Monday, 24 September 2018

హరిః ಓమ్




హరిః ಓమ్

17) శ్లోకము

ఉపేంద్రో వామనః ప్రాంశురమోఘః శుచిరూర్జితః !
అతీంద్రః సంగ్రహః సర్గోధృతాత్మా నియమోయమః !!

ఈ శ్లోకము ద్వాదశ నామములతో వెలయుౘున్నది.

151) (1) ఉపేంద్రః ఓం ఉపేంద్రాయనమః

1) ఇంద్రునకు తమ్ముడగుటచేత. "ఉపేంద్రః" అనబడును. ఇంద్రుని తల్లియగు "అదితి" కి జన్మించినవాడగుటచేత "ఉపేంద్రః" అని పురాణప్రసిద్ధి.

2) "ఉప" అను పదమునకు "పైన" అను అర్థము చెప్పబడును. ఈ అర్థముతో సమన్వయించినచో "ఇంద్రుని కంటే పైన ఉండువాడు " " ఇంద్రుని కంటే అధికుడు " = ఉపేంద్రః యని కీర్తింప బడును.

3) " ఓ కృష్ణా నీవు గోవులకు ఈశ్వరుండవగుటచేత" "ఇంద్రుడవు" గా విలసిల్లితివి. ఈ కారణంగా దేవతలు నిన్ను "ఉపేంద్రః" అని పిలుతురు" అని హరివంశమునందు వర్ణింపబడి యున్నందున శ్రీహరి ఉపేమద్రు అనబడుౘున్నాడు. (హరివంశము 76_47).

4). ఇక ఈనామము వేదాంతపరముగా అన్వయించినచో, ఇంద్రుడనగా ఇంద్రియములకు అధిపతియగు " మనస్సు " అని అర్థము. "ఉప" అను పదముచేత మనస్సుకంటెను మిక్కిలినేని పైగా నున్నది. అనగా మనస్సు కంటెను శ్రేష్ఠమైనది ఆత్మ అగునుకదా! శరీరము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి సర్వమును ఆత్మచేతనే చైతన్యము బొందుౘున్నవని ఉపనిషద్వాక్యము
కనుక భగవానుడు "ఉపేంద్రః" అనబడుౘున్నాడు.

152) (2) వామనః ఓం వామనాయనమః

1) శ్రీ మహావిష్ణువు తన ఐదవ అవతారమున పొట్టివాడై బలిచక్రవర్తిని యాచించి మూడడుగులతో ముల్లోకములను ఆక్రమించిన పౌరాణికగాథ ఈ నామము చేత స్మరణీయమగును.

2) ౘక్కగా ఊహింౘదగిన వాడగుటచేత "వామనుడు" అనబడు ౘున్నాడు . "మధ్యే వామన మాసీనం విశ్వేదేవా ఉపాసతే". హృదయకమలము యొక్క మధ్య భాగమున విలసిల్లుౘున్న వామనుని సకలదేవతలును ఉపాసింౘు ౘున్నారు (కఠోపనిషత్తు 3_5).

" సర్వస్యచాహం హృదిసన్నివిష్టః" (గీత 15_15) అను గీతావాక్యము స్మరణీయము.

--((**))--

153) (3) ప్రాంశుః ఓం ప్రాంశవేనమః 

మిక్కిలి విస్తారమగు దేహము గలవాడగుటచేత "ప్రాంశుః" అనబడును. బలిచక్రవర్తి నుండి దానమును స్వీకరించిన వామనమూర్తి ఒకపాదంబున భూమి గప్పి, స్వర్గమును వేరొకపాదముచే గప్పి బ్రహ్మాండమంతయు నిండిన దివ్యవర్ణనము హరివంశములో గాననగును. మఱియు ను పోతనామాత్యుడు ఆంధ్ర భాగవతమున వామనావతార ఘట్టమున " ఇంతింతై వటుడింతై. . .నిండె 
బ్రహ్మాండమున్" అని రమణీయముగా వర్ణించినాడు. అట్టి విశ్వరూప మనోజ్ఞ మూర్తియగు మాధవుడు  "ప్రాంశుః" అని స్తవనీయుడు. 

154) (4) అమోఘః ఓం అమోఘాయనమః 

వ్యర్థములుగాని ప్రయత్నములు గలవాడని ఈ శబ్దమున కర్థమై యున్నది. అనగా శ్రీహరి యొక్క ప్రయత్నము లన్నియు మహా ఫలసంపన్నములై విస్తరిల్లెనని పురాణగాథలు తెలుపుౘునే యున్నవిగదా! భగవంతుని భక్తితో నాశ్రయించిన వారెన్నడును వ్యర్థులు కాబోరని లాక్షణికార్థముగా ఈ నామము యొక్క వివరణము గావున. "అమోఘః" అని వచింపదగుౘున్నాడు. 
***
155) (5) శుచిః ఓం శుచయేనమః 

పరమ పవితారుడని భావమ సు. ఈశ్వరుని స్మరణచింతనములు గావించిన మాత్రముననే మాలిన్యములు పోగొట్టుకొని పరమపవిత్రులగుదురు గాన శ్రీపతి "శుచిః" అను దివ్యనామ వాచ్యుడగును. 
సాధన విధాన సమన్వయమున శారీరిక మానసికసిద్ధి (బాహ్యాభ్యంతర శౌచములు) మానవుని పవిత్రుని గావింౘును. అని భావము.

--((**))--


156) (6) ఊర్జితః ఓం ఊర్జితాయనమః 

అనంతమగు శక్తి సామర్థ్యములతో విలసిల్లువాడు గాన "ఊర్జితః" అను దివ్యనామ వాచ్యుడగును. "యద్యద్విభూతిమత్సత్త్వం, శ్రమదూర్దితమేవవా, తత్తదేవావగచ్ఛత్వం మమతేజోంశ సంభవమ్". (గీత 40_41). 

ఐశ్వర్యము, శక్తిసంపన్నత, నిర్మలత్వముగల వస్తువులు ఎచ్చటెచ్చట. నుండునో అచ్చట అవి యన్నియును నాతేజోంశ సంభూతములని తెలుసుకొనుమని గీతావాక్యము కావున " ఊర్జితః" అను పుణ్యనామము న శ్రీహరి పేరుగాంచెను. 

157) (7) అతీంద్రః ఓం అతీంద్రాయనమః 

తనయొక్క మహైశ్వర్య, బల, శక్తి, విభవ, తేజస్సులచేత దేవేంద్రుని మించినవాడగుటచేత "అతీంద్రః" అని పిలువబడెను. "ఇంద్రః" అనగా మనస్సు కంటెను శ్రేష్ఠుడు పరమాత్మ యని భావము. 

158) (8) సంగ్రహః ఓం సంగ్రహాయనమః 

1) ప్రళయకాలమునందు సర్వమును ఒకచోట చేర్చువాడు. 
2). జగత్తు రూపమే తానై యిన్నవాడు కనుక శ్రీహరి సంగ్రహ శబ్ద వాచ్యుడయ్యెను. 

159) (9) సర్గః ఓం సర్గాయనమః 

సృష్టియంతయూ తనరూపమేయైనవాడు. 

160) (10) ధృతాత్మా ఓం ధృతాత్మనేనమః 

జననమరణాది షడ్భావవికారము లెవ్వియునుగాక ఒకే రూపముగా ధరించియున్న రూపములుగా యున్నవాడగుటచేత "ధృతాత్మా" యని శ్రీపతి అర్చనీయుడగును. 
‌--((**))--

161) (11)  నియమః ఓం నియమాయనమః

సమస్తమునూ నియమించి , శాసించి, పాలింౘువాడని భావము,
సూర్య చంద్ర నక్షత్ర గ్రహాదులను, దిక్పాలాదులను నియమించి వారికి నియమిత కర్మను శాసించి పరిపాలనము చేయుౘుండు శాసక సార్వభౌముడు పరమాత్మయే యగుటచే "నియమః" అనునామమున ఆరాధ్యుడగును.

162) (12 ) యమః ఓం యమాయనమః

సమస్తములగు ప్రకృతి శక్తులను తనవశమునందే యుంౘుకొన్న మహనీయమూర్తి యగుటచేత " యమః " అని అర్చనీయుడగును.

సూచన: ఈ శ్లోకము లోని "నియమః, యమః అను (161, 162నామములు) ఈ రెండు నామములును 92వ శ్లోకమునందు కూడా 865,866 నామములుగా మఱలా గానము చేయబడినవి. ఆధ్యాత్మిక జీవితమునందు యమనియమములు అత్యంత ప్రధానములైనవి.

భక్తిజ్ఞాన కర్మమార్గములలో ఏమార్గమును సాధింౘుౘున్ననూ యమనియమములు అత్యంత ప్రధానములైనవి.

యమములనగా 1) అహింస. (ఏప్రాణికి హింసచేయకుండుట) 2) సత్యము (నిజము పలుకుట), 3) అస్తేయము (దొంగతనము చేయకుండుట) 4) బ్రహ్మచర్యము (ఇంద్రియనిగ్రహము). 5) అసంగ్రహము (ఇతరులనుండి స్వీకరింప కుండుట).

"నియమములనగా" 1) సంతోషము (సుఖదుఃఖాది ద్వంద ములయందు సమత్వము). 2) శౌచము (శారీర మానసిక శుద్ధి). 3) తపస్సు (శారీరక, వాచిక, మానసిక, నియమము). 4) స్వాధ్యాయము (పుణ్యగ్రంథపఠనం) 5) ఈశ్వర ప్రణిధానము (భగవంతుని శరణాగతి).

ఈ దశవిధ గుణముల అనుష్ఠానము చేత మానవుడు
మహాత్ముడగును. కావుననే ఈ స్తవరాజములో వీనికి ఎక్కువ ప్రాధాన్యత నీయబడెను.
--((**))--

హరిః ಓమ్ 

18) శ్లోకము 

వేద్యో వైద్యః సదాయోగీ వీరహా మాధవో మధుః ! 
అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబలః!! 

ఈ శ్లోకము నందు పది హరినామములు వర్ణితములు. 

163) (1)  వేద్యః ఓం వేద్యాయనమః 

"తెలియదగినవాడు". అని శబ్దార్థము, మోక్షమును బొందగోరు వారిచేత తెలియదగినది. "పరబ్రహ్మమే" యగుటచేత "వైద్యః" అని కీర్తనీయుడగును దేనిని గ్రహించిన సాధకునకు అమృతత్వము సిద్ధింౘునో అదియే "జ్ఞేయము" అనబడును. ఆ జ్ఞేయపరమాత్మయే "వేద్యః" అనబడును. గీతాశాస్త్రమున 13వ అధ్యాయములో13, 14, 15, 16, 17, 18. శ్లోకములలో అట్టి జ్ఞేయ పరబ్రహ్మము యొక్క మనోహర వర్ణణమును పాఠకులు గమనింప ప్రార్థన. 

దేనిని గ్రహించిన మఱియింకనూ తెలియదగినదేదియును నుండదో అదియే బ్రహ్మము (గీత 9_2). బంగారము యొక్క తత్త్వము తెలిసినౘో బంగారం తో తయారయిన సకలాభరణముల జ్ఞానమును తెలిపిన విధమునను మృత్తికను గూర్చి తెలిసిన పిదప మృత్తికతో తయారయిన వివిధ వస్తు సముదాయములను గూర్చి తెలియవలసిన అవసరముండనట్లును ఆత్మ (బ్రహ్మమును) గూర్చి తెలిసికొనిన, విశ్వమంతయును నిండియున్నది ఆత్మయే అగుటచేత ఇక వివిధ నామరూపాత్మక మగు జగత్తులోని విషయములను గూర్చి వేరు వేరుగా తెలియ నవసరముండదుగదా ? కావుననే " ఆధ్యాత్మ విద్యా_విద్యానాం". అన్ని విద్యల లోనూ ఆధ్యాత్మ విద్యయే సర్వ శ్రేష్ఠమగువిద్య. అదియే నేను". అని గీతా వాక్యము (అ10_32శ్లో) కావున బ్రహ్మము "వేద్యః" అను దివ్యనామవాచ్యు 
డగుౘున్నాడు.. 

164) (2) వైద్యః ఓం వైద్యాయనమః 

సర్వ విద్యాస్వరూపుడు, సకల కళాపరిపూర్ణుడును భగవంతుడే యగుటచేత "వైద్యః" అని గానము చేయబడును. చిత్త శుద్ధి తో ఆయనను సేవించినచో పాఠకులకు వారికి గావలసిన సకలవిద్యలును చేకూరునని భావము. 

287వ. నామవివరణమును గూడా తిలకింపనగును. శారీరిక మానసికాది సకల వ్యాధులను మరియు భయంకరమగు భవరోగ వ్యాధిని పోగొట్టు ఘనవైద్యుడును భగవానుడే గనుక "వైద్యః" అని పిలువబడును. ఈ సందర్భమున 62వ శ్లోకములోని భేషజం, భిషక్ ( 568, 569). నామవివరణలను పాఠకులు ముందు ముందు ౘూడగలరు.

--((**))--


హరిః ಓమ్

18) శ్లోకము


వేద్యో వైద్యః సదాయోగీ వీరహా మాధవో మధుః !

అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబలః!!

ఈ శ్లోకము నందు పది హరినామములు వర్ణితములు.


165) (3) సదాయోగీ ఓం సదాయోగినేనమః


నిరంతరము ఆవిర్భూత స్వరూపుడయియే యున్నవాడు. అనగా సంతతమును సత్ చిత్ ఆనంద స్వరూప పూర్ణబ్రహ్మమయి, యెట్టిమార్పును లేక యున్నవాడగుటచే "సదాయోగీ" అనబడు ౘున్నాడు.


యోగమనగా జీవుడు పరమాత్మతో కలిసియుండు స్థితి. ఇంద్రియ నిగ్రహముగలిగిన యోగులకట్టి స్థితి తఱౘూ కలుగుౘునే యుండును. కానీ మరల దేహాభిమానము మాయావశమున కలుగును. తమ దివ్యమైన ఆత్మోన్నతి స్థితినుండి పతనమగు ౘుందురు. అట్లుగాక నిరంతరమును (పానీయంబులు ద్రావుౘు, గుడుౘుౘు, భాషింౘుౘు నిత్య దైనందిన కార్యక్రమములలో నిమగ్ను

డగుౘు కూడా). ఆత్మభావముతో నుండవలయునని సూచన. ఈ స్తవరాజము నిత్యమూ జపింౘు ౘున్నచో అట్టి " సదాయోగము" లభింౘు ననుట నిర్వివాదాంశము.

166) (4) వీరహా ఓం వీరఘ్నేనమః


అనేకావతారముల నెత్తి వీరులగు దుష్టరాక్షసులను సంహరించిన వాడగుటచేత శ్రీహరి "వీరహా" అని పురాణ ప్రసిద్ధి. మన మనఃక్షేత్రములయందు శక్తిమంతులగు రాక్షసులెందరో యున్నారు. వారే కామక్రోధములు_లోభమోహాదులు తనస్మరణచింతనములు చేయు భక్తుల యొక్క మానసిక క్షేత్రమందలి దుష్టరాక్షస శక్తి బీజములనెల్ల నాశనము చేయువాడు కావున " వీరహా " అని స్తుతి చేయబడును.


167) (5) మాధవః ఓం మాధవాయనమః


"మా" అనగా విద్య లేక జ్ఞానమని భావము. వీనికి అధిపతి ("ధవుడు") గావున మాధవుడనబడును. 72వ నామ వివరణలో మరింత విపులంగా దీనినిగూర్చి తెలుపబడినందున పాఠకులు దానిని పరికింప ప్రార్థన. 


72) (6) మాధవః ఓం మాధవాయనమః


మాధవ శబ్దము భక్తులకత్యంత ప్రియమైనది.


1) మా+ధవః= మాధవః "మా" అనగా లక్ష్మి యనియర్థము లక్ష్మికి భర్తయైనవాడు.


2) "మా" యనగా మాయ లేక ప్రకృతి. ప్రకృతి కి అధిపతి యగుటచే భగవానుడు మాధవుడగును.


3) మాధవ శబ్దము మౌనమునకు చిహ్నము. ఆత్మ (మాధవః) నిస్సంగము.నిర్లిప్తము గనుక భగవానుడు మాధవు డగును .


4) మౌనమువలననూ , ధ్యానమువలననూ, యోగము వలననూ, పొందబడువాడు మాధవుడని మహాభారతములో వ్యాసమహర్షి వాక్యము. ( మౌనాత్, ధ్యానాచ్చ, యోగాచ్చ విద్ది భారత మాధవమ్). (మహా భా _ఉ.ప.70-4)


5) బృహదారణ్యక శ్రుతి యందు చెప్పబడిన రీతిగా మధు విద్యద్వారా తెలిసికొనబడువాడు కనుక మాధవుడగును.


6). సకల విభూతులకును అధిపతి యగుటచేత మాధవుడయ్యెను. ఆయనను ఆశ్రయించినవారికి సర్వ శుభము లునూ కలుగునని తాత్పర్యము.


168) (6)  మధుః ఓం మధవేనమః


1) మధువనగా తేనె, మధువువలె భక్తులకత్యంత ప్రియమైనవాడని ఈనామముయొక్క భావము.


2) మధు శబ్దమునకు "అమృతము" అను అర్థముకూడా గలదు. సారాంశమేమనగా. తన భక్తులకు భౌతిక సుఖభోగములను మాత్రమేకాక శాశ్వతమగు అమృతత్వమును (మోక్షము) ప్రసాదింౘు వాడు గనుక "మధుః" అనబడును.


3) మధు శబ్దము వసంతఋతువును తెలుపును. "ఋతూనాం కుసుమాకరః". ఋతువులలో వసంతము నా విభూతియని గీతాచార్యుని వాణి (10_35).

--((**))--
హరిః ಓమ్ 
18) శ్లోకము

వేద్యో వైద్యః సదాయోగీ వీరహా మాధవో మధుః !

అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబలః!!

ఈ శ్లోకము నందు పది హరినామములు వర్ణితములు.


169) (7) అతీంద్రియః ఓం అతీంద్రియాయనమః


ఇంద్రియములచేత తెలిసికొనబడజాలని వాడగుటచేత "అతీంద్రియః" అని స్తవనీయుడగు ౘున్నాడు.


"యతోవాచో నివర్తంతే అప్రాప్యమనసాసహ" వాక్కులచేత గానీ మనస్సు చేత గానీ పట్టరానివాడు పరమేశ్వరుడని శ్రుతి గానము చేసినది. "అశబ్దమస్పర్శమ్" అను శ్రుతివాక్యము స్మరణీయము.


170) (8) మహామాయః ఓం మహామాయాయనమః


మాయకే అధిపతి. తన మాయచేతనే సకలమును సృష్టించినవాడు భగవంతుని మాయను బ్రహ్మాదులు కూడా దాటజాలరుకదా. " మామేవ యే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే" ఎవరు నన్ను శరణు బొందుదురో వారే మాయను దాటిపోగలరని గీతాచార్యునివాక్యము (అ_7_14).


171) (9) మహోత్సాహః ఓం మహోత్సాహాయనమః


నిరంతరము అపారమగు ఆనందోత్సాహములో నుప్పొంగు ౘుండువాడు గాన " మహోత్సాహః " అను నామముతో పిలువబడును. జగదుత్పత్తి స్థితి, లయముల కొఱకు సదా ఉద్యుక్తుడై యుండువాడని భావము. 


172) (10) మహాబలః ఓం మహాబలాయనమః


బలవంతులకెల్ల మహాబలవంతుడు. తన్నాశ్రయించిన అబలులకు అనంతబలమును ప్రసాదింౘు వాడగుటచే "మహాబలః "అనబడెను.

--((**))--
హరిః ಓమ్

19) శ్లోకము 


మహాబుద్ధి ర్మహావీర్యో మహాశక్తి ర్మహాద్యుతిః !

అనిర్దేశ్యవపుః శ్రీమాన్ అమేయాత్మా మహాద్రిధృత్ !!

ఈ. పవిత్ర. శ్లోకమున హరినామములు ఎనిమిదికలవు.


173)(1) మహాబుద్ధి ఓం మహాబుద్దయేనమః


అనంతమగు బుద్ధి బలముతో శోభిల్లువాడు "బుద్ధిర్భుద్ధిమతామస్మి" బుద్ధిమంతులలో బుద్ధిబలము నేనేయైయున్నాను (గీత 7_10).


174) (2) మహావీర్యః ఓం మహావీర్యాయనమః


సకల సృజనాత్మక దివ్యశక్తులకును వీర్యమే మూలాధారము. అట్టి అనంతవీర్య సంపన్నుడగుట చేత మహావీర్యః అని ప్రసిద్దుడగుౘున్నాడు.


175) (3) మహాశక్తిః ఓం మహాశక్తయేనమః


క్రియాశక్తి, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి మున్నగు సర్వశక్తి మహాసాగరుడు భగవానుడగును.


176) (4) మహాద్యుతిః ఓం మహాద్యుతయేనమః


ద్యుతి అనగా కాంతియని భావము. మహాద్భుతమగు దివ్యకాంతి సంపన్నుడు భగవానుడు. చంద్ర సూర్యాగ్నులకు కూడా కాంతిని ప్రసాదించిన స్వయంజ్యోతిః స్వరూపుడగుటచే "మహాద్యుతిః" అను భవ్యనామవాచ్యుడగును.


"దివి సూర్యసహస్రస్య భవేద్యుగపదుత్థితా". ప్రళయకాలమున ఆకాశమునందు సహస్ర సూర్యబింబములు ఏకకాలమున ప్రకాశించినౘో ఎంత కాంతియుండునో అంతటి మహాకాంతితో ప్రకాశింౘు ౘున్నాడని గీతలో విశ్వరూప దర్శన యోగమున వర్ణితమైయున్నది (అ11_12).

--((**))--

హరిః ಓమ్ 

19) శ్లోకము 

మహాబుద్ధి ర్మహావీర్యో మహాశక్తి ర్మహాద్యుతిః ! 
అనిర్దేశ్యవపుః శ్రీమాన్ అమేయాత్మా మహాద్రిధృత్ !! 

ఈ. పవిత్ర. శ్లోకమున హరినామములు ఎనిమిదికలవు. 

177).(5)  అనిర్దేశ్యవపుః ఓం అనిర్దేశ్యవపుషేనమః 

వర్ణింౘుటకు వీలుగానట్టియు , ఊహింపనలవిగానట్టియు, ఆకారము గలవాడగుటచేత శ్రీహరి "అనిర్దేశ్యవపుః" అని పిలువబడెను. అతడు గుణాతీతుడు ఇంద్రియాతీతుడు, నిరాకారుడు నిర్గుణుడు గదా. 

178). (6)  శ్రీమాన్ ఓం శ్రీమతేనమః 

"శ్రీ ". అనగా లక్ష్మి. నిరంతరము లక్ష్మితో (ఐశ్వర్య శక్తిసంపదలతో) గూడియుండు వాడగుటచేత. " శ్రీమాన్ " అని శ్రీహరి నుతింపబడెను. ఈ పుణ్యనామము ఈ స్తవరాజములో నాలుగు పర్యాయములు మరల మరల గానము చేయబడినది. కనుక పాఠకులా శ్లోకములయందు తెలుపబడిన వివరణములను తిలకింప ప్రార్థన. 

179) (7) అమేయాత్మా ఓం అమేయాత్మనేనమః 

సర్వ వ్యాపక, సర్వశక్తి సంపన్నమైన ఆత్మస్వరూపమై యున్నవాడు. అసంఖ్యాకమైన క్షేత్రములలో క్షేత్రజ్ఞుడై యున్నవాడగుటచే త " అమేయాత్మా" అని కీర్తింపబడెను. 

180). (8) మహాద్రిధృత్ ఓం మహాద్రిధృతేనమః 

గొప్ప కొండలను ధరించిన వాడని ఈ నామము యొక్క భావము. 

(1) అమృతము కోసము క్షీరసాగరమునందు మందరపర్వతాన్ని కవ్వముగా జేసి వాసుకిని తాడుగాజేసి దేవదానవులు మథింౘుౘుండగా మందరము (కవ్వము) జారిపోకుండా కూర్మరూప ధారియై మహావిష్ణువు దానిని ధరించెను. కావున. " మహాద్రిధృత్" అయ్యెను. 

భావార్థము= మానవునియెక్కహృదయము క్షీరసాగరము. మనస్సే కవ్వము, దైవాసురభావనలే దేవదానవులు , వాసుకియే బుద్ధి, అమృతమే మోక్షము. సాధకుడు తన పురుషకారముతో అమృతోత్పాదనము కొఱకు(మోక్షముకొఱకు) తీవ్రప్రయత్నము చేయుౘుండగా కర్మసంస్కార బలముచేత క్రిందికి జారిపోవుౘున్న మనస్సు ను ( కవ్వమును ) ధారణము చేసి తన్నాశ్రయించి న సాధకునకు సహకరింౘువాడు భగవానుడేకదా! కనుక శ్రీహరి "మహాద్రిధృత్ "అనబడును. 

(2). ఇంద్రుడు దురహంకారముతో రాళ్ళవర్షమును గుఱిపింౘ గా భగవానుడు తన్నాశ్రయించి న గో, గోప, గోపికా జనుల రక్షణార్థమై గోవర్థన పర్వతమెత్తిన వాడగుటచేత. " మహాద్రిధృత్" అనబడును. 

గ్రాహ్యార్థము= గో, గోప, గోపికా జనములు భగవదాశ్రయమును బొందిన జీవులు . ఇట్టివారికి విపత్తులు కల్గుటయ్ రాళ్ళవర్షము. భక్తులకాపద రాకుండా తన యనగ్రహాచ్ఛాదనము చేయుటయే గోవర్ధనోద్ధరణము. కనుక శ్రీహరి " మహాద్రిధృత్ ". అనబడెను.

--((**))--


హరిః ಓమ్ 

20) శ్లోకము 


మహేష్వాసో మహీభర్తా శ్రీనివాసః సతాంగతిః ! 

అనిరుద్ధః సురానందో గోవిందో గోవిదాంపతిః !! 

ఈ పుణ్యశ్లోకము అష్టవిధములగు భగవన్నామము లతో పరిమళింౘుౘున్నది 


181) (1)  మహేష్వాసః - ఓం మహేష్వాసాయనమః 


ఈ నామమునకు " గొప్ప విలుకాడు " అని అర్థం. శ్రీమహావిష్ణువు " శార్ఙ్గ " మను విల్లును, శ్రీరాముడు "కోదండము". అను విల్లును ధరించి దుష్టరాక్షస సంహారము గావించిన విధము మన పురాణములో వర్ణితము. వేదాంత పరిభాషగా ధనస్సు మనస్సును లేక ప్రణవమును సూచింౘును. మనస్సును ఆవరించిన సమస్త పాతకములును మనో నిగ్రహముతో కూడిన ప్రణవోపాసనముచేత నశింౘునని భావము. శ్రీపతి తన కార్ముక విముక్త బాణముల చేత క్రూర రాక్షస సంహారం చేసినట్లు తన దివ్యనామ స్మరణమాత్రము చేతనే తన భక్తుల నావరించియున్న క్రూర రాక్షస గణములను దుర్వాసన లను నశింపజేయు నను భావము గ్రాహ్యము. 


182) (2)  మహీభర్తా - ఓం మహీభర్త్రేనమః 


1) ప్రళయసాగరములో నున్న భూమిని ఉద్ధరించిన వాడగుటచేత " మహీభర్తా " యనబడును. 2). భూదేవికి భర్తయైనవాడు ( వరాహావతారము) గాన భూభర్త యని పురాణ కథనము. 3). బంగారు నగలకన్నిటికిని బంగారమే యాధారమైన రీతిని భూమిపైగల సమస్తమునకు " విష్ణువే". అధిపతియును, ఆధారమును అగుటచే " మహీభర్తా " యని పిలువబడును. 


సారాంశమేమనగా, మానవుడు అజ్ఞానవశమున తుచ్ఛమగు మమకార పాశబద్దుడై ఇది నా ఇల్లు, నా ధనము, నా భూమి, నా వస్తువులని అహంకరింౘును. వాస్తవముగా నాలోచించినౘో సర్వమును భగవానునిదే. " నాది " యన్నది ఒక్క అణువుకూడా లేదు. నేనును, ఈ శరీరమును గూడ 

భగవంతునిదే కదా, ఇట్టి మమకారరాహిత్యమును సాధకుడు పొందుటకు ఈ నామము ధ్వని ప్రధానముగా బోధింౘుౘున్నది. 

183) (౩)  శ్రీనివాసః - ఓం శ్రీనివాసాయనమః 


శ్రీదేవికి నిత్యనివాసమైనవాడని భావము. శ్రీ అనగా ధనము ఐశ్వర్యము, ప్రతిభ మున్నగు సకల సంపదలును అని అర్థము. అట్టి శ్రీ నివాసుని ఆస్రయించిన వారికి కామితార్థములన్నియును కలుగునని భావము.


--((**))--

హరిః ಓమ్ 


20) శ్లోకము 


మహేష్వాసో మహీభర్తా శ్రీనివాసః సతాంగతిిః ! 

అనిరుద్ధః సురానందో గోవిందో గోవిదాంపతిః !! 

ఈ పుణ్యశ్లోకము అష్టవిధములగు భగవన్నామము లతో పరిమళింౘుౘున్నది 


184) (4) సతాంగతిః ఓం సతాంగతయేనమః 


సత్పురుషుల కు గతియైనవాడని ఈ పవిత్రనామము యొక్క భావము. సత్పురుషులనగా నెవరు ? భగవద్గీతలో ని 2వ అధ్యాయమునందు వర్ణింపబడిన స్థితప్రజ్ఞలక్షణములు, 12వ అధ్యాయము నందలి భక్తలక్షణములు, 13వ అధ్యాయమునందలి జ్ఞానలక్షణములు, 14వ అధ్యాయమునందలి 

దైవసంపదలు కలిగిన వారు ను సత్పురుషులు, వారే సజ్జనులు, అట్టి వారినే శ్రీహరి ఆదరించి తనవద్ద కు చేర్చుకొనునని భావము. కనుక. శ్రీహరి "సతాంగతిః". అను ప్రసిద్ధ నామమున స్తుతింప బడెను. నైతిక, ధార్మిక ప్రతిష్ఠతో జీవితమును గడుప వలెనని ఈ నామముయొక్క బోధనము. 

185) (5) అనిరుద్ధః ఓం అనిరుద్ధాయనమః 


ఆయనను నిరోధింపగలవారెవ్వరును లేరుగనుక, భగవానుడు " అనిరుద్ధః " అనబడును. సారాంశమేమనగా అనిరుద్ధుని (భగవానుని) స్మరణకీర్తనములు చేయువారికి, నిత్యదైనందిన జీవితమునందుగానీ ఆధ్యాత్మిక సాధనాపథమునందు గానీ ఎట్టి నిరోధములు ( అనగా అడ్డంకులు, చిక్కులు, బాధలును) కలుగనేరవని భావము. 


186) (6) సురానందః ఓం సురానందాయనమః 


సురులనగా దేవతలు, స్వర్గలోకనివాసులు. మానవులకంటే వారికి ఎక్కువ ఆనందము కలుగును కదా. అట్టి స్వర్గవాసులకు ఆనందము (సుఖ శాంతులు) ఎచ్చటనుండి కలుగుౘున్నవి? పరమాత్మ ఆనందస్వరూపు డగుటచేత ఆయన అనుగ్రహమున మనకును వారికిని ఆనందము కలుగుౘున్న 

దని భావము.

 --((**))--


 హరిః ಓమ్ 

20) శ్లోకము 

మహేష్వాసో మహీభర్తా శ్రీనివాసః సతాంగతిిః ! 
అనిరుద్ధః సురానందో గోవిందో గోవిదాంపతిః !! 

ఈ పుణ్యశ్లోకము అష్టవిధములగు భగవన్నామము లతో పరిమళింౘుౘున్నది. 

187)(7) గోవిందః - ఓం గోవిందాయనమః 

ఈ నామము భక్తులకత్యంత ప్రియమై నిత్యస్మరణీయమై యున్నది. ఈ మధుర నామము అనేక విధములగు పుణాయభావములతో నిండియున్నది. అందు కొన్ని మాత్రమే వివరింపబడుౘున్నవి. 

1) "గో" అనగా భూమి. భూమియందుగల దుర్జనులను సంహరించి ఆనందం 
గలుగజేయువాడు గనుక గోవిందుడగును. 

2) మానవునియొక్క మనఃక్షేత్రము (భూమి )నందు గల దుర్వాసనలను, దుష్టబీజములను నాశనముచేసి సత్ చిత్ ఆనంద ములను ఇచ్చువాడుగనుక గోవిందుడగును. 

3) గౌః అనగా గోవు అని అర్థము. బృందావన వనాంతర పుణ్యసీమలో గోపాలుడై మురళీగానము చేయుౘు విహరించిన శ్యామసుందరుని దివ్యావతారం స్మరణీయము గనుక ఆయన గోవిందుడగును. 

4) గో అనగా వాక్కు అని అర్థము. ఆయన వాక్పతి, వాగీశ్వరేశ్వరుడు గదా " మూకంకరోతివాచాలం". మూగవాని తో గూడా దివ్యవాణిని పలికించి ఆనందింప జేయువాడుగనుక గోవిందుడయ్యెను. 

5) గావః అనగా వేదములు ఆయన వేదవిదుడు. వేదాంత కర్తయగుట చేత గోవిందుడు. 

ఇంకనూ మిగిలిన వివరముల నిమిత్తము సాధకులు 591వ నామమున ముందు ముందు పరిశీలింప గలరు. 

188) (8)  గోవిదాంపతిః -  ఓం గోవిదాంపతయేనమః 

గోవిదులనగా వేదవేద్యులు, వేదార్థము నెఱింగిన మహాత్ములు. జ్ఞానసంపన్నులు, మహర్షులు. ఇట్టి పుణ్యాత్ముల కెల్లరకు శ్రీహరియే పతియగుట చేత "గోవిదాంపతిః" అని కీర్తింప బడెను. సారాంశమేమనగా వేదార్థములను గురువులయొద్ద ౘక్కగా నభ్యసించి నిత్యజీవితంలో అనుష్ఠానము చేయ వలయునని తాత్పర్యము. అట్టివారికి శ్రీహరి యొక్క ఆశ్రయము లభింౘును.
--((**))-- 


హరిః ಓమ్

21) శ్లోకము

మరీచిర్దమనోహంసః సుపర్ణో భుజగోత్తమః !
హిరణ్యనాభః సుతపాః పద్మనాభః ప్రజాపతిః!!

ఈ దివ్య శ్లోకమునందు భగవానుడు నవ విధములగు మధుర నామములతో స్తవనీయుడగు ౘున్నాడు.

189) మరీచిః - ఓం మరీచయేనమః

తేజోవంతుడని ఈ నామము యొక్క అర్థము. "తేజఃతేజస్వినామహం" తేజోవంతులలోని తేజస్సును నేనేయని భగవద్వాక్యము (గీత అ7_10). సూర్యచంద్రాగ్నులలోని తేజస్సంతయును నాదేయని భగవద్వాక్యము గదా. " మరీచిర్మరుతామస్మి". మరుత్తులను దేవతలలో "మరీచి " యనువాడను నేను అని భగవద్వాక్యము.(10_21).

190) దమనః - ఓం దమనాయనమః

దండింౘువాడని సామాన్యార్థము. యముని రూపమున జీవులను సంహరింౘువాడు పరమేశ్వరుడే. తన్నాశ్రయించి న భక్తుల మనః క్షేత్రములలోని విషయవాసనలను సంహరింౘు వాడును పరమేశ్వరుడే గనుక "దమనః" అని పిలువబడెను.

191) హంసః- ‌‌‌‌ ఓం హంసాయనమః

" అహంబ్రహ్మాస్మి " ( నేను పరబ్రహ్మము ను) అని బోధింౘు మహావాక్య సారమే " హంసః " అని ఇౘట గానము చేయబడినది. దీని భావమిది. 

" అహం + సః అహం = నేను, సః = ఆ పరమాత్మను అని అర్థమిచ్చును. కానీ "అహం " అను పదములో "అ" అను అక్షర మిచ్చట లోపించినదని విజ్ఞులు గుర్తింపగలరు. కనుక "అహంసః". అను పదమునకు బదులుగా ( అకారము సంధితో లోపింపగా) " హంసః ". అయినది. దీనిని అద్వైత
సిద్ధినికల్గింౘు మహామంత్రముగా జ్ఞానులు భావింతురు.

192) సుపర్ణః - ఓం సుపర్ణాయనమః

(1) పర్ణములనగా పక్షియొక్క ఱెక్కలని యర్థము. సుపర్ణము లనగా శోభనప్రదములయిన శక్తివంతములయిన ౘక్కని ఱెక్కలు గలవాడు. అనగా గరుత్మంతుడని భావము. " వైనతేయశ్చపక్షిణాం". పక్షులలో గరుత్మంతుడను నేను అని భగవద్వాక్యము (అ_10_30)

(2) ఈ దివ్య నామమునకు సరిగా మనోహరమగు  ఉపనిషద్వర్ణనము గలదు. " ద్వాసుపర్ణా " అని, మంత్రవర్ణనము శరీరమను వృక్షముపైన రెండు ౘక్కని పక్షులున్నవి. అందొకటి పండును భుజింౘుౘున్నది. రెండవపక్షి కేవలము ౘూౘుౘునేయున్నదని వర్ణింపబడి యున్నవి. ఆ రెండవ పక్షియే ఇౘట ఈనామముచే గ్రహింపదగినది. ఇందు మొదటిపక్షి " జీవుడు " కర్మ ఫలములను భక్షింౘుౘు సుఖదుఃఖములను అనుభవింౘుౘుండును. రెండవ పక్షి " ఈశ్వరుడు " ఈతడు సంగరహితుడై కేవలము సాక్షిమాత్రుడై యుండును. (ముండకోపనిషత్).

--((**))--

హరిః ಓమ్

21) శ్లోకము

మరీచిర్దమనోహంసః సుపర్ణో భుజగోత్తమః !
హిరణ్యనాభః సుతపాః పద్మనాభః ప్రజాపతిః!!

ఈ దివ్య శ్లోకమునందు భగవానుడు నవ విధములగు మధుర
నామములతో స్తవనీయుడగుౘున్నాడు.

193) భుజగోత్తమః-ఓం భుజగోత్తమాయనమః

" అనంతశ్చాస్మినాగానాం" సర్పములలో అనంతుడను నేను. అని గీతావాక్యము (10_29). " సర్పాణామస్మివాసుకిః". సర్పములలో నేను వాసుకిని. అని భగవద్వాక్యము (10_28). భగవానుడు భుజగభూషణుడుగా పురాణ ప్రసిద్ధి.

194) హిరణ్యనాభః - ఓం హిరణ్యనాభాయనమః

హిరణ్యము (బంగారము) వలె కల్యాణప్రదమును, మనోహరమును నాభిగలవాడు. సృష్టికర్త అయిన బ్రహ్మ కు (హిరణ్యగర్భునకు) ఆధారమై జన్మ స్థానమైన నాభిగలవాడగుట చేత "హిరణ్యనాభః " అని చెప్పబడుౘున్నాడు.

195) సుతపాః- ఓం సుతపసేనమః

1) ఇంద్రియమిలను, మనస్సు ను, బుద్ధి ని ఏకాగ్రము చేయుటయే తపస్సు. ఇట్టి తపస్సు వలననే ఈశ్వరసన్నివేశము కలుగును గనుక " సుతపాః " అనబడును.

2) సృష్టివిషయమై తీవ్రతపమాచరించిన కారణమున "సుతపాః " అనబడును.

3) బదరికాశ్రయమున సుదీర్ఘకాలం తీవ్రమైన తపశ్చర్యను నరనారాయణ రూపమున గావించినాడనియును భావము. కావున " సుతపాః " అని స్తవనీయుడగును.

196) పద్మనాభః - ఓం పద్మనాభాయనమః

పద్మము నాభి ప్రదేశమునందు గలిగినవాడు శ్రీహరి యని భావము హృదయపద్మము యొక్క మధ్యభాగమున (నాభియందు) ధ్యానింప తగినవాడు ‌లేక ప్రకాశింౘువాడు. ( 48 వ నామ వివరణమును తిలకింప ప్రార్థన )

48) పద్మనాభః ఓం పద్మనాభాయనమః

పద్మము నాభియందు గలవాడు. పద్మముయొక్క విశిష్టతను గూర్చి లోగడ 40వ నామముయొక్క వివరణమున ౘూడ ప్రార్థన. శ్రీహరి యొక్క నాభిపద్మమునుండి చతుర్ముఖబ్రహ్మ జన్మించి విశ్వసృష్టిని గావించినాడని పురాణశాస్త్రముల కథనము గదా. సర్వక్రియాత్మక శక్తులకు నాభియేకేంద్రమని యోగశాస్త్రము వచింౘును. ఈ కారణములచే శ్రీహరి పద్మనాభుడని వాసిగాంచెను.

.40) పుష్కరాక్షః ఓం పుష్కరాక్షాయనమః

పుష్కరమనగా తామరపూవు. అట్టి నేత్రము గలవాడగుటచేత పుష్కరాక్షః అని భగవానుడు పిలువబడును. భారతీయ వేదాంత సంస్కృతిలో పద్మమునకు గల స్థానము మహనీయమైనది. పద్మము సౌందర్యమునకు, సౌకుమార్యమునకు ప్రసన్నతకు, ప్రశాంతికి చిహ్నము. పద్మము సంగరాహిత్యమును తెలుపును. తామర జలములలో సంగమమును బొందదు. సంగరాహిత్యమే జ్ఞానము. నిస్సంగము, నిర్లిప్తత, మహానుభావ చిహ్నములగుట చేతనే శ్రీమహావిష్ణువు తన హస్తమునందు పద్మమును ధరింౘుట కానవచ్చును. అంతమాత్రమేగాక భగవంతుడు పద్మమువలె " నిస్సంగుడు_ నిర్లిప్తుడు " అని తెలుపుటకే ఆయన అవయవములన్నియును పద్మముతోనే వర్ణింపబడుౘుండుట గమనార్హము. ఉదా:- పద్మనేత్రుడు, పద్మముఖుడు, పద్మనాభుడు, పద్మహస్తుడు, పద్మపాదుడు మున్నగునవి గమనింౘునది. ఇచ్చట. " పుష్కరాక్ష " నామము శ్రీహరియొక్క ప్రశాంత నేత్రములను సూచింౘును. ఆయన నేత్రములు ప్రేమామృత ప్రపూర్ణములు. కరుణారసభరితములు. ఆయన ౘల్లని ౘూపులచేత భక్తుల సకల తాపములను హరింౘును గాన భగవానుడు పుష్కరాక్షుడుగా కీర్తింపబడును. ఈ ఈనామముయొక్క పర్యాయ పదములే ముందు రానున్న నామము లలో గూడా పాఠకులు ౘూడగలరు.

197) ప్రజాపతిః- ఓం ప్రజాపతయేనమః

సకల ప్రజలకును తండ్రి వంటివాడు " పితాహమస్యజగతః" ఈ విశ్వమునకంతకును నేను తండ్రి ని అని గీతావాక్యము (9_17).

" పితాసి లోకస్యచరాచరస్య". చరాచరాత్మకమగు లోకములకెల్ల నేను తండ్రిని అని గీతావాక్యము (11_43) .వాత్సల్య స్వరూపుడు భగవంతుడని భావము.
--((**))--

 హరిః ಓమ్

22) శ్లోకము

అమృత్యుః సర్వదృక్ సింహః సన్ధాతా సన్ధిమాన్ స్థిరః !
అజో దుర్మర్షణః శాస్తా విశ్రుతాత్మా సురారిహా !!

ఈ శ్లోకము నందు 11 నామములు గానము చేయబడెను.

198) అమృత్యుః- ఓం అమృత్యవేనమః

మరణముగానీ, నాశనముగాని లేనివాడు, షడ్భావవికార శూన్యుడు పరమాత్మ. " యస్స సర్వేషు భూతేషు నశ్శత్సు న వినశ్యతి ". సకల భూతములును నశించినను నాశనము లేనివాడని గీతావాక్యము (8_20). మృత్యురహితుడగు పరమాత్మను ధ్యానింౘువాడును మృత్యుంజయుడే యగునని సారాంశము. 

199) సర్వదృక్ - ఓం సర్వదృశేనమః

సకల భూతములయందును సర్వకాలములయందును కలుగుౘున్న సకల కార్యకలాపములను ౘక్కగా దర్శింౘువాడు పరమాత్మ యే యగుటచేత  ఆయన. " సర్వదృక్ ". అని స్తవనీయుడగును. ఆయన శరీరము నందంతటనూ వ్యాపించి యున్నందున మనము చేయు సమస్త ధర్మాధర్మ కార్యములన్నియ దర్శించి తగిన రీతిని ఫలములిచ్చువాడు అని సారాంశము. ధర్మవర్తనుడవై యుండుమని జీవులకీనామము హెచ్చరింౘుౘున్నది.

200) సింహః - ఓం సింహాయనమః

" హింసింౘువాడు " అని ఈ శబ్దముయొక్క సామాన్యార్థము 

1) " మృగాణాంచ మృగేంద్రో√హం ". మృగములలో సింహమును నేనైయున్నాను‌. అని భగవద్వాక్యము.(గీత 10_30). కనుక. భగవానుడు " సింహః" అని పిలువబడెను

2). దుర్మార్గులను, అవినీతిపరులను హింసిౘువాడు గనుక ". సింహః ". అని పిలువబడుౘున్నాడు. " వినాశాయచ దుష్కృతామ్ ". అని గీతావాక్యము, ( 4_8 )

3) " సింహః ". అను శబ్దము భగవానుని సూచింౘును గనుక " సింహః " అను దివ్యనామా‍‌చ్యుడ.

4) సింహము గర్జించినంత మాత్రము చేతనే అరణ్యములో నున్న మృగములన్నియు పారిపోవునట్లు శక్తివంతమగు భగవన్నామము యొక్క గర్జనము వలన( అనగా నామ జప తపః కీర్తన ధ్యానాదుల వలన) సాధకుల యొక్క మనస్సు లను భయంకరారణ్యములయందు దాగి యున్న మృగము లన్నియును (అనగా కామ క్రోధాది దుష్టగుణములు ) నశించిపోవునని ఈ శబ్దము యొక్క గ్రాహ్యార్థముగా భావింౘ నగును. కావున భగవానుడు " సింహః ". అని
సంకీర్తనీయుడు. 
--((**))--
               
హరిః ಓమ్ 

22) శ్లోకము 

అమృత్యుః సర్వదృక్ సింహః సన్ధాతా సన్ధిమాన్ స్థిరః ! 
అజో దుర్మర్షణః శాస్తా విశ్రుతాత్మా సురారిహా !! 

ఈ శ్లోకము నందు 11 నామములు గానము చేయబడెను. 

201) సన్ధాతా - ‌‌‌‌‌‌‌‌‌‌ ఓం సన్ధాత్రేనమః 

" సమన్వయ పఱౘువాడు, ఒకదానితో నింకొకదానిని ౘక్కగా జతగూర్చువాడని ఈ నామముయొక్క సామాన్యార్థము. మానవులాచరింౘు సమస్తకర్మలనూ పరీక్షించి వాటికి తగిన ఫలములను సరిగ్గా ప్రసాదింౘువాడు శ్రీహరియే. కర్మాచరణమునందే కర్మఫలమును నిక్షిప్తమై యున్నది కాలాంతరమున ఆయాకర్మఫలములను ప్రసాదింౘు వాడా పరమేశ్వరుడే గనుక. " సన్ధాతా ". అను దివ్యనామా‍‌చ్యుడగును. 

202) సన్ధిమాన్ - ఓం సన్ధిమతేనమః 

భగవానుడు పైనామములో సూచించిన రీతిగా కర్మఫల ప్రదాత మాత్రమేకాక జీవరూపుడై ఆయాఫలములననుభవింౘు వాడును శ్రీపతియే యగుట చేత " సన్ధిమాన్ ". అని పిలువబడును. 

203) స్థిరః - ఓం స్థిరాయనమః 

నిశ్చలుడు, నిర్వికారుడు, నిత్యుడు, సర్వకాలములయందు ఏకరీతిని నుండువాడుగనుక " స్థిరః ". అని ప్రసిద్దుడగుౘున్నాడు. అట్టి స్థిరుడగు వానిని ధ్యానింౘునపుడే అస్థిరమును, చంచలమును నగు చిత్తము స్థిరమును, నిశ్చల మును అగునని సాధకులు గ్రహింపనగును. 

204) అజః - ఓం అజాయనమః 

1) పుట్టుక లేనివాడు పరమాత్మ కనుక " అజః " అనబడును. 2) చతుర్ముఖబ్రహ్మ స్వరూపమున సకల సృష్టి వ్యాపారమును చేయువాడగుటచేత పరమాత్మ " అజః ". అనబడును. అజుని ( పుట్టుక లేని వానిని). ఆశ్రయింౘువారికే పుట్టుకయు, గిట్టుటయూ (జరామరణములు) నశింౘును. ఈ పవిత్రనామము 3 పర్యాయములు ఈ స్తవరాజము లో కొనసాగును. 

205) దుర్మర్షణః - ఓం దుర్మర్షణాయనమః. 

జయింౘుటకు గాని ఎదుర్కొనుటకుగానీ శక్యముగాని వాడగుటచే శ్రీనిధి " దుర్మర్షణు " డనబడును. 

1) ఆయన అవతారములయందెట్టి రాక్షసులును ఆయనను జయింౘలేదు కదా ! 

2) పరమేశ్వరాశ్రితులగునట్టి సాధకులను కామక్రోధములు జయింౘలేవని గూఢార్థము.
--((**))-- 

హరిః ಓమ్

22) శ్లోకము

అమృత్యుః సర్వదృక్ సింహః సన్ధాతా సన్ధిమాన్ స్థిరః !
అజో దుర్మర్షణః శాస్తా విశ్రుతాత్మా సురారిహా !!

ఈ శ్లోకము నందు 11 నామములు గానము చేయబడెను.

206) శాస్తా - ఓం శాస్త్రేనమః

శాసనకర్త యని ఈ నామముయొక్క అర్థము. వేదములు, స్మృతులు మున్నగునవన్నియును భగవానుని శాసనములు. మానవుడాచరింౘవలసిన విధివిధానములన్నియును వానిద్వారా భగవానుడు శాసించెను. కావున శాస్త్రవిధానోక్తంగా పుణ్యజీవితమును గడుపవలసినదని ఈనామము ప్రబోధము చేయబడుౘున్నది.

207) విశ్రుతాత్మా- ఓం విశ్రుతాత్మనేనమః

విస్తరించిన సమస్త సద్గుణములతో భాసిల్లువాడుగాన " విశ్రుతాత్ముడగును ". సత్యము, జ్ఞానము, శాంతి, శౌచము మున్నగు మహోన్నత దివ్యగుణగణ సంపదలచేత ప్రఖ్యాతుడైన వాడని భావము. ఆత్మదర్శనమును బొందిన వారందరును పైనవివరించిన దివ్యగుణములతో శోభిల్లుౘు ౘుందు రనియును , శౌచాది దివ్యగుణములను అభ్యాసము చేయువారికి ఆత్మదర్శనము గలుగుననియును భావము.

208) సురారిహా - ఓం సురారిఘ్నేనమః

సుర + అరి + హా = సురారిహా. సురలనగా దేవతలు.అరులనగా శత్రువులు. అనగా దేవతా విరోధులగు రాక్షసులు. హా అనగా 
సంహరింౘువాడని భావము.
సురలనగా దేవతా గుణములు, సురారులనగా రాక్షస గుణములు ( గీతలో 16వ అధ్యాయమున దైవసంపదయును అసురసంపదయు ను వివరింపబడినది ). భగవానుని శరణుబొంది ఆధ్యాత్మిక సాధనచేయు భక్తుల
యొక్క మనస్సు నందుగల అసురగుణ బీజములన్నింటినీ నాశనముచేసి దైవ సంపదలను వికసింపజేయువాడు శ్రీహరియే యని భావము.


-=-((**))--


హరిః ಓమ్ 
23) శ్లోకము 

గురుర్గురు తమోధామసత్యః సత్యపరాక్రమః ! 
నిమిషో √నిమిషః వ్రగ్వీ వాచస్పతి రుదారధీః !! 

ఈ శ్లోకము నందు తొమ్మిది, హరినామములు కీర్తింపబడుౘున్నవి. 

209). గురుః - ఓం గురవేనమః 

గురువనగా తన్నాశ్రయించిన శిష్యులకు వేద శాస్త్రాదులను దెలిపి, ధర్మమార్గములను వివరించి సంసారబంధనముల నుండి తొలగింౘు మార్గము బోధింౘుౘు తాను వానిననుష్ఠింౘునట్టి మహనీయుడే గురువు అట్టి జగద్గురువు భగవంతు డొక్కడే గనుక " గురుః " అని పిలువబడెను. లౌకిక పాఠములను చెప్పువారు " గురువు " అను దివ్యపదమునకు అనర్హులు. " కుంభినీధవు జెప్పెడి గురుడు గురుడు అను భాగవత వచనము స్మరణీయము. 

" గు " అనగా గుణాతీతుడు , " రు ". అనగా రూపరహితుడు. అట్టి వాడు పరమాత్ముడే గనుక గురుడనబడెను. "గు"= అజ్ఞానమును, "రు"= నాశనము జేయువాడు గాన గురువనబడును. అట్టి వాడు పరమాత్మ యేగదా. కృష్ణంవందే 
జగద్గురుమ్. స్మరణీయము. 

210). గురుతమః - ఓం గురుతమాయనమః 

గురువులలో సర్వ శ్రేష్ఠుడని ఈ నామముయొక్క భావము. 
బ్రహ్మాదులకును, మహాయోగిపుంగవులకును ఆధ్యాత్మిక రహస్యములను 

బోధించినవాడు పరమాత్మ యేగనుక. " గురుతము " డయ్యెను. 

--((**))--


హరిః ಓమ్ 

23) శ్లోకమున 

గురుర్గురు తమోధామసత్యః సత్యపరాక్రమః ! 
నిమిషో √నిమిషః వ్రగ్వీ వాచస్పతి రుదారధీః !! 

ఈ శ్లోకము నందు తొమ్మిది, హరినామములు కీర్తింపబడుౘున్నవి. 

211) ధామ 211) ధామ - ఓం ధామ్నేనమః 

" ధామ " అను శబ్దము న - ఓం ధామ్నేనమః 

" ధామ " అను శబ్దము నకు రెండు విధములగు అర్థములు 
వివరింపబడినవి. 1). గతి 2) ప్రకాశము. 

1) గతి యనగా నిలయము. సాధుసత్పురుషులకును, యోగులకును, జ్ఞానులకును, నిలయమైనవాడు, గతియైనవాడు పరాయణమైనవాడు పరబ్రహ్మ మేకదా. " యద్గత్వాన నివర్తంతే తద్ధామపరమం మమ ". దేనిని పొందినవారికి 
మఱల జననము లేదో అట్టి ధామమే నాది యని గీతావాణి స్మరణీయము ( అ 15_6). 

2) ధామ. మనగా దివ్యప్రకాశమని భావము. భగవంతుడు జ్యోతిః స్వరూపుడు. స్వయంజ్యోతిః = సూర్యచంద్రాగ్నులకు కూడా కాంతినిచ్చువాడు జ్ఞానజ్యోతిః స్వరూపుడని భావము. 

నారాయణ పరోజ్యోతిః ( నారాయణోపనిషత్తు) పరంబ్రహ్మ. పరంధామ (బృహదారణ్యకము) అను శ్రుతి వాక్యములు స్మరణీయములు. " జ్యోతిషామపితజ్జ్యోతిః " ( జ్యోతులకెల్లా జ్యోతి ) అని గీతావాక్యము(13_18). 

212) సత్యః - ఓం సత్యాయనమః 

1) మూడు కాలములందును నిత్యమై శ్రేష్ఠమై మార్పులేనిదై యున్నందున పరబ్రహ్మము సత్యమని జెప్పబడును. 

2) " తస్మాత్సత్యం పరమం వదన్తి " అందువలననే సత్యమే శ్రేష్ఠమైనది గా చెప్పబడును.. అను శ్రుతివాక్యానుసారము భగవానుడు సత్య శబ్ద వాచ్యుడగుౘున్నాడు. భగవానుడు తన అవతారములలో పలికినదియును అనుష్ఠింౘునదియును సత్యమే యగుటచేత సత్యానుష్ఠానము సర్వశ్రేష్ఠమైనది. " ‌సత్యం వద. " అను వ‍ేదవాణి సదా స్మరణీయము. సత్యవృత్తులకే సత్యము (పరబ్రహ్మము) లభ్యమగునని భావము. 

213) సత్యపరాక్రమః - ఓం సత్యపరాక్రమాయనమః 

1) అమోఘమైన. దివ్యపరాక్రమము గలవాడు గనుక సత్య పరాక్రముడగును. అవతారములయందాయన పరాక్రమలీలలు వర్ణితములేకదా ! 

2) ఆయన సత్యస్వరూపుడేగాక సత్యమును ప్రవర్తిల్ల జేయువాడు " సత్యమేవజయతే_ నానృతమ్ ". సత్యమే సదా జయింౘును. అసత్యమెన్నడును జయింౘదు. అను శ్రుతివాక్యము స్మరణీయము.

--((**))--


(13_10_2018)

హరిః ಓమ్


23) శ్లోకమున


గురుర్గురు తమోధామసత్యః సత్యపరాక్రమః !

నిమిషో √నిమిషః వ్రగ్వీ వాచస్పతి రుదారధీః !!

ఈ శ్లోకము నందు తొమ్మిది, హరినామములు కీర్తింపబడుౘున్నవి.


214) నిమిషః - ఓం నిమిషాయనమః


కన్నులు మూసియుండుస్థితిని నిమిషః యనబడును. యోగనిద్ర యందున్న వాడయినందున విష్ణువు "నిమిషః " అనబడును.


కన్నులు తెఱచి యుండినౘో బాహ్యప్రపంచమే గానవచ్చును. మనస్సు వికలమగును. అట్లు కన్నులు మూసినప్పుడు చిత్తము అంతర్ముఖమగును. అట్టి స్థితియే నిమిషస్థితి. ఇట్టి సాధనయే ఆత్మదర్శనమునకు మార్గమని ఈ నామము

నందుగల భావార్థముగా విజ్ఞులు గ్రహింపవలెను.

215) అనిమిషః - ఓం అనిమిషాయనమః


నిరంతరమును కన్నులు తెఱచియుండు స్థితిగలవాడు అని శబ్దార్థము సూచింౘును.


1) పరమాత్మ నిరంతరమూ ప్రబుద్ధస్వరూపుడే అనగా మేల్కొనియుండు వాడేయని భావము. సర్వమును సదా గమనింౘుౘు నిత్య జాగ్రత్స్వరూపుడు.


2) తమోగుణమును వీడి నిరంతరమూ ఏమరుపాటులేక జిజ్ఞాసువై బ్రహ్మపదము నన్వేషింౘు వానికే బ్రహ్మ సాక్షాతాకారమగునని భావము.


3) మత్స్యస్వరూపుడును, ఆత్మస్వరూపుడును అగుటచేత అనిమిషః అని పిలువబడును.


216) స్రగ్వీ - ఓం స్రగ్విణేనమః


పూలమాలకు "స్రక్ ". అనిపేరు. పూలహారమును ధరించిన వాడు గాన "స్రగ్వీ" అనబడును. వాడనట్టియు దివ్యపరిమళభరిత మగునట్టియు నగు వైజయంతీమాలను ధరించినవాడగుటచేత. శ్రీహరి "స్రగ్వీ" యనబడును.


పంచతన్మాత్ర స్వరూపమగు వైజయంతీమాలను నిరంతరమునూ ధరించి యున్నవాడగుటచేత "స్రగ్వీ" యనబడును.


217) వాచస్పతిరుదారధీః - ఓం వాచస్పతయే ఉదారధియేనమః


"వాచస్పతిః + ఉదారధీః ఈ రెండుపదములతో కూడిన ఏకనామమైయున్నది.


విద్యలకు పతియైనవాడు గనుక వాచస్పతి యగును.ధీయనగా జ్ఞానము. ఉదారధీః అనగా పరమశ్రేష్ఠమగు దివ్యజ్ఞానము సకల విద్యాసారథియును, జ్ఞానస్వరూపుండును నగుట చేత " విష్ణువు " " వాచస్పతిః " " ఉదారధీః " అని కీర్తనీయుడయ్యెను.


--((**))--

(14_10_2018) 

హరిః ಓమ్ 


24) శ్లోకము 


అగ్రణీర్గ్రామణీః శ్రీమాన్ నాయోనేతా సమీరణః । 

సహస్ర. మూర్ధా విశ్వాత్మా సహస్రాక్షాః సహస్రపాత్ ।। 

ఈ మంగళ శ్లోకము దశవిధ దివ్యనామ సంశోభితము. 


218) అగ్రణీః - ఓం అగ్రణ్యేనమః 


భగవంతుడు తాను ముందుగా నడౘౘు ఆధ్యాత్మిక సాధకులను గమ్యస్థానమునకు చేర్చువాడని ఈ ఈనామముయొక్క భావార్థమై యున్నది. పురుషకారము మాత్రమే ఫలసిద్ధిని ప్రసాదింౘ జాలదు. భగవదనుగ్రహముతోడుగా 

నుండవలయును. ఆధ్యాత్మిక సాధకులకు భగవానుడే సారథి యగుటచే " అగ్రణీః " యని పిలువబడెను. 

219) గ్రామణీః - ఓం గ్రామణ్యేనమః 


భూత సముదాయముల కెల్లవాటికిని నాయకుడైనవాడని భావము.  


220) శ్రీమాన్ - ఓం శ్రీమతేనమః 


శ్రీః అనగా కాంతి, తేజస్సు, వైభవము, సంపద. వీనితో కూడిన వాడుగాన " శ్రీమాన్ ". అనబడును. 


221) న్యాయః - ఓం న్యాయాయనమః 


" న్యాయః " అనగా తర్కశాస్త్రం. ఈ శాస్త్రము నందుగల ప్రమాణముల యొక్కయు సాధనములచే లియబడువాడగుటచేత " న్యాయః " అని భజనీయుడగుౘున్నాడు. 


222) నేతా - ఓం నేత్రేనమః 


నాయకుడని ఈ నామముయొక్క సామాన్యార్థము లోకమునందుగల సమస్త జీవకోటులకును అధిపతి, ప్రభువు, పాలనకర్త, రక్షకుడు, పోషకుడును శ్రీహరియే యగుటచేత. ". నేతా " యని కీర్తింపబడును. 


223) సమీరణః - ఓం సమీరణాయనమః 


వాయురూపమున సమస్త ప్రాణులను చైతన్యవంతులనుగా చేయువాడగుటచే " సమీరణః " అని పిలువబడెను.


--((**))--




నేటి పద్యం 
  
" వయసా ఈ పూట నిజమే తన్మాత్ర సౌభాగ్యమే "
" తనువా ఆ ఆశ పరిధే ఉత్సాహ ఉల్లాసమే "  
"కధలే ఆనంద అవినాభావాల మ్నాధుర్యమే"    
"మనసా నామాట వినుమా మర్యాద కాపాడుమా"

15_10_2018) 

హరిః ಓమ్ 

24) శ్లోకము 

అగ్రణీర్గ్రామణీః శ్రీమాన్ నాయోనేతా సమీరణః । 
సహస్ర మూర్ధా విశ్వాత్మా సహస్రాక్షాః సహస్రపాత్ ।। 

ఈ మంగళ శ్లోకము దశవిధ దివ్యనామ సంశోభితము. 

224) సహస్రమూర్థా - ఓం సహస్రమూర్థ్నేనమః 

వేలకొలది శిరస్సు లతో భాసింౘువాడు పరమాత్మ. 

" సహస్రశీర్షాపురుషః సహస్రాక్షః సహస్రపాత్ " అను పురుషసూక్త వచనములే 224, 225, 226, 227 నామములలో తెలుపబడుౘున్నవి. గీతాశాస్త్రము నందలి విశ్వరూపవర్ణనమును ఈ రీతిగనే నున్నది. 

అనేక బాహూదర వక్త్రనేత్రమ్ (11_16) అనేక వక్త్రనయనమ్ (11_10) 

225) విశ్వాత్మా - ఓం విశ్వాత్మనేనమః 

నానా రూపాత్మకమైయున్న ఈ విశాలవిశ్వమంతయును భగవత్స్వరూపమే. విశ్వమునకంతకును ఆయనయే ఆత్మ. 1వ నామముయొక్క వివరణము ౘూడదగును. 

1 వ నామము 

1. విశ్వమ్ ఓం విశ్వాయనమః 

ఈ స్తవరాజము యొక్క ప్రారంభ శ్లోకములోని ప్రథమ భగవన్నామము " విశ్వమ్ ".అని గానము చేయబడుౘున్నది 
విశ్వమనగా ప్రపంచమని యర్థము. నామరూపాత్మకమై_ చిత్రాతి చిత్రమై_ వికసించి, విస్తరించి, విరాజిల్లుౘు గానవచ్చుౘున్న సర్వ ప్రపంచమునకును పరబ్రహ్మమే మూలకారణ మగుటచేత "విశ్వమ్" అను నామముతో భగవానుడు గానము చేయబడుౘున్నాడు. 

"బ్రహ్మైవేదం విశ్వమిదం వరిష్ఠం పురుష ఏ వేదం విశ్వమ్"_ ఈ విశ్వము పరబ్రహ్మమే__ఈ విశ్వము పురుషుడే" అని శృతి 
గానము చేయుౘున్నది. 

" విశతీతి విశ్వం బ్రహ్మ " అనగా భగవానుడీ విశ్వమును సృజించి దానియందలి అణువణువు నందునూ ఆయనయే 
వ్యాపించి వున్నాడని శృతివాక్యము స్మరణీయము. " హరిమయము విశ్వమంతయు_హరివిశ్వమయుండు_సంశయిందర్శింౘదు_హరిమయముగాని వస్తువు పరమాణువు లేదు". అని 
భాగవతము గానము చేయుౘున్నది. ఈ విశ్వమంతయు భగవానుని విరాట్ స్వరూపమేయని గీతాచార్యుడు గానము చేసెను. 

"మత్తః పరతరంనాన్యత్ కించిదస్తి ధనంజయ" (గీత_7_శ్లో7) 

విశ్వమందుగల అన్నింటియందు విశ్వేశ్వరుని దర్శింౘుటయే మహాజ్ఞానము. 

"వాసుదేవస్సర్వమితి సమహాత్మాసుదుర్లభః". సర్వమునందును వాసుదేవుడే నిండియున్నాడని గ్రహింౘు 
జ్ఞాని సుదుర్లభుడు (గీత_7_ శ్లో_19) సకల భూతములయందునూ నారాయణుని దర్శింౘుటయే " భక్తి " అదియే మహాజ్ఞానము_ అదయే యోగము అని శాస్త్ర వాక్యము. అట్టి మహాజ్ఞాన ప్రాప్తియే ఈ స్తవరాజము యొక్క పరమలక్ష్య మగుటచేత. " విశ్వమ్ " అను సుప్రసిద్ధ మహానామముతో శ్రీ హరి గానము చేయ బడుౘున్నాడు . విశ్వమందెల్లనూ విశ్వేశ్వర దర్శనమే మహా తపస్సు. ఈ పవిత్రసాధనమును ఈ నామము సాధకులకు బోధింౘుౘున్నది. రామ భక్తుడు విశ్వమందన్ని రూపములయందు నూ రామునే దర్శింౘ వలయును. ఇదియే భక్తి సాధన ఈనామము జ్ఞానికిని భక్తునకునూ గూడా ఉపాసనా విధానమును సూచింౘుౘున్నది. 

226) సహస్రాక్షః - ఓం సహస్రాక్షాయనమః 

వేలకొలది నేత్రములతో కూడినవాడు ఆయన విశ్వనేత్రుడు. 

227) సహస్రపాత్ - ఓం సహస్రపదేనమః 

వేలకొలది పాదములతో విరాజిల్లువాడు . " సర్వతః పాణి పాదం, తత్సర్వ తోక్షి శిరోముఖం, సర్వతః శ్రుతిమల్లోకే సర్వమావృత్య తిష్ఠతి " అని గీతావాక్యము. అనగా పరబ్రహ్మము అంతటనూ పాదములుకలిగి, హస్తములుకలిగి, అంతటా ముఖములుకలిగి సర్వవ్యాపకమై విరాజిల్లుౘున్నది. 
(అ 13_14). 

సారాంశమిది : ఈ పై నామములలో చెప్పబడియున్న విశ్వరూపవర్ణనము ఆధ్యాత్మిక సాధకులలో విశ్వప్రేమను కలిగింౘును. అంతటను అన్నిరూపములతో నున్నవాడు భగవానుడేగనుక ఎవ్వరిని దూషించిననూ, నిందించినను, ఎవ్వరిని మోసగించి హానికల్గించినను అది భగవంతునికి చేసిన ద్రోహమేయగునని భావము. పాఠకులయందు సత్ప్రవర్తన, 
భూతదయ, ప్రేమ కలిగియుమడవలెను. ఈపవిత్ర గుణములు భగవత్ప్రాప్తికి సాధనములు.


--((**))--

(16_10_2018) 

హరిః ಓమ్ 

25) శ్లోకము 

ఆవర్తనో నివృత్తాత్మా సంవృతః సంప్రమర్దనః । 
అహస్సం వర్తకో వహ్నిరనిలోధరణీధరః ।। 

ఈ పుణ్యశ్లోకము నందు అష్టవిధములగు హరినామములు వర్ణితములు. 

228) ఆవర్తనః  - ఓం ఆవర్తనాయనమః 

" త్రిప్పువాడు" అని ఈ నామముయొక్క సామాన్యార్థము. అనగా జననమరణ క్లేశరూపమగు సంసారచక్రమును త్రిప్పువాడని భావము. " ఈశ్వరః  సర్వభూతానాం, హృద్దేశే√ ర్జున తిష్ఠతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా". ఈశ్వరుడు ప్రాణుల యొక్క హృదయస్థానమునందుండియంత్రముల  నారోహించిన వారినివలె త్రిప్పుౘున్నాడని గీతావాక్యము. (అ18_61). అందుచేత. " ఆవర్తనః " అని పిలువబడుౘున్నాడు. 

229) నివృత్తాత్మా - ఓం నివృత్తాత్మనేనమః 

నిరంతరమూ జీవులను సంసారచక్రమునందు త్రిప్పువాడైననూ తాను మాత్రమూ సంసారబంధనముల కతీతుడగుటచేత. " నివృత్తాత్మా " యని కొనయాడబడుౘున్నాడు. పైరెండునామములయొక్క సారాశమిది. మానవులు  కర్మఫలాసక్తులై విషయభోగపరులై యున్నందున జననమరణక్లేశ పరంపరలను బొందుౘు కర్మఫలములగు సుఖదుఃఖముల ననుభవింౘుౘున్నారు. అట్లుగాక నిష్కామ కర్మానుష్ఠాన పరులగుౘు విషయభోగములనుండి నివృత్తి చెందినవార 
లైనచో భగవత్ప్రసాదమును పొందగలరని భావము.

--((**))--
హరిః ಓమ్ 

25) శ్లోకము 

ఆవర్తనో నివృత్తాత్మా సంవృతః సంప్రమర్దనః । 
అహస్సం వర్తకో వహ్నిరనిలోధరణీధరః ।। 

ఈ పుణ్యశ్లోకము నందు అష్టవిధములగు హరినామములు వర్ణితములు. 

230) సంవృతః - ఓం సంవృతాయనమః 

కప్పబడియుండువాడని శబ్దార్థము. " నాహం ప్రకాశః సర్వస్య యోగమాయా సమావృతః। మూఢోయం నాభిజానాతి లోకోమా మజమవ్యయమ్। నేను యోగమాయచేత కూడుకొనియున్న కారణముచేత మూఢులునన్ను జనన మరణ రహితుండగు అవ్యయపరబ్రహ్మముగా గుర్తింపజాలకున్నారు. అని భగవద్వాక్యము (అ.7_25). బ్రహ్మ, ఇంద్రుడు మున్నగువారుకూడా శ్రీకృష్ణపరమాత్ముని దివ్యత్వమును గుర్తింపజాలక మోసపోయిన ఘట్టములు భాగవతములో వర్ణితములు. 

" మామేవయే ప్రపద్యంతే, మాయామేతాంతరంతితే" అయితే ఎట్లు ఈ మాయను దాటుట ? నన్ను ఎవరు సంపూర్ణ శరణాగతిని బొందుదురో వారు నా మాయను దాటిపోవుదురని". భగవద్వాక్యము స్మరణీయము ( అ_7_14). 
భగవంతుని శరణుబొందుమని ఈ నామముయొక్క ప్రబోధమైయున్నది. 

231) సంప్రమర్దనః - ఓం సంప్రమర్దనాయనమః 

దుర్మార్గులను , దుష్టులను, పాపాత్ములను వారి వారి దుష్ట కర్మానుసారముగా అనేకరీతులుగా ( వ్యాధులు, కష్టములు, రోగములు, సాంసారిక దుఃఖములు మున్నగువానిచేతను, రుద్రుడు, యముడు మున్నగువారి రూపముచేతను మర్దింౘువాడు ( అనగా హింసింౘువాడు) అగుటచేత " సంప్రమర్దనః " అని భజనీయుడగుౘున్నాడు. కనుక ధర్మమార్గములో నడుపుమని ఈ నామము శాసింౘును. 
.
 --((**))--


(18_10_2018)

హరిః ಓమ్

25) శ్లోకము

ఆవర్తనో నివృత్తాత్మా సంవృతః సంప్రమర్దనః ।
అహస్సం వర్తకో వహ్నిరనిలోధరణీధరః ।।

ఈ పుణ్యశ్లోకము నందు అష్టవిధములగు హరినామములు వర్ణితములు.

232). అహస్సంవర్తకః - ఓం అహస్సంవర్తకాయనమః

సూర్యని రూపముననుండి దినములను ౘక్కగా ప్రవర్తింపజేయు వాడని భావము. సూర్యుని వలఞే రాత్రింబవళ్ళు గలుగుౘు కాలప్రమాణము గుర్తింపబడుౘున్నది. కావున శ్రీహరి " అహస్సంవర్తకః " అనునామమున భజనీయుడగు ౘున్నాడు. కాలము దైవస్వరూపమగుటచేత. కాలమును సదా భగవదారాధనము లతో సద్వినియోగము చేయవలయును. అని ఈ నామముయొక్క ప్రబోధము.

233) వహ్నిః ఓం వహ్నయేనమః

అగ్నిహోత్రుడు. అగ్ని భగవద్విభూతిగా గీతాశాస్త్రము తెలుపును (అ 10_23) యజ్ఞయాగాదులందు అగ్నియందు హోమము చేయబడునట్టి హవిస్సులను అందింౘువాడు అగ్నియే. హిందూధర్మమున వివాహాది పుణ్యకర్మాను ష్ఠానము లన్నియునూ అగ్నియొక్క. ఆరాధనముచేతనే అగ్నిసాక్షికముగానే జరుగుౘుండును. ఈ రీతిగా నిత్యదై నందిన జీవితములో అగ్నిదేవుడు అనేకరీతులుగా అర్చనీయుడగు ౘున్నాడు గదా . అగ్ని సాహాయ్యము లేనిదే జీవితమే నడువదు. శరీరములోని అగ్నిౘల్లారిన శరీరమే నశింౘును. కనుక అగ్ని భగవత్స్వరూపము.

234) అనిలః - ఓం అనిలాయనమః

ఈ శబ్దమునకు " వాయువు " అని సామాన్యార్థము 

1. తనకొక. ప్రత్యేక నివాసస్థలమనునదిలేక యుండువాడు.

2. అంతటనూ వ్యాపించియుండువాడు

3. దేనితో సంగమము పొందక యుండువాడు.

కావున. శ్రీహరి " అనిలః " అని కొనియాడ బడుౘున్నాడు.

235) ధరణీధరః - ఓం ధరణీధరాయనమః

ఆదిశేషుని రూపమున , అష్టదిగ్గజములరూపమున, ఆదివరాహ రూపమున భూమిని ధరించియుండువాడు గాన. " ధరణీధరః " అని చెప్పబడును 

--((**))--

(19_10_2018)

హరిః ಓమ్
26) శ్లోకము
సుప్రసాదః ప్రసన్నాత్మా విశ్వధృగ్విశ్వభుగ్విభుః ।
సత్కర్తా సత్కృతిస్సాధు ర్జహ్నుర్నారాయణో నరః ।।
ఈ. శ్లోకమునందు పదకొండు హరినాణులు వర్ణితములు.

236) సుప్రసాదః - ఓం సుప్రసాదాయనమః
అనుగ్రహస్వరూపుడు, దయామృతధారలను వర్షింపజేయువాడు.
తనకు విషదుగ్ధములనిచ్చిన పూతనకును, తనను హింసించిన
కంసునకును, నిందించిన శిశుపాలునకును గూడా మోక్షమును ప్రసాదించిన
శ్రీ కృష్ణుని ప్రేమతత్వము భాగవతములో వర్ణింపబడినదికదా.
కలలోనైనను తనననొక్కసారి మాత్రమే స్మరింౘువానిని కూడా రక్షింౘువాడు భగవంతుడని భాగవత వర్ణనము. భక్తితో ఎంత స్వల్ప ముగా
తనకు సమర్పించినను, దానిని స్వీకరించి అట్టి భక్తులకు కామితార్థములను ఇచ్చు వాడని గీతావాక్యము (అ_9_20).
కావున. " సుప్రసాదః " అని భజనీయుడగును.

237) ప్రసన్నాత్మా - ఓం ప్రసన్నాత్మనేనమః
ప్రసన్నమును, ప్రశాంతమును నగు మనస్సు గలవాడు భగవంతుడగును. వ్యాకులచిత్తుడు, అశాంతచిత్తుడు మానవుడగును. మావవుడు మాధవుడు కావలెనన్న మనస్సు ను ప్రశాంతము చేసికొనుటయే సాధనమగును.
జప, కీర్తన ,ఆరాధనాదులచేతను, సజ్జన సాంగత్యము చేతను మనస్సు నావరించి యున్న. మాలిన్యములు నశింప అది ప్రసన్నమగును. త్రిగుణరహితుడు భగవానుడుగనుక ఆయన ప్రసన్నాత్ముడు. మానవులు ప్రకృతి జన్యములగు మూడు గుణములచేత బద్దులుగనుక దుఃఖితులు. అమానిత్వాది గుణములసాధనముచేత ( గీత అ 13లో _శ్లో 8 నుండి 12 వఱకు) భక్తి లక్షణముల యొక్క సాధనచేత ( గీత అ 12లో శ్లో 13 నుండి 20 వఱకు) మనస్సు సుప్రసన్నమగును. అట్టి సుప్రసన్నుడే భగవన్మూర్తి యగును.

238) విశ్వధృక్ - ఓం విశ్వదృశేనమః

ఈ అనంత విశ్వమునంతను ధారణచేసినవాడు గావున " విశ్వధృక్ " యని కొనియాడబడును గామావిశ్వచ భూతాని ధారయామ్యహ మోజసా (గీత 15_13). నేను నాయొక్క తేజస్సు చేత ఈ భూమినంతనూ ధరింౘుౘున్నాను. అని గీతాచార్యుని వాక్యము.
--((**))--


(20_10_2018)

హరిః ಓమ్
26) శ్లోకము
సుప్రసాదః ప్రసన్నాత్మా విశ్వధృగ్విశ్వభుగ్విభుః ।
సత్కర్తా సత్కృతిస్సాధు ర్జహ్నుర్నారాయణో నరః ।।
ఈ. శ్లోకమునందు పదకొండు హరినామములు వర్ణితములు.
239) విశ్వభుక్ - ఓం విశ్వభుజేనమః
విశ్వమును అనుభవింౘువాడు, భక్షింౘువాడు అని భావార్థము. పరమాత్మ యే జీవరూపమున శరీరమందుండి ఇంద్రియములద్వారా సుఖదుఃఖాల ననుభవింౘువాడు. ప్రళయకాలమునందు సర్వజీవులనూ తనయందే నింపుకొనువాడును అగుటచేత. " విశ్వభుక్ " అని స్తోత్రము చేయబడును.
240) విభుః - ఓం విభవేనమః
" నిత్యం విభుమ్ " అని ముండకోపనిషత్తు వచింౘును.
అనగా నిత్యుడైనవాడు విభుడు. తాను ఒక్కడేయైనను హిరణ్యగర్భుడు మున్నగువాని రూపమున అనేకవిధములుగా విశ్వమంతయూ నిండి వెలుంగువాడా
పరమేశ్వరుడొక్కడే యగుటచేత " విభుః " అను శబ్దముచే వాచ్యుడగుౘున్నాడు.
237,238,239 నామములు భగవంతుని సర్వవ్యాపక సర్వశక్తి స్వరూపములను తెలుపును. కావున ఆయనను నిరంతరమునూ కీర్తింౘుమని ప్రబోధమైయున్నది.
241) సత్కర్తా  - ఓం సత్కర్త్రేనమః
సజ్జనులను, పుణ్యవర్తనులను, ధర్మాత్ములను ఆదరింౘువాడును, గౌరవింౘువాడును భగవంతుడేకదా ! రామాయణము నందును, భారతబాగవతాదిగ్రంథములందును భగవదవతారమూర్తులగు శ్రీరాముడు, శ్రీకృష్ణుడు మున్నగువారు మహర్షులను, యోగులను, ధర్మజ్ఞులను, బ్రాహ్మణులను పూజించి గౌరవించి, సన్మానించి వారి పాద తీర్థములను కూడా ధరించిన సన్నివేశములు ౘూడనగును. కావున సాధువర్తనులై చరింౘుమని ఈ నామముయొక్క ప్రబోధము.
--((**))--
.(21_10_2018)

హరిః ಓమ్

26) శ్లోకము

సుప్రసాదః ప్రసన్నాత్మా విశ్వధృగ్విశ్వభుగ్విభుః ।
సత్కర్తా సత్కృతిస్సాధు ర్జహ్నుర్నారాయణో నరః ।।

ఈ శ్లోకమునందు పదకొండు హరినామములు వర్ణితములు.

242) సత్కృతిః - ‌ ‌‌ ‌ ఓం సత్కృతయేనమః

పూజనీయులచేతకూడా పూజింపబడువాడు. శ్రీహరి లోకైక పూజ్యుడు కావున " సత్కృతిః " అని పూజనీయుడగును. భగవంతుని యనుగ్రహము పొందుటకు ఆరాధనములేక భక్తితో పూజింౘుట‌ ఒక మహత్తర సాధనము.

243) సాధుః - ఓం సాధవేనమః

సాధువర్తనుడు, సదాచార సంపన్నుడు, సాధిమౘవలసిన సమస్త మును సాధించినవాడు అగుటచేత " సాధుః ". అని కీర్తనీయుడగును.

సాధుస్వరూపుండగు భగవానుని పొందుటకు సాధువర్తనము అత్యంతావశ్యకములు. శీలసంపద లేనివానికి మోక్షములేదు.

244) జహ్నుః - ‌‌‌ ఓం జహ్నవేనమః

‌‌ 1). సంహారకాలము నందు ప్రాణులను లయము చేయువాడు.
2) తన్నాశ్రయించిన భక్తులను పరమపదవికి తీసికొనిపోవువాడు. 
 3) మూఢులను విడనాడువాడు. ఈకారణములచే శ్రీహరి " జహ్నుః ". అని స్తవనీయుడగును.

245) నారాయణః - ఓం నారాయణాయనమః

ఈ నామము భక్తులకు అత్యంతప్రియమైనది. అష్టాక్షరీమహామంత్రము. లోకప్రసిద్ధమైయున్నది. ఈ పవిత్రనామము నకనేక పుణ్యభావములు విశేషార్థములును , సాంకేతికార్థములును గలవని శాస్త్రములును, భక్తులును చెప్పుౘున్నారు. వానిలో కొన్నిమాత్రము ఇందు తెలుపబడుౘున్నవి.

1) నరుడనగా " ఆత్మ " యనిపేరు. ఆత్మనుండియే ఆకాశాది కార్యము లన్నియును జనిమౘుట చేత నారములనిపిలువబడును. అట్టి నారములకు నిలయమగుటచేత. " నారాయణు" డనబడెను.
--((**))--

(22_10_2018)

హరిః ಓమ్

26) శ్లోకము

సుప్రసాదః ప్రసన్నాత్మా విశ్వధృగ్విశ్వభుగ్విభుః ।
సత్కర్తా సత్కృతిస్సాధు ర్జహ్నుర్నారాయణో నరః ।।

ఈ శ్లోకమునందు పదకొండు హరినామములు వర్ణితములు.

245) నారాయణః - ఓం నారాయణాయనమః

ఈ నామము భక్తులకు అత్యంతప్రియమైనది. అష్టాక్షరీమహామంత్రము. లోకప్రసిద్ధమైయున్నది. ఈ పవిత్రనామము నకనేకపుణ్యభావములు విశేషార్థములును , సాంకేతికార్థములును గలవని శాస్త్రములును, భక్తులును చెప్పుౘున్నారు. వానిలో కొన్నిమాత్రము ఇందు తెలుపబడుౘున్నవి.

1) నరుడనగా " ఆత్మ " యనిపేరు. ఆత్మనుండియే ఆకాశాది కార్యము లన్నియును జనిమౘుటచేత నారములని పిలువబడును. అట్టి నారములకు నిలయమగుటచేత. " నారాయణు" డనబడెను.

2) నారములనగా జీవసముదాయమని అర్థము. వీనికి ఆశ్రయమైనవాడు గాన నారాయణు డనబడెను.

3) " యచ్ఛకించి జ్జగత్సర్వం దృశ్యతే శ్రూయతే√పివా -- అన్తర్బహిశ్చతత్సర్వం వ్యాప్యనారాయణఃస్థితః ". అను ఉపనిషద్వాక్యానుసారముగా కంటికి కానవచ్చునదంతయును-- చెవికి వినబడునదంతయునునగు జగత్తుయొక్క ల లోపలను, వెలుపలను అంతటను వ్యాపించి యున్నవాడు నారాయణుడే యని భావము.

4) నారములనగా జలములని అర్థము. జలములకాధారమును ఆశ్రయమును నగువాడు గాన నారాయణుడయ్యెను.

5) ప్రళయకాలమునందు జీవులకందఱకును నిలయమైనవాడు గావున నారాయణుడు ప్రళయసాగరములో వటపత్రశాయియై తన తనకరారవిందముచేత పదారవిందమును బట్టి ముఖారవిందమున ప్రవేశపఱచి స్వస్వరూపామృత స్వాదనము చేయు ౘుండునని పురాణ వర్ణనము.

6) నారాయణ శబ్దోచ్చారణమాత్రము చేతనే ఆర్తులు, విషణ్ణులు, దుఃఖితులు భయమకర రోగపీడితులు భయగ్రస్తులు విముక్తులై సుఖశాంతులు బొందుదురని శాస్త్రవాక్యము . కావున. భగవానుడు నారాయణ పుణ్య శబ్దముచేత కీర్తింప బడుౘున్నాడు.

246) నరః - ఓం నరాయనమః

నడుపువాడుగనుక ". నరః ". అనబడును. " నయతితి నరః ప్రోక్తః పరమాత్మా సనాతనః " అనెడు వ్యాస వాక్యానుసారముగా భక్తులను పరమపదమునకు ౘక్కగా నడిపింౘువాడు గావున " నరః ". అనునామమున స్తవనీయుడగుౘున్నాడు.


--((**))--


(23_10_2018)

హరిః ಓమ్

27) శ్లోకము

అసంఖ్యేయో√ప్రమేయాత్మా విశిష్టః శిష్టకృచ్చుచిః ।
సిద్ధార్థః సిద్ధసంకల్పః సిద్ధిదః సిద్ధిసాధనః ।।

ఈ శ్లోకమునందు తొమ్మిది హరినామములు వర్ణింప బడుౘున్నవి.

247) అసంఖ్యేయః - ఓం అసంఖ్యేయాయనమః

సంఖ్య అనగా నామ, రూప, విభాగములు అని అర్థము.నామరూపవిభాగములు లేనివాడగుటచేత " అసంఖ్యేయః " అని పిలువబడును.నామము లేని భగవానుడు సహస్రనామములతో కీర్తింపబడుౘున్నాడు. రూప రహితుడైనవాడు కోటికోటి రూపములతో సాక్షాత్కరింౘుౘున్నాడు. విభాగములు లేని పరమాత్మ అనేక విభాగములుగా నున్నట్లు గోచరింౘును. వాస్తవముగానాతడు నామరూప బేధరహితుడు గాన అసంఖ్యేయః అని గానము చేయబడును.

248) అప్రమేయాత్మా- ఓం అప్రమేయాత్మనేనమః

ఎట్టి ప్రమాణములచేతను నిర్వచింౘుటకు వీలుగాని దివ్యాత్మ స్వరూపుడగుటచేత "అప్రమేయాత్మా " యనబడును. మనస్సుచేతగాని, ఇంద్రియములచేతగాని ఆత్మస్వరూపము, బోధపడునదిగాదు " బుద్ధిగ్రాహ్య మతీంద్రియమ్ ".
అనగా పరిశుద్ధ మగు, పవిత్రమగు బుధ్ధిచేత మాత్రమే అనుభవనీయ. మగునని భావము.

249) విశిష్టః- ఓం విశిష్టాయనమః

1). తన అనంత విభూతిశక్తి విశేషములచేత అందరికంటెను శ్రేష్ఠుడైనవాడు.

2) జాగ్రత్ స్వప్న సుషుప్తి మున్నగు అవస్థలకతీతుడు.

3) అన్నమయ, ప్రాణమయ, మనోమయాది పంచకోశములకంటెను విలక్షణుడు.

4) నశింౘు స్వభావముగల సకలలోకములకంటెను భిన్నుడు.

ఈ కారణములవలన. " విశిష్టః " అని కీర్తింపబడెను.

--((**))--

24_10_2018) 

హరిః ಓమ్ 

27) శ్లోకము 

అసంఖ్యేయో√ప్రమేయాత్మా విశిష్టః శిష్టకృచ్చుచిః । 
సిద్ధార్థః సిద్ధసంకల్పః సిద్ధిదః సిద్ధిసాధనః ।। 

ఈ శ్లోకమునందు తొమ్మిది హరినామములు వర్ణింప బడుౘున్నవి. 

250) శిష్టకృత్ - ఓం శిష్టకృతేనమః 

(1) శిష్టమనగా శాసనము అని అర్థము. శాసనకర్త యగుటచేత " శిష్టకృత్ " అనబడెను. వేద శాస్త్రములే భగవానుని శాసనములు. మానవ ధర్మము లన్నియునూ వానిలో చెప్పబడి యున్నందున దాని ననుసరించి మానవులు నడౘుకొనవలయునని భావము. 

(2) శిష్టులనగా సదాచారవంతులు, శీలసంపన్నులు, జ్ఞానసంపన్నులు. అట్టి వారిని పాలింౘువాడు, రక్షింౘువాడు గాన " శిష్టకృత్ " అనబడును. 

251) శుచిః - ఓం శుచయేనమః 

పవిత్రుడు, మాలిన్యరహితుడు, మాయాసంబంధము లేనివాడు గాన " శుచిః " అను దివ్యనామ వాచ్యుడగును. సారాంశమేమన. శుచిత్వము దేవత్వమునకు మార్గము. శరీరమునందు శుచిత, వాక్కునందు శుచిత, మానసమునందు శుచిత, ఈ రీతిగా త్రికరణములయందు శుద్ధని పాటింపుమని ఈనామము మనకు బోధింౘుౘున్నది. 

252) సిద్ధార్థః - ఓం సిద్ధార్థాయనమః 

అన్ని కోరికలను పొందినవాడు. అనగా ఆయన కోరదగినది మరేమియునూ లేదు. ఆయన పొందదగిన సిద్ధి ఏదియునూ లేదు. అతడు పూర్ణుడు, సంపూర్ణుడు, నిత్యపూర్ణుడు. కావున " సిద్ధార్థః " అని పిలువబడెను వాంఛారహితుడే సిద్ధార్థుడగునని విజ్ఞులు భావింతురు.


--((**))--


25_10_2018) 

హరిః ಓమ్ 

27) శ్లోకము 

అసంఖ్యేయో√ప్రమేయాత్మా విశిష్టః శిష్టకృచ్చుచిః । 
సిద్ధార్థః సిద్ధసంకల్పః సిద్ధిదః సిద్ధిసాధనః ।। 

ఈ శ్లోకమునందు తొమ్మిది హరినామములు వర్ణింప బడుౘున్నవి. 

253) సిద్ధసంకల్పః - ఓం సిద్ధసంకల్పాయనమః 

సంకల్పమనగా కోరిక అని భావము. కోరిన మరుక్షణమునందే నెరవేరిన కోరికలుగలవాడు కావున " సిద్ధసంకల్పః " అనబడును. " సత్యసంకల్పః " అని శ్రుతివాక్యము స్మరణీయము. 

254) సిద్ధిదః - ఓం సిద్ధిదాయనమః 

భగవానుడు సిద్ధిప్రదాత. అనగా వారివారి కర్మానుసారముగా జీవులకు సిద్ధులను, కర్మఫలములను ప్రసాదింౘువాడగుటచేత " సిద్ధిదః " అని పిలువబడెను. 

255) సిద్ధిసాధనః - ఓం సిద్ధిసాధనాయనమ 

ఒక కార్యము సాధింౘుటకు కూడా ఆయనయే సాధనము.కావున " సిద్ధిసాధనః " అని పిలువబడును. 

252, 253,254,255 నామములు భగవానుని అనంతశక్తి సామర్థ్యములను మరల మరల విశదము చేయుౘున్నవి. ఆయన సర్వసిద్ధులకును నిలయము. ఆయన సర్వసిద్ధిప్రదాత మాత్రమేకాక సిద్ధి సాధనముగూడానై యున్నాడని తెలుపుట మరింత విశేషము. భగవంతుని సాక్షాత్కారముకొఱకు సాధకుడు అనుష్ఠింౘు పుణ్యమార్గము లన్నియును భగవత్స్వరూపములే. సాధ్యము సాధనయందంతర్భూతమై యున్నది. కావున సాధనముకూడ భగవంతుడే యగును. కనక భక్తి శ్రద్ధలతో సాధనము చేయవలయునని ఈ నామముచే బోధన చేయబడు ౘున్నది.


(26_10_2018)


హరిః ಓమ్


28) శ్లోకము


వృషాహీ వృషభోవిష్ణుర్ వృషపర్వా వృషోదరః।

వర్ధనో వర్ధమానశ్చ వివిక్తః శ్రుతిసాగరః ।।

ఇందు తొమ్మిది హరినామములు మనోహరముగా వర్ణితములు.


256) వృషాహీ - ఓం వృషాహిణేనమః


వృషః అనగా ధర్మము అని అర్థము యజ్ఞములయొక్క ఫల స్వరూపుడు . పుణ్యమునకు కూడా వృషః అని పేరు. అట్టి పవిత్రమగు ధర్మపుణ్య ప్రకాశములతో గూడినవాడగుటచేత ఈశ్వరుడు " వృషాహీ " అనబడును. యజ్ఞములనగా విష్ణుప్రీతికరములగు , నిష్కామకర్మానుష్ఠానముగా చేయబడు పుణ్యకర్మలని గీతావాణి. ఇట్టి పుణ్యకర్మలఫలము భగవత్ప్రాప్తియే యని భావము.


257) వృషభః - ఓం వృషభాయనమః


(1) వృషః అనగా ధర్మము. ధర్మములను వర్షింపజేయువాడు.


(2) భక్తుల కోరికలను వర్షింపజేయువాడు. భక్తజనపారిజాతము భగవానుడు. కనుక " వృషభః " అని కీర్తనీయుడగును.


258) విష్ణుః - ఓం విష్ణవేనమః


సర్వ వ్యాపకుడు. 2వ నామముయొక్క వివరణమును పాఠకులు గమనింప ప్రార్థన.


రెండవ నామము " విష్ణుః "


2) విష్ణుః ఓం విష్ణవేనమః


"అంతటనూ వ్యాపించియున్న వాడని". ఈ నామముయొక్క తాత్పర్యము.


"వేవేష్టి వ్యాప్నోతి ఇతివిష్ణుః"


సర్వవ్యాపకమూ, దేశకాల వస్తుపరిచ్ఛేద శూన్యమునూ అగు మహాస్వరూపము స్వామిదని దీనిభావము.


" ఈశావాస్యమిదంసర్వం ". సమస్తమునూ ఈశ్వరునిచేతనే ఆచ్ఛాదింప బడియున్నదని ఈశావాస్యోపనిషత్తు గానము చేయును.


"విశ్" అనగా "ప్రవేశింౘుట" అని అర్థము. పరమాత్మయొక్క శక్తి విశ్వమందు ప్రతి అణువునందునూ ప్రతిష్ఠితమై యున్నదని భావము.


తొలినామము వలెనే ఈ నామముగూడా " ఆత్మసర్వగతము ". అను భావమునే వ్యక్తీకరింౘుౘూ సాధకులను

సర్వప్రపంచము నందునూ ఆత్మతత్వమును గుర్తెరుంగుటకు ప్రోత్సహింౘుౘున్నది.

--((**))--




(27_10_2018) 


హరిః ಓమ్ 


28) శ్లోకము 


వృషాహీ వృషభోవిష్ణుర్ వృషపర్వా వృషోదరః। 

వర్ధనో వర్ధమానశ్చ వివిక్తః శ్రుతిసాగరః ।। 

ఇందు తొమ్మిది హరినామములు మనోహరముగా వర్ణితములు. 


259) వృషపర్వా  - ఓం వృషపర్వణేనమః 


వృషః= ధర్మము, పర్వ = సోపానము, ధర్మమే సోపానముగా గలిగినవాడు. మోక్షసౌధము నధిరోహింౘుటకు ధర్మానుష్ఠానమే సోపానమగునని భావము. 


భగవంతుని పొందుటకు సాధనమైనది ధర్మానుష్ఠానమే. అనగా సత్యము, అహింస, కారుణ్యము, శౌచము, నిరహంకారము మున్నగునవియ సాధన చతుష్టయసంపత్తియు ధర్మసోపానములే యగును. కావున సాధకుడు ఈ ధర్మసోపానము ల ద్వారా మోక్షమందిరమును పొందగలడని భావము. 


260) వృషోదరః - ఓం వృషోదరాయనమః 


ఉదరః అనగా గర్భము. ధర్మములన్నియు తనగర్భమునందే గలిగియున్నవాడని భావము.ధర్మస్వరూపుడు. " రామోవిగ్రహవాన్ ధర్మః " అను మాటకు రాముడు మూర్తీభవిమచిన ధర్మమేయని యర్థము. 


252 వ నామమునుండి గానము చేయబడిన నామములన్నియు సాధకులు నిత్యదైనందిన జీవితంలో ధర్మాచరణము చేయవలయుననిన ధర్మము యొక్క ఆవశ్యకతనే తెలుపుౘున్నవి. కనుక భగవానుడు ధర్మవ్రతానుష్ఠాన రూపమున అర్చనీయుడగునని భావము. 


భగవంతుని కేవలము బాహ్యపుష్పములతో మాత్రమేగాక ధర్మపుష్పములతో ( సత్యము, శౌచము, కరుణ మున్నగువానితో ) అర్చింౘ వలయుననియును భావము. 


261) వర్ధనః - ఓంవర్ధనాయనమః 


అభివృద్ధిని గలిగింౘువాడు తన భక్తులకు ఐహిక ఆమష్మిక వృద్ధి పరంపరలను గలిగింౘువాడు. యోగక్షేమం వహమ్యహం (9_22) అను గీతావాక్యము స్మరణీయము. నా భక్తుల యోగక్షేమములు నేనే వహింతునని శ్రీకృష్ణస్వామి వచించెనుగదా.


--((**))--


(28_10_2018) 

హరిః ಓమ్ 

28) శ్లోకము 

వృషాహీ వృషభోవిష్ణుర్ వృషపర్వా వృషోదరః। 
వర్ధనో వర్ధమానశ్చ వివిక్తః శ్రుతిసాగరః ।। 

ఇందు తొమ్మిది హరినామములు మనోహరముగా వర్ణితములు. 

262) వర్ధమానః - ఓం వర్ధమానాయనమః 

తనకుతానుగా వృద్ధి పొందువాడని భావము. వామనావతారమును సూచింౘు నామమిది. బలిచక్రవర్తి వద్దనుండి మూడడుగులు దానముగా గ్రహించి వామనమూర్తి ఇంతింతై, మఱి ఇంతింతగా వృద్ధి పొందుౘు బ్రహ్మాండమంతయును నిండిన దివ్యవైభవము భాగవతమున వర్ణింపబడినది. 

263) వివిక్తః - ఓం వివిక్తాయనమః 

ఈ శబ్దమునకు ఏకాంతముగా నుండువాడు దేనితోను కలయికలేక యుండువాడనియు భావార్థము. 
భగవానుడు అసంఖ్యాకములగు లోకములను సృజించి కోటానుకోట్ల ప్రాణి సముదాయములను విరాజిల్ల చేసి విశ్వమందంతటను, అన్నిటి యందును తానే వ్యాపించియున్ననూ తానుమాత్రము దేనితోనూ సంగమము పొందుటలేదు. అతడు కేవలము ఉదాసీనుడు, నిర్లిప్తుడు, సాక్షిమాత్రుడై వెలుగొందు ౘున్నాడు. 

దీని భావమిది మానవుడు సంసారసాగరము లో నున్ననూ సంసారమునకతీతుడు గా నుండవలయును. పడవలు జలములలోనే నివసింౘుౘు జలములలోనే సంచరింౘుౘున్ననూ జలములను మాత్రము తనలోనికి రానీయకుండు విధముగా మానవుడు సాంసారిక జీవితములో నిరంతరము వ్యవహరింౘుౘున్ననూ దానితో ఎట్టి సంగమమును బొందక మమకార రహితుడుగా నుండి జలములయందలి తామర వలె సంచరింౘుౘున్నట్లు అభ్యాసము గావింపవలెను. ఇట్టి సంగరహిత జీవితమే పరమశ్రేయమును గలిగింౘునని భావము. 

264) శ్రుతిసాగరః - ఓం శ్రుతిసాగరాయనమః 

నదులన్నిటికినీ సాగరమే జననస్థానమును మఱల సంగమ స్థానమునునై యున్నట్లు సకల శాస్త్రములును నారాయణునియందే జన్మించి విస్తరించి నారాయణస్వరూపమునే బొందుౘున్నవి. కనుక " శ్రుతిసాగరః " అని కీర్తింపబడుౘున్నాడు.

--((**))--
(29_10_2018)

హరిః ಓమ్

29) శ్లోకము

సుభుజో దుర్ధరోవాగ్మీ మహేంద్రో వసుదోవసుః ।
నైకరూపో బృదద్రూపః శిపివిష్టః ప్రకాశనః ।।

ఈ సుందర శ్లోకమున దశవిధములగు పవిత్ర నామములు విలసిల్లు ౘున్నవి.

265) సుభుజః - ఓం సుభుజాయనమః

అందమైన భుజములుగలవాడని ఈ శబ్దముయొక్క సామాన్య భావము. ఆయన భుజములు కేవలము సౌందర్యవంతములు మాత్రమే గావు. అనంతశక్తి సంభరితములు. దుష్టరాక్షస సంహారము గావించిన దివ్యబాహువులు మఱియును సాధుజన సంరక్షణము గావించిన మహోన్నత బాహువులు. తనను ఆశ్రయించిన భక్తులకు అవి " వరద- అభయ " హస్తములు కావుననే " సుభుజః " అని స్వామి ఆరాధ్యుడు అగుౘున్నాడు.

266) దుర్ధరః- ఓం దుర్ధరాయనమః

ధారణ చేయుటకు వీలుకానివాడని ఈ శబ్దముయొక్క సామాన్యార్థము. సారాంశమేమనగా ప్రాణాయామాది కఠోర యోగానుష్ఠాన క్రియవలన గాని ప్రచండ పాండిత్య ప్రతిభా విశేషముల చేతగాని అధికార ధనాహంకారాదుల చేతగాని భగవానుని సాక్షాత్కరింౘుకొనుట కష్టమని తెలియబడువాడను ఏ వేదంబు పఠించె లూత ? భుజగంబే శాస్త్రముల్ సూచె తానే విద్యాభ్యసనం బొనర్చె కరి చంచే మంత్ర మూహించె ! బో
ధావిర్భావ నిదానముల్ ౘదువులయ్యా ? కావు నీపాద సంసేవాసక్తియె కాక , జంతుతతికిన్ శ్రీ కాళహస్తీశ్వరా !

తాత్పర్యము:

ప్రాణులకు మోక్షం కల్గింౘడానికి,నీ పాదాలు సేవించే భక్తి ఒక్కటే కారణమవుతుంది. అంతేకానీ ౘదువులు ఎన్ని ౘదివినా , జ్నానాన్నీ మోక్షాన్నీ కల్గింౘవు .ౘదివిన వారందరికీ జ్నానం కల్గడంలేదు. వారికి  మోక్షం లభించలేదు . నీదయతో మోక్షం పొందిన సాలెపురుగు ఏ వేదము ౘదువుకుంది ? పాము ఏ శాస్త్రాలుౘదివింది ? ఏనుగు ఏవిద్యలు నేర్చింది? చెంౘువాడైన తిన్నడు ఏ మంత్రము జపించాడు ? ఈశ్వర భక్తులు ముక్తి పొందడానికి , వారి జన్మలు అడ్డు రాలేదు కదా !

భగవంతుడు భక్త సులభుడు.

భక్త్యామామభిజానాతి (అ 18_54) భక్తివలననే నేను తెలియబడువాడను. అని గీతావాణి. నన్ను గూర్చి తెలుసుకొనుటకును నన్ను దర్శింౘుటకును, నాలో ప్రవేశింౘుటకును భక్తియే పరమసాధనమని గీతాచార్యుడు పలికెను.(గీత 11_ 53,54). కావున " దుర్ధరః " అను పుణ్యశబ్ద వాచ్యుడయ్యెను.

267) వాగ్మీ - ఓం వాగ్మినేనమః

వేదవాణిని వికసింపచేసినవాడు. ఆయన పుణ్యవాజ్ఞ్మయ స్వరూపుడు. సకల శాస్త్రములును ఆ దివ్యమూర్తిని గూర్చియే అన్వేషింౘును.
ఈ పుణ్యనామము స్వాధ్యాయ యజ్ఞమును గూర్చి లుపునదియైయున్నది.
" వాచ్య వాచకయో రభేదః " వాచ్యమునకును, వాచకమునకును భేదములేదని శాస్త్రము చెప్పుౘున్నది. వాచ్యము భగవంతుడయిన, వాచకమును ( ఆయనను గూర్చి చెప్పుశబ్దమును). భగవత్స్వరూపమే యగును. కావున నీ పుణ్యగ్రంథముల (రామాయణ, భారత, భాగవత గీతా గ్రంథముల ) పారాయణమును భగవత్స్వరూపమే యగును. వేద ఉపనిషత్పారాయణములు భగవంతుని స్వరూపములేగదా.

--((**))--

విష్ణు సహస్రనామ స్తోత్రమ్
( సంగ్రహ తాత్పర్య వివరణము)
(30_10_2018)
హరిః ಓమ్
29) శ్లోకము
సుభుజో దుర్ధరోవాగ్మీ మహేంద్రో వసుదోవసుః ।
నైకరూపో బృదద్రూపః శిపివిష్టః ప్రకాశనః ।।
ఈ సుందర శ్లోకమున దశవిధములగు పవిత్ర నామములు విలసిల్లుౘున్నవి.
268). మహేంద్రః - ఓం మహేంద్రాయనమః
దేవతల యొక్క ప్రభువు ఇంద్రుడు కాగా , ఇంద్రాదులకు కూడా ప్రభువగువాడు మహేంద్రుడు. తత్త్వపరంగా భావించినచో " ఇంద్ర " శబ్దము ఇంద్రియములకధిపతియైన మనస్సును సూచింౘును కదా, మనస్సును కూడా కదలింౘు శక్తిగల సర్వ చైతన్యబాండారము " ఆత్మ " యే యగుటచేత భగవానుడు " మహేంద్రః " అని గానముచేయబడును. 

మనోనిగ్రహమును సాధించి ఆత్మజ్ఞానము ను బొందవలెనని 
సారాంశము.

269) వసుదః - ఓం వసుదాయనమః

" వసు" ‌ అనగా ధనము, " దః " అనగా ఇచ్చువాడు. తన్నాశ్రయించిన భక్తజనులకు వారికావశ్యకములగు, ఐహికభోగములను ఇచ్చువాడు. భక్తులకు లేమిలేదని భావము. వారికి ఐహికభోగములతో పాటు కాలాంతరమున మోక్షలక్ష్మిని గూడా ప్రసాదింౘు వాడు ఆయన యే యగుటచేత " వసుదః " అని పిలువబడెను.
సంస్కృత భాషలో " ద " అను అక్షరము నాశనముచేయుట యనియును అర్థము నిచ్చుచుండును.
వసు+దః = ధనమును నాశనము చేయువాడనియును దీని అర్థమే. ఈ అర్థసమన్వయమున, మోక్షాపేక్ష కలిగిన వైరాగ్యవంతులగు భక్తులకు వారికి ప్రతిబంధకములుగా నుండు క్షుద్రములగు భౌతికభోగములను తొలగింౘువాడని భావము.

270) వసుః - ఓం వసవేనమః

" వసుః " అను ఈ పుణ్యనామమున అనేక బావార్థములలో భక్తులు కొనియాడుౘున్నారు. కొన్నిటికి మాత్రమే వివరణ
ఇవ్వబడింది.
1). " వసుః " అనగా ధనము అని అర్థము. ధనస్వరూపుడు ఐశ్వర్యస్వరూపుడని భావము
2). సర్వభూతములయందును వసింౘువాడు అగుటచేత పరమాత్మ " వసుః "అని పిలువబడును.
3). తనయందే సకలభూతములును వసింౘుటచేత " వసుః " అని ఈశ్వరుడు గానము చేయబడును.
4). " వసుః " అనగా సూర్యుడనియు అర్థముగలదు. సూర్యరూపమున ప్రకాశమును, ఉష్ణమును ప్రసాదింౘు వాడు భగవానుడే గదా ?
5). " వసుః " అనగా వాయువు అనికూడా అర్థమే. వాయురూపమున ఆకసమునందు సంచరింౘు వాడు గనుక. " వసుః " అనబడుౘున్నాడు. ( వసురన్తరిక్షసత్) అని శ్రుతివాక్యము.
6). తన స్వరూపమును మాయచేత కప్పియుంౘు వాడు గాన " వసుః" అనబడుౘున్నాడు.
విష్ణు సహస్రనామ స్తోత్రమ్

( సంగ్రహ తాత్పర్య వివరణము)

(31_10_2018)

హరిః ಓమ్

29) శ్లోకము

సుభుజో దుర్ధరోవాగ్మీ మహేంద్రో వసుదోవసుః ।
నైకరూపో బృదద్రూపః శిపివిష్టః ప్రకాశనః ।।

ఈ సుందర శ్లోకమున దశవిధములగు పవిత్ర నామములు
విలసిల్లుౘున్నవి.

271) నైకరూపః - ఓం నైకరూపాయనమః

అనేక రూపములతో వెలయువాడు గాన " నైకరూపః " అనబడుౘున్నాడు. విశ్వమందుగల సమస్త రూపములును ఆయనయొక్క దివ్యమంగళ స్వరూపములుగా దర్శింౘువాడే జ్ఞానియును, యోగియును, భక్తుడును అగునని శాస్త్రవాక్యము స్మరణీయము.

272) బృహద్రూపః - ఓం బృహద్రూపాయనమః

మహాద్భుతమైన దివ్యరూపము గలవాడని ఈనామము యొక్క భావము. భగవానుని కంటే మిక్కిలి పెద్దదియగు మహారూపము మరి
యెద్దియునూ లేదు. విశ్వము కంటెను మహోన్నతోన్నత దివ్య మహాద్భుత రూపవంతుడగుటచేత " బృహద్రూపః " యని పిలువబడెను.

273) శిపివిష్టః  ఓం శిపివిష్టాయనమః

1). " శిపి " అనగా కిరణములని యర్థము. సూర్య చంద్ర కిరణముల యందు వ్యాపించియున్న వాడు గాన శ్రీహరి " శిపివిష్టః " అనబడును

2). శీతలముగా నుండుటవలనను, భగవంతునకు శయనమై యుండుటవలననూ, జలములకు " శి " అను నాణు కలిగినది. అట్టి జలములను పానము చేయుట వలన కిరణములకే " శిపి " అను పేరుకలిగినది. అట్టి శివుల యందున్న కారణముచేత భగవానుడు " శిపివిష్టః " అనబడును.

3). " యజ్ఞోవైవిష్ణుః" అను శ్రుతివాక్యమునుబట్టి యజ్ఞపశువునందు
ఆవహించి యున్నవాడగుటచే " శిపివిష్టః " అనబడును. ( ఇచ్చట " శిపి " అనగా
యజ్ఞపశువు అని అర్థము).

274) ప్రకాశ
ఓం ప్రకాశనాయనమః

సమస్తమును ప్రకాశింప జేయు స్వయంజ్యోతిః స్వరూపుడు. ఒకే
సూర్యుడు సమస్తమును ప్రకాశింప చేయునట్లు ఆత్మ సర్వమును ప్రకాశింప
జేయును( గీత 13_24).