*అద్వైత వేదాన్త గీతాని*
*శ్రీ సదాశివ బ్రహ్మేన్ద్ర విరచిత*
🕉🌞🌎🌙🌟🚩
కున్తలవరాళీరాగః - ఆదితాళమ్.
5. గాయతీ వనమాలీ
గాయతి వనమాలీ - మధురం
గాయతీ వనమాలీ!!
1. పుష్పనుగన్ధిసు - మలయ సమీరే
మునిజన సేవిత యమునా తీరే || గాయతి||
2. కూజిత శుక - పిక - ముఖ ఖగకుఞ్జే
కుటిలాలిక బహు నీరదపుఞ్జే || గాయతి||
3. తులసీదామ విబూషణహారీ
జలజ భవస్తుత సద్గుణ శౌరీ || గాయతి||
4. పరమహంస హృద యోత్సవకారీ
పరిపూరిత మురళీ రవధారీ గాయ|!!
తాత్పర్యము:-
1. ఆహా! వైజయంతీ విభూషితుడైన శ్రీకృష్ణదేవుని మధురగానము చెలగుకున్నది.
పూలవాసనలతో గుబాళించుచున్న మలయమారుత ముతో నిండిన - మునిజన నివాసమైన - యమునాతీరమున వనమాలి గానము సాగుచున్నది.
2. యమునయొడ్డున పొదలలో చిలుకలు, కోయిలలు కూయుచున్నవి. ఉంగరాలజుట్టువలె మబ్బులు ముసురుకొని వచ్చుచున్నవి. అపుడచట వాని నడమ స్వామిగానము ప్రవహించుచున్నది.
3. తులసీమాలికా విభూషితుడు - బ్రహ్మ సంస్తుతుడు - గుణశాలి - శౌరి - వనమాలి గానముచేయుచున్నాడు.
4. పరమహంసలైన యోగీంద్రుల (సదాశివబ్రహ్మేంద్రుల) హృదయము నానందముతో నిండించుచు - వనమాలి గోపాలదేవుడు - అడుగో! గానము చేయుచున్నాడు.
🕉🌞🌎🌙🌟🚩
కాలభైరవుడు ఎవరు? శివాలయం బయట ఎందుకు ఉంటాడు?
కాలభైరవుడిని పరమేశ్వరుడి పరిపూర్ణ అవతారంగా భావిస్తారు. బ్రహ్మవిష్ణువులను ఆవహించిన అజ్ఞానాన్ని తొలగించడానికి రుద్రుడి భృకుటిలోంచి పుట్టిన ఆ మహాశక్తిమంతుడు... దుష్టశిక్షకుడిగా, గ్రహపీడల్ని తొలగించే దేవుడిగా పూజలు అందుకుంటున్నాడు. వారణాసికి కాలభైరవుడే క్షేత్రపాలకుడు.
భైరవః పూర్ణ రూపోహి శంకరస్యపరాత్మనః
మూఢాస్తంవై నజానంతి మోహితాశ్శివమాయయా
...అంటుంది శతరుద్రసంహితం. శివపురాణమూ, కాశీఖండమూ కాలభైరవుడి గొప్పదనాన్ని కొనియాడాయి. భైరవుడిని స్మరించుకోవడానికైనా ఓ యోగం ఉండాలంటారు. పక్కనే కాలభైరవక్షేత్రం ఉన్నా చాలా సందర్భాల్లో మనం పట్టించుకోం. లోపలికెళ్లాలన్న ఆలోచనా రాదు. అందుకో కారణం ఉందంటారు ఆధ్యాత్మికవేత్తలు. పరమశివుడు మనల్ని ఓరకమైన మాయాలో పడేస్తాడట. దీంతో... కాలభైరవుడి మహత్తును అర్థం చేసుకోలేకపోతామట. ఆ మాయాపొర తొలగిననాడు... పరమేశ్వరుడి పూర్ణాంశ అయిన కాలభైరవుడు కట్టెదుట దర్శనమిస్తాడు. కాలభైరవ ఉపాసన ప్రాచీనమైంది. భైరవుడిని పూజిస్తే గ్రహ దోషాలూ, అపమృత్యు గండాలూ తొలగిపోతాయనీ ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయనీ మంత్రశాస్త్రం చెబుతోంది. కాశీ మహానగరం, ఉజ్జయిని తదితర ప్రాచీన క్షేత్రాల్లో కాలభైరవుడి ఆలయాలున్నాయి.
ఎవరీ కాలభైరవుడు...
శివపురాణంలో కాలభైరవ వృత్తాంతం ఉంది. ఓసారి మహర్షులకు ఈశ్వర తత్వాన్ని అర్థం చేసుకోవాలన్న జిజ్ఞాస కలిగింది. ఎవరు చెబుతారా అని ఆలోచించారు. సృష్టికర్తను మించిన బ్రహ్మజ్ఞాని ఎవరుంటారు? నేరుగా బ్రహ్మ తపస్సు చేసుకుంటున్న మేరు పర్వతానికి వెళ్లారు. బ్రహ్మదేవుడు కూడా ఆ నిగూఢ రహస్యాన్ని తప్పక బోధిస్తానని మాటిచ్చాడు. అంతలోనే...సృష్టికర్త చుట్టూ ఓ మాయాపొరను సృష్టించాడు పరమేశ్వరుడు. దీంతో, మనసులో ఏ మూలనో ఉన్న అహంకారం బయటికొచ్చింది. ‘పిచ్చి మహర్షులూ! పరమతత్వం గురించి చెప్పేదేముంది? నేనే ఆ మహాతత్వాన్ని. స్వయంభువును నేను. విధాతను నేను. సృష్టిస్థితిలయ కారకుడినీ నేను. మీ ప్రశ్నకు జవాబు కూడా నేనే..’ అంటూ ప్రగల్బాలు పలికాడు. అక్కడే ఉన్న విష్ణుమూర్తికి ఆ మాటలు వినిపించాయి. మాయకే మాయలు నేర్పగలిగిన విష్ణుమూర్తిని కూడా మాయాపొర కమ్మేసింది. ‘కాదుకాదు...నేనే గొప్ప’ అంటూ వాదానికి దిగాడు. ఇద్దరూ కలసి వేదాల దగ్గరికెళ్లారు. వేదాలు పురుషరూపాన్ని ధరించి ‘యదంతస్థ్సాని భూతాని యత్సర్వం ప్రవర్తరే...’ - సకల ప్రాణుల్నీ తనలో లీనం చేసుకున్నవాడైన రుద్రుడే పరమతత్వం అంటూ ఆ వేదపురుషుడు పరమేశ్వరుడిని కొనియాడాడు. ఓంకారం కూడా శివుడే సర్వేశ్వరుడని నిర్ధారించింది. అంతలోనే...దివ్యతేజస్సుతో ముక్కంటి ప్రత్యక్షం అయ్యాడు.
ఆ ఆకారాన్ని చూసి బ్రహ్మ ఐదో తల ఫక్కున నవ్వింది. దీంతో శివుడు ఆగ్రహంతో వూగిపోయాడు. భృకుటి ముడిపడింది. అందులోంచి భయంకరమైన ఆకారంతో ఓ కాలపురుషుడు ఆవిర్భవించాడు. అతడే కాలభైరవుడు. భయంకరంగా ఉంటాడు కాబట్టి భైరవుడన్న పేరొచ్చింది. పాపాల్ని పరిహరించేవాడిగా ‘పాపభక్షు’ అయ్యాడు. కాలభైరవుడికి కాశీనగరం మీద ఆధిపత్యాన్ని ప్రసాదించాడు మహాదేవుడు. శివుడి ఆదేశాన్ని అనుసరించి ...తన వేలిగోటితో బ్రహ్మ ఐదో తలను తెగ నరికేశాడు కాలభైరవుడు. కానీ, ఆ తల కిందపడిపోకుండా భైరవుడి చేతికి అంటుకుపోయింది. అంతలోనే విష్ణువు చుట్టూ తిరుగుతున్న మాయ కూడా తొలగింది. శివతత్వాన్ని నోరారా మెచ్చుకున్నాడు. దీంతో, నాగభూషణుడు శాంతించి విష్ణుమూర్తిని ఆలింగనం చేసుకున్నాడు. చేతికి అంటుకున్న బ్రహ్మకపాలాన్ని మాత్రం కాలభైరవుడు వదిలించుకోలేకపోయాడు. ముల్లోకాలూ తిరిగినా ఫలితం లేకుండా పోయింది. కాశీనగరంలో కాలుపెట్టగానే, మహాద్భుతం జరిగినట్టు...కపాలం వూడిపడింది. దీంతో కాలభైరవుడు ఆనంద తాండవం చేశాడు. కాశీక్షేత్రంలోని ఆ ప్రాంతమే ‘కపాలమోచన’ దివ్యతీర్థంగా ప్రసిద్ధమైంది. ఇక్కడ పితృదేవతలకు తర్పణాలు ఇస్తారు. ఈ తీర్థానికి ఎదురుగా కాలభైరవుడు కొలువుదీరాడు. స్థానికులు ‘లాట్ భైరవ’ అని పిలుచుకుంటారు. ఈ క్షేత్రంలో మహాభైరవాష్టమిని ఘనంగా జరుపుతారు. కార్తికమాసంలోని కృష్ణపక్ష అష్టమినే...కాలాష్టమిగా, కాలభైరవ జయంతిగా జరుపుకుంటారు. మార్గశిర కృష్ణపక్ష అష్టమిని మహాభైరవాష్టమిగా నిర్వహించుకునే వారూ ఉన్నారు. ఆ రోజు కాలభైరవుడి సన్నిధిలో జాగరణ చేస్తారు.
పరమశివుడి ఆదేశం ప్రకారం...కాలభైరవుడే కాశీ క్షేత్రాధిపతి. ఏ ఆలయానికి వెళ్లినా ముందుగా క్షేత్ర పాలకుడిని సందర్శించుకోవడం ఆచారం. ఇక్కడ అష్టభైరవుల ఆలయాలున్నాయి. విశ్వనాథుడి ఆలయానికి కొద్దిదూరంలో కాలభైరవమూర్తి దర్శనమిస్తాడు. రకరకాల భయాలతో బాధపడేవారు ఇక్కడ రక్షరేకులు కట్టించుకుంటారు. దేవుడికి నైవేద్యంగా మద్యాన్ని సమర్పిచడం ఈ క్షేత్ర ప్రత్యేకత. మణికర్ణికాఘాట్ ప్రాంతంలో కాలభైరవుడిని మశాన్ (శ్మశాన)బాబాగా కొలుస్తారు. ఉజ్జయినిలో వెలసిన కాలభైరవుడు కూడా మహాశక్తిమంతుడని భక్తుల విశ్వాసం. దిల్లీ నగరంలోనూ కాలభైరవ క్షేత్రం ఒకటుంది. అసితాంగ భైరవుడూ, రురు భైరవుడూ, చండ భైరవుడూ, క్రోధ భైరవుడూ, ఉన్మత్త భైరవుడూ, కపాల భైరవుడూ, భీషణ భైరవుడూ, సంహార భైరవుడూ... ఇలా ఎన్నో రూపాల్ని ధరించాడు కాలభైరవుడు. ఒక్కో రూపాన్ని ఉపాసిస్తే, మనలోని ఒక్కో దుర్గుణం తొలగిపోతుందని సాధకులు చెబుతారు.
[06:05, 21/11/2020] +91 95058 13235: శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
156వ నామ మంత్రము
ఓం నీరాగాయై నమః
రాగము అనగా కోరిక. దీని వలన అరిషడ్వర్గములు అనగా కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు ఉద్భవిస్తాయి. ఫలితంగా ద్వేషము, పగ, హింస వంటి చెలరేగుతాయి. ఇవి అన్నీ భౌతికశరీరధారులకు మాత్రమే. వీటన్నిటికీ అతీతురాలైన పరమాత్మ స్వరూపిణి జగన్మాతకు నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి నీరాగా యను మూడక్షరముల (త్ర్యక్షరీ) నామ మంత్రమును ఓం నీరాగాయై నమః అని ఉచ్చరించుచూ, అత్యంత భక్తిశ్రద్ధలతో ఆ జగన్మాతను ఉపాసించు సాధకుడు, ఆ తల్లి కరుణచే అరిషడ్వర్గములను జయించును. భౌతికముగా సుఖసంతోషములనుభవించుచూ, పరమాత్మస్వరూపిణి పాదసేవలో పునీతుడై తరించును.
జగన్మాత నీరాగా (నిర్ + రాగా) అనగా కోరికలు లేనిది. ఆ తల్లి పరమాత్మ. భక్తజనుల ఇష్టకామ్యములను సిద్ధింపజేయును. ఆ తల్లి నిరీశ్వరా అని అన్నాముగదా! ఆ తల్లి లోకేశ్వరి. తానొక మహాసామ్రాజ్ఞి. సమస్త ప్రాణికోటిని తన బిడ్డలవలె సాకుచూ, ప్రేమానురాగాలతో బిడ్డలకేమి కావలెనో తల్లివలె అడగకముందే అన్నీ ఇస్తూ ఆనందభరితులను చేస్తుంది. తానే ఈశ్వరి. తనకెవరూ అధికులు గాని, సమములుగాని ఉండరు. అందుకే నిరీశ్వరి అయింది. అటువంటి నిరీశ్వరికి కోరికలు ఏమి ఉంటాయి? అందుకే ఆ తల్లిని నీరాగా అని అన్నాము.
కోరికలు ఉంటే అరిషడ్వర్గములు ఉద్భవిస్తాయి. అరిషడ్వర్గములు అనగా కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము.
కామము అనగా కోరిక. అది ఏదైనా కావచ్చు. ధనముకావచ్చు, అన్యస్త్రీ వ్యామోహము కావచ్చు...ఇంకేదైనా కావచ్చు.
కోరిక తీరక పోతే క్రోధము రావచ్చు. అందుకు ద్వేషము ఏర్పడవచ్చు. ఆ పైన పగ, హింస ఒకదాని వెంబడి మరొకటి వరుసకట్టి ఆవహిస్తాయి. అలాగే తాను కోరినది మరొకరు కోరకూడదనే లోభము చోటుచేసు కుంటుంది. ఆ కోరుకునే మరి ఒకరిని నిరోధించడంలో పగ, ద్వేషం పొడసూపుతాయి. తాను కోరిన కోరిక మూలంగా అదే దృష్టికలిగి ఆ కోరిన కోరికపై మోహము ప్రబలుతుంది. ఆ కోరికను తీర్చుకొనుటకు తనకున్న బలము, పలుకుబడిని తలచుకుంటూ ఉండే మదము అనేది బయటపడుతుంది. ఏకారణం చేతనైనా తాను కోరినది వేరొకరు కోరడంగాని, వేరొకరు పొందియుండుట జరిగితే మాత్సర్యము చెలరేగుతుంది. ఇది రాగము (కోరిక) యొక్క పర్యవసానము, దశలు. ఇవి మనసుకు సంబంధించినవి. ఆత్మకు ఉండవు. పరమాత్మస్వరూపిణి వీటన్నిటికీ అతీతురాలు గనుక నీరాగా యని అనబడుచున్నది. జగన్మాతను ఈ నామముతో ఆరాధిస్తే, సాధకులు నిశ్చయంగా అరిషడ్వర్గములను అధిగమించి జగన్మాత అనుగ్రహానికి పాత్రులు కాగలరు అనుటలో సందేహము లేదు.
జగన్మాతకు నమస్కరించునపుడు ఓం నీరాగాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐
[06:05, 21/11/2020] +91 95058 13235: 21.11.2020 ప్రాతః కాల సందేశము
వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం
దశమస్కంధము - పూర్వార్ధము - ఏడవ అధ్యాయము
శకటాసుర, తృణావర్తుల సంహారము
ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
7.21 (ఇరువది ఒకటవ శ్లోకము)
గోకులం సర్వమావృణ్వన్ ముష్ణంశ్చక్షూంషి రేణుభిః|
ఈరయన్ సుమహాఘోరశబ్దేన ప్రదిశో దిశః॥8527॥
7.22 (ఇరువది రెండవ శ్లోకము)
ముహూర్తమభవద్గోష్ఠం రజసా తమసాఽఽవృతమ్|
సుతం యశోదా నాపశ్యత్తస్మిన్ న్యస్తవతీ యతః॥8528॥
ఆ రాక్షసుడు (సుడిగాలి) ధూళులచేత గోకులమును క్రమ్మివేసి, ఆ దుమ్ముల ప్రభావముతో జనులు తమ కనులు తెఱచి చూడజాలనట్లు చేసెను. అంతేగాక, అతని (సుడిగాలి) యొక్క భయంకర శబ్దములు అన్ని దిక్కులందును ప్రతిధ్వనించెను. ఒక్క క్షణములోనే ఆ గోకులమంతయునూ, ధూళితోడను, చీకట్లతోడను నిండిపోయెను. అప్పుడు యశోదాదేవి తాను కూర్చొనబెట్టిన చోట కుమారునికై వెదకెను. కాని, అతడు ఎచ్చటను కనబడకుండెను.
పోతనా మాత్యుల వారి పద్యము
కంద పద్యము
ఖరుఁ డగు కంసుని పంపున
నరిగి తృణావర్తుఁ డవని కవచాటముగాఁ
సురకరువలి యై బిసబిస
నరు దరు దన ముసరి విసరి హరిఁ గొనిపోయెన్.
తాత్పర్యము
కఠినాత్ముడైన కంసుడు పంపిన తృణావర్తుడనే రాక్షసుడు అకస్మాత్తు నేల మీదకి వచ్చాడు. ఆ రావటం రావటం సుడిగాలి రూపంలో “రయ్” “రయ్” మంటు అందరు ఆశ్చర్యపోయేలా మిక్కిలి వడితో కమ్ముకుంటు వచ్చి, ఒక్క విసురుతో కృష్ణబాలకుని పైకి ఎత్తుకుపోయాడు.
7.23 (ఇరువది మూడవ శ్లోకము)
నాపశ్యత్కశ్చనాత్మానం పరం చాపి విమోహితః|
తృణావర్తనిసృష్టాభిః శర్కరాభిరుపద్రుతః॥8529॥
ఆ తృణావర్తుని (సుడిగాలి) విజృంభణతో చెలరేగిన ఇసుకరేణువుల దెబ్బకు జనులు ఎల్లరును ఉద్విగ్నులై, దిక్కుతోచని స్థితికి గుఱియైరి. అంతటవారు ఒకరిని మఱియొకరు కనుగొనలేకుండిరి.
పోతనామాత్యునివారి పద్యములు
కంద పద్యము
సుడి యెఱుఁగని హరి సుడివడ
సుడిగాలి తెఱంగు రక్కసుఁడు విసరెడి యా
సుడిగాలి ధూళి గన్నుల
సుడిసిన గోపకులు బెగడి సుడివడి రధిపా!
తాత్పర్యము
కష్టం అంటే తెలియని చంటిపిల్లాడు కృష్ణుడుని చిక్కుపడేయాలని తృణావర్తుడనే రాక్షసుడు సుడిగాలి రేపాడు. ఆ విసురుకి లేస్తున్న దుమ్ముకు కళ్ళు కమ్ముకోగా గోపకులు బెదిరి గాబరా పడ్డారు.
సుడి సుడి అని ఏడుసార్లు ప్రయోగించి. ఎంతో చమత్కారం చూపారు పొతన్న గారు.
7.24 (ఇరువది మూడవ శ్లోకము)
ఇతి ఖరపవనచక్రపాంశువర్షే సుతపదవీమబలావిలక్ష్య మాతా|
అతికరుణమనుస్మరంత్యశోచద్భువి పతితా మృతవత్సకా యథా గౌః॥8530॥
7.25 (ఇరువది ఐదవ శ్లోకము)
రుదితమనునిశమ్య తత్ర గోప్యో భృశమనుతప్తధియోఽశ్రుపూర్ణముఖ్యః|
రురుదురనుపలభ్య నందసూనుం పవన ఉపారత పాంసువర్షవేగే॥8531॥
తీవ్రమైన ఆ సుడిగాలి వేగమునకు ఆ ప్రదేశమంతయును దుమ్ముతో నిండిపోగా యశోదాదేవి ఎక్కడను తన కుమారుడు కనబడక పోవుటతో మిగుల దుఃఖితయై, అతనిని స్మరించుచు (కుమారా! కుమారా! అని వాపోవుచు) దైన్యముతో ఎడువసాగెను. ఆమె ఆ విపత్కరస్థితిలో, లేగను కోల్పోయిన ఆవువలె నేలమీద పడిపోయెను. ఇంతలో సుడిగాలి వేగము తగ్గిపోయెను. క్రమ్ముకొనిన దుమ్ము అణగిపోయెను. యశోదాదేవి రోదన ధ్వనులను విన్నంతనే గోపికలు ఎల్లరును ఆమె కడకు చేరిరి. చిన్నికృష్ణుడు కనబడకపోవుటతో వారును మిగుల పరితప్తహృదయులై కన్నీరు మున్నీరుగా ఏడువసాగిరి.
పోతనా మాత్యుల వారి పద్యము
ఉత్పలమాల
పాపనిఁ జూడఁ గానక విపద్దశ నొంది కలంగి తల్లి "యో
పాపఁడ! బాలసూర్యనిభ! బాలశిరోమణి! నేడు గాలికిం
జేపడిపోయితే" యనుచుఁ జీరుచు దైవముఁ జాల దూఱుచుం
దాపము నొంది నెవ్వగల డయ్యుచుఁ గుందుచు బిట్టు గూయుచున్
భావం
తన చంటిబిడ్డ కృష్ణుడు కనబడకపోడం అనే విపత్తులో పడి కొట్టుకుంటున్న యశోదాదేవి ఎంతో కలత చెందింది. “ఓ నా చిట్టితండ్రీ! ఉదయించే సూర్యుని లాంటి ప్రకాశం కలవాడవు కదా నువ్వు. బాలలలో వరేణ్యుడవుకదా. ఇదేమిటయ్యా, ఇలా సుడిగాలి బారిన పడిపోయావు” అని పిలుస్తూ విలపించింది. ఇలాటి విపద్దశ కలిగించిన దేవుణ్ణి అనేక రకాలుగా నిందించింది. ఎఁతో బాధ పడింది. బాధతో కుంగిపోతు విలపించసాగింది.
కంద పద్యము
"సుడిగాలి వచ్చి నిన్నున్
సుడిగొని కొనిపోవ మింట సుడిసుడి గొనుచున్
బెడఁ గడరెడు నా ముద్దుల
కొడుకా! యే మంటి" వనుచు “ఘోరం” బనుచున్
భావం
“ఓ నా ముద్దుల కొడుకా! అయ్యో సుడిగాలి వచ్చి ఎత్తుకుపోయిందా కొడుకా! ఆకాశంలో సుళ్ళు తిప్పేస్తుంటే ఎంతలా ఏడుస్తున్నావో ఏమిటో. ఎంతగా బెదిరి పోయావో ఏమిటో. మరీ ఇంత ఘోరమా” అంటు యశోద వాపోతోంది.
ఉత్పలమాల
"ఇక్కడఁ బెట్టితిం దనయుఁ డిక్కడ నాడుచు నుండె గాలి దా
నెక్కడ నుండి వచ్చె శిశు వెక్కడి మార్గము పట్టిపోయె నే
నెక్కడఁ జొత్తు" నంచుఁ గమలేక్షణ గ్రేపుఁ దొఱంగి ఖిన్నయై
పొక్కుచు వ్రాలు గోవు క్రియ భూస్థలి వ్రాలె దురంత చింతయై
భావం
“పిల్లాడ్ని ఇక్కడే ఇలా పడుకో బెట్టా. నా చిన్ని కన్నయ్య ఇక్కడే ఆడుతు ఉన్నాడు. ఇంతలో ఈ పాడు గాలి ఎక్కనుండి వచ్చిందో. నా పిల్లాడ్ని ఎక్కడకి ఎగరేసుకు పోతోందో. నా కొడుకు ఏమైపోతున్నాడో. అయ్యో నా కింకేం సాయం దొరుకుతుంది.” అంటూ ఆ కలువ కన్నుల కాంతామణి యశోద, లేగదూడ దూరమైన దుఃఖంతో అరుస్తు కూలే పాడి ఆవులా, భరించరాని దుఃఖంతో నేలమీద కుప్పకూలి పోయింది.
7.26 (ఇరువది ఆరవ శ్లోకము)
తృణావర్తః శాంతరయో వాత్యారూపధరో హరన్|
కృష్ణం నభో గతో గంతుం నాశక్నోద్భూరిభారభృత్॥8532॥
7.27 (ఇరువది ఆరవ శ్లోకము)
తమశ్మానం మన్యమాన ఆత్మనో గురుమత్తయా|
గలే గృహీత ఉత్స్రష్టుం నాశక్నోదద్భుతార్భకమ్॥8533॥
7.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)
గలగ్రహణనిశ్చేష్టో దైత్యో నిర్గతలోచనః|
అవ్యక్తరావో న్యపతత్సహ బాలో వ్యసుర్వ్రజే॥8534॥
సుడిగాలి రూపమున వచ్చిన తృణావర్తుడు శ్రీకృష్ణుని తీసికొని ఆకాశమునకు ఏగెను. క్రమక్రమముగా ఆ దివ్యశిశువు బరువై పోవుచుండుటతో ఆ రాక్షసుని వేగము తగ్గిపోయెను. అంతట అతడు ముందునకు సాగలేకపోయెను. ఆ అద్భుతబాలుడు తనకు మించిన బరువైపోవుచుండుటతో తృణావర్తుడు ఆయనను ఒక మహాశిలగా భావింపసాగెను. అంతేగాక, తన మెడను గట్టిగా పట్టుకొనియున్న ఆ బాలుని పట్టునుండి అతడు తప్పించుకొనలేకపోయెను. చిన్నికృష్ణుడు తనగొంతును గట్టిగా పట్టుకొని అదుముటతో ఆ తృణావర్తుడు చేష్టలుడిగినవాడై, కనులు తేలవైచెను. నోటమాట పెగలకుండెను. అంతట అసువులను కోల్పోయిన అతడు (అతని కళేబరము) కృష్ణునితోగూడి నేలపై పడిపోయెను.
పోతనామాత్యుల వారి పద్యములు
శార్దూల విక్రీడితము
ఆలోఁ జక్రసమీరదైత్యుఁడు మహాహంకారుఁడై మింటికిన్
బాలుం దోకొనిపోయి పోయి తుదిఁ దద్భారంబు మోవన్ బల
శ్రీ లేమిం బరిశాంత వేగుఁ డగుచుం జేష్టింపఁగా లేక ము
న్నీలా గర్భకుఁ జూడ నంచు నిటమీఁ దెట్లంచుఁ జింతించుచున్.
భావం
ఈలోగా, ఆ సుడిగాలిరాక్షసుడు, తృణావర్తుడు మిక్కిలి అహంకారంతో బాలకృష్ణుని ఆకాశంలో ఎంతో ఎత్తుకి తీసుకుపోసాగాడు. అయితే కృష్ణుడు క్రమేపీ బరువెక్కి పోసాగాడు. క్రమేణా రాక్షసుడికి బాలుని బరువు భరించే శక్తి సామర్థ్యాలు సరిపోవటం లేదు. వాడి తిరిగే వేగం తగ్గిపోతోంది. కడకు కదలటం కూడ కష్టసాధ్యం అయిపోయింది. “ఇంతకు ముందు ఇలాంటి పిల్లాణ్ణి ఎక్కడా చూడలేదే, ఇంకెలా బతకను బాబోయ్” అని విచారించసాగాడు.
కంద పద్యము
బాలద్విరద కరంబులఁ
బోలెడి కరములను దనుజు బొండుగు బిగియం
గీలించి వ్రేలఁ బడియెను
బాలకుఁ డొక కొండభంగి బరు వై యధిపా!
భావం
ఓ పరీక్షిన్మహారాజా! కృష్ణుడు గున్న ఏనుగు తొండాల్లాంటి తన రెండు చేతులు తృణావర్తుని కంఠానికి, శిక్షగావేసే బొండకొయ్యలా, మెలేసి బిగించాడు. పెద్ద కొండంత బరువై వాడి మెడగట్టిగా పట్టుకొని వేళ్ళాడసాగాడు.
రాజు శిక్షవేస్తేనే ఇక్కడ బాధపెట్టినా, పాప పరిహారం జరిగి నరకబాధలు తగ్గుతాయి. అలాగే భగవంతుడు వేసే శిక్షైనా అనుగ్రహమే. అందుకే అధిపా అని ప్రయోగించారేమో అనుకుంటాను.
కంద పద్యము
మెడ బిగియఁ బట్టుకొని డిగఁ
బడియెడి బాలకునిచేతఁ బర్వతనిభుచే
విడివడఁజాలక వాఁ డురిఁ
బడి బెగడెడు ఖగము భంగి భయముం బొందెన్.
భావం
తన కంఠం బిగించి పట్టుకున్న పర్వతమంత బరువైన కృష్ణబాలకుని బరువు దిగలాగుతుంటే, ఆ పట్టు తప్పించుకోలేక తృణావర్తుడు ఉరిలో చిక్కుకొని కొట్టుకొనే పక్షిలాగ గిలగిలా కొట్టుకోసాగాడు.
కంద పద్యము
హరి కరతల పీడనమునఁ
బరవశుఁడై ఱాలమీఁద భగ్నాంగకుఁ డై
సురవైరిభటుఁడు గూలెను
బురభంజను కోలఁ గూలు పురముం బోలెన్.
భావం
అలా పాపాలు హరించేవాడైన శ్రీకృష్ణుడు చేతులుతో నొక్కుతున్న నొక్కుడుకి, స్వాధీనం తప్పి తృణావర్తుడు రాళ్ళమీద పడ్డాడు. అలా త్రిపురసంహారి శంకరుని బాణం దెబ్బకి పురము కూలినట్లు కూలి పడ్డ ఆ దేవతల శత్రువు అవయవాలు అన్నీ తుక్కు తుక్కుగా చితికిపోయాయి.
7.29 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)
తమంతరిక్షాత్పతితం శిలాయాం విశీర్ణసర్వావయవం కరాలమ్|
పురం యథా రుద్రశరేణ విద్ధం స్త్రియో రుదత్యో దదృశుః సమేతాః॥8535॥
అంతట తృణావర్తుడు (తృణావర్తుని కళేబరము) శంకరుని బాణప్రహారమునకు దెబ్బతినిన త్రిపురాసురునివలె (త్రిపురాసురుని పురమువలె) నేలగూలగా ఆ కళేబరము ఒక పెద్దబండపై బడుటతో అవయవము లన్నియును శిథిలములయ్యెను. అచట చేరి రోదించుచున్న స్త్రీలు అందఱును ఆ భీకరరూపమును గాంచిరి.
7.30 (ముప్పదియవ శ్లోకము)
ప్రాదాయ మాత్రే ప్రతిహృత్య విస్మితాః కృష్ణం చ తస్యోరసి లంబమానమ్|
తం స్వస్తిమంతం పురుషాదనీతం విహాయసా మృత్యుముఖాత్ప్రముక్తమ్|
గోప్యశ్చ గోపాః కిల నందముఖ్యా లబ్ధ్వా పునః ప్రాపురతీవ మోదమ్॥8536॥
ఆ రాక్షసుని కంఠమును పట్టుకొని వ్రేలాడుచు అతని వక్షస్థలము పైనున్న చిట్టికృష్ణుని తీసికొని, గోపికలు యశోదమ్మకు అప్పగించిరి. ఆ రాక్షసునిచే ఆకాశమార్గమున తీసికొనిపోబడిన ఆ బాలుడు మృత్యుముఖమునుండి క్షేమముగా తిరిగివచ్చెను. అప్పుడు యశోదాది గోపికలు, నందాది గోపాలురును ఆకన్నయ్యను మఱల సురక్షితునిగా పొందినందులకు ఎంతయు సంతోషించిరి.
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి ఏడవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం
7702090319, 9505813235
[06:06, 21/11/2020] +91 95058 13235: ఈ రోజు తుంగభద్ర పుష్కర స్నానం సందర్భంగా జాప్యం అయింది🙏🙏🙏🌹
[20:45, 21/11/2020] +91 95058 13235: 21.11.2020 సాయం కాల సందేశము
వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం
దశమస్కంధము - పూర్వార్ధము - ఏడవ అధ్యాయము
శకటాసుర, తృణావర్తుల సంహారము
ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
7.31 (ముప్పది ఒకటవ శ్లోకము)
అహో బతాత్యద్భుతమేష రక్షసా బాలో నివృత్తిం గమితోఽభ్యగాత్పునః|
హింస్రః స్వపాపేన విహింసితః ఖలః సాధుః సమత్వేన భయాద్విముచ్యతే॥8537॥
పిమ్మట వారిట్లు నుడివిరి "ఇది ఎంత ఆశ్చర్యకరము? ఈ సంఘటన మిగుల అద్భుతమైనది. ఈ బాలుడు రాక్షసుని (తృణావర్తుని) వలన మృత్యుముఖమునకు చేరియు మఱల సురక్షితముగా తిరిగివచ్చినాడు. క్రూరుడైన దుర్మార్గుడు తాను చేసికొనిన పాపమునకు తానే బలియగును. సత్పురుషుడు రాగద్వేష రహితుడగుటవలన సకలభయముల (ఆపదల) నుండియు విముక్తుడగును.
పోతనామాత్యులవారి పద్యము
కంద పద్యము
రక్షణము లేక సాధుఁడు
రక్షితుఁ డగు సమతఁ జేసి రాయిడు లందున్
రక్షణములు వెయి గలిగిన
శిక్షి…
[05:57, 22/11/2020] +91 95058 13235: శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
731వ నామ మంత్రము
ఓం ప్రియంకర్యై నమః
సాధనస్థాయిని బట్టి, కోర్కెల ధర్మనిబద్ధత ననుసరించి కోర్కెలను తీర్చి భక్తులకు ప్రియమును చేకూర్చు ప్రేమస్వరూపిణి జగన్మాతకు నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి ప్రియంకరీ యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును ఓం ప్రియంకర్యై నమః అని ఉచ్చరించుచూ, ఆ లలితాంబను అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధనచేయు భక్తులను ఆ తల్లి కరుణించి భౌతికపరమైన సుఖశాంతులు ప్రసాదించును. మరియు జన్మరాహిత్యమైన మోక్ష సాధనకొరకు పరబ్రహ్మ చింతనవైపు మనస్సును మళ్ళించు ధ్యాననిమగ్నతను కూడా కలుగజేయును.
జగన్మాత ప్రేమస్వరూపిణి. అంతర్ముఖంగా అమ్మవారిని మిగుల ఏకాగ్రతతో ధ్యానించు భక్తులకు ఇష్టకామ్యార్ధసిద్ధిని కలుగజేస్తుంది. భక్తుల అనుష్టానంలోని స్థాయిని బట్టి అనుగ్రహించి ప్రియమును చేకూర్చుతుంది. యజ్ఞయాగాదులు చేసేవారు, దానధర్మమ…
[05:57, 22/11/2020] +91 95058 13235: శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
157వ నామ మంత్రము
ఓం రాగమథన్యై నమః
అనుభవించు కొలదీ వ్యామోహము పెంచు కోర్కెలయందు వైరాగ్యము కలిగించి, రాగద్వేషములను నశింపజేయు పరబ్రహ్మస్వరూపిణి జగన్మాతకు నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి రాగమథనీ యను ఐదక్షరముల (పంచాక్షరీ) నామ మంత్రమును ఓం రాగమథన్యై నమః అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని ఉపాసించు సాధకులకు రాగద్వేషకారకమైన కోర్కెలయందు వ్యామోహము తగ్గించి శాశ్వతమైన పరబ్రహ్మతత్త్వమును తెలిసికొను మార్గమునుజూపును.
జగన్మాత రాగద్వేషములకు అతీతురాలైనది. నీరాగా అను నామముతో స్తుతింపబడుచున్నది. కోరికలు కళ్ళెము లేని గుర్రముల వంటివి. అరిషడ్వర్గ ప్రభావముతో అనంతమైన కోర్కెల వలయములో చిక్కిన జీవుడు కోర్కెలు తీరక మరల మరల జన్మలు ఎత్తుచునేయుండును. వివిధ శరీరములు ధరించుచు జననమరణచక్రములో పరిభ్రమించుచునేయుండును. కోరికలు అనుభవించినంత మాత్రమున తీరునవి కాదు. అగ్నికి ఆజ్యము ఎటువంటిదో అనుభవించుట అనేది కోర్కెలకు అటువంటిది. అనుభవించుకొలదీ కోర్కెలపై వ్యామోహము అధికమగుచుండును. జగన్మాత తన భక్తులకు వైరాగ్యమును కలిగించి దేహాదులందనురాగము పోగొడుతుంది. రాగద్వేషములనేవి క్లేశములవంటివి. అటువంటి రాగద్వేషములను మథించి శాశ్వతమైన బ్రహ్మానందమును లభింపజేస్తుంది జగన్మాత. ఇంద్రియములను బుద్ధికి వశముకాకుండా జగన్మాత కాపాడుతుంది. జగన్మాత తన భక్తుల బుద్ధిని ఆత్మకు వశముచేయు బ్రహ్మవిద్యవైపు మరల్చుతుంది. దీనినే రాగమథనము అని అంటారు. గాన జగన్మాతకు రాగమథనీ యను నామము సార్థకమైనది.
జగన్మాతకు నమస్కరించునపుడు ఓం రాగమథన్యై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
నామకరణ సంస్కారము - బాల్యలీలలు
ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
శ్రీశుక ఉవాచ
8.1 (ప్రథమ శ్లోకము)
గర్గః పురోహితో రాజన్ యదూనాం సుమహాతపాః|
వ్రజం జగామ నందస్య వసుదేవప్రచోదితః॥8544॥
శ్రీశుకుడు పలికెను - పరీక్షిన్మహారాజా! మహాతపస్వియైన గర్గమహర్షి యదువంశజులకు పురోహితుడు. ఆ మహాత్ముడు వసుదేవుని ప్రేరణపై నందుని గోకులమునకు చేరెను.
8.2 (రెండవ శ్లోకము)
తం దృష్ట్వా పరమప్రీతః ప్రత్యుత్థాయ కృతాంజలిః|
ఆనర్చాధోక్షజధియా ప్రణిపాతపురఃసరమ్॥8545॥
ఆ మహామునిని చూచినంతనే నందుడు పరమప్రీతుడై, ఎదురేగి, ఆయనకు ప్రణమిల్లెను. పిదప అతడు ఆ సత్పురుషుని సాక్షాత్తూ భగవత్స్వరూపునిగా భావించి, భక్తితో ఆరాధించెను.
8.3 (మూడవ శ్లోకము)
సూపవిష్టం కృతాతిథ్యం గిరా సూనృతయా మునిమ్|
నందయిత్వాబ్రవీద్బ్రహ్మన్ పూర్ణస్య కరవామ కిమ్॥8546॥
అనంతరము నందగోపుడు ఆ మహర్షికి షడ్రసోపేత భోజనపదార్థములతో ఆతిథ్యమొసంగెను. పిమ్మట అతడు మృదుమధుర వచనములతో ప్రస్తుతించి ఆ మహర్షితో ఇట్లనెను - "మహాత్మా! నీవు పూర్ణకాముడవు (బ్రహ్మానందానుభూతిని పొందినావు). నీకు మేము ఎట్టిసేవలు చేయవలెనో తెలుపుము.
8.4 (నాలుగవ శ్లోకము)
మహద్విచలనం నౄణాం గృహిణాం దీనచేతసామ్|
నిఃశ్రేయసాయ భగవన్ కల్పతే నాన్యథా క్వచిత్॥8547॥
పూజ్యమహామునీ! సాంసారిక బంధకములలో కొట్టుమిట్టాడుచున్న మా వంటి దీనుల యిండ్లకు నీ యంతటి మహాపురుషుల ఆగమనము మాకు ఎంతయు శ్రేయోదాయకము (శుభప్రదము). అది మా పాలిట మహాభాగ్యము. లేనిచో మీ ఆగమనమునకు మరొక కారణమేమియు ఉండదు.
పోతనామాత్యుల వారి పద్యము
కంద పద్యము
"ఊరక రారు మహాత్ములు
వా రధముల యిండ్లకడకు వచ్చుట లెల్లం
గారణము మంగళములకు
నీ రాక శుభంబు మాకు నిజము మహాత్మా!
భావము
"ఓ మహాత్ముడవైన గర్గమహాముని! మీవంటి పెద్దలు, మా వంటి సామాన్యుల ఇళ్ళకు ఉత్తినే రారు. వచ్చారంటే తప్పకుండా ఏదో గొప్ప మేలు సిద్ధించడానికి మాత్రమే. అందుకే "ఊరక రారు మహాత్ములు" అన్న నానుడి ప్రసిద్ధమైంది కదా. కాబట్టి, తమ రాక వలన మాకు తప్పకుండా శుభాలు కలుగుతాయి. ఇది సత్యం.
8.4 (ఐదవ శ్లోకము)
జ్యోతిషామయనం సాక్షాద్యత్తజ్జ్ఞానమతీంద్రియమ్|
ప్రణీతం భవతా యేన పుమాన్ వేద పరావరమ్॥8548॥
8.6 (ఆరవ శ్లోకము)
త్వం హి బ్రహ్మవిదాం శ్రేష్ఠః సంస్కారాన్ కర్తుమర్హసి|
బాలయోరనయోర్నౄణాం జన్మనా బ్రాహ్మణో గురుః॥8549॥
జ్యోతిశ్శాస్త్రము ఇంద్రియములకు అగోచరమైన విషయములను తెలుపును. అట్టి మహాశాస్త్రమును మీరు రచించితిరి. దానివలన మానవులు తమ పూర్వజన్మ విషయములను గుఱించియు, భవిష్యత్తులో సంభవింపనున్న శుభాశుభ విశేషములను గూర్చియు తెలిసికొనగలుగుదురు. స్వామీ! బ్రహ్మవేత్తలలో మీరు శ్రేష్ఠులు. మా ఇద్దరు బాలురకును నామకరణాది సంస్కారములను నెఱపుటకు మీరే అర్హులు. ఏలయన బ్రాహ్మణోత్తముడు జన్మచేతనే మానవులకు గురువు.
గర్గ ఉవాచ
8.7 (ఏడవ శ్లోకము)
యదూనామహమాచార్యః ఖ్యాతశ్చ భువి సర్వతః|
సుతం మయా సంస్కృతం తే మన్యతే దేవకీసుతమ్॥8550॥
8.8 (ఎనిమిదవ శ్లోకము)
కంసః పాపమతిః సఖ్యం తవ చానకదుందుభేః|
దేవక్యా అష్టమో గర్భో న స్త్రీ భవితుమర్హతి॥8551॥
8.9 (తొమ్మిదవ శ్లోకము)
ఇతి సంచింతయంఛ్రుత్వా దేవక్యా దారికావచః|
అపి హంతాఽఽగతాశంకస్తర్హి తన్నోఽనయో భవేత్॥8552॥
గర్గాచార్యుడు నుడివెను - "నందగోపా! 'నేను యదువంశజులకు ఆచార్యుడను' అను విషయము లోకప్రసిద్ధము. నేను నీ కుమారునకు (బహిరంగముగా) నామకరణ సంస్కరణము నెఱపినచో - నీకును వసుదేవునకునుగల గాఢ మైత్రి కారణముగా 'ఇతడు వసుదేవుని కుమారుడు' అని కంసుడు భావించును. అంతట ఆ దుష్టాత్ముడు 'దేవకికి కలుగు ఎనిమిదవ సంతానము స్త్రీ కాదనియు, పురుషుడే యనియు' యోగమాయవలన వినిన మాటలను స్మరించుచు, 'ఈ బాలకుడు తనను చంపువాడే' అని కంసుడు శంకించును. ఆ కారణముగా అతడు ఈ బాలకునకు హాని తలపెట్టగలడు. విధముగా మనకు కీడు కలుగవచ్చును".
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి ఎనిమిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
శ్రీలలితా సహస్రనామ భాష్యము
732వ నామ మంత్రము
ఓం నామపారాయణ ప్రీతాయై నమః
మాతృకానామ పారాయణ, సహస్రనామస్తోత్ర పారాయణ, ఖడ్గమాల పారాయణ, పంచదశాక్షరీ మంత్రయుత త్రిశతీ నామపారాయణ - ఇటువంటి నామపారాయణల యందు ప్రీతిగలిగిన జగజ్జననికి నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి నామపారాయణప్రీతా యను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును ఓం నామపారాయణప్రీతాయై నమః అని ఉచ్చరించుచూ, ఆ జగదీశ్వరిని అత్యంత భక్తిశ్రద్ధలతో ఉపాసించు సాధకుడు పరమేశ్వరి అనుగ్రహానికి పాత్రుడై అనంతమైన ఆత్మానందానుభూతిని పొందును. భౌతిక సుఖశాంతులు కూడా పొందును.
జగన్మాత తన నామములను అత్యంత భక్తిశ్రద్ధలతో, ఆ తల్లిని అంతర్ముఖంగా వీక్షిస్తూ పారాయణ చేస్తే, అ పరమేశ్వరి బ్రహ్మానందభరితయై భక్తులను వరముల అమృతవృష్టిలో పరవశింపజేస్తుంది. ఆ జగన్మాతను స్మరించడానికి అనంతకోటి నామములు ఉన్నాయని చెప్పడానికి అతిశ…
[03:05, 23/11/2020] +91 95058 13235: శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
158వ నామ మంత్రము
ఓం నిర్మదాయై నమః
శరీరమదము, ధనమదము, అధికారమదము, విద్యామదము, సంపదమదము వంటి మదములు మనసుకు సంబంధించినవి. ఆత్మకు సంబంధించవు. అటువంటి మదములు ఏమియు లేక నిర్మదయై విరాజిల్లు పరమాత్మ స్వరూపిణియైన జగన్మాతకు నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి నిర్మదా యను మూడక్షరాల (త్ర్యక్షరీ) నామ మంత్రమును ఓం నిర్మదాయై నమః అని ఉచ్చరించుచూ, భక్తిశ్రద్ధలతో ఆ జగన్మాతను ఉపాసించు సాధకుడు నిశ్చయంగా అరిషడ్వర్గములకు అతీతంగా విరాజిల్లుచూ పరమేశ్వరీ పాదసేవలో తరించును.
అరిషడ్వర్గము లనగా కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు. అరిషడ్వర్గములు కేవలం మనసుకు సంబంధించినవి. ఆత్మకు కాదు. పరమేశ్వరి పరమాత్మ. ఆ తల్లికి ఇవేమియు (మదము వంటివి) ఉండవు. కాబట్టి ఆ తల్లి నిర్మదా యని నామ ప్రసిద్ధమైనది.
మనసున్న ప్రతీ జీవికి పలుకోరికలు ఉండడం సహజం. కోరిక అనగా కామము. కోరిక వెనుక క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము ఒకదాని వెంట ఒకటి ఆయా సందర్భములలో వచ్చేస్తాయి. అరిషడ్వర్గములలో మదము ఒకటి. మదము అనగా పలు అర్థములు గలవు. పొగరు, ఒళ్ళుకొవ్వెక్కడం, పరవశం అనగా తనను తను మరచిపోవడం. ఇక మదం ఉంటే దర్పం ఏర్పడుతుంది.
మదం అనేది శారీరక మదం (కండబలం) తనే బలవంతుడను, తనను మించిన వాడు లేడనే గర్వం అను లక్షణం , ధనమదం - నేనే ధనవంతుడను, ఏదైనా ధనంతో కొనవచ్చు, ధనహీనులనిన అసహ్యించుకోవడం, అవమానించడం ఇలా ఏధైనా కావచ్చు, అధికారమదం - తనకధికారం వస్తే, తనవద్దనున్నవారిని తూలనాడడం, పగసాధించడం కోసం వారిని హింసించడం, అధికార దుర్వినియోగంతో అక్రమంగా సంపాదించడం వంటి లక్షణములు కావచ్చు, విద్యామదం - తనకేదైనా విద్యలో పరిపూర్ణత సాధించుకున్నప్పుడు ఆ వ్యక్తిలో మార్పుకొందరికి వచ్చేస్తుంది. గర్వం ఏర్ఫడుతుంది. విద్యా వినయేన శోభతే అనునది మరచిపోయి తక్కువ విద్య ఉన్నవారిని అల్పులని మాటతూలడం లేదా వారు ఏదైనా విషయం చెపితే తిరస్కార భావంగా చూడడం, సూటిపోటి మాటలతో విమర్శించడం, సద్విమర్శలు చేయక హేళన చేయడం ఇలాంటి లక్షణములు, భాగ్యమదం - పుట్టుకతోనే భాగ్యవంతుడై ఉండడం, తన్మూలంగా భాగ్యహీనులను అవమానించడం వంటి లక్షణములు. ఇవన్నియు మదమునకు ఉన్న లక్షణములు. ఒళ్ళుతెలియక మాటలు తూలడం, ఎదుటి వారిని అవమానించడం, హింసించడం, ఎదుటి వారు బాధపడుతుంటే వికటాట్టహాసం చేయడం జరుగుతుంది. మదము అనేది జాగ్రస్వప్న అవస్థలయందే ఉంటుంది. సుషుప్తిలో ఉండదు. డంభము, దర్పము, దురభిమానము వంటి రాక్షస లక్షణములు మదము అని అంటారు. ఒళ్ళుతెలియక పరిమితులు దాటి మాట్లాడుతారు. ఇవన్నీ కేవలం మనసుకు సంబంధించినవి. ఆత్మకు సంబంధించినవి కావు. పరమేశ్వరి పరమాత్మస్వరూపిణి. గనుక ఆ తల్లికి అరిషడ్వర్గములలోని మదము ఉండదు. అందుకే ఆ తల్లి నిర్మదా యను నామముతో స్తుతింపబడుచున్నది.
జగన్మాతకు నమస్కరించునపుడు ఓం నిర్మదాయై నమః అని అనవలెను.
దశమస్కంధము - పూర్వార్ధము - ఎనిమిదవ అధ్యాయము
నామకరణ సంస్కారము - బాల్యలీలలు
ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
నంద ఉవాచ
8.10 (పదియవ శ్లోకము)
అలక్షితోఽస్మిన్ రహసి మామకైరపి గోవ్రజే|
కురు ద్విజాతిసంస్కారం స్వస్తివాచనపూర్వకమ్॥8553॥
నందుడు ప్రార్థించెను "ఆచార్యా! అట్లైనచో మా బంధుమిత్రాదులకు కూడ తెలియకుండా ఈ గోకులమునందు (ఈ గోశాలయందు) గోప్యముగా (ఎట్టి మేళతాళముల ఆర్భాటము లేకుండా) స్వస్తివాచన పూర్వకముగా (వేదమంత్రములతో) మా కుమారులకు ద్విజాతి సంస్కారములను (నామకరణాదులను) నిర్వహింపుము".
శ్రీశుక ఉవాచ
8.11 (పదకొండవ శ్లోకము)
ఏవం సంప్రార్థితో విప్రః స్వచికీర్షితమేవ తత్|
చకార నామకరణం గూఢో రహసి బాలయోః॥8554॥
శ్రీశుకుడు వచించెను - నందుడు ఆ విధముగా (గర్గమహామునివలననే తన బాలకులకు నామకరణాది సంస్కారములు జరుగవలయునను) తన కోరికను విన్నవించెను. అంతట ఆ మహర్షి ఎవ్వరికిని తెలియకుండా గోప్యముగా ఆ బాలకులకు నామకరణాది సంస్కారములను నెఱపెను.
గర్గ ఉవాచ
8.12 (పండ్రెండవ శ్లోకము)
అయం హి రోహిణీపుత్రో రమయన్ సుహృదో గుణైః|
ఆఖ్యాస్యతే రామ ఇతి బలాధిక్యాద్బలం విదుః|
యదూనామపృథగ్భావాత్సంకర్షణముశంత్యుత॥8555॥
గర్గమహర్షి నుడివెను "నందా! ఇతడు రోహిణీ పుత్రుడగుటవలన రౌహిణేయుడు అనియు, తన సుగుణ సంపదచే బంధుమిత్రులను ఆనందింపజేయువాడు కావున రాముడు అనియు పిలువబడును. ఇతడు అమిత (మిగుల) బలశాలికాగలడు. అందువలన బలుడు అనియు ప్రసిద్ధి వహించును. అంతేగాక, మీకును, యదువంశజులకును ఎట్టి భేదములకు తావులేకుండా సామరస్యమును కూర్చువాడు కావున సంకర్షుణుడు అనియు వ్యవహరింపబడును. శ్రీమహావిష్ణువుయొక్క ఆజ్ఞమేరకు యోగమాయ దేవకీదేవి గర్భస్థుడైయున్న ఏడవశిశువు రోహిణి కడుపున చేర్చుటచే ఈయనకు సంకర్షణుడు అను పేరు ప్రసిద్ధికెక్కెను.
8.13 (పండ్రెండవ శ్లోకము)
ఆసన్ వర్ణాస్త్రయో హ్యస్య గృహ్ణతోఽనుయుగం తనూః|
శుక్లో రక్తస్తథా పీత ఇదానీం కృష్ణతాం గతః॥8556॥
ఈ రెండవబాలుడు ప్రతియుగమునందును శుక్ల (తెలుపు) రక్త (ఎఱుపు) పీత (పసుపుపచ్చ) వర్ణములుగల (వన్నెలుగల) దేహములతో అలరారుచు లోకకళ్యాణార్థము అవతరించుచు వచ్చెను. ఈ యుగమునందు (ఇప్పుడు) కృష్ణవర్ణముతో (శ్యామవర్ణముతో) ఒప్పుచున్నందున ఇతడు కృష్ణుడు అని వ్యవహరింపబడును.
8.14 (పదునాలుగవ శ్లోకము)
ప్రాగయం వసుదేవస్య క్వచిజ్జాతస్తవాత్మజః|
వాసుదేవ ఇతి శ్రీమానభిజ్ఞాః సంప్రచక్షతే॥8557॥
పూర్వము ఒకప్పుడు ఈ నీ కుమారుడు వసుదేవుని ఇంట జన్మించెను. అందువలన అభిజ్ఞులు (ఈ రహస్యమును ఎఱిగినవారు). సకల శుభలక్షణ సంపన్నుడైన ఇతనిని వాసుదేవుడు అనియు పిలిచెదరు.
8.15 (పదునైదవ శ్లోకము)
బహూని సంతి నామాని రూపాణి చ సుతస్య తే|
గుణకర్మానురూపాణి తాన్యహం వేద నో జనాః॥ 8558॥
ఈ నీ కుమారునకు పెక్కురూపములు, పలునామములు గలవు. అవి అతని గుణకర్మలను అనుసరించి ఏర్పడినవి. వాటిని అన్నింటిని నేను ఎఱుగుదును. సామాన్యజనులు ఎఱుగరు.
8.16 (పదహారవ శ్లోకము)
ఏష వః శ్రేయ ఆధాస్యద్గోపగోకులనందనః|
అనేన సర్వదుర్గాణి యూయమంజస్తరిష్యథ॥8559॥
నందగోపా! ఈ బాలుడు (కృష్ణుడు) మీకు సకలశ్రేయస్సులను (ఐహిక-ఆముష్మిక సుఖసంపదలను) చేకూర్చగలడు. మీ పాలిట ఇతడు సకల శ్రేయోనిధి. మఱియు, ఇతడు గోపాలురకును, గోవులకును పరమానందదాయకుడు. ఎట్టి ఇక్కట్లు వచ్చినను ఈయన సహాయమున మీరు అవలీలగా బయటపడగలరు.
8.17 (పదునేడవ శ్లోకము)
పురానేన వ్రజపతే సాధవో దస్యుపీడితాః|
అరాజకే రక్ష్యమాణా జిగ్యుర్దస్యూన్ సమేధితాః॥8560॥
నందభూపతీ! పూర్వయుగమున అరాజక పరిస్థితులు ఏర్పడినప్పుడు తమను రక్షించువారు లేక సాధుపురుషులు దుర్మార్గులవలన పెక్కుబాధలకు లోనైరి. అప్పుడు ఈయన సహాయమువలన వారు ఉత్తేజితులై ఆ దుర్జనులపై విజయమును సాధించిరి.
8.18 (పదునెనిమిదవ శ్లోకము)
య ఏతస్మిన్ మహాభాగాః ప్రీతిం కుర్వంతి మానవాః|
నారయోఽభిభవంత్యేతాన్ విష్ణుపక్షానివాసురాః॥8561॥
విష్ణురక్షణలో నున్న దేవతలను రాక్షసులు ఏమియు చేయజాలనట్లు, భక్తిశ్రద్ధలతో ఈ మహాత్ముని సేవించిన భాగ్యశాలురను కామక్రోధాది అంతఃశ్శత్రువులుగాని, దుష్టులైన కంసుడు మొదలగు బాహ్యశత్రువులుగాని ఏమియును చేయజాలరు.
8.19 (పందొమ్మిదవ శ్లోకము)
తస్మాన్నందాత్మజోఽయం తే నారాయణసమో గుణైః|
శ్రియా కీర్త్యానుభావేన గోపాయస్వ సమాహితః॥8562॥
నందగోపా! ఈ నీ కుమారుడు తన కీర్తిప్రతిష్ఠలచేతను, సంపదలచేతను, ప్రాభవముల చేతను, తదితరములైన ఉదాత్తగుణములచేతను శ్రీమన్నారాయణునితో సమానుడు కాగలడు. అందువలన ఈతనిని కంటికి ఱెప్పవలె భద్రముగా చూచుకొనుచుండుము.
8.20 (ఇరువదియవ శ్లోకము)
ఇత్యాత్మానం సమాదిశ్య గర్గే చ స్వగృహం గతే|
నందః ప్రముదితో మేనే ఆత్మానం పూర్ణమాశ…
[02:49, 24/11/2020] +91 95058 13235: శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
733వ నామ మంత్రము
ఓం నందివిద్యాయై నమః
నటరాజ స్వామిచే నందీశ్వరాదులకు ఉపదేశింపబడిన ఆనందవిద్యా స్వరూపిణి అయిన జగన్మాతకు నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి నందివిద్యా యను నాలుగక్షరముల(చతురక్షరీ) నామ మంత్రమును ఓం నందివిద్యాయై నమః అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని అత్యంత భక్తిప్రపత్తులతో ఆరాధిస్తే సాధకునికి ఆ పరమేశ్వరి అంతులేని ఆనందమయమైన జీవితమును ప్రసాదించి భౌతికపరమైన సుఖసంతోషములతో బాటు ఆధ్యాత్మిక పరమైన బ్రహ్మానందమునుకూడ అనుగ్రహించి తరింపజేయును.
శ్రీవిద్యవంటిదే నందివిద్యకూడా. నటరాజస్వామిచే నందీశ్వరాదులకు నందివిద్య ఉపదేశింపబడినది. నందీశ్వరుడు ఉపాసించాడు గనుక నందివిద్య అని అన్నారు. శ్రీవిద్యకూడా పరమేశ్వరునిచే ఉపదేశింపబడినదే. గనుక జగన్మాత శ్రీవిద్యాస్వరూపిణి అనబడినట్లే నందివిద్యా స్వరూపిణి అనికూడా అనబడినది. ఇక పరమ…
[02:49, 24/11/2020] +91 95058 13235: శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
159వ నామ మంత్రము
ఓం మదనాశిన్యై నమః
డంబము, దర్పము, మదము వంటి అసురలక్షణములను నాశనము చేసి సాధకుని సన్మార్గమందు ముందుకు నడిపించుచూ అమృతత్త్వస్థితికి చేర్చు పరమేశ్వరికి నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి మదనాశినీ యను ఐదక్షరముల (పంచాక్షరీ) నామ మంత్రమును ఓం మదనాశిన్యై నమః అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని ఉపాసించు సాధకునిలో ఏమైనా డంబము, దర్పము, మదము వంటి అసురలక్షణములేవైనా ఉంటే, అటువంటివి అన్నియు మటుమాయమై, సన్మార్గమునందు నడచుచూ, అమృతత్త్వస్థితికి చేరి తరించుననుటలో సందేహము లేదు.
ఇంతకు ముందు 158వ నామ మంత్రములో జగన్మాత పరమాత్మయనియు, అట్టి పరమాత్మ అరిషడ్వర్గములకు అతీతురాలని తెలిసియున్నాము. ఈ నామ మంత్రములో (మదనాశనీ) ఆ తల్లి తన భక్తులను కూడా డంబము, దర్పము, మదము వంటి అసురీలక్షణములకు అతీతులను చేయును. కాబట్టి ఆ తల్లిని మదనాశినీ అని అన్నాము.
మదము అంటే పొగరు. తనకు మించిన వారు లేరనేది తలబిరుసు. ఆ తలబిరుసులో మంచి వారినికూడా దుర్భాషలాడును. రావణాబ్రహ్మ బ్రహ్మజ్ఞాన సంపన్నుడు. కైలాసాన్ని తనభుజస్కంధములతో పైకెత్తేసిన భుజబలశాలి. తన ప్రేగులతో వీణానాదము సృష్టించి శివస్తుతి చేసి తరించాడు. కాని బలమదముతో, విద్యామదముతో (బ్రహ్మజ్ఞాని కదా) అధికారమదముతో (లంకాధిపతి అయిన కారణముతో) నాశనమయాడు. జగన్మాత తన చేతి పదివ్రేళ్ళ గోళ్ళ సందులనుండి నారాయణుని దశావతారములు సృజించి (కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతిః) అతని మదమును నాశనము చేసినది. అంతేనా? కంసుడు, శిశుపాలుడు, దుర్యోధనాది కౌరవులు, హిరణ్యకశిపుడు, బలిచక్రవర్తి, కార్తవీర్యార్జునుడు మొదలైన మదమే తమస్వరూపమైన ఎందరో అసురలక్షణములున్నవారిని వారిమదమును నాశనము చేసినది. కాని జగన్మాత తన నామమును అంతర్ముఖసమారాధనతో స్మరించిన భక్తులలో మదము మరియు ఇతర అరిషడ్వర్గములను నాశనము చేసి సన్మార్గములో నడిపించి అమృతత్త్వస్థితికి చేర్చుతుంది.
మదము నశించినప్ఫుడు సమదృష్టి ఏర్పడుతుంది. అసురలక్షణములు అంతరించి దైవస్వరూపులౌతారు. వినయ విధేయతలు, విశ్వజనీనత వికసిస్తుంది.
జగన్మాతకు నమస్కరించునపుడు ఓం మదనాశిన్యై నమః అని అనవలెను.
దశమస్కంధము - పూర్వార్ధము - ఎనిమిదవ అధ్యాయము
నామకరణ సంస్కారము - బాల్యలీలలు
ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
8.21 (ఇరువది ఒకటవ శ్లోకము)
కాలేన వ్రజతాల్పేన గోకులే రామకేశవౌ|
జానుభ్యాం సహ పాణిభ్యాం రింగమాణౌ విజహ్రతుః॥8564॥
కొన్ని దినములకు పిమ్మట బలరామకృష్ణులు మోకాళ్ళతో, చేతులతో అటునిటు ప్రాకుచు గోకులమునందు అంతటను క్రీడింప (విహరింప) సాగిరి.
8.22 (ఇరువది రెండవ శ్లోకము)
తావంఘ్రియుగ్మమనుకృష్య సరీసృపంతౌ ఘోషప్రఘోషరుచిరం వ్రజకర్దమేషు|
తన్నాదహృష్టమనసావనుసృత్య లోకం ముగ్ధప్రభీతవదుపేయతురంతి మాత్రోః॥8565॥
ఆ ఇరువురును తమ చిట్టి చిట్టి పాదములతో, చేతులతో దోగాడుచు, గోకులము నందలి తేమనేలలపై తిరుగాడుచుండిరి. అప్ఫుడు వారి కాళ్ళయందును, నడుముల యందును గల చిఱుగజ్జెల సవ్వడులు వినసొంపుగా నుండెను. ఆ ధ్వనులను వినుచు వారు ఎంతయు మురిసిపోవుచుండిరి. అప్ఫుడప్ఫుడు క్రొత్తవారివెంట వెళ్ళుచు, వారు అపరిచితులని తెలియగనే భయముతో వెంటనే అమాయకులవలె వెనుకకు మఱలుచు చకచక తమ తల్లులగు రోహిణీ యశోదల కడకు చేరుచుండిరి.
8.23 (ఇరువది మూడవ శ్లోకము)
తన్మాతరౌ నిజసుతౌ ఘృణయా స్నువంత్యౌపంకాంగరాగరుచిరావుపగుహ్య దోర్భ్యామ్|
దత్త్వా స్తనం ప్రపిబతోః స్మ ముఖం నిరీక్ష్య ముగ్ధస్మితాల్పదశనం యయతుః ప్రమోదమ్॥8566॥
అంతట యశోదారోహిణులు తమ కడకు వచ్చిన సుతులను మమకారముతో చూచుచున్నంతనే వారి స్తనములనుండి క్షీరము పొంగారుచుండెను. నేలపై తిరుగాడుటచే ధూళిధూసరితములై యున్న వారి శరీరముల సొబగులు ఆ తల్లుల ఆనందములను ఇనుమడింపజేయుచుండెను. వెంటనే వారు తమ చిన్నారులను ఆత్మీయతతో తమ చేతులలోనికి దీసికొని అక్కున జేర్చుకొనుచుండిరి. స్తన్యమును గ్రోలుచున్న ఆ బుడుతల ముఖములను జూచుచు వారు మురిసిపోవుచుండిరి. అప్పుడు ఆ శిశువులు అమాయకముగా తల్లులవైపు చూచుచు నవ్వుచుండగా వచ్చియు రాని చిఱుదంతములుగల ఆ కన్నయ్యల ముఖములను జూచుచు ఆ రోహిణీ యశోదలు పొందుచుండెడి సంతోషము అపారము.
8.24 (ఇరువది నాలుగ శ్లోకము)
యర్హ్యంగనా దర్శనీయకుమారలీలావంతర్వ్రజేతదబలాః ప్రగృహీతపుచ్ఛైః|
వత్సైరితస్తత ఉభావనుకృష్యమాణౌ ప్రేక్షంత్య ఉజ్ఝితగృహా జహృషుర్హసంత్యః॥8567॥
బలరామకృష్ణులు కొద్దిగా పెద్దవారైరి. చూడముచ్చట గొలిపెడి ఆ ఇరువురి బాల్యలీలలను గాంచుచు గోకులమునందలి గోపకాంతలు మిగుల ఆనందించుచుండిరి. ఆ చిట్టిబాలురు చిలిపితనముతో ఆవులేగల తోకలను గట్టిగా పట్టుకొనుచుండగా, ఆ దూడలు భయముతో వారినిగూడ లాగికొనుచు ఇటునటు పరుగెత్తసాగెను.ఆ అద్భుత దృశ్యమునకు అబ్బురపడిన గోపవనితలు తమ తమ ఇంటి పనులను గూడ మానుకొని, బయటికి వచ్చి, వారి అల్లరిచేష్టలను జూచుచు మిక్కిలి సంతోషపడుచుండిరి.
8.25 (ఇరువది ఐదవ శ్లోకము)
శృంగ్యగ్నిదంష్ట్ర్యసిజలద్విజకంటకేభ్యః క్రీడాపరావతిచలౌ స్వసుతౌ నిషేద్ధుమ్|
గృహ్యాణి కర్తుమపి యత్ర న తజ్జనన్యౌ శేకాత ఆపతురలం మనసోఽనవస్థామ్॥8568॥
బలరామకృష్ణుల నిలుకడ లేకుండా తమ ఆటలలో భాగముగా చేసెడి అల్లరిపనులకు అంతులేకుండెను. అప్పుడప్పుడు వారు కొమ్ములుగల హరిణములను, ఆవులను ఆటపట్టించుచుండిరి. నిప్పులతో చెలగాట మాడుచుండెడివారు, కోఱలుగల కుక్కపిల్లలతో వింతగా ఆడుకొనుచుండిరి. మిగుల పదునుగల కత్తులను దీసికొని మెఱపు వేగముతో త్రిప్పుచుండిరి. జలములలో నిర్భయముగా ఈదులాడుచుండిరి. నెమళ్ళు మొదలగు పక్షులతో గూడి గంతులు వేయుచుండిరి. ముండ్లబాటలలో సైతము పరుగెత్తుచుండిరి. హానికరములైన ఆ ఆటలనుండి వారిని మఱల్పలేక తల్లులు మిగుల భీతిల్లుచు, ఆ భయములో వారు తమ గృహకృత్యములను గూడ చేసికొనలేకుండిరి. అప్పటి ఆ తల్లుల మనస్సులకు ఏమాత్రమును స్వస్థత లేకుండెను.
8.26 (ఇరువది ఆరవ శ్లోకము)
కాలేనాల్పేన రాజర్షే రామః కృష్ణశ్చ గోకులే|
అఘృష్టజానుభిః పద్భిర్విచక్రమతురంజసా॥8569॥
రాజశ్రేష్ఠా! స్వల్పకాలములోనే బలరామకృష్ణులు మోకాళ్ళపై దోగాడుట మాని, అనాయాసముగా అడుగులు వేయుచు గోకులమునందు అంతటను హాయిగా తిరుగాడుచుండిరి.
8.27 (ఇరువది ఏడవ శ్లోకము)
తతస్తు భగవాన్ కృష్ణో వయస్యైర్వ్రజబాలకైః|
సహ రామో వ్రజస్త్రీణాం చిక్రీడే జనయన్ ముదమ్॥8570॥
శ్రీకృష్ణభగవానుడు క్రమముగా తన యీడు గోపబాలురతోడను, అన్నయగు బలరామునితోడను కూడి, కేరింతలతో క్రీడించుచు అచటి గోపాంగనలను ఆనందింపజేయుచుండిరి.
8.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)
కృష్ణస్య గోప్యో రుచిరం వీక్ష్య కౌమారచాపలమ్|
శృణ్వంత్యాః కిల తన్మాతురితి హోచుః సమాగతాః॥8571॥
శ్రీకృష్ణుడు బాల్యచాపల్యమున చేసెడి చిలిపి చేష్టలకు అంతులేకుండెను. చూచుటకు అవి ముద్దు మురిపెములను గూర్చుచున్నను, ఆ అల్లరిపనులకు గోపికలు తట్టుకొనలేకుండిరి. అంతటవారు యశోదమ్మ కడకు వచ్చి, ఆమెతో ఇట్లు మొరపెట్టుకొనిరి.
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి ఎనిమిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం
7702090319, 9505813235
[22:27, 24/11/2020] +91 95058 13235: 24.11.2020 సాయంకాల సందేశము
వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం
దశమస్కంధము - పూర్వార్ధము - ఎనిమిదవ అధ్యాయము
నామకరణ సంస్కారము - బాల్యలీలలు
ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
8.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)
వత్సాన్ ముంచన్ క్వచిదసమయే క్రోశసంజాతహాసః|
స్తేయం స్వాద్వత్త్యథ దధి పయః కల్పితైః స్తేయయోగైః|
మర్కాన్ భోక్ష్యన్ విభజతి స చేన్నాత్తి భాండం భిన్నత్తి|
ద్రవ్యాలాభే స గృహకుపితో యాత్యుపక్రోశ్య తోకాన్॥8572॥
"యశోదమ్మా! నీ కొడుకు దుడుకు చేష్టలకు అంతే లేకున్నది. అతడు వేళగాని వేళలలో, పాలు పితికెడి సమయము గాకున్నను, లేగలను ఆవుల కడకు విడుచుచున్నాడు. అందులకు మేము కోపముతో మందలించుచున్నను నిర్లక్ష్య భావముతో మమ్ము జూచుచు పరిహాసముతో నవ్వుచున్నాడు😁😀😃 అతడు వివిధములగు చౌర్యోపాయములతో మా ఇండ్లలో ప్రవేశించి, కమ్మని పాలను, పెఱుగులను దొంగిలించి, స్వయముగా తాను తినుటయేగాక తోడివారికిని, కోతులకును పంచిపెట్టుచున్నాడు. రామావతారమునందు వానరులు తనకు చేసిన సాయమును గుర్తుపెట్టుకొని ఇప్పుడు కృష్ణావతారమునందు ఆ వానరులకు పాలు, పెఱుగు, వెన్నలను పంచిపెట్టుచున్నాడు. మఱియు మిత్రులను, వానరములను తృప్తి చెంది, తినుట మానినచో, అప్పుడు ఆ కుండలను పగులగొట్టుచున్నాడు. మా ఇండ్లలో తినుటకు ఏమియు దొరకనప్పుడు అతడు ఇంటివారిపై కుపితుడగుచు, ఆ ఉక్రోషముతో శయ్యలపై నిద్రించుచున్న పసిబాలురను ఏడిపించి, పాఱిపోవుచున్నాడు".
8.30 (ముప్పదియవ శ్లోకము)
హస్తాగ్రాహ్యే రచయతి విధిం పీఠకోలూఖలాద్యైః|
ఛిద్రం హ్యంతర్నిహితవయునః శిక్యభాండేషు తద్విత్|
ధ్వాంతాగారే ధృతమణిగణం స్వాంగమర్థప్రదీపమ్|
కాలే గోప్యో యర్హి గృహకృత్యేషు సువ్యగ్రచిత్తాః॥8573॥
బాలకృష్ణుని అల్లరిచేష్టలకు తట్టుకోలేని గోపికలు యశోదమ్మతో ఇంకను ఇట్లు మొరపెట్టుకొనుచున్నారు-
అమ్మా! నీ కొడుకునకు అందకుండా, మేము మా పాలు, పెఱుగులను ఉట్లలో భద్రపరచుకొనుచున్నాము. ఐనప్ఫటికిని, అతడు పీటలను ఒకదానిపైనొకటి చేర్చిగాని, ఱోళ్ళపై నిలబడిగాని, లేదా తోడిబాలుర భుజములపై ఎక్కిగాని వాటిని అందుకొనుటకు ప్రయత్నించు చున్నాడు. అప్పటికి అవి తన చేతులకు అందనప్ఫుడు ఏ కుండలో ఏమి ఉన్నదో తెలియునుగాన, రాళ్ళతో కొట్టి వాటికి చిల్లులు పెట్టుచున్నాడు. ఒక్కొక్కప్పుడు అతనికి కనబడకుండుటకై మా పాలు, పెఱుగు, వెన్నలను చీకటి గదులలో దాచుకొనుచున్నాము. ఐనను, అతడు తాను ధరించియున్న మణుల కాంతులతోను, తన దివ్యదేహకాంతులతోడను మా పదార్థములను గుర్తించుచున్నాడు. గోపికలు అందఱును (మేము అందరము) ఇంటి పనులలో నిమగ్నమై యుండుట గమనించి, అతడు తన ఆగడములను కొనసాగించుచుండెను.
8.31 (ముప్పది ఒకటవ శ్లోకము)
ఏవం ధార్ష్ట్యాన్యుశతి కురుతే మేహనాదీని వాస్తౌ|
స్తేయోపాయైర్విరచితకృతిః సుప్రతీకో యథాఽఽస్తే|
ఇత్థం స్త్రీభిః సభయనయనశ్రీముఖాలోకినీభిః|
వ్యాఖ్యాతార్థా ప్రహసితముఖీ న హ్యుపాలబ్ధుమైచ్ఛత్॥8574॥
బాలకృష్ణుని అల్లరిచేష్టలకు తట్టుకోలేని గోపికలు యశోదమ్మతో ఇంకను ఇట్లు మొరపెట్టుకొనుచున్నారు-
తల్లీ! నీ పుత్రరత్నము ఇన్ని అల్లరిపనులను చేయుచున్నను, తానే యజమానియైనట్లును, మేమే దొంగలమైనట్లును ప్రగల్భములను పలుకుచున్నాడు. మేము శుభ్రముగా, అలికి అలంకరించు కొనిన మా ఇండ్లలో మూత్రాదులను విసర్జించి, వాటిని అపవిత్రము చేయుచున్నాడు. ఇన్ని చౌర్యోపాయములకు పాల్పడియు, ఏమియు ఎఱుగనివానివలె ఇతడు బుంగమూతి పెట్టుకొని నీ ప్రక్కన ఒక శిలామూర్తి (విగ్రహము) గా నిలబడి యున్నాడు" ఈ విధముగా ఆ స్త్రీలు (గోపవనితలు) బిత్తరచూపులతో ఒప్పాఱుచున్న శ్రీకృష్ణుని ముఖమును జూచుచు ఆమెతో (యశోదమ్మతో) పలికిరి. అంతట యశోదాదేవి దరహాసము చేయుచు మిన్నకుండెనేగాని, తన కుమారుని మందలించుటకు ఏ మాత్రమూ పూనుకొనకుండెను.
8.32 (ముప్పది రెండవ శ్లోకము)
ఏకదా క్రీడమానాస్తే రామాద్యా గోపదారకాః|
కృష్ణో మృదం భక్షితవానితి మాత్రే న్యవేదయన్॥8575॥
8.33 (ముప్పది మూడవ శ్లోకము)
సా గృహీత్వా కరే కృష్ణముపాలభ్య హితైషిణీ|
యశోదా భయసంభ్రాంతప్రేక్షణాక్షమభాషత॥8576॥
ఒకనాడు బలరాముడు మొదలగు గోపబాలురు కృష్ణునితో ఆడుకొనుచుండిరి. మధ్యలో వారు యశోదామాత కడకు వచ్చి ' అమ్మా! మన కృష్ణుడు మన్నుతిన్నాడు' అని చెప్పిరి. అప్పుడు శ్రీకృష్ణుని నేత్రములు భయసంభ్రమములతో చలించుచుండెను. అంతట యశోదమ్మ ఆ కన్నయ్యచేతిని పట్టుకొని, అతని హితమును గోరుచు, ఇట్లు పలికెను.
8.34 (ముప్పది నాలుగవ శ్లోకము)
కస్మాన్మృదమదాంతాత్మన్ భవాన్ భక్షితవాన్ రహః|
వదంతి తావకా హ్యేతే కుమారాస్తేఽగ్రజోఽప్యయమ్॥8577॥
'కుమారా! నీవు మిక్కిలి అల్లరివాడవైనావు. నీవు ఎందువలన ఒంటరిగా దాగికొని, ఎందులకై మట్టి తింటివి? నీ అన్నయగు బలరాముడును, నీ తోడివారైన గోపబాలురును నీవు మన్నుతిన్నావని పలుకుచ…
[03:09, 25/11/2020] +91 95058 13235: శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
734వ నామ మంత్రము
ఓం నటేశ్వర్యై నమః
చిదంబర నటేశ్వరుని అనుకరించుచూ నృత్యము చేయు చతుష్షష్టి కళా స్వరూపిణియైన పరమేశ్వరికి నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి నటేశ్వరీ యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును ఓం నటేశ్వర్యై నమః అని ఉచ్చరించుచూ, ఆ అఖిలాండేశ్వరిని భక్తిప్రపత్తులతో ఆరాధించు భక్తులకు ఆ తల్లి సర్వాభీష్టసిద్ధిని ప్రసాదించును.
నటేశ్వరీ అనగా నటించుటకు ఈశ్వరీ. ఈ విశాల జగత్తే ఒక రంగస్థలం. ఈ రంగస్థలానికి నిర్మాత ఆ జగజ్జనని. అందుకే ఆ తల్లి నటేశ్వరీ యని అనబడుచున్నది. ఈ రంగస్థలంపై జీవులన్నియు పాత్రధారులే. పాత్రల ప్రవేశం, నిష్క్రమణ అనేవి నిర్దేశించేది ఆ జగన్మాతయే. రంగస్థలంపై నటించడానికి కావలసిన శాస్త్రీయత సాక్షాత్తు చిదంబర నటరాజస్వామినుండియే అనుకరణకు కావలసిన సాంకేతికత గ్రహించినది జగన్మాత.
ఈ జగన్నాటకంలో జీవులు తమ పాత్రలలో శాస్త్రబద్ధంగా (ధర్మబద్ధంగా) జీవించాలి. ఆ ధర్మ బద్ధత ఏమిటంటే ధర్మార్ధకామములు, అరిషడ్వర్గ నియంత్రణ వంటి సాంకేతిక ధర్మములకు తగిన విధంగా జీవులు తమ పాత్రలలో జీవించాలి. జీవుల పాత్రపోషణకు జగన్మాత దర్శకురాలు. అందుకే ఆ తల్లి నటేశ్వరీ యని అనబడినది.
పరమేశ్వరుడు నటేశ్వరుడు. నాట్యభంగిమలో ఉన్నవాడు. ప్రదోషకాలంలో ఆయన నృత్య ప్రదర్శన ఇస్తూ ఉంటాడు. జగన్మాత ఆయనను అనుకరించింది. అందుకనే పరమేశ్వరుడు నటేశ్వరుడైతే, పరమేశ్వరి నటేశ్వరీ యని అనబడినది. జగన్మాత చతుష్షష్ఠి కళామయి అందుచేత నటేశ్వరుని అనుకరించడం ఆ తల్లికి సులభతరమైనది. చిదంబరేశ్వరుని అనుకరించి ఆయన వలెనే నాట్యముచేసినది జగన్మాత. ఆ తల్లి శంకరునివలెనే నటనము చేయడానికి ఒక కాలిని మోకాలివరకూ పైకెత్తినపుడు, ఆ వ్రేలాడు పాదము పద్మముగాను, పిక్కవరకూ ఉన్న కాలుని నాళముగాను, కాలి వ్రేళ్ళ గోళ్ళు కింజల్కములుగాను, పాదముల పారాణికాంతులు పద్మముయొక్క రేకులుగాను, కాలియందె తుమ్మెదగాను వర్ణనము చేయబడినది. అందుచే పార్వతి శంకరుని నటనమును అనుకరించినది గాన శంకరుడు నటేశ్వరుడైతే, జగన్మాత నటేశ్వరి యని అనబడినది.
జగన్మాతకు నమస్కరించునపుడు ఓం నటేశ్వర్యై నమః అని అనవలెను.
[03:09, 25/11/2020] +91 95058 13235: శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
160వ నామ మంత్రము
ఓం నిశ్చింతాయై నమః
కలత, బాధ, నిరాశ, నిస్పృహ వంటి విచారకరమైన విషయములే చింతలు. ఇవి అన్నియూ మనసుకు సంబంధించినవేగాని ఆత్మకు సంబంధించినవి కావు. అట్టి చింతలు లేని తల్లియైన పరమాత్మస్వరూపిణి జగన్మాతకు నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి నిశ్చింతా యను మూడక్షరముల (త్ర్యక్షరీ) నామ మంత్రమును ఓం నిశ్చింతాయై నమః అని ఉచ్చరించుచూ, అత్యంత భక్తిశ్రద్ధలతో ఆ జగదీశ్వరిని ఉపాసించు సాధకుడు ఏవిధమైన చింతలు లేక భౌతిక సుఖసంతోషములతోబాటు, ఆత్మానందానుభూతితో జీవించును.
చింత అనేది మనసుకు సంబంధించినది. తానొకటి తలంచితే, జరిగేది వేరొకటై, ఆ జరిగినది తనతలంపుకు వ్యతిరేకమైనది అయితే నిరాశ ఏర్పడుతుంది. మానసికంగా సంఘర్షణ ప్రారంభమవుతుంది. మనసు పరిపరి విధములైన ఆలోచనలతో నిండిపోతుంది. పరధ్యానం ఏర్పడుతుంది. దీనినే చింత అంటారు. నమ్మిన …
[03:09, 25/11/2020] +91 95058 13235: 25.11.2020 ప్రాతః కాల సందేశము
వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం
దశమస్కంధము - పూర్వార్ధము - ఎనిమిదవ అధ్యాయము
నామకరణ సంస్కారము - బాల్యలీలలు
ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
8.39 (ముప్పది తొమ్మిదవ శ్లోకము)
ఏతద్విచిత్రం సహ జీవకాలస్వభావకర్మాశయలింగభేదమ్|
సూనోస్తనౌ వీక్ష్య విదారితాస్యే వ్రజం సహాత్మానమవాప శంకామ్॥8582॥
పరీక్షిన్మహారాజా! తెఱచియున్న ఆ చిన్నికృష్ణుని నోటియందు యశోదాదేవి సకల జీవరాసులను, సకల ప్రాణుల ఉత్పత్తికిని, వాటి ఉనికికిని, లయమునకును కారణమైన కాలమును, పరిణామమునకు మూలమైన స్వభావమును, జన్మహేతువులైన కర్మలను, వాటి వాసనలను, వివిధములగు శరీరములను కలిగి విచిత్రముగా నున్న సమస్త ప్రపంచమును గాంచెను. అంతేగాదు, ఆ చిన్నారి ముఖమునందు గోకులమును, తనను (యశోదను), కృష్ణునిగూడ చూచెను. ఆ కృష్ణుని చిట్టినోట ఈ అద్భుతదృశ్యములు కనబడుటతో ఆ తల్లికి సందేహము కలుగగా అప్పుడు ఆమె తనలో ఇట్లనుకొనెను-
8.40 (నలుబదియవ శ్లోకము)
కిం స్వప్న ఏతదుత దేవమాయా కిం వా మదీయో బత బుద్ధిమోహః|
అథో అముష్యైవ మమార్భకస్య యః కశ్చనౌత్పత్తిక ఆత్మయోగః॥8583॥
8.41 (నలుబది ఒకటవ శ్లోకము)
అథో యథావన్న వితర్కగోచరం చేతో మనఃకర్మవచోభిరంజసా|
యదాశ్రయం యేన యతః ప్రతీయతే సుదుర్విభావ్యం ప్రణతాస్మి తత్పదమ్॥8584॥
8.42 (నలుబది రెండవ శ్లోకము)
అహం మమాసౌ పతిరేష మే సుతో వ్రజేశ్వరస్యాఖిలవిత్తపా సతీ|
గోప్యశ్చ గోపాః సహ గోధనాశ్చ మే యన్మాయయేత్థం కుమతిః స మే గతిః॥8585॥
"ఇది కలయా? వైష్ణవమాయా! నా బుద్ధి భ్రమించెనా? బహుశా నా ఈ కుమారుడు పుట్టుకతోడనే యోగసిద్ధిని పొంది, జన్మించిన మహాత్ముడై యుండవచ్చును. యదార్థముగా ఇతడు చిత్తమునకును, మనోవాక్కాయ కర్మలకును ఏమాత్రమూ గోచరముగాడు. ఊహలకు అందనే అందడు. సమస్త విశ్వమునకును ఇతడే ఆధారభూతుడు. ఈయన వలననే జగత్తంతయును వ్యక్తమగుచున్నది. ఈ స్వామియొక్క స్వరూపము ఇట్టిది అని తెలుపుటకు సాధ్యముగానిది. అందువలన ఈ పరమాత్మ పాదములకు ప్రణమిల్లెదను🙏🙏🙏 'నేను యశోదను, ఈ నందుడు నా భర్త, ఈ కష్ణుడు నా కుమారుడు, ఈ గోకులమునకును, ఇందలి సకల సంపదలకును నేనే సర్వాధికారిని, గోపికలు, గోపాలురు నా అధీనములోనివారే. అంతేగాదు ఈ గోసంపద యంతయు నాదే' అని నా అజ్ఞానముచే భావించుచుంటిని. ఇది యంతయును ఆ సర్వేశ్వరుని మాయా ప్రభావమే. కనుక ఆ పరమాత్మయే నాకు శరణ్యుడు.
బమ్మెర పోతనామాత్యుల వారి పద్యముత్యములు
మత్తేభ విక్రీడితము
“కలయో! వైష్ణవ మాయయో! యితర సంకల్పార్థమో! సత్యమో!
తలఁపన్ నేరక యున్నదాననొ! యశోదాదేవిఁ గానో! పర
స్థలమో! బాలకుఁడెంత? యీతని ముఖస్థంబై యజాండంబు ప్ర
జ్వలమై యుండుట కేమి హేతువొ! మహాశ్చర్యంబు చింతింపఁగన్
భావం
కొడుకు నోటిలో బ్రహ్మాండం చూసి విభ్రాంతురాలైన యశోద ఇలా అనుకోసాగింది
“నేను కలగనటం లేదు కదా? లేకపోతే ఇదంతా విష్ణుమాయేమో? ఇదంతా నా చిత్తభ్రమా? కాకపోతే ఇదే సత్యమా? ఒకవేళ నా బుద్ధి సరిగా పనిచేయటం లేదా? అసలు నేను యశోదను అవునా కాదా? ఇది అసలు మా ఇల్లేనా మరొటా? ఈ పిల్లాడు ఎంత, వీడి నోటిలో బ్రహ్మాండం అంతా వెలుగులు చిమ్ముతూ ఉండటం ఏమిటి? ఇలా ఎలా సాధ్యం? ఆలోచించేకొద్దీ ఇదంతా మహా ఆశ్చర్యంగా ఉంది.
ఆటవెలది
బాలమాతృఁడగు సలీలుని ముఖమందు
విశ్వ మెల్ల నెట్లు వెలసి యుండు
బాలు భంగి నితఁడు భాసిల్లుఁ గాని స
ర్వాత్ముఁ డాది విష్ణుఁ డగుట నిజము.”
భావం
యశోద కొడుకు నోటిలో బ్రహ్మాండం చూసిన విభ్రాంతిలో ఇంకా ఇలా అనుకుంటోంది.
ఇంత చిన్న పిల్లవాడి నోటిలో, ఈ బ్రహ్మాండం అంతా ఎలా ఇమిడిపోయింది పసివాడిలాగ కనిపిస్తున్నాడు కాని ఇతడు నిజానికి సర్వమునందు ఆత్మరూపంలో ఉండే సర్వాత్మకుడు, ఆదిమూలాధారమైన సర్వవ్యాపకుడు అయిన శ్రీమహావిష్ణువే. ఇదే ముమ్మాటికీ నిజం.”
8.43 (నలుబది మూడవ శ్లోకము)
ఇత్థం విదితతత్త్వాయాం గోపికాయాం స ఈశ్వరః|
వైష్ణవీం వ్యతనోన్మాయాం పుత్రస్నేహమయీం విభుః॥8586॥
యశోదాదేవి ఈ విధమగు తాత్త్విక చింతనలొ మునిగియుండగా ఆ సర్వేశ్వరుడు ఆమెపై తన వైష్ణవమాయను ప్రసరింపజేసెను. తత్ప్రభావమున ఆమెలో శ్రీకృష్ణునిపై పుత్రవాత్సల్యము పెల్లుబికెను.
8.44 (నలుబది నాలుగవ శ్లోకము)
సద్యోనష్టస్మృతిర్గోపీ సాఽఽరోప్యారోహమాత్మజమ్|
ప్రవృద్ధస్నేహకలిలహృదయాఽఽసీద్యథా పురా॥8587॥
వెంటనే ఆ తల్లికి శ్రీకృష్ణునిపై పరమాత్మభావము మటుమాయ మయ్యెను. పిమ్మట ఆమె పుత్రుని (కన్నయ్యను) తన యొడిలోనికి తీసికొనెను. అంతట ఆమె హృదయమంతయును ఎప్పటివలె పుత్రప్రేమతో నిండారెను.
8.45 (నలుబది ఐదవ శ్లోకము)
త్రయ్యా చోపనిషద్భిశ్చ సాంఖ్యయోగైశ్చ సాత్వతైః|
ఉపగీయమానమాహాత్మ్యం హరిం సామన్యతాత్మజమ్॥8588॥
పరాత్పరుడైన ఆ శ్రీహరి ఋగ్యజుస్సామవేదముల చేతను, సకల ఉపనిషత్తులతోడను, సర్వదా ప్రస్తుతింప బడుచుండెను. సాంఖ్యయోగములచే (జ్ఞానయోగ కర్మయోగములచే) ప్రతిపాదింపబడుచుండును. అంతేగాదు, పరమభక్తులు ఆ స్వామిని నిరంతరము కీర్తించుచుందురు. అట్టి శ్రీమన్నారాయణుని తన పుత్రునిగా భావించిన యశోదమ్మ కడు ధన్యురాలు.
రాజోవాచ
8.46 (నలుబది ఆరవ శ్లోకము)
నందః కిమకరోద్బ్రహ్మన్ శ్రేయ ఏవం మహోదయమ్|
యశోదా చ మహాభాగా పపౌ యస్యాః స్తనం హరిః॥8589॥
పరీక్షిన్మహారాజు శుకయోగితో పలికెను " మహాత్మా! జగన్నాథుడైన శ్రీమహావిష్ణువునకు (శ్రీకృష్ణునకు) స్తన్యము నిచ్చిన ధన్యాత్మురాలు ఆ యశోద. ఆ తల్లి తన పూర్వజన్మమునందు ఎట్టి పుణ్యము చేసినదో? ఏమో! ఈ దివ్యశిశువును తన పుత్రునిగా తలంచుచు పెంచి పెద్దచేసినది. కృతార్థుడైన ఆ నందుడు ఎట్టి సుకృతములను ఒనర్చినాడో!
8.47 (నలుబది ఏఢవ శ్లోకము)
పితరౌ నాన్వవిందేతాం కృష్ణోదారార్భకేహితమ్|
గాయంత్యద్యాపి కవయో యల్లోకశమలాపహమ్॥8590॥
శ్రీకృష్ణభగవానుడు తన షడ్గుణైశ్వర్యసంపదలను మఱుగుపఱచి, గోకులమునందు ఒక సామాన్యబాలునివలె గోపబాలురతోగూడి తన బాల్యలీలను నెఱపెను. అట్టి దివ్యలీలలను వినిన, కీర్తించిన వారియొక్క సకల పాపములును పటాపంచలగును. త్రికాలజ్ఞులైన నారదాది మహర్షులు నేటికిని ఆ స్వామి పవిత్రగాథలను గానము చేయుచున్నారు. కాని, కన్న తల్లిదండ్రులైన దేవకీ వసుదేవులు ఆ లీలావైభవములను చూచు భాగ్యమునకు నోచుకొనలేదు. అదృష్టవంతులైన యశోదానందులు మాత్రము వాటిని కనులారచూచి పరమానందభరితులైరి. ఇందులకు కారణమేమై యుండును?
శ్రీశుక ఉవాచ
8.48 (నలుబది ఎనిమిదవ శ్లోకము)
ద్రోణో వసూనాం ప్రవరో ధరయా సహ భార్యయా|
కరిష్యమాణ ఆదేశాన్ బ్రహ్మణస్తమువాచ హ॥8591॥
8.49 (నలుబది తొమ్మిదవ శ్లోకము)
జాతయోర్నౌ మహాదేవే భువి విశ్వేశ్వరే హరౌ|
భక్తిః స్యాత్పరమా లోకే యయాంజో దుర్గతిం తరేత్॥8592॥
శ్రీశుకుడు నుడివెను పరీక్షిన్మహారాజా! నందుడు పూర్వజన్మలో ద్రోణుడు అను పేరుతో ఒప్పెను. ఆ ద్రోణుడు వసువులలో శ్రేష్ఠుడు. అతని భార్యపేరు ధర. అతడు బ్రహ్మదేవుని ఆదేశమును గౌరవించుచు ఇట్లనెను. "దేవా! జగన్నాథుడైన శ్రీహరిని భక్తితో నేవించెడివారు తమ సేవల ప్రభావమున దుర్గతులనుండి (యమయాతనలనుండి) తరింపబడుదురు. మేము భూలోకమున జన్మించినప్పుడు శ్రీకృష్ణునిపై అనన్యభక్తిని మాకు అనుగ్రహింపుము".
8.50 (ఏబదియవ శ్లోకము)
అస్త్విత్యుక్తః స భగవాన్ వ్రజే ద్రోణో మహాయశాః|
జజ్ఞే నంద ఇతి ఖ్యాతో యశోదా సా ధరాభవత్॥8593॥
అందులకు బ్రహ్మదేవుడు తథాస్తు అనెను. పిమ్మట ఆ ద్రోణుడే గోకులమున నందుడై జన్మించి, చక్కని కీర్తిప్రతిష్ఠలతో ఖ్యాతి వహించెను. ద్రోణుని భార్యయైన ధర యశోదయై జన్మించెను.
8.51 (ఏబది ఒకటవ శ్లోకము)
తతో భక్తిర్భగవతి పుత్రీభూతే జనార్దనే|
దంపత్యోర్నితరామాసీద్గోపగోపీషు భారత॥8594॥
పరీక్షిన్మహారాజా! ఇప్పుడు ఈ జన్మలో జనులను జననమరణ చక్రమునుండి రక్షించు శ్రీహరి వారికి పుత్రుడయ్యెను. భగవదనుగ్రహముతో ఆ యశోదానందులకు ఆ స్వామిపై గోపాలురకంటెను, గోపికలకంటెను మెండైన భక్తిప్రపత్తులు కుదురుకొనెను.
8.52 (ఏబది రెండవ శ్లోకము)
కృష్ణో బ్రహ్మణ ఆదేశం సత్యం కర్తుం వ్రజే విభుః|
సహ రామో వసంశ్చక్రే తేషాం ప్రీతిం స్వలీలయా॥8595॥
బ్రహ్మదేవుని వచనములను సత్యము చేయుటకై కృష్ణప్రభువు బలరామునితో గూడి గోకులమున నివసించుచు తన బాల్యలీలలచే నందాది వ్రజవాసులందఱిని ఆనందింపజేయసాగెను.
ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కంధే పూర్వార్ధే అష్టమోఽధ్యాయః (8)
ఇది భాగవత మహాపురాణమునందలి దశమస్కంధము, పూర్వభాగమునందలి ఎనిమిదవ అధ్యాయము (8)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
దశమస్కంధము - పూర్వార్ధము - తొమ్మిదవ అధ్యాయము
యశోదమ్మ చిలిపికృష్ణుని రోటికి కట్టివేయుట
ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
శ్రీశుక ఉవాచ
9.1 (ప్రథమ శ్లోకము)
ఏకదా గృహదాసీషు యశోదా నందగేహినీ|
కర్మాంతరనియుక్తాసు నిర్మమంథ స్వయం దధి॥8596॥
9.2 (రెండవ శ్లోకము)
యాని యానీహ గీతాని తద్బాలచరితాని చ|
దధినిర్మంథనే కాలే స్మరంతీ తాన్యగాయత॥8597॥
శ్రీశుకుడు పలికెను నందుని ధర్మపత్నియగు యశోద ఒకనాడు తన ఇంటి దాసీలకు వేర్వేఱు పనులను అప్పగించి, చిన్నికృష్ణునికొఱకు వెన్నదీయుటకై తానే స్వయముగా పెఱుగు చిలుకసాగెను. ఇంతవఱకును చిన్నారి కన్నయ్య ప్రదర్శించిన బాల్యలీలలను స్మరించుకొనుచు వాటికి సంబంధించిన మధురగీతములను హాయిగా గానము చేయుచు ఆ దేవి పెఱుగును మథించుచుండెను.
9.3 (మూడవ శ్లోకము)
క్షౌమం వాసః పృథుకటితటే బిభ్రతీ సూత్రనద్ధం
పుత్రస్నేహస్నుతకుచయుగం జాతకంపం చ సుభ్రూః|
రజ్జ్వాకర్షశ్రమభుజచలత్కంకణౌ కుండలే చ|
స్విన్నం వక్త్రం కబరవిగలన్మాలతీ నిర్మమంథ॥8598॥
చక్కని కనుబొమల తీరుగల యశోద ఆ పెఱుగు చిలుకు సమయమున ఒప్పైన తన కటితటమున మేలైన పట్టువస్త్రమును ధరించియుండెను. నడుమునకు నిగనిగలాడు బంగారు ఒడ్డాణమును అలంకరించుకొని యుండెను. కన్నయ్యపైగల వాత్సల్యప్రభావమున ఆమె స్తనముల నుండి పాలు (స్తన్యము) స్రవించుచుండెను. ఆమె తన రెండు చేతులతో కవ్వపుత్రాడు కొనలను పట్టుకొని, అటునిటు లాగు చుండుటచే శరీరమంతయును కంపించిపోవుచుండెను. చేతికంకణములు మనోజ్ఞముగా ధ్వనించుచుండెను.చెవుల కుండలములు తళుకు లీనుచుండెను. ముఖమంతయు చెమర్చుచుండెను. కొప్పు ముడితోపాటు సిగలో చెక్కుకొనిన మాలతీ మాలయును జాఱి పోవుచుండెను.
🌹🌹🌹
బమ్మెర పోతనామాత్యులవారి పద్యరత్నము
సీస పద్యము
కరకమలారుణ కాంతిఁ గవ్వుపు ద్రాడు;
పవడంపు నునుఁదీఁవ పగిది మెఱయఁ;
గ్రమముతో రజ్జు వాకర్షింపఁ బాలిండ్లు;
వీడ్వడి యొండొంటి వీఁక నొత్తఁ;
గుచకుంభములమీఁది కొంగు జాఱఁగ జిక్కు;
పడుచు హారావళుల్ బయలుపడగఁ;
బొడమిన చెమటతోఁ బొల్పారు నెమ్మోము;
మంచు పైఁబడిన పద్మంబుఁ దెగడఁ;
తేటగీతము
గౌను నులియంగఁ; గంకణక్వణన మెసఁగఁ;
దుఱుము బిగివీడఁ; గర్ణికాద్యుతులు మెఱయ;
బాలు నంకించి పాడెడి పాట వలనఁ
దరువు లిగురొత్త బెరు గింతి దరువఁ జొచ్చె.
భావము
అలా యశోదాదేవి పెరుగు చిలుకుతుండగా, ఆమె చేతుల అరుణకాంతులు కవ్వం తాటిపై పడి అది పగడపుతీగలాగ మెరుస్తోంది. తాడును క్రమపద్దతిలో ఒకదాని తరువాత ఒకటి లాగుతుంటే, ఆమె పాలిండ్లు ఒకదానితో ఒకటి ఒరుసుకుంటున్నాయి. వక్షోజాలపై ఉన్న కొంగు జారుతోంది. మెడలోని హారాలు చిక్కు పడుతూ కనబడుతూ ఉన్నాయి. పట్టిన చెమట బిందువులతో అందంగా ఉన్న ముఖం మంచుబిందువులు చెందిన తామరపూవు కన్నా మనోహరంగా ఉంది. సన్నని నడుము జవజవలాడుతూ ఉంది. చేతుల గాజులు గలగలలాడుతూ ఉన్నాయి. కొప్పుముడి బిగింపు సడలుతూ ఉంది. చెవుల కమ్మల కాంతులు తళుక్కుమంటూ ఉన్నాయి. ముద్దు కృష్ణుని ఉద్దేశించి ఆమె పాడేపాటకు చెట్లు చిగురుస్తూ ఉన్నాయి. ఇలా యశోదాదేవి పెరుగు చిలుకుతూ ఉంది.
🌹🌹🌹
9.4 (నాలుగవ శ్లోకము)
తాం స్తన్యకామ ఆసాద్య మథ్నంతీం జననీం హరిః|
గృహీత్వా దధిమంథానం న్యషేధత్ప్రీతిమావహన్॥8599॥
ఇంతలో స్తన్యము గ్రోలుటకై కృష్ణస్వామి పెఱుగు చిలుకుచున్న ఆ తల్లి కడకు వచ్చెను. పిదప ఆ ప్రభువు ఆమెలో మురిపెములను నింపుచు, కవ్వము పట్టుకొని, పెఱుగు చిలుకుటకు అడ్డు వచ్చెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
బమ్మెర పోతనామాత్యులవారి పద్యరత్నము
కంద పద్యము
సుడియుచు వ్రాలుచుఁ గిదుకుచు
సడి గొట్టుచు "నమ్మ! రమ్ము; చన్ని" మ్మనుచున్
వెడవెడ గంతులు వైచుచుఁ
గడవఁ గదిసి బాలకుండు గవ్వముఁ బట్టెన్.
భావం
కృష్ణబాలకుడు ఆమె చుట్టూ తిరుగుతూ, మీద పడుతూ, పైటలాగతూ అల్లరి చేయసాగాడు. “అమ్మా! రావే! నాకు పాలియ్యవే!” అంటూ గంతులు వేస్తూ దగ్గరకొచ్చి, చిన్నారి కన్నయ్య కవ్వాన్ని కదలకుండా పట్టుకున్నాడు.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
9.5 (ఐదవ శ్లోకము)
తమంకమారూఢమపాయయత్స్తనం స్నేహస్నుతం సస్మితమీక్షతీ ముఖమ్|
అతృప్తముత్సృజ్య జవేన సా యయావుత్సిచ్యమానే పయసి త్వధిశ్రితే॥8600॥
అంతట ఆ తల్లి తన చిన్నారిని ఒడిలోనికి దీసికొని, మమకారముతో పెల్లుబుకుచున్న స్తన్యమునిచ్చుచు, ఆ కన్నయ్య చిఱునవ్వులను గాంచి మురిసిపోవుచుండెను. ఇంతలో పొయిమీదనున్న పాలు పొంగిపోవుచుండుట గాంచి, ఆ యశోదమ్మ తన బుజ్జికృష్ణుడు పాలు త్రాగుచుండగనే, మధ్యలోనే అతనిని క్రిందికి దింపెను. వెంటనే పాల పొంగును చల్లార్చుటకై త్వరత్వరగా వంటయింటిలోనికి వెళ్ళెను.
9.6 (ఆరవ శ్లోకము)
సంజాతకోపః స్ఫురితారుణాధరం సందశ్య దద్భిర్దధిమంథభాజనమ్|
భిత్త్వా మృషాశ్రుర్దృషదశ్మనా రహో జఘాస హైయంగవమంతరం గ…
[04:02, 26/11/2020] +91 95058 13235: శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
735వ నామ మంత్రము
ఓం మిథ్యాజగదధిష్ఠానాయై నమః
మిథ్యాభూత జగత్తునకు అధిష్ఠానమై (ఆధారభూతమై) విరాజిల్లు జగన్మాతకు నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి మిథ్యాజగదధిష్ఠానా యను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును ఓం మిథ్యాజగదధిష్ఠానాయై నమః యని ఉచ్చరించుచూ ఆ జగదీశ్వరిని ఉపాసించు సాధకుడు ఆ తల్లి అనుగ్రహముతో జగత్తు అంతయు మిథ్య యనియు సత్యము, నిత్యమైనది పరమాత్మసన్నిధియనియు, అందుకోసము తానేమిచేయవలెనో తెలిసికొనును. అందుకోసం తన సాధన కొనసాగించి సాధించుకొనును.భౌతికపరమైన సుఖసంతోషములు కూడా ఆ తల్లి అనుగ్రహముచే సంప్రాప్తమవును.
మిథ్య అను పదానికి అర్థం మాయ. ఇంతకు ముందు మాయా యను 716వ నామ మంత్రము వివరణ జరిగినది. కాని ఈ మాయ రెండు రకములు. ఒకటి విద్యామాయ. రెండవది అవిద్యామాయ.
విద్యామాయ జ్ఞానసమ్మిళితమైనది. పరమాత్మ కొరకు అన్వేషణ చేసి తెలుసుకుంటుంది. వివేకము, వైరాగ్యము అని రెండు కలుగజేస్తుంది. భగవంతుని శరణు కోరుతుంది.
రెండవది అవిద్యామాయ. మహా మాయలాడి ఈ అవిద్య. కామక్రోధాది అరిషడ్వర్గముల మధ్య నిలుపుతుంది. నేను, నాది అనే అహంకారాన్ని రెచ్చగొడుతుంది. సంసారం అనే కారాగారంలో బంధింపజేస్తుంది. విద్యామాయ వ్యక్తం అయితే అవిద్యామాయ పలాయనం చిత్తగిస్తుంది, జ్ఞానజ్యోతులతో కాంతిమయమైన పరమాత్మ సన్నిధానాన్ని తిలకిస్తుంది జీవాత్మ. ఇది ఆ జీవుని పూర్వజన్మల కర్మలవాసనా ప్రభావితంగా పనిజేస్తుంది. ఇదంతా పరమేశ్వరి విసరిన మాయాజాలమే.
మిథ్య అను మాటకు వస్తే. జగత్తు అసత్యము. జగత్తు అనేది రంగస్థలం వంటిది. పాత్రలు ప్రవేశిస్తాయి నిష్క్రమిస్తాయి. నాటకమనేది రాత్రి చీకట్లో ప్రదర్శిస్తారు. అలాగే జగమనే నాటకంకూడా అజ్ఞానమనే చీకట్లో నడపబడుతుంది. అందుకే అజ్ఞానధ్వాంత దీపిక అయిన జగన్మాత అసత్యమయిన ఈ జగత్తులో తానొక అధిష్ఠానదేవతయై అజ్ఞానమనే (మిథ్యా) చీకటికి (జగత్తుకు) జ్ఞానదీపికయై (అధిష్ఠానయై) జీవులను సత్యమార్గంలో నడుపుతుంది గనుకనే జగన్మాత మిథ్యాజగదధిష్ఠానా యని నామప్రసిద్ధయైనది. అసత్యమైన జగత్తు భాసించాలంటే జగన్మాత ఆధారమైనది. ఈ మిథ్యాజగత్తులో లేనిపోని భ్రమలు, తాడు పామువలె, ముత్యపు చిప్ప వెండిచిప్పగా, మోసగాడు మంచివాడుగా, కులటలు పతివ్రతలుగా భ్రమలోకి రాకుండా జగన్మాత అధిష్ఠానపీఠముపైనుండి అసత్యంలోని సత్యాన్న వెలికి తీస్తుంది. అందుకే జగన్మాత మిథ్యాజగదధిష్ఠానా అని స్తుతింపబడుచున్నది. అసత్యమనే చత్వారానికి జ్ఞానమనే సులోచనముగా జగన్మాత అధిష్ఠాన పీఠముపైనధిష్ఠించి సత్యమనే అసలు దృష్టిని ఇస్తుంది కనుక జగన్మాత మిథ్యాజగదధిష్ఠానా యనునామముతో కీర్తింపబడుచున్నది. జగత్తు మిథ్యయను అనారోగ్యముతో అజ్ఞానమను అవసానదశకు చేరుకుంటుంటే జగన్మాత పరమాత్మగా ప్రాణముగా నిలచినది. బ్రహ్మమన్నది ఒక్కటే ఉంటుంది. అదే పరబ్రహ్మము. ఆ పరబ్రహ్మమే జగన్మాత. ద్వైతబుద్ధి మాయచే కల్పించబడుచున్నది. అద్వైతమే పరమార్థము. బ్రహ్మసత్యమైతే జగత్తు మిథ్య. అట్టి మిథ్య అయిన జగత్తుకు జగన్మాత ఆధారమైనది గాన జగన్మాతను మిథ్యాజగదధిష్ఠానా అనబడుచున్నది.
జగన్మాతకు నమస్కరించునఫుడు ఓం మిథ్యాజగదధిష్ఠానాయై నమః అని అనవలెను.
[04:02, 26/11/2020] +91 95058 13235: శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
161వ నామ మంత్రము
ఓం నిరహంకారాయై నమః
సాత్త్విక, రాజస, తామసములను త్రిగుణాత్మకమైన అహంకారము లేక నిరహంకారియై తేజరిల్లు పరమాత్మస్వరూపిణియైన జగన్మాతకు నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి నిరహంకారా యను ఐదక్షరముల (పంచాక్షరీ) నామ మంత్రమును ఓం నిరహంకారాయై నమః యని ఉచ్చరించుచూ, ఆ పరాశక్తిని అత్యంత భక్తిశ్రద్ధలతో ఉపాసించు సాధకుడు నేను, నాది, అంతా నావలననే యను అహంకారముపోయి, కేవలం జగన్మాత నామస్మరణేపరమావధిగా జీవించి తరించును. అమ్మవారు అతనికి భౌతికపరమైన సుఖసంతోషములు, ఆత్మానందకరమైన బ్రహ్మజ్ఞాన సంపదలు ప్రసాదించి తరింపజేయును.
తల్లిప్రేగు త్రెంచుకుని భౌతిక ప్రపంచంలోకి రాగానే ఆ పసికందుపై నీళ్ళు జల్లుటతోనే ఆ శిశువు ఏడుపు ప్రారంభించును. శరీరంపై గిల్లుటతోడనే కేర్ మని నొప్పితో ఏడ్చును. అంటే ఆ దేహం తనది, దానికి నొప్పి కలిగిందనిగదా ఏడ్ఛేది. కొంచం ఊహవచ్చే సరికి తన తల్లి, తన తండ్రి, తన పరిసరాలు ఇలా నేను, నాది అనే భావం కలుగుతుంది. మాటలు వచ్చి, ప్రపంచం అంతా చూచుటతోనే తన వస్తువులు, తన ఇల్లు ఇలా తన, పర అనే భేదము తెలుస్తుంది. ఇదంతా అహంకారమే. ఇటువంటి అహంకారములు మూడు విధములు. 1) సాత్త్విక, 2) రాజస, 3) తామసములనెడి త్రిగుణాత్మకమైనది అహంకారము. ఇది నా దేహము అనే భావన వస్తుంది. తన గుండెలపై చేయివేసుకుని నేను అనడం జరుగుతుంది. అహంకారము కొంతవరకూ పరవాలేదు. తనయొక్క భౌతిక పరమైన బాధ్యతా నిర్వణవరకూ అహంకారం ఉండాలి. అది కొంచం ముదిరి అన్నీ తానే, తానే అన్నిటికీ కారణము, తనపైనే సర్వం ఆధారపడి ఉంది. ఈ పొలం నాది. ఈ భూమినాది అనే అహంకారం అది అరిషడ్వర్గముల వలన ఏర్పడుతుంది. నిజానికి పుట్టినప్ఫుడు మొలత్రాడుకూడా ఉండదు. పొయినప్పుడు ఒంటిమీద నూలుప్రోగు కూడా ఉండనీయరు. ఇవన్నీ మధ్యలోవచ్చినవే. అలాంటప్పుడు అహంకారందేనికి? అంటే శరీరం ఉంది కనుక. ఆ శరీరం తనది అని భావించును గనుక. కాని ఆత్మకు ఇవి ఏమియు ఉండవు. నిర్గుణమైనది. ఆత్మ అగ్నికి దహింపబడదు, నీటిచే తడుపబడదు, వాయువుచే కదిలించబడదు, మట్టి అంటుకొనదు, నాశనము లేనిది. ఆత్మలకే పరమాత్మయైన జగన్మాత ఈ త్రిగుణాత్మకమైన అహంకారహితమైనది. శరీరంతో సంబంధంలేనిది. కాబట్టి ఆ తల్లి నిరహంకారా యని అనబడినది. జగన్మాతను సేవించిన సాధకునికి ఆ తల్లి అహంకార రహితిస్థితిని కలుగజేస్తుంది. అప్ఫుడు ఆ సాధకునికి శరీరంపై మమకారం తొలగిపోయి బ్రహ్మజ్ఞాన సముపార్జనకు మార్గాన్ని అన్వేషిస్తాడు. తన మార్గం సన్మార్గమవుతుంది. పరబ్రహ్మతతత్వం తెలిసి శాశ్వతమైన ఆత్మానందాన్ని పొందుతాడు.
జగన్మాతకు నమస్కరించునపుడు ఓం నిరహంకారాయై నమః అని అనవలెను.
వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం
దశమస్కంధము - పూర్వార్ధము - తొమ్మిదవ అధ్యాయము
యశోదమ్మ చిలిపికృష్ణుని రోటికి కట్టివేయుట
ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
9.9 (తొమ్మిదవ శ్లోకము)
తామాత్తయష్టిం ప్రసమీక్ష్య సత్వరస్తతోఽవరుధ్యాపససార భీతవత్|
గోప్యన్వధావన్న యమాప యోగినాం క్షమం ప్రవేష్టుం తపసేరితం మనః॥8604॥
చేతితో బెత్తమును పట్టుకొనియున్న తల్లినిజూచి, శ్రీకృష్ణుడు ఱోటిపైనుండి దిగి, భయపడుచున్న వానివలె త్వరత్వరగా పఱుగెత్తెను. అప్ఫుడు ఆ యశోదమ్మ అతనిని వెంబడించినను అతడు ఆమెకు చిక్కలేదు. తపస్సమాధిలోనున్న యోగీశ్వరుల మనస్సులకును అందని ఆ మహాత్ముడు ఆమెకు చిక్కునా? (చిక్కడుగదా!)
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
బమ్మెర పోతనామాత్యులవారి పద్యరత్నములు
సీస పద్యము
"బాలుఁ డీతండని భావింతు నందునా;
యే పెద్దలును నేర రీక్రమంబు
వెఱ పెఱుంగుటకు నై వెఱపింతు నందునా;
కలిగి లే కొక్కఁడు గాని లేఁడు
వెఱపుతో నా బుద్ధి వినిపింతు నందునా;
తనుఁ దాన యై బుద్ధిఁ దప్పకుండు
నొం డెఱుంగక యింట నుండెడి నందునా;
చొచ్చి చూడని దొకచోటు లేదు
ఆటవెలది
తన్ను నెవ్వరైనఁ దలపోయఁ బాఱెడి
యోజ లేదు భీతి యొక టెఱుంగఁ
డెలమి నూరకుండఁ డెక్కసక్కెము లాడుఁ
బట్టి శాస్తిజేయు భంగి యెట్లు?"
భావం
కన్నయ్యని పోనీ పసిపిల్లాడులే అనుకుందామంటే, ఇలాంటి నడవడి పెద్దలకు ఎవరికి తెలియదు; పోనీ ఇతడికి కొద్దిగా భయం చెబ్దాం అనుకుందామంటే, లేకలేక పుట్టినవాడు వీడొక్కడే మరోడు లేడాయె; బెదిరించి బుద్ధులు నేర్పుదాం అంటే, తనంతట తనే బుద్ధిగా ఉంటున్నాడాయె; అలాగనీ ఏమి తెలియకుండా ఇంట్లో కూర్చుంటాడులే అనుకుంటే, వీడు వెళ్ళని చోటు, చూడని చోటు ఏదీ లేనే లేదాయె; తనని ఎవరైనా చూస్తే పారిపోదామనే ఆలోచనే కూడా వీడికి రాదు; అసలు భయం అన్నదే తెలియదు; మళ్ళీ ఊరికే ఉండడు, ఎకసెక్కాలాడుతూనే ఉంటాడు; వీణ్ణి పట్టుకొని తగిన శాస్తి చేయటం ఎలా?
సీస పద్యము
స్తంభాదికంబులు దనకు నడ్డం బైన;
నిట్టట్టు చని పట్టనీనివాని
నీ తప్పు సైరింపు మింక దొంగిలఁ బోవ;
నే నని మునుముట్ట నేడ్చువాని
గాటుక నెఱయంగఁ గన్నులు నులుముచు;
వెడలు కన్నీటితో వెగచువాని
నే దెస వచ్చునో యిది యని పలుమాఱు;
సురుగుచుఁ గ్రేగంటఁ జూచువానిఁ
ఆటవెలది
గూడఁ బాఱి పట్టుకొని వెఱపించుచుఁ
జిన్న వెన్నదొంగ చిక్కె ననుచు
నలిగి కొట్టఁ జేతు లాడక పూఁబోఁడి
కరుణతోడ బాలుఁ గట్టఁ దలఁచి.
భావం
కృష్ణబాలుడు వాకిట్లో స్తంభాలు అడ్డంగా ఉంటే వాటి చాటున ఇటు అటు దొరక్కుండా పరిగెడుతున్నాడు; “ఈ ఒక్కసారికీ క్షమించవే! ఇంకెప్పుడూ దొంగతనం చేయనే!” అంటూ మునుముందే ఏడుస్తున్నాడు; కాటుక చెదిరేలా కళ్ళు నులుము కుంటున్నాడు; కన్నీరు కారుతుండగా వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు; తన తల్లి ఎటువైపు నుంచి వస్తుందో అని బెదురుతూ మాటి మాటికీ క్రీగంట చూస్తున్నాడు, పక్కలకు తప్పుకుంటున్నాడు; చివరికి ఎలాగైతేనేం వెంటబడి తరుముతున్న యశోద “అమ్మయ్య! ఈ చిన్ని వెన్నదొంగచిక్కాడు.” అంటూ భుజం పట్టుకుంది; కానీ ఆమెకు కొట్టటానికి చేతులు రాలేదు, యశోద శరీరము, స్వభావము కూడా పువ్వువలె సుతిమెత్తనైన పూబోడి కదా; కొడుకు మీద జాలిపడి కొట్టకుండా పోనీలే కట్టివేద్దా మనుకుంది;
కంద పద్యము
గజ్జలు గల్లని మ్రోయఁగ
నజ్జలు ద్రొక్కుటలు మాని యతిజవమున యో
షిజ్జనములు నగఁ దల్లియుఁ
బజ్జం జనుదేర నతఁడు పరువిడె నధిపా!
భావం
చిలిపి కృష్ణుడు చిందులు తొక్కటాలు మానేసి, చాలా వేగంగా పరుగు లంకించుకున్నాడు. కాలి గజ్జలు గల్లు గల్లు మని మ్రోగుతున్నాయి. తల్లి యశోదాదేవి వెంట పరుగెట్టుకుంటూ వస్తోంది. గోపికా స్త్రీలు నవ్వుతూ చూస్తున్నారు.
సీస పద్యము
స్తంభాదికంబులు దనకు నడ్డం బైన;
నిట్టట్టు చని పట్టనీనివాని
నీ తప్పు సైరింపు మింక దొంగిలఁ బోవ;
నే నని మునుముట్ట నేడ్చువాని
గాటుక నెఱయంగఁ గన్నులు నులుముచు;
వెడలు కన్నీటితో వెగచువాని
నే దెస వచ్చునో యిది యని పలుమాఱు;
సురుగుచుఁ గ్రేగంటఁ జూచువానిఁ
ఆటవెలది
గూడఁ బాఱి పట్టుకొని వెఱపించుచుఁ
జిన్న వెన్నదొంగ చిక్కె ననుచు
నలిగి కొట్టఁ జేతు లాడక పూఁబోఁడి
కరుణతోడ బాలుఁ గట్టఁ దలఁచి.
భావం
కృష్ణబాలుడు వాకిట్లో స్తంభాలు అడ్డంగా ఉంటే వాటి చాటున ఇటు అటు దొరక్కుండా పరిగెడుతున్నాడు; “ఈ ఒక్కసారికీ క్షమించవే! ఇంకెప్పుడూ దొంగతనం చేయనే!” అంటూ మునుముందే ఏడుస్తున్నాడు; కాటుక చెదిరేలా కళ్ళు నులుము కుంటున్నాడు; కన్నీరు కారుతుండగా వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు; తన తల్లి ఎటువైపు నుంచి వస్తుందో అని బెదురుతూ మాటి మాటికీ క్రీగంట చూస్తున్నాడు, పక్కలకు తప్పుకుంటున్నాడు; చివరికి ఎలాగైతేనేం వెంటబడి తరుముతున్న యశోద “అమ్మయ్య! ఈ చిన్ని వెన్నదొంగచిక్కాడు.” అంటూ భుజం పట్టుకుంది; కానీ ఆమెకు కొట్టటానికి చేతులు రాలేదు, యశోద శరీరము, స్వభావము కూడా పువ్వువలె సుతిమెత్తనైన పూబోడి కదా; కొడుకు మీద జాలిపడి కొట్టకుండా పోనీలే కట్టివేద్దా మనుకుంది;
కంద పద్యము
పట్టినఁ బట్టుపడని నినుఁ
బట్టెద నని చలముఁగొనినఁ బట్టుట బెట్టే?
పట్టువడ వండ్రు పట్టీ
పట్టుకొనన్ నాఁకుఁగాక పరులకు వశమే?
భావం
పట్టుకుందామంటే ఎవరికీ చిక్కనని అనుకుంటున్నావా. పట్టుకోవాలని నేను పట్టుబడితే నువ్వు దొరకటం పెద్ద కష్టం అనుకుంటున్నావా. నువ్వు చిక్కవు అని అందరూ అంటారు. నిన్ను పట్టుకోడం నాకు తప్ప ఇంకెవరికి సాధ్యం కాదురా.”
అసలు తత్వం కూడా ఆ మహాతల్లి యశోదమ్మ నోట అంతరార్థంగా ఇలా బయటబడుతోంది.
సీస పద్యము
తోయంబు లివి యని తొలగక చొచ్చెదు;
తలఁచెదు గట్టైనఁ దరల నెత్త;
మంటితో నాటలు మానవు; కోరాడె;
దున్నత స్తంభంబు లూఁపఁ బోయె;
దన్యుల నల్పంబు లడుగంగఁ బాఱెదు;
రాచవేఁటలఁ జాల ఱవ్వఁదెచ్చె;
దలయవు నీళ్ళకు నడ్డంబు గట్టెదు;
ముసలివై హలివృత్తి మొనయఁ; జూచె
ఆటవెలది
దంబరంబు మొలకు నడుగవు తిరిగెద
వింకఁ గల్కిచేఁత లేల పుత్ర!
నిన్ను వంప వ్రాల్ప నే నేర ననియొ నీ
విట్టు క్రిందు మీఁదు నెఱుఁగ కునికి.”
భావం
ఒరే కన్నయ్యా! అల్లరి పిల్లాడా! అదురు బెదురు లేకుండా నీళ్ళలో చొరబడి పోతావు! (మత్స్యావతారుడవుగా నీళ్ళల్లో తిరిగావు కదా). ఎంత పెద్ద బండైనా ఎత్తేయాలని చూస్తావు! (కూర్మావతారుడవుగా మందరపర్వతాన్ని ఎత్తావు కదా). పరాయి వాళ్ళ దగ్గర అల్ప మైన వాటికోసం చెయ్యి చాస్తావు! (వామనాతారుడవుగా రాక్షసచక్రవర్తి బలివద్ద చెయ్యిచాపావు కదా). నీకు రాజసం ఎక్కువ ఎన్నో జగడాలు తెస్తావు! (పరశురామావతారుడవుగా రాజలోకాన్ని సంహరించావు కదా). నీళ్ళ ప్రవాహానికి అడ్డకట్టలు వేయాలని చూస్తావు! (రామావతారుడవు సముద్రానికే సేతువు కట్టావు కదా). దుడ్డుకఱ్ఱ పట్టుకొని నాగలిదున్నే వాడిలా నటిస్తావు! (బలరామావాతారుడవుగా ముసలము పట్టావు కదా). మొలకు గుడ్డ లేకుండా దిగంబరంగా తిరుగుతావు! (బుద్ధావతారుడవుగా సన్యాసిగా ప్రకాశించావు కదా). ఇవి చాలవు నట్లు ఇంకా దుడుకు చేష్ట లెందుకు చేస్తావో ఏమిటో? (ఇక ముందు కల్కి అవతార మెత్తి దుష్టులను శిక్షించడానికి ఏవేం చేస్తావో). నిన్ను నేను భయభక్తులలో పెట్టలేను అనుకునేగా ఇలా కింద మీద తెలియకుండ మిడిసిపడు తున్నావు! (త్రివిక్రమావతారుడవుగా బ్రహ్మాండభాండందాటి ఎదిగిపోయావు కదా). ఇలా ఎత్తిపొడుపు మాటలతో తల్లి యశోదాదేవి కొంటెకొడుకును దెప్పుతోంది.
చమత్కారమైన అలంకారం నిందాస్తుతి. ఓ ప్రక్కన నిందిస్తున్నా, స్తుతి పలుకుతుంటే నిందాస్తుతి అంటారు. ఇలా అల్లరి కృష్ణబాలుని యశోద దెప్పటంలో నిందాస్తుతితో బహు చక్కగా అలరించారు మన పోతన్నగారు. ఆస్వాదిద్దాం రండి."
9.10 (పదియవ శ్లోకము)
అన్వంచమానా జననీ బృహచ్చలచ్ఛ్రోణీభరాక్రాంతగతిః సుమధ్యమా|
జవేన విస్రంసితకేశబంధనచ్యుతప్రసూనానుగతిః పరామృశత్॥8605॥
సొగసైన నడుముగల ఆ తల్లి త్వరత్వరగా తన సుతుని అనుసరించుచుండుటవలన, అలసటచే ఆమెయొక్క గమనవేగము తగ్గిపోయెను. ఆ తొందరలో కొప్ఫుముడి సడలిపోవుటచే తలలో పెట్టుకొనిన పూవులన్నియును రాలిపోయెను. ఎట్టకేలకు ఆమె అతనిని పట్టుకొనగలిగెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
బమ్మెర పోతనామాత్యులవారి పద్యరత్నములు
కంద పద్యము
చిక్కఁడు సిరికౌగిటిలోఁ
జిక్కఁడు సనకాది యోగిచిత్తాబ్జములం
జిక్కఁడు శ్రుతిలతికావళిఁ
జిక్కె నతఁడు లీలఁ దల్లి చేతన్ ఱోలన్
భావం
ఆ లీలా గోపాలకృష్ణుడు సామాన్యమైనవాడా కాదు. లక్ష్మీదేవి కౌగిటలోను చిక్కలేదు, సనకసనందాది మహార్షుల చిత్తాలకు చిక్కలేదు. ఉపనిషత్తులకు చిక్కలేదు. ఆహా! అంతటి వాడు లీలగా అవలీలగా తల్లి చేతికి చిక్కి రోటికి కట్టివేయబడ్డాడు.
భక్తపరాధీనుడు గనుక తల్లి యనే మిషచే తనకు అంతరంగ భక్తురాలు గనుక యశోదచేతికి చిక్కాడు.
9.11 (పదకొండవ శ్లోకము)
కృతాగసం తం ప్రరుదంతమక్షిణీ కషంతమంజన్మషిణీ స్వపాణినా|
ఉద్వీక్షమాణం భయవిహ్వలేక్షణం హస్తే గృహీత్వా భిషయంత్యవాగురత్॥8606॥
తన దుడుకు కొడుకును పట్టుకొనిన పిదప ఆమె భయపెట్టుచు అతనిని దండించుటకై చేతిని పైకెత్తెను. అపరాధమొనర్చిన ఆ బాలుడు, పైగా ఏడ్చుచు తన చిట్టి చేతులతో కనులను నులుముకొనసాగెను. అంతట కనులకుగల కాటుక ముఖమంతయు వ్యాపించెను. అతడు భయముతో వణికిపోవుచు బిత్తరచూపులతో వీక్షింపసాగెను.
9.12 (పండ్రెండవ శ్లోకము)
త్యక్త్వా యష్టిం సుతం భీతం విజ్ఞాయార్భకవత్సలా|
ఇయేష కిల తం బద్ధుం దామ్నాతద్వీర్యకోవిదా॥8608॥
పిమ్మట ఆ యశోదామాత కుమారునిపైగల మమకారముతో తన చిన్నారి నిజముగనే భీతిల్లుచున్నట్లు భావించి, చేతిలోని బెత్తమును పాఱవైచెను. ఆ దివ్యశిశువు ప్రభావమును ఎఱుగనిది అగుటచే, అ తల్లి మరల అతడు అల్లరి పనులకు దిగకుండుటకై సామాన్యునివలె అతనిని త్రాడుతో కట్టివేయదలంచెను.
9.13 (పదియవ శ్లోకము)
న చాంతర్న బహిర్యస్య న పూర్వం నాపి చాపరమ్|
పూర్వాపరం బహిశ్చాంతర్జగతో యో జగచ్చ యః॥8608॥
9.14 (పదునాలుగ శ్లోకము)
తం మత్వాఽఽత్మజమవ్యక్తం మర్త్యలింగమధోక్షజం|
గోపికోలూఖలే దామ్నా బబంధ ప్రాకృతం యథా॥8609॥
ఆ దివ్యప్రభువు సర్వవ్యాపకుడు. కనుక, ఆయనకు బహిరంతరములు లేవు. అతడు సృష్టికి పూర్వమునందును, అనంతరముగూడ శాశ్వతుడై యుండును. అతడు జగత్తునకు పూర్వాపరములయందును బాహ్యాంతరములయందును ప్రవర్తించుచుండును. వేయేల అతడు జగత్స్వరూపుడు, అవ్యక్థుడు, ఇంద్రియములకు గోచరముకానివాడు, చూచుటకు మనుష్యరూపమున తేజరిల్లు చుండెడివాడు. అట్టి పరమాత్మను తన కుమారునిగా భావించి, ఆ యశోదమ్మ అతనిని సాధారణ బాలకునివలె తలంచి, త్రాడుతో రోటికి కట్టివేయజూచెను.
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి తొమ్మిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
దశమస్కంధము - పూర్వార్ధము - తొమ్మిదవ అధ్యాయము
యశోదమ్మ చిలిపికృష్ణుని రోటికి కట్టివేయుట
ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
9.15 (పదునైదవ శ్లోకము)
తద్దామ బధ్యమానస్య స్వార్భకస్య కృతాగసః|
ద్వ్యంగులోనమభూత్తేన సందధేఽన్యచ్చ గోపికా॥8610॥
9.16 (పదునారవ శ్లోకము)
యదాఽఽసీత్తదపి న్యూనం తేనాన్యదపి సందధే|
తదపి ద్వ్యంగులం న్యూనం యద్యదాదత్త బంధనమ్॥8611॥
9.17 (పదునేడవ శ్లోకము)
ఏవం స్వగేహదామాని యశోదా సందధత్యపి|
గోపీనాం సుస్మయంతీనాం స్మయంతీ విస్మితాఽభవత్॥8612॥
అప్పుడు యశోదామాత చిలిపిచేష్టలొనర్చిన తన కుమారుని ఒక త్రాడుతో బంధించుటకై ప్రయత్నించెను. కాని, ఆ త్రాడు రెండు అంగుళములమేర తక్కువకాగా, ఆమె మరియొక త్రాడును దానికి జతపరచెను. అదియును ఆ బుడుతడిని బంధించుటకు రెండు అంగుళములు తక్కువగుటతో, ఆ తల్లి దానికిని మరియొక త్రాడును జోడించెను. ఇట్లు ఎన్నెన్ని త్రాళ్ళు కూర్చినను రెండు అంగుళములమేర తక్కువ అగుచునేయుండెను😀😀😀 ఈ విధముగా ఇంటిలోగల అన్ని త్రాళ్ళను దెచ్చి ముడివేసినను ఆ స్వామిని బంధింపలేకపోయెను. ఆ యశోదాదేవి పరిస్థితిని జూచి గోపికలు అందరును ముసిముసినవ్వులు నవ్వసాగిరి. అంతట యశోదయు నవ్వుకొనుచు ఆశ్చర్యమునకు లోనయ్యెను. ముజ్జగములను తనలో నిల్పికొనిన ఆ బుజ్జి బొజ్జను కట్టివేయుటకు ఎవరికి తరమగును? భక్తికి కట్టుబడతాడాయన. ప్రేమకు బంధింపబడతాడు ఆ పరమాత్మ.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
వచనము
ఇట్లు గ్రద్దన నా ముద్దియ ముద్దులపట్టి యుదరంబు గట్ట నడరుచుఁ జతురంబుగఁ జక్క నొక్కత్రాడు చుట్టిన నది రెండంగుళంబులు కడమపడియె; మఱియు నొక్క బంధనంబు సంధించి వలగొనిన నంతియ కొఱంత యయ్యె; వెండియు నొక్కపాశంబు గూర్చి పరివేష్టించిన వెల్తిఁ జూపె; నిట్లు.
భావం
ఇలా తన ముద్దుల కొడుకును కట్టటానికి ఒక త్రాడు తెచ్చి నడుం చుట్టూ చుట్టబోయింది. అది 2 అంగుళాలు తక్కువైంది. మరో త్రాడు జతచేసినా అదే 2 అంగుళాలు తక్కువైంది. మరొక్క త్రాడు ముడేసినా అంతే తక్కువైంది. ఇలా....
9.18 (పదునెనిమిదవ శ్లోకము)
స్వమాతుః స్విన్నగాత్రాయా విస్రస్తకబరస్రజః|
దృష్ట్వా పరిశ్రమం కృష్ణః కృపయాఽఽసీత్స్వబంధనే॥8613॥
అంతట శ్రీకృష్ణుడు తనను త్రాడుతో బంధించుటకై ప్రయాసపడుచున్న తన తల్లిని చూచెను. ఆమె ఒళ్ళంతయు చెమట బిందువులతో తడిసిపోవుచుండెను. ఆమె కొప్ఫు ముడివీడి అందలి పూలమాలలు జారిపోవుచుండెను. అప్ఫుడు ఆ స్వామి తన తల్లిపై జాలిపడుచు స్వయముగా కట్టువడెను. యశోదామాత వాత్సల్యమునకు వశుడై శ్రీకృష్ణుడు స్వయంగా తల్లి తెచ్చిన త్రాడుకు కట్టుపడెను 🙏🙏🙏ఓం నమో భగవతే వాసుదేవాయ అందుచే నాటినుండి ఆ పరమాత్మ దామోదరుడు అయినాడు.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
బమ్మెర పోతనామాత్యులవారి పద్యరత్నములు
కంద పద్యము
బంధవిమోచనుఁ డీశుఁడు
బంధింపఁ బెనంగు జనని పాటోర్చి సుహృ
ద్బంధుఁడు గావున జననీ
బంధంబునఁ గట్టుబడియెఁ బాటించి నృపా!
భావం
ఓ పరీక్షిన్మహారాజా! భగవంతుడు, భవబంధాలను తొలగించి మోక్షాన్ని ప్రసాదించేవాడు అయిన కృష్ణబాలుడు కన్నతల్లి కష్టం చూడలేక అలా త్రాడుకి కట్టుపడిపోయాడు; అతడు ఆప్తులైన వారికి ఆత్మబంధువు గదా!
9.19 (పందొమ్మిదవ శ్లోకము)
ఏవం సందర్శితా హ్యంగ హరిణా భృత్యవశ్యతా|
స్వవశేనాపి కృష్ణేన యస్యేదం సేశ్వరం వశే॥8614॥
మహారాజా! శ్రీకృష్ణుపరమాత్మ పరమ స్వతంత్రుడు, బ్రహ్మ, శివుడు, ఇంద్రుడు మొదలగు దేవతలతో గూడిన ఈ జగత్తు అంతయును ఆయన వశములోనుండును. ఐనను యశోదమ్మకు కట్టువడి, స్వతంత్రుడైన ఆ స్వామి "తాను భక్తపరాధీనుడు" అని తన భక్తపరాధీనతను లోకమునకు వెల్లడించెను
9.20 (ఇరువదియవ శ్లోకము)
నేమం విరించో న భవో న శ్రీరప్యంగ సంశ్రయా|
ప్రసాదం లేభిరే గోపీ యత్తత్ప్రాప విముక్తిదాత్॥8615॥
కైలాసనాథుడైన పరమశివుడు శ్రీహరికి పరమ మిత్రుడు, నిత్యానపాయినియైన (ఎల్లప్పుడును ఆ స్వామియొక్క వక్షస్థలమును ఆశ్రయించుకొని యుండెడి) లక్ష్మీదేవి ఆ ప్రభువుయొక్క అర్ధాంగి, సృష్టికర్తయైన బ్రహ్మదేవుడు ఆయన తనయుడు. వారెవ్వరు నోచుకొనని రీతిగా గోపాంగనయైన యశోదమ్మ ఆ సర్వేశ్వరుని అనుగ్రహమునకు పాత్రురాలయ్యెను. ఆ తల్లి ఎంతటి ధన్యురాలోగదా!🙏🙏🙏
9.21 (ఇరువది ఒకటవ శ్లోకము)
నాయం సుఖాపో భగవాన్ దేహినాం గోపికాసుతః|
జ్ఞానినాం చాత్మభూతానాం యథా భక్తిమతామిహ॥8616॥
గోపికానందనుడైన (యశోదమ్మ సుతుడైన) శ్రీకృష్ణుడు (శ్రీహరి) అనన్యభక్తులకు సుఖముగా లభించునట్లు, తత్త్వజ్ఞానులకుగాని, పరమమునులకుగాని, మహాదాతలకుగాని, దేహాభిమానులైన కర్మయోగులకుగాని, ఉత్తమోత్తములైన యోగీశ్వరులకుగాని లభ్యుడుగాడు.
9.22 (ఇరువది రెండవ శ్లోకము)
కృష్ణస్తు గృహకృత్యేషు వ్యగ్రాయాం మాతరి ప్రభుః|
అద్రాక్షీదర్జునౌ పూర్వం గుహ్యకౌ …
[02:49, 27/11/2020] +91 95058 13235: శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
736వ నామ మంత్రము
ఓం ముక్తిదాయై నమః
ఆరాధన శాస్త్రీయము, అశాస్త్రీయముల నిమిత్తములతో కాకుండా, కేవలము అంతర్ముఖసాధనతో ఆరాధించిన మాత్రముననే ముక్తిని ప్రసాదించీ జగన్మాతకు నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి ముక్తిదా యను మూడక్షరముల (త్ర్యక్షరీ) నామ మంత్రమును ఓం ముక్తిదాయై నమః అని ఉచ్చరించుచూ, అ జగన్మాతను భక్తిశ్రద్ధలతో నారాధించు సాధకునకు జగన్మాత అనుగ్రహముతో బ్రహ్మజ్ఞానసంపదలు లభించి పునర్జన్మరహితమైన మోక్షమునకు పాత్రుడగును.
జగన్మాతను ముక్తిదా అన్నాము. అంటే ముక్తిని ప్రసాదిస్తుంది. జన్మరాహిత్యమైన ముక్తిని ప్రసాదిస్తుంది. పునరపి జననం, పునరపి మరణం అనే జననమరణచక్రభ్రమణములో చిక్కుకోకుండా కాపాడుతుంది జగన్మాత. అంటే అమ్మవారి అనుగ్రహం సంపాదించుకోవాలి. అంటే ఆరాధించాలి. ఆ ఆరాధన శాస్త్రీయమా, అశాస్త్రీయమా అన్నది ముఖ్యంకాదు. కేవలం అంతర్ముఖంగా ఆతల్లిని మనోనేత్రాలతో హృదయంలోని దహరాకాశంలో వీక్షిస్తూ, సమస్త మోహాలను విడిచిపెట్టి ధ్యానిస్తే లభించేదే ముక్తి. ముక్తి అనేది ముంధుగా అరిషడ్వర్గ విముక్తి. అంటే కామక్రోధలోభమోహమదమాత్సర్యములను జయించడం. అంతే! అంతటితో సాధకునికి సాయుజ్యం లభిస్తుంది. పరబ్రహ్మలో లీనమైపోతాడు. పరబ్రహ్మ స్వరూపుడైపోతాడు. అంతేగాని వేదాలు చదివేసినంత మాత్రాన సువర్ఞఘంటాకంకణ బిరుదాంకితుడైనంత మాత్రాన యజ్ఞయాగాది కర్మలు నిర్వహించినంతమాత్రాన ముక్తి కలుగదు. అరిషడ్వర్గములను తన మనసునుండి పారద్రోలి, ఆత్మజ్ఞానియై, ఇంద్రియాలను బంధించి తన దృష్టిని అంతర్ముఖంచేసి ఆ పరమేశ్వరిని ధ్యానం చేసుకుంటే ఆతల్లి ముక్తిని ప్రసాదిస్తుంది. అందుచేతనే అమ్మవారు ముక్తిదా అను నామ ప్రసిద్ధమైనది.
ఏ వేదంబు పఠించె లూత , భుజగం బే శాస్త్రముల్సూచె దా
నే విద్యాభ్యసనం బొనర్చె గరి , చెంచే మంత్ర మూహించె , బో
ధావిర్భావ నిధానముల్ చదువులయ్యా ? కావు , మీ పాద సం
సేవాసక్తియే కాక జంతుతతికిన్ శ్రీ కాళహస్తీశ్వరా !
ఓ ఈశ్వరా ! జ్ఞాన సముపార్జనకు ప్రాణులకు విద్య అవసరం లేదు. నీ పాదసేవయే సమస్తజ్ఞానమును కల్గించును . ఎట్లనగా నిన్ను సేవించిన సాలెపురుగు ఏ వేదాధ్యయనము చేసి,జ్ఞానమును సముపార్జించినది . నిన్ను సేవించిన సర్పము ఏ శాస్త్రమును చదివినది . నిను పూజించిన ఏనుగు ఏ విద్య నభ్యసించినది . బోయవాడైన తిన్నడు ఏ మంత్రమును చదివి నిన్ను సేవించి ముక్తి పొందినాడు . కావున నీ పాదములను సేవించాలనే కుతూహలమే సమస్త జ్ఞానమును కల్గించును ప్రభూ
జగన్మాత ఆ పరమేశ్వరుని అర్ధాంగియేగదా! పై పద్యము అమ్మవారికి అన్వయించు కుంటే అమ్మవారిని ఆరాధించడానికి ఆచారము శాస్త్రీయమా, అశాస్త్రీయమా అన్నది ప్రక్కనబెట్టి నిర్మలమైన మనస్సుతో ధ్యానిస్తే చాలు ఆ తల్లి ముక్తిప్రదాత అవుతుంది. కాబట్టి ఆ తల్లి ముక్తిదా యని స్తుతిస్తున్నాము.
జగన్మాతకు నమస్కరించునపుడు ఓం ముక్తిదాయై నమః అని అనవలెను.
శ్రీలలితా సహస్రనామ భాష్యము
162వ నామ మంత్రము
ఓం నిర్మోహాయై నమః
స్వస్వరూప విస్మరణ, చిత్తభ్రాంత్యాది అవలక్షణములు లేక, మోహరహితురాలై తేజరిల్లు పరమేశ్వరికి నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి నిర్మోహా యను మూడక్షరముల (త్ర్రక్షరీ) నామమంత్రమును ఓం నిర్మోహాయై నమః అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను అత్యంత భక్తిశ్రద్ధలతో ఉపాసించు సాధకుని ఆ జగన్మాత భౌతికపరమైన మోహపాశములకు దూరముగానుంచి శాశ్వతమైన పరబ్రహ్మతత్త్వమును అన్వేషించు దిశగా నడిపించును.
తల్లిగర్భమునుండి భౌతికప్రపంచములోనికి అడుగిడిన జీవికి మోహము అనేది నిశ్చయముగా ఉంటుంది. విశాలమైన విశ్వంలో అనంతకోటి జీవరాసులు ఉన్నను తను తనవారు, వారితోటే తను అని ఒక పరిధికి లోబడి ఉండడం జరుగుతుంది.తన తల్లి తను, తనకు తన జీవితభాగస్వామి, తన బిడ్డలు, తన సంసారము ఇవన్నీకూడా మోహమునకు సాక్ష్యములే. ఈ లోకంలోకి వచ్చినది తాను మాత్రమే. మళ్ళీ నిష్క్రమించునది కూడా తను మాత్రమే. ఈ మధ్యనే ఈ బంధాలు. జగమే మాయ అనుకుంటే ఈ బంధాలు ఆ మాయ వలన ఏర్పడిన మోహాము వలననే. ఇది శరీరధారులకు మాత్రమే. ఆత్మకు కాదు. పరమాత్మస్వరూపిణీయైన జగన్మాత ఈ మోహమునకు అతీతురాలు. అందుకే ఆ తల్లిని నిర్మోహా యని అన్నాము. మోహము అనగా భ్రాంతి, అజ్ఞానము. అరిషడ్వర్గములలో ఒకటి. కామము (కోరిక) వలన మనసులో మోహం ఉద్భవిస్తుంది. అప్పుడు పురుషార్ధములు ధర్మబద్ధముగా నిర్వహింపబడితాయి కాని మోహము మాత్రము అధర్మయుతంగా నిర్వహింపబడుతుంది. అనగా జ్ఞానం నశించి భ్రాంతిలో మునిగిపోవడం జరుగుతుంది. పుట్టినప్పుడు జానెడు నేలపై పవళిస్తే గిట్టినఫుడు ఆరడగులు పొడవు, మూడడుగుల వెడల్పుగల నేలకావాలి. కాల్చడానికైనా, కప్ఫెట్టడానికైనా. ఎకరాల ఎకరాల భూమికొనేసి భూస్వామినైపోవాలనే కామము (కోరిక) జనిస్తుంది. అందుకు అధర్మంగానైనా కబ్జాలుచేసైనా ఆక్రమించేయాలని కోరిక జనిస్తుంది. అధర్మం వలన అజ్ఞానం తనలో పేరుకుపోతుంది. కారణం అరిషడ్వర్గాలు మనసును ఆవహించాయి. అరిషడ్వర్గాలలో (కామ,క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు) మోహం ఉందిగదా. ఇది మనసుకు సంబంధించినది గదా. ఆత్మకు సంబంధించినది కానేకాదు. శ్రీమాత ఆత్మలకు పరమాత్మ. ఆతల్లి అరిషడ్వర్గాలకు అతీతురాలు గనుక అమ్మవారిని నిర్మోహా అని యన్నాము. అనడమేమిటి? ఓం నిర్మోహాయై నమః అంటూ స్తుతిస్తూ పూజించుచున్నాము. ఇది ఒక నామ మంత్రము. ఈ నామ మంత్రముతో సాధకుడు ఆ పరమేశ్వరిని ఆరాధిస్తే జ్ఞానం లభిస్తుంది. ఆ లభించిన జ్ఞానంతో అరిషడ్వర్గాలను జయించుతాడు. తద్వారా మోహాన్ని జయిస్తాడు. జగన్మాతకు నమస్కారం చేయునపుడు ఓం నిర్మోహాయై నమః అని అంటే చాలు మోహాన్ని జయించవచ్చును.
వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం
దశమస్కంధము - పూర్వార్ధము - పదియవ అధ్యాయము
నలకూబర, మణిగ్రీవులకు శాపవిమోచనము
ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
రాజోవాచ
10.1 (ప్రథమశ్లోకము)
కథ్యతాం భగవన్నేతత్తయోః శాపస్య కారణమ్|
యత్తద్విగర్హితం కర్మ యేన వా దేవర్షేస్తమః॥8619॥
పరీక్షిన్మహారాజు నుడివెను పూజ్య శుకయోగీ! నారదుడు ఆ యక్షకుమారులను ఏల శపించెను? భాగవతోత్తముడైన ఆ దేవర్షి కుపితుడగుటకు వారొనర్చిన అపచారమేమి?
శ్రీశుక ఉవాచ
10.2 (రెండవ శ్లోకము)
రుద్రస్యానుచరౌ భూత్వా సుదృప్తౌ ధనదాత్మజౌ|
కైలాసోపవనే రమ్యే మందాకిన్యాం మదోత్కటౌ॥8620॥
10.3 (మూడవ శ్లోకము)
వారుణీం మదిరాం పీత్వా మదాఘూర్ణితలోచనౌ|
స్త్రీజనైరనుగాయద్భిశ్చేరతుః పుష్పితే వనే॥8621॥
శ్రీశుకుడు వచించెను ధనాధిపతియగు కుబేరుని యొక్క కుమారులైన నలకూబరమణిగ్రీవులు సహజముగా శంకరుని సేవకులు. కాని, వారు ధనము, సౌందర్యము మొదలగువాని ప్రభావముతో మిగుల గర్వోన్మత్తులై, కైలాసమునందలి ఉపవనమున మందాకిని నదియందు స్వేచ్ఛగా క్రీడించుచుండిరి. వారు అతిగా మదిరాపానము చేసియుండుటచే ఉచితానుచితములను మరచి కన్నుగానక యుండిరి. యువతీమణులతో ఆ ఇరువురును గానాలాపమొనర్చుచు, పుష్పవనమునందు విహరించుచుండిరి.
10.4 (రెండవ శ్లోకము)
అంతః ప్రవిశ్య గంగాయామంభోజవనరాజిని|
చిక్రీడతుర్యువతిభిర్గజావివ కరేణుభిః॥8622॥
వారు కమలములతో నిండియున్న గంగాజలములలో ప్రవేశించిరి. అందు ఆడు ఏనుగులతో కూడిన మదగజములవలె, వారు తరుణీమణులతో జేరి క్రీడించుచుండిరి.
10.5 (రెండవ శ్లోకము)
యదృచ్ఛయా చ దేవర్షిర్భగవాంస్తత్ర కౌరవ|
అపశ్యన్నారదో దేవౌ క్షీబాణౌ సమబుధ్యత॥8623॥
పరీక్షిన్మహారాజా! పూజ్యుడగు దేవర్షియైన నారదమహాముని అటుగా వెళ్ళుచు ఆ యక్షకుమారులను జూచెను. వారు సురాపానముచే మత్తిల్లి యుండుటను ఆ మహర్షి గమనించెను.
10.6 (ఆరవ శ్లోకము)
తం దృష్ట్వా వ్రీడితా దేవ్యో వివస్త్రాః శాపశంకితాః|
వాసాంసి పర్యధుః శీఘ్రం వివస్త్రౌ నైవ గుహ్యకౌ॥8624॥
అప్ఫుడు వివస్త్రలై యున్న ఆ యువతులు మహర్షిని చూచినంతనే సిగ్గుపడుచు, ఆయన తమను శపించునేమోయని శంకించి, వెంటనే వస్త్రములను ధరించిరి. కాని, ఆ కుబేరపుత్రులు మాత్రము మత్తిల్లియుండుటవలన వస్త్రములను ధరించనేలేదు.
10.7 (ఏడవ శ్లోకము)
తౌ దృష్ట్వా మదిరామత్తౌ శ్రీమదాంధౌ సురాత్మజౌ|
తయోరనుగ్రహార్థాయ శాపం దాస్యన్నిదం జగౌ॥8625॥
అంతట నారదమహాముని వారిని జూచి, 'ఈ యక్షకుమారులు ధనబలముచే, గర్వోన్మత్తులై యున్నారు. అంతేగాక, మదిరాపానముచే తెలివిదప్పియున్నారు' అని తలంచెను. పిమ్మట ఆ దేవర్షి వారిని అనుగ్రహింపదలచి శపించుచు ఇట్లు పలికెను.
మదనాశరూపానుగ్రహార్థం - భవిష్యద్భగవద్దర్శనరూప ప్రయోజనాయ చ| (వీరరాఘవీయ వ్యాఖ్య)
ఒక్కొక్కప్పుడు మహాత్ముల శాపములుగూడ పరమప్రయోజనములనే గూర్చుచుండును. దేవర్షియైన నారదుడు శపించుటలో రెండు కారణములు గలవు. 1) ఆ యక్షకుమారుల గర్వములను రూపుమాపుట, 2) శ్రీకృష్ణభగవానుని దర్శనప్రాప్తి - తత్ప్రభావమున శాపవిముక్తి. మహాకవి కాళిదాసుగూడ రఘువంశ మహాకావ్యమున దశరథునినోట ఈ భావములనే ప్రకటించెను.
శ్లో. శాపోఽప్యదృష్ట తనయాననపద్మశోభే సాఽనుగ్రహో భగవతామయి పాతితోఽయమ్...
'నీవును పుత్రశోకముతో మరణింతువుగాక - అను మునిశాపమునకు గురియైన దశరథమహారాజు ఇట్లు నుడివెను-
'ఇంత వరకును నాకు పుత్రుని ముఖారవిందమును చూచెడి అదృష్టము పట్టలేదు. ఈ శాపము నాకు పుత్రప్రాప్తి కలుగునని' సూచించుచున్నది. కనుక 'మహాత్మా! నీవు ఇచ్చిన శాపముగూడ నాకు శుభదాయకమే అగుచున్నది'.
నారద ఉవాచ
10.8 (ఎనిమిదవ శ్లోకము)
న హ్యన్యో జుషతో జోష్యాన్ బుద్ధిభ్రంశో రజోగుణః|
శ్రీమదాదాభిజాత్యాదిర్యత్ర స్త్రీ ద్యూతమాసవః॥8626॥
నారదుడు ఇట్లు వచించెను - సుఖలోలుడైన పురుషునకు అభిజాత్యము, విద్యలు మున్నగువాటివలన గర్వము ఏర్పడినను దాని (ఆ గర్వ) ప్రభావమున అతని బుద్ధి దెబ్బతినును. అట్టి సుఖలోలునకు సంపదలున్నచో, ఆ ధనగర్వము వలన రజోగుణ కార్యములైన కామక్రోధాదులు వృద్ధిచెంది, అతని బుద్ధి పూర్తిగా భ్రష్టమగును. ధనగర్వము మిక్కిలి ప్రమాదకరమైనది. ఏలనస, ధనగర్వకారణముగా స్త్రీలౌల్యము, జూదవ్యసనము, మద్యపానము మొదలగునవి వచ్చిపడును.
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి పదియవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం
7702090319, 9505813235
[21:46, 27/11/2020] +91 95058 13235: 27.11.2020 సాయం కాల సందేశము
వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం
దశమస్కంధము - పూర్వార్ధము - పదియవ అధ్యాయము
నలకూబర, మణిగ్రీవులకు శాపవిమోచనము
ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
10.9 (తొమ్మిదవ శ్లోకము)
హన్యంతే పశవో యత్ర నిర్దయైరజితాత్మభిః|
మన్యమానైరిమం దేహమజరామృత్యు నశ్వరమ్॥8627॥
ఐశ్వర్యమదాంధులు ఇంద్రియములకు వశులు (ఇంద్రియసుఖలోలురు) అగుదురు. అట్టివారు నశ్వరములైన తమ దేహములు జరామరణరహితములని (శాశ్వతములని) భావించి, విచక్షణను కోల్పోయి, క్రూరాత్ములై ఇతర ప్రాణులను హింసించుచుందురు.
10.10 (పదియవ శ్లోకము)
దేవసంజ్ఞితమప్యంతే కృమివిడ్భస్మసంజ్ఞితమ్|
భూతధ్రుక్ తత్కృతే స్వార్థం కిం వేద నిరయో యతః॥8628॥
మానవుడు దేహాభిమానియై, 'నేను భూసురుడను, నరపతిని (మహారాజును), దేవుడను (దివ్యశక్తి సంపన్నుడను) అని గర్వించును. కాని, కడకు మరణించిన పిమ్మట అతని దేహము పురుగులకును, పశుపక్ష్యాదులకును ఆహారమగును (క్రిమికీటకాదుల పాలగును). దహింపబడినచో బుగ్గియై పోవును. అట్టి మానవుడు తనకు ఏది హితమో (శ్రేయస్కరమో), ఏది అహితమో (శ్రేయస్కరము కాదో) తెలియక స్వార్థముతో ప్రాణులకు ద్రోహమును తలపెట్టును. అట్టివానికి చివరకు నరకయాతనలు (దుర్గతులు) తప్పవు.
10.11 (పదకొండవ శ్లోకము)
దేహః కిమన్నదాతుః స్వం నిషేక్తుర్మాతురేవ చ|
మాతుః పితుర్వా బలినః క్రేతురగ్నేః శునోఽపి వా॥8629॥
ఈ దేహము ఎవరిది? గర్భాధానమునకు కారకుడైన తండ్రిదా? తన కడుపున నవమాసములు మోసి కన్నట్టి తల్లిదా? తండ్రినిగన్న పితామహి-పితామహులదా? తల్లినిగన్న మాతామహి - మాతామహులదా? అన్నపానములను ఇచ్చి పోషించినవానిదా? జీవనభృతిని కలిగించి పనిచేయించుకొనిన అధికారిదా? వెలగట్టి కొన్న వానిదా? మృతిచెందిన పిమ్మట దహించివేసిన అగ్నిదా? లేక ఈ దేహమును తినుటకు ఆశించి కాచుకొనియున్న కుక్కలు, నక్కలు మొదలకు పశుపక్ష్యాదులదా? వాస్తవముగా ఈ దేహము ఎవరిది?
10.12 (పండ్రెండవ శ్లోకము)
ఏవం సాధారణం దేహమవ్యక్తప్రభవాప్యయమ్|
కో విద్వానాత్మసాత్కృత్వా హంతి జంతూన్ ఋతేఽసతః॥8630॥
యథార్థముగా ఈ దేహము ప్రకృతినుండి (పంచమహా భూతములనుండి) ఉత్పన్నమైనట్టిది. చివరకు ప్రకృతియందే లయమగునట్టిది. అశాశ్వతమైన ఈ దేహమును ఆత్మగా భావించి, దానికొఱకై ఇతరులను హింసించునట్టివాడు మూర్ఖుడు. జ్ఞానియైనవాడు అట్లు చేయడు.
10.13 (పదమూడవ శ్లోకము)
అసతః శ్రీమదాంధస్య దారిద్ర్యం పరమంజనమ్|
ఆత్మౌపమ్యేన భూతాని దరిద్రః పరమీక్షతే॥8631॥
ధనమదాంధుడైన మూర్ఖునకు కనువిప్పు కలుగుటకై దారిద్ర్యమే పరమౌషధము (దారిద్ర్యము ప్రాప్తించినచో అతని ధనగర్వము నశించును). దరిద్రుడైనవాడు సకల ప్రాణులను తనతో సమానముగా చూచుకొనును (అతడు ఇతరుల కష్టనష్టములను తనవిగా భావించి, వారికి ఎట్టి హానినీ తలపెట్టడు).
10.13 (పదమూడవ శ్లోకము)
యథా కంటకవిద్ధాంగో జంతోర్నేచ్ఛతి తాం వ్యథామ్|
జీవసామ్యం గతో లింగైర్న తథాఽఽవిద్ధకంటకః॥8632॥
ముండ్ల (కంటకముల) బాధకు గుఱియైనవాడు ఆ బాధ ఇతరులెవ్వరికిని కలుగుటకు ఇష్టపడడు. ఏలయన, తాసు ముండ్లబాధను అనుభవించి యున్నందున, ఇతరులకు ఆ బాధ ప్రాప్తించినచో ఎంతగా దుఃఖము కలుగునో అతడు ఎఱుగును. దానిని అనుభవింపనివానికి ఆ బాధతెలియదు.
10.15 (పదునైదవ శ్లోకము)
దరిద్రో నిరహంస్తంభో ముక్తః సర్వమదైరిహ|
కృచ్ఛ్రం యదృచ్ఛయాఽఽప్నోతి తద్ధి తస్య పరం తపః॥8633॥
దరిద్రునకు ఎట్టి అహంకారమూ, గర్వమూ ఉండవు. అందువలన అతడు అన్నివిధములైన గర్వములనుండియు (అభిజాత్యము, ధనము,, విద్య మొదలగువానివలన కలిగిన గర్వములనుండియు) విముక్తుడగును. విధివశమున ప్రాప్తించిన కష్టములే అతనిలో మార్పును తీసికొనివచ్చును. కనుక, ఆ కష్టములే అతని పాలిట తపస్సులగును.
10.16 (పదునారవ శ్లోకము)
నిత్యం క్షుత్క్షామదేహస్య దరిద్రస్యాన్నకాంక్షిణః|
ఇంద్రియాణ్యనుశుష్యంతి హింసాఽపి వినివర్తతే॥8634॥
దరిద్రుడు నిత్యము అన్నపానములకొరకై ఆరాటపడుచుండును. అందువలన అతని దేహము శుష్కించును. ఇంద్రియములు పటుత్వములను కోల్పోవుటచే అతడు ఎట్టి సుఖభోగములను ఆశింపడు. ఆ కారణముగా అతనిలో ఎట్టి హింసాప్రవృత్తియు ఉండదు.
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి పదియవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం
7702090319, 9505813235
[02:45, 28/11/2020] +91 95058 13235: శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
737వ నామ మంత్రము
ఓం ముక్తి రూపిణ్యై నమః
ఇంద్రియములను మనస్సునందు, మనస్సును బుద్ధియందు, బుద్ధిని ముఖ్యప్రాణమునందు లయంచేయు తురీయస్థితియే ముక్తి. తురీయాతీతస్థితి కూడా ఇదియే. అట్టి ముక్తిస్వరూపిణియైన తల్లికి నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి ముక్తిరూపిణీ యను ఐదక్షరముల (పంచాక్షరీ) నామ మంత్రమును ఓం ముక్తిరూపిణ్యై నమః అని ఉచ్చరించుచూ, అత్యంతభక్తి శ్రద్ధలతో ఆ పరమేశ్వరిని ఆరాధించు సాధకుడు అన్ని విధములైన అజ్ఞాన సంబంధిత వికారములనుండి విముక్తుడై, సదా పరబ్రహ్మతత్త్వాన్వేషణలో నిమగ్నుడై జీవించి, పరబ్రహ్మజ్ఞానసిద్ధి కలిగి తరించును.
జగన్మాత ముక్తి స్వరూపిణి. నిరంతర ధ్యాన సమాధిలో ఆ జగన్మాతను తన హృదయమందు దహరాకాశంలో జ్ఞాన నేత్రంతో వీక్షిస్తే జ్ఞానమే పరమేశ్వరి రూపంగా గోచరిస్తుంధి. అంటే సాధకునికి జ్ఞానోదయం కలిగిందన్నమాట. ధ్యానదీక్షలో ఇంద్రియాలను మనస్సులోను, మనస్సును బుద్ధియందు, బుద్ధిని ముఖ్యప్రాణంలోను లయంచేయడమే ముక్తి యనబడుతుంది.
జగన్మాత ముక్తి ప్రసాదిస్తుంది అని అన్నాము. అంతేకాదు ఆ తల్లి ముక్తిస్వరూపిణి కూడా. మనలోని అజ్ఞానమునకు విముక్తి కలిగిస్తుంది. తద్వారా అరిషడ్వర్గ విముక్తి లభిస్తుంది. అట్టి పరిస్థితిలో స్వస్వరూపజ్ఞానము కలుగుతుంది. స్వస్వరూపజ్ఞానం ఎప్పుడు లభిస్తుందో ముక్తి లభించినట్లే. అజ్ఞానాన్ని తొలగించేది జ్ఞానమైతే, ఆ జ్ఞానస్వరూపిణి జగన్మాత. జ్ఞానస్వరూపిణి అంటే ఆతల్లి ముక్తి స్వరూపిణియని అనబడుతుంది.
మనిషి పుట్టినదే బంధములతో. మొదటి బంధం ప్రేగుబంధం. అదే ప్రేగు బంధంతో తల్లి,బిడ్డలకు ఒకరిపై ఒకరికి మోహం ఉంటుంది. ఎందుకంటే తల్లి దేహంలోంచి ఆ బిడ్డదేహం వచ్చింది గనుక. అంటే మోహం అనేది దేహానికి సంబంధించినది. ఆ బిడ్డ తల్లిగర్భంలోనికి రావడానికి తండ్రి దేహం కారణం. అంటే తల్లిదండ్రులకు బిడ్డకు ప్రేగుబంధం, దేహబంధం. ఆ బంధం భగవంతుడు మోహబంధంగా ఏర్పరచాడు. ఆ మోహబంధం లేకపోతే తండ్రి బిడ్డ యోగక్షేమములు చూడలేడు. ఇక తల్లి అయితే అది ప్రేగుబంధమే. ఆకలికి బిడ్డఏడిస్తే తల్లి తల్లడిల్లిపోతుంది. ఎన్ని పనులున్నా అన్నీ ప్రక్కన ఉంచి స్తన్యమిస్తుంది. లాలపోస్తుంది. అందంగా కాటుక, బొట్టు పెడుతుంది. అన్నిటికీ మించి ఆ బిడ్డకు దృష్టిదోషం తగలకుండా బుగ్గచుక్కపెడుతుంది. ఇదే మోహం అంటే. ఆ బిడ్డపెరగడం, యోగ్యతసాధించడం, పెళ్ళి, మళ్ళీ అదే మోహపాశం. ఇది జీవనభ్రమణం. ఈ పాశములనుండి ఒకేసారి ముక్తికోరడం అంటే అది అధర్మం. కనుక ధ్యానించిన ఆ ఒక్కనిముషం ఈ బంధములను తలంపులోనికి రానీయక ఉంచడమే ముక్తి. అది జన్మరాహిత్య ముక్తికి మొదటిసోపానం. తాను సంసారంలో ఉండవచ్చు. తనలో సంసారం ఉండకూడదు అంటే పరమాత్మయందు ధ్యానం సమయంలో పరమాత్మయే మనోనేత్రాలలో ఉండాలి. ఇలా సాధకుడిని అనుగ్రహిస్తుంది ముక్తిరూపిణియైన జగన్మాత. వానప్రస్థంలో ఈ బంధాలనుండి విమక్తిని కలిగించి కేవలం పరమాత్మయందే ధ్యానం ఉండడమనేది కూడా జగన్మాత ముక్తిస్వరూపిణిగా అనుగ్రహిస్తుంది. ఇలా సాధకునికి ఏ వేళ ఏముక్తి కావాలో ప్రసాదించి, పరబ్రహ్మతత్త్వాన్ని అన్వేషించడంలో సరైన మార్గాన్ని మూక్తిస్వరూపిణిగా జగన్మాత అనుగ్రహిస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే సాధకుని కళ్ళఎదుట స్థూలరూపంలోనున్న జగన్మాత మూర్తి (విగ్రహము లేదా చిత్తరువు) యే ముక్తిరూపిణి.
అటువంటి ముక్తిరూపిణియైన జగన్మాతకు నమస్కరించునపుడు ఓం ముక్తిరూపిణ్యై నమః అని అనవలెను.
శ్రీలలితా సహస్రనామ భాష్యము
163వ నామ మంత్రము
ఓం మోహనాశిన్యై నమః
సకల లోకములు తన స్వరూపములై, ఎంతటి దుర్ఘటనకూ చలింపక (మోహరహితురాలై), సాధకునిలో అజ్ఞానముచే గలిగిన శోకమునుగూడ నశింపజేయు (మోహరహితులను జేయు) తల్లికి నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి మోహనాశినీ యను ఐదక్షరముల (పంచాక్షరీ) నామ మంత్రమును ఓం మోహనాశిన్యై నమః అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను భక్తిశ్రద్ధలతో ఆరాధించు భక్తులకు వారిలో గల రాగద్వేషములను తొలగించి, సుఖదుఃఖములు రెండిటినీ సమభావనతో ఆస్వాదిస్తూ, నిత్యమైన, సత్యమైన ఆత్మానందాన్ని అనుభవింపజేయును.
అరిషడ్వర్గములు అనునవి మానసిక సంఘర్షణకు సంబంధించినవి. ఆత్మకు సంబంధించినవి కావు. జ్ఞానస్వరూపిణి అయిన పరమాత్మకు మోహము, దుఃఖము వంటి మానసిక సంబంధమైన వికారములు ఉండవు. తననాశ్రయించిన భక్తులలో ప్రప్రథమంగా వారిలో ఉన్న సమస్త దుఃఖములకు హేతువైన మోహమును తొలగిస్తుంది. తరువాతనే తనభక్తులకు పరబ్రహ్మతత్త్వమును అన్వేషించుటకు కావలసిన సాధనపై దృష్టిని నిలుపుకొనే ఏకాగ్రతను ప్రసాదిస్తుంది. అరిషడ్వర్గములలో అత్యంత ప్రమాదకరమైన మోహమును సాధకునిలో సమూలంగా నాశనంజేస్తుంది కనుకనే ఆ తల్లి మోహనాశినీ యను నామ ప్రసిద్ధమైనది.
మహాభారతయుద్ధము ప్రారంభమైనది. అర్జునునికి రథసారథి శ్రీకృష్ణుడు. రథమును పార్థసారథి కురుసైన్యములదిశగా పోనిచ్చాడు. కురుసైన్యంలో తనగురువు ద్రోణుడు, తాత భీష్ముడు, తన సోదరులు దుర్యోధనుడు, దుశ్శాశనుడు మొదలైనవారు కనిపించారు. అంతా తనవాళ్ళే. వారితోనే యుద్ధంచేయాలి. వారినే చంపాలి. అంతా తనవాళ్ళే. తన గురువులు, తన బంధువులు...వీరినా నేను చంపాలి. అను మోహము ఒక్కసారి అర్జునిణ్ణి ఆవహించింది. తనవారే కదా అనే భ్రాంతి కలుగజేసింది అతనిలోనున్న మోహపాశం. అంతే రథం దిగిపోయాడు. అస్త్రాలను ప్రక్కనపెట్టేశాడు. యుద్ధముచేయలేనని దిగాలుగా కూర్చుండిపోయాడు. భగవానుఢు కృష్ణపరమాత్మ తన విరాట్స్వరూపాన్ని చూపించాడు (విశ్వరూపం ప్రదర్శించాడు) గీతోపదేశం చేశాడు. అర్జునునిలోనున్న మోహాన్ని పారద్రోలాడు.. అర్జునుడు తనకర్తవ్యాన్ని తాను నిర్వహించాడు. మోహం సర్వనాశనకారి అన్న సత్యం తెలుసుకున్నాడు.
శ్రీకాళహస్తీశ్వర శతకంలో ధూర్జటిమహాకవి పద్యంలో ఈ మోహమనే సముద్రంలో జీవుడు కొట్టుమిట్టాడుతూ పరమాత్మను తలవలేకపోతున్నాడని బాధపడతాడు. అందుకు ఆ మహాకవి ఆ పరమేశ్వరునితో ఏమని మొరపెట్టుకున్నాడో పరిశీలిద్దాము:-
శార్ధూలము
అంతా మిథ్య తలంచి చూచిన
......నరుండట్లౌ టెరింగిన్ సదా
కాంతల్ పుత్రులు నర్థముల్ తనువు
......నిక్కంబంచు మోహార్ణవ
భ్రాంతింజెంది చరించుగాని,
......పరమార్థంబైన నీయందు దా
జింతాకంతయు జింత నిల్పడు
......గదా, శ్రీకాళహస్తీశ్వరా!
భావం
ఆలోచించినచో ఈ జగతత్తంతయును మాయయేగదా! మానవు డా సంగతి తెలిసియుండియు, భార్యయు, పుత్రులు, ధనములు, తన శరీరము అన్నియు శాశ్వతములని భావించి మోహమునొందుచు, జీవనమునకు పరమార్థభూతుడైన నిన్ను మనసులో ఒక్క నిమిషమైనను ధ్యానించడు గదా! ఎంత అజ్ఞానము!
అంటే ఈ అజ్ఞానంతో కొట్టుమిట్టాడుతూ ఉన్నట్టుండి ఈ బంధాలను త్రెంచుకోవాలా? కాదు. చింతాకంతయు నైనను ఆ పరమాత్మను ధ్యానించాలి. ఆ ధ్యానంలో ఈ మోహాన్ని విస్మరించాలని ధూర్జటిమహాకవి భావన. ఆ పరమేశ్వరి పాదచింతన మాత్రమే ఆ సమయంలో ఉంటే ఆ తల్లి ఈ మోహబంధాలను క్రమంగా తప్పించి జన్మరాహిత్యమైన ముక్తిని ప్రసాదిస్తుంది. అందుచేతనే ఆ పరమేశ్వరి మోహనాశినీ అను నామముతో స్తుతిస్తున్నాము.
పరబ్రహ్మమనేది ఒకటే ఉన్నది. రెండవ మాటలేదు. అలా ద్వీతీయమనునది ఉన్నది అంటే అది అజ్ఞానము. అది ద్వైతభావన. అట్టిద్వైత భావనను లేకుండా చేయుటయే మనలోని మోహమును నాశనము చేయుట. జగన్మాత ద్వైతభావనను లేకుండా చేసి (మోహమును నాశనముచేసి), అద్వైతమును తెలియగల జ్ఞానమును కలుగజేస్తుంది గనుక ఆ పరమాత్మస్వరూపిణి అయిన జగన్మాతను మోహనాశినీ అని స్తుతిస్తున్నాము.
జగన్మాతకు నమస్కరించునపుడు ఓం మోహనాశిన్యై నమః అని అనవలెను.
దశమస్కంధము - పూర్వార్ధము - పదియవ అధ్యాయము
నలకూబర, మణిగ్రీవులకు శాపవిమోచనము
ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
10.17 (పదిహేడవ శ్లోకము)
దరిద్రస్యైవ యుజ్యంతే సాధవః సమదర్శినః|
సద్భిః క్షిణోతి తం తర్షం తత ఆరాద్విశుద్ధ్యతి॥8635॥
సమదర్శనులైన (సకలప్రాణులను తనతో సమానముగ చూచునట్టి) సాధుపురుషులతోడి సాంగత్యము దరిద్రునకు (నిర్ధనునకు) సులభముగా ఏర్పడును. ఏలయన అతనికి భోగజీవితము అంతకుముందే దూరమైనది. ఒకవేళ అతనిలో భోగలాలస (తృష్ణ) ఏమాత్రము మిగిలియున్నను సత్పురుషుల సాంగత్యప్రభావమున అది పూర్తిగా తొలగిపోవును. అతని అంతఃకరణము శీఘ్రముగా పరిశుద్ధమగును.
ధనవంతునకు ధనము, ధనగర్వము, ధనతృష్ణ అను మూడును ఉండును. దరిద్రునకు ధనము ఉండదు. అందువలన ధనగర్వము ఉండదు. కాని అతనిలో ధనతృష్ణ ఉండవచ్చును. సత్పురుషుల సాంగత్యముతో ఆ తృష్ణయు నశించును. తత్ఫలితముగా అతనికి శీఘ్రముగా శుభములు చేకూరును
10.18 (పదునెనిమిదవ శ్లోకము)
సాధూనాం సమచిత్తానాం ముకుందచరణైషిణామ్|
ఉపేక్ష్యైః కిం ధనస్తంభైరసద్భిరసదాశ్రయైః॥8636॥
సాధుఫురుషులు సహజముగనే సమచిత్తులై యుందురు. వారు నిరంతరము భగవంతుని పాదపద్మములను సేవించుటయందే కుతూహలము కలిగియుందురు. అట్టివారికి దుర్గుణములు గలవారితోగాని, దురాచారపరులతోగాని, ధనమదాంధులతోగాని ఏమి పని? వారిని ఉపేక్షించుటయే యుక్తము.
10.19 (పందొమ్మిదవ శ్లోకము)
తదహం మత్తయోర్మాధ్వ్యా వారుణ్యా శ్రీమదాంధయోః|
తమో మదం హరిష్యామి స్త్రైణయోరజితాత్మనోః॥8637॥
ఈ యక్షకుమారులు ఇద్దఱును ధనగర్వితులు, మదిరాపానమత్తులు. అంతేగాక వీరు ఇంద్రియసుఖలోలురై, స్త్రీ లంపటులై యున్నారు. కనుక నేను అజ్ఞానజనితమైన వీరి గర్వమును నిర్మూలింతును.
10.20 (ఇరువదియవ శ్లోకము)
యదిమౌ లోకపాలస్య పుత్రౌ భూత్వా తమఃప్లుతౌ|
న వివాససమాత్మానం విజానీతః సుదుర్మదౌ॥8638॥
10.21 (ఇరువది ఒకటవ శ్లోకము)
అతోఽర్హతః స్థావరతాం స్యాతాం నైవం యథా పునః|
స్మృతిః స్యాన్మత్ప్రసాదేన తత్రాపి మదనుగ్రహాత్॥8639॥
10.22 (ఇరువదిరెండవ శ్లోకము)
వాసుదేవస్య సాన్నిధ్యం లబ్ధ్వా దివ్యశరచ్ఛతే|
వృత్తే స్వర్లోకతాం భూయో లబ్ధభక్తీ భవిష్యతః॥8640॥
వీరు దిక్పాలురలో ఒకడైన కుబేరునియొక్క పుత్రులే యైనప్ఫటికిని ప్రస్తుతము అజ్ఞానములో మునిగి, ధనమదాంధులై యున్నారు. అందువలన వీరు తమ శరీరములపై వస్త్రములు లేని విషయమునే గ్రహింపలేకున్నారు. కనుక, ఈ ఇరువురును వృక్షరూపములలో పడియుండుటకు అర్హులు. దానివలన వీరిలోని ధనగర్వము అణగిపోవును. కాని నా కృపతో వీరిలో భగవంతునిపైగల ధ్యాసమాత్రము (భక్తిమాత్రము) మిగిలియే యుండును. అంతేగాక, నూఱు దివ్యవర్షములకు పిమ్మట నా అనుగ్రహమువలన శ్రీకృష్ణుని సాన్నిధ్యము ప్రాప్తించును. క్రమముగా వీరు దైవభక్తి తత్పరులై ఆ స్వామిని సేవించుటద్వారా స్వర్గలోకమునకు చేరుదురు".
శ్రీశుక ఉవాచ
10.23 (ఇరవై మూడవ శ్లోకము)
ఏవముక్త్వా స దేవర్షిర్గతో నారాయణాశ్రమమ్|
నలకూవరమణిగ్రీవావాసతుర్యమలార్జునౌ॥8641॥
శ్రీశుకుడు వచించెను ఈ విధముగా శాప వచనములను పలికిన పిదప నారద మహర్షి నరనారాయణుల ఆశ్రమమునకు (బదరికాశ్రమమునకు) చేరెను. ఆ ముని శాప ప్రభావమున నలకూబరమణిగ్రీవులు మద్దిచెట్లై పడియుండిరి.
నలకూబర మణిగ్రీవులకు శాపమిచ్చుటవలన నారదుని తపశ్శక్తి కొంత క్షీణించెను. దానిని మఱల పొందుటకై ఆ దేవర్షి బదరికాశ్రమమునకు చేరి, అచట తపశ్చర్యకు పూనుకొనెను. ఆగ్రహము వచ్చినప్పుడుగాని, కామప్రభావమునకు లోనైనప్పుడుగాని తపశ్శక్తులు క్షీణించుచుండును.
10.24 (ఇరవై నాలుగవ శ్లోకము)
ఋషేర్భాగవతముఖ్యస్య సత్యం కర్తుం వచో హరిః|
జగామ శనకైస్తత్ర యత్రాస్తాం యమలార్జునౌ॥8642॥
భాగవతోత్తముడైన నారదమహాముని యొక్క శాపవచనములను సత్యము గావించుటకై శ్రీహరి (శ్రీకృష్ణుడు), రోటిని లాగుకొనిపోవుచు నలకూబరమణిగ్రీవులు మద్దిచెట్లుగా పడియున్న చోటికి తిన్నగా చేరి ఇట్లనుకొనెను.
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి పదియవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం
7702090319, 9505813235
[21:56, 28/11/2020] +91 95058 13235: 28.11.2020 సాయం కాల సందేశము
వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం
దశమస్కంధము - పూర్వార్ధము - పదియవ అధ్యాయము
నలకూబర, మణిగ్రీవులకు శాపవిమోచనము
ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
10.25 (ఇరువది ఐదవ శ్లోకము)
దేవర్షిర్మే ప్రియతమో యదిమౌ ధనదాత్మజౌ|
తత్తథా సాధయిష్యామి యద్గీతం తన్మహాత్మనా॥8643॥
'ఈ నారదమహర్షి నాకు అత్యంత ప్రీతిపాత్రుడు (పరమ భక్తుడు).ఈ యక్షకుమారులు ఇరువురును నాయందు మిగుల భక్తిశ్రద్ధలుగల కుబేరునియొక్క కుమారులు. కనుక ఆ మహాముని పలికిన వచనము నిజము గావించుచు వీరిని ఉద్ధరించెదను (శాపవిముక్తులను గావించెదను).
10.26 (ఇరువది ఆరవ శ్లోకము)
ఇత్యంతరేణార్జునయోః కృష్ణస్తు యమయోర్యయౌ|
ఆత్మనిర్వేశమాత్రేణ తిర్యగ్గతములూఖలమ్॥8644॥
ఈ విధముగా తలపోసిన పిదప శ్రీకృష్ణుడు రోటిని లాగికొనిపోవుచు ఆ రెండు మద్దిచెట్ల మధ్యలో ప్రవేశించెను. అప్పుడు ఆ రోలు అడ్డముగా పడిపోయెను.
శ్రీకృష్ణ భగవానుడు సహజముగనే తన దయాదృష్టితో ఆ యక్షకుమారులను ఉద్ధరింపగలడు. కాని నారదుని శాపవచనముల ప్రకారము వారికి వృక్షరూపములను తొలగించి, తన దర్శనభాగ్యమును గలిగించి ఈ ప్రక్రియను నడిపెను. భగవంతుడు ఎవరి హృదయములలో ప్రవేశించునో, వారి జీవితములలో క్లేశములు ఏమాత్రము ఉండవు. అందువలననే శ్రీకృష్ణుడు ఆ ఇద్దఱికిని విముక్తిని ప్రసాదించుటకై చెట్లమధ్యలో (వారి హృదయములలో) ప్రవేశించెను.
10.27 (ఇరువది ఏడవ శ్లోకము)
బాలేన నిష్కర్షయతాన్వగులూఖలం తద్దామోదరేణ తరసోత్కలితాంఘ్రిబంధౌ|
నిష్పేతతుః పరమవిక్రమితాతివేపస్కంధప్రవాలవిటపౌ కృతచండశబ్దౌ ॥8645॥
శ్రీకృష్ణుని ఉదరము (నడుము) త్రాడుతో రోటికి గట్టిగా కట్టివేయబడియుండెను. అందువలన అతడు దామోదరుడు అయ్యెను. ఆ చిట్టిబాలుడు (ఆ ప్రభువు) కొద్దివేగముతో ఆ రోటిని లాగినంతనే ఆ మద్దిచెట్లవ్రేళ్ళు కొలదిగా కదలెను. పిమ్మట ఆ స్వామి మఱికొంత బలమును చూపుచు కొంత ముందునకు సాగగా కొమ్మలతో, చిగురుటాకులతో కూడియున్న ఆ మహావృక్షములు రెండును పెద్దగా ఊగుచు పెల్లగిలి, ఒక్కుమ్మడిగా ఫెళఫెళమని శబ్దము చేయుచు నేలగూలెను.
10.28 (ఇరువది ఏడవ శ్లోకము)
తత్ర శ్రియా పరమయా కకుభః స్ఫురంతౌ సిద్ధావుపేత్య కుజయోరివ జాత వేదాః|
కృష్ణం ప్రణమ్య శిరసాఖిలలోకనాథం బద్ధాంజలీ విరజసావిదమూచతుః స్మ॥8646॥
అంతట ఆ కూలిపోయిన వృక్షములనుండి అగ్ని తేజస్సులతో ఇరువురు సిద్ధపురుషులు బహిర్గతులైరి. వారి దివ్యప్రభలతో దిక్కులన్నియును తేజరిల్లెను, అనంతరము ఆ సిద్ధులు (యక్షులు) ఇరువురును సత్త్వగుణసంపన్నులై జగన్నాథుడైన శ్రీకృష్ణుని సమీపించి, ఆ ప్రభువుయొక్క పాదపద్మములకు ప్రణమిల్లి, అంజలి ఘటించి, నిర్మలమైన హృదయములతో ఇట్లు స్తుతించిరి--
10.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)
కృష్ణ కృష్ణ మహాయోగింస్త్వమాద్యః పురుషః పరః|
వ్యక్తావ్యక్తమిదం విశ్వం రూపం తే బ్రాహ్మణా విదుః॥8647॥
కృష్ణా! ఓ కృష్ణా! నీవు బాలుడవుగావు, పరమయోగీశ్వరుడవు. ఆదినారాయణుడవు. సమస్త జగత్తునకును ఆధారమైనవాడవు. 'సూక్ష్మము నుండి స్థూలము వరకు (అణు స్వరూపము నుండి మహద్రూపము వఱకు) వ్యాపించియున్న ఈ విశ్వమంతయును నీ లీలారూపమే (నీవు విరాడ్రూపుడవు)'. అని జ్ఞానులు పేర్కొందురు.
10.30 (ముప్పదియవ శ్లోకము)
త్వమేకః సర్వభూతానాం దేహాస్వాత్మేంద్రియేశ్వరః|
త్వమేవ కాలో భగవాన్ విష్ణురవ్యయ ఈశ్వరః॥8648॥
పరమేశ్వరా! నీకు నమస్కారములు. పృథివ్యాది పంచమహాభూతములకును, చరాచరాత్మకములైన సకల ప్రాణులకును, జ్ఞానేంద్రియములకును, కర్మేంద్రియములకును (బాహ్యేంద్రియములకును) అహంకారాది అంతరింద్రియములకును, పంచ ప్రాణములకును నీవే అధిపతివి. నీవే సర్వశక్తిమంతుడవైన కాలస్వరూపుడవు. షడ్గుణైశ్వర్యసంపన్నుడవు, సర్వవ్యాపకుడవు, సనాతనుడవు, సర్వేశ్వరుడవు.
10.31 (ముప్పది ఒకటవ శ్లోకము)
త్వం మహాన్ ప్రకృతిః సూక్ష్మా రజఃసత్త్వతమోమయీ|
త్వమేవ పురుషోఽధ్యక్షః సర్వక్షేత్రవికారవిత్॥8649॥
దేవా! మూలప్రకృతియు, దానినుండి ఏర్పడు మహత్తత్త్వము నీవే! సత్త్వరజస్తమో గుణాత్మకము, సూక్ష్మము అగు ప్రకృతి నీవే. నీవు సకల స్థూల సూక్ష్మ శరీరములయొక్క కర్మలను, భావములను, ధర్మములను, శక్తులను ఎఱిగిన సాక్షివగు పరమాత్ముడవు.
10.32 (ముప్పది రెండవ శ్లోకము)
గృహ్యమాణైస్త్వమగ్రాహ్యో వికారైః ప్రాకృతైర్గుణైః|
కో న్విహార్హతి విజ్ఞాతుం ప్రాక్సిద్ధం గుణసంవృతః॥8650॥
చిత్తవృత్తులద్వారా, త్రిగుణములద్వారా, వికారములద్వారా నీవు తెలియబడవు. స్థూల సూక్ష్మ శరీరములనెడి ఆచరణములచే కప్పబడిన ఏ మనుజుడును నిన్ను తెలిసికొనజాలడు. ఏలయన ఈ శరీరము లన్నింటికిని ఆద్యుడవు నీవు.
10.33 (ముప్పది మూడవ శ్లోకము)
తస్మై తుభ్యం భగవతే వాసుదేవాయ వేధసే|
ఆత్మద్యోతగుణైశ్ఛన్నమహిమ్నే బ్రహ్మణే నమః॥8651॥
సమస్త సృష్టికిని మూలమైన వాసుదేవా! నీకు నమస్కారము. నీ నుండి ప్రకాశితమైన గుణములచేతనే నీవు కప్పబడినట్లు కనబడుచుందువు. నీవు మహితాత్ముడవైన పరబ్రహ్మవు.
10.34 (ముప్పది నాలుగవ శ్లోకము)
యస్యావతారా జ్ఞాయంతే శరీరేష్వశరీరిణః|
తైస్తైరతుల్యాతిశయైర్వీర్యైర్దేహిష్వసంగతైః॥8652॥
జగన్నాథా! నీకు ప్రాకృతమైన శరీరమేలేదు. కాని నీవు మత్స్యాది వివిధ అవతారములను ధరించి, నీ పరాక్రమములను (నీ విశిష్టలీలలను) ప్రకటించుచుందువు. అవి సాధారణ మానవులకు అశక్యములైనవి. నీతో సమానుడుగాని, నీ కంటెను అధికుడుగాని ఈ లోకమున ఎవ్వరును లేరు. ఏ శరీరములయందు ఇట్టి పరాక్రమములు ప్రకటితమగునో అవి నీ అవతారములని తెలియవచ్చును.
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి పదియవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం
7702090319, 9505813235
[05:33, 29/11/2020] +91 95058 13235: శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
738వ నామ మంత్రము
ఓం లాస్యప్రియాయై నమః
సాక్షాత్తు నటరాజు అయిన పరమేశ్వరుని భార్యగా, చతుష్షష్టికళామయిగా, ఆ చతుష్షష్టి కళలలో ఒకటైనది, స్త్రీలు చేయు సుకుమారమైన నృత్యమైన లాస్యమునందు ప్రీతిగలిగిన పరాశక్తికి నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి లాస్యప్రియా యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును ఓం లాస్యప్రియాయై నమః అని ఉచ్చరించుచూ, భక్తిప్రపత్తులతో జగన్మాతకు చేతులు జోడించి నమస్కరిస్తూ, సుగంధ భరితమై, నానావర్శ సుశోభితమైన పుష్పములతో అర్చనచేస్తూ తరించు సాధకులను ఆ జగన్మాత కరుణించి ఇష్టకామ్యార్థసిద్ధియు, ఆత్మానందానుభూతినీ అనుగ్రహించును.
జగన్మాత చతుష్షష్టికళామయి. చతుష్షష్ఠి తంత్రప్రధానమైనది. అన్నిటికీ మించి నటరాజస్వరూపుడు, నాట్యవేదస్వరూపుడు అయిన పరమేశ్వరాని భార్య అయిన జగన్మాత, స్త్రీలు చేయు సుకుమారమైన నృత్యమైన లాస్యమునందు అత్యంత ప్రీతిగలిగినది. ఆహార్యము, అంగికము, వాచికము, సాత్వికము అను కావలసిన నాలుగు నాట్యాంశములు సమపాళ్ళలో మేళవించి నాట్యము చేయునంతటి లాస్యప్రియ జగన్మాత. అందుచేతనే అమ్మకుగల అనంతకోటి నామ మంత్రములలో లాస్యప్రియా యనునది కూడా ఒక నామ మంత్రము. ఆ నామము ఒక మంత్రమే. స్త్రీలు చేయు సుకుమార నృత్యము లాస్యము అయితే పురుషులు చేయు నృత్యమునందు వీరము, రౌద్రము కలిగిన తాండవము. ఆధారచక్రమందు పరమేశ్వరుడు శివతాండవము చేస్తే జగన్మాత లాస్యయుతమైన నాట్యము ఆయనతో కలిసి చేస్తుంది. ఇదే విషయాన్ని ఆదిశంకరులు ఇలా చెప్పారు.
శ్రీ ఆదిశంకర విరచిత సౌందర్యలహరి లోని 41వ శ్లోకం
తవాధారే మూలే - సహ సమయయా లాస్యపరయా
నవాత్మానం మన్యే - నవరస మహాతాండవ నటమ్ |
ఉభాభ్యామేతాభ్యా -ముదయవిధి ముద్దిశ్య దయయా
సనాథాభ్యాం జఙ్ఞే - జనక జననీమత్జగదిదమ్ || 41 ||
భావము:
మూలాదారచక్రంలో ఆనందభైరవీ నామంతో శక్తిస్వరూపంగా ఉన్న నీతో కలసి శివుడు నవరస భరితమైన,నవ వ్యూహాత్మకమైన, లాస్య రూపమైన నాట్యం చేస్తాడు. మీ ఇద్దరి నాట్యంలోంచి ఈ జగత్తు మరల సృష్టించ బడుతున్నది.ఆనందభైరవి, మహాబైరవులుగా మీచే సృజింపబడిన ఈ జగత్తుకు మీరే జగన్మాత, జగత్పితరులుగా భావించి నమస్కరించుచున్నాను.
సాక్షాత్తు ఆ పరమేశ్వరునితో తాండవమాడు వేళ ఆయనతో అడుగువేస్తూ, ఆయన చేతులతో ఆ తల్లికూడా లయబద్ధంగా చేతులు కలుపుతూ, ఆయన చేతులలో ఒదిగిపోతూ, తన ముఖపద్మముపై పరమేశ్వరుని వదనము ఒక భ్రమరము వలె వాలి ఉండగా తన్మయమైపోవు జగన్మాత లాస్యప్రియా యని అనదగునుగదా! అదే అనుకుంటాను కామేశ్వరముఖాలోక కల్పితశ్రీగణేశ్వరా అను నామములో అన్నట్లు కామేశ్వరుని ముఖమును అమ్మవారు ఆ తాండవకేళివేళ వీక్షించి గణేశ్వరుని కల్ఫించుకున్నది అనిపిస్తుంది. ఆ తాండవకేళి సమయంలో కామేశ్వరుడు ప్రేమగా వీక్షిస్తే తన వక్షోజములను ఆయనకు ప్రతిపణము ఇచ్చినందులకేమో అమ్మవారికి కామేశ్వర ప్రేమరత్నమణి ప్రతిపణస్తనీ (లలితా సహస్రనామావళి యందలి 33వ నామ మంత్రము) - కామేశ్వరుని ప్రేమయను రత్నమునకు ప్రతిఫలముగా తన వక్షోజములను ఇచ్చిన తల్లి - యను నామము కూడా ఏర్పడినది. జగన్మాత నటరాజు అయిన పరమేశ్వరునితో అంతగా తాండవనృత్యకేళి జరిపినది అంటే ఆతల్లికి స్త్రీలు చేయు సుకుమార నృత్యమైన లాస్యము నందు ప్రీతి ఎంత ఉన్నదో లాస్యప్రియా యను నామమే మనకు తెలియజేయుచున్నది.
జగన్మాత తాను సృజించిన జగమే నృత్యప్రదర్శన వేదిక. జీవులన్నియు తమతమసహజమైన కదలికలే నృత్యభంగిమలు. ఆ నృత్యభంగిమలకు జగన్మాతయే నాట్యాచారిణి. జీవుల రూపములే ఆహార్యము. జీవుల నోటి సవ్వడులే వాచకము. జీవుల కదలికలే ఆంగికము. జీవుల సహజసిద్ధమైన ప్రవర్తనయే సాత్త్వికము. జగన్మాత పరమశివునితో జరిపిన నృత్యవిలాసమే మానవజాతిలోని భార్యాభర్తల అన్యోన్య జీవనశైలికి ఆదర్శము. జగన్మాతలోని లాస్యప్రియత్వమే జగత్తులోని జీవకోటికి ఆనందభైరవీరాగము.
జగన్మాతకు నమస్కరించునపుడు ఓం లాస్యప్రియాయై నమః అని అనవలెను.
శ్రీలలితా సహస్రనామ భాష్యము
164వ నామ మంత్రము
ఓం నిర్మమాయై నమః
నేను, నాది యను అహంకారము లేక మమకార రహితురాలై తేజరిల్లు జగన్మాతకు నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి నిర్మమా యను మూడక్షరముల (త్ర్యక్షరీ) నామ మంత్రముసు ఓం నిర్మమాయై నమః అని ఉచ్చరించుచూ, అత్యంతభక్తిశ్రద్ధలతో ఆ అఖిలాండేశ్వరిని ఉపాసించు సాధకునకు నేను, నాది యను మమకారములన్నియు తొలగి సర్వము ఆ పరమాత్మ కరుణయే యను భావముతో మమకార రాహిత్యంతో జీవించి తరించును.
జగన్మాత పరమాత్మ. దేహసంబంధమైన లేదా మనసుకు సంబంధమైన మోహము, మమకారము, చింత వంటి వికారములు లేక నిర్మమా (మమకార రహితు రాలు) యను నామముతో స్తుతింపబడుచున్నది. నేను, నాది అను భావము శరీరసంబంధమైనది. జగన్మాత నిర్గుణస్వరూపురాలు అనగా రూపం గానీ, భౌతికపరమైన మరే లక్షణాలు గానీ లేని పరబ్రహ్మస్వరూపిణి. తనకంటె వేరేమియు లేనిది. అంతయూ తానే. జీవులన్నిటిలోనూ తానేయుంటూ భేదజ్ఞానములేనిదగుటచే నిర్మమా యని అన్నాము.
తల్లి గర్భమునుండి బాహ్యప్రపంచంలోనికి వచ్చిన తరువాత నేను అనే భావన ఉండుట అతిసహజము. అలాగే నాది అనే భావనకూడా వచ్చేస్తుంది. ఈ ఇల్లు నాది. ఈ వస్త్రమునాది. మమ అనగా ఇంద్రియాలపై భ్రాంతి. జీవించినంత కాలము ఇల్లు, వాకిలి, సంపదలు, వస్తువులు అన్నీ నావి అనడం జరుగుతుంది. తనవనుకున్నవాటిపై మమకారం పెంచుకోవడం జరుగుతుంది. కొన్ని సమయాలలో ప్రాణంకన్నా తనవి అనుకున్నవాటిపై భ్రాంతి పెంచుకోవడం జరుగుతుంది. ఈ హద్దువరకూ నాభూమి, హద్దుదాటితే వాళ్ళది అనే తన,పర భేదం ఏర్పడుతుంది. ఈమె నా జీవిత భాగస్వామిని. ఈ పిల్లలు మా పిల్లలు అని అనడంకూడా సహజమే. వినేవారు కూడా ఏమాత్రం ఆలోచించకుండా 'అలాగా, సంతోషమండి. పిల్లలు ఆణిముత్యాలులా ఉన్నారు' అని అనేస్తారు. అంతేగాని వేదాంతం మాట్లాడుతారా? అంటే మాట్లాడరు. ఎందుకంటే వారూ, వీరూ కూడా శరీరధారులే. పుట్టుక ఒక్కనిగా, గిట్టుట ఒక్కనిగా అయినను పదుగురిలో. బంధములమధ్య. ఈ బంధముల మధ్యయుండుటచేతనే నాది, నీది యనే మమకారము. ఇవన్నీ శరీరానికి, మనసుకు మాత్రమే. ఆత్మకు కాదు. పరమాత్మస్వరూపిణియైన జగన్మాత ఇందుగలదందు లేదనే సందేహం లేకుండా సర్వవ్యాపిని. స్వపరభేదాలుండవు. ఈ మమకారములకు అతీతురాలు జగన్మాత. గనుక అమ్మవారిని నిర్మమా యని అన్నాము. దివంగతులైన వారిని ఉద్దేశించి ఆత్మ శాంతించుగాక అంటూ వేదాంతపరమైన సందేశము ఇస్తాము. అంటే అంతవరకూ ఆ ఆత్మ ఆ శరీరంలో ఉండి, అరిషడ్వర్గములతో సహచరించి, బంధాలు, అనుబంధాలు, మమకారాలు, అహంకారాలు, రాగము, ద్వేషము మొదలైన భౌతిక వికారముల మధ్య ఉంటూ, తీవ్రక్షోభకు గురికాబడినది అనే భావనతో దేహాన్ని విడిచి వెళ్ళిన ఆ ఆత్మకు శాంతికోరుచున్నామని అర్థము. శరీరమును వదలి పయనమైన ఆ ఆత్మ ఎవరి గురుంచి ఘోషించదు. అంతవరకూ తనవారనుకున్నవారి గతి ఏమిటా అనికూడా ఘోషించదు. మమకారము అనేది శరీర సంబంధమైనది. ఆ మమకార భావన అనేది ఆ శరీరము నాశ్రయించిన మనసుది. అంతే గాని శరీరమును విడిచి పయనమయిన ఆత్మది కాదు. ఆత్మకు ఏవిధమైన భౌతిక వికారములు ఉండవు. ఆత్మలలో పరమాత్మ అయిన జగన్మాతకు ఇవేమీ ఉండవు గనుక నిర్మమా యని అన్నాము.
జగన్మాతకు గల ఈ నామములన్నియూ మంత్రములే. ఆ నామ మంత్రములు వాటిలోని పరబ్రహ్మతత్త్వాన్ని మనకు తెలియ జేస్తున్నది గనుక మనము పరమాత్మయైన జగన్మాతను నామస్తోత్రములతో కీర్తిస్తూ పరబ్రహ్మతత్త్వాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాము. అందుచే ఒక్కసారి ఈ వ్యాఖ్యానము చదివినవెంటనే జగన్మాతకు నమస్కరించుదాము. అలా నమస్కారం చేయునపుడు ఓం నిర్మమాయై నమః అని అందాము. శ్రీమాత్రేనమః
[05:34, 29/11/2020] +91 95058 13235: 29.11.2020 ప్రాతః కాల సందేశము
వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం
దశమస్కంధము - పూర్వార్ధము - పదియవ అధ్యాయము
నలకూబర, మణిగ్రీవులకు శాపవిమోచనము
ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
10.35 (ముప్పది ఐదవ శ్లోకము)
స భవాన్ సర్వలోకస్య భవాయ విభవాయ చ|
అవతీర్ణోంఽశభాగేన సాంప్రతం పతిరాశిషామ్॥8653॥
ప్రభూ! సకలలోకముల అభ్యుదయము కొఱకును, శ్రేయస్సు కొఱకును (లోకకల్యాణార్థము) బలరామునితో సహా ఇప్పుడు సకలశక్తులతో అవతరించితివి. నీవు నీ భక్తుల అభిలాషలను తీర్చెడివాడవు.
10.36 (ముప్పది ఆరవ శ్లోకము)
నమః పరమకల్యాణ నమః పరమమంగళ|
వాసుదేవాయ శాంతాయ యదూనాం పతయే నమః॥8654॥
నీవు పరమకల్యాణ (సాధ్య) స్వరూపుడవు. పరమ మంగళ (సాధన) స్వరూపుడవు. శాంతస్వభావుడవు, యదువంశ శిరోమణివి. వాసుదేవా! నీకు నమస్కారములు.
10.37 (ముప్పది ఏడవ శ్లోకము)
అనుజానీహి నౌ భూమంస్తవానుచరకింకరౌ|
దర్శనం నౌ భగవత ఋషేరాసీదనుగ్రహాత్॥8655॥
అనంతా! మేము నీకు దాసానుదాసులము. కనుక మమ్ము అనుగ్రహింపుము. పూజ్యుడైన నారదమహర్షి కృప వలన మాకు నీ దర్శనము లభించినది.
10.38 (ముప్పది ఐదవ శ్లోకము)
వాణీ గుణానుకథనే శ్రవణౌ కథాయాం హస్తౌ చ కర్మసు మనస్తవ పాదయోర్నః|
స్మృత్యాం శిరస్తవ నివాసజగత్ప్రణామే దృష్టిః సతాం దర్శనేఽస్తు భవత్తనూనామ్॥8656॥
ప్రభూ! మా వాక్కులు నిరంతరము నీ కల్యాణగుణములనే స్తుతించుచుండుగాక. మా చెవులు నీ యశోవిభవములను ఆలకించుచుండుగాక. మా చేతులు సంతతము నీ సేవలనే చేయుచుండుగాక. మా మనస్సులు సర్వదా నీపాద పద్మములయందే లగ్నమైయుండుగాక! ఈ జగత్తంతయును నీ నివాసస్థానమే. దానిముందు మా శిరస్సులు వినమ్రములై యుండుగాక! సాధుపురుషులు నీ ప్రత్యక్షస్వరూపములు. మా కన్నులు అనవరతము వారిని దర్శించుచుండుగాక! ఆ బుద్ధులు లౌకిక విషయములజోలికి పోక ఎల్లప్పుడును నిన్నే సర్వస్వముగా భావించుచుండుగాక! కృపానిధీ! నీవు మమ్ము ఈ విధముగా అనుగ్రహింపుము"
శ్రీశుక ఉవాచ
10.39 (ముప్పది తొమ్మిదవ శ్లోకము)
ఇత్థం సంకీర్తితస్తాభ్యాం భగవాన్ గోకులేశ్వరః|
దామ్నా చోలూఖలే బద్ధః ప్రహసన్నాహ గుహ్యకౌ॥8657॥
శ్రీశుకుడు వచించెను ఆ యక్షకుమారులు గోకులమునకు ప్రభువైన శ్రీకృష్ణభగవానుని ఈ విధముగా కీర్తించిరి. అంతట రోలునకు కట్టివేయబడియున్న కృష్ణస్వామి చిఱునవ్వు చిందించుచు వారితో ఇట్లు వచించెను.
శ్రీభగవానువాచ
10.40 (నలుబదియవ శ్లోకము)
జ్ఞాతం మమ పురైవైతదృషిణా కరుణాత్మనా|
యచ్ఛ్రీమదాంధయోర్వాగ్భిర్విభ్రంశోఽనుగ్రహః కృతః॥8658॥
శ్రీకృష్ణభగవానుడు ఇట్లు పలికెను "యక్షకుమారులారా! మీరు ధనమదాంధులై యుంటిరి. పరమదయాళువైన నారదమహర్షి శాపవచనముల ద్వారా మీ ధనగర్వమును పోగొట్టి మిమ్ము ఇట్లు అనుగ్రహించెను. నేను ఈ విషయమును ఇంతకుముందే ఎఱింగియుంటిని.
10.41 (నలుబది ఒకటవ శ్లోకము)
సాధూనాం సమచిత్తానాం సుతరాం మత్కృతాత్మనామ్|
దర్శనాన్నో భవేద్బంధః పుంసోఽక్ష్ణోః సవితుర్యథా॥8659॥
సమదర్శనులును, నా యందే తమ చిత్తములను లగ్నమొనర్చిన వారును అగు సాధుపురుషుల యొక్క దర్శనము వలన సూర్యోదయమైనంతనే చిమ్మ చీకట్లు మాయమైనట్లు మానవులబంధములన్నియును తొలగిపోవును.
10.42 (నలుబది రెండవ శ్లోకము)
తద్గచ్ఛతం మత్పరమౌ నలకూబర సాదనమ్|
సంజాతో మయి భావో వామీప్సితః పరమోఽభవః॥8660॥
"నలకూబరమణిగ్రీవులారా! మీరు నా యందే మనస్సులను నిలిపినవారై, మీ యిండ్లకు చేరుడు. మీరు కోరుకొనినరీతిగా సంసారబంధములనుండి విముక్తుని ప్రసాదించునట్టి అనన్యభక్తి నా యందు మీకు ఏర్పడినది."
శ్రీశుక ఉవాచ
10.43 (నలుబది మూడవ శ్లోకము)
ఇత్యుక్తౌ తౌ పరిక్రమ్య ప్రణమ్య చ పునః పునః|
బద్ధోలూఖలమామంత్ర్య జగ్మతుర్దిశముత్తరామ్॥8661॥
శ్రీశుకుడు నుడివెను శ్రీకృష్ణుడు ఇట్లు పలికిన పిమ్మట నలకూబర మణిగ్రీవులు ఉలూఖలబద్ధుడైయున్న ఆ స్వామికి ప్రదక్షిణ పూర్వకముగా పదేపదే ప్రణమిల్లిరి. అనంతరము వారు ఆ ప్రభువును వీడ్కొని ఉత్తరదిక్కునకు వెళ్ళిపోయిరి.
ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కంధే పూర్వార్ధే దశమోఽధ్యాయః (10)
ఇది భాగవత మహాపురాణమునందలి దశమస్కంధము, పూర్వభాగమునందలి పదియవ అధ్యాయము (10)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం
వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం
దశమస్కంధము - పూర్వార్ధము - పదకొండవ అధ్యాయము
గోపాలురు గోకులమునుండి బృందావనమునకు వెడలుట - శ్రీకృష్ణుడు వత్సాసుర, బకాసురులను వధించుట
ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
శ్రీశుక ఉవాచ
11.1 (ప్రథమ శ్లోకము)
గోపా నందాదయః శ్రుత్వా ద్రుమయోః పతతో రవ|
తత్రాజగ్ముః కురుశ్రేష్ఠ నిర్ఘాతభయశంకితాః॥8662॥
శ్రీశుకుడు పలికెను - పరీక్షిన్మహారాజా! నందుడు మొదలగు గోపాలురందరును ఆ రెండు మద్దిచెట్లను పడిపోవుచున్నప్ఫుడు ఏర్పడిన భయంకరధ్వనిని వినిరి. అంతట వారు పిడుగు పడినదేమోయని భీతిల్లుచు అచటికి విచ్చేసిరి.
11.2 (రెండవ శ్లోకము)
భూమ్యాం నిపతితౌ తత్ర దదృశుర్యమలార్జునౌ|
బభ్రముస్తదవిజ్ఞాయ లక్ష్యం పతనకారణమ్॥8663॥
నేలమీద మద్దివృక్షములు పడియున్న విషయము స్పష్టముగా బోధపడుచున్నను అవి నేలగూలుటకు గల కారణము తెలియక వారు భయభ్రాంతులకు లోనైరి.
11.3 (మూడవ శ్లోకము)
ఉలూఖలం వికర్షంతం దామ్నా బద్ధం చ బాలకమ్|
కస్యేదం కుత ఆశ్చర్యముత్పాత ఇతి కాతరాః॥8664॥
రోటికి త్రాడుతో కట్టివేయబడియున్న బాలుని, అతడు ఆ రోటిని లాగుకొని పోవుచుండుటను గూడ వారు గమనించిరి. 'ఈ వృక్షములు ఎట్లు కూలిపడినవి? ఇది ఎవరి పని?ఇదియంతయును మిగుల ఆశ్చర్యకరముగా ఉన్నది' అని వారు బిత్తరపోవుచుండిరి.
11.4 (నాలుగవ శ్లోకము)
బాలా ఊచురనేనేతి తిర్యగ్గతములూఖలమ్|
వికర్షతా మధ్యగేన పురుషావప్యచక్ష్మహి॥8665॥
అంతట అచట ఆడుకొనుచున్న గోపబాలురు వారితో చెప్పిరి. "ఇదియంతయును ఈ చిన్నికృష్ణుని వలననే జరిగినది. రోటికి బంధింపబడియున్న ఈ కృష్ణయ్య ఆ రోటిని లాగికొనిపోవుచు ఈ రెండుమద్దిచెట్లకు మధ్యగా ముందుకు సాగెను. అప్పుడు రోలు అడ్డముగా తిరిగియుండుటవలన దాని తాకిడికి అవి నేలగూలెను. అప్పుడు ఆ రెండు వృక్షములనుండి వెలువడిన ఇద్దరు మహాపురుషులనుగూడ మేము చూచితిమి".
11.5 (ఐదవ శ్లోకము)
న తే తదుక్తం జగృహుర్న ఘటేతేతి తస్య తత్|
బాలస్యోత్పాటనం తర్వోః కేచిత్సందిగ్ధచేతసః॥8666॥
ఆ గోపబాలుర మాటలను వారు విశ్వసింపజాలక పోయిరి. 'ఈ చిట్టివానివలన ఇంతటి అద్భుత సంఘటన జరుగుట అసంభవము' అని కొందరు నమ్మకుండిరి. 'పసిబాలుడు చెట్లను పెకలించుటయా! ఇదేమి చోద్యము!' అసి మరికొందరు అనుమానపడిరి. కానీ, ఆలోచనాపరులైన కొందరు మాత్రము ఇంతవరకును ప్రకటితములైన చిన్నికృష్ణుని అద్భుతలీలలను జ్ఞప్తికి తెచ్చుకొనుచు 'ఈ మహావృక్షములు కూలిపోవుట ఇతని వలననే జరిగియుండవచ్చును' అని తలపోసిరి.
11.6 (ఆరవ శ్లోకము)
ఉలూఖలం వికర్షంతం దామ్నా బద్ధం స్వమాత్మజమ్|
విలోక్య నందః ప్రహసద్వదనో విముమోచ హ॥8667॥
రోటికి త్రాడుతో కట్టివేయబడి, దానిని లాగికొనిపోవుచున్న తన ముద్దులకొడుకును చూచి, నందుడు తనలో నవ్వుకొనుచు ఆ త్రాడు ముడిని విప్పివేసెను.
11.7 (నాలుగవ శ్లోకము)
గోపీభిః స్తోభితోఽనృత్యద్భగవాన్ బాలవత్క్వచిత్|
ఉద్గాయతి క్వచిన్ముగ్ధస్తద్వశో దారుయంత్రవత్॥8668॥
తాను సర్వశక్తిమంతుడైన శ్రీహరియయ్యును తనను గుర్తింతురేమో అను శంకతో తన దివ్యశక్తిని ఎవరును పసిగట్టకుండుటకై ఆ చిన్నారి కృష్ణుడు చిన్నబాలునివలె ప్రవర్తించుచూ తన లీలావినోదములను అత్యద్భుతముగా ఆహా! ఓహో! అని పొగడ్తలతో చప్పట్లు కొడుతూ అతనిని ప్రోత్సహించుచుండిరి. అప్పుడా కన్నయ్య ఒక అమాయకునివలె ఒకమారు నాట్యము చేయుచుండెను. మరొకమారు పాటలు పాడుచూ వారిని మురిపించు చుండెను. వారి ప్రశంసలకు ముగ్ధుడై చేతులు, కన్నులు చమత్కారముగా త్రిప్పుచూ ఒక కీలుబొమ్మవలె వారికి వశుడై నృత్యములొనర్చుచుండెను.
11.8 (ఎనిమిదవ శ్లోకము)
బిభర్తి క్వచిదాజ్ఞప్తః పీఠకోన్మానపాదుకమ్|
బాహుక్షేపం చ కురుతే స్వానాం చ ప్రీతిమావహన్॥8669॥
గోపికలు అప్పుడప్పుడు పీటలను, తూనికరాళ్ళను, కుంచము, తవ్వ వంటి కొలతపాత్రలను, పావుకోళ్ళను తీసికొనిరమ్మని బాలకృష్ణుని ఆజ్ఞాపించుచుండిరి. వారి ఆజ్ఞలకు తలవూపి ఆ చిన్నికన్నయ్య వాటిని తన లేత బుజాలపై పెట్టుకొని, మోయలేని వానివలె నటించుచు వంగి వంగి బరువుగా బుడిబుడి అడుగులు వేయుచూ కడకు వాటిని తెచ్చి వారికి ఇచ్చుచుండును. ఒక్కొక్కప్తుడు ఒక మల్లునివలె తన చిన్నారి బుజములను చరుచుచూ, తొడగొట్టుచూ తన వారిని సంతోషపరచుచుండును.
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి పదకొండవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం
7702090319, 9505813235
[02:57, 30/11/2020] +91 95058 13235: శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
739వ నామ మంత్రము
ఓం లయకర్యై నమః
చిత్తమును ద్యేయరూపముతో ఐక్యము చేసి పదిరెట్లు ధ్యానఫలమును ప్రసాదించు పరబ్రహ్మ స్వరూపిణికి నమస్కారం.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి లయకరీ యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును ఓం లయకర్యై నమః అని ఉచ్చరిస్తూ, అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ పరమేశ్వరిని ఉపాసించు సాధకుడు ఆ పరమేశ్వరి కరుణచే తన జీవనవీణ లయతప్పకుండా ఆనందజీవనరాగాన్ని ఆలపించినట్లుగా సుఖసంతోషాలతో, ఆత్మానందానుభూతిని పొందును.
లయః చిత్తావస్థావిశేషః (సౌభాగ్యభాస్కరం, 849వ పుట) - లయము అనునది మనసుకు సంబంధించినది. అలాగే దశధ్యానసమో లయః (సౌభాగ్యభాస్కరం, 849వ పుట) పదిధ్యానముల ఫలితం లయము వలన లభిస్తుంది. లయములో చిత్తము ధ్యేయరూపముతో ఐక్యమందునట్లు అనుగ్రహించునది గనుకనే జగన్మాత లయకరీ అని నామముతో స్తుతించబడుచున్నది. భగవదారాధన సమయంలో మనసును లయంచేసి, అన్యమేమియు తన మనసులోనికి రానీయక చేయు ఆరాధన పదింతలు ఫలితమును ఇస్తుంది. అంతటి నిమగ్నతను అనుగ్రహించునది జగన్మాతయే గనుక లయకరీ అని నామ ప్రసిద్ధమైనది. అలాగే సంగీత విద్వాంసులు నృత్యమునకు, గీతమునకు కాలసామ్యమును చేతివ్రేళ్ళు, తాళములతో కొలుచుట లయమునబడును. దీనినే శ్రుతి,లయలు గానమునకు జననీ జనకులనికూడా అంటారు. లయతప్పిన నృత్యము, శ్రుతి తప్పిన గానము గతి తప్పిన జీవనము వంటిది. జగన్మాత లాస్యప్రియా అను నామ మంత్రములో చెప్పినట్లు స్త్రీ సహజమైన సుకుమార మిళితమైన నృత్యమందు మిక్కిలి ప్రీతిగలిగినదగుటచే అట్టి నృత్యమును అత్యంత లయబద్ధంగా శివతాండవమునకు సాటిగా నృత్యమొనరించి లయకరీ యని నామప్రసిద్ధమైనది.
పరమాత్మను ధ్యానము చేయునపుడు ధ్యానము లో లయము చేయునది జగన్మాత, కాబట్టి ఆ తల్లిని లయకరీ అని స్తుతిస్తున్నాము.
బ్రహ్మజ్ఞానాన్వేషణలో సాధకుడు కేవలము తన సాధనను బ్రహ్మజ్ఞానమార్గంలోనే నిలపడానికి దృష్టిని ఆ అన్వేషణలోనే లయముచేయునది జగన్మాత, గనుకనే కోట్లాది నామ మంత్రములలో లయకరీ యను నామ మంత్రముతో స్తుతిస్తున్నాము.
జగన్మాతకు నమస్కరించునపుడు ఓం లయకర్యై నమః అని అనవలెను.
శ్రీలలితా సహస్రనామ భాష్యము
165వ నామ మంత్రము
ఓం మమతాహంత్ర్యై నమః
భక్తులయందు గల నేను, నాది అనే అహంకారమును తొలగించు పరమాత్మస్వరూపిణియైన పరమేశ్వరికి నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి మమతాహంత్రీ యను ఐదక్షరముల (పంచాక్షరీ) నామ మంత్రమును ఓం మమతాహంత్ర్యై నమః అని ఉచ్చ రించుచూ, ఆ జగన్మాతను అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధించు భక్తులలోని మమకార లక్షణాన్ని పొగొట్టి ఆత్మజ్ఞానమును ప్రసాదించి తరింపజేయును.
జగన్మాత నిర్మమా యను నామ ప్రసిద్ధమైనది. అనగా నేను, నాది అను దేహేంద్రియాదులే నేను అనుకునే మమకారము లేని పరమాత్మ స్వరూపిణి. అలాగే తన భక్తులలోని దేహేంద్రియాదులనే తాను అనుకునే మమకారాన్ని పోగొట్టి ఆత్మజ్ఞానమును ప్రసాదించు అనుగ్రహమూర్తి ఆ జగన్మాత. ఇక్కడ హంత్రీ అనగా నాశనము చేయునది. లేకుండా చేయునది. తొలగించునది అని అర్థంచేసుకోగలము. జగన్మాత నిర్మమా యని గత నామ మంత్రములో తెలిసియుంటిమి. ఇక్కడ మమతాహంత్రీ యనగా భక్తులలో నేను, నాది యను మమకారమును తొలగుటకు కావలసిన స్వస్వరూపజ్ఞానమును ప్రసాదిస్తుంది. భవబంధాలను త్రెంచి మోక్షమార్గమును చూపుతుంది.
ఒక విషయం ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. సంసారములో ఉన్నవాడు అమ్మవారిని పూజించి నాలోని భవబంధాలను తొలగించు తల్లీ అంటే ఆ తల్లి తొలగించేస్తుందా? తాను సంసారములో ఉన్నాడు. సంసారం తనతో పెనవేసుకుపోయింది. అప్పుడు తనపాటికి తను అన్నీ త్రెంచుకుపోతే అది సన్యాసం స్వీకరించినట్లు అవుతుంది. తనతో ఉన్నవారిని నట్టేట్లో ముంచినట్లవుతుంది కదా! గనుక తను ధ్యానం చేసుకునే సమయంలో, పరమాత్మ తప్ప వేరే ధ్యాస ఉండకుండా, ఆ సమయంలో కూడా భౌతిక పరమైన, భవబంధపరమైన ఆలోచనలు లేకుండా, కేవలం పరమాత్మనే ధ్యానం చేసుకుంటూ ముక్తికి ఒక్కొక్కసోపానమును నిర్మించుకుంటూ పోవడానికి జగన్మాత అనుగ్రహిస్తుంది. మమతాహంత్రీ యను నామ మంత్రమునకు ఈ భావం సమన్వయమవుతుందని నా భావన. జీవుడు పరమాత్మను అర్థంచేసుకునే జ్ఞానాన్ని జగన్మాత ప్రసాదిస్తుంది. తద్వారా పురుషార్థములలో ధర్మార్ధకామములను సక్రమమార్గంలో నిర్వహింపజేసి ముక్తికి సోపానములు నిర్మించుకోగలగడం జరుగుతుంది ఇదే పరమపదసోపాన నిర్మాణము. ఈ పరమపద సోపాన మార్గంలో ఏమాత్రం పట్టుతప్పినా, ధ్యాస దిశతప్పి వికారములకు లొంగినట్లైతే ఆ మేరకు అజ్ఞానమనే సర్పదంష్టృడై క్రిందకు జారుతాడు సాధకుడు. అందుకని పరమేశ్వరీ ధ్యానం నిరంతరం చేస్తూ జీవనము కొనసాగిస్తూ పరమపదసోపాన నిర్మాణం చేసుకోవాలి.
జగన్మాతచే అనుగ్రహింప బడిన ఆత్మజ్ఞానంతో సాధకుడు మమకారరహితుడై మోక్షమార్గంలో జీవనయానం కొనసాగించు కోగలడు.
జగన్మాతకు నమస్కరించునపుడు ఓం మమతాహంత్ర్యై నమః అని అనవలెను.
[02:57, 30/11/2020] +91 95058 13235: 30.11.2020 ప్రాతః కాల సందేశము
వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం
దశమస్కంధము - పూర్వార్ధము - పదకొండవ అధ్యాయము
గోపాలురు గోకులమునుండి బృందావనమునకు వెడలుట - శ్రీకృష్ణుడు వత్సాసుర, బకాసురులను వధించుట
ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
11.9 (తొమ్మిదవ శ్లోకము)
దర్శయంస్తద్విదాం లోక ఆత్మనో భృత్యవశ్యతామ్|
వ్రజస్యోవాహ వై హర్షం భగవాన్ బాలచేష్టితైః॥8670॥
ఈ విధముగా భక్తవత్సలుడైన శ్రీకృష్ణభగవానుడు తన బాల్యలీలలతో ముద్ధుమురిపెములను కురిపించుచూ, గోకులవాసులసు ఆనందింపజేయుచుండెడివాడు. మరియు లోకమునందు తన ఐశ్వర్యమును, కృష్ణపరతత్ప్వమును ఎరిగియున్నవారికి తన భక్తపరాధీనతను ప్రదర్శించు చుండెడివాడు.
11.10 (పదియవ శ్లోకము)
క్రీణీహి భోః ఫలానీతి శ్రుత్వా సత్వరమచ్యుతః|
ఫలార్థీ ధాన్యమాదాయ యయౌ సర్వఫలప్రదః॥8671॥
11.11 (పదకొండవ శ్లోకము)
ఫలవిక్రయిణీ తస్య చ్యుతధాన్యం కరద్వయమ్|
ఫలైరపూరయద్రత్నైః ఫలభాండమపూరి చ॥8672॥
పండ్లను అమ్ముకొనెడి పడతి "అయ్యలారా! పండ్లు కొనండోయ్! పండ్లు" అని వీధిలో నిలబడి కేకలు వేయుచుండెను. అంతట సకలజనులకును వారివారి కర్మలకును, సేవలకును తగిన ఫలములను ప్రసాదించెడి కన్నయ్య ఆ పండ్లను కొనుటకై తన చిట్టిదోసిలి నిండా ధాన్యమును తీసికొనివచ్చెను. కాని ఆ కన్నయ్య వచ్చునపుడు ఆయన దోసిలిలోగల ధాన్యము త్రోవలోనే జాఱిపోయెను. కానీ! పండ్లను అమ్మెడి ఆ వనిత ఆ స్వామి ముఖారవిందమును జూచి మురిసిపోవుచు ఆయన దోసిలినిండా ఫలములను ఉంచెను. సత్ఫలప్రదాత యైన ఆ ప్రభువు వెంటనే ఆమె గంపనిండా రత్నములను అనుగ్రహించెను.
11.12 (పండ్రెండవ శ్లోకము)
సరిత్తీరగతం కృష్ణం భగ్నార్జునమథాహ్వయత్|
రామం చ రోహిణీదేవీ క్రీడంతం బాలకైర్భృశమ్॥8673॥
11.13 (పదమూడవ శ్లోకము)
నోపేయాతాం యదాఽఽహూతౌ క్రీడాసంగేన పుత్రకౌ|
యశోదాం ప్రేషయామాస రోహిణీ పుత్రవత్సలామ్॥8674॥
మద్దిచెట్లను గూల్చిన కృష్ణుడు మరియు బలరాముడు యమనానదీ తీరమున బాలురతో గూడి ఆటలలో మునిగియుండగా రోహిణీదేవి "ఓ బలరామా! ఓ కృష్ణా! త్వరగా రండు' అని పిలిచెను. పారవశ్యముతో ఆడుకొనుచున్నందున వారు రోహణీదేవి పిలుపును పట్టించుకొనకుండిరి. అప్పుడు ఆమె వారిని దీసికొనివచ్చుటకై పుత్రవాత్సల్యముగల యశోదాదేవిని పంపెను.
11.14 (పదునాలుగవ శ్లోకము)
క్రీడంతం సా సుతం బాలైరతివేలం సహాగ్రజమ్|
యశోదాజోహవీత్కృష్ణం పుత్రస్నేహస్నుతస్తనీ॥8675॥
11.15 (పదునైదవ శ్లోకము)
కృష్ణ కృష్ణారవిందాక్ష తాత ఏహి స్తనం పిబ|
అలం విహారైః క్షుత్క్షాంతః క్రీడాశ్రాంతోఽసి పుత్రక॥8676॥
11.16 (పదహారవ శ్లోకము)
హే రామాగచ్ఛ తాతాశు సానుజః కులనందన|
ప్రాతరేవ కృతాహారస్తద్భవాన్ భోక్తుమర్హతి॥8677॥
11.17 (పదునేడవ శ్లోకము)
ప్రతీక్షతే త్వాం దాశార్హ భోక్ష్యమాణో వ్రజాధిపః|
ఏహ్యావయోః ప్రియం ధేహి స్వగృహాన్ యాత బాలకాః॥8678॥
11.18 (పదునెనిమిదవ శ్లోకము)
ధూలిధూసరితాంగస్త్వం పుత్ర మజ్జనమావహ|
జన్మర్క్షమద్య భవతో విప్రేభ్యో దేహి గాః శుచిః॥8679॥
11.19 (పందొమ్మిదవశ్లోకము)
పశ్య పశ్య వయస్యాంస్తే మాతృమృష్టాన్ స్వలంకృతాన్|
త్వం చ స్నాతః కృతాహారో విహరస్వ స్వలంకృతః॥8680॥
శ్రీకృష్ణుడు తన అన్నయగు బలరామునితో, తోడిబాలురతో ఆడుకొనుచు క్రీడలలో వ్యగ్రుడై యుండెను. అప్ఫుడు పుత్రప్రేమతో నిండారియున్న యశోదమ్మకు స్తన్యము పొంగారుచుండగా ఆ దేవి తన కన్నయ్యను పిలిచెను. "కృష్ణా! కృష్ణా! నాయనా! అరవిందాక్షా! వచ్చిపాలు త్రాగుము. ఆడుకొనినంతవఱకు చాలును. కుమారా! ఆడుకొని ఆడుకొని మిగుల అలసియున్నావు. మిక్కిలి ఆకలిగొనియున్నావు. వెంటనే రమ్ము. నాయనా! కులనందనా! బలరామా! నా ముద్దులకుమారా! తమ్మునితోగూడి నీవు రమ్ము. ప్రొద్దున ఎప్పుడో ఆహారము తీసికొనియున్నావు. అందువలన వెంటనే వచ్చి ఆకలి దీర్చుకొనుము (తినిపొమ్ము). నాయనా! బలరామా! మీ తండ్రియగు నందుడు భుజించుటకు సిద్ధముగానున్నాడు. నీ కొఱకై ఎదురుచూచుచున్నాడు. కావున నీవు వెంటనే వచ్చి మాకు సంతోషమును గూర్పుము. గోపబాలులారా! ఇక ఆటలు చాలించి, మీమీ ఇండ్లకు చేరుడు. కుమారా! ఎగిరెగిరి ఆడుకొనుటవలన నీ శరీరమంతయును దుమ్ముకొట్టుకొని యున్నది. కనుక ఇంటికి వచ్చి స్నానము చేయుము. నేడు నీ జన్మ నక్షత్రము. నేడు నీవు పుట్టినరోజు. శుచివై బ్రాహ్మణోత్తములకు గోవులను దానము చేయుము. ఒక పర్యాయము నీ మిత్రులను చూడుము. వారు అందఱును స్నానములొనర్చుకొని తమ తల్లులచే చక్కగా అలంకృతులై యున్నారు. నీవును స్నానముచేసి, బాగుగా అలంకరించుకొని, భోజనానంతరము మఱల ఆడుకొనుము".
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి పదకొండవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం
7702090319, 9505813235
[02:57, 30/11/2020] +91 95058 13235: 30.11.2020 ప్రాతఃకాల సందేశమునకు అనుబంధం
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
శ్రీకృష్ణలీలలు - తప్ఫక చదవండి
వేదవ్యాస భాగవతంలో, దశమస్కంధంలో, పూర్వార్ధమందు ఏకాదశోధ్యాయంలో పదకొండవ శ్లోకంలో చెప్పినది నేను చిన్నప్ఫుడు పెద్దలు చెప్పగా వినియుంటిని (భాగవతంలో ఇలా చెప్పలేదు అని పొరటున అప్పటిలో అన్నాను) అది ఒక ఘట్టంగా చాలామందికి పంపియున్నాను ఒక సంవత్సరం క్రితం. ఆ చిన్నికృష్ణుని లీలలలో ఇదికూడా ఒకటి. నేటి ప్రాతః కాల సందేశంలో ఈ కథకు సంబంధించిన శ్లోకం వచ్చిన సందర్భంగా శ్రీకృష్ణుని లీలా విశేషమును మరొకసారి అందరికీ అందించుచున్నాను.
పదకొండవ శ్లోకము ఒకసారి చదివిన తరువాత ఈ కథ చదువగలరు.
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
అది మండు వేసవి. మధ్యాహ్న ఒంటిగంట దాటింది. ఆ అవ్వ పండు ముదుసలి. తలపై బరువైన పళ్ళ బుట్టతో వేణుగోపాలస్వామి గుడిదగ్గర కాసేపు నీడలో కూచుందామని వచ్చింది. మెల్లగా బుట్టదించింది. చెమట పట్టిన ఆ ముడుతల ముఖాన్ని తుడుచుకుంటూ నాయనా గోపాలా ఊరంతా తిరిగాను. ఒక్కపండుకూడా అమ్మలేదు. ఈ రోజు పస్తేనా ఆ వేణుగోపాలుని విగ్రహం చూస్తూ అంది.
అంతలో ఒక బాలుడు. నుదుటిపై కస్తూరి తిలకం, వక్షస్థలంపై కౌస్తుభహారం, నాసాగ్రమున నవమౌక్తికం, కంఠాన ముత్యాల హారం, చేత పిల్లనగ్రోవి, శిఖలో నెమలి పింఛం. ఎవరో కాదు. ఆ బాలుడు వేణుగోపాలుడే. ఆ అవ్వ దిశగా వస్తున్నాడు. ఆ అవ్వ అలా చూస్తోంది ఎవరా అన్నట్లు. దగ్గరగా వచ్చిన బాలుని చూసింది. ఆ లీలా మానుషుని చూసింది. అయినా కలియుగం. భగవంతుని దర్శనం ఏమిటిలే అనుకుంది.
అవ్వా, ఈ పళ్ళుతీయగా ఉంటాయా అడిగాడు.
అవును కన్నా. చాలా తీయగా ఉంటాయి. తీసుకో అంది.
బాలుడు: ఎన్ని
అవ్వ: ఎంత డబ్బు ఇస్తే అన్ని
బాలుడు: డబ్బా? అంటే?
అవ్వ: నీకు అర్ధం అవలేదా
అవలేదన్నట్లు తల ఊపాడు
ఆ చోద్యాన్ని నారదుడు చూస్తున్నాడు. ఆ లీలామానుష విగ్రహదారి లీల ఏమిటా అన్నట్లు గమనిస్తున్నాడు.
అవ్వ: అయ్యొ పిచ్చికన్నా, డబ్భంటేనే తెలియదా? నీవు ఏదైనా తీసుకుంటే దానికి ప్రతిఫలం ఇవ్వాలి. అదే డబ్బంటే
బాలుడు: డబ్బా? అదేమిటి? నాదగ్గర లేదే?
అవ్వ: నీకు తెలియదులే. అమ్మనడుగు పళ్ళుకొనడానికి డబ్బు కావాలని. ఇస్తుంది. పో. త్వరగా రా
బాలుడు: అమ్మ ఇంట్లో లేదు. యమునకు వెళ్ళింది
అవ్వ: ఇంట్లో ఏమైనా ధాన్యం గింజలున్నాయా
బాలుడు: ఓ చాలా ఉన్నాయి. గాదెల నిండా ఉన్నాయి
అవ్వ: అయితే తీసుకురా. పళ్ళు ఇస్తాను
బాలుడు: చాలా వింతగా ఉందే. అమ్మ ఎన్నో ఇస్తుంది. కానీ ఏమీ తీసుకోదు. గొల్లభామలు వెన్న పెడతారు. డబ్బులు తీసుకోరు. వాళ్ళు నన్ను ముద్దు పెట్టుకోమంటారు. కౌగిలించుకోమంటారు. అమ్మా అనమంటారు
బాలుడి మాటలు అవ్వకు అంత అలసటలోను నవ్వు తెప్పిస్తున్నాయి. బాలుని చూస్తోంది అలాగే. ఏదో తన్మయమయిపోతోంది ఆ ముద్దుముద్దు మాటలకు.
బాలుడు: అమ్మా
అవ్వ: అమ్మానా? నన్నే
బాలుడు: అవునమ్మా నిన్నే అమ్మా అన్నాను. అమ్మా అంటాను. నిన్ను కౌగలించు కుంటాను. నీ ఒళ్ళో కూచుంటాను. నిన్ను ముద్దు పెట్టుకుంటాను. ఒక్క పండు ఇవ్వవా?తినాలనుంది
అవ్వ: పిచ్చి తండ్రీ. నాకా అదృష్టం లేదుకన్నా.
బాలుడు: ఎందుకు?
అవ్వ: నేను అంటరానిదానను. నేను ఎలా ముద్దాడగలను?
అవ్వ అలా అంటుంటే బాలుడు ఇలా అంటూ అవ్వ ఒడిలో వాలిపోయాడు. అవ్వను ముద్దె ట్టుకున్నాడు. మెడ చుట్టూ చేతులు చుట్టేశాడు.
అవ్వ: అయ్యో కన్నా. ఏమిటిది. ఎవరైనా చూస్తే ఎంత గొడవ. నేను అంటరాని దానను
బాలుడు: ఏం? అంటరానివారు మనుషులు కారా?. అలాంటి ఆంక్షలు నాకు ఇష్టంలేదు. నా స్నేహితులు చాలా మంది అంటరానివారే. నవ్వు కూడా అమ్మవే నాకు అంటూ అవ్వనుముద్థు పెట్టుకున్నాడు.
నారదుడు చూస్తున్నాడు. దవడలు నొక్కుకుంటున్నాడు. ముసిముసి నవ్వులు నవ్వుతున్నాడు.
అవ్వ ఆ బాలుడి కళ్ళలోకి అలా వాత్సల్యంగా శ్రీకృష్ణునికి యశోదాదేవిలాగ, శ్రీనివాసూనికి వకుళాంబలాగ చూస్తోంది. తన అదృష్టానికి మురిసిపోతోంది.
అవ్వ: కన్నా నువ్వు ఎవరివి? ఏమిటీ మాయ? నీ స్పర్శ నా ఆత్మలో వెలుగు చిమ్మి తన్మయ పరచింది. క్రిందటి జన్మలో యశోదా దేవినా? లేక వకుళాదేవినా? చాలు ఈ అదృష్టం. ఇంతకన్నా ధనం వద్థు. తీసుకో పళ్ళు ఎన్నికావాలో. ఒకటా? రెండా? అన్నీనా? తీసుకో కన్నా ఎన్నికావాలో.
బాలుడు: నాకు ఇవి అన్నీ కావాలి
అవ్వ: అలాగే కన్నా. అన్నీ తీసుకో అన్నీ తీసి ఒక గుడ్డలో మూట కట్టబోయింది.
బాలుడు: ఉండమ్మా. బాధపడకు. నేను కావలసినన్ని ధాన్యం గింజలు కూడా తెస్తాను
అవ్వ: కన్నా వద్దు. నా జన్మ తరించిపోయింది. పళ్ళు తీసుకో కన్నా
ఆ బాలుడు వినిపించుకోకుండా చిట్టి చిట్టి అడుగులతో తుర్ మంటూ ఇంట్లోకి వెళుతుంటే ఆ అవ్వ ఆ బాలునివైపే చూస్తూ తన్మయమయిపోతోంది.
బుట్టలో పళ్ళన్నీ ఆ బాలునికోసం గుడ్డలో వేసి మూటకడుతోంది.
ఇంతలో ఆ బాలుడు పెద్ద నంద (ధాన్యం దాచే పెద్ద జాడీలాంటి కుండ) మీద ఉన్న మూత రెండు చేతులతో మెల్లగా దించి క్రింద ఉంచాడు. చిట్టి చేతులను దోసిలిగా చేసి, నిండా ధాన్యం తీసుకున్నాడు. తీసుకు వస్తున్నాడు. దారంతా గింజ గింజా పడిపోతున్నాయి.
బాలుడు: ఇవిగో ఇన్ని గింజలు తెచ్చాను. తీసుకో అంటూ అవ్వకు చూపించాడు. ఆ చిట్టి చేతుల దోసిలిలో పది లేదా పదిహేను గింజలు మాత్రమే ఉన్నాయి.
అవ్వ అలా దోసిలివైపు ఆబాలుని బుంగమూతవైఫు, ఆ బాలుని మిలమిలలాడే కన్నులవైపు చూస్తోంది.
ఆ బాలుడు గర్వంగా చిరునవ్వుతో, నాడు పదునాల్గులోకాలు యశోదాదేవికిచూపిన ఆ నోటిని సగం తెరచి అవ్వవైపు చూస్తున్నాడు.
ఆ గింజలు చూసి పక్కున నవ్వలేక బోసి నోరు సగం తెరచుకుని, కంటి నుండి వాత్సల్య పూరితమైన ఆనందాశ్రువులతో లీలామానుషధారిని చూస్తూ తన్మయమైపోతూ తనను తాను మరచిపోయి అలా ఉండిపోయింది ఆ అవ్వ.
అవ్వ: అబ్బో చాలా తెచ్చావే. చాలు కన్నా
బాలుడు: చాలానే దోసిలిలో తీసకున్నాను. అన్నీ మార్గంలో జల్లుకుపోయాయి. ఇవే ఉన్నాయమ్మా బుంగమూతితో అవ్వ వైపు చూస్తున్నాడు.
అవ్వ: ఇవే చాలా ఎక్కువ కన్నా. నా బుట్టనిండా అవుతాయి. ఆ ధాన్యంగింజలు తీసుకుంది. ఈరోజు ఒక మంచిరోజు అనుకుంది అవ్వ. ఆ కొంచం గింజలే బుట్టలోని గుడ్డలో అపురూపంగా పోసుకుంది. పళ్ళమూట బాలునికి ఇచ్చింది. బాలుడిని మనసారా కౌగలించుకుంది. ముద్థుపెట్టుకుంది. విడువలేక విడువలేక బయలుదేరింది.
అంతా నారదమహాముని తిలకించుతున్నాడు. ఆ శ్రీకృష్ఞపరమాత్మ ఏ లీల చూపనున్నాడా అన్నట్టు నమస్కారం చేశాడు.
అవ్వ బుట్ట తేలికగా ఉంది. మనసు ఆ బాలుని స్పర్శతో పరమానందంతో నిండిపోయింది. ఇంటికి చేరింది. నట్టింట్లో బుట్ట క్రింద పెట్టి, కూర్చుని బుట్టలోని ధాన్యం గింజలు కట్టిన గుడ్డ తెరిచి చూస్తే......🙏🙏🙏అందులో ధాన్యంగింజలు లేవు. వాటి స్థానంలో గంపెడు నవరత్నాలు, మణి మాణిక్యాలు ధగధగలతో అవ్వ కళ్ళను ఆశ్చర్యపరిచాయి. ఆమె చేతులు రేండు జోడించి పరమాత్మని నమస్కరిస్తున్నాయి.
గమనిస్తున్న నారదుడు ఆ పరమాత్మ ఆవ్వపై కురిపించిన కనకవర్షానికి ఇది పరమాత్మ చూపించిన ఇంకొక భక్తిమార్గము అనుకున్నాడు. మనకు ధనరాశులు ఇచ్చి భక్తిమార్గంలో వెళుతామా లేక ధనరాశులవలన వేరే పేరాశలు, పెనబంధాలకు మార్గం మార్చుకుంటామా అనేదానికి ఇది ఒక పరీక్ష కాదుగదా? ఆ పరమాత్మ వేసే ధనాకర్షణ అనే ఉచ్చులో నరుని వివేకము ఏవిధంగా పయనిస్తుందో..దైవచింతనవైపా లేక ధనచింతనవైపా? నరుడీ పరీక్షలో బాగా యోచించి ధనమనే మాయాపాశానికి లొంగక ఆ పరమాత్మ చింతనలోకి వెళతాడా లేక ఆ ఉచ్చులోచిక్కిపోయి ఐహిక బంధాలలో ఉండిపోతాడా? ఆ నందనందనుడు బహు చమత్కారి. అనుకున్నాడు నారదుడు🙏🙏🙏🙏🙏🕉🕉🕉🕉
పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం
7702090319, 9505813235
[02:57, 30/11/2020] +91 95058 13235: బమ్మెర పోతనామాత్యులవారు భగవానుని కీర్తించిన విధానము ఆయన పద్యంలో పరిశీలించగలరు
గుహ్యకులుకృష్ణునిపొగడుట
శార్దూల విక్రీడితము
నీ పద్యావళు లాలకించు చెవులున్ నిన్నాడు వాక్యంబులున్
నీ పేరం బనిచేయు హస్తయుగముల్ నీ మూర్తిపైఁ జూపులున్
నీ పాదంబుల పొంత మ్రొక్కు శిరముల్ నీ సేవపైఁ జిత్తముల్
నీ పై బుద్ధులు మాకు నిమ్ము కరుణన్ నీరేజపత్రేక్షణా!
భావం
ఓ కమలపత్రాల వంటి కన్నులున్న కన్నయ్యా! నీ స్తుతి చేసే పద్యాలను విడువక వింటూ ఉండే చెవులను, నిన్ను విడువక స్తోత్రం చేస్తు ఉండే వాక్కులను మాకు అనుగ్రహించు. ఏ పని చేస్తున్నా నీ పేరనే నీ పనిగానే చేసే చేతలను, ఎప్పుడు విడువక నిన్నే చూసే చూపులను మాకు అనుగ్రహించు. నీ పాదపద్మాలను విడువక నమస్కరించే శిరస్సులను, నీమీద ఏకాగ్రమైన భక్తి కలిగి ఉండే మనస్సును, నిరంతరం నీ ధ్యానం పైనే నిలిచి ఉండే బుద్ధిని మాకు దయతో ప్రసాదించు, పరమేశ్వరా!
బాలకృష్ణుడు తన నడుముకు కట్టిన ఱోలు ఈడ్చుకుంటూ రెండు మద్దిచెట్లను కూల్చాడు. వాటినుండి విముక్తులైన గుహ్యకులు కపటబాలుని స్తుతించి మాకు నీ యందు ప్రపత్తిని అనుగ్రహించమని ఇలా వేడుకున్నారు. ఇది భాగవతుల ధర్మాలని నిర్వచించే ఒక పరమాద్భుతమైన పద్యం. అందుకే ఒక శార్దూలాన్ని వదలి, ప్రాసాక్షార నియమాన్ని యతి స్థానాలైన మొదటి, పదమూడవ స్థానాలకు కూడా ప్రసరింపజేసి పంచదార పలుకులకు ప్రత్యేక జిలుగులు అద్దారు పోతనామాత్యులు.
[21:15, 30/11/2020] +91 95058 13235: 30.11.2020 సాయం కాల సందేశము
వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం
దశమస్కంధము - పూర్వార్ధము - పదకొండవ అధ్యాయము
గోపాలురు గోకులమునుండి బృందావనమునకు వెడలుట - శ్రీకృష్ణుడు వత్సాసుర, బకాసురులను వధించుట
ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
11.20 (ఇరువదియవ శ్లోకము)
ఇత్థం యశోదా తమశేషశేఖరం మత్వా సుతం స్నేహనిబద్ధధీర్నృప|
హస్తే గృహీత్వా సహ రామమచ్యుతం నీత్వా స్వవాటం కృతవత్యథోదయమ్॥8681॥
పరీక్షిన్మహారాజా! ఆ యశోదమ్మ గోపబాలురలో శ్రేష్థుడైన (దేవతాశిరోమణియైన) శ్రీకృష్ణభగవానుని ఇట్లు తన కుమారునిగా భావించి, తనలో ఎంతయు మమకారమును నింపుకొనినదై, ఒక చేతితో శ్రీకృష్ణుని, మఱియొక చేతితో బలరాముని పట్టుకొని తన యింటిలోనికి తీసికొనివెళ్ళెను. పిదప ఆ దేవి ప్రేమతో వారికి స్నానపానాది కృత్యములను జరిపెను.
11.21 (ఇరువది ఒకటవ శ్లోకము)
గోపవృద్ధా మహోత్పాతాననుభూయ బృహద్వనే|
నందాదయః సమాగమ్య వ్రజకార్యమమంత్రయన్॥8682॥
11.22 (ఇరువది రెండవ శ్లోకము)
తత్రోపనందనామాఽఽహ గోపో జ్ఞానవయోఽధికః|
దేశకాలార్థతత్త్వజ్ఞః ప్రియకృద్రామకృష్ణయోః॥8683॥
ఆ వ్రేపల్లెలోని బృహద్వనము పెక్కు మహోత్పాతములకు గుఱియగు చుండుటతో (పూతన, శకటా సురాదులవలన ప్రమాదములు వచ్చిపడుచుండుటతో) ఏమియు తోచక నందాది గోపవృద్ధులు అందఱును ఒకచోటచేరి, 'ఇపుడు మన కర్తవ్యమేమి?' అని ఆలోచింపసాగిరి. వారిలో ఉపనందుడు అను గోపాలుడు జ్ఞానమును బట్టియు, వయస్సు చేతను పెద్దవాడు. అంతేగాక అతడు దేశ, కాలపరిస్థితులకు అనుగుణముగా కర్తవ్యములను గూర్చి బాగుగా ఎఱిగినవాడు. బలరామకృష్ణులకు ప్రియమును గూర్చుటయనిన అతనికి ప్రాణము (అనుక్షణము బలరామకృష్ణుల యోగక్షేమములను గూర్చి ఆరాటపడుచుండువాడు). అట్టి వృద్ధుడు ఆ సమయమున ఇట్లు నుడివెను.
11.23 (ఇరువది మూడవ శ్లోకము)
ఉత్థాతవ్యమితోఽస్మాభిర్గోకులస్య హితైషిభిః|
ఆయాంత్యత్ర మహోత్పాతా బాలానాం నాశహేతవః॥8684॥
"మిత్రులారా! ఇచట పెక్కు మహోత్పాతములు ఘటిల్లుచున్నవి. ఇకముందు ఎట్టి ఉపద్రవములు ఏర్పడునో? ఇట్టివి బాలురకు అనగా భావితరముల వారైన మన చిన్నారులకు ఎంతయు అనర్థదాయకములు. కనుక మనమందరము ఈ గోకులవాసుల హితముకొఱకై ఇచటినుండి మన నివాసమును మార్చుకొనుట యుక్తము.
11.24 (ఇరువది ఒకటవ శ్లోకము)
ముక్తః కథంచిద్రాక్షస్యా బాలఘ్న్యా బాలకో హ్యసౌ|
హరేరనుగ్రహాన్నూనమనశ్చోపరి నాపతత్॥8685॥
ఇంతకుముందు మన చిన్నికృష్ణుడు బాలఘాతినియై పూతన అను రాక్షసివలన పెనుప్రమాద స్థితికి లోనయ్యును ఎట్టకేలకు అందునుండి బయటపడెను. అంతేగాక, ఒక పెద్దశకటము మీద పడినను నిజముగా ఆ శ్రీహరి అనుగ్రహమువలననే సురక్షితుడైయుండెను.
11.25 (ఇరువది ఐదవ శ్లోకము)
చక్రవాతేన నీతోఽయం దైత్యేన విపదం వియత్|
శిలాయాం పతితస్తత్ర పరిత్రాతః సురేశ్వరైః॥8686॥
సుడిగాలి రూపమున వచ్చిన దైత్యుడు మన చిన్నికృష్ణుని అంతరిక్షమునకు తీసికొనిపోయి పెను ఆపదలో పడవేసెను. పిమ్మట ఇతడు ఆ ఆకాశమునుండి ఒక మహాశిలపై పడిపోయినను మన ఇలవేలుపుల వలన రక్షింపబడెను.
11.26 (ఇరువది ఆరవ శ్లోకము)
యన్న మ్రియేత ద్రుమయోరంతరం ప్రాప్య బాలకః|
అసావన్యతమో వాపి తదప్యచ్యుతరక్షణమ్॥8687॥
ఇంత ఎందులకు మన చిట్టికృష్ణుడు రెండు పెద్ద మద్దిచెట్లమధ్యగా వెళ్ళు సమయమున అవి మహాశబ్దము ఒనర్చుచు నేలగూలెను. ప్రమాదకరమైన ఆ సంఘటనమునుండి ఈ చిన్నారిగాని, అచటనేయున్న ఇతర గోపబాలురుగాని ఎట్టి హానికిని లోనుగాక దైవానుగ్రహము చేతనే క్షేమముగా బయటపడిరి.
11.27 (ఇరువది ఏడవ శ్లోకము)
యావదౌత్పాతికోఽరిష్టో వ్రజం నాభిభవేదితః|
తావద్బాలానుపాదాయ యాస్యామోఽన్యత్ర సానుగాః॥8688॥
ఇకమీదట ఈ గోకులమునకు ఎట్టి ఉత్పాతములను, అరిష్టములును ప్రాప్తించకముందే, మనబాలురను అందఱిని తీసికొని, అనుచరులతో సహా మఱియొక సురక్షిత ప్రదేశమునకు చేరుదము.
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి పదకొండవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం
7702090319, 9505813235
[02:35, 01/12/2020] +91 95058 13235: శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
740వ నామ మంత్రము
ఓం లజ్జాయై నమః
స్త్రీలకు అలంకారమైన లజ్జా (నమ్రత) రూపంలో సర్వజీవులయందునూ విలసిల్లు పరాశక్తికి నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి లజ్జా యను రెండక్షరముల (ద్వ్యక్షరీ) నామ మంత్రమును ఓం లజ్జాయై నమః అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను అత్యంత భక్తి శ్రద్ధలతో ఉపాసించు సాధకుని అత్యంత నమ్రతతోను, అహంకార రహితంగాను ప్రవర్తింపజేయును మరియు ఇష్టకామ్యార్థసిద్ధియు కలుగజేయును.
లజ్జ అనగా స్త్రీ సహజమైన సిగ్గు మాత్రమే కాదు. స్త్రీ మూర్తికి ఉండవలసిన నిరహంకారము. సాధారణంగా స్త్రీ మూర్తి కపటరహితంగా ఉంటుంది. సుకుమారమైన స్త్రీ మూర్తి నమ్రత గానుండు సలక్షణము కూడా.
పరమేశ్వరుని సన్నిధిలో జగన్మాత లజ్జా స్వరూపిణిగా ఆయన హృదయంలో ఒదిగి పోతుంది. అందుకే జగన్నాత లజ్జా యని నామ ప్రసిద్ధమైనది.
ఆ తల్లి జగన్మాత. సకల లోకాలకు శ్రీమహారాజ్ఞి. చిదగ్నికుండ సంభూత భండాసురాది రాక్షసులను సంహరించిన ధీరురాలు. భర్తఅయిన పరమేశ్వరుణ్ణి తన స్వాధీనంలో ఉంచుకుని, పరమేశ్వరుడు శక్తికి అధీనుడు అనిపించుకున్న స్వాధీనవల్లభా యను నామ ప్రసిద్ధ. శ్రీవిద్యానగరానికి నాయికగా శ్రీమన్నగరనాయికా యను నామము గలిగి విరాజిల్లు తల్లి. బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశాన, సదాశివులచే నిర్మితమైన ఆసనమును కలిగి పంచబ్రహ్మాసన సంస్థితా యను నామముతో స్తుతింప బడుచున్నది. అయినప్పటికిని ఆ తల్లి తన పతియైన పరమేశ్వరుని వద్ద వినమ్రతామూర్తి (విధేయురాలు) గనుకనే లజ్జా యను నామ మంత్రమునకు సార్థకమయినది. తానెంత శ్రీమహాసామ్రాజ్ఞి యైనను, చిదగ్నికుండ సంభూత అయినను, సౌందర్యనిధియై మహాలావణ్యశేవధిః అని అనిపించుకున్నను అవధులులేని నిరహంకారి గనుకనే లజ్జా యను నామ మంత్రముతో ఆరాధింపబడుచున్నది.
జగన్మాతకు నమస్కరించునపుడు ఓం లజ్జాయై నమః అని అనవలెను.
[02:36, 01/12/2020] +91 95058 13235: శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
166వ నామ మంత్రము
ఓం నిష్పాపాయై నమః
అవిద్య, అజ్ఞానము, అన్యులకు అకారణముగా దుఃఖకారణమగుట వంటి పాపహేతు లక్షణములు లేని పాపరహితురాలైన పరమేశ్వరికి నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి నిష్పాపా యను మూడక్షరముల (త్ర్యక్షరీ) నామ మంత్రమును ఓం నిష్పాపాయై నమః అని ఉచ్చరించుచూ, అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ పరమేశ్వరిని ఆరాధించు భక్తులను తెలిసిగాని, తెలియకగాని, అజ్ఞానముచేగాని వారు చేసిన పాపకర్మలవలన లభించిన దోషములను తొలగించి సత్కర్మలను వారిచే చేయునట్లుగా అనుగ్రహించి తరింపజేయును.
జగన్మాత పరమాత్మ స్వరూపిణి. అజ్ఞానము, అవిద్య సంబంధిత పాపహేతువులకు సంబంధించిన లక్షణములు ఉండవు. ఆతల్లి పాపరహితురాలు.
మానవుడు చేసే ప్రతీ పనివలన పాపహేతువైనదైనా కావచ్చు, పుణ్యకార్యమైనా కావచ్చు. భక్తరామదాసు శ్రీరామాలయం నిర్మించి, సీతారామలక్ష్మణులకు నగలు చేయించినది పుణ్యకార్యమే. అయినా ఆయన చెరసాలజీవితం అనుభవించారు. కారణం? రామచిలుకను పెంచి, ప్రేమమాటలు నేర్పించారు. కాని దానిని పంజరంలో బంధించారు. అలాగే చేసుకున్నవారికి చేసుకున్నంత. పాపకర్మలకైనా, పుణ్యకర్మలకైనా ఫలితం ఈ జన్నలోనే ఇప్పుడైనా కావచ్చు, లేదా మరుజన్మకు సంచితమైనా కావచ్చు. మంచి కర్మలు చేస్తే తరువాత జన్మ మంచిది అవుతుంది. పాపకర్మలు చేస్తే ఆ జన్మ పిల్లిగా గాని, బల్లిగాగాని మరియేదైనా పశువులు, పక్షులు, క్రిమికీటకాలుగా నైనా కావచ్చు. చేసేపాపం భౌతికముగా గాని మానసికంగా గాని ఎలా చేసినా అది పాపమే. అందుకు ఫలితం తథ్యం.
చేసిన పాపం కట్టి కుడుపుతుంది అంటారు. నిజమే. అది ఈ జన్మలోనే జరగడం సాధారణం.
అలాగే మనం చేయవలసిన సత్కర్మలు అనేకం ఉన్నాయి. అవి నిర్వర్తించక పోవడం కూడా మహాపాపమే అవుతుంది.
దైవికముగా ఆధ్యాత్మికముగా ఋణము అంటే మనము జీవితములో విధిగా చేయవలసిన కార్యములు అని అర్ధము. అవి మూడు
త్రిఋణాలు అనగా మనిషికి జన్మనిచ్చిన వారికి అతను మూడు విధాలుగ ఋణపడి ఉంటాడు. ఈ ఋణములను అతను తన జీవిత కాలంలొ తీర్చుకోవలసి ఉంటుంది. అవి
1) దైవ ఋణములు, 2) పితృ ఋణములు, 3) ఋషి ఋణములు
ఆశ్రమ ధర్మాలు అనగా మనిషి జన్మ తంతు ప్రారంభమయినప్పటి నుండి పరమపదించేవరకు మనిషి వివిధ వయసులలో చెయ్యవలసిన కర్మలే.
దైవ ఋణాలు:
మనిషి జన్మకు మూల కారణం దేవుడు కనుక మొదటగ మనిషి దేవతలకు ఋణము తేర్చుకోవాలి! యజ్ఞ యాగాదులు నిర్వహించడము దైవఋణములు తీర్చుకోవడనికి ఒక త్రోవగా చెప్పడమయినది. యజ్ఞ తంతు లో వైదిక దేవతలయిన ఇంద్రుడు, వరుణుడు, అగ్ని, అశ్విని దేవతలు మొదలయినవారిని పూజించడం చెయ్యవలెను. వివిధ రకాలయిన ద్రవ్యములు ప్రధానంగా ఆవు నెయ్యి యజ్ఞ కుండములో అగ్నికి సమర్పించడం జరుగుతుంది. తదుపరి భూతబలులు ఇచ్చి దేవతలకు ఆహారముగ సమర్పించడం జరుగుతుంది. అనగా యజ్ఞ తంతు లో తోటి జనులకు విందు భోజనములు నిర్వహించాలి.
పితృ ఋణములు:
భౌతికంగా మనిషి కి జన్మనిచ్చిన జననీ జనకులకు, వారికి జన్మనిచ్చిన వారి పితృదేవతలకు...ప్రతి మనిషి ఋణపడి ఉంటాడనేది పితృఋణము. తల్లి దండ్రులను అవసాన దశలో కంటికి రెప్పలా కాపాడుకోవడం, వారు శయ్యపైనే ఉండిపోతే (తమ పసితనంలో తల్లి, దండ్రి తమ మలమూత్రాలను భరిస్తూ, తమకు విద్యాబుద్ధులు చెప్పించి, చేయిపట్టి నడిపించి, ఒక ఇంటివాడిని చేయువరకూ వారు పడిన తపన గుర్తుంచుకొంటూ) సేవచేసి, మరణించిన పిదప అంత్యక్రియల నుండి కర్మకాండల వరకు, తరువాత ప్రతి అమావాస్యకు పితృదేవతలకు తర్పణవిధి, ప్రతిసంవత్సరము శ్రాద్ధకర్మలాచరించడం ద్వారా పితృఋణం తీరుతుంది.
ఋషి ఋణములు:
ఋషులు అనగా మనకు జ్ఞాన సంపదను అందించిన మన గురువులు. మనకు తరతరాలుగా వారసత్వంగా వస్తున్న వేదములు, పురాణాలు, వేదాంగాలు, ఇతిహాసాలు - రామాయణ, భారతాలు, ఉపనిషత్తులు, శిక్ష, నిరుక్తి, వ్యాకరణము, యోగ, మొదలయిన జ్ఞాన సంపదను మనకు అందించిన దైవాంశ సంభూతులయిన మహా పురుషులే ఋషులు. వీరికి మనము అనగా హిందువులు ప్రత్యేకంగా ఋణపడి ఉంటారు. పైన ఉదహరించిన శాస్త్రాల్ని అభ్యసించడం ద్వారాను జ్ఞాన సముపార్జన చెయ్యడం ద్వారాను మరియు పర్వ దినాల్లో బ్రహ్మచర్యం , ఉపవాసము పాటించడం ద్వారాను హిందువులు ఋషులకు చెల్లించాల్సిన ఋణాల్ని తీర్చుకోవలెను.
మనిషి తన ఈ జన్మ లో ఈ మూడు ఋణాల్ని తీర్చుకోవడం ప్రధానకర్తవ్యం.
ఈ ఋణములు సక్రమంగా తీర్చుకోకపోవడం కూడా ఒక మహాపాపమే ఈ పాపానికి నిష్కృతి లేదు. జగన్మాతకూడా వీటిని క్షమించదు.
శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ న విద్యతే
శ్రీశైలశిఖర దర్శనం చేసుకున్నవారికి పునర్జన్మ ఉండదు. అంటారు. అందుకు ఒక కథ ఉన్నది.
ఒకసారి భ్రమరాంబ, మల్లికార్జునులు భక్తులను పరీక్షింపదలచారు.
మల్లికార్జునుడు వృద్ధబ్రాహ్మణునిగాను, భ్రమరాంబ ఆయనభార్యవృద్ధ బ్రాహ్మణ ముత్తైదువగానూ కొండ దిగువకు వచ్చారు. వృద్ధబ్రాహ్మణుడు ఒక ఊబిలో దిగబడిపోతున్నాడు. ఆ బ్రాహ్మణ ముత్తైదువు ఒడ్డున నిలబడి "అయ్యా! అమ్మా! నాభర్త ఊబిలో దిగబడిపోయారు. మీలో పాపంలేనివారు ఎవరైనా ఉంటే చేయి అందివ్వండి. ఆయన పైకి వచ్చేస్తారు. నా భర్త నాకు దక్కుతారు" అంటూ జాలిగా గోలపెడుతున్నది.
వచ్చేపోయేవారు అందరూ ఒకరి ముఖములు ఒకరు చూచుకుంటున్నారు. పెదవులు విరుస్తున్నారు. "అసలే మానవ జన్మ. పాపకర్మలు తప్ప పుణ్యకార్యములు చేసేది ఉండదు. మనం ఎలా చేయి అందిస్తాము అనుకుంటున్నారు"
ఆ బ్రాహ్మణ ముత్తైదువ ఆక్రందన మరింత ఎక్కువ అయినది.
ఇంతలో ఒక వేశ్య ఆ ఆక్రందన విన్నది.
"శ్రీశైల శిఖరం చూచినవారికి పాపాలు ఉండవుకదా. మరి నాకు పాపం ఎలా ఉంటుంది?" అనిఅంటూ "శ్రీశైల శిఖరం చూచాను. ఇంకనాకు పాపాలు లేవుగదా! పట్టవయ్యా బ్రాహ్మణోత్తమా నాచేయి. ఊబినుంచి పైకి రావయ్యా! నీ భార్య నీకోసం దుఃఖిస్తోంది" అంటూ ఆ వేశ్య చేయి అందించి ఆ బ్రాహ్మణరూపంలో ఉన్న మల్లికార్జున స్వామిని లాగింది. భ్రమరాంబా మల్లికార్జునులు ఆవేశ్యా స్త్రీకి మరింత పుణ్యఫలం ప్రసాదించి ఆమెకు ఉత్తమ గతులు కలిగించారు.
ఇది మనకు తెలియకనే పుణ్యమూ చేస్తాము, పాపమూ చేస్తాము. అందుచే జగన్మాత నామస్మరణ మాత్రమే తెలిసి చేయు పుణ్యకారణమైన సత్కర్మ.
మానవునికే ఇన్ని చిక్కులు. మానవునికే కాదు ప్రతీ శరీరధారికి రాసిపెట్టినవే. పాపంచేయడానికి ఎన్ని అవకాశములు ఉన్నవో పుణ్యములు చేయడానికి కూడా అన్ని అవకాశములు ఉన్నాయి. కాని ఆత్మకు కాదు. పరమాత్మకు అసలేకాదు. అందుకే జగన్మాత నిష్ఫాపా అని నామ ప్రసిద్ధమయినది.
గనుక జగన్మాతకు నమస్కరిస్తూ ఓం నిష్పాపాయై నమః అని అనవలెను.
మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐
[02:36, 01/12/2020] +91 95058 13235: 1.12.2020 ప్రాతః కాల సందేశము
వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం
దశమస్కంధము - పూర్వార్ధము - పదకొండవ అధ్యాయము
గోపాలురు గోకులమునుండి బృందావనమునకు వెడలుట - శ్రీకృష్ణుడు వత్సాసుర, బకాసురులను వధించుట
ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
11.28 (ఇరువది ఒకటవ శ్లోకము)
వనం వృందావనం నామ పశవ్యం నవకాననమ్|
గోపగోపీగవాం సేవ్యం పుణ్యాద్రితృణవీరుధమ్॥8689॥
ఇచటికి సమీపముననే బృందావనము అను ఒక క్రొత్త వనముగలదు. అచట పశుగ్రాసమునకును జలసమృద్ధికిని లోటే యుండదు. అది రమణీయమైన పర్వతముతో గూడి నిరంతరము చక్కని పచ్చికబయళ్ళతో, లతలతో, వృక్షములతో కళకళలాడుచుండును. అందువలన ఆ ప్రదేశము మన గోపాలురును, గోపికలును, గోవులును హాయిగా నివసించుటకు ఎంతేని యుక్తమైనది.
11.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)
తత్తత్రాద్యైవ యాస్యామః శకటాన్ యుంక్త మా చిరమ్|
గోధనాన్యగ్రతో యాంతు భవతాం యది రోచతే॥8690॥
మీ అందరికిని నా మాటలు నచ్చినచో నేడే అచటికి బయలుదేఱుదము. ఏ మాత్రమూ ఆలసింపక బండ్లను సిద్ధపఱచుడు. మనకు సకలసంపదలైన ఈ గోవులను, శకటములకు ముందుభాగమున నడుపుడు".
11.30 (ముప్పదియవ శ్లోకము)
తచ్ఛ్రుత్వైకధియో గోపాః సాధు సాధ్వితి వాదినః|
వ్రజాన్ స్వాన్ స్వాన్ సమాయుజ్య యయూ రూఢపరిచ్ఛదాః॥8691॥
అని చెప్పిన ఉపనందుని మాటలను విన్నంతనే 'బాగుబాగు' అనుచు గోపాలురు అందఱును, అతని వచనములను ఏకగ్రీవమగా ఆమోదించిరి. పిమ్మట వారు తమ వ్రజవాసులను, గోవులను, వెంటనిడుకొని, తమ తమ గృహసామాగ్రిని బండ్లకెక్కించి, అచటినుండి బృందావనమునకు బయలుదేఱిరి.
11.31 (ముప్పది ఒకటవ శ్లోకము)
వృద్ధాన్ బాలాన్ స్త్రియో రాజన్ సర్వోపకరణాని చ|
అనస్స్వారోప్య గోపాలా యత్తా ఆత్తశరాసనాః॥8692॥
11.32 (ముప్పది రెండవ శ్లోకము)
గోధనాని పురస్కృత్య శృంగాణ్యాపూర్య సర్వతః|
తూర్యఘోషేణ మహతా యయుః సహ పురోహితాః॥8693॥
పరీక్షిన్మహారాజా! వృద్ధులను, బాలురను, స్త్రీలను, సకల గృహోపకరణములను తమ శకటములపై చేర్చుకొని, గోపాలురు ధనుర్బాణములను చేబూని, ఆ శకటములను రక్షించుచు నడచిరి. వారు గోవులను, దూడలను ముందు భాగమున నడిపించుచు, వాటికి వెనుక భాగమున తాము కొమ్మువాద్యములను పూరించుచు, అద్భుతముగా తూర్యధ్వనులను గావించుచు, పురోహితులతో గూడి తమ ప్రయాణములను కొనసాగించుచుండిరి.
11.33 (ముప్పది మూడవ శ్లోకము)
గోప్యో రూఢరథా నూత్నకుచకుంకుమకాంతయః|
కృష్ణలీలా జగుః ప్రీతా నిష్కకంఠ్యః సువాససః॥8694॥
గోపికలు తమ వక్షస్థలములయందు రచించుకొనిన కుంకుమపత్ర శోభలు మిగుల మనోహరముగా నుండెను. చక్కని వస్త్రములతో, బంగారు ఆభరణములతో శోభిల్లుచున్న ఆ గోపకాంతలు బండ్లలో ఆసీనులై, మక్కువతో శ్రీకృష్ణలీలలను మధురముగా గానము చేయుచుండిరి.
11.34 (ముప్పది నాలుగవ శ్లోకము)
తథా యశోదారోహిణ్యావేకం శకటమాస్థితే|
రేజతుః కృష్ణరామాభ్యాం తత్కథాశ్రవణోత్సుకే॥8695॥
అట్లే యశోదా రోహిణులును మేలైన వస్త్రాభరణములను దాల్చి, తమ చిన్నారులైన బలరామకృష్ణులతో గూడి, ఒక బండిపై ఎక్కియుండిరి. అంతటవారు తమ బుడుతలతో ముద్దుముచ్చటలు సలుపుచు, వారి జిలిబిలి పలుకులకు మురిసిపోవుచు, వారియెడ ఎంతో ఉత్సుకత చూపుచుండిరి.
11.35 (ముప్పది ఐదవ శ్లోకము)
వృందావనం సంప్రవిశ్య సర్వకాలసుఖావహమ్|
తత్ర చక్రుర్వ్రజావాసం శకటైరర్ధచంద్రవత్॥8696॥
బృందావనము సర్వకాలములయందును హాయిని గూర్చుచుండెడి చక్కని ప్రదేశము. ఆ దివ్యప్రదేశమునకు చేరిన పిదప గోపాలురు తమ తమ శకటములను అర్ధచంద్రాకారములో నిలిపి, తమకును, గోవులకును అనువుగా నివాసస్థానములను ఏర్పరచుకొని అందు సంతోషముతో ఉండిరి.
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి పదకొండవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం
7702090319, 9505813235
[21:09, 01/12/2020] +91 95058 13235: 1.12.2020 సాయం కాల సందేశము
వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం
దశమస్కంధము - పూర్వార్ధము - పదకొండవ అధ్యాయము
గోపాలురు గోకులమునుండి బృందావనమునకు వెడలుట - శ్రీకృష్ణుడు వత్సాసుర, బకాసురులను వధించుట
ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
11.36 (ముప్పది ఆరవ శ్లోకము)
వృందావనం గోవర్ధనం యమునాపులినాని చ|
వీక్ష్యాసీదుత్తమా ప్రీతీ రామమాధవయోర్నృప॥8697॥
11.37 (ముప్పది ఏడవ శ్లోకము)
ఏవం వ్రజౌకసాం ప్రీతిం యచ్ఛంతౌ బాలచేష్టితైః|
కలవాక్యైః స్వకాలేన వత్సపాలౌ బభూవతుః॥8698॥
పరీక్షిన్మహారాజా! బలరామకృష్ణులు మనోహరముగా ఉన్న బృందావనమును, దర్శనీయముగానున్న గోవర్ధనగిరిని, చూడముచ్చటగొలుపుచున్న అచటి యమునాతీరమునందలి ఇసుక తిన్నెలను మిగుల ఉత్సుకతతో గాంచుచు, అటునిటు సంచరించుచు హర్షపులకితగాత్రులగుచుండిరి. ఆ చిన్నారులు తమ బాల్యచేష్టలతోను , చిలుకపలుకుల (ముద్దులొలుకు మాటల) తోను వ్రజవాసులను అందఱిని సంతసింపజేయుచుండిరి. వారు కాలక్రమమున కౌమారదశకు చేరిరి. వారు అనువగు పచ్చికబయళ్ళలో ఆవుదూడలను మేపసాగిరి.
11.38 (ముప్పది ఎనిమిదివ శ్లోకము)
అవిదూరే వ్రజభువః సహ గోపాలదారకైః|
చారయామాసతుర్వత్సాన్ నానాక్రీడాపరిచ్ఛదౌ॥8699॥
ఆ బలరామకృష్ణులు, తోడిగోపబాలురతోగూడి, వివిధములగు ఆటవస్తువులను దీసికొని, బృందావనమునకు సమీపమునగల ప్రదేశమునకు చేరుచుండిరి. అచటవారు గోవత్సములను మేపుచునే తమతమ క్రీడలను కొనసాగించుచుండిరి.
11.39 (ముప్పది తొమ్మిదవ శ్లోకము)
క్వచిద్వాదయతో వేణుం క్షేపణైః క్షిపతః క్వచిత్|
క్వచిత్పాదైః కింకిణీభిః క్వచిత్కృత్రిమగోవృషైః॥8700॥
11.40 (నలుబదియవ శ్లోకము)
వృషాయమాణౌ నర్దంతౌ యుయుధాతే పరస్పరమ్|
అనుకృత్య రుతైర్జంతూంశ్చేరతుః ప్రాకృతౌ యథా॥8701॥
వారు అప్పుడప్పుడు వేణునాదము లొనర్చుచుండిరి. మరొకసారి ఉట్టిత్రాళ్ళతో మట్టిబెడ్డలను పెట్టి అందరును ఒకరిపై నొకరు విసరుకొనుచుండిరి. ఇంకొకసారి కాళ్ళగజ్జెలు ఘల్లుఘల్లున మ్రోగుచుండగా కేరింతలు కొట్టుచు గంతులు వేయుచుండిరి. మరొకచోట మోకాళ్ళను, అఱచేతులను నేలపై మోపి ఆవుదూడలవలె సంచరించుచుండిరి. కోడెదూడలవలె ఱంకెలు వేయుచు కీచులాడుకొనుచుండిరి. ఆటలలో భాగముగా నవ్వులాటకై (వినోదముగా) పోట్లాడు కొనుచుండిరి. మయూరాది జంతువులవలెను, వివిధములగు పక్షలవలెను అఱచుచు వినోదించుచుండిరి. ఆ విధముగా సర్వసమర్థులైన (మహిమోపేతులైన) బలరామకృష్ణులు సాధారణ బాలురవలె తోడివారితోజేరి క్రీడించుచుండిరి.
11.41 (నలుబది ఒకటవ శ్లోకము)
కదాచిద్యమునాతీరే వత్సాంశ్చారయతోః స్వకైః|
వయస్యైః కృష్ణబలయోర్జిఘాంసుర్దైత్య ఆగమత్॥8702॥
ఒకనాడు బలరామకృష్ణులు తమ మిత్రులతోగూడి యమునానదీ తీరమునందుగల పచ్చికబయళ్ళలో ఆవుదూడలసు మేపుచుండిరి. ఇంతలో ఒక రాక్షసుడు వారిని చంపదలచి అచటికి వచ్చెను.
11.42 (నలుబది రెండవ శ్లోకము)
తం వత్సరూపిణం వీక్ష్య వత్సయూథగతం హరిః|
దర్శయన్ బలదేవాయ శనైర్ముగ్ధ ఇవాసదత్॥8703॥
11.43 (నలుబది మూడవ శ్లోకము)
గృహీత్వాపరపాదాభ్యాం సహలాంగూలమచ్యుతః|
భ్రామయిత్వా కపిత్థాగ్రే ప్రాహిణోద్గతజీవితమ్|
స కపిత్థైర్మహాకాయః పాత్యమానైః పపాత హ॥8704॥
ఆ రాక్షసుడు ఆవుదూడరూపమును దాల్చి, అచటి లేగల గుంపులో కలిసి తిరుగుట శ్రీకృష్ణుడు గమనించెను. వెంటనే అతడు ఆ విషయమును కనుసైగతో బలరామునకు తెలుపుచు, తాను ఒక అమాయకునివలె ఆ రాక్షసుని సమీపించెను. (శ్రీకృష్ణుడు వత్సరూపములో వచ్చినవానిని దైత్యుడని ఎఱుగనట్లును, ఆ వత్సముయొక్క అందచందములకు తాను ముగ్ధుడైనట్లును నటించెను). పిమ్మట కృష్ణప్రభువు దూడరూపములో నున్న రాక్షసునియొక్క తోకను, వెనుకవైపుగల కాళ్ళసు అందిపుచ్చుకొని, గిరగిరత్రిప్పి ఒక వెలగ చెట్ఠుమీదికి విసరివేసెను. ఆ దెబ్బకు అతడు ప్రాణములను కోల్పోయెను. బరువైన ఆ కళేబర వేగమునకు పెక్కు వెలగచెట్లును వాటితోపాటు ఆ కళేబరమూ నేలపాలాయెను.
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి పదకొండవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం
7702090319, 9505813235
[02:39, 02/12/2020] +91 95058 13235: శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
741వ నామ మంత్రము
ఓం రంభాదివందితాయై నమః
రంభ, ఊర్వశి, మేనక మొదలైన అప్సరాంగనలచే నమస్కరింపబడు జగదీశ్వరికి నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి రంభాదివందితా యను ఆరక్షరముల (షడక్షరీ) నామ మంత్రమును ఓం రంభాదివందితాయై నమః అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని అత్యంత భక్తిప్రపత్తులతో ఉపాసించు సాధకునకు స్వర్గసుఖములంతటి సుఖసంతోషములను ప్రస్తుత జీవనమునందు ప్రసాదించి, ఆధ్యాత్మికతయందు, భగవన్మామ సంకీర్తనమునందుగూడ మనసును నిలుపును.
రంభ మొదలైన అప్సరసలచే నమస్కరింపబడుచున్నది జగన్మాత.
సప్త-అప్సరసలు
1. రంభ, 2. ఘృతాచి, 3. మేనక, 4. తిలోత్తమ, 5. మంజుఘోష, 6. ఊర్వశి, 7. సుకేశి.
ద్వాదశ-అప్సరసలు
1. కృతస్థల, 2. పుంజికస్థల, 3. మేనక, 4. సహజన్య, 5. నీప్రమ్లోచ, 6. అనుమ్లోచ, 7. ఘృతాచి, 8. విశ్వాచి, 9. పూర్వజితి, 10. తిలోత్తమ, 11. రంభ.
షోడశ-అప్సరసలు
1. పాథాసూత, 2. మహాభాగ, 3. దేవి, 4. దేవర్షిత, 5. అలంబుష, 6. మిశ్రకేళి, 7. విద్యుత్పర్ణ, 8. తిలోత్తమ, 9. అరుణ, 10. రక్షిత, 11. రంభ, 12. మనోరమ, 13. కేశిని, 14. సుబాహువు, 15. సురత, 16. సురజ.
అప్సరసలు కశ్యపుడను మునియందు పుట్టినట్లును, పాలసముద్రమునందు పుట్టినట్లును చెప్పుదురు. బ్రహ్మదేవునికి పిక్కలనుండి పుట్టినవారుగా కూడా చెబుతారు.
వీరు ఇంద్రుని కొలువులో ఉండెడి దేవవేశ్యలు. అవివాహితలు. ఇంద్రుడు వీరిని విశ్వామిత్రుని వంటి మునుల తపస్సులను భగ్నము చేయడానికి, హరిశ్చంద్రుని వంటి సత్యశీలుర వ్రతభంగము చెరచడానికి భూలోకానికి పంపుతుండేవాడని అంటారు. ఊర్వశి అర్జునుని మోహించి, అర్జునునిచే తిరస్కరింపబడి, అతనిని నపుంసకునిగా కొంతకాలము జీవించమని శాపమిచ్చినది. ఆ శాపము అర్జునునికి వరమై, అజ్ఞాతవాసంలో ఉపయోగపడినది.
అప్సరసలు సంగీతము, నృత్యము వంటి కళలందు ప్రావీణ్యత గలవారు. ఇంద్రుని సభలో వీరు నృత్యప్రదర్శనలు, సంగీత సభలు నిర్వహించేవారు.
జగన్మాత చతుష్షష్టి కళామయి. సంగీతప్రియ, సామగానప్రియ, లాస్యప్రియ. సహజముగా కళాకారిణులైన రంభ,ఊర్వశి మొదలైన అప్సరసలు వాగ్దేవీ స్వరూపిణియైన అమ్మవారిని ఆరాధించి వారి కళాకౌశలమును మరింత రాణింపననుగ్రహించమని కోరుకొంటూ నమస్కరించేవారు. కాబట్టి జగన్మాతకు రంభాదివందితా యను నామ మంత్రమొకటి సార్థకమైనది.
రంభ అనగా హృల్లేఖ హ్రీంకారము. పరమేశ్వరి హ్రీం కారముచే జపింపబడుచున్నది.
జగన్మాతకు నమస్కరించునపుడు ఓం రంభాది వందితాయై నమః అని అనవలెను.
[02:39, 02/12/2020] +91 95058 13235: శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
167వ నామ మంత్రము
ఓం పాపనాశిన్యై నమః
కేవలం మంత్రజపం చేతగాని, నామస్మరణం చేతగాని భక్తుల పాపాలను నాశనం చేయు పరాశక్తికి నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి పాపనాశినీ యను ఐదక్షరముల (పంచాక్షరీ) నామ మంత్రమును ఓం పాపనాశిన్యై నమః అని ఉచ్చరిస్తూ, అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ అఖిలాండేశ్వరిని ఆరాధించు భక్తులను వారు తెలిసిగాని, తెలియకగాని చేసిన పాపకృత్యములను క్షమించి సద్బుద్ధిని ప్రసాదించి తరింపజేయును.
జగన్మాత నామ పారాయణప్రీతా యని నామ ప్రసిద్ధమైనది. తనకిష్టమైన తన నామ మంత్రమును జపించు భక్తుల పాపములను నశింపజేస్తుంది. ఓం శ్రీమాత్రే నమః అని నోరారా స్మరించండి. వెంటనే ఆ తల్లి వారి పాపములను అగ్నిలో దూదివలెను, ఎండుగడ్డివలెనూ దహింపజేస్తుంది. అలాగని పాపకృత్యం చేయడం, వెంటనే నామ మంత్రజపం చేస్తే ఆ తల్లి ఊరుకోదు. పాపకృత్యములు చేయు ఆ దుష్టబుద్ధిని తగలబెట్టి సద్బుద్ధిని ప్రసాదిస్తుంది. అందుకే జగన్మాత పాపసాశినీ అని నామ ప్రసిద్ధమైనది.
వాసిష్ఠసృతియందు ఇలా చెప్పబడినదని సౌభాగ్య భాస్కరంలో 359వ పుటలో చెప్పబడినది.
శ్లో. విద్యాతపోభ్యాం సంయుక్తం సదాపి పాపకర్మాణమేనో
న ప్రతియుజ్యతే జాపినాం హోమినాం చైవధ్యాయినాం
తీర్థవాసినాం న సంవసంతి పాపాని యే చ స్నాతాశ్శిరోవ్రతైః
విద్యాతపస్సులతో గూడి జపపరాయణుడైన బ్రాహ్మణుడు పాపకర్మలు నిత్యము చేయుచున్నను అతనికి పాపములు అంటవు. మంత్రజపములు చేయువానిని, సదా ధ్యాన నిమగ్నుడైనవానిని దివ్యతీర్థములను సేవించువానిని, శిరస్సునందు అగ్నిని ధరించునతనిని పాపములు అంటవు.
మరియు
పద్ళపురాణంలో,పుష్కరఖండంలో ఇలాచెప్పబడినదని సౌభాగ్యభాస్కరంలో చెప్పబడినది:
శ్లో. మేరుపర్వతమాత్రోఽపి రాశిః పాపస్య కర్మణః
కాత్యాయినీం సమాసాద్య నశ్యతి క్షణమాత్రతః॥
పాపకర్మలు చేయువాని పాపములరాశి మేరు పర్వతమంత పెద్దదైననూ, జగన్మాత దర్శనంచేత అంతపాపమూ నశిస్తుంది.
దేవీభాగవతంలో ఈ విధంగా చెప్పబడినదని సౌభాగ్యభాస్కరంలో చెప్పడంజరిగినది:
శ్లో. ఛిత్వా భిత్వా చ భూతాని హత్వా సర్వమిదం జగత్|
ప్రణమ్య శిరసా దేవీం న స పాపైర్వితిప్యతే॥
వర్ణాశ్రమ ధర్మములు విడిచినవారు, పాపకర్ములు, జగన్మాతను ధ్యానించినంతనే వారి పాపములు నాశనమై, పుణ్యాత్ములగుదురు.
ఇక్కడ ఒక విషయం మనం అర్థంచేసుకోవాలి. అదేమిటంటే చేయాలనుకున్న పాపకృత్యములు చేసేసి, అంతా ఆ దైవభారమంటూ నామజపంచేసేస్తే పుణ్యాత్ములై పోతారనేది, పాపం పోతుందనికాదు. జగన్మాత అంతటి భక్తసులభురాలు. చేసిన పాపాలకు అనుభవం ఏనాటికైనా తప్పదు. చేసిన పాపాలు కట్టికుడుపుతాయి. కాని జగన్మాత నామ స్మరణతో మనం పాపకర్మలకు దూరంగా ఉంటాము. అదియే పాపనాశినీ యను నామ మంత్రమునకు పరమార్థము. ఆ తల్లి మనను పాపము చేయనీయకుండా, పుణ్యకర్మలనాచరించుటయంధు మనసును నిమగ్నము చేస్తుంది. ఈ పరమార్థం దృష్టిలో ఉంచుకొని జగన్మాతకు నమస్కరిస్తూ ఓం పాపనాశిన్యై నమః అని అనవలెను.
వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం
దశమస్కంధము - పూర్వార్ధము - పదకొండవ అధ్యాయము
గోపాలురు గోకులమునుండి బృందావనమునకు వెడలుట - శ్రీకృష్ణుడు వత్సాసుర, బకాసురులను వధించుట
ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
11.44 (నలుబది నాలుగవ శ్లోకము)
తం వీక్ష్య విస్మితా బాలాః శశంసుః సాధు సాధ్వితి|
దేవాశ్చ పరిసంతుష్టా బభూవుః పుష్పవర్షిణః॥8705॥
ఆ దృశ్యమును జూచి, గోపబాలురు అందఱును అబ్బురపడుచు, బలేబలేయని కృష్ణుని కొనియాడుచు గంతులు వేయసాగిరి. అప్పుడు దేవతలును ఆ రాక్షససంహారమునకు సంతోషపడుచు పుష్పవర్షమును కురిపించిరి.
11.45 (నలుబది ఐదవ శ్లోకము)
తౌ వత్సపాలకౌ భూత్వా సర్వలోకైకపాలకౌ|
సప్రాతరాశౌ గో వత్సాంశ్చారయంతౌ విచేరతుః॥8706॥
సకలలోకరక్షకులైన బలరామకృష్ణులు ప్రస్తుతము ఆవుదూడలను మేపువారైరి. వారు చలిది అన్నపుమూటలసు దీసికొని, గోవత్సములను మేపుచు అటునిటు విహరింపసాగిరి.
11.46 (నలుబది ఆరవ శ్లోకము)
స్వం స్వం వత్సకులం సర్వే పాయయిష్యంత ఏకదా|
గత్వా జలాశయాభ్యాశం పాయయిత్వా పపుర్జలమ్॥8707॥
ఒకానొకనాడు బలరామకృష్ణులు, గోపబాలురు అందఱును తమ తమ దూడలకు నీరు ద్రాపుటకై ఒక జలాశయముకడకు చేరిరి. వారు ముందుగా ఆవుదూడలచే నీరు త్రాగించి, పిదప తామును తమ దప్పికలను దీర్చుకొనిరి.
11.47 (నలుబది ఏడవ శ్లోకము)
తే తత్ర దదృశుర్బాలా మహాసత్త్వమవస్థితమ్|
తత్రసుర్వజ్రనిర్భిన్నం గిరేః శృంగమివ చ్యుతమ్॥8708॥
ఆ బాలురు అచట బలిష్ఠముగా నున్న ఒక అద్భుతప్రాణిని జూచిరి. అది ఇంద్రుని వజ్రాయుధము ధాటికి కూలిపోయిన పర్వతశిఖరమువలె కన్పట్టుచుండెను. దానిని జూచి, వారు మిగుల భయకంపితులైరి.
11.48 (నలుబది ఎనిమిదవ శ్లోకము)
స వై బకో నామ మహానసురో బకరూపధృక్|
ఆగత్య సహసా కృష్ణం తీక్ష్ణతుండోఽగ్రసద్బలీ॥8709॥
11.49 (నలుబది తొమ్మిదవ శ్లోకము)
కృష్ణం మహాబకగ్రస్తం దృష్ట్వా రామాదయోఽర్భకాః|
బభూవురింద్రియాణీవ వినా ప్రాణం విచేతసః॥8710॥
వారికి కనబడినట్టి ఆ మహాప్రాణి బకుడను రాక్షసుడు. ఆ మహారాక్షసుడు బలిష్ఠమైన ఒక కొంగ రూపములో అచటికి వచ్చి వాడియైన తన ముక్కుతో క్షణములో శ్రీకృష్ణుని ఒడిసి పట్టుకొనెను. బకాసురుడు తన ముక్కుపుటముల మధ్య శ్రీకృష్ణుని చిక్కించుకొనుటను జూచి, బలరామాది గోపబాలురు నిశ్చేష్టులైరి. అప్పుడు వారు చైతన్యరహితములైన ఇంద్రియములవలె ఒప్పాఱిరి.
11.50 (నలుబది తొమ్మిదవ శ్లోకము)
తం తాలుమూలం ప్రదహంతమగ్నివద్గోపాలసూనుం పితరం జగద్గురోః|
చచ్ఛర్ద సద్యోఽతిరుషాక్షతం బకస్తుండేన హంతుం పునరభ్యపద్యత॥8711॥
జగత్సృష్టికర్తయగు బ్రహ్మదేవునకు తండ్రియైనను శ్రీహరి తన లీలలను ప్రదర్శించుటకై గోపాలబాలునిగా (శ్రీకృష్ణునిగా) అవతరించెను. ఆ స్వామిని చంపివేయుటకై బకాసురుడు తననోట గఱచుకొనినంతనే ఆ ప్రభువుయొక్క మహత్త్వముచే ఆ అసురుని దవడల మూలభాగమునందు (అంగిటియందు) మంటలు చెలరేగెను. ఆ తాపమునకు తట్టుకొనలేక ఆ రాక్షసుడు కృష్ణుని వెడలగ్రక్కెను. పిమ్మట బకాసురుడు తన ప్రయత్నమును వీడక మిగుల కుపితుడై తన ముక్కుకొనలతో చిన్ని కృష్ణుని చంపివేయుటకు మరల ప్రయత్నింపసాగెను.
11.51 (ఏబది ఒకటవ శ్లోకము)
తమాపతంతం స నిగృహ్య తుండయోర్దోర్భ్యాం బకం కంససఖం సతాం పతిః|
పశ్యత్సు బాలేషు దదార లీలయా ముదావహో వీరణవద్దివౌకసామ్॥8712॥
శ్రీకృష్ణుడు తనను ముక్కుపుటములతో పొడిచి చంపుటకై విజృంభించి వచ్చుచున్న బకాసురుని ఒడుపుతో పట్టుకొనెను. అనంతరము తోడిబాలురందఱునూ చూచుచుండగా ఆ స్వామి హుంకారమొనర్చుచు తన రెండు చేతులతో ఆ బకాసురుని ముక్కుపుటాలను తుంగగడ్డిపోచనువలె అవలీలగా చీల్చివేసి, అతనిని హతమార్చెను. ఆ దుష్టసంహారదృశ్యమును గాంచి దేవతలు మిగుల సంతసించిరి.
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి పదకొండవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం
7702090319, 9505813235