Monday, 30 August 2021

oooo


572. 'పరాశక్తిః' 

ప్రళయమునకు ఆవల పరముగా నుండు శక్తి స్వరూపిణి శ్రీమాత అని అర్థము. సృష్టి యందు శ్రీమాత నవశక్తులుగ, నవదుర్గలుగా నవావర్ణము లను నడిపించుచూ ఈశ్వరిగా పనిచేయు చుండును. సృష్టికావల పరమైన శక్తిగా నుండును. అనగా శివునితో ఐక్యముచెంది యుండును. శివుడు లేక శివమునకు అంకె పది. అది సత్యము, సుందరము, శాశ్వతము, మార్పున కతీతము అయిన స్థితి. అది అవ్యయము, అవ్యక్తము, మరి యొకటి లేని అనన్య స్థితి. అందు శ్రీమాత “పరా” అయి వున్నది. పరదేవత అని కూడ పిలుతురు. 'పరావాక్కు' అందురు

శ్రీమాతను 'పరమ ఈశ్వరీ' అందురు. సృష్టి యందామెయే దేవత. అనగా వెలుగు రూపము. అట్టి దేవతకు పరమైనది గనుక పరదేవత. సృష్టి యందామెయే సంకల్పమై వర్తించును. సృష్టి అంతయూ ఆమె ఉచ్ఛారణమే. సంకల్పము గాను, భావముగాను, భాషగాను, భాషణముగాను ఆమెయే వ్యక్తమగు చుండును. ఇట్టి వ్యక్తమగు తత్త్వమును ఋగ్వేదమందు వాక్కు అనిరి. అట్టి వాక్కునకు కూడ పరమై శ్రీమాత యున్నది. అందువలన పరావాక్కు అట్లే శక్తికి పరమై యున్నది. అనగా నవశక్తులకు పరమై యుండునది. సృష్టియందామె ఈశ్వరి, అనగా యజమాని.

సృష్టికి పరమైన తత్వము నందు వసించును గనుక ఈశ్వరీ తత్త్వమునకు కూడ పరమైనది. ఇట్లు తెలిసిన దానికెల్ల పరమైనదిగా 'పరమ పథము' వున్నది. 'పరా' శబ్దము అతీతమును, అవ్యక్తమును, అప్రజ్ఞాతమును, అవిజ్ఞేయమును, అప్రతర్క్యమును, అనిర్వచనీయమును సూచించును. సృష్టి యందు మూల ప్రకృతిగను, త్రిగుణములుగను, పంచ భూతములుగను వున్న శ్రీమాత సృష్టికావల పదియవదిగ పరాశక్తి అయి వున్నది. మన దేహమందు కూడ పదియవ ధాతువు పరాశక్తి అని చెప్పబడుచున్నది.

జీవుని యందు సప్త ధాతువులతో పాటు ప్రాణము, జీవుడు కలిపి నవధాతువులు యేర్పడుటకు కారణము పదియవ ధాతువు. ఈ ధాతువును మన యందలి పరాశక్తి అందురు. దేహమందు ఐదు ధాతువులు శక్తి మూలకములు. అవి ఆరోహణ క్రమమున ఎముకలు, చర్మము, రక్తము, మాంసము, మెదడు. నాలుగు ధాతువులు శివ మూలకములు. అవి వరుసగా మజ్జ, శుక్లము, ప్రాణము, జీవుడు. శక్తి మూలకము లనగా ప్రధానముగ శక్తి కలిగి యుండునవి. శివ మూలకము లనగా ప్రధానముగ శివుడుండు స్థానములు. నిజమున కన్నియునూ శివశక్తి సమ్మేళన స్థితులే.

శివ మూలకములగు ధాతువులు సూక్ష్మముగ నుండును. శక్తి మూలకములగు ధాతువులు ముందు వాటికన్న స్థూలమై యుండును. అన్నింటినీ శక్తియే నిర్మాణము చేయును. శివ మూలకములు నాలుగు, శక్తి మూలకములు ఐదుగా నవధాతువులు నిర్మాణమై మానవదేహ మున్నది. అందు వసించునది కూడ శివశక్తులే. ఈ రహస్యము తెలుపుటకే శ్రీచక్ర రాజము ఋషులు అందించినారు. శ్రీ చక్రమందు ఐదు త్రిభుజములు అధో ముఖములు, నాలుగు త్రిభుజములు ఊర్ధ్వ ముఖములు అయి ఒక దానిపై నొకటి పేర్చబడి యుండును. మేరువు నందు శివశక్తులు వసించి యుందురు.

దేహమందలి శిఖరమే శ్రీచక్ర మేరువు. అచ్చట సహస్రార చక్రము కలదు. అందు శివశక్తులు పరమై యుందురు. అచ్చట నుండి శ్రీమాత మూలాధారము వరకు అవరోహణ క్రమమున నవావర్ణ దేహమును నిర్మించును. అట్లు నిర్మించి మూలాధారమున కుండలినిగ వసించును. ఆరోహణ క్రమమున మొదటి ఐదు ఆవరణములు శక్త్యానుభూతిని, తరువాత నాలుగు ఆవరణలు శివశక్త్యానుభూతిని కలిగించ గలవు. అటుపైన మేరువు నందు జీవుడు ఐక్యము చెందును. పరాశక్తిని చేరుట యనగా తానుండక శివశక్తి స్వరూపముగ మిగులుట. పరాశక్తి ధ్యానము చేయువారు ఈ మార్గము నంతనూ ఎరిగినవారై యుందురు.

573. 'పరానిష్ఠా'

పరము నందే నిష్ఠ గలది శ్రీమాత అని అర్థము. పరమే శివము, సత్యము అని మరల మరల చెప్పవలసి యున్నది. పరమే శ్రీమాత స్వస్థానము. ఆమె పరమును వీడి యుండజాలదు, వుండుట కిచ్చపడదు. శివునితో అవినాభావ సమ్యక్ బంధము కలది. అట్టి శ్రీమాత కేవలము జీవకోట్ల కోసము, వారిపై తనకు గల అపార ప్రేమ కారణముగ నవావరణ సృష్టి గావించును. సృష్టి నిర్మాణము, పాలనము, ఇత్యాదివి గావించుట మహత్తరమగు ఇచ్ఛా, జ్ఞాన, క్రియా కలాపము. ఇట్టి కలాప మందున్ననూ శివుని వీడక యుండును. శివునితో నుండియే సర్వమునూ నిర్వహించును. ఇది అనుపమానము. అనన్య సాధ్యము. శివుని యందుండి సృష్టిగా వ్యాప్తిచెంది అందు జీవులను ప్రవేశింపజేసి వారి పరిణామ కథను నిర్వర్తించుచూ కాలానుసారము ప్రళయములను గావించుచూ అత్యద్భుతమగు విన్యాసమును శ్రీమాత నేర్పుచు నుండును.

క్రియ యందున్నప్పుడు జ్ఞాన మందుండ కుండుట జీవుల కెంత సహజమో, శ్రీమాతకు శివ జ్ఞానము నందుండుట అంత సహజము. శివజ్ఞానము నందు తిష్ఠవేసి ఆ నిష్ఠతో ఇచ్ఛా జ్ఞాన శక్తులను తన నుండి వ్యక్తము గావించి, మహదహంకారము నేర్పరచి, పంచ భూతముల నేర్పరచి ఈ మొత్తమునందు జీవులను  ప్రవేశింప జేసి, సూర్యాది మండలములను నిర్వహించుచూ కూడ ఎల్లప్పుడును శివునితోనే కూడియుండును. ఇట్టి నిష్ఠ అనన్య సాధ్యము. ఆమె నిష్ఠకు కూడ పరమే. దీక్షలు, నిష్ఠలు స్వీకరించువారు శ్రీమాత ఆరాధనముననే వాని యందు నిలచి కృతకృత్యులు కావలెను. శ్రీమాత అనుగ్రహము లేనిచో దీక్షలు, నిష్ఠలు భంగమగు చుండును.

574. 'ప్రజ్ఞాన ఘనరూపిణీ'

ఘనీభవించిన ప్రజ్ఞానరూపిణి శ్రీమాత అని అర్థము. ఘనము పరిపూర్ణరూపము. గోళము మరియొక పరిపూర్ణ రూపము. శ్రీమాత ఘనరూపిణి అనగా అవతరణము చెంది ఘనమై నిలచిన ప్రజ్ఞ అని అర్థము. చతురస్రము అవతరణమునకు, వృత్తము తిరోగమనమునకు సంకేతములు. దేవతల నారాధించినపుడు వారి నాహ్వానించుటకు, వారి అవతరణకు చతురస్రములగు పీఠముల నేర్పరచ వలెను. ఊర్ధ్వలోకములకు ఆరోహణము చేయువారు వృత్తాకారమును వినియోగింతురు. సృష్టి నేర్పరచు శ్రీమాత ఘనరూపము వహించును. సృష్టి మొదట గోళముగ వ్యక్తమైననూ అటుపైన ఘన రూపము దాల్చును. తిరోధానమందు మరల ఘనము గోళమై, గోళము అవ్యక్తమును చేరును.

*శ్రీమాత ప్రకటింపబడిన జ్ఞానరూపిణి. లవలేశమైననూ అజ్ఞాన ముచే తాక బడనది. లోపల వెలుపల ఒకే విధమగు ప్రజ్ఞతో కూడి యుండునది. ఈ కారణము చేత కూడ ఆమెను 'ప్రజ్ఞాన ఘనరూపిణి' అని కీర్తింతురు. శ్రీమాత ఘనరూపము దాల్చును అనుటలో విశేషార్థ మున్నది. ఘనమునకు ఆరు ముఖము లుండును. ఒక్కొక్క ముఖము ఒక్కొక్క చతురస్రముగ నేర్పడును. ఒక చతురస్రమున నాలుగు లంబకోణము లుండును. ఆరు చతురస్రములందు ఇరువది నాలుగు లంబకోణము లుండును. మొత్తము ఇరువది నాలుగు (24) లంబకోణములుగ ఘనము వున్నది. ఈ ఇరువది నాలుగు తత్త్వములుగనే సృష్టి ఏర్పడును. ఇట్లు తాను ఘనరూపమై తత్వార్థ వర్ణాత్మికయై సృష్టిగ యేర్పడును. *

సృష్టి యందు ఇరువది నాలుగు తత్త్వములు, ఇరువది నాలుగు అర్థములు, వర్ణములు (అనగా అక్షరములు, శబ్దములు, రంగులు) గుర్తించిన ఋషులు శ్రీమాతను గాయత్రిగా, తత్వార్థ వర్ణాత్మికగ కీర్తించిరి. "చతుర్ వింశతి అక్షర, త్రిపథ, షట్కుక్షి" అని కూడ ప్రశంసించిరి. శ్రీమాతయే చతుర్ వింశతి (24) అక్షరములుగ యేర్పడినది. త్రిపథగ ప్రవహించును. అవియే మూడు శక్తులు, మూడు గుణములు. ఆమె షట్కుక్షి అనగా ఆరు. ఆరు కేంద్రముల నేర్పరచి, ఉత్పత్తి గావించును. ఘనమును గూర్చి విశిష్టమగు జ్ఞానమును ఋషులు దర్శించి అందించిరి. కాలమును కూడ ఘనముతో పోల్చి చెప్పిరి. 24 గంటల కాలము, ఇరువది నాలుగు పక్షములతో కూడిన సంవత్సర కాలము. ఇట్లు ఇరువది నాలుగు సంఖ్యతో సృష్టి నెఱుగు విధానమును ఋషులు యేర్పరచిరి.

ఇరువది నాలుగు సంఖ్య యందు రెండు ద్వాదశము లున్నవి. నాలుగు షట్కము లున్నవి. ఆరు చతురస్రము లున్నవి. ఎనిమిది త్రిభుజము లున్నవి. మూడు అష్ట భుజు లున్నవి. వీని రహస్యముల నెఱుగు గుప్తవిద్య యున్నది. ఘనము నందలి రహస్యముల నెఱుగుట ఘనవిద్య యగును. ఈ విద్యకు కూడ శ్రీమాత అనుగ్రహము ప్రధానము. ఇటీవలి కాలమున ఈ ఘనవిద్య నావిష్కరించిన సిద్దురాలు రష్యాదేశపు వనితయైన హెలీనా పెట్రోవా బ్లావెట్స్కీ ఆమె అందించిన గుప్తవిద్య యందు సృష్టి విజ్ఞాన మంతయూ యిమిడి యున్నది. మన్వంతర రహస్యము లన్నియూ విడమరచినది. శ్రీమాత విజ్ఞాన ఘన రూపత్వము విశదముగ వివరించి ఆధునిక యుగమున ప్రాక్ - పశ్చిమ దేశములలో జ్ఞానమాతగ కీర్తింపబడు చున్నది. ఘనమగు రహస్యములతో కూడినది ఘనవిద్య. శ్రీమాత ఘనవిద్యా స్వరూపిణి కూడను


575, 576. 'మాధ్వీపానాలసా, మత్తా'- 1 🌻

మధుపానము గ్రోలి మత్తెక్కినట్లు గోచరించు శ్రీమాత అని అర్థము. మధు వనగా మధ్యము కాదు మధువు మేలుజాతి పుష్పములందేర్పడు అత్యంత మధురమైన రసము. ఆ రసమును గ్రోలి మత్తుగా నున్న కన్నులతో తన్మయత్వమున నుండునది శ్రీమాత. మధువు గ్రోలుట బాలకృష్ణుడు వెన్న దొంగిలించుట వంటిది. భక్తులు భగవదారాధనమున కరగి తన్మయులై యుండగా వారి హృదయ పద్మముల నుండి భక్తిరస ముద్భవించును. అట్టి భక్తిని మధురభక్తి అందురు. అట్టి భక్తియందు కలుగు రసము మధురసము. దానిని భగవంతుడు స్వీకరించి నపుడు భక్తులకు మహదానందము కలుగును.

భక్తుల హృదయమందు జనించు మధువును భ్రమరము వలె శ్రీమాత గ్రోలును గనుక ఆమెను భ్రమరాంబిక అని కీర్తింతురు. ఏయే పుష్పముల యందు మధువు యేర్పడు చున్నదో పర్యవేక్షించుచూ తేనెటీగ మధువు స్రవించు పుష్పములపై వ్రాలి ఆ మధువును గ్రోలును. అట్లే శ్రీమాత కూడ భక్తుల హృదయములందు జనించు భక్తిరసమును గ్రోలును. అట్టి మాధ్వీపానమందు అనురక్తి కలిగియున్నది శ్రీదేవి. మానవ హృదయములు కఠినములై కల్మషములతో కూడి యున్నప్పుడు వానిని పుష్పములతో పోల్చలేము. తమ కల్మషములను హరించి, కఠినత్వమును దమించి కారుణ్య హృదయులుగ తీర్చిదిద్దమని శ్రీమాతను ప్రార్థింప వలయును.

శ్రీమాతను క్రోధము, మాత్సర్యము, లోభము, మోహము, అశుభ భావనలు పారద్రోలు మని వేడుకొనవలెను. నిర్మల హృదయులను గావింపుమని సదా ప్రార్థింప వలయును.  అట్టి ప్రార్థనలు ఫలించినపుడు చెట్టు కొమ్మయొక్క రెమ్మనుండి పుష్పము వికసించినట్లు అనాహత చక్రము అనాహత పద్మముగ మారును. అనాహత చక్రముగ నున్నంత కాలము హృదయము వికాసము పొంద జాలదు. జనన మరణములను చక్రము నందు జీవుడు తిరుగాడుచునే యుండును. చక్రములు పద్మములు కావలయును (మార్పు చెంద వలెను). లేనిచో జీవితము అంధకార బంధురమే. అట్టి మార్పు కలుగుటకు దైవీ తత్త్వము నందు భక్తి, ప్రేమ ప్రధానము. పరహిత జీవనము భక్తి వికసించుటకు అనుపానమై నిలచును.

స్వాధ్యాయము గతి తప్పకుండ కాపాడును. ఈ మూడు ఉపాయములు జీవుని మధురమగు భక్తియందు చేర్చగలవు. దైవీతత్వము నందుగల రుచి క్రమముగ వృద్ధి చెందుచు భక్తి అనురక్తిగ మారును. అట్టి అనురక్తియే దైవము నందలి ప్రేమ కారణముగ అనన్య భక్తి యేర్పడును. అపు డన్యభావము లేర్పడవు. గోపిక లట్టివారు. వారి ప్రార్థన లన్నియూ భ్రమర గీతికలే. అట్టి ఆత్మసమర్పణ బుద్ధితో హృదయములు నర్పించు విశేష భక్తులు హృదయముల నుండి పుట్టు భక్తిరసమును గ్రోలుటయందు శ్రీమాత అమితాసక్తితో యుండును. అట్టి మధువును గ్రోలి గ్రోలి మత్తెక్కి సోలిన కన్నులు గలదిగా గోచరించును. ఇట్టి మత్తు ఇతర పానీయముల నుండి లభింపదు.

 577. 'మాతృకా వర్ణరూపిణీ' 
వర్ణాక్షరముల రూపమున నుండనది శ్రీమాత అని అర్థము. మాతృక లనగా అక్షరములు. అనగా క్షరము గానివి. నాశనము లేనివి. అవి శబ్దములు. ఆ శబ్దములకు శ్రీమాత రూప మేర్పరచును. అ, ఇ, ఉ అను శబ్దములకు అక్షర రూపము లున్నవి కదా! అపుడే వానిని వ్రాయగలము. అక్షరములు వేరు, అక్షర రూపములు వేరు. అక్షరములకు శబ్దము, రంగు, రూపము యిచ్చునది శ్రీమాత. అంతియే కాదు, వానికి అర్థమును కూడ నిచ్చును. ఉదాహరణకు 'అ' అను శబ్దమున్నది. దాని అర్థము పరతత్వము. (అక్షరములలో 'అ' నేను అని శ్రీకృష్ణుడు పలికినాడు.) దాని వర్ణము (రంగు) నీలము వలె గోచరించును.

లోతు తెలియలేని తత్త్వము గనుక నలుపు నీలమందురు. దానికి రూపము ఒక్కొక్క భాషయందు ఒక్కొక్క విధముగ నున్నది. తెలుగున 'అ', సంస్కృతమున 'అ', తమిళమున 'అ', పాశ్చాత్య భాషల యందు 'అ' వేరు వేరు రూపములు ధరించిననూ శబ్ద మొక్కటియే, అర్థ మొక్కటియే, రంగు ఒక్కటియే. ఆకారములు వేరు. ఇట్లు వివిధాకారములతో శ్రీమాత సృష్టి గావించుచున్నది. కాని లో అర్ధము వర్ణము, శబ్దము, అక్షరత్వము వైపునకు నడిపించును. పైకి వైవిధ్యముగ కనిపించిననూ, లోన ఏకత్వము గోచరించును. శబ్దము, అర్ధము, రంగు, రూపము అను నాలుగింటిలో మొదటి మూడు దివ్యమని, నాలుగవది మార్పు చెందునదని పురుష సూక్తము సూచించుచున్నది.

(త్రిపాదస్య అమృతందివి) రూపమునకు మరణ మున్నది. శబ్దము, అర్థము, రంగు మరణించవు. ఇట్లు సృష్టి అంతయూ అక్షర స్వరూపమే. మాతృకావర్ణ రూపమే అని తెలియవలెను. సప్త మాతృకలు అనగా సప్త లోకముల నేర్పరచు శబ్దము. వానిని బీజాక్షరములు అని కూడ పిలుతురు. సహ్రసారము నుండి మూలాధారము వరకు యం, హం, సం, కం, లం, రం, డం శబ్దములు కలవు. ఈ శబ్దము లత్యంత కాంతివంతములు. వజ్రకాంతి నుండి భూకాంతి (మట్టిరంగు) వరకు వివిధమగు కాంతులలో సప్తలోకములు ప్రకాశించు చుండును. శబ్దాచ్చారణమును నుండి రంగులు పుట్టును. అవి కాంతి వంతములు.

మెఱపు వంటి అ కార, క్ష కార శబ్దములున్నవి. బంగారు కాంతి గల ల, శ, ష, స శబ్దము లున్నవి. అట్లే అరుణ వర్ణము లున్నవి. గౌర వర్ణము లున్నవి. ధూమ్రము, సిందూర వర్ణములు కూడ నున్నవి. ఆయా లోకములలో ఆ యా శబ్దముల ప్రభావము వలన ఆయా కాంతులు పుట్టుచుండును. తత్కారణముగనే శ్రీమాత వివిధ కాంతులతో శోభిల్లుచుండును. భక్తుల పరిపక్వతను బట్టి సాధారణ కాంతుల నుండి కన్నులు మిరుమిట్లు గొలుపు మెఱపు కాంతుల వరకు దర్శనములు జరుగుచుండును. నాదములు వినపడు చుండును. రహస్యార్థములు తెలియుచుండును. ఇట్లు తెలియుచుండగా ఆరాధకులు పరవశము చెంది నిర్ఘాంతబోవుచు ఆమె దివ్య రూపమును చూచుటకే అశ్రాంతము కోరుచుందురు.

అక్షరములు అనగా అక్ష + రములు అని కూడ పెద్దలు తెలుపుదురు. అనగా మూలమును అక్షముగ గొనువచ్చు శక్తి అని అర్థము. 'అ' అను పరతత్వమును మూలము లేక కేంద్రము లేక పరము నుండి అక్షముగ శ్రీమాత గొనివచ్చును. క్షరము కాని పరతత్వమును, అక్షముగా గొనివచ్చుచూ సృష్టి నిర్మాణము చేయును. ఆమె అక్షరి. ఇట్లు గొనివచ్చి ఏడు లోకముల సృష్టిని చేయును. కేంద్రము నుండి పరిధి వరకు లేక పరము నుండి పదార్థము వరకు సృష్టిని యేర్పరచు శ్రీమాతకు శబ్దములు, వర్ణములు, అర్థములు ఉపకరణములు. వానికి రూపము లేర్పరచునది కూడ ఆమెయే.

మాతృకా వర్ణములు ఆమె నుండియే పుట్టును. నాదముగ జనించి శబ్దములుగ వ్యాప్తిచేయును. శబ్దముల నుండి వెలుగులు వ్యాప్తి యగును. అటుపైన రూపములుగ యేర్పడును. ఇట్లు శబ్దము, రంగు, రూపముగ సృష్టి నేర్పరచును. తత్సంబంధిత శక్తులు, సామర్థ్యములు కూడ పుట్టుచుండును. అక్షరములు అనగా 'అ' నుండి 'క్ష' వరకు కొనిరాబడినవి అని మరియొక అర్థము. దేవ భాషయైన సంస్కృతము నందు 'అ' మొదటి అక్షరము. 'క్ష' చివరి అక్షరము. అట్లు 'అ' నుండి 'క్ష' వరకు సృష్టి నిర్మాణము చేయు శ్రీమాత ఆ మొత్తము రూపముగ తానే యుండును. ఆమెయే అక్షరమాల. స్కందుని పుట్టించుటచే ఆమె మాతృక అయినది.

'అ' నుండి 'క్ష' వరకు సృష్టి నిర్మాణము చేయు శ్రీమాత ఆ మొత్తము రూపముగ తానే యుండును. ఆమెయే అక్షరమాల. స్కందుని పుట్టించుటచే ఆమె మాతృక అయినది.  శివ తత్వమును అవతరింప జేయుటతో శ్రీమాత మాతృక అయినదని తెలుపుదురు. అంతేకాక ఈ మాతృకా వర్ణముల సమూహమే శ్రీమాత శ్రీచక్ర రూపమని కూడ తెలుపుదురు. శ్రీ చక్ర మందలి బీజాక్షరములు, ఇతర అక్షరములు సృష్టి ప్రజ్ఞలుగ శ్రీమాత యేర్పడి యున్నది. సంస్కృతమున గల యాబది యొక్క అక్షరములు సృష్టి నిర్మాణ ప్రజ్ఞలు.

నలుబది తొమ్మిది అక్షరములతో సప్తసప్తిగా లోక నిర్మాణము చేసి అందుపై శివశక్తులు అధిష్ఠించి యుందురు. అందువలన యాబది యొక్క అక్షరముల దేవ భాషగ సంస్కృతము యేర్పడినది. పరదేవతగ శ్రీమాత మాతృకలను, వాని వర్ణములను కూడ దాటి యున్నది గనుక ఆమెను మాతృక అవర్ణ రూపిణి అని కూడ తెలియవలెను. తాను వస్తుతః మాతృకలు కాదు. ఆమెకు వర్ణములు లేవు. రూపములు లేవు. అన్నియూ తానై వర్తించును.

578. 'మహాకైలాస నిలయా' 
మహాకైలాసము నందుండునది శ్రీమాత అని అర్ధము. కైలాసము ఉత్తరము నందుండెడి శిఖరము. ఆర్యావర్తమునకు ఉత్తరమున, బ్రహ్మ మానస సరోవరమునకు కూడ ఉత్తరమున కైలాస శిఖర మున్నది. “శ్రీ చక్ర మేరువు" వలె లేక 'పిరమిడ్' వలే యేర్పడు శిఖరమును కైలాస మందురు. అచ్చట తత్త్వమొక్కటే యుండును. ఆ తత్త్వము యొక్క లాస్యముగ ఉత్తరము నుండి దిగువకు క్రమ పద్ధతిలో రూప మేర్పడును. ఇట్లు ఒకే తత్త్వము నుండి అనేకత్త్వ మేర్పడుటకు సూచనగ శ్రీచక్ర మేరువు నుండి శ్రీ చక్ర మేర్పడును.

కానుక చీకటింటకళ కాంతులు సర్వ మనోన్నతీయగున్ 
మేనుకు మోహతాపమున మేలుగ సఖ్యత సంభవమ్ముగన్
 తానుగ తత్వబోధయగుతన్మయ లక్ష్యముదేహతృప్తిగన్
ఆనతి శాఖ్యతన్ యగుట ఆమని సంపద శాంభవీ 
భావం:
అజ్ఞానం అనే చీకటి ఇంట్లో (లేదా మన అంతరంగంలో) వెలుగొందే కళా కాంతులు (ఆత్మజ్ఞానం లేదా అంతర్గత ప్రకాశం) అన్ని మనస్సులకూ అత్యున్నత స్థితిగా మారుతాయి.
శరీరానికి కలిగే కోరికల వేడిమిలో కూడా మంచి స్నేహం లేదా సామరస్యం సంభవిస్తుంది (అంటే, కోరికలను అర్థం చేసుకుని, వాటిని సమన్వయం చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి).
దానంతటదే తత్వజ్ఞానం (ఆత్మబోధ) కలుగుతుంది, అది కేవలం శరీరాన్ని సంతృప్తిపరిచే లక్ష్యం లాగా అనిపించినా, వాస్తవానికి ఒక తన్మయమైన, ఉన్నతమైన లక్ష్యంగా ఉంటుంది.
ఆ శాంతిని (లేదా సామరస్యాన్ని) పొందడం వల్ల, ఓ శాంభవీ (పార్వతీ దేవీ), వసంత కాలపు సంపద వంటి సమృద్ధి, ఆనందం లభిస్తాయి.

శిఖరము నుండి పర్వత మేర్పడును. సూక్ష్మము నుండి స్థూలమునకు సృష్టి యేర్పడును. శిశు జననము కూడ శిరస్సు, శిఖ కేంద్రముగ రూపమై వ్యాప్తము చెందును. సర్వమునకు ఉత్పత్తి స్థానము కైలాసమని తెలియవలెను. అట్టి కైలాస శిఖరము నందు వసించునది శ్రీమాత అని తెలియవలెను. మన శరీరమున శిఖను కైలాసముతో పోల్చెదరు. శ్రీచక్ర మేరువుతో పోల్చెదరు. అచ్చట కేవలము శివశక్తి తత్త్వమే యుండును.

కైలాసమున శివశక్తులు నిత్యమూ నృత్యము సలుపుచు నుందురు. లాస్యము నందుందురు. శివ శక్తుల లాస్యస్థానమే కైలాసము. ప్రతి జీవుని యందు కైలాస స్థాన మున్నది. అట్లే భూమికిని కైలాస స్థానము కలదు. అది ఉత్తర ధృవమునకు పైన యున్నది. అట్లే సూర్యునికి కూడ నున్నది. మొత్తము సృష్టికి కూడ కైలాస స్థాన మున్నది. దానినే మహా కైలాస మందురు. అట్టి మహా కైలాసమున వసించునది శ్రీమాత అని అర్ధము. ఉత్తరమునగల కైలాసమును కుబేర స్థానమని కూడ పలుకుదురు.

579. 'మృణాల మృదుదోర్లతా' 

తామర తూడువంటి మెత్తనైన భుజములు కలది శ్రీమాత అని అర్దము. తామరతూడు మెత్తనైన దారములతో సున్నితముగ నుండును. ముట్టుకుంటే కందిపోవు నట్లుండును. మృదువైన భుజములు స్త్రీకి సౌందర్య కారకములు. బలమైన భుజములు పురుషునికి సౌందర్య కారకములు. భుజ బలము శౌర్యమునకు చిహ్నము. సుకుమారమగు భుజములు సౌందర్యమునకు చిహ్నములు. శ్రీమాత ఎంత శక్తివంతురాలో అంత సౌందర్యరూపిణి కూడను. సౌందర్యము, శౌర్యము రెంటి యందును అత్యధికురాలైన శ్రీమాత రూపము మాత్రము సౌమ్యముగనే యుండును. లలితముగనే యుండును. భుజములు సుకుమారమైనంత మాత్రమున బలహీన అనుకొన రాదు.

చిందిన ఎప్పుడూ మనసు, చెప్పు నిరాశగ యొప్పదైననున్
చెంద ధనమ్ముతో కలుగు చింతయహమ్ముయు చూపదైననున్
చంద భయమ్ముతో కలుగు చత్వర ధైర్యము నుంచగల్గగన్
పొందిక సజ్జనుండుగను, పోరు సుఖమ్ముయు దుఃఖ శాంభవీ

🔹భావార్థం:
చంచలమైన మనస్సు ఎప్పుడూ నిరాశను వ్యక్తం చేస్తూ ఉంటుంది. కానీ అది వాస్తవంగా అంగీకరించదు — ఎందుకంటే అది స్థిరం కాదు.
ధనాన్ని సంపాదించినప్పటికీ, దానితో వచ్చే బాధను, ఆందోళనను మనసు పూర్తిగా గ్రహించదు.
భయం కలిగిన పరిస్థితిలోనూ, ఒక్కసారిగా ధైర్యం ఉద్భవించగలదు — అదే మానసిక స్థైర్యం.
అయితే, మంచి వ్యక్తిగా స్థిరంగా ఉండగలిగిన వాడికి, పోరాటం ద్వారా వచ్చిన సుఖం కూడా ఒక దుఃఖంలా మారుతుంది — ఎందుకంటే అది శాంభవీ, పరాశక్తి, దుఃఖాన్ని వరముగా మలచగలదే

మహత్తరమగు బలము కలిగియు తామరతూడువంటి మృదువైన భుజములు కలిగియుండుట అద్భుతమైన విషయము. త్రిమూర్తులు కూడ గెలువలేని భండాసుర, మహిషాసురాది అసురులను తన భుజ శక్తితోనే సంహరించినది కదా! అమిత శక్తివంతమైననూ సుకుమారముగ నుండుట వైభవమునకు చిహ్నము. కావుననే ప్రత్యేకించి హయగ్రీవుడు శ్రీమాత భుజములను కీర్తించుచూ ఈ నామము తెలిపినాడు. శ్రీమాత రూప సౌందర్య సందర్భమున గాక ఆమె మాహాత్మ్యమును తెలుపు సందర్భముగ తెలిపినాడు. మహాకైలాసమందు శివునితో నృత్యము చేయు శ్రీమాత భుజములను, మాహాత్మ్యమును వర్ణించుచున్నాడు. కావుననే తరువాతి నామము 'మహనీయా' అని పేర్కొనినాడు. 

580. 'మహనీయా' 

మహనీయమైనది శ్రీమాత అని అర్థము. అత్యంత వైభవోపేతము, అత్యంత ప్రశంసనీయము, అత్యంత కాంతివంతము, అత్యంత కీర్తివంతము, అత్యంత బలోపేతము, శక్తి వంతము, పుష్కలము, ఆనందదాయకము, స్ఫూర్తిమంతము, త్యాగ నీయము అగుటచే సమస్త లోకముల నుండి పూజలందుకొను దేవి కావున 'మహనీయా' అని శ్రీమాతను హయగ్రీవుడు కీర్తించుచున్నాడు.

మహనీయులను పదమును సామాన్యముగ నుచ్చరించరాదు. పొగడ్తలకు “మహనీయులు” అని వాడుట ఆచారమైనది. శ్రీమాతయే 'మహనీయా'. ఆమె భక్తులగు ఋషులు, సనక సనందనాదులు మహనీయులు. అట్లే శ్రీమాతకు సర్వ సమర్పణము చేసి శ్రీమాత మహనీయత్వమునకు దర్పణముగ నిలచినవారే మహనీయులు, అరకొర శక్తి, యుక్తి, జ్ఞానము కలవారిని మహనీయులని పొగడుట అసత్యమే అగును. అసత్య భాషణము వర్ణనీయము.

581. 'దయామూర్తి' 

మూర్తీభవించిన దయారూపము శ్రీమాత అని అర్ధము. భక్తుల యందు శ్రీమాతకు దయ మెండు. ఆర్తితో ఆరాధించు భక్తుల యెడల దయ కలిగియుండును. ఆర్తులను, బలహీనులను రక్షించును. అహంకారుల యందు ఉపేక్ష భావము చూపిననూ వారు నిరహంకారులై ప్రార్థించిన వెంటనే ప్రసన్న మగును. శ్రీమాతను మరచిన వారిని శ్రీమాత కూడ ఉపేక్షించును. స్మరించిన వారిపై దృష్టి సారించును. కష్టములందు దయ చూపును. ఆపదల యందు ఆదు కొనును.

జీవననాటకశ్రీ
మ.
మనమధ్యా విధి యాడు నాటకము యేమచ్చల్లె ప్రేమమ్ము యే
గుణమా నన్నుగ నీవు నుంచగలిగే గుప్తమ్ము గానౌను చూ
సినిమా కా ముని చెప్పె నేడు వదగునే సీతమ్మ గంగాతటిన్
తృణమే జీవిత భాగ్యమవ్వగలిగే తృప్తౌనులే శాంభవీ
మన మధ్య జరుగుతున్నదంతా విధి ఆడిస్తున్న నాటకం మాత్రమే. కానీ అందులో ప్రేమ మాత్రమే కలుషిత రహితంగా – మచ్చల్లేదుగా – నిలుస్తుంది.
నన్ను గుణవంతుడిగా నిలిపే శక్తి నీవు సమర్పించిన ఒక అంతర్ముఖ గుప్తమయ్య శక్తి – అది నీ చైతన్యమే.
ఈ జీవితం ఒక సినిమా మాత్రమే అని ఓ జ్ఞానముని నేడు గంగాతటంపై ఉపదేశించాడు – అంటే జీవనానుభవాన్ని తాత్త్వికంగా పరిశీలించిన వాడికి ఇది మాయానాటకమైంది.
జీవిత భాగ్యాలన్నీ తృణసమమైపోవగలవి – తృప్తి వుండినపుడే అవి మాధుర్యమవుతాయి. అటువంటి తృప్తిని ప్రసాదించగలదీ శాంభవీ (అమ్మవారి) అనుగ్రహమే.


తల్లి ప్రేమ, తల్లిదయ, అనుగ్రహము పొందినవారు నిజమగు అదృష్టవంతులు. పిలిచినంతనే పలుకు శ్రీమాతను పిలువకుండుట దురదృష్టము. పూజ, అర్చనలు చేయుట వలన సులభముగా ప్రసన్నత కలిగి బ్రోచును. శ్రీమాత అనుగ్రహము లేనిదే శివానుగ్రహము కలుగదు. తత్వదర్శనాభిలాషులు కూడ శ్రీమాత అనుగ్రహము చేతనే శివాను గ్రహమును పొందగలరు. శ్రీమాత దయను గూర్చి భక్తుల కెల్లరకునూ విదితమే.       

582. *'మహాసామ్రాజ్యశాలినీ'* 
మహా సామ్రాజ్యమును అనుగ్రహించునది శ్రీమాత అని అర్ధము. మహా సామ్రాజ్యమగు సృష్టి నిర్మాణము చేసి పాలించు శ్రీమాత తన అనుగ్రహమున వారికి అట్టి సామ్రాజ్యముపై అధికారము నీయగలదు. పరిపాలనా వైభవమును కలిగించగలదు. మహా సామ్రాజ్య పాలకులగు సామ్రాట్ లందరూ శ్రీమాత అనుగ్రహముననే అంతటి సామ్రాజ్యముల నేర్పరచి పరిపాలించిరి. పరిపాలనమున అహంకరించి శ్రీమాతను మరచినపుడు పతనము చెందిరి.

తరుణమాతవసాధనంమది తాప తన్మయ మౌనులే
కరుణగమ్యముమూలమున్ గతికాల మాయలు నీడలే 
తరువులన్నియుసాయమున్ విధి సానుకూలత మేలులే 
చెరువు నీరుగ దాహమున్ స్థితి చిత్తమౌను సాధన శాంభవీ

నా మనస్సు ఇప్పుడు శక్తిమాత సాధనలో తపస్సుతో నిమగ్నమైంది.
ఆ మాత కరుణే నా లక్ష్యం. ఆమె మూలతత్వం – కాలమూ, మాయలూ ఆమె నీడలు మాత్రమే.
ప్రకృతిలోని అన్ని వృక్షాలూ మానవుడికి సాయపడతాయి, ఎందుకంటే అవి విధి అనుకూలంగా ఎదుగుతాయి.
ఒక చెరువులో నీరిలా, ఆమె సాధన నా దాహానికి తృప్తిని ఇస్తోంది.
నా చిత్తం స్థిరమై శాంతమవుతోంది — ఇదే శాంభవీ సాధనఫలం.


ఎవ్వరికైననూ వారి అంగ బలము, ధనబలము, యశోబలము పెరుగుట వారియందలి నిగూఢమై యున్న శ్రీమాత శక్తి సామర్థ్యములే. తన నుండి వ్యాప్తి చెందుచున్న రాజ్యము, బలము, వైభవము శ్రీమాత అనుగ్రహమే అని భావింపవలెను గాని తనదిగా భావింపరాదు. చిన్న బీజము మహా వృక్షమై శాఖోప శాఖలతో విస్తరించుట బీజము గొప్పతనము గాదు. బీజమున అంతర్హితముగ నున్న అంకుర శక్తి. అది అనంతశక్తి. బీజము వాహికగ అంకుర శక్తి  వ్యాప్తి చెందుచూ మహా వృక్షమై నిలచినది.

అట్లే ఎవరి నుండి ఎట్టి మహా కార్యములు జరిగిననూ వారు బీజప్రాయులే. అందుండి వికాసము చెందునది శ్రీమాత యొక్క ఇచ్ఛా జ్ఞాన శక్తులే. ఎవ్వరి కేమి కలిగిననూ, అవి అన్నియూ ఆమె సమకూర్చినవే. ఆమెయే 'దాయిని', అనగా ఇచ్చునది. రాజ్యదాయిని కూడ ఆమెయే. సామ్రాజ్యదాయిని కూడ ఆమెయే. ఆమె దయ లేక ఎవ్వరునూ ఏమియూ పొందలేరు. ఆమె దాయిత్వమూర్తి. దానము లిచ్చు చేయి మాత్రమే కాదు, ఆమె మూర్తి మొత్తము అట్టి దాయిత్వ గుణముతో ప్రకాశించును.

583. 'ఆత్మవిద్యా’ 
ఆత్మజ్ఞాన రూపము గలది శ్రీమాత అని అర్థము. తా నెవరు? తా నుండుట అనగా ఏమి? తా నుండు టెట్లు సంభవించినది? యిత్యాది జ్ఞానము ఆత్మ జ్ఞానమని పలుకుదురు. ఈ జ్ఞానము పొందు విధానము, శాస్త్రము ఆత్మవిద్యగా భాసించును. శ్రీమాత విశ్వాత్మ. ఆమె నుండి పుట్టిన త్రిగుణముల నుండి జీవులు జనింతురు. జీవులు తాము ప్రత్యేకముగా వున్నామని భావించుట వలన అహంకారము ఆవహించును. అటుపైన జీవునకు తనదైన స్వభావ మేర్పడును. స్వభావము ననుసరించి పంచభూతాత్మకమైన శరీర మేర్పడును.

మన్నేముఖ్యముమానవత్వముగనే మానమ్ముజీవమ్ముగన్  మిన్నేసఖ్యతగానువర్షముగసమ్మోహమ్ము ప్రాణమ్ముగన్ 
జున్నేతీపిపదార్ధమవ్వుటగనే జూపుల్లు ఆహారమున్ 
నిన్నేనేనుగనే సహాయముగనేనీడల్లె గా శాంభవీ 

మన్నే ముఖ్యము — మానవతే నిజమైన ప్రాధాన్యత,
మానవత్వముగనే మానమ్ము జీవము — మానవత్వమే మన ప్రాణానికి మూలమైన జీవతత్వం.
మిన్నే సఖ్యతగా అనువర్షముగా సమ్మోహము ప్రాణమ్ము — మృదుత్వం సఖ్యతగా (స్నేహంగా) ప్రవహిస్తూ మమకారంగా ప్రాణంగా మారుతుంది.
జున్నే తీపి పదార్థమవ్వుటగనే జూపులు ఆహారమున్ — ప్రేమగా పలుకిన మాటలు తీపి పదార్థాలుగా మనసుకు ఆహారంగా మారతాయి.
నిన్నే నేనుగనే సహాయముగనే నీడల్లెగా శాంభవీ — నీవు నేనే, నేనే నీవు — ఈ సహజ సహాయసంబంధం జీవితం, నీడలా పరస్పరం నిలిచే శాంతి రూపిణి (శాంభవీ)ను సూచిస్తుంది.

జీవుడు తన నిజ స్వరూపము తెలియక తన శరీరమే తాననుకొనును. అటుపైన తన కోరికల సముదాయమే తానుగా జీవించును. ఆ తరువాత తన భావ సముదాయమే తానుగా నుండును. అటుపైన తానెరిగిన విద్యలే తానుగా నుండును. ఎన్ని నేర్చిననూ, ఆ విద్యలన్నియూ తన నిజస్థితిని ఆవిష్కరింపవు. తనను గూర్చి, తన నిజస్థితిని గూర్చి అవలోకనము చేయుట తనను తా నభ్యసించుట. తన శరీరము, తన కోరికలు, తన భావములు, తన విద్యలు కాక, తా నెట్లున్నాడు? తా నున్నాడని తనకెట్లు తెలిసినది? తాను నిత్యమెట్లు స్పందించు చున్నాడు - యిత్యాది విషయముల యందు శోధన చేయుట ఆత్మవిద్య ఉపాసించుట యగును.

తనయందు జరుగు స్పందనము, ప్రతి నిత్యము కలుగు ఎఱుక- ఈ రెంటి మూలమేమి? అని భావించుట ప్రారంభమగును. తాను మూలముగ తన యందు, తన ద్వారా చాల వ్యాపారము (activity) జరుగుచుండును. తనకు మూలమేమి? తా నెచ్చట నుండి మేల్కాంచు చున్నాడు? ఏమి ఆధారముగ ప్రాణస్పందన జరుగు చున్నది? తన స్పందనలో స్పందించు తత్త్వమేమి? తన ఎఱుకలోని ఎఱుక యేది? ఇట్టి శోధనలో లోపలికి జీవుని గొనిపోవును. తన మూలమునకు తనను చేర్చును. అప్పుడు తానెఱుగునది అపరిమితమగు వెలుగు. అది కన్నులకు గోచరింపని వెలుగు వెలుగు చీకట్లకు కూడ వెలుగు.

అట్టి వెలుగు అపరిమితము. అట్టి అపరిమితము, అప్రమేయము వెలుగు నందు తాను బిందువై (నామ మాత్రమై) గోచరించును. ఆ అపరిమితమగు చైతన్యమే శ్రీమాత. ఆమె యందలి ఒక బిందువే తానని తెలియును. ఈ మొత్తమును తెలియబరచుటకు తెలివి యుండవలెను గదా! అట్టి తెలివిగ శ్రీమాతయే యున్నది. తెలివికి మూలముగ కూడ ఆమెయే యున్నది. ఆమె నెఱిగినవాడు ఆత్మవంతుడు. ఆమె నెఱుగు ప్రయత్నము ఆత్మవిద్య. శ్రీమాతయే విద్యగ జీవులను తమ మూలమునకు చేర్చును. ఈ కారణముగ శ్రీమాత 'ఆత్మవిద్య' అని ప్రశంసింపబడినది.

*701వ నామ మంత్రము* *ఓం దేశకాలాపరిచ్ఛిన్నాయై నమః*

    

దేశ+కాల+అపరిచ్ఛిన్నా అనగా *దేశకాలాపరిచ్ఛిన్నా* అని చదువవలెను. అంతేగాని *దేశకాలపరిచ్ఛిన్నా*  అనగా ల అనే అక్షరం *లా* గా కాకుండా *ల* గా చదువకూడదు. అర్థం మారుతుంది. 

సకల ప్రపంచములకు తానే ముందుగా, సకల కాలములకు పూర్వముగాను, వస్తుభేదములు లేక, సకలభావములకు అభావముగా,  సమస్త చరాచర జగత్తులు, కాలములు తన వల్లనే ఏర్పడి, అన్నిటికీ తానే ఆదిగా, ఆదిపరాశక్తిగా విరాజిల్లు జగన్మాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *దేశకాలాపరిచ్ఛిన్నా* యను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును *ఓం దేశకాలాపరిచ్ఛిన్నాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని ఉపాసించు భక్తులు ఆ తల్లి కరుణచే సర్వాభీష్టసిద్ధికలిగి బ్రహ్మానందభరితులై తరించుదురు.

స్రగ్విణి .. (ర ర ర ర యతి 6 )


దేశకాలాపరిచ్ఛిన్నమానమ్ముగన్

ఆశపాశమ్ము ఆకాంక్షమూలమ్ముగన్ 

ధ్యాసదానమ్ము దాతృత్వభావమ్ముగన్         

దాసదమ్మమ్ము దాశ్యమ్ము ఆకాంక్షగన్ 


ఈ పద్యం, దేశకాలములకు అతీతమైన, అపరిమితమైన దేవతను కీర్తిస్తుంది. ఆ దేవతే సకల ఆశలకు, కోరికలకు మూలకారణం. ఆమె సమస్త దానగుణానికి, దాతృత్వానికి ప్రతీక. భక్తులు ఆమెకు దాస్యం చేయాలనే ఆకాంక్షను కలిగి ఉండటం ద్వారా ఆమెను చేరుకోవచ్చని ఈ పద్యం యొక్క అంతరార్థం. ఇది భక్తుని యొక్క సమర్పణా భావాన్ని, దేవత యొక్క సర్వవ్యాపకత్వం, దయాగుణాన్ని చాటి చెబుతుంది.

జగన్మాత ఎక్కడనుంచి వచ్చినది, ఎప్పుడు వచ్చినది, ఎప్పటివరకూ ఉంటుంది అని గానీ, ఎన్నాళ్ళు ఉంటుంది అని గానీ వివరించే కాల వ్యవధులు, ఎల్లలులేవు. ఆ తల్లి *అనాదినిధనా* పుట్టుక, పోవుట ఏమియు లేనిది. సకల ప్రపంచములకూ తానే ముందు. కాలములన్నిటికీ తానే పూర్వము. వస్తుభేదములేదు. *భావాభావ వివర్జితా* భావములుచేత, అభావములచేత విడచిపెట్టబడి సకల భావములకు అభావమైనది. బ్రహ్మాదులకందరికీ కాలపరిమాణము గలదు. మానవుని ఆయువు నూరు వరకూ, బ్రహ్మఆయువు ఒక కల్పము. పరబ్రహ్మ అయిన జగన్మాతకు ఆయువు, ఆ ఆయువు ఇంత అనిఏమీ లేదు.  ఎందుకంటే ఆది, అంతము లేనిది.  జగన్మాతకు ఆయుఃపరిమాణము అనగా *కాలాపరిచ్ఛేదము* (కాలపరిమాణము) లేదు, ఇక్కడలేదు అక్కడ ఉంది అనే దేశాపరిచ్ఛేదము లేదు. ఆవిధంగా జగన్మాత *దేశకాలాపరిచ్ఛిన్నా* అను నామప్రసిద్ధమైనది. ఆ జగన్మాత అనిత్యమైన శరీరాలమధ్య శరీరం లేనిదిగా, అశాశ్వతమైన వాటి మధ్య శాశ్వతమైనదిగా ఉంటుంది. ఆత్మ అనేది నిత్యము. సత్యము. సర్వవ్యాపకము. 

జగన్మాత పంచభూతాలలో భూమిలో ఉందని గాని, ఆకాశములో ఉందనిగాని, లేక వాయువు ఉందని గాని,ఇంకా నిప్పు, నీరు ఎక్కడ ఉన్నది? అంటే సర్వత్రా ఉన్నది.   అటువంటి *దేశాపరిచ్ఛిన్నము లేనిది*. ఇంతకు ముందు లేదు. ఇప్పుడు ఉంటుంది. తరువాత ఏమో! అనేది కూడా లేదు. నిత్యమైనది.

సృష్టికి పూర్వమే తానున్నది.బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను తానే నియమించింది. మహాప్రళయం తరువాత కూడా ఉంటుంది. అప్ఫుడు సృష్టి అన్నది లేక పోతే త్రిమూర్తులతో పనిఏముంది. వారు కూడా ఉండరు. సమస్త సృష్టిని ప్రళయకాలంలో తనలో లయంచేసుకున్న జగన్మాత ఉంటుంది. అందుకే జగన్మాత ఎప్పటి నుండి ఎప్పటి వరకూ అనే కాలాపరచ్ఛేదం లేనిది. అనగా సృష్టికిముందు, తరువాత కూడా ఉంటుంది గనుక *కాలాపరిచ్ఛేదం లేదు*.  కాబట్టి జగన్మాత *దేశకాలాపరిచ్ఛిన్నా* అని నామ ప్రసిద్ధమైనది. 

జగన్మాతకు నమస్కరించునపుడు  *ఓం దేశకాలాపరిచ్ఛిన్నాయై నమః* అని అనవలెను.

***

741వ నామ మంత్రము ....ఓం రంభాదివందితాయై నమః

రంభ, ఊర్వశి, మేనక మొదలైన అప్సరాంగనలచే నమస్కరింపబడు   జగదీశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి రంభాదివందితా యను ఆరక్షరముల (షడక్షరీ) నామ మంత్రమును ఓం రంభాదివందితాయై నమః అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని అత్యంత భక్తిప్రపత్తులతో ఉపాసించు సాధకునకు స్వర్గసుఖములంతటి సుఖసంతోషములను ప్రస్తుత జీవనమునందు ప్రసాదించి, ఆధ్యాత్మికతయందు, భగవన్మామ సంకీర్తనమునందుగూడ మనసును నిలుపును.

 ఇంద్ద్రవంశ (త ర జ ర .. యతి 7 ) 

రంభాదివందితా రసమ్ము దేవతా 

గంభీర చంద్రికా గళమ్ము  దేవతా 

సంభంద ముద్రికా సమమ్ము దేవతా       

ముంబా యనా మదీ ముఖ్యమ్ము దేవతా     

ఓం రంభాదివందితాయై నమః  ఒక దేవతను కీర్తిస్తుంది. ఆమె రంభ వంటి అప్సరసలచే పూజింపబడే సారవంతమైన శక్తిని కలిగి ఉంది. ఆమె స్వరం లేదా ఉనికి లోతైన వెన్నెల వలె ప్రశాంతంగా, కాంతివంతంగా ఉంటుంది. దేవత బంధాలను ధృవీకరించే పవిత్రమైన ముద్రిక వంటిది. చివరగా, కవికి ఆమె ముఖ్యమైన నామం "అంబా " అని తెలుపుతారు (అమ్మలగన్న అమ్మ) ,  దేవతను ఒక నిర్దిష్ట ఆధునిక ప్రదేశంతో అనుసంధానిస్తుంది అట్టి అమ్మకు మా నమస్కారములు  

రంభ మొదలైన అప్సరసలచే నమస్కరింపబడుచున్నది జగన్మాత.

సప్త-అప్సరసలు 1. రంభ, 2. ఘృతాచి, 3. మేనక, 4. తిలోత్తమ, 5. మంజుఘోష, 6. ఊర్వశి, 7. సుకేశి.

ద్వాదశ-అప్సరసలు

1. కృతస్థల, 2. పుంజికస్థల, 3. మేనక, 4. సహజన్య, 5. నీప్రమ్లోచ, 6. అనుమ్లోచ, 7. ఘృతాచి, 8. విశ్వాచి, 9. పూర్వజితి, 10. తిలోత్తమ, 11. రంభ.

షోడశ-అప్సరసలు

1. పాథాసూత, 2. మహాభాగ, 3. దేవి, 4. దేవర్షిత, 5. అలంబుష, 6. మిశ్రకేళి, 7. విద్యుత్పర్ణ, 8. తిలోత్తమ, 9. అరుణ, 10. రక్షిత, 11. రంభ, 12. మనోరమ, 13. కేశిని, 14. సుబాహువు, 15. సురత, 16. సురజ.

 అప్సరసలు కశ్యపుడను మునియందు పుట్టినట్లును, పాలసముద్రమునందు పుట్టినట్లును చెప్పుదురు. బ్రహ్మదేవునికి పిక్కలనుండి పుట్టినవారుగా కూడా చెబుతారు.

వీరు ఇంద్రుని కొలువులో ఉండెడి దేవవేశ్యలు. అవివాహితలు. ఇంద్రుడు వీరిని విశ్వామిత్రుని వంటి  మునుల తపస్సులను భగ్నము చేయడానికి, హరిశ్చంద్రుని వంటి సత్యశీలుర వ్రతభంగము చెరచడానికి భూలోకానికి పంపుతుండేవాడని అంటారు. ఊర్వశి అర్జునుని మోహించి, అర్జునునిచే తిరస్కరింపబడి, అతనిని నపుంసకునిగా కొంతకాలము జీవించమని శాపమిచ్చినది. ఆ శాపము అర్జునునికి వరమై, అజ్ఞాతవాసంలో ఉపయోగపడినది.

అప్సరసలు సంగీతము, నృత్యము వంటి కళలందు ప్రావీణ్యత గలవారు.  ఇంద్రుని సభలో వీరు నృత్యప్రదర్శనలు, సంగీత సభలు నిర్వహించేవారు. 

జగన్మాత చతుష్షష్టి కళామయి. సంగీతప్రియ, సామగానప్రియ, లాస్యప్రియ.  సహజముగా కళాకారిణులైన రంభ,ఊర్వశి మొదలైన అప్సరసలు వాగ్దేవీ స్వరూపిణియైన అమ్మవారిని ఆరాధించి వారి కళాకౌశలమును మరింత రాణింపననుగ్రహించమని కోరుకొంటూ నమస్కరించేవారు. కాబట్టి జగన్మాతకు రంభాదివందితా యను నామ మంత్రమొకటి సార్థకమైనది.

రంభ అనగా హృల్లేఖ హ్రీంకారము. పరమేశ్వరి హ్రీం కారముచే జపింపబడుచున్నది.

జగన్మాతకు నమస్కరించునపుడు ఓం రంభాది వందితాయై నమః అని అనవలెను.

****


*742వ నామ మంత్రము* *ఓం భవదావసుధావృష్ట్యై నమః*

సంసార దావానలంమధ్య చిక్కుకుపోయి, అట్టి దావానలాన్ని యధిగమించలేక  అలమటించే జీవులను  అమృతవర్షిణియై రక్షించు పరమేశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *భవధావసుధావృవ్టిః* యను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును *ఓం భవదావసుధావృష్ట్యై నమః* అని ఉచ్చరించుచూ, ఆ జగజ్జననిని ఆరాధించు భక్తులకు సంసారసంబంధమైన దుఃఖములు లేకుండా చేయును మరియు సుఖసంతోషమయమైన జీవితమును అనుగ్రహించును. పునర్జన్మరాహిత్యమైన మోక్షమును కలుగజేయును.

దైవ బలంబుగానులె మదీయబలమ్మునుజూప యత్నమున్ 

భావపరంపరాగతిగ భాగ్యమనస్సునుతెల్ప యుక్తిగన్ 

సేవ యనేదిగామనసు సీతల లక్ష్యము పొందగల్గుటన్ 

సావ సమాగుణమ్మును విశాలము పర్చగ శాంతి శాంభవీ

భగవద్బలం లేకుండా నాది ఏమాత్రం బలం లేదని, నేను చేసే ప్రయత్నమంతా దైవబలంతో కూడినదే అని తెలియజేస్తున్నాను.

భావాల పరంపరలో ప్రవహిస్తూ, అదృష్టానికి లోనైన నా మనస్సును సమర్థతతో అర్థవంతం చేయాలని ప్రయత్నించుచున్నాను.

సేవ అనే శాశ్వత మార్గాన్ని మనసుతో ఆశ్రయించి, చల్లదనమైన, శాంతియుతమైన లక్ష్యాన్ని సాధించగలగాలనే కోరిక.

సావధానంగా సమగుణతను (సమతా, సహనం, దయ మొదలైన గుణాలను) విస్తరింపజేసేలా శాంతియుతమైన శాంభవీ స్వరూపినీ అనుగ్రహించు.

**

భవ అనగా సంసారము. దావ అనగా కార్చిచ్చు (అడవిలో చెలరేగు  అగ్ని) సుధ అనగా అమృతము. వృష్టిః అనగా వర్షపుజల్లు. సంసారమను కార్చిచ్చుపై అమృతవృష్టిని కురిపించును జగన్మాత.

****


831వ నామ మంత్రము  ....ఓం ప్రాణేశ్వర్యై నమః

ముఖ్యప్రాణము మరియు ఇంద్రియాలకు అధిష్ఠాన దేవతయై విరాజిల్లు శ్రీమాతకు నమస్కారము. 

శ్రీలలితా  సహస్ర నామావళి యందలి ప్రాణేశ్వరీ యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును ఓం ప్రాణేశ్వర్యై నమః అని ఉచ్చరించుచూ, ఆ జగదీశ్వరియైన లలితాంబను ఆరాధించు సాధకులకు ఆయురారోగ్యములు, శాంతిసౌఖ్యములు, భగవదారాధనయందు ఏకాగ్రత సంప్రాప్తమగును.

ప్రాణములకు ఆధారమైనది. ప్రాణములనగా ఇంద్రియములు.  అట్టి ఇంద్రియములకు అధిష్ఠాత్రి. గనుకనే ప్రాణేశ్వరీ యని అనబడినది.

ప్రాణములు అయిదు.  1. ప్రాణము (హృదయమున నుండునది), 2. అపానము (గుదమున నుండునది), 3. సమానము (నాభి మండలమున నుండునది), 4. ఉదానము (కంఠమున నుండునది), 5. వ్యానము (శరీరమంతట వ్యాపించి యుండునది).

చం. 

హృదయమునుండుకాంక్షలుసహాయఅపానము ప్రాణ మూలమున్

ఉదయ మనస్సు కంఠమునయున్నతిగాను కళే సుహాసి మానమున్

పదము యశస్సు నాభిగను పాఠమునేస్తమయమ్ము జీవమున్

విధము శరీరమంతటయు విద్యల ధర్మ ప్రవర్త ప్రాణమున్

ఈ పద్యం, మానవ శరీరం కేవలం ఒక భౌతిక నిర్మాణం కాదని, అది కోరికలు, ప్రాణం, మనస్సు, కీర్తి, జ్ఞానం, ధర్మం వంటి అనేక సూక్ష్మ శక్తులకు, భావాలకు నిలయమని వివరిస్తుంది. హృదయంలో కోరికలు ఉంటే, అపాన వాయువు ప్రాణానికి మూలం. కంఠం మనస్సు యొక్క ఉన్నతమైన వ్యక్తీకరణకు, జ్ఞానానికి, ఆనందానికి వేదిక. నాభి కీర్తికి, శక్తికి కేంద్రం, జ్ఞానం జీవితానికి శాశ్వత మార్గదర్శి. చివరిగా, మొత్తం శరీరంలో విద్యలు (జ్ఞానం) మరియు ధర్మం (సదాచారం) వ్యాపించి, అవి జీవితాన్ని నడిపించే ప్రాణశక్తిగా పనిచేస్తాయి.

ఇది మానవ ఉనికి యొక్క సంక్లిష్టతను, ఆధ్యాత్మికతను, మరియు శరీరం, మనస్సు, ఆత్మల మధ్య ఉన్న సమన్వయాన్ని సూచించే ఒక అద్భుతమైన పద్యం.

ఉపప్రాణములు కూడా అయిదు. అవి:

 1. నాగము(వాక్కు నందుండునది), 2. కూర్మము (కంటిరెప్పల యందుండునది), 3. కృకరము (నేత్రముల యందుండునది), 4. దేవదత్తము (కంఠద్వారమున నుండునది), 5. ధనంజయము (హృదయమున నుండునది).

ఈ ప్రాణములకు పరమేశ్వరి అధిష్ఠాత్రి.

వేదమునందు ప్రాణమునకే ప్రాణము అనికూడా చెప్పబడినది. అనగా ప్రాణములకు అధిష్ఠాత్రి అయిన శ్రీమాత లేకుంటే ప్రాణములుకూడా నిలువలేవు. అందుకే అంటారు శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని.  ప్ర + ఆణ అనగా  ప్రాణ. ప్రాణ అనగా శబ్దము అను  అర్థము గలదు. ఇక్కడ శబ్దము అనగా వేదశబ్దము. అనగా వేదము.  వేదరాశికి దేవత. అనగా వేదముచే ప్రతిపాదింప బడినది. వేదము అనగా పరబ్రహ్మము. అట్టి పరబ్రహ్మ స్వరూపిణియైన అమ్మవారు ప్రాణేశ్వరీ యని అనబడినది.

సృష్టి సకల జీవరాసులు కర్మలు చేస్తుంటాయి. ఆ కర్మలఫలితంగా పునర్జన్మలు పొందడం జరుగుతుంది. ఈ పునర్జన్మ అనేది పరమేశ్వరి ఆజ్ఞయే. అనగా సకల జీవకోటికి (ప్రాణికోటికి) అధికారిణి గనుకనే అమ్మవారు ప్రాణేశ్వరీ యని అనబడినది. శ్రీమాత ప్రాణేశ్వరి యగుట చేతనే ముక్కంటి  మూడవ కంటి మంటలకు మన్మథుడు భస్మమయిపోయాడు. పరమేశ్వరి ప్రాణేశ్వరి గనుకనే మన్మథుని సజీవునిగా చేసినది. హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవ నౌషధిః (84వ నామ మంత్రము) శివుని నేత్రాగ్నిచే భస్మమయిపోయిన మన్మథుని సజీవుని చేయుటకు సంజీవనౌషధిగా జగన్మాత ఒప్పారినది.

మహిషుడు, భండాసురుడు మొదలైన రాక్షసుల ప్రాణములను హరించివేసినది యంటే ఆ తల్లి ప్రాణేశ్వరి యే గదా!

జగన్మాతకు నమస్కరించునపుడు ఓం ప్రాణేశ్వర్యై నమః అని యనవలెను.

*****

832వ నామ మంత్రము . ఓం ప్రాణదాత్ర్యై నమః

జీవులకు ప్రాణములను ఇచ్చి జీవింపజేయు పరమేశ్వరికి నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి ప్రాణదాత్రీ యను నాలుగు అక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును ఓం ప్రాణదాత్ర్యై నమః అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధించు సాధకులకు ఆ జగన్మాత అకాలమృత్యువులనుండి, ఆకస్మిక ప్రమాదములనుండి కాపాడును. ఆయురారోగ్యములు ప్రసాదించును. భౌతిక జీవనమునందు శాంతిసౌఖ్యములు ప్రసాదించి అనంతమైన బ్రహ్మజ్ఞాన సాధన దిశగా అడుగులు వేయించును.
జీవుల శరీరంలో ప్రాణములుంటేనే ఇంద్రియవ్యాపారం కొనసాగుతుంది.   ఇంద్రియముల కదలికలు గోచరమవుతాయి. దేహంలోని ప్రాణం చూడడానికి గోచరించదు. ప్రాణం యొక్క ఉనికి ఇంద్రియముల  కదలికననుసరించియే తెలియుచుండును. గనుక ప్రాణము  అంటే ఇంద్రియములు అని కూడా ఇచ్చట చెప్పుకొనవచ్చును. ప్రాణములుఅనగా పంచ ప్రాణములు, ఇంకను పంచ ఉప ప్రాణములను జగన్మాత జీవులకు ఇచ్చును. అలాగే జ్ఞానేంద్రియములు ఐదు, కర్మేంద్రియములు ఐదు, మనసు (వెరసి పదకొండు ఇంద్రియములను) కూడా ఇచ్చును.

మ.
మనమధ్యా విధి యాడు నాటకము యేమచ్చల్లె ప్రేమమ్ము యే
గుణమా నన్నుగ నీవు నుంచగలిగే గుప్తమ్ము గానౌను చూ
సినిమా కా ముని చెప్పె నేడు వదగునే సీతమ్మ గంగాతటిన్
తృణమే జీవిత భాగ్యమవ్వగలిగే తృప్తౌనులే శాంభవీ

మన మధ్య జరుగుతున్నదంతా విధి ఆడిస్తున్న నాటకం మాత్రమే. కానీ అందులో ప్రేమ మాత్రమే కలుషిత రహితంగా – మచ్చల్లేదుగా – నిలుస్తుంది. నన్ను గుణవంతుడిగా నిలిపే శక్తి నీవు సమర్పించిన ఒక అంతర్ముఖ గుప్తమయ్య శక్తి – అది నీ చైతన్యమే.
ఈ జీవితం ఒక సినిమా మాత్రమే అని ఓ జ్ఞానముని నేడు గంగాతటంపై ఉపదేశించాడు – అంటే జీవనానుభవాన్ని తాత్త్వికంగా పరిశీలించిన వాడికి ఇది మాయానాటకమైంది.
జీవిత భాగ్యాలన్నీ తృణసమమైపోవగలవి – తృప్తి వుండినపుడే అవి మాధుర్యమవుతాయి. అటువంటి తృప్తిని ప్రసాదించగలదీ శాంభవీ (అమ్మవారి) అనుగ్రహమే.

 శరీరం పుట్టిన తరువాత పదకొండు ఇంద్రియములు ఉంటాయి. మరి అవి అమ్మవారు ఇవ్వడమేమిటి? అనే ప్రశ్న ఉత్పన్నము కవచ్చును. ఇంద్రియములకు ఆయా పనితనములను ప్రసాదించునని భావించదగును. జీవుని పాత్ర తీరిపోగానే ప్రధాన ప్రాణము పయనమై పోవును. ఆ వెంట మిగిలిన ప్రాణములు కూడా తరలిపోవును. ప్రాణములు శరీరమును విడచిన వెంటనే ఇంద్రియములు కూడా చచ్చుబడిపోవును. అప్పుడు ఆ దేహాన్ని శవము అన్నారు. ఒక్క ప్రధాన ప్రాణమును అమ్మవారు జీవునికి పోయగానే మొత్తము ప్రాణములు, ఇంద్రియముల కార్యనిర్వాహకత్వము కూడా శరీరంలో స్థాపింపబడి పంచభూతాత్మకమైన ఆ శరీరము కదలును. లోకములో తనకున్న పాత్రనిర్వహణను కొనసాగించును. అందు చేతనే ప్రాణుల చేతనావస్థకు  వలసిన ప్రాణమును అమ్మవారు ప్రసాదించును గనుక ఆ తల్లి ప్రాణదాత్రీ యని అనబడినది.

జగన్మాతకు నమస్కరించునపుడు ఓం ప్రాణదాత్ర్యై నమః అని యనవలెను.
***


833వ నామ మంత్రము ... ఓం పంచాశత్పీఠ రూపిణ్యై నమః

ఏబదియొక్క పీఠములు (మాతృకావర్ణాధిదేవతల) స్వరూపిణిగా విరాజిల్లు జగన్మాతకు నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి పంచాశత్పీఠరూపిణీ యను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును ఓం పంచాశత్పీఠ రూపిణ్యై నమః అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను అత్యంత భక్తిప్రపత్తులతో ఉపాసించు సాధకునికి మానవజన్మకు, మానవేతర జన్మకు గల భేదము, మానవజన్మను పొందినందుకు ఆ పరమేశ్వరి నామమంత్రస్మరణతో కైవల్యమునందడానికి గల మార్గము    ఆ తల్లి అనుగ్రహము వలన తెలియును.

శార్దూలం :--
ప్రాణంబుల్ పదిలంబుగా తనువులన్ రాజిల్లుచు న్నుండగా
త్రాణోత్సాహములందజేయ తనదౌధర్మంబుపాటించుచున్
వీణావాదనమట్లు వాయువ హహా! వీచుల్ప్రపంచించునే!
రాణింపేర్పడ మేనులందు పులకల్ తైతక్కలా యీశ్వరీ  

ఈ పంక్తి పద్యానికి ముగింపు, ఇది దేవతకు (ఈశ్వరీ) సంబోధిస్తుంది. ప్రాణం, వాయువు, ధర్మం సరిగ్గా పనిచేస్తున్నప్పుడు, శరీరంలో ఆనందం, భక్తి, లేదా ఏదైనా దివ్య అనుభూతి వల్ల పులకింతలు (గూస్ బంప్స్/రోమాంచం) ఏర్పడతాయి. ఈ పులకింతలు "తైతక్కలా" (నాట్యంలోని ఒక శబ్దం) అన్నట్లుగా, అంటే ఒక లయబద్ధమైన నృత్యం వలె శరీరంలో ఆనందంగా ప్రకంపించి, ఆనందాన్ని పంచుతాయని కవి వర్ణించారు. ఇది దేవతానుగ్రహం వల్ల కలిగే దైవిక అనుభూతిని సూచిస్తుంది.


జగన్మాత ఏబదియొక్క శక్తిపీఠముల స్వరూపిణిగా విరాజిల్లుతున్నది అని భావము. 
పంచాశత్పీఠ యనగా ఏబది (50) మాత్రమే యథార్థమైన అర్థము. కాని ఏబదికి దగ్గరగా ఉన్నసంఖ్య ఏబది ఒకటిని గ్రహించినచో ఈ నామ మంత్రమునకు సరైన భావము మనకు తెలియును. భాస్కరరాయలు వారు ఏబది ఒకటి అని తీసుకోవడానికి చాలా ప్రమాణాలు తెలియజేశారు. కాని, కొన్ని ప్రమాణములను మాత్రమే గ్రహించి వివరణచేయు ప్రయత్నము జరిగినది.
దక్షయజ్ఞంలో సతీదేవి భర్త అయిన పరమేశ్వరునకు అవమానం జరిగి, సతీదేవి ఆత్మత్యాగముచేయగా, పరమేశ్వరుడు సతీదేవి దేహంతో ప్రళయతాండవము ప్రారంభించాడు. లోకాలు ఆ రుద్రుని తాండవమునకు తల్లడిల్లిపోతుంటే, నారాయణుడు తన సుదర్శనంతో సతీదేవి దేహాన్ని ఖండించగా, ఆ ఖండములు ఏబది ఒక్కచోట పడి, శక్తిపీఠములుగా వెలసినవి. గనుక శ్రీమాత పంచాశత్పీఠరూపిణీ యని అనబడినది.
జగన్మాత అకారాది క్షకారాంత మాతృకా వర్ణరూపిణి. మాతృకా వర్ణములు ఏబది ఒకటి (51) అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ౠ ఌ ౡ ఎ ఐ ఒ ఔ అం అః క ఖ గ ఘ ఙ చ ఛ జ ఝ ఞ ట ఠ డ ఢ ణ త థ ద ధ న ప ఫ బ భ మ య ర ల వ శ ష స హ ళ క్ష).  ఈ అక్షరములకు అధిదేవతలు (శక్తిలు) గలరు. వారు నెలకొని యున్న ప్రతీ ఒకటి ఒక్కొక్క శక్తి పీఠమై విలసిల్లుచున్నవి. అటువంటి ఏబదిఒక శక్తిపీఠముల స్వరూపము  తనదిగా భాసిల్లు పరమేశ్వరి పంచాశత్పీఠరూపిణీ యని అనబడినది🙏🙏🙏
ఈ అధిదేవతలకు, మనదేహంలో ఉన్న షట్చక్రములకు, లలితాసహస్ర నామస్తోత్రంలోని కొన్ని శ్లోకములతో సమన్వయించి ఇక్కడ వివరణ చేయబడినది.
*****