త విశ్వమునందును, అందలి చరాచరప్రాణుల యందును ఆ పరమాత్మయే వ్యాపించియున్నాడు. కనుక, ఈ జగత్తునందలి యే పదార్థము నందును వ్యామోహమును పొందక ఆ ప్రభువు అనుగ్రహించిన వాటిచేతనే జీవితమును గడపవలెను. ఈ జగత్తునందలి సంపదలు ఏ యొక్కని సొంతము కాదు. కనుక, సర్వదా వాటిపై తృష్ణను విడిచి పెట్టవలెను. సమస్తకర్మలను భగవదర్పణ బుద్ధితో ఆచరింపవలెను.
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి అష్టమస్కంధములోని ప్రథమ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
7702090319
Only admins can send messages
[04:50, 22/07/2020] +91 95058 13235: 22.7.2020 ప్రాతః కాల సందేశము
వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం
అష్టమ స్కంధము - ప్రథమాధ్యాయము
మన్వంతరముల వర్ణనము
ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
రాజోవాచ
1.1 (ప్రథమ శ్లోకము)
స్వాయంభువస్యేహ గురో వంశోఽయం విస్తరాచ్ఛ్రుతః |
యత్ర విశ్వసృజాం సర్గో మనూనన్యాన్ వదస్వ నః॥6326॥
పరీక్షిన్మహారాజు అడిగెను- గురుదేవా! స్వాయంభువ మనువుయొక్క వంశ విస్తృతిని గూర్చి నేను వింటిని. అదే వంశమునందు అతని కుమార్తెల ద్వారా మరీచి మొదలగు ప్రజాపతులను తమవంశ పరంపరను కొనసాగించిరి. ఇప్పుడు ఇతర మనువులను గురుంచి వర్ణింపుడు.
1.2 (రెండవ శ్లోకము)
యత్ర యత్ర హరేర్జన్మ కర్మాణి చ మహీయసః|
గృణంతి కవయో బ్రహ్మంస్తాని నో వద శృణ్వతామ్॥6327॥
మహాత్మా! జ్ఞానులు ఏయే మన్వంతరములలో మహిమాన్వితుడైన భగవంతుని యొక్క అవతారములను, లీలలను వర్ణించిరో, వాటిని నాకు తప్పక వినిపింపుము. నేను శ్రద్ధగా వాటిని వినగోరుచున్నాను.
1.3 (మూడవ శ్లోకము)
యద్యస్మిన్నంతరే బ్రహ్మన్ భగవాన్ విశ్వభావనః|
కృతవాన్ కురుతే కర్తా హ్యతీతేఽనాగతేఽద్య వా॥6328॥
జగత్పతియైన శ్రీహరి గడచిన మన్వంతరములలో చేసిన, వర్తమానమునందు చేయుచున్న, భవిష్యన్మన్వంతరములలో చేయబోవు లీలలను వినిపింపుము.
ఋషిరువాచ
1.4 (నాలుగవ శ్లోకము)
మనవోఽస్మిన్ వ్యతీతాః షట్ కల్పే స్వాయంభువాదయః|
ఆద్యస్తే కథితో యత్ర దేవాదీనాం చ సంభవః॥6329॥
శ్రీశుకుడు వచించెను మహారాజా! ఈ కల్పమునందు స్వాయంభువుడు మున్నగు ఆరుగురు మనువుల యొక్క మన్వంతరములు గడచిపోయెను. వాటిలో మొదటి మన్వంతరమును గూర్చి నేను వర్ణించితిని. అందులో దేవతలు మొదలగు వారి యొక్క ఉత్పత్తి జరిగినది.
1.5 (ఐదవ శ్లోకము)
ఆకూత్యాం దేవహూత్యాం చ దుహిత్రోస్తస్య వై మనోః|
ధర్మజ్ఞానోపదేశార్థం భగవాన్ పుత్రతాం గతః॥6330॥
స్వాయంభువమనువు కుమార్తెయైన ఆకూతియందు యజ్ఞపురుషుని రూపములో భగవానుడు జన్మించి, ధర్మములను ఉపదేశించెను. అట్లే దేవహూతియందు ఆ ప్రభువు కపిలభగవానునిగా అవతరించి, జ్ఞానోపదేశమును చేసెను.
15.6 (ఆరవ శ్లోకము)
కృతం పురా భగవతః కపిలస్యానువర్ణితమ్|
ఆఖ్యాస్యే భగవాన్ యజ్ఞో యచ్చకార కురూద్వహ॥6331॥
పరీక్షిన్మహారాజా! కఫిల భగవానునిగూర్చి మూడవ స్కంధములో వర్ణింపబడినది. ఇప్పుడు ఆకూతియందు యజ్ఞపురుషుడుగా అవతరించి చేసిన లీలలను వివరించెదను.
15.7 (ఏడవ శ్లోకము)
విరక్తః కామభోగేషు శతరూపాపతిః ప్రభుః|
విసృజ్య రాజ్యం తపసే సభార్యో వనమావిశత్॥6332॥
స్వాయంభువమనువు సకల విషయ భోగముల యెడ విరక్తుడై రాజ్యమును పరిత్యజించెను. పిమ్మట, తన భార్యయైన శతరూపతో గూడి తపమాచరించుటకై వనములకు వెళ్ళెను.
1.8 (ఎనిమిదవ శ్లోకము)
సునందాయాం వర్షశతం పదైకేన భువం స్పృశన్|
తప్యమానస్తపో ఘోరమిదమన్వాహ భారత॥6333॥
అతడు సునందానదీ తీరమున ఒంటి కాలిపై నిలబడి నూరు సంవత్సరములు తీవ్రమైన తపమొనర్చెను. ఆ సమయమున అతడు నిత్యము ఈ విధముగా భగవంతుని స్తుతించెను.
మనురువాచ
1.9 (తొమ్మిదవ శ్లోకము)
యేన చేతయతే విశ్వం విశ్వం చేతయతే న యమ్|
యో జాగర్తి శయానేఽస్మిన్నాయం తం వేద వేద సః॥6334॥
మనువు పలికెను పరమాత్మ చేతనను పొంది విశ్వము చైతన్యవంతమగును. కాని, విశ్వము మాత్రము ఆయనను చైతన్యవంతునిగా చేయజాలదు. ఆ ప్రభువు ప్రళయకాలమున నిద్రించు చున్నను మేల్కొనియే యుండును. ఆ విషయమును ఆయన ఎరుగును. కాని, విశ్వము మాత్రము తెలియజాలదు. కనుకనే, అతడు పరమాత్ముడు.
1.10 (పదియవ శ్లోకము)
ఆత్మావాస్యమిదం విశ్వం యత్కించిజ్జగత్యాం జగత్|
తేన త్యక్తేన భుంజీథా మా గృధః కస్య స్విద్ధనమ్॥6335॥
ఈ సమస్త విశ్వమునందును, అందలి చరాచరప్రాణుల యందును ఆ పరమాత్మయే వ్యాపించియున్నాడు. కనుక, ఈ జగత్తునందలి యే పదార్థము నందును వ్యామోహమును పొందక ఆ ప్రభువు అనుగ్రహించిన వాటిచేతనే జీవితమును గడపవలెను. ఈ జగత్తునందలి సంపదలు ఏ యొక్కని సొంతము కాదు. కనుక, సర్వదా వాటిపై తృష్ణను విడిచి పెట్టవలెను. సమస్తకర్మలను భగవదర్పణ బుద్ధితో ఆచరింపవలెను.
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి అష్టమస్కంధములోని ప్రథమ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
22.7.2020 సాయం కాల సందేశము
వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం
అష్టమ స్కంధము - ప్రథమాధ్యాయము
మన్వంతరముల వర్ణనము
ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
1.11 (పదకొండవ శ్లోకము)
యం న పశ్యతి పశ్యంతం చక్షుర్యస్య న రిష్యతి|
తం భూతనిలయం దేవం సుపర్ణముపధావత॥6336॥
అన్నింటికిని సాక్షి ఆ భగవంతుడే, బుద్ధి యొక్క వృత్తులు నేత్రములు మొదలగు ఇంద్రియములు ఆయనను చూడజాలవు. కాని, ఆయన జ్ఞానశక్తి అఖండమైనది. సకల ప్రాణుల హృదయములలో నివసించువాడును, సంగరహితుడును, స్వయంప్రకాశకుడును ఐన ఆ పరమాత్మను శరణు పొందవలెను.
1.12 (పండ్రెండవ శ్లోకము)
న యస్యాద్యంతౌ మధ్యం చ స్వః పరో నాంతరం బహిః|
విశ్వస్యామూని యద్యస్మాద్విశ్వం చ తదృతం మహత్॥6337॥
ఆ పరమాత్మకు ఆది, మధ్యాంతములు లేవు. ఆయనకు తనవాడు, పరాయివాడు అను భేదములు లేవు. ఆయన ఉనికివలననే విశ్వము అంతయును నిలిచియున్నది. ఈ విరాట్ బ్రహ్మాండము పరమాత్మ స్వరూపము అగుటచే అదికూడా ఋతమనబడును.
1.13 (పదమూడవ శ్లోకము)
స విశ్వకాయః పురుహూత ఈశః సత్యః స్వయంజ్యోతిరజః పురాణః|
ధత్తేఽస్య జన్మాద్యజయాఽఽత్మశక్త్యా తాం విద్యయోదస్య నిరీహ ఆస్తే॥6338॥
ఈ విశ్వము ఆ పరబ్రహ్మ స్వరూపమే. అసంఖ్యాకములగు పేర్లు అన్నియును ఆయనవే. సర్వశక్తిమంతుడైన ఆయనయే సత్యము. ఆయన స్వయంప్రకాశకుడు, పుట్టుకలేనివాడు, పురాణ పురుషుడు. తన మాయాశక్తిచే ఈ విశ్వమును సృజించి, తాను స్వీకరించెను. విద్యాశక్తి ద్వారా దానిని త్యజించి (మాయాతీతుడై) నిష్క్రియుడై సత్స్వరూపముతో నిలిచియున్నాడు.
1.14 (పదునాలుగవ శ్లోకము)
అథాగ్రే ఋషయః కర్మాణీహంతేఽకర్మహేతవే|
ఈహమానో హి పురుషః ప్రాయోఽనీహాం ప్రపద్యతే॥6339॥
ఋషులు, మునులు నైష్కర్మ్యస్థితికై - అనగా పరబ్రహ్మముతో ఏకత్వమును పొందుటకై మొదట కర్మయోగమును అనుష్ఠించెదరు. తరచుగా కర్మలను ఆచరించు పురుషుడే చివరకు నిష్క్రియుడై కర్మలనుండి బయటపడును.
1.15 (పదునైదవ శ్లోకము)
ఈహతే భగవానీశో న హి తత్ర విషజ్జతే|
ఆత్మలాభేన పూర్ణార్థో నావసీదంతి యేఽను తమ్॥6340॥
సర్వశక్తిమంతుడైన భగవంతుడు కూడా కర్మలను ఆచరించును. కాని, ఆ ప్రభువు పూర్ణకాముడగుటచే స్వలాభమునకై ఆ కర్మలయందు ఆసక్తుడుకాడు. కనుక, ఆయనను అనుసరించి అనాసక్తులై, కర్మలను ఆచరించువారు కూడా కర్మబంధము నుండి ముక్తులగుదురు.
1.16 (పదహారవ శ్లోకము)
తమీహమానం నిరహంకృతం బుధం నిరాశిషం పూర్ణమనన్యచోదితమ్|
నౄన్ శిక్షయంతం నిజవర్త్మసంస్థితం ప్రభుం ప్రపద్యేఽఖిలధర్మభావనమ్॥6341॥
భగవంతుడు జ్ఞానస్వరూపుడు. కనుక, ఆయనలో లేశమాత్రము అహంకారము లేదు. ఆయన అన్ని విధములుగా పరిపూర్ణుడు. అందువలనను ఆయనకు ఏ వస్తువుపైనను కోరికలేదు. ఆ ప్రభువు ఎవ్వరి ప్రేరణ లేకుండగనే స్వచ్ఛందముగా కర్మలను ఆచరించు చుండును. తాను స్థాపించిన మర్యాదలయందే నిలచి తన కర్మల ద్వారా మానవులకు శిక్షణను ఇచ్చుచుండును. ఆయన సమస్త ధర్మములకు ప్రవర్తకుడు. జీవన దాత. నేను ఆ స్వామిని శరణువేడుచున్నాను.
శ్రీశుక ఉవాచ
1.17 (పదునేడవ శ్లోకము)
ఇతి మంత్రోపనిషదం వ్యాహరంతం సమాహితమ్|
దృష్ట్వాసురా యాతుధానా జగ్ధుమభ్యద్రవన్ క్షుధా॥6342॥
శ్రీశుకుడు వచించెను- పరీక్షిన్మహారాజా! ఒకసారి స్వాయంభువమనువు ఏకాగ్రచిత్తములో ఉపనిషద్రూపమైన ఈ వేదమంత్రమును పఠించుచుండెను. అతడు నిద్రలో అచేతనుడుగా ఉన్నాడని భావించి ఆకలి గొన్న రాక్షసులు అతనిని భక్షించుటకై అతనిపై విజృంభించిరి.
1.18 (పదునెనిమిదవ శ్లోకము)
తాంస్తథావసితాన్ వీక్ష్య యజ్ఞః సర్వగతో హరిః|
యామైః పరివృతో దేవైర్హత్వాశాసత్త్రివిష్టపమ్॥6343॥
అట్లు మనువును భక్షించుటకై ఏతెంచిన రాక్షసులను జూచి, అంతర్యామియు, యజ్ఞపురుషుడు ఐన శ్రీహరి, యాములు అను తన పుత్రులైన దేవతలతోగూడి అచటికి విచ్చేసెను. పిమ్మట ఆ అసురులను సంహరించి యజ్ఞపురుషుడైన శ్రీహరియే ఇంద్రపదవిని అధిష్ఠించి, స్వర్గమును పరిపాలింపసాగెను.
1.19 (పందొమ్మిదవ శ్లోకము)
స్వారోచిషో ద్వితీయస్తుథ మనురగ్నేః సుతోఽభవత్|
ద్యుమత్సుషేణరోచిష్మత్ప్రముఖాస్తస్య చాత్మజాః॥6344॥
మహారాజా! స్వారోచిషుడు రెండవమనువు. అతడు అగ్నిపుత్రుడు. అతనికి ద్యుమంతుడు, సుషేణుడు, రోచిష్మంతుడు మొదలగు పుత్రులు కలిగిరి.
1.20 (ఇరువదియవ శ్లోకము)
తత్రేంద్రో రోచనస్త్వాసీద్దేవాశ్చ తుషితాదయః|
ఊర్జస్తంభాదయః సప్త ఋషయో బ్రహ్మవాదినః॥6345॥
ఆ మన్వంతరమున ఇంద్రుని పేరు రోచనుడు. ఇంకను తుషితులు మొదలగు దేవతాగుణములు ఊర్జస్తంభుడు మొదలగు వేదవేత్తలైన సప్తర్షులు ఉండిరి.
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి అష్టమస్కంధములోని ప్రథమ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
23.7.2020 ప్రాతః కాల సందేశము
వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం
అష్టమ స్కంధము - ప్రథమాధ్యాయము
మన్వంతరముల వర్ణనము
ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
1.21 (ఇరువది ఒకటవ శ్లోకము)
ఋషేస్తు వేదశిరసస్తుషితా నామ పత్న్యభూత్|
తస్యాం జజ్ఞే తతో దేవో విభురిత్యభివిశ్రుతః॥6346॥
ఆ మన్వంతరమున వేదశిరుడు అను ఋషివలన అతని పత్నియైన తుషిత యందు భగవంతుడు అవతరించి, విభువు అను పేరుతో ప్రసిద్ధిగాంచెను.
1.22 (ఇరువది రెండవ శ్లోకము)
అష్టాశీతిసహస్రాణి మునయో యే ధృతవ్రతాః|
అన్వశిక్షన్ వ్రతం తస్య కౌమారబ్రహ్మచారిణః॥6347॥
అతడు తన జీవిత పర్యంతము బ్రహ్మచర్యవ్రతమును పాటించెను. అతని ఆచరణనుండి శిక్షణను పొందిన ఎనుబది ఎనిమిదివేల మంది ఋషులుగూడ వ్రతనిష్ఠతో బ్రహ్మచర్యమును పాటించిరి.
1.23 (ఇరువది మూడవ శ్లోకము)
తృతీయ ఉత్తమో నామ ప్రియవ్రతసుతో మనుః|
పవనః సృంజయో యజ్ఞహోత్రాద్యాస్తత్సుతా నృప॥6348॥
ప్రియవ్రతుని కుమారుడైన ఉత్తముడు మూడవ మనువు. అతనికి పవనుడు, సృంజయుడు, యజ్ఞహోత్రుడు మొదలగు కుమారులు కలిగిరి.
1.24 (ఇరువది నాలుగవ శ్లోకము)
వసిష్ఠతనయాః సప్త ఋషయః ప్రమదాదయః|
సత్యా వేదశ్రుతా భద్రా దేవా ఇంద్రస్తు సత్యజిత్॥6349॥
ఆ మన్వంతరమున వసిష్ఠునకు ప్రమదుడు మొదలగు ఏడుగురు సప్తర్షులు సుతులుగా జన్మించిరి. సత్యుడు, వేదశ్రుతుడు, భద్రుడు అనువారు దేవతలలో ప్రముఖులు. సత్యజిత్తు అనువాడు ఇంద్ర పదవిని చేపట్టెను.
1.25 (ఇరువది ఐదవ శ్లోకము)
ధర్మస్య సూనృతాయాం తు భగవాన్ పురుషోత్తమః|
సత్యసేన ఇతి ఖ్యాతో జాతః సత్యవ్రతైః సహ॥6350॥
ఆ సమయమున ధర్ముని పత్నియైన సూనృతయందు ఫురుషోత్తముడైన భగవంతుడు సత్యసేనుడు అను పేరున అవతరించెను. అతనితో గూడి సత్యవ్రతులు అను దేవతలుగూడ ఉండిరి.
1.26 (ఇరువది ఆరవ శ్లోకము)
సోఽనృతవ్రతదుఃశీలానసతో యక్షరాక్షసాన్|
భూతద్రుహో భూతగణాంస్త్వవధీత్సత్యజిత్సఖః॥6351॥
ఆ సమయమున భగవంతుడు, ఇంద్రుడగు సత్యజిత్తునకు మిత్రుడై, అసత్యపరాయణులును, దుశ్శీలురును, దుష్టులును ఐన యక్షరాక్షసులను, జీవ ద్రోహులైన భూతగణములను సంహరించెను.
1.27 (ఇరువది ఏడవ శ్లోకము)
చతుర్థ ఉత్తమభ్రాతా మనుర్నామ్నా చ తామసః|
పృథుః ఖ్యాతిర్నరః కేతురిత్యాద్యా దశ తత్సుతాః॥6352॥
తామసుడు అనువాడు నాల్గవ మనువు. అతడు మూడవ మనువైన ఉత్తమునకు సోదరుడు. అతనికి పృథువు, ఖ్యాతి, నరుడు, కేతువు మొదలగు పదిమంది సుతులు కలిగిరి.
1.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)
సత్యకా హరయో వీరా దేవాస్త్రిశిఖ ఈశ్వరః|
జ్యోతిర్ధామాదయః సప్త ఋషయస్తామసేఽన్తరే॥6353॥
సత్యకుడు, హరి, వీరుడు అనువారు దేవతలలో ముఖ్యులు. ఆ మన్వంతరమున త్రిశిఖుడు అనువాడు ఇంద్రుడు. జ్యోతిర్ధాముడు మొదలగువారు సప్త ఋషులుగా ఉండిరి.
1.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)
దేవా వైధృతయో నామ విధృతేస్తనయా నృప|
నష్టాః కాలేన యైర్వేదా విధృతాః స్వేన తేజసా॥6354॥
మహారాజా! ఆ తామస మన్వంతరమున విధృతికి పుత్రులై వైధృతులు అను దేవతలు గూడ ఉండిరి. వారు కాల ప్రభావమున నష్టప్రాయమైన వేదములను తమ శక్తిద్వారా రక్షించిరి. అందువలన వారు వైధృతులు- అని ప్రసిద్ధిగాంచిరి.
1.30 (ముప్పదియవ శ్లోకము)
తత్రాపి జజ్ఞే భగవాన్ హరిణ్యాం హరిమేధసః|
హరిరిత్యాహృతో యేన గజేంద్రో మోచితో గ్రహాత్॥6355॥
ఆ మన్వంతరమున హరిమేధుడు అను ఋషివలన హరిణి అను పేరుగల అతని పత్నియందు భగవంతుడు హరి యను పేర అవతరించెను. ఈ అవతారమున గజేంద్రుని మొసలి బారినుండి భగవంతుడు రక్షించెను.
రాజోవాచ
1.31 (ముప్పది ఒకటవ శ్లోకము)
బాదరాయణ ఏతత్తే శ్రోతుమిచ్ఛామహే వయమ్|
హరిర్యథా గజపతిం గ్రాహగ్రస్తమమూముచత్॥6356॥
పరీక్షిన్మహారాజు ప్రశ్నించెను శుకమహర్షీ! భగవంతుడైన శ్రీహరి గజేంద్రుని మొసలి పట్టునుండి ఎట్లు విడిపించెనో నేను వినగోరుచున్నాను.
1.32 (ముప్పది రెండవ శ్లోకము)
తత్కథా సుమహత్పుణ్యం ధన్యం స్వస్త్యయనం శుభమ్|
యత్ర యత్రోత్తమశ్లోకో భగవాన్ గీయతే హరిః॥6357॥
ఆ గజేంద్ర మోక్షణ వత్తాంతము అన్ని కథలలో ఉత్తమమైనది, అది పవిత్రము, ప్రశస్తము, శుభ ప్రదము. మహాత్ములు ఆ కథను గానము చేయుచు శ్రీహరిభగవానుని పవిత్రకీర్తిని ప్రశంసింతురు కదా!
సూత ఉవాచ
1.33 (ముప్పది మూడవ శ్లోకము)
పరీక్షితైవం స తు బాదరాయణిః ప్రాయోపవిష్టేన కథాసు చోదితః|
ఉవాచ విప్రాః ప్రతినంద్య పార్థివం ముదా మునీనాం సదసి స్మ శృణ్వతామ్॥6358॥

No comments:
Post a Comment