.
విష్ణు సహస్రనామ స్తోత్రమ్
( సంగ్రహ తాత్పర్య వివరణము)
(01_11_2018)
హరిః ಓమ్
30 వ. శ్లోకము
ಓజస్తేజోద్యుతిధరః ప్రకాశాత్మా ప్రతాపనః ।
ఋద్ధః స్పష్టాక్షరోమంత్రః చంద్రాంశు ర్భాస్కరద్యుతిః ।।
ఈ శ్లోకరాజమునందు యెనిమిది దివ్యనామములు విరాజితములు.
275) ಓజస్తేజోద్యుతిధరః - ಓజస్తేజోద్యుతిధరాయనమః
ఓజస్సు, తేజస్సు, ద్యుతి ఈ మూడు పవిత్రలక్షణములు గలిగినవాడు. ఓజస్సు అనగా శరీరముయొక్క బలారోగ్య శక్తివిశేషములు. తేజస్సు అనగా అపారమగు మానసికశక్తి, ద్యుతియనగా ఆధ్యాత్మికశక్తి . ఈ మూడు శక్తులతో ౘక్కగా వికసించినవాడే పూర్ణపురుషుడు. కావుననే " ಓజస్తేజోద్యుతిధరః " అని సంకీర్తింపబడును.
" బలం బలవతాంచాహం " బలశాలురలోని బలము నేను.
" తేజఃతేజస్వినామహం " తేజశ్శాలురలోని తేజస్సు నాది. " బుద్ధిఃబుద్ధిమతామస్మి" బుద్ధిమంతులలోని బుద్ధి నాది. అను గీతాచార్యుని వాక్యములు స్మరణీయములు. ( అ 7_శ్లో 10,11). అనుష్ఠానవిధానము, సక్రమాహారవిహారముల వలన ಓజస్సు ను, ఇంద్రియనిగ్రహ ధ్యానాదుల వలన మానసికతేజస్సు, వివేకవైరాగ్యచింతనము వలన ద్యుతియును కలుగుననెడు శాస్త్రవాక్యములు స్మరణీయము లు. ఇవన్నియును పరమేశ్వర స్వరూపములే యగుటచే, " ಓజస్తేజోద్యుతిధరుడని"
గానము చేయబడును.
276) ప్రకాశాత్మా - ఓం ప్రకాశాత్మనేనమః
ప్రకాశస్వరూపమైన ఆత్మగలవాడు. అన్నిటిని తన దివ్య ప్రకాశము చేతనే ప్రకాశింపచేయువాడు గాన " ప్రకాశాత్మా " అనబడుౘున్నాడు.
277) ప్రతాపనః - ఓం ప్రతాపనాయనమః
1) సూర్యునిరూపమున తన శక్తివంతములగు కిరణములచేత లోకములను తపింప చేయువాడు కాన " ప్రతాపనః " అను శబ్దవాచ్యు డగుౘున్నాడు. " తపామ్యహం " గీత 9_19 సూర్యకిరణములతో తపింపజేయు వాడను నేనే యని గీతావాక్యము గదా.
2) దుర్మార్గులను, అవినీతిపరులను, వారిదుష్టప్రవర్తనలక అనేకరీతులుగా ( శారీరకమానసిక క్లేశములతో రోగములతో, క్షోభలతో) తపింప చేయువాడు శ్రీహరియే కనుక " ప్రతాపనః ". అనబడుౘున్నాడు.
కావునమానవులు సదా సద్వర్తనులై నిత్యజీవితములను గడుపవలెనని తెలియును.
--((**))--
విష్ణు సహస్రనామ స్తోత్రమ్
( సంగ్రహ తాత్పర్య వివరణము)
(03_11_2018)

281) చంద్రాంశుః - ఓం చంద్రాంశవేనమః
చంద్రకిరణము అని ఈ శబ్దముయొక్క అర్థము. చంద్రకిరణములద్వారా సస్యములను ఫలింపజేయువాడను నేనేయని భగవద్వాక్యము స్మరణీయము (అ 15_13). మనస్సునకు ఆహ్లాదము చేకూర్చువాడు చంద్రు డగుౘున్నట్లు చిత్తచాంచల్యమును బోగొట్టి శాంతిని ప్రసాదింౘు వాడు భగవానుడేయగుటచేత. " చంద్రాంశుః " అనబడును.
282) భాస్కరద్యుతిః - ఓం భాస్కరద్యుతయేనమః
" సూర్యకాంతి ". యని శబ్దార్థము. ఉదయముననే తూర్పు కొండ నధిరోహింౘి సర్వ లోకములను మేల్కొలుపుౘున్న సూర్యుని ప్రత్యక్ష భగవానునిగా భక్తులారాధింతురు. సూర్యకాంతి వలననే జగమంతయును
చైతన్యవంతము అగుౘున్నదిగదా. సూర్యుడు కానరాని దినము " దుర్దినమని "
భావించి భక్తులు ఉపవాసవ్రతమును బూనుదురు. తత్త్వపరముగా సమన్వయించి
నచో ఆయన జ్ఞానసూర్యుడు. ప్రతివాని హృదయక్షేత్రమునందు భాసిల్లు జ్ఞానసూర్యుడు. సూర్యుడు అనేక జలభాండములలో ప్రతిఫలింౘుౘు అనేక
సూర్యులుగా గానవచ్చునట్లు ఒకే ఆత్మ భిన్న భిన్నములగు ఉపాధులయందు
అనేకములుగా నున్నట్లు గోచరింౘుౘుండును.
సూర్యుడెట్టి పదార్థములపై ప్రకాశింౘుౘున్ననూ వాని గుణదోషములతో అతనికి సంబంధము లేనట్లు " ఆత్మ " అన్నింటనూ ప్రకాశింౘు ౘున్ననూ సంగ రహితము. కావున భగవానుడు " భాస్కరద్యుతిః " అను దివ్య నామమున స్తోత్రము చేయబడుౘున్నాడు.
సాధకులకు సంగరహితముగా సంసారమున చరింపుమను అనుష్ఠానము దీనిచే గోచరింౘును.
--((**))--
విష్ణు సహస్రనామ స్తోత్రమ్
( సంగ్రహ తాత్పర్య వివరణము)
(04_11_2018)
హరిః ಓమ్
31 వ. శ్లోకము
అమృతాంశూద్భవో భానుః శశబిన్దుః సురేశ్వరః ।
ఔషధం జగతస్సేతుః సత్యధర్మ పరాక్రమః ।।
ఈ శ్లోకమునందు ఏడు హరినామములు వర్ణితములు.
283) అమృతాంశూద్భవః - ఓం అమృతాంశూద్భవాయనమః
తన యమృతమయ కిరణములచేత , సస్యములను పోషింౘు
వాడగుటచేత చంద్రునకు " అమృతాంశుః " అను పేరు కలిగినది. క్షీరసాగరమథన
కాలమున అట్టి చంద్రుని జననమునకు కారణమైనవాడు క్షీరసాగర నివాసియగు మహావిష్ణువగుటచేత ఆయన " అమృతాంశూద్భవః " అని ప్రశంశింప
బడుౘున్నాడు.
తాత్త్వికముగా చంద్రుడు మనస్సునకు అనుష్ఠానము
( చంద్రమా మనసోజాతః) మన హృదయమను క్షీరసాగరము న దేవాసురులు
( అనగా దేవతాగుణములు, అసురగుణములు) మథనమును తీవ్రరూపమున సాగింపగా అందుండి వివేకబుద్ధియను చంద్రు డుదయింౘు నని భావము.
సూర్యుడు చైతన్యమునకు అధిష్ఠాన మగునట్లు చంద్రుడు
జడమగు నక్షత్రములకధిష్ఠానము. సకలక్షేత్రములకును భగవానుడే కారణము
అగుటచేత " అమృతాంశూద్భవః ". అను ప్రసిద్ధ నామమున విఖ్యాతిని గాంౘుౘున్నాడు.
284) భానుః - ఓం భానవేనమః
దివ్య ప్రకాశరూపమున విశ్వమంతయును వెలిగింౘు వాడగుట
చేత " భానుః " అని పిలువబడును.
(పాఠకులు 282 నామమున వివరణమును ౘూడ ప్రార్థితులు )
285) శశబిన్దుః - ఓం శశబిన్దవేనమః
కుందేలు వంటి చిహ్నము తనయందు కలిగియున్న వాడయి
నందున చంద్రునకు " శశబిన్దుః " అనునామము కలిగినది. చంద్ర రూపమున
లోకమునానందింపచేయువాడగుట చేత భగవానుడిట్లు గానము చేయబడును.
281, 283 నామములయొక్క వివరణములను పాఠకులు
గమనింప ప్రార్థన.
విష్ణు సహస్రనామ స్తోత్రమ్
( సంగ్రహ తాత్పర్య వివరణము)
(05_11_2018)

286) సురేశ్వరః - ఓం సురేశ్వరాయనమః
సురలనగా దేవతలు. వారికికూడా అధిపతి యగుటచేత "సురేశ్వరు " డని స్తుతింపబడును. 49, 85 నామములయొక్క వివరణములు ౘూడనగును.
49 వ నామ వివరణ
49) అమరప్రభుః ఓం అమరప్రభ వేనమః
అమరులనగా దేవతలు. వీరికి అధిపతి యగుటచేత శ్రీహరి " అమరప్రభు " డగుౘున్నాడు. తమ్మాశ్రయించిన భక్తులకు దేవతలు అనేక వరములను శక్తులను ప్రసాదింౘు ౘుందురు. అట్టి శక్తి సంపన్నులగు దేవతలకు కూడా ప్రభువు శ్రీహరి యగుటచేత అమరప్రభుడని కీర్తిగాంచెను. కనుక వివిధ దేవతారాధనలకంటే సర్వదేవతాగణ స్వరూపుండగు పరబ్రహ్మము ను సేవింౘుట యే సర్వశ్రేష్ఠమను బోధను ఈనామము ప్రసాదింౘుౘున్నది. ఈ
సందర్భమున గీతాశాస్త్రము నందలి ఈదిగువ శ్లోకము లు స్మరణీయములు.
భగవద్గీత అధ్యాయం 9
శ్లోకము__23
యే ప్యన్యదేవతా భక్తా యజన్తే శ్రద్ధయాన్వితాః!
తే పి మామేవ కౌంతేయ యజంత్య విధిపూర్వకమ్!!
ఇతర దేవతలను పూజించినప్పటికీ వారు నన్ను పూజించినట్లే. కానీ వారిపూజలు అవిధి పూర్వకములైనవి. అనగా అజ్ఞానముతో కూడినవి.
శ్లోకము__24
అహం హి సర్వయజ్ఞానాం భోక్తాచ ప్రభురేవ చ !
న తు మామభిజానంతి తత్త్వేనాతశ్చ్యవంతి తే!!
ఏలనన సకలయజ్ఞములకునూ భోక్తను, స్వామిని గూడ నేనే. వారు నాపరమేశ్వర తత్త్వమును ఎఱుంగరు. కావున పతనమగుదురు అనగా పునర్జన్మను పొందుదురు.
శ్లోకము__25
యాంతి దేవవ్రతా దేవాన్ పితృూన్ యాంతి పితృవ్రతాః !
భూతాని యాంతి భూతేజ్యా యాంతి మద్యాజినో పి మామ్!!
దేవతలనారాధింౘువారు దేవతలను, పితృదేవతల నారాధింౘు వారు పితృదేవతలను, భూతముల నారాధింౘువారు భూతముల పొందుదురు. సర్వదేవతా చక్రవర్తినగు నన్నారాధింౘువారు నన్నే పొందుదురు.
85 వ నామవివరణము
85) సురేశః ఓం సురేశాయనమః
సురలనగా స్వర్గలోకవాసులగు దేవతలు. వీరును శక్తి సంపన్నులగుట చేత. తమ్మాశ్రయించిన భక్తులకు వరముల నొసంగు ౘుందురు. మన్నారాయణమూర్తి భక్తులకును, దేవతలకునూ గూడ వరప్రదాతయగుట చేత. "సురేశః" అనునామమున ప్రసిద్ధుడయ్యెను.
(49వ నామవివరణమును గమనింప ప్రార్థన)
విష్ణు సహస్రనామ స్తోత్రమ్
( సంగ్రహ తాత్పర్య వివరణము)
(06_11_2018)

287) ఔషధమ్ - ఓం ఔషధాయనమః
భయంకరమగు జననమరణ జరా వ్యాధి పూరితమగు సంసార
మహా వ్యాధిని ( భవరోగమును ) బోగొట్టు ఔషధము భగవన్నామమేకదా
రామమంత్రము సమస్తములగు శారీరక మానసిక వ్యాధులను పోగొట్టినదని
తులసీదాసు రచించిన తన రామచరితమానసము నందు వ్యక్తము చేసినాడు.
ఆయన స్వయంగా కుష్ఠవ్యాధులను రామమంత్రము తో పోగొట్టినాడు. సమస్త రోగములకు బీజములు మనస్సు నందే యుండును. కనుక చికిత్స మనస్సు నకే చేయవలయును. శరీరమునకు భగవన్నామస్మరణ, చింతన , కీర్తన, జప, ధ్యానాదుల వలన సకలవ్యాధులును నివారితములగునని నవీన వైద్య శాస్త్ర పరిశోధనలు తెలుపుౘున్నవి. కర్మగతములగు సుదీర్ఘ భయంకరమగు వ్యాధులు విష్ణుసహస్రనామ పారాయణ జపధ్యానాదులచే నశింౘు ౘున్నవి కదా. " రోగార్తో ముచ్యతే రోగాత్ " అని ఈ స్తవరాజము నందు ఉత్తర పీఠికయందు గాననగును. కావున "శ్రీహరి ". " ఔషధమ్ " అని పిలువబడును.
288) జగతస్సేతుః - ఓం జగతస్సేతవేనమః
సేతువు అనగా వంతెన అని అర్థము. భయంకరమగు సంసారసాగరము ను దాటుటకు శ్రీహరి యే వంతెనవంటివాడు గావున ఈ పవిత్రమగు నామముచేత పోల్చి చెప్పబడు ౘున్నాడు.
289) సత్యధర్మపరాక్రమః - ఓం సత్యధర్మపరాక్రమాయనమః
భగవంతుడు సత్యస్వరూపుడు, ధర్మస్వరూపుడు. సత్యధర్మ
ప్రతిష్ఠాపన కై ఆయన ఆయా యుగములయందు అవతరింౘును. మనము నిరంతరమునూ సత్యవ్రతము ననుష్ఠింౘుౘు, ధర్మ పరాయణులమై జీవిత యాత్రను గడుపవలయునని భావము.
విష్ణు సహస్రనామ స్తోత్రమ్
( సంగ్రహ తాత్పర్య వివరణము)
(07_11_2018)
హరిః ಓమ్
32 వ. శ్లోకము
భూతభవ్య భవన్నాథః పవనః పావనో√నలః ।
కామహా కామకృత్ కాన్తః కామః కామప్రదః ప్రభుః ।।
ఈ శ్లోకము దశవిధనామ పుష్పములతో విరాజితము.
290) భూతభవ్యభవన్నాథః - ఓం భూతభవ్యభవన్నాథాయనమః
భూతకాలము, భవిష్యత్కాలము, వర్తమానకాలము ఈ మూడు
కాలములకును, ఈ కాలత్రయమునందుగల సమస్త జీవకోటులకును అధిపతి భగవానుడే. భగవంతుడు కాలస్వరూపుడు " కాలమే భగవంతుడు " కాలమును సద్వినియోగము చేయుటయే ఈశ్వరారాధనమని పాఠకులు గుర్తింపవలెను.
291) పవనః - ఓం పవనాయనమః
" పవనః పవనతామస్మి" పావనము చేయువారిలో
" వాయువును నేను " అని గీతావాక్యము స్మరణీయము(అ10_3౦). వాయువు
అంతటనూ వ్యాపించి యుండునట్లు, ఈశ్వరుడు అంతటనూ వ్యాపించి
యుండును. సర్వ వ్యాపియగు ఈశ్వరుడు సర్వమునకూ సాక్షియై ౘూౘుౘుండు ను. కనుక మానవులు ధర్మము తప్పక ఆచరింౘ వలయునని భావము.
292) పావనః - ఓం పావనాయనమః
పవనునకును, సకలప్రాణికోట్లకును చైతన్యము నొసంగువాడు గాన " పావనః " అని ప్రసిద్ధు డయ్యెను. వాయువును ప్రవర్తింప చేయువాడగుటచేత. " పావనః ". అని వెలయుౘున్నాడు.
విష్ణు సహస్రనామ స్తోత్రమ్
( సంగ్రహ తాత్పర్య వివరణము)
(08_11_2018)

293) అనలః - ఓం అనలాయనమః
1. అనలః అను శబ్దమునకు అగ్ని అని సామాన్య అర్థము. ఊర్ధ్వగతిని పొందు అగ్ని భగవత్స్వరూపము (233 నామ వివరణము ౘూడనగును).
2. అనాన్= ప్రాణులను, లః = గ్రహిమౘువాడు, గాన " అనలః "
అని ఈశ్వరుడు కీర్తనీయుడగును.
3. " అగంధ మరసమ్ ". ఆత్మ గంధరహితమయినది, రస
రహితమయినదియు నను శ్రుతి ప్రమాణమునుబట్టి " అనలః " అనబడును .
4. " న అలం " పరిసమాప్తి లేనివాడని అర్థము. కావున " అనలః"
అనబడుౘున్నాడు.
294) కామహా - ఓం కామఘ్నేనమః
కోరికలను పోగొట్టువాడు అని భావము. మోక్షమును బొందుటకు
కోరికలు ప్రతిబంధకములు అగుటచేత అట్టి ఉత్తమ సాధనకు వాంఛారాహిత్యము గావింౘువాడు. " ప్రజాహతి యదా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ ". అను గీతావాక్యము స్మరణీయము ( అ 2_55) మనస్సు లోని సకల వాంఛలను సంపూర్ణముగా త్యాగముచేసి ఆత్మచేతనే ఆత్మయందానందము పొందువాడే మహాజ్ఞాని లేక " స్థితప్రజ్ఞుడు " . సాధనా సారాంశమేమన మెల్ల మెల్లగా కోరిక లన్నింటినీ త్యాగము చేసుకొని చిత్తనైర్మల్యమును పొందవలెను. తద్ద్వారా మోక్ష ప్రాప్తి కలుగును.
295) కామకృత్ - ఓం కామకృతేనమః
కోరికలను తీర్చువాడని ఈ నామముయొక్క భావమైయున్నది.
పైనున్న నామమునకు ఇది విరుద్ధముగా నున్నట్లు పాఠకులకు గోచరింౘవచ్చును. కాని అదిసరికాదు. పైనామము " సిద్ధావస్థ" యొక్క స్వరూపమును ౘూపును. ఈ నామము " సాధనావస్థను " సూచింౘుౘున్నది. " ధర్మావిరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ ". ధర్మవిరుద్ధ ముు కాని కోరికయును నా స్వరూపమేయని
గీతాచార్యుడు పలికెను (7_11). కావున భక్తులయొక్క సాత్త్వికములగు
కోరికలను తీర్చువాడు ఈశ్వరుడేయగుటచేత. " కామకృత్ " అని పిలువబడెను
విష్ణు సహస్రనామ స్తోత్రమ్
( సంగ్రహ తాత్పర్య వివరణము)
(09_11_2018)

296) కాన్తః - ఓం కాన్తాయనమః
" మహాసౌందర్య స్వరూపుడు " అని అర్థము. శ్రీరాముని
దివ్యసౌందర్యమును గాంచి, విరాగులగు మునులే మోహించినారని పురాణప్రసిద్ధి కృష్ణుని రూపము జగన్మోహనము గదా ! మన్మథ మన్మథుడాతడు. కావున శ్రీహరి " కాన్తః " అను దివ్యనామ వాచ్యుడగును. " సత్యం, శివం, సుందరం " అని ఉపనిషత్తులు ఆత్మసౌందర్యమును వర్ణింౘుౘున్నవి.
297) కామః - ఓం కామాయనమః
ప్రేమ స్వరూపుడని యర్థము. ఆయన వలననే అందఱకూ
ప్రీతియు , సుఖమును కలుగును. మఱియును ధర్మార్థకామమోక్షములను
చతుర్విధపురుషార్థముల కొఱకును కోఱబడు మహనీయ మూర్తియు నతడే
యగుటచేత " కామః " అను నామ వాచ్యుడయ్యెను.
298) కామప్రదః - ఓం కామప్రదాయనమః
కోఱికలు ఇచ్చువాడని ఈనామముయొక్క అర్థము. భక్తజనమందారము, కామధేనువు అని భగవానుడు స్తుతింపబడుౘున్నాడు. భక్తులకు వారి వారి అర్హతలననుసరించి వరములను, కోఱికలను ప్రసాదింౘు వాడగుటచేత. " కామప్రదః ". అని పిలువబడెను.
299) ప్రభుః - ఓం ప్రభవేనమః
భగవానుడు సర్వలోక మహేశ్వరుడు. సర్వశక్తి భండారము.
ఆయనచేతనే కార్యములు నెఱవేరును, తత్భిన్నములగును, లేదా అన్యదా వర్తింౘును. సర్వస్వతంత్ర సంపూర్ణ శక్తి సంపన్నుడగు వాడగుటచేత " ప్రభుః " అని సంకీర్తనీయుడగును.
విష్ణు సహస్రనామ స్తోత్రమ్
( సంగ్రహ తాత్పర్య వివరణము)
(10_11_2018)
హరిః ಓమ్
33 వ. శ్లోకము
యుగాదికృత్ యుగావర్తో నైకమాయో మహాశనః ।
అదృశ్యో వ్యక్తరూపశ్చ సహస్రజిత్ అనంతజిత్ ।।
ఈ శ్లోకము అష్టవిధ దివ్యనామ పరిపూరితము.
300) యుగాదికృత్ - ఓం యుగాదికృతేనమః
అనంతమగు కాలస్వరూపుడు భగవానుడు. ఆయనయే
కాలమును కృత, త్రేతా, ద్వాపర, కలి యను నాలుగు యుగములు గా
విభజించినాడు. మఱియును యుగాది కర్తయును ఆయనయే. కాలప్రమాణాలు క్షణములు, నిమిషములు, గంటలు, దినములు, వారములు, పక్షములు, మాసములు, ఋతువులు, ఆయనములు, సంవత్సరములు, యుగములు, మహాయుగములు ఇవియన్నియూ పరమేశ్వర స్వరూపములే.
" అహమేవాక్షయః కాలః " నేను అక్షయమగు కాలస్వరూపమును(10_33), " కాలణ కలయతామహం " గణనచేయువానిలో కాలమును నేను. " (10_30) అని గీతావాక్యము.
కాలము ౘాలా విలువయైనది. పోయినకాలముు ౘాలా విలువైనది
పోయినకాలము తిరిగి రాదు. కావున హరి కీర్తన, చింతనములతో కాలమును
సద్వినియోగం చేయుమని దీని సారాంశము (232 వ నామ వివరణమును ౘూడుము).
232 వ నామవివరణము
232). అహస్సంవర్తకః - ఓం అహస్సంవర్తకాయనమః
సూర్యని రూపముననుండి దినములను ౘక్కగా ప్రవర్తింపజేయు
వాడని భావము. సూర్యుని వలఞే రాత్రింబవళ్ళు గలుగుౘు కాలప్రమాణము గుర్తింపబడుౘున్నది. కావున శ్రీహరి " అహస్సంవర్తకః " అనునామమున భజనీయుడగుౘున్నాడు. కాలము దైవస్వరూప మగుటచేత. కాలమును సదా భగవదారాధనము లతో సద్వినియోగము చేయవలయును. అని ఈ నామముయొక్క ప్రబోధము.
301) యుగావర్తః - ఓం యుగావర్తాయనమః
ఆయన యుగకర్తయును యుగారంభకుడును మాత్రమేగాక, యుగములను ప్రవర్తింప చేయువాడు. అనగా కాలచక్రమును త్రిప్పువాడును నగుటచేత యుగావర్తః అని పిలువబడెను.
విష్ణు సహస్రనామ స్తోత్రమ్
( సంగ్రహ తాత్పర్య వివరణము)
(11_11_2018)

302) నైకమాయః - ఓం నైకమాయాయనమః
భగవంతుడు మాయారహితుడు అయిననూ, తన మాయ
నే ఆధారముగా చేసికొని అనేకరూపములతో ధరాభార నివారణార్థముగా
అవతరింౘుౘున్నాడు. ఇవి పురాణ ప్రసిద్ధములు.
అజ్ఞానులగు మానవులు యోగమాయతోకూడిన భగవంతుని గుర్తింపలేరు. మాయారహితులగుటకు సాధకులు మాయాధిపతి యగు మాధవునే ఆశ్రయింౘవలయునని గుర్తింపనగును. (గీత 7_14).
(230 నామవివరణమును ౘూడుము)
230 నామవివరణ
సంవృతః - ఓం సంవృతాయనమః
కప్పబడియుండువాడని శబ్దార్థము. " నాహం ప్రకాశః సర్వస్య
యోగమాయా సమావృతః। మూఢోయం నాభిజానాతి లోకోమా మజమవ్యయమ్।
నేను యోగమాయచేత కూడుకొనియున్న కారణముచేత మూఢులునన్ను జనన మరణ రహితుండగు అవ్యయపరబ్రహ్మముగా గుర్తింప జాలకున్నారు. అని
భగవద్వాక్యము (అ.7_25).
బ్రహ్మ, ఇంద్రుడు మున్నగువారుకూడా శ్రీకృష్ణపరమాత్ముని
దివ్యత్వమును గుర్తింపజాలక మోసపోయిన ఘట్టములు భాగవతములో వర్ణితములు.
" మామేవయే ప్రపద్యంతే, మాయామేతాంతరంతితే" అయితే ఎట్లు ఈ మాయను దాటుట ? నన్ను ఎవరు సంపూర్ణ శరణాగతిని బొందుదురో వారు
నా మాయను దాటిపోవుదురని". భగవద్వాక్యము స్మరణీయము ( అ_7_14).
భగవంతుని శరణుబొందుమని ఈ నామముయొక్క ప్రబోధమైయున్నది.
303) మహాశనః - ఓం మహాశనాయనమః
సమస్తమును భక్షింౘువాడని ఈ శబ్దార్థము.
ప్రళయకాలమున సకల జీవకోటులను తనయందే నింపుకొను వాడగుటచేత " మహాశనః " అని పిలువబడెను.
మఱియొక సాంకేతిక వివరణమిది.
క్రమబద్ధముగా యోగానుష్ఠానాదులు నిరంతరమును
సాధనము చేయుౘుండు యోగసాధకునియొక్క మానసమునందు సమస్త
వాంఛలును ఆత్మయందే లయించి పోవుౘుండును. కావున ఆత్మ " మహాశనః " అని అలంకారిక భాషలో చెప్పబడుౘున్నదని విజ్ఞులు గ్రహింౘగలరు.
విష్ణు సహస్రనామ స్తోత్రమ్
( సంగ్రహ తాత్పర్య వివరణము)
(12_11_2018)

304) అదృశ్యః - ఓం అదృశ్యాయనమః
" కానరానివాడు " అని అర్థము. అనగా భగవానుడు చక్షురాది
ఇంద్రియములచేత కానవచ్చువాడు కాదు. మనో బుద్దులచేత కూడా పొందజాలని వాడగుటచేత " అదృశ్యః " అని చెప్పబడును.
305) వ్యక్తరూపః - ఓం వ్యక్తరూపాయనమః
ఇంద్రియములచేత ౘక్కగా గానవచ్చునట్టి వాడని ఈనామము భావము.
పై 304, 305 నామముల భావములు పరస్పర విరుద్ధంగా గోచరింప వచ్చును. కానీ అది సరికాదు. రెండునామములును యథార్థములే. భగవంతుడు మలినచిత్తము గలవానికిని, బహిర్ముఖము లగు ఇంద్రియ😚
గలవానికి కానరానిమాట వాస్తవమే కాని చిత్తశుద్ధి కలిగి యింద్రియ నిగ్రహము గల యోగులకు స్పష్టముగా గోచరింౘు వాడగుటచే ఆయన " వ్యక్తరూపః " అని చెప్పబడెను.
ఈ సందర్భంగా ఈ దిగువ గీతావాక్యమును స్మరింపుడు.
శ్లోకము : యతన్తో యోగినశ్చైవం పశ్యన్త్యాత్మన్యవస్థితమ్ ।
యతన్తో √ ప్యకృతాత్మానః నైనం పశ్యన్త్య చేతసః।।
ఆత్మ సాక్షాత్కారమునకై చిత్త శుద్ధితో సాధనలు చేయుౘున్న
యోగులు తమయందే ఆత్మదర్శనము చేయుౘున్నారు. ఇట్లు ప్రయత్నము చేయుౘున్నను చిత్తశుద్ధి లేని కారణంగా ఇతరులకు ఆత్మదర్శనము కలుగుట లేదు అని గీతాచార్యునివాణి (15_11).
సారాంశమేమనగా ఇంద్రియనిగ్రహము చిత్తనైర్మల్యము
అత్యంతావశ్యకములు.
విష్ణు సహస్రనామ స్తోత్రమ్
( సంగ్రహ తాత్పర్య వివరణము)
(13_11_2018)

ఈ శ్లోకము అష్టవిధ దివ్యనామ పరిపూరితమ
306). సహస్రజిత్ - ఓంసహస్రజితేనమః
వేలసంఖ్యలలో రాక్షసగణములనుసంహరించినవాడని భావము. శ్రీరాముడు తానొక్కడై పదునాలుగువేల రాక్షస సమూహములను
సంహరించిన విధము రామాయణములో వివరింపబడి యున్నది. కనుక
భగవానుడు " సహస్రజిత్ " అనబడెను.
మానవుని మనస్సు లో వేలకొలది రాక్షసగుణములు, దుర్వాసనలు, దుష్టబీజములును గలవు. వీనినన్నిటిని నాశనము చేయువాడు శ్రీహరియే యగుటచేత " సహస్రజిత్ " అని కీర్తింపబడెను ( హరినామ జపస్మరణ
కీర్తనలు సకల దుష్టబీజములను నశింపచేయునని సారాంశము).
307). అనంతజిత్ - ఓం అనంతజితేనమః
సకలభూతములను జయించిన వాడగుటచేత " అనంతజిత్" అని కీర్తింపబడెను. అవతారములయందు భగవానుని జయపరంపరలన్నియు పురాణముల యందు వర్ణితములే కదా. మనస్సు నందు గల అనేక దుష్టభావనలు, అభ్యాసములను నాశనముచేసి సత్ చిత్ ఆనంద స్థితిని చేకూర్చువాడగుటచేత " " అనంతజిత్ " అని పిలువబడుౘున్నాడని భావము.
విష్ణు సహస్రనామ స్తోత్రమ్
( సంగ్రహ తాత్పర్య వివరణము)
(14_11_2018)
హరిః ಓమ్
34. వ. శ్లోకము
ఇష్టో√విష్టః శిష్టేష్టః శిఖండీ నహుషోవృషః ।
క్రోధహా క్రోధకృత్ కర్తా విశ్వబాహుర్మహీధరః ।।
ఈ శ్లోకము నందు భగవానుడు పది పుణ్యనామము లతో
స్తోత్రము చేయబడుౘున్నాడు.
308) ఇష్టః - ఓం ఇష్టాయనమః
పరమానంద స్వరూపుడు అగుటచేత లోకమునందు అందఱకూ
ప్రియమైన వాడు కనుక " ఇష్టః " అనబడును.
" ఇష్టః " అను శబ్దము నకు యజ్ఞము అనియును అర్థమే. యజ్ఞము
విశ్వకల్యాణార్థము, ఈశ్వర ప్రీతికొఱకు, పరోపకారార్థమై నిష్కామము గా
చేయబడు సాత్మిక పుణ్యకర్మ. ఇట్టి పుణ్యవ్రత ఆరాధనా కర్మలచేత ఆరాధింపబడువాడు కావున " ఇష్టః " అవబడును.
నిష్కామకర్మానుష్ఠానము ఈశ్వర ప్రాప్తికి సాధనము.
309) అవిశిష్టః - ఓం అవిశిష్టాయనమః
సర్వాంతర్యామి యగుటచేత భగవానుడు " అవిశిష్టః "
అనబడుౘున్నాడు.
సర్వశ్రేష్ఠుడగుటచేత " విశిష్టః " అనబడును. ఈ రెండును ( అవిశిష్టః, విశిష్టః ) గణనీయములే.
310) శిష్టేష్టః - ఓం శిష్టేష్టాయనమః
శిష్ట+ఇష్టః = శిష్టేష్టః = శిష్టులయందు ప్రేమగలవాడు. శిష్టులనగా
సదాచారసంపన్నులు, శీలసంపన్నులు, సాధుసజ్జనులు, పుణ్యాత్ములు . వీరిపట్ల భగవంతునకు గలప్రేమ అపారముగదా. కనుక. " శిష్టేష్టః " అని స్తవనీయుడు అగుౘున్నాడు.. భగవంతుని దయను బొందవలయినన్న సత్ప్రవర్తన గలిగిన ధర్మ జీవితమును గడపవలయునని భావము.
విష్ణు సహస్రనామ స్తోత్రమ్
( సంగ్రహ తాత్పర్య వివరణము)
(15_11_2018)

311) శిఖండీ - ఓం శిఖండినేనమః
" శిఖండ " మనగా నెమలిపింఛమని అర్థము. దానిని ధరించిన
వాడగుటచేత శ్రీకృష్ణుడు " శిఖిపింఛమౌళి " యని పేరు గాంౘుటచే " శిఖండి " అని పేరు వహించెను. నెమలి పింఛమును ధరించిన శ్రీకృష్ణుని దివ్యమంగళ స్వరూపము సాధకులకు ధ్యానయోగ్యమైయున్నది.
312) నహుషః - ఓం నహుషాయనమః
సహనమనగా బంధనము. మాయాబంధనములచేత జీవులను బంధింౘు వాడగుటచేత ఈశ్వరుడు " నహుషః " అని ప్రసిద్ధుడయ్యెను
సమస్తకర్మబంధములు, మమకారాది మాయాబంధనములు హరింౘుటకు
మాయాధినేతయగు శ్రీహరిని శరణాగతిని బొందవలయును. (గీత 7_14) అని గమనింపవలెను.
313) వృషః - ఓం వృషాయనమః
వృషః అనగా ధర్మమని అర్థము భగవానుడు ధర్మస్వరూపుడగుట
చేత వృషః అని పిలువబడునని సాధన. ధర్మమునాచరింపుమని ఈనామము బోధింౘుౘున్నది.
సూచన : 256,257,259,260 నామములయొక్క వివరణ ౘూడవలయును.
314) క్రోధహా - ఓం క్రోధఘ్నేనమః
కోపమును పోగొట్టువాడని ఈనామము యొక్క అర్థము.
కోపము అసురలక్షణము, రజోగుణము వలన కలుగు భయంకర
స్వరూపము. " క్రోధమూలాని పాపాని " సమస్త పాపములకును కోపమే
మూలకారణము. ఇది నశిమచినగానీ చిత్తశాంతి కలుగదు. సాధకుల
మనస్సులలోనున్న ఈ కోప శత్రువును నాశనము చేయువాడగుటచేత శ్రీపతి " క్రోధహా " అని స్తవనీయుడు. క్రోధమును జయించుటకు హరికీర్తనమే సాధనము.
విష్ణు సహస్రనామ స్తోత్రమ్
( సంగ్రహ తాత్పర్య వివరణము)
(16_11_2018)

ఈ శ్లోకము నందు భగవానుడు పది పుణ్యనామము లతో స్తోత్రము చేయబడు ౘున్నాడు.
315) క్రోధకృత్కర్తా - ఓం క్రోధకృత్కర్త్రేనమః
ఇది ఏకనామము. (క్రోధకృత్ + కర్తా ).
సజ్జనుల కపకారముచేయు దుష్టులపట్ల కోపమును ౘూపువాడగుటచేత కారణమగుటచేతను, క్రోధకృత్ కర్తా యని అర్చ నీయు డగుౘున్నాడు.
ఎవ్వరికైననూ హింసాది దుష్కార్యములు చేయవద్దు. మఱియును ముఖ్యముగా సాధుసజ్జనులపట్ల అపకారమొనర్చితివో భగవానుడు
సహింపడు జాగ్రత్త అను ఈనామపు హెచ్చరిక, గ్రహింపదగినది.
316) విశ్వబాహుః - ఓం విశ్వబాహవేనమః
అసంఖ్యాకములగు బాహువులు గలవాడని యర్థము. విశ్వమందుగల సమస్త హస్తములును విరాట్ పురుషుని హస్తములే. బాహువులు కర్మాచరణ సాధనము లగుటచేత సకల కర్మలను చేయువాడు ఈశ్వరుడే యని
భావము.
ఈవిషయమంతయును గీతలోని 11వ అధ్యాయమగు విశ్వరూపమున ౘూపబడినది.
సర్వమును చేయువాడు భగవానుడే కాన " నిమిత్తమాత్రం
భవసవ్యసాచిన్ " అని గీతాచార్యుడు పలికెను (11_3౩).
కర్తృత్వాహంకారమును ( కర్తను నేనేయను అహంకారమును
విడిచిపెట్టి కర్తవ్యకర్మను నిమిత్తమాత్రుడవై చేయుమని సందేశము.
317) మహీధరః - ఓం మహీధరాయనమః
భూమిని ధారణ చేసినవాడు అని అర్థము. భూమికి ఆధార మైనవాడు. వస్త్రమునకు ప్రత్తివలె, కుండలకు మట్టివలె, ఆభరణమునకు
బంగారమువలె సర్వమునకును ఆధారమైనవాడు ఈశ్వరుడే యగుటచేత
" మహీధరః ' అనబడును.
విష్ణు సహస్రనామ స్తోత్రమ్
( సంగ్రహ తాత్పర్య వివరణము)
(18_11_2018)
హరిః ಓమ్
35. వ. శ్లోకము
అచ్యుతః ప్రథితః ప్రాణః ప్రాణదో వాసవానుజః ।
అపాంనిధి రధిష్ఠాన మప్రమత్తః ప్రతిష్ఠితః ।।
ప్రసిద్ధములగు తొమ్మిది హరినామములతో ఈ పుణ్యశ్లోకము
ప్రసిద్ధ మగుౘున్నది.
321) ప్రాణదః - ఓం ప్రాణదాయనమః
ప్రాణ + దః = ప్రాణదః , "దః " అనునది సంస్కృతం లో
రెండర్థములనిచ్చును.
1) దః = అనగా ఇచ్చువాడు.
2) దః = అనగా నాశనముచేయువాడు.
మొదటి యర్థమున సమస్త భూతములకునూ ప్రాణశక్తి ని ప్రసాదింౘు వాడు అని భావము. రెండవ యర్థమున ప్రాణులను ప్రళయకాలమునందు సంహారము చేయువాడని యర్థము.. సృష్టియును సంహారమును భగవత్స్వరూపము లే యగుటచేత " ప్రాణదః " అను నామమున ఈశ్వరుడు స్తుతింపబడుౘున్నాడు.
ఆధ్యాత్మిక సాధకులయొక్క మనస్సు లలోని విషవాసనలను
ధ్వంసముచేయువాడును, దివ్యభావములను, నూతన చైతన్యశక్తిని ప్రసాదింౘు వాడు నుూ భగవానుడే యగుటచేత "ప్రాణదః " అనిగానము చేయబడు ౘున్నాడు.
322) వాసవానుజః - ఓం వాసవానుజాయనమః
వాసవుడనగా ఇంద్రుడు. అనుజుడనగా తమ్ముడు.
ఇంద్రుని యొక్క తమ్ముడని ఈ నామముయొక్క అర్థమై యున్నది. అదితి గర్భమున జన్మించి యుండుటచేత ఇంద్రునకు వామనుడు తమ్ముడయ్యెనని పురాణకథతో సమన్వయము.ఇక తత్త్వపరంగా దేవేంద్రుడనగా ఇంద్రియములకధిపతియైన "మనస్సు" అగునని లోగడ నామ వివరణలలో తెలుపబడియేయున్నదికదా ! . ఇంద్రుడి సోదరుడనగా మనస్సు నందు నిరంతరమునూ జరుగు ఆధ్యాత్మిక నిష్ఠ అవస్థాత్రయమును దాటుటయనియును అంతరార్థముగా విజ్ఞులు గ్రహింపగలరు.
323) అపాంనిధిః - ఓంఅపాంనిధయేనమః
జలములకు నిలయమగు సముద్రమని ఈ నామమునకు
అర్థమగును. సాగరము భగవంతుని విభూతి. సరసామస్మి సాగరః. జలాశయములలో నేను సముద్రమును అని గీతావాణి (10_24)
విష్ణు సహస్రనామ స్తోత్రమ్
( సంగ్రహ తాత్పర్య వివరణము)
(19_11_2018)

ప్రసిద్ధమగుౘున్నది.
324) అధిష్టానమ్ - ఓం అధిష్టానాయనమః
వివిధ నామరూపములతో చిత్రవిచిత్రముగా గోచరించి సమస్త
ప్రపంచమునకును ఉపాదానకారణ మైయున్నది పరబ్రహ్మమేగనుక "అధిష్టానమ్" అని పిలువబడును. "మత్ స్థాని సర్వభూతాని" సకలభూతములును నాయందేగలవు. అను గీతావాక్యము స్మరణీయము.
సకలభూతములును భగవత్స్వరూపము లే కావున సమస్తమును ప్రేమింపుము. అదియే భగవద్భక్తి అని భావము.
325) అప్రమత్తః - ఓం అప్రమత్తాయనమః
1) ప్రమత్తత. అనుపదమునకు మదించియుండుట, మాంద్యము,
సోమరితనము , మఱపు, అలసత్వము అని అర్థములు. ఇవన్నియు తమోగుణ లక్షణములు. ఇట్టి దుర్గుణాదులు లేనివాడగుటచేత పరబ్రహ్మము "అప్రమత్తః " అనిప్రసిద్ధి గాంచెను.
2) జీవులాచరింౘు కర్మలకు తగినట్లుగా పక్షపాతము లేక, సేయక
వాని నియమిత కాలములయందు ఆయాకర్మఫలములను జాగరూకతతో ప్రసాదింౘు వాడు పరమాత్మయే గనుక " అప్రమత్తః " అనబడును.
సాధనః :- తమోగుణములగు అతినిద్ర, సోమరితనము, మున్నగు వానిని విడనాడి ఆధ్యాత్మిక సాధన చేయవలయును. కర్మఫలములు
అనివార్యములు. కనుక త్రికరణములతో సత్కర్మ చేయుము.
326) ప్రతిష్ఠితః - ఓం ప్రతిష్ఠితాయైనమః
ఈ విశ్వమంతయు నూ కార్యకారణ రూపమున గానవచ్చు ౘున్నది. కానీ పరబ్రహ్మము వీని కతీతుడగుటచేత, తనంతతానుగానే విలసిల్లిన
వాడగుటచేత. " ప్రతిష్ఠితః " అనబడెను.
సాధన :- నీయందున్న ఆత్మవికారరహితమై తనయందే ప్రతిష్ఠితమై యున్నట్లు ధ్యానింపుము.
విష్ణు సహస్రనామ స్తోత్రమ్
( సంగ్రహ తాత్పర్య వివరణము)
(20_11_2018)
హరిః ಓమ్
36 వ. శ్లోకము
ఈ శ్లోకమునందు నవవిధములుగా హరినామములు వికసితములు
327) స్కందః - ఓం స్కందాయనమః
1) శివునికుమారుడు స్కందుడు, సుబ్రహ్మణ్య స్వామి, కుమార స్వామి యను నామములతో గూడా పిలువబడును. ఇది పురాణ కథనము.
2) " సేనానీనాం అహం స్కందః " సేనానాయకులలో నేను "స్కందు"
డను అని గీతావాక్యము (10_24).
3) అమృతరూపమున స్రవింౘువాడనియును, వాయురూపమున
విస్తరిల్లువాడును నగుటచేత " స్కందః" అనబడునని మరొక వివరణముగలదు.
4) దేవతా సైన్యములకు నాయకత్వము వహించి దుష్టరాక్షస
భంజనము గావింౘు వాడు .
సాధన: దేవతా గుణముల నభివృద్ధి చేసుకొను ౘున్నచో అసుర భావములు
నశింౘును.
328) స్కందధరః - ఓం స్కందధరాయనమః
పతనావస్థయందున్న ధర్మమును ఉద్ధరింౘువాడు పరమాత్మయే
యగుటచేత " స్కందధరః " అనబడుౘున్నాడు.
సాధన :- ధర్మానుష్ఠానమే సకల మంగళపథము.
329) ధుర్యః - ఓం ధుర్యాయనమః
విశ్వసృష్టి పాలనాది సమస్తకార్యముులును తనంతటతానే
సమర్థతతో వసింౘువాడు గావున " ధుర్యః " అనబడును.
సాధన :- ఆధ్యాత్మిక సాధకుడు తన స్వకృత్యములన్నియు నితరులపై
నాధారపడక తనంతట తానే ౘూౘుకొనుట నభ్యాసము
చేయవలెను.
విష్ణు సహస్రనామ స్తోత్రమ్
( సంగ్రహ తాత్పర్య వివరణము)
(21_11_2018)
హరిః ಓమ్
36 వ. శ్లోకము
స్కందః స్కందధరోధుర్యో వరదో వాయువాహనః ।
వాసుదేవో బృహద్భానురాది దేవః పురందరః ।।

330) వరదః - ఓం వరదాయనమః
1) తన్నాశ్రయించిన భక్తులకు వారివారి అర్హతలననుసరించి
కోఱికలను వర్షింపజేయువాడు గనుక. " వరదః ". యగుౘున్నాడు.
2) వర+దః = వరదః. ఇందు "వర" అనుపదమునకు మిక్కిలి
శ్రేష్టమైనపదవి (మోక్షపదవి) అని అర్థము. "ద" అనగా ఇచ్చువాడు. జ్ఞానులకు మోక్షపదవిని ప్రసాదింౘువాడగుటచేత " వరదు " డయ్యెను.
సాధకులకు సూచన :- భక్తులు శ్రీహహరిని తాత్కాలిక భోగములను కోఱక
మోక్షపదమును కోఱవలెనని భావము.
331) వాయువాహనః - ఓం వాయువాహనాయనమః
సప్తవిధములుగా నున్న వాయువును యథాక్రమముగా సంచరింౘునట్లు చేయువాడు గాన " వాయువాహనః " అని ప్రసిద్ధుడయ్యెను.
సప్తవాయువులు:- 1. అవహుడు, 2. ప్రవహుడు, 3. అనువహుడు
4. వివహుడు 5. పరావహుడు 6. పరివహుడు 7. అనువీరుడు అనునవి.
332) వాసుదేవః - ఓం వాసుదేవాయనమః
భక్తులకత్యంత ప్రియమైన నామములలో నిది యొకటి. దీనికిగలపెక్కు వివరణములలో కొన్ని ఉదహరింపబడుౘున్నవి.
1) వసుదేవుని కుమారుడైన శ్రీకృష్ణుడు.
"కృష్ణస్తుభగవాన్ స్వయం" అని భాగవత ప్రశస్తిగదా.
2) వాసు+దేవః=వాసుదేవః. సమస్తభూతములయందును వసింౘు వాడగుటచేత
"వాసుః" అనబడును. దీవ్యతి = దివ్యకాంతితో ప్రకాశింౘు వాడు గాన
"దేవః" అనబడును. సకలభూతములలో దివ్యకాంతితో భాసిల్లు
పరబ్రహ్మమే "వాసుదేవః" అనబడెను.
3) సూర్యునివలె నాయొక్క దివ్యకిరణములతో సమస్తలోకములను
గప్పియుంౘు వాడనగుటచేతను, సకలభూతములకును నేనే అధిష్టానమునై యున్నందువలనను "వాసుదేవుడని" పేరుగాంచితినని మహాభారతము లోని శాంతిపర్వములోని వాక్యము.
4) ప్రపంచమంతయును పరమాత్మయందు యుండుటవలననూ పరమాత్మ ప్రపంచమునందంతటనూ ఉండుటచేతను" వాసుదేవయని" పిలువబడెను
(విష్ణుపురాణము).
సాధకునకు సూచన :- సర్వమునూ వాసుదేవమయముగా భావింౘుటయే
ఆత్మజ్ఞానము (వాసుదేవస్సర్వమితి ).
--((**))--
( సంగ్రహ తాత్పర్య వివరణము)
(23_11_2018)

333) బృహద్భానుః- ఓం బృహద్భానవేనమః
సూర్యచంద్రులయందు ప్రవేశించి తన సహస్రకోటి కిరణజాలముల
చే విశ్వమంతయునూ ప్రకాశింపజేయు వాడు పరమాత్మ యగుటచేత
"బృహద్భానుః" అనబడును.
సాధన :- జ్ఞానసూర్యుని ఉపాసన చేయవలయును.
334) ఆదిదేవః ఓం ఆదిదేవాయనమః
ఆది+దేవః = ఆదిదేవః అన్నిటికీ ప్రప్రథమముగా నున్నవాడగుట
చేత "ఆది" అనబడును. గొప్ప ప్రకాశముతో కూడినవాడగుటచేత "దేవః" అనబడును.
335) పురందరః- ఓం పురన్దరాయనమః
పురములను నాశనముజేయువాడు అని అర్థము. త్రిపుర సంహారుడు పరమేశ్వరుడే.
1) స్థూల,సూక్ష్మ, కారణ శరీరములను మూడుపురములను భేదించినవాడు.
2) జాగ్రత్, స్వప్న, సుషుప్తి యను అవస్థాత్రయమును దాటినవాడు.
సారాంశమిది :- ఈశ్వర ధ్యానముచేత పురత్రయములు, అవస్థా త్రయములు సాధకుడు దాటిపోగలడు.

(02_11_2018)

278) ఋద్ధః - ఓం ఋద్ధాయనమః
(1) ఈనామము నకు విభూతికలవాడని యర్థము. విశ్వమంతయును
భగవానుని విభూతులతోనే నిండియున్నది. విభూతులను ధ్యానింౘుట ద్వారా
భగవత్ప్రాప్తి కలుగుననియును భావము. ధర్మ జ్ఞానవైరాగ్యాది గుణసంపన్నుడు
అగుటచేత " ఋద్ధః " అనబడుౘున్నాడు.
సాధన : ధర్మానుష్ఠానము వలన ఈశ్వరజ్ఞానయోగ సాధనమువలన భగవత్ప్రాప్తి
వైరాగ్యసాధనమున. ఆత్మదర్శనము కలుగును.
(2) ఋద్ధిః అనగా సర్వసంపన్నత. స్వామి ఋద్ధుడు. సర్వసంపన్నుడని అర్థము.
279) స్పష్టాక్షరః - ఓం స్పష్టాక్షరాయనమః
స్పష్ఠమగు దివ్యశబ్దముతో నొప్పువాడు. ఆ దివ్యశబ్దమే " ఓమ్ "
అను ప్రణవము. దీనినిగూర్చి ప్రథమనామమున వివరింపబడి యున్నది.
"ఓం". అను మంత్రముతో భగవానుని
ఉపాసింౘువాడు ముక్తిని బొందునని ప్రశ్నోపనిషత్తు తెలుపుౘున్నది
" ఓమిత్యేకాక్షరమిదగ్ం సర్వం" అని
మాండుక్యోపనిషత్తు గానము చేయును. రగడ
" ఓం తత్బ్రహ్మ-- ఓంతద్వాయుః-- ఓంతదాత్మా-- ఓంతత్సత్యం-- ఓంతత్సర్వం ". అని నారాయ ణోపనిషత్తు గానము చేయుౘున్నది.
" ಓమిత్యే కాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్"
యః ప్రయాతి త్యజన్ దేహం సయాతిపరమాగతిమ్"
" ఎవ్వడు ఓంకారము నుచ్ఛరింౘుౘు దేహత్యాగము చేయునో
వాడు పరమగతిని బొందును" అను గీతావాక్యము స్మరణీయము.
(గీత అ_8 శ్లో. 11)
"ప్రణవః సర్వవేదేషు" సర్వవేదసారము ప్రణవమై
యున్నది. (గీత అ 7_శ్లో 8)
"గిరామస్మ్యేక మక్షరం" వాక్కులయందు నేన ఓంకారమై యున్నాను (గీత అ10_25)
"ఓం_అథ". అను ఈ రెండు శబ్దములును సృష్టి ప్రారంభమున బ్రహ్మ దేవుని కంఠము నుండి ఆవిర్భవించిన మంగళ శబ్దములని శ్రుతి గానము చేయును. కావున మంగళప్రదమగు ఓంకారపుణ్యశబ్దముతో మంగళప్రదమగు ఈ స్తవరాజము
ప్రారంభమగుౘున్నది.
తస్యవాచకఃప్రణవః _ భగవానుని నామముగా ప్రణవమని పతంజలి మహర్షి తెలిపి యున్నాడు. " ఓం " అనునది భగవానుని నామముగా గీతాశాస్త్రమున(అ 17_23) తెలుపబడి యున్నది. "ఓం" అని పిలిచినౘో "ఓ". యని భగవానుడు పలుకు
నని భక్తులయొక్క విశ్వాసము కనుకనే "ఓం" అను దివ్య నామము తో ఈ స్తవరాజము మంగళకరముగా ప్రారంభమగుౘున్నది.
280) మన్త్రః - ఓం మన్త్రాయనమః
వేదస్వరూపమయినది మన్త్రము. మన్త్రము ద్వారా ఉపాసింౘదగినవాడు భగవానుడి. సంసారకూపమునుండి రక్షింౘునది గాన మన్త్రము. కావుఞే ఈశ్వరుడును మన్త్ర శబ్ద వాచ్యుడగుౘున్నాడు.